bikes
-
హోండా మోటార్‌సైకిల్ కీలక ప్రకటన: ఆ బైకులకు రీకాల్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి - 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రూపొందించనుంది.వారంటీతో సంబంధం లేకుండా ప్రభావిత బైక్‌లలో సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. హోండా బిగ్‌వింగ్ వెబ్సైట్లో VINని నమోదు చేయడం ద్వారా కస్టమర్లు.. తమ బైక్ జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. ఈ బైక్ ధరలు మార్కెట్లో రూ. 16.01 లక్షల నుంచి రూ. 17.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. -
నమ్మండి ఇది 'రాయల్ ఎన్ఫీల్డ్' బైకే.. (ఫోటోలు)
-
బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ - రేటెంతో తెలుసా?
-
భారత్‌లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
-
EICMA 2024 : కళ్ళు చెదిరే సరికొత్త బైకులు.. చూస్తే మతిపోవాల్సిందే! (ఫోటోలు)
-
లక్షల ఖరీదైన బైకులు: మరింత కొత్తగా..
మారుతున్న ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా.. చాలా వాహన తయారీ సంస్థలు బైక్‌లను అప్డేట్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా చేరింది. ఇది ఒకేసారి నాలుగు బైకులను (ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ఆర్) అప్డేట్ చేయనుంది. ఇందులో నేకెడ్ ఆర్ మోడల్స్ కొత్త స్టైలింగ్ పొందుతాయి. పుల్ ఫెయిర్డ్ ఆర్ఆర్ బైకులు రీడిజైన్ పొందుతాయి.బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్ వంటి నేకెడ్ బైక్స్ ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతాయి. పవర్, టార్క్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. బైక్ ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ పొందుతుంది. సీటు కింద యూఎస్బీ-సీ ఛార్జర్ ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైకులు యాంత్రికంగా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైకులలో ఎక్కువ భాగం నలుపు రంగు ఉండటం చూడవచ్చు.ఇక బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ బైకుల విషయానికి వస్తే.. ఎం 1000 ఆర్ఆర్ కొంత ఎక్కువ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వింగ్లెట్లు కొంత పెద్దవిగా ఉంటాయి. కాస్మొటిక్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్‌బైక్ కూడా రీడిజైన్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎటువంటి మార్పు పొందదు.బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ఈ నాలుగు బైకులను భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్న ఈ బైకుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్: రూ. 19 లక్షల నుంచి రూ. 23.30 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్: రూ. 33 లక్షల నుంచి రూ. 38 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్: రూ. 20.75 లక్షల నుంచి రూ. 25.25 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్: రూ. 49 లక్షల నుంచి రూ. 55 లక్షలు -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులకు కొదువే లేదు. అయితే రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ బైకులు గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్స్ జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 59,881 కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 71,383 (ఎక్స్ షోరూమ్). ఇది 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ సీటీ 110ఎక్స్రూ. 70,176 ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే బజాజ్ సీటీ 110ఎక్స్ కూడా మంచి మైలేజ్ అందించే బెస్ట్ బైక్. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.48 హార్స్ పవర్, 9.81 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర రూ. 59,998. సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్ కలిగిన టాప్ వేరియంట్ ధరలు రూ. 69,018 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 7.91 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ రేడియన్రూ. 59,880 నుంచి రూ. 81,394 మధ్య (ఎక్స్ షోరూమ్) లభించే టీవీఎస్ రేడియన్ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.08 హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ బైక్ 68.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: 90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటనహోండా ఎస్పీ 125హోండా ఎస్పీ 125 ధరలు రూ. 87,468 నుంచి రూ. 91,468 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 10.72 Hp, 10.9 Nm టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. ఈ బైక్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా
-
కార్లు, బైక్‌లు అబ్బో.. అదృష్టమంటే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులదే!
చెన్నైకి చెందిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ అద్భుతమైన బహుమతులతో తమ ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల్లో మరింత ప్రేరణ కల్పించడానికి, ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.2005లో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ గుర్తింపు ఉద్యోగులను తమ పాత్రల్లో రాణించేలా మరింత ప్రేరేపిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన కార్లలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉండటం విశేషం. కార్లు, బైక్‌లతో పాటు, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు వివాహ కానుకను కూడా అందిస్తోంది. గతంలో రూ.50,000గా ఉన్న ఈ కానుకను ఈ ఏడాది రూ.లక్షకు కంపెనీ పెంచింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు రీకాల్.. కారణం ఇదే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్‌సైకిళ్లలోని రిఫ్లెక్టర్లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్‌లు వారి సమీప సర్వీస్ సెంటర్లో రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్‌సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం. -
రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!
భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఇండియన్ మార్కెట్లో 110 సీసీ బైకులు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు ఈ స్థానంలో 125 సీసీ.. 200 సీసీ బైకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కమ్యూటర్ బైకుల గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం.హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 95000 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే 'హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్' అనేది ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బైక్. 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 11.4 Bhp పవర్, 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఎల్ఈడీ ఇండికేటర్స్, లేటెస్ట్ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.టీవీఎస్ రైడర్ 125టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన 'రైడర్ 125' బైక్ కేవలం రెండున్నర సంవత్సరాల్లో 7,00,000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125సీఎన్జీ బైక్ విభాగంలో అడుగుపెట్టిన మొట్ట మొదటి బైక్.. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125. ఇది పెట్రోల్ అండ్ సీఎన్జీ ట్యాంక్స్ కలిగి 330 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 8000 rpm వద్ద 9.37 Bhp పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హోండా హార్నెట్ 2.0రూ. 1.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బైక్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. 184.4 సీసీ ఇంజిన్ కలిగిన హార్నెట్ 2.0 బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 17 బ్రేక్ హార్స్ పవర్, 15.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..బజాజ్ పల్సర్ ఎన్160అతి తక్కువ కాలంలో ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించిన బైకులలో ఒకటి బజాజ్ పల్సర్. ఇది ప్రస్తుతం మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ పల్సర్ ఎన్160. దీని ప్రారంభ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 164.82 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 17.7 Bhp పవర్, 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
షో రూమ్ కే నిప్పు పెట్టిన యువకుడు
-
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్‌లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్‌ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్‌లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్‌నగర్‌లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్‌తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
అప్డేటెడ్ జావా 42 బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్‌సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024 -
గుద్దుకుంటూ పోయిన బస్సు..
-
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న 'బీఎండబ్ల్యూ ఆర్20' - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్‌ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.మోడ్రన్ క్లాసిక్ మోటార్‌సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్‌లో అప్హోల్స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్‌లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. -
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్‌పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
ఇండియా బైక్ వీక్‌లో కనిపించే బైకులు ఇలాగే ఉంటాయి - మైండ్ బ్లోయింగ్ (ఫొటోలు)
-
హైదరాబాద్ రోడ్లపై కొట్టుకుపోతున్న బైకులు..!
-
ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే?
చిన్నవైనా, పెద్దవైనా వాహనాలకు చక్రాలు, వాటికి టైర్లు ఉంటాయి. టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్ బంకులకో, మెకానిక్ షెడ్‌లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్ కంపెనీ ‘థామస్ పంప్స్’ ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే ‘మినీ పంప్’ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. దీని సాయంతో సైకిల్ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ బంతుల్లో కూడా క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. దీని ధర 119 డాలర్లు (రూ.9898). -
వరల్డ్ ఛాంపియన్ 'నీరజ్ చోప్రా' అద్భుతమైన కార్లు, బైకులు - ఓ లుక్కేసుకోండి!
టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిన 'నీరజ్ చోప్రా' (Neeraj Chopra) తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణ పతకం గెలిచి యావత్ భారతదేశం మొత్తం గర్వపడేలా మరో రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా ప్రసిద్ధి చెందిన నీరజ్ ఎలాంటి కార్లు & బైకులు వినియోగిస్తారనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ (Ford Mustang GT).. నీరజ్ చోప్రా గ్యారేజిలోని మొదటి కారు ఈ ఫోర్డ్ మస్టాంగ్ జీటీ. దీని ధర రూ. 75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఈ అమెరికన్ బ్రాండ్ కారంటే చాలా ఇష్టం. ఇది 5.0 లీటర్ ఇంజన్ కలిగి 396 హార్స్ పవర్, 515 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మస్టాంగ్ టాప్ స్పీడ్ గంటకు 180 మైల్స్/గం. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport).. రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన 'స్పోర్ట్స్' కారు కూడా నీరజ్ చోప్రా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 2.20 కోట్లు ధర కలిగిన ఈ లగ్జరీ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 5.0 లీటర్ V8 ఇంజన్ కలిగి 567 హార్స్ పవర్ & 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ. మహీంద్రా థార్ & XUV700.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'థార్' నీరజ్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 17 లక్షలు విలువైన ఈ కారు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది 2.2 లీటర్ డీజిల్ & 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, ఇది నీరజ్ కోసం ప్రత్యేకంగా రూపోంచిన కారు. ఇందులో చాలా వరకు కస్టమైజ్ చేసిన డిజైన్స్ చూడవచ్చు. ఈ SUV మిగిలిన కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కూడా పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner).. భారతదేశంలో ఎక్కువమంది వినియోగించే టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ నీరజ్ చోప్రా గ్యారేజిలో ఉంది0 దీని ధర రూ. 51 లక్షలు అని తెలుస్తోంది. 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ 2.7-లీటర్ పెట్రోల్ అండ్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లతో వస్తుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ (Harley-Davidson 1200 Roadster).. బైక్ విభాగంలో ఖరీదైనవిగా భావించే హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ నీరజ్ చోప్రా వద్ద ఉంది. దీనిని 2019లో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన బజాజ్ పల్సర్ 200ఎఫ్ (Bajaj Pulsar 200F).. ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బజాజ్ పల్సర్ 200ఎఫ్ కూడా నీరజ్ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కార్లు, బైకులు మాత్రమే కాకుండా ఒక ట్రాక్టర్ కూడా నీరజ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra)