చంద్రగిరిలో ఆటవిక రాజ్యం.. | TDP Leaders Rowdyism in Chandragiri | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో ఆటవిక రాజ్యం..

Published Tue, Feb 19 2019 3:40 PM | Last Updated on Tue, Feb 19 2019 6:21 PM

TDP Leaders Rowdyism in Chandragiri - Sakshi

సాక్షి, చంద్రగిరి (చిత్తూరు): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిపెరిగిన ప్రాంతమైన చంద్రగిరిలో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. చంద్రగిరి మండంలోని ముంగిలిపట్టు గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యకాండకు దిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడైన దామోదర నాయుడు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటున్నారనే కారణంతో టీడీపీ నేతలు దామోదర నాయుడు కుటుంబంపై గ్రామబహిష్కరణ విధించారు. దీంతో సోమవారం నుంచి దామోదర నాయుడు కుటుంబానికి పాలు, నీళ్లు వంటి నిత్యావసర వస్తువులు రావడం ఆగిపోయాయి.  

దామోదర నాయుడు కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోవాలని, ఎవరైనా ఆయన కుటుంబంతో మాట్లాడితే రూ. 3,500 జరిమానా విధిస్తామని టీడీపీ నేతలు ఆంక్షలు విధించారు. దీంతో బాధిత కుటుంబం
పోలీసులను ఆశ్రయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement