army employee
-
కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు
సియోల్: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. ఒక్క వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరడంతో దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఉత్తర కొరియాలో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. లక్షలాది మంది విద్యార్థులు, యూత్ లీగ్ అధికారులు ఆర్మీలో చేరినట్టు.. మరి కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఒక్క వారంలోనే సైన్యంలో 14 లక్షల మంది యువత సైన్యంలో చేరినట్టు చెప్పుకొచ్చింది. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని వెల్లడించింది. దీంతో, దక్షిణ కొరియాపై దాడులకు నార్త్ కొరియా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా పేల్చేసింది. ఇక, కిమ్ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు కౌంటర్‌గా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. ఇదే సమయంలో తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది.అయితే, 2000 సంవత్సరం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో రోడ్లను నిర్మించారు. దీంతోపాటు రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేసుకొన్నారు. వీటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం -
ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
సదరాగా చేసిన తప్పు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించి, దేశ రక్షణలో భాగస్వామి అవుతాడనుకున్న కొడుకు శవంగా మారి.. పాడె ఎక్కడాన్ని తల్లిదండ్రులు భరించలేక పోతున్నారు. దోమ: పరువు పోతుందనే మనస్తాపంతో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట రాములు, మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. వీరిలో చింటు (21) పెద్దవాడు. డిగ్రీ పూర్తి చేసిన ఇతను అగి్నపథ్లో భాగంగా ఇండియన్ ఆరీ్మకి ఎంపికయ్యాడు. ఇటీవలే బెంగళూర్‌లో శిక్షణ పూర్తి చేసుకోగా.. గుజరాత్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సెలవులు ఇవ్వడంతో ఈనెల 22న ఇంటికి వచ్చాడు. గత సోమవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి చింటు సరదాగా బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా సాయంత్రం వేళ దాదాపూర్‌లో స్కూల్ ముగించుకుని కాలి నడకన గుండాలకు వెళ్తున్న ఓ బాలికను గమనించిన చింటు.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తానని స్నేహితులతో చెప్పాడు. ఆ వెంటనే వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఇందుకు అంగీకరించమని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి కొత్తపల్లికి చేరుకుని చింటు తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న చింటు జరిగిన విషయం గ్రామంలో తెలిస్తే తనతో పాటు తల్లిదండ్రుల పరువు పోతుందని మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం బైక్ తీసుకుని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన కొడుకు అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచి్చన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి మోసం
డోన్ టౌన్: ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టింది. బాధితురాలు చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శిరీష మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ప్రవీణ్ ఆరేళ్ల క్రితం ప్రేమ పేరుతో తన వెంట పడ్డాడన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడన్నారు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. కాగా యువతికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఉపాధ్యక్షురాలు షమీమ్‌బేగం గ్రామ మహిళలు మద్దతు తెలిపారు. -
కుమార్తె తొలి పుట్టిన రోజు చూడకుండానే.. ఆర్మీ ఉద్యోగి మృతి
విశాఖపట్నం: జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డు చిట్టివలస రెడ్డి వీధికి చెందిన ఆర్మీ ఉద్యోగి కొల్లి పూర్ణ రామచంద్రారెడ్డి(33) జమ్ములో శుక్రవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. జమ్ములోని సిగ్నల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండగా ఉదయం 10.30 సమయంలో తెగిపడిన విద్యుత్ వైర్లను గుర్తించకపోవడంతో అవి తగిలి మృత్యువాత పడినట్టు అతని బంధువులు తెలిపారు. ఆ సమయంలో విపరీతమైన మంచు కురుస్తుందని వివరించారు. రామచంద్రారెడ్డికి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పాత చెరకుపల్లికి చెందిన భవానీలక్ష్మితో 2020 ఫిబ్రవరిలో వివాహమైంది. వీరికి రేష్మ అనే 11 నెలల కుమార్తె ఉంది. కుమార్తె మొదటి పుట్టినరోజు ఘనంగా నిర్వహించేందుకు ఈ నెల 28న వస్తున్నట్టు ఇటీవల కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించాడు. మృతుని తల్లిదండ్రులు వెంకటరమణ, మంగమ్మలకు ఇద్దరు సంతానంలో పూర్ణ రామచంద్రారెడ్డితో పాటు వివాహమైన మరో కుమార్తె ఉంది. ఈ నెల 19న మృతుని పుట్టినరోజు. కాగా పూర్ణ భౌతిక కాయం శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో జమ్ము నుంచి విశాఖ రానుంది. ఆదివారం చిట్టివలస గోస్తనీనది తీరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి
ఆనందపురం : మండలంలోని వేములవలస వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమునిపట్నం మండలం, చిప్పాడ గ్రామానికి చెందిన సరగడ భరద్వాజ్ (25) గత ఆరేళ్లుగా జమ్ముకాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల రాజస్థాన్ బదిలీకాగా ఈ నెల 1న సెలవుపై ఇంటికి వచ్చాడు. అతనికి వివాహం కాలేదు. మంగళవారం తన అన్న శివ, స్నేహితుడు వెంకటే‹Ùతో కలిసి గ్రామ సమీపంలో గల లే అవుట్లో కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఆ కారు మరమ్మతులకు గురికాగా అన్నయ్య శివను ఇంటికి పంపించేసి, కారుకు మరమ్మతులు చేయించడానికి స్నేహితుడు వెంకటే‹Ùతో కలిసి తరగపువలస వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా భరద్వాజ్ ఇంటికి రాకపోవడంతో అన్నయ్య శివ ఫోన్ చేయగా కారు మరమ్మతులు పూర్తయిన వెంటనే వచ్చేస్తానని చెప్పాడు. ఇందిలా ఉండగా వేములవలస జాతీయ రహదారిపై కారుని మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో భరద్వాజ్ తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్టు పోలీసు లు భరద్వాజ్ అన్నయ్య శివకు సమాచారం అందించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు వెళ్లగా అప్పటికే భరద్వాజ్ మృతి చెందాడు. పెందుర్తి వైపు నుంచి వెళ్తున్న కారు ఎదురుగా రాంగ్ రూట్లో మోటార్ బైక్‌పై వస్తున్న భరద్వాజ్‌ని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. కాగా తగరపువలసలో కారు మరమ్మతులు చేయిస్తున్న భరద్వాజ్ తన స్వగ్రామం చేరుకోవడానికి విజయనగరం రోడ్డు వైపు ప్రయాణించాల్సి ఉండగా రాత్రి వేళ రాంగ్ రూట్లో ఆనందపురం వైపు రావాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అలాగే భరద్వాజ్ ఏదో పనిపై మధురవాడ వెళ్లి వచ్చినట్టు మరో కథనం వినిపిస్తోంది. మృతునికి తండ్రి వెంకట రమణ, తల్లి అరుణ, సోదరుడు శివతోపాటు సోదరి ఉంది. వీరిది వ్యవసాయ కుటుంబం. ఎస్ఐ నరసింహమూర్తి మృతదేహాన్ని పోస్టు మారా్టనికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో చిప్పాడలో విషాదం నెలకొంది. కారు రూపంలో మృత్యువు తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవు తున్నారు. -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్‌కు చెందిన యువతి (20)తో దాదాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
మూడేళ్ల కిందట వివాహం.. సెలవుపై గ్రామానికొచ్చి రోడ్డు ప్రమాదంలో
సాక్షి, బొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి 26పై సోమవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి ధుర్మరణం పాలైన సంఘటన చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్సై ఆర్.వాసుదేవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన అడ్డు త్రినాథరావు (30) జమ్ముకాశ్మీర్‌లో ఆర్మీలో జవానుగా పని చేస్తునట్లు తెలిపారు. మృతునికి విజయనగరం బొగ్గులుదిబ్బలో ఉంటున్న తన అక్క కూతురైన కీర్తిని 2018 సంవత్సరంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఆరు రోజులు కిందట శెలవులపై వచ్చిన అతను ద్విచక్ర వాహనంపై విజయనగరం వైపు నుంచి గజపతినగరం వైపు వస్తుండగా గొట్లాంకు సమీపంలో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు చెప్పారు. దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పంచనామా నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. చదవండి: (ఆ పతంగి దారం అతని గొంతును కోసేసింది.. అదృష్టవశాత్తు భార్యకు..) శోక సముద్రంలో కుటుంబాలు అటు త్రినాథరావు స్వగ్రామం నెల్లిమర్లలోని గాంధీనగర్‌లోను, ఇటు తన అక్క ఉంటున్న విజయనగరంలోని బొగ్గులదిబ్బలోను విషాద ఛాయలు అలుముకున్నాయి. క్రిస్మస్ పండుగకు వీలు చేసుకోని రావాలని తన తమ్ముడు, అల్లుడు అయిన త్రినాథరావుకు ఫోన్‌చేసి చెప్పినప్పటికీ శెలవులు ఇస్తే వస్తానని చెప్పిన వాడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా ఆసుపత్రి వద్ద రోదించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) -
నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా..
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): తనను మోసం చేశాడని మండలంలోని చౌటపల్లిలో ఆర్మీ జవాన్ ఇంటి ఎదుట నిరసనకు దిగిన ప్రియురాలి నిరసన ఆదివారం శృతిమించటంతో గందరగోళం నెలకొంది. చౌటపల్లికి చెందిన తిలక్‌గౌడ్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తనను మోసం చేశాడని హైదరాబాద్‌కు చెందిన పూజ అతని ఇంటి ఎదుట నిరసనకు దిగింది. కాగా రెండ్రోజుల క్రితం ఎవరూ లేకపోవటంతో ఆమె నిరసన విరమించింది. తిరిగి ఆదివారం ప్రియుడి ఇంటి ఎదుట మరోసారి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని కోరింది. తన నిరసనను ఎవరైనా అడ్డుకుంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. దీంతో చుట్టు పక్కలవారు, ప్రియుడి బంధువులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించిన తరుణంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అలాగే ఆమె ప్రతి ఘటించటంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో నిరసనకు దిగిన ప్రియురాలిని జవాన్ బంధువులు చితకబాదినట్లు సమాచారం. కత్తి తీ సుకుని రావటంతో ఆమెను ఆడ్డుకున్న తరుణంలో ఇద్దరికి గాయాలు అయినట్లు సమాచారం. కాగా ఈ విషయంలో ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, దీనికి గల పూర్వపరాలు పరిశీలించి కేసు దర్యాప్తు చే స్తామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. కాగా బాధితురాలు గతంలోనే తనను మోసం చేశాడన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. చదవండి: మూడు నెలలుగా సహజీవనం.. మనస్పర్థల కారణంగా ఆత్మహత్య -
మావోయిస్టు పేరుతో డబ్బు డీమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్
-
కల్నల్ భార్యను మోసం చేసిన నైజీరియన్..
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరంలో నివసిస్తున్న ఓ ఆర్మీ ఉన్నతాధికారి భార్యను మోసం చేశారు. అమెరికా నుంచి చాట్ చేస్తున్నట్లు చెప్పిన వాళ్లు భారత్ వచ్చామని, కిడ్నాప్ అయినట్లు కథ అల్లారు. రూ.1.5 లక్షలు కాజేశారు. మరో రూ.10 లక్షలకు గాలం వేశారు. భార్య ద్వారా సమాచారం అందుకున్న ఆ అధికారి కశ్మీర్ నుంచి ఆగమేఘాలపై వచ్చి గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్మీలో కల్నల్ హోదాలో పని చేస్తున్న ఓ అధికారి గతంలో నగరం కేంద్రంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనకు కాశ్మీర్లో పోస్టింగ్ వచ్చినప్పుటికీ కుటుంబాన్ని మాత్రం ఇక్కడే ఉంచారు. అప్పుడప్పుడు ఆయనే వచ్చి వెళుతుండే వారు. ఇదిలా ఉండగా... దాదాపు నెల రోజుల క్రితం సిటీలో ఉన్న ఆ కల్నల్ భార్యకు ఫేస్బుక్ ద్వారా ఓ రిక్వెస్ట్ వచ్చింది. అమెరికాకు చెందిన కిమ్‌గా, పెద్ద వ్యాపారిగా ఉన్న ప్రొఫైల్ చూసిన ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారారు. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు పూర్తి స్నేహపూర్వకంగా చాటింగ్ చేసిన కిమ్ కల్నల్ భార్య నమ్మకాన్ని చూరగొన్నాడు. ఆపై అసలు కథ ప్రారంభించిన అతగాడు మిమ్మల్ని కలవడానికి భారత్‌కు వస్తున్నట్లు చెప్పడంతో ఆమె అంగీకరించారు. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ నుంచి అంటూ కిమ్ ఫోన్ చేశాడు. అమెరికా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన తనను కొందరు కిడ్నాప్ చేశారని, డబ్బు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కొద్దిసేపటికి మళ్లీ కాల్ చేసిన కిమ్.. కిడ్నాపర్లు మాట్లాడతారని అంటున్నారంటూ ఫోన్ మరొకరికి అందించాడు. కల్నల్ భార్యతో మాట్లాడిన అతగాడు కిమ్‌ను కిడ్నాప్ చేసి ఢిల్లీ శివార్లలో దాచామని, తక్షణం రూ.1.5 లక్షలు చెల్లించకపోతే అతడిని చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడిన ఆమె విషయాన్ని తన భర్తకు చెప్పడానికి ఫోన్ ద్వారా ప్రయత్నించారు. కాశ్మీర్లో విధుల్లో ఉన్న ఆయన ఫోన్ కలవకపోవడంతో డబ్బు చెల్లిస్తానంటూ కిడ్నాపర్లుగా చెప్పుకున్న వారితో ఒప్పందం చేసుకున్నారు. ఆపై వారు చెప్పిన ఖాతాలోకి రూ.1.5 లక్షలు బదిలీ చేశారు. ఈ డబ్బు ముట్టిన తర్వాత మరోసారి కాల్ చేసి కిడ్నాపర్లుగా చెప్పుకున్న మరో కొత్త కథ అల్లారు. కిమ్ దగ్గర ఉన్న ఫోన్లో మీవి, మీ పిల్లలవి వివరాలు, ఫొటోలు ఉన్నాయని చెప్పారు. తమకు రూ.10 లక్షలు చెల్లించకపోతే ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా, అశ్లీలంగా మారుస్తామని, అంతటితో ఆగకుండా వాటిని సోషల్‌మీడియాలో పెడతామని బెదిరించారు. అదను చూసుకుని మీ పిల్లల్ని చంపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె మంగళవారం తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అది నైజీరియన్ల పనిగా గుర్తించిన ఆయన ఒక్క పైసా కూడా చెల్లించవద్దంటూ ఆమెకు చెప్పి హుటాహుటిన బయలుదేరి నగరానికి వచ్చారు. కాశ్మీర్లో తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతం నుంచి శ్రీనగర్‌కు హెలీకాఫ్టర్లో అక్కడ నుంచి ఢిల్లీకి, అట్నుంటి సిటీకి విమానంలో వచ్చారు. గురువారం తన భార్యతో సహా వచ్చి సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఆమె డబ్బు బదిలీ చేసిన ఖాతా ఈశాన్య రాష్ట్రాలకు చెందినదిగా గుర్తించారు. ఇది నైజీరియన్ల పనిగా తేల్చిన అధికారులు బాధ్యుల కోసం గాలిస్తున్నారు. -
రెండో పెళ్లి కేసులో ఆర్మీ ఉద్యోగి..
జవహర్‌నగర్: ఓ యువతిని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న ఆర్మీ ఉద్యోగిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మదర్ థెరిస్సా కాలనీకి చెందిన సుర్భమ్ రమేష్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన అతను తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఫేస్బుక్ పరిచయం.. బైక్ పేరుతో మోసం
బంజారాహిల్స్: ఫేస్బుక్లో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని ఆర్మీ అధికారి పేరిట ఓ వ్యక్తి నగర వాసిని మోసం చేశాడు. బైక్ విక్రయిస్తానని చెప్పి డబ్బు తీసుకొని తరువాత స్పందించకపోవడంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–2లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న చిరుద్యోగి వెంకటేష్‌కు రవికుమార్ అనే పేరుతో ఓ వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. తాను ఆర్మీ అధికారినని చెప్పుకున్నాడు. ఈ క్రమంలోనే తన వద్ద ఓ స్కూటీ ఉందని చెప్పడంతో తాను కొనుక్కుంటానని వెంకటేష్ వెల్లడించాడు. దీంతో రూ.15వేలు బ్యాంకు ఖాతాలో వేయమని చెప్పాడు. వాహనం రాకపోవడంతో ఆర్మీ నిబంధనల ప్రకారం.. బైక్ విడుదల కావాల్సి ఉంటుందని కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి ఇండియన్ ఆర్మీ ట్రాన్స్పోర్ట్ పార్సిల్ డిపార్ట్మెంట్ పేరుతో ఓ రశీదు కూడా పంపించాడు. అంతకుముందు ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటర్ఐడీ కార్డు కూడా పంపించడంతో సదరు యువకుడు నమ్మాడు. ఎంతకూ బైక్ రాకపోగా ఫోటోలో పంపించిన బైక్ ఆధారాలు తెలుసుకున్నాడు. అది ఓ మహిళ పేరుమీద ఉందని తేలింది. దీనికి తోడు ఆ వ్యక్తి సెల్‌కూడా స్విచ్ఆఫ్ అని వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఆర్మీ అధికారి పేరుతో ఓ వ్యక్తి అటు ఓఎల్ఎక్స్లోనూ ఇటు ఫేస్‌బుక్‌లోనూ వాహనాల ఫోటోలు పెడుతూ నకిలీ వాహనాల ఫోటోలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. -
ఆర్మీ అధికారి కుమార్తెల దుర్మరణం..
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు: గ్రామంలోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ అధికారి బాలికలు ఇద్దరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీకి చెందిన వినీత్ అగర్వాల్ మిలట్రీ అధికారి (కల్న ల్)గా పని చేస్తున్నారు. ఈయన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి కారులో కోల్‌కతాకు పయనమయ్యారు. ఆదివారం ఆయన భార్య సుభాయ్, ఇద్దరు కుమార్తెలు రాధికా అగర్వాల్ (16), రితికా అగర్వాల్ (14) కారులో రాజమహేంద్రవరం స్నేహితుడి ఇంటో ఆగి తిరిగి వెళ్తుండగా వీరి కారు ధర్మవరం గ్రామ జోడుగడ్ల వాగు సమీపాన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న అగర్వాల్, వెనుక సీటులో ఉన్న భార్య సుభాయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందు, వెనుక సీట్లలో ఓ వైపు కూర్చున్న కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. సంఘటనా స్థలాన్ని జగ్గంపేట సీఐ వై.రాంబాబు, ప్రత్తిపాడు ఎస్సై ఎ.బాలాజీ పరిశీలించారు. ఆర్మీ అధికారి పదోన్నతిపై కోల్‌కతాకు కుటుంబంతో కలిసి వెళ్తున్నట్టు తెలిసింది. లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి.. రాజమహేంద్రవరం రూరల్: ఇంటర్ పరీక్షలు రాసిన అతడు ఖాళీ సమయంలో ఇంటికి చేదోడు వాదోడుగా ఉందామని తాపీపనికి వెళుతున్న ఆ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రతి రోజూ రాజమహేంద్రవరంలో తాపీపనికి వెళుతున్న గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన తమ్మనబోయిన రవి (19)ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దివాన్‌చెరువు సమీపంలోని గైట్ కళాశాల వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆచంట నాగవెంకటేష్, ముత్తుత్తి సూర్యనారాయణతో కలిసి రవి ఆదివారం ఉదయం మోటార్ బైక్‌పై రాజమహేంద్రవరం తాపీపనికి వచ్చారు. ఇంటికి తిరిగి వెళుతుండగా లారీ బైక్‌ను అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యనారాయణ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. నాగ వెంకటేష్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు బొమ్మూరు పోలీసులకు సమాచారం అందించారు. -
దేశ సేవలోనే తుది శ్వాస
శ్రీకాకుళం , నరసన్నపేట రూరల్: విధి నిర్వహణలో భాగంగా గాయపడిన ఆర్మీ ఉద్యోగి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామం వీఎన్‌పురం తీసుకురావడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు సైనిక లాంఛనాలతో గురువారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.మండలంలోని వీఎన్‌పురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి చల్ల రమేష్ (34) 16వ మద్రాస్ ఇంజినీర్ రెజిమెంట్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట బరువైన వస్తువు తగిలి అతడి కాలికి గాయమైంది. ఆ తర్వాత గాయానికి ఇన్ఫెక్షన్ సోకడంతో ఢిల్లీలోని ఎంహెచ్ఆర్ఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు మృతి చెందారని సుబేదర్ భాస్కరరావు తెలిపారు. తల్లడిల్లిన చిన్నారి స్వగ్రామానికి శవపేటికలో రమేష్ మృతదేహాన్ని సైనిక సిబ్బంది తీసుకొచ్చారు. ఇక్కడ్నుంచి వెళ్లిన భర్త విగతజీవిగా కనిపించడంతో భార్య అరుణ జీర్ణించుకోలేకపోయింది. గండెలవిసేలా రోదించింది. ఈమెతోపాటు అతడి తల్లి నరసమ్మను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చిన్నారి అభిషేక్(9) తన తండ్రి పార్థివదేహానికి వందనం చేస్తూ కన్నీటి పర్యంతయ్యాడు. ఇంతలో అక్కడవారు ఓదార్చుతుండగా ‘డాడీ..రా..డాడీ’ అంటూ బోరుమని ఏడుస్తున్న ఘటన చూపరులను కలచివేసింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు హూటహుటిన ఇక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సైనిక సిబ్బంది ఘన నివాళి ఈ సందర్భంగా రమేష్ పార్థివదేహంపై సైనిక అధికారులు జాతీయ పతాకాన్ని కప్పారు. సుబేదర్ భాస్కరరావు, సైనిక సిబ్బంది సోమేశ్వరరావు, పీటీరావు, శ్రీనివాసరావు, శంకరరావు, సిగ్ననల్మేన్ శ్రీనివాసరావు శోకతప్త హృదయాలతో గౌరవ వందనం చేస్తూ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పార్థివదేహానికి అంతిమయాత్ర నిర్వహించి, స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంతిమ యాత్రలో వైఎస్సార్ సీపీ మండల యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య, మాజీ సర్పంచ్ పుట్ట ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల దాష్టీకం
విశాఖపట్నం: అనకాపల్లిలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయి. అధికార పార్టీ నేతల బరితెగింపు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అశాంతి రాజ్యమేలుతోంది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో ఓ ఆర్మీ ఉద్యోగిపై రెండో సారి కూడా దాడి జరిగింది. ఆ దాడి చేసింది టీడీపీ నేత అనుచరులని, అందువల్లే ఫిర్యాదుచేసినా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి అనకాపల్లి పట్టణంలోని కోట్నివీధికి చెందిన శ్యామలరావు అనే వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. ఈయనపై గతంలో ఒకసారి తాకాశివీధి వద్ద దాడి జరిగింది. పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులకు, శ్యామలరావుకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వారు దాడి చేశారు. కేసు నమోదు అయినా విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు కమాండర్ అధికారి ద్వారా కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ కేసు విచారణలో పురోగతి లేకుండాపోయింది. టీడీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్ల వల్లే ఈకేసు ముందుకు సాగడంలేదని ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ దాడి... తాజాగా శ్యాలమరావుపై పట్టణానికి చెందిన ఐదుగురు ఈనెల 18వ తేదీ రాత్రి దాడి చేశారు. దుస్తులు చింపి, తీవ్రంగా కొట్టడంతో శ్యామలరావు రక్తంమడుగులో పడిపోయాడు. దీంతో దాడి ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో తాజాగా ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. శ్యామలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన శేఖర్, నర్సింగరావు, కృష్ణాజీ, ప్రసాద్, చిన్నలపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. 19న నమోదైన ఈ కేసు విచారణ నత్తనడకన సాగుతోంది. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడి వల్లే కేసు విచారణలో పురోగతి లేకుండాపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారు శ్యామలరావును హత్య చేస్తారేమోనని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని శ్యామలరావు వేడుకుంటున్నాడు. కేసు విచారణను తాను ఉద్యోగం చేసే ప్రాంతానికి బదిలీ చేయాలని కోరుతున్నాడు. ఈ ఘర్షణలకు సంబంధించి పెద్దల మధ్య చర్చలు గత నాలుగైదు నెలల నుంచి నడుస్తున్నాయి. పోలీసుయంత్రాంగం తక్షణమే స్పందించి బాధితునికి న్యాయం చేయడంతోపాటు పట్టణంలో శాంతియుత వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
సినిమాల్లో సీన్లా ఒక్కటైన ప్రేమజంట
ఒంటరిగా వెళ్లిన యువకుడు జంటగా ఇంటికి తిరిగొచ్చాడు. ఏది ఏమైతేనేం, ఎన్ని కష్టాలు ఎదురైనా తన ప్రేమను గెలిపించుకుని శభాష్ అనిపించుకున్నాడు ఓ ఆర్మీ ఉద్యోగి. అచ్చం సినిమాల్లో సన్నివేశంలాగా జరిగిపోయిన వివాహంపై బిహార్‌లోని తిలౌతులో చర్చించుకుంటున్నారు. పట్నా : తిలౌతు పీఎస్ పరిధిలోని మహారాజ్‌గంజ్ గ్రామానికి చెందిన విశాల్ సింగ్ అలియాస్ తేజు(25) ఆర్మీలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. బరాధికి చెందిన సమీప బంధువు భిఖారి యాదవ్ కూతురు లక్ష్మిణ కుమారితో విశాల్‌తో పరిచయం ప్రేమగా మారింది. గత ఐదేళ్లగా తమ ఇంట్లో తెలియకుండా వీరు రహస్యంగా కలుసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్మీ నుంచి సెలవుపై వచ్చిన విశాల్, బుధవారం రాత్రి లక్ష్మి ఇంటికి దొంగచాటున వెళ్లాడు. లక్ష్మి కుటుంసభ్యులు దొంగగా భావించి విశాల్‌ను పట్టకున్నారు. విశాల్ చోరీకి వచ్చాడని అనుమానించి ఓ గదిలో అతడిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతోపాటు విశాల్ గ్రామ(మహారాజ్‌గంజ్) పెద్దలను సైతం పంచాయితీకి పిలిపించారు. గత కొంతకాలం నుంచి తాము ప్రేమించుకున్నామని విశాల్, లక్ష్మీలు బహిర్గతం చేశారు. దీంతో వీరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. గురువారం రోజు వేడుకగా వీరి పెళ్లిని రెండు గ్రామాల ప్రజల సమక్షంలో నిర్వహించారు. వరుడి తాత హర్షం వరకట్నం తీసుకోకుండా నా మనవడి పెళ్లి జరిపించాలనుకున్నా. నేడు అదే జరిగింది. మా విశాల్ కోరుకున్న అమ్మాయితో వివాహం జరగడం నా సంతోషాన్ని రెట్టింపు చేసిందని వరుడి తాత పంచూ అన్నారు. వధూవరులు మేజర్లు కావడం వల్ల అక్షింతలు వేసి ఆశీర్వదించడం తప్ప.. తాము చేసేదేంలేదన్నారు పోలీసులు. -
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
కలసపాడు: మండల పరిధిలోని పిడుగుపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి నాగిరెడ్డి దస్తగిరిరెడ్డి (28) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగుపల్లెకు చెందిన నాగిరెడ్డి పిచ్చిరెడ్డి, వెంకటసుబ్బమ్మ కుమారుడు దస్తగిరిరెడ్డి మహారాష్ట్రలోని పూణేలో 13 ఏళ్లుగా ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చెందిన క్రిష్ణవేణితో వివాహమైంది. వీరికి రెండు నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. దస్తగిరిరెడ్డి ఇటీవల 15 రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి బెడ్ రూంలో ఒకడే పడుకున్నాడు. తెల్లవారి చూసే సరికి ఫ్యా¯న్కు చీరతో ఉరేసుకుని మరణించాడు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని కిందికి దించారు. మెడ చుట్టూ కమిలిపోయి ఉంది. మృతునికి చెల్లెలు ఉంది. దస్తగిరిరెడ్డి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
కలసపాడు: మండల పరిధిలోని పిడుగుపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి నాగిరెడ్డి దస్తగిరిరెడ్డి (28) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగుపల్లెకు చెందిన నాగిరెడ్డి పిచ్చిరెడ్డి, వెంకటసుబ్బమ్మ కుమారుడు దస్తగిరిరెడ్డి మహారాష్ట్రలోని పూణేలో 13 ఏళ్లుగా ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చెందిన క్రిష్ణవేణితో వివాహం అయింది. వారికి రెండు నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. దస్తగిరిరెడ్డి ఇటీవల 15 రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి బెడ్ రూంలో ఒకడే పడుకున్నాడు. తెల్లవారి చూసే సరికి ఫ్యా¯Œన్కు చీరతో ఉరి వేసుకుని మరణించాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కిందికి దించారు. మెడ చుట్టూ కమిలిపోయి ఉంది. మృతునికి అవివాహిత చెల్లెలు ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేడుక ఇంట విషాదం
ఎస్.రాయవరం (పాయకరావుపేట): పుట్టిన రోజు వేడుకతో ఎంతో సందడిగా ఉండాల్సిన ఆ ఇంట మృత్యువు విషాదం నింపింది. ఇంటికి పెద్దదిక్కయిన వ్యక్తిని దూరం చేసింది. వివరాలిలావున్నాయి.పెనుగొల్లు గ్రామా నికి చెందిన పావని (10) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆమె పాలన మేనమామ ఇసరపు ఆనంద్, అమ్మమ్మ నూకాలమ్మ చూస్తున్నారు. ఆనంద్ ఆర్మీ ఉద్యోగి. నాలుగు రోజులక్రితం స్వగ్రామం పెనుగొల్లు వచ్చాడు. శనివారం మేనకోడలు పుట్టిన రోజు కావడంతో సాయంత్రం ఐదు గంటలకు కేక్ తెచ్చేందుకు బైక్‌పై పావని, సోదరుని కుమార్తె విజయ్‌తో అడ్డురోడ్డు బయలుదేరాడు. జాతీయ రహదారిపై వెళ్తుండగా నాటుబండిని బైక్‌తో ఢీకొన్నాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. పావనికి స్వల్పగాయాలు, విజయకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్.రాయవరం ఎస్ఐ కుమారస్వామి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆనంద్ మృతదేహాన్ని నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. వేడుకలతో సందడిగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు ఆనం ద్ మృతితో దుఃఖసాగరంలో మునిగి పోయారు. పోషించే దిక్కు కోల్పోవడంతో తమను ఎవరు ఆదుకుంటారని రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది. వారిని అదు పు చేయడం ఎవరితరం కాలేదు. -
ఆ..ఇల్లాలు ఇంటికి చీకటి!
►భర్తతో ఏడడుగులు కలిసి నడిచినా కనికరం చూపని భార్య ►ఇంటి యజమాని మంచాన పడితే ముఖం చాటేస్తున్న ఇల్లాలు ►పింఛన్, ఇతర వనరులన్నీ అనుభవిస్తూ భర్తను ఎట్టికి వదిలిన సతి ►ఇంటి నుంచి దుర్గంధం వస్తుండటంతో ఆందోళనకు దిగిన ఇరుగుపొరుగు ►ప్రశ్నించిన బంధువులపై కేసులు బనాయిస్తానంటూ బెదిరిస్తున్న మహిళ కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ.. ఇక్కడ ఈమె.. కార్యేషు దాసి కాలేకపోతోంది.. ఇక్కడ.. ఈమె కరణేషు మంత్రి అంతకన్నా కాదు.. ఇక్కడ. ఈమె భోజ్యేషు మాతను కాదు పొమ్మంటోంది.. సృష్టిలో వివాహ బంధాన్ని వర్ణిస్తూ కవులు ఎన్నో పాటలు రాశారు. ఎన్నో చిత్రాల్లో భార్య,భర్తల అనుబంధాన్ని చెప్పే సన్నివేశాల్లో పై నాలుగు చరణాలు ఉటంకిస్తుంటారు. అంతటి పవిత్ర బంధాన్ని ఓ ఇల్లాలు మంటగలుపుతోంది. కడవరకూ తోడుంటానని పెళ్లినాటి బాసలకు పాతరేస్తోంది. మంచంపట్టిన ఇంటి యజమానికి తోడు లేకుండా తన దారి తాను చూసుకుంటోంది. ఆయన నుంచి వచ్చిన అన్ని ఆదాయ వనరులు అనుభవిస్తూ ఎట్టికి వదిలేసింది. గిద్దలూరు రూరల్ : అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భర్త అనారోగ్యానికి గురయ్యాడు. భర్త మంచాన పడితే ఆమె కనికరం చూపడం లేదు. ఆయన్ను నిర్ధాక్షిణంగా వదిలి పుట్టింటికి వెళ్లింది. చివరకు స్థానికుల చొరవతో కన్నతల్లి, బంధువుల వద్దకు చేరాడు. ఈ హృదయ విదారక సంఘటన పట్టణంలోని నల్లబండ బజారులో ఆదివారం వెలుగు చూసింది. ఇదీ.. జరిగింది రాచర్లకు చెందిన రాచర్ల వెంకట సుబ్బయ్య ఆర్మీ ఉద్యోగి. ఆయనకు గిద్దలూరుకు చెందిన రమాదేవితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు గుర్తుగా ఇద్దరు కుమారులు కలిగారు. సుబ్బయ్య జమ్మూలో విధులు నిర్వర్తిస్తుండగా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. 3 ఏళ్ల క్రితం పక్షవాతం కూడా వచ్చి కాళ్లు, నోరు పడిపోయాయి. అప్పటి వరకూ దంపతులు కలిసి మెలిసి అన్యోన్యంగానే ఉన్నారు. విధుల నుంచి బయటకు వచ్చిన తర్వాత దంపతులు కాపురాన్ని గిద్దలూరు మార్చారు. నల్లబండ బజారులో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. సుబ్బయ్య ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. ఆయనకు పదవీ విరమణ బెన్ఫిట్స్ వచ్చాయి. ఫెన్షన్ నెలనెలా వస్తోంది. భర్త బాగోగులు పట్టించుకోని భార్య చిన్నచిన్నగా ఆమె భర్త బాగోగులను పట్టించుకోవడం లేదు. దీన్ని పసిగట్టిన ఇంటి యజమాని వారిని ఇంటి నుంచి ఖాళీ చేయించాడు. ఈ నేపథ్యంలో 6 నెలల క్రితం నల్లబండ బజారులో సొంతంగా ఓ ఇల్లు కొనుగోలు చేసి భర్తను అందులో పెట్టింది. మంచాన పడిన భర్త ఆలనా పాలన చూసుకోకుండా ఆమె తన మకాన్ని దగ్గర్లోని పుట్టింటికి మార్చింది. భర్తను ఒంటరిగా కొనుగోలు చేసిన ఇంట్లో ఉంచి ఆహారం మాత్రమే పెట్టింది. సుబ్బయ్య మలమూత్రాలు మంచంపైనే విసర్జించేవాడు. ఆమె పట్టించుకోవడం లేదు. ఇంటి నుంచి దుర్గంధం ఇంటి నుంచి తీవ్ర దుర్గంధం వస్తోంది. తట్టుకోలేని స్థానికులు ఆమెకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చేసేది లేక ఆయన బంధువులకు సమాచారం ఇచ్చారు. సుబ్బయ్యకు మెరుగైన వైద్య సేవలు అందించి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఇరుగుపొరుగు ఆదివారం ఆందోళనకు దిగారు. కట్టుకున్న భర్తను వదిలేసి ఇంటిని శుభ్రం చేసుకోకుండా భర్తను పట్టించుకోకుంటే ఎలాగని స్థానికులు ప్రశ్నించారు. సుబ్బయ్యకు వచ్చే నెలవారీ జీతం, ఫెన్షన్ మాత్రం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. కన్న ప్రేమను వదులుకోలేను : రాచర్ల పార్వతమ్మ, వెంకట సుబ్బయ్య తల్లి నా కుమారుడు వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మంచానపడితే కోడలు రమాదేవి పట్టించుకోవడం లేదు. ఆమె భర్త ప్రేమను మరిస్తే నేను కన్న ప్రేమను తుంచుకోలేను. నా కన్న కుమారుడిని ఇంటికి తీసుకెళ్లి దగ్గరుండి చూసుకుంటా. నా కొడుకును ఇంటికి తీసుకెళ్తే కిడ్నాప్ చేశారంటూ.. కేసులు పెడతానని కోడలు బెదిరిస్తోంది. -
ప్రదీప్ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్
విశాఖపట్నం: ఇంజనీరింగ్ విద్యార్థి దానబాల ప్రదీప్ హత్య కేసులో 8 మందిపై కేసు నమోదైంది. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం డిఫెన్స్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. గత నెల 28న మాకవరంపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 28న సహచర విద్యార్థినితో కలిసి కశింకోట వద్ద ప్రదీప్ బస్సు దిగాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో కలిసి చాట్ తింటుండగా గుర్తుతెలియని దుండగులు ప్రదీప్‌ను అక్కడినుంచి లాక్కెళ్లి కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేశారు. అదే రోజు ప్రదీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ప్రదీప్ బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
పశ్చిమ బెంగాల్లో ఘటన.. మృతుడు వరంగల్ జిల్లావాసి కొడకండ్ల: ఆర్మీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా కొడకండ్ల మండలంలోని ఏడునూతుల గ్రామానికి చెందిన వెలికట్టె సుధాకర్‌గౌడ్(24) గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్నాడు. గ్రామానికి చెందిన వెలికట్టె సోమయ్య-రామతార దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడైన సుధాకర్ 2012లో ఆర్మీలో డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికయ్యూడు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లో పనిచేసి, గత నెలలో పశ్చిమబెంగాల్‌కు బదిలీ అయ్యూడు. ఈ మేరకు ఉత్తర్వులు తీసుకుని నెలరోజులు సెలవు పెట్టి ఏడునూతులకు వచ్చాడు. తిరిగి ఈ నెల 18న ఇంటి నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్ వెళ్లి విధుల్లో చేరాడు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో క్యాంప్ బాత్రూంలో పైపునకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సహచరులు గమనించి అధికారులకు తెలపగా, వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నెలరోజులపాటు అందరితో సరదాగా గడిపి వెళ్లిన తమ కుమారుడు.. విధుల్లో చేరిన తెల్లవారే ఆత్మహత్య చేసుకున్నాడనే విషయూన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని శనివారం హైదరాబాద్‌కు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
గంట్యాడ : మండలంలోని పెనసాం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి లెంక సీతంనాయుడు మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతంనాయుడు పూణేలో ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల ఎనిమిదో తేదీన అతని తండ్రి అప్పలనాయుడు మృతి చెందడంతో సీతంనాయుడు గ్రామానికి వచ్చాడు. మంగళవారం రాత్రి వరకు అదే గ్రామంలో ఉన్న మేనమామ ఇంటి వద్ద గడిపి పడుకునేందుకు తన సొంత ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం సీతంనాయుడు మేనల్లుడు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా దూళానికి ఉరి వేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న వీఆర్ఓ అబద్ధం గంట్యాడ పోలీసులకు సమాచారం తెలియజేశారు. దీంతో ఎస్సై తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కుటుంబ సమస్యల కారణంగా మృతుడి భార్య కుమార్తెతో కలిసి కన్నవారింటిలో ఉంటోంది. ఒకే ఇంటిలో.. మృతుడి తల్లి నారాయణమ్మ రెండేళ్ల కిందట గుండె పోటుతో మృతి చెందగా, తండ్రి అప్పలనాయుడు ఎనిమిది రోజుల కిందట కన్నుమూశాడు. సోదరుడు అప్పలరాజు కూడా గతేడాది మూడో నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు సీతంనాయుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి. కొద్ది రోజుల్లోనే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. -
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
గంట్యాడ: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కనకం గ్రామంలో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెంక సీతంనాయుడు(33) అనే వ్యక్తి బుధవారం వేకువజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అనారోగ్యంగా ఉండడంతో ఇంటికి వచ్చిన సీతంనాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతికి కారణాలు తెలియలేదు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. -
భార్యను చంపి.. ఆత్మహత్యగా చిత్రించాడు!
నిజాంపట్నం(గుంటూరు): భార్యను కిరాతకంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రించాలని ప్రయత్నించాడో ఓ ఆర్మీ ఉద్యోగి. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజాంపట్నంకు చెందిన లెనిన్(25) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను స్థానికంగా నివాసముంటున్న షీలం సూర్యగౌతమి(20)ని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇందుకు ఇద్దరి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఉద్యోగం మానేశాడు. ఇంటి దగ్గర జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కులాంతర వివాహం కావడంతో.. పెళ్లి సమయంలో వధువుకు 50 సెంట్ల భూమిని లెనిన్ భరణంగా ఇచ్చాడు. ఇప్పుడు దానిని అమ్మి డబ్బు తీసుకురమ్మని భార్యతో గత కొన్నిరోజులుగా గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆమెను హతమార్చి అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.