ఆడవారికే ఎక్కువ డిప్రెషన్ ఎందుకు?
ఆడవారికే ఎక్కువ డిప్రెషన్ ఎందుకు?
Published Tue, May 27 2014 2:00 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
న్యూయార్క్: మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ డిప్రెషన్ కు గురవుతారనే ప్రశ్నకు హార్మోన్ల ప్రభావమే అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మగవాళ్లతో పోల్చుకుంటే ఆడవాళ్లలోనే డిప్రెషన్ ఎక్కువగ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఓస్ట్రోజెన్ అనే సెక్స్ హార్మోన్ అందుకు కారణమని శాస్త్ర్రజ్క్షులు తేల్చారు. మానసిక పరిస్థితి బాగాలేనప్పడు, మానసిక సమస్యలు తలెత్తినపుడు ఓస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎక్కువ మొత్తంలో రక్తాన్ని మెదడులోకి పంప్ చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితి ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందని యూనివర్సిటీ పెన్సిల్వేనియ ప్రొఫెసర్ థియోడర్ సట్టెర్థవేయిట్ వెల్లడించారు.
సాధారణంగా ఆడవాళ్లే ఎక్కువ ఉద్వేగానికి, డిప్రెషన్ కు లోనవుతారని.. మగవాళ్లు మనో వైకల్యానికి(స్కిజోఫ్రేనియా)కు గురవుతారని అధ్యయనంలో వెల్లడైందని థియోడర్ వెల్లడించారు. ఎక్కువగా హార్మోన్ల ప్రభావం, మార్పు జరిగే ఎనిమిది నుంచి 22 ఏళ్ల వయస్సున్న వారిపై ఎంఆర్ఐ స్కాన్ చేసి పరిశోధన జరిపారు. సామాజిక పరిస్థితుల్లో ఉద్వేగాలు, నియంత్రణ అంశాలను లెక్కలోనికి తీసుకుని పరిశోధన జరుపగా బాలికల్లోనే అత్యధికంగా మెదడులోకి రక్త ప్రవాహం జరిగిందనే విషయాన్ని అధ్యయనం వెల్లడించింది.
Advertisement