visakha airport
-
బాంబు బెదిరింపులతో హడల్
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల్లో 400 బెదిరింపులువిమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపుబాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మరో విమానానికి బాంబు బెదిరింపువిశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులుతనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణసాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. -
జగన్‌ను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే దాడి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్యానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైకోర్టుకు నివేదించింది. హత్య చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు పదునైన కత్తితో జగన్మోహన్రెడ్డిపై దాడి చేసినట్టు సాక్షులు తమ వాంగ్మూలాల్లో తెలిపారని ఎన్ఐఏ వివరించింది. హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాడని, దాచిపెట్టేందుకు అనువుగా ఉండేలా ఆ కత్తిని ఎంచుకున్నారని తెలిపింది. ప్రాణాంతక గాయం చేసేందుకు ఆ కత్తి సరిపోతుందని కోర్టుకు వివరించింది. ఈ కేసులో శ్రీనివాసరావు 9 సార్లు బెయిల్ పిటిషన్లు వేశారని, వాటన్నింటినీ న్యాయస్థానాలు కొట్టేశాయని తెలిపింది. జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి ప్రాథమిక ఆధారాలు ఉండటంతో న్యాయస్థానాలు అతని బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చాయంది. హత్యాయత్నం కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇప్పటికే ట్రయల్ మొదలు పెట్టిందని, కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయవద్దని అభ్యరి్థంచింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని తెలిపింది. అంతేకాక శ్రీనివాసరావు పారిపోతాడని, అతన్ని తిరిగి పట్టుకోవడం కష్టసాధ్యమవుతుందని తెలిపింది. అందువల్ల అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని విన్నవించింది. జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎన్ఐఏ ఇన్స్పెక్టర్, ఈ కేసు దర్యాప్తు అధికారి బీవీ శశిరేఖ కౌంటర్ దాఖలు చేశారు. ఇదే సమయంలో శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు సీనియర్ న్యాయవాది త్రిదీప్ పైస్ స్పందిస్తూ, ఎన్ఐఏ కౌంటర్ తమకు అందిందని, దానిని పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
CM YS Jagan: నేడు విశాఖకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రారంభోత్సవాలు చేస్తారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవకు చేరుకుని అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించి ప్రసంగిస్తారు. అనంతరం 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలను కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. వెజాగ్ స్టాండ్స్ విత్యూ..! దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊపిరి పోసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం జేజేలు పలుకుతున్నారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ‘వైజాగ్ స్టాండ్స్ విత్యూ’.. ‘థాంక్యూ సీఎం సార్..’ అని నినదిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం గురువారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు భారీ హోర్డింగ్‌లతో స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న పలు ప్రాంతాల్లో, ముఖ్య కూడళ్ల వద్ద థాంక్యూ సీఎం సార్.. మన విశాఖ.. మన రాజధాని.. మీవెంటే మేముంటాం.. అనే నినాదాలతో స్వచ్ఛందంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. పీఎం పాలెంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వద్ద సీఎం కార్యక్రమం ప్రాంతంలో దాదాపు 50 అడుగుల భారీ హోర్డింగ్ని కొందరు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా ఏర్పాటైన హోర్డింగ్‌లు ప్రజల మనోగతంతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేసిన సీఎం జగన్ పాలన పట్ల ఆదరణను చాటుతున్నాయని పేర్కొంటున్నారు. వలస ముద్ర స్థానంలో రాజముద్ర! వీఎంఆర్డీఏ, జీవీఎంసీ చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విశాఖ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసి భూమి పూజ చేయడంతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇన్నాళ్లూ వలస జిల్లాలుగా ముద్రపడిపోయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూపు రేఖలు రాజధాని ఏర్పాటుతో సమూలంగా మారిపోతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పాలన సాగిస్తానని సీఎం జగన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖలో మంత్రులపై దాడి ఘటనలో ఏసీపీ, సీఐలపై వేటు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి ఘటన సమయంలో బందోబస్తు కల్పనలోను, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పర్యటనలో విధుల నిర్వహణలోనూ విఫలమైన కారణంగా వెస్ట్ డివిజన్ ఏసీపీ టేకు మోహనరావు, అప్పటి ఎయిర్పోర్ట్ సీఐ సీహెచ్ ఉమాకాంత్‌లను నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ సస్పెండ్ చేశారు. గత నెల 15న విమానాశ్రయం వద్ద మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్ల మీద జనసేన కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మంత్రి రోజా వ్యక్తిగత సహాయకుడి తలకు తీవ్ర గాయమైంది. ఘటనలో ఇప్పటికే సుమారు 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 80 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత నెల 15వ తేదీన పవన్ విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంలో జనసేన కార్యకర్తలు ఎయిర్‌పోర్టులో రచ్చ రచ్చ చేశారు. పవన్‌కళ్యాణ్ విమానంలో సాయంత్రం 4.30 గంటలకు రాగా.. కార్యకర్తలు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంటకే పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని హంగామా చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న హోర్డింగ్స్ పైకెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఆ రోజున విశాఖ గర్జన ర్యాలీ ముగించుకుని మంత్రులు ఎయిర్‌పోర్టుకు వస్తున్న విషయం తెలిసినప్పటికీ వారికి బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో మంత్రులకు భద్రత, పవన్ పర్యటనకు బందోబస్తు చూసుకోవాల్సిన ఏసీపీ, సీఐలు విఫలమయ్యారని సీపీ వారిపై చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ ఉమాకాంత్‌ను గత నెల 18నే అక్కడి నుంచి బదిలీ చేసి రేంజ్‌కు సరెండర్ చేశారు. -
మంత్రులు, నేతలను చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు: విశాఖ సీపీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు శనివారం వీరంగం సృష్టించారు. మంత్రులను, వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. విశాఖ గర్జన ర్యాలీని ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాంతో ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై విశాఖ సీపీ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద అనుమతిలేకుండా 300 మంది వరకు జనసేన నేతలు గుమిగూడారు. మంత్రి రోజాతో పాటు వైఎస్సార్సీపీ నేతలను అగౌరపరిచే పదజాలంతో దూషించడమే కాకుండా చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు. ప్రజాశాంతికి భంగం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ రూల్స్ అతిక్రమించారు. పెందుర్తి ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మున్నంగి దిలీప్‌కుమార్, సిద్దు, సాయికిరణ్, హరీష్ లాంటి సామాన్య ప్రజలకు గాయాలు చేశారు. జనసేన కార్యకర్తల చర్యలతో విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రజలు భయభ్రాంతుకు గురయ్యారు. నిర్ణీత సమయంలో విమానాశ్రయానికి చేరుకోలేక 30 మంది ప్రయాణీకులు విమాన ప్రయాణం మిస్ చేసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన జనసేన నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశాం’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనలో అరెస్ట్‌ల పర్వం ప్రారంభమైంది. మంత్రులపై దాడి ఘటనలో పోలీసులు.. పలువురు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. విశాఖ దాడి ఘటనపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మంత్రులపై హత్యాయత్నంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. -
మంత్రుల కార్లపై జనసేన దాడి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన రౌడీమూకలు వీరంగం సృష్టించారు. రాష్ట్ర మంత్రులపై దాడులకు తెగబడ్డారు. కర్రలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు విసురుతూ తెగ రెచ్చిపోయారు. మంత్రుల భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారిపై కూడా విచక్షణారహితంగా దాడిచేశారు. వారి వాహనాలను చుట్టుముట్టి, కర్రలతో కొడుతూ, రాళ్లు విసురుతూ నానా బీభత్సం సృష్టించారు. మంత్రులు, మహిళలు అని ఏమాత్రం కూడా చూడకుండా జనసేన రౌడీమూకలు రెచ్చిపోయారు. దాడిచేస్తున్న సమయంలో వీరి ధోరణి చూస్తే.. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇక ఈ కేసు విషయంలో శనివారం రాత్రి జనసేనకు చెందిన పలువురిని అరెస్టుచేసినట్లు సమాచారం. ‘విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని ముగించుకుని విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి విడివిడిగా చేరుకున్న మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, రోజా, విడదల రజని.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై ఈ అల్లరి మూకలు విచక్షణారహితంగా దాడులకు దిగాయి. ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న చెత్తకుండీపైనున్న స్టీల్ మూతతో దాడిచేయగా మంత్రి రోజా వ్యక్తిగత సిబ్బందిలోని ఒకరి తలకు బలంగా గాయమైంది. దీంతో 15 నిమిషాల పాటు విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని మంత్రులను సురక్షితంగా ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమం భారీ వర్షంలోనూ జన సందోహంతో విజయవంతం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే జనసేన రౌడీమూకలు దాడికి యత్నించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, అదనపు కమిషనర్ (ఎస్బీ) ఆనందరెడ్డి విమానాశ్రయానికి చేరుకుని విచారణ చేపట్టారు. విశాఖపై విషం.. వాస్తవానికి విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పోటీచేశారు. అయితే, ఆయనకు ఇక్కడి ప్రజలు బుద్ధిచెప్పారు. దీంతో అప్పటినుంచి ఆయన.. అవకాశం ఉన్నప్పుడల్లా విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు. మొదటగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కనీసం స్పందించని పవన్.. ‘నన్ను గెలిపించారా? నేను మాట్లాడడానికి’ అని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు పరిపాలన రాజధాని కోసం చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమానికి పోటీగా జనవాణి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే విశాఖపై విషం చిమ్మేందుకు టీడీపీ డైరెక్షన్లో జనసేన నేత ముందుకెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతోనే.. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమాన్ని అక్టోబరు 15న నిర్వహిస్తున్నట్లు నాన్ పొలిటికల్ జేఏసీ ప్రకటించింది. ఇందుకు వైఎస్సార్సీపీ కూడా మద్దతు పలికింది. అయితే, అప్పటివరకు కనీసం విశాఖపట్నం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించని పవన్.. హడావుడిగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అది కూడా అక్టోబరు 16న నిర్వహించే కార్యక్రమానికి 15నే విశాఖకు వస్తున్నట్లు టూర్ షెడ్యూల్ ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ నేతలు అనుమానం వ్యక్తంచేశారు. విశాఖ గర్జన కార్యక్రమం రోజునే ఎందుకు విశాఖ వస్తున్నారని.. కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. అయినప్పటికీ మొదటగా 15వ తేదీ మ.3.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని జనసేన నేతలు ప్రకటించారు. ఆ తర్వాత టైం మారిపోయింది. సరిగ్గా విశాఖపట్నం నుంచి విజయవాడకు ఉన్న ఒకే ఒక విమాన సర్వీసు సమయంలోనే ఆయన విశాఖలో ల్యాండ్ అయ్యారు. అదే సమయంలో విశాఖ గర్జన ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి, మేరుగు నాగార్జున, జోగి రమేష్, రోజా, రజని కార్లపై దాడికి యత్నించారు. 20 మందిపై కేసు నమోదు విమానాశ్రయంలో మంత్రి రోజా అనుచరుడు దిలీప్‌పై దాడిచేసినందుకు జనసేన రౌడీమూకలపై 307, 324, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పోలీసులు విధులకు ఆటంకం కలిగించినందుకు పెందుర్తి సీఐ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు 353 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఈ రెండింటిలోనూ మొత్తంగా 20 మంది జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. జనసేన రౌడీమూకలపై మంత్రుల ఆగ్రహం విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు వీరంగం సృష్టించడంపై రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆర్కే రోజా, విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో సీఎం వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని.. ఇది తట్టుకోలేని ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వెళ్లిన ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మంత్రుల కార్లపై దాడిచేయడం దారుణమన్నారు. అఘాయిత్యాలు, అమానుషాలు చేసి ప్రజలను భయపెట్టి గెలవాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. తాము కూడా అలాగే ప్రవర్తిస్తే జనసేన మూకలు కనిపించరని వారు తెలిపారు. పవన్‌కు అమరావతి మాత్రమే కావాలనుకుంటే స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఆయన బలమేమిటో 2019 ఎన్నికల్లోనే తెలిసిపోయిందని.. ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ వీలుంటే సినిమాలు తీసుకోవాలని.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే సహించేదిలేదని మంత్రులు హెచ్చరించారు. జనసేన రౌడీమూకలు రాళ్లు, కర్రలతో తమ కార్లపై విరుచుకుపడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని.. ఎంత బతిమలాడినా వినకుండా కార్లపై రాళ్లు, కర్రలు విసిరారని వారు వివరించారు. దాదాపు 20 నిమిషాలపాటు నరకాన్ని ప్రత్యక్షంగా చూశామన్నారు. ఈ దాడికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విశాఖ విమానాశ్రయ వద్ద సంఘటన జరిగిన తీరును పరిశీలించాం. అక్కడ సీసీ కెమెరాల దృశ్యాలనూ చూశాం. దాడి జరిగిన తీరును, అందుకు బాధ్యులపై న్యాయపరంగా ముందుకెళ్తాం. నిర్వాహకులు ర్యాలీకి ఎటువంటి అనుమతి పొందలేదు. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద ప్రదర్శన చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్, నగర పోలీసు కమిషనర్ దాడులపై ఎవరేమన్నారంటే.. జనసేన రౌడీమూకల, ఆరాచక శక్తుల వికృత చేష్టలు, భౌతిక దాడులను వైఎస్సార్సీపీ సహించదు. భవిత్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోం. – వి. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రుల కార్లపై దాడికి పాల్పడిన జనసేన రౌడీమూకలు, అందుకు ప్రోత్సహించిన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దాడికి పాల్పడడం హేయమైన చర్య. – తానేటి వనిత, హోంమంత్రి పవన్‌కళ్యాణ్ ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మొదట్నుంచీ హింసావాదాన్ని రెచ్చగొట్టడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే పవన్ విశాఖకు వెళ్లారు. – కొట్టు సత్యనారాయణ, డిప్యూటీ సీఎం ఎప్పుడూ సుద్దులు చెప్పే పవన్‌కళ్యాణ్ తక్షణం దీనిపై స్పందించాలి. ఒక్క సీటు కూడా లేకపోతేనే జన సైనికులు ఇలా ఉంటే, మరి ఐదారు సీట్లు వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారో. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి జనసేన అల్లరిమూకలను పవన్ అదుపు చేసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. మేం తలుచుకుంటే రాష్ట్రంలో నీవు తిరగగలవా? మా నాయకులకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. – సామినేని ఉదయభాను, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే -
టీడీపీ నేతల హైడ్రామా
సాక్షి, విశాఖపట్నం/శ్రీకాకుళం రూరల్/కాశీబుగ్గ/ నరసన్నపేట/ఎచ్చెర్ల క్యాంపస్: సిక్కోలులోను, విశాఖలోను ఆదివారం టీడీపీ నాయకుడు లోకేశ్, ఇతర నేతలు నాయకులు హైడ్రామా సృష్టించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విశాఖ విమానాశ్రయం వద్ద ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. లోకేశ్, పార్టీ శ్రేణులు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించినా పోలీసులు సంయమనం పాటించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాసలో రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టారు. ఈ ఆక్రమణలన్నీ టీడీపీ నేతలవే కావడంతో ఆ పార్టీ నాయకులంతా ఆక్రమణల తొలగింపును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున గలాటా సృష్టించడానికి ప్రయత్నించారు. ఆక్రమణదారుడు పలాస కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించే నెపంతో అందరూ ఒక్కచోటుకు చేరి గొడవ చేయడానికి పూనుకున్నారు. పలాసలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆ పార్టీ నేత లోకేశ్ అనుమతి లేకుండా పలాస వెళ్లడానికి ప్రయత్నించగా శ్రీకాకుళం కొత్తబ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. అనంతరం లోకేశ్‌ను, పార్టీ నాయకులు కళా వెంకట్రావు, చినరాజప్పలను రణస్థలం పరిధిలోని జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లారు. లోకేశ్‌కు 149 నోటీసులు ఇచ్చి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకెళుతుండగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మార్గంమధ్యలో మధురవాడలో విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కుమారుడి వివాహ వేడుకకి హాజరైన ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. 149, 151 నోటీసులు జారీచేసినప్పుడు మీడియాతో మాట్లాడకూడదని పోలీసులు పలుమార్లు చెప్పినా ఆయన వినిపించుకోకుండా బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. దీంతో పోలీసులు లోకేశ్‌ని బలవంతంగా వాహనంలో ఎక్కించి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఆయన ఎయిర్‌పోర్టు వద్ద పేవ్‌మెంట్‌పై బైఠాయించారు. నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం ఆరుగంటలకు ఆందోళన విరమించిన లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కిరాతకంగా తనని నిర్బంధించారని చెప్పారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా ఎయిర్‌పోర్టుకి తీసుకొచ్చారని, మధ్యలో పెళ్లికి తీసుకెళ్లారని, ఎయిర్‌పోర్టు బయట కూర్చోబెట్టారని పేర్కొన్నారు. ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడులను ముందస్తుగా నరసన్నపేట మండలం మడపాం టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం విడిచిపెట్టారు. -
ఎయిర్‌పోర్టులో సింహాద్రి అప్పన్న
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో చందనధారుడు ప్రయాణికులకు దర్శనమివ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పన్న ఆలయ అధికారులు చందన రూపంలో ఉండే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సోమవారం తొలి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో చంద్రకళ మాట్లాడుతూ.. విశాఖపట్నం వచ్చే ప్రయాణికులు అప్పన్నను దర్శనం చేసుకునే అవకాశం కల్పించామన్నారు. స్వామి వారి చరిత్ర, డొనేషన్లు ఇచ్చే వారి కోసం వెబ్సైట్లు ఏర్పాటు చేశామన్నారు. స్వామి చరిత్ర ఆడియో వినేందుకు క్యూఆర్ కోడ్ త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్లో అప్పన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్థానాచార్యులు రాజ్‌గోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈవో రమణమూర్తి, శిల్పి రమణ, ఈఈ శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజు, దొడ్డి రమణ, సతీష్, పాత్నుడు, చందు, సువ్వాడ శ్రీదేవి, వంకాయల నిర్మల, రామలక్ష్మి పాల్గొన్నారు. అప్పన్నను దర్శించుకున్న కేజీఎఫ్ హీరో విమానాశ్రయంలో సింహాద్రి అప్పన్న విగ్రహం ప్రారంభోత్సవం జరిగిన కొద్దిసేపటికే కేజీఎఫ్ హీరో యష్ రావడంతో తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ పురోహితులు సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో చంద్రకళ యష్‌కు స్వామివారి శేష వస్త్రాలు కప్పి స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని యష్ తెలిపారు. -
భోగాపురానికి విశాఖ ఎయిర్‌పోర్టు
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్టును తరలించిన అనంతరం ఆ స్థలాన్ని తిరిగి రక్షణ శాఖకు అప్పగిస్తామన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ భూముల్నే ఎక్కువగా వినియోగించుకుంటామని.. అవసరమైతే తప్ప ప్రైవేట్ భూములు సేకరించకూడదని భావిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట వేగం తగ్గేలా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక నగర పరిధిలో 70 మీటర్లు, నగరం దాటిన తర్వాత 70కి పైగా రహదారి వెడల్పు ఉంటుందని వివరించారు. రహదారి నిర్మాణంలో భాగంగా వాకింగ్, సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. న్యాయస్థానంలో కేసులు కొలిక్కి రాగానే ఎయిర్‌పోర్టు, రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
విశాఖకు తప్పిన మరో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని కంటైనర్ కార్పొరేషన్ యార్డులో సోమవారం రోజున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న ఈ యార్డులో ఓ కంటైనర్ నుంచి మంటలు ప్రారంభమై కొద్దిసేపట్లోనే పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే అగ్నిమాపక యంత్రాలు త్వరితగతిన అక్కడికి చేరడంతో పూర్తిగా అదుపులోకి వచ్చాయి. విశాఖ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఈ యార్డులోని కంటెయినర్లలో వివిధ రకాల రసాయన నిల్వలు ఉన్న నేపథ్యంలో మంటలు మరింత వ్యాపించే ప్రమాదం ఉందని అందరూ భావించారు. కానీ తక్షణమే స్పందించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. -
గగనయానం షురూ
గన్నవరం/విశాఖపట్నం: లాక్డౌన్ కారణంగా విమానాశ్రయాల్లో రెండు నెలలుగా నిలిచిపోయిన పౌర విమాన సర్వీసులు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడాయి. బెంగళూరు నుంచి ఉదయం 7.20 గంటలకు 78 మంది ప్రయాణికులతో తొలి విమానం గన్నవరానికి చేరుకుంది. అనంతరం 8.20 గంటలకు బెంగళూరు నుంచి 49 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం వచ్చింది. ప్రయాణికులు టెర్మినల్‌లోకి ప్రవేశించగానే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు జిల్లాల వారీగా స్పందన వెబ్సైట్లో వివరాలు నమోదు చేశారు. అనంతరం రూట్ల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణికులను ఆయా జిల్లాల్లోని హోం క్వారంటైన్‌కు తరలించారు. ► కృష్ణా జిల్లాకు చెందిన 48 మంది ప్రయాణికులకు స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం హోం క్వారంటైన్ నిమిత్తం స్వస్థలాలకు పంపించారు. ► చెన్నై, ఢిల్లీ నుండి వచ్చిన ప్రయాణికులను మాత్రం ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ► ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు మాస్కులు, ఆరోగ్యసేతు యాప్ ఉన్నవారిని మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించారు. ► విశాఖకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నుంచి 3 ఇండిగో, ఎయిర్ ఆసియా నుంచి ఒక విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 581 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. అవే విమానాల్లో విశాఖ నుంచి 450 మంది ఆయా ప్రాంతాలకు వెళ్లారు. ► వచ్చిన ప్రయాణికులందరికి విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో అక్కయ్యపాలెంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారి చిరునామాలు, ఇతర వివరాలు తీసుకొని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. -
విమానాలకు లైన్ క్లియర్
విశాఖపట్నం: దేశీయ విమాన సర్వీసులకు లైన్‌క్లియర్ అయింది. తొలి దశలో మంగళవారం నుంచి నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల తరువాత ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్ల నుంచి విమానాలు విశాఖ విమానాశ్రయానికి వస్తున్నాయి. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా లాక్ డౌన్‌ను అమలు చేస్తూ వస్తోంది. అదే నెల 25వ తేదీ నుంచి అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను సైతం నిలిపివేసింది. కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. తాజాగా లాక్డౌన్ 4.0లో కేంద్రం కొన్ని సడలింపులతో ఈ నెల 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. అయితే ప్రయాణికుల విషయంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో విమాన సర్వీసులు తొలి రోజు ప్రారంభం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యంతో పాటు వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్గదర్శకాలతో దేశీయ విమాన సర్వీసులకు అనుమతులిచ్చింది. దీంతో మంగళవారం నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అధికారుల సుదీర్ఘ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం విశాఖ నుంచి విమాన సర్వీసుల ప్రారంభానికి అన్ని శాఖల అధికారులు సోమవారం సమావేశమయ్యారు. నావికాదళం, రెవెన్యూ, పోలీసు, ఇమిగ్రేషన్, ఎయిర్‌టైన్ మేనేజర్లు, ఎయిర్పోర్ట్ అథారిటీ సీనియర్ ఆఫీసర్లు, విమానాశ్రయం డైరెక్టర్, జిల్లా వైద్య, పోలీస్.. ఇలా అన్ని శాఖల అధికారులు విమానాశ్రయంలో సాంకేతికపరమైన అంశాల అమలుతో పాటు ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నాలుగు విమానాలకే అనుమతి తొలి దశలో నాలుగు దేశీయ విమానాలకే అనుమతులు లభించింది. మంగళవారం ఉదయం 6.55 గంటలకు బెంగళూరు నుంచి ఇండిగో విమానం, సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానంతో పాటు రాత్రి 9 గంటలకు బెంగుళూరు నుంచి ఎయిర్ ఏషియా విమానాలు విశాఖ విమానాశ్రయానికి రానున్నాయి. ఉదయం 11.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం రానుంది. ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతికాంశాలతో పాటు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దశల వారీగా ఈ సర్వీసులను పెంచేందుకు విమానయాన అధికారులు చర్యలు చేపడుతున్నారు. వారికి ఇన్స్టిట్యూషన్ క్వారైంటన్ తప్పనిసరి దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులందరినీ తప్పనిసరిగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సి ఉంటుంది. మంగళవారం రాత్రికి ఢిల్లీ నుంచి వచ్చే విమాన ప్రయాణికులు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు గానీ, ప్రైవేట్ హోటళ్లలో గానీ వారి కోరిక మేరకు తరలించి.. ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వారం రోజుల తరువాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందులో నెగిటివ్‌గా వచ్చిన వారిని ఇళ్లకు పంపించనున్నారు. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణైతే వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించనున్నారు. స్వాబ్ పరీక్షల తర్వాతే బయటకు.. బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు కరోనా నిర్ధారణ కోసం స్వాబ్ తీసుకొని ఆ తర్వాతే ఇళ్లకు పంపించనున్నారు. ప్రయాణికులందరికీ ప్రాథమిక పరీక్షలు విశాఖ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ వైద్యాధికారులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా వారికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఉష్ణోగ్రతలు పరీక్షించనున్నారు. అలాగే బ్యాగేజీల నుంచి బోర్డింగ్ పాస్‌లు.. తనిఖీలు ఇలా ప్రతీ చోటా భౌతికంగా కాకుండా సాంకేతికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తొలి దశలో రెండు విమానాలకే అనుమతులు లభించినప్పటికీ.. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే త్వరలోనే దశల వారీగా సర్వీసులు పెంచనున్నారు. – రాజ్‌కిశోర్, విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ -
నేడు గన్నవరం, విశాఖ నుంచి విమాన సర్వీసులు రద్దు
గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రారంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్‌లన్నీ రద్దయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సోమవారం నుంచి సర్వీస్‌లు ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే చివరి నిమిషం వరకూ ప్రయాణికుల విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కు పంపించాలా? లేదా? అనే విషయంపై స్పష్టత లేక సోమవారం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన నాలుగు ఇండిగో, ఒక ఎయిర్ ఆసియా విమాన సర్వీసులు నిలిచిపోనున్నట్లు విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజా కిశోర్ తెలిపారు. రెండు ఎయిర్‌పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రేణిగుంట నుంచి ఓకే.. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్ర విమానయాన శాఖ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు డైరెక్టర్ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు, 8.50 గంటలకు బెంగళూ రు నుంచి ఇక్కడికి ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తాయని పేర్కొ న్నారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు, 11.55 గంటలకు రేణి గుంట నుంచి కొల్హాపూర్‌కు రాకపోకలు కొనసాగుతాయని తెలియజేశారు. హైదరాబాద్ నుంచి 140 విమానాలు హైదరాబాద్: శంషాబాద్ నుంచి ఆదివారం అర్ధరాత్రి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం నుంచి జూన్ 30 వరకు విమానాల షెడ్యూల్‌ను ఎయిర్పోర్ట్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. -
విమానాశ్రయాల్లో పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప విమానా శ్రయాల్లో పౌర విమానయాన శాఖ సూచనల మేరకు థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారి కోసం విశాఖ విమానా శ్రయంలో ప్రత్యేక ఎయిర్‌బ్రిడ్జి, క్యూలైన్లను ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పంపిస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ ‘సాక్షి’కి వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. - 15 దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. - విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు విమాన సర్వీసులు ఉన్నాయి. 15 దేశాల జాబితాలో సింగపూర్, మలేషియా ఉండగా, దుబాయ్ లేదు. దీంతో సింగపూర్, మలేషియా నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం. - విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరించి ఆ సమాచారాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, విమానయాన శాఖ, ఇమిగ్రేషన్లకు పంపుతున్నాం. విశాఖలో చేపట్టిన చర్యలు.. - 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా మూడు షిప్టుల్లో వైద్యులు - అనుమానిత రోగులను తరలించడానికి ప్రత్యేక అంబులెన్స్ - శానిటైజేషన్ కోసం ప్రత్యేకంగా 116 మంది సిబ్బంది నియామకం - ప్రయాణికులు చేతులు శుభ్రపర్చుకోవడానికి శానిటైజర్ల ఏర్పాటు - సిబ్బంది, ప్రయాణికులకు మాస్కుల పంపిణీ - విదేశాల నుంచి వచ్చిన వారిని 28 రోజు ల పాటు ఇంటి నుంచి పర్యవేక్షించడం -
విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ హోదాలో ఆయన తొలిసారి విశాఖలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మీనా, నేవీ అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ మొదట తూర్పు నావికాదళం ఆపరేషన్ బేస్‌ను సందర్శించి, సర్క్యూట్ హౌస్‌కు వెళతారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం, అనంతరం డాక్టర్ వైఎస్సార్ సిటీ సెంట్రల్ పార్క్‌ను సందర్శిస్తారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం పోర్ట్ ట్రస్ట్‌ని సందర్శించి అక్కడ నుంచి రాత్రికి విజయవాడ బయలుదేరనున్నారు. -
విశాఖలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శనివారం విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, అదీప్ రాజ్, కన్నబాబు, గొల్ల బాబూరావు, గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు, మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, పార్టీ నగర అధ్యక్షులు శ్రీనివాస్ వంశీకృష్ణ, పార్టీ సీనియర్లు మళ్ల విజయ్ ప్రసాద్, కేకే రాజు, కుంభా రవిబాబు, అల్ఫా కృష్ణ, అక్కరమాని విజయనిర్మల తదితరులు ఉన్నారు. కాగా విమానాశ్రయంలోనే పార్టీ నాయకులు, అధికారులు, ఇతర ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. అనంతరం రోడ్డు మార్గాన తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలోని స్వర్ణ జయంతి ఆడిటోరియానికి చేరుకుని... అక్కడ జరిగే ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌తో జగన్ భేటీ కానున్నారు. అనంతరం కల్వరి వద్ద ఉన్న అరిహంత్ డైనింగ్ హాల్లో విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తాడేపల్లి బయల్దేరి వెళతారు. కాగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ నగరానికి రావడం ఇది రెండోసారి. -
సీఎం వైఎస్ జగన్‌కు ఆశా వర్కర్ల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం/ మెళియాపుట్టి: కనీవిని ఎరుగని రీతిలో ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తమ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖ నగర పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఆశా కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వరకు వందలాది మంది ఆశా వర్కర్లు బారులు తీరి జేజేలు పలికారు. వారికి సీఎం వైఎస్ జగన్ నమస్కరిస్తూ అభివాదం చేశారు. తమకు గౌరవ వేతనాన్ని కనీసం ఆరు వేలకు పెంచమని ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఉన్న 42 వేల మంది ఆశా వర్కర్లకు వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని హంసా (హెల్త్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడు ఎస్.అరవపాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మంగళవారం ఆశా వర్కర్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కష్టాలు తీరాయని.. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. -
పరిమళించిన మానవత్వం
సాక్షి, విశాఖపట్నం: ఓ యువకుడి ప్రాణం నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన చొరవ జనం హృదయాల్ని కదిలించింది. మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి తిరిగి వెళ్లేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రికి విమానాశ్రయం ఆవరణలో ‘బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్ పట్టుకుని కొంతమంది యువతీ యువకులు నినాదాలు చేస్తూ కనిపించారు. అతి వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌లోంచి రెప్పపాటు వ్యవధిలో ఆ దృశ్యాన్ని గమనించిన సీఎం జగన్ వెంటనే కాన్వాయ్ ఆపండని ఆదేశించారు. వాహనం లోంచి కిందికి దిగి, బారికేడ్ అవతల ఉన్న ఆ యువతీ యువకులను తన వద్దకు అనుమతించాలంటూ అధికారులకు చెప్పారు. వారు తన వద్దకు రాగానే అసలేం జరిగిందంటూ ఆప్యాయంగా పలకరించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌కుమార్ ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఈనెల 30న ఆపరేషన్ చేయించకపోతే కష్టమని వైద్యులు చెప్పారన్నారు. నీరజ్‌ని ఎలా బతికించుకోవాలో తెలీక మీ దృష్టిలో పడాలని ఇలా చేశామన్నారు. వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి.. ‘నీరజ్ బతుకుతాడు.. ఎప్పటిలానే మీతో సరదాగా, సంతోషంగా ఉంటాడు.. మీరేం అధైర్య పడొద్దు’ అంటూ తన సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డిని పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన తన ఫోన్ నంబర్‌ను యువకులకు ఇస్తూ.. పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను పిలిచి నీరజ్ ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అంతే.. ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ వాతావరణం వెల్లివిరిసింది. సీఎం జగన్ సార్ దేవుడంటూ నినాదాలు మిన్నంటాయి. నీరజ్ మిత్రుల కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. వారు చేతులు జోడించి నమస్కరిస్తుండగా.. జగన్ చిరునవ్వుతో అక్కడి నుంచి బయలుదేరారు. పదవి అంటే పెత్తనం కాదని, ప్రజల కష్టాల్ని పంచుకునే అధికారమని నిరూపించారని అక్కడున్న పలువురు కొనియాడారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం ఎయిర్ పోర్టులో యువత ప్రదర్శించిన బ్యానర్‌ని చూసి సీఎం స్పందించారు. సీఎం సెక్రటరీ హాస్పిటల్ వాళ్లతో మాట్లాడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా సీఎం ఆఫీసుకు వివరాలు పంపిస్తాం. అక్కడి నుంచి క్రెడిట్ నోట్ రాగానే ఆస్పత్రికి అందిస్తాం. ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయిస్తున్నాం. – కాటంనేని భాస్కర్, జిల్లా కలెక్టర్. ఇదీ నీరజ్ దీనగాధ.. విశాఖలోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన జాగరపు అప్పలనాయుడు, జాగరపు దేవి దంపతుల కుమారుడు నీరజ్ కుమార్. స్థానిక రైతు బజార్లో తల్లి కూరగాయలు అమ్ముకుని, తండ్రి కూలికి వెళ్లి కుటుంబం నెట్టుకొస్తున్నారు. నీరజ్ కుమార్ 2018లో స్థానిక రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. డిప్లమో చదువుదామని దరఖాస్తు చేశాడు. ఇంతలో బ్లడ్ క్యాన్సర్ బారినపడ్డాడు. నీరజ్‌ని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. అంత డబ్బులేకపోవడంతో అతని తల్లిదండ్రులు కొడుకు ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. నీరజ్‌తో పాటు చదువుకున్న స్నేహితులు, ఉపాధ్యాయులు రెండు నెలలుగా విరాళాలు సేకరిస్తున్నారు. మా స్నేహితుడికి పునర్జన్మనిచ్చారు.. ‘మా స్నేహితుడు నీరజ్‌కుమార్‌కు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాం. రెండు నెలలుగా దాతల కోసం తిరుగుతున్నాం. అందరం కలిసి ప్రయత్నిస్తే ఇప్పటి దాకా కేవలం రూ.40 వేలు మాత్రమే వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ వస్తున్నారని మేము ఉదయం 8 గంటల నుంచి ఎయిర్‌పోర్ట్‌లో వేచి చూశాం. పోలీసులు మమ్మల్ని లోపలకు పంపించలేదు. దారిలో నిలుచుంటే సీఎంకు కనపడకపోతామా అనే ఆశ. ఆ ఆశతోనే మధ్నాహ్నం బ్యానర్ పట్టుకుని నిలుచున్నాం. కాన్వాయ్ మా ముందు నుంచి కాస్త ముందుకెళ్లి ఆగిపోయింది. సీఎం కారు దిగి మమ్మల్ని దగ్గరకు రప్పించుకున్నారు. మా స్నేహితుడి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయించారు. ఇది నిజంగా నీరజ్‌కు పునర్జన్మే. – నీరజ్ స్నేహితులు ఈ ముఖ్యమంత్రి మా పాలిట దేవుడు మా బాబు నీరజ్‌కు ఇక్కడే (హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి)లో వైద్యం చేయిస్తున్నాం. ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బుల్లేవు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఏరోజుకారోజు వచ్చే ఆదాయంతో బతికే మేము మా బిడ్డ వైద్యానికయ్యే రూ.25 లక్షలు సమకూర్చుకోలేమని దిగులుతో ఉన్నాం. మా వాడి స్నేహితులు, టీచర్లు దాతల నుంచి చందాలు వసూలు చేసైనా ప్రాణం నిలబెట్టాలని చూస్తున్నారు. నీరజ్‌కు ఆపరేషన్ చేయిస్తామని సీఎం జగన్ చెప్పారని మంగళవారం మధ్యాహ్నం బంధువులు, మావాడి స్నేహితులు మాకు ఫోన్ చేశారు. ఇది కలా లేక నిజమా.. అనుకుని కాసేపు తేరుకోలేదు. ఈ విషయం టీవీల్లో కూడా వస్తోందని మళ్లీ ఫోన్లు వచ్చాయి. పట్టలేనంత సంతోషం వేసింది. ముఖ్యమంత్రి జగన్ గారు మాకు నిజంగా దేవుడే. మా కుటుంబం జీవితకాలం ఆయనకు రుణపడి ఉంటుంది. జగన్ గారి ఔదార్యంతో మా బిడ్డను దక్కించుకుంటామన్న ధైర్యం వచ్చింది. కష్టాల్లో ఉన్న వారి పట్ల స్పందించే గుణం జగన్‌లో ఉందని విన్నాం. కానీ ఇప్పుడు మా అనుభవంలో చూస్తున్నాం’ అని వారు గద్గద స్వరంతో పేర్కొన్నారు. గత ఏడాది విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ గారిని కత్తితో పొడిచి చంపేయాలని చూశారు. ఇప్పుడు అదే ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో నా బిడ్డను బతికించడానికి ఆయన పూనుకున్నారు. ఆయనది ఎంత మంచి మనసు!. –‘సాక్షి’తో నీరజ్‌కుమార్ తల్లిదండ్రులు దేవి, అప్పలనాయుడు, సోదరుడు అనిల్‌కుమార్ -
విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు కుమార్తె వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు, విజయలక్ష్మిల కుమారుడు రవితేజల వివాహం శనివారం రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరగనుంది. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన వైఎస్ జగన్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వివాహ వేదిక వద్దకు వెళతారు. నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించిన అనంతరం అదే రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ఇక వైఎస్ జగన్ వెంట విశాఖ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, మళ్ళ విజయ్ ప్రసాద్, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి, అవంతి శ్రీనివాస్, అదీప్ రాజ్, చెట్టి ఫాల్గుణ, బూడి ముత్యాలనాయుడు, గొట్టేటి మాధవి, కోలా గురువులు, కుంభ రవిబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, రొంగలి జగన్నాధం, కొండా రాజీవ్‌తో సహా సీనియర్ పార్టీ నేతలు ఉన్నారు. -
నాలుగు రోజుల్లో రూ.30.76కోట్లు స్వాధీనం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలో 30,76,50,984 నగదు, 17.940 కేజీల బంగారాన్ని తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అనుమానం వస్తే పది వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ బుధవారం ప్రకటించారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి 6,600 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 6,160 స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు, వీడియో సర్వలెన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సరిహద్దుల్లో 31 ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అలాగే 46 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, 18 సరిహద్దు మొబైల్ పార్టీ చెక్‌పోస్టులను , 161 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని, సోషల్ మీడియా వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. పెదకాకాని వద్ద రూ.67 లక్షలు.. ఎన్నికల నియమావళి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం చేసిన వాహనాల తనిఖీల్లో నోట్ల కట్టలతో పాటు బంగారం, వెండి అభరణాలు సైతం పట్టుబడ్డాయి. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ మొగల్రాజపురం నుంచి ఏటీఎం సెంటర్లలో నగదు నింపేందుకు గుంటూరు వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నంబూరు నుంచి వింతా శ్రీనివాసరెడ్డి స్కూటీలో రూ.3 లక్షలు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన నగదు విశాఖలో రూ.18.51లక్షలు.. సరైన పత్రాలు లేని రూ.18.51లక్షలను విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులు స్థానిక ఆర్అండ్బీ జంక్షన్ ఉడా లేఅవుట్ జంక్షన్ వద్ద పట్టుకున్నారు. ద్వారాకానగర్ నుంచి మర్రిపాలెం ఉడా లేఅవుట్‌కు వెళుతున్న విజయభాస్కర్ అనే వ్యక్తి ఏపీ31 సీఎమ్ 8559 నంబర్ గల సిఫ్ట్ డిజైర్ కారులో రూ18.51లక్షలు చిన్నబ్యాగులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాను ఎస్బీసీ సినిమా సంస్థలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నానని, తమ సంస్థకు మూడు జిల్లాల్లో 12 సినిమా హాళ్లు ఉన్నాయని విజయభాస్కర్ చెబుతున్నారు. తాడికొండలో రూ.9 లక్షలు.. గుంటూరు జిల్లా తాడికొండలో హైదరాబాద్ యల్లారెడ్డిగూడకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి కారు నుంచి రూ.9 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించడంతో వదిలేశారు. రేపల్లె మండలంలో.. రేపల్లె మండలంలోని శిరిపూడి గ్రామంలో శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.3.08 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు. ఆధారాలు సమర్పించడంతో నగదును తిరిగి ఇచ్చేశారు. 3.563 కేజీల బంగారం సీజ్.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని బోయపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి రెండు ప్రైవేట్ జ్యూయలరీ సంస్థలకు చెందిన 3.563 కేజీల బంగారాన్ని ముగ్గురు వ్యక్తులు ఓ వాహనంలో తిరుపతి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వారి వద్ద ఉన్న పత్రాలు అనుమానాస్పదంగా ఉండడంతో బంగారాన్ని సీజ్ చేశారు. బిల్లుల్లేని బంగారం.. గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేటకు చెందిన బెజవాడ హరి బిల్లులు లేకుండా తీసుకొస్తున్న 800 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ప్రస్తుతం నిందితుడు తెనాలి వన్‌టౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 22 కిలోల వెండి.. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని యూ.రంగాపురం చెక్‌పోస్ట్ వద్ద బెంగళూరు నుంచి పావగడ వెళ్తున్న ఓ కారును తనిఖీ చేసి 22 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.47 లక్షలపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. -
జగన్‌పై హత్యాయత్నం.. దర్యాప్తుపై ఓ అభిప్రాయానికి రండి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు చేపట్టే విషయంలో ఓ అభిప్రాయానికి రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. వివిధ పరిస్థితుల్లో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలన్న విధివిధానాలు ఎన్ఐఏ చట్టంలోని సెక్షన్ 6లో స్పష్టంగా ఉన్నాయని, దీనిప్రకారం ఓ అభిప్రాయానికి వచ్చి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఏ నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియచేయాలని సూచించింది. తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయవద్దని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఆదేశిస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రతా చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచనం పరిధిలోకి వస్తుందని.. ఈ నిర్వచనం పరిధిలోకి వచ్చే ఘటనలపై దర్యాప్తు చేయాల్సింది జాతీయ దర్యాప్తు సంస్థ అని, ఆ మేరకు కేంద్ర హోంశాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర సంస్థ దర్యాప్తుతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తుపై కేంద్రం నిర్ణయాన్ని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.లక్ష్మణ్ సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచారు. ధర్మాసనం దాన్ని తిరిగి సీల్డ్ కవర్లో ఉంచి, సీల్ చేసింది. ఆ నివేదికలో ఏముందో బహిర్గతం చేయలేదు. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తూ, కేంద్ర హోంశాఖ రహస్య ఈ నివేదికను తిరిగి ఆ శాఖకే ఇచ్చేస్తున్నట్లు తెలిపింది. శ్రీనివాసరావుకు మరో 14 రోజుల రిమాండ్ సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ విశాఖ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో అక్టోబర్ 25న జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్టయిన శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. గడచిన మూడు దఫాలుగా కస్టడీ ముగిసిన ప్రతిసారి సెంట్రల్ జైలు నుంచి నిందితుడ్ని ప్రత్యేక బందోబస్తుతో జిల్లా కోర్టుకు తీసుకురావడం.. మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగానే పది నిముషాల్లో రిమాండ్ పొడిగింపు ఆదేశాలు రాగానే తిరిగి మళ్లీ బందోబస్తు మధ్య సెంట్రల్ జైలుకు తరలించే వారు. మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా అమలు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమాండ్ నిందితుల హాజరు విధానానికి మళ్లీ శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టారు. రిమాండ్ ముగిసిన జనుపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ జైలులోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచే నేరుగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఆ వెంటనే మేజిస్ట్రేట్ నిందితుడి రిమాండ్ గడువును మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు నిందితుడి తరఫు లాయర్ సలీం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుందని ఆయన మీడియాకు తెలిపారు. కాగా ఎప్పటిలాగే ఈసారి కూడా నిందితుడ్ని కోర్టుకు తీసుకొస్తారన్న ఆలోచనతో మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జిల్లా కోర్టుకు చేరుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూశారు. -
సమగ్ర దర్యాప్తునకు కేంద్ర హోంశాఖను ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రతా చట్టం పరిధిలోకి వస్తుందని, అందువల్ల ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, పౌర విమానయాన భద్రతా చట్ట నిబంధనల ప్రకారం ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికార పరిధి జాతీయ భద్రతా విభాగానికి(ఎన్ఐఏ) ఉందని పేర్కొన్నారు. ఈ హత్యాయత్నం ఘటన తాలూకు పూర్తి సమాచారాన్ని, నివేదికను రాష్ట్ర పోలీసులు కేంద్ర హోంశాఖకు పంపాల్సి ఉన్నా, ఇప్పటివరకూ పంపలేదని న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల సంబంధిత నివేదికను, సమాచారాన్ని వెంటనే కేంద్రానికి పంపేలా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఎయిర్పోర్ట్ విమానాశ్రయ ఎస్హెచ్ఓలను ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. న్యాయస్థానానికి అదనపు సమాచారం విశాఖ విమానాశ్రయంలో అక్టోబర్ 25న తనపై జరిగిన హత్యాయత్నంపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి, డీజీపీ మాట్లాడిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, ఈ మొత్తం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. తాను దాఖలు చేసిన వ్యాజ్యానికి అనుబంధంగా జగన్మోహన్రెడ్డి శుక్రవారం కోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులో మరింత అదనపు సమాచారాన్ని, కీలక చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయన్న అంశాలను పొందుపరిచారు. కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయొచ్చు ‘‘పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా జరిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు 1982లో చట్టం వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3, 3ఎ ప్రకారం.. ఏ విమానాశ్రయంలోనైనా ఉద్దేశపూర్వకంగా, చట్ట విరుద్దంగా ఏదైనా ఆయుధాన్ని, పరికరాన్ని ఉపయోగించినా, హింస ద్వారా ఎవరైనా వ్యక్తిని గాయపరిచినా, హతమార్చినా, ఏదైనా విమానాన్ని నాశనం చేసినా, తీవ్రంగా నష్టపరిచినా, విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించినా, విమానాశ్రయం భద్రతకు ప్రమాదంగా పరిణమించినా, బెదిరింపులకు పాల్పడినా అందుకు బాధ్యుడైన వ్యక్తికి జీవిత ఖైదు విధించవచ్చు. ఈ నేరాలపై సెక్షన్ 5ఎ ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారి దర్యాప్తు చేయవచ్చు. సీఆర్పీసీ కింద ఓ పోలీసు అధికారికి ఉండే అధికారాలన్నీ ఈ సెక్షన్ కింద నియమితులయ్యే అధికారులకు ఉంటాయి. కేంద్రం నియమించే అధికారికి రాష్ట్ర పోలీసులు సహకరించాల్సి ఉంటుంది’’ అని అనుబంధ పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. ఎన్ఐఏకు దర్యాప్తు జరిపే పరిధి ఉంది ‘2008లో ఎన్ఐఏ చట్టం వచ్చింది. ఈ చట్టం కింద పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా జరిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలపై దర్యాప్తు జరిపే పరిధి ఎన్ఐఏకు ఉంది. విమానాశ్రయంలో చట్ట విరుద్ధ కార్యకలాలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. ఆ తరువాత ఆ సమాచారాన్ని నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఘటన తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించాలా? లేదా? అన్న దానిపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుంది. నాపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి పంపనే లేదు. విమానాశ్రయాల్లో ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలో చట్టం నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి’’ అని వైఎస్ జగన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ విఫలమయ్యారు ‘‘రాష్ట్ర హోంశాఖ, డీజీపీ తదితరులు వారి చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారు. అంతేకాక చట్ట నిబంధనల ప్రకారం ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక తెప్పించుకోలేదు. ఈ అదనపు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని నాపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన తాలూకు సమాచారాన్ని, నివేదికను కేంద్ర హోంశాఖకు పంపేలా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించండి. దాని ప్రకారం హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించండి’’ అని హైకోర్టును జగన్ అభ్యర్థించారు. విచారణను వాయిదా వేయండి: ఏజీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ నవంబర్ 27న విచారణకు రానున్న నేపథ్యంలో ఆ వ్యాజ్యం గురించి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 27వ తేదీన తనకు సుప్రీంకోర్టులో పోలవరం కేసుల విచారణ ఉందని, అందువల్ల జగన్ పిటిషన్ విచారణను ఆపై వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసే అంశాన్ని 27న పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తుపై తదుపరి చర్యలన్నీ నిలిపేయండి హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ‘పిల్’ విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా రాష్ట్ర సర్కారును ఆదేశించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. హత్యాయత్నంపై దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విన్నవించారు. అలాగే డీజీపీ, సిట్ ఇన్చార్జి, విశాఖ పోలీస్ కమిషనర్, ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓలను ప్రాసిక్యూట్ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలన్నారు. జగన్‌పై హత్యాయత్నంపై రాష్ట్ర పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అది ప్రాణం తీసే విచ్చుకత్తి
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేసేందుకు వాడిన కత్తి విషయంలోనూ అత్యంత పకడ్బందీ వ్యూహం దాగిఉంది. అంతమొందించేందుకు ఎంచుకున్న ప్రాంతం, ఎంపిక చేసుకున్న వ్యక్తి, ఉపయోగించిన ఆయుధం... ఇలా అన్ని విషయాల్లోనూ అత్యంత పటిష్టమైన వ్యూహంతో జరిగినట్టు పోలీసు వర్గాల్లోనే చర్చసాగుతోంది. ఇది పక్కా ప్రొఫెషనల్స్ వ్యూహమని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే కుట్రకు పథక రచన జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెల్సిందే. దానికి తగ్గట్టుగానే కోడి కత్తి రూపంలో మారణాయుధాన్నే తయారుచేయించారు. వాస్తవానికి కోడి కత్తి ముందు భాగంలో వెడల్పుగా పదునైన భాగం ఉంటే వెనుక మొన సూదిగా ఉంటుందని కోడి పుంజులకు కత్తులు తయారు చేసేవాళ్లు, కోడికి కత్తులు కట్టేవాళ్లు చెబుతున్నారు. కానీ ప్రతిపక్షనేతపై హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి ముందు పదునైన భాగం బాగా పొడవుగా ఉంది. దాన్ని పట్టుకోవడానికి బలంగా ఉండేలా వెనుక భాగం బలంగా పిడి మాదిరిగా ఉంది. చేతిలో బలంగా ఇమడటానికి వీలుగా తయారు చేయించారు. కచ్చితంగా ఇది కుట్రలో భాగంగానే కోడి కత్తి కంటే పదునుగా, బలంగా ఉండేలా తయారు చేయించిన విచ్చుకత్తి అని నేరవిచారణలో నిపుణులైన కొందరు పోలీసు అధికారులే చెబుతున్నారు. హత్యాయత్నం జరిగిన క్షణంలోనే దుండగుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదట అతని వద్ద ఒక కత్తే ఉందని, మూడవ రోజున తీరుబడిగా రెండవ కత్తి కూడా ఉందంటూ పోలీసులు చూపించారు. అంటే ఒక కత్తితో దాడి లక్ష్యం నెరవేరకపోతే మరో కత్తిని వాడేందుకు నిర్ణయించికున్నట్టు నిర్ధారణ అయ్యింది. నిందితుడు శ్రీనివాసరావు ఏకంగా రెండు కత్తులను పెట్టుకోవడం ప్రొఫెషనల్స్ వ్యూహమేనని క్రిమినల్ విచారణలో నిష్ణాతులు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే చేశాడని జరుగుతున్న ప్రచారం నిజమన్నట్లుగా ఈ అంశాలు కుండబద్దలుగొట్టినట్లు చెబుతున్నాయి. ఈ సంఘటన అనుకోకుండా జరిగిందని ఒకసారి, హత్యాయత్నం కాదు దాడి అని మరొకసారి, అసలు కత్తే లేదంటూ మరోసారి...ఇలా పొంతనలేని రకరకాల కట్టుకథలు వినిపిస్తున్న తీరు హత్యాయత్న కుట్ర వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహంతోనే.. కుట్ర వెనుక ఉన్న ముఖ్యులు, సూత్రధారులు, అనేక రకాలుగా రెక్కీలు నిర్వహించిన ప్రొఫెషనల్ గ్యాంగులు... నిత్యం ప్రజల మధ్య ఉండే జగన్మోహన్రెడ్డిని తుదముట్టించడం తమవల్ల కాదని నిర్దారణకు వచ్చి, విమానాశ్రయాన్ని ఎంచుకున్న సంగతి తెల్సిందే. రద్దీ లేని వీఐపీ లాంజ్‌లో తమ పని చక్కబెట్టుకోవచ్చని భావించి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి జనుపల్లి శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. తెరవెనుక కథ నడిపారు. అనుమతులతో పనిలేకుండా శ్రీనివాసరావును విమానాశ్రయంలోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోకి భారీ ఆయుధాలు తేవడం కంటే అత్యంత పదునైన చిన్నపాటి ఆయుధం తేవడాన్ని ఒక వ్యూహ ప్రకారమే ఎంచుకున్నారు. ప్లాన్ అమలులో ఏ పొరపాటు జరిగినా సూత్రధారుల పేర్లు, కుట్ర కోణం బైటపడకుండా కథ నడిపారు. ఎవరూ ఊహించలేని విధంగా హత్యకు కుట్రపన్నారని కొందరు న్యాయవిచారణ నిపుణులు చెబుతున్నారు. కత్తి ఎక్కడ తయారు చేయించారో తేల్చని పోలీసులు.. నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును తిప్పుతున్న పోలీసులు హత్యచేయడానికి వాడిన ఆయుధాన్ని ఎక్కడ తయారు చేయించారో కనుక్కోలేకపోవడం నిఘూడ అంశంగా ఉంది. ఘటన జరిగి 23 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కత్తికి సంబంధించి పోలీసులు ఒక నిర్ధారణకు రాకపోవడం కేసును నీరుగార్చే యత్నంగా కనిపిస్తోంది. దర్యాప్తు చేపట్టిన తొలిరోజుల్లో ఆ కత్తి ఎక్కడ చేయించాడన్న దానిపై పోలీసులు కొంత హడావుడి చేశారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కోడి కత్తులు చేసే వారితో పోలీసులు ఆరా తీసారు. ఆ ప్రాంతాల్లో ఆ కత్తిని తయారు చేయించలేదని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్లో కత్తి తయారు చేయించి ఆతరువాత విమానాశ్రయంలోకి చేర్చారు. ఇందుకు సెక్యూరిటీ అధికారుల సహకారంతో హర్షవర్దన్ చౌదని తన రెస్టారెంట్లో పనిచేసే సాకుతో శ్రీనివాసరావు, కత్తులను విమానాశ్రయంలోకి తరలించినట్లు కొందరు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా కత్తిని తయారు చేయించడంలోనే బలమైన కుట్ర దాగి ఉందనే విషయం తేట్టతెల్లమవుతోంది. -
శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
విశాఖ లీగల్: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జె. శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ మేరకు నగరంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.నాగార్జున శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. విచారణ ప్రాథమిక స్థాయిలో ఉందని, సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయడం, ఆధారాల సేకరణ వంటివి ఇంకా పూర్తికావల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్లో పనిచేసే శ్రీనివాసరావు వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్యచేయడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు తనను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఎన్ జయలక్ష్మి రాతపూర్వకంగా న్యాయమూర్తికి తమ వాదనలను దాఖలు చేశారు. నిందితునికి సంబంధించి ముమ్మడివరం కోర్టులో కొట్లాట కేసు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. కేసు పూర్తి విచారణ జరిగి తుది నివేదిక దాఖలు చేయడానికి సమయం పడుతుందన్నారు. ఈ కేసులో మరికొంత మందిని విచారించాల్సి ఉందన్నారు. దీంతోపాటు హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం సరైంది కాదన్నారు. శ్రీనివాసరావు కేవలం రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తని, ఎయిర్‌పోర్టు లాంజ్ దగ్గరకు ఎందుకు వచ్చాడన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. రహస్య విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. శ్రీనివాసరావు తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ దేశంలో పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించినందున శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ కథనంతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ తోసిపుచ్చారు. -
శ్రీనివాసరావు రెండోసారి కస్టడీపై సిట్ దొంగాట!
