చంపేసి శ్రద్ధాంజలి ఘటించినట్టుంది!: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయి. నిన్నటి వరకు విలీనమైపోతాయనుకున్న ఆ పార్టీల మధ్య ఇప్పుడు విమర్శల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విరుచుకుపడ్డారు. హత్యలు చేసినవాళ్లే శవంపై పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఆయన తీరు ఉందని దుయ్యబట్టారు.
జైరాం రాష్ట్ర పర్యటన సందర్భంగా జేఏసీ నేతలకు వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తామని ప్రకటనలు చేయడం, మరోపక్క తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలతో సమావేశం కానున్నట్టు ప్రకటిం చడాన్ని తప్పుబట్టారు. పార్టీ నేతలు హరీశ్వరరెడ్డి, స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి తదితరులతో కలిసి హరీష్ మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ దగ్గర యాదిరెడ్డి చనిపోయినప్పుడు జైరాం రమేష్‌కు ఆ శవాన్ని చూడడానికి కూడా సమయం ఎందుకు దొరకలేదని నిలదీశారు. ప్రస్తుతం జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు మధ్య అంతరం పెంచే పాపపు పనికి ఒడిగడుతున్నారని ఆరోపించారు.