Alzheimers
-
ఈ ఉద్యోగాలు చేస్తుంటే... మతిమరుపు రాదు!
అల్జీమర్స్. వయసుతో పాటు వచ్చే మతిమరుపు. ఇది కొందరిలో మరణానికీ దారి తీస్తుంది. అయితే కొన్ని రకాల వృత్తుల్లోని వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశమే లేదంటున్నాయి అధ్యయనాలు! ముఖ్యంగా డ్రైవింగ్‌లో ఉండేవాళ్లు ఆల్జీమర్స్‌తో మరణించే ప్రమాదం తక్కువట. అయితే బైక్ నడిపేవాళ్లు ఈ జాబితాలోకి రారు. అలాగే పైలట్లకు కూడా ఇది వర్తించదు. టాక్సీ, అంబులెన్స్ వంటివాటిని నడిపేవాళ్లకే అల్జీమర్స్ వచ్చే అవకాశం తక్కువట. అల్జీమర్స్ మెదడు వ్యాధి. జ్ఞాపకశక్తిని, ఆలోచనలను, రోజువారీ పని చేసే శక్తిని క్రమంగా తగ్గించేస్తుంది. ఇది వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపతుంది. మెదడు కణాలు దెబ్బతినడం, సరిగా పని చేయకపోవడం అల్జీమర్స్‌కు దారితీస్తుంది. దాంతో గందరగోళంగా మాట్లాడటం, అత్యంత సన్నిహితులను కూడా గుర్తించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. 2020 నుంచి 2022 మధ్య మరణించిన 90 లక్షల మంది వైద్య చరిత్రను పరిశీలించారు. వీరిలో 443 రకాల వృత్తులకు సంబంధించిన వారున్నారు. వారిలో 3.88 శాతం మరణాలు, అంటే మూడున్నర లక్షల మంది అల్జీమర్స్‌తో చనిపోయారు. వారిలో ట్యాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లు చాలా తక్కువ మంది ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. ఆ డ్రైవర్లకు ఎందుకు రాదంటే... పరిశోధన ఫలితాలను లోతుగా అధ్యయనం చేసిన మీదట ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్టు సైంటిస్టులు తెలిపారు. అవేమిటంటే... → అల్జీమర్స్ ప్రారంభంలో మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. → టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లలో రియల్ టైమ్ స్పేషియల్ థికింగ్, నావిగేషన్ ఈ హిప్పోకాంపస్‌కు చక్కని వ్యాయామంలా పని చేస్తున్నాయట. → ఈ నిరంతర వ్యాయామం వల్ల వారిలో అది చురుగ్గా, చైతన్యవంతంగా పని చేస్తోంది. → అదే బస్సు డ్రైవర్లు, విమానాల పైలట్లలో అంత నావిగేషన్ స్కిల్స్ ఉండటం లేదని అధ్యయన బృందం సారథి డాక్టర్ విశాల్ పటేల్ తెలిపారు. → నావిగేషన్స్ స్కిల్స్ పెంచే మానసిక వ్యాయామాలు మెదడును ప్రభావితం చేసి చురుగ్గా ఉంచుతాయని ఆయన వివరించారు. → కనుక వాటిపై దృష్టి పెడితే చాలని అధ్యయనకారులు చెబుతున్నారు. → మానసికంగా చురుగ్గా ఉంటే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని తేల్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా?
అల్జీమర్స్ వ్యాధిని న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్ అని అంటారు. దీని కారణంగా జ్షాపక శక్తి క్షీణించిపోతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తీవ్రమైన మతిమరుపుగా పేర్కొనవచ్చు. దీని కారణంగా రోజు వారి కార్యకలాపాలు కూడా సరిగా నిర్వహించలేరు బాధితులు. ఇది ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించగలమే గానీ పూర్తిగా నివారించలేం. అయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపనహాగన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడించారు. వారి అధ్యయనంలో దానిమ్మ పండు గుణాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అల్జీమర్లో వ్యాధిని చికిత్స చేయండంలో 'యురోలిథిన్ ఏ' కీలమకమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు నుంచి దెబ్బతిన్న మైటోకాండ్రియాను తొలగించడంలో యూరోలిథిన్ ఏ అనేది కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు పరిశోధకులు. ఇక్కడ యూరోలిథిన్ ఏ అనేది ఎల్లాజాటానిన్ల సమ్మేళనం. ఈ ఎల్లాజాటానిన్లు సమ్మెళనాలు అధికంగా దానిమ్మలో ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడూ గట్ బ్యాక్టీరియా ద్వారా రూపాంతరం చెంది 'యురోలిథిన్ ఏ'ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరిచి కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధన పేర్కొంది.ఈ దానిమ్మలో పాలీఫైనాల్స్, ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్పు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గిస్తాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయని పరిశోధనలో తేలింది. ఈ పండులో సీ, కే, ఫోలేట్ వంటి విటమిన్లు కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రీ రాడికల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది సెల్ డ్యామేజ్‌కు దారితీస్తుంది. నూర్యాన్ల క్షీణతలో ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన అంశం. ఈ దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్టీకరించి మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు.అల్జీమర్స్‌ను తీవ్రతరం చేసే అమిలాయిడ్ బీటా ఫలకాల నిక్షేపణలను తగ్గించడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారుఅంతేగాదు ఈ దానిమ్మ పండు అల్జీరమర్స్ వ్యాధిపి సమర్థవంతంగా నియంత్రిస్తుందా? లేదా అని చేసిన అధ్యయనంలో మంచి పలితాలు వచ్చాయని చెబుతున్నారు పరిశోధకులు. అందుకోసం తాము వృద్ధుల జ్ఞాపకశక్తిపై అధ్యయనం నిర్వహించగా..వారిలో గణనీయమైన మెరుగదల కనిపించిందని తెలిపారు. ఈ అధ్యయనం న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.అంతేగాదు ఈ దానిమ్మలో ఉండే విటమిన్లు ఇన్ఫ్లమేటరీ మార్గాలను నిరోధిస్తాయి. ప్రో-ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను తగ్గించి, న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి.పైగా దీనిలోని సమ్మేళనాలు కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహించి జ్ఞాపకశక్తి పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. అంతేగాదు దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేలా చేసి దీర్ఘాయువుని అందిస్తుంది.(చదవండి: కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?) -
సర్జరీ లేకుండా మతిమరుపును పోగొట్టొచ్చు, శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం
విద్యుత్ షాక్‌ని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని శాస్త్రవేత్తలు కొత్తరకం ప్రయోగం చేశారు. హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఈ చికిత్స నిర్వహించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి. అల్జీమర్స్ కారణంగా మానసిక, ప్రవర్తన, సామాజిక నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ న్యూరోలాజిక్ డిజార్డర్ కారణంగా బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. కాలక్రమేణా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి. మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్ బారినపడినవాళ్ల లో ఈ కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ చిన్నగా అవుతుంది. అంతేకాదు 'హైపోమెటబాలిజం' ఉంటుంది. అంటే గ్లూకోజ్ తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే. కాకుండా జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. హిప్పోకాంపస్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచేందుకు కొత్త హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి మతిమరుపును పోగొట్టొచ్చు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ (ICL) శాస్త్రవేత్తల నేతృత్వంలో టెంపోరల్ ఇంటర్ఫెరెన్స్ (TI) బ్రెయిన్ స్టిమ్యులేషన్‌తో మతిమరుపును పోగొట్టచ్చని కనిపెట్టారు. ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ విద్యుత్ కణాలకు బ్రెయిన్‌కు పంపించి జ్ఞాపకశక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుందట. ఇందులో భాగంగా2,000 Hz,2,005 Hz, వద్ద విద్యుత్ కణాలను పంపిస్తాయి. ఇది ఒకరకంగా కరెంట్ షాక్ లాంటిదే. 5-Hz కరెంట్‌తో అదే ఫ్రీక్వెన్సీలో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల సెల్-పవర్ చేసే మైటోకాండ్రియాను పునరుజ్జీవింపజేస్తాయని, ఇది మతిమరుపును పోగొడుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో వివరించారు.''ఇప్పటివరకు మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తితే రోగికి ఎలక్ట్రోడ్లను శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సి వచ్చేది. కానీ ఈ హై-ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో ఎలాంటి నొప్పిలేకుండా రోగికి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేలా చేయొచ్చు.'' అని సైంటిస్ట్ నిర్ గ్రాస్మాన్ తెలిపారు. ఈ టెక్నిక్‌తో సర్జరీ అవసరం లేకుండా మనిషి మెదడులోని కణాలను ప్రేరేపించడం సాధ్యమవుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్‌ను ప్రభావితం చేస్తుంది అని పేర్కొన్నారు. -
మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపు వస్తుండటం సహజం. మతిమరపును ఇంగ్లిష్‌లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైంది ‘అల్జైమర్స్’ అయితే... దానితో పోలిస్తే... దానికంటే కొద్దిగా అరుదైనది వాస్క్యులార్ డిమెన్షియా. ఈ సందర్భంగా మతిమరపునకు కారణమయ్యే అల్జైమర్స్ డిమెన్షియా, వాస్క్యులార్ డిమెన్షియాలపై అవగాహన కోసం ఈ కథనం. డిమెన్షియా, అల్జైమర్స్ని ఓ వ్యాధిగా కాకుండా ఓ సిండ్రోమ్‌గా చెప్పవచ్చు. అంటే... నిర్దిష్టంగా ఓ వ్యాధి లక్షణంతో కాకుండా... అనేక లక్షణాల సమాహారంతో కనిపించే ఆరోగ్య సమస్యను సిండ్రోమ్ అనవచ్చు. డిమెన్షియా ఉన్నప్పుడు అది కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు దోహదపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. అల్జైమర్స్ విషయానికి వస్తే ఇది కూడా డిమెన్షియాలో ఒక రకం. అందుకే దీన్ని అల్జైమర్స్ డిమెన్షియా (ఏడీ) అనవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడిది చాలా సాధారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత నలుగురితో కలవకపోవడం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి లాంటి అంశాల కారణంగా అల్జైమర్స్ పెరిగింది. అల్జైమర్స్ డిమెన్షియా: కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలో క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. ఒకసారి అల్జైమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా అయ్యేలా చికిత్స సాధ్యం కాదు. కాకపోతే దీనిలో మరపు అన్నది మొదట్లో తాజా తాజా విషయాలు మొదలుకొని... క్రమంగా పాత విషయాల్ని మరచిపోతుంటారు. తాము ఎంతోకాలంగా నివాసమున్న ప్రదేశాల్నీ, కాలాన్నీ (అది పగలా, రాత్రా అన్నదానితో సహా) మరచిపోతారు. ప్రశ్నలకు సమాధానాలివ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రవర్తనలో మార్పు రావడం... చివరకు సొంత కుటుంబ సభ్యుల్ని సైతం గుర్తుపట్టలేనంతగా మరచిపోతారు. వాస్క్యులార్ డిమెన్షియా మతిమరపులకు ‘వాస్క్యులార్ డిమెన్షియా’ అనేది ‘అల్జైమర్స్ డిమెన్షియా’ కంటే రెండో అతి ముఖ్యమైన కారణం. మెదడుకు క్రమంగా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల వస్తుంది కాబట్టి దీన్ని ‘వాస్క్యులార్ డిమెన్షియా’గా చెబుతారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఫలితంగా అభ్యాస, అధ్యయన, నేర్చుకునే ప్రక్రియలు... ఇలా ఇవన్నీ మరుస్తూపోవడం వల్ల పరిస్థితి అకస్మాత్తుగా దిగజారిపోతుంది. మతిమరుపు, అల్జైమర్స్ తెచ్చి పెట్టే అంశాల్లో కొన్ని... జన్యుపరమైనవి: మతిమరపులో జన్యుపరమైన అంశాలు కీలకమైన భూమిక పోషిస్తాయి. కొందరి కుటుంబాల్లో వంశపారం పర్యంగా కనిపిస్తుంటాయి. ఏపీఓఈ 4 ఎల్లీల్ వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ ముప్పులను పెంచుతాయి. వయసు : పెరిగే వయసు మతిమరపును తెచ్చిపెట్టే అల్జైమర్స్, వాస్క్యులార్ డిమెన్షియాలకు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. పైగా ఇది నిరోధించలేని అంశం. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించని వాళ్లలో అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, పొగ, ఆల్కహాల్ అలవాట్ల వంటì అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో ఈ ముప్పులు ఎక్కువ. దేహంలోని ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు మెదడు పనితీరుపై ప్రతికూలం ప్రభావం చూపి, పరోక్షంగా అల్జైమర్స్, వాస్క్యులార్ అల్జైమర్స్కూ, గురకను కల్పించే స్లీప్ ఆప్నియాకు కారణమవుతాయి. వాతావరణ అంశాలు : వాతావరణ కాలుష్యాలూ, విషపూరిత వ్యర్థాలూ చాలావరకు మతిమరపునకు కారణమవుతాయి. అందుకే వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి. ఆహారం : పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో ఉపయోగించే పసుపు, మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు తోడ్పడతాయి. నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్‌ను ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి. వ్యాయామం : దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ పెరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. దాంతో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మెదడుకు మేత : కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ సాధించడం, మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల అదుపు : డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధులను అదుపులో పెట్టుకోవాలి. నలుగురిలో ఒకరిగా : వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. చికిత్స : అలై్జమర్స్ డిమెన్షియానూ, వాస్క్యులార్ డిమెన్షియానూ పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ‘లెకానిమ్యాబ్’ అనే సరికొత్త మందును ఈ ఏడాదే ఎఫ్‌డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. (చదవండి: మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం) -
ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అల్జీమర్స్ కావొచ్చు
అల్జీమర్స్.. దాదాపు 60శాతం మంది వృద్దులు ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఇది. అల్జీమర్స్ అంటే మెదడు దెబ్బతినడం లేదా జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే వ్యాధి. అల్జీమర్స్ ఉన్న వ్యక్తికి రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వారు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? అన్నది ప్రముఖ వైద్యులునిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే... అల్జీమర్స్ ఏ వయసువారికి? అల్జీమర్స్ ఎందుకొస్తున్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. మెదడులో ప్రొటీన్ గార పోగుపడటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మెదడు కణాలు తమను తాము శుభ్ర పరచుకునే సామర్థ్యం మందగించటం దీనికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్జీమర్స్ వ్యాధి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి ఎక్కువగా 65ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.అల్జీమర్స్ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారం వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఇలా ఉంటాయి ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం,జ్ఞాపకశక్తి తగ్గడం రోజువారీ విషయాలను మర్చిపోవడం కుటుంబసభ్యుల పేర్లు కూడా మర్చిపోవడం వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తులేకపోవడం ఏకాగ్రత పెట్టలేకపోవడం, తీవ్రమైన గందరగోళం రాయడం, చదవడం,మాట్లాడేటప్పుడు ఇబ్బందులు కొద్ది నిమిషాల కింద జరిగిన విషయాలను కూడా మర్చిపోవడం పట్టరాని భావోద్వేగాలు, వ్యక్తిగత మార్పులు అల్జీమర్స్కి ఆయుర్వేదంలో చికిత్స ఇలా.. ►ఉసిరిక పొడి 2 గ్రాములు, నువ్వుల పిండి 2 గ్రాములు, తేనె, నెయ్యిలను కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు రెండు సార్లు 40 రోజుల పాటు తీసుకోవాలి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. ► ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుండాలి. లేదా ఉసిరిక పొడిని 2 గ్రాముల మోతాదులో తేనెతో లేదా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే మురబ్బాలను కూడా తినవచ్చు. ►అతి మధురం వేర్లను మెత్తగా నూరి పొడి చేసి 1 గ్రాము మోతాదులో తీసుకుని దానికి నీళ్లు కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ► ప్రతి రోజూ 5-10 నానబెట్టిన బాదం గింజలను తింటుండాలి. ► తిప్పతీగ రసాన్ని రోజుకు 10-20 ఎంఎల్ మోతాదులో రెండు సార్లు తీసుకోవాలి. ► శంఖపుష్పి మొక్క పంచాంగ స్వరసాన్ని 10 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది.. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు -
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్‌తోపాటు మ్యూజిక్‌ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్‌తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్‌కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్‌నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్‌కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్‌తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్‌టీఏ – వాకా మంజులారెడ్డి. -
Health: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు!
వృద్ధాప్యంలో తామెవరో తమకే తెలియకుండా పోవడం... తమ సొంతవాళ్లను మాత్రమే కాదు... సొంత ఇంటినీ మరచిపోవడం ఎంత దురదృష్టకరం. అయితే ముందునుంచీ జాగ్రత్తపడితే అలాంటి దురవస్థ రాకుండా కాపాడుకోవడం అంత కష్టం కాదు. చాలా ఈజీగా అనుసరించదగిన ఈ కింది సూచనలు పాటిస్తే చాలు... బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి బ్లడ్‌ప్రెషర్‌ను తరచూ చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం అన్న అంశం మతిమరపు(డిమెన్షియా)ను పెంచుతుంది. అది పరోక్షంగా అల్జీమర్స్‌కు దారితీయవచ్చు. అందుకే నిత్యం మన బీపీని అదుపులో ఉంచుకోవడం మేలు. బ్లడ్ ప్రెషర్ నియంత్రణతో పాటు అల్జీమర్స్ నివారణకూ ఆహారంలో ఉప్పు తగ్గించడం చాలా ఉపకరిస్తుంది. కండరాల కదలికలు చురుగ్గా ఉన్నవారితో పోలిస్తే... మందకొడి కదలికలు ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశాలు 60 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తెలిసింది. నడక మంచిదే రోజూ 30 – 45 నిమిషాల పాటు నడక అల్జీమర్స్‌నే కాదు... ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచి ఎన్నో వ్యాధుల నివారణలతో పాటు పూర్తి ఆరోగ్యానికి దోహదం చేసే నడకను రోజూ కొనసాగించడం చాలా మంచిది. వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు... మనసుకు కల్పించడం కూడా అల్జీమర్స్ నివారణకు తోడ్పడుతుంది. అందుకే రోజూ పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో కనిపించే పజిల్స్, సుడోకూ, గళ్లనుడికట్టు వంటి మెదడుకు మేత కల్పించే అంశాలు ప్రాక్టీస్ చేస్తుండటం మేలు. సృజనాత్మకంగా ఆలోచిస్తే.. సృజనాత్మకంగా ఆలోచించేవారికి అల్జీమర్స్ అవకాశం కాస్త తక్కువ. అందుకే మంచి ఊహాకల్పనలతో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండటం... ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచడంతో పాటు అల్జీమర్స్‌నూ నివారిస్తుంది. అందుకే ఇష్టమైన, అభిరుచి ఉన్న కళలను ప్రాక్టీస్ చేస్తుండటం ఎంతో మేలు. నోట్: ఇది ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మాత్రమే అందించిన కథనం. వైద్యుడిని సంప్రదిస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
మతిమరుపు బాధితులకు ‘లెసానెమాబ్’
లండన్: మనుషుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు (అల్జీమర్స్) తలెత్తడం సహజం. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా దీనితో బాధపడుతున్నారని అంచనా. బ్రిటన్‌లోని అల్జీమర్స్ రీసెర్చ్ సంస్థ లెసానెమాబ్ పేరుతో నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనితో మతిమరుపు పెరుగుదల నెమ్మదిస్తుందని సైంటిస్టులు చెప్పారు. అల్జీమర్స్ చికిత్సలో ఇదొక కీలక మలుపన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో 1,795 మందిపై సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. వారికి 18 నెలలపాటు చికిత్స అందిస్తే మతిమరుపు పెరుగుదల నాలుగింట మూడొంతులు తగ్గిపోతుందని చెప్పారు. అల్జీమర్స్‌కు ప్రధాన కారణమైన బీటా–అమైలాయిడ్ అనే ప్రొటీన్‌ను ఈ ఔషధం కరిగించేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన అల్జీమర్స్ చికిత్సల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని, ఈ దిశగా లెసానెమాబ్ డ్రగ్ ఒక ఉత్తమమైన పరిష్కారం అవుతుందని పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ హర్డీ తెలియజేశారు. -
పాలకూర, టీ.. ఇంకా.. వీటితో బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు!
బుర్రకు పదును పెట్టే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి వినే ఉంటారు. ఇవి తీసుకుంటే మేధస్సు వికసిస్తుందని, తెలివితేటలు పెరుగుతాయని, ఈ ఆహారం తీసుకుంటే చాలు మీకిక తిరుగులేని జ్ఞాపకశక్తి లభిస్తుందనీ సామాజిక మాధ్యమాలలో చాలా రకాల ఆహార పానీయాలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో ఎంత వరకు నిజముంటుందో తెలియదు కానీ, మెదడుకు మేత పెట్టే కొన్ని రకాల ఆహారాల గురించి హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ న్యూట్రిషనల్ అండ్ లైఫ్‌స్టైల్ సైకియాట్రీ డాక్టర్ ఉమానాయుడు మెదడుకు పదును పెట్టే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, తక్కువ మొత్తంలో తీసుకునే రెడ్ మీట్ అల్జీమర్స్ అనే ఒక విధమైన మతిమరపు వ్యాధిని నిరోధిస్తాయని తెలిసిందే. వీటితో కూడా బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు. పాలకూర: ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.. కాఫీ/ టీ: రోజూ రెండు నుంచి మూడు కప్పులకు మించకుండా తాగే కాఫీ లేదా టీ వల్ల మెమరీ పెరుగుతుంది. చురుకుగా ఉండేందుకు దోహదపడుతుంది. చేపలు: ఆహారపుటలవాట్లను బట్టి,ఇష్టాయిష్టాలను బట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేపలు తింటే ఏకాగ్రత పెరుగుతుంది.. క్యారట్: వయసు పెరగడం వల్ల వచ్చే మెమరీ సమస్యలను తగ్గిస్తుంది.. వాల్ నట్స్: జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు స్కిల్స్ మెరుగుపడుతాయి. ఇవి మనం తీసుకునే ఆహారం... వీటితోపాటు పజిల్స్ పూరించడం, చెస్ ఆడటం, చిన్నప్పుడు విన్న పద్యాలు, ఇష్టమైన పాటలు గుర్తు చేసుకుంటూ వాటిని రాయడం వంటి మెదడుకు పెట్టే మేత వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదవండి: ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే.. -
Health Tips: జంక్‌ఫుడ్ తింటున్నారా? అల్జీమర్స్, డిప్రెషన్.. ఇంకా..
జంక్‌ఫుడ్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, డయాబెటిక్, రక్తపోటు, చెడ్డ కొవ్వు పేరుకుపోవడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మనందరికీ తెలిసిందే! ఐతే జంక్‌ఫుడ్ జ్ఞాపకశక్తి మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆ వివరాలు మీకోసం.. అత్యధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారంలో ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. నాలుగు వారాలపాటు వృద్ధాప్య ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపి జ్ఞాపకశక్తి కోల్పోయేలా ప్రేరేపిస్తుందట. ఐతే ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలను జోడించిన జంక్‌ఫుడ్ ఇచ్చిన ఎలుకల్లో ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ తగ్గడం కూడా వీరి పరిశోధనల్లో భాగంగా కనుగొన్నారు. అంతేకాకుండా ప్రాసెస్ చేయబడిన ఆహారం వృద్ధుల్లో ఆకస్మికంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేసి.. అల్జీమర్స్‌కు దారితీసేలా చేస్తుందని ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన సైకియాట్రి, బిహేవియరల్ హెల్త్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రూత్ బారియంటోస్ కూడా పేర్కొన్నారు. మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం కూడా ఉందని, తరచుగా నిరాశకు లోనవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ఏదేమైనా.. ఇటువంటి జంక్‌ఫుడ్ తీసుకున్న చిన్నవయసున్న ఎలుకల్లో ఎటువంటి కాగ్నిటివ్ సమస్యలు తలెత్తలేదని పరిశోధకులు వెల్లడించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా? -
ఇతనో గజిని, భార్యని కూడా మర్చిపోయాడు.. ఆమె ఏం చేసిందంటే?
వాషింగ్టన్: ఏ వ్యక్తికైనా అత్యంత బాధ కలిగించే విషయం ఏమిటంటే, మనం ప్రేమించే వ్యక్తికి ఆరోగ్యం క్షీణించడం. కానీ అంతకన్నా దారుణం ఏమిటంటే, అదే వ్యక్తి మనల్ని ఎవరో మరచిపోవడం. సరిగ్గా అల్జీమర్స్ అనే వ్యాధి ఉన్న వ్యక్తి పరిస్థితి అదే. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి జ్ఞాపకాలు కాలంతో పాటు చెరిగిపోతుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం అల్జీమర్‌తో బాధపడుతున్న 56 ఏళ్ల పీటర్ మార్షల్ జీవితంలోనూ ఇలానే జరిగింది. ఇతను అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. పీటర్ భార్య తెలిపిన వివరలు ప్రకారం.. తాను అప్పటికే వివాహం చేసుకున్నట్లు పీటర్ మర్చిపోయాడని అతనికి ఎంత చెప్పిన గుర్తు రాలేదని తెలిపింది. ఫలితంగా తన పెళ్లి సహా గతాన్నంతా మర్చిపోయిన అతడికి భార్య లీసా తమ పెళ్లి వీడియోను చూపించింది. అయితే ఇవేవి తనకు గుర్తు లేదని, కానీ లీసా అంటే తనకు ఇప్పడు ఇష్టమని పీటర్ చెప్పాడు. దీంతో వారిద్దరికి తమ కూతురు సాయంతో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ‘ఓహ్ హలో అల్జీమర్స్’ అనే ఫేస్ బుక్ పేజీలో పీటర్ ప్రయాణాన్ని లిసా డాక్యుమెంట్ చేసి వారి జీవితంలోని సంఘటనలను అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన భర్త ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న అతనంటే తనకెంతో ఇష్టమని లీసా అంటోంది. చదవండి: Joe Biden: రిపోర్టర్‌పై బైడెన్ సీరియస్.. అంత కోపమెందుకో? View this post on Instagram A post shared by Alzheimers Caregiver Blog (@ohhelloalzheimers) -
అల్జీమర్స్‌కు ప్రధాన ముప్పు..పెరిగే వయసు!
వయసు పైబడిన దశలో జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమే. కానీ అల్జీమర్స్ లక్షణాలైన రోజువారీ జీవితాన్ని గందరగోళపరచగల మతిమరపు, దిక్కు తోచనిస్థితిలో చిక్కుకోవడం వంటివి వృద్ధాప్యం వల్లనే వచ్చేవి కావు. తాళం చేతులు ఎక్కడో పెట్టి మరచిపోవడం సాధారణ మతిమరపు లక్షణమే. అయితే వాహనం నడిపే విధానాన్నే మరిచిపోవడం, దశాబ్దాలుగా తిరుగుతున్న వీధుల్లో దారితప్పిపోవడం వంటివి వృద్ధాప్యపు మతిమరపు కానేకాదు. ఈ రకమైన జ్ఞాపకశక్తి క్షీణత ప్రమాదకరం. వృద్ధాప్యం వల్ల వచ్చే కొద్దిపాటి మతిమరపునకూ, అల్జీమర్స్‌కూ చాలా తేడా ఉంటుంది. ఇది మెదడులో జరిగే మార్పులు, మెదడును దెబ్బతీసే పరిణామాల కారణంగా వస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ ఆలోచించడం, తినడం, మాట్లాడటం వంటి సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. వృద్ధాప్యం లక్షణాలు అల్జీమర్స్ కాదు. కానీ వయసు పైబడిన కొందరిలో అనివార్యంగా వస్తున్న వ్యాధి అల్జీమర్స్. ప్రస్తుతానికి అల్జీమర్స్‌ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినా... లక్షణాలు కనిపించినప్పుడు వ్యాధిని సాధ్యమైనంత ఆలస్యం చేసే మందులు ఉన్నాయి. అయితే అల్జీమర్స్‌ను నివారించడానికి మెదడును ఉపయోగించి పరిష్కరించగలిగే పజిల్స్, సుడోకూ వంటి మెదడుకు మేత వ్యాయామాలతో దాన్ని చాలావరకు నివారించవచ్చు. -
ఆ వ్యాధి మరణిస్తేనే తెలుస్తుంది!
వయసు మీదపడిన తర్వాత చాలా మందిలో మతిమరుపు ఉండటం సహజం. కానీ ఓ వ్యక్తి చొక్కాకు గుండీలు పెట్టుకోవడం కూడా తెలియని స్థితికి చేరితే? తిట్టినా.. కొట్టినా ఏ రకమైన ఉద్వేగమూ కనిపించకుండా మారిపోతే? తిండి తినడం మొదలుకొని రోజూ వెళ్లే దారి వరకూ చాలా అంశాలు కూడా మరిచిపోతే? అది అల్జీమర్స్ కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. నలభై యాభై ఏళ్ల వయసులో మొదలై 65 దాటిన తర్వాతగానీ గుర్తించేంత స్థాయికి ముదరని ఈ వ్యాధికి కారణమేమిటో తెలియదు. చికిత్స కూడా లేదు. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముదిమిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఏటా పెరిగిపోతూనే ఉన్నారు. 2050నాటికి భూమ్మీద కనీసం 15.2 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు ఉంటారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. (కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే) 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో 40 లక్షల మంది అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డారు. ఇది ఏమంత పెద్ద సంఖ్యగా కనిపించకపోవచ్చు. అయితే ఈ వ్యాధి విషయంలో చైనా, అమెరికాల తర్వాతి స్థానం మనదే కావడం గమనార్హం. 2030 నాటికల్లా దేశంలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 75 లక్షలకు చేరుకుంటుందని అంచనా. కాకపోతే భారతదేశంలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఇతర దేశాల కంటే తక్కువగా ఉందని, పసుపు వాడకం ఇందుకు కారణమని ఇటీవలే జరిగిన ఒక అధ్యయనం చెబుతోంది. పసుపులోని కర్కుమిన్.. అల్జీమర్స్‌కు కారణమని భావిస్తున్న ప్రొటీన్ ఒకటి మెదడులో ఎక్కువ కాకుండా నియంత్రిస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. (బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే..) అల్జీమర్స్ అంటే... మతిమరుపు బాగా ముదిరితే వచ్చే సమస్య. మతిమరుపుతో బాధపడుతున్న వారిలో కనీసం 60–80 శాతం మంది అల్జీమర్స్ బారిన పడవచ్చు. వ్యాధులు లేదా మెదడుకు తగిలిన దెబ్బల కారణంగా జ్ఞాపక శక్తి, ఆలోచించే విధానం, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అల్జీమర్స్ సమస్య ఉన్నట్లు చాలా లేటుగా అంటే 65 ఏళ్ల తర్వాత గుర్తిస్తుండటం గమనార్హం. ఒకవేళ అంతకంటే ముందుగా గుర్తించినప్పటికీ దాన్ని ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ అల్జీమర్స్‌గానే పరిగణిస్తుంటారు. ఈ సమస్యకు కచ్చితమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కాకపోతే సమస్య మరీ ఎక్కువ కాకుండా నియంత్రించే పద్ధతులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మతిమరుపు కంటే ఎలా భిన్నం? మతిమరుపు.. అల్జీమర్స్ రెండూ ఒకటే అన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కానీ అల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపుగా మాత్రమే వైద్యశాస్త్రం గుర్తిస్తుంది. విషయాలను మరచిపోవడం, గందరగోళానికి గురవడం డిమెన్షియా తాలూకూ స్థూల లక్షణాలు. అయితే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మెదడుకు తీవ్రమైన దెబ్బ తగలడం వంటివి కూడా ఈ లక్షణాలను కలుగజేస్తాయి. సాధారణంగా చేసే పనులను కూడా చేయలేకపోవడం అల్జీమర్స్ లక్షణాల్లో ఒకటి. ఉదాహరణకు మైక్రోవేవ్‌ను చాలాకాలంగా వాడుతున్నప్పటికీ అకస్మాత్తుగా అదెలా వాడాలో స్పష్టంగా తెలియకపోవడం అన్నమాట. దీంతోపాటు మాట, రాతల్లో సమస్యలు ఏర్పడటం, వ్యక్తిగత శుభ్రత లోపించడం, ప్రాంతాలకు సంబంధించిన విషయాలు గుర్తులేకపోవడం వంటివన్నీ అల్జీమర్స్ లక్షణాలుగా పరిగణించవచ్చు. భావోద్వేగాల్లో మార్పులు, బంధు మిత్రులకు దూరంగా ఉండటం కూడా ఈ వ్యాధి సమస్యలే. మరణిస్తేనే తెలుస్తుంది! మతిమరుపునకు, అల్జీమర్స్‌కూ తేడా ఉన్న విషయం మనకు తెలుసు. మరి వైద్యులు ఏది ఏ సమస్యో ఎలా గుర్తిస్తారు. అల్జీమర్స్‌ను నిర్ధారించడం మెదడు కణజాలాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే సాధ్యం. అంటే మరణం తర్వాతే వ్యాధిని గుర్తించగలమన్నమాట. మరి బతికుండగా వ్యాధి ఉంటే? మరి గుర్తించడం ఎలా?ఇందుకోసం చాలా పద్ధతులు ఉన్నాయి లెండి. కుటుంబ చరిత్రను బట్టి అంచనా వేయడం, జన్యు పరీక్షల ద్వారా అల్జీమర్స్ కారక జన్యువుల ఉనికి తెలుసుకోవడం వీటిల్లో కొన్ని. దీంతోపాటు వైద్యులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ద్వారా అల్జీమర్స్, డిమెన్షియాల మధ్య తేడాను గుర్తించగలరు. మానసిక పరిస్థితిని గుర్తించిన తర్వాత మీ షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ మెమొరీని గుర్తించేందుకు ప్రశ్నలు వేస్తారు. దీనికి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రతలు, అవసరమైతే మూత్ర పరీక్షలు నిర్వహించి ఒక అంచనాకు వస్తారు. నాడీ సంబంధిత సమస్యలేవైనా ఉన్నాయా? అన్నది పరిశీలిస్తారు. ఎమ్మారై, సీటీ, పీఈటీ వంటి స్కాన్ల ద్వారా మెదడు నిర్మాణం, అందులోని తేడాలను తెలుసుకుంటారు. వీటన్నింటి ఆధారంగా వైద్యులు తుది నిర్ణయానికి వస్తారు. నివారణ ఎలా? అల్జీమర్స్‌కు కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. కానీ.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి రాకను ఆలస్యం చేయడంతోపాటు లక్షణాల తీవ్రతను కొంత వరకు తగ్గించవచ్చు అని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానానికి దూరంగా ఉండటం వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం బుర్రకు పదునుపెట్టే కార్యకలాపాలు చేపట్టడం శాఖాహారం తీసుకోవడం.. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్త పడితే ప్రయోజనం ఉంటుందని అంచనా ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నించడం, వాగ్వాదాలకు దూరంగా ఉండటం రోజూ తగినంత విశ్రాంతి తీసుకోవడం వీటన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తే వ్యాధిని కొంత వరకు నివారించవచ్చు. 1,850 కోట్ల గంటలు : అమెరికాలో వైద్య సిబ్బంది వేతనం లేకుండా అల్జీమర్స్ బాధితుల కోసం వెచ్చించిన సమయం 5.2 శాతం : మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్న 60 ఏళ్ల పైబడ్డవారు 204 శాతం: 2018–2050 మధ్యకాలం లో పెరిగే అల్జీమర్స్ బాధితులు 10 శాతం: దిగువ, మధ్యాదాయ దేశాల్లో 2050 నాటికి పెరిగే మతిమరుపు బాధితులు నలుగురిలో ఒకరు.. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిర్ధారణ జరిగే వారు 27,700 కోట్ల డాలర్లు: ఒక్క అమెరికాలో అల్జీమర్స్, మతి మరుపులపై పెట్టిన ఖర్చు -
ఫ్లూ టీకాతో ఆ రెండు జబ్బులు తగ్గుదల..
న్యూఢిల్లీ: ఫ్లూ టీకాతో గుండె జబ్బులు, అల్జిమర్స్(మతిమరుపు) వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అమెరికన్ హర్ట్ అసోసియేషన్ అధ్యయనం తెలిపింది. ఇటీవల కరోనా నియంత్రించేందుకు ఫ్లూ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో ఆశ్యర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఒక ఫ్లూ వ్యాక్సిన్‌తో 17శాతం, మరో ఫ్లూ వ్యాక్సిన్‌తో 13శాతం అల్జీమర్స్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు 65, 75 సంవత్సరాల వయస్సుల వారికి నిమోనియా టీకాలు వాడడం వల్ల 40శాతం అల్జీమర్స్ వ్యాధి తగ్గిందని తెలిపింది. ఎవరైతే బాల్యంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉందని, జన్యుపరమైన ఇబ్బందులు లేనివారికి ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న వారికి తీవ్ర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 28శాతం తగ్గుతుందని, 73శాతం మంది చనిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కుతారని నివేదిక పేర్కొంది. -
‘మతి’పోతోంది
బిజీ జీవితం.. మానసిక ఆందోళన.. పని ఒత్తిళ్లు.. మతిమరుపునకు దారితీస్తున్నాయి. ఇంతకు ముందు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించే అల్జీమర్స్ (మతిమరుపు) ఇప్పుడు 30 ఏళ్ల వయస్సు వారిలో కూడా కనిపిస్తుండటం ఆందోళన పరుస్తోంది. మెదుడులోని కణాలు క్షీణించడం వలన జ్ఞాపక శక్తి తగ్గడంతో ప్రారంభమై.. తమ కుటుంబ సభ్యులను గుర్తించ లేక పోవడం, ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి ఇంటికి చేరుకోలేక పోవడం, మరింత ముదిరి శరీరంపై దుస్తులు కూడా వేసుకోలేక పోవడం వంటివి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు. తొలిదశలో గుర్తిస్తే వ్యాధి తీవ్రత పెరగకుండా చూడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్ వ్యాధి సాధారణంగా 60 నుంచి 65 ఏళ్ల వయస్సు వారిలో బయట పడుతుంది. వ్యాధి సోకిన వారిలో 80 శాతం మంది అదే వయస్సు వారు కాగా, నవ్యాంధ్ర రాజధాని నగరాల్లో 20 శాతం మంది వయస్సు 50 ఏళ్లుపై బడిన వారు ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి సోకిన తర్వాత నివారించడం సాధ్యపడని విషయం. అయితే మందుల ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా చూడవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మందులు, చికిత్స అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యాధి సోకిన వారిలో 10 శాతం మంది కూడా తొలిదశలో చికిత్స పొందడం లేదు. వ్యాధి తీవ్రత పెరిగి, మానసిక స్థితి సరిగ్గా లేని సమయంలో చికిత్స కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పుడు ఎన్ని మందులు వాడినా అంతగా ఫలితం ఉండట్లేదు. వ్యాధి నిర్ధారణ ఇలా.. వ్యాధి సోకిన తర్వాత వివిధ దశలో కనిపించే లక్షణాలను బట్టి గుర్తించవ్చు. ఎంఆర్ఐ స్కానింగ్, పెట్ స్కాన్ వంటి వాటి ద్వారా వ్యాధిని నిర్థారించవచ్చు. జ్ఞాపకశక్తి తగ్గడం ప్రధాన లక్షణంగా గుర్తించాలి. గంట కిందట జరిగిన ఘటనలను మర్చిపోవడం, చివరికి భోజనం చేయడం కూడా మర్చిపోతుండటం వంటి లక్షణాలను గుర్తించి వ్యాధిని నిర్ధారణ చేయోచ్చు. అల్జీమర్స్ లక్షణాలు మొదటి దశ: మైల్డ్ డిమెన్షియా దశలో జ్ఞాపక శక్తి చాలా స్వల్పంగా తగ్గుతుంది. వ్యక్తిగత శ్రద్ధ, సామాజిక అంశాలలో పెద్దగా మార్పు ఉండదు. అయితే చుట్టుపక్కల జరిగే సంఘటనల పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు. సహనం తగ్గిపోయి, తొందరగా కోపం రావడం, చేసే పనిపట్ల ఆసక్తి తగ్గడం జరుగుతుంది. ఈ దశలో వ్యాధిగ్రస్తునితో పాటు ఇతరులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. రెండో దశ: దీనిని మోడరేట్ డిమెన్షియా అంటారు. ఈ దశలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అధికమవుతుంది. ఒక దశలో తాము ఎక్కడ ఉన్నది గుర్తించలేని స్థితి ఉంటుంది. ఉదయం.. సాయంత్రం అంటే ఏమిటో అర్థం కాకుండా ఉంటారు. దూరపు బంధువులనే కాకుండా దగ్గర బంధువులను గుర్తించలేని స్థితి ప్రారంభమవుతుంది. దుస్తులు వేసుకున్నదీ, లేనిదీ గమనించలేని స్థితిలో ఉంటారు. మూడోదశ: ఈ దశ చాలా ప్రమాదకరమైనది. వ్యక్తిగత శుభ్రత ఉండదు. తమపని తాము చేసుకోలేని స్థితి ఉంటుంది. ప్రతి పనికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ దశ«లో రకరకాల బ్రాంతులకు గురవుతారు. ఎవరో తనపై కుట్రపన్నుతున్నారని, తమ ఆస్తులు పూర్తిగా పోయి, కుటుంబ సభ్యులు వీధిన పడ్డారనే తరహా ఆలోచనలతో ఇబ్బందికి గురవుతారు. తనపేరు, ఊరు చెప్పలేని స్థితికి చేరుకుంటారు. -
నిద్ర మాత్రలతో అల్జీమర్స్ ముప్పు
లండన్ : నిద్ర మాత్రలను నిర్ధిష్ట కాలానికి మించి వాడితే అల్జీమర్స్ ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. నిద్ర మాత్రలను అదేపనిగా వాడేవారిలో మతిమరుపు లక్షణాలను గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. వైద్యులు సూచించిన కాలానికి మించి అధిక మోతాదుతో కూడిన నిద్ర మాత్రలను తీసుకునేవారిలో అల్జీమర్స్ ముప్పు అధికంగా ఉందని తమ అథ్యయనంలో వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ర్టన్ ఫిన్లాండ్ స్పష్టంచేసింది. బెంజోస్, జడ్ డ్రగ్స్ తీసుకునేవారిలో అల్జీమర్స్ ముప్పును గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. ఈ మందులను నాలుగు వారాల మించి తీసుకోరాదని వారు చెబుతున్నారు. యాంగ్జైటీ, నిద్రలేమిని నివారించేందుకు డాక్టర్స్ బెంజోస్ డ్రగ్‌ను సిఫార్సు చేస్తారు. అథ్యయనంలో భాగంగా దీర్ఘకాలంగా బెంజోస్, జడ్ డ్రగ్స్ తీసుకునేవారిలో 3,53,000 మందికి అల్జీమర్స్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. మరికొందరు తమకు 2005-2011 మధ్య కాలంలోనే డిమెన్షియా వ్యాధి ఉందని వెల్లడించారు. -
అదేపనిగా కూర్చుంటే మతిమరుపు ఖాయమట!
లాస్ ఏంజిలెస్ : సాధారణంగా వయసు పైబడితేనో, మానసిక ఒత్తిడి ఎక్కువైతేనో మతిమరుపు వస్తుందని చెబుతారు. కొన్నిసార్లు మెదడుకు గాయమైనా కూడా మతిమరుపు వస్తుంది. కానీ అదేపనిగా ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నా కూడా మతిమరుపు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఒకరు నేతృత్వం వహించిన బృందం డిమెన్షియాకు కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. గంటల తరబడి కూర్చొని, పనిలో నిమగ్నమయ్యేవారు మధ్యవయసుకు వచ్చేసరికి డిమెన్షియాబారిన పడుతున్నారని గుర్తించారు. ఇందుకోసం 45 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న 35 మందిపై పరిశోధన చేశారు. వారి ఫిజికల్ యాక్టివిటీ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత పరిశీలిస్తే.. కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే మెదడు భాగం.. అదేపనిగా కూర్చొని పనిచేసే వ్యక్తుల్లో అభివృద్ధి చెందకపోవడాన్ని గుర్తించారట. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తేలిందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభా సిద్ధార్థ తెలిపారు. -
అల్జైమర్స్ ఒక పజిల్
కారు తాళాలు మరచిపోవడం మతిమరుపు... మరి కారు డ్రైవింగే మరచిపోతే? అగ్గిపెట్టె ఎక్కడ పెట్టామో మరవచ్చు... అగ్గి బుగ్గి చేస్తుందన్న అంశమే మరిస్తే? పుస్తకం తెరవగానే అక్షరాలు రాలిపోయినట్టుగా మెదడులోని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతే? మతిమరుపు సహజం. కానీ అసలు మరచిపోయామన్న సంగతిని సైతం మరుపుకొచ్చేలా చేస్తే... అది అల్జైమర్స్! ఆ అల్జైమర్స్ పై ఎన్నో అపోహలూ సందేహాలు.. ఆ అపోహల వెనక అసలు నిజాలేమిటో నిగ్గుదేల్చి అల్జైమర్స్ పై అవగాహన కల్పించే వాస్తవాలివి... ప్రముఖ క్రిమినల్ లాయర్ ఒకరు చాలా చరిత్రాత్మక తీర్పులతో సహా న్యాయరంగానికి చెందిన అనేక పరిణామాలను పొల్లుపోకుండా చెప్పగలరు. అలాంటి వ్యక్తి ఇటీవల చిన్న చిన్న సంఘటనలు కూడా మరచిపోతున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో 75వ పుట్టిన రోజున బంధుమిత్రుల సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేసి, స్వయంగా ముక్కలు పంచిన వ్యక్తి.. డిన్నర్ చేస్తూ మన ఇంటికి ఇంతమంది గెస్ట్‌లు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లడానికి బదులు లాయర్ కోటుతో సహా గుడికి వెళ్లడం, తన చిరకాల సహచరుడైన న్యాయవాదిని గుర్తించలేకపోవడం వంటి అంశాలు కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. నడిచే న్యాయశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా పేరుబడ్డ ఆయన మతిమరుపునకు కారణం అల్జైమర్స్ వ్యాధి అన్నారు వైద్యులు. కుటుంబ సభ్యులకు కొన్ని సూచనలు కూడా చేశారు. అల్జైమర్స్ మెదడులో కణాలు చనిపోతుడటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనాసామర్థ్యం దెబ్బతింటాయి. ఇటీవలి సంఘటనలు, విషయాలను మరచిపోవడంతో మొదలై, క్రమంగా పెరిగి చివరకు తానెవరో కూడా తనకు తెలియనంతగా ఈ మతిమరుపు విస్తరిస్తుంది. అల్జైమర్స్ నిర్ధారణ అయ్యిందనగానే పేషెంట్ల కుటుంబ సభ్యులు వారి సన్నిహితులు అల్జైమర్స్, ఆ వ్యాధి లక్షణాలు, రోజువారీ జీవితంపై వాటి ప్రభావం గూర్చి చాలా అపోహలు, అనుమానాలతో అనేక ప్రశ్నలను అడుగుతుంటారు. వైద్యనిపుణుల అనుభవం, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు నిర్ధారణ చేసిన నిజాలు తెలుసుకోవడం ద్వారా అల్జైమర్స్ వ్యాధిని సరిగా అర్థం చేసుకునేందుకు వీలుంటుంది. తమ కుటుంబ సభ్యులు, ఆప్తులు ఆ వ్యాధి బారిన పడుతున్న తరుణంలో ప్రాథమికదశలోనే దాన్ని గుర్తించి దానిని ఎదుర్కోవడానికి, అందుబాటులో ఉన్న వైద్య చికిత్స నుంచి పూర్తి ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. అల్జైమర్స్ పై అనేక అపోహలున్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని... అపోహ : అల్జైమర్స్ వృద్ధుల్లోనే కనిపిస్తుంది. వాస్తవం : కొంత వరకు నిజమే. అల్జైమర్స్ కు... వయసు పైబడటానికి నేరుగా సంబంధం ఉంది. 65 ఏళ్లు దాటిన ప్రతి 9 మందిలో ఒకరు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అంతమాత్రాన ఇది కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితమైనది అనుకోవడానికి లేదు. కొన్ని సందర్భాల్లో 40–50 ఏళ్ల వ్యక్తుల్లోనూ అల్జైమర్స్ కనిపిస్తోంది. అయితే ఈ మధ్యవయస్కుల్లో కనిపించే అల్జైమర్స్ లక్షణాలను కొంతమంది డాక్టర్లు మధ్యవయసు తాలూకు మతిమరుపుగానో లేక ఒత్తిడి, మానసిక కుంగుబాటు, మహిళల్లో అయితే మెనోపాజ్ లక్షణాలుగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. దాంతో వ్యాధి ముదిరి పరిస్థితి మరింత దిగజారుతుంది. అపోహ : అల్జైమర్స్ వ్యాధి కాదు. ఇది వృద్ధాప్యంలో వ్యక్తుల్లో కనిపించే సహజ లక్షణమే. వాస్తవం: వయసు పైబడిన దశలో జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమే. కానీ అల్జైమర్స్ లక్షణాలైన రోజువారీ జీవితాన్ని గందరగోళపరచగల మతిమరుపు, దిక్కు తోచని స్థితిలో చిక్కుకోవడం వంటివి వృద్ధాప్యం వల్లనే వచ్చేవి కావు. తాళం చేతులు ఎక్కడో పెట్టి మరచిపోవడం సాధారణ మతిమరుపు లక్షణమే. దశాబ్దాలుగా తిరుగుతున్న వీధుల్లో దారితప్పిపోవడం వృద్ధాప్యపు మతిమరుపు కాదు. ఈ రకమైన జ్ఞాపకశక్తి క్షీణత ప్రమాదకరం. వృద్ధాప్యం వల్ల వచ్చే కొద్దిపాటి మతిమరుపునకూ, అల్జైమర్స్ కూ చాలా తేడా ఉంటుంది. ఇది మెదడులో జరిగే మార్పులు, మెదడును దెబ్బతీసే పరిణామాల కారణంగా వస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ ఆలోచించడం, తినడం, మాట్లాడటం వంటి సామర్థ్యాలను కోల్పోతారు. వయసు పైబడిన కొందరిలో వస్తున్న వ్యాధి అల్జైమర్స్. అపోహ : జ్ఞాపకశక్తి క్షీణించడం అంటే అల్జైమర్స్ వ్యాధి వచ్చినట్టే. వాస్తవం : ఇది నిజం కాదు. అనేక కారణాల వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. వయసు పైబడటం కావచ్చు, పోషకాహార లోపం కావచ్చు. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవడం వల్ల మతిమరుపు పెరగవచ్చు. కానీ జ్ఞాపకశక్తి క్షీణించడం అనే పరిణామం ఒక వ్యక్తి రోజువారీ జీవితంలోని వ్యక్తిగత పనులను అస్తవ్యస్తం చేసే విధంగా, ఆలోచనశక్తిని దెబ్బతీసే విధంగా, ఇతరులతో సంభాషించడానికి వీలులేని విధంగా ఉన్న పక్షంలో మాత్రం దానిని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. అప్పుడు డాక్టర్‌ను సంప్రదించి అల్జైమర్స్ ఉన్నదీ, లేనిది నిర్ధారణ చేసుకోవాలి. అపోహ : అల్జైమర్స్ వస్తే... ఆ వ్యక్తి జీవితం ముగింపునకు వచ్చినట్లేనా! వాస్తవం : ఇది ఎంతమాత్రమూ వాస్తవం కాదు. అల్జైమర్స్ వచ్చాక కూడా చాలా ఏళ్ల పాటు అర్థవంతమైన జీవితం గడపవచ్చు. మెదడును, గుండెను ఆరోగ్యంగా ఉంచగల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, చురుకైన సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ, మెదడుకు పనిపెట్టే వ్యాపకాలను కొనసాగించడం ద్వారా అల్జైమర్స్‌ను అదుపులో ఉంచవచ్చు. ప్రారంభంలోని గుర్తిస్తే వ్యాధి లక్షణాలను అదుపు చేయగల చికిత్స, మంచి ఫలితాలను ఇవ్వగల మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందుకే అల్జైమర్స్ ను తొలిదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. అపోహ : తల్లిదండ్రుల్లో ఎవరికైనా అల్జైమర్స్ వ్యాధి వచ్చిందంటే ఆ తర్వాతి కాలంలో పిల్లలూ ఈ వ్యాధి బారిన పడతారు. వాస్తవం : ఇది కొంతవరకే వాస్తవం. మొత్తం వ్యాధిగ్రస్తుల్లో కేవలం 5 శాతం మందికే వంశపారంపర్యంగా అల్జైమర్స్ సోకిన కేసులను కనుగొన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఒక వ్యక్తి తల్లిదండ్రుల్లో, తోబుట్టువుల్లో ఎవరికైనా అల్జైమర్స్ వచ్చి ఉంటే ఆ వ్యక్తికి వచ్చే అవకాశాలు కాస్తంత ఎక్కువ. వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరికైనా వృద్ధాప్యానికి ముందే అల్జైమర్స్ వచ్చి ఉంటే ఆ వ్యక్తి కూడా వృద్ధాప్యానికి ముందే అల్జైమర్స్ బారిన పడే అవకాశం ఉంది. అపోహ : సులభమైన వ్యాయామాలు... టంగ్ ఎక్సర్సైజ్, బ్రెయిన్ యాక్టివేటింగ్ ఎక్సర్సైజ్ ద్వారా అల్జైమర్స్ ను నివారించవచ్చు. వాస్తవం : అల్జైమర్స్ వ్యాధికి సంబంధించి చైతన్యం పెరుగుతుండటం వల్ల, మునుపటి తరాలతో పోలిస్తే ఎక్కువ మందికి ఈ వ్యాధి వస్తుండటం, అదే సమయంలో ఆధునిక వైద్యంలో దానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ అందుబాటులోకి రాకపోవడంతో టంగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అల్జైమర్స్ రాకుండా జాగ్రత్తపడవచ్చనీ, అంతేగాక ఒకవేళ వచ్చినా వ్యాధి ముదరకుండా అదుపు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. వ్యక్తి ఉదయం లేవగానే అద్దం ముందు నిలబడి నాలుకను నోటి నుంచి బయటకు పెట్టి, కుడివైపుకు, ఎడమవైపునకు వేగంగా అటు ఇటు కుదుపుతుండాలి. ఇలా రోజుకు పదిసార్లు చేయడం వల్ల మెదడులోని ప్రధాన భాగాలు ప్రేరేపితం అయి అల్జైమర్స్ రాకుండా ఉంటుందన్నది ప్రచారం. ఇక బ్రెయిన్ యాక్టివేటింగ్ ఎక్సర్సైజ్లో భాగంగా కుడి చెవిని ఎడమచేతితో, ఎడమచెవిని కుడిచేతితో పట్టుకొని గుంజీళ్లు తీయడం అన్నది ప్రధానమైంది. దీవల్ల అల్జైమర్స్ వ్యాధి దూరంగా ఉండటంతో పాటు వ్యక్తి మేధస్సు మెరుగుపడుతుందని చెబుతున్నారు. మన దేశంలో చాలా మంది ప్రార్థనలో భాగంగా చేసే ఈ గుంజిళ్లను నేర్పడానికి అమెరికాతో సహా కొన్ని పశ్చిమ దేశాలలో శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే ఇలాంటి వ్యాయామాలతో అల్జైమర్స్ వ్యాధిని నిరోధించగలమనే అంశం నిరూపితం కాలేదు. అపోహ : అల్జైమర్స్ వ్యాధిగ్రస్తులు ఆవేశంగా, దూకుడుగా వ్యవహరిస్తుంటారు. వాస్తవం : అల్జైమర్స్ ఉన్న కొందరు దూకుడుగా, ఆవేశపూరితంగా మారడం నిజమే. కానీ అందరూ ఒకేలా ప్రభావితం కారు. వ్యాధి వల్ల తికమకపడుతుండటం, భయానికి లోనుకావడం, ఆశాభంగం చెందడం వంటి కారణాలతో కొందరు దూకుడుగా వ్యవహరించవచ్చు. వారు అలా మారడానికి కారణాలను అర్థం చేసుకొని పరిసరాలను వారికి అనువుగా మార్చడం, ఆ విషయాలు వారికి అర్థమయ్యేలా వివరించి వారిని శాంత పరచవచ్చు. ఆ ప్రవర్తనను మితిమీరకుండా అదుపు చేయవచ్చు. అపోహ : చికిత్సతో అల్జైమర్స్ తగ్గిపోతుంది. వాస్తవం : వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించినప్పుడు మందులు, కుటుంబ సభ్యుల సేవలు, సహకారం వల్ల వ్యాధి లక్షణాలు పెరగకుండా, జీవననాణ్యత తగ్గకుండా చూడవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుతం రెండు రకాల మందులు వచ్చాయి. కోలినెట్రేస్ ఇన్హిబిటర్స్, మెమంటైన్ అనే ఈ రెండు జనరిక్ మందులకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. జ్ఞాపకశక్తి క్షీణించడం, తికమకపడటం, హేతుబద్ధంగా ఆలోచించలేకపోవడం వంటి లక్షణాలలో కొన్నింటిని అదుపు చేసేందుకు వీటిని సిఫార్సు చేస్తున్నారు. ఇంతకుమించి అల్జైమర్స్ తగ్గించే చికిత్సలేమీ అందుబాటులో లేవు. కొత్త చికిత్స ప్రక్రియల కోసం, మందుల కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అపోహ : తలకు బలమైన గాయం తగిలితే అది అల్జైమర్స్ కు దారితీస్తుంది. వాస్తవం : తలకు గాయం అయితే... కొన్నేళ్ల తర్వాత మతిమరుపు, అల్జైమర్స్ కు దారితీసే అవకాశం ఉందని గతంలో కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే తలకు తీవ్రగాయం అయిన ప్రతివ్యక్తికీ అల్జైమర్స్ రాదు. తలకు అదేపనిగా దెబ్బతగలడం వల్ల (ఫుట్‌బాల్, హాకీ, బాక్సింగ్ వంటి క్రీడల్లోలా) కొంతకాలానికి వ్యక్తికి తీవ్రమైన జ్ఞాపకశక్తి సమస్యలు (క్రానిక ట్రామాటిక్ ఎన్‌కెఫలోపతి) వంటి వ్యాధులకు మాత్రమే గురికావచ్చని స్పష్టం చేశాయి. క్రమం తప్పకుండా చేసే శారీరక వ్యాయామం (గుంజిళ్ల వంటి వాటితో సహా), సమతుల ఆహారం, ఒంటి బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటివి అల్జైమర్స్‌ను నివారించడానికి తోడ్పడతాయి. ఇవి అల్జైమర్స్ మాత్రమే కాకుండా గుండెజబ్బులు, డయాబెటిస్తో పాటు అనేక వ్యాధులు రాకుండా సహాయం చేస్తాయి. చురుకైన సామాజిక సంబంధాల వల్ల మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలు బలపడతాయి. వ్యక్తి ఆలోచన శక్తి దెబ్బతినకుండా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. డాక్టర్ ఆర్.ఎన్.కోమల్ కుమార్ సీనియర్ న్యూరో ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మెదడు పెద్దదైతే.. మానసిక రుగ్మతలు
వాషింగ్టన్ : మెదడు పరిమాణం పెద్దగా ఉండే వారు మనోవైకల్యం, అల్జీమర్స్ వంటి మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మెదడు పరిమాణం పెద్దగా ఉండడంతో మెదడులోని దూర ప్రాంతాలకు సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడమే దీనికి కారణంగా వారు పేర్కొంటున్నారు. క్షీరదాలలో సమాచార మార్పిడి, జ్ఞాపకశక్తి వ్యవస్థలను మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ నిర్వహిస్తుంది. దీనిలోని నాడుల పనితీరును తెలుసుకోవడం ద్వారా అది చేసే పనుల గురించి అవగాహనకు రావచ్చని వాషింగ్టన్ వర్సిటీ, రుమేనియాలోని బొలాయి వర్సిటీ పరిశోధకులు తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి అల్జీమర్ ట్యాబెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అల్జీమర్ తరహా వ్యాధుల చికిత్సకు వినియోగించే మెమంటైన్ హైడ్రోక్లోరైడ్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. 5ఎంజీ, 10 ఎంజీ ట్యాబ్లెట్లను విక్రయించడానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించిందని, అమెరికాలో ఈ ట్యాబ్లెట్ల మార్కెట్ పరిమాణం ఏడాదికి రూ. 8,800 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
వెన్నతో అల్జీమర్స్‌కు స్వస్తి!
రియో డిజనిరో: పాలను నుంచి వేరుచేసిన లినోలిక్ ఆమ్లంతో కూడిన వెన్నను తింటే అల్జీమర్స్‌ను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వెన్నను తింటే జ్ఞాపకశక్తికి కారణమయ్యే ఎంజైమ్ 'ఫోస్ఫోలిపాస్ ఏ2' పనితీరు మెరుగవుతుందని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో శాస్త్రవేత్తలు తెలిపారు. జ్ఞాపకశక్తికి కారణమయ్యే కణత్వచాల నిర్మాణంలో పాలుపంచుకునే కొవ్వుఆమ్లాలపై ఈ ఎంజైమ్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్యవంతుల్లో ఈ కణత్వచాలు ఎప్పటికప్పుడూ మారుతూ, కొత్తవి ఏర్పడుతాయి. అదే అల్జీమర్స్ రోగుల్లో కొవ్వు ఆమ్లాలు బంధించి ఉండటం వల్ల కణత్వచాలు స్తబ్దుగా ఉంటాయని పేర్కొన్నారు. ఎలుకలపై ఐదేళ్లు పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. -
తెలంగాణ గజల్ గాయకుడు విఠల్‌రావు మృతి
గాంధీ ఆస్పత్రి (సికింద్రాబాద్) : తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు శివపూర్కర్ విఠల్‌రావు(86) మృతి చెందారు. గాంధీ మార్చురీలో భధ్రపరిచిన మృతదేహం తన తండ్రి విఠల్రావుదేనని ఆయన కుమారుడు సంతోష్ శుక్రవారం గుర్తించాడు. ఈనెల 24వ తేదీన బేగంపేట కంట్రీక్లబ్ ఫ్లై ఓవర్ కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న విఠల్‌రావును యాచకునిగా భావించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, అదేరోజు అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన మృతిచెందారు. గుర్తుతెలియని మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భధ్రపరిచారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు చొరవతో మృతిచెందింది గజల్ గాయకుడు విఠల్‌రావుగా వెల్లడైంది. హైదరాబాద్ గోషామహల్, హిందీనగర్‌కు చెందిన విఠల్‌రావుకు ఐదుగురు సంతానం. సంజయ్, సంతోష్‌లు కుమారులు, సంధ్య, వింధ్య, సీమలు కుమార్తెలు. మతిమరుపు వ్యాధి (ఆల్జీమర్)గల విఠల్‌రావు గతనెల 29వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి సాయినాధుని దర్శనానికి షిరిడీ వెళ్లి అక్కడ తప్పిపోయారు. షిరిడీ పరిసర ప్రాంతాలు గాలించినా ఫలితం లేకపోవడంతో అక్కడి ఠాణాలో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సన్మానానికి పిలుపు.. తెలంగాణ పరగణాల్లో గజల్ గాయకునిగా ప్రఖ్యాతి పొందిన విఠల్‌రావును తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. జూన్ 2 వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విఠల్‌రావుకు సన్మానం చేస్తామని ప్రకటించి ఈమేరకు ఆయనకు సమాచారం కూడా అందించారు. ఇంతలోనే విఠల్‌రావు అదృశ్యమయ్యారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం విఠల్‌రావు అదృశ్యం మిస్టరీని చేధించాలని పోలీసులను ఆదేశించింది. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు నేతృత్వంలో దర్యాప్తులో భాగంగా విఠల్‌రావు ఫొటోలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాలకు పంపించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోస్టర్లను అతికించారు. గుర్తింపుకు కృత్రిమకన్నే ఆధారం.. గుర్తించలేని విధంగా ఉన్న విఠల్‌రావు మృతదేహన్ని గుర్తించేందుకు కృత్రిమంగా అమర్చిన కన్నే ప్రధాన ఆధారమైంది. విఠల్‌రావు అదృశ్యంపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు గాంధీ మార్చురీలోని అనాథ మృతదేహాల ఫోటోలను పరిశీలిస్తుండగా.. విఠల్‌రావును పోలిన మృతదేహం ఫొటో కనిపించింది. ఆయన కుమారుడు సంతోష్‌ను శుక్రవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహం డీకంపోజ్ కావడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. కొన్నేళ్ల క్రితం విఠల్‌రావు ఎడమకన్నును తొలగించి కృత్రిమ కన్ను అమర్చారు. దీని ఆధారంగా మృతదేహం విఠల్‌రావుదిగా అతని కుమారుడు సంతోష్ గుర్తించాడు. విఠల్‌రావు ఆచూకీ కోసం కొంతమంది కుటుంబసభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లారని, వాళ్లందరికీ సమాచారం అందించామని, శనివారం నాడు గోషామహల్లోనే తమ తండ్రి విఠల్‌రావు అంత్యక్రియలు నిర్వహిస్తామని అతని కుమారుడు సంతోష్ తెలిపారు. సీఎం కేసీఆర్ సంతాపం ప్రముఖ గజల్ గాయకుడు విఠల్‌రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏడో నిజాం ఆస్థానంలో విధ్వాంసుడిగా పని చేసిన విఠల్‌రావు దేశవ్యాప్తంగా పేరొందిన కళాకారుడని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విఠల్‌రావును ప్రత్యేకంగా గుర్తించి పారితోషికాన్ని అందించింది. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
2030 నాటికి భారత్‌లో ఏడు మిలియన్ల మంది ‘అల్జీమర్ వ్యాధిగ్రస్తులు’
అల్జీమర్స్‌పై చర్చా సదస్సులో న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ సాక్షి, బెంగళూరు : భారతదేశంలో 2030 నాటికి దాదాపు ఏడు మిలియన్ల మంది అల్జీమర్ వ్యాధిగ్రస్తులు ఉంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు తెలియజేస్తున్నాయని కొలంబియా ఏషియా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ తెలిపారు. వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారమిక్కడి కొలంబియా ఏషియా ఆస్పత్రిలో ‘అల్జీమర్స్’ వ్యాధిపై చర్చా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్ అనూరాధ మాట్లాడుతూ....వృద్ధాప్యం కారణంగా మెదడులోని కణాల పనితీరు క్షీణించడాన్నే అల్జీమర్స్‌గా పిలుస్తారని చెప్పారు. ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో సగటు వ్యక్తి ఆయుర్దాయం పెరుగుతుండటం అదే సమయంలో జననాల సంఖ్య తగ్గిపోతుండడం, రానున్న ఇరవై ఏళ్లలో అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్య పెరగడానికి ప్రముఖ కారణాలని తెలిపారు. ఇక ప్రస్తుత జీవన విధానం వల్ల కూడా రానున్న కాలంలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని అన్నారు. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగానే కాక మానసికంగా కూడా సంతోషంగా, దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇదే విషయంపై ప్రజల్లో అవగాహనను పెంచడం కోసం కొలంబియా ఏషియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో కుటుంబసభ్యులతో ఎక్కువసేపు గడపడం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన చుట్టూ సృష్టించుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, తద్వారా అల్జీమర్స్‌కు దూరంగా ఉండవ చ్చని సూచించారు. -
అల్జైమర్స్‌ను ఆలస్యం చేసే డీబీఎస్
అల్జైమర్స్‌ను మరింత ఆలస్యం చేసే కొత్త ప్రక్రియ త్వరలోనే అందుబాటులోకి రానుంది. గుండెలో పేస్ మేకర్ పెట్టినట్లే మెదడులోనూ అమర్చి... అల్జైమర్స్ కారణంగా వచ్చే మతిమరపును బాగా ఆలస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఒహయో స్టేట్ వెక్స్నర్ మెడికల్ సెంటర్ వైద్య పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దయ్యాక నేర్చుకున్న అనేక అంశాలు అల్జైమర్స్ వ్యాధిగ్రస్తుల్లో మరపునకు వస్తాయి. విచిత్రం ఏమిటంటే... అల్జైమర్స్తో వచ్చే మరపులో పూర్తి కాన్సెప్ట్నే మరచిపోతారు. ఉదాహరణకు అగ్గిపెట్టెను మరవడం మామూలే. కానీ మంటనే మరచిపోవడం జరిగిందంటే అది అల్జైమర్స్ మరుపు అన్నమాట. వృద్ధాప్యంలో వచ్చే ఈ జబ్బు వల్ల అనర్థాలేన్నో. ఈ వ్యాధి వచ్చిన రోగుల్లో మతిమరపు రావడాన్ని చిన్న చిన్న ఎలక్రిక్ తరంగాలతో ఇచ్చే షాక్‌లతో వీలైనంత ఆలస్యం చేసే ప్రక్రియపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ (డీబీఎస్) అని పిలిచే ఈ ప్రక్రియలో విద్యుత్ తరంగాలు మెదడులోని విద్యుత్ సర్క్యుట్స్పై పనిచేస్తూ వాటిని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనివల్ల మెదడులోని నరాల నెట్వర్క్ (న్యూరల్ నెట్వర్క్) ఎప్పుడూ నార్మల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. ఫలితంగా అల్జైమర్స్ కారణంగా వచ్చే మతిమరపు బాగా ఆలస్యంగా వచ్చేలా చేయడానికి అవకాశం ఉంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) ప్రక్రియ ఇప్పటికే పార్కిన్సన్ డిసీజ్ కారణంగా వచ్చే మతిమరపును విజయవంతంగా తగ్గిస్తుందని ఇప్పటికే తేలింది. దాంతో అల్జైమర్స్ రోగుల విషయంలోనూ ఈ ప్రక్రియ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. -
టైప్-2 ముదిరితే అల్జీమర్స్
లండన్: టైప్-2 మధుమేహం ముదిరితే అది అల్జీమర్స్ (మతిమరుపు సంబంధ వ్యాధి)కు దారితీస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తొలి దశలోనే గుర్తించి సరైన వ్యాయామం చేస్తూ, బరువును తగ్గించుకుంటే అల్జీమర్స్‌కు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నవారి దేహంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్.. మెదడు కణాలపై దుష్ర్పభావం చూపుతుందని, కొంతకాలానికి ఆ కణాలు పూర్తిగా దెబ్బతిని అల్జీమర్స్ వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. అల్జీమర్స్ బారిన పడుతున్నవారిలో 70 శాతం మంది టైప్-2 మధుమేహం వ్యాధిగ్రస్తులే ఉండడంతో వీటి మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రయోగాలు జరిపారు.