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నిందితుడు శ్రీనివాసరావు నుంచి ఇంకా ఏ వాస్తవాలు తెలుసుకోవాలని భావిస్తున్నారో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అతని నుంచి సేకరించే సమాచారంతో ఇంకా విచారించాల్సిన సాక్షులు ఎవరో కూడా వెల్లడించలేదు. అతనికి కస్టడి పొడిగించాల్సిన అవసరం ఏమిటో కూడా పోలీసులు సరైన కారణాలు చూపలేకపోయారు. దర్యాప్తు అధికారులు సరైన కారణాలు చూపితేగానీ కస్టడీ పొడిగించలేం’ – విశాఖపట్నం న్యాయస్థానం ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కస్టడి పొడిగించేందుకు పోలీసులు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఆ ప్రాతిపదికనే అతని కస్టడీ పొడిగింపును న్యాయస్థానం తిరస్కరించింది. కష్టడీ పిటిషన్‌ను ఏ కారణాల వల్ల నిరాకరిస్తుందో ఆ అంశాలను కోర్టు తెలిపింది. సాధారణంగా కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి పోలీసులు మరలా పిటిషన్ వేయాలి. కానీ ఈ కేసులో పోలీసులు ఆపని చేయలేదు. దీన్నిబట్టి చూస్తే కావాలనే పోలీసులు కష్టడీకి తిరిగి పిటిషన్ వేయలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహేతుకమైన కారణాలను పోలీసులు వివరించి ఉంటే న్యాయస్థానం కస్టడీకి సమ్మతించి ఉండేదని న్యాయ నిపుణులు చెబుతుండటం గమనార్హం. అంటే శ్రీనివాసరావును మరోసారి కస్టడీలోకి తీసుకుని ఈ కేసులో అసలు కుట్ర కోణాన్నిఛేదించే ఉద్దేశం పోలీసులకు లేదని స్పష్టమవుతోంది. ఈ కుట్రలో తెరవెనుక పెద్దలు, అసలు కుట్రదారుల పాత్ర బయటకు రాకుండా పోలీసులే విచారణను పక్కదారి పట్టించారన్నది తేటతెల్లమవుతోంది. పూర్తిగా విచారించే ఉద్దేశంలేని సిట్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు. సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిని లోతుగా, నిశితంగా విచారిస్తే అసలు కుట్ర బట్టబయలవుతుంది. అందుకే ఇలాంటి కేసుల్లో నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించేందుకు పోలీసులు రెండుమూడుసార్లు కస్టడీ కోరతారు. కస్టడీ పొడిగించేందుకు అనుమతించాల్సిందిగా సహేతుకమైన కారణాలను కూడా కోర్టుకు వివరిస్తారు. కాని సిట్ పోలీసులు ఆ ప్రమాణాలను పాటించకుండా తూతూ మంత్రంగా కస్టడీ పొడిగింపు పిటిషన్ వేశారు. దాంతో కస్టడియే అవసరం లేదని న్యాయస్థానం భావించి ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటూ.... వై.ఎస్.జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయటపడకుండా సిట్ అధికారులు మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆడమన్నట్టు ఆడుతున్నారు. నిందితుని కస్టడీ పొడిగించి విచారిస్తే ఈ కుట్రలో సూత్రధారుల పాత్రలు బయటపడే అవకాశముందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే అసలు కస్టడి పొడిగింపే వద్దని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. తద్వారా ఈ కేసు విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించి, కొన్ని రోజులకు కేసును పూర్తిగా నీరుగార్చాలన్నది వారి వ్యూహం. అందుకే తూతూ మంత్రంగా పిటిషన్ వేసి చేతులు దులుపుకున్నారు. పోలీసులు అంత ఉదాసీనంగా ఉండటాన్ని న్యాయస్థానం ప్రస్తావిస్తూ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను తిరస్కరించింది. తమకు కావల్సింది కూడా అదేనని ప్రభుత్వ పెద్దలు ఇటు పోలీసులు మిన్నుకుండిపోయారు. కస్టడీ పిటిషన్లోనే కాదు ఈ కేసులో మొదటి నుంచీ కూడా సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే చేస్తున్నారు. హత్యాయత్నం కేసు రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాన్ని 120బి సెక్షన్‌ను పొందుపరచలేదు. నిందితుడు శ్రీనివాసరావుకు నిబంధనలకు విరుద్ధంగా విశాఖ విమానాశ్రయంలో ఆశ్రయం కల్పించిన టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిను పిలిపించి తూతూ మంత్రంగా మాట్లాడి పంపించేశారు. హత్యాయత్నానికి మార్గం సుగమం చేసిన అతన్ని అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించకపోవడం విస్మయపరుస్తోంది. ఇక నిందితుడు శ్రీనివాసరావును అయినా పూర్తిస్థాయిలో విచారిస్తారా... అంటే అదీ లేదు. ఆరురోజుల కస్టడి సమయంలో పోలీసులే హైడ్రామా నడిపారు. ప్రభుత్వ పెద్దలు కోరుకున్నట్లుగా శ్రీనివాసరావును మీడియాతో మాట్లాడించేందుకు అనారోగ్యం పేరిట అతన్ని కింగ్‌జార్జ్ ఆసుపత్రికి తీసుకువచ్చి డ్రామా రక్తికట్టించారు. ఆ తరువాత ఇక అతన్ని సరైన రీతిలో విచారింకుండానే కస్టడీ గడువు ముగిసింది. -
కుట్రలో భాగంగానే కెమెరాలు ఆఫ్..
-
‘కళ్లు’గప్పి కడతేర్చే కుట్ర!
కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పి భవిష్యత్‌పై భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది నవంబరులో ఇడుపులపాయ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు... సరిగ్గా అప్పుడే అమరావతి కేంద్రంగా ప్రతిపక్ష నేతను అడ్డు తొలగించుకునే నీచమైన ఎత్తుగడ పురుడు పోసుకుంది. టీడీపీ నేత, ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి ద్వారా విశాఖ విమానాశ్రయంలో కుట్ర కథ నడిపించారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే అంటే సరిగ్గా మూడు నెలల క్రితం కుట్ర అమలుకు ప్రభుత్వ పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సరిగ్గా అప్పటి నుంచే విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం తాజాగా వెలుగులోకి రావడం కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తోంది. (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలిగిన విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థ మూడు నెలలుగా పడకేసింది. విమానాశ్రయంలో సీసీ కెమెరాల ఫుటేజీ మూడు నెలలుగా లేదని స్వయంగా విశాఖ పోలీసులే హైకోర్టుకు నివేదించడం గమనార్హం. కీలకమైన ఎయిర్‌పోర్టులో నెలల తరబడి సీసీ కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయని పోలీసులు చెప్పడం అందరినీ విస్మయపరుస్తోంది. దొంగతనాలు, ఇతర నేరాల కట్టడికి అపార్టుమెంట్లు, చిన్న వ్యాపార సంస్థల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు తరచూ చెబుతుంటారు. అలాంటిది దేశ, విదేశ ప్రముఖులు, వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ముఖ్యమైన విమానాశ్రయంలో సీసీ కెమెరాలు కచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే ధ్యాసే లేకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కావాలనే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని, కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగానే కెమెరాలు ఆఫ్.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర మూడు నెలల క్రితం ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆయన ప్రతి వారం విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ చివరినాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగియాల్సి ఉంది. అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఉత్తరాంధ్రలో పాదయాత్ర షెడ్యూల్ ఉన్నందున ప్రతిపక్ష నేత విశాఖపట్నం విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా దీన్నే అవకాశంగా మలుచుకుని ఆయన్ను హత్య చేసేందుకు ఏడాది క్రితం కుట్ర పన్నారు. విశాఖ విమానాశ్రయం కేంద్ర స్థానంగా.. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ నిర్వాహకుడు, టీడీపీ నేత హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి ద్వారా ఈ కథ నడిపించారు. ఆయనతో విమానాశ్రయ భద్రతాధికారి వేణుగోపాల్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా వాడుకుని తమ పన్నాగాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఉపక్రమించారు. ఏడాది క్రితమే నిందితుడు శ్రీనివాసరావును రెస్టారెంట్ వెయిటర్ ముసుగులో విమానాశ్రయంలోకి ప్రవేశపెట్టారు. ఎయిర్‌పోర్టులో ప్రవేశించేందుకు అవసరమయ్యే ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో మాటు వేశాడు. కుట్రలో భాగంగానే మూడు నెలల క్రితం విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీన్ని ఎవరు చేశారు...? ఎలా చేశారు? అనేది అంతుచిక్కకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్లే సీసీ కెమెరాల ఫుటేజీలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి నియంత్రణలో ఉన్నాయి? అన్న హైకోర్టు ప్రశ్నలకు పోలీసులు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. కెమెరాలు పనిచేస్తే బండారం బట్టబయలు.. విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర ఆధారసహితంగా వెంటనే బట్టబయలయ్యేదని పోలీసువర్గాలే చెబుతున్నాయి. హత్యాయత్నం జరిగిన అక్టోబరు 25వతేదీన నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలో ప్రవేశించడం, అతడికి సహకరించిన మరికొందరి చర్యలు, వీఐపీ లాంజ్‌వద్ద నిందితుడి ప్రవర్తన, అదను చూసి కత్తిదూయడం, ఆ వెంటనే నిందితుడికి సహకరించినవారి స్పందన మొదలైన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యి కేసులో కీలక ఆధారాలు వెంటనే లభించేవి. వారిని విచారిస్తే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల బండారం బహిర్గతమయ్యేది. ఈ పరిణామాలను ముందుగా ఊహించే మూడు నెలల ముందు నుంచే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని ఓ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
3 నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదా?
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయం మార్గంలో గత మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇంత ముఖ్యమైన మార్గంలో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఒకవేళ జాతి భద్రతకు సంబంధించి ఏదైనా జరగరాని ఘటన జరిగితే అప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంటుందని నిలదీసింది. మనిషి సృష్టించే విపత్తుల నుంచి రక్షించుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని న్యాయస్థానం పేర్కొంది. విమానాశ్రయంలో ఎక్కడెక్కడ సీసీ టీవీలున్నాయి..? వాటి ఫుటేజీ వివరాలపై కోర్టు ఆరా తీసింది. వీఐపీ లాంజ్, రెస్టారెంట్లో సీసీ కెమేరాలు లేవనే విషయాన్ని గుర్తించింది. విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బాధ్యతలు ఏమిటి..? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బాధ్యతలు ఏమిటి? అనే అంశాలను ఆరా తీసింది. ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యాయవాదులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సీఐఎస్‌ఫ్ ఐజీ, సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, విశాఖపట్నం విమానాశ్రయ ప్రధాన భద్రతాధికారి, విశాఖ విమానాశ్రయ డైరెక్టర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రతివాదులుగా చేర్చింది. వీరితోపాటు ఇప్పటికే ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, విశాఖ పోలీస్ కమిషనర్, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌కు కూడా నోటీసులు జారీ చేస్తూ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్, వైఎస్సార్ జిల్లాకు చెందిన గుమ్మా అమర్నాథ్రెడ్డిలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఇది ఒక్కరు చేసే పని కాదని, దీని వెనక మరికొంత మంది ఉండి ఉంటారని తెలిపారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బాధ్యతాయుతుడైన అధికారి సాయం తీసుకోవాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరిస్తూ తమకు ఇక్కడున్న న్యాయవాదులపై నమ్మకం ఉందని, అధికారుల సాయం ఎంత మాత్రం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఐఎస్ఎఫ్ గురించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. సీఐఎస్ఎఫ్ బాధ్యత అంతవరకే ... ప్రయాణికుల గుర్తింపు కార్డులను పరిశీలించి వారిని విమానాశ్రయం లోపలకు పంపడం, ఆ తరువాత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం వరకే సీఐఎస్ఎఫ్ బాధ్యతని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది లక్ష్మణ్ కోర్టుకు నివేదించారు. వీఐపీ లాంజ్ సీఐఎస్ఎఫ్ పరిధిలోకి రాదని, అది ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల నియంత్రణలో ఉంటుందన్నారు. గాయపడిన వ్యక్తులకు చికిత్స అందించే అంశం కూడా ఆ అ«థారిటీ పరిధిలోకే వస్తుందన్నారు. సీఐఎస్ఎఫ్ ఐజీ సి.వి.ఆనంద్ ఘటన తరువాత విశాఖ విమానాశ్రయానికి వెళ్లి విచారణ జరిపారని చెప్పారు. విమానాశ్రయం లోపల ఏ భాగాలు ఎవరి పరిధిలో వస్తాయో నిర్ధిష్టంగా చెప్పాలని ధర్మాసనం కోరగా.. కొంత గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని లక్ష్మణ్ నివేదించారు. కావాల్సినంత సమయం తీసుకోవచ్చని, ఈ విషయంలో తాము ఎవరినీ తొందరపెట్టబోమని, సీఐఎస్ఎఫ్ను శాసించజాలమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తరువాత ధర్మాసనం సీసీ టీవీలు, వాటి ఫుటేజీల గురించి ఆరా తీసింది. ఘటన తరువాత విమానాశ్రయంలో ఉన్న సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ప్రశ్నించగా... తీసుకున్నామని ఏజీ చెప్పారు. లాంజ్ లోపల, బయట, రెస్టారెంట్ లోపల, బయట సీసీ టీవీల ఫుటేజీ తీసుకున్నారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అయితే లాంజ్‌లో సీసీ టీవీ లేదని, బయట కొద్ది దూరంలో ఉన్న సీసీ టీవీ నుంచి ఫుటేజీ తీసుకున్నామని ఏజీ చెప్పారు. రెస్టారెంట్లో కూడా సీసీ టీవీ లేదన్నారు. అందుకే జగన్ వాంగ్మూలం ఇవ్వలేదు... ఆ తరువాత దర్యాప్తు అధికారుల ముందు వైఎస్ జగన్ వాంగ్మూలం ఇచ్చారా? అంటూ ధర్మాసనం ఆరా తీసింది. ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని... డీజీపీ, ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదు కాబట్టి వాంగ్మూలం ఇవ్వరాదని ఓ స్పష్టమైన వైఖరి తీసుకున్నామని జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, సానుభూతి కోసమే ఈ ఘటన జరిగిందని, దీనికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ సీపీ కార్యకర్తంటూ ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పారని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జగన్‌పై హత్యాయత్నాన్ని డ్రామాగా అభివర్ణిస్తూ దర్యాప్తును ఏ దిశగా చేయాలో పోలీసులకు నిర్దేశించారని, అలాగే దర్యాప్తు ఫలితం ఎలా ఉండాలో కూడా చెప్పకనే చెప్పారని ఆయన తెలిపారు. సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైందని, ఆ తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలను తెలుసుకునే మాట్లాడుతున్నట్లు చెప్పారన్నారు. నిందితుడు తనకు ప్రాణహాని ఉందని చెప్పాడని, అందుకు సంబంధించి సీడీలు కూడా ఉన్నాయని, వాటిని కూడా వ్యాజ్యాలతో జత చేశామని మోహన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గాయపడిన వ్యక్తిని విమానం ఎక్కేందుకు ఎవరు అనుమతించారంటూ లక్ష్మణ్‌ను ప్రశ్నించింది. దీంతో సీఐఎస్ఎఫ్కు సంబంధం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. అది ఎయిర్పోర్ట్ వారి పరిధిలోని అంశమన్నారు. వైఎస్ జగన్ విమానం ఎక్కే సమయానికి అక్కడ ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్, స్థానిక పోలీసులు కూడా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా, రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా తనకున్న విస్తృత ప్రజాభిమానం దృష్ట్యా వైఎస్ జగన్ తాను హైదరాబాద్ వెళ్లాలని కోరి ఉండొచ్చునని, అయితే నిబంధనలు తెలుసుకోకుండా ఆయన్ను విమానం ఎలా ఎక్కనిచ్చారని ప్రశ్నించింది. విమానంలో జగన్‌కు జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. మేం లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది... ఆ తరువాత సిట్ నివేదికను మరోసారి పరిశీలించిన ధర్మాసనం అందులో సీసీటీవీ కోర్ టీం అని పేర్కొని ఉండటాన్ని గమనించి కోర్ టీం ఏం చేస్తుందని ప్రశ్నించింది. ఇదే సమయంలో విమానాశ్రయ మార్గంలో గత మూడు నెలలుగా సీసీ టీవీలు పనిచేయడం లేదన్న విషయాన్ని నివేదికలో పేర్కొని ఉండటాన్ని గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను నిలదీసింది. సిట్ నివేదిక పరిశీలించిన తరువాత తాము మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలను పరిశీలించేందుకు సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన పలువురు అధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ విచారణను వాయిదా వేసింది. -
ముగ్గురు యువతుల నుంచి వాంగ్మూలం
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ముగ్గురు యువతుల నుంచి విశాఖపట్నం నాల్గవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుతోపాటు విశాఖ విమానాశ్రయం ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న హేమలత, రమాదేవి, అమ్మాజీలను పలు కోణాల్లో విచారించారు. ఈ కేసులో సాక్ష్యాల నమోదు కోసం సిట్ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద తాజాగా నాల్గవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట సోమవారం హాజరు పరిచారు. వారి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉండగా, ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది అబ్దుల్ సలీం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. ఈ పిటిషన్‌పై ఒకటవ అదనపు జిల్లా కోర్టులో వాదనలు వినిపించనున్నారు. -
దాచేస్తే దాగని కుట్ర
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం వెనక పకడ్బందీగా వ్యూహ రచన జరిగిందని, ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఈ కుట్రకు బీజం పడిందనే వాదనలకు బలం చేకూర్చేలా ఈ అంశాలపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) డీజీ నివేదిక ఇవ్వడం గమనార్హం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలోకి పదునైన కత్తి ఎలా వచ్చింది? నిందితుడు వీఐపీ లాంజ్‌లోకి ఎలా రాగలిగాడు? ఎవరు సహకారం అందించారు?... ఇదంతా కేవలం ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నందువల్లే సాధ్యమనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. బీసీఏఎస్ డీజీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో నిందితుడు శ్రీనివాసరావుకు కేవలం అక్టోబర్ నెలకు మాత్రమే ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) జారీ అయినట్లు ప్రస్తావించడం ఇది ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం సాగిన కుట్ర అనే విషయాన్ని రుజువు చేస్తోంది. విమానాశ్రయంలో పనిచేసేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన ఏఈపీ కోసం నిందితుడు కనీసం దరఖాస్తు కూడా చేయలేదని వెలుగులోకి రావడం గమనార్హం. జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే ఇది పబ్లిసిటీ కోసం జరిగిందని డీజీపీ వ్యాఖ్యలు చేయడం, విచారణ అవసరం లేదని సీఎం పేర్కొనడం, అనంతరం సిట్ దర్యాప్తు ప్రారంభమైనా ముందుకు సాగకపోవడం, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిని తూతూమంత్రంగా విచారించి వదిలేయడం, తాజాగా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీ... నిందితుడికి అక్టోబర్ నెలకు మాత్రమే ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాస్ ఉన్నట్లు పేర్కొనటం ఈ ఘటన వెనక పెద్దల ప్రమేయం ఉండటం వల్లే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలకు బలం చేకూరుస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుకు 2018, అక్టోబరు 1 నుంచి 30 వరకే తాత్కాలిక అనుమతి ఉందని తెలిపే బీసీఏఎస్ డీజీ నివేదిక విమానాశ్రయంలో ఏడాదిగా అనధికారికంగా పాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కుట్రదారులు వ్యూహాత్మకంగానే విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) డీజీ కుమార్ రాజేష్‌చంద్ర రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇదే అంశాన్ని నిర్ధారిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుకు విమానాశ్రయం జోన్ ‘డి’లో పనిచేసేందుకు 2018 అక్టోబరు 1వతేదీ నుంచి 30వతేదీ వరకు తాత్కాలిక ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ (ఏఈపీ)ని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జారీ చేశారు. ఇదే విషయాన్ని బీసీఏఎస్ డీజీ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే... నిందితుడు శ్రీనివాసరావు దాదాపు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. సిట్ పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కేవలం అక్టోబర్ నెలకు మాత్రమే అనుమతి ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో ఎలా కొనసాగాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. అనుమతిలేని వ్యక్తి విమానాశ్రయంలో ఏడాదిగా దర్జాగా తిరుగుతుంటే భద్రతా విభాగం అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది సందేహాస్పదంగా మారింది. పక్కా పథకం ప్రకారమే.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కుట్రకు ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా తమకు నమ్మకస్తుడైన ఫ్యూజన్ ఫుడ్స్ నిర్వాహకుడు హర్షవర్థన్ప్రసాద్ చౌదరిని సాధనంగా చేసుకున్నారు. ïఉత్తరాంధ్రలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో అదను చూసి ఆయన్ను మట్టుబెట్టేందుకు విమానాశ్రయంలో ఉన్న హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి రెస్టారెంట్ కేంద్రంగా పన్నాగం పన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల అండదండలతోనే హర్షవర్థన్ ప్రసాద్ చౌదరికి 2017లో విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్ లైసెన్సు లభించింది. నిబంధనలకు విరుద్ధంగా హర్షవర్థన్ ప్రసాద్‌కు చెందిన ఒలంపిక్స్ అసోసియేషన్‌కు గుర్తింపునిచ్చారు. రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్యపై పెత్తనం కట్టబెట్టారు. టీడీపీ టికెట్ ఇచ్చేలా హామీ! గత ఎన్నికల్లో గాజువాక టీడీపీ టిక్కెట్ కోసం హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి తీవ్రంగా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కేలా హామీ కూడా ఇచ్చినట్టు కూడా సమాచారం. విమానాశ్రయ ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్‌కు హర్షవర్థన్ ప్రసాద్‌తోపాటు విశాఖ నగరానికి చెందిన నేరచరిత్ర ఉన్న ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీన్ని కూడా తమ కుట్రకు సాధనంగా చేసుకున్నారు. భద్రతాధికారుల సహకారంతోనే.. నిందితుడు శ్రీనివాసరావు అనధికారికంగా విమానాశ్రయంలో ఏడాదిగా మాటేసినా భద్రతా అధికారులు పట్టించుకోలేదు. రెస్టారెంట్‌కు సరుకుల సరఫరా ముసుగులో విచ్చుకత్తిని విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేలా కథ నడిపారు. తాత్కాలిక ఏఈపీ ప్రకారం కూడా కేవలం ‘డి’ బ్లాక్ కు మాత్రమే పరిమితం కావాల్సిన శ్రీనివాసరావు ఏకంగా వీఐపీ లాంజ్‌లోకి ప్రవేశించాడు. దీన్ని కూడా భద్రతా ధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ రాక సందర్భంగా విమానాశ్రయ భద్రతా విభాగం కుట్ర కోణంతోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి నడిపించిన ఈ కుట్ర కథలో శ్రీనివాసరావు, టీడీపీ నేత హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి తెరముందు పాత్రలు కాగా... విమానాశ్రయ భద్రతాధికారులు అందుకు తమవంతు సహకారం అందించారన్నది స్పష్టమవుతోంది. ఏఈపీ కోసం దరఖాస్తే చేయలేదు నిబంధనల ప్రకారం విమానాశ్రయంలోని వివిధ విభాగాల్లో పనిచేసే వ్యక్తులకు ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) తప్పనిసరిగా ఉండాలి. ఏఈపీ జారీకి కేంద్ర విమానయాన సంస్థ (ఏఏఐ) కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ప్రైవేట్ వ్యక్తులకు ఒక రోజు నుంచి మూడు రోజులకు ఒక కేటగిరీలో, నాలుగు రోజుల నుంచి 90 రోజులకు మరో కేటగిరీ కింద ఏఈపీలు కేటాయిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విదేశీయులకు మరో రెండు కేటగిరీల కింద ఏఈపీ జారీ చేస్తారు. ఇందుకోసం సదరు వ్యక్తులు గుర్తింపు కార్డు, తాము పనిచేసే సంస్థ అనుమతిపత్రం, తమపై ఎలాంటి కేసులు లేవని నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) మొదలైనవి సమర్పించి దరఖాస్తు చేయాలి. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు గానీ అతడి తరపున రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిగానీ ఎలాంటి దరఖాస్తు చేయలేదని కూడా బీసీఏఎస్ డీజీ వెల్లడించడం గమనార్హం. కనీసం ఏఈపీ కోసం దరఖాస్తు చేయకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో అనధికారికంగా మాటు వేసినట్లు దీనిద్వారా తేటతెల్లమవుతోంది. నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలోని రెస్టారెంట్లో పనిచేస్తున్నాడని పోలీసులు సమర్పించిన నివేదిక తాత్కాలిక అనుమతిపైనా సందేహాలు నిందితుడు శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1వతేదీ నుంచి 30వతేదీ వరకు విమానాశ్రయంలో పనిచేసేందుకు తాత్కాలిక ఏఈపీ జారీ చేశామని విమానాశ్రయ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి బీసీఏసీ డీజీకి చెప్పడం సందేహాలకు తావిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుగానీ అతడి తరపున రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరిగానీ అసలు ఏఈపీ కోసం దరఖాస్తే చేయలేదని బీసీఏఎస్ డీజీ కుమార్ రాజేష్‌చంద్ర రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లిఖితపూర్వకంగా తెలిపారు. ఆయనే మరో ప్రశ్నకు సమాధానంగా నిందితుడు శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1 నుంచి 30వతేదీ వరకు విమానాశ్రయంలో పనిచేసేందుకు తాత్కాలిక ఏఈపీని విమానాశ్రయ డైరెక్టర్ జారీ చేశారని వెల్లడించారు. ఈ తాత్కాలిక ఏఈపీపై న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేసున్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం అనంతరం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పటికప్పుడు నెల రోజుల గడువు కలిగిన తాత్కాలిక ఏఈపీని సృష్టించారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు, రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరికి విమానాశ్రయ భద్రతా అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావుకు అక్టోబరు నెలకు సంబంధించి జారీ చేశారని చెబుతున్న తాత్కాలిక ఏఈపీ ఎంతవరకు సరైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీనివాసరావు టీడీపీ వర్గీయుడే నిందితుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులంతా టీడీపీకి చెందినవారేనని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సోదాహరణంగా వెల్లడించారు. టీడీపీ వర్గీయులైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను అడ్డుకున్న తీరు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఉదంతాన్ని ఆయన బయటపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే శ్రీనివాసరావును రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్ చౌదరి వద్దకు చేర్చారని కూడా ఆయన చెప్పడం గమనార్హం. కుట్ర కోణాన్ని పట్టించుకోని సిట్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అంతమొందించేందుకు ప్రభుత్వ పెద్దలు ఇంత పక్కాగా సాగించిన కుట్రపై సిట్ అధికారులు కనీసం దృష్టి సారించలేదు. శ్రీనివాసరావు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలో అనధికారికంగా మాటేసిన వైనం, అతడి కుటుంబం టీడీపీ సానుభూతిపరులనే వాస్తవాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణాన్ని కప్పిపుచ్చేందుకు కేసును నీరుగారుస్తున్నారని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. స్పందించేందుకు నిరాకరించిన ఎయిర్‌పోర్టు డైరెక్టర్, ముఖ్య భద్రతాధికారి ఈ అంశాలపై విశాఖ ఎయిర్‌పోర్డు డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్‌ను సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. బీసీఏఎస్ డీజీ ఇచ్చిన నివేదికకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ అంతకుమించి స్పందించేందుకు నిరాకరించారు. ఇదే అంశంపై వేణుగోపాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
పెద్దల అండతోనే కుట్ర
-
విశాఖ ఎయిర్పోర్ట్ సీఎస్‌వో బదిలీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రదారులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) వేణుగోపాల్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చెన్నైకి బదిలీ చేసింది. జాతీయ స్థాయిలో కలకలం రేపిన వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయటపడకుండా, సూత్రధారుల జోలికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ మొక్కుబడిగా విచారణ చేస్తుంటే.. కేంద్ర పరిధిలోని సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అప్పుడే చర్యలు మొదలు పెట్టాయి. ఘటన జరిగిన అక్టోబరు 25న అనుమానాస్పదంగా వ్యవహరించిన సీఎస్‌వో వేణుగోపాల్‌ను చెన్నైకి సాగనంపుతూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆది నుంచీ టీడీపీ నేతలతోనే.. ఐదేళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే కొనసాగుతున్న వేణుగోపాల్‌కు ఇప్పటివరకు రెండుసార్లు బదలీ ఉత్తర్వులు వచ్చినా అధికార పార్టీ నేతల అండతో నిలిపివేయించుకున్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలతో అంటకాగే వేణుగోపాల్.. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో కూడా చెట్టపట్టాల్ వేసుకుని తిరిగేవారు. ఘటన జరిగిన రోజు ఆయన వ్యవహారశైలి జగన్‌పై హత్యాయత్న కుట్రకు సహకరించారనేలా ఉంది. ఇదే విషయమై సీఐఎస్ఎఫ్ అధికారులు వేణుగోపాల్ వ్యవహారశైలిని సూటిగా ప్రశ్నించారు కూడా. హత్యాయత్న ఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్ పక్కన ఉండకుండా నిందితుడు శ్రీనివాసరావు వెంట ఎందుకు పరుగులు తీయాల్సి వచ్చిందని నిలదీశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారు వేణుగోపాల్‌పై ప్రశ్నలు కురిపించారు. కప్పు కాఫీకి అనుమతించలేదుగానీ.. వైఎస్ జగన్ గత రెండు నెలలుగా ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన సందర్భాల్లో వైఎస్సార్సీపీ స్థానిక నేత జియ్యాని శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హత్యాయత్న ఘటనకు రెండు వారాల క్రితం సీఎస్‌వో వేణుగోపాల్.. బయటి నుంచి కాఫీ తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్‌కు ఒక్కరికే ఇంటి నుంచి తీసుకువస్తామని ఎంత చెప్పినా వేణుగోపాల్ అంగీకరించలేదు. ఇదే అదనుగా శ్రీనివాసరావు వీవీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌పై హత్యాయత్నం చేయడం చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే వేణుగోపాల్ బయట నుంచి వస్తున్న కాఫీని అడ్డుకున్నారా.. అన్న అనుమానాలు తలెత్తాయి.సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లే కాదు.. మంత్రి గంటా, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి కూడా బయటి నుంచి వచ్చే ఫుడ్‌నే ఎయిర్పోర్ట్ వీవీఐపీ లాంజ్‌లో తీసుకుంటుంటారు. వైఎస్ జగన్‌కు తీసుకువచ్చే కాఫీ విషయంలో వేణుగోపాల్ వ్యవహరించిన తీరుతోపాటు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టులోకి స్వేచ్ఛగా కత్తులు తీసుకువచ్చినా అడ్డుకోలేకపోవడంతో ఆయనపై సందేహాలు బలపడ్డాయి. -
జగన్‌పై హత్యాయత్నం ఘటన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..
చోడవరం/ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌పై దాడి జరిగిన ఘటన బాధ్యత ఏపీ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అంగీకరించారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోడికత్తి ఎయిర్‌పోర్టులోకి ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ కేంద్రానికి అప్పగించే విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన దాటవేసే సమాధానమిచ్చారు. విచారణ కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కోర్టు ఆదేశించినట్టయితే ప్రభుత్వం దాన్ని అంగీకరిస్తుందా? అని విలేకరులు అడగ్గా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దర్యాప్తు కేంద్రం చేసినా, తాము చేసినా వాస్తవాలను బయటకు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని..తాము అదే పనిలో ఉన్నామని బదులిచ్చారు. ఘటన ఎయిర్‌పోర్టులో జరిగిందని చెప్పారే తప్ప బాధ్యత మాది కాదని చంద్రబాబు చెప్పలేదని, నిందితుడు ప్రాథమికంగా చెప్పిందే డీజీపీ మాట్లాడారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సిట్ విచారణ వేగవంతంగా జరుగుతోందని చెప్పారు. పోలీస్ కస్టడీలో ఉన్నవారు తమకు ప్రాణహాని ఉందని, ఆరోగ్యం బాగోలేదనే చెబుతారని చినరాజప్ప వ్యాఖ్యానించారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పడంపై న్యాయవిచారణ జరిపిస్తామని తెలిపారు. -
ఆ 4 వాక్యాల కోసం..పెద్దల ‘షో’
విశాఖ నుంచి సాక్షి ప్రతినిధులు: అంతా ఊహించిందే జరుగుతోంది. ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్టు మేరకే జగన్‌పై హత్యాయత్నం కేసులో విచారణ నిర్వహిస్తున్నారు. ఆది నుంచి బిగిసడలని సన్నివేశాలతో రక్తి కట్టిస్తున్న డ్రామా మంగళవారం పతాకస్థాయికి చేరింది. ‘నేను జగన్ అభిమానిని.. ప్రజల కోసమే ఇదంతా చేశా’ అంటూ నిందితుడు శ్రీనివాస్‌తో పరిమిత స్థాయిలో వాక్యాలను పోలీసులు పలికించారు. ఈ డ్రామా ముగింపులో ‘మీకు కావాల్సిన బైట్(విషయం) వచ్చింది కదా’ అంటూ విశాఖపట్నం ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ సీఐ మళ్ల శేషు ఎల్లో మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం! వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణలో భాగంగా తమ కస్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ మంగళవారం గుండె దడగా ఉందని చెప్పారని పోలీసులు ప్రైవేటు వైద్యుడిని పిలిపించారు. శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ దేవుడు బాబు..అతని ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. కథ నడిపిన పోలీసులు... ఆరోగ్యం బాగుందని డాక్టర్ చెప్పినా మళ్లీ వైద్య పరీక్షల కోసం నిందితుడు శ్రీనివాస్‌ను సాయంత్రం కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్సిటల్)కు తరలించారు. విచారణను అత్యంత గోప్యంగా చేస్తున్న పోలీసులు నిందితుడిని కేజీహెచ్‌కు తరలిస్తుండటంపై మాత్రం మీడియాకు లీకులు ఇచ్చారు. ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ నుంచి కేజీహెచ్‌కు 11 కిమీల దూరం ఉంటుంది. సాయంత్రం 3.40 నుంచి 4 గంటల మధ్య పెద్దగా ట్రాఫిక్ ఉండదు. సుమో లేదా కారు వంటి వాహనాల్లో కేవలం పది లేదా 15 నిమిషాల్లోనే కేజీహెచ్‌కు చేరుకోవచ్చు. కానీ.. మీడియా కేజీహెచ్‌కు చేరుకోవడానికి వీలుగా పోలీసులు కావాలనే నింపాదిగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కేవలం పావు గంట లేదా 20 నిమిషాల్లోపే కేజీహెచ్‌కు చేరుకోవాల్సిన పోలీసు వాహనం 40(ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ నుంచి 3.40 గంటలకు ప్రాంభమై.. కేజీహెచ్‌కు 4.20 గంటలకు చేరుకున్నారు) నిమిషాలకు చేరుకుంది. మీడియాకు వినిపించడానికే... కేజీహెచ్ ఆసుపత్రి ప్రాంగణంలో వాహనం నుంచి దించిన వెంటనే.. ‘నాకు ప్రాణహాని ఉంది సర్.. ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వండి’ అని శ్రీనివాస్ అడగడం విన్పించింది. శ్రీనివాస్‌ను నేరుగా క్యాజువాలిటీ వార్డుకు తీసుకెళ్లి.. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సురేంద్రబాబుకు చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ‘ఆరోగ్యం బాగుంది.. పరీక్షలు అవసరం లేదు.. వైద్యమూ అవసరం లేదు’ అని వైద్యలు పోలీసులకు సూచించారు. కానీ.. పోలీసులు క్యాజువాలిటీ నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న ఎమర్జీన్సి మెడిసిన్ విభాగానికి వీల్ ఛైర్లో శ్రీనివాస్‌ను తీసుకెళ్లారు. శ్రీనివాస్‌తో ఆ నాలుగు వాక్యాలు మీడియాకు చెప్పించడానికి వీలుగా.. 30 మీటర్ల దూరంలో ఐదు సార్లు అటు ఇటు తిప్పారు. ఈ సమయంలో మీడియాతో శ్రీనివాస్ మాట్లాడుతూ ‘నేను జగన్ అభిమాని’ అని ఒకే వాక్యం చెప్పగలిగాడు. దీంతో పోలీసులు తృప్తి పడలేదు. కాస్త స్పష్టంగా ఆ నాలుగు వాక్యాలు చెప్పించడానికి వీలుగా క్యాజువాలిటీ వార్డు నుంచి కాస్త విశాలమైన రోడ్డు గుండా కార్డియాలజీ విభాగానికి తీసుకెళ్లే సమయంలో శ్రీనివాస్‌తో ఆ నాలుగు వాక్యాలు మీడియాకు స్పష్టంగా చెప్పించారు. ‘నేను జగన్ అభిమానిని.. ప్రజల కోసమే ఇదంతా చేశా. నా వెనక ఎవరూ లేరు.. నన్ను చంపి రాజకీయం చేసేందుకు చూస్తున్నారు. నేను చనిపోతే నా అవయవాలు దానం చేయండి’ అంటూ శ్రీనివాస్‌తో మీడియాకు చెప్పించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆసుపత్రికి డీలాగా.. పోలీసు స్టేషన్లోకి హుషారుగా: నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం బాగుందని డాక్టర్ దేవుడు బాబు తేల్చి చెప్పాక.. అతన్ని మళ్లీ వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించాల్సిన అవసరం లేదు. కానీ.. మీడియాకు ఆ నాలుగు వాక్యాలను చెప్పించడం కోసం వేసిన స్కెచ్‌లో భాగంగానే సాయంత్రం నిందితుడిని కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకున్నాక డీలాగా ఉన్నట్ల నటిస్తున్న శ్రీనివాస్‌ను వీల్ ఛైర్‌పై ఆసుపత్రిలోకి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక శ్రీనివాస్‌ను పోలీసు వాహనంలో కేజీహెచ్ నుంచి సాయంత్రం 6.07 గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు 6.28 గంటలకు తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా కేజీహెచ్ నుంచి కేవలం 21 నిమిషాల్లోనే చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాహనం నుంచి దిగిన శ్రీనివాస్ హుషారుగా పోలీసు స్టేషన్లోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీటిని పరిశీలిస్తే.. కేవలం మీడియాకు ఆ నాలుగు వాక్యాలు చెప్పించడం కోసమే ఈ డ్రామాను పోలీసులు నడిపినట్లు స్పష్టమవుతోంది. మీడియాతో నేరుగా మాట్లాడించకుండా.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని నేరుగా మాట్లాడించడానికి పోలీసులకు అవకాశం ఉంది. అలా చేస్తే.. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడే అవకాశం ఉందని... హత్యకు కుట్ర చేసిన తమ బండారం బయపటడుతుందని స్క్రిప్టు రాసిన పెద్దలు భయపడ్డారు. ప్రతిపక్షనేతను హతమార్చడానికి కర్కశంగా దాడిచేయడం వెనక ఉన్న సూత్రధారుల గుట్టు రట్టవుతుందనే భయంతో... తాము చెప్పించాల్సిన ఆ నాలుగు వాక్యాలను చెప్పిండచానికి మాత్రమే ఈ హైడ్రామా నడిపినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్దల స్క్రిప్ట్ మేరకే ... వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్ట్ మేరకే నీరుగార్చుతున్నారు. ప్రతిపక్ష నేతపై గురువారం హత్యాయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష నేతపై ఆయన అభిమానే దాడి చేశారు.. ఇదో చిన్న సంఘటన’ అంటూ విచారణను ఆదిలోనే తేల్చేశారు. అనంతరం గురువారం రాత్రి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ‘వాళ్లపై వాళ్ల అభిమానే దాడి చేశారు.. సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవడానికే ఇలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచి.. అల్లర్లు సష్టించి, రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం కుట్ర చేస్తోంది. శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడలో భాగంగానే కేంద్రం ఈ దాడులు చేస్తోంది’ అంటూ ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసు విచారణ ఏ స్థాయిలో జగరబోతోందో చెప్పకనే చెప్పేశారు. గత ఆరు రోజులుగా ఉన్నత స్థాయి నుంచి అందిన స్క్రిప్టు మేరకే కేసు విచారణ చేస్తున్న పోలీసులు.. డ్రామాను పతాకస్థాయికి తీసుకెళ్లడానికి సోమవారం రాత్రి పూనుకున్నట్లు పోలీసు వర్గాలే వెల్లడించాయి. ‘‘సోమవారం అర్ధరాత్రి ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్.. ‘శ్రీనివాస్‌ను మీడియా ముందుకు తీసుకెళ్తే అసలు విషయాన్ని బయటపెట్టేస్తాడు. కేసు విచారణ ముగుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఆ మేరకు మంగళవారం పోలీసులు ఈ హైడ్రామా నడిపి.. సూత్రధారులైన ప్రభుత్వ పెద్దల గుట్టు రట్టు కాకుండా.. కేసు విచారణను నీరుగార్చేశారనే’’ అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
ఆ రోజే ఎందుకు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కుట్ర విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే జరిగిందని కేంద్ర బలగాలు విశ్వసిస్తున్నాయి. జగన్ అభిమానినని చెప్పుకుంటున్న నిందితుడు ఆ రోజే ఎందుకు తెగబడ్డాడనే విషయంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్ర పోలీసులు ఆ దిశగా ఇంతవరకు లోతుగా దర్యాప్తు చేయనప్పటికీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) వర్గాలు మాత్రం కుట్రదారులు ఎంతో వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకున్నట్టు భావిస్తున్నాయి. రక్షణ శాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగడాన్ని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఈ కోణంలోనే చూస్తూ అంతర్గత దర్యాప్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అభిమాని అయితే ఇన్నాళ్లూ ఎందుకు కలవలేదు? తాను వైఎస్ జగన్ వీరాభిమానినని, ఆయనంటే చాలా ఇష్టమని, ఇదే విషయం లేఖలో స్పష్టంగా రాశానని చెప్పుకొస్తున్న నిందితుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్ పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఎనిమిది నెలలుగా పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. మరి మూడు నెలల కాలంలో జగన్ అన్ని సార్లు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే ఏ సందర్భంలోనూ ఆయనతో ఫొటో కోసం గానీ, ఆటో గ్రాఫ్ కోసం గానీ, కనీసం చూసేందుకు గానీ వచ్చిన దాఖలాల్లేవు. ఇతరుల ద్వారా అయినా జగన్ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించేవాడు కదా? సరిగ్గా హత్యాయత్నానికి తెగబడిన 25వ తేదీనే తొలిసారి సెల్ఫీ పేరిట రావడం గమనార్హం. అంతకు ముందు వైఎస్ జగన్‌కు పార్టీ నేత ఇంటి నుంచి కాఫీ వస్తుంటే.. అలా తీసుకురావడానికి వీల్లేదంటూ, శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ నుంచే సర్వ్ చేయించడం చూస్తుంటే పక్కాగా వ్యూహం ప్రకారం రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగినట్టు స్పష్టమవుతోందని సీఐఎస్ఎఫ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. లేఖ విషయంలోనూ విచారణ నిందితుడు శ్రీనివాసరావు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 11 పేజీల లేఖ ఉందని చెబుతున్న వాదనలపైనా సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగా కత్తితో గానీ, పిస్తోలుతో గానీ దుండగుడు పోలీసులకు పట్టుబడితే వెంటనే అతన్ని పట్టుకుని ఇంకా అతని వద్ద ఏయే వస్తువులు ఉన్నాయో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. నాప్కిన్ మొదలు చిన్న కాగితం ముక్క ఉన్నా వదలకుండా వెంటనే స్వాధీనం చేసుకుంటారు. అలాంటిది శ్రీనివాసరావు విషయంలో పోలీసులు పూటకొకటి దొరికిందని చెప్పుకొస్తున్న నేపథ్యంపై కూడా సీఐఎస్ఎఫ్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేఖ విషయంలో సీఐఎస్ఎఫ్ అధికారి ఘటన జరిగిన రోజు హడావుడిగా సంతకం చేశారని తెలుస్తోంది. సదరు అధికారిని మీరు సరిగ్గా పరిశీలించే సంతకం చేశారా? 11 పేజీలు ఉన్నాయా? అని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. శ్రీనివాసరావు వద్ద నుంచి కేవలం మడతపెట్టిన ఓ చిన్న కాగితం ముక్క మాత్రమే చూశానని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ అధికారి సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని పేజీల లేఖ ఉందంటూ తమ విభాగానికే చెందిన అధికారి ఎలా సంతకం చేశారని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎయిర్‌పోర్టే ఎందుకంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు నుంచి దాదాపు వారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశ మొదలు.. విశాఖ జిల్లాలో యాత్ర కొనసాగినప్పుడు, ప్రస్తుతం విజయనగరంలో యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో దాదాపు ప్రతి వారం హైదరాబాద్ వెళ్లి వచ్చారు. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి, శుక్రవారం తిరిగి వస్తారు. సుమారుగా మూడు నెలల కాలంలో 20 సార్లకు పైగా ఆయన ఈ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్లి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయంలో ఎక్కడా ఆగకుండా నేరుగా పాద్రయాత్ర జరిగే ప్రాంతంలోని శిబిరం వద్దకు చేరుకుంటారు. హైదరాబాద్ వెళ్లేటప్పుడు మాత్రం కొంచెం సమయం ఉంటుంది (చెక్ ఇన్ కోసం కనీస నిర్ణీత సమయంలోగా వెళ్లాలి) కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో వేచి ఉంటారు. బోర్డింగ్ తర్వాత విమానం వద్దకు వెళ్తారు. జననేత ఎయిర్‌పోర్టుకెళ్లిన సందర్భాల్లో అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, అభిమానులు.. ఎవరు సెల్ఫీ అడిగినా కాదనకుండా వారితో ఫొటో దిగుతుంటారు. ఈ దృష్ట్యా జగన్‌పై హత్యకు కుట్ర పన్నిన వారు ఎయిర్‌పోర్ట్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. -
శ్రీనివాస్ ఫోన్ నుంచి 10 వేల కాల్స్
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో అనుమానాలు బలపడుతున్నాయి. జననేతను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక రచించినట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది. వాస్తవాలు ఒక్కొటి వెలుగు చూస్తుండటంతో వైఎస్ జగన్‌ను మట్టుబెట్టేందుకు తెర వెనుక పెద్ద కుట్రే జరిగిందని తేలుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలు, కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని సీసీ కెమెరాల ఫుటేజీపైనా కూడా దృష్టి పెట్టారు. 9 ఫోన్లు, 10 వేల కాల్స్ ఏడాది కాలంలో 9 ఫోన్లు మార్చిన నిందితుడు శ్రీనివాసరావు 10 వేల ఫోన్ కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పదివేల కాల్స్ కేవలం 397 ఫోన్ నంబర్లకు చేసినట్టు వెల్లడైంది. ఇందులో కొంతమందితో తరచుగా మాట్లాడినట్టు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. ఎయిర్‌పోర్టులోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ సిబ్బందిలో ముగ్గురిని సిట్ అధికారులు విచారణకు పిలిచారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన విశాఖ ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరా ఫుటేజీని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. 32 సీసీ కెమెరాల ఫుటేజీని 4 హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతంలో మాత్రం సీసీ కెమెరా లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నెల రోజులుగా శ్రీనివాసరావు కదలికలపై సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. సీఐఎస్ఎఫ్, పోలీసు సిబ్బందితో అతడు చనువుగా ఉండేవాడని వెల్లడైంది. బ్యాంకు ఖాతాలపై ఆరా శ్రీనివాసరావుకు మూడు బ్యాంకు ఖాతాలున్నట్టు పోలీసులు గుర్తించారు. విజయ బ్యాంక్, ఆంధ్రా బాంక్, స్టేట్ బ్యాంకుల్లో అతడి ఖాతాలను పరిశీలించారు. అతడికి ఖాతాలోకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయనే దానిపై ఆరా తీశారు. ముమ్మిడివరంలో శ్రీనివాసరావు కోటి రూపాయల విలువచేసే భూముల కొనుగోలుకు బేరం చేసినట్టు వచ్చిన వార్తలపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు శ్రీనివాసరావును కోర్టు వచ్చే నెల 2 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. సంబంధిత కథనాలు... జగన్‌పై హత్యాయత్నం: దారితప్పిన దర్యాప్తు బిర్యానీ కావాలన్న శ్రీనివాస్.. అందుకేనా.. అంత జల్సా! అది హత్యాయత్నమే -
ముమ్మిడివరంలోనే కుట్రకు బీజం!
సాక్షి, అమరావతి/కాకినాడ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోనే పథక రచన సాగించినట్లు తెలుస్తోంది. కోడిపందేలు, గుండాటల్లో ఆరితేరడం, దూకుడు స్వభావం, ఒకటి, రెండు కొట్లాటల్లో మారణాయుధాలతో దాడులకు తెగబడిన నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి ఎంపిక చేసుకున్నారు. రెండేళ్ల క్రితం స్వగ్రామం ఠానేలంకలో వివాహేతర సంబంధం విషయంలో ఘర్షణ, 2017లో బంధువుల వివాహంలో కొట్లాట, సరిహద్దు తగాదాలో ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడిచేసే ప్రయత్నంలో శ్రీనివాసరావు భయపడి ఊరి విడిచివెళ్లిపోవడం తదితర అంశాలపై ముమ్మిడివరం పోలీసు స్టేషన్లో కేసులున్నాయి. ఇటువంటి నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును అధికార టీడీపీ నాయకుడు హర్షవర్దన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో చెఫ్‌కు సహాయకుడిగా ఎనిమిది నెలల క్రితమే ముమ్మిడివరం టీడీపీ నేతల సిఫార్సుతోనే నియమించినట్లు సమాచారం. శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో చేరేందుకు ఠానేలంక జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సుతో ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబుకు వరుసకు సోదరుడైన పృథ్వీరాజ్(చినబాబు) సహకరించాడని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. చినబాబు ద్వారా విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరులకు పరిచయం కావడం, రామకృష్ణ, హర్షవర్దన్ చౌదరి మ«ధ్య ఉన్న సాన్నిహిత్యంతో శ్రీనివాసరావును క్యాంటీన్లో చేర్చుకున్నారని చెబుతున్నారు. అప్పటికే శ్రీనివాసరావుపై పలు కేసులున్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం అతడికి క్లీన్చిట్ (ఎన్ఓసీ) ఇవ్వడంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందంటున్నారు. అప్పుడే చంపేద్దామనుకున్నారు! టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో సంక్రాంతి సంబరాలు పేరుతో ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు రాష్ట్రస్థాయిలో భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పందేల్లో కోళ్లకు కత్తులు కట్టడంలో నిష్ణాతుడైన శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే ముఖ్యులతో ఏర్పడ్డ పరిచయాలు అటు విశాఖలోని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరులతో కలిసేందుకు దోహదపడ్డాయి. టీడీపీ సానుభూతిపరుడైన శ్రీనివాసరావు నేరప్రవత్తిని చూసే ఆ పార్టీ పెద్దలు జగన్ హత్య కుట్రను నడిపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముమ్మిడివరం నియోజకవర్గంలో జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర జరిగినప్పుడు (జూలై 30– ఆగస్టు 2) హత్యకు ప్లాన్ చేశారంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీనివాసరావు ముమ్మిడివరంలో రెక్కీ నిర్వహించాడని, కానీ అంత జనసమూహంలో, సెక్యూరిటీ మధ్య హత్య చేయడం సాధ్యం కాదని, అందుకే విశాఖ ఎయిర్‌పోర్టును ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని హకుం ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కుట్రలో తమ బండారం బయటపడుతుందనే ఆందోళనతో టీడీపీ నేతలు ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ముమ్మిడివరంలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఠానేలంక వాసులకు హుకుం జారీ చేశారు. అందుకే జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే బుచ్చిబాబు ఎల్లో మీడియాను వెంటబెట్టుకుని అనుచరులతో కలిసి ఠానేలంక వెళ్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కలవడం, కొద్దిసేపటికే శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు తాము వైఎస్సార్సీపీ అభిమానులమని మీడియా ఎదుట చెప్పడం, ఆ తరువాత నుంచి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల వరకు అంతా పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేయడం తెలిసిందే. గప్‌చుప్‌గా టీడీపీ నేతలు జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజున నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున హడావుడి చేసిన టీడీపీ నేతలు ప్రస్తుతం గప్‌చుప్‌గా మారిపోయారు. ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ నేతల లింకులు వెలుగుచూడటంతో ఆ ఇంటివైపే రావడం లేదు. ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్టుగా, నిందితుడి కుటుంబంతో సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉంటున్నారు. రూ.కోటితో 4 ఎకరాలు కొనేందుకు బేరం ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో చేరిన దగ్గర నుంచి కుట్రకు సూత్రదారులు శ్రీనివాసరావుకు విలాసవంతమైన జీవితం గడిపేందుకు నగదు సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది. ఆ డబ్బు అందబట్టే ఈ నెల 16న ఠానేలంక వచ్చినప్పుడు ‘లంక ఆఫ్ ఠానేలంక’లో 4 ఎకరాల లంక భూమి కొనేందుకు శ్రీనివాసరావు రూ.కోటికి బేరమాడి వెళ్లాడని స్థానికులు అంటున్నారు. భూమి కొనడానికే రూ.కోటి వరకు పెడతామని చెప్పిన శ్రీనివాసరావుకు అంతకు ఇంకా ఎన్నో రెట్ల సొమ్ము అంది ఉంటుందని ఠానేలంకలో పలువురు మాట్లాడుకోవడం కనిపించింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్లో మొదట్లో శ్రీనివాసరావు వేతనం రూ.7 వేలే. తర్వాత అది రూ.20 వేలకు పెరిగింది. నెలకు కేవలం రూ.20 వేల వేతనం తీసుకునే వ్యక్తి విలాసవంతమైన జీవితం గడపడంతోపాటు కోటి రూపాయలతో భూమి కొనేందుకు బేరం మాట్లాడుకోవడం గమనిస్తే కుట్రదారుల నుంచి అతడికి ఏ స్థాయిలో సొమ్ము అందుతోందో అర్థం చేసుకోవచ్చు. కాట్రేనికోనలో కత్తి కొనుగోలు కోడిపందేలకు వాడే కత్తుల తయారీలో పేరొందిన కాట్రేనికోనలో కొన్ని నెలల క్రితం శ్రీనివాసరావు కత్తిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. కొత్తగా తయారు చేసినది కాకుండా అప్పటికే వినియోగించిన కత్తిని కొనుగోలు చేయడంతో సదరు విక్రయదారులకు అనుమానం కూడా వచ్చి, ఇప్పుడెందుకని అడిగినట్టు సమాచారం. తనకు వేరే ముఖ్యమైన పని ఉందని చెప్పి కోడికత్తి కొనుగోలు చేసి విశాఖకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. -
జగన్ హత్యకు బాబు కుట్ర!
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చూపిస్తున్న ఆదరాభిమానాలు చూడలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్రణాళికతో హత్య చేయించేందుకు కుట్రపన్నారని వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. చంద్రబాబు ఓ క్రిమినల్‌గా వ్యవహరిస్తున్నారని.. అటువంటి వ్యక్తి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. బాబు నరనరాల్లో ఉండేదంతా కుళ్లు, కుతంత్రం, క్రిమినల్ ఆలోచనలేనన్నారు. మేకతోలు కప్పుకున్న మృగంలా వ్యవహరించడం ఆయన నైజమని మండిపడ్డారు. బాబు డైరక్షన్లోనే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే ముఖ్యమంత్రిగా ఇటువంటి చర్యలకు పాల్పడం దురదృష్టకరమని ఖండించాల్సిందిపోయి విలేకరుల సమావేశం పెట్టి జగన్‌పై కొంచెం కూడా మర్యాద లేకుండా పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. ముందస్తుగానే ప్లాన్ చేయకుంటే దాడి జరిగిన గంటలో డీజీపీ ఠాకూర్‌తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి పబ్లిసిటీ కోసం.. పేపర్లలోకి ఎక్కాలని, జగన్ అభిమాని అని చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అలాగే 14 పేజీలతో కూడిన లేఖ ఒకటి రాయించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీజీపీ వ్యవహరించడం తగదన్నారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేక అడ్డదారిలో మంత్రి పదవి పొందిన సోమిరెడ్డి చంద్రమోహన్, ఎంపీ కేశినేనిలకు.. జగన్‌ను హత్య చేయాలంటే చిన్న కత్తితో కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం చేస్తామని అనడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. సోంబేరి రెడ్డి నువ్వు అదే చేసినట్లయితే వైఎస్సార్ అభిమానులు నీకు కైమాకొడతారన్నారు. పక్కా ప్రణాళికతోనే.. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన హర్షవర్థన్ చౌదరి గత కొన్నాళ్లుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో క్యాంటిన్ నడుపుతున్నారని.. అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడితో జగన్‌పై చంద్రబాబు హత్యాయత్నం చేయించారని తమ్మినేని ఆరోపించారు. వీఐపీ లాంజ్‌లో అయితే ఎటువంటి అనుమానం రాకపోవడంతోపాటు.. అక్కడైతే రాష్ట్ర పోలీసులు ఉండరని, ఆ నెపాన్ని కేంద్రంపై తోసేయవచ్చని పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి పూనుకున్నారన్నారు. ఏడాది కాలంగా జగన్ ఎప్పుడు వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారన్న షెడ్యుల్ అంతా తెలుసుకుని పథకం ప్రకారమే అతన్ని హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించారనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని వంగవీటి మోహనరంగ రక్షణ కల్పించాలని కోరినప్పటికీ రక్షణ కల్పించలేదు సరికదా అందరికీ తెలిసేలా అంతమొందించిన ఘనత, ఎన్టీఆర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన మల్లెల బాబ్జీలను చంపేసిన ఘనుడు చంద్రబాబేనన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీతారాం డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న పెద్ద హస్తాలెవరివి, భవిష్యత్‌లో ఇంకా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతారు, చంద్రబాబుతో సహా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయనే విషయాలపై సీబీఐతో గాని, సిట్టింగ్ జడ్జితో గాని, ప్రత్యేక ఉన్నత న్యాయస్థానంతో గాని, కేంద్రం నుంచి ప్రత్యేక కమిటీ వేయించి సమగ్ర విచారణ జరిపి హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల ఏజెన్సీతో విచారణ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై, అధికారులపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కోరారు. చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగినపుడు అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే సంఘటన స్ధలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారని, తిరుపతిలో మహాధర్నా నిర్వహించి చంద్రబాబుకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని తమ్మినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే చంద్రబాబుకి మాత్రం కనీస మానవత్వం లేదనడానికి జగన్‌పై దాడి జరిగిన అనంతరం ఆయన వ్యవహరించిన తీరే నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొన్నాడ వెంకటరమణ, యువజన విభాగం నాయకులు పేడాడ అశోక్, పార్టీ ఎచ్చెర్ల మండల కన్వీనర్ సనపల నారాయణరావు, పొందూరు మండల కన్వీనర్ బొనిగి రమణమూర్తి, మహిళా విభాగం నాయకురాలు టి.కామేశ్వరి ఉన్నారు. -
ఊరంతా ఉష్.. గప్ చుప్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆ గ్రామంలో ఎప్పుడూ మాట్లాడుకునే పిచ్చాపాటి మాటలు కూడా వినిపించడం లేదు. నలుగురు కలసి మాట్లాడుకునే పరిస్థితులు కూడా కరువయ్యాయి. ఎవరిని పలకరించినా కనీసంగా కూడా మాట్లాడడం లేదు. ముమ్మిడివరం మండలం ఠాణేలంక బాడవలో పరిస్థితి ఇది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనిపెల్ల శ్రీనివాసరావు స్వగ్రామం ఠాణేలంకలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గ్రామస్తులను ఎవరిని ప్రశ్నించినా, ఏ విషయం అడిగినా తమకు ఏమీ తెలియదని ముఖం చాటేస్తున్నారు. మూడు రోజులుగా పోలీసులు, సిట్ అధికారులు నిందితుడి ఇంటి వద్ద, గ్రామంలోను జరిపిన విచారణ ఫలితంగా ఎవ్వరూ నోరు విప్పడానికి సాహసించడం లేదు. ఎవరైనా ఏవైనా వివరాలు చెబితే వారిని కూడా విచారిస్తారేమోనన్న భయంతో అందరూ మౌనం వహిస్తున్నారు. భయపడుతున్న జనం గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా స్థా నికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడి సోదరి విజయదుర్గతో పాటు స్నేహితుడు చైతన్యను సిట్ అధికారులు విచారణ నిమిత్తం తీసుకెళ్లడంతో మిగిలిన గ్రామస్తులు ఏదైనా మాట్లాడితే తమను తీసుకువెళ్తారేమోనన్న భయంతో నిజాలు చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు గురించి అన్ని విషయాలూ తెలిసినవారు కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు. శ్రీనివాసరావు స్నేహితులు కూడా గ్రామంలో ఉండటం లేదు. ఎక్కడ తమను విచారణకు పిలుస్తారోనని గ్రామం బయట కాలం వెళ్లదీస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా సిట్ విచారణ : నిందితుడి కాల్ లిస్ట్ ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. కొంతకాలంగా అతడు చేసిన ఫోన్‌కాల్స్ ఆధారంగా సదరు గ్రామస్తుల వివరాలపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోదరి విజయదుర్గ తల్లిదండ్రులను, అంగన్వాడీ టీచర్‌ను, మరికొంతమందిని సిట్ అధికారులు శనివారం విచారించారు. శ్రీనివాసరావు కాల్ లిస్టులో ఉన్నవారందరూ తాము గ్రామంలో ఉన్నప్పుడు వస్తేసరి, లేదంటే విశాఖ వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తుందని సిట్ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఎవరిని ఎప్పుడు పిలుస్తారోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బయటి వ్యక్తులతో కానీ, ఇరుగుపొరుగు వారితో కానీ మాట్లాడేందుకు భయపడుతున్నారు. గ్రామస్తులపై టీడీపీ నేతలు ఒత్తిడి గ్రామానికి ఎవరు వచ్చినా ఎటువంటి సమాచారమూ ఇవ్వవద్దని గ్రామస్తులకు టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చిన లబ్ధి వివరాలను గోప్యంగా ఉంచాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పార్టీతో ఉన్న సంబంధాలపై స్పందించవద్దని గ్రామస్థాయి టీడీపీ నాయకులను సహితం అప్రమత్తం చేశారు. సమాచారమిస్తే పోలీసు కేసుల్లో ఇరుక్కుంటారని గ్రామస్తులను భయపెడుతున్నట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు తమకు ఎందుకు వచ్చిన గొడవ అని మిన్నకుండిపోతున్నారు. -
వైఎస్ జగన్‌కు ప్రముఖుల పరామర్శ
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం పలువురు ప్రముఖులు ఫోన్లో పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య ఫోన్ చేసి, హత్యాయత్నం ఘటన గురించి జగన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ఫోన్‌చేసి జగన్ యోగక్షేమాలను తెలుసుకున్నారు. సంఘటన జరిగిన తీరును ఆరా తీశారు. జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం జగన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగారు. -
జగన్‌కు ఫస్ట్ ఎయిడ్ నిర్వహించిన డాక్టర్ స్వాతి ఆవేదన!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తనపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఫస్ట్ ఎయిడ్ నిర్వహించిన అపోలో మెడికల్ సెంటర్ డాక్టర్ కె.లలితాస్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్‌పై అటాక్ చేశారు.. వెంటనే రావాలని ఎవరో యువకులు పరుగుపరుగున రావటంతో స్టెతస్కోపు, బీపీ మెషీన్ పట్టుకుని వెంటనే అక్కడికి వెళ్లా. జగన్ ధరించిన తెల్ల చొక్కా మొత్తం రక్తసిక్తం కావడంతో భయపడ్డా.. ఆయన ఓపిగ్గా జాగ్రత్త తల్లీ.. అని చెప్పారు. నేను సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి ఫస్ట్ ఎయిడ్ లోషన్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేశా. ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు. సుమారుగా 0.5 సెంటీమీటర్ మేర కత్తి దిగిందని రిపోర్టులో ఇచ్చా. గాయం లోతు అంతకన్నా ఎక్కువ ఉండవచ్చనే భావించా. రిపోర్టు కూడా పోలీసులు వచ్చి వెంటనే కావాలని ఒత్తిడి చేస్తే హడావుడిలో రాసిచ్చేశా. కానీ ఆ రిపోర్ట్‌ను పట్టుకుని కొన్ని చానెళ్లు, నాయకులు తప్పుడు ప్రచారానికి దిగారు’ అని డాక్టర్ స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాను ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడుకున్న విషయాలను కూడా రికార్డ్ చేసి చానెళ్లలో తమకు అనుకూలంగా చూపించారని స్వాతి పేర్కొన్నారు. 0.5 సెం.మీ.పైన కత్తి గాయమైనప్పటికీ.. ఆ కత్తికి విష రసాయనాలు ఏమైనా ఉన్నాయేమోనని మరింత లోతు చేసి కుట్లు వేస్తారు. హైదరాబాద్‌లో డాక్టర్లు అదే చేశారు. కానీ నేనేదో పక్కాగా 0.5 సెంటీమీటర్ మాత్రమే గాయమైందని ధృవీకరించినట్టుగా వక్రీకరించారు..’అని స్వాతి వాపోయారు. -
జననేతకు బాసటగా..
సాక్షి, నెట్వర్క్: విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో గాయపడ్డ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షించారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ శుక్రవారం అన్ని జిల్లాల్లో సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కారు. జగన్ త్వరగా కోలుకోవాలని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, పీలేరు, పుంగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా నేతలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. కువైట్‌లోని మసీదులో ప్రార్థనలు చేస్తున్న నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన ముస్లింలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. కదిరి, తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే వైఎస్ జగన్‌పై దాడి జరిగిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు పలు పూజా కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించారు. మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, సత్తెనపల్లి, తాడికొండ, వేమూరు, గుంటూరు నియోజకవర్గాల్లో ఆయా మండల పార్టీ నేతలు, స్థానిక నేతల ఆధ్వర్యంలో ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం ఘటనను తప్పుదారిపట్టించేందుకు అధికార టీడీపీ కుట్రలు పన్నుతోందని, టీడీపీకి పోలీసుశాఖ తొత్తుగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా నేతలు మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జననేతకు బాసటగా నిలిచారు. జగన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని కాంక్షిస్తూ మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు, పూజలు చేశారు. ఘటనను తప్పుదారి పట్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందులు వేసేందుకు జరుగుతున్న కుట్రలను సహించేదిలేదంటూ పార్టీ నేతలు నినదించారు. జగన్‌కు పూర్తి అండగా ఉంటామని, ఆయా కార్యక్రమాల్లో పార్టీనాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ప్రజల కోసం పనిచేసే నేత జగన్.. నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి వైఎస్ జగన్ అని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలు పేర్కొన్నారు. వైఎస్ జగన్ కోలుకోవాలని జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గాల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొదలకూరు ప్రాంతం నుంచి కువైట్‌కు వలసవెళ్లినవారు అక్కడ సర్వమత ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతపై కత్తితో హత్యాయత్నం జరిగినా ప్రభుత్వం చిన్న సంఘటనగా చిత్రీకరించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మానవహారాలు నిర్వహించి దాడిపై నిరసన తెలియజేశారు. గుమ్మలక్ష్మీపురం, వేపాడ గ్రామాల్లో స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక టీడీపీ సర్కార్ హస్తం ఉందని నేతలు ఆరోపించారు. విజయనగరం జిల్లాలో శుక్రవారం కూడా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జగన్ త్వరగా కోలుకోవాలని అన్ని మండలాల్లో ఆలయాల్లో పూజలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శుక్రవారం కర్నూలు జిల్లాలోని పలు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ప్రియతమ నేత జగన్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్ అభిమానులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మార్కాపురంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జగన్ కోసం మృత్యుంజయ హోమం నిర్వహించారు. పర్చూరులో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. జగన్ కోలుకోవాలని పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో బంద్‌లో భాగంగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి యూఏఈలో పార్టీ శ్రేణుల నిరసనలు.. ప్రజల మనిషి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం యూఏఈ కన్వీనర్ నెల్లూరు రమేష్‌రెడ్డి అన్నారు. దాడికి నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జాలో ఎన్ఆర్ఐ శ్రేణులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను రాజకీయంగానే ఎదుర్కోవాలేగానీ హత్యాయత్నాలు, దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రతిపక్ష నేతపై దాడిని అందరూ ఖండిస్తుంటే.. సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు మాత్రం చౌకబారు విమర్శలు చేయడం సరైన పద్ధతికాదన్నారు. ఈ కార్యక్రమాల్లో యూఏఈ ఎన్ఆర్ఐ విభాగం పార్టీ నేతలు సోమిరెడ్డి, బ్రహ్మానంద్, రమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబూ.. ప్రజాక్షేత్రంలో ఎదుర్కో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల పార్టీ కార్యాలయాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడలో చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని గౌతంరెడ్డిని అరెస్టు చేశారు. గుడివాడ రూరల్ మండలం బిల్లపాడులో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆదరణ చూరగొంటున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ నేతలు సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకు పాల్పడితే జగనన్న సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ శుక్రవారం సర్వమత ప్రార్థనలు చేశారు. ఇకపై ఎయిర్‌పోర్టుల్లో వీఐపీలకు ప్రత్యేక భద్రత దేశంలోని విమానాశ్రయాల్లో ప్రముఖ వ్యక్తుల (వీఐపీల)కు ఇకపై ప్రత్యేక భద్రత కల్పించాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడంతో సీఐఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాశ్రయాల్లోని లాంజ్‌లు, వీఐపీ లాంజ్ల్లో ఉండే ప్రముఖుల చుట్టూ భద్రతా (సీఐఎస్ఎఫ్) సిబ్బంది రక్షణ వలయంలా ఉంటారు. వీఐపీలు బోర్డింగ్ పాయింట్‌కు వెళ్లేవరకూ వారు కొనసాగుతారు. అలాగే లాంజ్ల్లోని రెస్టారెంట్ల సిబ్బందిపై నిరంతర నిఘా ఉంచుతారు. వారు విధుల్లోకి ప్రవేశించే సమయంలో, ప్రముఖులకు అల్పాహారం, టీ వంటివి అందించే సమయంలో సునిశితంగా పరిశీలిస్తారు. ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా జరగలేదు. తొలిసారిగా విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నం జరగడంతో సీఐఎస్ఎఫ్ సీరియస్‌గా తీసుకుంది. -
ఆగ్రహం..ఆందోళన
సాక్షి,సిటీబ్యూరో: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ దాడికి నిరసనగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ డీజీపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతకు ముందు విశాఖపట్నంలో జగన్‌పై దాడి అనంతరం ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు తెలుసుకుని అభిమానులు భారీ ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయన విమానం దిగి లాంజ్‌లోకి రాగానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగా ఉన్నట్టు జగన్ సంకేతాలిచ్చారు. ఆయన కాన్వాయ్‌లో బయలుదేరగా అభిమానులు కూడా వెంటే బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ కూడా రోడ్డుపై బైఠాయించి ఏపీ డీజీపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాగా వైఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని జగన్మోహన్రెడ్డిని పరామర్శించారు. ఇదిలా ఉండగా జగన్మోహన్రెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రితో పాటు ఆయన నివాస ప్రాంతంలోనూ నగర పోలీసులు భద్రతను పెంచారు. -
ఎయిర్‌పోర్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్ విస్తరణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రూ.55 కోట్లతో టెండర్లు ఖరారు చేసింది. మరో పది రోజుల్లో పనుల శంకుస్థాపనకు శ్రీకారం జరపాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌కార్గోకే పరిమితం చేసి ప్రయాణాలన్నీ భోగాపురం వైపు సాగిస్తారన్న ప్రచారానికి తెరపడినట్లయింది. టెర్మినల్ విస్తరణ ఇలా... విశాఖ విమానాశ్రయంలో ఇప్పటికే వంద కోట్లతో అంతర్జాతీయ టెర్మినల్ భవంతి, 10,030 అడుగుల పొడవున రన్‌వే అభివృద్ధి జరిగింది. మూడు ఏరో బ్రిడ్జిలు, పార్కింగ్ బేస్‌లు విస్తరించింది. ఆరు పార్కింగ్‌బేలు ఇప్పటికే ఉండగా, మరో ఆరు పార్కింగ్ బేలు విమానాలు నిలుపుదలకు ఇటీవల సిద్ధం చేశారు. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో టెర్మినల్ బిల్డింగ్ ఎటూ చాలడం లేదు. లోపల రద్దీ పెరిగిపోయి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటోంది. ఈ తరుణంలో ఇక్కడి టెర్మినల్ బిల్డింగ్‌ను రెండు వైపులా 75 స్క్వేర్ మీటర్ల చొప్పున తూర్పు, పశ్చిమ దిశల్లో పదివేల స్క్వేర్ మీటర్ల విస్తరణ చేపట్టాలని పౌరవిమానయానశాఖ నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు ఖరారు చేసింది. ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే మార్కింగ్‌లు ఇచ్చేశారు. మరో పది రోజుల్లో పనులకు శ్రీకారం జరపాలని ఆశాఖ ఢిల్లీ నుంచి ఆదేశాలిచ్చింది. రన్‌వే మరో 300 అడుగులు విస్తరణ ఇదిలా ఉండగా ఇక్కడి రన్‌వేను మరో 300 అడుగులు విస్తరించడంతో పాటు మరో మూడు లగేజ్ బెల్టులు, మరో మూడు ఏరో బ్రిడ్జిలు ఏర్పాటుకు కూడా ప్రణాళికలు చేసింది. ఇప్పటికే దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, పోర్టుబ్లెయిర్, కొలంబో నుంచి అంతర్జాతీయ విమానాలు ఇక్కడ వాలుతుండగా, ఇంకా ఇక్కడ బోయింగ్ 747, ఎయిర్‌బస్ 340, ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ వంటి విమానాలు ఇక్కడ దించడానికి ఆయా విమాన సంస్ధలు ఉవ్విళ్లూగుతుండడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రేడ్ విమానాశ్రయాలంటే... సాధారణంగా చిన్నపాటి విమానాశ్రయాలను పౌరవిమానయానశాఖ బీ గ్రేడ్‌గా గుర్తిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ప్రయాణికుల రద్దీ 15 లక్షలు దాటితే ఏ గ్రేడ్ విమానాశ్రయంగా గుర్తింపునిస్తుంది. దీని వల్ల విమానాశ్రయం అభివృద్ధి అనూహ్యంగా పెరగడంతో పాటు ప్రపంచస్ధాయి అందాలు, సదుపాయాలూ చేకూరుతాయి. ఆ రకంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాదు తదితర విమానాశ్రయాలు గుర్తింపు పొందాయి. విశాఖ విమానాశ్రయంలో 2015–16లోనే 15లక్షలుదాటి ప్రయాణాలు సాగించిన తరుణంలో కేంద్రం ఆ స్థాయిని అప్పుడే ఇచ్చేసింది. గడచిన ఏడాదిలో 24,09,712 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఇక్కడి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించడం విశేషం. ఇలాంటి తరుణంలో విమానాశ్రయానికి డీజీఎం స్థాయి హోదా కాకుండా ఏ గ్రేడ్ హోదాకి తగ్గట్టు ఇక్కడ సీనియర్ జనరల్ మేనేజర్ హోదా ఉన్న ప్రకాష్‌రెడ్డిని కేంద్రం నియమించింది. -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, విశాఖ : విశాఖపట్నం విమానాశ్రయంలో బుధవారం ఉదయం ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. కాగా ఫ్లయిట్ టేకాఫ్ సమయంలో ఓ పక్షి విమానం రెక్కల్లో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా దించివేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నిటికీ ‘అశోక్’ సాక్షి
- ఆయనే దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించారు - విశాఖ ఎయిర్పోర్ట్ వివాదంపై జేసీ - ఓ టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో తాజాగా వెల్లడి - జేసీ వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో వీరంగం వేసి ఉద్యోగులపై దాడికి పాల్పడ్డ అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాజాగా ఆ వివాదంలోకి కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజునూ లాగారు. జూన్ 15న ఆలస్యంగా వచ్చి బోర్డింగ్ పాస్ కోసం ఎయిర్‌పోర్టులో ఇండిగో సంస్థ ఉద్యోగులపై జేసీ దౌర్జన్యానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో మంత్రి ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లోనే ఉన్నారని, ఆయన జోక్యంతోనే బోర్డింగ్ పాస్ తీసుకుని జేసీ హైదరాబాద్‌కు వెళ్లారని ‘సాక్షి’ స్పష్టంగా చెప్పింది. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం ఆ తర్వాత రోజు ట్విట్టర్లో ఆ ఘటనతో తనకేమీ సంబంధం లేదన్నారు. తన జోక్యంతోనే జేసీకి బోర్డింగ్ పాస్ ఇచ్చారన్న వాదనలను ఖండిం చారు. ఆ తర్వాత జేసీ విదేశాలకు వెళ్లడం.. ఘటన జరిగిన రోజు సీఎం చంద్రబాబు ఏం జరిగిందో తెలుసుకుంటానని ప్రకటించి ఊరుకోవడంతో విషయం మరు గునపడింది. కానీ శుక్రవారం ఢిల్లీకి చెందిన ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో జేసీ విశాఖలో ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించిన విషయాలు ఇప్పుడు చర్చనీయాం శమయ్యాయి. ఇండిగో సిబ్బందిపై దురుసుగానే ప్రవర్తించానని అంగీకరించారు. దీంతో ఇప్పుడు ఆ వివాదం అశోక్ మెడకు చుట్టుకుంది. -
విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ ఎంపీ హల్చల్
విశాఖపట్టణం : విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ హల్చల్ సృష్టించాడు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను ఐడీ కార్డు చూపించాలని విశాఖ ఎయిర్‌పోర్టు సిబ్బంది అడిగారు. దీనిపై అవంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నన్నే ఐడీ కార్డు అడుగుతారా అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది మిన్నకుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్ పోర్ట్ రన్ వే పెంచుతాం: ఏపీ కేబినెట్
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.4లక్షల మేర పరిహారం చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రకటించింది. ఉడీ ఉగ్రదాడి ఘటనలో అమరులైన జవాన్లకు కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. విశాఖ ఎయిర్ పోర్ట్ రన్ వే పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పశు సంవర్ధకశాఖలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఓ మంత్రి వెల్లడించారు. బీసీసీఐ సెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన ఎంఎస్కే ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. మంగళగిరిలో 5వేల ఎకరాలలో ఎయిర్ పోర్టు నిర్మించనున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే శిబిరాలకు తరలించినట్టు డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకూ ఐదుగురు మృతిచెందినట్టు ఏపీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. -
విమానాన్ని హైజాక్ చేశారా?
♦ ఉత్కంఠ రేపిన మాక్‌డ్రిల్ ♦ నాలుగు గంటల సేపు అప్రమత్తం ♦ ఎన్ఎస్ డేగాలో భద్రతా బలగాల మోహరింపు గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో విమానాన్ని హైజాక్ చేశారా... ఇదీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆనోటా ఈనోటా సాగిన వదంతులు. మధ్యాహ్నం మూడుగంటలు...రయ్..రయ్ మంటూ అనేక వాహనాలు విశాఖ విమానాశ్రయం వైపు దూసుకు వచ్చాయి. అందులో అనేక శాఖల భద్రతా బ లగాలు, వారి వెంట జిల్లా పోలీసు యంత్రాంగం, వీరందర్నీ అనుసరిస్తూ అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు. విమానాశ్రయం లోపల విమాన సంస్థల అధికారులు, ఉద్యోగులు ఉరుకులూపరుగులూ. అసలేం జరుగుతోంది...ఇవన్నీ ఏంటని ప్రయాణికులు, సందర్శకుల్లో ఉత్కంఠ. తీవ్రవాదులు హైజాక్ చేసిన విమానం ఇక్కడ వాలిదంటూ మరి కొద్ది సేపట్లో ఎవరి నుంచో వర్తమానం. ఉదయం డ్యూటీలు ముగించుకుని వెళ్లిపోయిన సీఐఎస్ఎఫ్ బలగాలు తిరిగి హుటాహుటిన విధుల్లో చేరిపోయి విమానాశ్రయ పరిసరాల్లో అడుగడుగునా కాపలా...సెక్యూరిటీ గేటు వద్ద అణువణువునా తనిఖీలు...ఇలా రాత్రి ఏడు గంటల వరకూ భద్రతాబలగాల హైరానాతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి ఇదంతా ఎయిర్‌క్రాఫ్ట్ యాన్టీ హైజాకింగ్ మాక్‌డ్రిల్‌గా భద్రతా అధికారులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత వైమానిక దళాలు, ఎయిర్‌పోర్టు అథారిటీ సీఐఎస్ఎఎఫ్ భద్రతా బలగాలతో అంతర్గత భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేయడానికే ఈమాక్ డ్రిల్ జరిపారని అధికారులు తెలిపారు. -
విశాఖ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు మూడు నెలలు
విశాఖ : పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గురువారం విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హుదూద్ తుఫాను విపత్తులో సమర్థవంతంగా పని చేసిన అధికారులను అభినందించారు. తుఫాను సమయంలో విమానాశ్రయాన్ని కాపాడేందుకు విమానాశ్రయ సిబ్బంది అంకితభావంతో పాటు మంచి నైపుణ్యం చూపారని కొనియాడారు. విపత్తులో కూడా సిబ్బంది విమానాశ్రయంలోనే ఉండి కీలక పరికరాలను ధైర్యంగా కాపాడారన్నారు. విమానాశ్రయంలో ప్రాణ నష్టం జరగలేదని అశోక్ గజపతిరాజు అన్నారు. ఆయన ఈ సందర్భంగా సిబ్బందిని సన్మానించి, జ్ఞాపికలు అందచేశారు. విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని అశోక్ గజపతిరాజు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. విమానాశ్రయం పూర్తి పునరుద్ధరణకు మూడు నెలల సమయం పడుతుందన్ని ఆయన తెలిపారు. -
కిల్లి కృపారాణిని అడ్డుకున్న సమైక్యవాదులు
విశాఖ : కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. మంగళశారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో ఆమెను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలంటే పదవులు అవసరమని కిల్లి కృపారాణి తెలిపారు. అయితే సమైక్యవాదులు మంత్రి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని కిల్లి కృపారాణిని విమానాశ్రయం లోపలికి తీసుకు వెళ్లారు.