Ashraf Ghani
-
Afghan Girl: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే! పాపం మరోసారి..
Nat Geo Green-Eyed Girl, "Most Famous Afghanistan Refugee": పాలనా సంక్షోభం ఏర్పడితే దేశ పౌరుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఇటువంటి నిస్సహాయ పరిస్థితులను 30 ఏళ్ల క్రితం ఎదుర్కొని శరణార్థిగా మారింది అఫ్గానిస్తాన్‌కు చెందిన షర్బత్ గుల్. గత నలభై ఏళ్లలో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న అఫ్గానిస్తాన్ మరోసారి తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో..49 ఏళ్ల వయసులో షర్బత్ మరోసారి శరణార్థిగా మారింది. అది అఫ్గానిస్తాన్‌ను జాహీర్ షా అనే రాజు పరిపాలించే రోజులు. నలభై ఏళ్లపాటు ఒకే రాజు పరిపాలించడంతో.. విసిగిపోయిన ప్రజలు, అధికారులు.. జాహీర్ షా కుటుంబానికి చెందిన మొహమ్మద్ దావుద్ ఖాన్‌కు పట్టంగట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త సంస్కరణలు దావూద్ అమలు చేసేవాడు. అవి నచ్చని ప్రతిపక్షం రకరకాల కుట్రలతో ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ పార్టీ పాలనలో కొన్ని నిర్ణయాలు సొంత సభ్యులకే నచ్చకపోవడంతో.. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అధికారం కోసం కుమ్ములాటలు, కుతంత్రాలతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో తలెత్తిన రాజకీయ అనిశ్చతిలో ఎంతో మంది అఫ్గాన్లు, సోవియట్ సైనికులు మరణించగా, లక్షలాదిమంది దేశం విడిచి వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో షర్బత్ కూడా ఒకరు. 80వ దశకంలో పాపులర్ ఫోటో.. దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు షర్బత్ కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. అప్పుడు షర్బత్ వయసు పన్నెండేళ్లు. అఫ్గాన్––పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఓ శరణార్థి శిబిరంలో షర్బత్‌ను స్టీవ్ మెకెర్రీ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ 1984లో చూశాడు. ఆకుపచ్చని రంగులో మెరుస్తున్న ఆమె కళ్లు మెకెర్రీని ఆకర్షించడంతో వెంటనే ఆమె ఫోటో తీశాడు. అప్పటి భీకర యుద్ధవాతావరణ పరిస్థితులన్నీ షర్బత్ పచ్చని కళ్లలో ప్రతిబింబించాయి. దీంతో ఆ ఫోటోను నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ కవర్ పేజీపైన 1985లో ప్రచురించారు. ‘‘అఫ్ఘన్ గర్ల్’’గా షర్బత్ ప్రపంచమంతా పాపులర్ అయ్యింది. 1980 – 1990 దశకంలో బాగా పాపులర్ అయిన ఫోటోలలో అఫ్గాన్ గర్ల్ ఒకటిగా నిలిచింది. తనకు పాపులారిటి వచ్చిందని షర్బత్‌కు ఏమాత్రం తెలీదు.పెళ్లి తరువాతే తను ఎంత పాపులర్ అయ్యిందో తెలుసుకుని ఆ ఫోటోను తీసుకుంది. 2002 వరకు షర్బత్ ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. మెకెర్రీ మళ్లీ షర్బత్ ఆచూకీ తెలుసుకుని..ఎఫ్‌బీఐ అనలిస్టు, ఫోరెన్సిక్ విభాగానికి ఇవ్వడంతో.. వారు షర్బత్‌గా నిర్ధారించారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటోన్న సమయంలోనే 16 ఏళ్ల వయసులో రహ్మత్ గుల్‌ను పెళ్లిచేసుకుంది. షర్బత్ దంపతులకు నలుగురు పిల్లలు. పాకిస్థాన్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తోన్న షర్బత్‌కు ముఫ్పై ఏళ్ల తరువాత అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అది 2016 షర్బత్‌కు నలభై ఏళ్లు. “తమ దేశంలో నకిలీ గుర్తింపు పత్రాలతో అక్రమంగా నివసిస్తోందన్న ఆరోపణతో షర్బత్‌కు పాక్ ప్రభుత్వం.. పదిహేను రోజుల జైలుశిక్ష, లక్షాపదివేల రూపాయల రుసుమును కట్టించి స్వదేశానికి పంపించేసింది. ఆ సమయంలో అఫ్ఘన్ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీ... షర్బత్ పరిస్థితి తెలుసుకుని, కాబూల్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉండేందుకు వసతి కల్పించారు. అప్పటి నుంచి అక్కడే కుటుంబంతో నివసిస్తోంది షర్బత్. హెపటైటీస్ సీతో 2012లో షర్బత్ భర్త మరణించడం, ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ అధికారం చేపట్టడంతో ఆమె కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాలిబన్ల పాలనలో జీవించలేక, ముందుముందు జీవితం మరింత దారుణంగా మారుతుందని భావించి ఆశ్రయం ఇవ్వాలని ఇటలీ ప్రభుతాన్ని కోరింది. షర్బత్ పరిస్థితి అర్థం చేసుకున్న ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి షర్బత్‌కు ఆశ్రయం కల్పించారు. అప్పుడూ ఇప్పుడూ ఆఫ్ఘన్ అమ్మాయిలకు భద్రత లేదని, తాజాగా షర్బత్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చదవండి: Mother Shipton Cave Facts: భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
ఘనీ, భుట్టో, శినావత్రా... వీళ్లంతా యూఏఈకే ఎందుకు?!
న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకోగానే అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయారు. మానవతా దృక్పథంతో తాము ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్లు యూఏఈ ప్రకటించింది కూడా. నిజానికి ఆ దేశం కేవలం ఘనీ ఒక్కరికే కాదు.. ఆయనలా శరణార్థులుగా వచ్చిన ఎంతో మంది దేశాధినేతలకు, ప్రముఖులకు ఆశ్రయం ఇచ్చింది. ఎందుకు వీళ్లంతా యూఏఈనే తమకు సురక్షిత స్థావరమని భావించారు? ఆ దేశం సైతం వారి రాకను స్వాగతించడం వెనుక కారణాలేంటి?! ఎందుకు యూఏఈకే? గల్ఫ్ దేశమైన యూఏఈకి అమెరికాతో సత్సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన విషయాల్లో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంది. అగ్రరాజ్యంతో మెరుగైన ద్వైపాక్షిక బంధాలు ఉండటం యూఏఈకి కలిసి వచ్చే అంశం. కాబట్టి, అక్కడికి వెళ్తే సురక్షితంగా ఉండవచ్చని అమెరికాతో వైరం లేని పెద్దలు భావించడం సహజం. అంతేకాదు, పెద్ద సంఖ్యలో చమురు నిల్వలు కలిగి ఉన్న ఈ గల్ఫ్ దేశంలో అండర్‌గ్రౌండ్ స్థావరాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎయిర్‌పోర్టుల్లో కూడా ఐరిస్ స్కానింగ్, భారీ సంఖ్యలో సెక్యూరిటీ కెమెరాలు, 24 గంటల పర్యవేక్షణ వంటి అంశాలు కూడా పారిపోయి వచ్చిన ఒకప్పటి దేశాధినేతలను ఆకర్షించే అంశాలు. ఇక యూఈఏలో విలాసాలకు కొదువ లేదు. అత్యాధునిక ఫైవ్‌స్టార్ హోటళ్లు, సకల సౌకర్యాలతో కూడిన భవనాలు, ఇతర వినోదాలు పంచే ప్రదేశాలు కోకొల్లలు. దేశం విడిచి వచ్చే సమయంలో తెచ్చుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. తద్వారా ఇటు ఆశ్రయం కల్పించిన యూఏఈకి, అటు శరణుజొచ్చి వచ్చిన వారికి.. ఉభయులకు లాభదాయకమే. యూఏఈకి కలిగే ప్రయోజనమేమిటి? అజ్ఞాతంలో ఉన్న నేతల దశ తిరిగి ఒకవేళ మళ్లీ అధికారం చేపట్టినట్లయితే.. రాజకీయంగా, దౌత్యపరంగా సత్పంబంధాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సంక్షోభ సమయంలో ప్రముఖులను ఆదుకోవడం, వారికి భద్రత కల్పించడం ద్వారా తాము నమ్మకమైన భాగస్వామినని నిరూపించుకుంటూ.. తదనంతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయాల గురించి క్రైసిస్ గ్రుపునకు చెందిన మిడ్ఈస్ట్ అడ్వైజర్ దీనా ఎస్ఫాన్‌డియరీ ఏపీతో మాట్లాడుతూ.. ‘‘సంక్షోభంలో ఉన్న వారిని ఆదుకునే క్రమంలో ఏ దేశమైనా సరే తనను తాను గొప్ప ఉదారవాదిగా చిత్రీకరించుకోవడం సహజం. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఎవరూ ఇందుకు అతీతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. మిత్రదేశమైన అమెరికా సైనిక విన్యాసాలకు, ప్రయాణాలకు అనువైన పరిస్థితులు కల్పించే యూఏఈ.. తాను రిలయబుల్ పార్ట్నర్ అని నిరూపించుకునే క్రమంలో కూడా ఘనీకి ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఘనీకి ముందు వీళ్లు సైతం.. గత కొన్నేళ్లుగా యూఏఈలో అజ్ఞాతవాసం చేస్తున్న మాజీ దేశాధినేతల జాబితాలో ఇప్పుడు అశ్రఫ్ ఘనీ కూడా చేరారు. ఆయన కంటే ముందు.. తోబుట్టువులైన థాయ్‌లాండ్ మాజీ ప్రధానులు థక్సిన్ శినావత్రా, యింగ్లక్ శినావత్రా యూఏఈలోనే ఆశ్రయం పొందుతున్నారు. పాకిస్తాన్ దివంగత ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కూడా ఒకప్పుడు దుబాయ్‌లో తలదాచుకున్న వారే. స్పానిష్ రాజు జువాన్ కార్లోస్(అవినీతి ఆరోపణలు), యెమెన్ నాయకుడి పెద్ద కుమారుడు అహ్మద్ అలీ అబ్దుల్లా సలేహ్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. కాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో థాయ్ మాజీ ప్రధాని థక్సిన్ శినావత్రా జైలు శిక్ష తప్పించుకునేందుకు యూఈఏ పారిపోగా.. ఆయన సోదరి యింగ్లక్ శినావత్రా సైనిక తిరుగబాటు నేపథ్యంలో 2018, జనవరిలో అక్కడికే వెళ్లారు. చదవండి: Kabul Airport: మరో 3 రోజులే.. రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్న తాలిబన్లు! -
‘వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు.. తాలిబన్లకు ఇదే నా విజ్ఞప్తి’
Afghanistan Crisis: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనను తాను అంగీకరిస్తున్నానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ సోదరుడు, గ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ కచిస్ చీఫ్ హష్మత్ ఘనీ అహ్మద్‌జై అన్నారు. దేశంలో రక్తపాతాన్ని నిర్మూలించాలంటే ఇదొక్కటే మార్గమని పేర్కొన్నారు. తాలిబన్లు త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన ఆయన.. అయితే తాను మాత్రం అందులో భాగస్వామిని కాలేనని స్పష్టం చేశారు. కాగా అఫ్గన్‌ను తలిబాన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో అశ్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన యూఏఈలో ఉంటున్నట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే, అశ్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ మాత్రం అఫ్గనిస్తాన్‌లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా టుడేతో మాట్లాడుతూ... అఫ్గన్‌లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రాజకీయాలను కొత్త పంథాలో నడిపించాలనే ఉద్దేశంతోనే తాను దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓవైపు.. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పంజ్‌షీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ నాయకుడు అహ్మద్ మసూద్, మరోవైపు.. తాలిబన్లతో ఏకకాలంలో చర్చలు జరుపుతున్నానని హష్మత్ పేర్కొన్నారు. ఎవరి షరతులు వారికున్నాయని, నాతో చర్చించేందుకు మాత్రం ఇరు వర్గాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అది మాత్రం ఆమోదయోగ్యం కాదు.. ‘‘హక్మత్యార్, కర్జాయిని ప్రభుత్వంలో చేర్చుకోవద్దని తాలిబన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వారిద్దరినీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాను. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశాన్ని నాశనం చేసింది వాళ్లే. అందుకే వారిని దూరం పెట్టండి’’ అని హష్మత్ ఈ సందర్భంగా మాజీ ప్రధాని గుల్బుద్ధీన్ హక్మత్యార్, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయిపై విమర్శలు గుప్పించారు. కాగా పాక్ సెలబ్రేషన్ మూడ్‌లో ఉందేమో గానీ.. అఫ్గన్‌లో ప్రస్తుత పరిస్థితులను చూసి పొరుగు దేశం పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటోందన్న హష్మత్ ఘనీ.. శరణార్థులు పోటెత్తితే వారికి బుద్ధి వస్తుందని విమర్శించారు. ‘‘దాదాపు 7 మిలియన్ల మంది డ్యూరాండ్ రేఖను దాటే అవకాశం ఉంది. వారిని అదుపుచేయడం పాకిస్తాన్‌కు అంత తేలికేమీ కాదు. కాబట్టి అఫ్గన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్లకు.. వాళ్లైనా కొన్ని సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. నా సోదరుడు అందుకే వెళ్లిపోయాడు ‘‘నా సోదరుడు అశ్రఫ్ ఘనీ డబ్బుతో పారిపోయాడన్నది పూర్తిగా కట్టుకథ. తను ప్రయాణించిన విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌లో సోదా చేశారు. అప్పుడు డబ్బు దొరకలేదు. నిజానికి, నా సోదరుడు దేశం విడిచి వెళ్లకపోయి ఉంటే తనను కచ్చితంగా హత్య చేసేవారు. ఇందుకు కుట్ర కూడా జరిగిందనే సమాచారం ఉంది. యూఏఈ తనకు ఆశ్రయం ఇచ్చింది. అయితే, రాజకీయాల గురించి మాట్లాడకూడదనే షరతు విధించింది. కాబట్టి తనేమీ మాట్లాడటం లేదు’’ అని హష్మత్ ఘనీ తన సోదరుడి నిర్ణయాన్ని సమర్థించారు. చదవండి: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి -
కట్టుబట్టలతో పారిపోయా! లేదంటే వాళ్లు ఉరి తీసేవారు!
కాబూల్: భారీ నగదుతో దేశం విడిచి పారిపోయాడన్న ఆరోపణలపై అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ(72) స్పందించారు. నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు వార్తలు అంటూ ఖండించారు. కాబూల్ నుండి పారిపోవాలనే తన నిర్ణయాన్ని ఘనీ మరోసారి సమర్ధించుకున్నారు. పారిపోయిరాలేదని 'భారీ విపత్తు'ను తప్పించేందుకే దేశాన్ని విడిచిపెట్టినట్టు ఘనీ తెలిపారు. రక్తపాతాన్ని నివారించేందుకు ఇదే ఏకైక మార్గమని భావించానని పేర్కొన్నారు. తాను అక్కడ ఉండి ఉంటే కొత్త అధ్యక్షుడి కళ్ల ముందే తనను ఉరితీసేవారని వాపోయారు. ప్రస్తుతం తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆశ్రయం పొందానని తెలిపారు. ఈ మేరకు ఘనీ తన ఫేస్బుక్ పేజీలో ఒక వీడియోను విడుదల చేశారు. దుబాయ్‌లో ప్రవాసంలో ఉండాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు. అలాగే దేశంనుంచి 169 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1257 కోట్లు) దొంగిలించాడన్న తజికిస్థాన్ అఫ్గన్ రాయబారి ఆరోపణలను కొట్టి పారేశారు.(Afghanistan:అశ్రఫ్ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది) అంతేకాదు కట్టుబట్టలు, చెప్పులతో తాను అఫ్గన్ విడిచి వెళ్ళవలసి వచ్చిందని ఫేస్బుక్ వీడియోలో చెప్పుకొచ్చారు. కనీసం బూట్లు వేసుకునే అవకాశం కూడా తనకు లేకుండా పోయిందని, ఉత్త చెప్పులు, ఖాళీ చేతులతో యూఏకి చేరుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఫ్గన్ భద్రతాదళాలకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి ప్రక్రియలో వైఫల్యమే తాలిబన్ ఆక్రమణకు దారితీసిందని విమర్శించారు. తాలిబన్ సీనియర్ నేత, ఘనీ పూర్వీకుడు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా మధ్య చర్చలకు మద్దతు ప్రకటించారు. ఈ ప్రక్రియ విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. దేశానికి తిరిగి రావడానికి చర్చలు జరుపుతున్నామని కూడా ఘనీ చెప్పారు. (Afghanistan: ఆమె భయపడినంతా అయింది!) కాగా అఫ్గన్ 14వ అధ్యక్షుడైన అశ్రఫ్ ఘనీ మొదట సెప్టెంబర్ 20, 2014న ఎన్నికయ్యారు, ఆ తరువాత సెప్టెంబర్ 28, 2019 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. తాలిబన్ అక్రమణల నేపథ్యంలో ఘనీ దేశం వదిలి వెళ్లారు. మరోవైపు మానవతా దృష్టితో ఘనీ, ఆయన కుటుంబాన్ని దేశంలోకి ఆహ్వానించామని యూఏఈ విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) -
Afghanistan Crisis: అశ్రఫ్ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది
సాక్షి, న్యూఢిల్లీ: తాలిబన్ల అక్రమణతో అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ, అతని కుటుంబం ఎక్కడ తల దాచుకున్నారో తెలిసిపోయింది. వారందరికీ తామే ఆశ్రయమిచ్చినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఐఈ) వెల్లడించింది. మానవతా ప్రాతిపదికన ఘనీ కుటుంబానికి ఆశ్రయమిచ్చినట్టు యుఏఈ విదేశాంగ శాఖ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అఫ్గన్‌ను హస్తగతం చేసుకునే క్రమంలో తాలిబన్లు కాబూల్‌కు చేరుకుంటున్న సమయంలోనే ఆదివారం అఫ్గన్ అధ్యక్షుడు అశ్రఫ్‌ఘనీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. తాలిబన్లు గెలిచారు. రక్తపాతాన్ని నివారించేందుకు తాను దేశం విడిచిపోతున్నట్టు ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. అయితే ఘనీ, భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారుతో కలిసి తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, లేదా ఓమన్కు పారిపోయాడంటూ మొదట్లో పలు ఊహాగానాలొచ్చాయి. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) కాగా మాజీ దేశాధినేతలు, వారి బంధువులకు గల్ఫ్ దేశం ఆశ్రయం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2017లో, దుబాయ్ ఎమిరేట్‌లో థాయ్ మాజీ ప్రధాని యింగ్లక్ షినవత్రాకు ఆతిథ్యమిచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ గత సంవత్సరం ఆగస్టులోయూఏకీ చెక్కేశాడు. అలాగే స్వదేశంలో హత్య కావడానికి ముందు ఎనిమిది సంవత్సరాలపాటు పాకిస్తాన్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత బెనజీర్ భుట్టో అక్కడే తలదాచుకున్నారు. 1996 నుండి 2001 వరకు పాలించిన మునుపటి తాలిబాన్ పాలనను గుర్తించిన మూడు దేశాల్లో సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో సహా యూఏఈ కూడా ఒకటి కావడం విశేషం. -
అఫ్గాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిని నేనే.. తనను తానే ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు
కాబుల్: అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేసాక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఉపాధ్యక్షడు అమ్రుల్లా సలేహ్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిన సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను దేశంలోనే ఉన్నానని, త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు వారందరిని కలుస్తానని ట్విటర్లో పేర్కొన్నారు. Clarity: As per d constitution of Afg, in absence, escape, resignation or death of the President the FVP becomes the caretaker President. I am currently inside my country & am the legitimate care taker President. Am reaching out to all leaders to secure their support & consensus. — Amrullah Saleh (@AmrullahSaleh2) August 17, 2021 చదవండి: అల్లకల్లోల అఫ్గాన్: సరిహద్దుల్లో 295 కి.మీ గోడ నిర్మిస్తున్న టర్కీ -
రక్తపాతం నివారించేందుకే వెళ్లిపోయా: ఘనీ
భారీ రక్తపాతంతో అఫ్గాన్ గడ్డ తడవకుండా ఉండేందుకే తాను దేశం విడిచి వెళ్లానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తెలిపారు. దేశం వదిలిపోయిన తర్వాత తొలిసారి ఘనీ తన అభిప్రాయాలను వెల్లడించారు. అధ్యక్ష భవనంలోకి వస్తున్న సాయుధ తాలిబన్లకు అడ్డుగా నిలబడడం, 20 ఏళ్లుగా రక్షించుకుంటున్న దేశాన్ని కాపాడేందుందుకు శాంతియుతంగా వెళ్లిపోవడం అనే రెండు మార్గాలు తనకు ఎదురయ్యాయని చెప్పారు. తాలిబన్లు ఆయుధాలతో విజయం సాధించారని, దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని, సంపదను కాపాడాల్సిన బాధ్యత ఇక వారిదేనని చెప్పారు. ‘ భయాందోళనలతో ఉన్న ప్రజల హృదయాలను వారు చట్టబద్ధంగా గెలవాల్సిఉంది. ప్రజలకు భరోసా ఇవ్వడంకోసం వాళ్లు ఒక ప్రణాళికను రూపొందించాలి’ అని ఘనీ పేర్కొన్నారు. -
‘హెలికాప్టర్ నిండా డబ్బుతో ఘనీ పారిపోయాడు’
మాస్కో: తాలిబన్ల అక్రమణతో అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ఘనీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ భారీగా నగదు నిండిన నాలుగు కార్లతో పలాయనం చిత్తగించాడని పేర్కొంది. అంతేకాదు హెలికాప్టర్ పట్టకపోవడంతో కొంత నగదును విడిచిపోవాల్సి వచ్చిందంటూ కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఘనీ నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా నగదుతో దేశం విడిచి పారిపోయాడని రష్యా వ్యాఖ్యానించింది. రక్తపాతాన్నినివారించాలని భావించినట్టు అతను పేర్కొన్నాడని తెలిపింది. రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తన వ్యాఖ్యలను రాయిటర్స్‌తో ధృవీకరించారు. నాలుగుకార్లు డబ్బుతో నిండి ఉన్నాయి, డబ్బులో కొంత భాగాన్ని హెలికాప్టర్లో నింపడానికి ప్రయత్నించారు, కానీ సరిపోక పోవడంతో వదిలేశారన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కాబూల్‌లో దౌత్యపరమైన ఉనికిని నిలుపుకుంటామనీ, తాలిబన్లతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తున్నామని రష్యా ప్రకటించింది. వారిని దేశపాలకులుగా గుర్తించడం తొందరపాటు కాకపోయి నప్పటికీ, తాలిబన్ల ధోరణిని నిశితంగా గమనిస్తుందని ప్రకటించడం విశేషం. తాలిబన్లతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటామని చైనా ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. కాగా అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ తొలుత తజకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే ఘనీ, ఆయన భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు పారిపోయారని అల్ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఘనీ ఎక్కడ తలదాచుకున్నదీ స్పష్టత లేదు. -
Afghanistan: అఫ్గాన్‌లో తాలిబన్ రాజ్యం
కాబూల్: అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తాలిబన్లకు అందివచ్చిన అవకాశం మారింది. దేశాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. అఫ్గాన్ సర్కారు నుంచి తాలిబన్లకు అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రకటించారు. అమ్మో... తాలిబన్ పాలన కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. అఫ్గాన్ భద్రతా దళాలను బలోపేతం చేసేందుకు అమెరికా, నాటో ఇప్పటిదాకా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ అదంతా వృథా ప్రయాసగా మారింది. అఫ్గాన్ సైన్యం తాలిబన్లకు కనీసం ఎదురు నిలువలేకపోయింది. రాజధాని కాబూల్ తాలిబన్ల పరం కావడానికి కనీసం నెల రోజులైనా పడుతుందంటూ అమెరికా సైన్యం వేసిన అంచనాలు తారుమారయ్యాయి. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ అఫ్గాన్లు, విదేశీయులు అఫ్గానిస్తాన్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు జనం ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. కొందరు పేదలు తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. తమ పౌరులను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ఆత్రుత పడుతున్నాయి. ఆదివారం కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని అమెరికా సైన్యం హెలికాప్టర్లలో కాబూల్ ఎయిర్‌పోర్టులోని ఔట్‌పోస్టుకు తరలించింది. కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ తాలిబన్లతో చర్చలు జరపడానికి, దేశంలో అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ కౌన్సిల్లో గుల్బుదీన్ హెక్మాత్యార్, అబ్దుల్లా అబ్దుల్లాతోపాటు తాను కూడా సభ్యులుగా ఉంటామని తెలిపారు. కాబూల్ వీధుల్లో అలజడి, అశాంతిని నియంత్రించాలని తాలిబన్లకు, అఫ్గాన్ సైనికులకు హామీద్ కర్జాయ్ సూచించారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించేందుకు, అధికార బదిలీ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అందరూ చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు తాలిబన్ల ముందు తాను ఎప్పటికీ తల వంచబోనని అఫ్గాన్ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తేల్చిచెప్పారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అఫ్గానిస్తాన్ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు! కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోందని, అందువల్ల అమెరికన్లు ఎక్కడివారక్కడే సురక్షితంగా తలదాచుకోవాలని సూచించింది. ‘కాబూల్‌లో పరిస్థితి క్షీణిస్తోంది. విమానాశ్రయంలో భద్రత ప్రమాదంలో పడింది. వేగంగా పరిస్థితి దిగజారుతోంది. విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడివారక్కడ సురక్షితంగా ఉండండి. రాయబార కార్యాలయంలో అధికారిక విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఈ సమయంలో ఎవరూ ఎంబసీకి, విమానాశ్రయానికి రావొద్దు’ అని కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. జెండాను కూడా తీసుకెళ్లిన అమెరికా అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్ విల్సన్ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోయారు. కాగా రాయబార కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను అమెరికా సిబ్బంది దగ్ధం చేశారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు విషమిస్తుండడంతో అమెరికా ప్రభుత్వం మరో 1,000 మంది సైనికులను ఆదివారం కాబూల్‌కు తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న తమ 4,000 మంది సైనికులకు సహకరించేందుకు వీరిని కువైట్ నుంచి తరలించినట్లు తెలిపింది. అధ్యక్ష భవనం స్వాధీనం అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రాజీనామా చేయడంతో అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌లో అల్లర్లు, లూటీలు జరగకుండా నివారించడానికే తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిదీన్ ప్రకటించారు. సైనిక దళాలు ఖాళీ చేసిన ఔట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం కాబూల్ శివార్లలో జరిగిన ఘర్షణల్లో 40 మంది గాయపడినట్లు తెలిసింది. -
దేశం విడిచి వెళ్లిపోయిన అశ్రఫ్ ఘనీ
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని, ఆయన ఎక్కడికి వెళ్లారన్న సంగతి తెలియదని స్థానిక మీడియా సంస్థ ‘టోలో’ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. భద్రత విషయంలో సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, తాలిబన్ బలగాలు కాబూల్‌లోకి పూర్తిగా ప్రవేశించేముందు చర్చలకు కొంత సమయం కేటాయించాలని హైకోర్టు కౌన్సిల్ ఫర్ నేషనల్ రికన్సిలియేషన్(హెచ్సీఎన్ఆర్) అధినేత అబ్దుల్లా పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని ఇతర దేశాల ప్రజలు తమ దేశానికి పయనమవుతున్నారు. ఆ దేశంలో నివాసం ఉంటున్న వారిని వెనక్కు తెచ్చేందుకు ఆయా దేశాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 129 మంది భారతీయులతో ఓ ఎయిరిండియా విమానం కాబూల్ నుంచి ఢిల్లీ బయల్దేరింది. -
తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘన్ ప్రభుత్వం? ఘనీ రాజీనామా!
కాబూల్ : ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయినట్లు.. దేశాధ్యక్షుడు ఆశ్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశ రాజధాని కాబూల్‌లోకి తాలిబన్ బలగాలు ప్రవేశించిన నేపథ్యంలో శాంతయుత చర్యల్లో భాగంగా ఘనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సాధారణ ప్రజలకు హాని తలపెట్టమని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్లు దురాక్రమణకు పాల్పడుతున్నారు. దేశంలో తాలిబన్ బలగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాత్రి జలాలాబాద్ నగరాన్ని ఆక్రమించాయి. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. తాలిబన్ల దురాక్రమణపై ఐరాస సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని చెప్పారు. తాలిబన్లు దేశాన్ని స్వాధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘన్ నుంచి అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తోంది. కార్యాలయ సిబ్బందితో పాటే ఆఫ్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడు ఆశ్రఫ్ ఘనీ కూడా అమెరికా వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని స్వదేశానికి తిరిగి రావాలని ఇప్పటికే విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. -
కాబూల్ శివార్లలో తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశమయ్యే సమయం దగ్గర పడుతోంది. కాబూల్ శివార్ల దాకా తాలిబన్లు చొచ్చుకొని వచ్చి సరిగ్గా 11 కి.మీ. దూరంలో తిష్టవేసుకొని కూర్చున్నారు. దేశ రాజధాని కాబూల్‌ని ముట్టడించే పని ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అఫ్గాన్ మొత్తం తాలిబన్ల వశమైతే మరోసారి దేశం అంతర్యుద్ధంతో తల్లడిల్లిపోతుందనే ఆందోళనలు చెలరేగుతున్నాయి. కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది చెప్పారు. అఫ్గాన్ నుంచి అమెరికా ఈ నెల 31న చివరి విడత బలగాలను ఉపసంహరించాల్సి ఉండగా, దానికి రెండు వారాల ముందే తాలిబన్లు కాబూల్‌లో తమ జెండాని ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. శనివారం ఒక్కరోజే మరో ఐదు ప్రావిన్స్‌లను ఆక్రమించుకున్నారు. లోగర్ ప్రావిన్స్ స్వాధీనం చేసుకునే సమయంలో తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. అయినప్పటికీ తాలిబన్ల ధాటికి అఫ్గాన్ దళాలు నిలవలేకపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న పక్తికా ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నట్టు ఆ ప్రావిన్స్ ప్రజాప్రతినిధి ఖలీద్ అసాద్ వెల్లడించారు. ఆ ప్రావిన్స్‌లోని ప్రధాన నగరమైన సహరానా తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుంది. దేశంలోని దాదాపుగా ముప్పావు వంతు ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కీలక నగరాలైన హెరాత్, కాందహార్లు (దేశంలోని రెండో, మూడో అతిపెద్ద నగరాలు) ఇప్పటికే తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలను కొల్లగొట్టేసి తమ సంస్థకు చెందిన తెల్ల జెండాను ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురవేస్తున్నారు. ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతున్న తాలిబన్లు మజార్ ఏ షరీఫ్(బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని)ను ఆక్రమించుకోవడానికి ముప్పేట దాడి చేశారు. భీకరపోరు తర్వాత శనివారం రాత్రి మజార్ ఏ షరీఫ్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నారు. ఫర్యాబ్, కునార్ ప్రావిన్స్‌లు కూడా తాలిబన్ల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చేశాయి. ఉలిక్కిపడిన అమెరికా, కాబూల్‌కు 3 వేల బలగాలు తాలిబన్లు చెలరేగిపోతూ వాయువేగంతో ఒక్కో ప్రాంతాన్ని చుట్టేస్తూ ఉండడంతో అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి 3 వేల మంది భద్రతా బలగాలను పంపింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యం కావడంతో ఆగస్టు 31 నాటికి పూర్తిగా బలగాలను వెనక్కి తీసుకురావాలన్న తమ లక్ష్యాలను ప్రభుత్వం అందుకోగలదా లేదా అన్న సందేహాలైతే ఉన్నాయి. మూడువేల బలగాల్లో కొంతమంది శుక్రవారం కాబూల్‌కు చేరుకోగా... మిగతా వారు ఆదివారం నాటికి రానున్నారు. ఈ బలగాలు కాబూల్ చేరుకొని దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకువస్తాయి. తాలిబన్లు కాబూల్ చేరే లోపు అమెరికా చేసే ఈ ఆపరేషన్ ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం అమెరికాకి చెందిన సైనికులు వెయ్యి మంది మాత్రమే ఉండడంతో తమ సిబ్బందిని తరలించడం కష్టమవుతుందనే అంచనాతోఅప్పటికప్పుడు 3 వేల మంది సైనికుల్ని పంపింది. క్షణక్షణం బతుకు భయం అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగుస్తూ ఉండడంతో ప్రజల్లో రోజు రోజుకీ ఆందోళన తీవ్రతరమవుతోంది. ఇక ముందు తమ బతుకులు ఎలా ఉంటాయోనని తలచుకుంటే వారికి వెన్నులో వణుకు పుడుతోంది. మజర్–ఏ–షరీఫ్ చుట్టూ తాలిబన్లు మోహరించి ఉండడంతో క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని నగరవాసి మొహిబుల్లా ఖాన్ చెప్పారు. సుస్థిరతకే కృషి: అధ్యక్షుడు ఘనీ అఫ్గాన్‌లో సుస్థిరత ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, దేశంలో చెలరేగే హింసాత్మక పరిస్థితుల్ని అడ్డుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సాయుధ బలగాలను తిరిగి సమాయత్తపరచడానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ కాబూల్ శివార్లకి చేరుకున్న నేపథ్యంలో ఘనీ రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోతారని విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి. అంతర్జాతీయ మీడియా ఇక ఘనీ పని అయిపోయినట్టుగా కథనాలు రాసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం నాడు టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. గత 20 ఏళ్లుగా సాధించిన లక్ష్యాలను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని అన్నారు. అఫ్గాన్లపై యుద్ధాన్ని ప్రకటించి, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే తన రాజీనామా విషయంపై వస్తున్న వార్తల గురించి ఆయన ప్రస్తావించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి, యుద్ధ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించడానికి అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దేశంలో శాంతి, సుస్థిరత ఏర్పాటు చేయడానికి రాజకీయ పక్ష నాయకులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పారు. శాంతి, సుస్థిర స్థాపనకు పరిష్కార మార్గాన్ని కనుగొంటామని ఘనీ స్పష్టం చేశారు. ► 22: అఫ్గాన్‌లో మొత్తం 34 ప్రావిన్స్‌లలో 22 ఇప్పటికే తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోయాయి ► 5: శనివారం తాలిబన్ల వశమైన ప్రావిన్స్‌లు ► 3000: కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బంది, పౌరులను తరలించేందుకు అమెరికా అత్యవసరంగా 3వేల మంది సైనికులను పంపుతోంది -
అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి
కాబూల్: అఫ్గాన్ భూభాగాలను తాలిబన్ సేనలు మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ప్రావిన్స్‌లపై పట్టుకోసం అఫ్గాన్ సైన్యం, తాలిబన్ మూకల మధ్య పోరుతో దేశంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. తాజాగా మరో మూడు ప్రావిన్స్‌ల రాజధానులను తాలిబన్ దళాలు ఆక్రమించాయి. తాజాగా బదఖ్షాన్ రాజధాని ఫైజాబాద్, బాగ్లాన్ రాజధాని పోలి–ఖుమ్రీ, ఫరాహ్ ప్రావిన్స్ రాజధాని తాలిబన్ వశమయ్యాయి. దీంతో అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి వచ్చింది. కుందుజ్ ఎయిర్‌పోర్ట్‌లోని సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. దీంతో తాలిబన్లపై ప్రతిదాడులు చేసి వారు తోకముడిచేలా చేసేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రంగంలోకి దిగారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లోని స్థానికసైన్యాల నేతలైన అబ్దుల్ రషీద్ దోస్తుమ్ తదితరులను సాయం కోరేందుకు అక్కడికి చేరుకున్నారు. వారం వ్యవధిలోనే ఆరు ప్రావిన్స్‌ల రాజధానులు తాలిబన్ చేతచిక్కాయి. మరోవైపు, కీలక దేశ ‘కస్టమ్స్ ఆదాయ మార్గాలను’ తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్థికమంత్రి ఖలీద్ పయేందా పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయారని ఆర్థికశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ రఫీ తబే చెప్పారు. ఉపసంహరణ ఆగదు: బైడెన్ అఫ్గాన్ సైన్యానికి తోడుగా ఉండేందుకు ఆ దేశంలోనే అమెరికా సేనలు ఉండబోతున్నాయని, సేనల ఉపసంహరణకు బ్రేక్ పడుతుందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. ‘మా బలగాలు అమెరికాకు రావడం ఖాయం. ఇప్పటికే అఫ్గాన్‌లో 20ఏళ్లకాలంలో దాదాపు రూ.74లక్షల కోట్లు ఖర్చుపెట్టాం. 3లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అఫ్గాన్ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందే’అని బైడెన్ వ్యాఖ్యానించారు. కాగా, దేశ సైన్యంలో మరింతగా పోరాటస్ఫూర్తిని పెంచేందుకు ఆర్మీ చీఫ్ స్టాఫ్‌గా జనరల్ హిబాతుల్లా అలీజాయ్ను రక్షణశాఖ నియమించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. Heart breaking scenes from #Kunduz province #Afghanistan 😰 pic.twitter.com/QjRzNa6XwQ — Khalid Amiri - خالد امیري (@KhalidAmiri01) August 8, 2021 -
ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి
కాబూల్: బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని దేశ అధ్యక్షుడు ప్రసంగం చేసే సమయానికి ముందే అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ ఘటన పండుగ వేళ కలకలం రేపింది. ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనం లక్ష్యంగా మంగళవారం రాకెట్ల దాడి జరిగింది. దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న అధ్యక్ష భవనం సమీపంలోకి మూడు రాకెట్లు వచ్చిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ చర్యను ఆఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బక్రీద్ సందర్భంగా అధ్యక్ష భవనంలో ఉదయం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు అశ్రఫ్ గని ప్రసంగం మొదలుపెట్టాలి. ప్రార్థనలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్ష భవనానికి సమీపంలో రాకెట్ల దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. అయితే రాకెట్లు భవనం సమీపంలో పడినా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆఫ్ఘాన్ మంత్రి మిర్వాస్ స్టాన్క్జాయ్ ప్రకటించారు. ఈ దాడి ఎవరు జరిపారో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్ల దాడులు తీవ్రంగా ఉన్నాయి. పండుగ వేళ కలకలం రేపేలా వారి చర్యలు ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికా, నాటో దళాలు పూర్తిగా విరమించుకున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఏకంగా అధ్యక్ష భవనం లక్ష్యంగా దాడి చేయడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ దాడిని అధ్యక్షుడు అశ్రఫ్ గని తీవ్రంగా ఖండించారు. తాలిబన్ల తీరుపై అశ్రఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అఫ్గాన్ అధ్యక్షుడితో జై శంకర్ భేటీ
న్యూఢిల్లీ: విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ గురువారం అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో తాష్కెంట్లో భేటీ అయ్యారు. దేశం నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ అనంతరం వేగంగా మారుతున్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. అఫ్గానిస్తాన్ అభివృద్ధి, శాంతి, సుస్థిరతకు భారత్ తోడ్పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా జై శంకర్ భరోసా ఇచ్చారు. తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో రెండు రోజులపాటు జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన కనెక్టివిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అష్రాఫ్ ఘనీతో సమావేశమయ్యారు. ఎస్సీవో సమావేశాల్లో రష్యా, చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేవాల విదేశాంగ మంత్రులు పాలుపంచుకున్నారు. Pleased to call on President @ashrafghani. Discussed the current situation in and around Afghanistan. Reiterated our support for peace, stability and development of Afghanistan. pic.twitter.com/heTlL9KwaQ — Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2021 -
అఫ్గానిస్తాన్‌కు అండగా ఉంటాం: జోబైడెన్
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ నుంచి తమ సేనలు వైదొలిగినా, తమ ప్రభుత్వం మాత్రం అఫ్గాన్ ప్రజలకు అండగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనికి హామీ ఇచ్చారు. అఫ్గాన్ ప్రజలు ఇకపై తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోనున్నారన్నారు. అఫ్గానిస్తాన్‌తో తమ బంధం స్ధిరంగా కొనసాగుతుందని వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఆయన చెప్పారు. తమ సైన్యం వైదొలిగిందంటే, ఇకపై అఫ్గాన్‌కు మిలటరీ, రాజకీయ, ఆర్థిక సాయం కొనసాగించమని చెప్పినట్లుకాదన్నారు. రెండు దశాబ్దాలుగా తమను కాపాడేందుకు అమెరికా సైన్యం రక్తం చిందించడంతోపాటు, ఎంతో ఆర్థిక సాయం అందించిందని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు ఘని కొనియాడారు. బైడెన్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి వీరిరువురు భేటీ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11నాటికి అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం పూర్తవుతుందని బైడెన్ చెప్పారు. ఇటీవల కాలంలో అఫ్ఘన్లోని పలు జిల్లాలను తాలిబన్లు ఆధీనం చేసుకుంటున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అఫ్ఘనిస్తాన్‌లో అందరి మధ్య ఐక్యత తేవడం కోసం తమ అధికారులు పాటుపడుతున్నారని బైడెన్ చెప్పారు. 2002 నుంచి అఫ్గాన్‌కు అమెరికా నుంచి దాదాపు 12,900 కోట్ల డాలర్ల సాయం అందింది. -
ఘోరం.. జంట పేలుళ్లలో 17 మంది మృతి
కాబుల్: అత్యంత సురక్షితమైన ప్రావిన్సులలో ఒకటైన బామియాన్ నగరంలో నిన్న (మంగళవారం) జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బామియన్‌లోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు సంభవించాయని స్థానిక వార్త సంస్థ టోలో న్యూస్ తెలిపింది. అయితే ఈ పేలుళ్లకు పాల్పడిందెవరో ఇప్పటికి వరకు ప్రకటించలేదు. బామియాన్‌కు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడ పేలుళ్లు జరగటం ఇదే తొలిసారి. జంట పేలుళ్లలో 17మంది మృతి చెందగా, 50మంది గాయపడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వెల్లడించారు. ఇటీవల జరిగిన దాడుల్లో 50మంది మృతి చెందిన విషయం విదితమే. -
అప్ఘన్లో ఆస్ట్రేలియా సైనికుల విధ్వంస క్రీడ!
కాన్బెర్రా: అఫ్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికులు జరిపిన దుశ్చర్యలు ఆలస్యంగా వెలుగులోనికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రత్యేక దళాలు 39 మంది నిరాయుధ పౌరులను, ఖైదీలను చట్టవిరుద్ధంగా చంపినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఆస్ట్రేలియా జనరల్ గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రత్యేక యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్‌తో ప్రస్తావించారు. 2005 నుంచి 2016 మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో సైనికుల దుష్ప్రవర్తనపై సంవత్సరాల తరబడి జరిపిన దర్యాప్తులో భయంకరమైన నిజాలను తెలుసుకున్నామని డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగస్ కాంప్‌బెల్ తెలిపారు. ఒక దశాబ్దం పాటు సైనికుల్లోని ఉన్నత దళాలు శిక్ష మినహాయింపుకోసం "విధ్వంసకర"మైన సంస్కృతిని అవలంభించాయని, తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో హత్యలు జరిగాయని పేర్కొన్నారు. బయటకు వచ్చిన నిజాలు.. ‘నిఘా సిబ్బందిలో కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. నియమాలను కాలరాశారు, కల్పిత కథలను సృష్టించారు. అబద్ధాలు చెప్పారు. పలు ఖైదీలను చంపేశారు’ అని కాంప్‌బెల్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. కాగా 'బ్లడింగ్' (వేట) అని పిలువబడే వికృత క్రీడలో కొంత మంది నిఘా సిబ్బంది మొదటిసారిగా కాల్చే అవకాశం కోసం ఖైదీలను బలవంతంగా కాల్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలు జరగడానికి జూనియర్ సైనికులే కారణమని ఆరోపించారు. మిలిటరీ ఇన్స్పెక్టర్ జనరల్ గురువారం 465 పేజీల అధికారిక నివేదికలో డజన్ల కొద్దీ హత్యలు జరిగాయని తెలిపింది. ఈ నివేదికలో బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సిఫార్సుచేసింది. 39 మందిని చట్టవిరుద్ధంగా హత్య చేయడంతో రెజిమెంట్, సాయుధ దళాలు, ఆస్ట్రేలియాకు మాయని మచ్చ తెచ్చారని కాంప్‌బెల్ అన్నారు. యుద్ధ నేరాలకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు అధికారికి ఈ వివరాలను పంపుతామన్నారు. సేవా పతకాలు తిరిగి వెనకీ.. కాంప్‌బెల్ 2007- 2013 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసిన సైనిక దళాలకు ఇచ్చిన కొన్ని విశిష్ట సేవా పతకాలను ఉపసంహరించుకుంటామన్నారు. సెప్టెంబర్ 11, 2001 దాడుల తరువాత, తాలిబన్, అల్-ఖైదా, ఇతర ఇస్లామిస్ట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యుఎస్, మిత్రరాజ్యాల దళాలతో కలిసి పోరాడటానికి 26,000 మందికి పైగా ఆస్ట్రేలియా సైనికులను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపారు. ఆస్ట్రేలియన్ సైనిక దళాలు అధికారికంగా 2013లో దేశంను విడిచి వెళ్లినా, ఉన్నత బలగాలు తరచూ క్రూరమైన పనులు చేసే వారని తెలిసింది. సైనికులు జరిపిన దాడిలో ఆరేళ్ల చిన్నారిని చంపినట్లు నివేదికలు వచ్చాయి. అంతేకాకుండా హెలికాప్టర్లో స్థలం లేకపోవడంతో ఖైదీని కాల్చి చంపేశారు.(చదవండి: లాక్డౌన్ నియమాలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నివేదిక తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. మోరిసన్ ప్రభుత్వం బుధవారం ఈ చర్యలను చాలా తీవ్రంగా పరిగణించిందని ఆఫ్ఘాన్ రాయబారికి తెలిపింది. ఇక సైనిక చర్యలపై ప్రధాని మోరిసన్ తన ప్రగాడ సానుభూతిని తన ట్వీట్లతో వ్యక్తం చేశారు. గత వారం, మోరిసన్ యుద్ధ నేరాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక పరిశోధకుడిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. మీడియాపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో తప్పు చేసినట్లు తెలిపిన సంస్థ నివేదికలను అణిచివేసేందుకు ప్రయత్నించింది, పోలీసులు నివేదికలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం మొదట ప్రజల దృష్టికి ‘ఆఫ్ఘన్ ఫైల్స్’ పేరుతో 2017లో ఆస్ట్రేలియా జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆస్ట్రేలియా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో నిరాయుధ పౌరులను, పిల్లలను చంపారని ఆరోపించారు. ప్రతిస్పందనగా, ఆస్ట్రేలియా పోలీసులు ఇద్దరు రిపోర్టర్లపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును విరమించుకునే ముందు, గత సంవత్సరం సిడ్నీలో ఏబీసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. -
అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ కీలక నిర్ణయం!
కాబూల్: జైలు నుంచి తాలిబన్లను విడుదల చేసేందుకు అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దశలవారీగా వారిని విడుదల చేయాలంటూ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి సిదిఖ్ సిద్ధిఖీ ధ్రువీకరించారు. దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్న తాలిబన్లను విడుదల చేయాలని షరతు విధించింది. తొలుత ఇందుకు అంగీకరించని అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ... మార్చి 10 నుంచి నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై సంప్రదింపులున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.(అమెరికా– తాలిబన్ మధ్య చారిత్రక ఒప్పందం) ఈ విషయం గురించి అష్రాఫ్ ఘనీ అధికార ప్రతినిధి సిదిఖ్ సిద్దిఖీ మాట్లాడుతూ.. శనివారం నుంచి తాలిబన్లను విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొదటి రోజు వంద మంది చొప్పున.. 1500 మందిని రిలీజ్ చేస్తామన్నారు. ఇక ఆఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన తర్వాత... రెండు వారాలకు మిగిలిన 3500 మందిని 500 మంది చొప్పును విడుదల చేస్తామని వెల్లడించారు. హింసకు పాల్పడబోమంటూ తాలిబన్లు హామీ ఇచ్చిన మేరకే ఈ నిర్ణయం సాఫీగా అమలువుతుందనే షరతుతో ముందుకు సాగుతామన్నారు. తాలిబన్ల విడుదలకు సంబంధించిన డిక్రీపై అధ్యక్షుడు ఘనీ సంతకం చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలోనే తాలిబన్ల విషయంలో ఘనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక సోమవారం ఘనీ, ఆయన మాజీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అబ్దుల్లాలు తామే ఆఫ్గనిస్తాన్ అధ్యక్షులం అంటూ పోటాపోటీగా ప్రమాణ స్వీకారోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఘనీ పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నపుడు అక్కడ రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులకు చెక్‌పెట్టేందుకు ఘనీ వేగంగా పావులు కదుపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో కుదుర్చుకున్న చారిత్రక శాంతి ఒప్పందానికి భారత్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. President Ghani has signed the decree that would facilitate the release of the Taliban prisoners in accordance with an accepted framework for the start of negotiation between the Taliban and the afghan government. Details of the decree will be shared tomorrow. — Sediq Sediqqi (@SediqSediqqi) March 10, 2020 -
అధ్యక్షులుగా పోటాపోటీ ప్రమాణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం పెరుగుతోంది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, అతడి మాజీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య రాజకీయ పోరు ఎక్కువైంది. సోమవారం ఘనీ, అబ్దుల్లాలు తామే అధ్యక్షులం అంటూ ప్రమాణ స్వీకారోత్సవాలు జరుపుకున్నారు. దశాబ్దకాలం యుద్ధానికి ఫుల్స్టాప్ పెడుతూ అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి. అయితే ఘనీ, అబ్దుల్లా వర్గాలు రెండు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపణలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఫలితాల వెల్లడిలో ఆలస్యమైంది. చివరకు గత నెలలో ఘనీ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సంప్రదాయ దుస్తులతో అధ్యక్ష భవనానికి విచ్చేసిన అష్రాఫ్ మద్దతుదారులు, ఉన్నతాధికారులు దౌత్యవేత్తలు, అమెరికా ప్రత్యేక ప్రతినిధి జలమే ఖాలిజాద్ల సమక్షంలో ప్రమాణం చేశారు. దాదాపుగా అదే సమయానికి అధ్యక్ష భవనం మరో మూల సూటు బూటులతో విచ్చేసిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సరిహద్దులను కాపాడతానని ప్రమాణం చేశారు. అయిత అష్రాఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో వందలాదిమంది ప్రజలు చూస్తూండగా రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. అయినప్పటికీ ఆ ప్రాంగణాన్ని వదిలి వెళ్లేందుకు అష్రాఫ్ ఘని నిరాకరించడం ‘ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడేది లేదు’ అని వ్యాఖ్యానించడంతో కొంత సమయం తరువాత అక్కడ మళ్లీ ప్రజలు, మద్దతుదారులు గుమికూడారు. అష్రాఫ్‌ను చప్పట్లతో స్వాగతించారు. అయితే ఇలా ఇరు రాజకీయ పక్షాలు పోటాపోటీ ప్రమాణాలు చేయడంపై అఫ్గానిస్తాన్ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ఇరు నేతలు చర్చలు జరిపితే మేలని ప్రజలు సూచిస్తున్నారు. -
అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం: భారీ పేలుళ్లు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబుల మోత తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రమాణస్వీకారం వేళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. అష్రఫ్ ఘని వేదికపై ప్రసంగిస్తున్న ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. బాంబు పేలుళ్ల శబ్ధాలు విని షాక్ తిన్న ఆయన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు సైతం అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఆయన ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించకుండానే ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. బాంబు పేలుళ్ల సంభవించడంతో ఘనీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తల తెగిపడుతున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. బాంబు దాడికి పాల్పడ్డది ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా, గత నెలలో అధ్యక్ష ఫలితాలు ప్రకటించగా.. అష్రఫ్ ఘని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఘని ప్రమాణ స్వీకారం చేయడం ఇది వరసగా రెండోసారి. -
తాలిబన్లను విడుదల చేయం
కాబుల్: అమెరికా–తాలిబన్ల శాంతి ఒప్పందం అమలుకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. జైళ్లలో ఉన్న తాలిబన్లను తక్షణమే విడుదల చేయడం కుదిరే పని కాదని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తేల్చి చెప్పారు. మార్చి 10 నుంచి నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై సంప్రదింపులున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని ఘనీ స్పష్టం చేశారు. రెండు దశాబ్దాల యుద్ధానికి స్వస్తి పలుకుతూ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. అయితే ఈలోగా తాలిబన్లు ఎలాంటి దాడులకు పాల్పడకూడదని షరతు విధించింది. అలాంటప్పుడు అఫ్గాన్ అధికార యంత్రాంగంతో చర్చలు జరగకుండా తాము తాలిబన్లను జైళ్ల నుంచి ఎందుకు విడుదల చేయాలని అధ్యక్షుడు ఘనీ ప్రశ్నించారు. జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేసే నిర్ణయం పూర్తిగా తమ ప్రభుత్వం ఇష్టమేనని, తదుపరి చర్చలు మొదలవకుండా ఖైదీలను విడుదల చేసే ఉద్దేశం లేదని చెప్పారు. మరోవైపు అమెరికా శాంతి దూత జల్మే ఖలీల్‌జద్ తాలిబన్లను జైళ్ల నుంచి విడుదల చేస్తేనే వారిలో విశ్వాసం వస్తుందని అంటున్నారు. ఓస్లోలో చర్చలకు ముందే అఫ్గాన్ ప్రభుత్వం 5 వేల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేస్తుందని ఈ ఒప్పందం సందర్భంగా అమెరికా హామీ ఇచ్చింది. ఇప్పుడు అధ్యక్షుడు ఎదురు తిరగడంతో ఈ ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. అఫ్గాన్ మహిళల్లో భయం భయం అమెరికా–తాలిబన్ల ఒప్పందం అఫ్గాన్ మహిళల్లో భయాన్ని నింపుతోంది. తాలిబన్లు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు తెస్తారోనని ఆందోళన చెందుతున్నారు. 2001 తర్వాత అమెరికా అఫ్గాన్‌ని ఆక్రమించడానికి ముందు తాలిబన్లు అయిదేళ్ల పాటు చేసిన అరాచకాలు అక్కడ మహిళల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలంటే తమ జీవితాల్ని పణంగా పెట్టాలేమోనన్న అనుమానం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అఫ్గానిస్తాన్ పగ్గాలు మళ్లీ ఘనీకే !
కాబూల్: అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా అష్రాఫ్ ఘనీ మళ్లీ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదివారం ప్రాథమిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఘనీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. అష్రాఫ్ ఘనీకి 50.64 శాతం ఓట్లు వస్తే, ఆయన ప్రత్యర్థి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52 శాతం ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ ఎన్నికల కమిషన్ (ఈఏసీ) తుది ఫలితాల్ని మరికొద్ది వారాల్లో ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరైనా ఫలితాలపై తమకేమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేసే హక్కు ఉంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఫలితాల్ని సవాల్ చేస్తామని అబ్దుల్లా ప్రకటించారు. సెప్టెంబర్ 28న అఫ్గానిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 19న ఫలితాల్ని వెల్లడించాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపించడంతో ఫలితాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్నికల పరిశీలకులు, పోటీ చేసిన అభ్యర్థులు ఈఏసీ సక్రమ మైన పనితీరును కనబరచలేదని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 2001లో తాలిబన్ల పాలన అంతం తర్వాత జరిగిన ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఐక్యరాజ్య సమితి అంటోంది. జర్మనీ సంస్థ పంపిణీ చేసిన బయోమెట్రిక్ యంత్రాలు బాగా పనిచేశాయని పేరొచ్చింది. కానీ, లక్ష ఓట్ల వరకు గల్లంతైనట్టు ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు తాలిబన్లతో అమెరికా జరిపిన చర్చలతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇక వారితో చర్చించడానికేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తే, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల సంఘం అధ్యక్షురాలు హవా అలామ్ నురిస్తానీ తమకు అప్పగించిన బాధ్యతను నీతి, నిజాయితీ , చిత్తశుద్ధితో నిర్వహించామన్నారు. ఫలితాలు పారదర్శకంగా లేవు: అబ్దుల్లా ఎన్నికల ఫలితాలు వెలువడగానే అబ్దుల్లా కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో..‘మాకు ఓటు వేసిన ప్రజలకి, మద్దతుదారులకి, ఎన్నికల సంఘానికి, అంతర్జాతీయ మిత్రులకి మేం ఒకటే చెబుదామనుకుంటున్నాం. ఎన్నికల ఫలితాల్ని మేం అంగీకరించడం లేదు. చట్టపరంగా మేం చేస్తున్న డిమాండ్లు తీర్చాల్సి ఉంది’’అని ఉంది. -
తాలిబన్ నేతలతో ట్రంప్ రహస్య భేటీ రద్దు
వాషింగ్టన్: తాలిబన్ నేతలతోపాటు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో జరగాల్సిన రహస్య భేటీని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైనికుడి మృతికి కారణమైన కాబూల్ పేలుడుకు కారణం తామేనంటూ తాలిబన్ చేసిన ప్రకటనపై ఆయన ఈ మేరకు స్పందించారు. దీంతో అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో అమెరికా– తాలిబన్ల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీతోపాటు తాలిబన్ నేతలతో ఆదివారం డేవిట్ రిట్రీట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నట్లు ట్రంప్ శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే, గురువారం కాబూల్‌లో అమెరికా సైనికుడితోపాటు 11 మంది చనిపోయిన కారు బాంబు పేలుడు తమ పనే అంటూ తాలిబన్ ప్రకటించడంతో ఆ భేటీని, శాంతి చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ‘చర్చల్లో పైచేయి సాధించటం కోసం ఇలా చంపుకుంటూ పోతారా? ఎన్ని దశాబ్దాలు ఇలా పోరాటం సాగించాలనుకుంటున్నారు? ఇటువంటి చర్యలు పరిస్థితిని మరింత జఠిలంగా మారుస్తాయి. అర్థవంతమైన ఒప్పందం కుదరాలనే నైతిక అర్హత వారికి లేదు’ అని వ్యాఖ్యానించారు. తాలిబన్‌తో శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా ప్రతినిధి ఖలీల్జాద్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
మా దేశంలో జోక్యం ఏంటి?
కాబూల్ : ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరుగుతున్న చర్చల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరించేది లేదంటూ పరోక్షంగా అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ హెచ్చరించారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో అష్రఫ్ ఘనీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకొంది. ఆదివారం నాడు ఈద్ ప్రార్థనల అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు రానున్న కాలంలో దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సి ఉన్నందున వచ్చే నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికలు అత్యంత కీలకమన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తును ఇక్కడ తామే నిర్ణయించుకుంటామని, ఇందులో ఎవరి జోక్యాన్ని తాము కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. దేశంలో శాంతియుత వాతావరణం నెలకొనాలన్నది ప్రతి ఆఫ్ఘన్ పౌరుడి ప్రగాఢ వాంఛ, ఇందులో ఎటువంటి సందేహానికీ తావులేదని పేర్కొన్నారు. ఆప్ఘన్లు ఆత్మగౌరవంతో సంచరించే విధంగా తాము శాంతిని కోరుకుంటున్నామని, కొంత మంది ప్రజలు దేశాన్ని వదిలిపెట్టాలన్న షరతుతో అమెరికా తరహా శాంతి ఒప్పందాన్ని కోరుకోవటం లేదన్నారు. తాము మేధో వలసలను, పెట్టుబడి వలసలను కోరుకోవటం లేదని, శాంతినే కోరుకుంటున్నామని పదే పదే వ్యాఖ్యానించారు. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం సెప్టెంబర్ 1 నాటికి తాలిబన్లతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తాము భావిస్తున్నట్లు అమెరికా రాయబారి జాల్మే ఖలీల్జాద్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఇతర ఉగ్రవాద తండాలకు నెలవు కాబోదన్న హామీని తాలిబన్లు ఇస్తే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న 20 వేల మంది అమెరికా, నాటో దళాలను తాము ఉపసంహరించుకుంటామని ఆయన ప్రతిపాదించారు. ఇరువర్గాలూ ఈ ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం చేయటంతో శాంతి ఒప్పందం కదురుతుందనే వార్తలు వెలువడ్డాయి. కాగా, ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఆఫ్ఘన్ విషయంలో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉంది. ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడానికి అమెరికా చాల రోజుల నుంచి ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే అతిపెద్ద అగ్రరాజ్యం ఒక చిన్న దేశంలోని తాలిబాన్లను కట్టడి చేయలేక పోయిందనే అపప్రదను మూటకట్టుకుందనే భయం అమెరికాలో ఉంది.