Banaganapalli
-
నంద్యాలలో భారీగా పట్టుబడ్డ డబ్బు
-
సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను
-
ఏడాదికి రూ.15,000..అక్క చెల్లెమ్మలకు వరం
-
బాబువన్నీ మోసాలే..బాబు మాటలు నమ్మకండి
-
మూడు పార్టీలు.. మళ్లీ అవే మాయమాటలు
మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. 2014లో మాదిరిగానే చంద్రబాబు, దత్తపుత్రుడు మళ్లీ బీజేపీతో కలిశారు. నాడు మేనిఫెస్టో హామీలను విస్మరించినట్లుగానే ఇప్పుడు రంగురంగుల హామీలు గుప్పిస్తున్నారు. వారి మోసాలు, దగాను గమనించాలని కోరుతున్నా.చంద్రబాబు పేరు చెబితే వంచన, దత్తపుత్రుడి పేరు చెబితే ఐదేళ్లకోసారి కారును మార్చినట్టుగా భార్యను మార్చే ఓ మోసగాడు, వంచకుడు గుర్తుకొస్తాడు! ఒకరికి విశ్వసనీయత లేదు.. ఇంకొకరికి విలువలు లేవు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి. పొరపాటు చేయవద్దని, అందరూ బాగా ఆలోచన చేయాలని కోరుతున్నా. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పేదరికానికి కులం ఉండదని, పేదవాడు ఎక్కడున్నా వారికి తోడుగా నిలిచే మనసు ప్రభుత్వ పెద్దలకు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలను ఆదుకునే గుణం, వారికి తోడుగా ఉండాలనే ఆరాటం పాలకులకు ఉండాలన్నారు. ‘నిజానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు మన మేనిఫెస్టోలో లేవు. అయినప్పటికీ అగ్రవర్ణ పేదలకు సైతం అండగా ఉండాలని, వారు పేదరికంతో ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదని అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డదే’ అని చెప్పారు. అగ్రవర్ణ పేదలను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం కింద 45 – 60 ఏళ్ల మధ్య వయసున్న 4.19 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.629 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మూడేళ్లలో మూడు దఫాల్లో 4,95,269 మందికి రూ.1,877 కోట్ల మేర లబ్ధిని చేకూర్చారు. బనగానపల్లెలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని సభా ప్రాంగణం నుంచే శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. 42.74 లక్షల మందికి మంచి చేశాం ‘చేయూత’ ద్వారా 33.15 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి చేస్తూ 58 నెలలుగా అడుగులు వేశాం. కాపు నేస్తం ద్వారా 4.64 లక్షల మందికి మేలు చేశాం. ఈబీసీ నేస్తం ద్వారా 4.95 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. ఇలా మొత్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసున్న 42.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో పాటు చివరకు ఇళ్ల పట్టాలను కూడా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇళ్లు సైతం కట్టిస్తున్నాం.పిల్లలు పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్షతో అమలు చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల డబ్బులు కూడా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనే వేస్తున్నాం. అక్క చెల్లెమ్మలు బాగుంటే వారి కుటుంబాలూ బాగుంటాయి, పిల్లల భవిష్యత్తూ బాగుంటుందని ధృఢంగా విశ్వసించాం. ఎక్కడా కులమతాలు, ప్రాంతాలు, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడలేదు. అర్హత ఉంటే చాలు వారికి తోడు ఉంటూ పారదర్శకంగా మేలు చేస్తూ అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇది. అవ్వాతాతలు, రైతన్నలతో పాటు అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ప్రతి ఒక్కరికీ గుమ్మం వద్దకే పథకాలను, సంక్షేమాన్ని చేరవేస్తున్నాం. మీ బ్యాంకు ఖాతాలే నిదర్శనం.. గత 58 నెలలుగా మన ప్రభుత్వం చేకూర్చిన లబ్ధికి మీ బ్యాంకు ఖాతాలే నిదర్శనం. మీరంతా ఒక్కసారి బ్యాంకులకు వెళ్లి గత పదేళ్లుగా మీ ఖాతాల స్టేట్మెంట్ ఇవ్వమని మేనేజర్లను కోరండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు, మీ బిడ్డ ప్రభుత్వంలో ఐదేళ్ల డేటాను పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయైనా మీ ఖాతాకు పంపించారా? అని అడుగుతున్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఎన్ని లక్షల రూపాయలు మీ చేతికి వచ్చాయో మీకే కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరుగుతోంది. నాడు ఏ పథకం ఎప్పుడిస్తారో? అసలు ఇస్తారో లేదో తెలియని దుస్థితి. ఇప్పుడు మన గ్రామంలోనే ఓ సచివాలయ వ్యవస్థ వచ్చింది. అందులో మన ఊరి పిల్లలే వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. అది ఆదివారమైనా, సెలవు రోజైనా వలంటీర్ మీ ఇంటి వద్దకే వచ్చి మీ మనవడిగా, మనవరాలిగా తోడుగా ఉంటూ లంచాలు, వివక్ష లేకుండా సేవలు అందిస్తున్నాడు. ప్రతి అక్కచెల్లెమ్మ ఇవన్నీ గమనించాలని కోరుతున్నా. మీరే చూడండంటూ గడప గడపకూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2.70 లక్షల కోట్లను మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో రూ.1.89 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను మీ బిడ్డ అమలు చేశాడు. మీ ఇంటికి వచ్చి మేనిఫెస్టో చూపించి గత ఎన్నికలప్పుడు జగనన్న ఏం చెప్పాడు? ఈ 58 నెలల్లో ఎన్ని చేశాడు? మీరే టిక్ పెట్టండి అని ధైర్యంగా గడప తొక్కే పరిస్థితి ఏ పార్టీకైనా ఉందా? అది ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. మ్యారేజ్ స్టార్, మోసగాడు, వంచకుడు.. ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఆ తర్వాత చెత్తబుట్టలో పడేసి మోసం చేయడం అనే సంప్రదాయాన్ని మార్చి విశ్వసనీయత అనే పదానికి అర్థం తేవడం కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే వంచన గుర్తుకొస్తుంది. పొదుపు మహిళలకు ఆయన చేసిన దగా గుర్తుకొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి పనిగానీ పథకంగానీ గుర్తురాదు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక మోసగాడు, ఐదేళ్లకోసారి కారును మార్చినట్టు భార్యను మార్చే మ్యారేజ్ స్టార్, మోసగాడు, వంచకుడు గుర్తుకొస్తాడు. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదకు కాదు.. పేదవాడి భవిష్యత్‌పై యుద్ధానికి వస్తున్నాయి. మోసగాళ్లకు బుద్ధి చెప్పండి.. మీ బిడ్డకు, చంద్రబాబు ప్రభుత్వానికి తేడాను గమనించాలని అందరినీ కోరుతున్నా. 99 శాతం హామీలను నెరవేర్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్న మీబిడ్డ ఒకవైపున ఉంటే మరోవైపున దగాకోర్లు, పచ్చి మోసగాళ్లు, మాయ మాంత్రికులున్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. మీ బిడ్డ మిమ్మల్ని కోరేది ఒక్కటే! మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అనేది మాత్రమే ఆలోచించండి. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీరే సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా మీ బిడ్డకు అండగా నిలవండి. మోసగాళ్లకు ఓటు అనే దివ్యాస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి. 2014 హామీలను బాబు నెరవేర్చారా? ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి 2014లో కూడా ఇప్పటి మాదిరిగానే మోసపూరిత హామీలిచ్చారు. ముగ్గురూ ఒక్కటై వేదికపై కూర్చున్నారు. కూటమిగా ఏర్పడ్డారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోపై సంతకం పెట్టి మరీ ప్రతీ ఇంటికి పంపించారు. రైతులకు రుణమాఫీపై తొలి సంతకం చేస్తామన్నారు. రూ.85,612 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టారు. పొదుపు సంఘాల మహిళలకు రూ.14,205 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని నమ్మించి విజయవాడ నడిబొడ్డున కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపారు. ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నారు. మరి ఒక్కరికైనా ఖాతాల్లో డిపాజిట్ చేశారా? ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చారా? కరపత్రాలు చూపించి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్‌సిటీ నిర్మిస్తానన్నారు. 2014 మేనిఫెస్టో పేజీ నెంబర్ 16, 17లో అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల్లో మచ్చుకు 9 మాత్రమే మీతో పంచుకుంటున్నా. వాటిల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా? ఇంత దారుణంగా మోసం చేస్తున్న వ్యక్తులు మరోసారి రంగు రంగుల హామీలతో వంచనకు సిద్ధమయ్యారు. కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ఒక విన్నపం.. ‘మీ అందరికీ ఒక విన్నపం! ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది. అందువల్ల బటన్ నొక్కటం పూర్తి చేస్తున్నాం. డబ్బులు వచ్చే కార్యక్రమం కాస్త అటూ ఇటుగా జరుగుతుంది. ఎవరూ ఆందోళన పడొద్దు. త్వరలోనే డబ్బులు పడతాయి. ఈ రెండు వారాల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దు. ఏబీఎన్, టీవీ–5 చూడొద్దు. చెడిపోయిన మీడియా వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. మంచి జరిగితే దాన్ని కూడా వక్రీకరించే చెడిపోయిన, కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏటా రూ.15 వేలు చొప్పున మూడు దఫాలుగా.. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు మంచి చేసేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ ఏటా రూ.15 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసి తోడుగా ఉంటున్నాం. ఈ ఏడాది కొత్తగా ఆర్థిక సాయం పొందుతున్నవారు 65,618 మంది కాగా రెండు దఫాలు తీసుకున్న వారు 1,07,824 మంది ఉన్నారు. మూడో విడతలో 3,21,827 మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి బటన్ నొక్కడం ఈ విడతతో ఆపేస్తున్నాం. మళ్లీ మీకు మరింత మంచి చేసేలా దేవుడు, మీరు ఆశీర్వదించాలని కోరుతున్నా. అదనపు ఆదాయం సమకూరేలా.. చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు మంచి చేశాం. కాపు నేస్తం ద్వారా కాపులకు అండగా నిలిచి ఆర్థిక సహకారం అందిస్తున్నాం. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాల్లోని అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలుస్తున్నామని సంతోషంగా చెబుతున్నా. ఈ డబ్బులతో వారు వివిధ వ్యాపారాలు నిర్వహించుకోవడం ద్వారా ప్రతి నెలా రూ.6 వేల నుంచి రూ.10 వేలు అదనంగా ఆదాయం సమకూరుతుందనే ఉద్దేశంతో అడుగులు వేగంగా ముందుకు వేశాం. 2014లో చంద్రబాబు ‘నవ’ మోసాలివీ.. ► మద్యం బెల్ట్‌షాపులు రద్దు చేస్తూ రెండో సంతకం ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ ► పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ ► పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీలకు రూ.10 వేలు ఆర్థిక సాయం ► పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు ► ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ. ఐదేళ్లలో మొత్తం రూ.6 వేలు సబ్సిడీ ► బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ ► కుటీరలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన ► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు. -
చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెప్తే గుర్తొచ్చేది ?
-
నంద్యాల జిల్లా బనగానపల్లిలో సాక్షి రచ్చబండ
-
నేరచరిత్రలో ఘనుడు బుల్లెట్ రాజు
సాక్షి, బనగానపల్లె : అవుకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గత నెల 22న సభ్యసమాజం తలదించుకునేలా 14 ఏళ్ల బాలుడిపై పైశాచికంగా లైంగికదాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త బుల్లెట్ రాజుకు పోలీసుల రికార్డులోనూ ఘనమైన నేరచరిత్రే ఉంది. బాలుడి లైంగిక దాడి ఘటనలో బుల్లెట్ రాజుతో పాటు ప్రేమసాగర్, రాజు, శ్రీధర్లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుల్లెట్ రాజు ప్రధాన నిందితుడు. ఇక 2019 డిసెంబర్ 25న రమణ అనే వ్యక్తిని అటకాయించి దాడి చేసినట్లు బుల్లెట్ రాజుపై కేసు నమోదై ఉంది. 2013 ఆగస్టు 2న ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులోనూ ఈయనపై పోలీసులు కేసు నమోదు చేయగా, గత సంవత్సరం కొట్టివేశారు. ఇక అవుకు పోలీస్స్టేషన్లోనైతే ఏకంగా బుల్లెట్ రాజుపై రౌడీషీట్ ఉంది. గత సంవత్సరం మార్చి 16న, 2014 ఏప్రిల్ 23న బైండోవర్ కేసులు నమోదై ఉన్నాయి. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, ఉన్నతాధికారుల వద్ద బుల్లెట్ రాజు సన్నిహితంగా ఉండేవాడన్న ప్రచారం ఉంది. టీడీపీ నాయకుల అండ ఉందన్న ఉద్దేశంతోనే తనను ఎవరూ ఏమీ చేయలేరన్న విధంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. కొంతకాలంగా అవుకు పట్టణంలో జులాయిగా తిరుగుతూ, అమ్మాయిల వెంటపడి వేధించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలపైనా స్థానికులు విసుగు చెందారు. కానీ ఇతనిపై స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇటీవల బాలుడిపై ఘటన చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. -
వదినను కొట్టొద్దు అన్నందుకు.. తమ్ముడి హత్య
