Andhra Pradesh Legislative Assembly
-
నేడు రాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 16వ రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన పోలింగ్ ఏర్పాట్లను కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్ భారతి (ఐఏఎస్), ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అజ్మీరా(ఐఐఎస్)లు ఆదివారం పరిశీలించారు. వారు తొలుత సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాతో సమావేశమై పోలింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను చంద్రేకర్ భారతి.. అధికారులకు వివరించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎన్నికల ప్రక్రియను అంతా వీడియో తీయించాలని, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన డ్యూటీ చార్టును పటిష్టంగా రూపొందించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి నిర్దిష్ట విరామాల్లో పరిమిత సంఖ్యలో వీడియోగ్రాఫర్లను ఏ విధంగా అనుమతిస్తారు, వారు వచ్చి.. వెళ్లే మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలు, మార్గాల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. తదనంతరం కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అక్కడ సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. శాసన సభా భవనం మొదటి అంతస్తులోని ఓటర్లు వేచి ఉండే 203, 205 గదులను పరిశీలించి, ఓటర్ల సూచనల ఫ్లెక్స్ బ్యానర్లను, కరపత్రాలను అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా ఏఆర్వో రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో డిప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో శ్రీనివాసశాస్త్రి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి ఉప కార్యదర్శులు, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులు రాజకుమార్, వనితా రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరిది యజ్ఞం? ఎవరు రాక్షసులు?
జగన్ ప్రభుత్వంపై పడినన్ని వ్యాజ్యాలు బహుశా దేశంలోనే ఏ ప్రభుత్వం పైనా పడి ఉండవు. వాటిలో తొంభై శాతం టీడీపీకి సంబంధించినవారివేనన్నది బహిరంగ రహస్యం! చంద్రబాబు ఈ మధ్యకాలంలో పార్టీ నాయకులతో కన్నా అడ్వకేట్లతో ఎక్కువ టైమ్ గడుపుతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కోర్టులలో ఇంకేమి కేసులు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చన్నదే వారి ప్రధాన చర్చ అని వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో చంద్రబాబు... రాజధాని భూముల నిర్బంధ సమీకరణకు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళ్లినా, వారిని రాక్షసులతో పోల్చేవారు. తాను యజ్ఞం చేస్తుంటే ప్రతిపక్షానికి చెందిన రాక్షసులు కోర్టుల ద్వారా అడ్డు పడుతున్నారని అనేవారు. మరి వీరిని రాక్షసులు అనాలా, వద్దా అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రాత్మకమైన చర్చనే జరిపింది. శాసన వ్యవస్థకూ, న్యాయ వ్యవస్థకూ మధ్య అంతరం ఏర్పడితే వచ్చే సమస్యలు ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ డిబేట్ గొప్పదనం ఏమిటంటే ఎక్కడా న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని తగ్గించకుండా, చాలా జాగ్రత్తగా సమ తూకంగా నిర్వహించడం! ఏ ఒక్క న్యాయమూర్తి పేరు తీసుకోలేదు. మూడు రాజధానులకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న రాజ్యాంగపరమైన లోపాలను ఎత్తి చూపారే తప్ప, ఎక్కడా న్యాయ వ్యవస్థను తూలనాడలేదు. వారు చెప్పదలిచింది చెప్పారు. అది కత్తిమీద సాము వంటిదే. అయినా విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధానులపై తమ ప్రభుత్వ విధానాన్ని శాసనసభలో స్పష్టంగా చెప్పారు. న్యాయ వ్యవస్థకు ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. జగన్ తన ప్రసంగంలో న్యాయ వ్యవస్థ గొప్పదనాన్నీ, శాసన వ్యవస్థ విశిష్టతనూ తెలియజేస్తూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులకు సంబంధించిన చట్టాలను ఉపసం హరించుకున్న తర్వాత వాటిపై తీర్పు ఇవ్వడం ఏమిటని సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి చట్టం చేయరాదన్న హైకోర్టు అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఆచరణ సాధ్యం కాని గడువులు పెట్టడం, ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అడి గారు. కేంద్రం రెండుసార్లు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసి రాజధాని అన్నది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే ఈ డిబేట్ ఒక సంచలనం అవ్వాలి. ఇలాంటి సమస్యలు మరి కొన్ని రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు. ఒకరి పరిధిలోకి మరొకరు వచ్చినప్పుడు ఇలాంటి డిబేట్లు తప్పనిసరి అవుతాయి. అందువల్ల ఇది చారిత్రాత్మక చర్యగా శాసన వ్యవస్థలో మిగిలిపోతుంది. ఉమ్మడి ఏపీలో కూడా ఒకటి, రెండు సార్లు న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై ప్రస్తావనలు వచ్చినా, ఇంత సవిస్తరంగా చర్చ జరగలేదని చెప్పాలి. హైకోర్టు తీర్పును సమర్థించిన చంద్రబాబు నాయుడు నిర్దిష్ట ప్రశ్నలకు సమా ధానం ఇవ్వకుండా కప్పదాటు ధోరణిలో అసలు తీర్పునే వ్యతిరేకించకూడదన్నట్లు మాట్లాడారు. ఇక్కడ ఒక సంగతి గుర్తు చేయాలి. స్విస్ చాలెంజ్ పద్ధతి ద్వారా రాజధానిలో కాంట్రాక్టులు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసింది. దీనిపై కొందరు ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టువారు విచారణ చేసి కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంబంధిత సవరణలు చేసి కొత్త చట్టం తెచ్చింది. దీనర్థం ప్రభుత్వం తప్పు చేసిందనే కదా? కాకపోతే కొత్త చట్టం తేవద్దని ఆనాటి హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం తాను చేసిన చట్టాలను ఉపసంహరించుకుని కోర్టుకు ఆ సంగతి తెలిపింది. అయినా తాము విచారణ జరుపుతామని, లేని చట్టాలపై తీర్పు ఇచ్చారు. దీనిపై చంద్రబాబుకు నిర్దిష్ట అభిప్రాయం ఉంటే చెప్పి ఉండవలసింది. ఆయన అలా చేయలేదు. తీర్పు తను కోరుకున్నట్లు ఉంది కనుక దానిని సమర్థిస్తున్నారు. సింగపూర్ సంస్థ లతో ఒప్పందం అయినప్పుడు కొన్ని దారుణమైన కండిషన్లకు ఆనాటి ప్రభుత్వం ఒప్పుకుంది. 350 కోట్ల వరకే ఆ కంపెనీలు పెట్టుబడి పెడితే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఐదువేల కోట్లకుపైగా వివిధ వసతుల కోసం ఖర్చు చేస్తే, వారు ప్లాట్లు వేసి అమ్ముకుంటారట. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. సింగపూర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిదన్న వ్యాఖ్యలు కూడా వచ్చాయి. మరి వైసీపీ ప్రభుత్వం రాగానే సింగపూర్ కంపెనీలు సైలెంట్‌గా ఒప్పందం నుంచి తప్పుకున్నాయి. ఒప్పందాలే రద్దు చేయరాదంటున్న చంద్రబాబు దీనికి ఏం జవాబిస్తారు? జగన్ కంటే ముందు మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమర్థంగా తమ వాదనలు వినిపించారు. ధర్మాన, బుగ్గన అయితే అనేక ‘కేస్ లా’లు చదివి శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ చొరబడకూడదన్న సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. గౌరవ న్యాయస్థానం ఈ తీర్పు లన్నీ చూడకుండానే మూడు రాజధానులపై తీర్పు ఇచ్చిందా అన్న ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండదు. చట్టాలు చేసే అధికారమే చట్టసభకు లేకపోతే ఎన్నికలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు అన్న ప్రశ్నను ఏపీ శాసనసభ వేసింది. ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు గౌరవ హైకోర్టు వారు సుమోటోగా తాము ఏ కారణంతో లేని చట్టాలపై తీర్పు ఇచ్చింది వివరణ ఇవ్వగలిగితే సమాజానికి మంచిది. లేకుంటే చట్ట సభ అడిగిన ప్రశ్నలకు న్యాయ వ్యవస్థలో జవాబులు లేవేమో అన్న అనుమానం రావచ్చు. గత మూడేళ్లలో అనేక కేసులలో వెలువడ్డ తీర్పులు వివాదాలకు అతీతంగా లేవన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. కారణం ఏమైనా ఏపీ శాసనసభలో సభ్యులు ఎవరూ హైకోర్టు వారు గత మూడేళ్లలో ఇచ్చిన వివిధ తీర్పుల మంచి చెడుల గురించి ప్రస్తావించ లేదు. కేవలం మూడు రాజధానుల కేసు, చట్టసభకు చట్టాలు చేసే అధి కారం లేదన్నంతవరకే పరిమితం అయి జాగ్రత్తగా మాట్లాడుతూనే, తమ అభిప్రాయాలను నిర్మొహ మాటంగా చెప్పారు. చంద్రబాబు మరో సంగతి చెప్పారు. జగన్ ప్రభుత్వం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలట. జగన్ రాజధానులపై తన అభిప్రాయం కొంత మార్చుకుంటే మార్చుకుని ఉండవచ్చు. కానీ అదే సమయంలో అమరావతి అభివృద్ధి కూడా తన బాధ్యత అని చెప్పారు. కానీ అమరావతి, అమరావతి అంటూ కలవరించే చంద్రబాబు గానీ, ఆయన పక్ష సభ్యులు గానీ అసలు చర్చకే హాజరు కాలేదు. కేవలం నాటుసారా మరణాలు అంటూ రోజు సభలో గొడవ చేసి, చివరికి ఈలలు, చిడతలు వేసే స్థాయికి దిగజారి వ్యవహరించారే తప్ప ఇంత కీలకమైన చర్చలో పాల్గొని తమ భావాలను వ్యక్తం చేయలేదు. ఇది వారి వైఫల్యమే. దీనిని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న ఆ గ్రామాలవారు కూడా గమనించగలగాలి. రాజీనామా చేయాల్సి వస్తే చంద్రబాబు ఎన్నిసార్లు ఆ పని చేసి ఉండాల్సింది! అసలు 1994లో ప్రజలు ఎన్టీఆర్‌ను ఎన్నుకున్నారా, చంద్రబాబునా? ఎన్టీఆర్‌ను పడగొట్టి తాను అధి కారంలోకి వచ్చిన వెంటనే ప్రజల తీర్పు కోరా ల్సింది కదా? ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం స్కీమ్ అమలు వంటివాటిని ఎత్తివేసి నప్పుడు చంద్రబాబు రాజీనామా చేసి ప్రజల మనోగతం తెలుసుకున్నారా? 2014లో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, తదుపరి అలా అడిగిన వారిని ఆశపోతులని అన్నప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? 45 వేల బెల్టు షాపులను ప్రోత్స హించినందుకు ఎవరు రాజీనామా చేయాలి? నిజానికి చంద్రబాబే స్థానిక ఎన్నికల సమయంలో అదే ప్రజాభిప్రాయం అని విజయవాడ, గుంటూరు సభలలో ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడారు. ‘ప్రజలకు బుద్ధి ఉంటే, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని భావిస్తే వైసీపీని ఓడించా’లని పిలుపు ఇచ్చారు. ప్రజలు ఆయనను ఖాతరు చేయలేదు. టీడీపీ దారుణంగా ఓటమి పాలైంది. అయినా చంద్రబాబు మళ్లీ ప్రజల తీర్పు అంటూ పాత పల్లవే ఎత్తుకున్నారు. ఏది ఏమైనా శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఉండే సున్నితమైన రేఖ చెరిగి పోకూడదు. అలా చెరిగినప్పుడే ఇలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. రెండు వ్యవస్థలు దీనిపై ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగితే అందరికీ మంచిది. - కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
Andhra Pradesh: ఈ నెల 7 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అదే రోజున శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు బుధవారం జారీ చేశారు. ఈ నెల 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. శాసనసభలో 2022–23 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 11న ప్రవేశపెట్టనున్నారు. -
కరోనా నుంచి కోలుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
-
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించే కార్యక్రమం (పేపర్స్ లెయిడ్ ఆన్ ద టేబుల్) ఉంటుంది. బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలు కొద్ది సేపు విరామంతో వాయిదా పడతాయి. ఈ విరామ సమయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఆయన చాంబర్లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. మండలిలో చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో యధావిధిగా ఎజెండాను ఖరారు చేస్తారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ► రాజ్యాంగ నియమం ప్రకారం డిసెంబర్ 14వ తేదీ లోపుగా ఉభయ సభల సమావేశాలు జరిగి తీరాలి కనుక.. కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అనేకులు 60 ఏళ్లు దాటిన వారున్నప్పటికీ, తప్పనిసరిగా ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం సిద్ధం ► ప్రజా ప్రాధాన్యత గల అంశాలను చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, అత్యవసర ప్రాధాన్యత గల అంశాలను కానీ ప్రతిపక్షం చర్చకు తెస్తే ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చర్చకు తావిచ్చేందుకు, సమగ్రంగా అన్ని విషయాలు చర్చించేందుకు అధికారపక్షం మొగ్గు చూపుతోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రాధాన్యత గల అంశాలన్నింటిపైనా చర్చకు సిద్ధపడదామని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ, మండలిని నడిపిద్దామని సూచించారు. ► ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో సహా ఇతరత్రా సమస్యలు సుమారు 20 వరకు ఎంపిక చేసి, చర్చ కోసం అధికారపక్షం సిద్ధపడుతోంది. శుక్ర, ఆదివారాల్లో జరిగిన ప్రభుత్వ చీఫ్ విప్, విప్, మంత్రుల సమావేశాల్లో అధికార పక్షం ఆయా అంశాల వారీగా చర్చలో పాల్గొనే వారికి బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని వ్యూహం రూపొందించింది. అడ్డుకోవడమే ప్రతిపక్షం ఎజెండా ► ప్రజా సమస్యలపై ఒక దశ, దిశ లేకుండా సతమతం అవుతున్న ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వ కా>ర్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఉభయ సభల్లోనూ అడ్డుకుంటామని ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బాహాటంగానే ప్రకటించారు. ► ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చే అధికారిక బిల్లులను శాసనమండలిలో తమకున్న ఆధిక్యతతో అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై చర్చ కన్నా రాజకీయ లబ్ధి చేకూరే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ► రాష్ట్ర ప్రజలకు అవసరమా? లేదా? అనే అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం తెచ్చిన బిల్లును మండలిలో అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్దేశనం చేశారు. టీడీపీ అనుకూల మీడియాపై అసెంబ్లీ, మండలిలో ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు జరుగుతోందని, రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగి పోయిందని, రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఉభయ సభల్లో చర్చకు దిగాలని ప్రతిపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. 15 బిల్లులు.. 20 అంశాలు ► శీతాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు 5 రోజులు జరుగుతాయని భావిస్తున్నందున ఇప్పటి వరకు బిల్లుల స్థానంలో ఉన్న ఆర్డినెన్సులన్నింటికీ చట్ట రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని బిల్లుల వివరాలిలా ఉన్నాయి. ► ఏపీ పశుదాణా బిల్లు, చేపల దాణా బిల్లు, అక్వా కల్చర్ విత్తన బిల్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు బిల్లు, అసైన్మెంట్ భూమి బదలాయింపు నిషేధ సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను (3వ సవరణ) బిల్లుతో పాటుగా సుమారు 15 బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది. ► మరి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సమావేశాలు ముగిసే లోపు అవి కూడా సంబంధిత అనుమతులు పొందితే ఇదే సమావేశాల్లో చర్చకు వస్తాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ప్రజా ప్రాధాన్యం గల 20 అంశాలను సమావేశాల్లో చర్చకు తీసుకు రావాలని జాబితాను సిద్ధం చేసింది. చర్చకు రానున్న అంశాలు ► పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ. ► ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు, ► నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్ – విద్యుత్ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది. ► వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు. -
ప్రజా ప్రయోజనాల కోసమే..
చంద్రబాబులా బాహుబలి లాంటి గ్రాఫిక్స్ సినిమాలు చూపించకుండా మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆశ పడితే అది తప్పా? ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్లో ఆలస్యం జరగకూడదు. కుట్రలతో మంచి పనులు ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకే మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ‘ద టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ.. వాట్ ఈజ్ రైట్..’ (మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదే) అని చెప్పిన అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ సూక్తిని ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకోవాలి. -సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో నడుస్తున్నందు వల్లే శాసన మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ దీనికి కారణాలను సోదాహరణంగా వివరించారు. అసలు శాసనమండలి ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? గతంలో దీన్ని సమర్థించిన పత్రికలు, టీడీపీ ఇప్పుడు ఎలా యూటర్న్ తీసుకున్నాయి? అనే అంశాలను వివరించారు. నాడు రామోజీరావు కోసం శాసనమండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేస్తే అద్భుత నిర్ణయమని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాసిన ఈనాడుకు ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. ఇదేనా మీ ద్వంద్వనీతి? అని ప్రశ్నించారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా.. వద్దా? ‘‘అధ్యక్షా.. ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న సంగతి మనతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనందరి ముందు ఉన్న ప్రశ్న కేవలం మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా బతికించుకోవాలా.. వద్దా? అన్న ప్రశ్న మనముందు ఉంది. ప్రజా ప్రభుత్వాలు సజావుగా పని చేయలా.. వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేరుగా ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి. భరించలేక వద్దనుకున్నాయి.. ఇప్పుడు శాసనమండలి దేశంలో 28 రాష్ట్రాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే ఉంది. (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర). మండలిని భరించలేక ఈ వ్యవస్థ వద్దని పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. నాడు మాకు బలమున్నా కొనుగోలు చేసి గెలిచారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరులో మాకు బలమున్నా అతి నీచంగా కొనుగోలు చేసి గెలిచారు. అప్పుడూ ఈ ఎల్లో మీడియా చంద్రబాబును ఒక్కరోజైనా ప్రశ్నించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసే అవకాశం ఉన్నా అలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. ఇదే విషయాన్ని తొలిరోజే సభలో చెప్పా. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాజకీయాలను మార్చడానికి ఈ చట్టసభలో అడుగుపెట్టామే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. మండలి తప్పనిసరి కాదు రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ శాసన మండలి తప్పనిసరి అనుకుని ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలులేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది. రెండో సభను ఆప్షనల్‌గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి మండలి రద్దు అధికారాన్ని కూడా ఆర్టికల్ 169 ప్రకారం అసెంబ్లీకే అప్పగించారు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో.. మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఇదే శాసనసభలో ముగ్గురు పీహెచ్డీ చేసినవారు, 38 మంది పీజీ చేసినవారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు, ఇద్దరు గ్రూప్ – 1 అధికారులు, 1 ప్రొఫెసర్, 1 జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఇలాంటప్పుడు మండలి అవసరం ఏముంది? సోమవారం శాసన మండలి రద్దు తీర్మానంపై చర్చిస్తున్న అసెంబ్లీ కాలయాపనకే కౌన్సిల్.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండళ్లను ఏమనాలి? కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రజా ప్రయోజనం లేని మండలిపై డబ్బులు ఖర్చు చేయడం శుద్ధ దండగ. ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు ఈ మండలికి అర్హత లేదు. ఇటువంటి మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా? అని అంతా ఆలోచించాలి. మండలికి శాసనసభ జవాబుదారీ కాదు. పేదలు రూపాయి కూడా ఖర్చు చేయకుండా వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం బిల్లు తెచ్చినా, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తెచ్చిన ప్రత్యేక కమిషన్ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్న మండలి కారణంగా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఎలా హాని చేయాలి? బిల్లులను ఎలా అడ్డుకోవాలి? కత్తిరించాలి? అనే దిక్కుమాలిన ఆలోచనలు చేసే అలాంటి సభ మనకు అవసరమా? అన్నది ఆలోచన చేయాలి. నాడు ఈనాడు సమర్థించలేదా..? మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు టీడీపీ పాంప్లేట్ పేపర్ ఈనాడు దాన్ని సమర్థిస్తూ సంపాదకీయాలు రాసింది. అప్పుడు ఈనాడు ఏమేం రాసిందంటే... (క్లిప్పింగ్‌లను సీఎం చదివారు) అనుభవంలో వాటి (మండళ్ల) నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయి. అందుకు పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయనవసరం లేదు. నిరర్ధకమే కాక గుదిబండలా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లు గుండెలు బాదుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది.రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గంలో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచిపేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఇలా ఎంత చక్కగా రాశారు అధ్యక్షా అప్పట్లో! రామోజీ కోసం రద్దు చేశారు.. ఆనాడు మండలిని ఒక మనిషి కోసం రద్దు చేశారు అధ్యక్షా. ఆ మనిషి సాక్షాత్తూ ఈనాడు అధినేత రామోజీరావు. ఆనాటి రాజకీయాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారందరికీ ఈ విషయం తెలుసు. ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా మండలినే రద్దు చేసిన పరిస్థితి. అటువంటి మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప సంపాదకీయాలు రాశారు. ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంతో అడ్డుతగులుతున్నారు. అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలి రద్దు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మండలిని కొనసాగిస్తే వచ్చే ఏడాది మా పార్టీకి మెజారిటీ వస్తుందని తెలిసినా ప్రజల అవసరాలు, ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మండలి రద్దు కోసం తీర్మానం చేస్తున్నాం. ఆకర్ష్ అంటూ సిగ్గుమాలిన రాతలు.. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాస్తున్నాయి. ఇంత దిగజారిన రాతలు చంద్రబాబు పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్లంతా చంద్రబాబు హయాంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏ రోజైనా కనీసం నోరెత్తారా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ 5 ఎందుకు ప్రశ్నించలేదు? నోరెత్తకపోగా చంద్రబాబు గొప్ప రాజనీతి చాణక్యుడని, ఆయన పరిపాలన చూసి ముగ్దులై ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటూ దిక్కుమాలిన కథనాలు రాశాయి. చర్చ జరగాలనే మూడు రోజులు టైం మండలి రద్దు గురించే సభ పెడుతున్నామని గురువారం నాడే చెప్పాం. ప్రజలు చర్చించుకోవాలని సమయమిచ్చినా ఎమ్మెల్సీలను రూ. 5 కోట్లకు కొంటున్నామని టీడీపీ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మేం సమయం ఇవ్వకుంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేసేవారు. విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరో, అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే నైజం ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో, మోదీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో, మండలి విషయంలో చంద్రబాబు ఎన్నెన్ని యూటర్న్లు తీసుకున్నాడో గత ఐదేళ్లలో చాలా చూశాం. నిజంగా మాటలు ఎవరు మార్చారో ఒక్కసారి వీటిని చూస్తే తెలుస్తుంది (బాబు వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు). అవసరం తీరిన తరువాత ఎవరినైనా వెన్నుపోటు పొడవటానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి బాబు. చంద్రబాబు యూటర్నులు కాంగ్రెస్ పార్టీ గురించి ముందు.. - కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీనా? చెత్త పార్టీ. ఇది సోనియాగాంధీ సామ్రాజ్యం కాదు. ఇది ఇటలీ కాదు ఇది ఇండియా - కాంగ్రెస్‌కు సహకరిస్తే వారిని ఏమనాలి...? ఆ పార్టీనే శాశ్వతంగా బాయ్‌కాట్ చేయాలి. అప్పుడు కూడా కసి తీరదు - సోనియా, రాహుల్ ఇంతవరకు ఒక్క మాట అయినా విభజన గురించి మాట్లాడారా? మీకు చేతకాదా? మీరు నాయకులా? ఏమనుకుంటున్నారు మీ గురించి అని అడుగుతున్నా. - ఆ మహాతల్లి (సోనియా)కి ఎక్కడ లేని డబ్బు పిచ్చి. డబ్బులు లేకపోతే ఆవిడకు నిద్ర పట్టదు. సోనియా ఇటలీ నుంచి వచ్చింది. మన కష్టాలు తెలిసిన వ్యక్తా? కాదు. - కాంగ్రెస్‌ను ఎండగడతాం. ఈ దేశంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెడతా. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయింది. ఆ వెంటిలేటర్ ఎప్పుడు తీసేస్తే అప్పుడు చనిపోతుంది. - కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. నీచమైన రాజకీయాలు చేస్తోంది. æ సోనియాగాంధీ ఈ దేశానికి వచ్చి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకువచ్చిందంటే చాలా దుర్మార్గం - తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో పోరాడాం. కాంగ్రెస్‌తో లాలూచీ పడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఉండబోదు తరువాత - కాంగ్రెస్, మేమూ కలసి పనిచేస్తున్నాం. మా మధ్య సమస్య ఉండదు. మేము కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. - పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. 90 శాతం డబ్బులు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. - మోదీ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. కొత్త ప్రధాని వస్తారు. - మేము కూర్చొని మాట్లాడుతున్నాం. రాహుల్‌ను కూడా ఆయన పార్టీలో చర్చించమని కోరా. మేం ఓ ఉమ్మడి వేదిక మీదకు వస్తాం. కలసి ఎలా పనిచేయాలన్నది నిర్ణయిస్తాం. నరేంద్ర మోదీ గురించి ముందు.. - మోదీ సమర్థుడు. ఆయన ప్రధాని కాబోతున్నారు. ఎవరూ అడ్డుకోలేరు. నాదీ నరేంద్రమోదీదీ విన్‌విన్ కాంబినేషన్. - అభివృద్ధి కోసం మోదీతో కలసి పనిచేయాలని భావిస్తున్నాను. - స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు. కానీ భారతదేశం ప్రతిష్టను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ. - సమర్థుడైన మోదీ నాయకత్వంలో భారతదేశం త్వరలోనే సూపర్వపర్గా తయారవుతుంది. - మోదీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. తరువాత... - గురువుకు నామాలు పెట్టింది నరేంద్ర మోదీ. తల్లిని చూడలేదు. తల్లికి బిచ్చం పెట్టనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడంట. - నరేంద్రమోదీ కంటే మిగతా నాయకులంతా మెరుగైన వారే. - నరేంద్రమోదీ కరుడుగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. - నరేంద్ర మోదీకి ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. - హుందాతనం ఏమైంది. పోలవరం ఈయన ఇచ్చాడంటాడు... ఈయన ఇచ్చేదేంటి పోలవరం. మన రాజధాని శంకుస్థాపనకు ఆయన్ని పిలిచాను. ఏం ఇచ్చారు...మట్టీ, నీళ్లు మన ముఖాన కొట్టాడు. - మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా గురించి ముందు .. - ప్రత్యేక హోదా ఇవ్వాలి ఐదేళ్లు ఇచ్చారు. నరేంద్రమోదీని కోరుతున్నా 15 ఏళ్లు ఇవ్వండి. ఐదేళ్లలో పరిశ్రమలు రావాలంటే రెండుమూడేళ్లవుతుంది. అది ప్రారంభమయ్యేలోగా ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా. తరువాత - కావాలని కొందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే అదేదో సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందండి? రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ... రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు తగ్గించేశారు. 62 శాతం నుంచి 52శాతానికి వచ్చింది. ఇక ఈఏపీ ఏంటీ... కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ఇస్తే ...మళ్లా వాళ్లు మంత్రిమండలిలో ఆమోదించాలి. - నేను మొదట అడిగింది ప్రత్యేక హోదానే. కాదు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారన్నారనుకో. నేను కాదనను కదా. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? - ప్రత్యేక హోదాతోనే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు , పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదేం... - ఈ రోజు కేంద్రం ఇచ్చిందానికి అభినందిస్తూనే...వాళ్లు ఎంతిచ్చినా తీసుకోవడం...ముందుకు పోవడం తప్పా మనకు మరో మార్గం లేదు. మళ్లీ : ప్రత్యేక హోదా మినహా మనకు మరో మార్గం లేదు. చంద్రబాబూ ఈ ప్రశ్నలకు బదులేది? - ఎస్సీ ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది. వారి క్షేమాన్ని కాంక్షించి ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లు తెచ్చాం. దీన్ని అడ్డుకోవడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? - రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులు తేవడం న్యాయమా.. అన్యాయమా? - ఏ అన్యాయం జరిగిందని ఆయన అమరావతి రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నారు? రైతులకు కౌలు (యాన్యుటి) 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా? - రాజధానిలో భూమి లేని నిరుపేదలకు జీవనభృతి రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం అన్యాయమా? - అసైన్డు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ప్లాట్లు ఇవ్వడం మేం చేసిన తప్పా? - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగితే నేరమా? - వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలనుకోవడం నేరమా? - స్వాతంత్య్రానికి పూర్వం 1937నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా? -
కరెంట్ కోతలపై పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: చట్టసభల సాక్షిగా ప్రతిపక్షం విద్యుత్ అంతరాయాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అబద్ధాలు చెప్పడమే విపక్షానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి లేవనెత్తిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బదులిచ్చారు. ఈ దశలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం జోక్యం చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గా ఉందా లేదా అనేది వివరాలతో సహా చెబుతున్నాం. కనీసం ఇది కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోవడంలేదు. విద్యుత్ అంతరాయాల వివరాలు ఎవరికి తెలుస్తాయి.. సంబంధిత మంత్రికి కాదా. చట్టసభలో మీరు పదేపదే అబద్ధాలు మాట్లాడుతుంటే వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి సమాచారం తెప్పించి, సభ ముందు ఉంచాలనే నేను కల్పించుకుని మాట్లాడుతున్నాను’ అని అన్నారు. విద్యుత్ వ్యవస్థను అప్పుల్లోకి నెట్టారు మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ రంగాన్ని రూ.70వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విభజన నాటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందనే విషయాన్ని వక్రీకరించారన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం విద్యుత్ లైన్లు, ఫీడర్లను పరిశీలించ లేదన్నారు. తాము ఈ పనిచేశామని, దీనివల్ల అక్కడక్కడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయన్నారు. గతేడాదితో పోలిస్తే తక్కువ ఫీడర్లు, తక్కువ గంటల్లోనే అంతరాయం నమోదైందన్న విషయాన్ని సభ ముందుంచారు. విద్యుత్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, 2021 నాటికి మరో 1600 మెగావాట్ల అదనపు ఉత్పత్తి వస్తుందని తెలిపారు. -
బెడిసికొట్టిన చంద్రబాబు ఎత్తుగడ
సాక్షి, అమరావతి: రాజధాని అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని భావించి టీడీపీ శాసనసభలో మరోసారి బొక్కబోర్లా పడింది. అమరావతి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం అనుసరించిన స్విస్ చాలెంజ్ విధానాన్ని సమర్థించుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. ఇక సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం అంటూ చేసిన వాదన కూడా ఆయన చదివి వినిపించిన లేఖతోనే నీరుగారిపోవడంతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. అమరావతి అంశంలో తమ ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. పత్రాలు ఉంటే కదా.. తేవడానికి రాజధాని అంశంపై శాసనసభలో మంగళవారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్సీపీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఎన్నో ఏళ్ల క్రితమే తప్పుబట్టిన స్విస్ చాలెంజ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం అనుసరించడం వెనుక భారీ అవినీతి దాగుందని దుయ్యబట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రస్ అల్ ఖైమాకు చెందిన ఆన్‌రాక్ సంస్థతో స్విస్ చాలెంజ్ విధానంలోనే అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని విమర్శించారు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వంతో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్సార్ ప్రభుత్వం ఆన్‌రాక్ సంస్థతో స్విస్ చాలెంజ్ విధానంలో ఒప్పందం చేసుకుందని టీడీపీ నిరూపిస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా’’ అని సవాల్ విసిరారు. తన ఆరోపణలను నిరూపిస్తానని అన్న చంద్రబాబు తన పక్కనే ఉన్న అచ్చెన్నాయుడుకు ఏదో చెప్పి బయటకు పంపించారు. కాసేపటికి అచ్చెన్నాయుడు ఒట్టి చేతులతో సభలోకి వచ్చారు. వెంటనే మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘‘అచ్చెన్నాయుడూ.. ఏవీ పత్రాలు? తేలేదా? ఉంటే కదా తేవడానికి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించలేదు’’ అని స్పష్టం చేశారు. దాంతో చంద్రబాబు మాట మార్చారు. వైఎస్సార్ ప్రభుత్వం ఆన్‌రాక్ సంస్థతో అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుందని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘‘స్విస్ చాలెంజ్ విధానానికి, ఎంవోయూకు తేడా తెలియని చంద్రబాబు మొన్నటివరకు సీఎంగా ఉండటం మన ఖర్మ. రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు గత ఐదేళ్లు సీఎంగా ఉండటంతోనే ఎక్కువ నష్టం జరిగింది’’ అని ఘాటుగా విమర్శించారు. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వంతో టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని చంద్రబాబు చెప్పడాన్ని మంత్రి బొత్స తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదని, ఓ కంపెనీతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. వెంటనే చంద్రబాబు స్పందిస్తూ.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. ఆ లేఖలో ‘సింగపూర్ కంపెనీల కన్సార్టియం’ అని ఉండటాన్ని వైఎస్సార్సీపీ సభ్యుడు పార్థసారథి ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని బొత్స విమర్శించారు. ఎన్.జనార్థన్‌రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే.. తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు ఆయనే శంకుస్థాపన చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని బొత్స సవాల్ విసిరారు. -
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
-
వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయి?
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి నీరు లీకేజీ ఘటనపై సీఆర్డీఎ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే వైఎస్ జగన్ చాంబర్లోకి వర్షపు నీళ్లు లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలన జరిపారు. లీకేజీ ఎక్కడి నుంచి జరిగిందన్న విషయంపై అసెంబ్లీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ప్రశ్నించారు. ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయంటూ రూఫ్ పైన ఫైర్ ఇంజిన్‌తో నీటిని పంప్ చేసి పరిశీలించారు. సీలింగ్ లో ఏర్పడిన లోపం కారణంగానే నీరు లీకైనట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మంగళవారంనాడు కురిసిన వర్షంతో చాంబర్ సీలింగ్ నుంచి వర్షపు నీరు ధారగా కారడంతో.. ఆ అంశంపై శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి కూడా ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్లో వర్షపు నీరు పైనుంచి లీకై చేరింది. ఆ ఘటనపై అప్పట్లో రాద్ధాంతం చేసిన అధికార పార్టీ తూతు మంత్రపు విచారణ జరిపించింది. పైగా నీరు లీకేజీకి సంబంధించి కుట్ర ఉందని అధికార పార్టీ హైడ్రామాకు తెరలేపింది. అప్పట్లో పైపై రిపేర్లు చేసి నట్టు ప్రకటించారు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ప్రతిపక్ష నేత చాంబర్లోకి మరోసారి నీరు లీకవడం గమనార్హం. -
నేడు ప్రైవేట్ వైద్యం బంద్!
విజయవాడ : ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు సంబంధించిన మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దీనివల్ల చిన్న ఆసుపత్రులు మూతపడతాయని, ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) వ్యతిరేకించింది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు(గురువారం) వైద్యం బంద్‌కు పిలుపినిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ చట్టం ఉంది. మళ్లీ కొత్తగా కేంద్రం తెచ్చిన ఈ చట్టానికి ఎందుకు ఆమోదం తెలపాలని, ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓపీ సేవలు నిలిపివేత క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలకు మాత్రమే వైద్యం అందించనున్నారు. భవిష్యత్ కార్యచరణపై ఐఎంఎ హాల్లో వైద్యులు సమావేశం కానున్నట్లు డా.వాడ్రేవు రవి తెలిపారు. -
మనిషిని కోసుకొని తింటే..
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో టీడీపీ-బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌లు పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో గంటా.. ‘బీజేపీ అంటేనే మనుషులను కోసుకుని తినే పార్టీ’ అని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే: ఏపి విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియపై బుధవారం మండలిలో స్వల్ప చర్చ జరిగింది. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. 17 జాతీయ సంస్థలకుగానూ ఏపీ ప్రభుత్వం 3508 ఎకరాలు కేటాయించిందని, ప్రస్తుతానికి ఐదు విద్యా సంస్థల్లో క్లాసులు నడుస్తున్నాయని,అయితే శాశ్వత నిర్మాణాలు పూర్తికానందున వాటిని తాత్కాలిక భవనాల్లోనే తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. సంచలన వ్యాఖ్యలు: ‘‘బిల్డింగ్స్ లేని కారణంగా సీట్లు నిండటంలేదు. నిర్మాణాలు చేపట్టమని కేంద్రాన్ని అడిడితే స్థలం ఇవ్వలేదని సాకులు చెబుతోంది. చాలా సార్లు కేంద్ర మంత్రిని కలిసినా ఫలితంరాలేదు. అధ్యక్షా.. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఏపీపై కక్షకట్టి అన్యాయం చేస్తున్నది. కోడి కోసుకుని తింటే అది చికెన్ పార్టీ, మేకను కోసుకుని తింటే అది మటన్ పార్టీ, అదే మధ్యతరగతి మనిషిని కోసుకుని తింటే అది భారతీయ జనతాపార్టీ’’ అని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. బీజేపీ ఫైర్: తమ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి గంటాపై బీజేపీ సభ్యులు ఫైరయ్యారు. ‘‘తలుచుకుంటే మీకన్నా ఎక్కువే అనగలం. కానీ ఇది అసెంబ్లీ అన్న సంగతి మర్చిపోవద్దు. మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత అనుచితంగా మాట్లాడటం సరికాదు’’ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 30,31, వచ్చే నెల 1, 5న సెలవుగా ప్రకటించారు. అలాగే 28 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
నదుల అనుసంధానం బీజేపీ చొరవే: వీర్రాజు
సాక్షి, అమరావతి: కేంద్రం చొరవతోనే రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ పథకం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం శాసన మండలిలో తెలిపారు. గురువారం మండలిలో ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నదుల అనుసంధానం మొదటగా బీజేపీయే ప్రవేశ పెట్టిందని అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1998లోనే నదుల అనుసంధానం కోసం సురేష్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశరని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుగానే కాలువలు తవ్వించారని వీర్రాజు పేర్కొన్నారు. పోలవరం మాదిరిగానే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఓ వారం కేటాయించాలని సూచించారు. ముంపు మండలాలను ఆంధ్రలో కలపడానికి కారణం బీజేపీయేనని వీర్రాజు తెలిపారు. ఆ మండలాలను ఆంధ్రలో కలపకుంటే కేసీఆర్ పోలవరానికి అడ్డుపడేవాడని ఆయన అన్నారు. -
పట్టిసీమపై బీజేపీ, టీడీపీ మాటల యుద్ధం
-
బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..
సాక్షి, అమరావతి : ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు. 30 పంపులు ఏర్పాటు చేస్తామని 24 పంపులే ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.1170 కోట్లు అంచనా వేసి చివరకు రూ.1487 కోట్లు చెల్లించారన్నారు. ఆధారాలు లేకుండా తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని అన్నారు. దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. దీంతో మంత్రులు...విష్ణుకుమార్ రాజుపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టిసీమపై బీజేపీ చవకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేయండి.. ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లలేరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేయడంతో...దమ్ముంటే రాజీనామాలు చేద్దాం రండి అంటూ విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడకపోతే మంత్రులకు భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని, ఆ అవసరం తనకు లేదని అన్నారు. కాగ్ నివేదికను చదివే మాట్లాడుతున్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రుల భాష సరిగా లేదు ఏపీ మంత్రుల తీరును మంత్రి మాణిక్యాలరావు తప్పుబట్టారు. పట్టిసీమపై విష్ణుకుమార్ రాజు ఆధారాలతోనే మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు తప్పు చేయకపోతే విచారణకు సిద్ధంగ కావాలన్నారు. మంత్రుల భాష సరిగా లేదని, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే ప్రజా ద్రోహులవుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. -
క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ఉపయోగించిన మాటలు కొన్ని కులాలను కించపరిచేలా ఉన్నాయని గ్రహించినట్లు, అందుకుగానూ క్షమాపణలు కూడా చెబుతున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై నేను మండలిలో మాట్లాడాను. ఆ సందర్భంగా.. టీడీపీ నాయకులను ఉద్దేశించి కొన్ని పదాలను వాడాను. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ మణిశంకర్ అయ్యర్ వాడిన పదాలు ఎంత వివాదాస్పదమయ్యాయో గుర్తురాగానే.. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు చైర్మన్‌కు తెలిపాను. నా మాటలతో గాండ్ల కులస్తుల హృదయాలు గాయపడినందున క్షమాపణలు కోరుతున్నా’’ అని వీర్రాజు పేర్కొన్నారు. సోము ప్రకటన.. -
మరోసారి మాట మార్చిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మాట మార్చారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన... సభలో కొత్త పల్లవి అందుకున్నారు. పోలవరం నిర్మాణ పనుల్ని తాను అడగలేదని ...నీతి ఆయోగ్ సిఫార్సుతోనే కేంద్రం తనకు అప్పగించిందని చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించిందని క్యాబినెట్‌తో పాటు, అసెంబ్లీలో చెప్పుకున్న చంద్రబాబు...ఇప్పుడిలా మాట మార్చడంపై ఇతర పార్టీ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇక చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.....‘హోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని అడిగారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఎందుకు వెనక్కి వెళ్తోంది. నా మీద ఒక్కొక్కర్ని పంపి దాడి చేయిస్తారా?. నేను ఆగస్టు సంక్షోభం, విభజన సంక్షోభం చూశాను. ఇప్పుడు మూడో సంక్షోభం చూస్తున్నాను. సహకరిస్తామన్న మిత్రపక్షం, యుద్ధం చేస్తానంటోంది. పోలవరాన్ని నేను తీసుకున్నానని ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నేను తీసుకోలేదు. కేంద్రమే అప్పగించింది. రాత్రి కల వస్తే..పొద్దున్నే కొంతమంది మాట్లాడుతున్నారు. నేను భూసేకరణ, పునరావాసం డబ్బులు ఇస్తానని చెప్పలేదు. పోలవరంలో ఎవరైనా చేతులు పెడితే అవి కాలిపోతాయి. నేను ప్రాజెక్ట్ కోసం లాలూచీ పడ్డట్లు ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. -
ఎన్నికలు దగ్గరపడేసరికి హోదా రాగం అందుకున్నారు
-
ప్రత్యేక హోదాపై తిరగబడ్డ తీర్మానం
-
అసెంబ్లీ: ప్యాకేజీపై చంద్రబాబు గతంలో ఏమన్నారు..
-
అసెంబ్లీ: హోదా తీర్మానంపై బాబు ఇప్పుడేమన్నారు..!
-
హోదా.. అసెంబ్లీలో అనూహ్య తీర్మానం!
-
హోదాపై యూటర్న్ : అసెంబ్లీలో తీర్మానం!
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి పిల్లిమొగ్గ వేసింది. గతంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటూ.. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ అదే శాసనసభ వేదికగా మరోసారి తీర్మానం చేసింది. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్న ముమ్మరం చేసిన తరుణంలో చంద్రబాబు సర్కారు హోదాపై ఈమేరకు యూటర్న్ తీసుకుంది. గతంలో ప్రత్యేక హోదా కంటే గొప్ప ప్యాకేజీని తీసుకొచ్చామంటూ.. ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి అభినందనలు తెలుపుతూ అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు తీర్మానం చేసింది. ఆ విషయాన్ని, గతంలో ప్యాకేజీ గురించి చంద్రబాబు చెప్పిన గొప్పలను నిస్సంకోచంగా మరిచిపోయిన టీడీపీ సర్కారు.. ఇప్పుడు మళ్లీ హోదా మాట ఎత్తుకుంది. హోదా సాధనకు ప్రజలు ఆందోళనలకు సిద్ధమవుతుండటం, హోదా కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పోరాటాలను తీవ్రతరం చేసిన నేపథ్యంలో హోదా కోసం బాబు ప్రభుత్వం తీర్మానం చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హోదాపై తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. -
చంద్రబాబూ.. అది నిజం కాదా!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పడం అవాస్తవమని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుండానే డబుల్ డిజిట్ గ్రోత్‌ను రాష్ట్రం సాధించిందా? అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వకుండానే 24 గంటల విద్యుత్ సరఫరా వచ్చిందా? అని ప్రశ్నించారు. సాంకేతికంగా సాధ్యపడదు కాబట్టే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని గతంలో చంద్రబాబు స్వాగతించిన విషయం నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ నిధులు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలుపాలని డిమాండ్ చేశారు.