Rana Daggubati
-
'ఇట్స్ కాంప్లికేటెడ్' ట్రైలర్ చూశారా..?
సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. దీంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. సుమారు ఐదేళ్ల తర్వాత 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ఈ యూత్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. హీరో రానా దగ్గుబాటి సోషల్‌మీడియా వేదికగా రీసెంట్గా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక ఫన్నీ వీడియో చేసిన విషయం తెలిసిందే. -
నెట్‌ఫ్లిక్స్‌తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
భారత్‌లో పర్యటించనున్న మాజీ బాక్సింగ్ లైట్ వెయిట్ ఛాంపియన్
భారత్‌లో పోరాట క్రీడలను ప్రోత్సహించడానికి.. అలాగే అంతర్జాతీయ, దేశీయ ప్రతిభ మధ్య అంతరాన్ని తగ్గించడానికి మాజీ యుఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంథోనీ పెట్టిస్ మొదటిసారి (మార్చిలో) భారత్‌లో పర్యటించనున్నాడు. ఆరు భారతీయ నగరాల్లో (ఢిల్లీ, జైపూర్, ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరు) ఆంథోనీ పెట్టిస్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (APFC), ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) మధ్య బాక్సింగ్ పోటీలు జరుగనున్నాయి. ఏపీఎఫ్సీ భారత పర్యటన ఖరారైన విషయాన్ని ఐపీబీఎల్ నిర్ధారించింది. 'ROAD TO IPBL' పేరుతో సాగే ఈ పర్యటనలో WBC ఇండియా ఛాంపియన్ శబరి జైశంకర్.. మాజీ బెల్లాటర్ బాంటమ్‌వెయిట్ ఛాంపియన్ సెర్గియో పెట్టిస్ (ఆంథోనీ పెట్టిస్ సోదరుడు) మధ్య ప్రధాన పోటీ జరుగనుంది.అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన సెర్గియో పెట్టిస్.. ప్రస్తుతం బెల్లాటర్ MMAతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బెల్లాటర్లో చేరడానికి ముందు సెర్గియో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో పోటీ పడ్డాడు. అక్కడ బాంటమ్‌వెయిట్ విభాగంలో అగ్రశ్రేణి యోధులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.సెర్గియో ప్రత్యర్థి శబరి జైశంకర్ భారతదేశపు అగ్రశ్రేణి ప్రొఫెషనల్ బాక్సర్. శబరి జైశంకర్.. WBC ఇండియా, WBC ఆస్ట్రలేసియా, WBC మిడిల్ ఈస్ట్ టైటిళ్లతో సహా బహుళ ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) టైటిళ్లను గెలుచుకున్నారు.'రోడ్ టు IPBL' ఇండియా టూర్ అనేది కేవలం బాక్సింగ్ మ్యాచ్‌ల శ్రేణి మాత్రమే కాదు. ఇది ప్రపంచ పోరాట క్రీడల వేడుక. ఇది భారతీయ అభిమానులు మరియు పోరాట క్రీడాకారుల అభిరుచిని రేకెత్తించడానికి ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని ఒకచోటికి చేర్చింది. మేము సందర్శించే ప్రతి నగరంలో IPBL ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం మరియు మరపురాని క్షణాలను సృష్టించాలని భావిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. మేము చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాము అని IPBL వ్యూహాత్మక భాగస్వామి రానా దగ్గుబాటి అన్నారు.IPBL బాక్సింగ్ గురించి:IPBL బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (www.indianproboxingleague.com) భారతదేశంలోని ఒక ప్రముఖ బాక్సింగ్ ప్రమోషన్ కంపెనీ. ఇది బాక్సింగ్ క్రీడను ఉన్నతీకరించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బాక్సర్ల ప్రతిభను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది. బాక్సింగ్ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని విస్తృత ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పడింది. -
వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati)నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ విడుదలైంది.ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతో మేకర్స్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Ab hogi todfod ki shuruvaat mamu, kyun ki ye Rana Naidu ka style hai 👊. Watch Rana Naidu Season 2, out in 2025, only on Netflix #RanaNaiduS2#RanaNaiduS2OnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/AKzezumPzN— Netflix India (@NetflixIndia) February 3, 2025 -
ఐదేళ్ల తర్వాత విడుదల కానున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా
సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ఈ యూత్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదల సమయంలో హీరో రానా దగ్గుబాటి సోషల్‌మీడియా వేదికగా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల సందర్భంగా ఆయన మరోసారి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తన సోషల్‌మీడియాలో ఒక ఫన్నీ వీడియోతో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే, ఈసారి 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో ఫిబ్రవరి 14 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Title endhuk marchamo adagakandi, It’s complicated anthe! Unexpected drama tho final ga theatres lo release avthundi ee Feb 14th ki. Catch us with your loved ones! Or two’s 😉#ItsComplicated #Starboy #FinallyIntheatres#SiddhuJonnalagadda @RanaDaggubati @ShraddhaSrinath… pic.twitter.com/vBOemAKPqD— Rana Daggubati (@RanaDaggubati) February 3, 2025 -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్‌గా
ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్‌గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్‌గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్‌గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్‌కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్‌లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్‌కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్‌తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్‌లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్‌లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్‌గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్‌లు, బార్లు, కాఫీ హౌస్‌లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్‌లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్‌తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్‌లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
పెదకాపు హీరో మూవీ.. ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసిన రానా
పెదకాపు మూవీ ఫేమ్ విరాట్ కర్ణ(Virat Karrna) హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్'(Nagabandham Movie). డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భోగి పండుగ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) చేతుల మీదుగా విరాట్ కర్ణ పోస్టర్‌ను రివీల్ చేశారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో విరాట్ సముద్రపు యాక్షన్ సన్నివేశంలో మొసలితో ఫైట్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ మూవీలో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ కనిపించనున్నారు.కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రాన్ని ఎలక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి అభే సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నాగబంధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. So happy to present the first look of @ViratKarrna from #Nagabandham.Already feels like an exhilarating ride :)Best wishes to my dearest #AbhishekNama garu, @nikstudiosindia and the entire team!!!@AbhishekPicture #KishoreAnnapureddy@ViratKarrna @NabhaNatesh @Ishmenon… pic.twitter.com/GXSSNYdlcg— Rana Daggubati (@RanaDaggubati) January 13, 2025 -
హీరో వెంకటేష్ పై కేసు నమోదు.. దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్ట్ షాక్
-
నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
టాలీవుడుకు చెందిన దగ్గుబాటి వెంకటేష్,సురేష్, రానాలపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైంది. దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, అభిరామ్‌పై 448, 452,458,120బి సెక్షన్లపై కేసు నమోదైంది.వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చెబుతుంది..?జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో వెంకటేష్‌కు చెందిన 1000 గజాలు స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలానికి పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే వారి మధ్య వివాదం తలెత్తింది. రానా నుంచి తీసుకున్న స్థలం లీజు పూర్తి అయింది. కానీ, ఆ స్థలంలో నందకుమార్ నిర్మాణాలు చేయడంతో రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆపై జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్‌కు నోటీసులు జారీ చేసి డెక్కన్ కిచెన్ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, దగ్గుబాటి కుటుంబ సభ్యులు 60 మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్‌ను కూల్చివేశారని నాంపల్లి కోర్టును నందకుమార్ ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో నందకుమార్‌పై కూడా కేసు నమోదు అయింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పుకుంటూ మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై రెండు కేసులో నమోదు అయ్యాయి. -
లక్కీ భాస్కర్ తర్వాత 'దుల్కర్ సల్మాన్' చేతిలో రెండు సినిమాలు
లక్కీ భాస్కర్‌తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండగా.. సుజిత్ సారంగ్ కెమెరామెన్‌గా వ్యహరించనున్నట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
రానా కోసం సమంత పోస్ట్.. సోషల్‌మీడియాలో వైరల్
రానా దగ్గుబాటి, సమంత ఇద్దరి మధ్య మంచి అనుబంధంతో పాటు స్నేహం కూడా ఉంది. వారిద్దరూ కలిసి పలుమార్లు టాక్ షోలలో సరదాగా మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా చాలామంది సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, తాజాగా సమంత షోషల్‌మీడియాలో రానా కోసం ప్రత్యేకంగా విషెష్ తెలిపింది.రానా కోసం బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ సమంత ఇలా తెలిపింది. ' హ్యాపీ బర్త్‌డే రానా. నీవు చేసే ప్రతి పనిలోను 100శాతం ఎఫర్ట్ పెట్టి శ్రమిస్తావు. నేను కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నీ మాదిరే నేను కూడా ప్రతి పనిని ఇంకా బాగా చేయాలి అనే కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నా' అని ఆమె తెలిపింది.సమయం కుదిరినప్పుడల్లా సమంతతో తాను మాట్లాడుతుంటానని రానా గతంలోనే చెప్పారు. సామ్ మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిన తర్వాత కూడా ఆమె అనారోగ్య సమస్యల గురించి ఆయన తెలుసుకున్నారు. వీరిద్దరూ ‘బెంగళూరు డేస్’ తమిళం రీమేక్ కోసం కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రీసెంట్గా జిగ్రా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో కూడా సమంత మాట్లాడుతూ.. రానా తనకు అన్న లాంటి వ్యక్తి అని సామ్ చెప్పింది. ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో రానా కూడా సమంత మై సిస్టర్ అని పిలిచాడు. -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి
డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' లాంటి అద్భుతమైన సినిమాలే గుర్తొస్తాయి. రాజమౌళి ఫ్యామిలీ గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు రానా టాక్ షోలో పాల్గొని.. తన ఇంటర్మీడియట్ ప్రేమకథని బయటపెట్టాడు.'ద రానా దగ్గుబాటి షో' పేరుతో నటుడు రానా ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రతి వీకెండ్ ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకే నాని, సిద్ధు జొన్నలగడ్డ-శ్రీలీల, నాగచైతన్య తదితరులు పాల్గొన్న ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తాజాగా రాజమౌళి-రాంగోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే రాజమౌళి తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)'ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి ఉండేది. ఆమె అంటే ఇష్టముండేది. కానీ మాట్లాడాలంటే భయం. మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని. నన్ను ఈ విషయమై ఏడిపించేవారు. మొత్తం ఏడాదిలో ఒకేఒక్కసారి ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను' అని రాజమౌళి చెప్పాడు. దీంతో రానా పగలబడి నవ్వాడు. ఈ సంభాషణ అంతా చూసి చాలామంది 90స్ కుర్రాళ్లు తమని తాము రాజమౌళి మాటల్లో చూసుకుంటున్నారు.చివరగా 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి.. మహేశ్ బాబుతో కొత్త సినిమా చేయబోతున్నారు. చాన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు టైమ్ ఉండటంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. (ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్) -
నాగ చైతన్య మరదలినే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా!
-
పిల్లలు పుడితే ఆ పని చేస్తా..: నాగచైతన్య
నాగచైతన్య- శోభిత ధూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇకమీదట భార్యాభర్తలుగా జీవితప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 4న రాత్రి అక్కినేని స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది.ఇద్దరు పిల్లలైనా ఓకే..పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇకపోతే నాగచైతన్య.. దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే! ఈ టాక్ షోలో అతడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చై మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనా ఓకే. వారిని కార్ రేసింగ్‌కు తీసుకెళ్తా.. వాళ్లతో ఉంటూ మళ్లీ నా బాల్యంలోకి వెళ్లిపోతా.. అని చెప్పాడు.నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వే..ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న ప్రశ్నకు.. నువ్వు ఉన్నావ్ కదా అని రానాకు బదులిచ్చాడు. ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను. వాళ్లేమో ఆయన నీ బంధువు కదా? అని అడుగుతుంటారు. నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటాను అని చై తెలిపాడు.వింతకల నిజం చేస్తానన్న చచైఈ సందర్భంగా రానా తనకు వచ్చిన ఓ వింతకల బయటపెట్టాడు. ఓ పార్టీలో చై చొక్కా విప్పేసి బార్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కల వచ్చిందన్నాడు. అది విని నవ్విన చై త్వరలోనే దాన్ని నిజం చేస్తానన్నాడు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో శనివారం (డిసెంబర్ 6) అందుబాటులోకి రానుంది.చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్! -
ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్
తారలు ప్రేమలో పడితే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. జంటగా విహారయాత్రలకు వెళ్లినా, విందుకు వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో లీకైపోతుంటుంది. మరికొద్ది గంటల్లో భార్యాభర్తలు కాబోతున్న శోభిత ధూళిపాళ- నాగచైతన్య కూడా డేటింగ్ చేసుకునేటప్పుడు ఎంచక్కా ట్రిప్పులకు వెళ్లారు. డిన్నర్ డేట్స్‌కు వెళ్లారు. చై-శోభిత డేటింగ్ పిక్స్ కానీ ఎక్కడా తమ ఫోటోలు రిలీజ్ కాకుండా వీలైనంతవరకు జాగ్రత్తపడ్డారు. మీడియా గుచ్చిగుచ్చి అడిగినా మౌనం వహించారే తప్ప తమ ప్రేమ కహానీని బయటపెట్టలేదు. ఇన్నాళ్లకు నాగచైతన్య-శోభితల డేటింగ్ పిక్స్ బయటకు వచ్చాయి. అదెలాగంటే.. హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ద రానా దగ్గుబాటి షోకి చై అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెనయ్యాడు.లైఫ్ అలా ఉందన్న చైలైఫ్ ఎలా ఉందన్న ప్రశ్నకు చై.. శుభ్రంగా, బాగానే ఉందన్నాడు. పనిలోపనిగా ఈ ప్రేమజంట కలిసున్న కొన్ని ఫోటోలను ప్రోమోలో చూపించారు. అందులో ఒకదాంట్లో చై.. శోభిత బ్యాగు పట్టుకుని నిల్చున్నాడు. మరో ఫోటోలో శోభిత.. ప్రియుడి భుజంపై చేయేసి దర్జాగా నిలుచుంది. ఇక ఈ వినోదాత్మక ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ శనివారం (డిసెంబర్ 7న) అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం -
Rana Daggubati: నా ఫేవరెట్ షో..!
-
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్‌గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్‌గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్‌లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్‌గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
రానా దగ్గుబాటి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
ఐఫా కాంట్రవర్సీ.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తేజ సజ్జా
‘ఐఫా’ అవార్డుల వేడుకలో రానా-తేజ సజ్జ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వ్యాఖ్యాతలుగా చేసిన రానా-తేజ స్టార్ హీరోల సినిమాలపై జోకులు వేశారు. అయితే ఫ్యాన్స్ దానికి సంబంధించిన క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..రానా-తేజలను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై తేజ సజ్జ క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేడుకలో తాము సరదా కోసమే అలా మాట్లాడామని, ఫుల్ వీడియో చూస్తే ఆ విషయం అందరికి అర్థమవుతుందని చెప్పారు. ‘ఐఫా అవార్డులు అనేది ఒక జాతీయ స్థాయి వేడుకు. దాని కోసం చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ పని చేస్తుంటారు. అన్ని విధాల చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు అందిస్తారు. మేము అదే ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పులన్నీ కట్ చేసినవి మాత్రమే. ఫుల్ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. రానా నాపై జోకులు వేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందరి హీరోలతో కలిసి పని చేశాను. స్టార్ హీరోలందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. వారిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మా వ్యాఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు’అని తేజ సజ్జ అన్నారు. కాగా, ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో నిర్వహించారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ వేడుకలో రానా-తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరించారు. పలువురు టాలీవుడు స్టార్ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
అందుకే ఆ పేరు పెట్టాం: రానా
‘‘ఇది వరకు నేను కొన్ని టాక్ షోలు చేశాను. కానీ ప్రైమ్ వీడియోలో చేస్తున్న ఈ షో వైవిధ్యమైనది. అందుకే దీనికి ‘రానా దగ్గుబాటి షో’ అని పేరు పెట్టాం. ఇది ఆర్డినరీ టాక్ షో కాదు. వెరీ ఆథెంటిక్, అన్ ఫిల్టర్డ్, అన్‌స్క్రిప్టెడ్ షో’’ అన్నారు రానా. ఆయన ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్గా, క్రియేటర్‌గా వ్యవహరిస్తూ హోస్ట్ చేస్తున్న షో ‘ది రానా దగ్గుబాటి షో’. స్పిరిట్ మీడియా బ్యానర్‌పై అమేజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన ఈ టాక్ షో ఈ నెల 23 నుంచి అమేజాన్‌లో ప్రసారం కానుంది.శుక్రవారం ఈ షో ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘ఈ షోలో ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, నాగచైతన్య, నాని, దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, రిషబ్ శెట్టి, శ్రీలీల వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఈ షోలో మా మాటలు చాలా సరదాగా సాగుతాయి. సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నట్టుగానే నిజాయతీగా, సహజంగా ఉండేలా చేసే ఒక రకమైన హ్యాంగ్ అవుట్ స్పాట్ ఇది. సెలబ్రిటీల గురించి ఎన్నో కొత్త విషయాలను డిస్కవరీ చేసే షో. 240 దేశాల్లో ఈ షో ప్రసారం కానుండటం సంతోషంగా ఉంది’’ అని చె΄్పారు. -
రానాతో టాక్ షో.. పెళ్లి, పిల్లల గురించి నాగచైతన్య ఏం చెప్పారంటే..?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా ఒక టాక్ షో రానుంది. 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో తాజాగా ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టాక్ షో కార్యక్రమంలో సౌత్ ఇండియా సెలబ్రిటీలు పాల్గొన్నారు. ట్రైలర్లో మొదట నాగచైతన్య, శ్రీలీల కనిపిస్తే.. రాజమౌళి, నానిలతో రానా ముచ్చట్లు రన్ అవుతాయి. ప్రియాంక మోహన్, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జా, రిషభ్ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ పాటు రానా సతీమణి మిహికా బజాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక అతిథితో రానా ప్రేక్షకుల ముందుకు వస్తాడు. సుమారు 10కి పైగా ఎపిసోడ్స్ ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ షో చిత్రీకరించారు. ఫస్ట్ ఎపిసోడ్ నాగచైతన్యకు సంబంధించినది ఉండొచ్చని తెలుస్తోంది.రానాతో చాలా సరదా విషయాలు వారందరూ పంచుకున్నారు. అయితే, 'నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు..?' అని చైతూను రానా ప్రశ్నిస్తే.. 'సంతోషంగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు'తో అని నవ్వుతూ బదులిచ్చారు. తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
మరోసారి హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, హీరో రానా దగ్గుబాటి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఐఫా వేడుకల్లో సందడి చేసిన రానా సరికొత్త షోలో హోస్ట్‌గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సరికొత్త 'ది రానా దగ్గుబాటి షో'తో అభిమానులను అలరించనున్నారు.ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. దీంతో రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The stars you know, the stories you don’t✨🤭Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024 -
ప్రశాంత్ వర్మ మరో సర్ప్రైజ్.. ఏకంగా బాహుబలి హీరోతో!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్‌తో సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్ థీమ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై హనుమాన్ అని క్యాప్షన్ ఇస్తూ రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. రానా కూడా జై హనుమాన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్‌కు తగినట్లు పవర్ఫుల్ రోల్ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024 -
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్