కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌.. ఉద్రిక్తత! | congress versus TRS in gambhiraopeta | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌.. ఉద్రిక్తత!

Published Tue, Jan 31 2017 9:35 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌.. ఉద్రిక్తత! - Sakshi

కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌.. ఉద్రిక్తత!

  • పోటాపోటీ ఆందోళనలు.. గంభీరావుపేటలో టెన్షన్‌

  • రాజన్న సిరిసిల్ల: అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ శ్రేణుల పోటాపోటీ ఆందోళనలతో జిల్లాలోని గంభీరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్‌ సోమవారం గంభీరావుపేటలో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్‌ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో గంభీరావుపేటతోపాటు పలు గ్రామాల్లో అక్రమాలు జరిగాయంటూ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు. అయితే, వారిని అడ్డుకొని హస్తం నేతలు, శ్రేణులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. పలువురిని ముందస్తుగా అరెస్టు చేశారు.

    ఈ అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు గంభీరావుపేట బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను విఫలం చేసేందుకు పోటీగా టీఆర్‌ఎస్‌ నేతలు కూడా రంగంలోకి దిగారు. రెండు పార్టీల శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలకు దిగడంతో ప్రస్తుతం గంభీరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement