Jonty Rhodes
-
లక్నోలోకి రోహిత్ శర్మ..? హింట్ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్
ఐపీఎల్-2025 సీజన్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడిడంపై ఊహాగానాలు ఊపుందుకున్నాయి. రోహిత్ వచ్చే ఏడాది సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో జతకట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.అతడి కోసం ఎంత మొత్తాన్ని నైనా వెచ్చించేందుకు లక్నో ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి."శర్మ వేలంలోకి వస్తే అతడిని స్వాగతించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దంగా ఉంది. అతడు చాలా గొప్ప ఆటగాడు. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే ప్రతీ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముంబై ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్‌తో చాలా క్లోజ్‌గా పనిచేశా. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టమని" న్యూస్ 24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోడ్స్ పేర్కొన్నాడు. దీంతో రోహిత్‌పై లక్నో దృష్టిసారించినట్లు తేటతెల్లమైంది.కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి ముంబై తమ జట్టు పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై యాజమాన్యం పట్ల హిట్‌మ్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ మారేందుకు రోహిత్ శర్మ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్..?
టీమిండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అతని కోచింగ్ బృందంలోని సభ్యులను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ బృందంలో ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నాడు. ఒకవేళ ద్రవిడ్‌తో పాటు అతని సహాయ బృందం మొత్తం తప్పుకుంటే.. బీసీసీఐ కొత్త కోచింగ్ టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన సపోర్టింగ్ స్టాఫ్ ఎంచుకునే విషయంలో గంభీర్ పూర్తి స్వేచ్చను ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా గంభీరే రోడ్స్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. గంభీర్, రోడ్స్ 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు సేవలందించారు. గంభీర్ మెంటార్, రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా లక్నో ఫ్రాంచైజీకి పని చేశారు. కోచ్‌గా తొలిసారి..గంభీర్ భారత ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే ఇదే అతనికి హెడ్ కోచ్‌గా మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది. -
కాస్తైనా సిగ్గుపడు.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన జాంటీ రోడ్స్
తనను విమర్శించిన నెటిజన్‌కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. నిజం తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడిన మీరు సిగ్గుపడాలంటూ చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నాటి నుంచి జాంటీ రోడ్స్ భారత పర్యటనలో ఉన్నాడు. ఇందులో భాగంగా ఈ లెజండరీ ఫీల్డర్.. గోవా, ఢిల్లీ, బెంగళూరులో పర్యటిస్తూ తన ప్రయాణానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరినపుడు.. టాక్సీ డ్రైవర్ సలహా మేరకు రోడ్‌సైడ్ ఫుడ్ తిన్నానంటూ ‘ఎక్స్’ ట్వీట్ చేశాడు జాంటీ రోడ్స్. మంగళూరు బన్, మసాలా దోశ, ఛాయ్ రుచి అదిరిపోయిందంటూ బెంగళూరు రుచులపై రివ్యూ ఇస్తూ ఐ లవ్ ఇండియా అంటూ ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో జాంటీ రోడ్స్ భోజనం రుచి చూస్తుండగా.. పక్కనే కూర్చున్న వ్యక్తి గడ్డానికి చేతులు ఆనించుకుని.. అతడి వైపే తదేకంగా చూస్తున్నాడు. అయితే, ఆ వ్యక్తిని టాక్సీ డ్రైవర్‌గా పొరబడ్డ ఓ ఎక్స్ యూజర్.. ‘‘మీ టాక్సీ డ్రైవర్ కోసం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాల్సింది. సెలబ్రిటీ అయిన మీ స్థాయికి ఇది ఎంతమాత్రం తగదు’’ అంటూ జాంటీ రోడ్స్‌ను విమర్శించారు. ఇక రెండోరోజుల క్రితం నాటి తన పోస్ట్‌పై ఈ విధంగా స్పందించిన సదరు వ్యక్తికి జాంటీ రోడ్స్ దిమ్మతిరిగేలా కౌంటర్ వేశాడు. ‘‘టేబుల్ దగ్గర నా ఎదురుగా కూర్చున్న జెంటిల్‌మ్యాన్ ఎవరో నాకు తెలియదు. ఆ ఫొటోను మా డ్రైవర్ తీశాడు. నిజానికి తను ఏమీ తినాలనుకోలేదు. తనకిష్టమైన రెస్టారెంట్లో తనకిష్టమైన భోజనాన్ని రుచి చూడాలని నన్ను కోరాడు. నా కోసం తను ఫుడ్ ఆర్డర్ చేశాడు. తను కేవలం టీ మాత్రమే తాగాడు. నేను అతడి టీ బిల్లును చెల్లించాను. కాస్త సిగ్గుపడండి(#shameonyou)’’ అంటూ జాంటీ రోడ్స్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా గెలిచిన ఏకైక ఐసీసీ ట్రోఫీ అందుకున్న జట్టులో జాంటీ రోడ్స్ సభ్యుడు. 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ(ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీగా చలామణిలో ఉంది)ని రోడ్స్ ముద్దాడాడు. I have been sitting on this reply for a couple of days. The gentleman at my table is a stranger to me, and my driver was taking the picture. He did not eat, just ordered for me some of his favourite food. He just had tea, and yes, I did pay for it #shameonyou https://t.co/JPXphe60I3 — Jonty Rhodes (@JontyRhodes8) November 24, 2023 -
CWC 2023: టాక్సీ డ్రైవర్ మాట విన్నందుకు ఇలా: సౌతాఫ్రికా లెజెండ్
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ గత కొన్ని రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఢిల్లీ, గోవా అంటూ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు పయనమైన జాంటీ రోడ్స్‌కు టాక్సీ డ్రైవర్ మూలంగా కర్ణాటక వంటల రుచులు చవిచూసే అవకాశం లభించింది. అది కూడా రోడ్‌సైడ్ ఫుడ్! అయితే, జాంటీ రోడ్స్ ఆహార పదార్థాలను టేస్ట్ చేయడానికి మాత్రమే పరిమితమైపోలేదు. అవెంతో రుచిగా ఉన్నాయని.. తనకు ఈ అవకాశం కల్పించిన సదరు డ్రైవర్‌కు ధన్యవాదాలు కూడా చెప్పాడు. ట్రాఫిక్ చికాకు నుంచి తప్పించుకునే క్రమంలో తనకు ఇంత టేస్టీ ఫుడ్ పరిచయం చేసినందుకు అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు..‘‘బెంగళూరు ఎయిర్‌పోర్టు దగ్గర టాక్సీ డ్రైవర్ నాకో సలహా ఇచ్చాడు. ఎలాగూ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి.. మార్గమధ్యంలో రోడ్డు పక్కన తనకు ఇష్టమైన రెస్టారెంట్లో కాసేపు ఆగుదామని నాకు చెప్పాడు. నాకు తన ఆలోచన నచ్చి అలాగే అన్నాను. అద్భుతమైన రుచి గల మంగళూరు బన్‌తో మొదలుపెట్టి.. మైసూర్ మసాలా దోశ, మసాలా ఛాయ్‌తో ముగించాను’’ అంటూ ఐలవ్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేశాడు. అక్కడితో జాంటీ రోడ్స్ ఆగిపోలేదు.. తనకు ఇంతటి రుచికరమైన వంటకాలు అందించిన రెస్టారెంట్ సిబ్బందితో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు మంగళవారం జాంటీ రోడ్స్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ‘‘క్రికెటర్లు అంటేనే లగ్జరీ లైఫ్.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస.. లావిష్ రెస్టారెంట్లలో ఫుడ్.. అబ్బో వాళ్ల లైఫ్‌స్టైలే వేరు.. కానీ జాంటీ రోడ్స్ మాత్రం మిగతా క్రికెటర్లకు భిన్నం.. రోడ్‌సైడ్ ఫుడ్ టేస్ట్ చేయడంతో పాటు.. వాళ్ల సేవలకు తగిన మర్యాద ఇచ్చాడు. ముఖ్యంగా భారత్ మీద తన ప్రేమను చాటుకున్న విధానం అద్భుతం.. అందుకే నువ్వు లెజెండ్’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నుంచి జాంటీ రోడ్స్ ఇండియాలోనే ఉన్నాడు. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లోనూ ప్రయాణం చేశాడు. సౌతాఫ్రికా తరఫున 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాంటీ రోడ్స్.. దిగ్గజ ఫీల్డర్‌గా పేరుగాంచాడు. 2003లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఈ ప్రొటిస్ బ్యాటర్.. తన కెరీర్లో 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 2532, 5935 పరుగులు సాధించాడు. When taxi driver at Bengaluru airport suggested to stop at his favourite restaurant for a roadside bite, because according to him: "traffic will be standing!" Grateful I took his advice. Excellent #mangalorebun and #Mysoremasaldosa, finished off with #masalachai #loveIndia pic.twitter.com/tH3KjykLUI — Jonty Rhodes (@JontyRhodes8) November 21, 2023 -
మంచి ఫీల్డర్ మాత్రమే కాదు.. జాంటీ రోడ్స్ చర్య వైరల్
జాంటీ రోడ్స్.. ఈ పేరు వినగానే సంచలన క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్లు చేసిన సంఘటనలు గుర్తుకొస్తాయి. తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఎన్నోసార్లు సౌతాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆటకు రిటైర్మెంట్ తర్వాత ఫీల్డింగ్ కోచ్‌గా మారిన జాంటీ రోడ్స్ తన మార్క్‌ను చూపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే రోడ్స్ మంచి ఫీల్డర్ మాత్రమే కాదు.. తనలోని మంచితనం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి పరిచయం చేశాడు. సాధారణంగా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే పిచ్‌పై కవర్లను కప్పడం చూస్తాం. కానీ ఆ కవర్లు లాగడానికి గ్రౌండ్స్‌మెన్ చాలా కష్టపడతారు. చాలా బరువుండే దానికి గ్రౌండ్లోకి తీసుకురావడం కత్తిమీద సామే. ఆ కష్టం తెలిసినోడు కాబట్టే జాంటీ రోడ్స్ గ్రౌండ్స్‌మెన్‌కు తనవంతు సాయం చేశాడు. విషయంలోకి వెళితే... బుధవారం సీఎస్కే,లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. లక్నో ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో గ్రౌండ్ సిబ్బంది రెయిన్ టర్పైన్ కవర్లతో గ్రౌండ్లోకి వస్తున్నారు. ఇది గమనించిన జాంటీ రోడ్స్ వారితో పాటు కవర్‌ను లాగేందుకు యత్నించాడు. సిబ్బంది వద్దని వారించినా రోడ్స్ వినిపించుకోకుండా తన పని కానిచ్చాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వద్దు సార్... మేం చూసుకుంటాం అనగానే రోడ్స్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@JontyRhodes8 to the rescue 😃👌🏻 No shortage of assistance for the ground staff in Lucknow 😉#TATAIPL | #LSGvCSK pic.twitter.com/CGfT3dA94M— IndianPremierLeague (@IPL) May 3, 2023 ఇక లక్నో సూపర్‌జెయింట్స్, సీఎస్కే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. లక్నో తొలి ఇన్నింగ్స్ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు స్పష్టం చేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో సూపర్‌జెయింట్స్ 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఆడుతుంది. ఆయుష్ బదోని 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. చదవండి: పని చేయని ధోని మంత్రం.. పూర్తిగా విఫలమయ్యాడు -
కోహ్లి, స్మిత్ కాదు.. అతడే ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్! సూపర్ మ్యాన్‌లా
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ జెయింట్స్ జట్టులో చేరిన జాంటీ రోడ్స్.. లక్నోలోని వాజ్‌పేయ్ స్టేడియంలో తమ ఆటగాళ్లకు ఫీల్డింగ్ మెళుకువలను నేర్పిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు రోడ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రోడ్స్‌కు ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. వెంటనే రోడ్స్ ఏమీ ఆలోచించకుండా వరల్డ్ క్రికెట్లో రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్ అంటూ బదులిచ్చాడు. జడేజా ఒక గన్ ఫీల్డర్, ఫీల్డ్‌లో సూపర్ మ్యాన్‌లా ఉంటాడని రోడ్స్ తెలిపాడు. అయితే ప్రపంచక్రికెట్లో అద్భుతమైన ఫీల్డర్లగా పేరొందిన విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ పేర్లను రోడ్స్ ప్రస్తావించకపోవడం గమానార్హం కాగా జడ్డూ ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు. ఎన్నో సంచలన క్యాచ్‌లను జడ్డూ అందుకున్నాడు. తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో అందరని జడేజా అకట్టుకున్నాడు. జడ్డూ ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు జడేజా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 31 నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: IPL 2023: సీఎస్కేకు బిగ్ షాక్.. ధోని దూరం! కెప్టెన్‌గా రుత్‌రాజ్ -
పాక్ దిగ్గజ బౌలర్‌తో అర్ష్‌దీప్ సింగ్‌కు పోలికా?! ఇలా మాట్లాడితే..
T20 World Cup 2022- Arshdeep Singh: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ ప్రభావం చూపగలిగాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న 23 ఏళ్ల అర్ష్ వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఆడిన ఆరు మ్యాచ్‌లలో మొత్తంగా 10 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. కొత్త స్వింగ్ సుల్తాన్ ముఖ్యంగా బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించి తనదైన ముద్ర వేయగలిగాడు ఈ లెఫ్టార్మ్ సీమర్. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడంతో వచ్చిన వరుస అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా.. కొత్త స్వింగ్ సుల్తాన్ వచ్చేశాడు అంటూ అర్ష్‌దీప్‌ను ఆకాశానికెత్తాడు. మరికొందరేమో.. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్, మాజీ పేసర్ వసీం అక్రమ్‌తో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ది గ్రేట్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్‌తో అర్ష్‌దీప్‌ను పోల్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. వసీం అక్రమ్- జాంటీ రోడ్స్(PC: PTI) పోలిక వద్దు.. ఇలా మాట్లాడితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ బౌలర్‌పై ఇలాంటి పోలికలు ఒత్తిడిని పెంచుతాయని.. అతడి ఆటపై ప్రభావం పడుతుందని పేర్కొన్నాడు. ‘‘జస్ప్రీత్ బుమ్రా లాగే అర్ష్‌దీప్ సింగ్ కూడా కెరీర్ ఆరంభంలోనే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి అతడిలో మెండుగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగలుగుతున్నాడు. పవర్ ప్లేలోనూ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు. వసీం అక్రమ్ మాదిరి బౌలింగ్ చేయగలుగుతున్నాడు. కానీ ఇప్పుడే దిగ్గజాలతో పోలిస్తే అతడిపై ఒత్తిడి పెరుగుతుంది’’ 53 ఏళ్ల జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. అర్ష్‌దీప్‌నకు మేటి బౌలర్‌గా ఎదగగల సత్తా ఉందని.. అతడి భవిష్యత్తు బాగుంటుందంటూ జోస్యం చెప్పాడు. చదవండి: Aus Vs Eng 1st ODI: స్టార్క్ అద్బుత ఇన్‌స్వింగర్.. షాట్ ఎలా ఆడాలిరా బాబూ! బిక్క ముఖం వేసిన రాయ్ FIFA World Cup Trophy History: ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ: పాక్ మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన శ్రీలంక.. సఫారీలకు మరో షాక్
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022లో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక దిగ్గజాల టీమ్ ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా శ్రీలంక 11 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్‌లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో జీవన్ మెండిస్ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉపుల్ తరంగ (27 బంతుల్లో 36; 7 ఫోర్లు), మునవీరా (24 బంతుల్లో 26; 4 ఫోర్లు), గుణరత్నే (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించగా.. సఫారీ బౌలర్లు క్రుగెర్ 2, ఫిలాండర్, బోథా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. మోర్నీ వాన్ విక్ (56 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినప్పటికీ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సఫారీ జట్టులో విక్ మినహా మరే ఇతర ఆటగాడు రాణించలేకపోయాడు. లంక బౌలర్లలో కులశేఖర 2, దిల్షాన్, ఉడాన, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో శ్రీలంక తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) చేరుకోగా.. 4 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించిన సౌతాఫ్రికా (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) నాలుగో స్థానానికి పడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇండియా లెజెండ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) మూడో ప్లేస్‌లో నిలిచింది. ఆతర్వాత న్యూజిలాండ్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ ఓటమి), ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఆస్ట్రేలియా (ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓటమి) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. -
ఇండియా లెజెండ్స్‌తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ'
బీసీసీఐ సహకారంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2 ఇవాల్టి (సెప్టెంబర్ 10) నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీ నేటి నుంచి ఆక్టోబర్ 1 వరకు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రడూన్ వేదికలుగా జరుగనుంది. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్‌లో ఇవాళ ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ తలపడనున్నాయి. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా లెజెండ్స్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సారధ్యంలో మరోసారి బరిలోకి దిగనుండగా.. సౌతాఫ్రికా లెజెండ్స్ దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ నేతృత్వంలో పోటీపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను కలర్స్ సినీప్లెక్స్, కలర్స్ సినీప్లెక్స్ హెచ్డీ, కలర్స్ సినీప్లెక్స్ సూపర్ హిట్స్, స్పోర్ట్స్18 ఖేల్ ఛానల్లు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ సిరీస్‌లో జరిగే 23 మ్యాచ్‌లు పై పేర్కొన్న ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వీటితో ఈ సిరీస్‌లోని మొత్తం మ్యాచ్‌లను వూట్ యాప్, వెబ్సైట్లో కూడా చూడవచ్చు. దిగ్గజాల పోరును ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ సిరీస్‌లో ఇండియా, సౌతాఫ్రికా లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దిగ్గజ జట్లు పాల్గొంటున్నాయి. రోడ్ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ తొలి ఎడిషన్‌లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. జట్ల వివరాలు.. ఇండియా లెజెండ్స్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన్ ఓజా (వికెట్‌కీపర్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, మన్‌ప్రీత్ గోని, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, ప్రగ్యాన్ ఓజా, బాలసుబ్రమన్యమ్, రాహుల్ శర్మ, రాజేశ్ పవార్ సౌతాఫ్రికా లెజెండ్స్: జాంటీ రోడ్స్ (కెప్టెన్), మోర్నీ వాన్ విక్ (వికెట్‌కీపర్), అల్విరో పీటర్సన్, జాక్ రుడాల్ఫ్, హెన్రీ డేవిడ్స్, వెర్నాన్ ఫిలాండర్, జోహాన్ బోథా, లాన్స్ క్లూసనర్, జాండర్ డి బ్రూన్, మఖాయ ఎన్తిని, గార్నెట్ క్రుగర్, ఆండ్రూ పుట్టిక్, జోహాన్ వాండర్ వాత్, థండి షబలాల, ఎడ్డీ లీ, ల్యాడ్ నోరిస్ జోన్స్ చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..! -
Viral Video: సచిన్ కాళ్లు మొక్కిన పంజాబ్ కోచ్..!
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన రసవత్తర పోరులో పంజాబ్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రోహిత్ సేనను మట్టికరిపించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, ప్రస్తుత సీజన్లో వరుసగా ఐదో ఓటమిని చవిచూసిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. i missed this last night why is he like this😭 pic.twitter.com/AnlnoyZgOp — m. (@idyyllliic) April 14, 2022 కాగా, పంజాబ్-ముంబై జట్ల మధ్య మ్యాచ్ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో పంజాబ్ బ్యాటింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్ టెండూల్కర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాదాలకు నమస్కారం చేయబోయాడు. ఈ హఠాత్పరిణామంతో ఆశ్చర్యపోయిన సచిన్ వెంటనే తేరుకుని జాంటీని వారించాడు. అనంతరం ఇరువురు ఆత్మీయంగా హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌ని చూసిన ఆటగాళ్లు, ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వయసులో చిన్నవాడైన సచిన్ (48)తో జాంటీ రోడ్స్ (52) అలా ప్రవర్తించడమేంటని కొందరు, క్రికెట్ గాడ్‌కు పాదాభివందనం చేస్తే తప్పేమీ లేదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఐపీఎల్లో సచిన్-జాంటీ రోడ్స్ (ఫీల్డింగ్ కోచ్)లు గతంలో ముంబై ఇండియన్స్‌కు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. రోడ్స్ 2017 సీజన్లో ముంబైను వదిలి పంజాబ్ కింగ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. చదవండి: IPL 2022: ఆ విషయంలో రిషబ్, రోహిత్, కోహ్లి ముగ్గురూ ఒక్కటే..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్విటర్ ఖాతా హ్యాక్, ఇదెలా వచ్చిందో తెలియదు!
దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటి రోడ్స్ ఖాతాను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. భారత్‌లో రైతుల ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో అంతర్జాతీయంగానూ మద్దతు లభిస్తోంది. యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్, పాప్ సింగర్ రిహన్న వంటివారు రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదని, కేవలం వారు ప్రేక్షక పాత్ర వహిస్తే చాలని మన దేశానికి చెందిన క్రీడా, సినీ ప్రముఖులు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వంటివారు సోషల్ మీడియా వేదికగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో సచిన్ చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తన ట్విటర్ ఖాతాలో దర్శనమిచ్చిందని జాంటి రోడ్స్ తెలిపారు. నా ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్టుగా ఉంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. సచిన్ స్క్రీన్ షాట్ నేను జోడించలేదు’ అని రోడ్స్ ఇన్‌స్టాలో చెప్పుకొచ్చారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో జాంటిరోడ్స్ బెస్ట్ ఫీల్డర్‌గా వెలుగొందారు. ఇక ‘భారత దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. బాహ్య శక్తులు ప్రేక్షకులుగా ఉంటే మంచిది. భారత దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు. మన దేశం గురించి భారతీయులకు మాత్రమే తెలుసు. దేశం కోసం ఏం చేయాలో తెలుసు. ఒక జాతిగా ఐక్యంగా ఉందాం’ అని సచిన్ ట్విటర్లో బుధవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Jonty Rhodes (@jontyrhodes8) -
చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం
బ్రిస్బేన్ : జాంటీ రోడ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. అప్పటివరకు మూస ధోరణిలో ఉండే ఫీల్డింగ్‌కు కొత్త పర్యాయం చెప్పిన వ్యక్తి రోడ్స్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఫీల్డింగ్ విన్యాసాలు.. డైవ్ క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్లు.. మైదానంలో పాదరసంలా కదలడం లాంటివన్నీ రోడ్స్ వచ్చిన తర్వాత వేగంగా మారిపోయాయి. తన 11 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు.. రనౌట్లు.. వెరసి కొన్నిసార్లు దక్షిణాఫ్రికా జట్టును కేవలం తన ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్‌లు గెలిపించాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం) అందుకు చాలా ఉదాహరణలున్నాయి.. వాటి గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తుకువచ్చేది 1992 ప్రపంచకప్.. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్స్.. ఇంజమామ్‌ను రనౌట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. రోడ్స్ చేసిన విన్యాసం జిమ్ ఫెన్విక్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించగా.. అది బెస్ట్ ఫోటోగ్రఫీగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 36 ఓవర్లకు కుదించి 194 పరుగులను రివైజ్డ్ టార్గెట్‌గా విధించారు. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. పాక్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులతో పటిష్టంగా నిలిచి విజయానికి చేరువలో ఉంది. క్రీజులో ఇంజమామ్ ఉల్ హక్ 48 పరుగులతో మంచి టచ్‌లో ఉండగా.. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అతనికి అండగా ఉన్నాడు. అలెన్ డొనాల్డ్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఇంజమామ్ షాట్ ఆడాడు. ఇంజమాముల్ హక్ కొట్టిన బంతిని రోడ్స్ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఇంజమామ్‌ను రోడ్స్ ఔట్ చేయడంతో ఆ ప్రభావం పాక్‌పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్‌తోనే జాంటీ రోడ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఒకే మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకున్న ఘనత రోడ్స్ పేరిట ఇప్పటికి నిలిచిపోయింది. తాజాగా ఐసీసీ క్రిస్టమస్ సందర్భంగా మరోసారి జాంటీ రోడ్స్ రనౌట్ ఫీట్‌ను స్నో స్టాపింగ్ మూమెంట్ పేరుతో ట్విటర్లో షేర్ చేసింది. As a part of our Crickmas celebrations, we bring you some of the biggest 'snow'stopping instances in cricket history ❄️❗ Who remembers this incredible run-out by Jonty Rhodes from the 1992 @cricketworldcup 🤩 pic.twitter.com/cQM5f73TcJ — ICC (@ICC) December 23, 2020 -
స్వీడన్ జట్టు కోచ్‌గా జాంటీ రోడ్స్
స్వీడన్ : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన స్వీడన్ తమ దేశంలో ఆట అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ హెడ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న 51 ఏళ్ల రోడ్స్... టోర్నీ ముగిసిన వెంటనే కుటుంబంతో సహా స్వీడన్లో స్థిరపడనున్నాడు. సఫారీ జట్టు తరఫున జాంటీ 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. -
జడేజాను అందుకోవడం కష్టం: రోడ్స్
కేప్‌టౌన్: జాంటీ రోడ్స్.. క్రికెట్ మైదానంలో ఫీల్డింగ్‌కే వన్నె తెచ్చిన ఆటగాడు. దక్షిణాఫ్రికా చెందిన ఈ క్రికెటర్ అసాధారణమైన ఫీల్డింగ్‌తో ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. రోడ్స్ అంటే ఫీల్డింగ్..ఫీల్డింగ్ అంటే రోడ్స్ అనేలా చరిత్రలో నిలిచిపోయాడు. డైవ్ కొట్టి క్యాచ్ పట్టడంలో రోడ్స్‌కు సాటి-పోటీ కూడా ఎవరూ లేరు. రెప్పపాటు వేగంలో క్యాచ్‌ను అందుకోవడం రోడ్స్ ప్రత్యేకత. మరి అటువంటి రోడ్స్‌కే ఒకరి ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టమట. అది కూడా భారత్‌కు చెందిన క్రికెటరే. భారత క్రికెట్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలు అద్భుతమైన ఫీల్డర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిలో రవీంద్ర జడేజాకే ఓటేశాడు రోడ్స్. చాలామంది అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నప్పటికీ జడేజా వంటి వేగం ఉన్న ఫీల్డర్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారన్నాడు.(‘ఎంఎస్ ధోనిని ఫాలో అవుతా’) సురేశ్ రైనాతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో మాట్లాడిన రోడ్స్.. ‘నీలో-నాలో లేనిది’ జడేజాలో ఉందన్నాడు. అది జడేజాలో వేగమట. బంతిని అందుకునే క్రమంలో జడేజా పరుగెట్టే తీరు తనను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుందన్నాడు. బంతి వెనకాల పరుగెడుతూ డైవ్ కొడతాడా.. లేక స్లైడ్(జారతాడా) అనేది ఇప్పటికీ కచ్చితంగా అంచనా వేయలేమన్నాడు. ఈ రెండింటికి కాస్త భిన్నంగా ఉండే జడేజా ఫీల్డింగ్ ఆకర్షణీయంగా ఉంటుందన్నాడు. బౌండరీకి వెళుతుందనే బంతిని అమాంతం ఆపేసి అంతే వేగంగా పైకి లేవడం జడేజాకే సాధ్యమన్నాడు. అది జడేజాలో తాను చూసిన భిన్నమైన కోణమని రోడ్స్ తెలిపాడు. అది నీలోనూ, నాలోనూ కూడా లేదని కుండబద్ధలు కొట్టి మరీ చెప్పాడు రోడ్స్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ బెవాన్ తరహాలో జడేజా ఒక విభిన్నమైన ఫీల్డర్ అని కొనియాడాడు. ఎంత వేగంగా బంతిని ఆపుతాడో, అంతే వేగంగా పైకి లేచి పోవడం అనేది ఒక ప్రత్యేకమైన కళ అని పేర్కొన్నాడు. ఒకవేళ అదే బంతిని మనం పరుగెత్తి ఆపితే గ్రౌండ్లో మొత్తం దొర్లాల్సి వస్తుందన్నాడు. ఒకవేళ మనం డైవ్ కొట్టి బంతిని ఆపి పైకి వెంటనే లేచినా మురికి మురికి చేసుకోవాల్సి వస్తుందన్నాడు. ఈ విషయంలో జడేజా కంప్లీట్ స్పీడ్ ఉన్న క్లీన్ మ్యాన్ అని చెప్పవచ్చన్నాడు. మరొకవైపు తమ దేశానికే చెందిన ఏబీ డివిలియర్స్ ఫీల్డింగ్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమన్నాడు. ఏబీ బ్యాటింగ్‌ను, ఫీల్డింగ్‌ను తాను ఎప్పుడూ మిస్ కానన్నాడు.(నన్ను వృద్ధుడిని చేసేశారు: భజ్జీ) -
డివిలియర్స్‌ను తీసుకోవాలి!
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ను గెలవాలంటే దక్షిణాఫ్రికా జట్టు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేయడం కూడా అందులో ఒకటని అతను అన్నాడు. డివిలియర్స్ జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు రెండేళ్లయింది. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అతను పునరామగనం చేసేందుకు సిద్ధమని కూడా ప్రకటించాడు. ‘నేను డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. టి20 ప్రపంచకప్ గెలవాలంటే మీరు ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టవద్దు. రాబోయే ఐపీఎల్లో అతను ఎలా ఆడతాడనేది ప్రపంచం మొత్తం చూస్తుంది. అయితే ఇటీవల బిగ్‌బాష్ లీగ్‌లో అతని ఆట చూస్తే ఏబీ ఎంత అద్భుతమైన ఆటగాడో అర్థమవుతుంది’ అని రోడ్స్ వ్యాఖ్యానించాడు. అయితే ప్రస్తుతం పోటీలో ఉన్న ఆటగాళ్లను కాదని ఒక్కసారిగా డివిలియర్స్‌ను ఎంపిక చేస్తే ఇది దక్షిణాఫ్రికా క్రికెట్లో చెడు సాంప్రదాయానికి దారి తీసినట్లు విమర్శలు వస్తాయని కూడా రోడ్స్ అన్నాడు. కానీ వరల్డ్ కప్ కోసం, డివిలియర్స్ స్థాయి ఆటగాడి కోసం ఒక సారి ఇలా చేసినా తప్పేమీ కాదని కూడా అతను విశ్లేషించాడు. -
పాంటింగ్ ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్లు వీరే..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ దిగ్గజమే కాదు.. తన జనరేషన్లో అత్యుత్తమ ఫీల్డర్ కూడా. అయితే ఆల్‌టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లలో ఇద్దరు దక్షిణాఫ్రికా దిగ్గజాల పేర్లు వెల్లడించిన పాంటింగ్.. ఒక ఆసీస్ ఆటగాడి పేరును పేర్కొన్నాడు. ట్వీటర్లో క్వశ్చన్-ఆన్సర్లో భాగంగా ఆల్‌టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా జాంటీ రోడ్స్(దక్షిణాఫ్రికా), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), ఆండ్రూ సైమండ్స్(ఆస్ట్రేలియా)ల పేర్లను పాంటింగ్ సూచించాడు. వీరు ముగ్గురు తన ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్లని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ ఉన్న పాంటింగ్.. టీమిండియా యువ వికెట్ కీపర్ , ఢిల్లీ జట్టు సభ్యుడైన రిషభ్ పంత్‌ను వెనకేసుకొచ్చాడు. పంత్‌లో విశేషమైన టాలెంట్ ఉందని, అతన్ని త్వరలోనే మళ్లీ భారత క్రికెట్ జట్టులో చూస్తామన్నాడు. అందుకు పెద్దగా సమయం కూడా ఏమీ పట్టదన్నాడు. ఐపీఎల్లో పంత్‌తో కలిసి పని చేసిన క్రమంలో అతనిలో విశేషమైన నైపుణ్యాన్ని చూశానని తెలిపాడు. పంత్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పాంటింగ్ పైవిధంగా స్పందించాడు. (ఇక్కడ చదవండి: ‘పంత్.. వారి నోటికి తాళం వేయి’) -
నువ్వు రాంచీ టెస్టులో ఆడొచ్చు కదా!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్‌ను మళ్లీ క్రికెట్ ఆడొచ్చు కదా అంటూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోరాడు. అదేంటి ఎప్పుడో రిటైర్ అయిన జాంటీని మళ్లీ క్రికెట్ ఆడమని కోరడం ఏంటా అనుకుంటున్నారా.. అందుకు జాంటీ రోడ్స్ మళ్లీ సఫారీ జెర్సీలో కనిపించడమే. సఫారీ జెర్సీ ధరించి రోడ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందుకు ఒక క్యాప్టన్ కూడా జత చేశాడు. ‘గ్రీన్ అండ్ గోల్డ్ జెర్సీని వేసుకోవడం గొప్ప అనుభూతిని తీసుకొచ్చింది. ఇది కేవలం ఫొటోషూట్ కోసం మాత్రమే. ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఇలా ఫోజిచ్చా’ అని పోస్ట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించాడు భజ్జీ. ‘ జాంటీ...ఇప్పుడు మీ దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ అవసరం ఉంది. నువ్వు మళ్లీ బరిలోకి దిగొచ్చుకదా. భారత్‌తో రాంచీలో జరుగనున్న చివరి టెస్టులో ఆడొచ్చు కదా’ అని హర్భజన్ సింగ్ సరదాగా చమత్కరించాడు. ఇప్పటికే భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోంది. వరుస రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ను ఇంకా టెస్టు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. విశాఖపట్టణం, పుణేల్లో జరిగిన టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా తిరుగులేని విజయాల్ని ఖాతాలో వేసుకుంది. దాంతో టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లలో రెండొందల పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి టెస్టును భారత్ గెలిస్తే 240 పాయింట్లు సాధిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు చాంపియన్‌షిప్ ఆరంభించిన తర్వాత భారత్ జట్టు.. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ సాధించింది. దాంతో 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఇది మూడు టెస్టుల సిరీస్ కావడంతో రెండు టెస్టుల్లో విజయాల ద్వారా 80 పాయింట్లను సాధించింది. -
‘అలాంటి చెత్త సెంచరీలు ముందెన్నడూ చూడలేదు’
ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడని దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అన్నాడు. కోహ్లి ఆటను తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని..అతడే బెస్ట్ క్రికెటర్ అని ప్రశంసలు కురిపించాడు. బాల్ టాంపరింగ్ వివాదం-నిషేధం అనంతరం.. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో స్మిత్ డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే విధంగా టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లి అధిగమించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లోనూ స్మిత్ 937 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి-స్మిత్‌ల మధ్య పోలిక తెస్తూ జాంటీ రోడ్స్ స్మిత్ ఆట గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను చేసిన చెత్త సెంచరీలను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నాడు. ‘ విరాట్ ఆటను ఎంజాయ్ చేస్తా. కొంతమంది ఆటను చూస్తే వావ్..షాట్ ఎంత అద్భుతంగా ఉంది అనాలనిపిస్తుంది. కోహ్లి అదే కోవకు చెందినవాడు. కానీ స్టీవ్ స్మిత్ తన యాక్షన్, టెక్నిక్‌తో చెత్త సెంచరీలు చేశాడు. పరుగులు తీస్తూనే ఉన్నాడు గానీ అలాంటి ఆటను నేను ఇంతకుముందు చూడలేదు’ అని జాంటీ రోడ్స్ వ్యాఖ్యానించాడు. కాగా ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే తమ దేశ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కంటే కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ అని ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. స్మిత్ కేవలం టెస్టు ఫార్మాట్లో మాత్రమే అత్యుత్తమ ఆటగాడని, కోహ్లి మూడు ఫార్మాట్లలో మేటి ఆటగాడు అని వార్న్ ప్రశంసలు కురిపించాడు. ఇక భారత మాజీ సారథి గంగూలీ.. కోహ్లి-స్మిత్ ప్రదర్శనను పోల్చడం తనకు ఇష్టం లేదని.. కోహ్లి ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పరిగణింపబడుతుండగా.. స్మిత్ రికార్డులు కూడా అతడి విలువను చాటుతున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘అందుకే రోడ్స్‌ను ఫైనల్ లిస్ట్‌లో చేర్చలేదు’
ముంబై: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌నే తిరిగి ఎంపిక చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి పోటీ పడినప్పటికీ శ్రీధర్‌వైపు సెలక్షన్ కమిటీ మొగ్గుచూపింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి అండదండలతోనే శ్రీధర్‌ను మళ్లీ నియమించారనేది కాదనలేని వాస్తవం. అయితే రోడ్స్‌ను కనీసం ఫైనలిస్టులో చేర్చకపోవడమే చర్చనీయాంశంగా మారింది. దీనిపై చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ‘ఫీల్డింగ్ కోచ్ ఫైనలిస్టులో శ్రీధర్‌తో పాటు, అభయ్ శర్మ, టి దిలీప్‌లతోనే సరిపెట్టాం. వీరిద్దరికీ భారత్-ఏ జట్టుతో పని చేసిన అనుభవంతో పాటు ఎన్సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ)లో కూడా సేవలందించారు. దాంతో రోడ్స్‌ను తుది జాబితాలో ఎంపిక చేయలేదు’ అని ఎంఎస్కే తెలిపాడు. అయితే శ్రీధర్‌నే తిరిగి నియమించడాన్ని ఎంఎస్కే సమర్ధించుకున్నాడు.‘ ఆర్ శ్రీధర్ ఒక అత్యుత్తమ ఫీల్డింగ్ కోచ్. అందులో సందేహం లేదు. టీమిండియా ఫీల్డింగ్ మెరుగు పడటంలో శ్రీధర్ పాత్ర చాలానే ఉంది. దాంతో మాకు వేరే ఆలోచన లేకుండా శ్రీధర్‌నే ఎంపిక చేశాం’ అని చెప్పుకొచ్చాడు. (ఇక్కడ చదవండి: సంజయ్ బంగర్‌పై వేటు) -
ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్?
హైదరాబాద్ : క్రికెట్లో ఫీల్డింగ్‌కు పర్యాయ పదంగా చెప్పుకునే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కు తీవ్ర నిరాశే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం రోడ్స్ దరఖాస్తు చేసుకోవడంతో అతడి ఎంపిక దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే ఇటీవలే ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మరల నియామకమైన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో రవిశాస్త్రి వెనక్కి తగ్గటం లేదని, తనకు నచ్చిన వారినే నియమించుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతమున్న సిబ్బందే కొనసాగుతారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సపోర్టింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేసేందుకు గురువారం భేటీ కానుంది. ఆదే రోజున సహాయక సిబ్బంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్ శ్రీధర్ కోచింగ్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ మరింత బలపడిందని, ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగుపడిందని రవిశాస్త్రి వాదిస్తున్నాడు. దీంతో శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే దిగ్గజ ఫీల్డర్‌గా కీర్తింపబడే జాంటీ రోడ్స్‌కు నిరాశ ఎదురవక తప్పదు. భారత్‌పై తనకున్న ప్రేమ, గౌరవాన్ని అనేకమార్లు చాటిన రోడ్స్.. ఫీల్డింగ్ కోచ్‌గా టీమిండియాకు సేవలందించాలని తెగ ఆరాటపడ్డాడు. అయితే ఆశ్చర్యకరంగా రోడ్స్‌ను పక్కకు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇక దాదాపుగా బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బౌలింగ్‌లో ఎలాంటి సమస్యలు లేనందున భరత్ అరుణ్ వైపే కమిటీ మొగ్గు చూపుతోంది. అయితే బ్యాటింగ్ కోచ్‌ను తప్పకుంగా మార్చాలనే ఆలోచనలో బీసీసీఐతో పాటు ప్రసాద్ కమిటీ ఉన్నట్లు సమాచారం. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంతోపాటు, మిడిలార్డర్ సమస్యను పరిష్కరించలేకపోయిన ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, విక్రమ్ రాథోర్లు రేసులో ముందున్నారు. చదవండి: ఎగేసికుంటూ పోయి.. ఉట్టి చేతులతోనే! ఫీల్డింగ్ కోచ్ బరిలో జాంటీ రోడ్స్ -
ఫీల్డింగ్ కోచ్ బరిలో జాంటీ రోడ్స్
ముంబై: మైదానంలో పాదరసంలాంటి కదలికలతో క్రికెట్ ఫీల్డింగ్‌కు కొత్త పాఠాలు నేర్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ ఇప్పుడు భారత జట్టుకు శిక్షకుడిగా పని చేయాలని భావిస్తున్నాడు. బీసీసీఐ ప్రకటనకు స్పందిస్తూ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం రోడ్స్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 27న 50వ పుట్టినరోజు జరుపుకోబోతున్న రోడ్స్ తొమ్మిది సీజన్ల పాటు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదే అనుభవంతో తాను భారత జట్టుతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు అతను చెప్పాడు. ‘భారత్‌తో నాది ప్రత్యేక అనుబంధం. నాకు, నా భార్యకు ఈ దేశమంటే చాలా ఇష్టం. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు. గత కొన్నేళ్లలో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా పెరిగిపోయాయి. అలాంటి టీమ్‌తో పని చేయాలని కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాను’ అని జాంటీ వెల్లడించాడు. -
ఎగేసికుంటూ పోయి.. ఉట్టి చేతులతోనే!
న్యూఢిల్లీ: ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఎప్పటిలాగే సన్నాహాలు చేసుకుని రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నీ హాట్ ఫేవరెట్స్ లో ఒకటైన టీం ఇలాగైనా ఆడేది అన్న అపప్రధను మూటగట్టుకుంది. ఎనిమిది మ్యాచ్‌లకు గాను రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి టోర్నీ నుంచి ముందుగానే నిష్క్రమించింది. వరల్డ్‌కప్‌లో సఫారీల ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పోరాడాలనే కసి లేకపోవడమే దక్షిణాఫ్రికా లీగ్ దశ నుంచే నిష్క్రమించడానికి ప్రధాన కారణంగా ఆ దేశ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విమర్శించాడు. అదే సమయంలో తమ జట్టు అత్యుత్తమ ఎలెవన్‌ను ఎంపిక చేయడంలో విఫలం కావడం కూడా ఘోర పరాభవానికి కారణమన్నాడు. ‘మా వాళ్లు వరల్డ్‌కప్‌కు బయల్దేరి ముందు వరకూ తుది కూర్పు ఎలా ఉండాలనే దానిపై ఒక అంచనా లేదు. అసలు ప్లాన్-బి అనేది మా మేనేజ్మెంట్ వద్ద లేనేలేదు. వరల్డ్‌కప్ సన్నాహకానికి సరిగా సిద్ధం కాలేదు. దాంతో మా జట్టుపై ఎవరికీ అంచనాలు లేవు. గత 12 నెలలుగా దక్షిణాఫ్రికా జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అటు స్వదేశీ సిరీస్‌ల్లోనూ ఇటు విదేశీ పర్యటనల్లో కూడా దక్షిణాఫ్రికా విఫలమయ్యింది. ఆ నేపథ్యంలో వరల్డ్‌కప్‌కు ఉత్తమ ఎలెవన్ ఏంటనేది తెలుసుకోలేకపోయారు. వరల్డ్‌కప్‌కు బయల్దేరి ముందు వరకూ తుది జట్టుపై ఒక స్పష్టత లేదంటూ మా వాళ్లు ఎలా సిద్ధమయ్యారనేది అర్థం చేసుకోవచ్చు. కనీసం మూడు, నాలుగు స్థానాల్లో ఉంటుందని ఆశించిన సఫారీ అభిమానికి అది కాగితం వరకూ పరిమితమని మా వాళ్లు తేల్చి చెప్పారు. డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాడు లేకపోవడం కూడా మా జట్టు వైఫల్యంపై ప్రభావం చూపింది. చివరి నిమిషంలో అతను వస్తానన్న అప్పటికీ ఆలస్యమై పోయింది. అతనొక అసాధారణ ఆటగాడు. ఏబీకి నేను పెద్ద ఫ్యాన్. అతని అంతర్జాతీయ కెరీర్ అద్భుతంగా సాగింది. దాదాపు రిటైర్మెంట్ ప్రకటించిన ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి వస్తాననడం, అందులోనూ వరల్డ్‌కప్ ఆరంభమయ్యాక జట్టులోకి తీసుకోమంటూ దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్కు విన్నవించడం సరైనది కాదు. ఏది ఏమైనా మా వాళ్లు సరైన ప్రణాళిక లేకుండా మెగా టోర్నీకి సిద్ధం కావడం, లీగ్ దశలోనే ముగించడం చాలా బాధాకరం’ అని రోడ్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
సరోజిని అకాడమీలో జాంటీరోడ్స్ సందడి
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్ జాంటీరోడ్స్ బుధవారం నగరంలో సందడి చేశాడు. బాగ్‌లింగంపల్లిలోని సరోజిని క్రికెట్ అండ్ ఫిట్నెస్ అకాడమీని ఆయన సందర్శించాడు. ఆయనకు జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, అకాడమీ కార్యదర్శి కిరణ్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. రోడ్స్‌తో పాటు ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు విజయ్ కుమార్ కూడా అకాడమీకి వచ్చారు. అక్కడ శిక్షణ పొందుతోన్న చిన్నారులకు జాంటీరోడ్స్ క్రికెట్ నైపుణ్యాలు, ఫీల్డింగ్‌లో మెళకువలు నేర్పించాడు. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపాడు. క్రికెట్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తోన్న చిన్నారులకు బహుమతులు అందజేశాడు. ఈ సందర్భంగా జాంటీ మాట్లాడుతూ క్రికెటర్లకు ప్రధానంగా దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, అంకితభావం, పట్టుదల ముఖ్యమని అన్నారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లని తట్టుకొని లక్ష్యసాధన దిశగా అడుగులేయాలని చిన్నారుల్లో స్ఫూర్తి నింపారు. అనంతరం అకాడమీ కార్యదర్శి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ జాంటీరోడ్స్ తరహాలో చిన్నారులంతా మేటి క్రికెటర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి క్రికెట్ క్యాంపు ఎస్సీఎఫ్ఏలో శుక్రవారం నుంచి ప్రత్యేక క్రీడా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కిరణ్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాలకు మిహిర్ (84840 22440), సుధాకర్ (98986 03533)లను సంప్రదించాలి. -
సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇదే రోజున..
-
ఆ సూపర్ రనౌట్‌కు పాక్ బలి!
హైదరాబాద్: క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఏమాత్రం తడుముకోకుండా చెప్పే పేరు జాంటీ రోడ్స్. ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైదానంలో పక్షిలా రివ్వున ఎగురుతూ.. చిరుత కంటే వేగంగా కదులుతూ.. కళ్లు చెదిరేరీతిలో ఫీల్డింగ్ చేయడం అతడి సొంతం. బ్యాటింగ్, బౌలింగ్‌తోనే కాదు ఫీల్డింగ్తోను జట్టుకు విజయాలను అందించవచ్చని పలుమార్లు నిరూపించాడు. తన మెరుపులాంటి ఫీల్డింగ్‌తో దక్షిణాఫ్రికాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. తరం మారినా ఇప్పటికీ ఫీల్డింగ్ అంటే గుర్తుకొచ్చే పేరు రోడ్స్ అంటే అతిశయోక్తి కాదు. తాజాగా జాంటీ రోడ్స్ కళ్లుచెదిరే ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా ఐసీసీ షేర్ చేసింది. ఈ వీడియోను క్రికెట్ అభిమానులు మళ్లీ మళ్లీ ప్లే చేసి చూస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఐసీసీ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుండగా.. క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున.. ప్రపంచకప్-1992లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాంటీ రోడ్స్ చేసిన రనౌట్ మ్యాచ్ స్వరూపానే మార్చేసింది. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుండగా.. పాక్ బ్యాట్స్‌మన్ ఇంజమాముల్ హక్ ఆడిన బంతిని రోడ్స్ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు వాతావరణం, అదృష్టం కలిసిరాలేదు. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను కాసేపు ఆపిన అంపైర్లు.. అనంతరం ఓవర్లను కుదించి పాక్ లక్ష్యాన్ని 36 ఓవర్లలో 193 పరుగులకు సెట్ చేశారు. మంచి ఫామ్‌లో ఉన్న ఇంజమామ్‌ను రోడ్స్ ఔట్ చేయడంతో ఆ ప్రభావం పాక్‌పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్‌తోనే జాంటీ రోడ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.