అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన అండర్-19 వరల్డ్ కప్ జట్టులో దాదాపు సగం మంది భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఆటగాళ్ల గౌరవ సూచకంగా ఎంపిక చేసిన జట్టులో భారత యువ ఆటగాళ్లు పృథ్వీషా, మన్‌జోత్ కల్రా, శుభమాన్ గిల్, అనుకుల్ రాయ్, కమలేష్ నాగర్‌కోటిలకు స్థానం దక్కింది. ఇందులో పృథ్వీషా, మన్‌జోత్ కల్రా, శుభమన్ గిల్‌లు బ్యాట్స్‌మెన్లు కాగా, కమలేష్ నాగర్ కోటి, అనుకుల్ రాయ్‌లు బౌలింగ్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్.. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసింది.
శనివారం ఆసీస్ జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో బ్యాటింగ్ విభాగంలో పృథ్వీషా(261 పరుగులు), కల్రా(252 పరుగులు), శుభ్‌మన్ గిల్(372 పరుగులు) విశేషంగా ఆకట్టుకున్నారు. కాగా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనుకుల్ రాయ్ 14 వికెట్లను సాధించగా, నాగర్‌కోటి 9 వికెట్లను తీశాడు.
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ జట్టు(బ్యాటింగ్ ఆర్డర్)
పృథ్వీషా(భారత్), మన్‌జోత్ కల్రా(భారత్), శుభమన్ గిల్(భారత్), ఫిల్ అలెన్(న్యూజిలాండ్), రాయ్‌నార్డ్ వాన్ టోండర్(దక్షిణాఫ్రికా,కెప్టెన్), వాండైల్ మక్వెటు(దక్షిణాఫ్రికా, వికెట్ కీపర్),అనుకుల్ రాయ్(భారత్), కమలేష నాగర్‌కోటి(భారత్),గెరాల్డ్ కోట్జి(దక్షిణాఫ్రికా), ఖాయిస్ అహ్మద్(అఫ్గానిస్తాన్), షహీన్ ఆఫ్రిది( పాకిస్తాన్), 12వ ఆటగాడు అలిక్ అథనాజే(వెస్టిండీస్)
Comments
Please login to add a commentAdd a comment