నేటి నుంచి దివ్యాంగుల క్రికెట్‌ శిక్షణ శిబిరం | Disabled cricketers camp starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దివ్యాంగుల క్రికెట్‌ శిక్షణ శిబిరం

Published Tue, Oct 23 2018 8:19 AM | Last Updated on Tue, Oct 23 2018 8:19 AM

Disabled cricketers camp starts today - Sakshi

హైదరాబాద్‌:  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దివ్యాంగుల క్రికెట్‌ ప్రపంచకప్‌ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత జట్టు ఎంపిక కోసం నేటి నుంచి దివ్యాంగుల క్రికెట్‌ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. జింఖానా మైదానంలో మంగళవారం నుంచి ఆదివారం వరకు ఈ శిబిరం జరుగుతుంది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం శిబిరం కరపత్రాన్ని దివ్యాంగుల క్రికెట్‌ సంఘం డైరెక్టర్లు హుస్సేన్, నదీమ్, సంయుక్త కార్యదర్శి రవికుమార్‌ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 80 మంది క్రికెటర్లు ఈ శిబిరంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

దివ్యాంగులకు చేయూతనిస్తే అద్భు తాలు సృష్టిస్తారని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈ క్యాం ప్‌ను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. క్యాంప్‌ అనంతరం ఆటగాళ్లను ఐదు జట్లుగా విభజించి ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్‌ 2 వరకు ఎల్బీ స్టేడియంలో టి20 మ్యాచ్‌లను నిర్వహిస్తామన్నారు. మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement