మెట్‌పల్లి రూరల్ : గుర్తు తెలియన మహిళపై లైంగికదాడి చేసి, హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రాజేం ద్రప్రసాద్ తెలిపిన వివరాలు.. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ శివారు 63వ జాతీయ రహదారి సమీపంలో నిర్మిస్తున్న సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమంలో ఈనెల 15న ఓ మహిళ హత్యకు గురైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు..ఆమెను నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మి (38)గా తేల్చారు.
అయితే, ఆమె మద్యానికి బా నిసై భర్తతో విడిపోరుు ఒంటరిగా ఉంటోంది. ఈక్రమంలో ఇటీవల మెట్‌పల్లికి చేరింది. స్థానిక గాజులపేటకు చెందిన గుండుగుల రాజన్న, మెట్‌పల్లిలో నివాసం ఉండే రాయికల్ మండలం బో ర్నపెల్లి శివారు చెలుకుగూడేనికి చెందిన షడ్మకే గంగారాం ఆమెను మున్సిపల్ కార్యాలయ సమీపంలోని కల్లు దుకాణం లో పరిచయం చేసుకున్నారు. కమ్మర్‌పల్లిలోని ఆమె బంధువుల ఇంటివద్ద దిం పుతామని నమ్మించి ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. గండిహనుమాన్ ఆలయం వద్ద ఆటో ఆపి దేవుని దర్శనం చేసుకున్నారు.
తర్వాత ముగ్గురూ కలిసి సుంద ర చైతన్యానందస్వామి ఆశ్రమంలో భోజనం చేశారు. ఆతర్వాత ఇద్దరూ మహిళపై బలవంతంగా లైంగికాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు బెదిరించగా, అక్కడే ఉన్న కర్రచెక్కతో తలపై బాదారు, కొంగుతో మెడకు గట్టిగా చుట్టి చంపేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. బుధవారం మెట్‌పల్లి శివారులోని వెంకట్రావుపేట మల్లన్న గుట్టవద్ద పెట్రోలింగ్ చేపట్టారు. అక్కడ గుండగుల రాజన్న, షడ్మకే గంగారాం పట్టుబడ్డారు. హత్య మిస్టరీని ఛేదిం చిన మెట్‌పల్లి సీఐ రాజశేఖర్‌రాజు, ఇబ్రహీంపట్నం ఎస్సై రాజరెడ్డి, పోలీసులు నజీర్, మల్లేశ్, రమేశ్‌ను డీఎస్పీ అభినందించారు.
లైంగికదాడి.. ఆపై హత్య
Published Thu, May 21 2015 2:52 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement