bhuma akhila priya
-
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక?
మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ.. భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. -
టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై భూమా కిషోర్ రెడ్డి ఫైర్
-
అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా అఖిల ప్రియ.. భూమా కిషోర్‌రెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల జిల్లా: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడటం కంటే ఆళ్లగడ్డలో జరిగే అరాచకాల గురించి మాట్లాడితే బాగుండేదంటూ భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపాలిటీలో ఉద్యోగాల కోసం రెండు లక్షల తీసుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు.‘‘అసెంబ్లీలో ఆళ్లగడ్డ రైతుల ప్రస్తావన రాకపోవడం, మద్దతు ధర గురించి మాట్లకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పెరిగాయని బాదుడే బాదుడు అంటూ తిరిగారు. కూటమి ప్రభుత్వం హయాంలో గతంలో కంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. 15 మంది ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని అక్రమ వసూళ్లు చేస్తున్నారు. తర్వాత వడ్డీతో సహా చెల్లించేలా చేస్తాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బెల్టు షాపులు, కల్తీ మద్యం అమ్ముతున్నారు ముందు వాటి గురించి తేల్చడంటూ భూమా కిషోర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
సొంతపార్టీ నేతలపైనా అఖిలప్రియ రెడ్ బుక్ పడగ
-
భూమా అఖిల ప్రియపై ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం
-
ఆళ్లగడ్డలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో చెప్తే నేనెందుకు వెళ్తా.. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. మందిమార్బలంతో డెయిరీ ప్రాంగణంలోని చైర్మన్ గదిలోకి వెళ్లారు. డెయిరీలో ఏం జరుగుతుందో చెప్పాలని, ఇక్కడి అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అఖిలప్రియ రెచ్చిపోయారు. డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నూతన శిలాఫలకాల ఏర్పాటుపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యకం చేశారు. తనతో ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని అఖిల సూచించారు.‘నాతో మామగా మాట్లాడుతున్నావా... లేక చైర్మన్‌గా మాట్లాడుతున్నావా.. మామవైతే నీ సీట్లో కూర్చుంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావ్ అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నంద్యాలకు వచ్చి రాజకీయాలు చేయడం ఏంటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పరిధిలో రాజకీయాలు చేసుకోవాలని.. తమ పరిధిలోకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. -
అఖిల ప్రియా ఓవర్ యాక్షన్ పై మామ స్ట్రాంగ్ రియాక్షన్...
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్‌బుక్ రాజ్యాంగం
-
అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం.. మహిళపై దాడి
సాక్షి, నంద్యాల: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌లో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే పచ్చ మంద.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇక, తాజాగా నంద్యాల జిల్లాలో అఖిలప్రియ మద్దతుదారులు మహిళలపై భౌతిక దాడులు చేస్తున్నారు.ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగంనంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. తాజాగా అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి కబ్జాలు చేస్తున్నారు. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న కొండయ్య కూతురిపై పచ్చ మంద విరుచుకుపడింది. అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి ఆమెను అసభ్యపదజాలంతో తిడుతూ రెచ్చిపోయాడు. ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. చేయి విరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు.నా టార్గెట్ వంద మంది: అఖిలప్రియకొన్ని రోజుల క్రితమే తనకు ఓ రెడ్ బుక్ ఉంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు. వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఆళ్లగడ్డలో వంద మంది నా టార్గెట్.. అఖిలప్రియ
సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. రెడ్‌బుక్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రజాపాలన, ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం వైఎస్సార్సీపీ నేతలను, అధికారులను టార్గెట్ చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా మీడియాలో బహిరంగంగానే భూమా అఖిలప్రియ.. వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు.ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు ఓ రెడ్ బుక్ ఉంది. అందులో వంద మందికిపైగా వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు ఉన్నాయి. పాపం పోనీలే అని ఇద్దరు, ముగ్గురిని వదిలేస్తున్నాను. కానీ, వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో వంద మంది కచ్చితంగా ఇబ్బంది పడబోతున్నారు. వారి పేర్లు నా రెడ్ బుక్‌లో ఉన్నాయి అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు.అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను కదా. అదే విధంగా ఎవరినీ వదిలిపెట్టను. అందరి తోలుతీస్తాను. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. -
భూమా అఖిల ప్రియాపై భూమా కిషోర్ రెడ్డి ఫైర్
-
అఖిల ప్రియ అడ్డాలో అరాచకం
-
అఖిల ప్రియVs ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్‌పై అఖిల ప్రియ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. భూమా ఘాట్ నుంచి ఎమ్మెల్యే అఖిల ప్రియ ర్యాలీగా బయలుదేరగా, ర్యాలీలో వెళ్తుండగా ఏవీ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్, రిలయన్స్ మార్ట్ పై అఖిల ప్రియ అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.భూమా ఫ్యామిలీ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాల విషయం తెలిసిందే. గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇటీవల ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డుపై దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
ఇదేందయ్యా.. భార్గవా?
సాక్షి, నంద్యాల: నంద్యాల పార్లమెంట్ స్థానానికి ఓ వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఉపసంహరించుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఆయన ఎవరో కాదు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ భర్త మద్దూరు భార్గవ రామ్ నాయుడు. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్లలో చివరి రోజు ఈనెల 25వ తేదీ భార్గవ రామ్ చడీచప్పుడు కాకుండా నంద్యాల ఎంపీగా నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు తాను సమర్పించిన నామినేషన్ల పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న శబరి.. అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని హామీ ఇస్తేనే భార్గవరామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని.. లేని పక్షంలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామని అఖిల ప్రియ చెప్పినట్లు ప్రచారం సాగింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో టీడీపీలో హైడ్రామా నడిచింది. భార్గవరామ్ తన నామినేషన్ విత్‌డ్రా చేసుకోకుంటే పార్టీ పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని అధిష్టానం నుంచి గట్టి హెచ్చరికలు చేయడంతో భార్గవ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ‘సార్.. ఏం ఆశించి నామినేషన్ వేశారో’ అన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఈ తంతంగంపై బైరెడ్డి శబరి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
వివరాలు చెప్పండి.. అఖిలమ్మ అడగమంది!
ఆళ్లగడ్డ: ఓటమి భయంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని భూమా అఖిలప్రియ ఓటర్లకు ఎర వేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టి.. కులాల మధ్య కుంపటి రాజేసి గెలుపొందాలని కుటిల ప్రయత్నం చేస్త్తున్నారు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాల ద్వారా సంపాదించిన డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్ట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ వైపు ఉన్నారనే సమాచారంతో ఆపార్టీ నేతలు, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేయాలనే ప్రయత్నంలో దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు గ్రామాలు, వార్డులను ఎంచుకుని ఇంటింటికి తిరిగి ఫోన్ నంబర్లతో సహా వివరాలు సేకరిస్తున్నారు. వాటిని అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు అందజేస్తున్నారు. ఆయన నాయకులకు ఫోన్ చేసి నగదు ఆశ చూపడమే కాక ‘పెత్తనం మీదేనంటూ’ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఎంతో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ ప్రలోభాలుక లొంగకుండా ధీటుగా సమాధానం చెబుతున్నారు. చాగలమర్రి, రుద్రవరం మండలాల పరిధిలోని సీనియర్ నాయకులకు ఇదే తరహాలో ఫోన్ వస్తే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫోన్ కట్ చేసిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సొంత మండలమైన రుద్రవరాన్ని టీడీపీ నాయకులు టార్గెట్ చేసి ప్రలోభాల పర్వానికి తెరతీశారని తెలుస్తోంది. మండల కేంద్రం రుద్రవరానికి చెందిన బలిజ సంఘం నాయకుడు అఖిలప్రియ భర్తతో కలిసి వైఎస్సార్సీపీకి చెందిన బలిజ నేతలే లక్ష్యంగా నిత్యం ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. తమ పార్టీలోకి వస్తే పెత్తనం అంతా మీదే అని ఖర్చులకు నగదు కూడా ఇస్తామని అఖలప్రియ భర్త భార్గవరామ్ నేరుగా ప్రలోభపెడుతున్నారని సమచారం. ఎన్నికల నియమావళి ఉల్లంఘనే.. అనుమతి లేకుండా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఏం పనిచేస్తారు. ఏ కులం, ఏ పార్టీకి ఓటు వేస్తారని వివరాలు అడగటంతో పాటు ఫోన్ నంబర్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు కూడా సేకరించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ముమ్మాటికీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఓటర్ల వివరాలతో పాటు ఇంటి పెద్ద ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓట్లు అడిగితే తప్పులేదని ప్రలోభాలకు గురిచేయడం, వ్యక్తిగత వివరాలు సేకరించే వ్యక్తులపై ఆధారాలు తమకు సమర్పిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎందుకు అంటే ఏమి చెప్పడం లేదు టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు మా ఇంటితో పాటు చుట్టూ ఉన్న వాళ్ల ఇళ్ల దగ్గరకు వచ్చి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? ఏం పనిచేస్తున్నారు? మీరు ఏ పార్టీ.. అంటూ వివరాలు అడిగి విషయాలు రాసుకున్నారు. ఫోన్ నంబర్లతో పాటు కొందరి బ్యాంక్ అకౌంట్ కూడా అడిగి రాసుకున్నారు. ఎందుకు అంటే అఖిలమ్మ రాసుకు రమ్మంది అంటున్నారు. అంతకంటే ఏమీ చెప్పడం లేదు. – నజీర్, రహిమాన్ వీధి, ఆళ్లగడ్డ -
భూమా అఖిలప్రియకు చంద్రబాబు హుహించని షాక్..!
-
అఖిలను పక్కకు పెట్టేసినట్టే..
సాక్షి, నంద్యాల: టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి అఖిలప్రియ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఆమె వ్యవహారశైలి బూమరాంగ్ అవుతుందా? సొంత కుటుంబ సభ్యులకే నచ్చడం లేదా? ఆమె ఏకాకిగా మిగిలారా? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారా? అంటే అవుననే జవాబులే వినిపిస్తున్నాయి. బాబు మోసాల ఖాతాలో మరో వికెట్ పడిందని నంద్యాల జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి కూతురిగా అఖిలప్రియ వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పార్టీ మారినా భూమా కుటుంబ సభ్యుల్లో అధికశాతం వైఎస్సార్ సీపీకే మద్దతుగా నిలిచారు. దీనికితోడు అఖిలప్రియ భర్త భార్గవరాం నాయుడు వ్యవహార శైలిని అనుచరులతోపాటు కుటుంబ సభ్యులూ తప్పుపట్టారు. అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాం నాయుడికి భూమా కుటుంబంతో సంబంధం లేదని భూమా కిశోర్ రెడ్డి (అఖిలప్రియ పెదనాన్న కొడుకు) స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులంతా సమావేశమై ఈ ఎన్నికల్లో అఖిలకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కిశోర్ పేర్కొన్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అఖిల వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలకు పోవడంతో బంధువుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత దోపిడీ, బెదిరింపులు, కిడ్నాప్ కేసులతో అఖిల తీరు వివాదాస్పదమైంది. బంధువులతోనూ వివాదాలు, ఆస్తి తగాదాలు రావడం, అఖిల భర్త వ్యవహారశైలి వల్ల కుటుంబ సభ్యులు ఆమెతో బంధుత్వం తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టారు. గతేడాది నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆళ్లగడ్డలో జరిగినప్పుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటన యాత్రపై ప్రభావం చూపడంతో అప్పట్లో బాబు అఖిలను మందలించారని సమాచారం. అయినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆమె వల్ల పార్టీ దెబ్బతింటోందని జిల్లా నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివరించారు. దీంతో ఆళ్లగడ్డ బరి నుంచి ఆమెను తప్పించాలనే నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆళ్లగడ్డలో నిర్వహించిన రా.. కదలిరా సభలోనూ టికెట్ విషయం తేల్చకపోవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ బాధ్యతల నుంచి అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించడం.. ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్ అఖిలప్రియకు ఇవ్వరనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబును నమ్మి భూమా కుటుంబం పెద్ద తప్పే చేసిందనే వాదన జిల్లాలో వినిపిస్తోంది. అఖిల కూడా ఈ విషయంపై ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. -
టీడీపీ నేత అఖిలప్రియపై బీజేపీ నేత భూమా కిషోర్‌రెడ్డి ఫైర్
-
అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య ముదిరిన వర్గపోరు
-
ఏవీ సుబ్బారెడ్డి సభ వద్దకు రావద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
-
బాబు సభకు ముందే.. ఆళ్లగడ్డలో భగ్గుమన్న టీడీపీ, జనసేన విభేదాలు
సాక్షి, నంద్యాల: అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి వస్తే తాను సైలెంట్‌గా ఉన్నా తన అనుచరులు ఊరుకోరని చెప్పిందట అఖిల ప్రియా.. దీంతో రేపటి చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బాబు సభకు జనసేన నేతలు కూడా వేదికపైకి రాకూడదని అఖిల ఆంక్షలు విధించారని ప్రచారం జరుగుతోంది. ‘మీ సభ మీ ఇష్టం, మేం ఎందుకు వస్తాం’ అని జనసేన నేతలు చెప్పేశారట. దీంతో ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు జనసేన సైడ్ అయిపోయింది. ఈ మేరకు ఆళ్లగడ్డ జనసేన ప్రకటన విడుదల చేసింది. ‘టీడీపీ సభకు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు. రేపు జనసైనికులు, నేతలు టీడీపీ సభకు వెళ్లొద్దు’అని ఆదేశించింది. -
అమ్మ అఖిలప్రియా.. అలా డిసైడ్ అయ్యావా?
