తప్పతాగి యువతి వీరంగం! | lady rash driving while caught at drunk and drive in hyderabad | Sakshi
Sakshi News home page

తప్పతాగి యువతి వీరంగం!

Published Tue, Jan 10 2017 7:20 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

తప్పతాగి యువతి వీరంగం! - Sakshi

తప్పతాగి యువతి వీరంగం!

హైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువతి నగర రోడ్లపై వీరంగం చేసింది. నగర పోలీసులు బంజారాహిల్స్‌లో సోమవారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న యువతి పోలీసులను తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగా మద్యం మత్తులో ఉన్న యువతి అతివేగంగా కారు నడుపుతూ ఓ బైక్, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం. యువతి కేర్ లెస్ డ్రైవింగ్‌తో  ఇతర వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మరికొందరు వాహనదారులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించిగా వారిని నానా దుర్భాషలాడుతూ రెచ్చిపోయింది.

వాహనదారుల సహాయంతో ఎట్టకేలకు పోలీసులు ఆ యువతిని, ఆ సమయంలో కారులో ఉన్న ఆమె స్నేహితురాలిని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలోనూ వారికి సహకరిచకుండా యువతి  దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువతి ప్రైవేట్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతోందని వారి విచారణలో తేలింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement