babli project
-
నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు 14 గేట్లను తెరిచారు. ఈ క్రమంలో గోదావరి జలాలు శ్రీరామ్‌సాగర్ వైపు పరుగులు తీశాయి. అయితే, ప్రతీ ఏటా జూల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అధికారులు గేట్లు ఎత్తుతారు. ఇదిలా ఉండగా.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు 553 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో, ప్రాజెక్ట్‌లో ప్రస్తుత నీటి మట్టం 1064 అడుగులకు చేరుకుంది. ఇక, ప్రాజెక్ట్ పూర్తి స్తాయి నీటి మట్టం 1090 అడుగులుగా ఉంది. ఇది కూడా చదవండి: స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి -
పెద్ద మనసుతో చెప్తున్నా.. బాబ్లీకి ఎత్తిపోసుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి నది నుంచి మన కళ్ల ముందే రెండున్నర వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సమస్యను అర్థం చేసుకునే శక్తి ఉంటే పార్టీలు, ప్రభుత్వాలుగా విడిపోకుండా పరిష్కరించుకుని వాడుకోవచ్చు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు సామర్ద్యం ఒక టీఎంసీ కూడా లేదు. పెద్ద మనసు చేసుకుని చెప్తున్నా తెలంగాణతో ఒప్పందం చేసుకోండి. గోదావరిలో నీటి లభ్యత ఉందనే విషయాన్ని రుజువు చేసి అవసరమైతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాబ్లీ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసుకోండి’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్ర నాందేడ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిది పదిమార్లు మహారాష్ట్రకు వచ్చి నాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఒప్పించి తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే నీటి వినియోగంలో విప్లవాత్మక ఎజెండా అమలు చేస్తామని, రాష్ట్రాల నడుమ కొట్లాటలు లేని జాతీయ విధానం తెస్తామన్నారు. అవసరానికి మించి నదీ జలాలున్న భారత్‌లో భారీ రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరముందన్నారు. ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడంతో పార్లమెంటు, అసెంబ్లీల్లో 33శాతం సీట్లు రిజర్వు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 33 శాతం సీట్లు పెంచి మహిళలకు ప్రత్యేకిస్తామన్నారు. రాష్ట్రాలు, జిల్లాల పునర్విభజనపై తమ పార్టీ విధానాన్ని దేశ ప్రజల ముందు పెడతామని చెప్పారు. గుణాత్మక అభివృద్ధి కోసం భిన్న ఆలోచనతో దేశ ఆలోచన విధానాన్ని మార్చడం కోసమే బీఆర్ఎస్ ఏర్పాటైందని కేసీఆర్ ప్రకటించారు. సింగపూర్, జపాన్, మలేషియా తదితర దేశాల తరహాలçో అభివృద్ధిని పరుగులు పెట్టించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తమ పార్టీ విధానాన్ని అనుసరిస్తే రెండేళ్లలో భారత్ అద్భుతమైన అభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ అ«ధీనంలోనే పెడతామని, రెండేళ్లలోనే దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తామని స్పష్టంచేశారు. దేశంలో సంపూర్ణ పరివర్తన కోసమే... విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు సంబంధించి తమ పార్టీ ఎజెండాపై నిపుణుల బృందం కసరత్తు చేస్తోందని కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో సంపూర్ణ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వరంగ కంపెనీ ఎల్ఐసీని పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించడం వాస్తవం కాదని చెప్తున్న కేంద్రం.. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలంటే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కేంద్రంతో ఉన్న మిత్రుత్వంతోనే అదానీ ప్రపంచంలో రెండో స్థానానికి ఎదిగాడన్నారు. మతం పేరిట దేశ ప్రజల విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని తేల్చిచెప్పారు. తన తదుపరి మీడియా సమావేశం త్వరలో ఢిల్లీలో ఉంటుందని ప్రకటించారు. -
బాబ్లీ గేట్ల మూసివేత
బాల్కొండ/బాసర (ముధోల్): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శనివారం త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మూసివేశారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరదలకు బ్రేకు పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 29న మూసి వేయాలి. పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్ఆర్ఎస్పీకి 0.6 టీఎంసీల నీటిని వదలాలి. అందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి క్రమంగా సాయంత్రం వరకు 14 గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరితే మిగులు జలాలను బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు వదిలితే తప్ప మార్చి 1 వరకు గేట్లను ఎత్తే అవకాశం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ నిండుగా ఉండటంతో మళ్లీ గేట్లను ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 8268 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరు తోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్లద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులతో నిండుగా ఉంది. -
బాబ్లీ గేట్లు దించేందుకు ‘మహా’ ఎత్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను గడువు కన్నా ముందే దించేందుకు మహారాష్ట్ర సర్కారు ఎత్తులు వేస్తోంది. మహారాష్ట్ర ఇంజనీర్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్ల ముందు ఇప్పటికే దీనిపై ప్రతిపాదన చేశారు. బాబ్లీ గేట్లను మూసేయడానికి ఇంకా నెల గడువు ఉంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. వరదొస్తుంటే తొందరెందుకు..? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తి, అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలి. అక్టోబర్ 29న మూసివేయాలి. ప్రతిఏటా ఇదే రీతిన కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో గేట్లు తెరవడం, మూయడం జరుగుతోంది. ఈ ఏడాది జూలై ఒకటిన గేట్లు తెరిచిన అనంతరం ఇప్పటివరకు ఎస్సారెస్పీలోకి ఏకంగా 225 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరింది. ఆదివారం సైతం ప్రాజెక్టులోకి 96 వేల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుండగా, ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదంతా బాబ్లీని దాటుకుంటూ వస్తోంది. బాబ్లీని దాటుకుంటూ వరదంతా దిగువకు వెళుతుండటం, గోదావరి నదిపై ఉన్న తెలంగాణ రిజర్వాయర్లు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరులన్నీ నిండుగా ఉండటంతో బాబ్లీ గేట్ల మూసివేత ప్రతిపాదనను మహారాష్ట్ర ముందుకు తెచ్చింది. గేట్లు మూస్తే బాబ్లీలో 2.74 టీఎంసీల నిల్వ సాధ్యమవుతుంది. దీనివల్ల బాబ్లీపై ఆధారపడి చేపట్టిన ఒకట్రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి అభిప్రాయమూ చెప్పలేదు. మహారాష్ట్రలోని గైక్వాడ్ నుంచి ఎస్సారెస్పీ వరకు ఉన్న చిన్న, చిన్న రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు నిండుగానే ఉన్నాయి. నాందేడ్ వంటి ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టులోనూ 102 టీఎంసీలకుగానూ 101 టీఎంసీల మేర నిల్వలు ఉండగా 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద అక్టోబర్ వరకూ కొనసాగే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మహారాష్ట్ర ముందుగానే గేట్లు మూసే ప్రతిపాదన చేయడం గమనార్హం. గతంలో ఒకసారి అక్టోబర్‌లో గేట్లు మూశాక, బాబ్లీ నిండి మరింత వరద కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేసిన సందర్భాలున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించే అవకాశాలపై ఇరిగేషన్ శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది. -
వారంట్ బూచితో ఇంత లేకితనమా?
ప్రజా మేలు కాంక్షించే నాయకుని ఆలోచనలు వేరే ఉంటాయి వివాదాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవటమే రాజనీతి. వరుసగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబుకు బాబ్లీ ప్రాజెక్టు గుర్తుకురాలేదు. కానీ బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన వారంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కుట్రగా చెప్పుకుంటూ సానుభూతి ఓట్ల కోసం తన్లాడటం చంద్రబాబు మార్కు పాలిటిక్స్‌లో భాగమే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నదీజలాల పంపిణీలో రాజనీతిని ప్రదర్శించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహ హస్తాలను సాచారు. మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర çఫడ్నవిస్‌ను ఒప్పించారు. ‘రాజకీయ విలువలు అస్థి రమైనవి’ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు అంటాడు. అర్థిక శాస్త్రం చదివిన చంద్ర బాబుకు ఏ ఘడియల్లో ఇది వంటబట్టించుకున్నాడో గానీ కౌటిల్యుడే సిగ్గుపడే టట్లు ఆ పదాల ‘అర్థా’న్నే మార్చేశారు. తెలంగాణ పల్లెల్లో ఉద్యమం ఉరకలె త్తుతున్న రోజుల్లో ‘రెండు కళ్ల సిద్ధాంతాన్ని’ ముంద టేసుకున్నారు. రెండు నాల్కల మాటలకైతే లెక్కే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ‘మీది ఏ ఇజం’ అని జర్నలిస్టులు అడిగితే ‘నాకు ఏ ఇజం లేదు.. టూరిజం’ అన్నాడు. ఆయన ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. ప్రతి పనిని ఓటుతోనే సరితూకం చేస్తారు. పిల్లని చ్చిన మామకు వెన్నుపోటు పొడిచినా... ఒకప్పుడు నరేంద్ర మోదీని రాష్ట్రంలోకి రాకుండా నిషే«ధిం చాలని నినదించి.. ఆ తరువాత ఆయన్ను కౌగిలించు కొని, మోకరిల్లినా.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మఘోషిం చేలా ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టు కున్నా... అంతిమంగా అధికార పీఠం దక్కించుకోవా లనే యావే. తాజాగా బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన వారంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కుట్రగా చెప్పుకుంటూ సానుభూతి ఓట్ల కోసం తన్లా డటం చంద్రబాబు మార్కు పాలిటిక్స్‌లో భాగమే. ఆ మధ్యకాలంలో ఓ ఎన్బీడబ్ల్యూ వారంట్ వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టింది. అటు తిరిగి.. ఇటు తిరిగి నాకూ చేరింది. తీరా చూస్తే ఆ వారంట్ నాదే. తెలంగాణ ఉద్యమ సమయంలో అయిన కేసు అది. రెండేళ్లుగా కోర్టుకు హాజరు కాకపోవటంతో సిద్దిపేట కోర్టు వారంట్ ఇచ్చింది. నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరో దాన్ని వాట్సాప్‌లో పెట్టారు. ‘రామలింగారెడ్డి అధికార దుర్వినియోగం చూడండి’ దానికో క్యాప్షన్ పెట్టారు. నేను ఆ ఓ లాయర్‌ను పట్టుకొని రీకాల్ పిటిషన్ వేయించాను. కోర్టుకు గైర్హాజరు అయ్యే వాళ్లకు భారత శిక్షాస్మృతిలో ఇది సర్వ సాధారణ వారంట్. రాజకీయ నేతలకైతే ఇటువంటి వారంట్లు అతి సాధారణం. చంద్రబాబు నాయుడుకు బాబ్లీ ఆందోళన కేసులో వచ్చిన ఎన్బీడబ్ల్యూ వారంట్ కూడా నూటికి నూరుపాళ్లు ఇటువంటిదే. చంద్ర బాబునాయుడుకు కోర్టులు, కేసులు కొత్తకావు. ఆయన మీద 29 అవినీతి కేసులు ఉన్నాయి. వీటి మీద కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని రాజ్య పాలన చేస్తున్నాడు. ఇటీవల బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసులో వచ్చిన నాన్‌బెయిలబుల్(ఎన్బీడబ్ల్యూ) వారంటు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పటి వరకు ఆయనకు 37 సార్లు కోర్టు నుంచి నోటీసులు అందాయి. నిందితులు కోర్టుకు హాజరుకావడం లేదనే కారణంపైన 2015 సెప్టెంబర్ 21 మొదటిసారి ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. అప్పుడు చంద్రబాబు – మోదీ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత 35 సార్లూ ఎన్బీడబ్ల్యూ జారీ చేస్తూ వచ్చింది. అప్పుడూ ఏ చప్పుడూ లేదు. తెలంగాణలో సాధారణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బాబ్లీపై వారెంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి అంపశయ్యమీద ఉన్న టీడీపీకి ఇంత జీవగంజి పోయటానికి, రెండోది కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు వ్యవహారంపై రెండు రాష్ట్రాల ప్రజానీకం, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరు ణంలో దీనిపై చర్చ జరగకుండా కప్పిపుచ్చేందుకు 37వ ఎన్బీడబ్ల్యూ వారంట్ కుట్రగా కనిపించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడకుండా చేశారు. సమస్యను పరిష్కరిం చడానికి బదులు మరింత జటిలం చేశారు. ప్రతి చిన్న విషయానికి మహారాష్ట్రతో గిల్లికజ్జాలు పెట్టుకు న్నారు. నిజానికి 2010లో చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగటం కూడా ఓట్ల స్టంటే. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన బాబుకు తెలంగాణ ప్రజల మద్దతు లభించక పోవటంతో బాబ్లీ బాట పట్టారు. వివా దాన్ని దౌత్యం ద్వారా పరిష్కరించుకోవటమే రాజ నీతి. వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసినప్పుడు బాబుకు బాబ్లీ ప్రాజెక్టు గుర్తుకురాలేదు. అధికారం పోగానే ప్రాజెక్టు గుర్తొచ్చి ఫైటింగ్ కోసం పోయిండు. బాబ్లీ వివాదం ఎప్పటికీ తెగకుండా చేశారు. పైగా తెలంగాణ ప్రాజెక్టులు అంటేనే మహారాష్ట్ర ఒంటి కాలు మీద లేచే పరిస్థితికి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాజనీతిని ప్రదర్శించారు. ‘మాకు కావలసింది నీళ్లు తప్ప వివాదాలు కాదు. రైతు ఎక్కడివాడైనా రైతే. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల రంగంలో తీవ్రంగా నష్టపోయాము. తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే సాగునీటి రంగానికి మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. ముంపు సమస్య లేకుండా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశాము, సహకరిం చండి అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కడుపులో కల్మషం లేకుండా కావాల్సింది ఏమిటో విడమరచి చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఒప్పించారు. గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై మూడు బ్యారేజీల నిర్మాణానికి సీఎంలు పరస్పరం అంగీకారం తెలిపారు. తెలం గాణ సీఎం కేసీఆర్, మహా రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్న వీస్ సంతకాలు చేశారు. మొదటి ఒప్పందం: గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో, 16 టీఎంసీల నీటినిల్వ సామ ర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీ కారం కుదిరింది. ఈ బ్యారేజీ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగా రెడ్డి జిల్లాల్లో 18.19 లక్షల ఎకరాలు కొత్తగా సాగు లోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయ కట్టు స్థిరీకరణ చెందుతుంది. రెండో ఒప్పందం : ప్రాణహితపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, 1.8 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. దీని వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్–కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మూడో ఒప్పందం: పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో చనఖా – కొరాటా బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది. కృష్ణా, గోదావరి జలాలను ఎలాగైనా ఆంధ్రాకు మళ్లించుకుపోవాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు, ప్రాజెక్టులు నిర్మాణం కాకుండా కోర్టు కేసులతో అడ్డం పడి తెలంగాణ భూములను ఎండబెట్టాలనే దుర్భు ద్ధితో ఉన్న కాంగ్రెస్ పార్టీలు జతకట్టి ఓట్ల కోసం వస్తు న్నారు. ఇటువంటి తోడు దొంగల పట్ల తెలంగాణ జనం జాగ్రత్తగా ఉండాలే. ఓటుతోనే తరిమికొట్టాలి. సోలిపేటరామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141 -
మహారాష్ట్ర ఆర్థికమంత్రి చంద్రబాబుకి మిత్రుడు
-
బాబ్లీకేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు చుక్కెదురు
-
బాబ్లీకేసు: చంద్రబాబుకు చుక్కెదురు
ధర్మాబాద్(మహారాష్ట్ర) : బాబ్లీకేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. అదే సమయంలో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో సహా మరో 19 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా వారిలో తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్ గౌడ్లు నేడు కోర్టుకు హాజరయ్యారు. అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమకు ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపారు. అంతేకాకుండా నాలుగు వారాల గడువు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాము ఎవరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అయిన కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తెలిపింది. కోర్టుకు హాజరైన గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్ గౌడ్లకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. నోటీసులు అందుకున్న మిగిలిన 16మంది(చంద్రబాబుతో పాటు) ఆ రోజున కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. -
బాబ్లీపై ఢిల్లీని ఢీకొన్నది వైఎస్సే
బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అనుమతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే కోర్టు నోటీసులు అందుకోకుండా కాలయాపన చేశారు. ఫలితంగా ఇప్పటికి మొత్తం 37 సార్లు కేసు విచారణకు నోటీసులు జారీ అయ్యాయి. విచిత్రమేమంటే, 2009లో దివంగతుడైన వైఎస్ బాబ్లీ నిర్మాణానికి 2010లో అనుకూలుడని ఓ అపవాదు వేసి తప్పుకోవాలని చంద్రబాబు చూడటం! 2010లో నేను బాబ్లీ (మహారాష్ట్ర) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ఆ రోజున బాబ్లీ కట్టడాన్ని మహారాష్ట్రకు అను కూలంగా నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థించారు. – ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ‘జలసిరి’ బహిరంగసభలో (కర్నూలు జిల్లా)14–9–2018 చదవేస్తే ఉన్న మతి పోయిందన్న సామెత బహుశా చంద్రబాబు లాంటి పాలకుల్ని చూసి పుట్టి ఉంటుంది. అసలు 2010 నాటికి వైఎస్ రాజశేఖరరెడ్డి సజీవుడిగా ఉన్నట్టు ఏ దాఖలాలను బట్టి బాబు చెప్పడా నికి సాహసించారు? అప్పటికి ప్రతిపక్ష నాయకుని పాత్రలోనే ఉన్న బాబుకి 2009లోనే ముఖ్యమంత్రి హోదాలో ఉండగా హెలికాప్టర్ ప్రమా దంలో వైఎస్ దివంగతులైన విషయం తెలియదా? లేక ‘మతి తప్పిన మొదటి వేల్పుల’ జాబితాలోకి జారుకున్న బాబు అంతటి అబద్ధానికి పాల్పడ్డారా? ఇంతకీ అసలు పచ్చి అబద్ధం–బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వైఎస్ సమర్ధించారన్నది. అందుకు తోడుదొంగగా ఒక తైనాతీ దిన పత్రికను ఆయన ఉదహరించడం! ఆదరా బాదరాగా చంద్రబాబు ఇన్ని అవాకులు, చవాకులు పేలడానికి అసలు కారణం తెలంగాణలో తక్షణం, ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని మాసాల్లో జరగనున్న ఎన్నికలు. రెండు చోట్లా కునారిల్లిపోతున్న టీడీపీని బతికించుకునే దింపుడు కళ్లం ఆశకు గండి కొట్టే విధంగా మహారాష్ట్ర కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారంట్ వచ్చిపడింది. మూడేళ్ల క్రితమే చంద్రబాబుకు, ఆయన పరివారానికి ఈ కేసులో వారంట్ వచ్చింది. అసలా సీరియస్ నోటీస్ ఎందుకు రావలసి వచ్చింది? తెలంగాణ, కోస్తా జిల్లాల జ లాధారాలకు, ప్రాజెక్టులకు గండి కొట్టే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం తల పెట్టడానికి నిరసనగా ఆనాటి టీడీపీ సహా కొన్ని ప్రతిపక్షాలు ఆందోళన తలపెట్టడంలో తప్పులేదు. కాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రాజె క్టులకు, ప్రజాహిత పథకాలకు అంకురార్పణ చేసి, వాటిని విజయవం తంగా అమలు చేసిన రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు అభాండం వేయడం మాత్రం క్షమించరాని నేరం. బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టింది మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాగా, దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రిగా వైఎస్ అఖిలపక్షానికి నాయకత్వం వహించి, ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయించేందుకు కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్లారన్న విషయం మరచి పోకూడదు. వైఎస్ నాయకత్వాన ఢిల్లీ వెళ్లిన బృందంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబూ ఉన్నారు. 1975లో ఒప్పందం 1969లో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత 1975లో గోదావరి జల వినియోగంపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు శ్రీరాంసాగర్ (పోచంపాడు) నిర్మాణం వల్ల మహారాష్ట్రలోని ముంపు ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లించడానికి ఏపీ అంగీకరించింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండగానే బాబ్లీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2003 వరకు ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నా, బాబు ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. వైఎస్ అధికారంలోకి వచ్చాక, పోచంపాడు పరిధిలో బాబ్లీ బరాజ్ నిర్మాణం జరుగుతోందని 2005 మేలో తొలిసారిగా గుర్తించారు. ఈ విషయం తెలి సిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగానే కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి లేదని (మహారాష్ట్ర 1975 ఒప్పందాన్ని తిరగదోడదలచినప్పుడు) ఇంజనీర్ల బృందం ధ్రువీక రించింది. బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్రం ఆదేశించింది. కాగా, ఈ సమస్యపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా మహారాష్ట్ర గైర్హాజరయింది. దీంతో మహారాష్ట్రకు బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం 2006 జనవరి 7న స్పష్టం చేసింది. ఈ కుట్రనంతా బయటపెడుతూ తొలిసారిగా ఇక ‘‘బాబ్లీ కథ ముగిసింది’’ అనే పతాక శీర్షికతో ఓ దినపత్రికలో హెచ్. బాబ్జీ అనే విలేకరి ప్రత్యేక కథనంగా ప్రచురించడం జరిగింది. గతంలో ఆ పత్రికకు నేను ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించాను. ఈ ప్రత్యేక కథనంలో బాబ్లీ నిర్మాణం రహస్యంగా మహారాష్ట్ర పూర్తి చేసుకున్న వైనాన్ని వివ రించడంతోపాటు ఏపీ ప్రజలను, రాజకీయపార్టీలను హెచ్చరించడం జరిగింది. అప్పటికే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ దశలో ఏ ఒక్క ఇతర రాష్ట్రం పిట్టనూ ప్రాజెక్టు వైపునకు రానీయకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈ కథనం రాసిన విలేకరి మహారాష్ట్రలోని తన స్నేహితుని అండదండలతో ప్రాజెక్టు ఫోటోలను కెమెరాలో బంధించి జాగ్రత్తగా బయటపడ్డాడు. నిఘా సంస్థల కళ్లపడకుండా ఇంత సాహసం చేశాడు. గత నాలుగు దశాబ్దాలుగా సాగిన కుట్ర, కేంద్రం ఆదేశాలను తోసిపు చ్చిన మహారాష్ట్ర బరితెగింపు చర్యల ఫలితం ఇది. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలను ధిక్కరించి బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న వైనంపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి ఏపీ అభ్యం తరాన్ని వైఎస్ తెలపడమే గాక, మహారాష్ట్ర సీఎంకూ(2006 ఏప్రిల్ 4) నిరసన తెలిపారు. బాబ్లీ నిర్మాణం నిలిపివేయాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళుతూ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ రిట్ పిటిషన్ దాఖలు(2006 ఏప్రిల్ 10) చేశారు. గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించి నిర్మిస్తున్న బాబ్లీని నిలిపివేయాలన్న ఏపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు (2006 జులై 7) విచారణ చేపట్టింది. 8 వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. అయినా, మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా 2.70 టీఎంసీల సామర్ధ్యంగల బాబ్లీ నిర్మాణాన్ని పూర్తిచేసింది. వైఎస్‌పై అపనింద వేసి తప్పుకోజూసిన బాబు! బాబ్లీ కథ తెరకెక్కిన తొలి రోజుల్లో ఈ సమస్యపై చంద్రబాబునాయుడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక నిరసన ప్రదర్శన పెట్టి చాలించుకున్నారు. కానీ, రెండోసారి బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అను మతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్ చేసి, కొట్టి సుమారు 15 రోజుల పాటు ఓ స్కూలు ఆవరణలో ఉంచారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే కోర్టు నోటీసులు అందుకోకుండా కాలయాపన చేశారు. ఫలితంగా ఇప్పటికి సమన్లు అందుకోనందుకు గాను మొత్తం 37 సార్లు కేసు విచారణకు నోటీసులు జారీ అయ్యాయి. 2013లో చంద్రబాబుపై ప్రారంభమైన విచారణ ఇలా సాగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. విచిత్రమేమంటే, 2009లో దివంగతుడైన వైఎస్ బాబ్లీ నిర్మాణానికి 2010లో అనుకూలు డని ఓ అపవాదు వేసి తప్పుకోవాలని చంద్రబాబు చూడడం! తెలం గాణ అసెంబ్లీ ఎన్నికలను సాకుగా చేసుకుని, తనపై బీజేపీ చేస్తున్న ‘కపట రాజకీయ దాడి’ని తిప్పికొట్టడానికి చంద్రబాబు మధ్యలో దివం గత నేత వైఎస్ పేరును అడ్డగోలుగా బాబ్లీ వివాదంలోకి లాగారు. 2010లో జీవించి లేని రాజశేఖరరెడ్డిపై నిందమోపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. నిజానికి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ఒక్కటే కాదు, గోదావరిపై మరో నాలుగు ప్రాజెక్టులను నిర్మించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే బాబ్లీ నిర్మాణం పూర్తి చేసింది. ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల దిగువన ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ, కోస్తా ఆంధ్ర జిల్లాల భూములు బీడు పడిపోతాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా ‘మాకు ఫికరులేదని’ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యులు కొందరు దిలాసాగా ప్రక టించారు. తమ భూభాగంలోకి గోదావరిలోకి నీళ్లు చేరితే తమ లక్ష్యం పూర్తయినట్టేనని చెప్పారు. బాబ్లీతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎడారి కాగలదన్న భీతి ప్రజలలో ఇంకా పోలేదు. సింగూరు బ్యాలెన్సింగ్ రిజ ర్వాయరు, హైదరాబాద్ మంచి నీటి సరఫరాకు ఆటంకాలు ఇంకా తొలగలేదు. వైఎస్ తెలంగాణ సౌభాగ్యంలో భాగంగా తలపెట్టిన చేవెళ్ల–ప్రాణహిత, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు నీరు అవసరం. ‘జలయజ్ఞాని’కి తలమానికంగా చెప్పుకున్న ఈ ఎత్తిపోతల పథకాలను బాబ్జీ ప్రాజెక్టు కబళించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే బాబ్లీ నిర్మా ణాన్ని ఆపవలసిందిగా మొదట్లో ఆదేశించిన సుప్రీంకోర్టు కూడా చివరికి మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణానికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ రోజుల్లో ఏ లాబీ, ఎక్కడ, ఏ సంస్థలో పనిచేస్తోందో ప్రజలకు మాత్రం పాలుపోని స్థితి. ముఖ్యంగా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉంచి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టాన్ని అడ్డగోలుగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల పంపిణీలో కుటుంబాలు ఎలా తన్నులాటలకు దిగుతాయో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమ స్యలు తెలుగు వారిని వెన్నంటుతూనే ఉన్నాయి. 1969 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుతో బాబ్లీ కథ మొదలయింది. 2010లో దాని నిర్మాణం ఇంకాస్త రహస్యంగా ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాల ముందు రాజకీయ ప్రయోజనాలు పనికి రావనే ఆరోగ్యకర భావన కొర వడితే రాజకీయ పార్టీలు (అది ఏ పక్షమైనా సరే) ప్రజల నమ్మకం కోల్పోక తప్పదని, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే అది ఆత్మహత్యా సదృశమేనని దేశాల చరిత్ర చెబుతోంది. వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
నారావారి సాము ‘గరుడ’లు!
కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు నారా చంద్రబాబునా యుడు. న్యాయవ్యవస్థ పనితీరు తెలిసినవారు ఎవరైనా రెండు రోజులుగా చంద్రబాబు, ఆయన సహచరులూ ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో మాట్లాడుతున్న తీరు చూస్తే వీళ్ళకి మతులు పోయాయని నిర్ధారించుకుంటారు. రాజ కీయం ఇంతగా దిగజారిపోయిందేమిటని బాధపడతారు. గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నందుకు ఆగ్రహి స్తారు. న్యాయవ్యవహారాలు తెలియనివారు మాత్రం ప్రధాని నరేంద్రమోదీకీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ మధ్య భీకర సమరం సాగుతున్నదని భ్రమి స్తారు. మోదీ అన్ని పనులూ పక్కన పెట్టి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను పిలిపించుకొని గంటలకొద్దీ సమాలోచనలు జరిపి, ఇద్దరూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో మాట్లాడిన ట్టూ, ఫడ్నవీస్ నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్‌లో ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌తో కలిసి రాజకీయకుట్ర చేసి చంద్ర బాబును అరెస్టు చేయడానికి పన్నాగం పన్నినట్టూ, అందులో భాగంగానే నాన్‌బెయిలబుల్ వారెంటు పంపి నట్టూ అపార్థం చేసుకొని అనవసరంగా ఆవేశపడతారు. ఇటువంటì వారెంట్లకూ, అరెస్టులకూ తాను భయపడేది లేదని కర్నూలు జిల్లా సున్నిపెంటలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రులు కళావెంకటరావు, యనమల రామకృష్ణుడు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు, మాజీ ఎంపీ నామానాగేశ్వరరావు తక్కుంగల నేత లందరూ నాన్‌బెయిలబుల్ వారెంటు మోదీ పనేనంటూ ప్రకటించారు. తాను మరోసారి ప్రధాని కాకుండా చంద్ర బాబు అడ్డుకుంటారనే భయంతో మోదీ కుట్ర చేసి తమ నాయకుడిని వేధించాలని ప్రయత్నిస్తున్నారనీ, మోదీ ఆటలు సాగవనీ, అంతు చూస్తామనీ వారంతా ముక్తకం ఠంతో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, బాబ్లీ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థించారని చంద్ర బాబు ఆరోపించారు. వైఎస్ 2009లో దివంగతుడైన విష యం ముఖ్యమంత్రి మరచిపోయారు. మీడియా సహకారం చంద్రబాబుకు అరెస్టు వారెంట్ వార్తను మీడియా సమ ధికోత్సాహంతో పతాక శీర్షికలతో, పొలికేకలతో ప్రకటించి, ప్రసారం చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో యుద్ధవాతా వరణం సృష్టించింది. చంద్రబాబును ఒక వైపు నరేంద్ర మోదీతోనూ, రెండో వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనూ, ఇంకోవైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తోనూ త్రిముఖంగా పోరాడుతున్న యోధానయోధుడుగా ప్రజలు గుర్తించి ఆయనను రాబోయే ఎన్నికలలో కూడా గెలిపిం చాలని బాబు మిత్రుల ఆకాంక్ష. అసలు విషయం ఏమి టంటే వడ్ల గింజలో బియ్యపు గింజ. పత్రికలూ, వార్తాచా నళ్ళూ నిర్వహించేవారికి నాన్బెయిలబుల్వారెంట్ (ఎన్బీ డబ్ల్యూ) కొత్తకాదు. నాకు అనేక సందర్భాలలో ఎన్బీ డబ్ల్యూ వచ్చింది. ఒకసారి ఇద్దరు పోలీసు అధికారులు సరాసరి మా కార్యాలయంలో నా గదిలోకి వచ్చి నాకు ఎదు రుగా కూర్చొని ఆశ్చర్యపరిచారు. ఎన్బీడబ్ల్యూ చూపిం చారు. మా లాయర్ నుంచి కానీ, రిపోర్టర్ నుంచి కానీ నాకు సమాచారం బొత్తిగా లేదు. మర్నాడు కోర్టుకు హాజ రవుతానని చెప్పి వారిని పంపించాను. కోర్టుకు హాజరై నాను. ఇతర సంపాదకులకూ, పత్రికాధిపతులకూ పరువు నష్టం దావాలలో కోర్టుకు హాజరు కాలేకపోయిన పరిస్థితు లలో ఎన్బీడబ్ల్యూ రావడం, దిరిమిలా కోర్టుకు హాజరు కావడం లేదా న్యాయవాదిచేత దరఖాస్తు చేయించడం, ఎన్బీడబ్ల్యూను ‘రీకాల్’ చేయించుకోవడం సర్వసాధా రణం. ఇది చాలా చిన్న విషయం. అటువంటి ఎన్బీడబ్ల్యూ ఒకటి చంద్రబాబుకీ, మరి కొంతమందికీ 37వ సారి వచ్చింది. ధర్మాబాద్ మెజిస్ట్రేట్ ఎన్ఆర్ గజఖియే జులై 5న తాజా వారెంట్ పంపించాలని ఆదేశించారు. దాని ప్రకారం ఆగస్టు 16 నిందితులు హాజరు కావాలి. కానీ తేదీని చేతితో కొట్టివేసి సెప్టెంబర్ 21న హాజరు కావాలని ఆదేశిస్తూ పంపిన తాఖీదు రెండు రోజుల కిందటే అందినట్టు ప్రచారం. 2010లో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీ సహచరులతో వెళ్ళి ధర్నా చేశారు. మహారాష్ట్ర పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌లో దింపారు. భారత శిక్షాస్మృతి కింద మహా రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. విచారణ 2013 ఆగ స్టులో ప్రారంభమైంది. నిందితులు కోర్టుకు హాజరు కావడం లేదనే కారణంపైన 2015 సెప్టెం» ర్ 21 మొద టిసారి ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. ఆ తర్వాత 35 సార్లూ ఎన్బీడబ్ల్యూ జారీ చేస్తూ వచ్చింది ధర్మాబాద్ కోర్టు. ఎనిమిదేళ్ళుగా అదే కోర్టులో కేసు నలుగుతూ ఉన్నది. ఎన్బీడబ్ల్యూ జారీ చేయడమే కానీ దాన్ని అమలు చేసే ఉద్దేశం కోర్టుకు ఉన్నట్టు లేదు. మన న్యాయవ్యవస్థ పని తీరుకు ఇది ప్రబల నిదర్శనం. టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న కాలంలోనే 35 ఎన్బీడబ్ల్యూలు వచ్చాయి. బుట్టదాఖలైనాయి. కానీ 37వ ఎన్బీడబ్ల్యూని రాజకీయంగా వినియోగించుకోవాలనే మెరుపులాంటి ఆలోచన చంద్రబాబుకి వచ్చినట్టుంది. తెలంగాణ కోణం నరేంద్రమోదీపైన వ్యతిరేకత సృష్టించడం ఒక్కటే లక్ష్యం కాదు. తెలంగాణ ఎన్నికలలో ఈ అంశాన్ని తురుపు ముక్కగా ఉపయోగించుకోవాలని సంకల్పం. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దింపడానికి వైస్రాయ్ హోట ల్లో జరిగిన నాటకంలో సహకరించిన శక్తులు ఇన్నేళ్ళు గడిచినా చంద్రబాబుతోనే మరింత అంకితభావంతో కొన సాగడం విశేషం. అందుకే ఆయనకు ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసి ఫలితాలు సాధించగలుగుతున్నారు. ఆయన ‘తందానా’ అంటే ‘తానతందనానా’ అంటూ దరువు వేయడానికీ, బృందగానం చేయడానికి వెరపులేని మీడియా సిద్ధంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో కార్యసా ధనకు అవసరమైన శక్తియుక్తులున్నాయి. టీడీపీలో ఆయన మాటకు ఎదురు చెప్పే చేవ ఉన్నవారు ఎవ్వరూ లేరు. నాయకుడు ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతారు. ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడతారు. తెలంగాణలో ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రబాబు మరో ప్రయత్నం చేస్తున్నారు. ‘ఓటుకు కోట్ల’ కేసు తర్వాత బతుకుజీవుడా అంటూ ఉమ్మడి రాజధాని వదిలి అమరావతికి మకాం మార్చిన బాబు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తనపైన కేసీఆర్‌ది పైచేయి అయింది. అందుకు ప్రతీకారంగా కేసీఆర్‌ని ఓడించేందుకు కాంగ్రె స్తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి కనుక ముందస్తు ఎన్నికలకు వెడుతున్న తెలంగాణలో మరోసారి కాలుమోపడానికి ప్రయత్నం చేయాలని ఆరా టపడుతున్నారు. అందుకే వారం రోజుల కిందట హైదరా బాద్‌లో టీఆర్ఎస్లోకి వలస పోగా మిగిలిన కొద్దిమంది టీడీపీ నాయకులతో సమాలోచనలు జరిపి కమిటీలు వేసి హడావిడి చేశారు. తెలంగాణ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమికి తానే సారథ్యం వహిస్తున్నట్టు కనిపిం చడం చంద్రబాబు ఉద్దేశం. పెద్దపార్టీగా చొరవ తీసుకో వాలన్న అభిలాష ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణకు బాధ్యతలు అప్పగించి చంద్ర బాబు అమరావతికి వెళ్ళిపోయారు. ఎందుకైనా పనికి వస్తుందని ఒక సైడ్షోను శివాజీ అనే నటుడితో ‘ఆపరేషన్ గరుడ’ అనే ఒకానొక ఊహాజనిత ప్రాయోజిత కార్యక్ర మాన్ని కొన్ని మాసాల కిందటే ఆరంభింపజేశారు. దాన్ని మహారాష్ట్ర కోర్టు నుంచి వచ్చిన ఎన్‌బీడబ్ల్యూకు ప్రచారం ఇవ్వడానికి వినియోగించుకున్నారు. ఈ విధంగా మేథోక్రీడ ఆడటం టీడీపీ అధినేతకు అలవాటే. అవే ఎత్తుగడలు, అవే వ్యూహాలు వైస్రాయ్ డ్రామాలో సైతం ఇదే రకమైన ఎత్తుగడలు అమలు పరిచారు. లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ నమ్మించడం ఈ క్రీడలో ్రçపధానం. ఎన్టీఆర్‌ను భార్యా విధేయుడుగా, అసమర్థుడుగా, లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా నమ్మించడానికి వినియోగించిన తంత్రాన్నే ఇప్పుడు మోదీతో తాను యుద్ధం చేస్తున్నట్టు ప్రజలు విశ్వసించే విధంగా నాటకం రక్తికట్టించేందుకు యధాశక్తి ఉపయో గిస్తున్నారు. అన్నివేళలా వ్యూహాలు ఫలించవు. 1995లో ఫలించిన వ్యూహం 2004లోనూ, 2009లోనూ పారలేదు. 2014లో ఫలించి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కడచిన నాలు గేళ్ళుగా ప్రజలు రకరకాల అనుభవాల నుంచి గుణ పాఠాలు నేర్చుకున్నారు. అందుకే ‘యాక్సిస్ మై ఇండియా’ ‘ఇండియాటుడే’ సంస్థ కోసం చేసిన సర్వేలో భావి ముఖ్య మంత్రి ఎవరనే ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బదులిస్తే 38 శాతం మంది మాత్రమే చంద్రబాబు అని చెప్పారు. శనివారంనాడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన బహిరంగ సభకు గణనీయమైన సంఖ్యలో జనం హాజరు కావడం కూడా ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నదన డానికి నిదర్శనం. రాబోయే ఎన్నికల దృష్ట్యా బాబ్లీ బరాజ్ నిర్మాణం సమయంలో టీడీపీ చేసిన ధర్నాను తిరిగి ప్రజ లకు గుర్తు చేయడం అవసరమని చంద్రబాబు భావించి ఉంటారు. గోదావరిపైన మరో ప్రాజెక్టు వస్తే ఉత్తర తెలంగాణ బీడైపోతుందన్న ఆవేదనతో ఆ నాడు తాను మహారాష్ట్ర వెళ్ళి ఆందోళన చేశానని చెప్పుకోవడానికి ఎన్బీడబ్ల్యూ ఆయనకు ఒక సందర్భాన్ని ప్రసాదించింది. ఒక వైపు ఆపరేషన్ గరుడ, మరోవైపు ఆపరేషన్ ఎన్బీడబ్ల్యూ కొనసాగిస్తూనే ఇంకోవైపు ఆపరేషన్ ఇంటెలిజెన్స్‌కు తెరలేపారు. సిబ్బందితో సహా హైదరాబాద్‌లో మకాం వేసి ఏయే నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవ కాశం ఉన్నదో పరిశీలించమని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి వెంకటేశ్వరరావుకు పురమాయించారు. టీడీపీ ఓటు బ్యాంకు 31 శాతం చెక్కు చెదరలేదంటూ మొన్న హైదరాబాద్ సందర్శన సందర్భంగా రమణ చేత ఒక ప్రకటన చేయించారు. కనీసం 50 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తాయంటూ వెంకటేశ్వరరావు చేత నివేదిక ఇప్పించుకుంటారు. ఈ రెండు అంశాలు ప్రాతి పదికగా కాంగ్రెస్‌తో సీట్ల బేరం పెడతారు. అమరుల ఆకాంక్షల ఆధారంగా ఎజెండా తయారు చేసుకొని కోదండరామ్ కూడా ఈ కూటమిలో భాగస్వామి కావ డానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లయితే టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తాయి. ఈ పరి ణామాలను కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపైన, రేవంత్‌రెడ్డిపైన కేసులు తిరగ దోడటంలోని ఆంతర్యం ‘ఓటుకు కోట్ల’ కేసు గురించి చంద్రబాబుకి సంకేతం పంపడమేనని ఒక వాదన. ‘తెలం గాణలో నువ్వు వేలు పెడితే ఆంధ్రప్రదేశ్‌లో నేను కాలు పెడతా’ అంటూ ఇప్పటికే కేసీఆర్ చంద్రబాబుని హెచ్చ రించారంటూ రాజకీయవర్గాలలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధి ష్ఠానంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ ఎక్కువ సీట్లు అడిగితే ఇవ్వకూడదనీ, కాంగ్రెస్‌కి విజయావకాశాలు ఉన్న సీట్లను వదులు కోకూడదనీ మొన్న రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో స్పష్టంగా చెప్పారు. ఒక వేళ టీడీపీ పొత్తుకు నిరాకరిస్తే కాంగ్రెస్‌కి నష్టం లేదనీ, టీఆర్ఎస్కు వెళ్ళ వలసిన నాయకులందరూ వెళ్ళిపోయారనీ, మిగిలినవారు కాంగ్రె‹ Üలో చేరి కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపైన పోటీ చేయడమే మేలు అనే అభిప్రాయంలో ఉన్నారనీ కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్‌తో చెప్పారు. తెలంగాణలో అస్తి త్వంకోసం, రెండు కళ్ళ సిద్ధాంతం కొనసాగించడంకోసం చంద్రబాబు తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంటే కూట మిలో ఉండటానికి కాంగ్రెస్‌కి అభ్యంతరం ఉండదు. జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ బిహార్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో జూనియర్ భాగ స్వామిగా సర్దుకుపోతున్నది. తెలంగాణలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎంఎల్ఏలలో ఎల్బీనగర్ శాసనసభ్యుడు కృష్ణయ్య సొంత పార్టీ పెట్టుకుంటానంటున్నారు. సత్తుపల్లి ఎంఎల్ఏ సండ్రవెంకటవీరయ్య మాత్రమే మిగిలారు. ఆయన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాబల్యంతో గెలిచారు. రక రకాల పనికిమాలిన ‘ఆపరేషన్లు’ నడిపిస్తూ అలవి కాని చోట అధికులమనడం అవివేకమని టీడీపీ అధినేత గుర్తిస్తే ఆయనకే మంచిది. -కె. రామచంద్రమూర్తి -
‘నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చేయ్’..
సాక్షి, కామారెడ్డి : బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు‘‘ నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చేయ్’’ అన్నట్లు ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బాబ్లీ ఒకటే కాకుండా చాలా ప్రాజెక్టులు కట్టారని తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో ప్రచారం వదిలి బాబు బాబ్లీ యాత్రకు వెళ్లారని అన్నారు. బాబ్లీ విషయంలో ఏం చేసినా ఏమీ కాదని బాబుకు ఆనాడు తెలుసని చెప్పారు. చంద్రబాబుపై మహారాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులకు.. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. టీడీపీవి బూటకపు మాటలని ఆయన విమర్శించారు. -
బాబ్లీ కేసులో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే
జుక్కల్ (నిజామాబాద్): మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాని కి అడ్డుపడిన కేసులో జుక్కల్ తాజా మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే ఉన్నారు. దీంతో అరెస్టు వారెం ట్ జారీ అయ్యేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2010లో నాటి ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత బాబ్లీ ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేల్లో హన్మంత్ సింధే ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటి సమస్య కావడం, ఓవైపు తెలంగాణ ఉద్య మం ఉండడం బాబ్లీ ప్రాజెక్ట్‌కు వెళ్లిన టీడీపీ బృందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలవ్వడం, ప్రస్తుతం హన్మంత్ సింధే ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. దీం తో చంద్రబాబు ఉచ్చు త న మెడకు బిగిస్తుందా అని హన్మంత్‌సింధే ఆం దోళన లో ఉన్నారు. ఎమ్మెల్యే నాన్ బెయిల్‌బుల్ వారెంట్ నోటీసులు అందితే చంద్రబాబుతో సహ హన్మంత్‌సింధే కూడా జైలుకు వెళ్లె పరిస్థితి ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బాబ్లీ కేసు తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా బయటపడుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బాబు.. 'బాబ్లీ' డ్రామా
సాక్షి, హైదరాబాద్: విచారణకు పలుమార్లు గైర్హాజరు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్లు్య)పై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా స్పందిస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఇచ్చిన ఎన్బీడబ్లు్యపై చంద్రబాబు బృందం రాజకీయాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలోనే ధర్మాబాద్ కోర్టు 2015 సెప్టెంబర్ 21న మొదటిసారి ఎన్‌బీడబ్లు్య జారీ చేసినప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు నోరు విప్పలేదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కుట్ర జరుగుతోందంటూ గగ్గోలు పెడుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి బయటకు వచ్చేంత వరకు చంద్రబాబుపై కేసు ధర్మాబాద్ కోర్టులో 35 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ దశలో విచారణకు వచ్చింది. అయితే అప్పుడు ఆ కేసు గురించి, వారెంట్ జారీ గురించి ఆయన స్పందించలేదు. ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారంటూ ఇప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు. 2013 ఆగస్టు 31న విచారణ ప్రారంభం బాబ్లీకి వ్యతిరేకంగా చంద్రబాబు, కొందరు టీడీపీ నేతలు ప్రాజెక్టు వద్ద ఆందోళన నిర్వహించడంపై మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీసులు 2010లో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, జి.కమలాకర్, సీహెచ్.ప్రభాకర్, ఎన్.నాగేశ్వర్, జి.రామ్‌నాయుడు అలియాస్ జీవీ నాయుడు, సీహెచ్ విజయరామారావు, ముజఫరుద్దీన్ అనరొద్దీన్, హన్మత్ షిండే, ఎస్.సోమోజు, ఏఎస్ రత్న సాయన్న, పి.సత్యనారాయణ, టి.ప్రకాశ్‌గౌడ్, ఎన్.ఆనందబాబులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబు ఏ 1గా ఉన్నారు. ధర్మాబాద్ పోలీసులు 2013లో చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 2013 ఆగస్టు 31న విచారణ ప్రారంభించింది. విచారణ ప్రాథమిక దశలో నిబంధనల ప్రకారం కేసులో నిందితులైన చంద్రబాబునాయుడు తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ఆదేశాలను చంద్రబాబు తదితరులు బేఖాతరు చేశారు. కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడం గానీ, హాజరు నుంచి మినహాయింపు కోరడం గానీ చేయలేదు. దీంతో నిబంధనల ప్రకారం న్యాయస్థానం చంద్రబాబు తదితరులకు తొలిసారి 2015 సెప్టెంబర్ 21న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అప్పటి నుంచి గత నెల 16వ తేదీ వరకు మొత్తం 37సార్లు ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రతిసారి ఎన్‌బీడబ్లు్య (అన్‌రెడీ) పేరుతో కేసు విచారణకు వచ్చింది. హోదా కోసం ఉద్యమించిన విపక్ష నేతలపై కేసులు... దేశంలో చంద్రబాబుకే తొలిసారిగా ఎన్‌బీడబ్లు్య జారీ అయినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసులు కేసులు నమోదు చేయడం సర్వ సాధారణం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసిన పలువురు వైఎస్సార్ సీపీ నేతలపై పోలీస్స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు రైల్‌రోకో కార్యక్రమం నిర్వహించారు. వీరిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వారంతా కోర్టు నోటీసులు అందుకున్నారు. వీరిలో నాన్ బెయిలబుల్ వారెంట్లు అందుకున్న వారు కూడా ఉన్నారు. నోటీసులు, వారెంట్లు అందుకున్న వారంతా కోర్టుకెళ్లి వారెంట్లను రీకాల్ చేయించుకున్నారు. మంత్రుల హోదాలో ఇప్పటికీ విచారణ జరుగుతున్న రైల్వే కోర్టుకు హాజరవుతున్నారు. ఇదంతా కోర్టు విచారణ ప్రక్రియలో భాగం. సానుభూతి స్కెచ్ ప్రజా వ్యతిరేకత, కాంగ్రెస్‌తో పొత్తు నుంచి దృష్టి మళ్లించే యత్నం సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు రోడ్లెక్కి చేస్తున్న విన్యాసాల వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆరాటం ప్రస్ఫుటమవుతోంది. టీడీపీ నాయకుల ధర్నాలు, ఆందోళనలు, వినూత్న హంగామాల వెనుక చంద్రబాబు రచించిన పెద్ద పథకమే దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుండడం, కాంగ్రెస్‌తో పొత్తును సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఈ అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు వారెంట్ల అంశాన్ని వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసినట్లు పేర్కొంటున్న చంద్రబాబు అదే రాష్ట్రానికి చెందిన మంత్రి సతీమణికి టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించడం గమనార్హం. బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర సర్కారుతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే తనకు వారెంట్ల వెనుక ఆ పార్టీ పెద్దల కుట్ర ఉన్నట్లు చంద్రబాబు ఆరోపించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు కోర్టు వారెంట్ ఎప్పుడో జారీ అయితే ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగించకుండా అడ్డుకునేందుకే మోడీ వీటిని ఇప్పించినట్లు టీడీపీ నేతలు ఆరోపించడాన్ని చూసి అంతా విస్తుపోతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో లబ్ధికి ఆరాటం మూడు రకాలుగా లబ్ధి పొందే వ్యూహంతో చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని, అనుకూల మీడియాను వారెంట్‌కు వ్యతిరేకంగా ఎగదోశారు. ఈ నోటీసుల్ని ప్రధాని మోడీయే ఇప్పించారనే ప్రచారం చేసుకోవడం, తనపై ఉన్న వ్యతిరేకతను బీజేపీపైకి మళ్లించి లబ్ధి పొందాలనుకోవడం బాబు మొదటి లక్ష్యం. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బాబ్లీపై వారెంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి అక్కడ పూర్తిగా చతికిలబడిన టీడీపీకి ఆశలు కల్పించడం రెండో లక్ష్యంగా ఉంది. ఇక కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు వ్యవహారంపై రెండు రాష్ట్రాల ప్రజానీకం, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో దీనిపై చర్చ జరగకుండా కప్పిపుచ్చేందుకు నోటీసుల అంశాన్ని వినియోగించుకోవడం చివరి లక్ష్యం. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం నోటీసుల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా పనిచేసే సినీనటుడి ద్వారా వ్యూహాత్మకంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ల జారీపై టీడీపీ నేతలు చేస్తున్న హంగామాపై సోషల్ మీడియాలో ఛలోక్తులు, విమర్శలు, సెటైర్లు వెల్లువలా వైరల్ అవుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే దీనిపై విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నట్లు నెటిజన్లతోపాటు అన్నివర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అవధులు దాటిన వంచన
ముప్పు ముంచుకొచ్చినప్పుడల్లా జనాన్ని పక్కదోవ పట్టించడంలో సిద్ధహస్తుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హడావుడి మొదలెట్టారు. రొటీన్‌గా న్యాయ స్థానం నుంచి అందిన వారెంట్‌ను ఆసరా చేసుకుని భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు. తన చతురంగ బలగాలను రంగంలోకి దించి కుట్ర కోణాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏలేరు కుంభకోణం మొదలుకొని నిన్న మొన్నటి ‘ఓటుకు కోట్లు’ వరకూ బడా బడా కేసుల్లో సైతం సునాయాసంగా స్టేలు తెచ్చుకోగలిగిన బాబు... ఈ పిపీలకాన్ని మాత్రం విస్మరించారని అనుకోవటం తెలివితక్కువ తనమే. దానిలోని ఆంతర్యమేమిటో ఇప్పుడు సాగుతున్న హడావుడి గమనిస్తే సులభంగానే బోధ పడుతుంది. ప్రజాసమస్యలపై ఆందోళనలు చేసేవారిపై నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న పేరిట కేసులు పెట్టడం, అరెస్టు చేయడం ప్రభుత్వాలకు రివాజు. గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు సర్కారు విపక్షాలనూ, ప్రజాసంఘాలనూ ఇలాంటి కేసులతోనే వేధిస్తోంది. ఆఖరికి ఇటీవల తన సభలో మౌనంగా ప్లకార్డులు పట్టుకున్నందుకు ఏ పార్టీకీ చెందని ముస్లిం యువకులను సైతం బాబు సర్కారు ఇలాగే అరెస్టు చేసి, అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా, శారీరకంగా హింసించింది. ఇంతకూ ఇప్పుడు బాబుకు న్యాయస్థానం నుంచి వచ్చిన నోటీసు పూర్వాపరాలేమిటి? చంద్ర బాబు, ఆయన పార్టీ నేతలు ఎనిమిదేళ్లక్రితం, అంటే 2010లో బాబ్లీ ప్రాజెక్టును నిరసిస్తూ ఆందో ళన చేసేందుకు వెళ్లినప్పుడు మహారాష్ట్ర పోలీసులు ధర్మాబాద్ వద్ద వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారు. ఆ కేసుల విచారణ ధర్మాబాద్ సివిల్ జడ్జి కోర్టులో మూడేళ్లక్రితం మొదలైంది. అప్పటి నుంచి వేర్వేరు సందర్భాల్లో 22 సార్లు ఆ కేసు విచారణకొచ్చింది. అలా విచారణ జరిగిన ప్రతిసారీ కేసులోని ముద్దాయిలందరికీ నోటీసులు వెళ్తాయి. ఆ నోటీసులకు అనుగుణంగా కోర్టు ముందు హాజరై తమ వాదన వినిపించకపోతే, విచారణకు సహకరించకపోతే నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ అవుతుంది. జంగా మహారాష్ట్రలో తాము తప్పుచేయలేదనుకున్నప్పుడు 22 సార్లు కోర్టు నుంచి వచ్చిన నోటీసులకు బాబు ఎందుకు స్పందించలేదు? వాస్తవానికి ఇలాంటి చిన్న కేసుల్లో ముద్దాయిలు వెళ్లనవసరం లేదు. తమ న్యాయవాది ద్వారా వాదన వినిపించవచ్చు. ఈ మార్గాన్ని వదిలి ఇప్పుడు నానా యాగీ చేయడంలో బాబు ఉద్దేశం సుస్పష్టమే. ఆంధ్రప్రదేశ్‌లో తన కథ ముగింపుకొచ్చిందని ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీకి ఓటమి తప్పదని దాదాపు సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. అందుకే ‘జరుగుబాటు’ సిద్ధాంతాన్ని నమ్ముకుని చివరి వరకూ అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. పొరుగునున్న తెలం గాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోంది. ‘ఓటుకు కోట్లు’ కేసులో తాను అడ్డంగా దొరికాక అక్కడ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకో వడం వల్ల వీసమెత్తు ఉపయోగం కూడా లేదని బాబుకు ఎప్పుడో తెలిసిపోయింది. ఈ ముందస్తు ఎన్నికల్లో పార్టీకి సంభవించబోయే ఓటమి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి పడిపోతామన్న భీతి ఆయన్ను వేధిస్తోంది. ఒక్క నోటీసుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లబ్ధి పొందడమే లక్ష్యంగా రెండునెలల తర్వాత ఇప్పుడు కోర్టు వారెం ట్ను బయటకు తవ్వి తీసి ‘కుట్ర’ కథకు తెరలేపారు. బాబ్లీ వ్యవహారాన్ని తెలంగాణ వాసులకు గుర్తు చేసి వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎంతో పోరాడానని చెప్పుకోవటం బాబు ఆంతర్యం. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని లక్ష లాది ఎకరాలను బీడు చేసే ప్రమాదమున్న ఆ ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు మొద లైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 2001లో తాత్కాలిక డిజైన్ తయారైంది. మరికొన్నాళ్లకు అంచనా వ్యయాన్ని సవరించారు. టెండర్లు పిలిచారు. ఆ రోజుల్లో ఎప్పుడూ బాబ్లీ ప్రాజెక్టుపై ఆయన నోరెత్తింది లేదు. ఒక్క బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మాత్రమే కాదు... మహారాష్ట్ర తలపెట్టిన ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన మౌనమే పాటించారు. కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచినప్పుడూ, కృష్ణానదిపై ఇతర ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నప్పుడూ ఆయన వైఖరి డిటోయే. అదే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశానని చెప్పుకోవడానికి ఈ వారెంట్ సాకుతో పెడబొబ్బలు పెడుతున్నారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని అనుచరగణంతో ఆరోపణలు చేయి స్తున్నారు. ఒకపక్క ‘ఆపరేషన్ గరుడ’ అంటూ ఒక నటుడితో కథ చెప్పిస్తూ, దానికి అనుగుణంగా సహచర మంత్రులతో ఇష్టానుసారం మాట్లాడిస్తున్న ప్రభుత్వాధినేతకు తనకు వ్యతిరేకంగా ఒక కోర్టు నుంచి వారెంట్ జారీ అయిందని రెండు నెలల తర్వాతగానీ తెలియలేదంటే ఎవరూ నమ్మరు. మహారాష్ట్రతో బాబుకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఆయన విపక్షంలో ఉన్నప్పుడు సైతం ఆ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి సీబీఐలో ఉండి బాబు ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని చెప్పాక కూడా మహారాష్ట్ర ఆర్థికమంత్రి సతీ మణికి బాబు టీటీడీ బోర్డు సభ్యత్వమిచ్చారు. నిజానికి బాబుపై తెలంగాణలో విచారణ ప్రారంభం కావలసిన ‘ఓటుకు కోట్లు’ కేసు ఇప్పటికీ ఫైళ్లలో పడి మూలుగుతోంది. బాబు సర్కారు వేలాది కోట్ల అవినీతికి పాల్పడుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ మొదలుకొని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు గత నాలుగున్నరేళ్లుగా ఆరోపిస్తున్నాయి. వాటిపై ఇంతవరకూ కేసులే లేవు. కానీ ఈ చిన్న వారెంట్ పట్టుకుని రెండురోజులుగా బాబు అను చరగణం, ఆయన అనుకూల మీడియా హడావుడి చేస్తున్న తీరు ఔరా అనిపిస్తుంది. ఈ మాదిరి ప్రచారాలకు కాలం చెల్లిందని వారు గ్రహించటం ఉత్తమం. -
చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
-
చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సాగునీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులకు అరెస్టు వారెంట్ జారీచేసింది. 2010లో అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన కేసులో చంద్రబాబు సహా మరో 15 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు శుక్రవారం అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వీరిలో తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఉన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వులపై కౌంటర్ దాఖలు చేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్(అవిభక్త) రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేతలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి విచారణలో ఉంది. Arrest warrant has been issued by Maharashtra's Dharmabad Court against Andhra Pradesh CM N Chandrababu Naidu, AP irrigation minister and 14 others in connection with an agitation held by TDP in 2010 against the Maharashtra govt opposing the construction of Babhali project. — ANI (@ANI) September 14, 2018 -
చంద్రబాబు కోర్టుకు వెళ్తారు : లోకేశ్
సాక్షి, హైదరాబాద్ : ప్రతీ అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తారన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు బహిర్గతమైంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు... తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన న్యాయంగా జరుగలేదని, ఈ విషయంలో తప్పంతా కాంగ్రెస్ పార్టీదేనని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అధికారం చేజిక్కించుకునేందుకు మరో జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ ఉద్యమం ఉధృతమైన వేళ.. హోదా కంటే ప్యాకేజీ ద్వారానే లాభం చేకూరుతుందంటూ చంద్రబాబు ఏపీ ప్రజలను వంచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తూండటంతో.. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్నామంటూ బాబు మరో కొత్త నాటకానికి తెరలేపారు. మరోసారి అధికారం చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో అనైతిక పొత్తుకు సిద్ధపడ్డారు. తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి తెలంగాణ ప్రజలకు తమ పార్టీ పట్ల నమ్మకం కలిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ సారి ఆ బాధ్యత చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్ బాబు తలకెత్తుకున్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ముందస్తు ఎన్నికల విషయమై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ కేసు విషయమై ధర్మాబాద్ కోర్టుకు చంద్రబాబు హాజరుకావాలంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మాబాద్ కోర్టుకు వెళ్తారు... మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. తెలంగాణ ప్రయోజనాల కోసమే.. ఈ విషయంపై స్పందించిన లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆనాడు పోరాటం చేశారని వ్యాఖ్యానించారు. ధర్మాబాద్ పోరాటంలో టీడీపీ తెగువ ప్రజలు చూశారని, ప్రజల సంక్షేమం పట్ల చంద్రబాబుకు ఎంతో నిబద్ధత ఉందన్నారు. ఆనాడు అరెస్టు చేసినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదని, అన్యాయంగా అరెస్టు చేసినందుకు బెయిలు కూడా తిరస్కరించారని తెలిపారు. ఒకవేళ నిజంగానే నోటీసులు పంపిస్తే చంద్రబాబు కోర్టుకు హాజరవుతారని పేర్కొన్నారు. దీంతో ఏ విషయాన్నైనా సరే తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ నేతలకు ఎవరూ సాటి రాలేరంటూ విమర్శలు వస్తున్నాయి. -
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
బాసర : మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం బాబ్లీ వద్ద గోదావరిలో నిల్వ ఉన్న 0.56 టీఎంసీల నీరు దిగువ గోదావరికి ప్రవహిస్తోంది. ఈ నీరు మధ్యాహ్నానికి తెలంగాణ సరిహద్దు కాండకుర్తి వద్దకు చేరుకుంటుంది. సాయంత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీరు నిల్వ రెండు టీఎంసీలకు పెరగనుంది. నేటి నుంచి 120 రోజులు పాటు (అంటే అక్టోబర్ 28 వరకూ) గేట్లు తెరచుకునే ఉంటాయి. -
బాబ్లీ నీటిపై ‘మహా’ నాటకం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచే విషయంలో మహారాష్ట్ర కొత్త నాటకానికి తెరలేపింది. రాష్ట్రానికి దక్కాల్సిన చిన్నపాటి నీటి వాటాను అడ్డుకునేందుకు ఎత్తులు వేస్తోంది. మార్చిలో తెలంగాణకు రావాల్సిన 0.6 టీఎంసీ ల నీటిని విడుదల చేయలేమంటూ రాష్ట్రానికి లేఖ రాసింది. ఎగువన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ నిల్వలు ఉన్నందున బాబ్లీ నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన నీటిని విడుదల చేయాల్సిందేనంటూ రాష్ట్రం తెలిపింది. సుప్రీం చెప్పినా కూడా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై నాలుగేళ్ల కింద సుప్రీం తీర్పు వెలువరించింది. దీని ప్రకారం ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. మార్చి 1న గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదలాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు అక్టోబర్ 29న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తింది. మళ్లీ మార్చి 1న వాటిని తెరవాల్సి ఉంది. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో కేవలం 0.048 టీఎంసీల మేర మాత్రనే నీరుందని మహారాష్ట్ర అంటోంది. దీంతో నీటి విడుదల సాధ్యం కాదని నాందేడ్ చీఫ్ ఇంజనీర్ ఎస్సారెస్పీ అధికారులకు లేఖ రాశారు. మహారాష్ట్రలో బాబ్లీ ఎగువన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 102.73 టీఎంసీలకు గానూ 77.77 టీఎంసీల నిల్వలున్నాయి. గైక్వాడ్ దిగువన విష్ణుపురి ప్రాజెక్టులోనూ 2.7 టీఎంసీల సామర్థ్యానికి గాను 2 టీఎంసీల నిల్వలున్నాయి. ఎస్సారెస్పీలో 26 టీఎంసీలే.. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90.313 టీఎంసీల సామర్థ్యా నికి గాను 26.98 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో డెడ్‌స్టోరేజీని పక్కనబెడితే లభ్యత జలాలు 10 టీఎంసీలకు మించి ఉండవు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందేనంటూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులు నాందేడ్ చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాశారు. దీనిపై మహారాష్ట్ర ఎలాంటి నిర్ణయం చేస్తుందో వేచి చూడాలి. -
బాబ్లీ గేట్లు ఎత్తివేత
నాందేడ్: మహారాష్ట్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు కలిసి ఈ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరిచారు. నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లు తెరవడంతో నీరు కిందకు వస్తోంది. కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాల మేరకు అధికారులు శనివారం గేట్లు ఎత్తారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. త్వరలోనే గోదావరి నీరు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి చేరనుందని అధికారులు తెలిపారు. -
తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు
1న గేట్లు ఎత్తనున్న మహారాష్ట్ర సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించి న వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జూలై 1న తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదే శాల మేరకు గేట్లు మూసిఉంచేందుకు విధిం చిన గడువు ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో అదేరోజు అర్ధరాత్రి 12 గంటలు దాటాక మహారాష్ట్ర నీటిని విడుదల చేయ నుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏటా జూలై ఒకటిన ప్రాజెక్టు గేట్లు తెరిచి, అక్టోబర్ 28 వరకు నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా మహారాష్ట్ర చూడాలి. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు అక్టోబర్ 29న 14 గేట్లు మూసేసిన మహారాష్ట్ర వచ్చేనెల 1న తిరిగి తెరవనుంది. 9.68 లక్షల ఎకరాలకు సాగు నీరు... గతేడాది గోదావరి బేసిన్లో కురిసిన వర్షాల వల్ల ఎస్సారెస్పీలోకి భారీ ప్రవాహాలొచ్చా యి. దీంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరి.. దీని కింద రబీలో 8.78లక్షల ఎకరాల కు సాగునీరందించారు. ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తిస్థాయి ఆయకట్టు 9.68లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బాబ్లీని దాటుకొని వచ్చే ప్రవాహాలే ప్రధానం. ప్రస్తుతం మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో బాబ్లీ గేట్లు తెరుచుకుంటే దిగువకు ప్రవాహాలు పెరిగే అవకాశాలు ఉంటాయని నీటిపారు దల శాఖ అంచనా వేస్తోంది. -
‘బాబ్లీ’ దెబ్బ
ఎస్సారెస్పీలో నాలుగు రోజుల్లో మూడు టీఎంసీల నీరు త గ్గుదల ఎగువ నుంచి పూర్తిగా నిలిచిన వరద నీరు కాల్వల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ ప్రభావం అప్పుడే కనపడుతోంది. బాబ్లీ గేట్లు మూసిన మరునాటి నుంచే నీటిమట్టం తగ్గుతోంది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు గత నెల 29న అధికారులు మూసి వేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత వారబందీ గత నెల 24 నుంచి కొనసాగుతుంది. కానీ ప్రాజెక్ట్‌లో గతనెల 29 వరకు చుక్క నీరు తగ్గుముఖం పట్టలేదు. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగినప్పటికీ నీరు తగ్గలేదు. కానీ బాబ్లీ గేట్లు మూసిన రెండు రోజుల నుంచి క్రమంగా ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. గేట్లు మూసినప్పటి నుంచి ప్రాజెక్ట్‌లో 0.70 అడుగుల నీటి మట్టం తగ్గింది. గేట్ల మూసివేతకు ముందే అంతేస్థాయిలో ప్రాజెక్ట్ నుంచి కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగినా ప్రాజెక్టు నీటిమట్టం తగ్గలేదు. కారణమేమిటంటే ఎగువ ప్రాంతాల నుంచి కాల్వల ద్వారా ఎంత నీటి విడుదల జరిగిందో అంత స్థాయిలో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. బాబ్లీ గేట్లు మూసి వేయడంతో ప్రాజెక్ట్‌లోకి చుక్క నీరు రాకుండా అడ్డుగా మారింది. అలాగే నికర జలాలను కూడా తోడుకునే విధంగా బాబ్లీ ప్రాజెక్టు ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం 6,217 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో 3 టీఎంసీల నీరు తగ్గిపోయింది. ప్రాజెక్టు ఔట్‌ఫ్లోకు తగ్గిన నీటిమట్టం సమానంగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. కాని గేట్లు మూసివేయక ముందు నీటి మట్టం తగ్గకపోవడానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరే కారణం. ప్రస్తుతం గేట్లు మూసివేయడం ఆ నీటికి అడ్డుకట్ట పడింది. 24 నుంచి 29 వరకు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత వారబందీ అక్టోబర్ 24న ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది. కానీ ఆ 5 రోజులు ప్రాజెక్ట్ నీటిమట్టం ఒక చుక్క నీరు తగ్గ లేదు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులతో నిండుకుండలా ఉంది. కానీ బాబ్లీ గేట్లు మూసినప్పటి నుంచి ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగుల చొప్పున తగ్గుతూ వచ్చింది. 30 నుంచి ప్రాజెక్ట్ నీటి మ ట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్‌లో 3 టీఎంసీల నీరు ఇప్పుడే తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 87 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు చెబతున్నారు. -
బాబ్లీ గేట్లు బంద్..
బాల్కొండ: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను శనివారం మూసివేశారు. దీంతో ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి బ్రేకులు పడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉండాలి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక్కో గేటును క్రమంగా దించుతూ మొత్తం 14 గేట్లను మూసివేశారు. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం, దించడం త్రిసభ్య సమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరగాలన్న కోర్టు ఆదేశాల మేరకు.. ఎస్సారెస్పీ ఎస్ఈ సత్యనారాయణ, నాందేడ్ ఈఈ లవరాలే, సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్ సమక్షంలో గేట్లను మూసివేశారు. దీంతో, వచ్చే జూలై 1 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి కానీ, ఎగువ ప్రాంతాల నుంచి కాని ఎస్సారెస్పీలోకి చుక్క నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. -
ముందుగానే మూసేద్దాం...
► బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేతపై మహారాష్ట్ర ప్రతిపాదన ► తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువు 29న మూసుకోనున్న గేట్లు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గే ట్లు మూసివేతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తొందర పడుతోంది. ఎగువన విస్తారంగా కురిసిన వర్షాలతో నీరంతా ఎస్సారెస్పీకి చేరుతున్న నేపథ్యంలో గడువుకు ముం దే గేట్లు మూసివేస్తామని రాష్ట్రానికి ప్రతిపాదించింది. కానీ దీనిపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువునే గేట్లు మూయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు రెండున్నరేళ్ల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఏటా జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా తెరిచి ఉంచి నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను సుప్రీం ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచవచ్చని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 1న తెరిచిన గేట్లను అక్టోబర్ 29న మూసేయాల్సి ఉంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్ర నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దాంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది కూడా. అయితే ఆ వరదల సందర్భంగానే మహారాష్ట్ర బాబ్లీ గేట్లను మూసివేసే ప్రతిపాదన తెచ్చింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. భారీగా వస్తున్న ప్రవాహాలకు అడ్డుకట్టవేయవద్దని స్పష్టం చేసింది. దాంతో మిన్నకుండిపోయిన మహారాష్ట్ర.. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండడం, నీరు సముద్రంలోకి వెళుతున్న నేపథ్యంలో మళ్లీ బాబ్లీ గేట్ల మూసివేతను తెరపైకి తెచ్చింది. వచ్చిన నీరు వచ్చినట్లుగా మళ్లింపు తాజాగా మహారాష్ట్ర చేసిన ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌కు కేవలం 25-30వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు మాత్రమే వస్తున్నాయి. ఇదే స్థాయిలో నీటిని కాకతీయ, లక్ష్మి కాలువల ద్వారా సాగు అవ సరాలకు వదులుతున్నారు. దీనికితోడు ఎస్సారెస్పీ, వరద కాలువల ప్రాజెక్టు కింద కలిపి మొత్తంగా 920 చెరువులుండగా.. అందులో 823 చెరువులను నింపారు. మిగతా చెరువులను నింపాల్సి ఉంది. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలను చెరువులు నింపేందుకు, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబ్లీ గేట్లు మూసివేస్తే వస్తున్న ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశముంది. దీంతో గేట్లు మూయాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రాష్ట్ర అవసరాలకు మళ్లించి, గేట్లు మూసే సమయంలోగా వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకోవాలని భావిస్తోంది. -
తెరుచుకున్న బాబ్లీ గేట్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను కేంద్ర జలవనరుల సంఘం సభ్యుల సమక్షంలో శుక్రవారం ఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 28న మూసి వేయాలి. త్రిసభ్య కమిటీ సభ్యులైన ఎస్సారెస్పీ ఈఈ రామారావు, మహారాష్ట్ర ఈఈ లవరాలే, సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో ఈ గేట్లను ఎత్తారు. దీంతో గోదావరిలో 6 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, స్థానికంగా కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లోకి స్వల్ప వరద నీరు వచ్చి చేర డంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. - రెంజల్/బాల్కొండ