Rajkumar Rao
-
నా భార్య వంట చేస్తే నేను బోళ్లు తోముతా: హీరో
కష్టసుఖాల్నే కాదు, ఇంటిపనినీ సమంగా పంచుకుంటే భార్యాభర్తల మధ్య ఏ గొడవా ఉండదంటున్నాడు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao). మరో రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా ప్రేమజంటలకు, పెళ్లి జంటలకు రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ (Patralekhaa) దంపతులు కొన్ని సూచనలిస్తున్నారు. ముందుగా పాత్రలేఖ మాట్లాడుతూ.. మా బంధంలో ఎవరి ఆధిపత్యం ఉండకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం. బాగా సర్దుతాడుచిన్నదైనా, పెద్దదైనా ప్రతీ విషయాన్ని, పనిని షేర్ చేసుకోవాలని నియమంగా పెట్టుకున్నాం. తను అన్నింటినీ చక్కగా సర్దుతాడు. ఏది ఎక్కడుందన్నది ఇట్టే చెప్పగలడు. నేను వంట చేస్తే తను పాత్రలు కడుగుతాడు. ఇలాంటి చిన్నచిన్న పనులు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఇద్దరం సమానమే అన్న భావనను మరింత పెంపొందిస్తాయి అని చెప్పుకొచ్చింది. (చదవండి: అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్)నేను బోళ్లు తోముతా..దీని గురించి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మా వైవాహిక జీవితంలో చిన్నచిన్న పనులు, సాయాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. నా భార్య వంట చేసిన తర్వాత ఎంతో ఇష్టంగా సింక్‌లోని పాత్రలు శుభ్రం చేస్తాను. ఆమె ఇంట్లో లేనప్పుడు కూడా ఈ పనులన్నీ చేస్తాను. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమంటే మన జీవితాల్ని సులభతరం చేసుకోవడమే! అని చెప్పుకొచ్చాడు. కాగా రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ సుమారు దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. 2021 నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సిటీలైట్స్ (Citylights) మూవీ, బోస్:డెడ్/అలైవ్ వెబ్‌సిరీస్ సహా పలు ప్రాజెక్టుల్లో కలిసి పని చేశారు.చదవండి: పెళ్లికి సిద్ధమైన జాలిరెడ్డి.. గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్ -
గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు..?
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని హిందీలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్లో నటిస్తాడిని ప్రచారం జరిగింది. అయితే డేట్స్ కుదరక ఖురానా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. 🚨 RAJKUMAR RAO AS GANGULY. 🚨- Rajkumar Rao likely to play Sourav Ganguly in Dada's biopic. (Sumit Ghosh). pic.twitter.com/zReuoMSp4h— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2025తాజాగా గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ (లవ్ ఫిల్మ్స్) ఇప్పటివరకు స్పందించలేదు.కాగా, గంగూలీ బయోపిక్‌లో లీడ్ రోల్ కోసం తొలుత ఓ ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు.గంగూలీ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. టీమిండియా గొప్ప కెప్టెన్లలో గంగూలీ ఒకడు. భారత క్రికెట్‌కు గంగూలీ దూకుడు నేర్పాడు. గంగూలీ సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. గంగూలీ నేతృత్వంలో భారత్ 146 వన్డేల్లో 76 విజయాలు.. 49 టెస్ట్‌ల్లో 21 విజయాలు సాధించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం గంగూలీ బీసీసీఐ అథ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. -
తాళి, గాజులు.. అన్నీ తనకే! అందుకే పెళ్లిలో అలా చేశా..: హీరో
పెళ్లిలో భార్యతో నుదుటన సింధూరం పెట్టించుకున్నాడు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు. ఇద్దరం సమానమే అని నిరూపించడానికే ఈ పని చేశానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ.. పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు ఓ విషయం అర్థం కాలేదు. మంగళసూత్రం, సింధూరం, గాజులు అన్నీ పాత్రలేఖ ధరించి ఉంది. మంత్రాలకు అర్థం చెప్పమన్నా..నా వేలికి ఒక ఉంగరం మాత్రమే ఉంది. అప్పుడు తనను.. నువ్వు కూడా నా నుదుటన బొట్టు పెట్టు, అప్పుడు ఇద్దరం సమానమవుతామని చెప్పాను. నా మాటలు విని పాత్రలేఖ చాలా సంతోషించింది. అంతేకాదు పూజారి వేద మంత్రాలు చదువుతున్నప్పుడు దాని అర్థాలు కూడా విడమరిచి చెప్పమన్నాను. ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నాపై కోప్పడకూడదటఅలా ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకునే క్రమంలో కొన్ని నాకు మింగుడుపడలేదు. ఉదాహరణకు ఓ మంత్రంలో ఏమని ఉందంటే.. నా భార్య నాపై కోప్పడకూడదట! అది విని ఆశ్చర్యపోయాను. ఆ లైన్ చదివేందుకు నేను ఒప్పుకోలేదు. తనకు నచ్చినట్లుగా ఉండాలంతే అని చెప్పాను అంటున్నాడు రాజ్‌కుమార్.సినిమారాజ్కుమార్ రావు, పాత్రలేఖ 2010లో ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్లో పరిచయమ్యారు. ఆ పాట షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డారు. 2021 నవంబర్ 15న చంఢీగడ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యే మూడో పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇకపోతే రాజ్‌కుమార్ రావు ఈ ఏడాది.. స్త్రీ 2, శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, విక్కీ విద్యకా వో వాలా వీడియో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.చదవండి: అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉంది.. బచ్చల మల్లి -
రెమ్యునరేషన్ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో!
సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆ హీరో కూడా రేటు పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికానికి అదనంగా మరో రూ.5 కోట్లు అడుగుతున్నాడట! అంత తెలివితక్కువవాడిని కాదుఈ పుకార్లపై రాజ్‌కుమార్ స్పందించాడు. నా నిర్మాతలను కాల్చుకుతినేంత తెలివితక్కువవాడిని కాదు. బ్లాక్‌బస్టర్ సినిమా చేసినంతమాత్రాన నేనేమీ మారిపోను. డబ్బు కన్నా నాకు ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్, సర్ప్రైజింగ్ రోల్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే స్త్రీ 2 సినిమాకుగానూ రాజ్‌కుమార్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా..స్త్రీ 2 విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన హిట్ మూవీ స్త్రీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం ఆగస్టు 15న విడుదలవగా.. ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లు వసూలు చేసింది. స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: వైల్డ్‌కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్ -
మన తెలుగువాడి బయోపిక్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్‌గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం. మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు. -
రెండు హృదయాల కల
‘రూహి’ చిత్రం తర్వాత రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ‘నో డ్రీమ్ ఈజ్ ఎవర్ చేజ్డ్ ఎలోన్!’ అనేది క్యాప్షన్. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్‌కు శరణ్‌శర్మ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ‘‘ఒకే కల కోసం రెండు హృదయాలు ఎదురు చుస్తున్నాయి’’ అంటూ ఈ మూవీని ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్లుగా జాన్వీ కపూర్ అండ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న బాలీవుడ్ హీరో?
బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భీద్ చిత్రం మార్చి 24న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించి తనే స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమస్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే భీద్ మూవీలో రాజ్‌కుమార్‌ను చూసిన జనాలు కొందరు అతడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి నటుడు స్పందిస్తూ.. 'అలాంటిదేమీ లేదు. నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది విన్నప్పుడు నాకైతే నవ్వాగదు' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజ్‌కుమార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎత్తూపొడుగూ లేదు, నీ ముక్కు సరిగా లేదు, కనుబొమ్మలు కరెక్ట్ షేప్ లేదు.. ఇలా ఏదో ఒకటి ఎత్తి చూపుతూ అతడికి ఆఫర్లు ఇచ్చేవాళ్లు కాదు. యాక్టింగ్ తప్ప అన్నీ చూస్తున్నారేంటి? నటనా నైపుణ్యాన్ని పట్టించుకోరా? అని ఆలోచించేవాడు రాజ్‌కుమార్. తన టాలెంట్ నిరూపించుకునే ఒక్క అవకాశం కోసం ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఎదురొడ్డి నిలబడ్డాడు. రామ్‌గోపాల్ వర్మ 'రన్' సినిమాతో కెరీర్ ఆరంభించి.. షాహిద్, కాయ్ పోచె, అలీఘడ్, న్యూటన్, స్త్రీ, జడ్జ్‌మెంటల్ హై క్యా, లూడో వంటి చిత్రాలతో ప్రశంసలే కాకుండా అవార్డులు సైతం అందుకున్నాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్, ఎప్పుడు? ఎక్కడంటే?
