Beheaded
-
తోడి కోడళ్ల సిగపట్లు.. మధ్యలోకి వెళ్లిన మామ, చిన్నకోడలు కాలితో తన్నడంతో
ఆగ్రా: అత్తింటిలో దీపం పెట్టడానికి వచ్చిన తోడి కోడళ్ళు పందెం కోళ్లలా గొడవపడుతుంటే విడదీసే ప్రయత్నంలో మామగారు చిన్న కోడలి తల నరికేశాడు. అనంతరం ఆగ్రా జిల్లాలోని కిరావాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హంతకుడి చిన్నకొడుకు, మృతురాలి భర్త ఫరూఖాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రఘువీర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగ్రాలోని మాలిక్ పూర్ గ్రామంలో నివాసముండే రఘువీర్ (62)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చనిపోగా అతని భార్య తమతోనే ఉంటోందని.. ఆమెతో చిన్న కోడలు ప్రియాంక సింగ్ (28) తరచూ గొడవపడుతూ ఉండేదని చెప్పాడు. వారిని కలిసి ఉండాలని ఎంత చెప్పినా వినేవారు కాదని పోలీసులకు తెలిపాడు రఘువీర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇద్దరి కోడళ్ల మధ్య వాగ్వాదం చెలరేగిందని, ఇద్దరూ సిగపట్లు పట్టుకున్నారని.. విడదీసేందుకు మధ్యలోకి వెళ్లిన రఘువీర్ ను ప్రియాంక కాలితో తన్నగా.. దూరాన పడిన మామగారు కోపోద్రిక్తుడై గొడ్డలి అందిపుచ్చుకుని చిన్న కోడలి మెడ మీద వేటు వేశాడని.. దాంతో ఆమె తల మొండెం రెండూ వేరై అక్కడికక్కడే చనిపోయిందని తెలిపారు. మృతురాలు ప్రియాంక సింగ్ తండ్రి ఫిర్యాదు ప్రకారం తండ్రీ, కొడుకులు ఇద్దరి పైనా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇది కూడా చదవండి: 5 గంటల్లో రూ.40.. కర్ణాటక ఆటో డ్రైవర్ల దయనీయ స్థితి.. -
రూ.500 కోసం దారుణం.. తల నరికి చేతిలో పట్టుకుని 25 కి.మి..!
గువాహటి: క్షణికావేశంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడటం లేదు కొందరు. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై వేసిన రూ.500 పందెంపై మొదలైన ఓ గొడవ వ్యక్తి ప్రాణాలు తీసింది. క్షణికావేశంలో ఎదుటి వ్యక్తి తల నరికి చేతిలో పట్టుకుని 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ సంఘటన అస్సాంలోని సొనిత్‌పుర్ జిల్లాలో సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫూట్‌బాల్ మ్యాచ్ అనంతరం గొడవ జరిగినట్లు చెప్పారు. ఫూట్‌బాల్ మ్యాచ్‌కు ముందు నిందితుడు తునిరామ్ మాద్రిని బాధితుడు బోయిలా హెమ్‌రామ్ రూ.500 అప్పు అడిగాడు. అందుకు నిందితుడు నిరాకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నిందితుడు బెట్లో ఓ మేకను గెలుచుకున్నాడు. ఆ మేకును కోసేందుకు తనతో రావాలని బోయిలా హెమ్‌రామ్‌ను కోరాడు నిందితుడు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. బోయిలా హెమ్‌రామ్‌ను హత్య చేసిన తర్వాత అతడి తలతో ఇంటికి వెళ్లాడు నిందితుడు. అక్కడే ఉన్న అతడి సోదరుడు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఆ తర్వాత 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్‌కు తలతో వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసేందుకు ఉపయోగించిన కొడవలిని సైతం తీసుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం? -
Crime News: ప్రేమించానంటూనే నరరూప రాక్షసుడిలా..
సాక్షి,బళ్లారి: ప్రేమించానన్నాడు. ప్రాణంగా చూసుకుంటానన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. పైగా ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినా సుఖంగా మాత్రం లేడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగలేదని, ఆమె వేరొకరి సొంతం కాకూడదని రగిలిపోయాడు. చివరికి.. నరరూప రాక్షసుడిలా మారిపోయి ఘోరానికి పాల్పడ్డాడు. మాజీ ప్రేయసి తల నరికి హత్య చేయడంతో పాటు.. మొండెం నుంచి ఆమె తలను వేరు చేశాడు ఓ ఉన్మాది. నేరుగా పోలీసు స్టేషన్‌కు ఆ తలను తీసుకెళ్లాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో సంచలనం రేకెత్తించింది. గురువారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కేబీ హట్టి (కన్నబోరయ్యనహట్టి) గ్రామంలో నిర్మలా (23) అనే అమ్మాయిని.. భోజరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. యువతి తలను పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయారు. నిర్మల బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. పరీక్షలు ఉన్న కారణంగా స్వంత ఊరులో చదువుకోవడానికి వచ్చింది. మాట్లాడాలని పిలిచి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు భోజరాజు. కొన్నాళ్ల కిందట ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని ఆమె వెంటపడ్డాడు. స్నేహం ముసుగులోని అతని ప్రేమను ఆమె ఒప్పుకోలేదు. పంచాయితీ పెట్టి పెద్దలతో పెళ్లి కుదర్చాలని ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వేరే యువతిని రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు కూడా. అయితే.. నిర్మలను కిరాతకంగా హతమార్చిన ఉన్మాదిని నడిబజారులో ఉరితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై కూడ్లిగి తాలూకా ఖానాహొసళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయ్‌పూర్ హత్య: రాజస్థాన్‌లో నెలపాటు 144 సెక్షన్
జైపూర్: మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్దాస్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. మరోవైపు సీఎం అశోక్‌గెహ్లాట్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు. ఈ ఉదంతంపై నిరసనలు, మతపరమైన ఉద్రిక్తతలతో ఉదయ్‌పూర్‌తో పాటు రాజస్తాన్ అంతా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్ కాకుండా చూస్తున్నారు. సంయమనం పాటించాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్ఐఏ బృందాన్ని పంపింది. కస్టమర్లలా వచ్చి... మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్‌పూర్‌లో టైలర్. హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్‌లోని దాన్ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. దీన్నంతా గౌస్ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కణ్నుంచి పారిపోయారు. ఈ దారుణంపై స్థానిక దుకాణదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా వారంతా దుకాణాలు మూసేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే యూఐటీ ప్రకారం.. కన్హయ్య లాల్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య ఎనిమిదేళ్ల కుమారుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా దాన్ని కన్హయ్య సమర్థించినట్టు చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఆయనను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కన్హయ్యను చంపుతామంటూ జూన్ 17న తీసిన వీడియోను కూడా హంతకులు మంగళవారమే సోషల్ మీడియాలో పెట్టారు. తమ వర్గం వారు ఇలాంటి దాడులను ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్తర్ స్థానిక మసీదులో పని చేస్తుండగా.. గౌస్ కిరాణా దుకాణం నడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని ఉదయ్‌పూర్ ఎస్పీ మనోజ్‌కుమార్ చెప్పారు. రక్షణ కోరినా పట్టించుకోలేదు.. మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. రాజస్తాన్‌లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పునియా ఆరోపించారు. ‘‘హంతకులు కత్తులు చేతబట్టి నేరుగా ప్రధానినే చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెను సవాలు’’ అని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్‌కుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్త: షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే.. -
నూపుర్ శర్మ ఫొటో షేర్ చేసినందుకు షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే
Udaipur Gruesome Murder: జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ హత్యకు గురయ్యాడు. టైలర్ తన దుకాణంలో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. టైలర్ హత్యోదంతంతో ఉదయ్‌పూర్‌లోని మల్డాస్ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. ఈఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. టైలర్ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో పోలీసులు మోహరించారు. 24 గంటలపాటు నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్ శర్మకు మద్దతుగా టైలర్ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పారిపోతున్న నిందితులను రాజ్‌సమంద్ జిల్లాలోని భీం ప్రాంతంలో పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. చదవండి👇 వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? ఉపాధ్యాయుడి హత్య: భార్యే హంతకురాలు.. వివాహేతర సంబంధంతో.. -
భర్త తల నరికి.. కవర్లో పెట్టుకుని..
రేణిగుంట: ఓ మహిళ తన భర్తను దారుణంగా హతమార్చి.. అతని తలను వేరుచేసి కవర్లో పెట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో కలకలం రేపింది. రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన శ్రీభాష్యం రవిచంద్రసూరి (53), అతని భార్య ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వసుంధర (50), కుమారుడు జయదీప్ అలియాస్ సాయి (20) గత కొన్నేళ్లుగా రేణిగుంటలో కాపురముంటున్నారు. రవిచంద్రసూరి తిరుచానూరు ముళ్లపూడి సమీపంలో ఓ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ నడుపుతున్నాడు. రేణిగుంట బుగ్గవీధిలో పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే వీరు అద్దె ఇంట్లో కాపురముంటున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో రవిచంద్రసూరి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ భార్య వసుంధర కొన్నాళ్లుగా ఘర్షణ పడుతుండేది. పైగా అతను మద్యం తాగి వస్తుండడంతో రోజూ వాదులాడుకునేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్తకు ఇష్టమైన దోసెలు వేసింది. తింటూ ఉండగానే వంటింట్లో సిద్ధంగా ఉంచుకున్న కత్తితో తలపై మోదింది. వెంటనే తేరుకున్న భర్త ఏం చేస్తున్నావంటూ మాట్లాడుతుండగానే.. గుండెలపై కూర్చొని పీక కోసేసింది. చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత తలను వేరు చేసింది. అనంతరం మృతుడి తలను ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని కుమారుడు జయదీప్‌ను వెంటపెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులకు తన చేతిలో ఉన్న కవర్‌ను తెరిచి భర్త తలను చూపడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వసుంధరను అదుపులోకి తీసుకుని హత్యకు దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హంతకురాలు వసుంధరకు, కుమారుడు జయదీప్‌కు మానసిక స్థితి బాగోలేదని చుట్టుపక్కలవారు తెలిపారని రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ తెలిపారు. -
రైల్వే ఉద్యోగి ఘాతుకం.. భార్యకు కరోనా అని తెలిసి తల నరికి
పట్నా: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యకు కరోనా అని తేలడంతో.. ఓ రైల్వే ఉద్యోగి ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు.. అతుల్ లాల్ అనే వ్యక్తి రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లాల్ భార్యకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో ఆగ్రహానికి గురైన లాల్ కత్తితో భార్య తల నరికి హత్య చేశాడు. ఆ తర్వాత లాల్ కూడా అపార్ట్మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఢిల్లీలో ఓ వ్యక్తి అనుమానంతో భార్యను నడిరోడ్డులో కత్తితో 25 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య -
ప్రేమ వ్యవహారం: కొద్ది రోజుల్లో పెళ్లి.. యువతి తల నరికి
పట్నా: మరి కొద్ది రోజుల్లో వివాహం చేసుకుని నూతన జీవితం ఆరంభించబోతుంది. వైవాహిక జీవితానికి సంబంధించి కలలు కంటూ ఊహల్లో తేలిపోతున్న ఆ యువతి.. అమానుష రీతిలో హత్యకు గురైంది. దుండుగులు కాళ్లు, చేతులు కట్టేసి.. యువతి తల నరికి అత్యంత కిరాతకంగా హతమర్చారు. పెళ్లి కళ ఉట్టిపడాల్సిన ఆ ఇంట్లో ప్రస్తుతం విషాదం రాజ్యమేలుతుంది. ఇక యువతి మరణానికి వరుడి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బిహార్‌లో వెలుగు చూసిన ఈ దారుణం వివరాలు... నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామానికి చెందిన యువతి(19)కి నీర్పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు సరస్వతి పూజా సమయంలో వధువు కుటుంబం వరుడి కుటుంబ సభ్యులకు సుమారు 4 లక్షల విలువైన లాంఛనాలను కూడా ముట్టజెప్పారు. మరికొద్దిరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. వధువుని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి ఆమె తల నరికి కిరాతకంగా చంపేశారు. తల లేని యువతి శవం చూసి స్థానికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న తార్థారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వరుడి లవ్ ఎఫైర్ కారణంగానే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆజాద్ గతంలోనే మరో యువతితో ప్రేమాయనం నడిపాడని.. ఆమె బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వాపోయారు. చదవండి: 'చేదు నిజాలు తెలిశాయి, అతడితో నా పెళ్లి జరగదు' -
60యేళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా
కోలకతా : దేశంలో మహిళలపై హింసకు, దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. దక్షిణ కోల్‌కతాలోని అద్దె అపార్ట్మెంట్లో నివసిస్తున్న 60 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన కలకలం రేపింది. ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. ఇంత దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడ్డారో అంచనా వేయలేక పోలీసులు సైతం తలలు పట్టుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనలో చనిపోయిన మహిళను పంజాబ్‌కు ఊర్మిళ కుమారిగా గుర్తించారు. తన ఇద్దరు కొడుకులతో గత కొన్నాళ్లుగా కోలకతాలో నివసిస్తోంది. కుమారులు ఇద్దరు వివాహానికి హాజరయ్యేందుకు వేరే నగరానికి వెళ్లారు. దీంతో ఆమె రెండు రోజులుగా ఒంటరిగానే వుంటోంది. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని భావిస్తున్నారు. శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. తలను వేరు చేయడంతోపాటు, పొత్తి కడుపును చీల్చివేశారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఆమె శరీరంపై బంగారం ఆభరణాలు, ఇంట్లోని నగదు అలానే ఉన్నాయనీ, దీంతో పగతో చేసిన హత్యగానే ప్రాథమికంగా భావిస్తున్నామని జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) మురళీధర శర్మ అన్నారు. అయితే విలువైన వస్తువులు ఏమైనా మాయమయ్యాలేదా అనేది ఇపుడే నిర్ధారించలేమని శర్మ తెలిపారు. బాధితురాలి కుమారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని వెల్లడించారు. అయితే ఊర్మిళ నివాసానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండేదనీ, దీంతో అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పలుసార్లు ఆమె గారియాహాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్థానికులు చెప్పారు. ఆ కక్షతోనే ఈదారుణానికి ఒడిగట్టి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. -
కసితోనే భార్య తల నరికాడు
సాక్షి, అమరావతి: అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో తలెత్తిన విభేదాలు, మనస్పర్థల కారణంగానే భార్య మణిక్రాంతిని కసితోనే కడతేర్చాడని విజయవాడ శాంతిభద్రతల విభాగం డీసీపీ–2 విజయరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన శ్రీనగర్‌కాలనీ 4వ లైనులో భర్త చేతిలో మణిక్రాంతి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్‌కుమార్‌ను, అతడికి సహకరించిన కారు డ్రైవర్ భవానీ ప్రసాద్‌ను శుక్రవారం సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ విజయరావు ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ విజయరావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘విజయవాడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న మణిక్రాంతి, ప్రదీప్‌కుమార్ 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వీరి కాపురం బాగానే ఉంది. 2017లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రదీప్ అతడి కుటుంబ సభ్యులపై మణిక్రాంతి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో 2018లో ఫిర్యాదు చేయగా 498(ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత వివిధ సందర్భాల్లో అదే పోలీసు స్టేషన్లో మరో మూడు సార్లు మణిక్రాంతి ఫిర్యాదు చేయగా ప్రదీప్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో మూడు కేసులు.. మాచవరం పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. సదరు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేశారు. మణిక్రాంతి పెట్టిన కేసులలో ప్రదీప్‌కుమార్, అతడి కుటుంబ సభ్యులు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఇటీవల సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో పెండింగ్‌లో ఉన్న వారెంట్ ఆధారంగా ఈ నెల 6వ తేదీ అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 7వ తేదీ ప్రదీప్ బెయిల్‌పై బయటకొచ్చాడు. నీవెంతంటే.. నీవెంత.. ఈ నెల 7వ తేదీన విజయవాడలోని కోర్టు ఆవరణలో భార్యభర్తల మధ్య కోర్టు ఆవరణలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. నీవెంత అంటే నీవెంత అనే స్థాయిలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అతడి స్నేహితుడు మధురానగర్ 7వ లైనుకు చెందిన గరికపాటి భవానీప్రసాద్ సహకారం తీసుకున్నాడు. హత్య జరిగిన ముందు(10.8.19) రోజు శ్రీనగర్ కాలనీకి భవానీప్రసాద్కు చెందిన కారులో వెళ్లి రెక్కీ నిర్వహించారు. 11వ తేదీ మధ్యాహ్నం మళ్లీ భవానీప్రసాద్ తన కారులో ప్రదీప్‌ను శ్రీనగర్ కాలనీకి తీసుకొచ్చి మణిక్రాంతి ఇంటి ముందు అతడిని దించి తాను వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రదీప్ కుమార్ తన పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో మణిక్రాంతి వద్దకు వెళ్లి ఆమెను కాళ్లపైనా, మెడపైన విచక్షణా రహితంగా నరుకుతుండగా ఆమె కేకలు వేసింది. అది విని మృతురాలి తల్లి, చెల్లి బయటకు వచ్చి చూడగా వారిని బెదిరించాడు. తలను వేరు చేసి చేతిలో పట్టుకుని వెళ్తుండగా అడ్డువచ్చిన ఆమె తల్లి, చెల్లితోపాటు స్థానికులను ప్రదీప్ కత్తితో బెదిరించి పారిపోతూ సమీపంలోని ఏలూరు కాలువలో తలను, కత్తిని, ఫోన్‌ను పడేశాడు. ఈ నేపథ్యంలో డెయిల్ 100కు వచ్చిన సమాచారం మేరకు సత్యనారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరినీ శుక్రవారం అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కారు, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో.. నిందితుడు మృతురాలి తలను వేరు చేసి కాలువలో పడేశాడు. ఆ తల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నాం. కాలువ మార్గంలో ఉన్న పోలీసుస్టేషన్లకు సమాచారం అందించాం. స్థానిక పోలీసులు వెతుకుతున్నారు. అయితే తల కనబడకపోయినా.. కేసుకు సంబంధించి బలమైన సాంతికేక ఆధారాలైన సీసీ టీవీ ఫుటేజీ సేకరించాం. హతుడు ఉపయోగించిన కత్తికి సంబంధించిన పిడికిలి లభ్యమైంది. రక్త నమానాలు తీసుకున్నాం. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కారును సీజ్ చేశాం. వీటన్నింటీ ఆధారంగానే చార్జీషీటు దాఖలు చేసి నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం’ అని విజయరావు వివరించారు. సమావేశంలో ఏడీసీపీ ఎల్టీ చంద్రశేఖర్, ఏసీపీ షేక్ షరీఫుద్దీన్, సీఐ బాలమురళీ కృష్ణ, ఎస్ఐ సత్యానారాయణ పాల్గొన్నారు. -
తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు
రాంచీ: జంషేడ్‌పూర్ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన మూడేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పాత నేరస్తుడు రింకూగా గుర్తించారు పోలీసులు. గత రాత్రి రైల్వే స్టేషన్ నుంచి అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి.. బుధవారం ఉదయం మృతదేహంగా ప్రత్యక్షమయ్యింది. నిందితుడు చిన్నారి తలను, మొండాన్ని వేరు చేసి.. పొదల్లో పడేశాడు. అంతేకాక చిన్నారిపై అత్యాచారం కూడా జరిగినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టు తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గత రాత్రి తల్లితో కలిసి చిన్నారి రైల్వే స్టేషన్లో నిద్రించింది. ఆ సమయంలో స్టేషన్‌కు వచ్చిన రింకు పాపను తీసుకుని.. కామ్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారం చేసి.. అతి పాశవికంగా చంపడమే కాక.. తలను, మొండాన్ని వేరు చేసి పొదల్లో పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రింకూను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రింకుకు ఇలాంటి నేరాలు కొత్త కాదని.. గతంలో ఓ ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడని.. ఆ కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి.. ఓ వారం రోజుల క్రితమే విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అంతేకాక రింకు తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. -
బిహార్‌లో దారుణం..
పట్నా : బిహార్‌లో పదహారేళ్ల బాలిక దారుణ హత్యకు గురయ్యింది. దాంతో గయా పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వివరాలు.. గత ఆదివారం గయలో శరీరం నుంచి తలను వేరు చేయడమే కాకుండా ముఖంపై యాసిడ్‌తో కాల్చిన గాయాలు, ఛాతీపైనా తీవ్రమైన గాయాలతో అత్యంత దారుణ స్థితిలో ఓ పదాహారేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. మరణించిన బాలిక డిసెంబరు 28న కనిపించకుండా పోగా, జనవరి 6న కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. తమ కూతురుపై అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ సంఘటన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల దర్యాప్తు త్వరగా చేయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గయలో మంగళ, బుధ వారాల్లో క్యాండిల్ లైట్లతో ర్యాలీలు చేశారు. అయితే ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులు దీన్ని అత్యాచారం, హత్యగా ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభ్యమై అయిదు రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్ చెయ్యకపోవడంపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. తమ కూతురు కనిపించట్లేదని ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే బాలిక కుటుంబ సభ్యుల చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉన్నాయంటున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టంలో బాలికపై అత్యాచారం జరిగిందా.. లేదా అని తెలుస్తుందని.. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు. -
నల్లమలలో వెదురు నరికివేతపై నిషేధం
కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు బొంగుల నరికివేతపై ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధాన్ని విధించిందని కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్ మనోహర్ వెల్లడించారు. ఈమేరకు ఇటీవలే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. అడవిలో ఎవరైనా అక్రమంగా వెదురు బొంగులను నరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెదురు బొంగుల నరికివేతను పూర్తిస్థాయిలో నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడవుల పరిరక్షణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని రేంజర్ కోరారు. -
కుక్క పిల్లలపై పైశాచిక ఘటన
-
హైదరాబాద్‌లో పైశాచిక ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. మూగ జీవి నుంచి పిల్లలను ఎత్తుకెళ్లిన కొందరు దుండగులు.. వాటి తల నరికి చంపారు. పురానాపూల్ లోని పార్థివాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే క్రాంతి రాజా అనే వాలంటీర్ ఓ కుక్కకు, దాని పిల్లలకి భోజనం పెడుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి అవి కనిపించకుండా పోవటంతో చుట్టుపక్కల గాలించాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ సిమెంట్ పైప్ లైన్ల వద్ద ఓ పిల్ల దేహం ముక్కలై పడి ఉండగా.. తల్లి అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. ఓ పైపులో మిగతా మృతదేహాలు పడి ఉన్నాయి. నాలిగింటిని తల నరికి చంపగా.. మరో దానిని చర్మంతో సహా వలిచి ముక్కలుగా నరికారు. ఈ దారుణంపై స్థానిక పోలీసులకు క్రాంతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తీరతామని చెబుతున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవటంతో నిందితుడిని గుర్తించటం కష్టం మారిందని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కొందరు తాగుబోతులు ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించగా.. ఆ కుక్క వారిని చూసి మొరిగింది. ఈ కోపంలోనే వాళ్లు ఈ దాష్టీకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఖననం చేశాక కూడా ఆ తల్లి శునకం సిమెంట్ పైపులైన్ల వద్దే తచ్చాడుతూ రోదిస్తుండటం స్థానికులను కలిచివేస్తోంది. -
మోదీ చౌక్‌లో తెగిపడ్డ తల
పట్నా : బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న ఓ చౌరస్తా పేరును మార్చేందుకు కొందరు యత్నించగా.. అడ్డుకున్న ఓ వృద్ధుడిని దారుణంగా తల నరికి చంపారు. ఈ కేసుపై పోలీసులు, నేతలు ఇచ్చే పొంతన లేకపోవటంతో ఇప్పుడక్కడ ఇది రాజకీయ చర్చకు దారితీసింది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం... దర్బంగలోని భాదవన్ గ్రామం సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ చౌరస్తాకు ‘ నరేంద్ర మోదీ చౌక్’ అనే పేరుంది. శుక్రవారం సుమారు 50-60 మంది ఆర్జేడీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉప ఎన్నికల్లో విజయంతో నినాదాలు చేస్తూ.. ఆ బోర్డు(మోదీ చౌక్)ను తొలగించి.. దానికి లాలూ ప్రసాద్ చౌక్‌గా నామకరణం చేసేందుకు యత్నించారు. అయితే వారికి అడ్డుకునేందుకు రాంచంద్ర యాదవ్(60) యత్నించగా.. అతన్ని హకీ స్టిక్‌లతో కొట్టి, ఆపై తల నరికి హత్య చేశారు. దాడిలో రాంచంద్ర కొడుకు కమలేష్‌కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు మాత్రం బాధిత కుటుంబ కథనాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఎప్పటి నుంచో భూతగాదాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందని.. పబ్లిసిటీ స్టంట్ కోసమే హతుడి కుటుంబ సభ్యులు మోదీ(చౌక్) పేరును తెరపైకి తెచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు? ఈ ఘటనపై డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తన ట్విట్టర్లో స్పందించారు. ఆ కథనాలన్నీ అవాస్తవమని.. ఆ చౌక్‌కు పేరు ఎప్పటి నుంచో ఉందని.. అది భూతగాదాలో జరిగిన హత్యేనని ట్వీట్ చేశారు. కానీ, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాత్రం ఈ కేసులో అనుమానాలు ఉన్నట్లు చెబుతున్నారు. ‘రామచంద్ర(హతుడు) భార్యతో నేను మాట్లాడా. మీడియా ముందు బోర్డు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావని పోలీసులు ఆమెను బెదిరించినట్లు నాతో చెప్పింది. ఆ లెక్కన్న వాస్తవాలు దాచిపెట్టి పోలీసులు ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనిపిస్తోంది’ అంటూ గిరిరాజ్ తెలిపారు. ఇక బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ కూడా ఇది చౌక్ పేరు మార్చే క్రమంలో జరిగిన గొడవ అని చెబుతుండటం గమనార్హం. ఏది ఏమైనా ఈ కేసు పోలీసుల తీరుపై విమర్శలకు తావునిస్తోంది. -
టీచర్ల ముందే తలనరికిన ఉన్మాది
-
టీచర్ల ముందే తలనరికిన ఉన్మాది
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. టీచర్లు, విద్యార్థుల ముందే ఆమెను తలనరికి కిరాతకంగా హతమార్చాడు. అనుప్పూర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట్మా పట్టణానికి చెందిన 17 ఏళ్ల పూజా పనికా, నిగ్వాని రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన పూజను ఓ యువకుడు వెంబడించాడు. పాఠశాల గేట్ వద్దకు చేరుకోగానే అప్పటిదాకా తనతో దాచుకున్న తల్వార్‌ను తీసి ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. పూజ వీపు, మెడ, గొంతు భాగంలో పొడిచాడు. కత్తి పోట్లకు ఆమె తల తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్లు, విద్యార్థులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఇదంతా చూస్తున్న స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ‘బాలిక వెనకాలే అతను రావటం చూశాం. కానీ, ఆమె ఇంట్లో వ్యక్తి అయి ఉంటాడని భావించాం. చివరకు కత్తితో ఆమెపై దాడి చేశాడు. మేమంతా అప్రమత్తం అయ్యే లోపు ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అనుమానితుడి అరెస్ట్... కాగా, 2014లో యువతిని వేధించాడన్న కారణంగా దిలీప్ సాహూ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీస్ అధికారి విజయ్ సింగ్ తెలిపారు. స్కూల్ ఆవరణలోనే అందరి ముందు ఈ భయానక ఘటన చోటు చేసుకోవటంతో వారం రోజులు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. -
భర్త లేకుండా బయటకు వచ్చిందని..
కాబుల్: మహిళలపై తాలిబన్ల అఘాయిత్యాలు అఫ్గనిస్తాన్‌లో పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భర్త లేకుండా తమ గ్రామంలోకి ప్రవేశించిన ఓ మహిళను తాలిబన్లు అతికిరాతకంగా చంపారు. ఏకంగా మహిళ తలను మొండెం నుంచి వేరు చేసి తమ కర్కషత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఈ సంఘటన సర్ ఈ పుల్ ప్రావిన్స్‌లోని తాలిబన్ల పాలనలో ఉన్న లట్టి గ్రామంలో చోటు చేసుకుంది. భర్త ఇరాన్లో ఉండటంతో మార్కెట్లో షాపింగ్ చేయడానికి లట్టి గ్రామానికి బాధిత మహిళ వచ్చిందని సర్ ఈ పుల్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. భర్త లేకుండా వచ్చినందుకు గానూ ఆమెను తాలిబన్లు హత్య చేసినట్టు పేర్కొంది. తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఇస్లాం పేరుతో నిబంధనలను తాలిబన్లు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పురుషుల సహాయం లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావడం నిషేధం. చదువు, ఉద్యోగాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. బురఖా తప్పని సరిగా ధరించాలి. ఇటీవలే భద్రతాదళాల్లో పని చేస్తున్న ఐదుగురు మహిళలు ఉద్యోగానికి వేళ్తుండగా తాలిబన్లు తుపాకులతో కాల్చి చంపారు. 2001లో తాలిబన్ల ప్రాబల్యం తగ్గినప్పటినుంచి మహిళల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.విద్యా, ఉపాధిలో అఫ్గన్ మహిళలు కొంత మేర విజయం సాధించినా తాలిబన్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. -
తల్లి కళ్లెదుటే చిన్నారి తల నరికేశాడు!
తైపీ: తైవాన్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని దుండగుడు కన్నతల్లి కళ్లెదుటే అభంశుభం తెలియని ఓ చిన్నారి తల నరికివేశాడు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజధాని తైపీలో నిన్న ఉదయం మెట్రో స్టేషన్ కు ఓ తల్లీ,కూతురు వెళ్తున్నారు. బాలిక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తుంది. ఇంతలోనే ఓ గుర్తుతెలియని దుండగుడు వారిద్దరిని ఫాలో అయ్యాడు. కొంతసేపటి తర్వాత ఆ దుండగుడు తమను సమీపించాడని బాలిక తల్లి తెలిపింది. ఆ సమయంలో తన కూతురు సైకిల్ నడుపుందని ఆ వ్యక్తి తన బేబీకి సహాయం చేయడానికి వస్తున్నాడని భావించినట్లు తెలిపింది. బాలిక వద్దకు చేరిన వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో చిన్నారిపై దాడికి దిగాడు. తాను ఎంత వారిస్తున్నా వినకుండా దుండగుడు చిన్నారిపై కత్తితో అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతడ్ని లాగేందుక చాలా ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని చెప్పింది. చుట్టుపక్కల ఉన్న కొందరు అక్కడికి చేరుకునే లోగానే ఆ చిన్నారి తల నరికివేసి అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. వారు అ దుండగుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అదేరోజు ఉదయం మెట్రో స్టేషన్ దగ్గర్లోని ఓ సూపర్ మార్కెట్లో దాడికి పాల్పడిన కత్తిని కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి పేరు వాంగ్ అని, అతడి మానసిక స్థితి సరిగాలేదని వెల్లడించారు. -
ప్రార్థనకు రాలేదని కాల్చి చంపారు..
మోసుల్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అఘాయిత్యాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. వారు నరరూప రాక్షసులని మరోసారి నిరూపించుకున్నారు. పాప్ గీతాలు విన్నాడని ఓ యువకుడి తల నరికిన ఉగ్రవాదులు తాజాగా మరో ఇద్దరిని కాల్చి చంపేశారు. అయితే, వీరు మసీదులో ప్రార్థనకు హాజరుకాకోపోవడమే అందుకు కారణమట. ఇది కూడా యువకుడి తల నరికిన మోసుల్‌లోనే చోటుచేసుకుంది. కుర్దీష్కు చెందిన మీడియా సంస్థ ఆ వివరాలను వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం మోసూల్ లోని ఓ మసీదు ప్రార్థనలకు హాజరుకాలేదని ఇద్దరు యువకులను ఉగ్రవాదులు బంధించారు. అనంతరం వారిని అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ తన్నుతూ చివరకు పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి దారుణంగా కాల్చిచంపేశారు. అంతకుముందు ఇదే మోసుల్‌లో అయాం హుస్సేన్ (15) అనే బాలుడు తన తండ్రి చౌక ధరల దుకాణంలో పాటలు వినుకుంటూ కూర్చుండగా అదే సమయంలో ఆ వైపు పెట్రోలింగ్ కోసం వచ్చిన ఉగ్రవాదులు అతడిని పట్టుకొని బహిరంగంగా తల నరికేశారు. అనంతరం అతడి దేహాన్ని సాయంత్రపూట తల్లిదండ్రులకు అప్పగించారు. -
టాయ్ ట్రైన్ ఢీకొని తల విడిపోయింది
సిలిగురి: పశ్చిమబెంగాల్లో ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మహబిరిస్తాన్ వద్ద ఓ యువకుడు ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా టాయ్ ట్రైన్ వచ్చి ఢీకొనడంతో అతడి తల మొండెం విడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. రైలు వేగం పుంజుకుందని తెలిసినప్పటికీ కూడా అతడు నిర్లక్ష్యంగా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడు వివరాలు తెలియరాలేదు. -
పాక్ స్మగ్లర్‌కు శిరచ్ఛేదం
రియాద్: హెరాయిన్, కొకేయిన్ వంటి మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేస్తూ తమ పౌరులను వాటికి బానిసలుగా మార్చుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థానీకి.. సౌదీ అరేబియా అధికారులు మరణదండనను అమలుచేశారు. పాకిస్థాన్‌కు చెందిన షా ఫైజల్ అజీమ్ షా అనే స్మగ్లర్ కు శుక్రవారం శిరచ్ఛేదం అమలుచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఈ ఏడాది సౌదీలో అమలుచేసిన మరణ శిక్షల సంఖ్య 109కి చేరింది. పలుమార్లు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డ అజీజ్.. కొద్ది రొజుల కిందట పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో తన నేరాన్ని అంగీకరించడంతో అతనికి మరణశిక్ష ఖరారయింది. అయితే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దాదాపు 50 రోజుల పాటు మరణ దండనలకు విరామం ప్రకటించిన సౌదీ అధికారులు.. అజీన్ శిరచ్ఛేదంతో తిరిగి షరియత్ చట్టాల అమలును ప్రారంభించారు. సౌదీలో నేరాలకు పాల్పడి, మరణదండనకు గురైన వీదేశీయుల సంఖ్య 2014లో 87 శాతం ఉండగా ఈ ఏడాది 125 శాతానికి పెరిగింది. షరియత్ చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాల అక్రమరవాణా, అత్యాచారం, హత్య, ఆయుధాలతో దోపిడీ, మతధర్మాలను మీరడం లాంటిచర్యలను తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. ఆయా కేసుల్లో దోషులకు మరణదండన ఖాయం. -
మంత్రాల పేరుతో వృద్ధురాలి తల నరికివేత
గౌహతి: అసోంలో అమానుషం చోటు చేసుకుంది. చేతబడి నెంపతో గ్రామస్తులంతా కలిసి అరవైమూడేళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సోనిత్ పూర్జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక దేవాయలంలో దేవుని ప్రతినిధిగా, అమ్మగా చలామణిలో ఉన్న అనిమా రోఘంటి (35) అనే మహిళ ఈ ఘాతుకానికి పురికొల్పింది. ఓరంగ్ అనే ఆదివాసీ వృద్ధురాలి వల్ల గ్రామానికి చెడు జరగబోతోందని చెప్పింది. ఆమె చేతబడులు చేస్తోందని గ్రామస్తులను నమ్మబలికింది. దీంతో ఆగ్రవేశాలతో ఊగిపోయిన జనం..వృద్ధురాలిని ఇంటినుంచి బైటికి లొక్కొచ్చారు. సుమారు 200 మంది గ్రామస్తులు ఆమెను చుట్టుముట్టారు. నడివీధిలో పట్టపగలు నగ్నంగా ఊరేగించారు. గ్రామం నడిబొడ్డులో నిర్దాక్షిణ్యంగా తలనరికి వేశారు. కాగా అనిమా చెప్పిన జోస్యం ఆధారంగా గ్రామస్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ సమద్ హుస్సేన్ తెలిపారు. అనిమా భర్తతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు, మరికొంతమంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అసోంలో గత అయిదేళ్లలో వందమందికికి పైగా మహిళలను చేతబడి చేస్తున్నారనే అనుమానంతో హతమార్చిన ఘటనలు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పెచ్చుమీరుతున్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ముందని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతబడులకు వ్యతిరేకంగా చట్టం చేయాలనే ఆలోచనలో ఉంది. -
ఐదేళ్ల బాలుడి తల నరికారు
రామ్ పారా(అసోం): అసోంలో దారుణం జరిగింది. ఓ ఐదేళ్ల బాలుడి తలను నరికివేశారు. మొండెం నుంచి పూర్తిగా వేరు చేశారు. ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు చితక్కొట్టారు. సోనిత్ పూర్ జిల్లాలోని ఓ తేయాకు తోటలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు దీనిపై స్పందిస్తూ ఘటన జరిగిన చోట కొన్ని విగ్రహాలు లభించాయని, దాని ప్రకారం తేయాకు తోటలో ఎవరో కావాలనే ఆ బాలుడిని నరబలి పేరిట హతమార్చి ఉండొచ్చని చెప్తున్నారు. బాలుడికి సంబంధించిన వారు తీవ్రంగా విలపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.