airport authority of India
-
AP: విమానయానం ఫుల్ జోష్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయానరంగం జోరుమీద కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ద్వారా 27,49,835 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 17.22శాతం వృద్ధి నమోదైంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 23,45,795 మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది 27,49,835కు చేరింది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖలో అత్యధిక వృద్ధి... పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం విమానాశ్రయం అన్నిటికంటే అత్యధికంగా 30.5శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది విశాఖ నుంచి 11.50 లక్షల మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది ఏకంగా 15.03 లక్షలకు పెరిగింది. పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, గత కొన్ని నెలలుగా నమోదవుతున్న గణాంకాలే దీనికి నిదర్శనమని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. విశాఖ తర్వాత గడిచిన ఆరు నెలల్లో విజయవాడ నుంచి 5.41 లక్షల మంది, తిరుపతి నుంచి 4.30 లక్షల మంది, రాజమండ్రి నుంచి 2.11 లక్షల మంది ప్రయాణించారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 41,056 మంది, కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి 21,326 మంది ప్రయాణించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు రద్దు కావడంతో తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారి సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైందని, రానున్నకాలంలో ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘భోగాపురం’తో డబుల్ ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఎయిర్‌ఫోర్స్ వారిది కావడంతో రాత్రిపూట అనేక ఆంక్షలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంక్షలు తొలగిపోతాయని, ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం 2025 నాటికి అందుబాటులోకి రానుంది. చదవండి: వావ్..విశాఖ! -
కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ. 224.05 కోట్ల నిధులు
కడప సిటీ : కడప విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రూ. 224.05 కోట్లతో న్యూ డొమెస్టిక్ బిల్డింగ్ నిర్మాణం, ఇతర పనులకు శ్రీకారం చుట్టేందుకు టెండర్లను కూడా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పిలిచింది. మరో మూడు నెలల్లో టెండర్లు పూర్తయి రెండేళ్ల కాలంలో అంటే మార్చి 2026కు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.ఇప్పటికే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు. రూ. 224.05 కోట్లతో పనులు ఇటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ. 224.05 కోట్ల నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో 12,900 చదరపు మీటర్లలో న్యూ డొమెస్టిక్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని అత్యాధునిక సౌకర్యాలతో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి తరహాలో ఈ ఎయిర్‌పోర్టును సర్వాంగ సుందరంగా మార్చనున్నారు. మూడు ఏరో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే టెర్మినల్ భవనం నుంచి నేరుగా విమానంలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. వర్షం వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు విమానం వద్దకు చేరుకోవచ్చు. ప్రస్తుతం బస్సు ద్వారా అక్కడికి చేరుకుంటారు. పెద్ద విమానాలు వచ్చేందుకు అవకాశం కడప విమానాశ్రయంలో పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి వచ్చిన తర్వాత పనులన్నీ పూర్తయ్యాయి. రన్‌వే పెంపుతోపాటు రన్‌వే లైటింగ్, అప్రోచ్ లైటింగ్, పార్కింగ్ బే లైటింగ్, 2.5 కిలోమీటర్ల రన్‌వే, సెక్యూరిటీ, పెరిమీటర్ లైటింగ్, పెరిమీటరు రోడ్డు తదితర పనులు పూర్తయ్యాయి. దీంతో నైట్ ల్యాండింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా విమానాలు దిగేందుకు అవకాశం ఉంటుంది. 8కొత్త టెర్మినల్ లో 700 మంది ప్రయాణికుల సౌకర్యం ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనంలో 40+40 (80) మందికి మాత్రమే అవకాశం ఉంది. కొత్త టెరి్మనల్ పూర్తయితే మొత్తం 700 మందికి రాకపోకలు సాగించే అవకాశాలు ఉంటాయి. ఏడు విమానాలు పార్కింగ్ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. అభివృద్ది పనులు పూర్తయితే ఏ–320 (180మంది) ప్రయాణికులు ప్రయాణించే పెద్ద విమానాలు ఇక్కడి నుంచి నడిపేందుకు వీలు ఉంటుంది. 8పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు కడప విమానాశ్రయంలో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా పైలెట్ శిక్షణా కేంద్రం లేదు. ప్రప్రథమంగా కడప విమానాశ్రయంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చేనెల 25, 26 తేదీల్లో ఇందుకు సంబంధించి ప్రణాళిక ఖరారు కానుంది. తర్వాత ఈ శిక్షణా కేంద్రం పనులు చేపట్టే అవకాశం ఉంది. -
భారీ మాల్‌కు చిక్కులు... మూసివేయాలని ఆదేశాలు...
సాక్షి, చైన్నె: చైన్నె మీనంబాక్కం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ రూపుదిద్దుకున్న భారీ మాల్ నిర్వహణకు చిక్కులు తప్పడం లేదు. ఈ మాల్, సినిమా కాంప్లెక్స్ కారణంగా విమానాశ్రయం వద్ద కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గుర్తించింది. దీంతో ఆ మాల్‌ను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయం నుంచి స్వదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన నగరాలకు , దేశాల రాజధానులకు విమానాల సేవలు అందుతున్న విషయం తెలిసిందే. రూ. 2400 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దే పనులు జరుగుతున్నాయి. తొలి దశ పనులు ఏప్రిల్‌లో ముగించగా, ప్రస్తుతం రెండో దశ పనులు మొదలెట్టి ఉన్నారు. అలాగే, విమానాశ్రయం పరిసరాల్లో పార్కింగ్ కోసం భారీ భవనం ఏర్పాటు చేశారు. ఇక్కడ 2400 కార్లు తదితర వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. రూ. 250 కోట్లతో ఆరు అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టారు. భద్రతా పరమైన కారణాలతో.. విమానాశ్రయం స్వదేశీ, విదేశీ టెర్మినల్స్‌కు మధ్య భాగంలో ఆరు అంతస్తులతో భారీ మాల్‌కు రూపకల్పన చేశారు. ఇక్కడ ప్రయాణికులకు వినోదాన్ని పంచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు, ఫుట్కోట్లు, పలు బ్రాండ్లకు సంబంధించిన దుకాణాలు ఇక్కడ కొలువు దీర్చారు. అంతే కాకుండా ప్రముఖ సంస్థ నేతృత్వంలో సినిమా థియేటర్లు ఏర్పాటు చేశారు. వర్తక, వినోద కేంద్రంగా ఉన్న ఇక్కడకు నిత్య జనం తాకిడి పెరగడం విమానాశ్రయానికి కొత్త చిక్కులను సృష్టించి ఉంది. ఇక్కడకు వచ్చే వారి వాహనాలతో ఆ కాంప్లెక్స్నిండి పోవడంతో పాటు విమానాశ్రయ పరిసరాలను ఆక్రమిస్తున్నట్టు తేలింది. అలాగే విమానాశ్రయానికి ఏదేని భద్రతా పరంగా సమస్య తలెత్త వచ్చనే అనుమానాలను చైన్నె ఏయిర్ పోర్టు వర్గాలు ఢిల్లీలోని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇదే మాల్ నుంచి ఓ మహిళ కిందకు దూకి ఆత్మహత్య సైతం చేసుకోవడం వంటి పరిణామాలను, ఇక్కడకు నిత్యం తరలివస్తున్న ప్రేక్షకుల సంఖ్యతో భద్రతా సమస్యలే కాకుండా, పార్కింగ్‌కు మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో భారీ మాల్, థియేటర్లను మూసి వేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పూర్తిస్థాయి కారణాలను తెలియ జేయకుండా ఏకపక్షంగా మూసి వేయాల్సిందేనంటూ ఆదే శాలు జారీ చేయడంపై సంబంధింత మల్టిఫ్లెక్స్ సంస్థ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది. -
ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు
న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. -
Wings India 2024: ఎయిర్ షో తేదీలు ఖరారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్‌షో ప్రత్యేక ఆకర్షణ. -
విమానాశ్రయం విస్తరణే ధ్యేయం.. 300 ఎకరాలు కావాలి
మీనంబాక్కం విమానాశ్రయం విస్తరణే ధ్యేయంగా మరిన్ని పనులు చేపట్టాలని విమానయాన శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 300 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం, స్వదేశీ, అంతర్జాతీయ టెర్మినల్స్‌గా సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం తీర్చిదిద్దారు. ఇక్కడ విమానాల ట్రాఫిక్ పెరిగింది. దీంతో కాంచీపురం జిల్లా పరందూరులో మరో విమానాశ్రయానికి చర్యలు చేపట్టారు. ఈ విమానశ్రయం ప్రారంభమయ్యేలోపు చెన్నైలో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికుల సంఖ్య పెంచడంపై విమానయాన శాఖ దృష్టి పెట్టింది. ఇందుకోసం మీనంబాక్కం విమానాశ్రయ పరిసరాలను మరింతగా విస్తరించబోతున్నారు. ఇందుకు తగ్గ నివేదిక సిద్ధమైంది. ఆ మేరకు ప్రస్తుతం కార్గో ఉన్న పరిసరాలను విమాన సేవలకు ఎంపిక చేశారు. కార్గో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. కార్గోను మరో చోటకు మార్చేందుకు తగిన ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. విమానాశ్రయానికి అవతలి వైపు ఉన్న ఖాళీ స్థలాలపై సైతం అధికారులు దృష్టి పెట్టడం గమనార్హం. 300 ఎకరాల స్థలాన్ని మరింత విస్తరణ పనులకు స్వాధీనం చేసుకోబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: హమ్మయ్యా..ఎస్బీఐ ఖాతాదారులకు భారీ ఊరట! -
కరోనా పేరు చెప్పి విమానం ఎక్కనివ్వరా ? హైకోర్టులో ఎన్నారై ఫైట్!
కరోనా వచ్చింది మొదలు జాగ్రత్తలు మొదలు , టెస్టుల, చికిత్సా విధానం వరకు నిబంధనల్లో బోలెడు వైరుధ్యాలు ఉన్నాయి. చాలా మంది వీటిని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. కానీ ఓ ఎన్నారై మాత్రం కరోనా టెస్టుల్లో డొల్లతనం.. దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఏకంగా హైకోర్టునే ఆశ్రయించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏవియేషన్ డిపార్ట్మెంట్, ఐసీఎంఆర్‌ల పనితీరుని నేరుగా ప్రశ్నించాడు. అబుదాబీకి పయణం కేరళాకి చెందిన ముజామిల్ వరికొట్టిల్ (29) అనే యువకుడు పదేళ్లుగా అబుదాబీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని సంపాదనపైనే ఇండియాలో కుటుంబం ఆధారపడి ఉంది. కాగా నాలుగు నెలల క్రితం ముజామిల్ కేరళా వచ్చాడు. తిరిగి అబుదాబీ వెళ్లేందుకు టిక్కెట్టు బుక్ చేసుకున్నాడు. 2022 జనవరి 29న కోజికోడ్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేందుకు అతను ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు. చిక్కొచ్చి పడింది ఎయిర్పోర్ట్ అధికారులు కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా ముజామిల్‌ని ఆదేశించారు. ప్రయాణానికి రెండు రోజుల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్‌లో చేయించిన కరోనా ఆర్టీ పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించినా ఎయిర్పోర్ట్ అధికారులు అంగీకరించలేదు. ఎయిర్‌పోర్టులో టెస్ట్ చేయించాల్సిందే అంటూ పట్టుబట్టారు. దీంతో రూ. 2,490 చెల్లించి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించాడు. అప్పుడు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు ముజామిల్‌ని ఫ్లైట్ ఎక్కనీయకుండా ఇంటికి పంపించేశారు. హైకోర్టులో కేసు ఫ్లైట్ మిస్ అవడం వల్ల అబుదాబీలో డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు ముజామిల్. అంతేకాకుండా ఫ్లైట్ టిక్కెట్ కోసం ఖర్చు పెట్టిన రూ.15,000 వెనక్కి ఇచ్చేందుకు విమాన సంస్థ నిరాకరించింది. ఓ వైపు ఉద్యోగం పోవడం, మరోవైపు ఆర్థిక నష్టం కలగడంతో ముజామిల్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోలేదు. వెంటనే తగు ఆధారాలతో కేరళా హైకోర్టును ఆశ్రయించాడు. అతను సమర్పించిన ఆధారాలు బలంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ఆర్యోగ శాఖలు, ఐసీఎంఆర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కాలికట్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్లను ప్రతివాదులగా చేర్చుతూ కేసును విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు పంపింది. ముజామిల్ లేవనెత్తిన కీలక అంశాలు - ప్రయాణానికి రెండు రోజుల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ టెస్ట్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఎందుకు అంగీకరించలేదు - కోజికోడ్ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్ట్ సెంటర్‌కి ఐసీఎంఆర్ నుంచి ఎటువంటి అధికారిక గుర్తింపు లేదు. ఎటువంటి గుర్తింపు లేకుండా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రైవేట్‌గా ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు. - ప్రయాణానికి రెండు రోజుల ముందు, అంతకు ముందు చేసిన ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు ఐసీఎంఆర్ సైట్లో కనిపిస్తున్నాయి. కానీ ఎయిర్‌పోర్టులో చేసిన రిపోర్టులు కనిపించడం లేదు. - రెండు రోజులు ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ నెగటీవ్ రిపోర్టు ఉండగా గుర్తింపు లేని ల్యాబ్ నుంచి మరోసారి ఎందుకు కోవిడ్ టెస్ట్ చేయించారు. - నిబంధనలకు విరుద్ధంగా చేసిన టెస్ట్ వల్ల ఉద్యోగం కోల్పోవడంతో పాటు ఆర్థిక నష్టం జరిగింది. కుటుంబానికి ఆర్థిక అండ లేకుండా పోయింది. అంతేకాదు ప్రయాణం చేయకుండా నా ప్రాథమిక హక్కును అడ్డుకున్నారు. చదవండి: అమెరికాలో విచిత్ర ఘటన.. ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్టుగా.. -
ఏఏఐకు ఎయిర్‌లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల నిర్వహణ సంస్థ – ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఎయిర్‌లైన్స్ సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, గోఫస్ట్, ఎయిరేషియా ఇండియా, ఎయిర్ ఇండియా, విస్తారా కలసి 2021 అక్టోబర్ చివరికి రూ.2,636 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఎయిర్ నేవిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్ తదితర రూపాల్లో ఏఏఐకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏఏఐకు అత్యధిక బకాయిలు ఎయిర్ ఇండియానే చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి 1 నాటికి రూ.2,184 కోట్ల మేర ఎయిర్ ఇండియా చెల్లించాల్సి ఉంటే.. 2021 అక్టోబర్ చివరి నాటికి రూ.2,362 కోట్లకు పెరిగినట్టు ఏఏఐ అంతర్గత పత్రాలు తెలియజేస్తున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించడం తెలిసిందే. -
ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్.. ఆ 121 మంది ఎక్కడ?
సాక్షి,మహారాణిపేట(విశాఖ దక్షిణ): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన 121 మంది విమాన ప్రయాణికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 34 ఏళ్ల వయస్సు గల యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో విమానాశ్రయంలో పరీక్షలు ముమ్మరం చేసింది. ఈ యువకుడు విజయనగరం జిల్లాకు చెందిన వాడైనా మధురవాడలో ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని జిల్లా యంత్రాంగం స్పెషల్ బ్రాంచి పోలీసులను కోరింది. కేంద్ర విమానయాన శాఖ పంపిన జాబితా ప్రకారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, పర్యాటక శాఖ అధికారులు చర్యలకు దిగారు. విమానాశ్రయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటి నుంచి 13వ తేదీ వరకు వివిధ దేశాల నుంచి 2825 మంది విశాఖ చేరుకున్నారు. వీరిలో 2704మంది ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. నెగిటివ్ వచ్చింది. ఇంకా 121 మంది ఎక్కడ ఉన్నారో తెలియక వైద్య ఆరోగ్య శాఖ అయోమయంలో పడింది. విమాన యాన శాఖ ఇచ్చిన జాబితాల ప్రకారం గాలిస్తున్నారు. ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ రంగంలో దిగి తనిఖీలు ముమ్మరం చేశారు. చిరునామా వివరాలు పూర్తిగా లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్ చేయడం వల్ల వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. గత రెండు రోజుల కిందట 296 మంది ఆచూకీ లభించలేదు. వీరిలో ఆది, సోమవారాల్లో 175 మంది ఆచూకీ తెలియడంతో వారికి పరీక్షలు నిర్వహించారు. మిగతా వారి కోసం వెతుకుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున దృష్టికి కూడా తీసుకెళ్లారు. విమానాశ్రయంలో పరీక్షలు విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడం కోసం విమానాశ్రయంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక వైద్యుడు, నర్సు, ఏఎన్ఎం, ఇతర సిబ్బంది ఈ బృందంలో ఉంటున్నారు. ప్రయాణికులకు తొలుత కరోనా పరీక్షలు చేస్తున్నారు. తర్వాత ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల పూర్తి వివరాలు సేకరించి, బయటకు పంపుతున్నారు. మాస్క్ పెట్టుకోకపోతే రూ.100 జరిమానా మధురవాడ ఏరియాలో హోమ్ ఐసోలేషన్‌లో 34 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి నెగిటివ్ వచ్చింది. అయినా రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండమన్నాం. ఆ ఇంటి చుట్టూ ఎవరిని లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశాం. బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేనిపక్షంలో రూ.100 జరిమానా విధిస్తాం. భౌతిక దూరం పాటించాలి. ఇందులో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. – డాక్టర్ ఎ.మల్లికార్జున, కలెక్టర్, విశాఖపట్నం చదవండి: రైతు బిడ్డగా కొత్త జీవితం.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని.. -
AP: విమానయానం రయ్ రయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయాన రంగం కోవిడ్ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో విమాన ప్రయాణీకుల సంఖ్యలో 159.11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ సర్వీసుల సంఖ్యలో 75.51 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి గడిచిన ఆర్నెల్ల కాలంలో 11,88,673 మంది ప్రయాణించారు. గత ఏడాది ప్రయాణించిన 4,58,738 మందితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో 159 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో విమాన సర్వీసులు సంఖ్య 7,982 నుంచి 14,010కు పెరిగింది. చదవండి: చిరకాల స్వప్నం నెరవేరింది..: ఏపీ టీచర్స్ గిల్డ్ హర్షం అంతర్జాతీయ సర్వీసులపై ఇంకా ఆంక్షలు ఉండటంతో విదేశీ సర్వీసులు సంఖ్య నామమాత్రంగానే ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో దేశీయ సర్వీసులు మాత్రం కోవిడ్ ముందు స్థితికి చేరుకోవడమే కాకుండా కొత్త సర్వీసులు కూడా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్‌కు ముందు విశాఖకు అంతర్జాతీయ సర్వీసులతో కలిపి రోజుకు 80 వరకు విమానాల రాకపోకలు ఉండగా ఇప్పుడిది 62 వరకు చేరుకుందని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కేఎస్ రావు ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కసారి అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు తొలగిపోతే ఈ సర్వీసుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తిరుపతికి పెరిగిన డిమాండ్ ఇక రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లోకెల్లా తిరుపతికి డిమాండ్ బాగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తిరుపతి ప్రయాణికుల సంఖ్యలో 262.59 శాతం, సర్వీసుల సంఖ్యలో 205.78 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 59,129 మంది ప్రయాణించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా 2,14,400కు చేరింది. ఇదే సమయంలో విమాన సర్వీసుల సంఖ్య 1,002 నుంచి 3,064కు చేరింది. కోవిడ్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాలపై ఆంక్షలు తొలగించడమే ప్రయాణికుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే స్పైస్‌జెట్ ఢిల్లీ నుంచి తిరుపతికి నేరుగా సర్వీసు ప్రారంభించగా ఇండిగో డిసెంబర్ 15 నుంచి విశాఖ–తిరుపతి సర్వీసును ప్రారంభించనుంది. డిమాండ్ పెరుగుతుండడంతో మరిన్ని పట్టణాల నుంచి తిరుపతికి సర్వీసులను పెంచే యోచనలో విమానయాన సంస్థలున్నాయి. మరోవైపు.. తిరుపతి తర్వాత విశాఖ విమాన సర్వీసులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. గడిచిన ఆరు నెలల కాలంలో విశాఖ నుంచి 5,861 సర్వీసుల ద్వారా 2,14,400 మంది ప్రయాణించారు. కొత్తగా ప్రారంభమైన కర్నూలు విమానాశ్రయం ద్వారా ఆరు నెలల్లో 14,224 మంది ప్రయాణించారు. -
చార్టర్డ్ ప్లేన్స్‌కు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తొలుత చార్టర్డ్ విమానాలను నడుపుకొనేందుకు వీలుగా అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా అధికారులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ప్రతిపాదించారు. వాస్తవానికి ఏడాదిన్నర కిందటే ఈ అంశంపై ఏఏఐతో అధికారులు చర్చించారు. ఈ లోపు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఏఐ వాణిజ్య విభాగం.. టెక్నో ఫీజిబులిటీ సర్వే నిర్వహించేందుకు సిద్ధం కావటంతో ఆ అంశం మరుగున పడింది. దాదాపు రెండు నెలల కింద ఆ నివేదిక వచ్చింది. దాని ప్రకారం విమానాశ్రయాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుందని స్పష్టం చేసింది. దీంతో వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా కొన్ని అడ్డంకులను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మళ్లీ సర్వే చేయాల్సి రావటంతో కొత్త విమానాశ్రయాల అంశం కొలిక్కి రాలేదు. దీంతో భవిష్యత్తులో వాటిని పెద్ద విమానాలు నడుపుకొనేందుకు వీలుగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తూనే.. తొలుత చిన్నపాటి రన్వేలు నిర్మించి చార్టర్డ్ విమానాలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని తాజాగా కోరింది. వరంగల్ ఒక్కటే అనుకూలం.. నిజాం హయాంలో నిర్వహించిన వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా యత్నిస్తోంది. దీంతోపాటు జక్రాన్‌పల్లి (నిజామాబాద్), పాల్వంచ (భద్రాచలం–కొత్తగూడెం), బసంత్‌నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించింది. తాజాగా ఏఏఐ అందించిన టెక్నో ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం రూ.2,300 కోట్లకుపైగా ఖర్చు కానుంది. దీన్ని వీలైనంత తగ్గించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ఏఏఐ ముందుంచింది. విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకుల్లో కొన్నింటిని వదిలేస్తే ఖర్చు తగ్గుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం. అది సాధ్యమా కాదా అన్న విషయంలో ఏఏఐ తిరిగి నివేదిక అందించాల్సి ఉంది. ఆ తర్వాత తుది సర్వే చేయాలి. ఇదంతా జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున చార్టర్డ్ విమానాలను నడిపితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి సమయ పట్టిక ఆధారంగా ప్రయాణికుల కోసం నడిపే విమానాలు కాదు. ముందస్తుగా బుక్ చేసుకుంటే సంస్థలు వాటిని ప్రైవేటు అవసరాల కోసం నడుపుతాయి. వీటిల్లో 19 సీట్ల వరకు ఉండే విమానాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ప్రైవేటు విమానాలకు మన వద్ద అంతగా వ్యాపారం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, అక్కడ పరిశ్రమలు భారీగా వస్తుండటం, సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో చార్టర్డ్ విమానాలకు కొంత డిమాండ్ మొదలవుతుందన్న అభిప్రాయంలో ఉంది. టేకాఫ్.. ల్యాండింగ్ ఒకవైపే.. సాధారణంగా రన్‌వేలకు టేకాఫ్, ల్యాండింగ్ వసతి రెండు వైపులా ఉండేలా ప్లాన్ చేస్తారు. మరోవైపు రెండు రన్‌వేలను నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాల ఖర్చు తగ్గించుకునే క్రమంలో తొలుత ల్యాండింగ్, టేకాఫ్ ఒకవైపే అయ్యేలా సాధారణ రన్‌వేతో ప్రారంభించాలని అధికారులు ఏఏఐకి ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాటిని రెండు వైపులా విస్తరించటంతో పాటు రెండో రన్‌వేను కూడా నిర్మించుకోవచ్చని, తొలుత ఒకవైపే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా రన్‌వేకు అనుమతించాలని కోరారు. -
ఇండియన్ ఎయిర్పోర్ట్ లలో వాటాలు అమ్మనున్న AAI
-
ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
గగనయానం దిశగా తెలంగాణ
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాల పరిశీలనలో భాగంగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సాంకేతిక విభాగం బృందాలు పలు దఫాలుగా ఆయా ప్రాంతాలు సందర్శించి సానుకూల నివేదికను అందించాయి. ఏడాదిగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలను తేల్చేందుకు చేస్తున్న కరసత్తును కొలిక్కి తెచ్చిన సాంకేతిక విభాగం.. ఈ మేరకు నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారుపై భారమే.. చిన్న పట్టణాల ప్రజలకు విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఉడాన్ పథకాన్ని తెరపైకి తెచ్చింది. తొలుత కొన్ని పట్టణాలలో నిర్మించే విమానాశ్రయాల ఖర్చులో కొంత భరించేందుకు కూడా సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి తాజా అంచనా ప్రకారం భారీ వ్యయమే కానుంది. ఇక భూసేకరణకు అంతకంటే ఎక్కువ ఖర్చు కానుంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఎయిర్‌పోర్ట్స్ అథా రిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. టెక్నో ఎకనమిక్ ఫీజబిలిటీ రిపోర్టులో భాగంగా, తాజాగా విమానాశ్రయాలకు కావాల్సిన భూమి, అంచనా వ్యయంతో కూడిన తుది నివేదికను ఖరారు చేసింది. రెండురోజుల క్రితం ఆ వివరాలను తెలం గాణ ప్రభుత్వాని కి అందజేసింది. ఈ ఆరు విమానాశ్రయాల ఏర్పా టు సాధ్యమేనని సంస్థ టెక్నికల్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించగా, తాజా నివేదిక నేపథ్యంలో.. తుది అనుమతులకు సంబంధిం చిన సర్వే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నివేదిక ఆధారంగా చేయాల్సిన ఖర్చు, సమీకరించాల్సిన భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని పౌర విమానయాన శాఖకు అంగీకారం తెలిపితే, తుది అనుమతులకు సంబంధించిన సర్వే పనులు మొదలవుతాయి. ప్రతిపాదిత విమానాశ్రయాల్లో వేటికి తుది అనుమతులు ఇవ్వాలన్న విషయం ఆ సర్వేతో ఖరారవుతుంది. ఆ వెంటనే పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమవుతుంది. ఎక్కడెక్కడ? నిజాం హయాంలో సేవలందించిన వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని దాదాపు 15 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు ఆ విమానాశ్రయంతో పాటు మరో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. మామునూరుతో పాటు ఆదిలాబాద్‌లో, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించాలని, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కన్సల్టెన్సీ సేవలు అందించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరగా అంగీకరించింది. ఈ మేరకు సానుకూల నివేదిక ఇచ్చిన సంస్థ సాంకేతిక విభాగం.. తాజాగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలతో నివేదికను రాష్ట్రానికి అందించింది. ఫేజ్–1, 2 నివేదికలో ఫేజ్–1, ఫేజ్–2 పేరుతో సంస్థ వివరాలు పొందుపరిచింది. 40–50 సీట్ల సామర్ధ్యం ఉండే చిన్న విమానాల కోసం ఫేజ్–1 ప్రణాళిక రూపొందించింది. ఇవి పూర్తిగా డొమెస్టిక్ (దేశీయ) విమానాశ్రయాలుగా మాత్రమే ఉంటాయి. ఇతర వసతులు కూడా సాధారణంగా ఉంటాయి. వీటి వ్యయం కొంత తక్కువగా ఉంటుంది. భూమి అవసరం కూడా కొంత తక్కువే. ఇక అంతర్జాతీయ విమానాలు, బోయింగ్ విమానాల కోసం అదనపు హంగులతో నిర్మించే విమానాశ్రయాల కోసం ఫేజ్–2 ప్రణాళిక రూపొందించింది. వీటి వ్యయం కాస్త ఎక్కువ. భూమి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్చు తగ్గింపుపై త్వరలో భేటీ ఇంత భారాన్ని భరించటం కష్టమైన విషయమే కావటంతో ఖర్చును ఎంతమేర తగ్గించాలనే విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. విమానాశ్రయానికి కావాల్సిన వసతులు, భద్రత ప్రమాణాల ప్రకారం అంచనా వ్యయం రూపొందుతుంది. ఇందులో భద్రత ప్రమాణాలకు చేయాల్సిన ఖర్చు విషయంలో రాజీ ఉండదు. వసతుల పరంగా అయ్యే వ్యయంలోనే కొంత కోతపెట్టి ఖర్చును తగ్గించవచ్చు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఎక్కువ భూమిని సేకరించటం సహజం. దాన్ని ఇప్పుడు భారీగా తగ్గించటం ద్వారా భూసేకరణ వ్యయాన్ని కొంత అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమే రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. ఇక వరంగల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున అక్కడ ఫేజ్–2 ప్రకారం విమానాశ్రయాన్ని నిర్మించి, మిగతా చోట్ల ఫేజ్–1 ప్రమాణాల ప్రకారం తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉంది. అలాగే ఒకేసారి ఆరుచోట్ల కాకుండా తొలుత ఒకటి, రెండు చేపట్టి.. మిగతావి దశలవారీగా చేపట్టే అవకాశం కూడా ఉంది. విమానాశ్రయానికి 150 కి.మీ. లోపు మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదనే ఒప్పందం జీఎంఆర్ ఎయిర్‌పోర్టు–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉంది. అందువల్ల మమహబూబ్‌నగర్ విమానాశ్రయం విషయంలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై జీఎంఆర్ సంస్థతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
Covid Crisis : ‘శంషాబాద్’ నుంచి కేంద్రం అవుట్
హైదరాబాద్: పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడుల ఉపసంహారణ పట్ల కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. నలువైపులా విమర్శలు వస్తోన్నా... ముందుకే వెళ్తోంది. తాజాగా శంషాబాద్‌తో పాటు బెంగళూరులోని కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ఉన్న వాటాల విక్రయానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సిద్ధమైంది. ఏఏఐ వాటా సిలిక్యాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు, హైటెక్ సిటీ హైదరాబాద్‌లలో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వాటాలు విక్రయించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఈ రెండు ఎయిర్‌పోర్టుల్లో ఏఏఐకి 13 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటాను కూడా అమ్మేసి ఎయిర్‌పోర్టుల నిర్వాహాణ వ్యాపారం నుంచి నెమ్మదిగా పక్కకు తప్పుకుంటోంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో తమ వాటా విలువను మదింపు పనుల్లో ఏఏఐ బిజీగా ఉంది. అప్పులు తీర్చేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కోవిడ్ సెకండ్‌వేవ్ కారణంగా వెయ్యి కోట్ల నష్టం వచ్చినట్టు ఏఏఐ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో వాటాలు అమ్మకం ద్వారా నిధులు సమీకరించి అప్పులు తీర్చే పనిలో ఏఏఊ ఉంది. ముందుగా బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న వాటాలు విక్రయించి తర్వాత ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల నిర్వహాణ నుంచి కూడా తప్పుకోనుంది. ప్రభుత్వ వాటా 13 శాతమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ గ్రూపు ప్రధాన వాటా దారుగా ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ కంపెనీ 63 శాతం వాటాతో మెజార్టీ షేర్ హోల్డర్‌గా ఉంది. కాగా మలేషియన్ ఎయిర్పోర్ట్ హోల్డింగ్ సంస్థకి 11 శాతం వాటాలు ఉన్నాయి. మొత్తంగా 74 శాతం వాటాలు ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. కేవలం ఏఏఐ 13 శాతం, తెలంగాణ ప్రభుత్వం 13 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. తాజాగా ఏఏఐ కూడా పెట్టుబడులు ఉపసంహరిస్తుండటంతో శంషాబాద్‌లో ప్రభుత్వ వాటా కేవలం 13 శాతానికే పరిమితం కానుంది. బెంగళూరు విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి : రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త! -
విమానాలకు ఎదురుగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విమానయాన రంగానికి కోవిడ్ దెబ్బ గట్టిగానే తగిలింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2020–21లో రాష్ట్ర విమాన ప్రయాణికుల్లో ఏకంగా 57 శాతం క్షీణత నమోదైంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2020–21లో కోవిడ్ వల్ల విమాన సర్వీసులపై ఆంక్షలు ఉండటంతో ప్రయాణికులు స్వేచ్ఛగా ఎగరలేకపోయారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2019–20లో ఈ 5 ఎయిర్‌పోర్టుల నుంచి 51.65 లక్షల మంది ప్రయాణించగా.. అది 2020–21లో 22.27 లక్షలకు పరిమితమైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 34.10 కోట్ల నుంచి 11.53 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలోని ఐదు విమానాశ్రయాల నుంచి గతేడాది కేవలం 29,874 విమానాలు మాత్రమే ఎగిరాయి. అంతకుముందు ఏడాది 57,680 సర్వీసులతో పోలిస్తే 48.21 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల సంఖ్య 25.87 లక్షల నుంచి 11.96 లక్షలకు పరిమితమయ్యాయి. దేశీయ విమానయాన రంగం మెల్లగా కోలుకుంటోంది అనుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఏడాది కూడా విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడిచే అవకాశాలు కనిపించడం లేదని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. విశాఖకు ఆగిపోయిన విదేశీ విమానాలు.. రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నప్పటికీ.. కేవలం విశాఖకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుండేవి. 2019లో విజయవాడ నుంచి సింగపూర్‌కు ఒక ఆరు నెలల పాటు వీజీఎఫ్ కింద విమాన సర్వీసులు నడిపారు. ఆ తర్వాత ఆ స్కీం ఆగిపోవడంతో.. విజయవాడకు అంతర్జాతీయ సర్వీసులు ఆగిపోయాయి. కోవిడ్ వల్ల అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉండటంతో.. విశాఖకు వచ్చే విదేశీ విమానాల సంఖ్య భారీగా పడిపోయింది. 2019–20లో విశాఖకు 1,885 అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 89కి పరిమితమయ్యింది. గతంతో పోలిస్తే కేవలం 5 శాతం విదేశీ విమానాలు మాత్రమే గాలిలోకి ఎగిరాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య 95 శాతం క్షీణించి.. 1,43,535 నుంచి 7,581కి పడిపోయింది. విజయవాడకు విదేశీ విమానాల జోరు.. విజయవాడకు 2020–21లో భారీగా విదేశీ విమానాలు వచ్చి వాలాయి. 2019–20లో కేవలం సింగపూర్ నుంచి 52 సర్వీసులు నడవగా.. 2020–21లో ఏకంగా 40కిపైగా దేశాల నుంచి 560కి పైగా విదేశీ విమాన సర్వీసులు నడిచాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా 5,032 నుంచి 72,478కి పెరిగింది. లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులు నడిపింది. మన రాష్ట్రానికి వచ్చే వారికోసం అత్యధిక సర్వీసులు విజయవాడ విమానాశ్రయానికి వచ్చాయి. -
జీవీకే గ్రూప్ చైర్మన్‌కు సీబీఐ షాక్..
-
జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్!
సాక్షి, ముంబై: ఎయిర్ పోర్ట్ స్కాం కేసులో జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్ ఇచ్చింది. జీవీకే గ్రూపు ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జీ వెంకట కృష్ణారెడ్డి, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (మియాల్), జీవీకే కుమారుడు, మియాల్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 705 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడిన ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో మరో తొమ్మిది ప్రైవేట్ సంస్థలపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, 2012-2018 మధ్య కాలంలో అక్రమంగా 705 కోట్లకు పైగా లాభాలను ఆర్జించారనేది ప్రధాన ఆరోపణ. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఇతర విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన జాయింట్ వెంచర్ "ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్'' లేదా మియాల్. ఇందులో జీవీకే వాటా 50.5 శాతం కాగా, 26 శాతం వాటా ఏఏఐ సొంతం. 2006 లో ఏఏఐ, మియాల్ ఒప్పందం ప్రకారం ముంబై విమానాశ్రయ నిర్వహణ మియాల్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ ఆదాయంలో 38.7 శాతం వార్షిక రుసుముగా ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన నిధులు విమానాశ్రయం ఆధునీకరణ, ఆపరేషన్, నిర్వహణ కోసం ఉద్దేశించింది. అయితే తొమ్మిది ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపి బోగస్ వర్క్ కాంట్రాక్టులు చూపించి 310 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. వీటిలో ఎక్కువ భాగం 2017-18 మధ్య ముంబై విమానాశ్రయం చుట్టూ 200 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వినియోగించినట్టు పేర్కొంది. జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని , తద్వారా జాయింట్ వెంచర్ కంపెనీకి 100 కోట్ల రూపాలయకు పైగా నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. అదే కాలంలో నిందితులు మియాల్ ఆదాయాన్ని తక్కువగా నివేదించారని దర్యాప్తులో తేలిందనీ, దీంతో కలిపి ప్రభుత్వ ఖజానాకు మొత్తం నష్టం రూ .1,000 కోట్లకు పైగా ఉంటుందని సీబీఐ వర్గాల వాదన. -
త్వరలో వరంగల్ ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం వెల్లడించారు.అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో పాత ఎయిర్‌పోర్టుల పునరుద్ధరణతోపాటు కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలిపోర్ట్స్ తేనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుదిబండ వద్ద కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు వరంగల్ సమీపంలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్ వద్ద ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా ప్రదర్శన, సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్‌గా నియమించాం. వరంగల్ విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపంలోకి వచ్చేందుకు అన్ని శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన రంగానికి ఊతమిస్తుంది.మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్‌కు తోడ్పాటు లభిస్తుంది. ‘ఉడాన్’లో భాగంగా వరంగల్ విమానాశ్రయాన్ని జత చేయాలని కేంద్రాన్ని కోరాం’అని చెప్పారు. భారత్‌లో తొలి అటానమస్ బగ్గీని ఆవిష్కరించిన అనంతరం అందులో కేటీఆర్ ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే నడుస్తుంది. -
ఏరోస్పేస్‌కు కొత్త రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించేందుకు ఈ ఏడాది మార్చిలో జరిగే ‘వింగ్స్ ఇండియా–2020’ని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. భారతీయ పౌర విమానయాన పరిశ్రమకు తలమాణికంగా భావించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ‘వింగ్స్ ఇండియా 2020’లో భాగంగా అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సులుంటాయి. ‘ఫ్లైయింగ్ ఫర్ ఆల్’నినాదంతో జరిగే ‘వింగ్స్ ఇండియా’ద్వారా రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి అవసరమైన వాతావరణం వృద్ధి చెందగా.. ఎయిరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచస్థాయి కంపెనీలు బోయింగ్, జీఈ, రాఫెల్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు సుమారు వేయి చిన్న, మధ్య తరహా ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలు, నాలుగు ఏరోస్పేస్ పార్కులున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్‌లు రాష్ట్రంలో ఉండటంతో భవిష్యత్‌లో ఏరోస్సేస్, డిఫెన్స్ రంగాల వృద్ధికి మరింత అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏరోస్పేస్ శిక్షణపైనా దృష్టి ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు శిక్షణ రంగంపైనా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఇప్పటికే బోయింగ్, ఫ్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఏరోస్పేస్ వంటి స్టార్టప్ సంస్థలతో నూతన ఆవిష్కరణల కోసం ‘టీ హబ్’పనిచేస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే ‘టీ వర్క్స్’ద్వారా కూడా ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులకు తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ (టాస్క్) తరఫున శిక్షణ ఇస్తుండగా, ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా ఈ రంగాలకు చెందిన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పాలసీని రూపొందించిన రాష్ట్రం.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక పాలసీ తయారు చేయాలనే యోచనలో ఉంది. పారిశ్రామికవాడల్లో హెలిపోర్టులు.. దేశవ్యాప్తంగా వచ్చే నాలుగేళ్లలో వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. మామునూరు (వరంగల్), ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి (నిజామాబాద్), బసంత్‌నగర్ (పెద్దపల్లి), అడ్డాకుల (మహబూబ్‌నగర్)లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిం ది. ఈ 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తోంది. హైదరాబాద్ బయట వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఐటీ క్లస్టర్లతో పాటు, ఫార్మాసిటీ వంటి భారీ పారిశ్రామికవాడల్లో హెలిపోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ హెలీపోర్టుల ద్వారా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందడంతో పాటు, పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభిస్తుందనే అంచనా వేస్తోంది. వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు నిధులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. -
‘విమానాశ్రయం’పై ఉత్కంఠ.!
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏయిర్‌ఫోర్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించి బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు పంపనుండగా, మరోవైపు జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారులు విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి రూట్‌మ్యాప్‌లు ఖరారు చేసి రెడీగా ఉంచడంతో మరింత ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఏఏఐ అధికారుల బృందం సభ్యులు హైదరాబాద్ నుంచి జిల్లాకు రానున్నట్లు అధికారులకు సమాచారం. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఎయిర్‌పోర్టు విస్తరణలో సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడంతో పాటు వైమానిక శిక్షణ కోసం వినియోగిస్తున్న బేస్‌క్యాంప్‌ను పరిశీలన చేయనున్నారు. అందుబాటులోని స్థలం, బౌండ్రీలు, వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ డిమాండ్, రూట్‌మ్యాప్‌లు తదితర అంశాలను పరిశీలిస్తారు. జిల్లా అధికారుల సహకారం తీసుకోనున్నారు. స్థలాన్ని పరిశీలించనున్న బృందం.. ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఎయిర్‌బేస్ ఉంది. దీనిని పౌర విమానయాన సేవలకు తీర్చిదిద్దేందుకు రెండు విడతల్లో తొమ్మిది వందల ఎకరాలకుపైగా అవసరం అవుతుందని ప్రభుత్వం ఇది వరకే లెక్కలు వేసింది. అయితే విమానశ్రయం ఏర్పాటుకు కావాల్సినంత భూమి అందుబాటులో ఉండడంతో జిల్లా ఎంపికైందని చెప్పవచ్చు. 2014లో జిల్లా అధికారులు చేసిన సర్వే ప్రకారం 1,591.45 ఎకరాల భూమి విమానశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 89.44 ఎకరాలు ఉండగా, ప్రైవేట్ భూమి 1502.01 ఎకరాలు ఉన్నట్లు తేలింది. పట్టణానికి అనుకొని ఉన్న ఖానాపూర్ శివారులో ప్రభుత్వ భూమి 50.20 ఎకరాలు, అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి శివారులో 5.20 ఎకరాలు ఉంది. ప్రైవేట్ భూమి ఖానాపూర్ శివారులో 431.36 ఎకరాలు, అనుకుంట శివారులో 501.34 ఎకరాలు, కచ్కంటి శివారులో 313.24 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 256.07 ఉన్నట్లు అప్పట్లో సర్వే ద్వారా నిర్థారించారు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ భూమిని కలుపుకొని మొత్తం 1591.45 ఎకరాలు ఉన్నట్లు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఏర్పాటుకు జిల్లా అనుకూలం.. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయానికి వాయుమార్గంలో 150 కి.మీ. పరిధిలో కొత్తగా ఏయిర్‌పోర్టులు నిర్మించబోమని గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు 300 కి.మీ.లకుపైనే ఉంది. దీంతో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు అనుకూలించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వరకే జిల్లా అధికారుల బృందం విమానశ్రయ ఏర్పాటుకు జిల్లా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతోపాటు అప్పట్లో ఏయిర్‌ఫోర్స్ అధికారులు జిల్లాకు వచ్చి స్థలాన్ని పరిశీలన చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ – నాగ్‌పూర్ రెండు నగరాల మద్యలో జిల్లా ఉండడం, ఏర్పాటుకు కావాల్సిన స్థలం అందుబాటులో ఉండడం, ఇది వరకే ఓ మిలిటరీ ఏయిర్‌బేస్ ఉండడం లాంటివి ఏర్పాటుకు కలిసివస్తున్నట్లు చెప్పవచ్చు. ఏఏఐ నివేదికపైనే ఆశలు.. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్ కింద రాష్ట్రంలో ఆరు విమానశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహాబూబ్‌నగర్, కొత్తగూడెంలలో విమానశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఏఏఐ బందంని జిల్లాలకు పంపిస్తోంది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. అయితే పరిశీలనలో తెలుసుకున్న అంశాలు, ఏఏఐ బృందం రూపొందించే నివేదికపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అన్ని కోణాల్లో పరిశీలన చేసి విమానశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు బృందం నిర్థారిస్తే జిల్లాకు విమానయోగం కలుగనుంది. -
రూటు మారిన విమానాశ్రయం
సాక్షి, దేవరకద్ర : మహబూబ్‌నగర్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన స్థలాల అన్వేషణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలోనే ఎయిర్‌పోర్టు నెలకొల్పే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం మాత్రం తేలడం లేదు. గతంలో అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. తాజాగా మంగళవారం దేవరకద్ర మండలం చౌదర్పల్లి, హజిలాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను జిల్లా రెవెన్యూ సర్వేయర్ అధికారులు పరిశీలించడంతో ఎయిర్ పోర్టు రూటు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా నియోజకవర్గంలోని మూసాపేట వద్ద విభా సీడ్స్ కంపెనీ సమీపంలో, భూత్పూర్ మండలంలోని హెచ్‌బీఎల్ కంపెనీ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేవరకద్ర నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారికి దగ్గరే.. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు స్థల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రోడ్డు మార్గం కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టుకు జాతీయ రహదారి దగ్గరగా ఉండాలని ఏవియేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, హజిలాపూర్లు 44వ జాతీయ రహదారికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గతంలో అడ్డాకుల మండలం గుడిబండ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ స్థలంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ సమస్యగా ఉన్నందున విమానాశ్రయం దేవరకద్ర మండలం వైపు మళ్లించినట్లు తెలుస్తుంది. ఏఏఐ బృందం పర్యటన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో ఈ నెల 21 నుంచి 22 వరకు పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో 23న హైదరాబాద్‌కు తిరిగి వచ్చే బృందం మహబూబ్‌నగర్ జిల్లాకు మరోసారి వచ్చే అవకాశం ఉంది. అయితే వారి రాక అధికారికంగా ఖరారు కాకపోయినా తాజాగా దేవరకద్ర మండలంలోని భూములను పరిశీలించినట్లు తెలుస్తుంది. చౌదర్పల్లి, హజిలాపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉండడం, విమానాశ్రయానికి అనువుగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉంది. -
‘ల్యాండ్’ కాని ఎయిర్‌పోర్టు
సాక్షి, దేవరకద్ర/ అడ్డాకుల : పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన స్థలాల అన్వేషణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలోనే ఎయిర్‌పోర్టు నెలకొల్పే అవకాశం ఉందని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. తాజాగా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించినా మరో రెండు, మూడు స్థలాలను ఎంపిక చేసి పరిశీలించాలని నిర్ణయించడంతో స్థల ఎంపికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించిన తర్వాత దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో కొన్ని ప్రదేశాలను అధికారులు స్థల పరిశీలన నిమిత్తం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, మూసాపేట విభా సీడ్స్ కంపెనీ సమీపంలో, భూత్పూర్ మండలంలోని హెచ్‌బీఎల్ కంపెనీ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో ఏదో ఒకచోట ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుడిబండ ఆశలు ఆవిరేనా..? గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు కోసం అధికారులు పరిశీలించిన స్థలంలో రెండు ప్రధాన విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ స్థలాన్ని పరిశీలించిన సందర్భంలో విద్యుత్ లైన్‌పై చాలాసేపు అధికారులు చర్చ చేశారు. లైన్ మార్పు చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించిన తర్వాత ఇతర ప్రాంతాల్లో స్థలాలను చూడాలని నిర్ణయించారు. దేవరకద్ర సమీపంలో ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి ప్రకటన తర్వాత.. 2018 మార్చి 27న జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే మొదట అధికారులు గుడిబండ వద్ద స్థల పరిశీలన చేశారు. తర్వాత మూసాపేట మండలంలోని తుంకినిపూర్, వేముల, దాసర్పల్లి