చంద్రబాబు రాజకీయ ఎత్తులు.. జిత్తుల సంగతి పూర్తిగా అవగతం చేసుకున్న భూమా అఖిల ప్రియ.. తనకు తాను అపరచాణక్యుడిలా ఫీలయ్యే చంద్రబాబుకే షాక్ ఇచ్చారట. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత అనూహ్యంగా మంత్రి అయిన అఖిలప్రియ పేరు కన్నా చెడ్డపేరును ఎక్కువ సంపాదించారు. హత్యలు.. కిడ్నాపులు.. బ్యాంకులను మోసం చేయడం.. రుణాలు ఎగ్గొట్టడం.. బెదిరించడం.. ఇంకా తన తండ్రి అంతరంగికుడు.. ఆప్తమిత్రుడు అయినా ఏవీ సుబ్బారెడ్డి మీద లోకేష్ పాదయాత్రతోనే బహిరంగంగా దాడులు చేయడం వంటి దూకుడు చర్యలతో ఎంత అప్రదిష్టమూటగట్టుకున్నారో ఎవరికీ తెలియదు.. ఆళ్లగడ్డలో మళ్ళీ పోటీ చేసేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవని టీడీపీ అంటోంది.. ఆమెకు టికెట్ ఇస్తే క్యాడర్ సపోర్ట్ చేయదని .. ఆమె దూకుడు పార్టీకి మరింత చేటు చేస్తుందని పార్టీ పెద్దలు భయపడుతున్నారు. అందుకే ఆమెకు టికెట్ లేకుండా పక్కనబెట్టి. ఆమె సపోర్ట్ తీసుకుని వేరేవాళ్లకు టికెట్ ఇచ్చేలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం సైతం టిక్కెట్లు ఖరారు చేసేందుకు ఓ వైపు సిద్ధం అవుతూనే చంద్రబాబు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు షెడ్యూల్ రెడీ చేసారు. ఈనెల ఐదున తణుకు, ఏడున కృష్ణాజిల్లా తిరువూరు.. తొమ్మిదిన ఆళ్లగడ్డ , పదకొండున నరసరావుపేటలో భారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ జనసమీకరణతో .. భారీ వేదికలు ఏర్పాటుతో రూపొందే ఈ సభలకు ఆయా స్థానిక నాయకులూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.. బస్సులు.. వేదిక.. సౌండ్ సిస్టం.. రవాణా.. భోజనాలు.. పెద్ద నాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా. టికెట్ కోరుకుంటున్నవాళ్ళు చేయాల్సి ఉంది. ఇది అన్ని చోట్లా ఉన్నదే.. అయితే ఆళ్లగడ్డ సభకు మాత్రం భూమా అఖిల ప్రియ మెలికపెట్టినట్లు తెలిసింది. తనకు టిక్కెట్ ఇస్తామంటేనే ఈ సభ ఖర్చులు తాను పెట్టుకుంటానని. లేకుంటే ఈ సభకు దాదాపు కోటి ఖర్చు చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసినట్లు తెలిసింది. టిక్కెట్ ఇవ్వనప్పుడు ఈ గడ్డు రోజుల్లో అంత డబ్బును అప్పుతెచ్చి ఎందుకు ఖర్చు చేయాలన్నది ఆమె ఆలోచన అంటున్నారు. ఇప్పటికే కోర్టులు.. కేసులు.. బ్యాంకర్ల నోటీసులతో ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న అఖిల ప్రియా ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇస్తాను అంటేనే సభా ఖర్చుల బాధ్యత తీసుకుంటాను అని .. లేదంటే లేదని ఆమె పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆమెకు టిక్కెట్ ఇస్తారా.. ఆమెను పక్కన పెడతారా అన్నది టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.. ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. -సిమ్మాదిరప్పన్న -
నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్!
‘భూమా’ పేరు రాజకీయాల నుంచి కనుమరుగు కానుందా? నంద్యాల బరిలో నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని కాకుండా ఫరూక్‌ను బరిలోకి దించనున్నారా? ఆళ్లగడ్డలో కూడా అఖిల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? టీడీపీలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ అధినేతలు సాగిస్తున్న చర్చలు ఈ విషయాలనే వెల్లడి చేస్తోంది. పార్టీ నిర్ణయంతో భూమా బ్రహ్మనందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. గత 20 ఏళ్లలో ఇక్కడ టీడీపీ అత్యధికంగా గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో టీడీపీ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. పైగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ చేసిన సర్వేల్లో కూడా కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని స్పష్టమైనట్లు సమాచారం. ఈ క్రమంలో టిక్కెట్ల ఖారారుపై టీడీపీ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. డోన్ పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇదివరకే ప్రకటించారు. అయితే డోన్ బరిలో కచ్చితంగా కేఈ కుటుంబం ఉంటుందని, పోటీ చేసి తీరుతుందని కేఈ ప్రభాకర్ తేల్చిచెప్పారు. ఈ టిక్కెట్ బీసీ జనార్దన్‌రెడ్డి సూచన మేరకే చంద్రబాబు ప్రకటించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో నంద్యాల నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని తప్పించేందుకు బీసీ జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భూమా బ్రహ్మనందరెడ్డిపై చంద్రబాబుకు ప్రతీ సందర్భంలో కూడా ఫిర్యాదులు చేశారు. ఇది గ్రహించిన బ్రహ్మం ఇటీవల నంద్యాలకు వచ్చి అరెస్టయ్యే ముందురోజు బీసీ జనార్దన్రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల బహిరంగసభలో బ్రహ్మం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ‘భూమా’ అనుచరులు నినాదాలు చేసినా చంద్రబాబు ఎవ్వరి పేరు ప్రకటించనని, సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫరూక్‌ను నంద్యాల అభ్యర్థిగా టీడీపీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీని వీడాలని బ్రహ్మం నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతోంది. ఇది తెలిసి టీడీపీ అధిష్టానం ఫరూక్, బ్రహ్మంలను పిలిపించి ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు బ్రహ్మం ససేమిరా అని మధ్యలోనే లేచి వచ్చేశాడని సమాచారం. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని జనసేనకు.. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆళ్లగడ్డలో గెలిచే పరిస్థితులు లేకపోవడం, మరోవైపు బలిజ ఓటర్లు అధికంగా ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కట్టబెడదామనే నిర్ణయానికి టీడీపీ వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ ఓడిపోయే సీటు, పొత్తులో ఇస్తే సరిపోతుంది, పైగా బలిజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డ లాంటి కీలక స్థానం జనసేనకు ఇచ్చామని చెప్పుకునేందుకు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీటలో చేరారు. పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్ తనకే వస్తుందని ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకునేంత శక్తి తన నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గంలో లేరని, కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని ఇరిగెల తన వర్గీయులతో చెబుతుండటం గమనార్హం. ఏదిఏమైనా ఓ వైపు నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి, మరోవైపు ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు టిక్కెట్లు దక్కకపోతే ‘భూమా’ కుటుంబం తొలిసారి పోటీలో లేని పరిస్థితి తలెత్తుంది. ఇదే జరిగితే రాజకీయాల్లో ‘భూమా’ కుటుంబం తెరమరుగైనట్లే! స్వయంకృతాపరాధం భూమా బ్రహ్మనందరెడ్డికి కాకుండా తన సోదరుడు జగత్ విఖ్యాత్‌కు టిక్కెట్ దక్కించుకోవాలని అఖిల శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అఖిల, బ్రహ్మనికి మధ్య విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. ఇద్దరి విభేదాలతో పరస్పరం బలాన్ని తగ్గించుంటున్నామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఘోర పరాభవం తప్పదని రాబిన్‌శర్మ టీం అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీంతో అఖిలకు కాకుండా భూమా కిషోర్‌ను టీడీపీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ తొలుత భావించింది. అయితే కిషోర్‌కు ఇచ్చినా అఖిల వర్గం మద్దతు ఇవ్వదని గ్రహించింది. ప్రజల్లో నిత్యం ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తోన్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ద్వయం చేతిలో కిషోర్ కూడా ఓటమిని తప్పించుకోలేరని తేలినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో 45వేల బలిజ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారని, వారికి టిక్కెట్ ఇద్దామనే ఓ చర్చ నడిచింది. దీనికి బీసీ జనార్దన్‌రెడ్డి కూడా మద్దతు పలికినట్లు సమాచారం. ఇదే క్రమంలో బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం కూడా గెలుపును దక్కించుకునేది కాదని తేలినట్లు చర్చ జరుగుతోంది. అఖిలకు అందరూ దూరమే.. ► నాగిరెడ్డి మృతి తర్వాత రాజకీయంగా కీలకంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే దూరమయ్యాడు. ► ‘భూమా’కు అత్యంత సన్నిహితుడు శివరామిరెడ్డి, విజయడైరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో పాటు బంధువర్గం, సన్నిహితులు ఆ గుమ్మం తొక్కడమే మానేశారు. ► ‘భూమా’ కుటుంబం సొంత మండలం దొర్నిపాడులోనే వారికి వ్యతిరేకంగా సర్వేలు వచ్చాయంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.