Balloon
-
దక్షణ కొరియా రాజధాని సియోల్ లో అధ్యక్ష కార్యాలయంపై పడిన చెత్త బెలూన్
-
నింగిలోకి బెలూన్ శాటిలైట్
చంద్రగిరి (తిరుపతి జిల్లా): వాతావరణంలోని మార్పులు, పీడనతో పాటు మరికొన్ని విశేషాలను తెలుసుకునేందుకు మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) విద్యార్థులు, ఎన్ఏఆర్ఎల్, ఐఐఎస్టీ సహకారంతో రూపొందించిన బెలూన్ శాటిలైట్ శనివారం నింగిలోకి ఎగిరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్సలర్ మోహన్‌బాబు, ప్రో చాన్సలర్ మంచు విష్ణులతో పాటు ఇస్రో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వీర ముత్తువేల్, డాక్టర్ కల్పన కాళహస్తి, ఓషన్ శాట్–3 మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ తెన్ముయి శెల్వి , గ్రూపు డైరెక్టర్ గోపికృష్ణతో పాటు ఎన్ఏఆర్ఎల్, ఐఐఎస్టీ శాస్త్రవేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఉదయం 11.15 గంటలకు విద్యార్థులు రూపొందించిన ఎంబీయూ శాట్–1ను మోహన్‌బాబుతో పాటు శాస్త్రవేత్తలు లాంచ్ చేశారు. ఎన్ఏఆర్ఎల్తో భాగస్వామ్యం ద్వారా రూ.1.5 లక్షల తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహించిన ఈ బెలూన్ శాటిలైట్ ఇతర విశ్వవిద్యాలయాలకు ప్రామాణికంగామారుతుందని విద్యార్థులు చెప్పారు. సుమారు 5 కేజీల బరువుతో 35 కి.మీ. ఎత్తులో 200 కిలోమీటర్ల వరకూ ఈ శాటిలైట్ ప్రయాణిస్తుందని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఒక యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ విజయవంతం కావడం సంతోషకరమని యూనివర్సిటీ చాన్సలర్ మోహన్‌బాబు చెప్పారు. -
ఆ సిల్లీ బెలూన్ ప్రతిదాన్ని మార్చేసింది! త్వరలో అన్ని సమసిపోతాయ్: బైడెన్
అమెరికా రక్షణ స్థావరంలోని గగన తలంలపై ఎగిరిన చైనా గుఢాచారి బెలూన్ కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అంతకమునుపు నవంబర్‌లో ఇండోనేషియాలో బాలిలో జరిగిన జీ 20 సదస్సులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడ బైడైన్ చర్చలు జరిపారు. అవి జరిగిన నెలరోజుల్లోనే చైనాతో సంబధాలు క్షీణించాయని ప్రకటించారు బైడెన్. ఫిబ్రవరిలో అమెరికా గగనతలంలో ఎగిరిన స్పై బెలూన్‌తో ఒక్కసారిగా సంబంధాలు భగ్గుమన్నాయి. ఒకరకంగా ఈ స్పై బెలూన్ కారణంగా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్యపరమైన విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ఈ సంఘట కారణంగానే.. అమెరికా చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునే అంశంతో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ పర్యటనను కూడా అనూహ్యంగా రద్దు చేసింది. ఈ మేరకు జపాన్‌లోని హిరోషిమాలో జరగతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చైనా యూఎస్‌ల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించగా..బాలి సమావేశంలో తాము ఇరువురం(బైడెన్, జిన్‌పింగ్) సమావేశమయ్యి, చర్చించాలని అనుకున్నాం కానీ ఆ సిల్లీ బెలూన్ ప్రతిదీ మార్చేసింది. ఆ స్పై బెలూన్ రెండు కార్లు రవాణ చేసే పరికరాలను తీసుకెళ్లగల సామర్థ్యం కలది. దీన్ని తాము కాల్చడంతోనే అంతా ఒక్కసారిగా మారిపోయిందని, ఇవన్నీ త్వరలో సమసిపోవాలనే భావిస్తున్నా. అలాగే తమ చర్యని కూడా సమర్థించుకునే యత్నం చేశారు బైడెన్. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ యథావిధికి వచ్చేలా చేయగలిగినదంతా చేస్తానని బైడెన్ చెప్పారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
Spy Balloon: భారత్ గగనతలంపై స్పై బెలూనా? పైగా అమెరికా కంటే..
అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ వ్యవహారం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా రక్షణ వ్యవస్థకు సమీపంలో ఆ స్పై బెలూన్ ఉందంటూ కూల్చివేసింది. ఈ ఘటన జరిగిన నాలుగు వారాల తర్వాత భారత గగనతలంపై కూడా ఈ స్పై బెలూన్ ప్రత్యక్ష్యం అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అదీకూడా అమెరికా గగనతలంలో ప్రత్యక్ష కావడానికి ముందే గతేడాది ఈ స్పై బెలూన్ భారత్ గగనతలంలో కనిపించినట్లు అధికారుల చెబుతున్నారు. ఐతే తాము అది ఏమిటనేది గుర్తించలేకపోవడం, సరైన సమాచారం కూడా లేకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. గతేడాది అండమాన్ నికోబార్ దీవులు భూభాగంలోని గగనతలంపై ఈ స్పైబెలూన్‌ని చూసినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిని తాము వాతావరణ బెలూన్లుగా భావించామని, అదీగాక అలాంటి వాతావరణ బెలూన్లు గాలుల కారణంగా పాకిస్తాన్ వైపు నుంచి బారత్ గగనతలంలోకి వస్తుంటాయని చెప్పారు. పైగా ఆ బెలూన్ ఏంటి అని తెలుసుకునేలోపే సముద్ర గగనతలం వైపుకి వెళ్లిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా చైనా నిఘా బెలూన్ వ్యవహారంతో తాము ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలిపారు. ఇక ఇలాంటి బెలూన్లు అండమాన్ లేదా మరే ఇతర ప్రాంతాల్లో కనిపించినా.. జాగ్రత్తగా పరిశీలించడమే గాక అది గూఢచర్యానికి చెందినదని తెలిస్తే కూల్చివేస్తామని చెప్పారు అధికారులు. ఆ నిఘా బెలూన్ కనిపించిన దీవులు భారత క్షిపణి పరీక్ష ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా భారత రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది. (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
పంట పొలాల్లో కూలిన భారీ బెలూన్.. 1,050 కిలోల బరువు
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆకాశం నుంచి ఓ భారీ బెలూన్‌కు సంబంధించిన యంత్రం కూలడం కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బెలూన్ యంత్రాన్ని పరిశీలించారు. దానిని హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)కు చెందిన బెలూన్‌గా గుర్తించారు. బెలూన్ యంత్రం తర్నికల్ సమీపంలోని పొలాల్లో పడిపోగా.. జిల్లాలోని ఊర్కొండ మండలం శివారులోని బండారు బాలయ్యకు చెందిన మామిడితోటలో తెలుపు రంగు భారీ బెలూన్ పడిపోయింది. దీని మొత్తం బరువు సుమారు 1,050 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ఆకాశం నుంచి యంత్రం తమ దగ్గరలో వచ్చి పడిపోవడంతో భయం వేసిందని, కాసేపటి వరకు ఏమీ అర్థం కాలేదని రాజిరెడ్డి అనే రైతు చెప్పారు. టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన హరినాయక్ నేతృత్వంలోని బృందం బెలూన్, యంత్ర పరికరాలను హైదరాబాద్‌కు తరలించింది. ఖగోళ, వాతావరణ పరిశోధన కోసమే.. అంతరిక్ష పరిశోధనలతోపాటు భూ ఉపరితలంపై వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని తమ బెలూన్ ఫెసిలిటీ సెంటర్ నుంచి ఈ నెల 17న ప్లాస్టిక్ రీసెర్చ్ బెలూన్ను ఆకాశంలోకి పంపించామని టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన సైంటిఫిక్ ఆఫీసర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. 176 మీటర్ల పొడవు ఉండే ఈ బెలూన్ పేలిపోయే ప్రమాదం లేదని, జనసమ్మర్ధం లేనిచోట నెమ్మదిగా ల్యాండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. చదవండి: తలసరి ‘విద్యుత్’లో 5వ స్థానం -
అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం
-
అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం
వాషింగ్టన్: చైనా భారీ నిఘా బెలూన్ను అమెరికా కూల్చేసిన ఘటన మరువకముందే అగ్రరాజ్యంలో మరో గగనతల ఉల్లంఘన ఉదంతం చోటుచేసు కుంది. అలాస్కాలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్‌హౌస్ తెలిపింది. ‘పౌర విమానాల రాకపోకలకు కాస్తంత విఘాతం కల్గించేదిగా ఉన్న వస్తువును కూల్చేశాం. శిథిలాలను వెతికే పనిలో ఉన్నాం’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ చెప్పారు. ‘ 40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును 24 గంటలపాటు నిశితంగా పరిశీలించాక అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలమేరకు యుద్ధవిమానం కూల్చేసింది. అది గడ్డ కట్టిన అమెరికా సముద్రజలాల్లో పడింది’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్ (వ్యూహాత్మక కమ్యూనికేషన్స్) జాన్ కిర్బీ మీడియాతో చెప్పారు. ‘‘ఇటీవల కూల్చేసిన చైనా నిఘా బెలూన్‌కు స్వయం నియంత్రణ, గమన వ్యవస్థ ఉన్నాయి. సున్నిత సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది. కానీ ఈ వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియదు’’ అని ఆయన అన్నారు. -
భారత్ టార్గెట్‌గా చైనా నిఘా బెలూన్లు!
వాషింగ్టన్: నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా.. మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుందనే సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్‌తో పాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్.. ఇలా మరికొన్ని దేశాలపైనా సర్వేయిలెన్స్ బెలూన్లను ప్రయోగించిందని, ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే యత్నం చేసిందని కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి నిఘా బెలూన్ల ప్రయత్నం కొనసాగిందని.. జపాన్, భారతదేశం, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో సహా పలు దేశాల సైనిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగిందని ఆ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి పలువురు నిఘా అధికారులు, భద్రతా విభాగానికి చెందిన ప్రముఖుల నుంచి అభిప్రాయాలను సేకరించి.. ప్రచురించింది ఆ కథనం. ఈ పరిణామంపై భారత్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ పోస్ట్ కథనానికి కొనసాగింపుగా.. అమెరికా భద్రతా అధికారులు భారత్ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని.. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు నివేదించింది అమెరికా. గత మూడురోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో పెంటగాన్ అధికారులు ‘చైనా నిఘా బెలూన్ల వ్యవహారం’పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సర్వేయలెన్స్ ఎయిర్‌షిప్స్‌గా భావిస్తున్న ఈ బెలూన్లు.. చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ద్వారానే ప్రయోగించబడుతున్నాయని, ఐదు ఖండాల్లో వీటి ఉనికి గుర్తించినట్లు అమెరికా భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇది ఇతర దేశాల సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించడేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైనా మాత్రం అవి శాటిలైట్ సంబంధిత ఎయిర్‌షిప్స్ తప్ప.. నిఘాకు సంబంధించినవి కాదని వాదిస్తోంది. ఈ మేరకు బెలూన్ కూల్చివేతపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమెరికా మాత్రం ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయదనే ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్. అలాగే.. పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అప్పగించబోమని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా.. హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లో చైనా బెలూన్లు దర్శనమిచ్చాయి. ఇందులో మూడు ట్రంప్ హయాంలోనే గగనతలంలో విహరించేందుకు అనుమతులు లభించాయని.. అయితే అవి చైనా నిఘా బెలూన్లు అనే విషయం తాజాగానే వెల్లడైందని భద్రతా అధికారుల నివేదిక వివరిస్తోంది. -
చైనా నిఘా బెలూన్ వ్యవహారం.. ఆకాశంలో మరొకటి!
వాషింగ్టన్: అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైంది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో తీవ్రంగా పరిగణించిన అమెరికా.. తమ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ‘చైనా పర్యటన’ను వాయిదా వేయించింది. అయితే.. అది నిఘా బెలూన్ కాదని చైనా వివరణ ఇచ్చేలోపే.. ఇప్పుడు మరో బెలూన్ వ్యవహారం వెలుగు చూసింది. లాటిన్ అమెరికా రీజియన్ గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధృవీకరించింది. ఒక బెలూన్ లాటిన్ అమెరికా దిశగా ప్రయాణిస్తున్నట్లు మేం నివేదికలను పరిశీలించాం. ఇది చైనీస్ నిఘా బెలూన్‌గానే భావిస్తున్నాం అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. అది చైనాదేనా? లేదా మరేదైనా దేశం నుంచి ప్రయోగించారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు.. ఆ బెలూన్ సంచారాన్ని గమనిస్తే అది అమెరికా వైపుగా పయనిస్తున్నట్లు కనిపించడం లేదని ఓ భద్రతాధికారి చెప్తున్నారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో దాని సంచారం ఎటువైపు ఉందో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని పెంటగాన్ పేర్కొంది. అంతకు ముందు అమెరికా గగనతలంలో మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఓ బెలూన్.. సంచరించడం కలకలం రేపింది. గురువారం ఏకంగా మోంటానా(అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి ఉంది)లో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అయితే అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల విమానాల రాకపోకలకు దానివల్ల అంతరాయమేమీ కలగలేదు. అయినప్పటికీ కీలక సమాచారం లీక్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. అమెరికా జాగ్రత్త పడింది. దానిని పేల్చినా.. కూల్చినా.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళనతో కేవలం నిఘా మాత్రమే పెట్టింది అమెరికా రక్షణ శాఖ. ఈ బెలూన్ వ్యవహారాన్ని పెంటగాన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి తీసుకెళ్లింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. కానీ, ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. -
అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్
వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు. -
అధిక బరువు ఉన్నారా? ఈ బెలూన్ మింగారంటే చాలు.. 20 నిముషాల్లో..!
బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. తమ ఊబకాయం అకస్మాత్తుగా ప్రాణాపాయం వంటి ప్రమాదం తెచ్చిపెట్టేంత ఎక్కువగా (మార్బిడ్ ఒబేసిటీ) ఉంటే... బేరియాట్రిక్ శస్త్రచికిత్స వంటివీ అందుబాటులో ఉన్నాయి. అయితే స్వల్ప, ఓ మోస్తరు ఊబకాయం ఉన్నప్పుడు... పొట్టను కాస్తా... పేగు స్థాయికి కోసేయడం ఇష్టపడని వారికోసం ఇప్పుడు కేవలం ఓ క్యాప్సూల్‌ను మింగించి, అది పొట్టలోకి వెళ్లాక బెలూన్లా ఉబ్బేలా చేయడం ద్వారా ఆహారం తక్కువగా తీసుకునేలా చేస్తూ, బరువు తగ్గించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీన్నే ‘‘స్వాలోవబుల్ గ్యాస్ట్రిక్ బెలూన్’’ అంటారు. దాని గురించి తెలిపే కథనమిది. ఎవరైనా సరే... కాస్త బొద్దుగా ఉంటే పర్వాలేదు. కానీ... అతిగా లావు పెరిగితే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అధిక ఊబకాయం కొన్నిసార్లు అకస్మాత్తుగా ప్రాణాపాయాన్నీ తెచ్చిపెట్టవచ్చు. ఓ వ్యక్తి బాడీ–మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ప్రమాదకరమైన స్థాయికి చేరినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. పట్టికలో ఉన్న బీఎమ్‌ఐని బట్టి... అది స్వల్ప, ఓ మోస్తరు స్థాయిలో ఉంటే ఆ ఊబకాయాన్ని తగ్గించడానికి ఈ ‘‘గ్యాస్ట్రిక్ బెలూన్’’ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎలా అమర్చుతారంటే... తొలుత క్యాప్సూల్లా ఉండే ఉబ్బని బెలూన్ను ఊబకాయం ఉన్న వ్యక్తి చేత మింగిస్తారు. అది కడుపులోపలికి వెళ్లాక సరైన స్థానంలో ఉందా అని నిర్ధారణ చేసుకుం టారు. ఆ తర్వాత, దానికి అతుక్కుని ఉన్న సన్నటి ట్యూబ్ ద్వారా నీటిని పంపి, బెలూన్ను ఉబ్బేలా చేస్తారు. ఉబ్బగానే... దానికి అతుక్కుని ఉన్న ట్యూబ్‌ను మెల్లగా బయటకు లాగేస్తారు. ∙ఈ మొత్తం ప్రక్రియ 20 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ బెలూన్ కడుపులో 4 – 6 నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత అది స్వాభావికంగానే జారిపోతుంది. ఎలా పని చేస్తుందంటే...? కడుపులోని ఖాళీ ప్రదేశంలో బెలూన్ ఉండటమూ, ఆహారం పట్టడానికి తక్కువ ఖాళీ ప్రదేశం ఉండటంతో కొద్దిగా తినగానే కడుపు నిండిపోయి ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కానీ ఆహారం కొద్దిగానే వెళ్లడంతో, మళ్లీ కొద్దిసేపటికే ఆకలేస్తుంది. అయినప్పటికీ రోజుమొత్తం లో తినే అన్నం పరిమాణం కంటే ఇది తక్కువే ఉండటంతో... కేవలం దేహానికీ, దేహపు జీవ క్రియలకీ అవసరమైన మేరకే తింటారు. ఫలితంగా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే శరీరపు అదనపు బరువు తగ్గిపోతుంది. ప్రయోజనాలు బాగా అభివృద్ధి చెందిన సాంతికతతో తయారైన ఈ పాలీయూరీథేన్ బెలూన్లు చాలా మృదువుగానూ, ఉపరితలం నునుపుగానూ ఉంటాయి. కాబట్టి కడుపులోని కండరాలు గాయపడటం వంటి అనర్థాలు ఉండవు. కడుపులో ప్రసరించే ఆమ్లాన్ని (యాసిడ్‌ను) ఇది బాగా తట్టుకుంటుంది. ∙దీని సహాయంతో మొత్తం దేహపు బరువులో 15 – 25 శాతం వరకు తగ్గుతుంది. దీన్ని ఉపయోగించిన దాదాపు 95 శాతం మంది, తొలగించాక కూడా దాదాపు ఏడాది పాటు అదే దేహపు బరువు తో కొనసాగుతారు. దేహపు బరువులో కనీసం 5 శాతం తగ్గినా డయాబెటిస్, గుండెజబ్బులు, ఇతరత్రా అనర్థాలు గణనీయంగా తగ్గుతున్నందున ఇది ఉపయోగకరమనే చెప్పవచ్చు. ప్రతికూలతలు అమర్చిన కొత్తలో కడుపులో ఏదో నిండుగా బెలూన్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ త్వరలోనే దానికి అలవాటు పడిపోతారు. కేవలం దేహం బరువులో 15 – 25 శాతం మేరకు మాత్రమే తగ్గుతుంది. కాబట్టి మరీ ఆరోగ్యానికి అనర్థం కలిగించేంత బరువు, ప్రాణాపాయం కలిగించేంత బరువు ఉంటే బేరియాట్రిక్ చేయించాల్సి రావచ్చు. స్వల్పం నుంచి ఓ మోస్తరు బరువు వారికీ, ఆపరేషన్ చేయించుకోడానికి వెనకాడేవారికీ గ్యాస్ట్రిక్ బెలూన్ ఓ మార్గం. -
బెలూన్ వరల్డ్‌కప్.. క్రీడాకారిణి ప్రాణం మీదకు
బెలూన్ వరల్డ్‌కప్ ఒక క్రీడాకారిణి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా మొదలైన ఆట ఆఖర్లో కాస్త ఉత్కంఠను రేపింది. విషయంలోకి వెళితే.. ట్విచ్కాన్ 2022 పేరిట అక్టోబర్ 8న సాన్ డీగోలో బెలూన్ వరల్డ్‌కప్ నిర్వహించారు. ఈ గేమ్‌లో చాలా మంది పాల్గొన్నారు. బెలూన్ గేమ్ అంటే ఏంటి? గాలిలోకి ఎగిరిన బెలూన్ కిందపడకుండా చేతితోనే కొడుతుండాలి. ఒక్కో రౌండ్ రెండు నిమిషాల పాటు ఆడాలి. ఈ క్రమంలో ఆటలో పాల్గొన్న క్రీడాకారుల్లో ఒకరినొకరు చేజ్ చేస్తూ ఎవరు ఎక్కువసేపు బెలూన్ను గాలిలోకి కొట్టగలిగితే వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇది క్లుప్తంగా బెలూన్ వరల్డ్‌కప్ గేమ్. కాగా బెలూన్ వరల్డ్‌కప్‌లో ట్విచ్ స్రీమర్ జుమ్మెర్స్ కూడా పాల్గొంది. జుమ్మెర్స్ ఇదివరకు చాలాసార్లు బెలూన్ గేమ్స్‌లో విజయాలు అందుకొని ఫెవరెట్‌గా మారిపోయింది. ఆమెకు అభిమాన దళం కూడా ఎక్కువే. ఇక మ్యాచ్‌లో జుమ్మెర్స్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయిస్తూ చాలావరకు బెలూన్ను గాల్లోనే ఉంచింది. అయితే మరికొద్ది సెకన్లలో ఆట ముగుస్తుందనగా ఆమె సోఫాలో నుంచి జారి కింద పడింది. తల భాగం గట్టిగా తగలడంతో పెద్ద గాయం అయిందని అంతా భావించారు. కానీ జుమ్మెర్స్ కుడి చీలమండకు మాత్రం తీవ్ర గాయమైంది. వెంటనే నిర్వహాకులు ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. మూడువారాలు రెస్ట్ తీసుకుంటే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ట్విచర్ జుమ్మెర్స్ కోరిక మేరకు తొలగించారు. ఇక జుమ్మెర్స్ గాయపడడంపై ఆమె అభిమానులు ట్విటర్ వేదికగా త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. చదవండి: ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..' -
విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..
ప్రపంచంలో అందాలన్నీ ఓచోట చేరిస్తే విశాఖగా మారిందన్నట్లుగా.. దేశానికి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ముగ్గురు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ.. ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తయిన తూర్పు కనుమల అందాలు అంతర్జాతీయ టూరిస్టులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కార్యనిర్వాహక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశీ, విదేశీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న విశాఖలో పీపీపీ విధానంలో పలు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పెట్టుబడులకు విదేశాలు ఆసక్తి పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రిక్రియేషన్ టూరిజంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. సరికొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వివిధ దేశాలు విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. రిక్రియేషన్ అండ్ అడ్వెంచర్ టూరిజం విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టి.. పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ తదితర దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రానున్న ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ఐకానిక్‌గా.. స్కైటవర్ తీరంలో సముద్ర మట్టానికి ఎత్తున విహరిస్తూ.. ఓవైపు అలల అందాల్ని.. మరోవైపు విశాఖ నగర హొయలను చూసేలా స్కైటవర్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీటూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచస్థాయి సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అంతర్జాతీయ వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమ్యూజ్మెంట్ రైడ్స్ సంస్థ ఇంటమిన్ ఈ ప్రాజెక్టుకు ఏపీటీడీసీ జాయింట్ వెంచర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టి.. స్కైటవర్ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. సుమారు 70 మంది సందర్శకులు చుట్టూ కూర్చొనే విధంగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ స్కైటవర్ పైకి తీసుకెళ్తుంది. రాత్రి వేళ మిరుమిట్లు గొలిపే కాంతులతో కనిపించే ఈ టవర్.. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అరకు అందాల్లో తేలినట్టుందే.. మరోవైపు అడ్వెంచర్ టూరిజంని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రకృతి అందాలకు నిలయంగా.. అంతర్జాతీయ టూరిస్టుల్ని ఆకర్షిస్తున్న విశాఖ మన్యం అడ్వెంచర్ టూరిజంకి కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా అరకులోయలో టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్టు రానుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరో ఫైల్ సంస్థ దీనికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి 30 మంది గాల్లో విహరించే సామర్థ్యం ఉన్న బెలూన్‌లో పర్యాటకులు విహరించేలా ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఇలా.. సరికొత్త పర్యాటకాన్ని విశాఖ వచ్చే టూరిస్టులకు పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై.. రిక్రియేషన్ ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ఏపీటీడీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. జలచరాల మధ్యలో విహరించేలా.. టన్నెల్ అక్వేరియం.. ఓ అద్భుత ప్రపంచంలా ఉంటుంది. సముద్ర లోతు ల్లో ఉండే పగడపు దీవులకు వెళ్లి.. 360 డిగ్రీల కోణంలో జలచరాల్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలో.. నీలి నీలి అందాలు.. చూపు తిప్పనీకుండా చేస్తాయి. టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్.. ఈ టన్నెల్ అక్వేరియంని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. టన్నెల్ అక్వేరియంకు ఎక్కువ శాతం సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో తొట్లకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. -
అంతరిక్ష యాత్రకు ఛలో ఛలో.. అది కూడా ఓ బెలూన్‌లో!
Space Tourism: బెలూన్‌లో విలాసంగా విహరించాలని ఉందా? అలాగైతే, ఈ ఫొటోలో కనిపిస్తున్నదే అందుకు సరైన బెలూన్. అలా పైకెగిరి, నాలుగు చక్కర్లు కొట్టేసి నేలకు దిగిపోయే ఆషామాషీ బెలూన్ కాదిది. సరిగా చెప్పాలంటే, ఇదొక కొత్తతరహా వ్యోమనౌక. స్పేస్టూరిజంలో ఇదొక కొత్త ప్రయోగం. ఇందులో కులాసాగా కూర్చుంటే, అంతరిక్షం అంచుల వరకు వెళ్లవచ్చు. నేల మీద నుంచి ఏకంగా లక్ష అడుగుల పైకి వెళ్లి, అక్కడి నుంచి బంతిలా కనిపించే భూగోళాన్ని కళ్లారా తిలకించవచ్చు. ఇదొక్కటే ఇందులోని విశేషం కాదు. ఇందులో స్టార్ హోటళ్లలో ఉండే సమస్త విలాసాలూ సౌకర్యాలూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ విలాసాల వ్యోమనౌక పేరు ‘స్పేస్‌షిప్ నెప్ట్యూన్’. అమెరికాకు చెందిన ప్రైవేట్ స్పేస్ టూరిజం సంస్థ ‘స్పేస్ పెర్స్పెక్టివ్’ 2024లో దీని ద్వారా పర్యాటకులను అంతరిక్ష యాత్రకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రపంచంలోనే తొలిసారిగా పర్యాటకులకు విలాసవంతమైన అంతరిక్ష యాత్రానుభూతి కల్పించనున్నామని ఈ కంపెనీ చెప్పుకుంటోంది. ‘స్పేస్‌క్రాఫ్ట్ నెప్ట్యూన్’ విస్తీర్ణంలో పూర్తిగా ఒక ఫుట్‌బాల్ మైదానమంత ఉంటుంది. దీని పొడవు ఏడువందల అడుగులు కాగా, పూర్తిగా విస్తరిస్తే, దీని ఘన పరిమాణం 1.8 కోట్ల ఘనపుటడుగులు ఉంటుంది. దీనిలో ప్రయాణిస్తే, 360 డిగ్రీల కోణంలో భూగోళాన్ని పూర్తిగా తిలకించవచ్చునని కంపెనీ వర్గాల సమాచారం. ఇందులో ప్రయాణించాలంటే, 1.25 లక్షల డాలర్లు (రూ.99.61 లక్షలు) చెల్లించి, సీటును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి: Scam 1992: '1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా? -
హోలీ వేళ విషాదం... ఆటో బోల్తా
న్యూఢిల్లీ: పండుగలు అందరూ సరదాగా ఆనందంగా జరుపుకోవడానికే. కానీ వాటిని ఎవరైన సరే ఎవరికీ ఇబ్బందీ కలిగించకుండా చేసుకోవాలి. అంతేగానీ మన సరదాతో ఇతరులకు ప్రాణాపాయ స్థితి కలిగిలే చేయకూడాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చేసి అతనే కటకటాల పాలయ్యే స్థితి కొని తెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్లే..హోలీ చక్కగా ఒకరి మీద ఒకరు రంగుల జల్లుకోవడం లేదా కలర్స్ వాటర్ లేదా బెలూన్లతో జల్లుకుంటారు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ల మీద మన స్నేహితుల మీద జల్లుకోవాలి. అంతేకాదు వాళ్లు ఏదైన సీరియస్ పనిలో ఉన్న ప్రమాదకరమైన వస్తువులతో పని చేస్తున్నప్పుడూ ఇలాంటి పండుగకి సంబంధించిన చిలిపి పనులు అసలు చేయకూడదు. కానీ యూపీకి చెందిన ఒక వ్యక్తి ప్రయాణికులతో వేగంగా వస్తున్న ఆటో పై వాటర్ బెలూన్ విసిరాడు అంతే ఒక్కసారిగా ఆటో ఒకవైపుకు తిరగబడిపోయింది. ఈ ఘటనలో ఎంతమంది గాయాలపాలయ్యారో పూర్తి సమాచారం తెలియలేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఘటనకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో చోటు చేసుకుందని పేర్కొన్నారు. पानी का गुब्बारा मारने पर पलटा ऑटो, सोशल मीडिया पर वायरल हुआ वीडियो#ViralVideo #Holi pic.twitter.com/83G9QhwHbk — Zee News (@ZeeNews) March 20, 2022 (చదవండి: జైలులో స్నేహం.. కథ మొదలైంది అక్కడినుంచే!) -
వాసాలతిప్పలో ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేప!
సాక్షి, తూర్పుగోదావరి: ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో మనిషి ముఖంతో పోలిన రూపంతో ఉన్న అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. సోషల్ మీడియాలో ఈ చేప వైరల్‌గా మారింది. విచిత్రం ఏమిటంటే.. తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా ఉబ్బుతుంది. అందుకే దీన్ని బెలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ తదితర పేర్లతోనూ పిలుస్తారు. ఇది చూసేందుకు మూములుగానే ఉంటుంది. కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా (ఉబ్బుతుంది)మారిపోతుంది. అందుకే బెలూన్ ఫిష్ అంటారు. చేప అలా ఉబ్బిపోగానే.. దాన్ని తినడానికి వచ్చిన జీవులు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతాయి. టెట్రాడాంటిడీ జాతికి చెందిన ఈ చేప శాస్త్రీయ నామం టెట్రాడాన్ ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపగా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. జపాన్‌కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’. జపాన్‌లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో దీన్ని ఎక్కువగా వండుకుని తింటారు. జపాన్, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లు ఈ చేపలతో టేస్టీ ఆహారం సిద్ధం చేస్తారు. ఈ చేపను వండాలంటే సుమారుగా పదేళ్ల అనుభవం, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలి. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ విషం వల్ల ప్రాణాలకే ప్రమాదకరం. -
ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే!. కానీ, సమయానికి అది బయటపడితేనే.. గుర్తింపు దక్కేది. అందుకు ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం కూడా. ఇవాళ రేపు ఓవర్‌నైట్ సెన్సేషన్స్‌కి ఒక వేదిక అయ్యింది ఇంటర్నెట్. బచ్పన్ కా ప్యార్, కచ్చా బాదామ్ లాంటి వాళ్లు ఇలా పాపులర్ అయినవాళ్లే. ఈ లిస్ట్‌లో ఇప్పుడు చేరిపోయింది బెలూన్లు అమ్ముకునే యువతి కిస్బూ. కిస్బూ రాజస్థానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. కేరళలో ఆమె కుటుంబం సెటిల్ అయ్యింది. రోడ్ల మీద, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తోంది ఈమె కుటుంబం. అయితే అండలూర్ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లిన కిస్బూ జీవితం.. రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన అర్జున్ కృష్ణన్.. సరదాగా జాతరకు వెళ్లి ఫొటోలు తీయసాగాడు. అక్కడ అర్జున్.. అనుకోకుండా అక్కడే బుగ్గలు అమ్ముకుంటున్న కిస్బూను క్లిక్‌మనిపించాడు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చింది. దీంతో ముగ్దుడైన అర్జున్..ఆ ఫొటోను కిస్బూ, ఆమె తల్లికి చూపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో వైరల్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. దీంతో స్టైలిష్ రమ్య ఆధ్వర్యంలో ఆమెతో కొన్ని ఫొటోషూట్లు చేయించారు. దీంతో ఇప్పుడామె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) సిగ్నళ్ల దగ్గర బుడగలు అమ్ముకునే కిస్బూ.. మోడలింగ్ ఫొటోషూట్లు వైరల్ కావడం, ఆమెకు పలు బ్రాండ్స్ అవకాశాలు దక్కడంపై ఫొటోగ్రాఫర్ అర్జున్ స్పందించాడు. తాను తీసిన ఒక్క ఫొటో వల్ల ఆమె జీవితం మారిపోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇంత గుర్తింపునకు కారణమైన అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు కిస్బూ, ఆమె తల్లి. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) -
బాలుడి ప్రాణం తీసిన బెలూన్
ముంబై: గొంతులో బెలూన్ ఇరుక్కోవడంతో ఊపిరాడక ఓ అరేళ్ల బాలుడు మృతి చెందాడు. నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ పటేల్(6)కు అతని తల్లిదండ్రులు బుధవారం ఉదయం అడుకునేందుకు కొన్ని ఆటవస్తువులు, బెలూన్లు ఇచ్చారు. విజయ్ వాటితో ఆడుకుంటుండగా ఓ బెలూన్‌లోంచి గాలి పోయింది. దీంతో ఆ బెలూన్ను నోటిలో పెట్టుకుని గాలిఊదే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తూ అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే తల్లిదండ్రులు పరుగున వచ్చి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీపావళి వేడుకలతో సంతోషాలు నిండాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్) -
అంతరిక్షానికి ఎగిరే బెలూన్.. సీట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు
... ఎస్.. ఆ బెలూన్ భూ వాతావరణ పరిధిని దాటి అంతరిక్షం వరకు వెళుతుంది.. మనుషులను తీసుకొని మరీ! ఫేక్ కాదు ఫ్యాక్ట్. ఫ్లొరిడాలోని ఓ టూరిజం సంస్థ స్పేస్ బెలూన్ సవారీని టేకాఫ్ చేయనుంది. సుమారు లక్ష అడుగుల ఎత్తుకు.. కేవలం రెండు గంటల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లగలదు. అక్కడికి చేరుకున్నాక మరో రెండు గంటలు ఆ అంతరిక్ష అందాలను వీక్షించడానికి, ఆస్వాదించడానికి అనువుగా అక్కడే చక్కర్లు కొడుతుంది. ఈ షికారులో ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని టూరిజం సంస్థ వారే సరఫరా చేస్తారు. అంతేకాదు ఈ బెలూన్‌లో ఒక కిచెన్, బార్, బాత్రూమ్ కూడా ఉంటాయి. తిరిగి నేలకు చేరుకోడానికి మరో రెండు గంటలు. మొత్తం ఆరుగంటల ఈ ప్రయాణంలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే చోటు ఉంటుంది. బాగుంది కదూ! ఈ షికారును మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కూసింత కరుసవుద్ది మరి! జస్ట్ రూ. 93 లక్షలు చెల్లించి, సీట్ బుక్ చేసుకుని.. 2024 వరకు వేచి చూడండి. హైడ్రోజన్ బెలూన్లు అంతపైకి ఎలా వెళ్లగలవనే కదా మీ డౌటా. ‘నాసా’ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి అతి తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించారు. అది గురత్వాక్షరణ శక్తిని అధిగమించి అంతరిక్ష ప్రయాణానికి అనుకూలిస్తుంది. ఈ పద్ధతి ఉపయోగించే తాజాగా.. ఫ్లొరిడాలోని ఓ సంస్థ అంతరిక్షంలోకి విమాన ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విమానం మాదిరే ఈ బెలూన్ను నడిపేందుకూ ఒక స్పేస్ పైలట్, ఒక కో పైలట్ ఉంటారు. ప్రయాణికులు అంతరిక్ష సవారీని ఆస్వాదిస్తూ ఆ మధుర క్షణాలను బెలూన్ పారదర్శక గోడల నుంచి మీ మొబైల్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. -
భారీ బెలూన్‌తో నింగికి శాటిలైట్లు
సాక్షి, చెన్నై: భారీ బెలూన్ సాయంతో నింగికి వంద శాటిలైట్లను ప్రయోగించి విద్యార్థులు రికార్డు ప్రయత్నం చేశారు. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం పుట్టిన గడ్డ రామేశ్వరం ఈ కార్యక్రమానికి ఆదివారం వేదికైంది. అబ్దుల్‌కలాం కలలను సాకారం చేసే రీతిలో ఆయన కుటుంబీకులు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం అంతర్జాతీయ ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రస్టు నేతృత్వంలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను చాటే రీతిలో చిన్నపాటి శాటిలైట్ల తయారీపై ప్రత్యేక కార్యక్రమాన్ని గతవారం చేపట్టారు. ఇందుకోసం తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు రామేశ్వరానికి తరలివచ్చారు. భారీ బెలూన్‌తో.. ప్రపంచంలోనే అతి చిన్నశాటిలైట్లుగా 40 గ్రాముల నుంచి 50 గ్రాముల్లోపు విద్యార్థులు సిద్ధం చేశారు. విద్యార్థులు సిద్ధం చేసిన వంద శాటిలైట్లను ప్రయోగించే రీతిలో ఆదివారం రామేశ్వరంలో కార్యక్రమం జరిగింది. ఆన్లైన్ ద్వారా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 నుంచి 8 అడుగుల మేరకు ఉన్న భారీబెలూన్‌లో ఈ శాటిలైట్లను పొందు పరిచి గాల్లోకి వదిలారు. వాతావరణ పరిశోధ, ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాలు తెలుసుకునే రీతిలో ఈ ప్రయోగం సాగింది. రామేశ్వరం పరిసరాలకు చెందిన వెయ్యికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. కలాం మనవళ్లు షేక్ సలీం, షేక్ దావుద్, అబ్దుల్ కలాంతో పనిచేసిన శాస్త్రవేత్త శివథానుపిల్‌లై, పలు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు, కళాశాలల ప్రొఫెసర్లు, పరిశోధకలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేవలం అవగాహన కల్పించే రీతిలో కలాం పేరిట రికార్డు ప్రయత్నంగా భారీ బెలూన్ ద్వారా శాటిలైట్ల ప్రయోగం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన మనవళ్లు పేర్కొన్నారు. -
బెలూన్ అడిగినందుకు చంపిన సవతి తండ్రి
లక్నో: ‘నాన్న బెలూన్ కొనివ్వు’ అన్నందుకు కూతురినే చంపేశాడో దుర్మార్గపు తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు... ఖుల్దాబాద్‌లోని సిద్ధార్థనగర్‌లో అద్దెకు నివసిస్తున్న ఓ జంట మందులకోసమని కూతురును వెంటబెట్టుకుని బయటకు వెళ్లింది. ఈ సమయంలో బెలూన్ కావాలంటూ నాలుగేళ్ల కూతురు సవతి తండ్రిని కోరింది. అతను కోపంతో ఆమెను ఇష్టమొచ్చినట్టుగా కొట్టాడు. అడ్డొచ్చిన భార్యను సైతం కిందపడేశాడు. అనంతరం ఆవేశంతో కూతురుని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకుని తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఉదయం అతని గదిలోకి వెళ్లి చూసిన భార్య హతాశురాలైంది. ఆమె భర్త కూతురును చంపి, శవం పక్కనే గాయాలతో పడి ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమివ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. -
ఆకాశంలో ఆర్మీ సాహసం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇండియన్ ఆర్మీ ఆకాశంలో అద్భుతం సృష్టించనుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశమార్గాన భారీ బెలూన్‌లో సాహస ప్రయాణం చేసి రికార్డు నెలకొల్పబోతోంది. అందులో భాగంగా మంగళవారం ఇక్కడికి చేరుకున్న బృందం తిరిగి బుధవారం బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..ఇండియన్ ఆర్మీ అధికారి మేజర్ అనిరుధ్ నేతృత్వంలో 60 మంది సైనికుల బృందం జమ్మూ–కశ్మీర్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు భారీ బెలూన్‌లో ఆకాశయానాన సాహస ప్రయాణాన్ని గత నెల 6వ తేదీన ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ అనే అక్షరాలు రాసి ఉన్న రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ బెలూన్‌లో నలుగురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంది. ఈ కారణంగా నలుగురు సైనికులు బెలూన్‌లో ప్రయాణిస్తే మిగిలిన వారు రోడ్డు మార్గంలో వారిని అనుసరించారు. నిర్ణీత ప్రయాణం చేసిన తరువాత బెలూన్ నేలపైకి దిగినపుడు అందులోని సైనికులు కిందకు దిగుతుండగా..మరో నలుగురు అందులో ఎక్కేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జమ్మూ–కశ్మీర్ నుంచి ఆగ్రా, భోపాల్, తిరుపతి మీదుగా చెన్నైకి చేరుకున్నారు. చెన్నై నుంచి కాంచీపురానికి సమీపంలోని కురువిమలైలోని విమాన కంట్రోలు కార్యాలయం మైదానంలో మంగళవారం సాయంత్రం దిగారు. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి మైదానంలో దిగిన బెలూన్ చూసి పరిసరాల ప్రజలు ఆశ్చర్యంతో చుట్టూ చేరారు. సైనిక వీరులతో సెల్ఫీ దిగారు. ఇక్కడ కొన్ని గంటలపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి బుధవారం బయలు దేరారు. చెన్నై, తిరుచ్చిరాపల్లి, మదురై, శివకాశి, తిరునెల్వేలి మీదుగా ఈనెల 29వ తేదీకి కన్యాకుమారి చేరుకుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సాహస ప్రయాణంలో ఆకాశమార్గాన 3,236 కిలోమీటర్లు, రోడు మార్గంలో 3,901 కిలోమీటర్లు పయనించినట్లవుతుందని వారు తెలిపారు. -
అయ్యో చిన్నారి..
సాక్షి, తిరుపతి రూరల్ : అప్పటివరకు చేతితో గిలిగింతలు పెట్టిన ఆ బెలూన్...పేలిపోయిన తర్వాత అమాయకంగా నోట్లో వేసుకున్న ఆ చిన్నారికి నరకం చూపించింది. గొంతుకు అడ్డం పడిన బెలూన్ను మింగలేకకక్కలేక... ఊపిరి తీసుకోలేక అల్లాడిన ఆ చిన్నారి చివరికి మృత్యువుకు తలవొంచింది. ఈ విషాద ఘటన తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి పంచాయతీ రిక్షాకాలనీలో శుక్రవారం జరిగింది. సుదర్శన్, సునీత దంపతలకు హేమవర్షిత(1) ఏకైక కుమార్తె. సుదర్శన్ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు వీరు వెళ్లారు. పాప అడగడంతో ఇంటికి ఒక బెలూన్ను తీసుకొచ్చారు. దానితో ఆడుకున్న వర్షిత అది పేలిపోవడంతో తినే వస్తువు అనుకుంటూ నోట్లో వేసుకుంది. అది కాస్త.. ఆ చిన్నారి గొంతులో అడ్డం పడింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో గుర్తించిన తల్లి దాన్ని బయటకు కక్కించేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిస్థితి విషమంగా మారడంతో రుయా చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. -
‘ఆయనతో నటించాలని ఉంది’
సాక్షి, సినిమా: సినిమా రంగంలో ఇవాళ ఒక్క భాషలో నటిస్తూ పోతే చాలదు. మార్కెట్‌ను పెంచుకోవాలంటే పలు భాషా చిత్రాల్లో నటించాలి. నయనతార నుంచి సమంత, అమలాపాల్, సాయిపల్లవిల వరకూ మాతృభాషల నుంచి ఇతర భాషలోకి తమ మార్కెట్‌ను విస్తరించుకుంటూ కథానాయికలుగా రాణిస్తున్నారు. అదే విధంగా నటి జననీ అయ్యర్ నటిగా తన పరిధిని పెంచుకోవాలని ఆశ పడుతోంది. అచ్చ తమిళ అమ్మాయి అయిన ఈ బ్యూటీ అవన్ ఇవన్, తెగిడి వంటి చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నటించిన పాగన్ వంటి కొన్ని చిత్రాలు నిరాశపరచడంతో కాస్త వెనుక పడినా తాజాగా బెలూన్ చిత్రంతో తన సత్తా చాటుకుంటోంది. ఇందులో మరో నాయకిగా అంజిలి నటించిందన్నది గమనార్హం. నటుడు జై హీరోగా నటించిన ఈ లవ్ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి జననీ అయ్యర్‌తో చిట్‌చాట్.. మీరూ మోడలింగ్ రంగం నుంచి వచ్చిన నటేననుకుంటా? అవును. చెన్నైలో పుట్టి పెరిగి చదివిన నేను 150 వరకూ వాణిజ్య ప్రకటనల్లో నటించాను. అయితే సినిమాల్లో నటించాలన్నది నాకు ఫ్యాషన్. అందుకే తొలుత తిరు తిరు తురు తురు చిత్రంలో మోడల్‌గానే చిన్న పాత్రలో నటించాను. ఆ తరువాత గౌతమ్‌మీనన్ దర్శకత్వంలోనూ విన్నైతాండి వరువాయా చిత్రంలో సహాయదర్శకురాలిగా నటించాను. హీరోయిన్గా నా మొదటి చిత్రం బాలా దర్శకత్వం వహించిన అవన్ ఇవన్. అలా కథానాయకిగా నా ప్రస్థావన మొదలైంది. బాలా వంటి సంచన దర్శకుడి చిత్రంలో నటించినా మీరింకా సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారే? సక్సెస్ కాలేదనడం కర్టెక్ కాదు. కథానాయకిగా నా తొలి చిత్రం అవన్ ఇవన్ చిత్రంతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. అదే విధంగా తెగిడి చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే మీరన్నట్లు ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో మంచి పాత్ర అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నాను. మలయాళంలోనూ నటిస్తున్నట్లున్నారు? అవును అక్కడ 3 డాట్స్ అనే చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యాను. అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి .ప్రస్తుతం హ్యాపీబర్త్‌డే చిత్రంలో నటిస్తున్నాను. మరి టాలీవుడ్లో నటించాలన్న ఆసక్తి లేదా? నిజం చెప్పాలంటే తెలుగు చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.అన్ని చిత్రాలు చూస్తాను.తెలుగులో నటించాలన్న ఆకాంక్ష చాలానే ఉంది.అయితే అక్కడ నాకు మేనేజర్ లేరు. తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు? పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలా మంది హీరోలంటే ఇష్టం.ముఖ్యంగా మహేశ్‌బాబుకు నేను అభిమానిని. ఆయనతో నటించాలన్న కోరిక ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను. బెలూన్ చిత్రం గురించి? బెలూన్ చిత్రంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఇందులో 1980లో జరిగే కథాభాగంలో నేను నటించాను. ఈ పాత్ర కోసం వేష, భాషాపరంగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే అప్పటి యువతిగా మారి నటించాననే చెప్పాలి. ఈ చిత్రంతో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న లక్ష్యంగా నటించాను. బెలూన్ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ అనువాద చిత్రంగా విడుదల కానుంది కాబట్టి తెలుగులోనూ నాకిది మంచి ఎంట్రీ అవుతుందనే నమ్మకం ఉంది. -
'బెలూన్' మూవీ స్టిల్స్