గ్రామాల వద్ద స్థలాలను చూశారు. ఆ తర్వాత భూత్పూర్ మండలంలోని రావులపల్లి వద్ద కూడా స్థలాలను పరిశీలించారు. స్థలాలకు సంబంధించిన మ్యాపులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్పట్లో స్థల పరిశీలనకు రాకపోవడంతో ఎయిర్‌పోర్టు అంశం మూలకు పడింది. తాజాగా మళ్లీ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై అధికారులు స్థలాలను పరిశీలిస్తుండటంతో ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. జాతీయ రహదారికి సమీపంలో.. విమానాశ్రయం ఏర్పాటుకు స్థల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రోడ్డు మార్గం కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎయిర్ పోర్టుకు జాతీయ రహదారి దగ్గరగా ఉండాలని ఏవియేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలు మాత్రమే హైవేకు దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూడు మండలాలనే పరిగణలోకి తీసుకుంటే గుడిబండనే అన్నింటికీ అనుకూలంగా ఉండనుంది. ఒకవేళ రవాణా మార్గాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుంటే దేవరకద్ర మండలం వైపు అధికారులు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్అండ్బీ అధికారులు ఇటీవల పరిశీలించిన స్థలాల వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. -
భోగాపురంలో భారీ స్కామ్‌కు స్కెచ్
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్కామ్‌కు చంద్రబాబు స్కెచ్ వేశారు. విమానాశ్రయ ప్రకటన చేసినప్పటి నుంచీ ముడుపుల కోసం అనేక జిమ్మిక్కులు చేస్తూ వచ్చిన చంద్రబాబు.. చివరికి ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే తన ప్రణాళికను అధికారుల ద్వారా అమలు చేయించారు. తద్వారా చంద్రబాబు జేబులోకి కోట్ల రూపాయలు వెళ్లనున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆహ్వానించిన టెండర్లలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎల్–1గా, జీఎంఆర్ ఎల్–2గా వచ్చిన విషయం తెలిసిందే. 30.2 శాతం రెవెన్యూ వాటా, ఎకరానికి ఏడాదికి లైసెన్స్ ఫీజు కింద 20 వేల రూపాయలు, ప్రతీ ఏడాది లైసెన్స్ ఫీజు మొత్తం ఆరు శాతం పెంచడంతోపాటు 26 శాతం ఈక్విటీ ఇస్తామని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. జీఎంఆర్ కేవలం 21.6 శాతమే రెవెన్యూ వాటా ఇస్తామని తెలిపింది. దీంతో అధికారులందరూ ఎయిర్ పోర్ట్ అధారిటీ ఇండియాకు టెండర్‌ను అప్పగించాల్సిందిగా సిఫార్సు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ముడుపులు అందే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు పట్టుపట్టి మరీ టెండర్‌ను రద్దు చేయించారు. అదనపు పనుల పేరుతో మళ్లీ టెండర్లు ఆహ్వానించి.. ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా పాల్గొనకుండా జీఎంఆర్‌కు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు. ఈ టెండర్లలో డీవోఐటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీవీకే ఎయిర్ పోర్ట్ లిమిటెడ్, జీఎంఆర్ సంస్థలు పాల్గొన్నాయి. నిబంధనల్లో తొలుత రెవెన్యూ వాటా ఎంత ఇస్తారనేది పేర్కొనగా తరువాత పిలిచిన టెండర్లో విమాన టికెట్లో వాటా ఎంత ఇస్తారంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా భూమిని లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని, విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్‌లో వచ్చిన తరువాత పదో సంవత్సరం నుంచి టికెట్ ఫీజు చెల్లించాలనే నిబంధనలు రూపొందించారు. టికెట్ ఫీజు బెంచ్ మార్క్‌గా 209 రూపాయలనే టెండర్ నిబంధనల్లో పెట్టారు. దీనిపై జీఎంఆర్ టికెట్ ఫీజుగా 303 రూపాయలు, డీవోఐటీ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ 261 రూపాయలు, వీవీకే 207 రూపాయలను కోట్ చేశాయి. ఎన్నికల కోడ్‌లో కథ నడిపిన చంద్రబాబు మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత అధికారులతో సీఎం చంద్రబాబు భోగాపురం ఫైలును నడిపించారు. మార్చి 15వ తేదీన అధికారులతో కూడిన సాధికార కమిటీ సమావేశమై బిడ్స్‌ను ఖరారు చేసింది. దాని ప్రకారం.. మూడు దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. తొలుత 2,703 ఎకరాల్లో రూ. 2,302.51 కోట్లతో నిర్మాణం చేపడతారు. ఈ భూమిని 99 సంవత్సరాలకు ఎకరానికి రూపాయి లీజుకు అప్పగిస్తారు. ఈ భూమిని తాకట్టు పెట్టి జీఎంఆర్ సంస్థ పెట్టుబడిని సమీకరించనుంది. ఈ భూమి కాకుండా అదనంగా వాణిజ్య అవసరాలకు 793 ఎకరాలను, రెసిడెన్షియల్ అవసరాల కోసం 139 ఎకరాలను జీఎంఆర్‌కు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ భూమి అభివృద్ధి చేయడానికి రూ. 134 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. టికెట్ ఫీజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 303 రూపాయలు 2033 సంవత్సరం నుంచి ఇస్తారు. వీటిపై ఆర్థిక శాఖ, న్యాయ శాఖలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ సాధికార కమిటీ ఆమోదం తెలిపింది. సాధికార కమిటీని ప్రశ్నించిన ఆర్థిక శాఖ టెండర్ నిబంధనల్లో మార్పులపై ఆర్థిక శాఖ సాధికార కమిటీని నిలదీసింది. ‘ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తానన్న రెవెన్యూ వాటాతో పోల్చితే ఇప్పుడు జీఎంఆర్ ఇస్తానన్న టికెట్ ఫీజు అనేది నామమాత్రమే. అలాంటప్పుడు రెవెన్యూ వాటా నిబంధన మార్చేసి టికెట్ ఫీజు ఎందుకు పెట్టారు? టికెట్ బెంచ్ మార్క్ రూ.209గా నిర్ధారించడం వాస్తవికంగా లేదు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకున్నారా లేదా?. విశాఖ నావెల్ ఎయిర్ పోర్ట్ మూసేయకుండా అంతర్జాతీయ విమానాశ్రయం లాభదాయకం కాదు. ఇందుకు అనుమతి తీసుకున్నారా?. భూమి లైసెన్స్‌కు బదులు లీజుకు ఇవ్వాలని ఏ ప్రాతిపదికన నిబంధనలు మార్చారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే టెండర్ నిబంధనల్లో పలు ఉల్లంఘనలున్నాయని, వీటిని సాధికార కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ నుంచి ఇటీవలే సంబంధిత ఫైలు ఇంధన, ఎయిర్పోర్ట్, మౌలిక సదుపాయాల శాఖకు చేరింది. ఎలాగైనా అధికారులపై ఒత్తిడి తెచ్చి భోగాపురం విమానాశ్రయం టెండర్‌ను జీఎంఆర్‌కు అప్పగింపచేయాలని సీఎం యత్నిస్తున్నట్టు అధికార వర్గాలంటున్నాయి. -
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కలవరం అందుకే...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగకుండా అడ్డుకునే లక్ష్యంతోనే ఏపీలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ టీడీపీ సర్కారు జీవో జారీ చేసినట్లు వెల్లడవుతోంది. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడం, సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో అంచనాలు భారీగా పెంచి రూ.వేల కోట్లలో అవినీతికి పాల్పడటం, నీరు–చెట్టు పేరుతో ఉపాధి హామీ నిధులను టీడీపీ నేతలకు పంచిపెట్టడం, విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులను గల్లంతు చేసి భూ కబ్జాలకు దిగడంతోపాటు తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు దొరికిపోయిన నేపథ్యంలో ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగకుండా రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతర్.. రాజధాని, నిర్మాణ పనులు, సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు లాంటి పలు అంశాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సీఎం చంద్రబాబు కేబినెట్లో ఆమోదించుకుని అక్రమాలను సక్రమం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేశారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మినిట్స్‌లో స్పష్టం చేశారు. రాజధాని టెండర్లతో పాటు తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రాజధాని భూ సమీకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో పాటు సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టులో అంచనాల పెంపు, నామినేషన్లపై కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వరకు నేరుగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో లొసుగులు ఉన్నట్లు మినిట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఉపాధి నిధులు నీటి పాలు! విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. హెడ్ వర్క్స్ నుంచి కుడి, ఎడమ కాలువ పనుల వరకూ ఇదే కథ. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల పోలవరం జలాశయం పనులకు సంబంధించిన డిజైన్లు కొలిక్కి రాలేదు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లోనూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. చెరువుల్లో పూడిక తీత, మరమ్మతుల పనులను నీరు–చెట్టు కింద టీడీపీ కార్యకర్తలకు నామినేషన్‌పై అప్పగించి.. పనులు చేయకుండా చేసినట్లు చూపి రూ.15,689 కోట్లను దోచుకున్నారు. ఇందులో ఉపాధిహామీ నిధులే రూ.11,005.25 కోట్లు ఉండటం గమనార్హం. విశాఖ భూముల స్కాంపై స్వయంగా మంత్రే గళం విప్పినా... విశాఖపట్నం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురయ్యాయి. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గంటా, టీడీపీకి చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలలతో సహా పార్టీ ఇతర నాయకుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం గురించి అదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. అయితే సిట్ విచారణ పేరుతో ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఏరులై పారిన అవినీతి.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా పెండింగ్ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తాం. కొత్తగా 35.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ అని సాగునీటి ప్రాజెక్టులపై 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. నాలుగున్నరేళ్లలో రూ.60,266.74 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మినహాయిస్తే రూ.51 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. కానీ ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. ఈ అవినీతిని 2015–16, 2016–17 కాగ్ నివేదికలు ఎత్తిచూపాయి. పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడంలో విఫలమైన చంద్రబాబు సర్కార్.. అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,970.86 కోట్లకు పెంచేయడంలో మాత్రం ప్రగతి సాధించిందని సీనియర్ ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ వదిలిపెట్టి... తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తూ చిక్కి అరెస్టయ్యారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉన్నఫళంగా అమరావతికి తరలివచ్చారు. దీనికి సంబంధించి న్యాయస్థానంలో కేసు విచారణలోఉంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిగితే తమ పాత్ర బయట పడుతుందనే భయంతోనే ఏపీలో సీబీఐకి ప్రవేశాన్ని నిషేధిస్తూ టీడీపీ సర్కారు జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. హాయ్‌ల్యాండ్‌పై లోకేష్ కన్ను! కీలకమైన హాయ్‌ల్యాండ్‌ను చేజిక్కించుకునేందుకు సీఎం తనయుడు, మంత్రి లోకేష్ ప్రయత్నించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని బాధితులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని సీఐడీకి కేసును అప్పగించి తూతూ మంత్రంగా వ్యవహరించింది. న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయాన్ని పలు సార్లు వ్యక్తీకరించడం గమనార్హం. ఇవి కావా దోపిడీలు? - ఉచితం పేరుతో అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా ఇష్జారాజ్యంగా దోపిడీకి పాల్పడుతోంది. - అమరావతి సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని రూ.వెయ్యి కోట్ల విలువచేసే భూమిని ప్రభుత్వ పెద్దలు తమ బినామీకి కట్టబెట్టి సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. - విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాల్లోని ఆర్టీసీకి చెందిన స్థలాలు తమవారికి కట్టబెట్టి లబ్ధి పొందే ప్రయత్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. - విశాఖలో పేదల భూములను ‘గీతం’కు కట్టబెట్టారు. దొంగ డాక్యుమెంట్లతో దస్పల్లా హిల్స్‌ను కైకంకర్యం చేశారు. - బెరైటీస్, విదేశీ బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలకు, సోలార్‌లో గోల్‌మాల్‌కు చంద్రబాబు సర్కారు తెగబడింది. - గ్రానైట్ ఖనిజం కోసం మంత్రి పుల్లారావు పేదల భూములను కొల్లగొట్టడానికి స్కెచ్ వేశారు. పత్తి కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. - రెయిన్గన్ల నిర్వహణ పేరిట కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్ష కోట్ల దోపిడీ గుంటూరు–విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు 2014 సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వెలువడేలోగా చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కొట్టేసింది. పది వేల ఎకరాల భూములను చంద్రబాబు అండ్ కో సొంతం చేసుకున్నాకనే రాజధాని ఏర్పాటుపై శాసనసభలో ప్రకటన చేయడం గమనార్హం! ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఇలా రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్నారు. 29 గ్రామాల్లో సులభంగా భూసమీకరణ చేయాలన్న ముందస్తు వ్యూహంలో భాగంలో ఒక్కో గ్రామంలో ఇద్దరు చొప్పున మంత్రులు.. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేయించారు. భూసమీకరణకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు అత్యంత ప్రాధాన్యం గల ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించడంతో లోగుట్టు రట్టయింది. మరోవైపు రాజధానిలో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను పలు కార్పొరేట్ సంస్థలకు చౌకగా కట్టబెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధిక రేట్లకు విక్రయించి ప్రయివేటు సంస్థలకు మాత్రం తక్కువ మొత్తానికి కట్టబెట్టి కమీషన్లు వసూళ్లు వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. స్విస్ ఛాలెంజ్ ముసుగులో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ రూ.3,137 కోట్ల వ్యయంతో చేపట్టిన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును ముందే ఎంపిక చేసిన సింగపూర్ కన్సార్టియంకు ప్రభుత్వం కట్టబెట్టింది. రాజధాని కోసం అంటూ రైతుల నుంచి 33 వేల ఎకరాలకు పైగా తీసుకున్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే నిర్ణయం తీసుకుని అక్కడ ప్రభుత్వ పెద్దల బినామీలతో భారీగా భూములను కొనుగోలు చేయించారు. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణంగా మార్చేశారు. అంతే కాకుండా రాజధానిలో సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాలను కేటాయించారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయింపుల నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించారు. ఇలా మౌలిక వసతులు కల్పించిన 1,691 ఎకరాలను ప్లాట్లుగా వేసి సింగపూర్ కంపెనీలు మూడో పార్టీకి విక్రయిస్తాయి. ఇందులో రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. సింగపూర్ కంపెనీలు కేవలం రూ.232 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడతాయి. కానీ 1,691 ఎకరాలను ప్లాట్లు వేసి విక్రయించగా వచ్చిన మొత్తంలో సింహభాగం లాభం ఆ సంస్థలకే చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది రూ.446 కోట్లు మాత్రమే. సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందానికి కేంద్రం అనుమతించగా సింగపూర్ ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం చేసుకోవడం గమనార్హం. కమీషన్లు రావనే భోగాపురం టెండర్ రద్దు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించడానికి టెండర్లలో అర్హత సాధించింది. టెండర్ దాఖలు చేసిన మరో సంస్థ ఇస్తామన్న రెవెన్యూ వాటా కన్నా ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా అత్యధికంగా ఇస్తానంది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి కమీషన్లు, అక్రమ వ్యవహారాలు సాధ్యం కావనే ఉద్దేశంతో టెండర్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియాకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్‌ను ఖరారు చేయాలని రెండు సార్లు సిఫార్సు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమీరా అనటం వెనుక లోగుట్టు ఇదేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.