bombings
-
టార్గెట్ నస్రల్లా.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
బీరుట్: హెజ్బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞచేసిన కొద్దిసేపటికే.. లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై భారీ బాంబు దాడులు జరిగాయి. బంకర్లను సైతం భూస్థాపితం చేసే భారీ బాంబులతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. బీరుట్ నగరంలోని దహియే పరిధిలోని హరేట్ రీక్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆరు ప్రధాన భవనాలు నేలమట్టమయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 76 మంది గాయపడ్డారు.మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఘటనాస్థలి వద్ద పెద్దసంఖ్యలో జనం గుమికూడారు. హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ టీవీఛానెళ్లు పేర్కొన్నాయి. ఏకధాటిగా బాంబులు వేయడం, పెద్ద సైజు బాంబులు వాడటం చూస్తుంటే హమాస్ అగ్రనేతను అంతంచేయడానికే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా పరిస్థితిపై ఎలాంటి స్పష్టత రాలేదు. బీరుట్లో గత ఏడాదికాలంలో ఇంతటి భారీస్థాయిలో బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. దాడుల ధాటికి ఆరు ప్రధాన భవంతులు నేలమట్టమయ్యాయి. అవి కూలాక బాంబులను వేయడం చూస్తుంటే అక్కడి భూగర్భంలో నిర్మించిన బంకర్లను కూల్చేయడమే అసలు లక్ష్యమని తెలుస్తోంది.‘‘ఈ బంకర్లలో∙నస్రల్లా ఉన్నట్లు భావిస్తున్నాం. ఖచ్చితత్వంతో కూడిన లక్షిత దాడి చేశాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. బాంబు పేలుళ్ల ప్రభావంతో ఏకంగా 30 కి.మీ.ల దూరంలోని ఇళ్ల గాజు కిటికీలు, అద్దాలు సైతం పగిలిపోయాయి. గురువారం చనిపోయిన హెజ్బొల్లా కమాండర్ అంత్యక్రియలు జరిగిన గంటకే బీరుట్‌పై దాడులు జరగడం గమనార్హం. పర్యటనను అర్థంతరంగా ముగించిన నెతన్యాహూ అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూ ఈ దాడుల వార్త తెల్సి వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశం బయల్దేరారు. నస్రల్లా మరణిస్తే తదుపరి కార్యాచరణపై రక్షణ, సైనిక, పాలనా వర్గాలతో చర్చించేందుకు ఆయన తిరిగొస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా దాడి ప్రాంతంలో లేడని హెజ్బొల్లా ప్రకటించింది. నస్రల్లా సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉన్నారని ఇరాన్ అధికార ‘తస్నీమ్’ వార్తాసంస్థ ప్రకటించింది. దాడులపై అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ చెబుతుండగా, అలాంటి సమాచారం తమకు అందలేదని అమెరికా స్పష్టంచేసింది. ఇరాన్ ఆరా.. నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి జరగడంతో ఇరాన్ సుప్రీం ఖమేనీ తన నివాసంలో జాతీయ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరిచారు. బీరుట్‌పై ఐడీఎఫ్(ఇజ్రాయెల్ రక్షణ బలగాలు) దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. అయితే.. ఓ మీడియా సంస్థతో అతడు బతికే ఉన్నాడని హెజ్బొల్లా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అలాగే.. ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి సైతం మీడియాతో మాట్లాడుతూ.. టెహ్రాన్ వర్గాలు అతడి సమాచారం గురించి ఆరా తీస్తోంది. -
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
ఇరాన్ జంట పేలుళ్లపై భారత్ దిగ్భ్రాంతి
ఢిల్లీ: ఇరాన్లో జరిగిన జంట పేలుళ్లపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో జరిగిన బాంబు దాడుల పట్ల మేము దిగ్భ్రాంతి చెందాం. ఈ క్లిష్ట సమయంలో మేము ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. బాధిత కుటుంబాలు, క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నాం" అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 95 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి చేసింది ఎవరనేది ఇప్పటికి తెలియదు. ఇదీ చదవండి: Iran explosions: రక్తమోడిన ర్యాలీ -
Israel-Hamas war: గాజాలో 20,057కి చేరిన మృతుల సంఖ్య
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో సామాన్యులే సమిధలవుతున్నారు. అక్టోబర్ 7న ఇరుపక్షాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులకు దిగుతోంది. సాధారణ జనావాసాలపై బాంబలు వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 20,057 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది మృత్యువాత పడినట్లు స్పష్టమవుతోంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. సరిపడా ఆహారం, నీరు అందక గాజాలో జనం ఆకలిలో అల్లాడిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల మందికి ఆహారం అందడం లేదని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాకు మానవతా సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొంది. యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరగాల్సిన ఓటింగ్ వాయిదా పడింది. రెండు రోజుల్లో 390 మంది బలి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరస్థాయిలో విరుచుకుపడుతోంది. గత రెండు రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ దాడుల్లో ఏకంగా 390 మంది పాలస్తీనియన్లు బలయ్యారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. 734 మంది క్షతగాత్రులుగా మారారని తెలియజేసింది. గాజాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. -
Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై బైడెన్ అసంతృప్తి!
వాషింగ్టన్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్ దేశాలూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులే చెబుతున్నారు. అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఈ వారమే ఇజ్రాయెల్‌లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్‌లో యుద్ధానికి దిగింది. అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్ కోల్పోతుంది’’ అని బైడెన్ హెచ్చరించారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్‌లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్ వ్యాఖ్యానించారు. -
Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం
ఖాన్ యూనిస్ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్‌తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నడుపుతున్న అల్ ఫలా స్కూల్‌పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్ ఫకూరా స్కూల్‌పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ అల్ జాతర్ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది. దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే. ఇంధన సరఫరా తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది. గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి. నోవా ఫెస్ట్ మృతులు 364 మంది ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ను హమాస్ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్‌లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది. పులి మీద పుట్రలా... ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. -
Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు
గాజాసిటీ/ఖాన్ యూనిస్/జెరూసలేం: గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్‌లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అల్–ఖుద్స్ ఆసుపత్రి సమీపంలో పేలుడు గాజాలో ఆదివారం ఉదయం అల్–ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్ వేటు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిపై సస్పెన్షన్ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అబ్బాస్‌తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్ 7 తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. జర్నలిస్టుకు తీరని దుఃఖం అల్–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్ అలలౌల్కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. -
Israel-Gaza War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా (ఫొటోలు)
-
Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం
జెరూసలేం/టెల్ అవివ్/న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు. తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు. బందీలను ఎక్కడ దాచారో? ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య! హమాస్ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది. గాజాలో ఆకలి కేకలు ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది. మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్ అల్ షేక్ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వెల్లడించింది. హమాస్ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయాప్ ఎర్డోగాన్ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం భరోసా ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌దే పైచేయి! హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్ ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్, టెల్ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. -
యుద్ధం అంతుచూసేదాకా వదలను
ఖార్తూమ్: యుద్ధం అంతుచూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంక్షుభిత సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ శనివారం ప్రకటించారు. దాంతో అక్కడి తమవారి భద్రతపై అమెరికా, బ్రిటన్, చైనా, తదితర దేశాలు ఆందోళనలో పడ్డాయి. కాల్పుల విరమణ యత్నాలు రెండుసార్లు విఫలమైన దరిమిలా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న దేశం నుంచి బయటపడే మార్గంలేక విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో ఇప్పటిదాక 400 మందికిపైగా మరణించారు. సూడాన్‌లో చిక్కుకున్న 16 వేల మంది తమ పౌరులను ఎలాగైనా రక్షిస్తామని అమెరికా శుక్రవారం ప్రకటించడం తెల్సిందే. -
సొంత నగరంపైనే రష్యా బాంబింగ్
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ రష్యా వైమానిక దళం పొరపాటున సరిహద్దుల్లోని సొంత నగరంపైనే భారీ బాంబు వేసింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలోని బెల్గొరొడ్ నగరంలోని అపార్టుమెంట్‌కు సమీపంలో తమ బాంబర్లు అనుకోకుండా ఒక బాంబు వేసినట్లు రష్యా మిలటరీ ధ్రువీకరించింది. ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 500 కిలోల బరువైన శక్తివంతమైన బాంబు పేలి 20 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా ఒక వ్యక్తి హైబీపీతో ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
దక్షిణ లెబనాన్, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
జెరూసలేం: దక్షిణ లెబనాన్‌తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్‌లో టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
Russia-Ukraine war: చొచ్చుకెళ్తున్న రష్యా
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్లోకి రష్యా సైన్యం మరింతగా చొచ్చుకుపోతోంది. గురువారం ఆ ప్రాంతంలో పలు గ్రామాలతో పాటు భారీ పరిమాణంలో భూభాగాన్ని ఆక్రమించి కీలకమైన హైవేను చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. అదే జరిగితే ముందుండి పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు సరఫరా మార్గాలన్నీ మూసుకుపోతాయి. రష్యా సైన్యానికి నానాటికీ అదనపు బలగాలు వచ్చి పడుతుండటంతో లిసిచాన్స్క్ నగరాన్ని అన్నివైపుల నుంచీ ముట్టడించేందుకు సిద్ధమవుతోంది. అందులో చిక్కే ప్రమాదాన్ని తప్పించుకునేందుకు నగరం, పరిసర ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెనుదిరుగుతున్నాయి. లెహాన్స్‌క్ ప్రాంత పాలనా కేంద్రమైన సెవెరోడొనెట్స్క్ నగర సమీపంలోని పలు ఇతర పట్టణాలు, గ్రామాలపై రష్యా సైన్యం ఇప్పటికే అదుపు సాధించిందని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. సెవరోడొనెట్స్క్ను కూడా పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అక్కడ ఉక్రెయిన్ ప్రతిఘటన అజోట్ కెమికల్ ప్లాంటుకే పరిమితమైంది. కొద్దిపాటి సైనికులు పౌరులతో పాటు వారాలుగా ప్లాంటులో చిక్కుబడి ఉన్నారు. డోన్బాస్లో సగం మేరకు విస్తరించిన లుహాన్స్క్ ప్రాంతం ఇప్పటికే 95 శాతానికి పైగా రష్యా అధీనంలోకి వెళ్లిపోయింది. మరోవైపు ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ సభ్యత్వం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బ్రెసెల్స్‌లో జరగనున్న ఈయూ శిఖరాగ్రంలో ఉక్రెయిన్‌కు అభ్యర్థి హోదా ఇస్తారని తెలుస్తోంది. తద్వారా ఉక్రెయిన్ను ఈయూలో చేర్చుకోవడంపై సభ్య దేశాలు అధికారికంగా చర్చలు జరుపుకోవడం వీలు పడుతుంది. ఈయూ పూర్తి సభ్యత్వ ప్రక్రియలో అభ్యర్థి హోదా తొలి అడుగు. అంతకుముందు ఈయూ ప్రశ్నావళికి ఉక్రెయిన్ ఇచ్చిన సమాధానాలను ఈయూ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదించింది. ఇక అమెరికాలోని భారతీయులు గురువారం ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. రష్యా తక్షణం నరమేధాన్ని ఆపాలంటూ నినదించారు. ఉక్రెయిన్‌పై దాడిని అమెరికాలోని భారతీయులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రష్యా నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్టు ప్రపంచంలో అతి పెద్ద క్రీడా ఉపకరణాల తయారీ సంస్థ నైక్ పేర్కొంది. దేశంలో అమ్మకాలను అదిప్పటికే నిలిపేసింది. వందలాది టాప్ కంపెనీలు ఇప్పటికే రష్యాకు గుడ్‌బై చెప్పడం తెలిసిందే. -
Russia-Ukraine War: తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు భారీ స్థాయిలో బాంబు దాడులు చేస్తున్నాయి. వాటిలో పలు నగరాల్లో భవనాలు తదితరాలు నేలమట్టం కావడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్టు ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో సెవెరోడొనెట్స్క్లో కెమికల్ ప్లాంటులో చిక్కుకున్న వందలాది పౌరులు, ఉక్రెయిన్ సైనికుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తనను యూరోపియన్ యూనియన్‌లో చేర్చుకోవడంపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వస్తాయని ఉక్రెయిన్ ఆశాభావం వెలిబుచ్చింది. ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్టు దేశ ఉప ప్రధాని ఓలా స్టెఫానిష్నా అన్నారు. మరోవైపు యుద్ధం మొదలైన తొలినాళ్లలో మరణించిన ఉక్రెయిన్ ఫొటో జర్నలిస్టును రష్యా సేనలు సజీవంగా పట్టుకుని దారుణంగా హతమార్చినట్టు తాజాగా వెలుగు చూసింది. రష్యా తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఓ ఉక్రెయిన్ అధికారిని, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా పాశవికం
కీవ్/లండన్/మాస్కో: రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడులను ఉధృతం చేస్తోంది. సామాన్య పౌరులు తలదాచుకున్న శిబిరాలను కూడా వదిలిపెట్టకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని బిలోహోరివ్కా గ్రామంలో ఓ పాఠశాలపై శనివారం రష్యా జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో జనం మరణించినట్లు స్థానిక గవర్నర్ సెర్హీ హైడే ప్రకటించారు. ఈ స్కూల్లో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్నారు. రష్యా బాంబు దాడుల్లో స్కూల్ భవనం పూర్తిగా నేలమట్టమయ్యింది. ఇప్పటిదాకా రెండు మృతదేహాలను గుర్తించామని, 30 మందిని రక్షించామని గవర్నర్ తెలిపారు. మరో 60 మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారని, వారంతా మరణించినట్లు నిర్ణయానికొచ్చామని వెల్లడించారు. అలాగే ప్రైవిలియా పట్టణంలో రష్యా దాడుల్లో ఇద్దరు బాలురు బలయ్యారు. మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌ను రష్యా సైన్యం దాదాపుగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడుతామని ఇక్కడి ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు.స్టీల్‌ప్లాంట్ ఉన్న సాధారణ ప్రజలను శనివారం నాటికి పూర్తిగా ఖాళీ చేయించారు. నల్లసముద్ర తీరంలోని అతిపెద్ద ఓడరేవు ఒడెసాపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం అక్కడ పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖర్కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాల ప్రతిదాడుల్లో రష్యా లెఫ్టినెంట్ కల్నల్ మృతిచెందాడు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనిక ఉన్నతాధికారుల సంఖ్య 39కు చేరింది. యూకే అదనపు సాయం 1.3 బిలియన్ పౌండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్‌కు అదనంగా 1.3 బిలియన్ పౌండ్ల సైనికపరమైన సాయం అందిస్తామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తోపాటు ఇతర జి–7 దేశాల అధినేతలు ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన అన్యాయమైన యుద్ధం వల్ల కేవలం ఉక్రెయిన్ నష్టపోవడమే కాదు మొత్తం యూరప్ భద్రత, శాంతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని పుతిన్‌కు హితవు పలికారు. రష్యా ‘విక్టరీ డే’ రష్యాలో సోమవారం జరిగే విక్టరీ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో నగరాలు, పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు ప్రా«ధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొంటారు. పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన చేయబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆయుధ సరఫరాలే లక్ష్యం
లివీవ్: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత తీవ్రతరం చేసింది. అమెరికా, యూరప్ దేశాల ఆయుధ సరఫరాలే లక్ష్యంగా పశ్చిమ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా రైల్వే లైన్లు, ప్రధాన రోడ్డు మార్గాలపై గురి పెట్టింది. రైల్వేస్టేషన్లకు కరెంటు సరఫరా చేస్తున్న ఐదు విద్యుత్కేంద్రాలను, పలు ఆయుధాగారాలను ధ్వంసం చేసింది. లివీవ్‌పైనా తీవ్రస్థాయిలో దాడులకు దిగింది. నగరంలో విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బ తిని పలుచోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్‌లోకి ఆయుధాలతో వెళ్లే నాటో, పాశ్చాత్య వాహనాలన్నింటినీ ధ్వంసం చేసేస్తామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ హెచ్చరించారు. తూర్పున డోన్బాస్ను పూర్తిగా చేజిక్కించుకునే ప్రయత్నాలను కూడా రష్యా ముమ్మరం చేసింది. అక్కడి క్రొమటోర్క్‌స్, సెవరోడోనెట్స్‌క్ సహా పలు నగరాలను ఆక్రమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్ వెల్లడించింది. తాజా దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ చెప్పింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై మళ్లీ దాడులకు దిగామన్న వార్తలను రష్యా రక్షణ మంత్రి ఖండించారు. కానీ అక్కడ బాంబింగ్ కొనసాగుతోందని ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ చెప్పుకొచ్చింది. మే 9న విక్టరీ డే ఉత్సవాల సందర్భంగా ఉక్రెయిన్‌పై పుతిన్ ‘పూర్తిస్థాయి యుద్ధం’ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. దీన్ని రష్యా ఖండించింది. రష్యాలో జెర్జిన్‌స్కీ పారిశ్రామిక ప్రాంతంలో ఓ ప్రభుత్వ పుస్తక ప్రచురణ సంస్థలో భారీ మంటలు చెలరేగాయి. ఇది రష్యాలో ప్రచ్ఛన్నంగా ఉన్న ఉక్రెయిన్ బలగాల పనేనని అనుమానిస్తున్నారు. రష్యా సైన్యం తమ భూభాగం నుంచి పూర్తిగా వైదొలిగేదాకా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందమూ ఉండబోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. పుతిన్ తనతో చర్చలకు రావాలన్నారు. ‘‘తొలి దశ యుద్ధంలో రష్యాను నిలువరించాం. మలి దశలో తరిమికొడతాం. చివరిదైన మూడో దశలో ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా పునరుద్ధరించుకుంటాం’’ అని ధీమా వెలిబుచ్చారు. రష్యా చమురును నిషేధిద్దాం: ఈయూ చీఫ్ రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను 27 యూరోపియన్ యూనియన్ దేశాలు ఏకగ్రీవంగా, సంపూర్ణంగా నిషేధించాలని ఈయూ చీఫ్ ఉర్సులా వాండెర్ లియెన్ ప్రతిపాదించారు. పుతిన్ సన్నిహితుడైన రష్యా ఆర్థడాక్స్ చర్చి చీఫ్ కిరిల్‌పై ఆంక్షలు విధించాలని కూడా ఈయూ యోచిస్తోంది. -
Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా
కీవ్: నెల రోజుల యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా నానాటికీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. నిర్బంధంతో అల్లాడుతున్న మారియుపోల్ నగరానికి బుధవారం ఆహారం తదితర అత్యవసరాలను తీసుకెళ్తున్న హ్యుమానిటేరియన్ కాన్వాయ్‌ని, 15 మంది రెస్క్యూ వర్కర్లను రష్యా సైన్యం నిర్బంధించిందని ఆరోపించింది. ఇరుపక్షాలూ అంగీకరించిన మానవీయ కారిడార్లను గౌరవించడం లేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దుమ్మెత్తిపోశారు. నగరంపై భూ, గగనతల దాడులకు తోడు నావికా దాడులకూ రష్యా తెర తీసింది. అజోవ్ సముద్రం నుంచి ఏడు యుద్ధ నౌకల ద్వారా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజులుగా ఐదు సెకన్లకో బాంబు చొప్పున పడుతున్నట్టు నగరం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. కీవ్‌లో ప్రతిఘటన కీవ్‌పైనా రష్యా దాడుల తీవ్రత బుధవారం మరింత పెరిగింది. నగరం, శివార్లలో ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, నేలమట్టమైన నిర్మాణాలు, పొగ తప్ప మరేమీ కన్పించని పరిస్థితి. కానీ ఉక్రెయిన్ దళాల ప్రతిఘటన నేపథ్యంలో రష్యా సేనలు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయాయని చెప్తున్నారు. ఉత్తరాది నగరం చెర్నిహివ్‌ను కీవ్‌కు కలిపే కీలక బ్రిడ్జిని రష్యా సైన్యం బాంబులతో పేల్చేసింది. దాంతో నగరానికి అత్యవసరాలను చేరేసే మార్గం మూసుకుపోయింది. తిండీ, నీరూ కూడా లేక నగరవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధం ఉక్రెయిన్ సైన్యం దూకుడు మరింతగా పెరిగిందని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. పలు నగరాల్లో రష్యా సైన్యాన్ని విజయవంతంగా నిలువరిస్తున్నట్టు చెప్పారు. వారి గెరిల్లా యుద్ధరీతులకు రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోందన్నారు. దక్షిణాదిన రష్యా ఆక్రమించిన ఖెర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఉక్రెయిన్ను రోజుల వ్యవధిలోనే ఆక్రమించేస్తామన్న అతివిశ్వాసమే రష్యాను దెబ్బ తీసిందని పాశ్చాత్య సైనిక నిపుణులు అంటున్నారు. ‘‘పరాయి దేశంలో తీవ్ర ఆహార, ఇంధన కొరతతో రష్యా సైన్యం అల్లాడుతోంది. అతి శీతల వాతావరణం సమస్యను రెట్టింపు చేస్తోంది. మంచు దెబ్బ తదితర సమస్యలతో సైనికులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది చనిపోయారు’’ అని చెబుతున్నారు. మొత్తమ్మీద రష్యా తన యుద్ధపాటవంలో పదో వంతు దాకా కోల్పోయిందని అమెరికా అంచనా. ఆకలికి తాళలేక రష్యా సైనికులు దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నారని ఉక్రెయిన్ చెబుతోంది. చర్చల్లో పురోగతి రష్యాతో చర్చల్లో కాస్త పురోగతి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండువైపులా ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయన్నారు. పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటున్నాయి. జీ–20 నుంచి రష్యాకు ఉద్వాసన! ఆంక్షలతో అతలాకుతలమవుతున్న రష్యాను ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల బృందమైన జీ–20 గ్రూప్ నుంచి తొలగించడంపై మిత్రపక్షాలతో అమెరికా చర్చలు జరుపుతోందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా అన్యాయమైన యుద్ధానికి దిగినందుకు పర్యవసానాలను రష్యా అనుభవించాల్సి ఉంటుంది. ఇకపై అది అంతర్జాతీయంగా ఏకాకిగానే మిగిలిపోతుంది’’ అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల మద్దతును మరింతగా కూడగట్టేందుకు నాలుగు రోజుల యూరప్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం బయల్దేరారు. తొలుత బ్రెసెల్స్‌లో దేశాధినేతలతో ఆయన వరుస చర్చలు జరుపుతారు. నాటో అత్యవసర శిఖరాగ్ర భేటీలో, యూరోపియన్ యూనియన్, జీ–7 సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం పోలండ్ వెళ్లి మర్నాడు అధ్యక్షుడు ఆంద్రే డూడతో భేటీ అవుతారు. -
పగవారికీ రావొద్దీ కష్టం.. ఈయూ సాయం మరువలేనిది.. గణాంకాలివే!
రష్యా నిర్దాక్షిణ్యంగా కురిపిస్తున్న బాంబుల వర్షానికి గూడు చెదిరిపోయింది. శిథిల దృశ్యాలను చూస్తూ గుండె పగిలిపోతోంది. యుద్ధం ఊరు విడిచి వెళ్లిపొమ్మంటోంది. మగవాళ్లు దేశ రక్షణ కోసం ఆగిపోతుంటే మహిళలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో వలసబాట పట్టారు. వీరిని యూరప్ అక్కున చేర్చుకుంటోంది... కనీవినీ ఎరుగని మానవీయ సంక్షోభంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. రష్యా దాడి మొదలైనప్పటి నుంచి దేశం విడిచిన వారి సంఖ్య 33 లక్షలు దాటేసింది. వీరిలో 90 శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. లక్షలాది మంది సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇక దేశంలో నిరాశ్రయులైన వారు 65 లక్షల దాకా ఉంటారని ఐరాస హక్కుల మండలి అంచనా. ‘‘ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఉన్న జనం వలస బాట పట్టారు. యుద్ధం ఆగితే తప్ప వలసలు ఆగేలా లేవు’’ అని యూఎన్హెచ్ఆర్సీ చీఫ్ ఫిలిప్పో గ్రాండీ అన్నారు. ఉక్రెయిన్‌లో మహిళల కష్టాలు వర్ణనాతీతం! ‘‘కరెంట్ లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవు. నరకం భరించలేక నానాకష్టాలకోర్చి వలస వచ్చా’’ అని ఓల్హా అనే మహిళ కన్నీరుమున్నీరైంది. శరణార్థులుగా మారితే అల్లకల్లోలం ఉక్రెయిన్ వలసలను చూసి ఇతర దేశాల్లోని శరణార్థులూ చలించిపోతున్నారు. ఈ బాధలు పగవారిక్కూడా వద్దని 13 ఏళ్లప్పుడే సిరియా నుంచి అమెరికా వలస వచ్చిన నిడా అల్జబౌరిన్ చెప్పింది. చిన్నవయసులో శరణార్థులుగా మారితే జీవితం అల్లకల్లోలమవుతుందని ఆవేదన వెలిబుచ్చింది. చిన్నారులను నేరస్తుల ముఠాలు ఎత్తుకెళ్లే ప్రమాదముందని యునిసెఫ్ హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ సాయం ఇలా ఉక్రెయిన్ ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని వస్తున్న వారిని యూరోపియన్ యూనియన్ అక్కున చేర్చుకుంటోంది. ఎక్కడికక్కడ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా నిత్యావసరాలు అందిస్తోంది. మంచి ఆహారం, వైద్య సదుపాయాలతో పాటు సంక్షేమాన్ని కూడా చూస్తోంది. పిల్లలకు స్కూళ్లలో సీట్లు కూడా ఇవ్వనుంది. 27 ఈయూ దేశాలు శరణార్థులకు మూడేళ్ల పాటు ఉండే అవకాశం కల్పించాయి. అమెరికాలోకి శరణార్థులెవరూ రాకపోయినా మానవతా సాయం కింద ఉక్రెయిన్‌కు ఇప్పటికే 400 కోట్లకు డాలర్లకు పైగా అందించింది. అందులో 104 కోట్ల డాలర్లు శరణార్థులకు ప్రత్యేకించింది. ► ఉక్రెయిన్ నుంచి అత్యధికంగా పోలండ్‌కు 20 లక్షల మందికి పైగా వలస వెళ్లారు ► 5 లక్షల మంది రుమేనియాకు వెళ్లారు ► మాల్దోవాకు 4 లక్షల మంది వెళ్లారు. ఇక్కడ్నుంచి వేరే దేశాలకు వెళ్తున్నారు. ► 3 లక్షల మంది హంగరీ వెళ్లినట్టు గణాంకాలు చెప్తున్నాయి ► స్లొవేకియాకు 2.5 లక్షల మంది వెళ్లారు – నేషనల్ డెస్క్, సాక్షి -
Russia-Ukraine war: ప్రధాన నగరాలే టార్గెట్
కీవ్/లెవివ్/మాస్కో/వాషింగ్టన్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్ శివార్లతో పాటు పశ్చిమాన లెవివ్ సిటీపై శుక్రవారం ఉదయం భీకర దాడులు జరిపింది. లెవివ్ నడిబొడ్డున బాంబుల మోత మోగించింది. కొన్ని గంటలపాటు దట్టమైన పొగ వ్యాపించింది. క్షిపణి దాడుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో యుద్ధ విమానాల మరమ్మతు కేంద్రం, బస్సుల మరమ్మతు కేంద్రం దెబ్బతిన్నాయి. రష్యా నల్ల సముద్రం నుంచి లెవివ్‌పై క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. క్రామాటోర్స్క్ సిటీలో ఇళ్లపైనా క్షిపణులు వచ్చి పడుతున్నాయి. ఖర్కీవ్‌లో మార్కెట్లను కూడా వదలడం లేదు. చెర్నిహివ్‌లో ఒక్కరోజే 53 మృతదేహాలను మార్చురీలకు తరలించారు. మారియుపోల్‌లో బాంబుల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బాంబు దాడులకు గురైన థియేటర్ నుంచి 130 మంది బయటపడగా 1,300 మంది బేస్మెంట్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. రష్యా కల్నల్, మేజర్ మృతి ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సెర్గీ సుఖరెవ్, మేజర్ సెర్గీ క్రైలోవ్ కూడా వీరిలో చనిపోయినట్టు రష్యా అధికారిక టెలివిజన్ కూడా దీన్ని ధ్రువీకరించింది. రష్యా ఇప్పటిదాకా 7,000 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు సమాచారం. బైడెన్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తమకు అదనపు సైనిక సాయం అందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని రష్యా సరిగా అంచనా వేయలేకపోయిందన్నారు. ఆపేయండి: హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని ప్రఖ్యాత హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ రష్యాకు సూచించారు. పుతిన్ స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ‘‘నా తండ్రి కూడా కొందరి మాయమాటలు నమ్మి హిట్లర్ తరపున రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. భౌతికంగా, మానసికంగా గాయపడి ఆస్ట్రియాకు తిరిగొచ్చారు’’ అన్నారు. మానవత్వం చూపాల్సిన సమయం: భారత్ రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, సామాన్యులు మృత్యువాత పడుతున్నారని ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. నిరాశ్రయులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరముందని భద్రతా మండలి భేటీలో ఆయనన్నారు. భారత్ తనవంతు సాయం అందిస్తోందని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో సామాన్యులు చనిపోతుండడం తీవ్ర ఆందోళనకరమని ఐరాస పొలిటికల్ చీఫ్, అండర్ సెక్రెటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 60.6 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా ఉక్రెయిన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని రష్యా తరపు బృందానికి సారథ్యం వహిస్తున్న వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. ఉక్రెయిన్‌కు తటస్థ దేశం హోదా ఉండాలని తాము కోరుతున్నామని, ఈ విషయంలో ఒక ఒప్పందానికి ఇరుపక్షాలు దగ్గరగా వచ్చినట్లు వెల్లడించారు. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ఉద్దేశం పట్ల ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు. ర్యాలీలో పాల్గొన్న పుతిన్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాజధాని మాస్కోలో భారీ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పం రష్యాలో విలీనమై 8 ఏళ్లయిన సందర్భంగా మాస్కోలోని లుఝ్నికీ స్టేడియం చుట్టూ ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న తమ సైనిక బలగాలపై ఈ సందర్భంగా పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లో నాజీయిజంపై పుతిన్ పోరాడుతున్నారని వక్తలన్నారు. రష్యా చమురుపై జర్మనీ ఆంక్షలు! ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు ముకుతాడు వేయక తప్పదన్న సంకేతాలను జర్మనీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా బెయిర్‌బాక్ చెప్పారు. చమురు కోసం తాము రష్యాపై ఆధారపడుతున్నప్పటికీ ఇది మౌనంగా ఉండే సమయం కాదన్నారు. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో ఫోన్లో దాదాపు గంటపాటు మాట్లాడారు. ఉక్రెయిన్‌లో కాల్పులు విరమణకు వెంటనే అంగీకరించాలని కోరారు. -
ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై రష్యా సైన్యం దాడులు సోమవారం మరింత పదునెక్కాయి. కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా దళాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నగరాన్ని, శివార్లను లక్ష్యం చేసుకుని క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇర్పిన్, బుచా, హోస్టొమెల్ వంటి శివారు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. దాడుల్లో నగరంలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ కూలిపోగా ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాలు తయారు చేసే కీవ్‌లోని ఆంటొనోవ్ ఫ్యాక్టరీ దెబ్బ తిన్నది. ప్లాంటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మారియుపోల్, మైకోలెయివ్, ఖర్కీవ్ సహా పలు నగరాలు దాడుల ధాటికి అల్లాడుతున్నాయి. మైకోలెయివ్, ఖర్కీవ్‌ల్లో రష్యా వైమానిక దాడుల్లో పలు నివాస భవనాలు, రివైన్ ప్రాంతంలో ఓ టీవీ టవర్ నేలమట్టమయ్యాయి. పౌర మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 2,500 మందికి పైగా యుద్ధానికి బలైనట్టు నెక్స్టా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వలసలు 28 లక్షలు దాటాయని ఐరాస పేర్కొంది. సంక్షోభంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్, చైనా విదేశాంగ శాఖ సలహాదారు యాంగ్ జీచీ రోమ్‌లో చర్చలు జరిపారు. మా అంచనాలు తప్పుతున్నాయి: రష్యా యుద్ధం తాము ఆశించినట్టుగా సాగడం లేదని రష్యా తొలిసారి అంగీకరించింది. తమ సేనలు అనుకున్న దానికంటే నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని రష్యా నేషనల్ గార్డ్స్ చీఫ్ విక్టర్ జొలొటోవ్ అన్నారు. మరోవైపు రష్యా జీఆర్యూ మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారి కెప్టెన్ అలెక్సీ గుల్చక్ సోమవారం మారియుపోల్‌లో దాడుల్లో మరణించారు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనికాధికారుల సంఖ్య 12కు చేరింది. ఎటూ తేల్చని నాలుగో రౌండ్ చర్చలు భీకర దాడుల మధ్యే సోమవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం నాలుగో రౌండ్ చర్చలు జరిగాయి. గంటల తరబడి జరిగిన చర్చలు చెప్పుకోదగ్గ ఫలితమేదీ లేకుండానే ముగిశాయి. ముట్టడిలో ఉన్న నగరాలకు సాయం అందించడం తదితరాలకే చర్చలు పరిమితమైనట్టు సమాచారం. చర్చలు మంగళవారం కొనసాగనున్నాయి. శాంతి, కాల్పుల విరమణ, తక్షణం సైన్యాల ఉపసంహరణ, భద్రత హామీలను తమ ప్రధాన డిమాండ్లుగా ఉంచినట్టు ఉక్రెయిన్ చెప్పింది. చైనా సైనిక సాయం కోరిన రష్యా! ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు మిత్రదేశం చైనాను రష్యా సైనిక సాయం అర్థిస్తోందని అమెరికా సీనియర్ అధికారి ఒకరన్నారు. ఆయుధాలు, సైనిక సామాగ్రి కోరుతోందని వెల్లడించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల భయంతో చైనా ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం. ఇది తప్పుడు ప్రచారమని, చైనాతో పాటు రష్యా కూడా ఖండించింది. ఆహార విపత్తును ఎదుర్కొంటాం: ఐరాస చూçస్తుండగానే ఉక్రెయిన్ శ్మశానంగా మారిపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వెలిబుచ్చారు. అణు యుద్ధ ప్రమాదం వెన్నులో చలి పుట్టిస్తోందన్నారు. ప్రపంచ ఆహార భద్రతపైనా యుద్ధం పెను ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆహార, ఇంధన విపత్తు స్పందన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 30 వేల సైన్యంతో నాటో విన్యాసాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో భారీ బల ప్రదర్శనకు దిగింది. యూరప్, ఉత్తర అమెరికా నుంచి 25కు పైగా సభ్య దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు, 50కి పైగా యుద్ధ నౌకలతో ఉత్తర నార్వేలో సోమవారం భారీ కవాతు జరిపింది. ఇది యుద్ధానికి చాలా ముందే ఖరారైన షెడ్యూల్ అని, రష్యాకూ వీటిపై సమాచారముందని నార్వే చెప్పింది. రెండేళ్లకోసారి జరిగే ఈ విన్యాసాలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1న ముగియాలి. ప్రత్యక్ష చర్చలు జరపాలి: భారత్ యుద్ధం ఆగాలని ఐరాసలో భారత ప్రతినిధి ఆర్.రవీంద్ర ఆకాంక్షించారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు ప్రారంభించాలని కోరారు. ఆయన సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌తో తాము సంప్రదింపులు కొనసాగిస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలని సూచించారు. నిండు చూలాలు దుర్మరణం రష్యా దాడికి ఓ నిండు చూలాలు బలైన వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మారియుపోల్‌లో ఓ ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అంబులెన్సుతో తరలిస్తుండగా నొప్పితో అల్లాడుతున్న వీడియో వైరలైంది. హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించి సిజేరియన్ చేసినా లాభం లేకపోయింది. పాప దక్కదని అర్థమయ్యాక ‘నన్ను చంపేయండి’ అంటూ ఆమె రోదించిన తీరు డాక్టర్లను కూడా కలచివేసింది. నాతో ఫైటింగ్‌కు రా పుతిన్‌కు ఎలాన్ మస్క్ చాలెంజ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో ద్వంద్వ యుద్ధానికి రావాలని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాలు చేశారు. ఉక్రెయిన్ను పందెంగా ఒడ్డాలంటూ ట్వీట్ చేశారు. పుతిన్‌కు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లేకపోవడంతో, తన సవాలుకు రష్యా అధ్యక్షుని అధికారిక అకౌంట్ ద్వారా స్పందించాలని సూచించారు. ‘‘నాతో ఫైటింగ్‌కు ఒప్పుకుంటారా?’’ అని పుతిన్‌ను ప్రశ్నించారు. అందులో పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్లో రాశారు. యుద్ధం వల్ల ఇంటర్నెట్ సేవలకు దూరమైన ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్ కంపెనీ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని మస్క్ అందజేయడం తెలిసిందే. -
Russia-Ukraine war: భీకర పోరు
మారియుపోల్/లెవివ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. రష్యా సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలనే కాదు, సాధారణ నివాస గృహాలను కూడా విడిచిపెట్టడం లేదు. కీవ్, మారియుపోల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. కాల్పుల మోత ఆగకపోవడంతో పౌరుల తరలింపు సాధ్యం కావడంలేదు. నీరు, ఆహారం, అత్యవసర ఔషధాలు అందక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారియుపోల్‌లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్ చుట్టూ రష్యా సైన్యం మోహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడొల్యాక్ చెప్పారు. కీవ్‌పై రష్యా సైన్యం చాలావరకు పట్టు సాధించిందని తెలిపారు. రాజధానిని ప్రత్యర్థుల కబంధ హస్తాల నుంచి కాపాడుకొనేందుకు జనం సిద్ధమవుతున్నారని వెల్లడించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ నగర సమీపంలో ఉన్న యారోవివ్ సైనిక శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉదయం రష్యా గగనతల దాడుల్లో 35 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. పోలండ్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న యారోవివ్ మిలటరీ రేంజ్‌పై రష్యా సైన్యం రాకెట్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. దీన్ని యారోవివ్ ఇంటర్నేషనల్ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ సెంటర్గానూ పిలుస్తారు. అమెరికా సైనికాధికారులు ఇక్కడ ఉక్రెయిన్ సైన్యానికి స్వయంగా శిక్షణ ఇస్తుంటారు. ఈ మిలటరీ రేంజ్లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే, యారోవివ్ శిక్షణా కేంద్రంలో మాటువేసిన 180 మంది విదేశీ కిరాయి సైనికులను హతమార్చామని, విదేశీ ఆయుధాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఉక్రెయిన్‌కు మరో 20 కోట్ల డాలర్లు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తెచ్చే నౌకలను పేల్చేస్తామని వెల్లడించింది. నకిలీ రిపబ్లిక్లను సృష్టిస్తే సహించం తమ దేశాన్ని ముక్కలు చేయడానికి రష్యా తమ భూభాగంలో నకిలీ రిపబ్లిక్లను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ తరహా అనుభవాలను పునరావృతం కానివ్వబోమన్నారు. ఖేర్సన్ ప్రాంతాన్ని రిపబ్లిక్‌గా మార్చేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. మానవతా కారిడార్ల ద్వారా 1,25,000 మందిని దేశం నుంచి క్షేమంగా బయటకు పంపించామని వివరించారు. మరో మేయర్‌ను అపహరించిన రష్యా! దినిప్రొరుడ్నె నగర మేయర్ యెవ్హెన్ మాట్‌వెయెవ్‌ను ఆదివారం రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే మెలిటోపోల్ సిటీ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా సైన్యం అపహరించినట్లు వార్తలు రావడం తెలిసిందే. భారత ఎంబసీ పోలండ్‌కు మార్పు ఉక్రెయిన్‌లో పరిస్థితులు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) పొరుగు దేశం పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఇప్పటికే లెవివ్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా దాడుల్లో అమెరికా జర్నలిస్టు మృతి ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్లో రష్యా దాడుల్లో ప్రఖ్యాత ‘ద న్యూయార్క్ టైమ్స్’లో పనిచేసిన బ్రెంట్ రెనాడ్(51) మృతి చెందినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక ఆదివారం వెల్లడించింది. మరో ఇద్దరు అమెరికా జర్నలిస్టులు గాయపడ్డారని తెలియజేసింది. అమెరికాకు చెందిన బ్రెంట్ రెనాడ్ సినీ దర్శకుడిగానూ పని చేస్తున్నారు. నాటో జోలికొస్తే ప్రతిదాడులే: అమెరికా ఉక్రెయిన్–నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా దాడులకు దిగితే ప్రతిదాడులు చేస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై జేక్ సలీవన్, చైనా విదేశాంగ విధానం సీనియర్ సలహాదారు యాంగ్ జీచీ సోమవారం రోమ్‌లో చర్చలు జరుపనున్నారు. గూగుల్ ఉన్నతాధికారులకు బెదిరింపులు పుతిన్‌కు వ్యతిరేకంగా ఓట్లను నమోదు చేసే ఒక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని రష్యా అధికారులు గూగుల్ మహిళా ఉన్నతాధికారిని బెదిరించారు. ఈ యాప్‌ను 24 గంటల్లో తొలగించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించడంతో కంపెనీ ఆమెను ఒక హోటల్‌కు తరలించింది. కానీ కేజీబీ ఏజెంట్లు అక్కడకు వచ్చి మరోమారు బెదిరించారని తెలిపింది. దీంతో స్మార్ట్ ఓటింగ్ యాప్ గంటల్లో ప్లేస్టోర్ నుంచి మాయమైంది. తనకు ఇలాంటి బెదిరింపులే తమకూ వచ్చాయని యాపిల్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా ఇరుదేశాల మధ్య యుద్ధంపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి లభించిందని రష్యా తరపు ప్రతినిధి లియోనిడ్ స్లట్స్కీ ఆదివారం చెప్పారు. చర్చల ప్రారంభం నాటితో పోలిస్తే ఇప్పుడు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా ప్రతినిధుల మధ్య బెలారస్ సరిహద్దులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు ఇలాగే సానుకూల ధోరణితో కొనసాగితే రెండు దేశాల నడుమ ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని స్లట్స్కీ వివరించారు. ఆశ్రయమిస్తే నెలకు 350 పౌండ్లు ఉక్రెయిన్ శరణార్థులకు ఇళ్లల్లో ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే నెలకు 350 పౌండ్లు చొప్పున భత్యం అందజేస్తామని యూకే హౌసింగ్ సెక్రెటరీ మైఖేల్ గోవ్ చెప్పారు. కనీసం 6 నెలలపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రాణభయంతో తరలివస్తున్నారని, ఒక్కొక్కరి అవసరాలను తీర్చడానికి గాను స్థానిక కౌన్సిళ్లకు 10 వేల పౌండ్లుచొప్పున ఇస్తామన్నారు. శరణార్థులకు వైద్య సేవలు, వారి పిల్లల స్కూళ్ల ఫీజులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఆసక్తి ఉన్నవారు సోమవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శరణార్థులు మూడేళ్లపాటు ఉండొచ్చని తెలిపారు. -
Ukraine-Russia War: దిగ్బంధంలో కీవ్
లెవివ్/వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులతోపాటు స్థానికుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా సైన్యం దూసుకుపోతోంది. కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలను ఆక్రమించేందుకు ఈశాన్యంగా చుట్టుముడుతోంది. కీవ్ శివార్లలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు పోర్టు సిటీ మారియుపోల్‌లో చిన్నారులతో సహా 80 మందికి పైగా పౌరులు తలదాచుకున్న మసీదుపై రష్యా సైన్యం శనివారం క్షిపణులతో భీకర దాడికి దిగింది. మారియుపోల్‌లో యుద్ధ మరణాలు 1,500 దాటినట్లు మేయర్ కార్యాలయం ప్రకటించింది. కీవ్ పరిధిలోని పెరెమోహా గ్రామంలో పౌరులను తరలిస్తున్న వాహన కాన్వాయ్‌పై రష్యా బాంబు దాడి జరగడంతో ఏడుగురు పౌరులు మరణించారు. మైకోలైవ్ నగరంలోనూ రష్యా బీభత్సం సృష్టిస్తోంది. దాడిలో క్యాన్సర్ ఆసుపత్రి, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. మారియుపోల్ తూర్పు శివారు ప్రాంతాలను రష్యా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ వలసలు 26 లక్షలు దాటినట్టు సమాచారం. యుద్ధం ఆపాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్ చేశారు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. కాల్పులు విరమించాలని కోరారు. మరో మేజర్ జనరల్ మృతి యుద్ధంలో రష్యా మరో సైనిక ఉన్నతాధికారిని కోల్పోయింది. మారియుపోల్‌లో తమ దాడిలో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ కొలేస్నికోవ్ చనిపోయినట్టు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. రష్యా ఇప్పటికే ఇద్దరు మేజర్ జనరల్స్‌ను పోగొట్టుకోవడం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు కోసం ఉక్రెయిన్, రష్యాలతో చర్చిస్తున్నట్టు ఐరాస చెప్పింది. 12,000 మంది అమెరికా సైనికులు రష్యాతో సరిహద్దులున్న లాత్వియా, ఎస్తోనియా, లిథువేనియా, రొమేనియా తదితర దేశాలకు 12,000 మంది సైనికులను పంపినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గెలవలేరన్నారు. రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ ప్రజలు అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. అయితే ఈ యుద్ధంలో తాము భాగస్వాములం కాబోమన్నారు. నాటో సభ్య దేశాల భూభాగాలను కాపాడుకునేందుకు రష్యా సరిహద్దులకు 12,000 అమెరికా సైనికులను పంపించినట్టు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యంలోకి... స్నైపర్ వలీ ‘రష్యాపై జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేయండి’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తి పట్ల కెనడా మాజీ సైనికులు సానుకూలంగా స్పందించారు. కెనడా రాయల్ 22వ రెజిమెంట్‌కు చెందిన పూర్వ సైనికులు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. వీరిలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్ వలీ కూడా ఉన్నారు. రష్యా అన్యాయమైన యుద్ధం చేస్తోందని, అందుకే ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దిగానని వలీ చెప్పారు. గతంలో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడిన కుర్దిష్ దళాలకు వలీ సాయం అందించారు. వలీ ఒక్కరోజులో కనీసం 40 మందిని హతమార్చగలడంటారు. 2017 జూన్‌లో ఇరాక్‌లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ జిహాదిస్ట్‌ను సునాయాసంగా కాల్చి చంపాడు. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్ మెలిటోపోల్ మేయర్‌ను రష్యా సైనికులు అపహరించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా సైన్యం ఐసిస్ ఉగ్రవాదుల్లా రాక్షసంగా ప్రవర్తిస్తోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బందీలుగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రష్యాపై పోరాటం కొనసాగించాలని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేయర్‌ను రష్యా జవాన్లు కిడ్నాప్ చేస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ పిల్లలను యుద్ధానికి పంపొద్దు..రష్యా తల్లులకు జెలెన్స్కీ విజ్ఞప్తి ‘దయచేసి మీ పిల్లలను యుద్ధ రంగానికి పంపకండి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి’ అని రష్యా మహిళలకు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలను ఉక్రెయిన్‌లో యుద్ధంలోకి దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగాలిస్తాం, కేవలం సైనిక శిక్షణ ఇస్తాం అనే మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని కోరారు. యుద్ధంలో తమ సైనికులు 1,300 మంది అమరులయ్యారని వెల్లడించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకొనేందుకు అమాయకులను రష్యా పొట్టన పెట్టుకుంటోందని ఆరోపించారు. సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో చర్చిద్దామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జెలెన్స్కీ ప్రతిపాదించినట్లు సమాచారం. -
విరామం లేని దాడులు..మాట తప్పిన రష్యా
లెవివ్: ఉక్రెయిన్‌లోని మరియూపోల్, వోల్నోవఖా నగరాల నుంచి సాధారణ పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు వీలుగా శనివారం దాదాపు ఐదున్నర గంటలపాటు పరిమిత స్థాయిలో కాల్పుల విరమణకు రష్యా అంగీకరించడం కీలక పరిణామంగా నిపుణులు భావించారు. రష్యా కొంత దిగి వస్తున్నట్లుగా అంచనా వేశారు. అయితే, కాల్పుల విరమణ హామీని రష్యా నిలబెట్టుకోలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. మరియూపోల్, వోల్నోవఖా నగరాలపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించిందని, ఫలితంగా పౌరుల చేరవేత సాధ్యం కాలేదని ఉక్రెయిన్ తెలిపింది. కాల్పుల విరమణకు రష్యా కట్టుబడి ఉండలేదని, మరియూపోల్తోపాటు పరిసర ప్రాంతాలపై దాడులు యథాతథంగా కొనసాగించిందని, బయటకు వెళ్లాల్సిన పౌరులు అండర్‌గ్రౌండ్ స్టేషన్లలోనే తలదాచుకోవాల్సి వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయ ప్రతినిధి కైరీలో టైమోషెంకో తెలిపారు. కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ రష్యాతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. పౌరుల భద్రత దృష్ట్యా మరియూపోల్, వోల్నోవఖా నగరాల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తూ తొలుత రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరులు వెళ్లే మార్గాల్లో ఎలాంటి దాడులు జరుపబోమని హామీ ఇచ్చింది. దీంతో ఉక్రెయిన్ అధికారుల్లో ఆశలు చిగురించాయి. రెండు నగరాల నుంచి పౌరులను తరలించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలిసింది. రష్యా సైన్యం మాట తప్పడంతో తరలింపు ప్రక్రియ నిలిపివేయక తప్పలేదని ఉక్రెయిన్ పేర్కొంది. దాడులు ఆపాలని రష్యాను కోరుతున్నట్లు ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఇరీనా వెరెషుక్ చెప్పారు. మరియూపోల్, వోల్నోవఖా సిటీల్లో ఉన్న తమ సేనలకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. అందుకే ప్రతిదాడులు చేశామన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చింది. కాల్పుల విరమణ అనేది చివరకు వృథా ప్రయాసగానే మిగిలిపోవడం ఉక్రెయిన్ను నిరాశపర్చింది. ఈ ఒప్పందం అమలయ్యేలా తమ వైపు నుంచి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. జనం ఆకలి కేకలు మరియూపోల్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. గడ్డకట్టించే చలిలో వేలాది మంది ప్రజలు నానా కష్టాలూ పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ఫోన్లు పనిచేయడం లేదు. ఆహారం, మంచినీటి కొరత వేధిస్తోంది. ఫార్మసీల్లో ఔషధాలు దొరకడం లేదు. బయటకు వెళ్లిపోవడానికి వేలాది మంది సిద్ధమయ్యారని, ఇంతలో రష్యా దాడులు ప్రారంభించడంతో వారంతా ఆగిపోయారని మరియూపోల్ మేయర్ చెప్పారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని, అందుకే తరలింపు ఆపేశామని తెలిపారు. మరియూపోల్‌లో 2 లక్షలు, వోల్నోవఖాలో 20 వేల మంది ఉన్నట్లు అంచనా. -
భారతీయ విద్యార్థులూ.. భయం వద్దు
కీవ్: రెండు రోజులైంది. తినడానికి తిండి లేదు, నిద్ర లేదు. తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. ప్రాణభయంతో బేస్మెంట్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. బాంబులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రష్యా సేనలు పౌర నివాస ప్రాంతాలపైన కూడా బాంబుల వర్షం కురిపిస్తూ ఉండడంతో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలర చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. దేశం కాని దేశంలో యుద్ధ భయంతో భీతిల్లుతున్న తమ కన్న బిడ్డలకి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక భారత్‌లో ఉన్న తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. రెండు రోజులుగా తిండి, నిద్ర లేకుండా గడుపుతున్న విద్యార్థుల్ని క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు ప్రత్యేక విమానాల్ని రుమేనియా రాజధాని బుకారెస్ట్‌కు పంపించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బుకారెస్ట్కి చేరుకోగలిగే విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా విదేశాంగ శాఖ అ«ధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికయ్యే ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల్ని బుకారెస్ట్ తీసుకురావడానికి కీవ్‌లో భారత రాయబార కార్యాలయం వారికి సహకారం అందిస్తుంది. రుమేనియా, హంగేరి నుంచి వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రుమేనియా, హంగేరి సరిహద్దు ప్రాంతాలైన చాప్ జహోని, చెర్నివిట్సికి సమీపంలో సిరెత్ సరిహద్దుల్లో నివసించే భారతీయులు ఒక క్రమ పద్ధతిలో చెక్ పాయింట్ల దగ్గరకు చేరుకోవాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారతీయులందరూ ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. పాస్‌పోర్టు, కోవిడ్–19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్తో పాటు అత్యంత అవసరమైన సామాన్లు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు చిక్కుకొని ఉంటే వారిలో అత్యధికులు విద్యార్థులే. 8 కి.మీ. నడుచుకుంటూ 40 మంది భారతీయ వైద్య విద్యార్థులు నడుచుకుంటూ పోలండ్ సరిహద్దులకు చేరుకున్నారు. లివివ్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న వారంతా 8కి.మీ.కు పైగా నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వచ్చారు. ఉక్రెయిన్ ఇరుగు పొరుగు దేశాల నుంచి విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో వీరంతా ప్రాణాలు దక్కించుకోవడానికి నడుచుకుంటూ వచ్చారు. -
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
గాజా సిటీ: పాలస్తీనా హమాస్ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హమాస్ కేంద్ర స్థావరమైన గాజా సిటీపై వరుసగా వైమానిక దాడులు సాగిస్తోంది. శనివారం శరణార్థుల క్యాంపుపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మరో 10 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వీరిలో చాలామంది చిన్నారులే కావడం గమనార్హం. హమాస్ గ్రూపు అగ్రనేతల్లో ఒకరైన ఖలీల్ అల్–హయె నివాసంపై బాంబుదాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నెలకొన్న ఘర్షణలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఆదివారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏడాది పాటు సంధి చేసుకోవాలని, ఘర్షణ ఆపాలని ఈజిప్టు సూచించగా, హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ నో చెప్పింది. గాజాలో తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసింది మాట్లాడారు. స్వీయరక్షణకు ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలను నెతన్యాహు వివరించారు. గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 126 మంది పాలస్తీనావాసులు మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో శనివారం గాజా సిటీలోని బహుళ అంతస్తుల భవనం ధ్వంసమయ్యింది. 12 అంతస్తులున్న ఈ భవనంలోనే అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ), అల్–జజీరా ఛానల్‌తోపాటు ఇతర మీడియా సంస్థల ఆఫీస్‌లున్నాయి.