appalaraju
-
హోం మంత్రి కాదు మైకుల మంత్రి: సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం: వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సీదిరి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశారు. టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు. లాఅండ్ఆర్డర్ కంట్రోల్లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారు. హోం మంత్రి అనిత మైక్‌ల మంత్రిగా మారారు.చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేస్తాం’అని సీదిరి హెచ్చరించారు.ఇదీ చదవండి: విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు -
చంద్రబాబు సీఎంగా వేస్ట్..
-
ఏపీలోనే ఇలాంటి పరిస్థితి.. సిగ్గుచేటు: సీదిరి
శ్రీకాకుళం, సాక్షి: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. మెడికల్ సీట్లు వదులుకోవడం అత్యంత హేయనీయమని వ్యాఖ్యానించారు. . పలాసలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం విస్మయం కలిగించిందన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ మాటలు బాధాకరం. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే వద్దు అని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. .. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వద్దంటుందా?. కానీ, చంద్రబాబు ప్రభుత్వం సీట్లు వద్దు అని లెటర్ రాసింది. మెడికల్ సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే.. తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి మొట్టమొదటి సారి పరిస్థితి ఏర్పడింది... పద్నాలుగేళ్లు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా స్థాపించలేదు. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోండి అని ఎన్ఎంసీ నిధులు ఇస్తుంటే.... మాకు వద్దు అన్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కింది. రాష్ట్రంలోని వైద్య విద్యను ఎంచుకోవాలనుకున్న అనేక లక్షల మంది భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గమనించాలి అని సీదిరి అప్పలరాజు కోరారు.ఇదీ చదవండి: పవన్ అయినా స్పందించడేం? -
మీకు ఓట్లు వేసిన వారికే విత్తనాలు ఇస్తారా..?
-
సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ
-
చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు
-
ఉద్దానం కిడ్నీ రోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి
-
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్
-
కింజరాపు అచ్చెన్నాయుడుని ఏకిపారేసిన మంత్రి
-
మనసున్న ప్రభుత్వం మనది
సాక్షి, విశాఖపట్నం: మనసున్న ప్రభుత్వం మనదని, బాధితులను తక్షణమే ఆదుకునే స్వభావం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ నెల 19 అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన 49 బోట్ల యజమానులకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 కోట్ల 11 లక్షల 76 వేల నష్ట పరిహారాన్ని గురువారం జిల్లా పరిషత్ హాల్లో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే నష్టంలో 80 శాతం సొమ్మును పరిహారంగా అందజేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. ప్రమాదంలో కాలిపోయిన బోట్లలో పనిచేస్తున్న సుమారు 400 కలాసీ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నట్టు తెలిపారు. బాధిత మత్స్యకారుల్లో సీఎం జగన్ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారని, ఇలాంటి నేత దేశంలోనే లేరని ప్రశంసించారు. రూ.80 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అయ్యే లాంగ్‌లైనర్(పెద్ద) బోటు కొనుగోలుకు ఇప్పుడున్న 60 శాతం సబ్సిడీని 75కి పెంచుతూ త్వరలో జీవో జారీ చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు ఈ పరిహారం సొమ్మును లాంగ్‌లైనర్ బోట్ల పెట్టుబడి సొమ్ముగా వినియోగించాలని సూచించారు. ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమన్నారు. గతంలో హుద్‌హుద్, తిత్లీ తుపానులకు దెబ్బతిన్న బోట్లకు ఏళ్ల తరబడి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, దీంతో ఆయన హామీలన్నీ నీటిమీద రాతలేనన్న భావనలో మత్స్యకారులున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు పాత డీజిల్ సబ్సిడీ బకాయి సుమారు రూ.5.50 కోట్లను రెండు వారాల్లో చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోరిక మేరకు బయో డీగ్రేడబుల్ ఆయిల్‌కు కూడా సబ్సిడీ ఇస్తామని, సంబంధిత బంకుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సీఎం జగన్ చలించిపోయారు: వైవీ సుబ్బారెడ్డి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై సీఎం జగన్ చలించిపోయారని, దగ్ధమైన బోట్లకు బీమా ఉందా లేదా అన్నది చూడకుండా మత్స్యకారులు నిలదొక్కుకునేలా ఆదుకోవడం మన బాధ్యత అని, అందుకు 80 శాతం పరిహారం ఇవ్వాలని చెప్పారని తెలిపారు. ఈ సాయంతో వారు కొత్త బోట్లు కొనుగోలుకు వీలవుతుందన్నారు. చిన్న బోట్లతో పాటు పెద్ద బోట్ల యజమానులు బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ తన దృష్టికి తెచ్చారని, ఆ మేరకు తాను కృషి చేస్తానని, బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గత తుపాన్లకు దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.6 లక్షలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని, వారికీ న్యాయం జరిగేలా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2019 మే నుంచి సెప్టెంబర్ వరకు డీజిల్ సబ్సిడీ చెల్లించేలా చూస్తామని చెప్పారు. ఇంతలా స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరు..: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బాధిత మత్స్యకారులు ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ఇంతలా పెద్ద మనసుతో స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న 34 బోట్లకు పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు చుట్టూ తాను ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదన్నారు. అనంతరం మంత్రి అప్పలరాజు, రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డిలు బోట్ల యజమానులకు చెక్కులను అందజేశారు. సభలో మత్స్యకారులు జై జగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయచందర్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
రామోజీ నీకు రోజులు దగ్గరపడ్డాయి: సీదిరి అప్పలరాజు
-
చంద్రబాబుకి అసలు సర్జరీ ఎలా చేశారు?
సాక్షి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వైద్య నివేదికలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అంత తీవ్రమైన రోగాలు ఉంటే.. ఏ వైద్యపరీక్షలు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? అనేది నమ్మబుద్ధి కావడంలేదు. ఈ దశలో నిజంగానే ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? జైలుకు పోకుండా ఉండడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక రాజకీయ నేత మాత్రమే కాదు.. ఒక వైద్యుడు కూడా. చంద్రబాబు వైద్య నివేదిక విషయంలో ఒక వైద్యుడిగా ఆయన తన అనుమానాల్ని బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు(73).. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్(ఛాతీలో బరువు.. నొప్పి), గిడ్డినెస్(తల తిప్పడం), నిద్రలేమి, ఇతరతత్రా ఇబ్బందికర పరిస్థితులతో పాటు తన శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధుల సమస్యలతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ రెండు ప్రధానమైన అంశాలను ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒకటి.. కరోనరీ ఆర్టరీ వ్యాధి(హృదయ సంబంధ వ్యాధులలో సర్వసాధారణమైంది), రెండోది..హైపర్ ట్రోపిక్ కార్డియోమియోపతి(హృదయ కండర పెరుగుదల వ్యాధి). హైపర్ ట్రోపిక్ కార్డియోమయోపతి(గుండె కండర పెరుగుదల వ్యాధి)తో పాటు ఎల్వీ (Left Ventricular గుండెలో ఎడమ జఠరిక) గడ్డ కట్టింది. అలాగే.. డయాబెటిస్ ఉంది. చర్మ సంబంధిత వ్యాధి ఉంది. వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి. వ్యాయామాలు, శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్ నిత్యం కూడా టూర్ షెడ్యూల్లో ఉండాలి.. వైద్య నివేదికలో రిఫర్ చేశారు. మరోవైపు కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉందని, విటిలిగో(బొల్లి)కి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఎరిట్రియా ప్రోన్ అంటే.. గుండె కొట్టుకోవడంలో హఠాత్తుగా వైవిధ్యమైన పరిస్థితులు చంద్రబాబులో ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇటువంటి ఆరోగ్య పరిస్థితిల్లో ఉన్న వారికి సర్జరీ కోసం మత్తుమందు(ఆనస్తీషియా) ఇవ్వటం ప్రాణాంతకం. పైగా ఏ వైద్యుడు కూడా అంత సాహసానికి దిగడు. ఒకవేళ అలా మత్తు మందు ఇవ్వాలి అంటే గనుక.. ముందస్తు పరీక్షలన్నీ చేసుకున్నాకే నిర్ధారించుకుంటారు. కానీ.. చంద్రబాబు విషయంలో రెండో తేదీన అడ్మిట్ అయితే.. ఆ మరుసటి రోజే సర్జరీ చేసి డిశ్చార్జి కూడా చేశారు. ఏ వైద్యుడైనా సరే చంద్రబాబు హెల్త్ రిపోర్టులు చూపించాక.. సర్జరీ చేయడానికి కచ్చితంగా ఆలోచిస్తారు అనేది డాక్టర్ సీదిరి అప్పలరాజు చెబుతున్న మాట. చంద్రబాబు గుండె సైజు పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా బాబుకు కంటి ఆపరేషన్ చేయరు. బెయిల్ పొడగించుకోవడానికే ఈ మెడికల్ రిపోర్టు స్టోరీ అల్లుతున్నారు. అయినా బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు… pic.twitter.com/3AtDBI2rQl — YSR Congress Party (@YSRCParty) November 17, 2023 ఇక్కడ.. చంద్రబాబు కేసులో కంటి చూపు తగ్గిపోయింది అనే విషయానికి ఎవరూ అభ్యంతరం చేయరు. అయితే సీపీ కాల్షియం స్కోర్ 2019 రిపోర్టు ప్రకారం 916 ఉంది. ఇప్పుడు ఏకంగా 1,611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వైద్యులు అన్నారు. కాల్షియం ఇంతలా పెరిగితే.. ఏ కార్డియాలజిస్ట్ అయనా సరే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కచ్చితంగా చేస్తారు. పైగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్థరీస్ ఎలాగ ఉన్నాయో తెలుస్తవి. అలా తెలిసినప్పుడు ఆయనకి కచ్చితమైన చికిత్స అందిచడానికి అవకాశం ఉంటుంది. మరి.. ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ముందస్తు పరీక్షలు చేయకుండా.. కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఏ వైద్యుడు ముందుకు వెళ్లడు కదా. కాబట్టి.. బెయిల్ పొడిగింపు కోసం ఇది వడ్డివారుస్తున్న కథ కూడా అనుకోవచ్చు అని మంత్రి సీదిరి అభిప్రాయపడుతున్నారు. సీదిరి మాట్లలోనే.. ‘‘చంద్రబాబుకు గుండె కండర పెరుగుదల వ్యాధి ఉందన్న విషయం మెడికల్ స్టూడెంట్స్‌గా ఉన్న టైంలోనే నాకు తెలుసు. గతంలో ఆయన ఓసారి ఉపవాస కార్యక్రమం చేపట్టినప్పుడు.. నిమ్స్ వైద్యులు ఆయన్నీ పరీక్షించారు. అప్పుడు నిమ్స్‌లో పని చేస్తున్న మా సీనియర్లు ఆ విషయం నాకు చెప్పారు. చంద్రబాబుకు ఇంతగా తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు.. కచ్చితంగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయాలి. ఇటువంటి జబ్బుల గురించి టెక్నికల్‌గా మాట్లాడితే.. మాయక్టిమి అంటారు. ఈ స్థితిలో.. గుండె ఎనలార్జ్ అయిన భాగాన్ని శుభ్రంగా తొలగిస్తారు. తద్వారా గుండె కొట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఇంకా చంద్రబాబుకు ఉన్న కరోనరీ ఆర్టరీ వ్యాధికి బైపాస్ తప్పనిసరి. ఇంకా ఏవేవో ఉన్నాయని రాసిచ్చారు. అయోగ్టిక్ స్టినోసిస్ ఉందన్నారు. డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు. నిజంగా అవన్నీ ఉంటే.. అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి. కచ్చితమైన పరీక్షలు.. కచ్చితమైన ట్రీట్మెంట్ ఏమీ అందించకుండానే ఆపరేషన్ చేస్తారా?.. ఒక ప్రెస్టేజ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారేమో. కనీసం ఉన్న సమస్యలకు మందులు వాడడమో.. ఆ మందుల గురించి ప్రిస్క్రిప్షన్లు ఏవీ లేవు. చదవండి: బోగస్ ఇన్వాయిస్లతో ‘స్కిల్’ నిధులు స్వాహా -
చంద్రముఖిగా మారిన పురందేశ్వరి: సీదిరి అప్పలరాజు
-
సామాజిక న్యాయానికి ప్రతీక సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారంటే సీఎం వైఎస్ జగన్, ఆయన పథకాలే కారణమని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం గాజువాక నియోజకవర్గం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు, చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గతంలో మనమందించే పథకాలను అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా పథకాలు ఇస్తా అంటున్నాడని, ఇవి పేదలకు అందించే పథకాలని ఇప్పుడు తెలిసాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వారి మాటలు నమ్మకూడదని చెప్పారు. ఓ రోడ్డు వేస్తేనో, బిల్డింగ్ కట్టేస్తేనో అభివృద్ధి కాదని, పేద వాడి జీవన ప్రమాణాలను పెంచి, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభివృద్ధికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో బడుగుల అభ్యున్నతి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అని చెప్పారు. ఈ వర్గాలను అన్ని రంగాల్లోనే అగ్రగణ్యులుగా నిలబెడుతున్న ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. గతంలో బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే సమావేశం పెట్టుకునే ధైర్యం కూడా ఉండేది కాదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తలెత్తుకొని ధైర్యంగా సభలు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన వద్ద ఈ వర్గాల నాయకులు ఎందుకు బానిసత్వం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముందుగా లేఖ రాసింది సీఎం జగన్ అని గుర్తించుకోవాలన్నారు. పవన్‌కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను 2024లోనూ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను భుజానికెత్తుకున్న జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. ఒకప్పడు చంద్రబాబును ఛీకొట్టిన పురందేశ్వరి ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆమె బీజీపీ కండువా వేసుకుని టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 600పైగా హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని, అయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలోనే ముస్లిం మైనారిటీలకు సువర్ణ పాలన అందించిని ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ బీసీ మహిళకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌ను 30 ఏళ్ల పాటు సీఎంను చేసుకుందాం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని చెప్పారు. సీఎం జగన్‌ను 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్ తరాల భవిత బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు. -
ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర
కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు/సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే సామాజిక సాధికారత సాధ్యమైందని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా వైఎస్ జగన్ పాలిస్తున్నారని.. అందుకే తమ పథకాలను చంద్రబాబు కూడా కాపీ కొట్టడానికి తయారైపోయారని వారు ఎద్దేవా చేశారు. పేదల పక్షాన నిల్చుని పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడం చారిత్రక అవసరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వీరు ప్రసంగించారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూశారని.. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా మాట్లాడారని, అలాగే.. నాయీ బ్రాహ్మణులతో కూడా నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టసభలు, కార్పొరేషన్ పదవుల్లో సీఎం జగన్ పెద్దపీట వేశారని సీదిరి అప్పలరాజు చెప్పారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదని, కానీ.. జగన్ మాత్రం అమ్మఒడి అందించి పేదల చదువులు ఆగకుండా వారి బతుకుల్లో దీపాలు వెలిగించారని కొనియాడారు. అవినీతి మరక లేకుండా ‘సంక్షేమం’ : ధర్మాన అనంతరం.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచిని గుర్తుచేసేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఏదైనా కార్యక్రమం తలపెడితే మూడు నాలుగు ప్రభుత్వాలు మారితే గానీ అది కార్యరూపం దాల్చేది కాదని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనుల్లో వేగం కనిపిస్తోందని.. పాలనలో ఆయన కొత్త ఒరవడి సృష్టించారని తెలిపారు. ఉద్యమాలు జరిగితేగానీ జరగని పనులు ప్రస్తుత ప్రభుత్వం సులభంగా చేస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాల కింద రూ.రెండు లక్షల ముప్పై వేల కోట్లను ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా జమచేశారని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుకు ఇది మచ్చుతునక అని ధర్మాన అన్నారు. చంద్రబాబు కూడా ఈ సంక్షేమ పథకాలపై ఎలాంటి అవినీతి ఆరోపణ చేయలేకపోయారన్నారు. బాబు పాలనకు, జగన్ పాలనకు మధ్యనున్న తేడాను ప్రజలే బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. బాబు జీవితమంతా తన వారికి దోచి పెట్టడానికి, దోచుకున్నది దాచుకోవడానికే సరిపోయిందని ధర్మాన ఎద్దేవా చేశారు. పేదలు తలెత్తుకుని బతికేలా.. ఇక మేనిఫెస్టోలో ఇచి్చన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో పేదలు తలెత్తుకుని బతికేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన మనవళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదలకు మాత్రం ఆంగ్ల మాధ్యమం వద్దంటూ కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటివి పేద విద్యార్థులకు వరమని ఆయన తెలిపారు. తన దృష్టిలో ఇద్దరే ఇద్దరు మామలని.. ఒకరు చందమామ అయితే మరొకరు జగన్ మామ అని కొనియాడారు. మరోవైపు.. జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించడం సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే సాధ్యమన్నారు. ఇది మన స్వాభిమాన ఆత్మగౌరవ యాత్ర అని తమ్మినేని అభివరి్ణంచారు. జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకే వెళ్తుందని, మధ్యవర్తిత్వం లేని పాలన అందిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఎన్ని బటన్లు నొక్కారో అందుకున్న వారికే తెలుసునన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పాలవలస శ్రీకాంత్, ఎమ్మెల్యేలు కంభాల జోగులు, రెడ్డి శాంతి, విశ్వాసరాయి కళావతి, పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఇక ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. పల్లె ప్రాంతాల నుంచి వెల్లువలా బహిరంగ సభకు తరలివచ్చారు. సభ నిర్వహించిన ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ కేటీ రోడ్డు వరకు బస్సు యాత్ర సాగింది. నేడు విశాఖ, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో యాత్ర.. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం విశాఖపట్నం జిల్లా గాజువాక, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో జరుగుతుంది. -
"మత్స్యకారుల తోలు తీస్తా అంటావా..”: మంత్రి సీదిరి
-
బాబు ప్రాజెక్టుల సందర్శన విడ్డూరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ఎవరూలేరని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కటైనా చంద్రబాబు పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాల్లేవన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారాలు అందించి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు వంశధార ఫేజ్–2, స్టేజ్–2ని, ఆఫ్‌షోర్ వంటి పనులను ప్రారంభించింది వైఎస్సార్ అని, వాటిని పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ నిధులు కేటాయించారు. హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల నీరు చేరేలా లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతులిచ్చారు. అలాగే, నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించేందుకు ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు జగనన్నే స్వయంగా వెళ్లారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు అన్ని పనులు చేస్తున్నాం. జిల్లాలోని అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్‌లు ఏనాడైనా జిల్లాలో ప్రాజెక్టులపై దృష్టిపెట్టారా? నిర్వాసితుల పరిహారాలను తెలుగు తమ్ముళ్లు మింగేయలేదా? ఇక వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు శరవేగంగా చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైఎస్సార్ హయాంలో ప్రారంభిస్తే ఇద్దరు సీఎంలు మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకుండా గాలికొదిలేశారు. బాబు, పవన్‌లకు ఎందుకంత కోపం.. విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తున్నామనే అక్కసుతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌లు రాద్ధాంతం చేస్తున్న తీరుచూస్తే ఉత్తరాంధ్ర ప్రజలపై ఎంత కోపం ఉందో అర్థమవుతోంది. విశాఖలో పవన్, శ్రీకాకుళం జిల్లాలో బాబు ఒకేరోజు సందర్శించి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం జగన్ అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రం విభజనకు చంద్రబాబే సహకరించి ఇప్పుడు ఏమీ తెలియనట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక విద్యుత్, గ్యాస్, పెట్రోలు, నిత్యావసర ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్నాయా ఒక్క ఏపీలోనే ఉన్నాయా అనేది ప్రజలందరూ గమనించాలి. -
పవన్ కళ్యాణ్ కు మంత్రి సీదిరి అప్పలరాజు స్ట్రాంగ్ కౌంటర్
-
ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఏపీ తరహాలోనే దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను కారుచౌకగా అందించడం ద్వారా వా రికి ఆర్థిక భారం తగ్గించడం, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అన్ని ప్రాథమిక పశు వైద్యశాలలు, పాలిక్లినిక్స్, డిస్పెన్సరీ ప్రాంగణాల్లో ఈ వైఎస్సార్ జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సంకల్పించి జనరిక్ మందుల తయారీదారులతో పశుసంవర్ధక శాఖ అవగాహనా ఒప్పందం చేసుకుంది. విజయవాడలో తొలిసారిగా.. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, యూనిట్ కాస్ట్లో కేవలం 25 శాతాన్ని లబ్ది దారులు భరిస్తే చాలు.. రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీని భరిస్తోంది. వీటి ద్వారా నిర్వాహకులతో పాటు కనీసం ముగ్గురు నుంచి నలుగురికి ఉపాధి లభిస్తుంది. ఈ ఔట్లెట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిన 70కు పైగా జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్ ధరల కంటే 35–85% తక్కు వగా ఇక్కడ లభిస్తుండడంతో పశు పోషకులతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీరోజూ 300 మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రం సేవలను వినియో గించుకుంటుండగా, రోజుకు రూ.20 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజ యవంతం కావడంతో మలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా రూ.14.17 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రాథమిక పశు వైద్యశాల (పీవీసీ) ప్రాంగణాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల రాష్ట్రాల పశుసంవర్థక శాఖ మంత్రులతో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పశుసంవర్ధక శాఖ వర్కుషాపులో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్లు ఏపీలో సీఎం జగన్ ఆలోచనల మేరకు పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారి జనరిక్ పశుఔషధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో వీటిని విస్తరించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కృషికి కేంద్ర బృందం కితాబు సదస్సులో పాల్గొన్న కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాతో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ కృషిని, సీఎం జగన్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించడమే కాక.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆ యన కూడా అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర బృందం శుక్రవారం మరోసారి భేటీ అయింది. కేంద్రం ఆహ్వానంతో అమరేంద్రకుమార్ వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకం లక్ష్యాలను వివరించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధి విధానాల రూపకల్పనకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మలి విడతలో ఏర్పాటుచేయ తలపెట్టిన జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు అంగీకరించింది. -
ఉత్తరాంధ్రకు వెలుగు రేఖ.. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు త్వరలో మారిపోనున్నాయి. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ప్రాంత వాసుల కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, అత్యంత కీలకమైన చోట ఈ పోర్టు ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్æ, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఈ పోర్టు అత్యంత కీలకం కానుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు భావనపాడుకే ఉన్నాయని మారిటైమ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు.. థర్మల్ కోల్, కుకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి ఈ పోర్టు కేంద్రం కానుంది. ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్.. ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతటి కీలకమైన భావనపాడు పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయడం ద్వారా ప్రారంభించనున్నారు. తొలి దశలో నాలుగు బెర్తులు తొలి దశలో భావనపాడు పోర్టును నిరి్మంచడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,361.91 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనులను రూ.2,949.70 కోట్లతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనతో తొలి దశ ఉంటుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా, తొలి దశలో నాలుగు బెర్తులతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ రూపంలో సమకీరించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పోర్టు సిటీగా శ్రీకాకుళం భావనపాడుతో శ్రీకాకుళం జిల్లా పోర్టు సిటీగా మారుతుంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలో మచిలీపట్నం పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే స్ఫూర్తితో భావనపాడు పోర్టు పనులు కూడా లక్ష్యంలోగా పూర్తి చేస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి రూ.35 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీ భావనపాడు పోర్టు నిర్వాసితులు 594 మంది కోసం రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో నౌపడలో అధునాతన వసతులతో అర్అండ్ఆర్ కాలనీ నిరి్మంచనున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. ఈ నెల 19న భావనపాడు పోర్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూలపేట, విష్ణుచక్రంలో రైతుల నుంచి 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. రైతులకు 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. దీంతో పాటు మొదటి ఫేజ్‌లో సీఆర్‌జెడ్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు.. మొత్తం 1000 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండో ఫేజ్‌లో బృహత్తర పోర్టు డెవలప్మెంట్కు మరికొన్ని భూములు రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఆర్అండ్ ఆర్ కాలనీకి ఈ నెల 11న ప్రభుత్వం నుంచి ప్లాన్ అప్రూవల్ వచి్చందన్నారు. జిల్లా ప్రజల పోర్టు కల నెరవేరుతుండడం శుభ పరిణామమన్నారు. వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం మత్స్యకారుల వలసల నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రూ.365 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం తీరంలో నిరి్మంచనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచి్చన ప్రతి హామీని సీఎం నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, హార్బర్లు లేక మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితిని సీఎం పూర్తిగా మార్చేస్తున్నారన్నారు. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాలకు సమానంగా భవిష్యత్‌లో ఇక్కడ తీరం అభివృద్ధి చెందుతుందన్నారు. నెల్లూరులో హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉందని, బాపట్ల, మచిలీపట్నం, రామాయపట్నం వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు జరగుతున్నాయని తెలిపారు. అనకాపల్లి వద్ద మరో హార్బర్ నిర్మాణంతో పాటు మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను హార్బర్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మే 3న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌లో పూర్తి స్థాయి ప్రగతి సాధిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారు అప్పుడప్పుడూ కనిపిస్తూ మత్స్యకారుల కోసం మాట్లాడుతుంటారని, అలాంటి పార్ట్‌టైమ్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు. -
చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు: సీదిరి అప్పల రాజు
సాక్షి, శ్రీకాకుళం/విశాఖపట్నం: టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే పుస్తకం విడుదల చేయడంపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైజాగ్‌లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు బుక్‌లెట్స్‌తో ప్రచారం చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 'సత్యం రామలింగ రాజు, కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్‌ను వేదించామంటున్నారు. వారికి మాకు సంబంధం ఏంటి? చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించింది. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉంది. అదానీ లాంటి వ్యక్తి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారు. రిలయన్స్ని వెనక్కి పంపామంటున్నారు. చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్‌ని రిలయన్స్‌కి కేటాయించారు. కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లింది. ఇది మీ తప్పిదం కాదా..? జాకీ సైతం మాకు మార్కెట్ లేదంటూ వెనక్కి తగ్గారు. చంద్రబాబు హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారు. ప్రాంక్లిన్ టెంపుల్ టేన్ దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీ. అమర్ రాజా వారు ఏపీలోనే పెట్టుబడి పెట్టాలని రూల్ ఉందా..? విస్తరణలో బాగంగానే తెలంగాణకు వెళ్లారు. అమరాజా కంపెనీ లెడ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు అని పీసీబీ నోటీస్ ఇస్తే.. మేం ఇబ్బందులు కు గురి చేసారంటారా? అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వారి క్యాంపస్.. మొదలుపెడుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఏడు నెలల్లో 40 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం స్వయంగా చెప్పింది. ఎక్స్ పోర్ట్స్ లో 4వ ర్యాంక్ లో ఉన్నాం. చంద్రబాబు హయాంలోని పారిశ్రామిక బకాయిలు రూ.3,675 కోట్లు సైతం మేం చెల్లించాం , తిరిగి పారిశ్రామిక రాయితీ ఇచ్చాం. విపత్కర పరిస్థితులను తట్టుకుని 11.4% గ్రోత్ సీఎం జగన్ పరిపాలనతో సాధ్యం అయ్యింది. 108 భారీ పరిశ్రమలు మా హయాంలో వచ్చాయి చంద్రబాబుకి సిగ్గు లజ్జాలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే .. ఇలా రాసుకునే బాధ ఉండేది కాదు. డబ్బులు కోసం ఒప్పుకుని వచ్చి నంగవాచి వేషాలు వేశారు. అందుకే ప్రజలు గూబమిద కొట్టి పక్కకు తోశారు. సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా? చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు అని ప్రజలు అనుకుంటున్నారు. 4 వారాల్లో భావనపాడు పోర్టుకు సీఎం జగన్ శంఖుస్థాపన చేస్తారు. భావన పాడు-మూలపేట పోర్టుతో శ్రీకాకుళం దిశ దశ మారనుంది. మెడలు వంచించుకునే స్థితిలో బీజేపీ లేదు. మేం మాటతప్పాం అనే నైతిక బాధ్యత వహించే స్థితిలో కూడా బీజేపీ లేదు. చంద్రబాబు ఏ ఓక్క సమయంలో కూడా హోదాా గురించి అడగలేదు. ఐపాక్ మాకు సలహాదారు అని ఓపెన్ గా చెప్పాం. ఐప్యాక్ మా పార్టీలో భాగం. పవన్ చెప్పగలరా తన స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో. వారికి కూడా సలహాదారులు ఉన్నారు కదా? రోడ్లు ఏవి వేయాలో ఐపాక్ టీం ఏలా డిసైడ్ చేస్తుంది. ఇది అసత్య ప్రచారం' అని సీదిరి అప్పలరాజు టీడీపీపై ఫైర్ అయ్యారు. స్టాల్స్‌ను పరిశీలించిన విడదల రజిని.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరిశీలించారు. టిీడీపీ హయాంలో జరిగిన సదస్సులో పెట్టుబడులు కాగితాల పైనే జరిగాయాని ఎద్దేవా చేశారు. ఈ సదస్సు ఏపీ లో భారీ పెట్టుబడులకు అనువైన సమయమన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో ఏపీ నెంబర్ వన్ కాబోతోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు -
అమూల్‌పై టీడీపీ టిష్యూ పేపర్ తప్పుడు కథనాలు: మంత్రి అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: అమూల్ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్ ఈనాడులో సర్వం అమూల్ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్ కాదు.. సర్వం హెరిటేజ్ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు -
చిత్తూరు డెయిరీ మూయించింది చంద్రబాబే : మంత్రి సిదిరి అప్పలరాజు
-
చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు : మంత్రి అప్పలరాజు
-
పాడి పరిశ్రమ, పశు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
చీపురుపల్లి(గరివిడి): పశు సంపద పుష్కలంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యపడుతుందన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పశు సంపద, పాడి పరిశ్రమ, పశు వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు తెలిపారు. గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పశువైద్య కళాశాలలో రూ.81.25 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన పశువైద్య చికిత్స సముదాయం, పశుగణ క్షేత్ర సముదాయం, బాలుర, బాలికల వసతిగృహాల భవనాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో సీదిరి మాట్లాడారు. ఏపీలో ఆర్బీకేలలో అందిస్తున్న సేవలు దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతీ వెయ్యి మూగజీవాల వైద్య సేవలకు ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనుషుల వలే త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనికి సీఎం ఇప్పటికే ఆమోద ముద్రవేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మూగజీవాలకు కష్టంవస్తే మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఊరిలోనే వైద్యసేవలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా పటిష్ట్రపణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. పశు వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి భవిష్యత్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కళాశాలను అభివృద్ధి చేస్తోందన్నారు. గరివిడిలోని కళాశాలను వర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి అని, వారి చదువుల కోసం ప్రభుత్వం అధిక నిధులు ఖర్చుచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టర్, వైస్‌చాన్సలర్ సూచనల మేరకు రూ.5 కోట్ల వ్యయంతో జిల్లా స్థాయి ఆడిటోరియంను గరివిడి పశువైద్య కళాశాలలో నిర్మించనున్నట్టు వెల్లడించారు. గరివిడిలో పశువైద్య కళాశాలకు 2016లోనే జీఓలు ఇచ్చినప్పటికీ పనులపై అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పశువైద్య కళాశాల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పశువైద్య వృత్తికి భారీ డిమాండ్ పెరుగుతోందన్నారు. కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నది సీఎం అభిమతంగా పేర్కొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పశువైద్య కళాశాలకు జీఓలు ఇచ్చినప్పటికీ కేంద్రం అనుమతులు తీసుకురాలేదన్నారు. ఎంపీ అయ్యాక కేంద్ర అధికారులతో మాట్లాడి, బృందాలను రప్పించి పరిశీలన జరిపించి అనుమతులు తెప్పించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ పద్మనాభరెడ్డి, బోర్డు మెంబర్లు జీఎస్.రెడ్డి, జానకీరామ్, విజయ్‌కుమార్, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, అసోసియేట్ డీన్ సీవీ రాయులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, సర్పంచ్ గేదెల కృష్ణవేణి, ఏఎంసీ చైర్మన్ దన్నాన జనార్దనరావు, నాలుగు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, ఎస్వీ రమణరాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, పొట్నూరు సన్యాసినాయుడు, తహసీల్దార్ టి. గోవింద, ఎంపీడీఓ జి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువి శవ రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ సిగ్గులేని మాటలు చెబుతున్న చంద్రబాబునాయుడు ‘శవాల వద్దకే చంద్రబాబు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి డా.సీదిరి అప్పలరాజు విమర్శించారు. విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాలలో కొత్తగా నిర్మించిన చికిత్స సముదాయాలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంగ్లిష్ మీడియంపై సిగ్గులేని మాటలు అడుతున్నారని విమర్శించారు. ఇంగ్లిష్ మీడియం చదివితే మొద్దు అవుతారన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఆయన కొడుకు, మనవడు ఏ మీడియంలో చదివారు... మనవడుకు తెలుగు అక్షరాలు వచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిల్లలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలే తప్ప రాష్ట్రంలోని పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవకూడదన్నది ఆయన నైజమన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంక్షదబాబు చేయలేని పనులు రెండేళ్లలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. ప్రజల్లో మంచి పేరు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మాతృభాష అయిన తెలుగును గౌరవిస్తూనే... మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేలా ఆంగ్లమాధ్యమ చదువులకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ఆంగ్లమాధ్యమ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి తెచ్చారన్నారు. చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడు కదా... అక్కడ ఆంగ్లమాధ్యమం అమలుపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జై జగన్ అంటూ జనం నినదిస్తున్న తీరుచూస్తే ‘బాబుకు బాదుడే బాదుడు’ తప్పదన్నారు. 2024 నాటికి తెలుగు దొంగల పార్టీ అంతరించిపోవడం ఖాయమన్నారు. ఎన్ని శవ యాత్రలు చేసినా, లోకేష్ ఎన్ని శవాలు వద్దకు వెళ్లి ఫొటోలు తీయించుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. 2024లో మరోసారీ భారీ మెజారిటీతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మానుకుని హుందాగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు.