న్యూఢిల్లీ:గత రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వన్డే రికార్డును కోహ్లి సవరించిన నేపథ్యంలో సచిన్ స్పందించాడు.
'కోహ్లి అరంగేట్రం చేసిన నాటికి ఇప్పటికీ అతని దూకుడు ఏమీ మారలేదు. అదే దూకుడు.. అదే బ్యాటింగ్. కోహ్లి తొలి మ్యాచ్ లోనే అతని దూకుడ్ని నేను గుర్తించా. ఇంకా అదే తరహా దూకుడును ఇంకా చూస్తూనే ఉన్నా. అయితే దూకుడుగా ఉన్నవారు ఎక్కువగా విమర్శలు పాలు కావడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ కోహ్లి దూకుడు మాత్రం టీమిండియాకు బలంగా మారింది. భారత్ జట్టుకు కోహ్లి దూకుడే బలమని నేను నమ్ముతున్నా. కాకపోతే కోహ్లి ఆడే విధానంలో అతని దృక్పథం మారింది.ఆటగాడిగా అతని ప్రదర్శన భారత జట్టుకు కీలకం కాబట్టి స్వేచ్ఛగా ఆడుతున్నాడు' అని సచిన్ విశ్లేషించాడు.
Comments
Please login to add a commentAdd a comment