తెలుగులో వచ్చిన హిట్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీని నేచురల్ స్టార్ నాని నిర్మించారు. ఇక్కడ మూవీ హిట్ కొట్టడంతో హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే కదా! రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో దంగల్ బ్యూటీ సాన్యా మల్హోత్రా కథానాయికగా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరి హిట్‌ను యధాతథంగా తీశారా? ఏమైనా మార్పులు చేశారా? హిందీ వర్షన్ ఎలాగుంది? అనేది తెలుసుకోవాలంటే మరో నాలుగురోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో హిట్‌ను చూసేయండి మరి! The tense case of a highway, a lost car and a missing girl. HIT, The First Case is coming to Netflix on 28th August!#HITTheFirstCase pic.twitter.com/8H9gj8ODY1 — Netflix India (@NetflixIndia) August 23, 2022 చదవండి: అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటున్న నటి సురేఖ వాణి సౌందర్యతో ఎఫైర్.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన జగపతి బాబు -
స్టార్ హీరోకి ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటికి పదును పెడుతోంది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జాన్వీ పలు ప్రాజెక్ట్స్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా జాన్వీ తన లగ్జరీ ఇల్లును అమ్మేసిందంటూ బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు జూహులోని ఓ అపార్టుమెంట్‌లోని తన ప్లాట్‌ను భారీ ధరకు ఓ స్టార్ నటుడికి అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల ఆమె సోదరుడు అర్జున్ కపూర్ సైతం తన ఇల్లును అమ్మేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జూహు-విల్లె పార్లీ అనే అపార్ట్మెంట్లో గల 14, 15, 16 అంతస్థుల్లో నిర్మించిన ఈ లగ్జరీ ప్లాట్‌ను జాన్వీ 2020లో రూ. 35 కోట్లకు కొనుగొలు చేసిందట. 3456 sqf ఉన్న ఈ ఇంటిని ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉమా మహేశ్వరి అంత్యక్రియలు, పాడె మోసిన బాలయ్య కాగా ఇటీవల రాజ్‌కుమార్ రావు, తన ప్రియురాలు, సహానటి పత్రలేఖను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరు ఉండేందుకు ఇంటి కోసం వెతుకుతుండగా జాన్వీని సంప్రదించాడు రాజ్ కుమార్. అప్పటికే తన లగ్జరీ ప్లాట్‌ను అమ్మాలని చూస్తున్న జాన్వీ రాజ్‌కుమార్‌కు అమ్మినట్లు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జుహూలోని ఓ పెద్ద అపార్ట్మెంట్లో 14, 15, 16వ ఫ్లోర్లు కలిపి ఈ ఫ్లాట్ ఉంటుందట. అంతే కాకుండా కేవలం ఈ ఫ్లాట్ల పార్కింగ్ స్పేస్ కోసమే రాజ్‌కుమార్ రావు మరో రూ. 2.19 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం. -
పరేషాన్ వద్దు.. లోన్ మోసాలను గుర్తించండి ఇలా!
ఆన్లైన్లో నగదు లావాదేవీలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్‌లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు సులువుగా చక్కబెట్టుస్తున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోసగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు పాన్‌కార్డును దుర్వినియోగం చేసి రుణ మోసాలకు పాల్పడ్డారు దుండగులు. గతంలో సన్నీలియోన్ కూడా ఇదే తరహాలో మోసగాళ్ల బారిన పడ్డారు. దీంతో వారిద్దరి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. సిబిల్ స్కోర్ అంటే..? బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి సిబిల్ ఇచ్చే స్కోర్(క్రెడిట్ స్కోర్)ను ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్ స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణ చరిత్ర ఆధారంగా ఈ స్కోర్ ఉంటుంది. 900 పాయింట్ల దగ్గరగా మీ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం లభించే అవకాశాలు ఉంటాయి. ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లేదా సీఆర్ఐఎఫ్ వంటి క్రెడిట్ బ్యూరోలు కూడా స్కోర్ అందిస్తుంటాయి. జాగ్రత్తలు పాటించాలి రుణ మోసాల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. క్రెడిట్ స్కోర్‌ను రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా క్రెడిట్ స్కోరు చూసుకోవడం మంచిది. సిబిల్ వెబ్సైట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ స్కోరు చూసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారనే వివరాలు ఇందులో వెల్లడవుతాయి. (క్లిక్: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) ఇలా చేయొద్దు! ► ఐడీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ► ఆధార్, పాన్‌కార్డ్ నంబర్లను మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయొద్దు. ► స్కాన్ చేసిన ఆధార్, పాన్‌కార్డ్ కాపీలను మీ ఈ-మెయిల్లో పెట్టుకోవద్దు. ► ఈ-మెయిల్లో మీ పాన్‌కార్డ్‌ను షేర్ చేయాల్సివస్తే incognito మోడ్‌లో బ్రౌజర్‌ను వాడాలి. ► గుర్తింపు పత్రాల ఫొటో కాపీలను అటెస్ట్ చేసి మాత్రమే వాడాలి. ► ప్లబిక్ వై-ఫై వినియోగించి ఆన్లైన్ ట్రాన్టాక్షన్స్ చేయొద్దు. ► పాన్‌కార్డ్ ఇమేజ్ మీ ఫోన్లో సేవ్ చేసివుంటే.. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫొటోగ్యాలరీ యాక్సెస్ ఇవ్వొద్దు. వెంటనే స్పందించండి మీకు తెలియకుండా మీ పేరు ఎవరైనా రుణాలు తీసుకున్నట్టు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. క్రెడిట్ బ్యూరో వైబ్‌సైట్ ద్వారా మీ ఫిర్యాదును ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్లైన్లో cms.rbi.org.inకు ఫిర్యాదు చేయవచ్చు. crpc@rbi..org.inకు ఈ-మెయిల్ పంపవచ్చు. (క్లిక్: మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే..) -
బొల్లాంట్ ఇండస్ట్రీస్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు
‘‘శ్రీకాంత్ బొల్లా ఎందరికో ఆదర్శప్రాయుడు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కెమెరా ముందు శ్రీకాంత్‌లా నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్. బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. అంధుడైనప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఉన్నత స్థాయికి ఎదిగారు శ్రీకాంత్. గురువారం ఆయన జీవిత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్ ఓ నిర్మాత. భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పుట్టిన దగ్గర్నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని తన కలలను నిజం చేసుకున్నారు శ్రీకాంత్. పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఎందరికో ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఆదర్శనీయం’’ అన్నారు. దివ్యాంగులకు ఉపాధి: ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. 3 వేల మంది దివ్యాంగులను ఉచితంగా చదివిస్తున్నారు. -
వివాహం చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో.. సన్నిహితులకే ఆహ్వానం
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, నటి పత్రలేఖను పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరి వివాహం వీరికి సంబంధించిన అతి సన్నిహితుల సమక్షంలో జరగనుందట. వీరి వివాహ వేడుక చండీగఢ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పత్రలేఖ కుటుంబం ఇప్పటికే చేరుకుందట. త్వరలో రాజ్ కుమార్ కుటంబం హాజరు కానుందని సమాచారం. అయితే కొవిడ్ కారణంగా వివాహాన్ని ఎలాంటి ఆర్బాటం లేకుండా, ప్రవేట్‌గా నిర్వహించాలనుకున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీలోని అతి సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చాలా కాలంగా కలిసి ఉంటున్న రాజ్ కుమార్, పత్రలేఖ తమ పెళ్లి పుకార్ల గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొన్ని రోజులుగా ఈ జంట నవంబర్ 11-13 మధ్య వివాహం జరగనుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. రాజ్ కుమార్.. పత్రలేఖను తొలిసారిగా ఒక ప్రకటనలో చూశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా తన మనసు పత్రలేఖకు ఇచ్చేశాడు. నిజ జీవితంలో ఆమెను కలవాలని గట్టిగా కోరుకున్నాడు. ఇంకే.. నెల రోజుల తర్వాత కట్ చేస్తే డైరెక్ట్‌గా ఆమెను కలుసుకున్నాడు. తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇప్పటికీ వారు ఏడేళ్లకుపైగా రిలేషన్షిప్లో ఉన్నారు. View this post on Instagram A post shared by 🌸 Patralekhaa 🌸 (@patralekhaa) పత్రలేఖ 2014లో సిటీలైట్స్లో రాజ్‌కుమార్ రావు సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సమయానికి, రాజ్‌కుమార్ విమర్శకుల ప్రశంసలు పొందిన కై పో చే!, షాహిద్, ఒమెర్టా, అలీగర్, లవ్ సోనియా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్, సెక్స్ ఔర్ ధోఖాతో రాజ్‌కుమార్ రావు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2013లో విడుదలైన కై పో చే! చిత్రంలో అతనిది అద్భుతమైన పాత్ర. షాహిద్‌లో తన పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. రాజ్ కుమార్ చేసిన ఇటీవలి చిత్రాలు హమ్ దో హమారే దో, రూహి. -
‘హిట్’ రీమేక్‌లో హీరోయిన్గా దంగల్ నటి ఖరారు!
