Antarctica
-
అంటార్కిటికా హరితమయం!
న్యూఢిల్లీ: మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ద్వీపకల్పం క్రమంగా హరితమయం అవుతోంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతోంది. పచి్చక పరిధి విస్తృతమవుతోంది. గత మూడు దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ పరిణామం ఇటీవల 30 శాతానికిపైగా వేగం పుంజుకున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అంటార్కిటికా పరిణామాలపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాటిలైట్ డేటాను ఉపయోగించారు. అంటార్కిటికాలో 1986లో చదరపు కిలోమీటర్ కంటే తక్కువ వైశాల్యంలో పచ్చదనం ఉండగా, 2021 నాటికి అది 12 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నట్లు తేల్చారు. ఇక్కడ పచ్చదనం పెరిగిపోతుండానికి కారణంగా భూతాపం, వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఒకవైపు మంచు పరిమాణం తగ్గిపోతుండగా, అదే సమయంలో పచ్చదనం పెరుగుతోంది. ఈ రెండింటికీ సంబంధం ఉందని అంటున్నారు. ఆధునిక కాలంలో ప్రపంచ సగటుతో పోలిస్తే అంటార్కిటికా ద్వీపకల్పం వేగంగా వేడెక్కుతోంది. ఇక్కడ వడగాల్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. మంచి కరిగిపోయి, ఆ ప్రాంతంలో పచి్చక కనిపిస్తోంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పచి్చక అని సైంటిస్టులు చెప్పారు. వాతావరణ మార్పులను అడ్డుకోకపోతే అంటార్కిటికాలో మంచు పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
ITGC Thwaites Glacier: ‘ప్రళయ’ గ్లేసియర్తో... విలయమే!
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్‌డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది. ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్‌కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది! అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్‌డే (ప్రళయకాల) గ్లేసియర్‌గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్‌వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్‌బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు... → డూమ్స్‌డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. → మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది. → అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్‌డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది. → డూమ్స్‌డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
సముద్ర గర్భంలో ఏకంగా 8 అగ్నిపర్వతాలు
అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్ఐఆర్ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్ఐఆర్ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి. సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద విమానం
నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్ అరుదైన ఘనత సాధించింది. అతి పెద్ద ప్యాసింజర్ విమానం బోయింగ్ 787ను అంటార్కిటికాలోని "బ్లూ ఐస్ రన్‌వే"పై సురక్షితంగా ల్యాండ్ చేసింది. నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం అంటార్కిటికాలోని ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగింది. 330 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల భారీ ఎయిర్‌క్రాఫ్ట్ అంటార్కిటికా ఖండానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. "నార్స్కి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. అంటార్కిటికాలో ల్యాండ్ అయిన మొట్టమొదటి బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్. ఈ ఘనతతో నార్స్ ఓ మైలురాయిని చేరింది. ఇందుకు మేము గర్వంగా భావిస్తున్నాము" అని ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. "ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగిన అతిపెద్ద విమానం. దీంతో ఒకేసారి ఎక్కువ మందిని అంటార్కిటికాకు తీసుకెళ్లగలమని భావిస్తున్నాం.' అని డైరెక్టర్ కెమిల్లా బ్రెక్కే చెప్పారు. ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను జత చేస్తూ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ ట్వీట్ చేసింది. Largest aircraft ever to land on #TrollAirfield! "This demonstrates our capability of performing more effective flight operations to #Antarctica by carrying a larger scientific/logistics crew, more cargo with a smaller environmental footprint", says NPI-director, Camilla Brekke, pic.twitter.com/7vjsSw0gPI — Norsk Polarinstitutt // Norwegian Polar Institute (@NorskPolar) November 16, 2023 అంటార్కిటికాలోని క్వీన్ మౌడ్ ల్యాండ్‌లోని రిమోట్ ట్రోల్ రీసెర్చ్ స్టేషన్‌కు అవసరమైన పరిశోధన పరికరాలు, శాస్త్రవేత్తలను తీసుకెళ్లడం ఎయిర్‌లైన్ డ్రీమ్‌లైనర్ లక్ష్యం. అంటార్కిటిక్ అన్వేషణకు అవసరమైన 12 టన్నుల పరిశోధన పరికరాలను విమానంలో తీసుకెళ్లారు. నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో సహా మొత్తం 45 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా ఖండంలో విమానం ల్యాండ్ చేయడం సవాలుతో కూడి ఉంటుంది. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్‌లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్‌పోల్‌లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
National Snow and Ice Data Center: అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. -
Global warming: సముద్ర జీవజాలానికి భూతాపం ముప్పు
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న శిలాజ ఇంధనాల వినియోగం.. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం. వీటివల్ల భూగోళంపై మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం భూమిపై ఉన్న జీవజాలమే కాదు, సముద్రాల్లోని జీవులు సైతం అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు. ► ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేది యథాతథంగా కొనసాగితే అంటార్కిటికాలో మంచు మరింత కరిగి, ఆ మంచినీరంతా సముద్రాల్లోకి చేరుతుంది. ► కొత్త నీటి రాకతో సముద్రాల ఉపరితల జలంలో లవణీయత, సాంద్రత తగ్గిపోతుంది. ఈ పరిణామం సముద్ర ఉపరితలం నుంచి అంతర్భాగంలోకి జల ప్రవాహాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సముద్రాల్లో పైభాగం నుంచి లోపలి భాగంలోకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్భాగంలో కూడా ఒకచోటు నుంచి మరోచోటుకి జల ప్రవాహాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ► మంచు కరిగి, కొత్త నీరు వస్తే సముద్రాల పైభాగం నుంచి 4,000 మీటర్ల(4 కిలోమీటర్ల) దిగువన నీటి ప్రవాహాలు తొలుత నెమ్మదిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా స్తంభించిపోతాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. ► నీటి ప్రవాహం స్తంభిస్తే సముద్రాల్లో లోతున ఉండే ప్రాణవాయువు(ఆక్సిజన్), ఇతర పోషకాలు సైతం అంతమైపోతాయని సైంటిస్టు ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లాండ్ చెప్పారు. దీంతో సముద్రాల్లోని జీవుల మనగడకు అవసరమైన వనరుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఇదంతా మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు. ► సముద్రాల్లో జలమట్టం పెరిగితే ఉపరితలంపై కొత్త నీటి పొరలు ఏర్పడుతాయి. దానివల్ల సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను శోషించుకోలేవు. అంతేకాకుండా తమలోని కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సముద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఉధృతమవుతాయి. ఫలితంగా భూగోళం మరింత వేడెక్కుతుంది. ► అంటార్కిటికాలో ప్రతిఏటా 250 ట్రిలియన్ టన్నుల చల్లని, ఉప్పు, ఆక్సిజన్‌తో కూడిన నీరు చేరుతుంది. ఇది ఉత్తర దిశగా విస్తరిస్తుంది. హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోకి ఆక్సిజన్‌ను చేరుస్తుంది. రానున్న రోజుల్లో అంటార్కిటికా నుంచి విస్తరించే ఆక్సిజన్ పరిమాణం తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ► ప్రపంచ కర్బన ఉద్గారాలను సమర్థంగా నియంత్రించకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో అంటార్కిటికాలోని సముద్రాల కింది భాగంలో జల ప్రవాహం ఆగిపోతుందని, సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంటార్కిటికా కరిగిపోతోంది!
పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది! ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వనించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు! అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత 40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా తేలింది. 1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటినుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్ విల్ హాబ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మి కి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ తీరాలన్నీ మునకే! ♦ అంటార్కిటికా మహాసముద్రంలో ఉండే అపార హిమ రాశి తీరానికి కాస్త సమీపంలో ఉండే మంచుపై తుఫాను గాలుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఆ హిమ రాశి ప్రస్తుత వేగంతో కరిగిపోతూ ఉంటే అలల తాకిడి వేగం బాగా పెరుగుతుంది. దాంతో సముద్రంలో తీరానికి సమీపంలో ఉన్న మంచూ క్రమంగా బలహీనపడి కరుగుతుంది. తర్వాత ఆ ఖండంలో నేలపై ఉన్న అపారమైన మంచుకు, హిమానీ నదులకు స్థిరత్వమిచ్చే ఈ ఆసరా శాశ్వతంగా కనుమరుగవుతుంది. ♦ పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్, బెలింగ్హసన్ సముద్రాల్లో మంచు ఊహాతీత వేగంతో కరగడం శాస్త్రవేత్తలను మరీ కలవరపెడుతోంది. అంటార్కిటికాలో సగటు మంచు పరిమాణం 2014 దాకా ఎంతో కొంత పెరిగిన సమయంలో కూడా ఈ సముద్రాల్లో మంచు కరుగుతూనే వచ్చింది! ♦ పశ్చిమ అంటార్కిటికాలోనే ఉన్న త్వాయిట్స్ హిమానీ నదం కూడా క్రమంగా కరుగుతోంది. కేవలం ఇదొక్కటి గనక పూర్తిగా కరిగిందంటే సముద్ర మట్టాలు ఏకంగా అర మీటరు పెరుగుతాయి! అందుకే దీన్ని ‘డూమ్స్‌డే గ్లేసియర్’గా పిలుస్తారు! ♦ గత ఫిబ్రవరిలో తొలిసారిగా అంటార్కిటికా ఖండపు తీర రేఖలో ఏకంగా మూడింట రెండు వంతులు ఏ మాత్రం మంచు లేకుండా సముద్రపు జలాలతో బోసిపోయి కనిపించిందట! ♦అంటార్కిటికా సముద్రంలోని అపారమైన మంచు ఇలా కరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు మీటర్ల మేరకు పెరుగుతాయి! ♦ దాంతో తీర ప్రాంతాలన్నీ ముంపు బారిన పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా నగరాలెన్నో ఈ జాబితాలోకి వస్తాయి! అది కోట్లాది మందిని నిర్వాసితులను చేసి ఊహించని పెను విషాదానికి దారి తీస్తుంది. మున్ముందు మరింత ముప్పే! సమీప భవిష్యత్తులో అంటార్కిటికాలో మంచు కరిగే వేగం తగ్గే సూచనలేవీ పెద్దగా లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అంటార్కిటికాపై కొన్నేళ్లుగా చాలా పడుతోంది. కనుక సముద్రపు మంచు కరిగే వేగానికి ఇప్పుడప్పట్లో అడ్డుకట్ట పడుతుందని భావించడం అత్యాశే’’ అని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన ఓషనోగ్రాఫర్, వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లండ్ కుండబద్దలు కొట్టారు. అక్కడి మంచు ఈ స్థాయిలో కరగడం కచ్చితంగా పెను ప్రమాద సూచికేనని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటార్కిటికా సముద్రంలోని మంచు ఈ స్థాయిలో కరిగిపోతుండటం వెనక గ్లోబల్ వారి్మంగ్‌తో పాటు ఇంకేమేం కారణాలున్నాయో వెదికి వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు. కోల్‌కతా, చెన్నైలకు ముంపు ముప్పు.. సముద్ర మట్టాల పెంపు వల్ల ముప్పు ముంపున్న మహా నగరాల జాబితాలో కోల్‌కతా, చెన్నై ముందున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరుగుతూ ఉంటే 2100 నాటికి ఆ రెండు నగరాల్లో సముద్ర మట్టాలు 20 నుంచి 30 శాతం దాకా పెరిగే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆసియాలో యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, మనీలా కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ♦ సముద్ర ప్రవాహాల్లో మార్పుల వల్ల సముద్ర మట్టాల్లో పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. వీటితో పాటు ఎల్ నినో తదితరాల ప్రభావాలను కూడా అధ్యయనం చేసి న మీదట ఈ నివేదికను రూపొందించారు. విశేషాలు... ♦ సముద్ర మట్టాల్లో పెరుగుదల కేవలం వాతావరణ మార్పులతో పోలిస్తే అంతర్గత వాతావరణ మార్పులూ తోడైనప్పుడు మరో 20, 30 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఎక్కువగా ఉంటుంది! ♦ అమెరికా పశ్చిమ తీరంతో పాటు ఆ్రస్టేలియాకు కూడా ఈ ముంపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ♦ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతా, ముంబై తీర ప్రాంతాల్లో వరదలు 2006తో పోలిస్తే 2100 నాటికి కనీసం 18 రెట్ల నుంచి ఏకంగా 96 రెట్ల దాకా పెరిగే ఆస్కారముంది. -
మంచుఖండం మనసైన సాహసం
అంటార్కిటికా విహారం తెర మీద చూసినంత సౌకర్యంగా ఉండదు. కానీ మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదంగా ఉంటుంది జర్నీ. అంటార్కిటికా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా పర్యటించాల్సిందే అనుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు హసన్ అరుణ్. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఎకనమిక్స్ చదువుతున్న అరుణ్ గత డిసెంబర్లో అంటార్కిటికా సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశేషాలను లండన్ నుంచి సాక్షితో పంచుకున్నాడు. మూడు సముద్రాల కలయిక ‘‘అంటార్కిటికా గురించి తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంటర్నెట్లో ఉన్న సమాచారం నాకు సంతృప్తినివ్వలేదు. స్వయంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనుకున్నాను. ఆ అడ్వెంచర్‌ని ఎంజాయ్ చేయాలని కూడా. హైదరాబాద్ నుంచి గత డిసెంబర్ 21వ తేదీ బయలుదేరి దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత బ్రెజిల్ లోని ‘రియో డీ జెనీరో’మీదుగా అర్జెంటీనా రాజధాని ‘బ్యూనోస్ ఎయిరిజ్’కి చేరాను. అక్కడ మూడు రోజులున్నాను. ప్రపంచం అంచు అని చెప్పే ‘ఉషుయాయియా’ ను చూశాను. అంటార్కిటికా క్రూయిజ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఉషుయాయియా నుంచి 26వ తేదీ ఉదయం క్రూయిజ్ ప్రయాణం మొదలైంది. బీగెల్ చానెల్లో సాగుతుంది క్రూయిజ్ ప్రయాణం. డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ఒకటిన్నర రోజు ప్రయాణించాలి. ఈ జర్నీలో అత్యంత క్లిష్టమైన ప్రదేశం ఇదే. అట్లాంటిక్, పసిఫిక్, సదరన్ ఓషన్ ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది. అలలు నాలుగు మీటర్ల నుంచి పదకొండు మీటర్ల ఎత్తు లేస్తుంటాయి. సీ సిక్నెస్ వచ్చేది ఇప్పుడే. తల తిరగడం, వాంతులతో ఇబ్బంది పడతారు. సిక్నెస్ తగ్గడానికి మందులు, సీ బ్యాండేజ్ ఇస్తారు. ఈ స్థితిలో నిద్ర సమయం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ రెండు ఉంటుంది. క్రూయిజ్ లోపల ఏసీ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓపెన్ ప్లేస్‌లో నాలుగైదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉండలేం. అలలు పైకి లేచినప్పుడు అంత భారీ క్రూయిజ్ కూడా నీటి తాకిడికి కదిలిపోతుంటుంది. అలలు ఆరు మీటర్ల ఎత్తు వస్తున్నంత వరకు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంతకు మించితే మాత్రం క్రూయిజ్ ఆగాల్సిందే. లంగరు వేసి వాతావరణం నెమ్మదించిన తర్వాత కదులుతుంది. మా జర్నీలో నాలుగు మీటర్లకు మించలేదు, కాబట్టి ఆగాల్సిన అవసరం రాలేదు. నేలను పలకరిస్తూ నీటిలో ప్రయాణం వెడెల్ సీలోకి ప్రవేశించామంటే అంటార్కిటికా ఖండంలోకి అడుగుపెట్టినట్లే. వెడెల్ సీ లో దాదాపు సగం రోజు సాగుతుంది ప్రయాణం. గ్లేసియర్లు, ఐస్‌బెర్గ్‌లు, పర్వతాలు, పెంగ్విన్ కాలనీలు, వేల్స్, సీల్స్ కనిపిస్తుంటాయి. అంటార్కిటికా చేరిన తర్వాత ఆరు రోజుల పా టు రోజుకు రెండు దీవులు లేదా ద్వీపకల్పాల మీద ల్యాండ్ అవుతూ ఆరు రోజుల్లో పన్నెండింటిని కవర్ చేశాను. జనవరి రెండవ తేదీ తిరుగు ప్రయాణం. ‘బ్యూనోస్ ఎయిరిజ్’ నుంచి నేను లండన్‌కి వచ్చేశాను. రోజంతా పగలే! అంటార్కిటికాలో రోజంతా నింగికీ నేలకూ మధ్యనే గడిపినప్పటికీ ఆ వారం రోజులూ సూర్యాస్తమయాన్ని చూడలేకపోయాను. సూర్యుడు చండప్రచండంగా ఉదయించే ఉన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. కాలుష్యం అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన నీరు, లెక్కకు మించిన హిమనీనదాలు, గుంపుల కొద్దీ పెంగ్విన్ లు, సహజమైన దారుల్లో ట్రెకింగ్ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. నేను అడ్వెంచర్స్ని బాగా ఇష్టపడతాను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో కూడా ట్రెకింగ్ చేశాను. కానీ అంటార్కిటికా ట్రెకింగ్ సహజత్వం ఒడిలో సాగిన సాహసం అనిపించింది’’. మనిషి వల్లే హాని అంటార్కిటికా గురించి ప్రయాణంలోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. క్రూయిజ్‌లో మెరైన్ ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు, నేచరిస్ట్లు కూడా ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్లడానికి ముందు ఆ ప్రదేశం వివరాలు, అక్కడ మెలగాల్సిన విధానం కూడా చెప్తారు . పెంగ్విన్ లకు కనీసం ఐదు మీటర్ల దూరంగా ఉండాలని, మనుషుల నుంచి వాటికి ఇన్ఫెక్షన్ సోకితే ఏకంగా వేలకొద్దీ ఉన్న కాలనీలే తుడిచిపెట్టుకుపోతాయని తెలిసింది. మనిషి ఎంత హానికారకుడో, ప్రకృతికి ఎంత పెద్ద శత్రువో మొదటిసారి తెలిసింది. వాళ్లు పర్యాటకులను ఆహ్వానిస్తూనే మంచుఖండం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటున్నారు. ఇక్కడ పర్యటించడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అనుకూలమైన సమయం. – హసన్ అరుణ్, సాహస యాత్రికుడు -- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
ప్రపంచ శిఖరాగ్రాలపై ‘నవరత్నాలు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలపై రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాల’ జెండాను విశాఖపట్నం యువకుడు భూపతిరాజు అన్మిష్‌వర్మ ఎగురవేశాడు. మార్షల్స్‌లో ప్రపంచ పతకాలు సాధించిన అన్మిష్‌వర్మ 2020 నుంచి ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం ప్రారంభించాడు. గత రెండేళ్లలో ఆఫ్రికాలోని కిలిమంజారో, సౌత్ అమెరికాలోని అకాంకోగోవా, నేపాల్‌లోని ఎవరెస్ట్, యూరప్‌లోని ఎల్బ్రూస్, నార్త్ అమెరికాలోని డెనాలి, ఆస్ట్రేలియాలోని కొసియస్కో పర్వతాలను అధిరోహించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల జెండాను ఎగురవేశాడు. తాజాగా ఈ ఏడాది జనవరి 22న అంటార్కిటాలోని విన్షన్ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాల జెండాను ఎగురవేశాడు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకుగాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపే బ్యానర్లను ప్రదర్శించాడు. లండన్, చెక్ రిపబ్లిక్, అమెరికాకు చెందిన ముగ్గురు పర్వతారోహకులతో కలిసి అన్మిష్‌వర్మ ఈ పర్వతాన్ని అధిరోహించాడు. అన్మిష్‌వర్మ తండ్రి వేణుగోపాలరాజు మిలటరీలో పనిచేశారు. తల్లి సత్యవేణి గృహిణి. విశాఖపట్నంలోని బిట్స్ కాలేజీలో ఎంబీఏ పూర్తిచేసిన అన్మిష్‌వర్మ ఇప్పటివరకు దేశానికి రెండు ప్రపంచ పతకాలను అందించాడు. తాజాగా ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించి మరో రికార్డు సృష్టించాడు. -
హిమగర్భంలో భారీ ఉల్క
న్యూఢిల్లీ: అంటార్కిటికాలో దట్టమైన మంచు గర్భంలో 7.6 కిలోల బరువైన ఉల్కను అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వెలికితీసింది. మంచు ఖండంలో ఇంతటి భారీ ఉల్క దొరకడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. గత డిసెంబర్ 11 నుంచి నెల రోజుల పాటు జరిపిన అన్వేషణలో మరిన్ని చిన్న సైజు ఉల్కలు కూడా దొరికాయి. శాటిలైట్ ఇమేజీలు, జీపీఎస్ సాయంతో వీటి జాడను కనిపెట్టారు. ‘‘ఇవి బహుశా ఏదో ఆస్టిరాయిడ్ నుంచి రాలి పడి ఉంటాయి. వేలాది ఏళ్లుగా మంచు గర్భంలో ఉండిపోయాయి. వీటిని పరిశోధన నిమిత్తం బ్రెసెల్స్కు పంపాం. అందులో భూమి ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. -
విన్సన్ పర్వతంపై భారత జెండా రెపరెపలు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 2న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. మైనస్ 25 నుంచి మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్ పర్వతాన్ని ఈ నెల 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్ 28న నేపాల్‌లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్ 7వ తేదీన యూరప్‌లోని ఎల్బ్రోస్ పర్వతాలను ఎక్కారు. -
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
మంచు ఖండం అంటార్కిటికాలో పాగా వేసేందుకు అర్జెంటీనా, చిలీ మాస్టర్ ప్లాన్..!
అంటార్కిటికా అంటేనే మంచు ఖండం.. మైనస్ ఉష్ణోగ్రతలు.. కాసేపు బయట ఉంటే మనుషులూ గడ్డకట్టుకుపోయేంత దుర్భర వాతావరణం. అలాంటి అంటార్కిటికాలో ఇప్పటివరకు 11 మంది పిల్లలు పుట్టారు. భేషుగ్గా బతికేస్తున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఉన్నవి పరిశోధనా కేంద్రాలే.. భూమ్మీద అన్ని ఖండాలు మనుషులతో నిండి ఉన్నా.. ఒక్క అంటార్కిటికాలో ఎలాంటి శాశ్వత నివాసాల్లేవు. కొన్నిదేశాలు వివిధ పరిశోధనలు, వనరుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. క్లిష్టమైన వాతావరణం కారణంగా.. ఈ కేంద్రాల్లో ఉండే శాస్త్రవేత్తలు, సిబ్బంది కూడా కొంతకాలానికే తిరిగి వచ్చేస్తుంటారు. వేరే వాళ్లు వెళ్తుంటారు. అంతేతప్ప అంటార్కిటికాలో మానవ శాశ్వత నివాసాలేమీ లేవు. అంటార్కిటికా తమదేనంటూ.. నిజానికి అంటార్కిటికా ఖండం ఏ దేశానికీ చెందినది కాదు. కానీ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే, యూకే వంటి పలు దేశాలు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమవేనంటూ వాటికవే ప్రకటించుకున్నాయి. దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఏమీ లేదు. మంచు ఖండంలోని ఏ ప్రాంతంలోకి ఏ దేశమైనా వెళ్లి పరిశోధనా కేంద్రాలు పెట్టుకోవచ్చు. శాస్త్రవేత్తలు, సిబ్బంది వెళ్లవచ్చు. అయినా కొన్ని దేశాలు వెనక్కి తగ్గలేదు. మిగతా దేశాలతో పోలిస్తే మంచు ఖండానికి దగ్గరగా ఉన్న చిలీ, అర్జెంటీనా, యూకేలు (ఫాక్లాండ్ దీవులు) అంటార్కిటికాపై ఎక్కువ దృష్టిపెట్టాయి. ఈ మూడు దేశాలు తమదిగా ప్రకటించుకున్న ప్రాంతం చాలావరకు ఒకటే కావడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఇద్దరి ‘పోరు’తో.. 1970వ దశకంలో అర్జెంటీనా పాలకుడు జార్జ్ రఫీల్ విడెలా, చిలీ అధినేత అగస్టో పినోచెట్ ఇద్దరూ అంటార్కిటికాలోని ప్రాంతాలపై ఆధిపత్యం కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. అంటార్కిటికాలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని, జీవించడం చాలా కష్టం. అందుకే తెలివిగా చిత్రమైన ప్లాన్ వేశారు. తమ పౌరులు జన్మించిన ప్రాంతం తమదేనని చెప్పుకొనేందుకు వీలవుతుందని భావించారు. ఇందుకోసం అంటార్కిటికాలో తమ దేశవాసులు పిల్లల్ని కనే ఏర్పాట్లు చేశారు. క్లిష్టమైనా.. అంతా సేఫ్.. అంటార్కిటికాలో అసలే అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు. రాకపోకలు చాలా కష్టం.. డెలివరీ సమయంలో ఏదైనా తేడా వస్తే అవసరమైన వైద్య సదుపాయాలూ ఉండవు. అయినా ఆ ఖండంపై ప్రసవాలన్నీ సురక్షితంగా జరగడం, పుట్టిన 11 మంది శిశువులు ఆరోగ్యంగా తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం గమనార్హం. 1978 జనవరిలో ‘తొలి’ జననం! 1977 మొదట్లో చిలీ అధినేత పినోచెట్ అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన తమ దేశ పరిశోధన కేంద్రానికి అధికారిక పర్యటన నిర్వహించి.. ఆయా ప్రాంతాలు తమవేనని ప్రకటించారు. ►మరోవైపు అర్జెంటీనా అదే ఏడాది చివరిలో సిల్వియా మొరెల్లో డి పాల్మా అనే ఏడు నెలల గర్భిణిని అంటార్కిటికాలోని తమ ఎస్పరాంజా బేస్‌కు పంపింది. ఆమె 1978 జనవరి 7న ప్రసవించింది. ఇదే అంటార్కిటికా ఖండంలో తొలి శిశువు జననం. ►చిలీ అయితే మరో అడుగు ముందుకేసి కొత్తగా పెళ్లయిన జంటను అంటార్కిటికాలోని తమ బేస్‌కు పంపింది. వారు అక్కడే కాపురం చేసి, పిల్లలను కన్నారు. ►తర్వాత కూడా ఇది కొనసాగింది. ఇరుదేశాలు పెళ్లయిన జంటలు, గర్భిణులను అంటార్కిటికాలోని తమ బేస్‌లకు తరలించాయి. ఇలా కొన్నేళ్లలో మొత్తంగా 11 మంది అంటార్కిటికాలో పుట్టారు. ►అయితే అర్జెంటీనా, చిలీల ప్రయత్నాలను ప్రపంచ దేశాలు తప్పుపట్టడం, మంచు ఖండంపై ఏ దేశానికీ హక్కులు ఉండవని స్పష్టం చేయడంతో ఇది ఆగిపోయింది. ఆ తర్వాత ఏ దేశం కూడా అంటార్కిటికాలో ఇలా పిల్లలను కనేలా చేయడం వంటి ప్రయత్నాలు చేయలేదు. -
అతిపెద్ద ఐస్‌బర్గ్ అంతర్ధానం!
వాషింగ్టన్: భూతాపానికి ఫలితం ఈ ఉదాహరణ. అంటార్కిటికాలోని అట్లాంటిక్ తీరప్రాంతంలో ఉన్న రొన్నే మంచు పలక నుంచి విడివడిన ఒక భారీ ఐస్‌బర్గ్ త్వరలోనే కనుమరుగు కానుంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఐస్‌బర్గ్ 2021 మేలో విడిపోయాక మరో మూడు ముక్కలైంది. అమెరికాకు చెందిన టెర్రా ఉపగ్రహం ఈ ఐస్బర్గ్లోని అతిపెద్ద భాగం ఫొటో తీసింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం పయనించిన ఈ ఐస్‌బర్గ్ భారీ శకలం ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలోని కేప్ హార్న్‌కు, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్ దీవులు, ఎలిఫెంట్ దీవులకు మధ్యలోని డ్రేక్ పాసేజీలో ఉంది. ఎ–76ఎ గా పిలుస్తున్న దీని పొడవు 135 కిలోమీటర్లు కాగా వెడల్పు 26 కిలోమీటర్లు.. లండన్ నగరానికి ఇది రెట్టింపు సైజు అని అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది తన ఆకారాన్ని కోల్పోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, భూమధ్య రేఖ వైపు పయనించి అక్కడి సముద్ర జలాల వేడికి త్వరలోనే అంతర్థానం కానుందని అంటున్నారు. ఐస్‌బర్గ్‌లను సర్వసాధారణంగా బలమైన ఆర్కిటిక్ ప్రవాహాలు డ్రేక్ పాసేజ్ గుండా ముందుకు తోసేస్తాయి. అక్కడి నుంచి అవి ఉత్తర దిశగా భూమధ్య రేఖ వైపు పయనించి వేగంగా కరిగిపోతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మంచుకొండల్లో రక్తజలపాతం.. ఎక్కడంటే?
అక్కడి జలపాతాన్ని చూస్తే, అక్కడేదో రక్తపాతం జరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఎర్రని రక్తధారల్లా నీరు ఉరకలేస్తూ ఉంటుంది. చలికాలంలో పూర్తిగా గడ్డకట్టుకుపోయి, నీటి మధ్య వెడల్పాటి నెత్తుటి చారికలా కనిపిస్తుంది. ఈ రక్తజలపాతం అంటార్కిటికాలో ఉంది. టేలర్ వ్యాలీ వరకు విమానంలో చేరుకుని, ఇక్కడకు పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అంటార్కిటికా మంచుకొండల మీదుగా ఈ జలపాతం ఉరుకుతున్న దృశ్యం సందర్శకులను గగుర్పాటుకు గురిచేస్తుంది. అరుదైన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు ఔత్సాహిక పర్వతారోహకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి నీటిలో ఇనుము సాంద్రత ఎక్కువగా ఉండి, ఆ ఇనుము ఉప్పునీటి కారణంగా తుప్పుపట్టడం వల్ల జలపాతం మధ్యలో నీరు ఎర్రగా మారుతోందని అలాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలపాతాన్ని చూడటానికి ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు అనుకూలమైన కాలం. ఈ కాలంలోనే సాహస ప్రవృత్తిగల పర్యాటకులు దేశ దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. చదవండి: VenkampalliL: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రంగులు అద్దిన చిత్రం కాదండోయ్.. ప్రకృతి దిద్దుకున్న మనోహర దృశ్యం
ఇది కాన్వాస్‌పై రంగులు అద్దిన చిత్రం కాదు.. వినీలాకాశంపై ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా వద్ద గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక. అంటార్కిటికాలోని న్యూజిలాండ్ పరిశోధన కేంద్రం టెక్నీషియన్ స్టువర్ట్ షా ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు. దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్నిపర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా? The sky over Antarctica turned pink due to the January eruption of the Hunga-Tonga-Hunga-Haapai volcano in the Pacific Ocean. pic.twitter.com/AhPwWv0Gp1 — Spriteer (@spriteer_774400) July 17, 2022 -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్‌ను తినేసే కృత్రిమ ఎంజైమ్‌లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్‌లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్‌లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్‌లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్‌ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్‌సెప్టర్‌కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్‌ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్‌తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్‌తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్‌లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్‌ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు ఖండాన.. గ్రీన్ చాలెంజ్ జెండా
సాక్షి, హైదరాబాద్: పర్యా వరణ హితాన్ని కోరుతూ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ, కర్బన ఉద్ఘారాలు తగ్గించాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా వలంటీర్‌కు స్థానం దక్కింది. పర్యావరణ మార్పులపై 35 దేశాలకు చెందిన 150 మంది సభ్యుల బృందం చేపట్టిన అధ్యయనంలో భాగంగా గ్రీన్ఇండియా అంటార్కిటికాకు ప్రయాణించింది. ఫౌండేషన్–2041 నెలకొల్పి పర్యావరణం కాపాడాలనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్‌ను అక్కడ గ్రీన్ ఇండియా వాలంటీర్ కలిశారు. తమ ఉద్యమం తీరును వివరించారు. దీన్ని ప్రశంసించిన రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు. అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలంటీర్ అభిషేక్ శోభన్నను ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు. -
20 లక్షల ఏళ్లుగా వాన పడలే.. ఎక్కడో తెలుసా!
భూమ్మీద వందలు, వేల ఏళ్లుగా వాన అనేదే లేకుండా, పూర్తిగా పొడిగా ఉండే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఏముందీ.. ఏ సహారా ఎడారో, మరో ఎడారో అయి ఉంటుందిలే అనిపిస్తోందా? అస్సలు కాదు.. ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా ఖండంలో అలాంటి ‘కరువు’ ప్రాంతం ఉంది. చలితో గజగజ వణికిపోతున్న ఈ శీతాకాలంలో.. ఆ చలి ఖండంలోని చిత్రమైన ప్రాంతం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ మంచు మధ్య ‘కరువు’! భూమి దక్షిణ ధ్రువంలో కొన్ని కిలోమీటర్ల మందం మంచుతో కప్పబడి ఉన్న ఖండం అంటార్కిటికా. అత్యంత శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 4,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను ‘డ్రై వ్యాలీస్’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటంగానీ, మంచు కురవడంగానీ జరగలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ, మంచుగానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్ 14 నుంచి మైనస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గడ్డ కట్టించే చలి ఉండటం గమనార్హం. మంచును కొండలు పట్టేసి.. నిజానికి అంటార్కిటికా ఖండంలోని గాలిలో తేమ శాతం ఎక్కువే. అలాంటి మంచు ఖండంలో ఇంతటి పొడి ప్రదేశాలు ఉండటానికి కారణం ‘కాటబాటిక్ విండ్స్’గా పిలిచే గాలులు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డ్రైవ్యాలీస్ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్ అట్లాంటిక్’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రైవ్యాలీస్ వైపు వీచే గాలులు ఈ పర్వతాల కారణంగా వాతావరణంలో మరింత పైకి ఎగుస్తాయి. అక్కడి అతితక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. ఏమాత్రం తేమలేని పొడి గాలులు.. డ్రైవ్యాలీస్ వైపు ప్రయాణిస్తాయి. వీటినే ‘కాటబాటిక్ విండ్స్’ అంటారు. గాలిలో తేమ లేకపోవడంతో వానలు, మంచు కురవడం వంటివి అసలే ఉండవు. ఉప్పునీటి సరస్సులతో.. డ్రైవ్యాలీస్గా పిలిచే ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడో లక్షల ఏళ్ల కింద ఏర్పడ్డ ఆ సరస్సుల్లో అప్పటి నీరే ఉంది. వానలు, హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు. వేల ఏళ్లుగా వేసవికాలంలో స్వల్పంగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువ. ఆ నీళ్లు సముద్రపు నీటికన్నా మూడు రెట్లు ఉప్పుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిగా మంచినీటి మంచు ఖండంలో ఇలా ఉప్పునీటి సరస్సులు ఉండటం మరో వింత కూడా. అక్కడక్కడా ‘మమ్మీ’లు కూడా.. సమీపంలోని సముద్రం నుంచో, మధ్యలోని సరస్సుల నుంచో డ్రైవ్యాలీస్లోకి వచ్చిన సీల్ జంతువులు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి. ఇలా చనిపోయిన వాటి శరీరాలు వందలు, వేల ఏళ్లపాటు పెద్దగా చెడిపోకుండా ‘మమ్మీ’ల్లా ఉండిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కనీరు లేని పరిస్థితులు, తీవ్రమైన చలి, ఉప్పునీరు వంటివి దీనికి కారణమని తేల్చారు. రెండోస్థానంలో అటకామా ఎడారి అంటార్కిటికాలోని డ్రైవ్యాలీస్ను మినహాయిస్తే.. భూమ్మీద అత్యంత పొడిగా ఉండే ప్రాంతం అటకామా ఎడారి. చిలీ, పెరూ దేశాల మధ్య ఉన్న ఈ ఎడారిలో ఏళ్లకేళ్లు ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా ఏడాదికి ఒకట్రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుంది. మన దగ్గర ఒకట్రెండు నిమిషాల పాటు కురిసే వానకంటే అది తక్కువ. -
లెక్కచేయలేదు.. లెక్కచెప్పింది..
మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు... లెక్కచేయలేదు. ఎముకలు కొరికే అత్యంత చల్లటి గాలులు... లెక్కచేయలేదు. వేల మైళ్ల ప్రయాణంలో తోడు ఎవరూ ఉండరు... లెక్కచేయలేదు. 40 రోజుల్లో అంటార్కిటికా దక్షిణ ధ్రువ యాత్రను ఒంటరిగా పూర్తి చేసి లెక్క చెప్పింది ‘700 మైళ్లు ప్రయాణించాను’ అని. ‘నేను గాజు పైకప్పును పగులకొట్టాలనుకోలేదు, దానిని మిలియన్ల ముక్కలు చేయాలనుకున్నాను’ అని సగర్వంగా చాటింది. మొక్కవోని ధైర్యంతో వజ్రంలా మెరిసింది. ‘సైనికుల దృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ చాందీ’ అంటూ బ్రిటిష్ ఆర్మీ ఆమెకు అభినందనలు తెలియజేసింది. బ్రిటిష్ ఆర్మీ అధికారి కెప్టెన్ ప్రీత్ చాందీ అంటార్కిటికా దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ప్రయాణించిన భార త సంతతికి చెందిన తొలి మహిళ. ఆమె యాత్ర కిందటేడాది నవంబర్‌లో ప్రారంభమై 700 మైళ్లు అంటే సుమారు 1,127 కిలోమీటర్లు 40 రోజుల పాటు కొనసాగింది. మొన్నటి సోమవారం తన లైవ్ బ్లాగ్‌లో చరిత్ర సృష్టించిన ఘనతను ప్రకటించింది. తెలియని ప్రపంచంలోకి... 32 ఏళ్ల కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీ మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో గాలి వేగంతో పోరాడుతూ, తనకు అవసరమైనవన్నీ ఉంచిన స్లెడ్జ్‌ను లాగుతూ దక్షిణ ధ్రువంలో వందల మైళ్లు ప్రయాణించింది. ‘మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువానికి చేరుకున్నాను. ప్రస్తుతం చాలా భావోద్వేగాలను అనుభవిస్తున్నాను. మూడేళ్ల క్రితం వరకు ఈ ధ్రువ ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అలాంటిది, ఇక్కడ ఉండటం నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఇక్కడికి రావడం చాలా కష్టం. నేను విజేతగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఆమె బ్లాగులో రాసింది. సరిహద్దులను దాటాలి ‘ఈ యాత్ర సాధారణమైనది కాదు, ఎంతో పెద్దది, ఊహకు కూడా అందనిది. ప్రజలు తమ సరిహద్దులను దాటడానికి తమని తాము నమ్మాలి. అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపడానికే నా ఈ ప్రయాణం. మీరు నన్ను తిరుగుబాటుదారుని అని ముద్ర వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సందర్భాలలో ఈ సాహసం ‘వద్దు’ అనే నాకు చాలా మంది చెప్పారు. ‘సాధారణం అనిపించే పనిని మాత్రమే చేయండి’ అన్నారు. కానీ, నేను నాదైన సాధారణాన్ని సృష్టిస్తాను’ అని చాందీ చెప్పారు. గాజు కప్పును పగలకొట్టేద్దాం తన ప్రయాణం గురించి బయటి ప్రపంచానికి తెలియడానికి ఆమె తన ట్రెక్ లైవ్ ట్రాకింగ్ మ్యాప్‌ను అప్లోడ్ చేసింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలోనూ తన ప్రయాణం గురించి బ్లాగులో పోస్ట్ చేస్తూనే ఉంది. ‘40వ రోజు పూర్తయ్యింది. అంటార్కిటికాలో సోలో సాహస యాత్రను పూర్తి చేసిన మొదటి వర్ణ మహిళగా ప్రీత్ చరిత్ర సృష్టించింది’ అని ఆమె బ్లాగ్ చివరి పేర్కొన్న ఎంట్రీ చెబుతుంది. ‘మీకు కావల్సిన దేనినైనా మీరు సాధించగలరు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నాకు కేవలం మూస పద్ధతిలో ఉన్న గాజు పై కప్పును పగలగొట్టడం ఇష్టం లేదు. దానిని మిలియన్ ముక్కలుగా బద్దలు కొట్టాలనుకుంటున్నాను’ అని దృఢంగా వెలిబుచ్చిన పదాలు మన అందరినీ ఆలోచింపజేస్తాయి. వెడ్డింగ్ ప్లాన్ ఆమె తన సాహసయాత్రకు బయలుదేరే ముందు ఆర్మీ రిజర్విస్ట్ డేవిడ్ జర్మాన్‌తో నిశ్చితార్థం అయ్యింది. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాక వివాహ ప్రణాళికల గురించి ఆలోచించడానికి ఆమె తన సమయాన్ని చలిలోనే ఉపయోగించుకుంది. ఈ నెలాఖరులో ఆమె దక్షిణ ధ్రువం నుండి తిరిగి వచ్చాక ఈ జంట చిలీలో తిరిగి కలుస్తారని భావిస్తున్నారు. పోలార్ ప్రీత్ అంటూ అంతా పిలుచుకునే ప్రీత్ చాందీ వాయవ్య ఇంగ్లండ్‌లోని మెడికల్ రెజిమెంట్‌లో భాగంగా సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్‌గానూ శిక్షణ ఇస్తుంది. ఫిజియోథెరపిస్ట్ కూడా. లండన్‌లోని క్వీన్ మెరీస్ యూనివర్శిటీలో పార్ట్‌టైమ్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్ౖసైజ్ మెడిసిన్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేస్తోంది. స్లెడ్జ్‌కి ప్రత్యామ్నాయంగా పోలార్ ట్రైనింగ్ కోసం కొన్ని నెలల పాటు అత్యంత బరువైన రెండు పెద్ద టైర్లను లాగుతూ శిక్షణ తీసుకుంది. స్లెడ్జ్లో కావల్సిన తప్పనిసరి వస్తువులను ఉంచి, అంటార్కిటికా సౌత్‌పోల్ మొత్తం ఇదే ప్రయాణం కొనసాగించింది. -
గ్లోబల్ ‘వార్నింగ్’.. మాయమైపోయిన మంచు!
ఈ చిత్రాలు చూడండి. పై చిత్రంలో కొండలు కనబడట్లేదు కానీ కింది చిత్రంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఆహ్లాదంగా, చూడముచ్చటగా ఉందనిపిస్తోంది కదా. చూడముచ్చట పక్కనబెడితే మున్ముందు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి ఇవి. పై చిత్రాన్ని దాదాపు 100 ఏళ్ల కిందట ఆర్కిటిక్‌లో తీశారు. అప్పుడు కొండలు కనబడనంతగా మంచు పేరుకుపోయి ఉంది. కానీ ఇప్పుడు ఆ మంచు ఆనవాళ్లు కూడా లేవు. కొన్నేళ్లుగా పెరుగుతున్న భూతాపం వల్లే ఈ మంచంతా మాయమైపోయింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోందని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి: స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్..)