Badmintan Tourney
-
నేను ఒత్తిడిలో తప్పులు చేశాను.. అతడు మాత్రం అద్భుతం: లక్ష్యసేన్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. పురుషుల బ్యాడ్మంటన్ సింగిల్స్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్.. కాంస్య పతక మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. సోమవారం జరిగిన కాంస్య పతక పోరులో 21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. దీంతో 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టడం ఇదే తొలి సారి. 2012 లండన్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం లక్ష్యసేన్ స్పందించాడు."ఏం తప్పు జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాను. నేను మ్యాచ్‌ను బాగా మొదలు పెట్టినా దానిని కొనసాగించలేకపోయాను. ఫలితంతో చాలా నిరాశ చెందాను. గత మ్యాచ్, ఈ మ్యాచ్‌లను ఎలా పోల్చాలో కూడా అర్థం కావడం లేదు. రెండూ కీలక మ్యాచ్‌లే. కానీ రెండూ ఓడిపోయాను.కీలక దశలో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను చాలా తప్పులు చేశాను. నా ప్రత్యర్థి రెండో గేమ్ నుంచి అద్భుతంగా పుంజుకున్నాడు. కుడి చేతికి గాయంతో కొంత రక్తం రావడంతో మధ్యలో ఆటను ఆపి చికిత్స చేయించుకోవాల్సి వచి్చంది. అయితే మ్యాచ్ ఫలితానికి దీనికి సంబంధం లేదని లక్ష్యసేన్ పేర్కొన్నాడు. -
చైనా ‘డబుల్’ ధమాకా... థామస్ కప్, ఉబెర్ కప్ టైటిల్స్ సొంతం..
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాయి. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్ కప్‌ను 16వ సారి... చైనా పురుషుల జట్టు థామస్ కప్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాయి.ఇండోనేసియాతో జరిగిన ఉబెర్ కప్ టైటిల్ పోరులో చైనా 3–0తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో చెన్ యు ఫె 21–7, 21–16తో మరిస్కాపై... రెండో మ్యాచ్‌లో చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ 21–11, 21–8తో సితి ఫాదియా–రిబ్కా సుగియార్తోలపై... మూడో మ్యాచ్‌లో హి బింగ్ జియావో 10–21, 21–15, 21–17తో ఎస్తెర్పై గెలిచారు. థామస్ కప్ ఫైనల్లో చైనా 3–1తో ఇండోనేసియాను ఓడించింది.తొలి మ్యాచ్‌లో షి యు కి 21–17, 21–6 తో జిన్టింగ్పై, రెండో మ్యాచ్‌లో లియాంగ్ –వాంగ్ చాంగ్ 21–18, 17–21, 21–17తో ఫజర్–అర్దియాంతోలపై నెగ్గడంతో చైనా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–16, 15–21, 21–17తో లీ షి ఫెంగ్‌ను ఓడించాడు. నాలుగో మ్యాచ్‌లో హి జి టింగ్–జియాంగ్ 21–11, 21–15తో ఫిక్రి–మౌలానాలపై నెగ్గి చైనాకు 3–1తో టైటిల్‌ను ఖరారు చేశారు.ఇవి చదవండి: స్టార్ రెజ్లర్ బజరంగ్ పై.. తాత్కాలిక నిషేధం! -
క్వార్టర్ ఫైనల్లో భారత్..
చెంగ్డూ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘సి’లో సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21–15, 21–15తో హ్యారీ హంగ్‌పై గెలిచి భారత్‌కు 1–0తో శుభారంభం ఇచ్చాడు.రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–17, 19–21, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ జంటపై గెలిచి ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–16, 21–11తో నదీమ్ డాలి్వపై నెగ్గడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్‌లో అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–17, 21–19తో రోరీ ఈస్టన్–అలెక్స్ గ్రీన్ ద్వయంపై గెలిచింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో కిరణ్ జార్జ్ 21–18, 21–12తో చోలన్ కేయాన్‌ను ఓడించడంతో భారత్ 5–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గ్రూప్ తొలి మ్యాచ్‌లో భారత్ 4–1తో థాయ్‌లాండ్‌పై గెలుపొందింది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది.ఇవి చదవండి: కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ -
ధ్రువ్–తనీషా జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
కటక్: ఒడిశా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం విజేతగా నిలువగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ చాంపియన్ అయ్యాడు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ధ్రువ్–తనీషా జోడీ 74 నిమిషాల్లో17–21, 21–19, 23–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–తాన్ వె హాన్ జెస్సికా (సింగపూర్) జంటను ఓడించింది. ధ్రువ్–తనీషా జోడీకి 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సతీశ్ 21–18, 19–21, 21–14తో ఆయుశ్ శెట్టి (భారత్)పై గెలిచాడు. సతీశ్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 14–21, 17–21తో మెలీసా–రాచెల్ రోజ్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ (భారత్) జంట 20–22, 18–21, 17–21తో లిన్ బింగ్ వె–సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
కెనడా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్య సేన్
కెనడా ఓపెన్ టైటిల్ విజేతగా భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన లిషి ఫెంగ్‌పై 21-18, 22-20 తేడాతో వరుస గేమ్‌లలో లక్ష్య సేన్ విజయం సాధించాడు. ఇది అతడికి రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న లక్ష్య సేన్ టైటిల్ పోరులో కూడా చెలరేగి పోయాడు. వరల్డ్ రాంకింగ్స్ లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న చైనా ప్లేయర్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. రెండో గేమ్ లో ప్రత్యర్ధి కాస్త పోటీ ఇచ్చిన కీలక సమయంలో ఆధిక్యం నిలుపుకుని టైటిల్ గెలుచుకున్నాడు. ఇక మరో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. చదవండి: సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి -
CWG 2022: సింధు సాధించింది.. స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సత్తా చాటి పసిడి పతకం గెలిచి మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా బర్మింగ్‌హామ్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్లీ లీని సింధు మట్టికరిపించింది. ఆది నుంచి ఆధిపత్యం కనబరుస్తూ (21-15, 21-13) ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయింది. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ వరుస సెట్లలో పైచేయి సాధించి విజేతగా నిలిచింది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం, 2018లో రజత పతకాలను సింధు గెలిచింది. 2018లో సింధు ఫైనల్ చేరినా.. తుదిపోరులో మరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: CWG 2022 Womens Doubles Badminton: కాంస్యం నెగ్గిన గోపిచంద్ తనయ -
CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. ‘పసిడి’కి అడుగు దూరంలో..
CWG 2022- PV Sindhu Enters Final: కామన్వెల్త్ గేమ్స్-2022లో బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సెమీస్‌లో సింగపూర్ షట్లర్ ఇయో జియా మిన్ను ఓడించి ఫైనల్ చేరింది. కాగా క్వార్టర్ ఫైనల్లో సింధు మలేషియా షట్లర్ గో వె జిన్ను 19-21, 21-14, 21-18తో ఓడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు జియాతో సెమీస్‌లో పోటీపడింది. గాయం వేధిస్తున్నా.. హోరాహోరీగా సాగిన పోరులో సింధు ఆఖరికి పైచేయి సాధించింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా తన అనుభవంతో ఒత్తిడిని జయించి పీవీ సింధు 21-19, 21-17తో గెలుపు నమోదు చేసింది. తద్వారా ఈ భారత షట్లర్ కామన్వెల్త్ గేమ్స్-2022 ఫైనల్లో ప్రవేశించింది. కాగా సింధు ఈ ఫీట్ నమోదు చేయడం వరుసగా ఇది రెండోసారి. అంతేకాదు.. తాజా ప్రదర్శనతో ఆమె ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా మూడో పతకాన్ని ఖాయం చేసుకుంది. కాగా 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2014లో కాంస్య పతకం అందుకుంది. ఇక ఇప్పుడు స్వర్ణ పతకానికి గురిపెట్టింది పూసర్ల వెంకట సింధు. ఈ క్రమంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ వేదికగా సింధును అభినందించాడు. భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారంటూ పీవీ సింధుతో పాటు కాంస్యం గెలిచిన జట్టులో భాగమైన హాకీ ప్లేయర్ సవితా పునియా, స్వర్ణం గెలిచిన బాక్సర్ నీతూ ఘంగస్ను కొనియాడాడు. ఈ మేరకు భారత మహిళా అథ్లెట్లు దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని ప్రశంసించాడు. చదవండి: Rohit Sharma: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. 5 క్లీన్‌స్వీప్‌లు.. నువ్వు తోపు కెప్టెన్! CWG 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు! PV Sindhu, Savita Punia, Nitu Ghanghas..Across sports, so many stars. India's women athletes are doing us proud. — Harsha Bhogle (@bhogleharsha) August 7, 2022 -
Malaysia Open Badminton: తాడో పేడో తేల్చుకోనున్న సాయిప్రణీత్
కౌలాలంపూర్: కొంతకాలంగా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న భారత అగ్రశ్రేణి షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టోర్నీకి సిద్ధమయ్యాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఈ హైదరాబాద్ ప్లేయర్‌కు ఈ ఏడాదీ కలసి రావడంలేదు. ఈ సంవత్సరం ఆరు టోర్నీలలో బరిలోకి దిగిన సాయిప్రణీత్ ఐదు టోర్నీలలో తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... మరో టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. నేడు మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలో 30 ఏళ్ల సాయిప్రణీత్‌కు తొలి రౌండ్లోనే క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రపంచ 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ తలపడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ మలేసియా ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలో ఉన్నారు. చదవండి: Wimbledon: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. జకోవిచ్ శుభారంభం.. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ప్రణయ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సైనా నెహ్వాల్, అష్మిత, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకాంత్ 18–21, 21–10, 21–16తో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. సౌరభ్ వర్మ 20–22, 12–21తో తోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సాయిప్రణీత్ 12–21, 13–21తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్) చేతిలో, ప్రణయ్ 17–21, 21–15, 15–21తో డారెన్ లూ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–19, 18– 21, 21–18తో లారెన్ లామ్ (అమెరికా)పై... మాళవిక 17–21, 21–15, 21–11తో ఉలితినా (ఉక్రెయిన్) పై నెగ్గగా.. సైనా 21–11, 15–21, 17–21తో కిమ్ గా ఉన్ (కొరియా) చేతిలో, ఆకర్షి 13–21, 18–21 తో మిచెల్లి (కెనడా) చేతిలో, అష్మిత 10–21, 15– 21తో రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు. -
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21–10, 21–19తో ఐదో సీడ్ మిచెల్లి లీ (కెనడా)పై విజయం సాధించింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించగా... రెండో గేమ్‌లో ఆమెకు గట్టిపోటీ లభించింది. కీలకదశలో సింధు పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. ప్రణయ్ ముందంజ... పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–16తో భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌ను ఓడించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 17–21, 14–21తో ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 20–22, 21–23తో వివియన్ హూ–లిమ్ చియు సియెన్ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. చదవండి: IPL 2022:క్రికెట్ పండగొచ్చింది.. కోల్‌కతా, చెన్నై సమరానికి సిద్దం -
బ్యాంకాక్‌కు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –1000 బ్యాడ్మింటన్ టోర్నీలలో పాల్గొనేందుకు భారత బృందం బ్యాంకాక్ పయనమైంది. ఈనెల 12–17 వరకు యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీతో పాటు... 19 నుంచి 24 వరకు జరిగే టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు భారత్ నుంచి స్టార్ షట్లర్లు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్ బయలుదేరారు. వీరి వెంట డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, సింగిల్స్ ఆటగాళ్లు ప్రణయ్, కశ్యప్, సమీర్ వర్మ, ధ్రువ్ కపిల, మనూ అత్రి కూడా వెళ్లారు. లక్ష్యసేన్ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్నాడు. లండన్ నుంచి సింధు గత అక్టోబర్ నుంచి లండన్‌లోనే ఉంటూ అక్కడే ప్రాక్టీస్ చేసిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరనుంది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు సింధుతో కలిసి తీసుకున్న ఫోటోను ఇంగ్లండ్ డబుల్స్ ఆటగాళ్లు బెన్ లేన్, సీన్ వెండీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంగ్లండ్ ఆటగాళ్లతో సింధు -
రన్నరప్ సాత్విక్–చిరాగ్ జంట
పారిస్: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జోడీలను బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తుది మెట్టుపై పోరాడి ఓడింది. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట రన్నరప్‌గా నిలిచింది. కెరీర్లో తొలిసారి వరల్డ్ టూర్–750 స్థాయి టోర్నీ ఫైనల్ ఆడిన భారత జంట 18–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీ మార్కస్ ఫెర్నాల్డి గిడియోన్–కెవిన్ సంజయ సుకముల్జో (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. సాత్విక్–చిరాగ్ జంటకు 26,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 55 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 121 వారాల నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న గిడియోన్–కెవిన్ జోడీ చేతిలో సాత్విక్–చిరాగ్‌లకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్–చిరాగ్‌లు ఈసారి ఫైనల్లో ఒత్తిడికి లోనయ్యారు. రెండు గేముల్లోనూ భారత జంట ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడింది. తొలి గేమ్‌లో 17–17తో స్కోరును కూడా సమం చేసింది. కానీ కీలకదశలో అనుభవజ్ఞులైన ఇండోనేసియా జంట పైచేయి సాధించింది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా సాగింది. మూడుసార్లు 6–6, 8–8, 11–11తో స్కోరు సమమైంది. ఈ గేమ్‌లోనూ కీలకదశలో ఇండోనేసియా జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని అందుకుంది. ఒకవేళ సాత్విక్–చిరాగ్ గెలిచుంటే 1983లో పార్థో గంగూలీ–విక్రమ్ సింగ్ బిష్త్ తర్వాత ఈ టైటిల్ నెగ్గిన భారత జంటగా గుర్తింపు పొందేది. గతంలో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2017), మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2012) విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో సాత్విక్–చిరాగ్ జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్స్ మొహమ్మద్ హసన్–సెతియావాన్ (ఇండోనేసియా)లను, క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్స్ కిమ్ అస్ట్రప్–ఆండెర్స్ రస్‌ముసేన్ (డెన్మార్క్)లను, సెమీఫైనల్లో ఆరో ర్యాంకర్స్ హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్)లను ఓడించింది. ఫైనల్లో మేము రెండు గేమ్‌లనూ నెమ్మదిగా ప్రారంభించాం. ఆరంభంలోనే ఆధిక్యాన్ని సమర్పించుకున్నాం. ఆ తర్వాత కోలుకొని స్కోరును సమం చేసినా కీలకదశలో తప్పిదాలు చేశాం. ఈ టోర్నీలో మా ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నాం. మా కెరీర్లో ఇది రెండో గొప్ప ప్రదర్శనగా చెబుతాం. థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ మా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. –సాత్విక్, చిరాగ్ శెట్టి -
ఫైనల్లో ఓటమి.. అరుదైన చాన్స్ మిస్
పారిస్ (ఫ్రాన్స్): ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడి సాత్విక్-చిరాగ్ జోడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడి 18-21,16-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా) ద్వయంపై ఓటమి పాలైంది. రెండు గేమ్‌ల్లో సాత్విక్-చిరాగ్‌లు పోరాడినప్పటికీ టైటిల్‌ను సాధించలేకపోయారు. టాప్ సీడ్ చేతిలో సాత్విక్-చిరాగ్‌లు ఓటమి పాలై రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. కేవలం 35 నిమిషాలు పాటు జరిగిన తుది పోరులో గిడియోన్-సుకముల్జోలు ఆకట్టుకున్నారు. భారత్ జోడికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా 11 ఫైనల్లో సాత్విక్-చిరాగ్‌లు 3వ ఓటమి. ఇక ఇండోనేసియా జోడి సుకుముల్జో-గిడియోన్ చేతిలో సాత్విక్-చిరాగ్‌లకు 7వ పరాజయం. ఈ టైటిల్ గెలిస్తే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రెండో భారత డబుల్స్ జోడిగా సాత్విక్-చిరాగ్‌లు అరుదైన ఘనతను సాధించేవారు. కాకపోతే ఓటమి పాలు కావడంతో పార్తో గంగూలీ-విక్రమ్ సింగ్‌ల సరసన నిలిచే అవకాశాన్ని కోల్పోయారు. 1983లో పార్తో గంగూలీ-విక్రమ్ సింగ్‌లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి భారత జోడి. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ జంటను...క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్ జోడీని బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం.. సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. ఐదో సీడ్ హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది. -
డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట
పారిస్ (ఫ్రాన్స్): ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ జంటను...క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్ జోడీని బోల్తా కొట్టించిన భారత యువ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోనూ గొప్ప విజయం సాధించారు. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–11, 25–23తో ఐదో సీడ్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న హిరోయుకి ఎండో–యుటా వతనాబె (జపాన్) జంటను ఓడించి ఫైనల్‌కు చేరింది. గతంలో ఈ జపాన్ జోడీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సాత్విక్–చిరాగ్ మూడో ప్రయత్నంలో మాత్రం గెలుపు రుచి చూశారు. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–6తో వెనుకబడి ఉంది. షెడ్యూల్ ప్రకారం పురుషుల డబుల్స్ ఫైనల్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత జరిగే అవకాశముంది. మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వరుసగా 11 పాయింట్లు గెలిచి... పురుషుల సింగిల్స్ విభాగంలో ఇండోనేసియా ప్లేయర్ జొనాథన్ క్రిస్టీ అత్యద్భుత విజయం సాధించాడు. ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో 7–21, 22–20, 21–19తో గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణాయక చివరి గేమ్‌లో ఒకదశలో క్రిస్టీ 10–19తో వెనుకంజలో నిలిచి ఓటమి అంచుల్లో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా విజృంభించిన క్రిస్టీ వరుసగా 11 పాయింట్లు సాధించి చివరి గేమ్‌ను 21–19తో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. -
క్వార్టర్స్‌లో సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో ఐదో సీడ్ శుభాంకర్ డే, ఏడో సీడ్ సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ క్వార్టర్స్‌కు చేరుకోగా... మహిళల సింగిల్స్ కేటగిరీలో ఆకర్షి కశ్యప్, చుక్కా సాయి ఉత్తేజితరావు పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శుభాంకర్ డే 21–16, 21–15తో చికో అరా వార్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందగా... సౌరభ్ వర్మ 21–16, 21–11తో సన్ పెయ్ జియాంగ్ (చైనా)ను, అజయ్ జయరామ్ 21–18, 21–13తో జియా వీ తాన్ (మలేసియా)ను ఓడించారు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ పారుపల్లి కశ్యప్ 21–17, 15–21, 19–21తో లోహ్ కియాన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత రావు 10–21, 21–9, 8–21తో క్వాలిఫయర్ బెన్యప ఎమ్‌సార్డ్ (థాయ్‌లాండ్) చేతిలో, క్వాలిఫయర్ ఆకర్షి కశ్యప్ 18–21, 13–21తో రెండో సీడ్ అన్ సు యంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. -
వైదొలిగిన సింధు
బ్యాంకాక్: ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత నంబర్‌వన్ మహిళా షట్లర్ పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. రెండు వారాల క్రితం ఇండోనేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ఈ రెండు టోర్నీల్లోనూ జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి చేతిలో సింధు ఓడిపోయింది. సింధు గైర్హాజరీలో... మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత ఆశలన్నీ ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌పై ఆధారపడ్డాయి. ఈ ఏడాది ఆరంభంంలో ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన సైనా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్లకు ఎంట్రీలు పంపించి... ఆ తర్వాత వైదొలిగింది. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ సాధించడంతో ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా ఆడుతుంది. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు కెనడా ప్లేయర్ బ్రిట్నీ టామ్‌తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, శుభాంకర్ డే బరిలో ఉన్నారు. -
సైనా సాధించేనా?
ఆక్లాండ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ న్యూజిలాండ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతవారం ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి ఈ సీజన్లో మరో టైటిలే లక్ష్యంగా ఆమె బరిలో దిగుతోంది. తొలి రోజు మంగళవారం కేవలం క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. సింగిల్స్ తొలి రౌండ్లో వాంగ్ జియి (చైనా)తో సైనా ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారమైతే సైనా తన స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్ చేరుకునే అవకాశముంది. మరో పార్శ్వంలో టాప్ సీడ్, ఆసియా చాంపియన్ అకానె యామగుచి (జపాన్) తుది పోరుకు చేరుకునే చాన్స్ ఉంది. ఈ ఏడాది భారత్ నుంచి సైనా నెహ్వాల్ మాత్రమే అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. ఆమె ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో అజయ్ జయరామ్, లక్ష్య సేన్, పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. మెయిన్ ‘డ్రా’లో హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్, శుభాంకర్ డేలకు చోటు లభించింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జోడీ... మహిళల డబుల్స్‌లో నేలకుర్తి సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంటలు పోటీపడనున్నాయి. -
క్వార్టర్స్‌లో సైనా, ఉత్తేజిత
లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సైనాతోపాటు తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రితూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–14, 21–9తో భారత్‌కే చెందిన అమోలిక సింగ్ సిసోడియాను అలవోకగా ఓడించింది. సాయి ఉత్తేజిత 21–12, 21–15తో రేష్మా కార్తీక్ (భారత్)పై, రితూపర్ణ దాస్ 21–11, 21–15తో శ్రుతి ముందాడ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 16–21, 18–21తో రుసెలి హర్తావాన్ (ఇండోనేసియా) చేతిలో... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మామిళ్లపల్లి తనిష్క్ 10–21, 9–21తో హాన్ వైయువె (చైనా) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సాయి ఉత్తేజిత; రితూపర్ణ దాస్‌తో సైనా తలపడతారు. సమీర్ వర్మ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాబోయే భర్త పారుపల్లి కశ్యప్‌తోపాటు సాయిప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా... గురుసాయిదత్ ఇంటిదారి పట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కశ్యప్ 9–21, 22–20, 21–8తో ఫిర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలుపొందగా... సమీర్ వర్మ 22–20, 21–17తో జున్‌పెంగ్ జావో (చైనా)పై... సాయిప్రణీత్ 21–12, 21–10తో రుస్తావిటో (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఒకవేళ ఈ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిస్తే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు. సిక్కి–అశ్విని జంట జోరు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–13తో ప్రీతి–ప్రియ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 21–10తో శివమ్ శర్మ–హేమనాగేంద్ర బాబు (భారత్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–దండు పూజ (భారత్); సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. -
క్వార్టర్స్‌లో అజయ్ జయరామ్
తైపీ సిటీ: చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ తరఫున అజయ్ జయరామ్ ఒక్కడే నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో అతను క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఆట ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. భారత స్టార్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో మిగతా యువ షట్లర్లంతా తొలిరౌండ్లోనే కంగుతిన్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అజయ్ 21–10, 22–20తో డెన్మార్క్‌కు చెందిన కిమ్ బ్రూన్‌ను వరుస గేముల్లో ఓడించాడు. 30 ఏళ్ల భారత ఆటగాడు... క్వార్టర్స్‌లో లీ జి జియా (మలేసియా)తో తలపడతాడు. సౌరభ్ వర్మ 21–19, 21–23, 16–21తో జపాన్‌కు చెందిన రిచి తకషిత చేతిలో పరాజయం చవిచూశాడు. -
సిక్కి జంట శుభారంభం
అంచనాలకు అనుగుణంగా రాణించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళల డబుల్స్‌లో సంయోగిత–ప్రజక్తా సావంత్ జంట మినహా తొలి రోజు బరిలోకి దిగిన వారందరూ విజయం రుచి చూడటం విశేషం. భారత నంబర్‌వన్ మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా... పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ, ప్రణయ్ అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్ మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్ (vs) దెమిర్బాగ్ (టర్కీ) పురుషుల సింగిల్స్: శ్రీకాంత్ (vs) ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) మహిళల డబుల్స్: కుహూ గార్గ్, నింగ్షీ హజారికా (vs) చాంగ్ చింగ్ హుయ్, యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ); మేఘన, పూర్వీషా (vs) దెబోరా జిలి, ఇమ్కె వాన్ డెర్ (నెదర్లాండ్స్); సిక్కి, అశ్విని (vs) చియాంగ్ కై సిన్, హుంగ్ షి హాన్ (చైనీస్ తైపీ) పురుషుల డబుల్స్: సాత్విక్, చిరాగ్ శెట్టి (vs) మార్కస్ ఇలిస్, క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్); కోన తరుణ్, సౌరభ్ శర్మ (vs) ఆర్ చిన్ చుంగ్, టాంగ్ చున్ మాన్ (హాంకాంగ్); అర్జున్, శ్లోక్ (vs) ఓంగ్ యు సిన్, తియో ఎ యి (మలేసియా) మిక్స్డ్ డబుల్స్: సిక్కి, ప్రణవ్ (vs) హఫీజ్, గ్లోరియా (ఇండోనేసియా); సౌరభ్ శర్మ, అనుష్క (vs) చాన్ పెంగ్ సూన్, (vs) లియు యింగ్ (మలేసియా); సాత్విక్, అశ్విని (vs) లామ్స్‌ఫస్, ఇసాబెల్ (జర్మనీ); రోహన్, కుహూ (vs) క్రిస్, గాబ్రియేలా (ఇంగ్లండ్) ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
53ఏళ్ల తర్వాత స్వర్ణపతకం సాధించిన లక్ష్య సేన్
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార లక్ష్య సేన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. 53 ఏళ్ల విరామం తర్వాత పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచిన షట్లర్‌గా గుర్తింపు పొందాడు. జకార్తాలో ఆదివారం జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ వరుస గేముల్లో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. జకార్తా (ఇండోనేసియా): ఆద్యంతం తన సంచలన ప్రదర్శన కొనసాగించిన భారత బ్యాడ్మింటన్ యువస్టార్ లక్ష్య సేన్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్లో విజేతగా అవతరించాడు. ఆదివారం అండర్–19 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ లక్ష్య సేన్ 21–19, 21–18తో టాప్ సీడ్, ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. టైటిల్ గెలిచే క్రమంలో లక్ష్య సేన్ నలుగురు సీడెడ్ క్రీడాకారులపై నెగ్గడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ సరన్ జామ్శ్రీ (థాయ్‌లాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ లీ షిఫెంగ్ (చైనా)పై, సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఇక్షన్ రుమ్బే (ఇండోనేసియా)పై, ఫైనల్లో టాప్ సీడ్ కున్లావుత్‌పై లక్ష్య సేన్ గెలుపొందాడు. వరుసగా మూడో ప్రయత్నంలో లక్ష్య సేన్ ఖాతాలో ఆసియా స్వర్ణ పతకం చేరడం విశేషం. 2016లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఈసారి మాత్రం ఏకంగా టైటిల్ కొల్లగొట్టాడు. నిలకడగా ఆడుతూ... ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన 16 ఏళ్ల లక్ష్య సేన్ కుటుంబానికి బ్యాడ్మింటన్ నేపథ్యం ఉంది. లక్ష్య సేన్ సోదరుడు చిరాగ్ సేన్ అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... తండ్రి డీకే సేన్ బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉన్నారు. తాత చంద్రలాల్ సేన్ ప్రోత్సాహంతో తొమ్మిదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. 2014లో స్విస్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచ్చిన లక్ష్య సేన్ అదే ఏడాది డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన అతను గతేడాది జూనియర్ ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. అంతేకాకుండా జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ‘బాయ్’ నజరానా రూ. 10 లక్షలు... ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచిన లక్ష్య సేన్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. ‘ఆసియా టైటిల్ గెలిచి లక్ష్య సేన్ దేశం మొత్తం గర్వపడేలా చేశాడు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారు కూడా మంచి ఫలితాలు సాధిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. భారత్ తరఫున 1965లో గౌతమ్ ఠక్కర్ (మహారాష్ట్ర) పురుషుల సింగిల్స్‌లో తొలిసారి ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచాడు. అనంతరం సమీర్ వర్మ 2011లో రజతం, 2012లో కాంస్యం... 2016లో లక్ష్య సేన్ కాంస్యం గెలిచారు. 2009లో ప్రణవ్ చోప్రా–ప్రజక్తా సావంత్ ద్వయం మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం గెలిచింది. 2011లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో కాంస్యం, 2012లో స్వర్ణ పతకం సాధించింది. ఆసియా టోర్నీలో టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎనిమిది రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో తొలుత టీమ్ ఈవెంట్లో, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పోటీపడ్డాను. క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్‌ను ఓడించాక టైటిల్ సాధిస్తాననే నమ్మకం పెరిగింది. టోర్నీ సందర్భంగా కాలి కండరాల గాయమైంది. నొప్పి నివారణ మాత్రలు తీసుకుంటూ మ్యాచ్‌లు కొనసాగించాను. –లక్ష్య సేన్ -
రన్నరప్ సింధు
బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 15–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఫైనల్ పోరులో ఓడిపోవడం సింధుకిది మూడోసారి. ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్‌లోనూ సింధు ఓటమి చవిచూసింది. విజేత ఒకుహారాకు 26,250 డాలర్ల (రూ. 17 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ, 9,200 పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 11 వేలు), 7800 పాయింట్లు లభించాయి. -
స్పానిష్ ఓపెన్ చాంప్ వైష్ణవి
సాక్షి, హైదరాబాద్: స్పానిష్ ఓపెన్ జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి చాంపియన్‌గా అవతరించింది. స్పెయిన్‌లోని ఒవియెడో నగరంలో జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ వైష్ణవి 21–9, 21–10తో మరియన్ లె టుర్డు (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచే క్రమంలో 16 ఏళ్ల వైష్ణవి తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో ‘బై’ పొందిన వైష్ణవి రెండో రౌండ్లో 21–9, 21–12తో లారా విలాకోర్టా (స్పెయిన్)పై, మూడో రౌండ్లో 21–9, 21–19తో రొమేన్ క్లోటెక్స్ (ఫ్రాన్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–10, 21–8తో మడుక్ లిండెర్స్ (నెదర్లాండ్స్)పై, సెమీఫైనల్లో 21–19, 21–5తో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రూహీ రాజుపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో సింధు
ఫిజౌ (చైనా): చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకోగా, మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ జాతీయ చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ రెండోరౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నెం.2 సింధు 21–15, 21–13తో హాన్ యుయు (చైనా)పై అలవోకగా గెలుపొందింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సింధు 40 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. క్వార్టర్స్‌లో సింధు క్వాలిఫయర్ గావో ఫాంగ్జితో తలపడుతుంది. మరోవైపు తాజాగా జాతీయ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించి మంచి ఫామ్‌లో ఉన్న సైనా నెహ్వాల్ బలమైన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 18–21, 11–21తో ఐదో సీడ్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో 11–9తో ఆధిక్యాన్ని ప్రదర్శించిన సైనా తర్వాత వెనుకబడింది. యామగుచి వెంటవెంటనే పాయింట్లు సాధిస్తూ 21–18తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా రెండోగేమ్‌లోనూ పుంజుకోలేకపోయింది. కేవలం 31 నిమిషాల్లోనే సైనాను ఓడించి యామగుచి క్వార్టర్స్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లోనూ ప్రపంచ నెం.11 ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 19–21, 17–21తో చౌక్ యు లీ (హాంకాంగ్) చేతిలో 42 నిమిషాల్లో పోరాడి ఓడిపోయాడు. సైనా, ప్రణయ్ ఓడిపోవడంతో ఈ టోర్నీలో భారత్ నుంచి సింధు మాత్రమే బరిలో మిగిలింది. మరోవైపు ఈ టోర్నీలో ఓడినా గురువారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఒక స్థానం మెరుగు పర్చుకొని 10వ ర్యాంకు చేరుకోవడం విశేషం.