సాక్షి, బనగానపల్లె(కర్నూలు) : సొంత తమ్ముడినే అన్న కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన మండల పరిధిలోని చిన్నరాజుపాలెం తండాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన సొంత అన్నదమ్ములు ఈశ్వర్‌నాయక్, శంకర్‌నాయక్(35) గ్రామ సమీపంలో పక్కపక్కనే వేర్వేరుగా నివసిస్తున్నారు. శంకర్‌నాయక్ అతని భార్య పార్వతీబాయి వ్యవసాయ పనులకెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈశ్వర్‌నాయక్ టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాగా ఇటీవల ఈశ్వర్‌నాయక్ మద్యానికి బానిసై రోజు భార్య లక్ష్మిబాయిని వేధించేవాడు. కొంతకాలంగా టైలర్ పని విడిచిపెట్టి గౌండా పనికి వెళ్తున్నాడు. శనివారం మాల పున్నమి కావడంతో ఉదయమే మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు. వదినను కొడుతుండగా శంకర్‌నాయక్ అడ్డుకున్నాడు. దీంతో ఆవేశానికి గురైన ఈశ్వర్‌నాయక్ తమ్ముడని కూడా చూడకుండా శంకర్‌నాయక్ తలపై కర్రతో దాడి చేసి, కత్తితో విచక్షణా రహితంగా కడుపులో పొడిచి, అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో శంకర్‌నాయక్ కొంతసేపటికే మృతిచెందాడు. హత్య విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, బనగానపల్లె సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐ మహేష్‌కుమార్ గ్రామానికి చేరుకున్నారు. హత్యకు దారితీసిన వివరాలను మృతుని భార్యను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నాటుసారా విచ్చలవిడిగా లభిస్తుండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయిన డీఎస్పీ నరసింహరెడ్డికి గ్రామస్తులు విన్నవించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, మృతుడి భార్య పార్వతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా పండుగ పూట, సొంత అన్నచేతిలోనే తమ్ముడు హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. -
13వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం
-
బనగానపల్లె నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, బనగానపల్లి (కర్నూలు జిల్లా) : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన బనగానపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. బాతులూరుపాడు, ఎన్నకొండల మీదుగా ఉదయం 10.30 గంటలకు హుస్సైనపురం చేరుకుంటారు. హుస్సైనపురం చేరుకొనే ముందు మహిళ సదస్సులో పాల్గొంటారు. అనంతరం హుస్సైనపురంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మూడు గంటల సమయంలో హుస్సైనపురం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. పాలుకూరు క్రాస్‌రోడ్డు, గోవిందదిన్నెల మీదుగా డోన్ నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద వైఎస్ జగన్‌కు డోన్ నియోజకవర్గ పార్టీ నేతలు, ప్రజలు ఘనస్వాగతం పలుకుతారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో మాట్లాడతారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగుస్తుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. -
కొండను మింగిన టీడీపీ నేతలు
-
బనగానపల్లె ఆసుపత్రిలో అంధకారం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఓ మోస్తరు వర్షానికి స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల ఎదురుగా ఉన్న ఏళ్ల నాటి వేప చెట్టు నేల కూలింది. పక్కనే ఉన్న తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంపై పడటంతో పాక్షికంగా ధ్వంసమైంది. అలాగే విద్యుత్ తీగలపై కొమ్మలు పడటంతో ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. కాగా వీలు కాలేదు. దీంతో ఆసుపత్రిలోని బాలింతలు, రోగులు చీకట్లో అవస్థలు పడ్డారు. -
ముగిసిన షూటింగ్
బనగానపల్లె రూరల్: మండలంలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. బుధవారం ఫతేనగర్ గ్రామ సమీపంలోని ఎతైన మలుపు రోడ్డు వద్ద హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే సాయంత్రం మిట్టపల్లె సమీపంలోని వ్యవసాయ పొలంలో హీరో, హీరోయిన్‌కు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. షూటింగ్లో చిత్ర దర్శకులు తేజతో పాటు పలువురు, ఆర్టిస్టులు పాల్గొన్నారు. -
బనగానపల్లె ఆసుపత్రికి కాజల్, రానా
బనగానపల్లె రూరల్: సినీ హీరో రానా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం బనగానపల్లె ఆసుపత్రికి చేరుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్‌ను అక్కడ నిర్వహించారు. మూడు రోజులుగా యాగంటి క్షేత్రంలో నిర్వహిస్తున్న షూటింగ్‌ను మంగళవారం రానా, కాజల్ మధ్య ఆసుపత్రిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గర్భిణిగా కాజల్ ఆసుపత్రికి రాగా, స్కానింగ్ చేసే సన్నివేశాలను షూటింగ్ చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ గదికి వెళ్లే ప్రధాన గేట్‌కు తాళం వేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఎస్ఐ రాకేష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. బుధవారం యాగంటిలో షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. -
తండ్రిని చంపిన తనయుడు
బనగానపల్లె రూరల్: కన్నతండ్రినే కుమారుడు గొడ్డలితో నరికి చంపిన ఘటన ఆదివారం బనగానపల్లెలో చోటు చేసుకుంది. స్థానిక తెలుగుపేట కాలనీలో నివాసముంటున్న బైరెడ్డి నడిపి వెంకట సుబ్బన్న(58), పుల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు బనగానపల్లెలో న్నారు. వీరిలో మూడో కుమారుడు రామకృష్ణకు వివాహమైంది. అతను రోజు మద్యం సేవించి ఆస్తి విషయంలో తండ్రితో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మంచంపై నిద్రిస్తున్న తండ్రి తలపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాకేష్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విషయం తెలుసుకున్న బనగానపల్లె వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటసాని రామిరెడ్డి హతుడి కుటుంబీకులను పరామర్శించారు. -
నవాబుబంగ్లాలో ‘దేవయాని’
పాతపాడు (బనగానపల్లె రూరల్): బనగానపల్లె నవాబు బంగ్లాలో శనివారం..త్వరలో ఓ టీవీ చానెల్లో ప్రారంభం కానున్న దేవయాని సీరియల్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. సీరియల్ హీరో ఇంద్రనిల్, హీరోయిన్ చందనతో పాటు కోట శంకర్రావుకు సంబంధించిన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. గతంలో ఈ బంగ్లా వద్ద అరుంధతి, జయం మనదేరా...సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దేవయాని సీరియల్ నిర్మాతగా సాయిబాబా, డైరెక్టర్‌గా విజయకృష్ణ పనిచేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
-
భక్తిశ్రద్ధలతో మొహర్రం
బనగానపల్లె: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత ఏపీలోని బనగానపల్లె పట్టణంలో ఆ స్థాయిలో మొహర్రం నిర్వహించడం కర్నూలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లె ప్రత్యేకత. మొహర్రం పీర్ల ఊరేగింపులో భాగంగా షియా మతస్తులు శోక గీతాలు ఆలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎద, వీపుపై మాతం నిర్వహించారు. బుధవారం బనగానపల్లె నవాబు వంశస్తుల ఆధ్వర్యంలో సుమారు 200 పీర్లను పట్టణంలో ఊరేగించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించే ఈ ఊరేగింపును ఆద్యంతం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. స్థానిక నవాబుకోట నుంచి ప్రారంభమైన పీర్ల ఊరేగింపులో బనగానపల్లె నవాబు మీర్ ఫజిల్ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్ పీర్ల వెంట శోకగీతాలు ఆలపిస్తూ నడవగా షియా మతస్తులు నల్లటి వస్త్రాలు ధరించి పీర్ల ఊరేగింపును కొనసాగించారు. ఈ సందర్భంగా బ్లేడ్లు, చురకత్తులతో ఎదపై మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. కొండపేటలోని ఇమాం ఖాసీం పీరు జుర్రేరు వద్దకు చేరుకున్న అన్ని పీర్లను ఆలింగనం చేసుకుంది. ఇక్కడకు వచ్చిన సుమారు 200 పీర్లను జుర్రేరువాగులో శుద్ధిచేసిన అనంతరం తిరిగి చావిడిలోకి చేర్చారు. మాతంను తిలకించేందుకు బనగానపల్లె పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సంతాప సూచకంగా పట్టణంలోని వ్యాపార దుకాణాలు, సినిమా థియేటర్లు మూసివేశారు. -
అన్ని జిల్లాల్లో మోడల్ డిగ్రీ కాలేజీలు
ఉన్నత విద్య, ఆర్జేడీ, మల్లేశ్వరి – నాలుగైదు రోజుల్లో కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యూవల్ – ఉన్నత విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ కె. మల్లీశ్వరి బనగానపల్లె : కర్నూలు జిల్లా ఆత్మకూరు మోడల్ డిగ్రీ కళాశాల తరహాల్లో రాయలసీమ పరిధిలోని అన్ని జిల్లాల్లో డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు కషి చేస్తున్నట్లు ఉన్నతవిద్యాశాఖ రిజినల్ జాయింట్ డైరెక్టర్ కె. మల్లీశ్వరి తెలిపారు. రాయలసీమ పరిధిలోని డిగ్రీకాలేజీలకు సంబంధించి 305 మంది కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులను త్వరలో రెన్యూవల్ చేస్తామని తెలిపారు. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులతోపాటు తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రీయ ఉశ్చరత శిక్షణ అభియాన్ (రూసా) కింద రాయలసీమకు సంబంధించి 14 ప్రభుత్వ డిగ్రి కళాశాలలను ఎంపిక చేశామని తెలిపారు. వీటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.2 కోట్ల ప్రకారం ఖర్చు చేస్తామన్నారు. ఇటీవలే ఆత్మకూరులో మోడల్ డిగ్రీ కళాశాలను ప్రారంభించామని చెప్పిన ఆమె అనంతపురం జిల్లా హిందూపూరంలో కూడా అదే తరహా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాలో కూడా ఈ తరహా కాలేజీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కషి చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్జేడీ సూపరింటెండెంట్ హనుమాయమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలతాదేవి, న్యాక్ కో ఆర్డినేటర్ హెచ్ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
సోమిశెట్టి.. నోరు అదుపులో ఉంచుకో
వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మండిపాటు బనగానపల్లె: ప్రజల మనిషిగా పేరు గాంచిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీకి చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎక్కడదంటూ ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డితో పాటు మరికొందరు నాయకులు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సోమిశెట్టిపై ధ్వజమెత్తారు. మాట్లాడేటప్పుడు స్థాయిని గుర్తించాలని సూచించారు. అమరావతి నిర్మాణంలో పాల్పడుతున్న అవినీతితో సీఎం చంద్రబాబు,లోకేష్ త్వరలో జైలుకెళ్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని సోమిశెట్టి తెలుసుకోవాలన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ హుసేన్, బీసీ సెల్ జిల్లా నాయకులు పాపన్న, కార్యవర్గ సభ్యులు మురళీమోహన్‌రెడ్డి, కంబగిరి స్వామి పాల్గొన్నారు. -
బ్యాంకు ఏజీఎంను దోచుకున్న దోపిడి దొంగలు
కర్నూలు: కర్నూలు జిల్లా బనగానిపల్లె మండలం రాళ్లకొత్తూరు సమీపంలోని రహదారిపై శనివారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అనంతపురం నుంచి మహానందికి కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ జె.లక్ష్మీనారాయణను బెదిరించి... రూ. 38 వేల నగదుతోపాటు బంగారు చైన్‌ను లాక్కున్నారు. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య
టీడీపీ నాయకుల బరితెగింపు ట్రాక్టరుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, ఆపై బండరాయితో మోదిన వైనం నిందితులపై కేసు నమోదు బనగానపల్లె : కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆపతి ప్రభాకర్ నాయుడు(41) గురువారం ఉదయం టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ దాడిలో ఆయన వెంట ఉన్న గుమస్తా మధుభాస్కర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు...రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ నాయుడు గురువారం ఉదయం తన గుమస్తా మధుభాస్కర్‌తో కలసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలో తాను లీజుకు తీసుకున్న మైనింగ్ గనుల వద్దకు వెళ్లారు. వాటిని చూసిన అనంతరం 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా ట్రాక్టర్‌పై వచ్చిన ప్రత్యర్థులు మోటర్ సైకిల్‌ను ఢీకొట్టించారు. ప్రభాకర్ నాయుడు, మధుభాస్కర్ కిందపడిపోగా ట్రాక్టర్లో ఉన్న వారు కిందకి దిగి కత్తులతో ప్రభాకర్ నాయుడిపై దాడిచేసి దారుణంగా నరికారు. ఇంకా బతికి ఉన్నాడన్న అనుమానంతో పెద్ద బండరాయిని తలపై వేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. దాడి సమయంలో మధుభాస్కర్‌ను పక్కకు ఈడ్చి వేయడంతో అతను గాయపడ్డాడు. గత కొంతకాలంగా గ్రామంలో ఇరువర్గాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులతోపాటు గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రభాకర్ నాయుడుకు భార్య లక్ష్మీదేవితోపాటు కుమారులు ఆపతి కార్తీక్(15) ఆపతి శశాంక్(11) ఉన్నారు. మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గ్రామానికి చెందిన నగేష్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలతో అక్కడకి చేరుకుని ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. పరామర్శ హత్యకు గురైన ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులను బనగానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. -
మునిసిపల్ కార్యాలయం ఎదుట కాటసాని ధర్నా
కర్నూలు జిల్లా బనగానపల్లెలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలను కూల్చివేయాలంటూ టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో మునిసిపల్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేసేందుకు రంగం సిద్దం చేశారు. ఆ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని.... తమ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేయాలన్న ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అందుకు మునిసిపల్ అధికారులు ససేమిరా అనడంతో కాటసాని రామిరెడ్డి మునిసిపల్ కార్యాలయం ఎదుటు ఆందోళనకు దిగారు. ఆందోళనలో వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరైయ్యారు. -
మూగనోము!
సాక్షి, కర్నూలు: పురపాలక సంఘాలు.. నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి మైకులన్నీ మూగబోయాయి. నాయకులు రహస్య భేటీలు.. చర్చల్లో తలమునకలవుతున్నారు. నగదు, వస్తువులు, మద్యం తదితరాల పంపిణీని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. పార్టీలోని అసంతృప్తి నేతలు.. ముఖ్య కార్యకర్తలను బుజ్జగించేందుకు చివరి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలను బుట్టలో వేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నంద్యాల, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు.. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో విస్తృతంగా పాల్గొనగా.. విభజన భయంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో నాలుగు రోజుల పాటు చేపట్టిన ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనకు.. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలను పోల్చి చూపడం ప్రజలను ఆలోచింపజేసింది. ప్రజల్లోకి వెళ్లలేకనే చంద్రబాబు కర్నూలు నగరంలో మాత్రమే ప్రజాగర్జన చేపట్టారనే చర్చ జరుగుతోంది. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ప్రచార కమిటీ సారథి, సినీ నటుడు చిరంజీవి గురువారం కర్నూలుకు వచ్చినా నాయకులు, శ్రేణుల్లో కనీస ఉత్సాహాన్ని నింపలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీదారులు అంతంత మాత్రమే కావడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీజేపీ, సీపీఎం, సీపీఐ తమదైన శైలిలో ప్రచారం చేపట్టాయి. వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాలలో ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, నందికొట్కూరులో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత.. డోన్, ఆత్మకూరు, ఆదోని, గూడూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, మణిగాంధీ తదితరులు విస్తృత ప్రచారం నిర్వహించారు. బనగానపల్లె నగర పంచాయతీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. ఇదిలాఉండగా టీడీపీలోకి విభజనకు కారణమైన కాంగ్రెస్ నేతలు చేరడంతో.. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారోననే చర్చ జరుగుతోంది. ప్రలోభాలపర్వం ప్రచారపర్వం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు పోటీ పడి పంపకాలకు సిద్ధమయ్యారు. ఎమ్మిగనూరులో రియల్ఎస్టేట్ వ్యాపారులు బరిలో ఉండటంతో డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.500 చొప్పున చెల్లించినట్లు తెలుస్తోం ది. డోన్ బరిలోని అభ్యర్థులు కొం దరు పరస్పర అవగాహనతో రూ.300 చొప్పున పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఆత్మకూరులోనే ఇదే తంతు కొనసాగింది. ఆదోనిలో శుక్రవారం నలుగురు వ్యక్తులు ఓటర్లకు పంచుతున్న రూ.33వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల, బనగానపల్లెలో 16 మంది సారా విక్రేతలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.