ayyappa swamy
-
ఎడిసన్, సాయిదత్త పీఠంలో శ్రీ అయ్యప్ప స్వామి పూజ
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)
-
గుడి వద్ద మద్యం షాపు.. అయ్యప్ప స్వాముల ఆగ్రహం
-
ఎడిసన్, సాయిదత్తం పీఠంలో అయ్యప్ప మహా పడి పూజ
-
మంత్రి తలసాని నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న ప్రముఖులు (ఫొటోలు)
-
కావాలనే అలా మాట్లాడా.. భైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు!
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప స్వామి పుట్టుకను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్.. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలతో హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహానికి గురయ్యాడు ఓయూ స్టూడెంట్ భైరి నరేష్. అయితే కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇక రిమాండ్‌లో ఉన్న భైరి నరేష్ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. కావాలనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడతను. అలాగే.. నరేష్‌ను తాను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కార్యక్రమానికి పిలిచినట్లు మరో నిందితుడు, సభను నిర్వహించిన హనుమంతు పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు భైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని కొడంగల్ పోలీసులు కోర్టుకు వెల్లడించినట్లు రిమాండ్ కాపీలో ఉంది. మత విద్వేషాలకు పాల్పడే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కొడంగల్ స్థానిక కోర్టుకు తెలిపారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్ స్టేషన్లోనూ భైరి నరేష్‌పై కేసులు ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుత కేసుపై అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. డిసెంబర్19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొడంగల్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంలో ప్రసంగించిన భైరి నరేష్ ఈ క్రమంలోనే హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఉమాపతి గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. సాక్షి చేతిలో బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ -
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్ అరెస్ట్
సాక్షి, వికారాబాద్/వరంగల్: అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో బైరి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శనివారం తెలిపారు. నరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని కోరారు. ఇప్పటికే బైరి నరేశ్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు కోటిరెడ్డి తెలిపారు. అయితే పరారీలో ఉన్న నరేష్ వీడియోలు పోస్టు చేయగా... సోషల్ మీడియా ద్వారా అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా అయ్యప్ప స్వామిపై నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన సభలో దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Hyderabad: నుమాయిష్‌కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే! -
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్–కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్(07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్–కొల్లాం (07121) ఈ నెల 27, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొల్లాం (07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వివరించారు. -
అయ్యప్ప మాలధారణ .. నియమాల ఆచరణ.. మండల పూజ ఎప్పటినుంచంటే?
రాజంపేట రూరల్ (వైఎస్సార్ కడప): శివకేశవుల తనయుడైన శ్రీమణికంఠుని మాలధారణ నియమాలతో కూడుకున్న ఆచరణ. హరిహరపుత్రుడైన అయ్యప్ప కొలువై ఉన్న కేరళ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది అయ్యప్ప దీక్ష తీసుకుని మాల ధరిస్తున్నారు. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. మోక్షమార్గాన్ని అన్వేశించే వారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పని సరిగా జీవితంలో ఒక సారి అయినా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విళ్లూరు తుంటారు. నియమాలు ఇలా.. అయ్యప్ప మాలను పవిత్రమైన ఆలయంలో గురుస్వామి వద్ద కానీ లేదా ఇంట్లో మాతృమూర్తి వద్ద వేయించుకోవచ్చును. ప్రతి రోజు సూర్యోదయంకు ముందే పూజలు, సూర్యాస్తమయం తరువాత పూజలు నిర్వహించాలి. కఠిన నియమాలను పాటిస్తూ నలుపు దుస్తులనే వాడాలి. రాత్రివేళల్లో ఆలయాలలోని నిద్రే శ్రేయస్కరం. ప్రతి రోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి. భక్తుడే భగవంతుడు అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌక్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై స్వామి గానే పిలువబడుతుంటారు. దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికి, భగవంతునికి తేడా కనిపించదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమత భేదాలు, తారతమ్యాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమల. ఇరుముడి ప్రాముఖ్యత అయ్యప్పను నవవిధ సేవలతో ప్రార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మ నివేదనలతో అయ్యప్పను కొలుస్తుంటారు. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందున్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామి వారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. కొబ్బరికాయకు బిగించే కార్క్‌ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. ఆ పైన కాయకు ఆత్మ అనే లక్కతో సీలు వేస్తారు. ఈ జ్ఞానం అనే నెయ్యితోనే స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లుగా భావించడమే అర్థం. దీన్నే ఆత్మ నివేదన అంటారు. స్వామి అయ్యప్ప దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అనే అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరు చేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్య జ్యోతి దర్శనమవుతుంది. దానినే మకరజ్యోతిగా భావించాలి. ఆద్యంతం భక్తిపారవశ్యమే.. శబరిమలై యాత్ర ఆధ్యంతం భక్తి పారవశ్యమే. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం నుంచి ఇరుముడి కట్టుకుని బృందంతో బయలుదేరుతారు. మొదటగా వావర్‌స్వామి కొలువై ఉన్న ఎరిమేలికి చేరుకుంటారు. అక్కడ పేటతుళ్లి ఆడి వావర్‌స్వామిని, పేటశాస్త్రిలను దర్శించుకుని పంబకు బయలుదేరుతారు. పంబానదిలో పుణ్యస్నానాన్ని ఆచరించి సన్నిధానంకు ఇరుముడిని మోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ బయలుదేరుతారు. కొండ అంచున ఉన్న అప్పాచిమేడు చేరుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బహిరంగ ప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. పంబానదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తిఆల్కు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లలను ఉంచుతారు. అనంతరం స్వామి వారిని సన్నిధానానికి చేరుకుంటారు. పవిత్రమైన పదునెట్టాంబడి.. స్వామి సన్నిధానంలో ఉండే 18 పడిమెట్లను అవతార పురుషుడైన పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, రెండు యోగములైన కర్మయోగం, జ్ఞానయోగంతో పాటు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పరిచారు. సన్నిధానం చేరిన భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి ఎక్కవలెను. స్వామి వారి దర్శనార్థం ఇరుముడిని గురుస్వామి సాయంతో విప్పవలెను. అందులో ఉన్న నెయ్యిని అయ్యప్పకు అభిషేకాన్ని చేస్తారు. అనంతరం మాలిగైపుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలను దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుగా చెల్లించుకుంటారు. అద్వైత మలై.. అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. హరిహరసుతుడు, శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించినవాడే అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర భేదం లేదు. అద్వైతానికి నిలువెత్తు నిదర్శనం శబరిమలై కొండ. కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమలవెంకటేశ్వరస్వామి తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. మండల కాలం (41రోజులు) ఈ దీక్ష కొనసాగుతుంది. 18 మెట్లను ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్లీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్లీ అయ్యప్పను కనులారా చూస్తామా అంటూ పరితపిస్తుంటారు భక్తులు. ఈ యేడాది నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 3వ తేది వరకు మండల దర్శనం, జనవరి 10 నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. -
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం |
-
దర్శనమిచ్చిన మకర జ్యోతి
శబరిమల : కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో బుధవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల సన్నిధానం మారుమోగింది. మకరజ్యోతి దర్శనానికి విచ్చేసిన అయ్యప్ప స్వాములతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పంబ, నీలికల్, పులిమేడ్ ప్రాంతాలను జ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్‌కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. అంతకుముందు మకరజ్యోతి వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకువచ్చిన ప్రత్యేక ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. ఆ తర్వాత సాయంత్రం 6.50 గంటల సమయంలో పొన్నాంబలమేడు కొండపై జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చింది. -
మహా పడిపూజలో శర్వానంద్
-
శరణం అయ్యప్ప
మలయాళ హీరో పృథ్వీరాజ్ అయ్యప్పగా మారబోతున్నారు. అయ్యప్ప మాల వేసుకుంటున్నారా అంటే? కాదు.. అయ్యప్ప స్వామి పాత్రనే పోషిస్తున్నారు ఆయన. అయ్యప్ప స్వామి జీవితం ఆధారంగా దర్శకుడు శంకర్ రామకృష్ణ ‘అయ్యప్పన్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ ‘ఆగస్ట్ సినిమాస్’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘అయ్యప్పన్: రియల్. రెబల్’ అన్నది క్యాప్షన్. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేయడంతో పాటు మోహన్‌లాల్‌తో ‘లూసిఫర్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు పృథ్వీరాజ్. -
యథావిధిగా నిరపుధారి పూజ
శబరిమల/తిరువనంతపురం: శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో ఏటా నిర్వహించే పవిత్రమైన ‘నిరపుధారి’పూజను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు బుధవారం యథావిధిగా పూజ ఉంటుంది. ఆలయ ప్రధాన పూజారి ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారని, పూజకు అవసరమైన వరిపంటను మంగళవారం సాయంత్రానికి తీసుకొస్తామని టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2 బృందాలు వేర్వేరు మార్గాల ద్వారా పంటను తీసుకొస్తున్నాయి. మంగళవారం సాయంత్రం అయ్యప్ప దేవాలయాన్ని తెరుస్తారు. పంపానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భక్తులెవరూ శబరిమలకు రావోద్దని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న ఓనమ్ వేడుకలను రద్దు చేశామని, ఈ మొత్తాన్ని వరద సహాయక కార్యక్రమాలకు వాడతామన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.వెయ్యి కోట్లు, శబరిమల రోడ్లకు రూ.200 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం నాటికి 40 మంది ప్రాణాలు కోల్పోగా.. 20వేల ఇళ్లు, 10వేల కి.మీ రోడ్లు ధ్వంసం అయ్యాయి. వరదలు కారణంగా వాయనడ్, ఇడుక్కి జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. మట్టుపెట్టి డ్యాం గేట్లు ఎత్తటంతో ఇడుక్కిలోని మన్నార్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. -
25 రోజుల్లో రూ.100 కోట్లు!
-
అయ్యప్ప స్వామి జోలపాట రీరికార్డింగ్
తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని నిద్ర పుచ్చేందుకు వినిపించే ‘హరివరాసనమ్’ పాటను మళ్లీ రికార్డు చేయాలని ఆలయాన్ని పర్యవేక్షిస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. ఎనిమిది చరణాల సమాహారమైన ఈ గీతంలోని ప్రతీ లైనులో ‘స్వామి’ పదాన్ని చేర్చనున్నారు. ప్రముఖ గాయకుడు కె.జె ఏసుదాస్ ఆలపించిన గీతాన్నే వినియోగిస్తున్నారు. ఈ గీతంలో వచ్చే ‘అరివిమర్ధనం’ పదాన్ని ‘అరి’(శత్రువు), ‘విమర్ధనం(నాశనం)’గా విడగొట్టేందుకు నిర్ణయించినట్లు కుమార్ వెల్లడించారు. 1950 నుంచి ఈ గీతాన్ని స్వామి నిద్రా సమయంలో వినిపిస్తున్నారు. శబరిమలలో ఏపీ మహిళను అడ్డుకున్న పోలీసులు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి యత్నించిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్వతి(31) భర్త, పిల్లలు, మరో 11 మందితో కలిసి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. -
తెరుచుకున్న శబరిమల ఆలయం
శబరిమల: వార్షిక మండలం–మకరజ్యోతి ఉత్సవాల కోసం ప్రఖ్యాతిగాంచిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. బుధవారం సాయంత్రం తంత్రి (ఆలయ ప్రధాన పూజారి) మహేశ్ మొహన్నరు గుడి తలుపులను తెరిచారు. విరీచికం (మలయాళ నెల తొలి రోజు) సందర్భంగా గురువారం ఉదయం తంత్రి అష్టద్రవ్య మహా గణపతి హోమం నిర్వహించి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలయం తెరవడంతో దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. 41 రోజులపాటు నిర్వహించే మండల పూజ కార్యక్రమం డిసెంబర్ 26న పూర్తికానుంది. అదే రోజు పూజ తర్వాత గుడి తలుపులు మూసి డిసెంబర్ 30న తెరుస్తారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం అయిన వారం తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు. -
అయ్యప్ప ఆదాయం రూ. 243.69 కోట్లు
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా దీక్ష తీసుకునే స్వాములు, భక్తుల సందర్శనతో శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 2016-17 సంవత్సరానికి అన్ని రకాల ఆదాయాలు కలిపి స్వామివారికి రూ.243.69 కోట్లు వచ్చాయని రాష్ట్ర దేవస్వోమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. నవంబర్- జనవరి మధ్య కేవలం హుండీ ద్వారానే రూ.89.70 రాగా, అప్పం విక్రయాలతో రూ.17.29 కోట్లు వచ్చినట్లు వివరించారు. దీంతో పాటు ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.46.14 కోట్లు మంజూరు చేసిందని ఆయన వివరించారు. -
చర్లపల్లిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
-
అయ్యప్ప మహిమలు
అయ్యప్ప స్వామి నేపథ్యంలో వీవీ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘ఆపద్బాంధవుడు... అయ్యప్ప’. పెనుమర్తి విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మూడు పాటలు, కొంత టాకీ మినహా పూర్తయ్యింది. వేల్పుల వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో పాటు పాటలు స్వరపరిచి, సాహిత్యం కూడా రాశాను. ఈ నెలాఖరుతో షూటింగ్ ముగుస్తుంది’’ అన్నారు. ఇందులో తండ్రీ, కొడుకులుగా భానుచందర్ పోషిస్తున్న పాత్రలు హైలైట్‌గా నిలుస్తాయనీ, గురుస్వామి పాత్రను హేమసుందర్ చేస్తున్నారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కొత్తపల్లి బ్రదర్స్, సహనిర్మాత: నూకబోయిన వెంకట్రామ్. -
నేడే శబరిమలై మకరజ్యోతి దర్శనం
-
వైభవంగా అయ్యప్ప మహాపూజ
భివండీ, న్యూస్‌లైన్ : శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి భక్త మండలి ఆధ్వర్యంలో పద్మనగర్‌లోని దత్తమందిరం ప్రాంగణంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్పమాల ధరించిన తెలుగు భక్తులు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పడిపూజ, నిత్యానదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగి పోతున్నాయి. ఇదిలా వుండగా, మహాపూజలో భాగంగా సాయంత్రం 21 మంది చిన్నారులు గంగాజలంతో కూడిన కలశాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వరాలదేవి మందిరం నుంచి బాలాజీ మందిర్, దత్తామందిర్ వరకు వెళ్లారు. తర్వాత శ్రీ గణపతి హోమం, దీపారాధన, శ్రీ అయ్యప్ప అర్చన, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా వివిధ భాషల్లో భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 8 గంటలకు కట్టేకోల గురుస్వామి చేతులమీదుగా పడి పూజ , మహాపూజ నిర్వహించారు. ఈ మహాపూజకు వర్లీకి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి సచ్చిదానంద భక్త సమాజానికి చెందిన పొట్టబత్తిని శ్రీహరి గురుస్వామి, చెంబూరులోని మణికంఠ సేవా సమితికి చెందిన ముక్కు శ్రీనివాస్ గురుస్వామి, శ్రీ అయ్యప్ప సేవాసమితికి చెందిన సురేష్ గురుస్వామి, శ్రీ వేంకటాచల అయ్యప్ప భక్త బృందానికి చెందిన గడ్డం లక్ష్మణ్ గురుస్వామి, శ్రీ తమిళ్ గణేశ్ మిత్ర మండలికి చెందిన లాల్ చంద్ గురుస్వామి, కామత్‌ఘర్‌కు చెందిన సంతోష్ బండారి గురుస్వామితో పాటు భివండి పట్టణవ్యాప్తంగా మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు, స్థానిక తెలుగు ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. మహాపూజ అనంతరం స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనంతరం చేపట్టిన మహాప్రసాదం అన్నదానం కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారని అనుమండ్ల శ్రీహరి గురుస్వామి తెలిపారు. -
అయ్యప్పస్వాముల కోసం శబరిమలకు ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-కొల్లాం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-కొల్లాం (07625) ప్రత్యేక రైలు ఈ నెల 14న సాయంత్రం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30కు కొల్లాం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 15న రాత్రి 11.50 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి రెండవరోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, కట్పడి, జోలార్‌పట్టి, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పలక్కాడ్, త్రిశూర్, ఆలువా, ఎర్నాకులం, కొట్టాయం, తిరువళ్ల, చింగన్నూర్, కాయంకులళం స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు బుధవారం (డిసెంబర్ 10) నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుందని సీపీఆర్వో వెల్లడించారు. -
అయ్యప్పలూ.. తస్మాత్ జాగ్రత్త!
ఒంగోలు క్రైం: జిల్లా నుంచి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములు, యాత్రికులు టూర్ ఆపరేటర్లు, కంప్యూటర్ సెంటర్ల నిర్వాహకులు, సైబర్ కేఫ్ ఆపరేటర్లతో మోసవపోవద్దని ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుదూర ప్రాంతాలకు యాత్రలకు వెళ్లే స్వాములను కొందరు మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతేడాది వివిధ రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లిన యాత్రికులు అనేక రకాలుగా మోసపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే కేరళ డీజీపీ జిల్లా పోలీసు కార్యాలయానికి పంపిన లేఖకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. గతేడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వెబ్‌సైట్‌ను కొందరు వినియోగించుకుని యాత్రికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేశారని, యాత్రికులకు నకిలీ బుకింగ్ కూపన్లు ఇవ్వడంతో పాటు శబరిమలలో అదనపు సౌకర్యాలు కల్పిస్తామని మోసం చేసినట్లు ఎస్పీ చెప్పారు. శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం కేరళ పోలీసులు వర్చువల్ క్యూ సిస్టం పేరిట వెబ్‌సైట్‌ను రూపొందించారన్నారు. ఆ వెబ్సైట్ నుంచి ముందుగా దర్శనం టిక్కెట్లను ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న బుకింగ్ కూపన్లను ప్రింట్ తీసుకుని యాత్రికులు విధిగా తమ వెంట తీసుకెళ్లాల్సి ఉందన్నారు. సన్నిదానం వద్ద పోలీసులు ఆ కూపన్లను పరిశీలించి అనంతరం అయ్యప్పస్వామి దర్శనం కోసం ఎంట్రీ కార్డు ఇస్తారన్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి జనవరి వరకు శబరిమల యాత్రకు వెళ్లేవారు ఈ ఉచిత వెబ్సైట్ సర్వీసును ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ముందు బుక్ చేసుకున్న వారికి ముందే దర్శనం సౌకర్యాన్ని కల్పిస్తారని కేరళ డీజీపీ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. కంప్యూటర్ సెంటర్ల నిర్వాహకులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే శబరిమల యాత్రీకులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తిరిగి ఇంటికి రావచ్చని ఎస్పీ వివరించారు. కేరళ పోలీసుల సూచనలు పాటించాలి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వాములు కేరళ పోలీసుల సూచనలను విధిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ఉచిత వెబ్‌సైట్‌ను ఉపయోగించుకొని యాత్ర సుఖంగా సాగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వెబ్సైట్ గురించి పూర్తిగా తెలియకుంటే బాగా పరిచయం ఉన్న వారి సేవలను వినియోగించుకున్న తర్వాతే శబరిమల వెళ్లాలని ఎస్పీ శ్రీకాంత్ పేర్కొన్నారు.