సీన్ రిపీట్ | Tokens traces of giving the authorities | Sakshi
Sakshi News home page

సీన్ రిపీట్

Published Sun, Feb 1 2015 2:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సీన్ రిపీట్ - Sakshi

సీన్ రిపీట్

టోకెన్లు ఇచ్చి జాడలేని అధికారులు
ఆరుగంటల తర్వాత కొనుగోళ్లకు సై..
మళ్లీ రైతన్నల ఆందోళన
మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ  
జేసీ, డీఎస్పీలను అడ్డుకున్న రైతులు

 
 
మారని సీసీఐ తీరు.. తేమ పేరిట కొర్రీలు.. అన్నదాత ఆగ్రహం.. బ్యానర్ల దగ్ధం.. మార్కెట్ ప్రధాన గేట్లకు తాళం రైతుల అర్ధనగ్న
ప్రదర్శన, ధర్నా మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ రాస్తారోకో ఆరు గంటలు ఆందోళన ఫర్నిచర్ ధ్వంసం జేసీ, డీఎస్పీలను అడ్డుకున్న రైతులు
 
పత్తి రైతుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది.. తేమ పేరిట కొర్రీలు పెట్టడంతో సీసీఐ తీరును నిరసిస్తూ అన్న దాతలు రహదారిపై బైఠారుుంచారు..  వరంగల్ మార్కెట్‌లో శుక్రవారం  రాత్రి టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేయక  పోవడంతో కార్యాలయూనికితాళం  వేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు..  రైతులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి,  వ్యతిరేకంగా నినాదాలు చేశారు..  రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్  పార్టీలు ఆందోళనలు నిర్వహించారుు..  చివరకు కొనుగోళ్లు ప్రారంభం  కావడంతో ఆందోళన సద్దుమణిగింది..
  - పోచమ్మమైదాన్
 
సీసీఐ అధికారుల తీరు మార లేదు. మళ్లీ పాత పాటే పాడారు. ఏనుమాముల మార్కెట్‌లో ఆందోళనల పర్వం కొనసాగింది. తేమ శాతంపై దిగొచ్చిన అధికారులు మళ్లీ పేచీ పెట్టారు. దీంతో గంటల తరబడి రైతులు నిరసనకు దిగాల్సి వచ్చింది. మూడు రోజులుగా రైతులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ తతంగం భరించలేక కొందరు.. నామమాత్రపు ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని ఇంటిదారి పట్టారు. తుదకు సీసీఐ కొనుగోళ్లు చేపట్టినా.. రోజంతా రగడే కొనసాగింది.
 
పోచమ్మమైదాన్ : రైతులు ఆరుసార్లు ఆందోళనలు చేస్తే శుక్రవారం సీసీఐ అధికారులు మెత్తబడ్డారు. కానీ శనివారం మళ్లీ మొదటికొచ్చారు. ఆరుగంటల పాటు ఆందోళనలు చేస్తేగానీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. శుక్రవారం రాత్రి పొద్దుపోవడంతో దాదాపు 100మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. వీరంతా పత్తి కొనుగోళ్ల కోసం ఉదయం 9 గంటల వరకు నిరీక్షించారు. సీసీఐ అధికారులు రాలేదు. ఫోన్లు సిచ్ఛాఫ్ చేసుకున్నారని సిబ్బంది చెప్పడంతో రైతులు రగిలిపోయూరు. మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సర్దిచెప్పేందుకు యత్నించిన వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్‌పై మండిపడ్డారు.మార్కెట్ ప్రధాన గేట్లుమూసేసి రోడ్డుై పె బైఠారుుంచారు. అటుగా ఎడ్లబండిపై పత్తి తీసుకెళ్తున్న వ్యక్తిపై దాడిచేశారు. సుమారు రెండు గంటలు రోడ్డుపై రాకపోకలను అడ్డున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, జిల్లాఎస్టీసెల్ నాయకుడు దిలీప్ నాయక్ వీరికి మద్దతుగా ఆందోళనలో పా ల్గొన్నారు. పోలీసులు అశోక్ రెడ్డిని అరె స్టు చేశారు. ఈసందర్భంగా వీరితో  దురుసుగా ప్రవర్తించారు. అశోక్‌రెడ్డి కారు డ్రైవర్‌పై చేరుుచేసుకున్నారు.
 
సీసీఐ ఉన్నతాధికారులతో కలెక్టర్ చర్చలు
 

కాగా, రైతులు మళ్లీ మార్కెట్ పరిపాలన భవనం ప్రధాన గేట్ వద్ద ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ మహమూద్ ధర్నాలో పాల్గొన్నారు. సీసీఐ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకుని మార్కెట్‌కు వచ్చిన జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్‌నూ రైతులు అడ్డుకున్నారు. 18 శాతం వరకు తేమ ఉంటే తప్పక కొంటామని జేసీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఢిల్లీ స్థాయిలో సీసీఐ అధికారులతో కలెక్టర్ వాకాటి కరుణ చర్చలు జరిపి.. కొనుగోళ్లు సాగేలా ఒప్పించారు.  3,888 - రూ 4,050 వరకు సీసీఐ ధర నిర్ణయించగా.. తేమ శాతాన్ని బట్టి గరిష్టంగా రూ .3, 969 మాత్రమే చెల్లించారు అధికారులు.  
 
 
10వేల బస్తాలు కొన్న ప్రైవేట్ వ్యక్తులు

 
శనివారం మార్కెట్‌కు కొత్తగా వచ్చిన ఆరు వేల పత్తి బస్తాలను, గత రెండు రోజులుగా ఉన్న 4 వేల పత్తి బస్తాలను ప్రైవేటు అడ్తీదారులు కొనుగోలు చేశారు. రైతులు మూడు రోజులుగా పడిగాపులు కాస్తుండటం..మళ్లీ ఆదివారం మార్కెట్ బంద్ ఉంటుండంతో ఎంతో కొంతకు అమ్ముకోవాలని రైతులు భావించారు. ఇదే అదనుగా అడ్తీదారులు రూ.3,600 -రూ.3, 900 వరకు మాత్రమే చెల్లించారు.  
 
 రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా  విఫలం: మాజీ మంత్రి సారయ్య
 

పత్తి కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం అధికారులతో సమీక్షించే బదులు రైతులతో సమీక్షించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement