Bheeshma Movie
-
డైరెక్టర్‌కే సినిమా చూపించారు
-
‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా..
సాక్షి, హైదరాబాద్: నితిన్ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ చిత్రం పేరు చెప్పి, ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆ చిత్రాన్ని నామినేట్ చేస్తామంటూ నమ్మబలికారు. ఆయన నుంచి రూ. 66 వేలు డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. వెంకీ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం అద్భుతంగా ఉందని చెప్పారు. దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆరు కేటగిరీల్లో నామినేట్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నాడు. తాను ఆ ప్యానల్లో కీలక సభ్యుడిని అని, గోప్యత వహించాల్సిన అంశం కావడంతో రహస్యంగా ఇలా ఫోన్ చేశానని నమ్మబలికాడు. ఆ ఫెస్టివల్లో నామినేట్ చేయడానికి ఒకో కేటగిరికి రూ.11 వేలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. దీనికి వెంకీ అంగీకరించడంతో ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నేరగాడు అందులో డబ్బు డిపాజిట్ చేయమన్నాడు. సైబర్ నేరగాడు చెప్పింది నిజమేనని నమ్మిన వెంకీ మొత్తం రూ.66 వేలు ఆ బ్యాంకు ఖాతాలోకి పంపాడు. మరుసటి రోజు మళ్లీ డైరెక్టర్ వెంకీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు కొత్త కథ చెప్పాడు. ఆరింటిలోనూ మూడు కేటగిరిలకు సంబంధించి నామినేట్ చేసే విషయంలో చిన్న పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పాడు. వాటిని సరిచెయ్యడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందంటూ చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ సదరు చిత్ర నిర్మాత నామినేషన్ పర్వం వద్దన్నారంటూ చెప్పి తాత్కాలికంగా దాట వేశారు. ఆపై పూర్వాపరాలు పరిశీలించిన ఆయన జరిగిన మోసం తెలుసుకున్నారు. దీనిపై సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాడు వినియోగించిన ఫోన్ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్ 'భీష్మ' డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్ నో చెప్పిన చెర్రీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్! -
బాలీవుడ్ భీష్మ
టాలీవుడ్లో హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సెన్సేషనల్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేయగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్ 100, ఓ బేబీ, రాక్షసుడు’ వంటి చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కానున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘భీష్మ’ చేరింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరెక్కించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో రణ్వీర్ సింగ్ నటించనున్నారని టాక్. -
చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మేజర్ షెడ్యూల్ పూర్తయినప్పటికీ కరోనా ఎఫెక్ట్ తో మిగతా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటి వరకూ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మాత్రం ప్రకటించలేదు. జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందని వార్తలు వినిపించినా ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడు చరణ్ మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (చదవండి: పవన్ చిత్రంలో మెగాపవర్ స్టార్?) ఇటీవల హీరో నితిన్‌తో ‘భీష్మ’ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుములకు చరణ్ చాన్స్ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు హీరో నితిన్‌కు కూడా మంచి కమర్షియల్ హిట్ అందించింది. దీంతో ఈ డైరెక్టర్‌కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ వెంకి కుడుములతో కలిసి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే చరణ్‌కు వెంకీ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో కామెడీ, యాక్షన్, లవ్ ట్రాక్ లను బాగా ప్రొజెక్ట్ చేయగల వెంకీ కుడుములకు స్టార్ డైరెక్టర్‌గా ఎదగడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!) -
బాలీవుడ్ భీష్మ
‘భీష్మ: ది బ్యాచిలర్’ తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అందుకే బాలీవుడ్‌లోనూ రీమేక్ కాబోతున్నాడు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌లో రణ్‌బీర్ కపూర్ యాక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బాలీవుడ్ ‘భీష్మ’ కన్ ఫర్మ్ అయ్యారట. ఈ సినిమాలో హీరోగా అర్జున్ కపూర్ నటించబోతున్నారు అని తాజా సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. -
నితిన్ పెళ్లి వాయిదా..!
‘భీష్మ’ విజయంతో మంచి ఊపుమీద ఉన్నాడు యంగ్ హీరో నితిన్. అంతేకాకుండా తాను ప్రేమించిన యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందుకు మరోరకంగా ఆనందంగా ఉన్నాడు. అయితే నితిన్ ఆనందంపై కరోనా కన్నెర్ర జేసినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ముందుఅనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య దుబాయ్‌లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అయితే దుబాయ్‌లో కూడా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోనే నితిన్ వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ దీనిపై నితిన్ , షాలినీ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయదలేదు. -
నా సినిమా విజయం కంటే ఎక్కువ సంతోషపడ్డా
‘‘ఈ వేడుకకు అతిథిలా రాలేదు. నితిన్ సక్సెస్‌ని ఎంజాయ్ చేయడానికి తన ఫ్రెండ్‌లా వచ్చాను. నా సినిమా సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నితిన్ సక్సెస్‌ను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో రెండో సినిమా కూడా హిట్ కొట్టడం కష్టమంటారు. వెంకీ పాసయ్యాడు. రష్మిక నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి. తనతో కలసి త్వరలోనే యాక్ట్ చేయాలనుంది. మణిశర్మగారి అబ్బాయి సాగర్ మహతి మంచి సాంగ్స్ ఇచ్చారు. నితిన్ నేను ఈ మధ్య మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలనుకుంటున్నాను. సింగిల్ అని చెప్పి రిలీజ్ కంటే ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అందర్నీ మోసం చేశాడు’’అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ నిర్మాణసంస్థతో ‘అ ఆ’ చేశాను. పెద్ద హిట్ అయింది. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. దీనికి కారణమైనన దర్శక–నిర్మాతలకు «థ్యాంక్స్. రష్మికతో నటన, డ్యాన్సులు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ – ‘‘భీష్మ’ మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నితిన్‌గారు, వెంకీ గారు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన నితిన్‌గారికి, నిర్మాత వంశీగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. -
విశాఖలో ‘భీష్మ’ థ్యాంక్స్ మీట్
-
నాలుగేళ్ల తర్వాత హిట్ వచ్చింది
‘‘భీష్మ’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా టీమ్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఇది. నేను బాగా నటించాను.. నవ్వించానని అంటుంటే సంతోషంగా ఉంది. డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టానంతే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు’’ అని నితిన్ అన్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవంలో నితిన్ మాట్లాడుతూ –‘‘భీష్మ’ హిట్‌తో చాలామందికి వెంకీ జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది.. అందుకే ఎమోషన్ అవుతున్నా. ఈ సినిమాలో రష్మికతో కంటే సంపత్ రాజ్‌తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా కుదిరిందని అంటున్నారు. ‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. ‘అ ఆ’తో నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టిచ్చిన బ్యానర్లోనే నాకు మళ్లీ హిట్ వచ్చింది.. ఈ సంస్థలో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘భీష్మ’ చిత్రం పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నేను చెప్పినట్లే ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ‘ఛలో’తో హిట్ కొట్టిన వెంకీ ‘భీష్మ’తో సూపర్ హిట్ కొట్టాడు.. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. నితిన్‌తో ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో హిట్ కొట్టాలనుకున్నాం. కానీ, కుదరలేదు. హీరోలతో పోటీ పడుతూ రష్మిక డ్యాన్స్ చేస్తోంది. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’ సినిమాలు నిరూపించాయి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నా కథని నమ్మి అవకాశం ఇచ్చిన చినబాబు, వంశీ, నితిన్‌గార్లకు థ్యాంక్స్. నా సాంకేతిక నిపుణులంతా బాగా సహకారం అందించడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తీశాను. ‘దిల్’ సినిమా నుంచి నితిన్‌ను అభిమానిస్తూ వస్తున్నా. కలిసి పని చేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా’’ అన్నారు. ‘‘భీష్మ’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు వెంకీకి రుణపడి ఉంటాను. భీష్మ పాత్రలో నితిన్‌ను చూసి అభిమానిని అయిపోయాను’’ అన్నారు రష్మికా మందన్నా. ఈ విజయోత్సవంలో సూర్యదేవర నాగవంశీ, కెమెరామేన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, నటులు ‘శుభలేఖ’ సుధాకర్, సంపత్ రాజ్, పాటల రచయితలు కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల తర్వాత హిట్: నితిన్ భావోద్వేగం
యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం 'భీష్మ' బాక్సాఫీస్‌లో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం అసలు సిసలైన కామెడీతో థియేటర్లో ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతోంది. సితార ఎంటర్టైర్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. వివరాల్లోకి వెళితే.... నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. తొలి సినిమా 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా 'భీష్మ'తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ విజన్ పర్ఫెక్టుగా ఉంటే 'భీష్మ'కు వచ్చిన ఫలితమే వస్తుంది. రష్మికలో అసాధారణ ఎనర్జీ ఉంది. హీరోలతో పోటీపడుతూ డ్యాన్స్ చేస్తుంది, చక్కగా నటిస్తుంది. నితిన్‌తో మేం 'శ్రీనివాస కల్యాణం'తో హిట్ కొట్టాలనుకున్నాం కానీ, కుదరలేదు. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్ బలంగా ఉంటే హిట్ చేస్తారని ప్రతిరోజూ పండగే, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఇప్పుడు భీష్మ నిరూపించాయి. ఈ సినిమాను యూత్ బాగా ఆదరిస్తున్నారు" అని చెప్పారు. హీరో నితిన్ మాట్లాడుతూ ‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది. నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్‌తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. కన్నీళ్లు కనబడకూడదనే అద్దాలు పెట్టుకున్నా. ఇక రష్మికతో కంటే సంపత్ రాజ్‌తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. 'ఛలో'తో వెంకీకి, 'భీష్మ'తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’నని పేర్కొన్నారు. (భీష్మ మూవీ రివ్యూ) దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ 'దిల్' సినిమా నుంచి నేను నితిన్‌ను అభిమానిస్తూ వస్తున్నా. ఆయనను అభిమానించేవాడిగానే ఈ సినిమా తీశాను. కలిసి పనిచేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా. నా ఊహకు భిన్నంగా కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని రష్మిక ఈ సినిమా చేసింది. తను స్నేహానికి విలువ ఇచ్చిందన్నారు. హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ ‘ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీకి రుణపడి ఉంటాను. 'భీష్మ' పాత్రలో నితిన్‌ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డానని పేర్కొన్నారు. గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘నేను రాసిన వాటే బ్యూటీ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసిందన్నారు. ఇది 'హాసమ్' సక్సెస్ అని మరో గేయ రచయిత శ్రీమణి అన్నారు. ఈ బ్యానర్ తో 'జులాయి' సినిమా నుంచి అనుబంధం ఉందన్నారు. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ మాట్లాడుతూ ‘మా తండ్రులు గర్వపడేలా 'భీష్మ'ను వెంకీ రూపొందించారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. నటుడు సంపత్ రాజ్ మాట్లాడుతూ, "నాకు 'తియ్యరా బండి' అనే డైలాగ్ చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. ఈ సినిమాలో దానికి భిన్నమైన క్యారెక్టర్ ఇవ్వగా దానికి ప్రశంసలు రావడం సంతోషకరమన్నారు. ఈ వేడుకలో సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.(హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుంటా: రష్మిక) -
పవన్‌తో 'భీష్మ' యూనిట్
సాక్షి, హైదరాబాద్: నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ' విజయం సాధించడంతో నితిన్‌తో పాటు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల పవన్ కల్యాణ్‌ని కలిసారు. ఈ సందర్భంగా పవన్ చిత్ర బృందాన్ని, నితిన్‌ను అభినందించారు. ‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ను పవర్ స్టార్ ప్రశంసించారు. ఈ విషయంపై నితిన్ తన ట్విటర్ అకౌంట్లో ఫోటోలు షేర్ చేస్తూ.. 'వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సర్’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్’ ఇక దర్శకుడు వెంకీ కుడుముల కూడా తన ట్విటర్ ఖాతాలో.. ‘భీష్మ సినిమా తీసినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. ఈ క్షణం నాకైతే జీవితాంతం గుర్తిండిపోతుంది’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా.. భీష్మ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబడుతూ.. నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ‘భీష్మ’ మూవీ రివ్యూ POWERSTAR congratulating BHEESHMA team for its success!! Priceless moment..love you forever sirr 😍😍😍🤗🤗🤗@VenkyKudumula @vamsi84 @SitharaEnts pic.twitter.com/y38ZKF66zr — nithiin (@actor_nithiin) February 24, 2020 -
‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్’
నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ సత్తా చాటుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి. మొదటిరోజే చిత్రం ఆరున్నర కోట్లకు పైగా షేర్ సాధించిన విషయం తెల్సిందే. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. నాలుగు కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భీష్మ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ను దాటింది. ఇక మూడవ రోజు అయిన ఆదివారం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో భీష్మ మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన తమ హీరో సినిమాకు హిట్ టాక్ రావడంతో నితిన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. (చదవండి : ‘భీష్మ’ మూవీ రివ్యూ) ఇక ఈ సినిమా విజయంపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా భీష్మ టీమ్‌కు అభినందనలు తెలిపారు. భీష్మ హిట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నితిన్‌కు పుల్ జోష్ ఇచ్చిందన్నారు. ‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్. ‘భీప్మ’ విజయంతో నీ పెళ్లి వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సరైన సమయంలో మంచి పని జరిగింది. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది’ అని బన్నీ ట్వీట్ చేశారు. మంచి హిట్ సాధించినందుకుగాను దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మీక,నిర్మాత సూర్యదేవర నాగవంశికి అభినందనలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా గత శుక్రవారం విడుదలైంది. Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma . — Allu Arjun (@alluarjun) February 24, 2020 -
మేకింగ్ ఆఫ్ భీష్మ
-
‘భీష్మ’ మూవీ రివ్యూ
-
‘భీష్మ’ మూవీ రివ్యూ
టైటిల్: భీష్మ టైటిల్: రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నటీనటులు: నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, జిష్‌సేన్ గుప్త, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: వెంకీ కుడుముల సంగీతం: మహతి స్వర సాగర్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్ నిడివి: 150.45 నిమిషాలు ‘అఆ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తరువాత సినిమా కోసం ఆచితూచి అడుగేశాడు. ‘ఛలో’తో మంచి క్రేజ్ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్‌కు నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నితిన్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిందా? రష్మిక గ్లామర్ ఈ చిత్రానికి ఎంతవరకు పనిచేసింది? టీజర్, ట్రైలర్ రేంజ్లో సినిమా ఉందా? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: తాను ఐఏఎస్ అని భీష్మ (నితిన్) చెప్పుకుంటూ అమ్మాయిల వెంట పడతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే భీష్మకు బైబై చెప్పి వెళ్లి పోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్‌కు అర్థం కలెక్టర్ అని కాదు.. ఐయామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాపౌట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత సవ్యంగా సాగుతున్న తరుణంలో ఏసీపీ దేవా(సంపత్) తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్ ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ (నరేశ్) ఓ సంచలన విషయాన్ని చెబుతాడు. ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి భీష్మ సీఈఓ అని, పెద్దాయన భీష్మ (అనంత్ నాగ్) మనవడు అని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది. చివరికి ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా? లేక కొడుకును కాపాడుకోవాడానికి చెప్పిన అబద్దమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్ (జిషుసేన్ గుప్తా), పరిమళ్ (వెన్నెల కిశోర్), జేపీ (బ్రహ్మాజీ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అనేదే భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు: ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్‌లర్‌గా కనిపించిన నితిన్, సెకండాఫ్‌లో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించాడు. అమ్మాయిల వెంట పడే రోమియోగా, అప్పుడప్పుడు మంచి వాక్యాలు చెప్పి ఇతరులను ఇంప్రెస్ చేసే తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంటాడు. తన నటనలో డిఫరెంట్ షేడ్స్‌ను చూపించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. చైత్రగా కనిపించిన రష్మిక నితిన్‌తో పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్‌లు చాలా ముద్దుగా ఉంటాయి.అంతేకాకుండా నితిన్‌తో కలిసి రష్మిక డ్యాన్స్‌లతో అదరగొట్టింది. అనంత్ నాగ్ తన అనుభవాన్ని రంగరించి పెద్దాయన భీష్మ పాత్రను అవలీలగా చేశాడు. వెన్నెల కిశోర్, రఘుబాబు, జేపీల కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. విలన్‌గా కనిపించిన జిషుసేన్ గుప్త క్లాస్ విలన్‌గా కనిపించాడు. అయితే అశ్వథ్థామ చిత్రంలో చూసినట్టు ఈ చిత్రంలో కనిపిస్తాడు. హెబ్బా పటేల్ కనిపించేది రెండు మూడు సీన్లలో అయినా ఆకట్టుకుంటుంది. విశ్లేషణ: ఈ సినిమా కథ మొత్తం భీష్మ (నితిన్, అనంత్ నాగ్, ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. అనంత్ నాగ్ ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్ ఎంట్రీ, వెన్నెల కిశోర్, సంపత్, నరేశ్, నితిన్, బ్రహ్మాజీల కామెడీ, నితిన్, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కామెడీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్ డైలాగ్‌లు వావ్ అనిపించేలా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందని ‘భీష్మ’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించిన పాటలు ఎంతటి హిట్ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సింగర్స్, లిరక్ రైటర్స్ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్‌గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రం ‘భీష్మ’ . పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.. పైసా వసూల్ చిత్రం. ప్లస్ పాయింట్స్: నితిన్ నటన రష్మిక గ్లామర్ అండ్ క్యూట్‌నెస్ కామెడీ మైనస్ పాయింట్స్: విలనిజం ఆకట్టుకోకపోవడం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ కావడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రతి సినిమా పరీక్షే
‘‘నా మొదటి సినిమా ‘ఛలో’ విడుదలయ్యాక, నేను రాసింది నాకే కాదు ఆడియన్స్‌ని కూడా నవ్విస్తుందనే నమ్మకం వచ్చింది. మొదటి సినిమాలానే రెండో సినిమాకి కూడా అదే భయం, నిజాయతీతో పని చేశాను. ప్రతి సినిమా పరీక్షలానే భావించి పని చేస్తాను’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘ఛలో’ సినిమా పూర్తయిన తర్వాత నితిన్‌గారితో సినిమా చేయాలనే కమిట్మెంట్ ఉంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాకే షూటింగ్ చేద్దాం అని నితిన్‌గారు చెప్పారు. కొంచెం లేట్ అయినా అలానే చేశాం. బౌండ్ స్క్రిప్ట్ వల్ల చిత్రీకరణ సులువుగా జరిగిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు భీష్మలు ఉంటారు. ఒకరేమో అనంత్ నాగ్‌గారు. ఆయన ఒక లక్ష్యం కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మరోవైపు నితిన్ పేమించాలనుకున్నా ఎవ్వరూ పడరు. ఆయన పేరు (భీష్మ) వల్లే ఇలా జరుగుతుందని బాధపడుతుంటారు. ఈ ఇద్దరి భీష్మల మధ్య సంబంధం ఏంటి? అనేది సినిమాలో చూడాలి. తదుపరి సినిమా ఇంకా నిర్ణయించుకోలేదు. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లకు కమిట్మెంట్స్ ఉన్నాయి’’ అన్నారు. -
‘భీష్మ’ సినిమాలో ట్విస్ట్ అదే : వెంకీ
నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల గురువారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలివి... ► ‘ఛలో’ విడుదలయ్యాక నితిన్‌కి ఈ కథ చెప్పా. ఆయన కోసమే రాసిన కథ ఇది. స్ర్కిప్ట్ వర్క్ పూర్తవడానికి కాస్త సమయం పట్టడంతో టెన్షన్ పడ్డా. కానీ నితిన్ ‘బౌండెడ్ స్ర్కిప్ట్‌తోనే సెట్‌కి వెళదాం. కంగారు ఏమీ లేదు. నేను వెయిట్ చేస్తా’ అని ఏడాది మరో సినిమా చేయకుండా ఉన్నారు. స్ర్కిప్ట్ లాక్ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. మధ్యలో మార్పులు, చేర్పుల గొడవే లేదు. షూటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. ►ప్రతి కథలోనూ ప్రేమ మిళితమై ఉంటుంది. ఇందులోనూ కామన్‌గా లవ్‌స్టోరీ ఉంది. కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంది. కథలో భాగంగానే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాను. మీమ్స్ చేస్తూ సరదాగా తిరిగే కుర్రాడికి, సేంద్రీయ వ్యవసాయానికి మధ్య సంబంధం ఏంటన్నది ఇందులో ఆసక్తికరమైన పాయింట్. (చదవండి : నవ్వులు పూయిస్తున్న ‘భీష్మ’ మేకింగ్ వీడియో) ►భీష్మ అంటే బ్రహ్మచారి. ఇందులో అనంత్ నాగ్ బ్రహ్మచారిగా కనిపిస్తారు. నితిన్ పాత్రని కూడా భీష్మకి సంబంధించిన కొన్ని అంశాలు జోడించి తీర్చిదిద్దాను. అనంత్ నాగ్‌కి, నితిన్ సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సేంద్రీయ వ్యవసాయం మంచిదనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. ►రష్మిక తొలి సినిమాకే తెలుగు బాగా నేర్చుకుంది. డెడికేషన్‌తో పని చేసే నటి ఆమె. తన ఎక్స్ప్రెషన్స్ నాకు ఇష్టం. అందుకే మరోసారి ఆమెను కథానాయికగా ఎంపిక చేశా. అయితే రెండో సినిమాతోనే రష్మిక పెద్ద స్టార్ అయిపోయింది. అసలు నా సినిమా చేస్తుందో లేదో అనుకున్నా. అడగ్గానే అంగీకరించింది. నితిన్‌తో ఆమె చేసే సందడి అలరిస్తుంది. హుందాగా ఉండే ఓ పాత్ర కోసం అనంత నాగ్ని సంప్రదించా. మొదట చేయనన్నారు. కథ పూర్తిగా విన్నాక అంగీకరించారు. సినిమాకు ఆయన పాత్ర చాలా కీలకం. ►మన దగ్గ ఉన్న అత్యుత్తమ రైటర్స్‌లో త్రివిక్రమ్ గారు ముందుంటారు. నేను ఆయనకు అభిమానిని. ఆయన దగ్గర పని చేయడం వల్ల ఆ ప్రభావం నాపై చాలా ఉంది. నా డైలాగులు కూడా ఆయన డైలాగుల్లా అనిపించడానికి అదో కారణం. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి నచ్చిందన్నారు. ట్రైలర్లోనే కథ చెప్పేయాలని, అప్పుడే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి వస్తారని, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని సలహా ఇచ్చారు. అందుకే ట్రైలర్లో కథ చెప్పే ప్రయత్నం చేశా. ►చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. పేరెంట్స్ కోసం చదువుకున్నా. కొన్ని రోజులు వ్యవసాయం చేశా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చా. తొలి విజయం సాధించాక అనేకమంది హీరోలు, నిర్మాతలు ఫోన్ చేయడం కామన్. నాకది ఓ గుర్తింపులా అనిపిస్తుంది. తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయనే దాని కంటే నా వర్క్‌ని గుర్తించారనే విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘భీష్మ’ తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. మైత్రీ, యువీ సంస్థలకు సినిమాలు చేయాల్సి ఉంది. ప్రతి సినిమా నాకు ఓ పరీక్షలాగే ఫీలవుతా. సినిమా చేసే ప్రాసెస్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. -
‘భీష్మ’ మేకింగ్ : రష్మీక అల్లరే అల్లరి
నితిన్ హీరోగా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా భీష్మ. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెంచాయి. మంచి హైప్‌తో, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై హీరో నితిన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. (చదవండి : అదిరిపోయిన ‘భీష్మ’ ట్రైలర్) శుక్రవారం (ఫిబ్రవరి 21న) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం బృందం గురువారం మేకింగ్ వీడియోని విడుదల చేసింది. సెట్స్‌లో రష్మిక చేసే అల్లరి, నితిన్ కామెడీ పంచ్‌లతో మేకింగ్ వీడియో అదిరిపోయింది. సినిమాలో సెట్లో జరిగిన సందడి అంతా ఇందులో చూపించారు. (చదవండి : భీష్మ సినిమా పేరు మార్చాలి) ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్‌లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను బ్యాగ్రౌండ్ ప్లే చేస్తూ మేకింగ్ వీడియోను క్రియేట్ చేశారు. షూటింగ్ టైంలో రష్మీక, డైరెక్టర్ వెంకీల మధ్య జరిగిన సరదా సన్నివేశాలను మేకింగ్ వీడియోలో చూపించారు. దర్శకుడి షర్ట్‌పై ‘హీ ఇజ్ ఏ వెరీ రోమాంటిక్ ఫెల్లో’ అని రష్మీక రాయడం బట్టి చూస్తే తెలుస్తుంది ఆమె భీష్మ సెట్లో ఎంత అల్లరి చేసిందో. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం నితిన్‌కి బ్రేక్ ఇస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే. -
భీష్మ సినిమా పేరు మార్చాలి
పంజగుట్ట: భీష్మ సినిమా పేరును, సినిమాలో హీరో పేరును మార్చాలని, లేనిపక్షంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అడ్డుకుంటామని తెలంగాణ బెస్తగూండ్ల చైతన్య సమితి హెచ్చరించింది. మహాభారతానికి మూలం భీష్మ పితామహుడు, ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారని, సినిమాలో వెకిలిచేష్టలు, అసభ్యకరమైన సీన్లు ఉన్నాయని వెంటనే సినిమా పేరు, హీరో క్యారెక్టర్ పేరు మార్చకపోతే జరిగే పరిణామాలకు వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు పి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎమ్.శకర్, శివసేన ప్రతినిధి సుదర్శన్, బీజేపీ ప్రతినిధి మైలారం రాజులు మాట్లాడుతూ సినిమా టైటిల్ విషయమై తాము ఇప్పటికే ఫిలించాంబర్‌లో ఫిర్యాదు చేశామని, సినిమా నిర్మాత వద్దకు వెళ్లగా ఆయన తమకు సినిమా చూపించారని, అందులో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని, ఈవిషయాన్ని ఆయన దృష్టికి తేగా పట్టించుకోలేదన్నారు. ఇదే విషయమై డీజీపీని కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. సమావేశంలో చెంద్రశేఖర్ బెస్త, సురేష్, గణేష్, తారకప్రభు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న సమితి అధ్యక్షులు సత్యనారాయణ -
ఇక ఒకేసారి మూడు సినిమాలు చేయను
‘‘ఇష్క్’ (2012)కి ముందు నావి 12 సినిమాలు ఆడలేదు. ఇంటికెళ్లిపోతామా? అనే ఆలోచన రాబోతున్నప్పుడు ‘ఇష్క్’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆడియన్స్ మళ్లీ చాన్స్ ఇచ్చారనిపించింది. ఈ మధ్య నావి మూడు సినిమాలు (లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం) ఆడలేదు. జాగ్రత్తలు తీసుకుని ‘భీష్మ’ చిత్రం చేశాను. ఈ సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ‘మీమ్స్’ క్రియేటర్‌గా నటించాను. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో ఒక లేయర్‌గా మాత్రమే సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రస్తావన ఉంటుంది. సినిమాలో వచ్చే ఓ పొలం ఫైట్‌ను ‘అతడు’ సినిమాలోని ఫైట్‌ను ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశాం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత బాగా డ్యాన్స్‌లు చేసే అవకాశం ఈ చిత్రంలో లభించింది. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి హిట్ అవుతుందని చెప్పారు. ► నేను ‘శ్రీనివాసకల్యాణం’ సినిమా చేస్తున్నప్పుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ కథ చెప్పారు. నా గత మూడు సినిమాలు అంతగా ఆడలేదు కాబట్టి ‘భీష్మ’ స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయిన తర్వాతే సెట్స్‌కు వెళ్దాం అని చెప్పాను. ఇందుకు కొంత సమయం పట్టింది. అలాగే ‘రంగ్ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో...), ‘చెక్’ (చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో...) సినిమాల స్క్రిప్ట్స్‌ని కూడా విని ఓకే చేశాను. షూట్ కూడా స్టార్ట్ చేశాం. ఆ తర్వాత హిందీ హిట్ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్ (మేర్లపాకగాంధీ దర్శకత్వంలో..), ‘పవర్‌పేట’ (కృష్ణచైతన్య దర్శకత్వంలో) కథలను కూడా ఓకే చేశాను. గత ఏడాది నా సినిమా ఒక్కటి కూడా రాలేదు. కానీ ఈ ఏడాది నావి కనీసం నాలుగు సినిమాలు విడుదలవుతాయి. అయితే జీవితంలో ఇకపై మూడు సినిమాలను ఒకేసారి చేయను. సరిగ్గా నిద్ర లేదు. విశ్రాంతి లేదు. నాకు ఒక్క రోజు గ్యాప్ వస్తే చాలు.. నా కాల్షీట్ కోసం ముగ్గురు డైరెక్టర్స్ కొట్టుకుంటారు (నవ్వుతూ). ఇప్పుడు ‘భీష్మ’ అయిపోయింది కాబట్టి రిలాక్స్‌గా అనిపిస్తోంది. ► జాతీయ అవార్డు సాధించిన హిందీ హిట్ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నటించడం రిస్క్‌తో కూడుకున్న పని. కానీ చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్నాను. నా కెరీర్ గ్రాఫ్ సరిగ్గా లేదని నాకూ అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాను. ► ఓ సినిమా బాగున్నప్పుడు అభినందనలు తీసుకున్న నేను, మరో సినిమా బాగోలేదన్నప్పుడు విమర్శలను కూడా తీసుకుంటాను. విమర్శలను విశ్లేషించుకుని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతుంటాను. కమర్షియల్, డిఫరెంట్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్దాం అనుకుంటున్నా. ► ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చాను. అప్పట్లో బుట్టో.... ఇప్పుడు ముషారఫ్ (‘దిల్’ సినిమాలోని డైలాగ్) అన్నట్లు నన్ను యంగ్ హీరో అంటుంటే హ్యాపీగానే ఉంది కానీ నేను ఇంకా యంగ్ ఏంటీ? జట్టు కూడా నెరిసింది. గెడ్డం కూడా తెల్లబడింది అని నా ఇన్నర్ఫీలింగ్ (నవ్వుతూ). పెళ్లి ముచ్చట్లు ► పెళ్లనేది జీవితంలో ఓ బిగ్ స్టెప్. మెంటల్‌గా రెడీ అవ్వాలి. అందుకే కాస్త సమయం పట్టినట్లుంది. ఈ ఏడాది ఏప్రిల్ 15న నిశ్చితార్థం జరుగుతుంది. దుబాయ్‌లో ఏప్రిల్ 16న వివాహం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏప్రిల్ 21న ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం. షాలినీ (నితిన్ కాబోయే భార్య)కి నేను నటించిన ‘ఇష్క్, సై’ చిత్రాలంటే ఇష్టం ► నా పెళ్లి గురించి కొందరు హీరోలు సంతోషపడుతుంటే మరికొందరు బాధపడుతున్నారు. నాని ఏమో.. మా పెళ్లి బ్యాచ్‌లోకి రా అని పిలుస్తున్నాడు. రానా ఏమో ‘ఏంటీ బ్రో’ అంటున్నాడు. వరుణ్‌తేజ్.. ‘ఏంటీ నితిన్ ఇలా చేశావ్. నీ వల్ల ఇప్పుడు మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నారు’ అన్నాడు (నవ్వుతూ). -
మా బుట్టబొమ్మ..లా వాటే బ్యూటీ ఉంది
‘‘భీష్మ’ సినిమాని చూశాను.. చాలా చాలా బాగుంది. 21న అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘భీష్మ’లో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్‌లో రెండున్నాయి. ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్. రెండు.. జానీ మాస్టర్ చేసిన లాస్ట్ సాంగ్ ‘వాటే బ్యూటీ’. ఈ పాటను మా ‘బుట్టబొమ్మ’ పాటలా బాగా చేశాడు. ‘జెర్సీ’ తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని తీసుకువస్తున్నారు’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘భీష్మ’ చూసి చాలా సంతోషపడ్డా. ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నితిన్ డ్యాన్సులు ఇరగదీశాడు. ‘అల.. వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుసు. ఆ సినిమాతో పోటీపడేలా ‘భీష్మ’ విజువల్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘వెంకీ కుడుముల లేకపోతే నేనిక్కడ ఉండేవాణ్ణి కాదు’’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘భీష్మ’ కథకు సమయం పట్టింది. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచం’’ అన్నారు. ‘‘ఈరోజు టాలీవుడ్లో నేను ఉన్నానంటే ప్రధాన కారణం వెంకీ కుడుముల. ఆయనకు జీవితాంతం మంచి ఫ్రెండ్‌గా ఉంటాను. నితిన్ నా బెస్ట్ కో–స్టార్ కాదు.. బెస్ట్ ఫ్రెండ్’’ అన్నారు రష్మికా మందన్నా. నితిన్ మాట్లాడుతూ– ‘‘వెంకీ కుడుముల నాకు, ‘దిల్’ సినిమాకు పెద్ద అభిమాని. ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ‘దిల్’, ‘సై’ తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు. నా అభిమానులందరూ ఎప్పుడూ ‘డ్యాన్స్.. డ్యాన్స్’ అని అడుగుతున్నారు.. ఈ సినిమాలో నా డ్యాన్స్ చూసి వారి ఆకలి తీరుతుందనుకుంటున్నా. ఈ సినిమాలో ‘వాటే బ్యూటీ’ సాంగ్‌లో రష్మిక డ్యాన్స్ చూసి షాకయ్యా.. చాలా బాగా చేసింది. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట ‘అఆ’ చేశా.. ఇప్పుడు ‘భీష్మ’ చేశాను.. మూడో సినిమా ‘రంగ్ దే’ ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్ గీస్తున్నారు. నా జీవితంలో మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్‌గారు, త్రివిక్రమ్‌గారు పంచప్రాణాలు.. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నా భార్య ఆరో ప్రాణం కాబోతోంది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యామ్, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్ వెంకట్, సుచిర్ ఇండియా కిరణ్, గ్రీన్ మెట్రో ప్రతినిధులు అశోక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
భీష్మ ఇన్ లవ్
-
‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’
‘దుర్యోధనుడు, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మ రాజ్, శని, శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు ఎందుకు పెట్టారు నాకు’ అని తెగ ఫీలైపోతున్నాడు హీరో నితిన్. ఆయన హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంది. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమైపోతోంది.‘దుర్యోధన్, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’ అనే నితిన్ డైలాగుతో ట్రైలర్ మొదలైంది. వెన్నెల కిషోర్ కామెడీ పంచ్‌లు, రష్మీకతో నితిల్ రోమాన్స్ తరవాత అసలు కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందో చూపించారు. (చదవండి : ‘సరాసరి గుండెల్లో దించావె..’) ఈ సినిమా కథ సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విలన్‌గా బెంగాల్ నటుడు జిషు సేన్‌గుప్తా నటించారు. ఈయన ఎరువుల తయారీ కంపెనీకి యజమాని. జిషు, నితిన్ మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’ అంటూ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు.. అదృష్టవంతుడితో గెలవలేం’ అని విలన్ చెప్పే డైలాగ్ బాగుంది. చివరిగా ‘యు టచ్ మి ఐ పోక్ యు.. యు పోక్ మి ఐ స్క్రాచ్ యు’అని నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. -
మాటిస్తే నిలబెట్టుకుంటా
‘‘కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు, నా మనసుకి నచ్చిన పాత్రలు, ఈ పాత్ర నేను చేస్తే కొత్తగా ఉంటుంది అనే సినిమాలనే ప్రస్తుతం ఎంపిక చేసుకుంటున్నాను. సినిమా చూడటానికి థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు ఒక కొత్త అనుభూతికి లోనవ్వాలి. లేదా కడుపుబ్బా నవ్వుకోవాలి. ‘భీష్మ’ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్లందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు’’ అన్నారు రష్మికా మందన్నా. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మిక చెప్పిన విశేషాలు. ► ‘భీష్మ’లో చైత్ర అనే పాత్ర చేశాను. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటాను. ఈ సినిమాలో బాగా డ్యాన్స్ చేశాను. వినోదం పంచాను. ఇది చాలా సరదా సినిమా అయినప్పటికీ ఇందులో రైతుల సమస్యలను, ఆర్గానిక్ ఫార్మింగ్ విషయాలను చర్చించాం. ఈ విషయాన్ని వెంకీ చాలా సున్నితంగా డీల్ చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో బాగా ఎంజాయ్ చేశాను. ► ‘ఛలో’ తర్వాత వెంకీ కుడుముల నెక్ట్స్ సినిమాలో నటిస్తాను అని అప్పుడే చెప్పాను. మాటిస్తే నిలబెట్టుకోవాలనుకునే మనస్తత్వం నాది. కొన్నిసార్లు డేట్స్ ఇబ్బంది అయినా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. వరుసగా సినిమాలు చేయడం వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. అలా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించే అవకాశం మిస్ అయింది. నాతో సినిమాలు చేసిన దర్శకులు మళ్లీ నన్ను హీరోయిన్గా పెట్టుకోవాలనుకోవడం చాలా సంతోషంగా ఉంది. ► ‘అఆ’ సినిమాలో నితిన్, సమంత జంట నాకు చాలా ఇష్టం. నితిన్‌తో పని చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ తను చాలా కూల్‌గా కాలేజ్‌కి వెళ్లే అబ్బాయిలా ఉన్నారు. తనతో కలసి పని చేయడం చాలా సౌకర్యవంతంగా అనిపించింది. ► ఈ సినిమా టైటిల్లో బ్యాచ్‌లర్ ఉన్నా సినిమా రిలీజ్ అవ్వకముందే నితిన్ ఎంగేజ్ అయిపోయారు. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే నితిన్ లవ్‌స్టోరీ గురించి తెలిసింది. అప్పటివరకూ మాకు ఎవ్వరికీ చెప్పలేదు. నేను కన్నడంలో ‘పొగరు’ సినిమా చేస్తున్న సమయంలో «ధృవ సర్జాగారికి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నితిన్‌గారికి కూడా పెళ్లి అవుతోంది (నవ్వుతూ). ► నా ఫిట్నెస్ సీక్రెట్ అంటే.. జిమ్ చేస్తుంటాను. వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తుంటా. స్పోర్ట్స్ ఆడతాను. డైట్ మెయింటేన్ చేస్తుంటాను. షుగర్ ఉన్న పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేశాను. చాక్లెట్స్ వైపే చూడటం లేదు. ► పబ్లిక్‌లో కనిపించేవాళ్లు విమర్శలు ఎదుర్కోవడం కామన్. మన గురించి ఎప్పుడూ మంచే మాట్లాడాలని అనుకోలేం. అది కుదరదు కూడా. నా కెరీర్ తొలి రోజుల్లో చాలా సీరియస్‌గా తీసుకునేదాన్ని. ఇప్పుడు విమర్శలను పట్టించుకోవడం లేదు. ► ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ సార్ కాంబినేషన్ సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ► మా నాన్నగారు బిజినెస్‌మేన్. నేను నటిని. దాంతో కాజ్యువల్‌గా ఐటీ రైడ్స్ చేశారు. మా ఇంట్లో ఏమీ దొరకలేదు. వెళ్లిపోయారు. ► కుక్క బిస్కెట్లు తింటోందని నా గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్æ చేస్తున్నారు. ఓ రోజు సరదాగా ట్రై చేద్దాం అని చిన్న ముక్క కొరికాను అంతే (నవ్వుతూ). దానికి నితిన్ ‘నేను కుక్క బిస్కెట్లు తింటాను’ అని చెప్పారు. ► వేలంటైన్స్ డే రోజు ఫుల్ బిజీ షెడ్యూల్. కానీ అనుకోకుండా అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఉదయ్యానే జిమ్ చేసి, మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమా చూడాలనుకున్నాను. సగంలోనే నిద్రపోయా. ఆ తర్వాత ఓ కథ న్యారేట్ చేయడానికి ఓ డైరెక్టర్ వచ్చారు.