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్‌ను అందుకుంటున్నాయి. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన ఉప్పెన. ఇది చిన్న సినిమే అయినప్పటికీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కంటెంట్ చిత్రాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కబీర సింగ్‌గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడంతో ఇక బాలీవుడ్ మన తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ టాలెంటెట్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ కూడా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. హిందీ రాజ్‌కుమార్ రావు హీరోగా తెరకెక్కతున్న ఈ రీమేక్‌లో.. తాజాగా హీరోయిన్ను కూడా ఖారారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దంగల్ మూవీ నటి సన్యా మల్హోత్రాను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. కాగా దంగల్‌లో ఆమె ఆమీర్ ఖాన్‌కు కూతురిగా కనిపించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితో పాటు జెర్సీ, బ్రోచేవారేవరురా, అలా వైకుంఠపురంలో, డీజే, నంది, రవితేజ ఖిలాడీ మూవీలో కూడా హందీ రీమేక్‌కు క్యూలో ఉన్నాయి. -
ఇర్ఫాన్‌ను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చిన కుమారుడు
తండ్రిని తలుచుకుని ఆనందబాష్పాలు రావాలి. అశ్రువులు కాదు. కాని తండ్రి జీవించి ఉంటే ఆనంద బాష్పాలు వచ్చేవే. తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2021 ఫంక్షన్లో తండ్రి ఇర్ఫాన్ ఖాన్‌కు వచ్చిన అవార్డును అతడి తరఫున కుమారుడు బాబిల్ ఖాన్ అందుకుంటూ తండ్రిని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. ఇటీవల ముంబైలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. ఆ వేడుకలో ఇర్ఫాన్ ఖాన్‌ను మరణానంతర ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ప్రకటించారు. అలాగే ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. దానిని అందుకోవడానికి ఇర్ఫాన్ కుమారుడు బాబిల్‌ను స్టేజ్ మీదకు నటులు ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్ పిలిచారు. ఆ సమయంలో ఆయుష్మాన్ మాట్లాడుతూ ‘ఇర్ఫాన్ ఖాన్ నుంచి మేమందరం ఎంతో నేర్చుకున్నాం’ అన్నాడు. అప్పుడు అవార్డు అందుకున్న బాబిల్ తండ్రిని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అది చూసి రాజ్‌కుమార్ రావ్ కూడా కన్నీరు కార్చాడు. చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేనేమి ప్రత్యేక ఉపన్యాసం తయారు చేసుకుని రాలేదు. నన్ను మీ అందరూ అక్కున చేర్చుకున్నారు. అది చాలు’ అన్నాడు బాబిల్. ఈ ఈవెంట్ ప్రసారం కావాల్సి ఉంది. -
శుభాకాంక్షలు
ఆయుష్మాన్ ఖురానా ముఖ్య పాత్రలో హర్షవర్ధన్ కులకర్ణి తెరకెక్కించిన చిత్రం ‘బదాయి హో’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘బదాయి దో’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్, భూమి ఫెడ్నేకర్ జంటగా నటించబోతున్నారు. ఈ సీక్వెల్‌ను హర్షవర్థన్ కులకర్ణి డైరెక్ట్ చేస్తారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘శుభాకాంక్షలు. చేయి ఇటు ఇవ్వండి. (శానిటైజ్ చేసుకున్నాకే)’’ అంటూ ఈ సీక్వెల్‌ని ప్రకటించారు రాజ్‌కుమార్ రావ్. -
హిందీకి హిట్
టాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా ‘హిట్’ సినిమా చేరింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నిర్మాత కుల్దీప్ రాథోర్‌తో కలిసి ‘హిట్’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించనున్నారు. హిందీ రీమేక్‌ను కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా 2021లో సెట్స్‌పైకి వెళ్లనుంది. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్ రావ్, ‘దిల్’ రాజుగారితో కలిసి పని చేయనుండటం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి, నేటివిటీకి తగినట్లు చిన్న చిన్న మార్పులు చేస్తా’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్ మూవీ ‘హిట్’. ఓ నటుడిగా ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘హిట్’ రీమేక్ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు రాజ్‌కుమార్ రావ్ . -
తగ్గుతున్నా!
సాధారణంగా సంతానం లేనివారు పిల్లలను దత్తత తీసుకుంటారు. కానీ ఓ అనాథ యువకుడు తల్లిదండ్రులను దత్తత తీసుకుంటాడు. దాంతో అతని జీవితం మారుతుంది. అయితే అతని ప్రేమ, పెళ్లి విషయాల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఆ యువకుడు ఎలా పరిష్కరించాడు? ఇందులో అతని ప్రేయసి ప్రమేయం ఎంత? అనే అంశాలకు కాస్త హాస్యం జోడిస్తూ హిందీలో ఓ సినిమా తెరకెక్కనుంది. రాజ్‌కుమార్‌రావు, కృతీసనన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. పరేష్ రావల్, డింపుల్ కపాడియా కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత దినేష్ విజన్ తెలిపారు. ప్రస్తుతం కృతీ ‘మిమీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె సరోగేట్ మదర్ పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కోసం కృతీ 15 కిలోల బరువు పెరిగారు. రాజ్‌కుమార్ రావుతో ఒప్పుకున్న తాజా సినిమా కోసం బరువు తగ్గుతున్నారు. -
అందుకే ‘దోస్తానా-2’కు నో చెప్పాను!
ముంబై : నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు హీరో రాజ్‌కుమార్ రావు. కంగనా రనౌత్ వంటి టాప్ హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అతడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజ్‌కుమార్ నటించిన మేడ్ ఇన్ చైనా షూటింగ్ పూర్తి చేసుకోగా... జాన్వీ కపూర్‌తో కలిసి నటిస్తున్న రూహీ అఫ్జా సహా మరో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించే అవకాశం రాజ్‌కుమార్ దక్కినట్లు సమాచారం. 2008లో విడుదలైన కరణ్ జోహార్ ప్రొడక్షన్ హిట్ మూవీ దోస్తానా సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కోలిన్ డి కున్హా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన్లతో పాటు రాజ్‌కుమార్‌ను తీసుకోవాలని భావించారు. అయితే రాజ్‌కుమార్ మాత్రం దోస్తానా-2కు నో చెప్పి మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ విషయం గురించి ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... ‘ నా తదుపరి సినిమాలో ప్రియాంక చోప్రాకు జోడీగా కనిపిస్తాను. ఆ సినిమా షూటింగ్ కూడా దోస్తానా-2తో పాటు ప్రారంభం కానుంది. అందుకే దోస్తానా టీంకు నో చెప్పాను. కోలిన్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నా క్లాస్మేట్. దోస్తానా-2 కోసం అద్భుతమైన స్క్రిప్టు రాశాడు. కానీ నేను ఛాన్స్ మిస్సయ్యాను’ అని పేర్కొన్నాడు. కాగా అవార్డు విన్నింగ్ నవల ఆధారంగా తెరకెక్కనున్న ‘ది వైట్ టైగర్’ సినిమాలో ప్రియాంకతో కలిసి రాజ్‌కుమార్ కనిపించనున్నాడు. ఈ సినిమాకు ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక అరవింద్ అడిగా రచించిన ఈ నవల ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. View this post on Instagram Day 1 table read for #TheWhiteTiger with this incredibly talented team #RaminBahrani @rajkummar_rao @gouravadarsh! Can’t wait for shoot!!! @netflix @netflix_in A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Sep 23, 2019 at 3:32am PDT -
రెండు అడుగులతో నెట్టింట్లోకి....
హాలీవుడ్ వెళ్లిపోయినా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు ప్రియాంకా చోప్రా. ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారామె. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి కాదు.. ఏకంగా రెండు నెట్‌ఫ్లిక్స్ చిత్రాలను అంగీకరించారు. ఒకటేమో ‘వియ్ కెన్ బీ హీరోస్’. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. తాజాగా మరో నెట్‌ఫ్లిక్స్ చిత్రాన్ని బుధవారం అనౌన్స్ చేశారు. అరవింద్ అడిగా రచించిన ‘ద వైట్ టైగర్’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రియాంకా చోప్రా, రాజ్‌కుమార్ రావ్, ఆదర్ష్ గౌరవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తారు. ఇరానీ–అమెరికన్ దర్శకుడు రామిన్ బహ్రానీ ఈ సినిమాకు దర్శకుడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా వ్యవహరించనున్నారు. కథ ఆమెకు అంతగా నచ్చిందట. -
నేను తప్పు చేశానా : కంగన ఫైర్!
ముంబై : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. తన అప్‌మింగ్ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనను విమర్శించాడంటూ అతడిపై ఫైర్ అయ్యారు. కంగనా- రాజ్‌కుమార్ రావు సినిమా జడ్జిమెంటల్ హై క్యా సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే... కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మణికర్ణిక సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనా పూర్తిగా దేశభక్తురాలిగా మారి ఈ సినిమాను తెరకెక్కించిందని సదరు జర్నలిస్టు విమర్శించారు. అదే విధంగా పాకిస్తాన్లో షోలు నిర్వహించే భారతీయ ముస్లిం నటీమణులను వ్యతిరేకించే కంగనా... తన మణికర్ణిక సినిమాను మాత్రం అక్కడ రిలీజ్ చేయడం విశేషం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో తాజా మూవీ ప్రమోషన్‌కు వచ్చిన అతడిపై కంగన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నా మణికర్ణిక సినిమా గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు. ఆ సినిమా తెరకెక్కించి తప్పు చేశానా? జాతీయవాదిగా నాపై ముద్ర వేశావు కదూ. గతంలో నీకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అప్పుడు బాగా మెచ్చుకున్నావు. మరి తర్వాత ఏమైంది’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ పరిణామంతో కంగుతిన్న సదరు జర్నలిస్టు తను కంగన నటనను విమర్శించినందుకే తనపై ఇలా కక్ష గట్టిందని వాపోయాడు. Great to see journos standing up to #FarziNationalists like #Kangana. Questioning them or flop #Manikarnika makes you question Nationalism?🤨 Not only did @JustinJRao stand his ground - he shut the MC trying to silence him. Kudos to @ektaravikapoor for allowing journo to finish. pic.twitter.com/Vuf7ZbAXj9 — The DeshBhakt (@akashbanerjee) July 8, 2019 -
ఇకపై జడ్జిమెంటల్ హై క్యా?
అందరిలా మనమూ లేమే? అని మానసికంగా ఇబ్బంది పడేవారు బాధపడకుండా ఎవరి ఇండివిడ్యువాలిటీని వారు ఎంజాయ్ చేయాలి. ఎవరి జీవితాన్ని వాళ్లు సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మెంటల్ హై క్యా’. కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించారు. జూలై 26న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయింది. ‘మెంటల్ హై క్యా’ టైటిల్‌ను ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐఎస్ఎస్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చిత్రం టైటిల్ మానసిక సమస్యలతో బాధపడేవారిని కించపరిచే విధంగా ఉందని ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ సినిమా టైటిల్లో స్వల్ప మార్పులు చేసి ‘జడ్జిమెంటల్ హై క్యా’ అని పేరు మార్చారు చిత్రబృందం. ఈ విషయాన్ని ఏక్తా కపూర్ స్పష్టం చేస్తూ – ‘‘ఈ చిత్రం మానసికంగా ఇబ్బంది పడుతున్నవారిని తక్కువ చేసేలా ఉండదు. అలాగే టైటిల్‌తో ఎవరి సెంటిమెంట్స్నీ హర్ట్ చేయాలనే ఉద్దేశం మాకు లేనే లేదు. ఈ సినిమాలో మానసిక సమస్యలను సెన్సిటివ్‌గా డీల్ చేశాం’’ అన్నారు. -
ఇక షురూ...
ఈ రోజు (శుక్రవారం) నుంచి షురూ అంటున్నారు జాన్వీ కపూర్. తన కొత్త చిత్రం గురించే జాన్వీ కపూర్ ఇలా చెబుతున్నారు. ఆమె కథానాయికగా నటిస్తున్న హారర్ మూవీ ‘రూహీ అఫ్జా’ శుక్రవారం మొదలైంది. ఇందులో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నారు. హార్థిక్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ శర్మ కీలక పాత్రధారి. దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం మొదలైంది. ‘‘సినిమా అభిమానులందరూ శ్రద్ధగా ఆలకించండి. నా తర్వాతి హిందీ చిత్రం ఈ రోజు మొదలైంది’’ అని జాన్వీ కపూర్ అన్నారు. ఈ సినిమా కాకుండా వీరవనిత గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కార్గిల్ గాళ్’ సినిమాలోనూ నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. -
అందాల దెయ్యం
సవాళ్లంటే ఇష్టం.. సాదాసీదాగా మిగిలిపోవడం అంటే అయిష్టం అన్నట్లుగా ఉంది జాన్వీ కపూర్ తీరు. ఆమె ఒప్పుకుంటున్న సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘ధడక్’లాంటి లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెంటనే భారత పైలెట్ గుంజన్ సక్సెనా జీవితకథలో నటించడానికి అంగీకరించారు. పైలెట్ పాత్ర కోసం శిక్షణ తీసుకుని మరీ సెట్లోకి అడుగుపెట్టారు. తాజాగా మరో సినిమాకి సై అన్నారు. ఈసారి ఏకంగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి దెయ్యం పాత్ర అట. గత ఏడాది రాజ్‌కుమార్ రావ్‌తో సూపర్ హిట్ సినిమా ‘స్త్రీ’ తీసిన దినేజ్ విజయ్ ఈ హారర్ చిత్రానికి నిర్మాత. రాజ్‌కుమార్ రావ్ హీరో. మృగ్దీప్ మరో నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ జూలైలో ప్రారంభం కానుంది. ‘రుహి ఆప్జా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘ట్రాప్డ్, క్వీన్’ చిత్రాలకు స్క్రిప్ట్ విభాగంలో పనిచేసిన హార్ధిక్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
మరింత భయం
రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా గతేడాది విడుదలైన హిందీ చిత్రం ‘స్త్రీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ హారర్ సినిమాకు సీక్వెల్ చేయనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతానికైతే సీక్వెల్ ప్రస్తావనను పక్కన పెడితే రాజ్‌కుమార్ రావు మళ్లీ ఓ హారర్ సినిమా చేయడానికి అంగీకరించారు. ‘స్త్రీ’కి ఒక నిర్మాతగా వ్యవహరించిన దినేష్ విజనే ఈ సినిమాను నిర్మించనున్నారు. మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఇందులో వరుణ్‌శర్మ కీలకపాత్ర చేయనున్నారు. ఈ చిత్రానికి ‘ఫక్రీ’ ఫ్రాంచైజీ ఫేమ్ మృగ్దీప్ లమ్బా దర్శకత్వం వహిస్తారు. ఇందులో హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ఈ చిత్రానికి ‘రూహ్ అఫ్జా’ అనే టైటిల్ పెట్టాలను కుంటున్నారు. ‘స్త్రీ’ కన్నా ఈ సినిమా ఇంకా భయపెట్టే విధంగా స్క్రీన్‌ప్లే ఉంటుందట. -
పంద్రాగస్టుకి బాక్సాఫీస్ పోటీ!
వచ్చే పంద్రాగస్టుకి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్ పోటీ పడనున్నారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు కలెక్ట్ చేసిన హిందీ చిత్రాల జాబితాలో ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ టాప్ ఫైవ్‌లో ఉంటుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ‘బాహుబలి’ తన స్టామినా నిరూపించుకుంది. ఆ విధంగా ప్రభాస్ మార్కెట్ ఇతర భాషల్లోనూ పెద్దదైంది. అందుకే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. బీ టౌన్లో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. ‘సాహో’ చిత్రాన్ని వచ్చే ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మరో మూడు హిందీ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాల రిలీజ్‌ల గురించి బాలీవుడ్లో జోరుగా చర్చ మొదలైంది. అవి ‘మిషన్ మంగళ్’, ‘బాల్తా హౌస్’. ‘మేడ్ ఇన్ చైనా’. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. జగన్ శక్తి ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇస్రో (ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తల కృషి ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ‘బాల్తా హౌస్’ గురించి చెప్పాలంటే.. దాదాపు పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఆపరేషన్ బాల్తా హౌస్ ఇన్సిడెంట్ ఆధారంగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా మిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘మేడ్ ఇన్ చైనా’. చైనా ప్రాడెక్ట్స్ గురించి ఈ సినిమా ఉంటుందని భోగట్టా. ఈ మూడు సినిమాలనూ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు వెల్లడించాయి. ఇప్పుడు ‘సాహో’ కూడా సీన్లోకొచ్చింది. ఒకేరోజు నాలుగు సినిమాలంటే బాక్సాఫీస్ కలెక్షన్స్ షేర్ అయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే గురువారం వచ్చింది. ఆ రోజు పబ్లిక్ హాలీడే. నెక్ట్స్ వీకెండ్ స్టారై్టపోయింది. గురు, శుక్ర, శని, ఆదివారం.. వరుసగా నాలుగు రోజులు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది కాబట్టి, నాలుగు చిత్రాల నిర్మాతలూ తమ సినిమాని రిలీజ్ చేసే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేకపోవచ్చు. మరి.. వచ్చే పంద్రాగస్టుకి ఏ సినిమా నిర్మాత ఆలోచన అయినా మారుతుందా? వెయిట్ అండ్ సీ. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’, ఈ ఏడాది ఆయన నటించిన ‘గోల్డ్’ సినిమాలు ఆగస్టు 15న విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇదే సెంటిమెంట్‌తో అక్షయ్ కుమార్ ‘మిషన మంగళ్’ చిత్రాన్ని వచ్చే ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. సేమ్ జాన్ అబ్రహాం ఈ ఏడాది హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ ఆగస్టు 15న విడుదౖలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అందుకే ‘బాల్తా హౌస్’ చిత్రాన్ని కూడా సేమ్ రిలీజ్‌కు అబ్రహాం రెడీ చేశారని బాలీవుడ్ టాక్. ‘సత్యమేవ జయతే, బాల్తా హౌస్’ రెండు చిత్రాల్లో జాన్ అబ్రహాంది పోలీస్ క్యారెక్టర్‌నే కావడం విశేషం. ప్రభాస్, జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్. వీళ్లందరీ కంటే వచ్చే ఏడాది పంద్రాగస్టు రిలీజ్ డేట్‌ను ఫస్ట్ ఫిక్స్ చేసుకుంది హీరో రణ్‌బీర్ కపూర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. కరణ్ జోహార్ నిర్మాత. మూడు పార్ట్స్‌గా రానున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను ఆగస్టు 15కు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండటంతో వచ్చే ఏడాది తొలి పార్ట్‌ను క్రిస్మస్కు వాయిదా వేశారు ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. ఈ సినిమాలో నాగార్జున, డింపుల్ కపాడియా కూడా కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహాం రాజ్‌కుమార్, మౌనీ ‘మిషన్ మంగళ్’ టీమ్ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ -
ధైర్యం కావాలి
ఈ ఏడాది ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ఇటు బాలీవుడ్ సినిమాలతో పాటు అటు హాలీవుడ్ చాన్స్‌లను దక్కించుకుంటున్నారు. మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. అలాగే కల్కి కోచ్లిన్ మరో కథానాయిక. మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో ఓ డైనమిక్ లేడీ పాత్రలో కనిపించనున్నారు రాధిక. ‘‘ఓ ఖాళీ ప్రదేశంలో కనిపించకుండా ఉన్నారు. వారిని దాటుకుంటూనే చాలామంది వెళ్తుంటారు. ఆ కనిపించనివారికి హలో కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. కమింగ్ సూన్’’ అని ఈ సినిమా కథనాన్ని వివరించే ప్రయత్నం చేశారు రాధిక. ‘‘ఈ మూవీలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. ఈ నెల 13న మరిన్ని వివరాలు చెబుతాం’’ అని రాజ్‌కుమార్ రావు పేర్కొన్నారు. -
స్త్రీక్వెల్
హర్రర్ కామెడీ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి గిరాకీ ఉందని ‘స్త్రీ’ సినిమా రూపంలో మరోసారి ప్రూవ్ అయ్యింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘స్త్రీ’. దినేష్ విజన్‌తో పాటు రాజ్ అండ్ డీకే నిర్మించారు. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే మంచి బాక్సాఫీస్ నంబర్స్‌తో టీమ్ కూడా బహుత్ ఖుషీ అవుతున్నారు. అందుకే ‘స్త్ర్రీ’ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ‘‘ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సీక్వెల్ గురించి మా సినిమా రైటర్స్ రాజ్ అండ్ డీకేకు ఐడియాస్ ఉన్నట్లు ఉన్నాయి. అన్నీ కుదిరితే సీక్వెల్ గురించి త్వరలోనే అనౌన్స్మెంట్ ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు హీరో రాజ్‌కుమార్ రావ్. -
డేట్ గుర్తు పెట్టుకుంటారా?
నాటి తరం ప్రేమకథతో పాటు ఈ తరం ప్రేమకథను కూడా ఒకే షోలో చూడండి అంటున్నారు ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ టీమ్. అందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రెజీనా, రాజ్‌కుమార్ రావ్, జూహీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రెజీనా, సోనమ్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి తొలిసారి నటిస్తున్నారు సోనమ్ కపూర్. అనిల్ కపూర్‌కు ప్రేయసిగా జూహ్లీ చావ్లా నటించారట. అలాగే రెజీనాకు బీటౌన్‌లో ఫస్ట్ మూవీ ఇది. ఇందులో రాజ్‌కుమార్ రావ్‌కు జోడీగా రెజీనా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్గా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘ఫిబ్రవరి 1, 2019 డేట్‌ను మర్చిపోవద్దు. మా సినిమాను అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు సోనమ్. -
‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఎంత వాడి వేడి చర్చ జరిగిందో అంత కంటే ఎక్కువ సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అవి కూడా ఇంతవరకూ ఎన్నడూ ఏ లోక్‌సభ సమావేశంలో కనిపించని దృశ్యాలు. ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన పని లోక్‌సభ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదనుకుంటున్నారు జనాలు. అవిశ్వాస తీర్మానంపై చాలా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ గాంధీ చివరలో అనూహ్యంగా సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పక్కన ఉన్న వారిని చూస్తూ కన్నుగీటారు. దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటికే నెటిజన్లు రాహుల్ చేసిన పనిని విమర్శిస్తుండగా తాజాగా వీరి కోవలోకి బాలీవుడ్ జనాలు కూడా వచ్చి చేరారు. రాహుల్ కౌగిలింత ఫలితంగా నేడు ‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’ జరుపుకోవాలంటూ పిలుపునిచ్చారు బాలీవుడ్ నటీనటులు. ‘క్వీన్’ నటుడు రాజ్‌కుమార్ రావ్ తన ట్విటర్లో ఓపెనింగ్ షాట్ సన్నివేశాన్ని అనుకరిస్తూ ‘ఈ రోజు కౌగిలింతల దినోత్సవం’ అంటూ ప్రకటించారు. రాజ్ కుమార్ ట్వీట్‌కు స్పందిస్తూ సోనమ్ కపూర్ రెండు హగ్ ఎమోషన్స్‌ను రీ ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్లను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. Today is official,”Hug day.” 🤗🤗 — Rajkummar Rao (@RajkummarRao) July 20, 2018 🤗 🤗 https://t.co/KLaVs8P8ma — Sonam K Ahuja (@sonamakapoor) July 20, 2018 బీజేపీ రాహుల్ చేసిన పనిని చిన్న పిల్లల చేష్టలా ఉందని విమర్శిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దడ్లాని మాత్రం రాహుల్‌కు మద్దతు తెలిపారు. విశాల్ దడ్లాని తన ట్విటర్లో ‘రాహుల్ చేసిన పనిని విమర్శించడం కాదు. ఆలింగనం కంటే ముందు అతని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేమంతా దాని కోసం ఎదురు చూస్తోన్నాం’ అంటూ బీజేపీపై మండి పడ్డారు. What's childish about a hug? It was sorta sweet, actually. BJP should accept it with grace & perhaps send some love back, instead of being negative and churlish. Also, it would be more becoming of the govt. to answer each point Rahul made pre-hug. That's what we want to hear. https://t.co/Bl2gM8osPI — VISHAL DADLANI (@VishalDadlani) July 20, 2018 -
బై బై లండన్
పిచ్చి పిచ్చిగా నటిస్తూ పిక్చర్‌పై అంచనాలను పెంచుతున్నారు కంగనా రనౌత్ అండ్ రాజ్‌కుమార్ రావ్. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెంటల్ హై క్యా’. ఇందులో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్, అమైరా దస్తూర్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్, శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్నారు. నెల రోజులుగా లండన్‌లో జరుగుతోన్న ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. ‘లండన్‌లో షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కంగనా, రాజ్ ఇలా పోజ్ ఇచ్చారు’ అని పైన ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు ఏక్తా కపూర్. ‘క్వీన్’ సినిమాలో కలిసి నటించిన కంగనా అండ్ రాజ్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘మెంటల్ హై క్యా’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న విడుదల కానుంది. -
సర్ప్రైజ్ సెలబ్రేషన్స్
ప్యాకప్ చెప్పారు డైరెక్టర్. ఇంటికి వెళ్లిపోదామనుకున్న బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ చుట్టూ చేరారు అనిల్‌కపూర్, ఐశ్వర్యా రాయ్ అండ్ టీమ్. ఒక నిమిషం సైలెన్స్. ఆ నెక్ట్స్ కేక్ కటింగ్. మీరు ఊహించినట్లు రాజ్‌కుమార్ రావ్ బర్త్‌డే కాదు. ‘ఫ్యాన్నీఖాన్’ చిత్రంలో ఆయన వంతు షూటింగ్ కంప్లీటైనందుకు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది టీమ్. అనిల్‌కపూర్, ఐశ్వర్యా రాయ్, రాజ్‌కుమార్ రావ్ ముఖ్య తారలుగా అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఫ్యాన్నీఖాన్’. ‘‘గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆగస్టు 3న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రాజ్‌కుమార్ రావ్. అంటే ఇంతకాలం జూలైలో విడుదలవుతుందనుకున్న ‘ఫ్యాన్నీఖాన్’ ఆగస్టుకు వాయిదా పడిందన్నమాట. సెట్లో సెలబ్రేషన్సే కాదు, రిలీజ్ డేట్‌తో కూడా సర్ప్రైజ్ చేశారు టీమ్ అని అనుకుంటున్నారు బాలీవుడ్ మూవీ లవర్స్. -
శ్రద్ధా వర్సెస్ శ్రద్ధా
ఆనందపడాలో లేక బాధపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు శ్రద్ధాకపూర్. ఎందుకంటే.. ఆమె హీరోయిన్గా నటించిన ‘బట్టీగుల్ మీటర్ చాలు, స్త్రీ’ సినిమాలు ఆగస్టు 31నే రిలీజ్ కానున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజు సిల్వర్‌స్క్రీన్‌పైకి రాబోతున్నందుకు నవ్వాలో లేక రెండు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ షేర్ అవుతాయని దిగులుపడాలో అర్థం కావడం లేదట శ్రద్ధాకు. పైగా రెండు సినిమాల ప్రమోషన్స్‌లో కంపల్సరీ పాల్గొనాలి. సో.. ప్రమోషన్స్‌లో ఎవరికి ముందు ఓకే అంటే ఎవరు బాధపడతారో అని శ్రద్ధా బాధపడుతున్నారు. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బట్టీగుల్ మీటర్ చాలు’. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్‌నే ముందు అనౌన్స్ చేశారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా జంటగా నటించిన హారర్ చిత్రం ‘స్త్రీ’ రిలీజ్ డేట్‌ను త్రీ డేస్ బ్యాక్ ఎనౌన్స్ చేశారు. మరి... రిలీజ్ డేట్స్ విషయంలో మనసు మార్చుకుని ఎవరైనా శ్రద్ధా మనసును సంతోషపెడతారేమో చూడాలి. లేకపోతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కోసం శ్రద్ధా వర్సెస్ శ్రద్ధానే. -
మాట సాయం!
మాట్లాడేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. ఏమంటున్నారు బాస్..! ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే కంగనాకు స్పీచ్‌లో ట్రైనింగా అంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. ఆమె కొత్త మాటలు నేర్చుకుంటున్నది సినిమా కోసం. ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్, అమైరా దస్తూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా’. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లండన్‌లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు జరుగుతుంది. ఇందులో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రొఫెషనల్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారట. మాట్లాడటం చేత కాక కాదు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే.. మంచి మాడ్యులేషన్‌తో మాట్లాడాలి కదా. రియల్ లైఫ్‌లో మాటలతో చెడుగుడు ఆడే కంగనా ఈ సినిమాలో భాష రాని వారికి మాట సాయం చేస్తారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. -
అతనంటే పిచ్చి: జాన్వీ కపూర్
సాక్షి, ముంబై: ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే జాన్వీ కపూర్‌కు కావాల్సినంత స్టార్ డమ్ వచ్చేసిందనే చెప్పాలి. ధడక్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ బ్యూటీ.. తనను తాను ప్రమోట్ చేసుకునే పనులను ప్రారంభించారు. ఓ ప్రముఖ మ్యాగ్జైన్ ఫోటో షూట్‌తో ఆకట్టుకున్న జాన్వీ, ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ఆమె పేర్కొన్నారు. తన అభిమాన స్టార్లు ఎవరన్న విషయాన్ని చెప్పేశారు. బాలీవుడ్ విలక్షణ నటులు రాజ్‌కుమార్ రావ్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతోపాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు. ‘వాళ్ల నటన అద్భుతంగా ఉంటుంది. అందుకే వారంటే నాకు ఇష్టం’ అని జాన్వీ చెప్పారు. ముఖ్యంగా రాజ్‌కుమార్ రావ్‌పై ఆమె ప్రత్యేక ప్రశంసలు గుప్పించారు. ‘ఆయనంటే(రాజ్‌కుమార్ రావ్) ముందునుంచి అభిమానం ఉండేది. కానీ, బరేలీ కీ బర్ఫీ(2017) చిత్రం చూశాక ఆయనకు వీరాభిమానిగా మారిపోయా. ఒకానొక టైమ్‌లో ఆయన దృష్టిలో పడాలని ఎంతో ప్రయత్నించా. ఆయన సోషల్ మీడియాలో ఫోటోలన్నింటికీ కామెంట్లు చేయటం ప్రారంభించా. నేను ఎవరినైనా ఫోటో అడగదల్చుకున్నానంటే అది ఆయన్నే. అంత పిచ్చి ఆయనంటే’ అని జాన్వీ చెప్పుకొచ్చారు. ‘అయితే ఫెవరేట్ అనగానే అందరు హీరోయిన్లలా ఏ ఖానో లేక కపూరో పేరు చెబుతావనుకుంటే.. ఊహించని సమాధానం ఇచ్చావంటూ’ కరణ్, జాన్వీ అభిరుచికి హ్యాట్సాఫ్ చెప్పారు. తల్లి శ్రీదేవితో అనుబంధాన్ని, చివరి స్పర్శను గుర్తు చేసుకున్న ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. -
మెంటల్ మొదలైంది
కింద ఉన్న ఫొటో చూసి, హెడ్డింగ్ చదివి తప్పుగా అర్థం చేసుకోకండి. మెంటల్ స్టార్ట్ అయ్యింది సినిమాలో. రాజ్‌కుమార్ రావ్, కంగనా రనౌత్ ముఖ్య తారలుగా ప్రకాశ్ కొవెలముడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మెంటల్ హై క్యా’. ఏక్తా కపూర్, శోభా కపూర్, శైలేష్ ఆర్. సింగ్ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శనివారం మొదలైంది. ‘‘గో..మెంటల్’...‘మెంటల్ హై క్యా’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది’’అని పేర్కొన్నారు నిర్మాత శైలేష్. నాలుగేళ్ల తర్వాత రాజ్ కుమార్, కంగనా కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ ఇద్దరు కలిసి ‘క్వీన్’ సినిమాలో నటించారు. మరోవైపు వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన సినిమా ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని బీటౌన్ టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే... 71వ కాన్స్ వేడుకల్లో కంగనా తొలిసారి పాల్గొన్న విషయం తెలిసిందే. -
గుమ్మడికాయ కొట్టేశారు
ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు టీమ్ అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటారు. లాస్ట్డే షూటింగ్ అంటే హ్యాపీగా సినిమా పూర్తయినందుకు ఒక్క పక్క ఆనందం, యూనిట్‌ని మిస్ అవుతున్నందుకు మరో పక్క బాధ. ప్రస్తుతం ఈ పరిస్థితులనే ఫేస్ చేస్తున్నారు ‘మణికర్ణిక’ టీమ్. కంగనా రనౌత్ టైటిల్ రోల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ సినిమా షూటింగ్ జోథ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారంతో ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారట. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెంటల్ హై క్యా’ చిత్రం కంగనా రనౌత్ నెక్ట్స్ మూవీ. ఆల్మోస్ట్ నాలుగేళ్ల తర్వాత రాజ్‌కుమార్ రావ్‌తో కలసి ఈ సినిమాలో నటిస్తున్నారు కంగనా. 2014లో వచ్చిన ‘క్వీన్’ మూవీలో కంగనా, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. -
‘సైజ్ జీరో’ దర్శకుడి ‘మెంటల్ హై క్యా’
తెలుగులో అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ కోవెలమూడి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ప్రకాష్ కమర్షియల్ సక్సెస్ లు సాధించలేకపోయినా.. విభిన్న చిత్రాలతో తన మార్క్ చూపిస్తున్నాడు. గతంలో మార్నింగ్‌రాగా అనే జాతీయ స్థాయి చిత్రంతో ఆకట్టుకున్న ప్రకాష్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలక పాత్రల్లో మెంటల్ హై క్యా.? అనే సినిమాను రూపొందిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
నాలుగేళ్ల తర్వాత
కెరీర్ పరంగానే కాదు. యాక్టింగ్‌వైజ్‌గా కూడా కంగనా రనౌత్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన సినిమా ‘క్వీన్’. వికాశ్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రసంశలూ దక్కాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో రాజ్‌కుమార్ రావ్ నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరు నాలుగేళ్ల తర్వాత నటించనున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందనుందని బాలీవుడ్ టాక్. బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో చిత్రాలను తెరకెక్కించారాయన. ఈ సినిమా షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుందని బీటౌన్ టాక్. -
తొలి అడుగు ముగిసింది
ఎవరిది అంటే.. రాజ్‌కుమార్ రావ్ అండ్ టీమ్ ది. ఎందుకు అంటే.. థియేటర్లో నవ్విసూ,్త భయపెట్టడానికి. ఎలా అంటే మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే అంటున్నారు ‘స్త్రీ’ చిత్రబృందం. రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్త్రీ’. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కథను అందించారు. ఈ సినిమా షూటింగ్ చందేరీలో జరిగింది. మంగళవారంతో ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ‘‘బ్యూటిఫుల్ టౌన్ చందేరిలో ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాం. సెట్లో అందరం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాం. మోస్ట్ అమేజింగ్ టీమ్‌తో వర్క్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్ రావ్. -
ఓ స్త్రీ ... కల్ ఆనా
మా సినిమాకి టైటిల్ దొరికేసిందోచ్ అంటున్నారు శ్రద్ధా కపూర్. విషయం ఏంటంటే రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధాకపూర్ జంటగా ఓ హర్రర్ కామెడీ సినిమా రూపొందుతోంది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది. ‘స్త్రీ’ అని టైటిల్ ఫిక్స్ చేశామని అనౌన్స్ చేశారు. ‘‘ఈ సినిమాలో మీరు భయపడుతూనే నవ్వేస్తుంటారు’’ అంటూ క్లాప్‌బోర్డ్ ఫొటోని షేర్ చేశారు శ్రద్ధా కపూర్. ఆ క్లాప్ బోర్డ్ వెనుక ‘ఓ స్త్రీ కల్ ఆనా’ అని రాసి ఉంది. అంటే.. ‘ఓ స్త్రీ రేపు రా అని అర్థం’. ఈ హర్రర్ కామెడీ మూవీకి తెలుగు దర్శక–ద్వయం రాజ్–డీకే రచయితలుగా వ్యవహరించడంతో పాటు సహనిర్మాతలుగా కూడా చేస్తున్నారు. మాడాంక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమర్ కౌషిక్ దర్శకత్వం వహిస్తున్నారు. -
నో నామినేషన్
2018లో జరగనున్న 90వ ఆస్కార్స్‌కు గాను ‘ఉత్తమ ఫారిన్ ల్యాంగ్వేజ్ చిత్ర విభాగం’లో భారతదేశం తరçపున ‘న్యూటన్’ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన విషయం తెలిసిందే. అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ సినిమాకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైయింది. ఈ క్యాటగిరీలో తర్వాతి రౌండ్‌కు సెలెక్ట్ అయిన తొమ్మిది చిత్రాల లిస్ట్‌ను ఆస్కార్ అవార్డ్స్ అందించే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది ‘న్యూటన్’. ఇది వరకు ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ ఈ క్యాటగిరీలో చోటు దక్కించుకున్నప్పటికీ అవార్డుని సొంతం చేసుకోలేకపోయాయి. ఆస్కార్‌లో అన్ని విభాగాల నామినేషన్ల పూర్తి వివరాలను జనవరి 23న విడుదల చేస్తారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చ్ 4న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగనుంది. ‘‘ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో మొత్తం 92 సినిమాలు పోటీకి వచ్చాయి. అక్కడిదాకా మా సినిమా వెళ్లినందుకు మాకు ఆనందంగా ఉంది. నామినేషన్ దక్కలేదనే బాధ లేదు. ఈ అనుభవం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నాకు ఉత్సాహాన్నిచ్చింది’’అన్నారు దర్శకుడు. -
‘న్యూటన్’కు నిరాశ
ఆస్కార్ బరిలో సత్తా చాటలనుకున్న బాలీవుడ్ మూవీ న్యూటన్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు ఆస్కార్ బరిలో ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో లగాన్, మదర్ ఇండియా, సలాం బాంబే చిత్రాలు మాత్రమే ఫైనల్స్ వరకు వెళ్లాయి. ఈ సారి న్యూటన్ ఆ ఘనత సాదిస్తుందని భావించినా.. నిరాశే ఎదురైంది. 90వ ఆస్కార్ అవార్డ్స్ లో ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో 98 విదేశీ సినిమాలు పోటిలో పడ్డాయి. వీటిలో కేవలం 9 సినిమాలు మాత్రమే ఫైనల్స్ కు చేరాయి. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన న్యూటన్ కు ఫైనల్స్ లో చోటు దక్కలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియపై తెరకెక్కిన న్యూటన్ సినిమాకు అమిత్ మసూర్కర్ దర్శకుడు. ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో ఫైనల్స్ కు చేరిన చిత్రాలు... ఫెలిసైట్ ఆన్ బాడీ అండ్ సోల్ ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ ఇన్ ది ఫేడ్ ది ఇన్ సల్ట్ ఫాక్స్ ట్రాట్ లవ్ లెస్ ది స్క్వేర్ ది వూండ్ -
కృతి కంటే ముందు వంద మంది
వందమంది కాదు, లెక్క అంతకు మించే అట! ఎవరూ నచ్చలేదు. వచ్చిన వాళ్లను వచ్చినట్టే వెనక్కి పంపించేశారు దర్శక–నిర్మాతలు. చివరకు, కృతీ కర్భందాలో వాళ్లకు కావలసిన హీరోయిన్ కనిపించింది. అంటే... కృతి కంటే ముందు ఆమె నటించిన క్యారెక్టర్‌కు వందమందికి పైగా ఆడిషన్ ఇచ్చారన్న మాట! ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తున్న హిందీ సినిమా ‘షాదీ మే జరూర్ ఆనా’ సినిమా కోసమే ఇదంతా! రాజ్‌కుమార్ రావ్ ఇందులో హీరో. కృతీ కర్భందా హీరోయిన్. తెలుగులో ‘తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ’ సినిమాల్లో హీరోయిన్గా చేశారీమె. ‘బ్రూస్లీ’లో రామ్‌చరణ్‌కి అక్కగానూ నటించారు. అయితే.. పెద్దగా బ్రేక్ రాలేదు. ఇటువంటి టైమ్‌లో హిందీలో ఈ సినిమా చాన్స్ వచ్చింది. సినిమాకు మంచి పేరొస్తే... కృతి కెరీర్ హిట్ టర్న్ తీసుకున్నట్టే!! -
మళ్లీ మలైకా మాయాజాలం
దేశం మొత్తాన్నీ తన ఆటతో, అందుకు తోడైన పాటతో ఉర్రూతలూపిన మలైకా అరోరా ఖాన్ ఇప్పుడు మరోసారి తన మాయాజాలం చూపనున్నారు. గతంలో ‘మున్నీ బద్నామ్ హుయీ...’ పాటతో అన్ని రికార్డులూ బద్దలుకొట్టిన ఈ అమ్మడు తాజాగా ‘ఫ్యాషన్ ఖతమ్ ముఝ్పే...’ అనే పాటలో తన ఒయ్యారాలు ఒలకబోస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్, సోనమ్ కపూర్లు సైతం ఆ పాటలో కనిపించనున్నారు. సాజిద్ - వాజిద్‌లు సంగీతం కూర్చగా, మమతా శర్మ పాడిన ఈ ప్రత్యేక నృత్యగీతం ‘డాలీ కీ డోలీ’ చిత్రంలో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్ళినాటి రాత్రే అబ్బాయిలను మోసం చేసి, దోచుకొనే ఒక మోసగత్తె పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ డోగ్రా దర్శకుడు. ఇది ఇలా ఉండగా, ఈ ప్రత్యేక నృత్యగీతం ద్వారా ‘బాలీవుడ్ మున్నీ’ మలైకా అరోరా మరోసారి మంత్రముగ్ధుల్ని చేస్తుందని దర్శక, నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. మరి, మలైకా అందచందాలు, ఆటపాటలు చూడడానికి ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే! -
హోలీ రోజు ఏం చేస్తున్నారు ?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంతా సోమవారం హోలీ ఆడుతున్నారు. మరి బాలీవుడ్ తారల పరిస్థితి ఏంటి ? షబానా ఆజ్మీ, మనోజ్ బాజ్‌పేయి, రాజ్‌కుమార్ రావు వంటి తారలు పండుగ జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. కొత్తతరం బ్యూటీలు పరిణీతి చోప్రా, ఆలియా భట్, నర్గిస్ ఫక్రీ వంటి వాళ్లు మాత్రం షూటింగుల వల్ల ఈ రంగుల ఉత్సవానికి దూరమవుతున్నారు. హోలీ గురించి వీళ్లంతా చెప్పే కబుర్లు ఇవిగో.. ఫర్హాన్ అఖ్తర్: కుటుంబ సభ్యులతో గడపడానికి చక్కని పండుగ ఇది! పరిణీతి చోప్రా: ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. కాబట్టి సోమవారం కూడా పని చేయాల్సిందే. ఆయుష్మాన్ ఖురానా: హోలీ అంటే పెద్దగా ఇష్టపడను. మా ప్రాంతంలో ‘రౌడీ హోలీ’ జరుగుతుంటుంది. పండుగ నాడు కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతాను. ఆలియా భట్: నాకు హోలీ పండుగ లేదు. హంప్టీ శర్మ కీ దుల్హానియా షూటింగ్‌తో బిజీగా ఉన్నాను రాజ్‌కుమార్ రావు: కుటుంబం, స్నేహితులతో కలిసి హోలీ జరుపుకుంటున్నాను. రంగులు గుమ్మరించుకోవడం ఏమీ ఉండదు. గులాల్ చల్లుకోవడం వరకే.. షబానా ఆజ్మీ: నా పుట్టిళ్లు జానకీ కుటీర్‌లో సంప్రదాయబద్ధంగా హోలీ జరుపుకుంటాం. సినిమా, నాటక రంగాలకు చెందిన మా స్నేహితులు వస్తారు. రిషీ కపూర్: షూటింగ్ కోసం చండీగఢ్‌లో ఉన్నాను. రెండు రోజుల సెలవు వచ్చింది. 18 రోజుల తరువాత ముంబైకి వెళ్తున్నాను. అయితే హోలీ ఆడను. నర్గిస్ ఫక్రి: మై తేరా హీరో సినిమా ప్రచార కార్యక్రమాలతో తీరిక లేదు. కాబట్టి హోలీ ఆడే అవకాశాలు తక్కువే. వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తా. మనోజ్ బాజ్‌పేయి: హోలీ ఆడడం ఇష్టముండదు. ఈసారి నా కూతురు బలవంతం చేస్తోంది. తప్పేలా లేదు. రోణిత్ రాయ్: చాలా ఏళ్లుగా హోలీ జరుపుకోవడం లేదు. మనీశ్ పాల్: వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో హోలీ ఆడుతున్నాను. -
సిటీలైట్స్ కోసం ఎంతో కష్టపడ్డా!
ఇది వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. తాజాగా నటించిన సిటీలైట్స్ సినిమా ఒకెత్తని హీరో రాజ్‌కుమార్ రావు అంటున్నాడు. ఇంతకుముందు విడుదలైన కోయి పో చే, షహీద్ సినిమాలు మనోడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2010లో హత్యకు గురైన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది షహీద్ ఆజ్మీ జీవితగాథ ఆధారంగా షహీద్ తీశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం బ్రిటన్ నుంచి వచ్చిన మెట్రో మనీలా ఆధారంగా సిటీలైట్స్ రూపొందించారు. ‘దీని సినిమా షూటింగ్‌ను ఇటీవలే ముగించాం. మంచి జీవితం కోసం రాజస్థాన్ నుంచి ముంబై వచ్చిన జంట కథ ఇది. కొత్త నగరంలో వాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ప్రేమకథలో ఎన్నో మలుపులు ఉంటాయి’ అని రాజ్‌కుమార్ వివరించాడు. మహేశ్ భట్ నిర్మించగా, హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే ఒకటిన విడుదలయ్యే అవకాశముంది. కొత్తనటి పత్రలేఖ ఇందులో హీరోయిన్గా కనిపిస్తుంది. షహీద్ సినిమాతో తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన మెహతా కుటుంబసభ్యుడి వంటివాడేనని రావు అన్నాడు. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటామని, పాత్రలను ఎలా తీర్చిదిద్దాలో బాగా తెలుసని చెప్పాడు. ఆయన దమ్మున్న దర్శకుడు కాబట్టే సిటీలైట్స్లో నటించడానికి సంతోషంగా ఒప్పుకున్నానని ఈ 29 ఏళ్ల నటుడు అన్నాడు. కంగనా రనౌత్ ప్రధానపాత్రధారిగా ఇటీవలే వచ్చిన క్వీన్లోనూ రావు ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రియురాలిని ప్రేమలోకి దింపడానికి ఎన్నో కష్టాలు పడే ఢిల్లీ యువకుడు విజయ్ ధింగ్రాగా సత్తా ప్రదర్శించాడు. ‘ఇది హీరోయిన్ ఆధారిత సినిమా అని తెలిసినా, నాకూ నటించే అవకాశముంటుంది కాబట్టి అంగీకరించాను. ఇందులో విజయ్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది’ అని చెప్పిన రాజ్‌కుమార్ రావు ఢిల్లీడాలీ సినిమాలో సోనమ్ కపూర్ సరసన నటించే చాన్స్ కొట్టేశాడు.