‘ఆల్ ఇంగ్లండ్’ టోర్నీకి సన్నాహకంగా...
యూరోప్ సర్క్యూట్‌లో భాగంగా మంగళవారం మొదలయ్యే జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ బరిలోకి దిగనున్నాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి సన్నాహకంగా అతను ఈ టోర్నీలో ఆడుతున్నాడు.
తొలి రౌండ్‌లో స్లొవేనియా ప్లేయర్ అలెన్ రోజ్‌తో శ్రీకాంత్ తలపడతాడు. గతేడాది సెప్టెంబరులో కొరియా ఓపెన్ తర్వాత గాయపడ్డ అతను 3 నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఏడాది సయ్యద్ మోడి టోర్నీలో సెమీస్‌లోనే నిష్క్రమించాడు.