నల్లగొండ: రివాల్వర్‌తో సంచరిస్తున్న ఓ యువకుడిని నల్లగొండ జిల్లా సూర్యాపేట పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సూర్యాపేటలోని జనగామ క్రాస్‌రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన ఒక ఆటోను ఆపగా.. అందులో ప్రయాణిస్తున్న విజయ్ అనే యువకుడు వెంటనే పరుగు లంకించుకున్నాడు.
పోలీసులు అప్రమత్తమై అతడ్ని పట్టుకుని సోదా చేయగా రివాల్వర్ బయటపడింది. అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి విచారించారు. చోరీలకు సాయంగా ఉంటుందని రూ.20వేలు పెట్టి కొనుగోలు చేసినట్టు అతడు బయటపెట్టాడు. నిందితుడు మిర్యాలగూడ మండలం ఆళ్లగడప గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు.