YS Jagan Mohan Reddy
-
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
కూటమిని అనవసరంగా గెలిపించాం : మహిళలు
-
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ కేసుల విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కేసులను హైకోర్టు చూసుకుంటుందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు.ఈ కేసుతో మీకు సంబంధం ఏంటని రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది ఈ కేసులో వాదనలకు సమయం కోరారు. దాంతో విచారణను వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేసులు విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్.. కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ముకుల్ తెలిపారు. రాజకీయపరమైన పిటిషన్‌గా ముకుల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా? -
ఖోఖో ప్రపంచ కప్ విజేత భారత్.. వైఎస్ జగన్ ప్రశంసలు
-
పేదల గోడు పట్టని ప్రభుత్వం
చంద్రబాబు పాలన రాష్ట్ర ప్రజలకు పెనుశాపంగా మారిందనడానికి ఇవే ప్రబల నిదర్శనాలు. ప్రజలు, చిరుద్యోగులకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్య సేవలు అందించడంలోనూ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపశయ్య ఎక్కించింది. ప్రజల ప్రాణాలను గాలిలో దీపంలా మార్చేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. మీరే డబ్బు కట్టి వైద్యం చేయించుకోండి’ అని ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు కరాఖండిగా చెప్పేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అంటేనే రోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నాయి. – సాక్షి, అమరావతికర్నూలు జిల్లా హలహర్వి మండలం సిరుగాపురానికి చెందిన ఎ. తిమ్మన గౌడు(54) షుగర్ వ్యాధి కారణంగా ఇన్ఫెక్షన్ సోకడంతో కర్నూలులోని అమీలియా ఆస్పత్రిలో వారం క్రితం చేరారు. తిమ్మన గౌడ్ అనారోగ్య సమస్య ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. అయితే, ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడానికి అదనంగా రూ. 40 వేలు వసూలు చేశారు. తప్పనిసరై డబ్బు కట్టాడు. ఈ డబ్బుకు ఆస్పత్రి యాజమాన్యం బిల్లు కూడా ఇవ్వలేదు. చికిత్స పొందుతూ తిమ్మన మృతి చెందాడు.ప్రకాశం జిల్లా కంభంకు చెందిన నరసింహులు పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగి. కాలి మడిమ వద్ద సమస్యకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద చికిత్స కోసం కర్నూలులోని జెమ్కేర్ కామినేని ఆస్పత్రికి వెళ్లాడు. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఈహెచ్ఎస్ కింద చికిత్స చేయాలని కోరగా ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్య సేవలు నిలిపి వేశామని స్పష్టం చేసింది. చికిత్సకు డబ్బు చెల్లించి, కావాలంటే రియింబర్స్‌మెంట్ పెట్టుకోవాలని సూచించింది. డబ్బు చెల్లించే స్తోమతు లేక నరసింహులు తల్లడిల్లుతున్నాడు.ఇన్ని రోజులు సేవలు ఆగడం ఇదే తొలిసారివైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తెస్తూ ప్రొసీజర్లను 3,257కు పెంచింది. అంతేకాకుండా వైద్య సేవల ఖర్చుల పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. దీంతో రాష్ట్రంలో 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నెట్వర్స్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల బిల్లులు ఆగిపోవడంతో ఇక ఆస్పత్రులు సేవలకు ముఖం చాటేశాయి. ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో ఉన్నామని వెంటనే బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలను నిలిపేశాయి. దీంతో చర్చలకని పిలిచిన ప్రభుత్వం రూ.500 కోట్లు బిల్లులు ఇస్తామని, వెంటనే సేవలు ప్రారంభించాలని ఆస్పత్రులకు చెప్పింది. ప్రభుత్వం ప్రతిసారీ ఇలాగే చెబుతోందని, రూ.500 కోట్లు బిల్లులు ఇచ్చాకే సేవలు ప్రారంభిస్తామని ఆస్పత్రులు తేల్చి చెప్పేశాయి. ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తామన్న మొత్తం కూడా ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని రోజుల పాటు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు ఆగిపోవడం ఇదే తొలిసారి అని నెట్వర్క్ ఆస్పత్రుల యజమాన్యాలు తెలిపాయి. గతంలో తమకు ఇబ్బందులొస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకొనేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.వైద్యం కోసం అప్పులుప్రభుత్వం పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపివేయడంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్ నెల వరకూ మెజారిటీ ఆస్పత్రుల్లో గుండె, న్యూరో, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ అదనంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కొత్త ఏడాది మొదలయ్యాక మొత్తం చికిత్సలకే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలని తేల్చి చెబుతుండటంతో పేదలు, ప్రభుత్వ చిరుద్యోగులు, మాజీ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.సేవలు నిలిపేశామన్నారుమెట్ల మీద నుంచి జారి పడి నడుము ఎముకలు విరిగాయి. ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీకి రూ.1.8 లక్షలు అవుతుందన్నారు. డబ్బు పెట్టి చికిత్స చేయించుకోలేను. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాను. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసినట్లు అక్కడ చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదన్నారు. సర్పవరం జంక్షన్‌లోని మరో ఆసుపత్రికి వెళితే అక్కడా అదే చెప్పారు. గత్యంతరం లేక మందులు వాడుతూ నొప్పిని భరిస్తూ రోజువారీ జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. – వింజమూరి సరస్వతి, కాకినాడఇది చాలా అన్యాయంమా బంధువుకు అనారోగ్యంగా ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయడంలేదని చెప్పారు. ఇది చాలా అన్యాయం. నిరుపేద, మధ్య తరగతి ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? పేదలకు ఆపద్బాంధవిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాలి.– కవిత, ప్రశాంతి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లాఅందరినీ వెనక్కి పంపేస్తున్నారువైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే, ఈ కార్డు కింద ఉచిత వైద్యం చేయబోమని చెబుతున్నారు. రెండు రోజుల నుంచి ఉచితంగా ఆపరేషన్లు ఆపేశామన్నారు. నా లాగే చాలా మందిని వెనక్కి పంపించేస్తున్నారు. కూలికి పోతే గానీ గడవని బతుకులు మావి. డబ్బులిచ్చి ఆపరేషన్లు చేయించుకోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? – ఎన్ని నర్సయ్య, సైరిగాం, శ్రీకాకుళం జిల్లాడయాలసిస్కు చేతి నుంచి డబ్బు పెట్టుకున్నాకిడ్నీలు ఫెయిల్ అవడంతో వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో కర్నూలులోనే కిమ్స్ ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ కింద డయాలసిస్ చేయించుకునేవాడిని. ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఈహెచ్ఎస్ సేవలు ఆపేశారు. ఇప్పుడు డబ్బు చెల్లించి డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఇది నాకు పెను భారమే అయింది.– వెంకటేశ్వర్లు, మాజీ ఉద్యోగి వైద్య, ఆరోగ్య శాఖ కర్నూలు -
ప్రపంచ ఖోఖో విజేతలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: తొలి ప్రపంచ ఖోఖో చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో డబుల్ గోల్స్ సాధించి విజేతలుగా నిలిచిన భారత పురుషులు, మహిళల జట్లను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అభినందించారు.భవిష్యత్‌లో జరిగే టోర్నీల్లో భారత జట్లు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) వెళ్లడం, దానికి అనుకూల మీడియా బాకా ఊదడం తెలిసిందే. తాజాగా దావోస్(Davos) పర్యటనకు వెళుతున్న చంద్రబాబు(Chandrababu) అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ, సీఎన్‌బీసీ టీవీ18, బిజినెస్ టుడే పత్రికలకు రూ.కోట్లు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రచారం మాట అటుంచి.. 2014–19 మధ్య దావోస్(Davos) పర్యటనల్లో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాలు ఏమయ్యాయి.. ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా బాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు.ప్రపంచంలోని కుబేరులతో ఫొటోలు తీయించుకుని ప్రచారం చేయించుకోవడమే కానీ.. దావోస్(Davos) పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు(Chandrababu) చెప్పగలరా... అని ప్రశ్చిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా నాలుగుసార్లు చంద్రబాబు(Chandrababu) దావోస్(Davos) పర్యటనకు వెళితే... ఎన్నికల ఏడాది 2019లో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్(Davos) పర్యటనకు వెళ్లింది. మొత్తం దావోస్(Davos) పర్యటనకు రూ.55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా, రూ.ఒక కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్(Davos) పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి దావోస్(Davos)కు వెళ్లిన అప్పటి సీఎం చంద్రబాబు(Chandrababu) పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలుసుకోవడంతో పాటు సీఈవో సత్య నాదెళ్లతో చర్చలు జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చి పదేళ్లయినా ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా... తాజాగా సత్య నాదెళ్ల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారే కానీ.. మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, పెగా సిస్టమ్స్... ఇలా అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్టు ఊదరగొట్టారే కానీ... ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు(Chandrababu) హయాంలో తీసుకురాలేకపోయారు.వైఎస్ జగన్ ఒకసారి పర్యటనతో రికార్డుస్థాయి ఒప్పందాలుకేవలం రూ.11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్(Davos) సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. రూ.200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు.అలాగే రూ.60 వేల కోట్లతో అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్కో రూ.37 వేల కోట్లతో, అరబిందో రూ.28 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్(Davos)లో ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే.. 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్లు, తెలుగు వంటలు గురించి చర్చించారని, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండ వేపుడును పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.2014–19 మధ్య దావోస్(Davos)లో చంద్రబాబు(Chandrababu) పర్యటించి ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు ఇవీ... ఇందులో ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు 2015లో⇒ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం ⇒ విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన ⇒ రాష్ట్రంలో భారీ హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం2016లో⇒ మియర్ బర్గర్, ఫిస్లోం సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ⇒ రూ.2 వేల కోట్లతో ఘెర్జి టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ⇒ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతోపాటు నెస్లే, వెల్సపన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి 2017లో⇒ ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులు ⇒ విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు ⇒ విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు 2018లో⇒ కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం ⇒ గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు ⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హిటాచీ పెట్టుబడులు 2019లో⇒ జేఎస్‌డబ్ల్యూ రూ.3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం ⇒డెలాయిట్, పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి -
వైఎస్ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టు చేస్తారా?: నాగలక్ష్మి
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ ఆటోపై వైఎస్ జగన్ ఫొటో ఉందని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడనే కారణంతో కూటమి ఎమ్మెల్యే ఉడికిపోయారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేసి.. ఆటోను సీజ్ చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త పంజా దుర్గారావుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన దౌర్జన్యకాండ శుక్రవారం తణుకులో సంచలనం రేకెత్తించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్సార్సీపీకి అనుకూలంగా, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్న దుర్గారావును టార్గెట్ చేసిన ఎమ్మెల్యే నడిరోడ్డుపై ఒక సామాన్య ఆటో డ్రైవర్ అని కూడా చూడకుండా వెంటాడి వీరంగం చేసిన ఘటనను ప్రజలు చీదరించుకుంటున్నారు. బెదిరించి, ఇష్టానుసారంగా దూషించిన తర్వాత పోలీసులకు అప్పగించడం, ఆపై స్టేషన్లో నడిచిన హైడ్రామాపై పలువురు విమర్శిస్తున్నారు. ఉదయం 12 గంటల నుంచి తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గారావును స్టేషన్లో ఎవరూ కలవకుండా నిర్బంధించడం, వ్యవహారాన్ని గుట్టుగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన ప్రముఖులు స్టేషన్‌కు రావడం, అధికారులతో మంతనాలు జరపడం, లీగల్ బృందంతో సంప్రదింపులు జరపడం వెనుక భారీ కుట్రపూరిత వ్యవహారం నడుస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు, కుటుంబసభ్యులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఏ కేసులు నమోదు చేస్తారో, ఎక్కడికి తీసుకువెళ్తారోననే ఉత్కంఠ నడిచింది. రాత్రి 10.30 గంటలు గడిచినా దుర్గారావును స్టేషన్లోనే ఉంచడం, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ చేయాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతుండటం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి.కన్నీరుమున్నీరవుతున్న భార్య, పిల్లలుతన భర్త దుర్గారావును చూసేందుకు తణుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్య నాగలక్ష్మి, కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ముఖ్యంగా ఆడబిడ్డల రోదనలు తణుకువాసులను కదిలించాయి. తాజాగా దుర్గారవు భార్య పంజా నాగలక్ష్మి మాట్లాడుతూ..‘ఆటో నడుపుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. నిన్న నా భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త ఎవరికి అన్యాయం చేశాఆడని పోలీసులు తీసుకువెళ్లారు?. ఏం పోస్టులు పెట్టాడని తీసుకువెళ్లారు?. ఆటో తీసుకెళ్లి నా భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారు. మేము మధ్యతరగతి ప్రజలం.. ఎలా బతకాలి?. మాకు వైఎస్ జగన్ అంటే అభిమానం. వైఎస్ జగన్‌పై అభిమానం ఉంటే అరెస్టులు చేస్తారా?. నా భర్తకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాధ్యుడు అవుతాడు. నా భర్తను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. విడ్డూరంగా ఆర్టీఓ తీరుసామాన్య ఆటోడ్రైవర్ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్టీఓ హుటాహుటిన పోలీసుస్టేషన్‌కు రావడం, వెంటనే దుర్గారావు ఆటోను స్వాధీనం చేసుకుని నిమిషాల వ్యవధిలోనే తణుకు ఆర్టీసీ బస్‌డిపోకు తరలించడం విడ్డూరంగా మారింది. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని, జిల్లా మారి హైవేపైకి ఆటో వచ్చిందని తదితర కారణాలు చూపించి రూ.3,400 జరిమానా విధించడం, రవాణా కార్యాలయం నుంచి పనిగట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ అధికారం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు చూపిస్తున్న అధికార దర్పాన్ని చూసిన తోటి ఆటోడ్రైవర్లు ముక్కున వేలేసుకున్నారు. -
వైఎస్ జగన్ పుత్రికోత్సాహం.. లండన్‌లో కుటుంబంతో.. ఈ చిత్రాలు చూశారా?
-
YSRCP ప్రభుత్వ చర్యల వల్లే ఆగిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
-
వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది
సాక్షి, న్యూఢిల్లీ: ‘కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే, దీనికి వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించింది.’ అని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలోని ఉద్యోగ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్నంత వరకూ కర్మాగారం అభివృద్ధిలో నడిచింది. 2016–17లో 7.3 మిలియన్ల ఉత్పత్తికి ప్రయత్నాలు చేసినప్పటి నుంచి నష్టాలు ప్రారంభయ్యాయి. 2018–19, 2020–21లో రూ.930 కోట్లు లాభాలు వచ్చాయి. 2021 కోవిడ్ సమయంలో ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన గొంతు వినిపించింది. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేసింది. అంతేకాదు.. ఉద్యమాలు, ఆందోళనలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి.. అప్పటి ప్రభుత్వంవల్లే వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ జరగలేదు.Thankyou YSRCP MP's For Saving VIZAG STEEL PLANT✊ pic.twitter.com/UECSvaE8Wj— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) January 17, 2025ఆర్థిక మంత్రికి అభ్యంతరాలున్నాయినేను కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సమీక్షలు చేసి విశాఖ ఉక్కుకు సాయంచేయాలనే విషయాన్ని ప్రధాని, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లా. అయితే, ఈ ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కొన్ని అభ్యంతరాలున్నాయి. అయినా, వాటిని పక్కనపెట్టి చివరి అవకాశంగా రూ.11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు. దీంతో రెండేళ్లలోనే స్టీల్‌ప్లాంట్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడాన్ని నేను సవాలుగా తీసుకున్నా.ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం.. ఎక్స్‌లో ప్రధాని మోదీ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కర్మాగారానికి రూ.10 వేల కోట్లుకు పైగా పెట్టుబడిని మద్దతుగా ఇచ్చేందుకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం. ఆత్మనిర్భర భారత్ సాధించడంలో ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థంచేసుకుని ఈ చర్య చేపట్టాం’ అని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ‘ఎక్స్’లో తెలిపారు. విలీనం, ఉద్యోగుల వీఆర్ఎస్పై దాటవేత..ఇదిలా ఉంటే.. ఉద్యోగుల్ని వీఆర్ఎస్ తీసుకోమంటున్నారు.. సెయిల్ విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందంటూ మీడియా ప్రస్తావించగా.. కుమారస్వామి దాటవేసే ప్రయత్నం చేశారు. వీఆర్ఎస్పై త్వరలో యూనియన్ నేతలతో మాట్లాడతామన్నారు. ఇక ప్రతి అంశాన్ని దశల వారీగా చర్చించి, పరిష్కరించేందుకు ముందుకెళ్తామన్నారు.అలాగే, ప్యాకేజీ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో రూ.26,114.82 కోట్లు అప్పుల్లో ఉన్నట్లు ఉంది. ఇదే అంశంపై కేంద్రమంత్రిని మీడియా ప్రశ్నించగా.. ‘రూ.26,114.82 కోట్లు కాదు రూ.35 వేల కోట్లు రుణభారం ఉంది. దీనిని అధిగమించేందుకు అంచెలంచెలుగా ముందుకెళ్తాం. ప్రస్తుతం ఇచ్చిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో కర్మాగారాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం’ అన్నారు. ప్యాకేజీకి.. ఉన్న రుణభారానికి సంబంధంలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం తమకెంతో ఆనందంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైయస్ జగన్ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. ఆనాడు లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం ప్రయత్నించగా ఏపీ శాసనసభ దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. సంస్థను కాపాడేందుకు @ysjagan ప్రభుత్వం ఆది నుంచి పోరాడుతూనే… pic.twitter.com/vdsM9VCkIS— YSR Congress Party (@YSRCParty) January 18, 2025 -
వైఎస్ జగన్ వల్లే ప్రైవేటీకరణ ఆగింది - కేంద్రమంత్రి కుమార స్వామి
-
విద్యార్థుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై కక్షగట్టిన కూటమి సర్కారుకు విద్యార్థులు షాకిచ్చారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగులోనూ రాసేందుకు అవకాశం కల్పించినా విద్యార్థులు ససేమిరా అన్నారు. కొన్నిచోట్ల సర్కారు ఒత్తిడితో కేవలం 7 శాతం మంది మాత్రమే తెలుగులో పరీక్షలు రాసేందుకు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను తెలుగు మీడియంలోకి మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పదో తరగతి విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పినట్టయింది.సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మీడియానికే జై కొట్టారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 93 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలోనే రాస్తామని తేల్చి చెప్పారు. 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతిలో మొత్తం 6,64,527 మంది విద్యార్థులు ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 3,77,054 మంది చదువుతున్నారు. వీరంతా మార్చి 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ నామినల్ రోల్స్ పంపాల్సిందిగా పాఠశాలలను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొదలైన అనంతరం తెలుగులోనూ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుంచి కేవలం 51,037 మంది మాత్రమే తెలుగు మీడియంకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య 25 వేలకు మించి ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలతో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్ మీడియం లేకున్నా సరే 4 లక్షల మంది విద్యార్థుల్లో 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. చట్టప్రకారం ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోకి మారింది. అయినప్పటికీ కూటమి సర్కారు ఇంగ్లిష్ మీడియం రద్దుకు కంకణం కట్టుకుని పదో తరగతి విద్యార్థులను తెలుగు మీడియం వైపు తిప్పేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇంగ్లిష్ మీడియం విద్యకే ఓటు రాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉండేది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకోవడం, అది ప్రభుత్వ బడుల్లో లేకపోవడంతో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడం.. ప్రైవేటు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగడం పరిపాటిగా మారింది. దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలను గత టీడీపీ ప్రభుత్వం మూసేసింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అధ్యయనం చేసి తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంది. తద్వారా రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటున్నామని 95 శాతం మంది తెలిపారు. ఇంగ్లిష్ కోసమే ఫీజులు భారమైనా తమ బిడ్డలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నట్టు వివరించారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. ఆ సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టగా, 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ఇదే క్రమంలో 2024–25 విద్యా సంత్సరంలో పదో తరగతి కూడా ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వచ్చింది. కుట్రను తిప్పికొట్టి మరీ..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదవలేకపోతున్నారని, మాతృభాషలో బోధన అందిస్తామని ప్రకటించింది. కానీ.. విద్యార్థులు అందుకు అంగీకరించలేదు. 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువుతున్న పదో తరగతి విద్యార్థుల్లో 2.20 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వారిలో 1.94 లక్షల మంది ఉత్తర్ణీత సాధించడం ద్వారా పిల్లలు ఇంగ్లిష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో రుజువు చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో 25 వేల మందే తెలుగు మీడియం పరీక్షలకు అంగీకరించి.. తెలుగు మీడియం సంఖ్యను మరింత తగ్గించారు. గత ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో ప్రజల్లో సర్కారు బడులపై నమ్మకం పెరిగింది. దాంతో 2023–24 విద్యా సంవత్సరంలో అంతకు ముందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరికలు నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ప్రభుత్వం బైలింగ్యువల్ పుస్తకాలను అందించడంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే భయం పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకే ఇష్టపడుతున్నారు. గతేడాది ముగిసిన పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 3 నుంచి 5 తరగతుల్లో 86 శాతం, 6 నుంచి 9వ తరగతి వరకు 94 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయగా, మొత్తం అన్ని తరగతుల్లోను పరీక్షలు 93 శాతం ఇంగ్లిష్ మీడియంలోనే పూర్తి చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. అదీ ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎందుకని ఆక్షేపించిన వారికి గట్టి జవాబు ఇచ్చారు. -
34 వేల ప్రభుత్వ పోస్టులకు మంగళం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే దిశగా చంద్రబాబు సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరాలన్న సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేయబోతోంది. ఎందుకంటే.. తాజాగా, శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే... ప్రభుత్వంలో ఒకేసారి దాదాపు 34వేల ఉద్యోగాలు శాశ్వతంగా తగ్గిపోనున్నాయి. రాష్ట్రంలో మొన్న జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. 2.66 లక్షల మంది ఉన్న వలంటీర్ల వ్యవస్థకు ఇప్పటికే దాదాపు మంగళం పాడేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ చేపట్టి అందులో పనిచేసే ఉద్యోగులను భారీగా కుదించనుంది. 1.49 లక్షల ఉద్యోగాలకు 1.15 లక్షలతో సరి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమం, సంక్షేమ పథకం ఎలాంటి అవినీతి, పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా చిట్టచివరి స్థాయి వరకు సంతృప్త స్థాయిలో చేరవేయాలన్న లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో సచివాలయంలో 10–11 మంది చొప్పున మొత్తం 1,49,235 మంది పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించి దిగ్విజయంగా నిర్వహించి జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో వీటిల్లో సిబ్బంది సంఖ్యను భారీగా కుదిస్తోంది. ఎంతలా అంటే.. 2,500 కన్నా తక్కువ జనాభా ఉండే 3,562 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరుగురు చొప్పున.. 2,500–3,500 మధ్య జనాభా ఉండే 5,388 సచివాలయాల్లో ఏడుగురు చొప్పున.. 3,500 పైబడి జనాభా ఉండే 6,054 సచివాలయాల్లో ఎనిమిది మంది చొప్పున మాత్రమే కొనసాగించాలన్న నిర్ణయానికి శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా మొత్తం సచివాలయాల్లో ఉద్యోగాల సంఖ్యను 1,15,226 మందికే పరిమితం చేయాలని నిర్ణయించారు. అంటే.. 34వేల పోస్టులకు ఎసరు పెట్టనున్నారు. 15,496 మంది వేరే శాఖలకు బదిలీ నిజానికి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లూచేశారు. కానీ, ఎన్నికలతో ఆ ప్రక్రియకు బ్రేక్‌పడింది. ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు చేపడుతున్న హేతుబద్ధీకరణ ప్రక్రియ తర్వాత ఆ ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు.. వాటిల్లో 15,496 మంది అదనంగా పనిచేస్తున్నట్లు లెక్కగట్టింది. ఇప్పుడు వీరందరినీ వేరే శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది.పాత రోజులు పునరావృతం..గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు 3–4 ఊళ్లకు ఒక్క పంచాయతీ కార్యదర్శి.. ఐదారు ఊర్లకు ఒక వీఆర్వో మాత్రమే ఉన్న పరిస్థితి ఉండేది. వ్యవసాయ అసిస్టెంట్లు అయితే ఎక్కడో ఒకరు ఉండేవారు. ఇక సర్వేయర్లు మండలానికి ఒకరు.. చాలా మండలాలకు ఇన్చార్జి సర్వేయర్లు ఉండేవారు. కానీ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యాక ప్రతి ఊర్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు నియమితులయ్యారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో చాలా గ్రామాల్లో కీలకమైన ఉద్యోగులు 2–3 ఊళ్లకు ఒకరు చొప్పున ఉండే పరిస్థితి మళ్లీ రానుంది. అలాగే, వీఆర్వో సంఖ్య 11,162 నుంచి 5,562కు తగ్గిపోనుంది. అంటే.. సగం గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు ఉండని పరిస్థితి దాపురించబోతోంది. సర్వేయర్లదీ ఇదే పరిస్థితి. ఇక ఈ సచివాలయాల్లో ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ ఉద్యోగులు 10,475 మంది ఉండగా, హేతుబద్ధీకరణతో ఆ సంఖ్య 7,524కు పరిమితమవుతుంది. ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు కూడా 8,138 నుంచి 6,359కి తగ్గిపోనున్నాయి. -
పేదల భూములు ఫలహారం!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో లబ్ధి పొందిన పేద రైతుల పొట్ట గొట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుపేదలు ఇప్పటికే పూర్తి హక్కులు పొందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు, వారికి కేటాయించిన ఇళ్లను రద్దు చేసేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దశాబ్దాల పాటు కొనసాగిన ఆంక్షల చెర నుంచి గత ప్రభుత్వంలో విముక్తి పొందిన అసైన్డ్ పేద రైతుల భూములను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఎత్తులు వేస్తోంది. లక్షలాది ఎకరాల భూములకు చట్టబద్ధంగా హక్కులు కల్పించడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ వారి నుంచి వాటిని లాక్కునేందుకు యత్నిస్తోంది. పేదల నుంచి భూములు ఎలా లాక్కోవాలనే అంశంపైనే మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరగడం గమనార్హం. తన హయాంలో భూములకు సంబంధించి ఒక్క సంస్కరణ కూడా చేపట్టకుండా వాటన్నింటినీ వివాదాల్లో ముంచెత్తిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణల కారణంగా ప్రయోజనం చేకూరిన రైతులను ముంచేందుకు కంకణం కట్టుకుని పని చేయడంపై అంతా నివ్వెరపోతున్నారు. భూముల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేయగా అసలు ఎప్పుడూ వీటి గురించి ఆలకించని చంద్రబాబు ప్రభుత్వం పేదలను దగా చేసేందుకు కుతంత్రాలు పన్నుతోంది. ఫ్రీహోల్డ్ భూములపై పన్నాగాలుగత ప్రభుత్వం చరిత్రాత్మక రీతిలో అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించి చట్టానికి కీలక సవరణలు చేసింది. దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్న కూటమి ప్రభుత్వం పేదల నుంచి లాక్కునేందుకు పావులు కదుపుతోంది. దీర్ఘకాలంగా భూములపై ఎలాంటి హక్కులు లేకపోవడంతో పేద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఇతర పేద వర్గాల రైతులు ఎన్నో ఏళ్లుగా కోరుతూ వచ్చిన నేపథ్యంలో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడంతోపాటు మన రైతుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించింది. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన 15.20 లక్షల మంది అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడంతో వారు ప్రైవేట్ భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసి పేద రైతులను భూ యజమానులుగా చేసింది. హక్కులు దక్కిన రైతుల్లో కొందరు తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అవసరాల కోసం వాటిని అమ్ముకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని తప్పుబడుతోంది. నిజానికి ఇలా క్రయ విక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు సంబంధించిన భూములు మాత్రమే. మిగిలిన భూములన్నీ అసైనీల చేతుల్లోనే భద్రంగా ఉన్నాయి. రైతులకు మేలు చేసిన ఈ సంస్కరణను చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతూ ఈ భూములన్నీ అక్రమమని చెబుతూ వాటిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.10 లక్షల ఎకరాలు సక్రమమేనని కూటమి సర్కారు విచారణలోనే వెల్లడిగత 6 నెలల నుంచి ఫ్రీహోల్డ్ భూములపై కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తూనే ఉంది. సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగా ఫ్రీ హోల్డ్ అయినట్లు ఈ విచారణలో తేలింది. మిగిలిన దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని పేర్కొంటున్నా అవి ఏమిటనే అంశాలను కచ్చితంగా తేల్చలేకపోయింది. కేవలం రాజకీయ కారణాలతోనే కొన్ని జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూములపై వివాదాలు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడైనా అధికారులు, భూ మాఫియాల వల్ల పొరపాట్లు జరిగితే సరిదిద్దాల్సిందిపోయి వాటన్నింటినీ కబళించేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. ఆంక్షల చెరలో చిక్కుకుని దశాబ్దాలుగా అన్యాయమైపోయిన రైతులకు మేలు జరగడాన్ని జీర్ణించుకోలేక వారి నుంచి ఏకంగా భూములు లాక్కునేందుకు పన్నాగాలు పన్నడంపై పేదలు కలవరం చెందుతున్నారు. రాజధానిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొల్లగొట్టి వారికి రావాల్సిన ప్లాట్లను దర్జాగా దోచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన అసైన్డ్ రైతుల భూములను కూడా కొట్టేసేందుకు సిద్ధం కావడంపై పేదలు మండిపడుతున్నారు. చట్టబద్ధంగా అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి గత ప్రభుత్వం నిర్వహించిన మంచి పనిని సైతం వక్రీకరించి 22 ఏ జాబితా నుంచి తొలగించిన భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు మంత్రులు, టీడీపీ నేతలు అడ్డగోలుగా ఆరోపణలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఫ్రీ హోల్డ్ అయిన 13 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలు మాత్రమేనని టీడీపీ ప్రభుత్వమే నిర్ధారించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వాటిపై విచారణ నిర్వహించి మిగిలిన భూములపై ఆంక్షలు ఎత్తి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. జగన్ హయాంలో జరిగిన మేలు కొనసాగకూడదనే రీతిలో లక్షలాది ఎకరాలను వివాదాస్పదంగా మార్చేసింది. పేదల ఇళ్లపైనా పగగత ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన ఇళ్లపైనా చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. ఇళ్లు కట్టుకోలేదనే నెపంతో జగనన్న కాలనీల్లో వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొందరు అక్రమంగా ఇళ్లు పొందారని చెబుతూ పేదల కడుపు కొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారి పరిస్థితి ప్రశ్నార్థకమైంది. వారికిచ్చిన స్థలాలను రద్దు చేసి తిరిగి ఎక్కడ ఇస్తారో చెప్పడం లేదు. ఇచ్చిన స్థలాలను రద్దు చేయడంపై పేదలు గగ్గోలు పెడుతున్నా ఆలకించడం లేదు. అదే రీతిలో రాష్ట్రంలో అనేక చోట్ల లక్షలాది మంది పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునేందుకు సన్నద్ధం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
పేదల ఇళ్లకు ఎసరు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కారు కక్ష కట్టింది. గత ప్రభుత్వం కాలనీల్లో, ఇతర చోట్ల పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోని లబ్ధిదారులకు ఆ కేటాయింపులను రద్దు చేయాలని టీడీపీ కూటమి సర్కారు తాజాగా నిర్ణయించింది. అంతేకాకుండా కోర్టు కేసుల్లో ఉన్న ఇళ్ల స్థలాల కేటాయింపులను సైతం రద్దు చేసింది.మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద రైతులకు మేలు చేస్తూ 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన, పట్టా, ఫ్రీ హోల్డ్ భూములపై కూటమి సర్కారు కన్నేసింది. వాటిని ప్రభుత్వ అవసరాల పేరుతో పారిశ్రామిక పార్కులకు, ఇళ్ల స్థలాల కోసం వినియోగించుకోవడంపై వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి ప్రతిపాదనలతో రావాలని జిల్లా ఇన్చార్జీ మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఇక హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారధి మీడియాకు వెల్లడించారు.» వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకోని లబ్ధిదారులకు కేటాయింపులు రద్దు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకోకుంటే వాటిని రద్దు చేసి ఇతర లబ్ధిదారులకు కేటాయింపు. కోర్టు కేసుల్లో ఉన్న స్థలాల కేటాయింపులు రద్దు. నివాసయోగ్యంగా లేక నిర్మాణాలు చేపట్టని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు. » పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని నిర్ణయం. ఇందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఐదు ఎకరాల్లోపు మెట్ట, రెండున్నర ఎకరాల్లోపు మాగాణి ఉన్నవారే ఇళ్ల స్థలాల కేటాయింపులకు అర్హులు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ గృహ నిర్మాణ పథకం కింద గృహ నిర్మాణ రుణాన్ని పొంది ఉండకూడదు.» వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేద రైతులకు మేలు చేస్తూ 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు, పట్టా భూములు, ఫ్రీ హోల్డ్ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడాలని మంత్రివర్గం నిర్ణయం. వీటిని పారిశ్రామిక పార్కులు, ఇళ్ల స్థలాలకు వినియోగించుకోవడంపై వచ్చే కేబినెట్ నాటికి ప్రతిపాదనలు సిద్ధం. రీ సర్వేలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సర్వే చేసి సరిదిద్దాలని నిర్ణయం.» అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన చోట్ల క్రమబద్ధీకరించాలని నిర్ణయం. 15–10–2019 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి వర్తింపు. 150 గజాల వరకు పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ. » పట్టణ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ గడువు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు.» హేతుబద్దీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలు, ఉద్యోగుల సంఖ్య కుదింపు. మూడు కేటగిరీలుగా గ్రామ, వార్డు సచివాలయాల వర్గీకరణ. 3,500 జనాభా పైబడిన సచివాలయాల్లో 8 మంది ఉద్యోగులు, 2500 నుంచి 3,500 జనాభా కలిగిన చోట్ల ఏడుగురు ఉద్యోగులు, 2,500 లోపు జనాభా ఉన్న ఆరుగురు ఉద్యోగులకే సచివాలయాలు పరిమితం. మిగులు ఉద్యోగులను వారి అర్హతల ఆధారంగా ఇతర శాఖల్లో వినియోగించుకోవాలని నిర్ణయం. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు పంచాయితీ సెక్రటరీ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్‌గా ఉంటారు.» ధాన్యం కొనుగోళ్లకు రూ.700 కోట్ల మార్క్‌ఫెడ్ రుణానికి ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం.» ఏపీ ఫెర్రో ఎల్లాయిస్ ఫెడరేషన్ అసోసియేషన్ వినతి మేరకు విద్యుత్ సుంకం రాయితీ మార్చి వరకు పొడిగింపు.» మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటు. » తోటపల్లి బ్యారేజీ హెడ్ స్లూయిస్‌పై కుడివైపు 1.0 మెగావాట్ల మినీ హైడల్ ప్లాంట్ ఏర్పాటుకు హైదరాబాద్‌కు చెందిన మే ఎన్‌కాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీకి ఆమోదం. హెడ్ స్లూయిస్ కుడివైపు 2.7 మెగావాట్ల మినీ హైడల్ ప్లాంట్ కోసం కూడా అదే సంస్థకు ఎన్వోసీ జారీకి ఓకే.» గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నది కుడి మార్జిన్లో 0.9 కి.మీ నుంచి 2.61 కి.మీ వరకు వరద రక్షణ గోడ నిర్మాణ పనులకు రూ.294.20 కోట్లతో పరిపాలన అనుమతులకు ఆమోదం. విజయవాడ వద్ద కృష్ణా నది ఎడమవైపు మార్జిన్లో వరద రక్షణ గోడ నిర్మాణం వల్ల గతేడాది సెప్టెంబరులో 11.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కృష్ణ లంక, రాణీగారి తోట తదితర పల్లపు ప్రాంతాలు సురక్షితం.» కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు 2,595 ఎకరాలు, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు 2,621 ఎకరాలను ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు. -
3 డిమాండ్లపైనా మౌనమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికుల పోరాటమంతా.. ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపి వేయడం.. క్యాపిటివ్ మైన్స్‌ను కేటాయించడం.. సెయిల్‌లో విలీనం చేయడం..! మరి విశాఖ ఉక్కుకు ఊరట దక్కాలంటే ఇందులో ఒక్కటైనా నెరవేరాలి కదా? తమ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం నుంచి రూ.వేల కోట్ల ప్యాకేజీని సాధించినట్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని.. ముడి సరుకు సరఫరాదారుల బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు, ఇతర బెనిఫిట్స్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుకే అది చాలదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.భారీగా బకాయిలు..విశాఖ స్టీలు ప్లాంటు ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌తో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయిపడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్ఎస్ అమలు.. ఇలా మొత్తం రూ. 25 వేల కోట్ల మేర స్టీలు ప్లాంటు లోటు బడ్జెట్లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్ ఇతర బకాయిలు కలిపి రూ.1,600 కోట్ల మేర ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ కోసం రూ.1,000 కోట్ల మేర అవసరం. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌కు ఏకంగా రూ.7 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా ఆరు ర్యాకులు (దాదాపు వంద టన్నులు) బొగ్గు సరఫరా అవుతుండగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజూ తొమ్మిది ర్యాక్‌లు అవసరం. నక్కపల్లి ప్రైవేటు స్టీలు ప్లాంటులో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4–5 ర్యాకులు బొగ్గు అవసరం అవుతుంది. రోజుకు 13–14 ర్యాక్‌ల బొగ్గును ఒక్క రైల్వే లైను ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ప్రైవేట్ సంస్థతో పోటీపడి బొగ్గు సమస్యను పరిష్కరించుకునే అవకాశం విశాఖ స్టీలుకు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న 12 వేల మంది ఉద్యోగుల్లో నాలుగు వేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7 వేల మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్పం..విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈమేరకు అసెంబ్లీలో 2021 మే నెలలో తీర్మానం కూడా చేశారు. పార్లమెంటులో సైతం వైఎస్సార్ సీపీ తన గళాన్ని వినిపించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సైతం తాజాగా స్వయంగా చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ వైఎస్ జగన్ కేంద్రానికి పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోదీ సభలో కూడా వైఎస్ జగన్ దీన్ని ప్రస్తావించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి విశాఖలో భారీ పాదయాత్రను కూడా చేపట్టారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విశాఖ స్టీలు ప్లాంటు ఆర్థిక సమస్యలతో పాటు ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.తాత్కాలిక ఉపశనమం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రుణాలు, పెండింగ్ బకాయిలు కలిపితే సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలి. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్టీయూసీ సొంత గనులు కేటాయిస్తేనే..ప్యాకేజీ వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీఆర్ఎస్ను ఉపసంహరించుకోవాలి. సొంత గనులు ఇవ్వడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయాలి. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ అంతా బూటకం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటన చేయడం బూటకం. దేశంలో అన్ని స్టీల్ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ ప్లాంట్‌కు మాత్రం ఎందుకు ఇవ్వరు? స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. – సీహెచ్ నరసింగరావు, సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
నాటి జగన్ సర్కార్ ఒత్తిడితోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది: కుమారస్వామి
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిన సంగతి తెలిసిందే.. అదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు అధికారికంగా వెల్లడించారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని స్వయంగా కుమారస్వామి చెప్పారు.పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు కరోనా సమయంలో రూ.930 కోట్ల లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిందని కుమారస్వామి తెలిపారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని కుమారస్వామి గుర్తుచేశారు.నాటి నుంచి ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. వైఎస్సార్సీపీ సఫలీకృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, కార్మికుల ఒత్తిడితో చివరికి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం... పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారంప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం -
కుమార్తె స్నాతకోత్సవంపై భావోద్వేగ ట్వీట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
వాట్సాప్ పాలన.. అలాంటి విజన్ కాదుగా!
ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?.... వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు. రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్‌కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్‌లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?. ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్‌కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇస్రో శాస్త్రవేత్తలకు YS జగన్ అభినందనలు
-
మమ్మల్ని గర్వపడేలా చేశావు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘వర్షమ్మకు అభినందనలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని స్పందించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear! pic.twitter.com/8QN5qrGOEe— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025 -
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు వైఎస్ జగన్ అభినందనలు
-
ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan) అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేసిన సందర్బంగా వైఎస్ జగన్.. ఇస్రోను అభినందించారు.ఇస్రో(ISRO) విజయంపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. ఈ ముఖ్యమైన విజయం రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన ముందడుగు వేస్తుంది. ఇస్రోకు అభినందనలు! అంటూ కామెంట్స్ చేశారు.The scientists at @isro have achieved a remarkable milestone with the successful docking of satellites in space. This significant accomplishment is a pivotal step forward for India’s ambitious space missions in the years ahead. Kudos to ISRO!— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025ఇది కూడా చదవండి: ఇస్రో సరికొత్త చరిత్ర.. ఆ మూడు దేశాల సరసన నిలిచిన భారత్ -
పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతా బాగానే ఉందా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండి, చివరికి తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణించినా... ప్రభుత్వం, టీటీడీ పెద్దలు అదేదో చాలా చిన్న అంశమైనట్లు వ్యవహరిస్తున్నారా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి తమ మధ్య విభేదాలు లేవు.. కలసి పని చేస్తున్నామని చెబితే జనం నమ్మాల్సిందేనా?.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు బీఆర్ నాయుడు ఇతర ఉన్నతాధికారులంతా ఎవరిని మోసం చేస్తున్నారు?. ప్రజలనే కాదు.. తమను తాము మోసం చేసుకుంటూ తిరుమలేశుడిని కూడా మోసం చేయడం కాదా!. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ఉదంతం నుంచి వరసగా జరుగుతున్న అనేక సంఘటనలలో అపచారానికి పాల్పడుతున్నది ఎవరు?. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నది ఎవరు?. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌తో పాటు బీఆర్ నాయుడు కూడా బాధ్యత వహించవలసిందే. 👉బీఆర్ నాయుడు(BR Naidu)కు నిజంగా హిందూ సెంటిమెంట్, దైవభక్తి ఉంటే పదవి నుంచి తప్పుకుని దైవ సన్నిధిలో క్షమాపణ కోరి ఉండాల్సింది. ఒకవేళ రాజీనామాకు మొండికేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి నుంచి తొలగించి ఉండాలి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఉప ముఖ్యమంత్రి పవన్ తిరుపతిలో సనాతన హైందవ ధర్మం సక్రమంగా నడవడం లేదని, తిరుమల పుణ్యక్షేత్రానికి అపచారం జరిగిందని ప్రకటించి కూటమి నుంచి వైదొలగి ఉండాల్సింది. బీజేపీ హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్లు నటించడం కాకుండా, తాము ఈ పాపానికి బాధ్యత తీసుకోలేమని ప్రకటించి ఉండాలి. వీరెవ్వరూ ఆ పని చేయలేదు. క్షమాపణల డ్రామా నడిపి, ఛైర్మన్, ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా కూర్చోబెట్టి అతా బాగున్నట్లు కలరింగ్ ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. దీంతో మరణించినవారి ప్రాణాలు తిరిగి వచ్చేసినంతగా పిక్చర్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇదంతా చంద్రబాబు స్టైలే. పైకి సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తూ, లోపల మాత్రం తుతు మంత్రంగా కథ నడిపిస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాటలు(Stampede) జరిగితే పదవుల నుంచి తప్పుకోవడం అనేది నైతిక బాధ్యత. అలా విలువలు పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు!. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట వల్ల 29 మంది మరణిస్తేనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ నాయుడు పదవి ఎందుకు వదలుకుంటారు?. పుష్కరాల తొక్కిసలాట కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే అది తన వరకు వస్తుందని భయపడ్డ చంద్రబాబు ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. తిరుపతి ఘటనలో కూడా ఒక ఐదుగురు చిన్న స్థాయి అధికారులపై చర్య చేపట్టి, తనకు కావల్సిన అధికారి ఒక్కరిని మాత్రం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ డ్రామాలో పవన్ తన వంతు పాత్ర పోషించి రక్తి కట్టించారు. కాకపోతే మధ్యలో బీఆర్ నాయుడు చేతిలో పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ నాయుడుతో సహా అధికారులంతా అంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని టీటీడీ చైర్మన్ మాత్రం పవన్ ఎవరు తనకు చెప్పడానికి అని తీసిపారేశారు. చివరికి ముఖ్యమంత్రి ఒత్తిడితో క్షమాపణ చెప్పినా పవన్ మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా సరిపెట్టుకున్నారు. బీఆర్ నాయుడి దెబ్బకు భయపడి ఆయన ఇతర అధికారుల జోలికి వెళ్లలేదు. ఇక చంద్రబాబు ఎదుటే బీఆర్ నాయుడు, శ్యామలరావులు ఘర్షణ పడ్డారు. దీన్ని తెలుగుదేశం జాకీ మీడియానే ప్రముఖంగా వార్త ఇచ్చింది. ‘నువ్వంటే.. నవ్వు...’ అనుకున్నారని కూడా రాశారు. అసలు తమకు ఏమీ చెప్పడం లేదని చైర్మన్ అంటే.. తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నానని ఈవో అన్నారు. మధ్యలో రెవెన్యూ మంత్రి జోక్యం చేసుకోవడం, చంద్రబాబు వారించడం వంటి సన్నివేశాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ రోజున వీరెవరూ ఖండించలేదు. కానీ.. తదుపరి బి.ఆర్.నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరిలు ఏమీ తెలియనట్లు నటించారు. ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెబితే అది వేరే సంగతి. కాని అసలు గొడవలే లేవన్నట్లుగా మాట్లాడి ఎవరిని ఫూల్స్‌ను చేస్తారు?. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నాయుడు అనడం మరీ విడ్డూరం. కొద్ది నెలలుగా ఈ అపచారానికి పాల్పడుతున్నది కూటమి పెద్దలు కాదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని అబద్దం చెప్పడం అపచారం కాదా? అలాంటిది ఏమీ లేదని శ్యామలరావు తొలుత చెప్పగా, ఆయనతో మాట మార్పించ లేదా? అది అప్రతిష్ట కాదా? ఆ మీదట పవన్ రెచ్చిపోయి సనాతని అంటూ వేషం కట్టి మరింత పరువు తీయలేదా? ఐదేళ్లుగా అసలు తిరుమలనే దర్శించని బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవికి నియమించడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? ఇప్పుడు లోకేష్ మనిషిగా ఉన్నందున బీఆర్ నాయుడును కనీసం పదవి నుంచి తప్పుకో అని చెప్పలేకపోతున్న చంద్రబాబు నిస్సహాయత వల్ల ఇమేజీ దెబ్బతినడం లేదా? జరగని కల్తీకి సంప్రోక్షణ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు మరణిస్తే ఎందుకు అలా ప్రత్యేక పూజలు చేయించలేదు? ఇది అపచారం కాదా? ఈ ఘటన కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని అంకెలతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అబ్బే అదేమీ లేదని బుకాయించడం అవసరమా?. టీటీడీ బోర్డులో ఛైర్మన్‌తో సహా పలువురు బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావుపై ధ్వజమెత్తడం అసత్యమా? ఆయన గుడికి వెళ్తే ఇతర అధికారులు సైతం పలకరించడానికి భయపడ్డారట!. అది ఎందుకు జరిగింది అంటే ఆయనకంటే వెంకయ్య చౌదరే పవర్ ఫుల్ అనే భావం కాదా? టీటీడీలో టెక్నాలజీని వాడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా క్రౌడ్, క్యూలైన్ మేనేజ్ మెంట్ గురించి గూగుల్ అధికారితో సలహాలు తీసుకున్నామని వెంకయ్య చెబుతున్నారు. అది నిజమైతే ఆ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు?. పెద్ద ఘనకార్యం చేయబోతున్నట్లుగా చెప్పేవారు కదా?. ఇక.. అధికారిక సమావేశంలో కూడా కొందరు అనధికారులను ఎలా కూర్చోబెట్టారు.లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన, మరికొందరు తిరుమలలో పెత్తనం చేస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోయారు? తిరుపతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు చెప్పినట్లుగానే టీటీడీ అధికారులు వ్యవహరించారని, ఒక డీఎస్పీ వల్ల తొక్కిసలాట జరిగిందని శ్యామలరావు అంటున్నారు. అంటే టీటీడీ అధికారుల తప్పు లేకపోయినా ఒక మహిళా జేఈవో పై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకున్నారు?. ఎస్పీపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు? ఇవన్ని పక్షపాతంతో చేసిన నిర్ణయాలుగానే కనిపిస్తాయి. ఇదేనా దైవభక్తి ఉన్నవారు చేసేది?. గతంలో జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి సృష్టించి తిరుమలకు అపచారం జరిగిందంటూ చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దారుణ విష ప్రచారం చేసేవి. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? కేవలం టీటీడీ ఛైర్మన్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మనోభావాలు దెబ్బతింటాయా? తిరుమలకు అప్రతిష్ట వస్తుందా? గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై పదమూడు మంది మరణించిన ఘటనలో విదేశాలలో ఉన్న యాజమాన్యం వారిని కూడా అరెస్టు చేయాలని చంద్రబాబు, పవన్ లు డిమాండ్ చేశారా? లేదా?. ఆ ప్రకారమే జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించిందా? లేదా?. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు దెబ్బతగిలేనా తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎందుకు కనీసం ఎవరిపైన కేసు పెట్టలేదు?. కేవలం పదవులు అంటిపెట్టుకుని హిందూ మతానికి తీరని పాపం చేస్తున్నది వీరే అని వేరే చెప్పనవసరం లేదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.