భువనేశ్వర్: స్వదేశంలో జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచకప్ 2018లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే టీమిండియా అదరగొట్టింది. మన్‌ప్రీత్ సింగ్ సేన 5-0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టీమిండియా జోరును సఫారీ జట్టు ఆటగాళ్లు అడ్డుకోలేక చేతులెత్తేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ టీమిండియాకు తొలి గోల్ అందించాడు.
మన్‌దీప్ ఇచ్చిన షాక్ నుంచి సఫారీ జట్టు కోలుకోకముందే ఆకాశ్ దీప్ కోలుకోని దెబ్బ కొట్టాడు. 12వ నిమిషంలో మరో గోల్ కొట్టి టీమిండియా ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అయితే సిమ్రన్‌జిత్ సింగ్ (43 ని, 46 ని) రెండు గోల్స్ సాధించి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చివర్లో లలిత్ ఉపాధ్యాయ్ మరో గోల్ సాధించడంతో టీమిండియా 5-0తో నిలిచింది. ఆట చివరి వరకు ఇరు జట్లు మరో గోల్ కూడా నమోదు చేయలేదు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది. పూల్ సిలో భాగంగా డిసెంబర్2 న బెల్జియంతో టీమిండియా రెండో మ్యాచ్‌లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment