Agenda
-
మోదీ 3.0: తొలి బడ్జెట్లో ఆర్థిక ఎజెండాపై దృష్టి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన ప్రభుత్వం త్వరలో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించనుంది. ఈ నేపధ్యంలో మంత్రి సీతారామన్‌కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన సీతారామన్ తన ఆర్థిక ఎజెండాలో భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే 2047 నాటికి దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చడానికి తగిన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసేదిశగా ముందడుగు వేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ నుండి డివిడెండ్ రూపంలో ప్రభుత్వం అందుకున్న రూ. 2.11 లక్షల కోట్లు దేశ ఆర్థిక స్థితికి మెరుగుదలకు సహాయకారిగా మారినట్లు నిరూపితమయ్యింది.మోదీ 3.0 ప్రభుత్వానికి దేశంలోని వ్యవసాయ రంగంలో ఒత్తిడిని పరిష్కరించడం, ఉపాధి కల్పన, మూలధన వ్యయాల వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక ఏకీకరణ మార్గంలో ఉండటానికి ఆదాయ వృద్ధిని పెంచడం వంటివి కీలకంగా మారనున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీల ప్రైవేటీకరణకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.నిర్మలా సీతారామన్ 2019లో తొలిసారిగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి ఆమె ఈ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశం కోవిడ్ -19 మహమ్మారితో ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటిని సమర్థవంతంగా దాటగలిగింది. -
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల అయ్యింది. కేంద్రం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజ్యసభ, లోక్‌సభలు వేర్వేరుగా బులిటెన్లు విడుదల చేశాయి. ఇందులో భాగంగా.. ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చ జరగనుంది. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనున్నట్లు ఆయా బులిటెన్లు పేర్కొన్నారు. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: 450 మంది పోలీసులకు ప్రధాని విందు -
భారత్ వృద్ధికి సంస్కరణల ఊతం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. 2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే, ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ‘దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు తిరోగమనం–పోకడలు, అంచనాలు–విధానాల’ పేరుతో విడుదలైన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు. ► భారత్ తోటి దేశాల కంటే వేగవంతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, సంస్కరణ ఎజెండాను ముఖ్యంగా తయారీ, మౌలిక రంగంలో వేగవంతంగా అమలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఒత్తిడులను తొలగించాల్సి ఉంది. ఈ విభాగంలో సవాళ్లు దేశ పురోగతికి బ్రేకులు వేస్తున్నాయి. ► 2000–10లో భారత్ పెట్టుబడుల సగటు వార్షిక వృద్ధి 10.5 శాతం అయితే, 2011–21లో ఈ రేటు 5.7 శాతానికి పడిపోయింది. ► విద్యుత్, రోడ్డు, రైలు నెట్వర్క్, వ్యాపారాలకు ఎదురవుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల వంటి బలహీనతలు వంటి అంశాలు భారత్ ఎకానమీకి అవరోధాలుగా ఉన్నాయి. ► కోవిడ్–19తో ఎదురవుతున్న పరిణామాలు ప్రపంచ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ► భౌగోళిక ఉద్రిక్తతలూ ప్రపంచ వృద్ధి తిరోగమనానికి దారితీస్తున్నాయి. ► పెట్టుబడుల్లో వృద్ధి క్షీణిస్తోంది. ప్రపంచ శ్రామిక శక్తి మందకొడిగా పెరుగుతోంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల మానవ వనరుల నైపుణ్య కొరత ఎదురవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వృద్ధి.. జీడీపీ పురోగతికి తగిన విధంగా సరిపోవడం లేదు. -
భారత్‌పై బిలావల్ ఆక్రోశం
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను పాలస్తీనాతో పోలుస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘రెండుచోట్లా పరిస్థితులు ఒక్కటే. రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటికీ పరిష్కరించలేదు. కశ్మీర్‌ను ఐరాస ప్రధాన ఎజెండాలోకి తీసుకురాకుండా భారత్ పదేపదే అడ్డుపడుతోంది’’ అంటూ వాపోయారు. భారత్‌ను గురించి మాట్లాడే క్రమంలో ఒకసారి మిత్రదేశం, మరోసారి పొరుగుదేశం అంటూ ఆయన తడబాటుకు గురయ్యారు. -
మోదీ శంఖారావం
న్యూఢిల్లీ: ఏడాదిన్నర ముందే ప్రధాని మోదీ ఎన్నికల శంఖం పూరించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు కేవలం 400 రోజుల దూరంలోనే ఉన్నాయి. ఇక టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. చరిత్ర సృష్టిద్దాం పదండి’’ అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చివరి రోజైన మంగళవారం కీలకాంశాలపై లోతైన చర్చ జరిగింది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన 350 మంది బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, సీఎంలు కూలంకషంగా చర్చించారు. చివరగా మోదీ కీలకోపన్యాసం చేశారు. భావి కార్యాచరణపై నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అతి విశ్వాసానికి ఎక్కడా చోటివ్వొద్దని హెచ్చరించారు. ‘‘బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు... ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కండి. ఎన్నికల లబ్ధి గురించి ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం పాటుపడండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా, ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా ప్రత్యేక కార్యక్రమాలు, మోర్చాలు నిర్వహించండి. అక్కడి ప్రజలకు మరింత చేరువ కండి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా అక్కడికీ చేరవేయండి. సరిహద్దు గ్రామాల యువతను బీజేపీ కార్యకర్తలుగా తీర్చిదిద్దండి. తద్వారా అక్కడా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయండి. 18–25 ఏళ్ల యువతకు దేశ రాజకీయ చరిత్ర తెలియదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, తప్పిదాలు తెలియవు. వీటన్నింటిపైనా వారికి అవగాహన కల్పించండి. అంతటి దుష్పరిపాలనను బీజేపీ ఎలా సుపరిపాలనగా మార్చి చూపించిందో యువతలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని సూచించారు. ‘‘రానున్నది మన దేశానికి అత్యుత్తమ సమయం. వచ్చే పాతికేళ్ల అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకుని కష్టపడితేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. ప్రజలకు సేవ చేసేందుకు అన్ని విధాలుగా కష్టపడదాం’’ అన్నారు. ‘‘అతి విశ్వాసానికి పోతే ప్రతికూల ఫలితాలు తప్పవు. 1998లో మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా బీజేపీ కేవలం అతి విశ్వాసం వల్లే ఓడింది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం’’ అంటూ నేతలను హెచ్చరించారు. మోదీ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా మాత్రమే గాక సరికొత్త దిశానిర్దేశం చేసేదిగా సాగిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రసంగ విశేషాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ సాకారానికి కృషి చేయాల్సిందిగా బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. పార్టీ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తూ రాజకీయ నాయకునిగా గాక రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రసంగం సాగింది’’ అని ఫడ్నవీస్ చెప్పారు. ధర్తీ బచావో... పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. ‘‘బేటీ పఢావో మాదిరిగా ధర్తీ బచావో (భూమిని కాపాడండి) ఉద్యమానికి శ్రీకారం చుడదాం. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకుందాం. కాశీ–తమిళ సంగమం తరహాలో భిన్న సంస్కృతులను, ప్రాంతాలను కలిపే వారధిగా పార్టీని తీర్చిదిద్దుకుందాం’’ అని సూచించారు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలొద్దు: మోదీ సినిమాలు తదితర అంశాలపై అనవసర ప్రకటనలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలను, శ్రేణులను మోదీ ఆదేశించారు. ‘‘ఏదో సినిమా గురించి మనవాళ్లలో ఎవరో ఏదో అంటారు. టీవీల్లో, మీడియాలో రోజంతా అదే వస్తుంది. అభివృద్ధి అజెండా తదితర అసలు విషయాలన్నీ పక్కకు పోతాయి. అందుకే అనవసర వ్యాఖ్యలేవీ చేయకండి’’ అని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయాన్ని కించపరిచారంటూ దాని బహిష్కరణకు నరోత్తం మిశ్రా, రామ్ కదమ్ తదితర బీజేపీ నేతలు, మంత్రులు బహిరంగంగా పిలుపునివ్వడం, దానిపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. -
KCR BRS: కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు.. బిజీబిజీగా కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమం, ఉత్తరాది రాష్ట్రాల్లో కలిసొచ్చే పార్టీలు, సంఘాలు, పార్టీ ప్రధాన ఎజెండా తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాదికి చెందిన నేతలు, రైతు సంఘాల నాయకులతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు, రైతులే కీలకం కావడంతో.. వారి ఎజెండాతోనే ముందుకు పోవాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమ నిర్మాణం, వ్యవసాయ కేంద్రీకృత అంశాలపై విస్తృత చర్చలు జరుపుతున్నారు. ధాన్యం సేకరణ, గోధుమ సాగుపై చర్చలు రైతు ఎజెండానే తమ తొలి ప్రాధాన్యమని చాటేలా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్)ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి అధ్యక్షునిగా రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీని కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. తన నియామకంపై కృతజ్ఞతలు తెలియజేసేందుకు.. గుర్నామ్ సింగ్‌తో పాటు పంజాబ్, హరియాణాకు చెందిన రైతులు గురువారం తుగ్లక్ రోడ్డులోని సీఎం అధికారిక నివా సంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి ధాన్యం సేకరణ, దానికి అనుసరిస్తున్న విధానాలు, గోధుమల సాగు లో తలెత్తే సమస్యలు, పంట వ్యర్ధాల దహనం, ప్రభుత్వ విధానాలు, తదితర అంశాలపై చర్చించారు.పంటల సేకరణలో జాతీయ విధానం, మద్దతు ధరలు, వ్యవసాయంలో సంప్రదాయ దేశీయ పద్ధతులకు ప్రోత్సాహం వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. సాగు నీటి రంగంలో తెలంగాణ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, విద్యుత్ సంస్కరణలు, వివిధ వృత్తుల వారికి సామాజిక భద్రత వంటి అంశాలపై మాట్లాడినట్లు చెబుతున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులనే జాతీయ స్థాయి లో అమలు చేసేలా ఎజెండాను రూపొందిద్దామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒవైసీ భేటీ.. కుమార్తె వివాహానికి ఆహ్వానం! మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఏర్పాటుపై ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ స్థాయిలో కలిసి ఉద్యమించే అంశాలు, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన విషయాలపై ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రెండోరోజు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర సందర్శకుల రాకతో ఆయన బిజీబిజీగా గడిపారు. తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన రైతు సంఘాల నేతలు, ప్రముఖులను పలుకరించిన ముఖ్యమంత్రి వారితో ఫొటోలు దిగారు. సందర్శకుల తాకిడితో తుగ్లక్ రోడ్డు పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిశాయి. ఇలావుండగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి పయనమైన నేతలకు విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపించాయి. గరిష్టంగా రూ.50 వేల వరకు పలకడంతో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఉద్యమ కార్యాచరణపై త్వరలో ప్రకటన! రాజస్థాన్‌కు చెందిన రాష్ట్రీయ్ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) నేషనల్ కన్వీనర్, ఎంపీ హనుమాన్ బేనివాల్, ఒడిశాకు చెందిన రైతు సంఘం నేత అక్షయ్ కుమార్, జహీరాబాద్‌కు చెందిన రైతు నేత ఢిల్లీ వసంత్‌లు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల విధానాలు, చేయాల్సిన సంస్కరణలు వంటి అంశాలపై లోతుగా చర్చించారు. రైతు సంబంధిత అంశాలపై వివరాలను సేకరించిన కేసీఆర్.. త్వరలోనే పార్టీ తరఫున జాతీయ స్థాయి సమావేశం నిర్వహణ, తదనంతరం ఢిల్లీ వేదికగా చేసే ఉద్యమ కార్యాచరణపై ప్రకటన చేద్దామని చెప్పినట్లు తెలిసింది. ఇదీ చదవండి: స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం! -
Amaravati: రాజధాని అను ఒక ‘రియల్’ ఎజెండా
పునర్వ్యవస్థీకరణ అనంతరం, కొత్తగా ఏర్పడ బోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం శివరామకృష్ణన్ చైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. కమిటీ సభ్యులలో అందరూ సంబంధిత రంగంలో నిపుణులే. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివి : విజిటిఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోయాయి కనుక నీటి వనరులు, రవాణా, రక్షణ, చారిత్రక అంశాల ఆధారంగా రాజధాని నిర్మాణ ప్రదేశం ఎంపిక చేయాలి. విశాఖపట్నంలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయవచ్చు. నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండవలసిన అవసరం లేదు. విశాఖపట్నంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి. విశాఖపట్నంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఇంత స్పష్టంగా శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను అందించినప్పటికీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివేదికను బుట్టదాఖలు చేసి, తన ‘రాజకీయ గురువు’ సూచించిన ‘అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అందులో భాగంగా 2014 జూలై 14న ‘నారాయణ కమిటీ’ని నియమించారు. ఆ కమిటీలో సభ్యులను చంద్రబాబు ప్రభుత్వమే నియమించింది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్ చౌదరి, మండవ ప్రభాకర్ చౌదరి, మరో ఐదుగురు సభ్యులతో ఆ కమిటీ ఏర్పడింది. అనంతరం రాజధాని ఏర్పాటుపై లీకులు మొదలయ్యాయి. నారాయణ కమిటీ రిపోర్టు పేరుతో దొనకొండ, నూజివీడు, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రాంతం ఉండవచ్చని ప్రచారాలు మొదలు పెట్టారు. అది నమ్మి కొందరు దొనకొండ, నూజివీడుల్లో వేల ఎకరాల భూములు కొని మోసపోయారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు, ఆయన సామాజిక వర్గ నేతలు మాత్రం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రాంతంలో భూములు కొన్నారు. మొదట నాగార్జున యూనివర్సిటీ దగ్గర, విజయవాడ–గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని రావచ్చని చంద్రబాబు తనకు చెప్పారని నక్కా ఆనంద్‌బాబు ఏబీఎన్ ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. తర్వాత స్వయంగా చంద్రబాబే నర్మగర్భంగా గుంటూరు–విజయవాడ మధ్య రాజధాని వస్తుందని 2014 సెప్టెంబర్ 4న శాసనసభలో ప్రకటించారు. 2014 డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. కానీ 2014 సెప్టెంబర్‌లోనే కొంతమంది చంద్రబాబు అనుయాయులు 29 గ్రామాల పరిసరాల్లోని భూములు కొని అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు! ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్‌కు ముందే జరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి నిర్మాణం పేరుతో 34,000 ఎకరాల భూ సేకరణకు పూనుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని శాసన సభ, శాసన మండలి, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను 200 ఎకరాల్లోనే ఉంచడం గమనించాల్సిన విషయం. ఏపీసీఆర్డీఏ యాక్ట్ ఫామ్ 9.14 బీ ప్రకారం ల్యాండ్ పూలింగ్‌లో ఒక్కో ఎకరానికి 250 సెంట్లు అభివృద్ధి చేసిన ప్లాటు ఇచ్చే విధంగా రైతులతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రకటనకు ముందు సీఆర్డీఏ ప్రాంతంలో ఎకరం రూ.15 లక్షలు ఉండేది. అయితే ‘హ్యాపీనెస్ట్’ పేరుతో జరిగిన విక్రయాల్లో ఎకరానికి రూ.10 కోట్ల రేటుకు సీఆర్డీఏ అమ్మింది. అంటే ల్యాండ్ పూలింగ్‌లో భూమి ఇచ్చిన ప్రతి రైతు ఎకరానికి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లేగా! ఇందులో త్యాగం ఎక్కడుంది? 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దండరాయని పాలెంలో రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకు హాజరు కాలేకపోవటానికి కారణాలు చూపుతూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15నే చంద్రబాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న విధానం, కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా ఇస్తూ సీఆర్డీఏ 42 శాతం తీసుకోవటంలో ఉన్న స్కామ్‌ను తెలియ జేస్తూ.. చంద్రబాబు తన వర్గాన్ని బినామీలుగా పెట్టుకుంటూ భూదోపిడీకి పాల్పడుతున్నందున శంకుస్థాపనకు తనను ఆహ్వానించవద్దని నిర్మొహమాటంగా తెలియజేశారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) గుంటూరు–విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చింది. నవ నగరాల నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అమరావతిలో చంద్రబాబు 5 ఏళ్లలో కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు (ఇందులో సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది). అంటే ప్రతి సంవత్సరం పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుంటే రాజధాని నిర్మాణానికి మరో 100 ఏళ్లు పడుతుంది. అయితే రాజధానిని ఆర్నెల్లలో పూర్తి చేయాలని 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని భూ యజమానులకు చెందిన పునర్నిర్మిత ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనీ; అమరావతి రాజధాని నగరంలో నివాసానికి అనువుగా ఉండేలా అప్రోచ్ రోడ్లు, తాగునీరు, ప్రతి ప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్, డ్రైనేజీ మొదలైనవి ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది! (క్లిక్ చేయండి: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు) - పొనకా జనార్దన రెడ్డి మహా ప్రశాసకులు, ఏపీ ప్రభుత్వం -
కశ్మీర్‌కు రాష్ట్ర హోదానే ఎజెండా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా తమ కొత్త పార్టీ ఎజెండాలో ప్రధానంగా ఉంటుందని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని వర్గాలను కలుపుకుని పోతామని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆయన ఇటీవల రాజీనామా చేయడం తెలిసిందే. జమ్మూ శివారులోని సైనిక్ కాలనీలో ఆదివారం మొట్టమొదటి ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం, నివాసితులకు భూ, ఉద్యోగ హక్కుల కల్పన వంటివి కూడా తమ ఎజెండాలో ఉంటాయన్నారు. కొత్త పార్టీ పేరు, జెండా వంటి వాటిని ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. ఉగ్రవాదుల టార్గెట్ కిల్లింగ్స్‌పై ఆయన మాట్లాడుతూ ఇటువంటి వాటిని ఇకపై ఆపేయాలన్నారు. లోయకు తిరిగి రావాలనుకునే వారికి భద్రత, వసతులు కల్పిస్తామని చెప్పారు. ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆప్‌ని పార్టీ, పీడీపీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. -
2014 బీజేపీ మేనిఫెస్టోలో హోదా అంశం ఉందా? లేదా?
-
కమల్ ఎన్నికల ఎజెండా.. మహిళా సంక్షేమానికి పెద్దపీట
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ బుధవారం తన పార్టీ ఎన్నికల ఎజెండాను వెల్లడించారు. మహిళల సంక్షేమానికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహిళ రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామీణ బ్యాంక్‌లను మహిళా పథకాల ఆధ్వర్యంలో నిర్వహించేలా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తాని ఎంఎన్ఎం పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది. ఆయన బుధవారం రాత్రి ఓ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కమల్ హాసన్ ఇటీవల తనకు మద్దతు పలకాలని పలువురు సినీ ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌తో పాటు ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారు చేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అదే విధంగా ఆ కూటమి సీఎం అభ్యర్థిని తనే అని వెల్లడించారు. ఇక 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ! -
ఎజెండాకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశా లను ఒక్కోరోజు చొప్పున మాత్రమే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం శాసనసభ, బుధ వారం శాసనమండలి భేటీ జరగనుంది. భేటీ ఒకరోజు మాత్రమే కాబట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఎజెండాను మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో శాసనసభ, మండలి సమావేశ మందిరాల్లో సీటింగ్ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణంతో పాటు, సభ లోపల కూడా పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయించా లని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహా చార్యులను ఆదేశించారు. ఏర్పాటు చేయా ల్సిన బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్లతో ఫోన్ ద్వారా సమీక్షించారు. అవసరమైన సమాచా రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఫోన్లో సూచించారు. ఎజెండా అంశాలే... మంగళవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమై నేరుగా ఎజెండాపై చర్చిస్తుంది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో నాలా, రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ 1955 చట్టాలను సవరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ మూడు చట్టాలకు సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వీటిపై చర్చించి ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్ వాయిదా వేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మండలి... శాసనసభ ఆమోదించిన బిల్లులను చర్చించి ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. అనుమానితులకు కరోనా పరీక్షలు ఉభయ సభల ప్రాంగణాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమ య్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు కరోనా లక్షణాలు న్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయిం చుకోవాలని మండలి చైర్మన్ గుత్తా, శాసన సభ స్పీకర్ పోచారం సూచించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులివే... ►వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు చేస్తారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నాలా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేయాలనే సవరణ కూడా చేస్తారు. ►రెవెన్యూ చట్టంలోని సవరణలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చట్టానికి కూడా స్వల్ప సవరణ చేస్తారు. ►జీహెచ్ఎంసీ చట్టం – 1955కు సవరణ చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పాల కమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతి నిధ్యానికి చట్టబద్ధత కల్పిస్తారు. వార్డు కమిటీల పనివిధానం, వార్డుల రిజర్వేషన్ రొటేషన్‌ను రెండు పర్యాయాలకు మారుస్తూ చట్ట సవరణ చేస్తారు. -
ఐపీఎల్ అజెండాగా...
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో గత వారమే క్రికెట్ మొదలైంది. ఇక భారత్‌లో ఆటల గంట మోగాల్సివుంది. అందరి కళ్లు ఐపీఎల్ మీదే ఉన్నాయి. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన ఈ ఈవెంట్‌పైనే గత కొన్నాళ్లుగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆసీస్‌లో టి20 ప్రపంచకప్‌కు అవకాశం లేకపోవడంతో ప్రధానంగా ఐపీఎలే అందరి నోటా నానుతోంది. ఇక ఈ నాన్చుడు ధోరణికి ఫుల్స్టాప్ పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా నిర్ణయించుకున్నట్లుంది. అందుకే శుక్రవారం జరిగే బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఐపీఎల్ అజెండాగా మారింది. ఎక్కడివారక్కడినుంచే పాల్గొనే ఈ ‘వర్చువల్ మీటింగ్’లో మొత్తం 11 అంశాలపై బోర్డు చర్చించనుంది. లీగ్‌తో వేలకోట్ల ఆర్థికాంశాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రధానంగా ఐపీఎల్‌పైనే చర్చిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మహమ్మారి బారిన పడి మూలన పడిపోయిన దేశవాళీ క్రికెట్, భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) తదితర అంశాలపై కూడా చర్చిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. భారత్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ (2021)కు పన్ను మినహాయింపు, బెంగళూరులోని ఎన్సీఏలో సౌకర్యాల పెంపు, డిజిటల్ కాంట్రాక్టుల పొడిగింపు, బీహార్ సంఘం వ్యవహారం, బీసీసీఐలో సిబ్బంది నియామకం, కొత్త సీఈఓ నియామకం, ఈశాన్య క్రికెట్ సంఘాలకు చెల్లింపులు, భారత జట్ల దుస్తుల టెండర్లపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఇటీవల బోర్డు అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని, విధిలేని పరిస్థితుల్లోనే శ్రీలంక, యూఏఈ వేదికల్ని పరిశీలిస్తామన్నారు. అయితే బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మీటింగ్‌లో ఏకంగా వేదికనే ఖరారు చేస్తామని భావించడం లేదు. అందుబాటులో ఉన్న అవకాశాలు, నిర్వహణకు సానుకూలతల్ని బేరీజు వేస్తామనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఐసీసీ... టి20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం ప్రకటించలేదు. ఇలాంటి స్థితిలో ఏకంగా షెడ్యూలునే ఆశించడం ఆత్యాశే అవుతుంది’ అని అన్నారు. వచ్చే సోమవారం జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో మెగా ఈవెంట్‌పై నిర్ణయం వెలువడే అవకాశముంది. -
మోదీ అజెండాలో ముందున్న అంశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచే పార్టీ ఎజెండాలో పేర్కొన్న ఒక్కొక్క అంశాన్నే ప్రజల ముందుకు తీసుకొచ్చి పరిష్కరిస్తుందని రాజకీయ పండితులు ముందుగానే భావించారు. దాన్ని నిజం చేస్తూ మోదీ ప్రభుత్వం, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఊహించిన దానికన్నా ముందే అయోధ్య వివాదాన్ని తీసుకొచ్చి కోర్టు సహకారంతో పరిష్కరించింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ అది ఇంత సులభంగా సాధ్యం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ఇప్పుడు బీజేపీ అజెండాలోని ఏ అంశాలు పరిష్కారానికి ముందుకు రానున్నాయి. అసోం నుంచి బంగ్లాదేశ్ ముస్లిం శరణార్థులను వెనక్కి పంపించేందుకు చేపట్టిన కసరత్తు గత రెండు, మూడేళ్లుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. దాదాపు 20 లక్షల మంది ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా అస్సాంలో ఉంటున్నట్లు ‘జాతీయ పౌరసత్వం నమోదు’ కార్యక్రమం తేల్చింది. అంటే వారంతా అసోం స్థానిక పౌరులమని నిరూపించుకోలేక పోయారు. వారి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలే కాకుండా బెంగాల్ నుంచి వచ్చిన ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. ముస్లింలకు మినహా మిగతా మతస్థులకు భారత పౌరసత్వం కల్పించి, ముస్లింలను బంగ్లాదేశ్‌కు పంపించాలన్న బీజేపీ అజెండా. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధం చేసింది. దాన్ని ఆమోదించి, ముస్లింలను వెనక్కి పంపించే ప్రక్రియను ఇప్పుడు చేపట్టాల్సి ఉంది. ముస్లిం మహిళల కోసం ‘ట్రిపుల్ తలాక్’ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని మతాల వారికి వర్తించే ‘ఉమ్మడి పౌర స్పృతి’ని తీసుకురానుంది. అప్పుడు ఇప్పుడున్నట్లుగా ముస్లింలకు ప్రత్యేక వివాహ చట్టాలు ఉండవు. ఆ తర్వాత పటిష్టమైన మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకరానుంది. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఈ చట్టాలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో లేదు. హిందువులైన దళితుల్లో ఎక్కువ మంది క్రైస్తవంలోకి మారుతున్నందున దాన్ని నివారించడం కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తానని బీజేపీ మొదటి నుంచి చెబుతోంది. ఇది సరే, పార్టీ అజెండా అమలు చేయడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిన బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక దుస్థితిపై దృష్టిని కేంద్రీకరించక పోవడంతో అది మరింతగా దిగజారుతోంది. దేశంలో గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 6.1 శాతంతో గరిష్ట స్థాయికి చేరుకుందని నివేదికలు పేర్కొన్నాయి. అయినా సరైన చికిత్సా చర్యలు లేకపోవడంతో ఆ సమస్య ఇప్పుడు దాదాపు 8 శాతానికి చేరుకుంది. -
కేబినెట్ అజెండాపై స్క్రీనింగ్ కమిటీ భేటీ
-
ఇదేంది చైర్మన్ గారూ..!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్(వైఎస్సార్) : ఐదు రోజుల క్రితం టీడీపీ 30వ వార్డు కౌన్సిలర్ సీతారామిరెడ్డిని ఫిబ్రవరి, మార్చి నెలల కౌన్సిల్ సమావేశాలకు రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి ప్లేటు ఫిరాయించడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28వ తేదీన కౌన్సిల్ సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్‌కు దిక్కుతోచలేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఈ కౌన్సిల్ సమావేశమే చివరిదిగా చెప్పుకుంటున్నారు. దీంతో కోరం లేక వాయిదా పడిన సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అత్యవసర కౌన్సిల్ సమావేశంగా ఏర్పాటు చేసినట్లు అజెండా రూపొందించి సోమవారం పంపిణీ చేశారు. సస్పెండ్ రద్దు మొదటి అంశంగా... అయితే ఈ అజెండాలో మొదటి అంశంగా సస్పెం డ్ అయిన టీడీపీ కౌన్సిలర్ జి.సీతారామిరెడ్డిని సస్పెండ్ నుంచి తొలగించేందుకు కౌన్సిల్ ముం దుంచారు. జనవరి 31న జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్ ప్రవర్తనకు చైర్మన్ మున్సి పల్ యాక్ట్, 1965 సెక్షన్ 51–5 ప్రకారం రెండు నెలలు సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 27న నోటీసులు జారీ చేశారు. అయితే కౌన్సిలర్ 28న జరిగే కౌన్సిల్ స మావేశంలో సభ్యుల నిర్ణయానికి ఉంచాలని కోరా రు. కానీ ఎలాగైనా సీతారామిరెడ్డిని కౌన్సిల్ సమావేశానికి రాకుండా చేయాలని అజెండాలో ఈ అం శాన్ని చేర్చలేదు. కౌన్సిల్ సమావేశానికి ఎవ్వరూ రాక వాయిదా పడటంతో చైర్మన్ మార్చి నెల సమావేశం మొదటి అంశంగా చేర్చాలని చెప్పారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా సస్పెండ్ చేయడమేంటి సారూ.. కౌన్సిల్ సభ్యున్ని రెండు, మూడు నెలలు సస్పెండ్ చేయాలంటే సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన మరుసటి సమావేశంలో కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని చట్టం చెబుతోంది. అయితే అదేదీ తమకు వర్తించదన్నట్లు, రెండు నెలలు సస్పెండ్ చేసిన చైర్మన్ వారం రోజులకే కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అజెండాలోకి తీసుకురావడంపై తోటి కౌన్సిలర్లు నవ్వుకుంటున్నారు. తప్పుడు విధానాల్లో సస్పెండ్ చేసిన చైర్మన్, కమిషనర్లపై కోర్టులో పరువునష్టం దావా వేస్తామని కౌన్సిలర్ సీతారామిరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నారని కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరైన కౌన్సిలర్లు అంటున్నారు. ముక్తియార్ మాటపై నిలబడతారా... టీడీపీ కౌన్సిలర్ సీతారామిరెడ్డిని సస్పెండ్ చేసిన సందర్భంలో కౌన్సిలర్ ముక్తియార్ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఇక తాము ఏ కౌన్సిల్ సమావేశాలకు వెళ్లమని, అన్నీ రిక్విజేషన్ సమావేశాలే నిర్వహిస్తామని చెప్పారు. ఇదే విధంగా మంగళవారం జరిగే సమావేశానికి ఎంపీ రమేశ్ వర్గం టీడీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా మాట నిలబెట్టుకుంటారా, లేక అంతా ఉత్తుత్తి ప్రకటనలేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మెజారిటీ లేకుండానే ర్యాటిఫై... చైర్మన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని కొన్ని అంశాలను ర్యాటిఫై చేయాలని అనుకుంటే మెజారిటీ కౌన్సిల్ సభ్యులు తన వర్గంలో ఉండాలి. అప్పుడు ఆ అంశం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పోతుంది. అయితే ఈ చైర్మన్ వర్గంలో 9 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ రమేశ్ వర్గంలో 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ రెండో అంశంలోని రూ.39.88 లక్షల పనికి, 3వ అంశంలోని రూ.39 లక్షల పనికి, 6వ అంశంలోని రూ.39 లక్షల పనికి దాదాపు రూ.కోటికిపైగా పనులకు ర్యాటిఫై చేశారు. మరి కౌన్సిల్ సభ్యులు ఈ అంశాలను రద్దు చేయాలనో, వాయిదా వేయాలనో కోరితే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. చైర్మన్ చర్యలపై భగ్గుమంటున్న టీడీపీ కౌన్సిలర్లు ఈ అంశాలను ఆమోదిస్తారో లేదో వేచి చూడాలి. -
కమల్ పార్టీ ప్రధాన ఎజెండా ఏంటంటే...
సాక్షి, చెన్నై : సీనియర్ నటుడు, కమల్ హాసన్ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైపోయారు. వచ్చే బుధవారం పార్టీ పేరుతోపాటు పలు కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే తన పార్టీ అసలు ఎజెండా ఏంటో ఇప్పుడు ఆయన వివరించే పనిలో నిమగ్నమయ్యారు. తమిళ వారపత్రిక ఆనంద వికటన్‌లో ఈ మేరకు ఆయన ఓ వ్యాసం రాశారు. ‘రైతన్నల సమస్యల పరిష్కారం- ఆ దిశగా పోరాటం’ తన పార్టీ ప్రధాన ఉద్దేశ్యమని కమల్ ప్రకటించేశాడు. ‘‘తమిళనాడులో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. అభివృద్ధి పేపర్ల మీద తప్ప ఆచరణలో కనిపించటం లేదు. ఇక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం కలిసి రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున రైతులు దీక్షలు చేసినా.. దేశం మొత్తం చర్చించుకున్నా ప్రభుత్వాల్లో కదలికలు రాలేదు. అందుకే ఆ అంశాన్ని పార్టీ ప్రధాన ఎజెండాగా ఎత్తుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా’’ అని కమల్ వివరించారు. ఇక అమెరికా పర్యటనలో భారత వ్యాపారవేత్తలతో భేటీ అయిన విషయాలను కూడా ఆయన వెల్లడించారు. ‘తమిళనాడు వ్యవసాయ రంగం గురించి భారత వ్యాపారవేత్తలతో చర్చించా. గ్రామాల అభివృద్ధికి వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగానో, విద్యాలయాలకు కేంద్రంగానో భావించవద్దని విజ్ఞప్తి చేశా. అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు’ అని కమల్ వివరించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను, వ్యవసాయాన్ని సజీవంగా సమాధి చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని... అందుకే తన పోరాటాన్ని(రాష్ట్ర పర్యటన) గ్రామాల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. తమిళనాడులోని గ్రామాలన్నింటిని స్వర్గధామంగా చూడటమే తన కల అని కమల్ ఆ వ్యాసంలో వెల్లడించారు. -
అభివృద్ధి లేదు... సొంత ఎజెండానే!
ప్రభుత్వాల తీరుపై చుక్కా రామయ్య సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో గెలిచిన రాజకీయ పార్టీలు, గద్దెనెక్కాక సొంత ఎజెండాలనే తెరపైకి తెస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అన్నారు. దళిత వర్గాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ప్రకటన నిమిత్తం గురువారం ఇక్క డ జరిగిన టీఎస్‌యూటీఎఫ్ సమావేశంలో రామయ్య మాట్లాడా రు. ప్రస్తుతం అసెం బ్లీలో రాజకీయాల భాష మారిపోయిందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా రాజకీయ నాయకులకు తామేమీ తీసిపోలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి... వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పి.మాణిక్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి ప్రకటించారు. టీఎస్‌యూటీఎఫ్‌తో పాటు ఎస్టీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, ఎయిడెడ్, కాంట్రాక్ట్ టీచర్స్, యూనివర్సిటీ టీచర్స్ తదితర సంఘాలన్నీ మాణిక్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా మద్దతు పలికాయన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి చావ రవి పాల్గొన్నారు. -
అక్రమాలే టీడీపీ అజెండా
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజం గుంటూరు (పట్నంబజారు): కేవలం దోచుకోవడం, దాచుకోవడమే పనిగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గుంటూ రు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి, అక్రమాలే సింగిల్ ఏజెండాగా చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోందని, ప్రత్యేక హోదా విషయంలో సైతం రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రం విడిపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, విభజన వద్దని ఆనాడే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదు సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఎన్నికల సమయంలో మాట్లాడిన చంద్రబాబు ఈరోజు హోదా సంజీవినా అని అనడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే, నేటి ప్రభుత్వం దాన్ని సరిగా అమలు చేయకుండా ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు.. వైఎస్సార్సీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు యువజన విభాగం కృషిచేస్తుందని జక్కంపూడి రాజా అన్నారు. ఆగస్టు 2వ తేదీన పార్టీ అధినేత వైఎస్. జగన్ పిలుపు మేరకు నిర్వహించనున్న బంద్ కార్యక్రమంలో యువజన విభాగం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. -
ఏదీ.. మావోయిస్టుల ఎజెండా?
ఖమ్మం: మావోయిస్టుల ఎజెండాయే మా ఎజెండా అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు ప్రజా ఉద్యమాలు, ప్రజలను హత్యలు చేయిస్తున్నారని.. హక్కుల సంఘాల గొంతుకలను నొక్కుతున్నారని మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా 'సాక్షి' కార్యాలయానికి బుధవారం పంపిన లేఖలో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏడాది దాటినా మావోయిస్టుల ఎజెండా ఎక్కడ అమల చేస్తున్నారని కిరణ్ లేఖలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పెట్టుబడిదార్ల తొత్తుగా మారి పోలవరం, కంతనపల్లి, ఇనుప గనుల తవ్వకాలు, మైనింగ్ మాఫియా, ఓపెన్‌కాస్ట్ గనులు, హైడల్ ప్రాజెక్టు, విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణానికి పూనుకుంటూ విదేశీ పెట్టుబడులు, బహుళజాతి గుత్త సంస్థలకు ఎర్రతివాచీ పరచి స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఉస్మానియాలో విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా ప్రకటన చేసి గతంలో విద్యార్థులు చదువుకోవడానికి, ఉండటానికి కేటాయించిన భూములను ఆక్రమించుకో చూశారని ఆరోపించారు. విద్యార్థులకు పోలీసుల రుచిని చూపించాడని పేర్కొన్నారు. భారతదేశ ప్రజల విముక్తి కోసం పీడిత ప్రజలను ఐక్యం చేసి ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో పాలకుల కుట్రలు, కుతంత్రాలు, ప్రజాయుద్ధంలో నేలకొరిగిన అమరులను స్మరించుకుంటూ ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు జరుగుతున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని కిరణ్ పిలుపునిచ్చారు. -
వాడీవేడిగా రాజమండ్రి నగరపాలక సమావేశం
రాజమండ్రి : రాజమండ్రి నగరపాలక సంస్థ సాధారణ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే, ప్రారంభంలోనే సభలో వాగ్వివాదం చోటు చేసుకుంది. అజెండాలో పుష్కరాలకు సంబంధించిన అంశాలకు చోటు కల్పించకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రశ్నించారు. ఆ అంశానికి చోటు కుదరదంటూ టీడీపీ సభ్యులు వాదనకు దిగారు. దీంతో సమామేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. -
'బీజేపీకి విజన్, అజెండా అంటూ లేవు'
భారతీయ జనతా పార్టీకి విజన్ కాని, ప్రత్యేక అజెండా అంటూ ఏం లేవు అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ వాళ్లు చివరికి మేనిఫెస్టో కూడా విడుదల చేయలేకపోయారంటూ ఆ పార్టీపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. మేనిఫెస్టో అనేది విడుదల చేయడానికి వెనుకంజ వేస్తున్న బీజేపీ... ఎన్నికల తర్వాత ప్రజలకు ఏం మేలు చేయగలుగుతుందంటూ ఎద్దేవా చేశారు. 'బీజేపీ లేక ఇతర ఏ పార్టీ అయినా సరే వారు అడిగితే నేను ఐదు ప్రశ్నలకేంటి... వెయ్యి ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వగలను' అంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇతర రాజకీయ పార్టీలకు సవాలు విసిరారు. -
ప్రజా సమస్యలే అజెండా.....
ప్రజల కష్టాలను అన్నలా అర్థం చేసుకుని స్నేహితునిగా తోడు నిలుస్తూ పార్టీలకు అతీతంగా తన వంతు సహాయం చేయడమే ఎస్వీ మోహన్‌రెడ్డిని ప్రజాప్రతినిధిగా నిలబెట్టింది. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడిగా జిల్లాకు సుపరిచితుడు. సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్న ఈయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. వైఎస్ కుటుంబమంటే ఎనలేని అభిమానం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయనకు తోడుగా నిలవాలనే సంకల్పంతో తన ఎమ్మెల్సీ పదవిని త్యజించారు. రాజీనామా చేసి పూర్తిస్థాయి సమయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవల్లోనే వినియోగించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న టి.జి.వెంకటేశ్‌పై విజయం సాధించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా తనను ఆదరించిన ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై అలుపెరుగని పోరుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు అండగా నిలిచి మీ కోసం నేనున్నానని నిరూపించుకున్నారు. ముస్లింల సమస్యలపై అసెంబ్లీలో సైతం పోరాడే నేతగా ఆయన మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా నగరపాలక సంస్థ అధికారులను వెంట బెట్టుకుని నిత్యం వార్డు విజిట్ నిర్వహిస్తూ ఎన్నోరకాల వార్డు సమస్యలను పరిష్కరించగలిగారు. ప్రజల కష్టాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ‘సాక్షి’ తరపున కర్నూలు నగరంలోని బుధవారపేటలో పర్యటించి వీఐపీ రిపోర్టింగ్ చేశారు. ఎస్వీ : ఏమ్మా బాగున్నారా.. మీ పేర్లేంటి? కాలనీలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కాలనీవాసులు : నా పేరు జైబున్బీ సార్.. భర్త లేడు.. ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి పింఛన్ జాబితాలో పేరు నమోదు చేయిస్తే..ఒక్క నెల మాత్రమే పింఛన్ వచ్చింది. అంతలోపే కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న పింఛన్ కాస్త తొలగించింది. దీంతో గత మూడు నెలలుగా పింఛను రావడం లేదు. సర్.. నా పేరు ఖాజాబీ. కొడుకులు లేరు. పింఛన్ కూడా రావడం లేదు. ఇప్పించండి సార్.. నా పేరు వెంకటరమణ.. వికలాంగుడిని సార్. పింఛను ఇప్పించండి. నా పేరు సర్వేశ్వర్.. ఆక్సిడెంట్లో కాలు విరిగింది. ప్రస్తుతం నడవనిలేని పరిస్థితి. నాకు పింఛను ఇప్పించండి.. ఎస్వీ : అంగవైకల్యం.. 70 శాతంపైగా ఉన్న వారికి మాత్రమే వికలాంగ పింఛన్ వస్తుంది. అలాంటి వారు దరఖాస్తులు నాకు ఇవ్వండి. అధికారులతో మాట్లాడి పింఛను ఇప్పించేందుకు ప్రయత్నిస్తాను. జగన్ సీఎం అయి ఉంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు చంద్రబాబు పాలన సాగుతోంది. పింఛన్ల తొలగింపుతో చాలా మంది అర్హులు పింఛన్లు కోల్పోయారు. అయినా అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడతాను. ఎస్వీ : పెద్దమనిషి, మీ వీధిలో సమస్యలు ఏవైనా ఉన్నాయా..? కాలనీవాసులు: సార్, నా పేరు మాలిక్బాష. మా ఇంటి ముందే కరెంటోళ్లు డీప్(టాన్స్‌ఫార్మర్) ఏర్పాటు చేశారు. చాలా ప్రమాదకరంగా ఉంది. దాన్ని ఇక్కడ్నించి తీసేయించండి సార్.. ఎస్వీ : సంబంధిత అధికారులతో మాట్లాడి కరెంటుకు సంబంధించిన డీప్‌ను పక్కకు జరిపిస్తా. ఎస్వీ : ఏం బాబు.. బాగున్నావా.. నీలాంటి యువకులకు ఇబ్బందులు ఏమీ లేవు కదా.. మణికంఠ: ఏం చెప్పమంటారు సార్.. ఎన్నికల ముందేమో నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మాకు నెలకు రూ. 2 వేల కాదు కదా రెండు రూపాయలు కూడా ఇవ్వడం లేదు. మా వీధిలో చాలా మంది చదువుకున్నోళ్లు ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్నారు. ఎస్వీ : ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నాయకుని లక్షణం. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో అధికార పార్టీ నేతల్ని నిలదీయండి. ఎస్వీ : ఏమన్నా.. వ్యాపారం ఎలా ఉంది.. గ్యాస్ సిలిండర్ ఎంతకు కొంటున్నావ్.. సమస్యలు ఏమైనా ఉన్నాయా.. మంచినీళ్లు బాగా వస్తున్నాయా? శ్రీనివాసులు: వ్యాపారం డల్‌గా ఉంది సార్. సిలిండర్ ఒక్కోటి రూ. 850 దాకా పెట్టి కొనాల్సి వస్తుంది. నా తల్లికి పింఛన్ రావడం లేదు. కాలువలు సరిగ్గా లేవు. మంచినీళ్లు బాగానే వస్తున్నాయి. ఎస్వీ : ఏమ్మా ఇస్త్రీపని బాగా జరుగుతోందా.. మీ కుటుంబానికి ఏవైనా సమస్యలున్నాయా.. శిరీష: నేను ఆరో తరగతి చదువుతున్నా సార్. నాన్న చనిపోయాడు. దీంతో మధ్యలోనే చదువు మానాల్సి వచ్చింది. అమ్మే నన్ను కష్టపడి పోషిస్తోంది. ఇప్పుడు అమ్మకు తోడుగా నేను లాండ్రీ పని చేస్తున్నా అయితే మా అమ్మకు వితంతు పింఛన్ రావడం లేదు సార్.. మీరు దయవుంచి అమ్మకు పింఛను వచ్చేలా చూడండి ఎస్వీ : ఈ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు తొలగించిందమ్మా.. మీ అమ్మకు పింఛన్ వచ్చేలా ప్రయత్నిస్తా. ఎస్వీ : ఏమ్మా.. పొదుపు మహిళా సంఘాలు ఎలా నడుస్తున్నాయి.. లోన్లు ఏమైనా వచ్చాయా.. వనజ: సార్.. లోన్ల సంగతి ఏమోకాని ఉన్న డబ్బు కూడా పోతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు తీసుకున్న రుణాల కంతులు కట్టడం మానేయమని చెబితే మానేశాం. ఇప్పుడేమో బ్యాంకు వాళ్లు వడ్డీలు వసూలు చేస్తున్నారు. కట్టకపోతే అసలులో కట్ చేస్తున్నారు. కూడబెట్టిన డబ్బంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సంక్రాంతికి పిల్లలకు బట్టలు కూడా కొనలేని పరిస్థితి కల్పించారు. ఎస్వీ : చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు. రుణమాఫీ అయ్యేంతవరకు మా నాయకుడు జగన్మోహన్రెడ్డితో కలిసి పోరాడుతాం. ఈనెల 31 నుంచి రెండు రోజుల నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎస్వీ : ఏమ్మా బాగున్నారా.. సమస్యలేమైనా ఉన్నాయా.. మహిళలు: నా పేరు వెంకటేశ్వరమ్మ. వెయ్యి రూపాయల పింఛన్ ఉత్త డూప్ సార్.. ఆశ చూపి ఉన్న పింఛన్లు తీసేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అందరికి పింఛన్లు వచ్చేవి. చంద్రబాబు పాలనలో ఉన్న పింఛన్లు పోయాయి. సర్, నాపేరు మారెమ్మ. నా వయస్సు 75 ఏళ్లు. 10 నెలలుగా పింఛను రావడం లేదు. జాబితాలో పేరు లేదంటున్నారు. మీరైనా దయచేసి న్యాయం చేయండి ఎస్వీ : పీఏ శ్రీనివాసులు.. వీరందరితోనూ పింఛను దరఖాస్తులు తీసుకో. మీకు పింఛన్లు కచ్చితంగా వచ్చేలా కృషి చేస్తాను. ఎస్వీ : అమ్మాల్లరా ఏైైమైనా సమస్యలు ఉన్నాయా? ఎస్.చిట్టి: సర్, ఇక్కడ మహిళలకు మరుగుదొడ్లు లేవు సార్. మురుగు నీరు రోడ్డుపైన పారుతుంది. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కావడం లేదు. రుణాలు ఇవ్వడం లేదు. వడ్డీలు మళ్లీ కట్టాలంటున్నారు. ఎలా కట్టాలో తెలియడం లేదు. ఎస్వీ : పురపాలక సంస్థ అధికారులతో ప్రతిపాదనలు చేయించి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తా. మురుగునీటి సమస్యా పరిష్కరిస్తా. (మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్కు పీఏ ఫోను కలిపి ఇవ్వడంతో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అక్కడిక్కడే శానిటరీ అధికారికి డ్రైనేజీ సమస్యను వివరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.) చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ వస్తువులను కాలనీవాసులు కాలువల్లో వేయకండి. అలా వేయడం వల్లే కాలువలు బ్లాక్ అవుతున్నాయి. ఎస్వీ : (పూరి గుడిసెలోకి వెళ్లి) అవ్వా.. క్షేమమేనా.. నాగమ్మ, రాములమ్మ: ఏం చెప్పమంటావు నాయనా.. ఆధార్ లేదని పింఛన్ ఇవ్వట్లేదు. ఆమెకు మొదట్నుంచి రావడంలేదు. ఎస్వీ : అవ్వా నీకు పింఛను ఇప్పించేందుకు ప్రయత్నిస్తా. ఎస్వీ : ఏమన్నా.. పులిజాకబ్, చేపలకుంట వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా.. పులిజాకబ్(స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్): సార్, చేపలకుంట గుంత 60, 70 ఏళ్లుగా ఉంది. ఇక్కడ రైతు మార్కెట్ లేక స్కూల్ కట్టివ్వాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. స్థానికులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ప్రతిపాదిస్తుండటంతో సమస్య పెండింగ్‌లో ఉంది. గట్టి నిర్ణయం తీసుకోండి. ఎస్వీ : ఈ గుంత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏసన్న (స్థానిక నేత): గుంత చుట్టుపక్కల ప్రమాదకరంగా ఉంది. పొరపాటున పడితే బయటికి రాలేరు. డ్రైనేజీ నీరు కూడా చేరుతుంది. దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. ఎస్వీ : ఈ గుంత ఇబ్బందుల గురించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కూడా ప్రస్తావించాను. మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తా. ఎస్వీ : ఏమమ్మా.. మీ సమస్యలేవైనా ఉన్నాయా? మారెమ్మగుడి కాలనీవాసులు: సార్, మరుగుదొడ్లు ఉపయోగించేందుకు వీలుగా లేవు. సింటెక్స్ ట్యాంకు పగిలింది. గోడల ఎత్తు తక్కువగా ఉండటంతో పురుషుల కంట పడాల్సి వస్తుంది. ఎస్వీ : (నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో) మారెమ్మగుడి వద్ద ఉన్న మరుగుదొడ్లు చెడిపోయాయి. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టండి. మరొక సింటెక్స్ ట్యాంక్ పెట్టి మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడండి. -
నీళ్లు తాగించారు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగర పాలక తొలి కౌన్సిల్ సమావేశం సోమవారం రసాభాస అయింది. నగరపాలక సంస్థ చర్చకు పెట్టిన అజెండాలో ప్రజాసమస్యలను ప్రస్తావించలేదని, ప్రజలకు ఉపయోగపడని ఈ సమావేశం ఎందుకంటూ వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్, 40వ డివిజన్ కార్పొరేటర్ పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మేయర్ అబ్దుల్‌అజీజ్‌పై మండిపడ్డారు. అసలు ఇది అజెండానే కాదంటూ రూప్‌కుమార్‌కు ఏడో డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ వంతపాడటంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. నగర సమస్యలపై రెండుగంటలపాటు వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులు మూకుమ్మడి దాడికి దిగడంతో మేయర్ అబ్దుల్అజీజ్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వైఎస్సార్సీపీ సభ్యులకు కొందరు టీడీపీ సభ్యులు మద్దతు పలకండంతో ఏంచేయాలో మేయర్‌కు పాలుపోలేదు. దీంతో ఆయన పదేపదే మంచినీళ్లు తాగాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ప్రజాసమస్యలు, కార్పొరేషన్లో అవినీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక దశలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి సైతం వీరికి మద్దతు పలకడం విశేషం. సభ నడిపేతీరు మేయర్‌కు తెలియక పోవడంతో పలుమార్లు రూప్‌కుమార్ యాదవ్ పదేపదే క్లాస్ పెరకడం చర్చనీయాంశమైంది. నగరపాలిక ఏర్పడిన మూడునెలల తర్వాత ఎట్టకేలకు సోమవారం ఉద యం 11 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. తొలుత గతంలో కార్పొరేటర్లగా పని చేసి మృతి చెందిన వారితో పాటు ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి ఆత్మశాంతి కలగాలని సభ మౌనం పాటించి సంతాపం తెలిపింది. అనంతరం మేయర్ అబ్దుల్ అజీజ్ 11:30కు సభను ప్రారంభించారు. నగరప్రజల ప్రధాన సమస్యలైన తాగునీరు, పారిశుధ్యం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను ప్రస్తావించని ఎజెండాను చదవడం ప్రారంభించారు. 45 నిమిషాలపాటు ఓపిక వహిం చిన రూప్‌కుమార్ యాదవ్ ఒక్కసారిగా లేచి ‘ప్రధాన ప్రజాసమస్యలు ఎజెండా లో పెట్టకుండా అయ్యోర్లు పిల్లకాయలకు చెప్పినట్టు సోది చదివి మా సహనాన్ని పరీక్షిస్తావా? అదేదన్నా ఉంటే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకో’ అంటూ మేయర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మేము నీకింద పనిచేసే ఉద్యోగులం కాదు. ప్రజాప్రతినిధులం’ అంటూ విరుచుక పడ్డారు. నెల్లూరు నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏమైంది? శానిటేషన్ సంగతేంది? అవేవీ ఎజెండాలో పెట్టకుండా, వాటిపై చర్చలేకుండా అసలు సమావేశం ఎందుకు? అంటూ రూప్ ప్రశ్నల వర్షం కురిపించారు. కార్పొరేషన్లో అవినీతిపైనా నిలదీశారు. పార్టీలు మారడంకాదు, పద్దులు తెలుసుకో అని హితవు పలికారు. ఎజెండాపై అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఎందుకు చర్చించలేదు? అని మేయర్‌పై రూప్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుక పడ్డారు. దీంతో మేయర్‌కు దిక్కుతోచక పలుమార్లు రూప్‌కు మైక్ కట్ చేయండం, ఆయన నిలదీయడంతో మళ్లీ ఇవ్వడం కనిపించింది. ‘మా పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్లావ్’ అంటూ రూప్ పదేపదే మేయర్‌కు చురకలంటించారు. టీడీపీ సభ్యుడు కిన్నెరప్రసాద్ లేచి మేయర్‌పై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఇది అసలు ఎజెండానే కాదంటూ ధ్వజమెత్తారు. ‘ఏం చేయాలో తెలియనపుడు అడిగి తెలుసుకో. పారిశుధ్యం అధ్వానంగా మారింది. దోమలతో చచ్చిపోతున్నాం. ఎవరితోనైనా దీన్ని అజెండా అనిపిస్తే రాజీనామా చేసి ఇంటికెల్లిపోతా! కార్పొరేటర్లంటే అంతవిలువ లేకుండా పోయిందా’ అంటూ మేయర్‌పై కిన్నెర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఏకపక్షంగా అజెండా పెట్టడంతప్పు. కాంట్రాక్టర్ల కేటాయింపుల్లోనూ అనుమానాలున్నాయి. మరోసారి ఇలా జరగకుండా చూసుకోండి’ అంటూ 8 వ డివిజన్ కార్పొరేటర్ జెడ్‌ఎస్‌ప్రసాద్ కిన్నెరను బలపరిచారు. విపక్షంతోపాటు స్వపక్షం వారూ ఎదురు దాడికి దిడగంతో మేయర్ అజీజ్‌కు కొద్దిసేపు ఏమిచేయాలో పాలుపోలేదు. రూప్‌కుమార్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ నేతృత్వంలో మేయర్ పోడియం వద్దకుకు వెళ్లి కార్పొరేషన్ అక్రమాలపై పత్రికల్లో వచ్చిన కటింగులు ప్రదర్శిస్తూ కొద్దిసేపు ఆందోళనకు దిగారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ కార్పొరేషన్లో అక్రమాలపై ధ్వజమెత్తారు. అవినీతిని ప్రోత్సహించేలా అజెండా ఉందన్నారు. అనంతరం మేయర్ ఎజెండాలోని ఏడు అంశాలను చదివారు. వైఎస్సార్సీపీ సభ్యు లు పలు అభ్యంతరాలను లేవనెత్తగా టీడీపీ సభ్యులు కూడా వాటిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొన్ని సవరణలతో ఆమోదం తెలిపారు. తాగునీటి పథకానికి రూ.550 కోట్లు హడ్కోరుణం రూ.550 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మించతలపెట్టినట్లు చెప్పారు. నగరాభివృద్ధికి రూ.200 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల స్మార్ట్ సిటీ రాలేదన్నారు. వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించడం చర్చనీయాంశమైంది. -
సీమాంధ్ర అభివృద్ధి అన్ని నగరాల్లో ఉండాలా?
రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో కొత్త రాజధాని కూడా ఏర్పడబోతుంది. ఇందుకోసం అయిదుగురు నిఫుణుల కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించి భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకోవడమే వివేకవంతుల లక్షణం. మరి మన సీమాంధ్ర ప్రాంతాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేయచ్చు. అందుకోసం అన్ని పెట్టుబడులు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, మౌలిక వసతులు ఒకే చోట కేంద్రికృతం కాకుండా చూడాలా? హైదరాబాదు విషయంలో చేసిన పొరపాట్లు మరలా చేయకూడదా? సీమాంధ్రను అన్ని రంగాల్లో.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక్క నగరానికే అభివృద్ధి పరిమితం కాకూడదా? అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలా? ప్రత్యేక ప్రతిపత్తి హోదాని పదేళ్ళకు పొడిగించేలా?