ఈస్ట్ లండన్: అండర్-19లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు 8 వికెట్ల ఘన విజయం సాధించింది. బర్త్‌డే బాయ్ యశస్వి జైశ్వాల్ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ముందుగా బంతితో ప్రత్యర్థులను వణికించిన ఈ యువ స్పిన్నర్ తర్వాత బ్యాట్‌తో సత్తా చాటాడు. అర్ధ సెంచరీ చేయడంతో పాటు 4 వికెట్లు పడగొట్టి తన 18వ పుట్టినరోజును తీపిగుర్తుగా మలచుకున్నాడు. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి అజేయ అర్థసెంచరీతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. 56 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ 26 పరుగులు చేయగా, ప్రియం గార్గ్ డకౌటయ్యాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 29.5 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 4 వికెట్లు నేల కూల్చాడు. ఆకాశ్ సింగ్, అంకోలేకర్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. యశస్వి జైశ్వాల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో భారత్ సొంతమయింది. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను యువ భారత్ చిత్తు చేసింది. నామమాత్రమైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో యశస్విని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది. యశస్వి తాజా ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ఖుషీగా ఉంది. రోడ్డుపై పానీపూరీలు అమ్మే స్థాయి నుంచి ముంబై సీనియర్ జట్టు వరకు ఎదిగిన సంచలన ఆటగాడు యశస్వికి భారీ మొత్తం లభించడం విశేషం. (చదవండి: ఐపీఎల్ వేలంలో కోట్లాభిషేకం)
యశస్వి జైశ్వాల్ ఆల్‌రౌండ్ షో
Published Sat, Dec 28 2019 7:42 PM | Last Updated on Sat, Dec 28 2019 7:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment