book realease
-
Akshainie Reddy: నానమ్మ గురించి రాస్తా...
పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల్ల అమ్మాయి గురించి కథ రాస్తే ఎలా ఉంటుంది?! ఏడవతరగతి చదువుతున్న పన్నెండేళ్ల పట్లోళ్ల అక్షయినీ రెడ్డి రాసిన ‘ట్రైల్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్’ పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలు అక్షయినీ రెడ్డి.‘‘మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో రోజూ చూస్తుంటాను. నానమ్మ, అమ్మ, నాన్న.. మా ఇంట్లోని వ్యక్తులే నాకు స్ఫూర్తి. నానమ్మ లైఫ్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను...’ అంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.‘‘నాకు కథలపైన ఆసక్తి మొదలైందంటే అమ్మ చెప్పిన స్టోరీస్ వల్లే. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ రకరకాల కథలు చెబుతుంటుంది. తముణ్ణి, నన్ను బయటకు తీసుకెళ్లినప్పుడైనా, కాస్త టైమ్ దొరికినా ఏదో చిట్టి కథ ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పి, వాటిని షార్ట్ ఫార్మ్‌లో రాసి చూపించమనేది. తర్వాత్తర్వాత పుస్తకాల్లోని కథలు చదివినా, వాటిని ఒక చిన్న పేరాలో రాసి చూపించేదాన్ని. ఈ అలవాటు నాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగేలా చేసింది. ఇప్పుడు నా కోసం ఇంట్లో ఓ లైబ్రరీయే ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం ఇంగ్లిష్వే ఉంటాయి. ఫారినర్స్ రాసినవి, సుధామూర్తి రచనలు బాగా చదువుతాను. ఒక బుక్ చదివాక బాగా నచ్చితే ఆ బుక్ నుంచి మరొక స్టోరీ రాస్తాను. ‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ పుస్తకం అలా రాసిందే. నానమ్మ, నాన్న, అమ్మ, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్.. చాలా మెచ్చుకున్నారు.బలమైన వ్యక్తిత్వం‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ బుక్ లో పదహారేళ్ల అమ్మాయి పేరు ఆటమ్. ఆమె భావోద్వేగాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. ఒక చిన్న వెకేషన్ కోసం తల్లిదండ్రులను ఒప్పించి మెక్సికోకు బయల్దేరుతుంది. అనుకోని సంఘటనలో తల్లి మరణిస్తుంది. తమ కుటుంబం నుంచి దూరమైన ఆంటోనియోను కలుసుకుంటుంది. క్షేమకరం కాని ఆ ్రపాంతంలో ఉండలేక మెక్సికో నుంచి వాళ్లు లండన్‌కు చేరుకుంటారు. అక్కడ జేమ్సన్ అనే వ్యక్తిని కలుస్తారు. జేమ్సన్ కుటుంబంతో ఉండటమూ క్షేమకరం కాదని అర్థమై తండ్రి, ఆంటోనియోలతో కలిసి జర్మనీకి వెళ్లిపోతుంది. జీవితమెప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే ఆటమ్ ప్రతినిత్యం సమస్యలతో చేసే ప్రయాణం గురించి ఈ కథ వివరిస్తుంది. ఆ అమ్మాయి స్నేహాలను ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఒకమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ ఎండింగ్ తప్పక దొరుకుతుంది అనే హోప్‌ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ టైటిల్ విషయంలో, కవర్ పేజీ విషయంలో సాయం చేశారు. ఈ బుక్ కోసం ఏడాది పాటు వర్క్ చేశాను. నిజానికి 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అనే విషయాలను గురించి అంతగా మ్యాచ్ చేయలేకపోవచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ బుక్స్ బాగా చదువుతారు. వారికి ఈ పుస్తకంలో స్నేహపూర్వక స్వభావం, స్ట్రాంగ్ విల్‌పవర్, వ్యక్తిత్వం బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్‌కు నేను రాసిన స్టోరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ ఈ బుక్ కొని చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో అందరూ నన్ను అభినందించారు. కొందరు మంచి విమర్శలు కూడా చేశారు.ఎంతో నేర్చుకోవాలి...రచనలు చేయడంలో చాలా నేర్చుకోవాల్సి ఉందని నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసి వచ్చింది. వచ్చిన విమర్శల నుంచి కూడా నేర్చుకుంటున్నాను. స్టోరీలో ఒక పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, స్టోరీ ΄్లాట్ ఎలా రాయాలి.. వంటివి నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకుంటూనే నా రచనల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్లాలని ఉంది. ముఖ్యంగా మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో చూస్తుంటాను. నానమ్మ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అందుకు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి రైటర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంటూనే లాయర్ని అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాను. లాయర్‌గా న్యాయం కోసం పోరాటం చేస్తూనే, నా రచనల ద్వారా కొంతమందినైనా ప్రభావితం చేయాలనేది నా ముందున్న లక్ష్యం’’ అంటూ తెలిపింది ఈ బాల రచయిత్రి. టైమ్ క్రియేషన్ఈ బుక్ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో సహా కొంతమంది నీకు టైమ్ ఎలా సరిపోతుంది అని అడిగారు. నేను టైమ్‌ను క్రియేట్ చేసుకున్నాను. రోజులో ఒక గంటసేపు ఈ బుక్ కోసం కేటాయించుకున్నాను. మొత్తం ఇరవై ఐదు వేల పదాలు. నేనే స్వయంగా టైప్ చేసి, ఎడిటింగ్ చేసుకుంటూ, తిరిగి మార్పులు చేసుకుంటూ రాశాను. దీనిని బుక్‌గా తీసుకురావడానికి అమ్మవాళ్లకు చెప్పకుండానే నలుగురు పబ్లిషర్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆశ్చర్యపోయారు. పబ్లిషర్స్ అమ్మ వాళ్లను అ్రపోచ్ అవడంతో... ఈ పని ఈజీ అయ్యింది. – నిర్మలారెడ్డిఫొటోలు: గడిగె బాలస్వామి -
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
కమలా హ్యారిస్ ఖాళీ బుక్... బెస్ట్ సెల్లర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై వ్యంగ్యాస్త్రంగా ఇటీవల వెలువడిన పుస్తకం ‘అమెజాన్’ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ‘ది అచీవ్మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ అనే ఈ పుస్తకంలో ఉన్నవల్లా దాదాపు ఖాళీ పేజీలే! ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల పేర్లు మాత్రమే ముద్రించి, అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్యనున్న పేజీలన్నీ ఖాళీ తెల్లకాగితాలుగా విడిచిపెట్టి అచ్చేశారు. వాల్‌మార్ట్ బుక్‌స్టోర్‌లో ఒక వ్యక్తి ఈ పుస్తకం వీడియోను చిత్రించి ‘టిక్ టాక్’లో పోస్ట్ చేశారు. తర్వాత జాక్ అనే వ్యక్తి ఈ పుస్తకం వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే, దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని రీ΄ోస్ట్ చేశారు. కమలా హ్యారిస్ మీద ఈ వెటకారం వీడియో సంగతి ఎలా ఉన్నా, హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో ఆమె విజయం తథ్యమని ‘ఎన్నికల నోస్ట్రడామస్’గా పేరు పొందిన అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్ ఘంటాపథంగా చెబుతుండటం విశేషం. ఇవీ చదవండి: గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో -
కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది
‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు. -
మూడు దారులు.. వేరు.. వేరే!
'ముగ్గురు ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. అలా చూడాలంటే అయితే రాజకీయ నాయకుడైనా అయి ఉండాలి లేకపోతే పాత్రికేయుడైనా అయి ఉండాలి. దేవులపల్లి అమర్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయుడు కావడంతో రాజకీయాల్లో దిగ్గజాలనదగిన ముగ్గురు నాయకులను అతి సమీపంనుంచి చూసి, వారి నడతను, వ్యవహార శైలినీ, రాజకీయ పరిణతిని అంచనా వేసే అవకాశం దొరికింది.' రాసింది ముగ్గురు నేతల గురించే అయినా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటునుంచి మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్ అవతరణ మీదుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన వరకూ తెలుగునాట చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను రచయిత విపులంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి కనబరిచే ఈ తరానికి, ముఖ్యంగా యువతరానికి ఈ విషయాలన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. (ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కాంగ్రెస్‌లో వేళ్లూనుకుపోయిన ముఠా సంస్కృతి కారణంగా కూలిపోయిందన్న సంగతి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఇలాంటి విస్తుగొలిపే అనేక రాజకీయ పరిణామాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది) అప్పటి పరిణామాల గురించి ఈనాటి యువతరానికి జరిగింది జరిగినట్లు చెప్పేందుకు చేసిన ఓ ప్రయత్నమే ఈ పుస్తక రచన అని రచయితే స్వయంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వైఎస్ఆర్, చంద్రబాబుల గురించి విశ్లేషించే క్రమంలో వారిద్దరినీ రచయిత ఒక తాసులో ఉంచి తూచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు స్నేహితులుగా, తర్వాత రాజకీయ విరోధులుగా మారిన ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను ఇలా తూచి తీర్పు చెప్పడం తప్పేమీ కాదు. పైగా అప్పట్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలకు రచయిత సాక్షిగా ఉన్నందువల్ల సాధికారికంగా ఇలా బేరీజు వేసే అర్హత ఆయనకు ఉంది. ‘అధికారం కోసం పార్టీ మారి, అందలం కోసం అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి తృటిలో తప్పిపోయినా అదే పార్టీలో కొనసాగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు ఏ విషయంలోనూ పోలిక లేదు’ అంటారు రచయిత. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు జగన్ చేసిన ప్రయత్నాలనూ, అధిష్ఠానం తృణీకార ధోరణిని భరించలేక వేరు పార్టీ పెట్టిన వైనాన్ని కూడా పుస్తకంలో విశదంగా పొందుపరిచారు. పదహారు నెలలు జైలులో ఉండి, బయటకు వచ్చి ప్రజాభిమానంతో ఆయన ముఖ్యమంత్రి అయిన క్రమాన్ని ఆసక్తికరంగా రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు మీద రచయిత విమర్శనాస్త్రాలు సంధించినా వాటన్నింటినీ సహేతుకంగా, సాధికారికంగా విశ్లేషించారు. ముఖ్యంగా 1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర, 1995లో చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాలను సరిపోలుస్తూ, ఈ రెండూ సంఘటనలూ ఒకే రీతిలో జరిగినా నాదెండ్ల తిరుగుబాటు జరిగినప్పుడు ప్రజల నుంచీ, ప్రజాస్వామ్య పక్షాలనుంచీ, మీడియా నుంచీ ఎన్టీఆర్‌కు లభించిన మద్దతు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే లభించలేదంటారు. వెన్నుపోటు సంఘటనను వివరించేందుకు ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అంటూ రచయిత ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించారు. తొమ్మిది రోజులపాటు రోజువారీ చోటు చేసుకున్న పరిణామాల గురించి చదువుతున్నప్పుడు రచయిత మరోసారి పాత్రికేయుడిగా పరకాయప్రవేశం చేశారనిపిస్తుంది. అన్నీ తనవల్లనే జరిగాయని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారన్న రచయిత.. అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది తానేనని, ప్రధాని అయ్యే అవకాశం తనకు రెండుసార్లు వచ్చిందనీ, తానే ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ రెండూ అబద్ధాలేనంటూ తగిన సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలననూ సాధికారికంగా విశ్లేషించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జగన్ చిత్తశుద్ధిని, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ పాలనను వివరించడానికి రచయిత ఒక ప్రత్యేక చాప్టర్‌ను కేటాయించారు. ఫోటోల ఎంపికలో రచయితకు ఫుల్ మార్కులు పడతాయి. ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ఫోటోలు ప్రచురించడం మెచ్చుకోదగినది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వైఎస్ఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆకట్టుకుంటుంది. రాజకీయాల్లో అవినీతి, అక్రమాలపై, నీతిబాహ్యమైన చర్యలపై రచయితకు గల ధర్మాగ్రహం ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. తప్పయితే తప్పనీ, ఒప్పయితే ఒప్పనీ బల్లగుద్ది చెబుతూ సాగే రచయిత శైలి ఆకట్టుకుంటుంది. ఇప్పటి తరానికే కాదు, భావితరాలకు కూడా తెలుగు రాజకీయ పరిణామాలపై ఈ పుస్తకం ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. – బీ.ఎస్. రామకృష్ణ (బీ.ఎస్.ఆర్) ఇవి చదవండి: భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు' -
The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్‌పేయీకి రహస్య చీటీ!
న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్‌పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్ టాండన్ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన ‘ది రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణస్వీకారం వేళ వాజ్‌పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్‌పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట. 1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్‌పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్ రాసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్‌పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రపతి పదవి తిరస్కరణ! 2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్‌పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్‌పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్‌పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్‌పేయీ అన్నారట. 1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్‌పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్‌పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
తూర్పు తీరంలో వెల్లివిరిసిన ‘ తెలుగు రేఖలు’
ప్రపంచానికి తూర్పు వైపున ఉన్న ఆస్ట్రేలియాలో వైభవోపేతంగా తెలుగు వెలుగులీనుతోంది. ఆరు దశాబ్దాలుగా ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలుగు భాషా,సాహిత్యాలను, తెలుగు వారి అస్తిత్వాన్ని, తెలుగు సంస్కృతిని సమున్నతంగా చాటుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన వారు ఎందరో ప్రముఖులు తమ మేధాసంపత్తితో, ప్రతిభాపాటవాలతో ఆస్ట్రేలియా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు. విశ్వవిపణిపైన తెలుగు కీర్తి బావుటాను ఎగురవేస్తున్నారు.సరిగ్గా 60 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్లు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఎన్నో కష్టాలను,బాధలను అనుభవించారు. కానీ ఆ ఆరవై ఏళ్లల్లో వందలు, వేలు,లక్షలుగా తెలుగు వారి ప్రస్తానం సాగింది. ఆస్ట్రేలియాదేశంలోనే మన భాషకు ఒక సామాజిక గుర్తింపు, హోదా లభించాయి. ఈ 60 ఏళ్ల పరిణామాలపైన ప్రముఖ రచయిత, మెల్బోర్న్లో నివసిస్తున్న కొంచాడ మల్లికేశ్వరరావు రచించిన అద్భుతమైన పుస్తకం ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’. ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరించింది. మొదటి తరం అనుభవించిన కష్టాలను మొదలుకొని నేటి తరం చేరుకున్న ఉన్నతమైన విజయ శిఖరాల వరకు సమగ్రంగా చర్చించింది. మల్లికేశ్వరరావు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో తెలుగుభాష అభివృద్ధి కోసం విశేషకృషి చేస్తున్నారు. భువనవిజయం వంటి సాంస్కృతిక సంస్థలను స్థాపించి నాటకాలను, కవిసమ్మేళనాలను, సాహిత్య చర్చలను నిర్వహిస్తున్నారు. అలాగే తెలుగు భాష గుర్తింపు కోసం ఆస్ట్రేలియా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అక్కడి తెలుగు సంఘాలతో కలిసి పని చేశారు. తెలుగు భాషాసంస్కృతులను ప్రాణప్రదంగా భావించే ఆయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకం ఆస్ట్రేలియాలో అరవై ఏళ్ల తెలుగు వసంతాల ప్రస్తానం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా చదవదగిన పుస్తకం. అంతేకాదు. ఆస్ట్రేలియాకు వెళ్లే తెలుగువారికి ఈ ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుంది. -
అక్షరాల... టైమ్ ట్రావెల్!
ఒక జాతి, ఒక భాష, ఒక సంస్కృతి... చిరంతనంగా నిలవాలంటే సాహిత్యం సుసంపన్నంగా వెలగాలి. ముద్రణ లేని రోజుల్లో మౌఖికం, తాళపత్ర బంధితంగానే మిగిలిన అపార మైన, అపురూప సాహిత్యాన్ని ఆ తర్వాత పుస్తక రూపంలో అందరికీ దగ్గర చేసి, అక్షరాస్యతా ఉద్యమంలో భాగమైన పుణ్యమూర్తులైన ప్రచురణకర్తలు ఎందరెందరో! ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించి ఇవాళ వందేళ్ళ గోరఖ్‌పూర్ గీతాప్రెస్ గురించి ఎంతో వింటుంటాం, చూస్తుంటాం. కానీ, అంత కన్నా కొన్ని దశాబ్దాల ముందే ఒక తెలుగు ప్రచురణ సంస్థ అంతకు మించిన భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవ చేసిందని ఈ తరంలో ఎంత మందికి తెలుసు? తెలుగు ప్రచురణల ద్వారా అక్షర యాగం చేసి, మన జాతి సాహితీ సంస్కృతులకు ఎనలేని సేవ చేసినసంస్థ – వావిళ్ళ సంస్థ. ఇప్పటికి దాదాపు 170 ఏళ్ళ క్రితం... 1854లోనే పుస్తక ప్రచురణ రంగంలో ప్రవేశించి, అఖండ విజయం సాధించిన మహనీయులు వావిళ్ళ వారు. పురాణాలు, ప్రబంధాలు, స్తోత్రాలు, వేదాంత శాస్త్రాలు, శతకాలు, వ్రతకల్పాలు, వ్యాకరణాలు, నిఘంటువులు... ఇలా వారు ప్రచురించనిది లేదు. అనేక తాళపత్ర గ్రంథా లనూ, చేతిరాతలనూ, ప్రాచీన కావ్యాలనూ పండితులతో పరిష్కరింపజేసి, సవివరమైన పీఠికలతో సప్రామాణికంగా అందించిన ప్రచురణకర్తలు, కవిపండిత పోషకులు, దేశభక్తులు వారు. సంస్థాపకులు వావిళ్ళ రామస్వామి శాస్త్రి సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలకు చేసిన సేవ అనుపమానం. ఆరు పదులైనా నిండక ముందే ఆయన పరమపదిస్తే, అనంతరం ఆయన కుమారుడు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ఆ కృషిని కొనసాగించారు. తండ్రి నాటిన మొక్కను మహావృక్షంగా పెంచారు. తెలుగుకే కాదు... సంస్కృత, తమిళ, కన్నడ భాషా రచనల్ని కూడా ప్రచురించి, ఆ సాహిత్యాలకు విశేష సేవలందించారు. తెలుగులో ‘త్రిలిఙ్గ’, ఇంగ్లీషులో ‘ఫెడరేటెడ్ ఇండియా’, తమిళంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి సహ కారంతో ‘బాల వినోదిని’ మాసపత్రిక... ఇలా పలు పత్రి కలూ నడిపారు. ఇవాళ్టికీ వావిళ్ళ వారి ప్రచురణ అంటే ప్రామాణికతకూ, సాధికారికతకూ, సాహితీ విలువలకూ ఐఎస్ఐ మార్క్. ముద్రణ దశలోని ప్రూఫ్ గ్యాలీలను తమ ప్రెస్ బయట అంటించి, ప్రచురిస్తున్న పుస్తకంలో అక్షర దోషం పట్టుకుంటే తప్పుకు ఇంత చొప్పున డబ్బులిస్తామని వావిళ్ళ వారు ధైర్యంగా ప్రకటించేవారని పాత తరంవారు చెప్పేవారు. అందుకే, ప్రస్తుతం పలు సంస్థలు చలామణీలోకి తెస్తున్న అనేక పాత పుస్తకాల కొత్త ప్రింట్లు వావిళ్ళ ప్రతులకు సింపుల్ జిరాక్స్ కాపీలే! ఈ తరం పాఠకులకు వావిళ్ళ సంస్థ కృషిని పరిచయం చేయాల్సిన పరిస్థితుల్లో, అదే లక్ష్యంగా వచ్చిన పుస్తకం–‘వావిళ్ళ సాహితీ వికాసం.’ సాంకేతిక విద్యానైపుణ్యం పుష్కలంగా ఉండి, కేంద్ర ప్రభుత్వ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేసిన డాక్టర్ వి.వి. వేంకటరమణ ఈ పుస్తక రచయిత. కంప్యూటర్ విజ్ఞానం నుంచి కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని రచనల దాకా వివిధ అంశాలపై ఇప్పటికే 15 ప్రామా ణిక రచనలు చేసిన నిరంతర జిజ్ఞాసి. ఆయన పుష్కర కాలం శ్రమించి, పరిశోధించి మరీ చేసిన రచన ఇది. దాదాపు 700 పేజీల పుస్తకంలో ఎన్నో తెలియని విషయాలనూ, ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రాలనూ అందించారు. వెయ్యికి పైగా వావిళ్ళ ప్రచురణల్ని పట్టికలు, తేదీలతో సహా పాఠక లోకం ముందుంచారు. ప్రపంచంలో ముద్రణారంభం, బ్రిటీషు కాలంలో మన దేశంలో ముద్రణ, మద్రాసులో ముద్రణ తొలినాళ్ళు, పుదూరు ద్రావిడులైన వావిళ్ళవారు ముద్రణా రంగం లోకొచ్చిన తీరు, వారు నడిపిన పత్రికలు, చేసిన సాహిత్య సేవ, అప్పట్లో జరిగిన వాదవివాదాలు, వావిళ్ళపై వచ్చిన ప్రత్యేక సంపుటాల విశేషాలు... ఇలా ఈ పుస్తకం ఓ సమా చార గని. ‘కన్యాశుల్కం’ రచన గురజాడదా? గోమఠం శ్రీని వాసాచార్యులదా? అంటూ అప్పట్లో వావిళ్ళ చుట్టూ నడిచిన వివాదం ఆసక్తిగా చదివిస్తుంది. తండ్రి ఆరంభించిన ‘ఆది సరస్వతీ నిలయం’ నుంచి కుమారుడు నడిపిన వావిళ్ళ ప్రెస్ దాకా, ఆ తర్వాత జరిగిన చరిత్రకు అద్దం ఈ రచన. అలా ఇది వావిళ్ళ వారు చేసిన బృహత్తర యజ్ఞంపై ఓ అరుదైన లో చూపు. బోలెడుశ్రమతో ఈ రచనలో పునర్ముద్రించిన వావిళ్ళ వారి ప్రచురణల ముఖచిత్రాలు, ఫోటోలు, వార్తల్ని చూస్తూ పేజీలు తిప్పినా ఇది అక్షరాలా 170 ఏళ్ళ టైమ్ ట్రావెల్! – రెంటాల జయదేవ(నేడు నెల్లూరులో ‘వావిళ్ళ సాహితీ వికాసం’ ఆవిష్కరణ) -
Highway to Swades: మనలోనే సూపర్శక్తి
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు. ‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్ అఫ్ కచ్ వరకు, దక్కన్ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది. ► స్వయంగా తెలుసుకుని... 2014లో ఒక రోజు రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్ పవర్లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు. ► సమయపాలన చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను. ► రోడ్ ట్రిప్స్.. మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ. 1896లో స్థాపించిన ఎస్.సి.ఏ. గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవితా సంకలనాన్ని విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ పుస్తకాన్నితాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ విడుదల చేశారు. ఆదిత్యనాథ్ దాస్ సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్‌ను సీఎంకు చీఫ్ సెక్రటరీ బహుకరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రచురణకర్త రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. చదవండి: ఏపీకి పార్లమెంట్ కమిటీ ప్రశంసలు ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
అసెంబ్లీలో ‘పప్పూ’ ‘దొంగ’ పదం నిషేధం
భోపాల్: వాస్తవంగా నాలుగు నెలలకోసారి చట్టసభల సమావేశాలు జరగాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయాలతో చట్టసభల ప్రాధాన్యం తగ్గిస్తున్నాయి. ఒకవేళ సమావేశాలు నిర్వహిస్తే అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కైనట్టు ఒక్కనాడు కూడా సక్రమంగా జరగవు. ఈ సమావేశాల్లో వాగ్వాదాలు ఏర్పడి ఒక్కోసారి తీవ్రస్థాయిలో వాదనలు ఉంటాయి. ఈ సమయంలో పచ్చిబూతులు కూడా వస్తుంటాయి. స్పీకర్ వాటిని వినలేకపోతుంటారు. తూక్కెత్తా అంటే తూక్కెత్తా అంటూ మాటల దుమారం ఏర్పడుతుంది. ఇలా సభలో అన్‌పార్లమెంటరీ భాష వినియోగం అధికమవుతుండడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సభలో కొందరు సభ్యులు పలికిన పదాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఆ విధంగా నిషేధించిన పదాల వివరాలతో ఓ పుస్తకం విడుదల చేసింది. ఈ క్రమంలో కొన్ని పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో పప్పూ అనే పదం కూడా నిషేధం ఉండడం గమనార్హం. ఈ పదంతో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఒకరు గుర్తుకు వస్తుంటారు. తమ నేతను ఆ పదంతో సంబోధిస్తున్నారనే ఉద్దేశంతో ఈ పదాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. మొత్తం 38 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో 1,161 పదాలు నిషేధంలో ఉన్నాయి. దొంగ, చెడిన, అవినీతిపరుడు, నియంత, గూండా, వ్యభిచారి, అబద్ధాలకోరు, మామ తదితర పదాలు నిషేధం. ఈ పుస్తకాన్ని ఆదివారం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సోమవారం నుంచి ఈ పుస్తకాలను అసెంబ్లీ సభ్యులకు పంపిణీ చేయనున్నారు. ప్రారంభమైన వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులు సంయమనంతో సభలో పాల్గొనేలా ఆ పుస్తకం మార్పు తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విలువలతో విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దని సీఎం పిలుపునిచ్చారు. -
‘భారత న్యాయదిగ్గజం’ పుస్తకం త్వరలో ఆవిష్కరణ
కాచిగూడ (హైదరాబాద్): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ జీవిత విశేషా లతో, న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలను పొందుపరుస్తూ రూపొందించిన ‘భారత న్యాయదిగ్గజం’ పుస్తకాన్ని జూన్ 2వ వారంలో ఢిల్లీలో ఆవిష్కరించనున్నట్లు ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీస్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామ దాసప్ప నాయుడు తెలి పారు. సోమవారం బర్కత్‌పురలోని సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముద్ర సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పుస్తకానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరు రామిరెడ్డి, మాజీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు అబ్రహం, మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు మాధవి సందేశాలు రాశారని పేర్కొన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీలకు నిధులు పెంచి పేదల చెంతకు ఉచిత న్యాయసేవలు అందించడానికి, సామాన్యులు న్యాయం పొందడానికి ఈ పుస్తకంలో సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. -
చిన్నారుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివృద్ధికి పునాది పండుతుందన్న ఆయన, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉప రాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో.. ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పౌష్టికాహార లోపం ఓ సవాల్‌గా మారిందని, దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు. సరైన పోషకాహారం అందకపోవడం ద్వారా చిన్నారుల శారీరక, మేధో వికాసానికి ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో పౌష్టికాహార సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయన్న ఉప రాష్ట్రపతి.. ఈ మహత్కార్యంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సహా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.భారతదేశ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే దేశ భవిష్యత్ అయిన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఇందుకోసం వ్యూహాత్మక, సమష్టి కార్యాచరణ అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నారులకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టడమే గాక, ఆనందంగా, ఉల్లాసంగా ఉండేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం కూడా వారి సర్వతోముఖాభివృద్ధికి కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇందుకోసం చిన్నారులకు మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమైన, విలువైన సమయమన్న ఉప రాష్ట్రపతి.. ఈ సమయంలో వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ సామాజిక, విద్యావిషయక అవసరాలను తీర్చాల్సిన అవసరాన్ని విస్మరించరాదన్నారు. బాల్యంలోనే ఆరోగ్యకరమైన జీవితాన్ని, నాణ్యమైన విద్యను అందుకున్న చిన్నారులు బలమైన పునాదిని వేసుకుని.. భవిష్యత్తులో సమాజాభివృద్ధిలో తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆయన పేర్కొన్నారు.పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌష్టికాహార సమస్య నిర్మూలనకు జరుగుతున్న సమగ్ర శిశు సంరక్షణ పథకం (ఐసీడీఎస్) ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు సూచించిన లక్ష్యాల దిశగా భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని మహాత్మాగాంధీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కలలుగన్న అంత్యోదయ నినాదాన్ని సాకారం చేయడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. విస్తృత అధ్యయనంతో ఈ పుస్తకాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ క్రచెస్ సంస్థ చైర్పర్సన్ అమృతాజైన్, సహ వ్యవస్థాపకురాలు దేవికా సింగ్, కార్యనిర్వాహక నిర్దేశకురాలు సుమిత్ర మిశ్రా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సంజయ్ కౌల్, డాక్టర్ అనురాధా రాజీవన్.. టేలర్ అండ్ ఫ్రాన్సిస్ గ్రూప్ (ప్రచురణ సంస్థ) డైరెక్టర్ డాక్టర్ శశాంక్ సిన్హా, ద హిందూ పత్రిక మాజీ ప్రధాన సంపాదకుడు రామ్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన పని లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా వ్యాఖ్యానించారు. తమ ఇంటి సభ్యులు కాకుండా బయట వ్యక్తులకే కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలన్న తన సోదరుడు రాహుల్ అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. పార్టీని నడిపే సత్తా కలిగిన నాయకులు ఎందరో ఉన్నారని తాజాగా విడుదలైన పుస్తకంలో తన మనసులో మాట వెల్లడించారు. అమెరికా విద్యావేత్తలు ప్రదీప్ చిబ్బర్, హర్ష షాలు రచించిన ‘‘ఇండియా టుమారో : కన్వర్జేషన్ విత్ ది నెక్స్›్ట జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్’’అన్న పుస్తకంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంపై ఆధారపడకుండా కాంగ్రెస్‌కు సొంత దారంటూ ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించినట్టుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ద్వారా విడుదలైన ఆ పుస్తకం వెల్లడించింది. ‘‘రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా లేఖలోనే కాదు, చాలా సార్లు తన మనోగతాన్ని విప్పి చెప్పారు. మన కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదన్నారు. నేను కూడా రాహుల్‌కి మద్దతుగా ఉంటా’’అని ప్రియాంక చెప్పారు. 15 నెలల క్రితం ఇంటర్వ్యూ అది: కాంగ్రెస్ దేశంలో యువ రాజకీయ నేతల్ని పుస్తక రచయితలు గత ఏడాది ఇంటర్వ్యూ చేశారని, ప్రియాంక వెల్లడించిన అభిప్రాయాలు అప్పటివని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గత ఏడాది మే 25న రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా గాంధీ కుటుంబానికి చెందని వారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని కూడా సలహా ఇచ్చారు. గత ఏడాది జూలైలో అమెరికాకు చెందిన రచయితలు ప్రియాంక అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని ప్రియాంక వారికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి రాహుల్ చేసిన కృషిని ప్రియాంక కొనియాడారు. -
జాతీయవాదమే భారతీయ ఆత్మ : ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత సాంస్కృతిక ఐక్యతే ఇవాళ దేశప్రజలను సమైక్యంగా మార్చిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాసిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తకం తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను వెంకయ్య నాయుడు ఆన్లైన్ ద్వారా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పువాటిల్లుతుందని గ్రహిస్తే.. ప్రజలంతా ఏకమై ఆ దాడిని ఎదుర్కునేందుకు సిద్ధపడతారని, ఇదే జాతీయవాదమన్నారు. భారతీయ ఆత్మలో జాతీయవాదం బలంగా ఉందని ఇటీవల ఎదురైన పరిణామాలు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు. ‘మతం, జాతి, భాష అనే వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదని నా అభిప్రాయం. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఈ విషయంలో మన దృష్టి కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని వెంకయ్య అన్నారు. (చదవండి: విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి) ప్రజాస్వామ్యం అనేది.. ఒక సామాజిక వ్యవస్థ పరిణామంలో పరిపక్వమైన పరిస్థితులకు సంకేతమన్నారు. ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాస్వామిక ప్రక్రియను ఉపయోగించుకుని తమ పరిపక్వతను ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామిక వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పటికీ.. ఈ లోపాలు పరిణామ క్రమంలో ఏర్పడినవే. వాటిపై చర్చిస్తూ, పరిష్కరించుకునే క్రమంలో ప్రజాస్వామ్యం తనను తాను మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విస్తృత అధ్యయనం చేసే ఆసక్తితో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారు. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకరణ సంబంధాలతో, లాజికల్‌గా ఆలోచించడం జైపాల్ రెడ్డి ప్రత్యేకత. వాదన పటిమ, లోతైన విశ్లేషణతో, అరుదైన రాజనీతిజ్ఞుడిగా అందరి మనసులు గెలిచిన జైపాల్ రెడ్డి తన ఆలోచనలను ‘టెన్ ఐడియాలజీస్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు’ అని తెలిపారు. (చదవండి: కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర) ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని స్వయంగా ఆయనే తనను కలిసి బహుకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. ‘ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని జైపాల్ రెడ్డి వివరించారు. భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు జైపాల్ రెడ్డి ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడం కాకుండా.. సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ‘వ్యవసాయిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వరకు’ మారే క్రమంలో వివిధ దేశాల్లో జరిగిన అనేక పరిణామాలను, అన్వేషణలను, ఆవిష్కారాలను, భావజాలాలను అన్వేషించారు. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాల్ని ఆయన పది భావజాలాలుగా వర్గీకరించారు. ఈ పది భావజాలాల్లో ప్రధానమైనది జాతీయవాదం’ అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. (చదవండి: వీవీని కాపాడండి: హృదయం చెమ్మగిల్లుతోంది) రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం తప్పని సరిగా ఉండాలని.. సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృథా అని ఆయన అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తాయన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశానికి బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పర్చేందుకు దీర్ఘకాలిక దృష్టిని, కార్యాచరణను అందించేదే ఒక సైద్ధాంతిక దృక్పథమన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరంను, ఈ పుస్తక ప్రచురణ కర్తలు ‘ఓరియంట్ బ్లాక్ స్వాన్’ సంస్థ వారిని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. -
రేపు ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైఎస్సార్’’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం.(ఏపీని అగ్రస్థానంలో నిలిపారు) మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజలనుంచి తెలుసుకున్నానని; ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని వైఎస్ విజయమ్మ తన తొలి పలుకులో తెలిపారు. వైఎస్సార్ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో... ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు. (ప్రతిదినం-ప్రజాహితం పుస్తకాన్ని ఆవిష్కరించిన విజయమ్మ) మహానేత వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును, ఇంట్లోవారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను కూడా అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్‌ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో ఆమె వివరించారు. వైఎస్సార్ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా...ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని విజయమ్మ పేర్కొన్నారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నానని విజయమ్మ అన్నారు. తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైఎస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటి నుంచి వైఎస్సార్ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, వైఎస్ జగన్, షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు.. మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్ళు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు పరిణామాలు... ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు. ఉన్నది ఉన్నట్టుగా తెలియజేశారు. మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మరణం లేని మహానేత గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని విజయమ్మ అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని.. ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు. -
మొండి బాకీలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
ముంబై: బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీన్ని ప్రచురించిన హార్పర్‌కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ‘ఓవర్‌డ్రాఫ్ట్– భారత్‌లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం’ పేరిట పటేల్ ఈ పుస్తకం రాశారు. ఎన్పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆయన పదవీకాలంలోనే పెద్ద నోట్ల రద్దు అమలైంది. అయితే, కొన్ని అంశాలపై ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో 2018 డిసెంబర్లో ఆయన అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. కానీ, ఇటీవలే ఎన్ఐపీఎఫ్పీ చైర్మన్‌గా గత నెలలో నియమితులయ్యారు. -
జననేత పాదయాత్ర పుస్తకావిష్కరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జననేత పాదయాత్రపై గొల్లల మామిడాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి రాసిన పాదయాత్ర పుస్తకాన్ని శనివారం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు క్యాంపు కార్యాలయం విడుదల చేశారు. కాఫీ టేబుల్ బుక్ తరహాలో ఈ పుస్తకాన్ని ముద్రించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రస్తావనతో మొదలైన ఈ పుస్తకంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర, రాజ్యాధికారం చేపట్టడం, నవరత్నాలు అమలు తదితర అంశాలపై సాగింది. ప్రత్యేక కథనాలతో కూడిన ఛాయాచిత్రాలు ఆకట్టుకున్నాయి. 150 పేజీల ఈ పుస్తకాన్ని వినాయక పబ్లికేషన్స్ ప్రచురించింది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు భీమవాదం భరత్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ప్రముఖ మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఆర్థిక రంగం ముందు సవాళ్లు: సీతారామన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్సీక్వెన్సెస్, క్యూర్’ అనే పేరుతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్, గుల్జార్ నటరాజన్ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. ఓ పుస్తకంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందగలదని, మరీ ముఖ్యంగా.. మనకు సందర్భోచితంగా ఉండటంతోపాటు సరైన సమయంలో విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చినట్టు చెప్పారు. -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతీవారం ‘సాక్షి’ జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన ఈ పేజీ 22 నెలలుగా.. ఈ సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 15 జూన్ 2018 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలపై, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమన్ రాజధాని మస్కట్‌లో 4 అక్టోబర్ 2019న నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా 83 వారాల పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం సంతోషం. ‘మైగ్రేంట్ ఫోరం ఇన్ ఏసియా’ సభ్య సంస్థ అయిన ‘ఎమిగ్రేంట్స్ వెల్ఫేర్ ఫోరం’ తెలంగాణ వలసల చరిత్రలతో ఈ ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం గుర్తుండిపోయే ఘట్టం అని చెప్పవచ్చు. -
దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది
న్యూఢిల్లీ: భారత్‌ను ఎంత రెచ్చగొడుతున్నా భరిస్తూనే ఉందని, కానీ దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఆ ప్రతి దాడి.. ఎన్నటికీ మర్చిపోలేనంత భారీ స్థాయిలో ఉంటుందంటూ పాకిస్తాన్‌ను ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో సంవత్సర పాలనలో చేసిన 95 ప్రసంగాలతో కూడిన ‘రిపబ్లికన్ ఎథిక్–2’, ‘లోక్తంత్ర కే స్వర్’ ఖండ్–2 పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా వెంకయ్యనాయుడు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. దేశ చరిత్రను పరిశీలిస్తే ఎక్కడా దూకుడు ప్రదర్శించినట్లు కనిపించదని, ‘విశ్వగురువు’గా ప్రసిద్ధి చెందిన భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని ఆయన గుర్తు చేశారు. అయినా దాడి చేయలేదు చాలా మంది భారత్‌పై దండెత్తినా, పాలించినా, నాశనం చేసినా, మోసం చేసినా తామెవరిపైనా దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పుస్తకం లోని ఓ మాటను ప్రస్తావిస్తూ... భారత్ తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి శాంతిమార్గా న్నే ఎన్నుకుందన్నారు. రాష్ట్రపతి రాసిన పుస్తకంలో ఆయన జ్ఞానం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పుస్తకాలు కిండిల్ వంటి ఆన్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాల్లో జాతినుద్దేశించినవి, ప్రపంచాన్ని ఉద్దేశించినవి, మహాత్మాగాంధీ గురించి మాట్లాడినవి ఉన్నాయని వెల్లడించారు. -
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం
సాక్షి, చెన్నై: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కశ్మీర్ అభివృద్ధి, సంక్షేమంపై ఇక పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ ఆదివారం చెన్నైలో జరిగింది. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని అమిత్‌షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెంకయ్య చేసిన రాజకీయ, ప్రజాసేవ గురించి అమిత్ షా వివరించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని స్పష్టం చేశారు. వెంకయ్య ఇన్నాళ్ల తన పయనాన్ని గుర్తుచేసుకుంటూ రాజకీయంగా తప్పుకున్నా, ప్రజాసేవలో, ప్రజాపయనంలో విశ్రాంతి లేదని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు రజనీకాంత్.. వెంకయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప ఆధ్యాత్మిక వాదిగా ఉన్న వెంకయ్య పొరపాటున రాజకీయాల్లోకి వచ్చేశారని చమత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు హాజరయ్యారు. అమిత్ షాకి రజినీ ప్రశంసలు కశ్మీర్ వ్యవహారం, ఆర్టికల్ 370 రద్దు విషయమై హోం మంత్రి అమిత్‌షాను రజినీకాంత్ అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌షా కృష్ణార్జునులని కొనియాడారు. ‘నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కృష్ణార్జునుల ద్వయం వంటిది. అయితే వీరిద్దరిలో కృష్ణుడు ఎవరో, అర్జునుడు ఎవరో మనకు తెలీదు’ అని రజినీకాంత్ అన్నారు. త్వరలో రాజకీయ పార్టీని స్థాపించి, 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని రజినీకాంత్ గతంలో చెప్పడం తెలిసిందే. -
పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే ప్రయోజనం
సాక్షి,హైదరాబాద్: పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ చేకూరుతుందని, తీసుకెళ్లి షోకేసుల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘నవ్యాంధ్రతో నా నడక’పుస్తకంతో పాటు ‘దిస్ దట్ ఎవ్రిథింగ్’.., ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాలను ఆదివారం ఫ్యాప్సీలో రోశయ్య ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది పుస్తకాలు తీసుకెళ్తుంటారే కానీ, వాటిని చదవరని, అలాంటి వాళ్లతో ప్రయోజనం ఉండదన్నారు. వృత్తిపరంగా ఐవైఆర్ కృష్ణారావు అనుభవాలు, రాజకీయనేతలతో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పర్యవసానాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇతరులను కించపరచడానికో లేక.. డైరెక్షన్ చేయడానికో ఈ పుస్తకం రాయలేదని, వృత్తిపరంగా ఎదుర్కొన్న అనుభవాలను, ఎంచుకు న్న ధోరణిలో రాశారన్నారు. భారత్‌టుడే చీఫ్ ఎడిట ర్ జి.వల్లేశ్వర్ పుస్తక సమీక్ష చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తుండటాన్ని చూస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని మాజీ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ విభజన సమయంలో ఓ అధికారి ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రతిరూపమే ఈ పుస్తకమన్నారు. రచయిత ఐవైఆర్ మాట్లాడుతూ ఏపీ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఆగమేఘాలపై రాజధాని తరలింపు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, జవాబుదారీతనం లేని సీఎంఓలో పని చేయడం వల్ల జరిగిన నష్టాలను ఇందులో వివరించానన్నారు. -
అమరావతి–ఎవరి రాజధాని?
ఇటీవల రాజకీయ వర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తల్లో ఉన్న పుస్తకం శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు రాసిన ‘‘అమరావతి – ఎవరి రాజధాని?’’. ఈ పుస్తకం మార్చి–2018లో ప్రచురితమైంది. రాజధాని నగరానికి అంతకుముందే పునాదులుపడ్డాయి, భవనాలు వెలిశాయి, కార్యాలయాలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఈ సందర్భంలో ఈ పుస్తకం రావడం గత జల సేతుబంధనమేనా (వెళ్ళిపోయిన నీటికి ఆనకట్ట కట్టడం) అనే భావన పాఠకుల మనస్సులో మెదిలే అవకాశం ఉంది. అంతమాత్రమే అయితే పుస్తకానికి చారిత్రక విలువ మాత్రమే ఉంటుంది. కానీ అందులో మిగతా అంశాల్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో ఏవిధంగా సమతౌల్యం సాధించాలి అనే విషయాన్నీ, ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పారు. అంతేకాక వాస్తవాల్ని తెలుసుకునే అధికారం ప్రజలకు ఉందన్న ఉద్దేశం రచయితది. వివిధ దేశాల్లో రాజధానులు ఎలా ఏర్పడ్డాయి, ఎలాంటి ప్రాతిపదికల్ని విశ్లేషించి నిర్మిం చారు అన్న విషయంపై రచయిత పరిశోధన చేశారు. భౌగోళిక ఉనికి, అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఉండటం, ఏ ప్రాంతానికీ, వర్గానికీ అక్రమ లాభాన్ని చేకూర్చకుండా ఉండటం, భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలుండటం మొదలైన వాటిని పరిగణనలో తీసుకుని రాజధాని నగరాల్ని ఎన్నుకుంటారు. చారిత్రక నేపథ్యాన్నీ, మిగతా దేశాల్లో అనుభవాన్నీ, మనదేశంలో మిగతా నగరాల అనుభవాన్నీ మొదటి ఐదు అధ్యాయాలలో రచయిత అందించారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంలో ఉన్న ఆలోచనావిధానం 2014లో ప్రభుత్వం మారగానే పూర్తిగా మారింది. శివరామకృష్ణన్ కమిటీ ఎన్ని అడ్డంకుల్నీ, సహాయ నిరాకరణను ఎదుర్కొని తమ నివేదిక అందించిందీ ఇందులో చూడగలం. అయినప్పటికీ ఆ కమిటీ ఇచ్చిన స్పష్టమైన నివేదికను పూర్తిగా తృణీకరించి తమదైన శైలిలో నిర్ణయాన్ని తీసుకోవడం అప్రజాస్వామికంగా జరిగిందని రచయిత అభిప్రాయం. నిజానికి కొత్త రాజధాని ఏర్పాటు వినూత్నంగా ఆలోచించడానికి ఒక గొప్ప అవకాశం. సంకుచిత రాజకీయ, వర్గ, వ్యాపార ప్రయోజనాల్నీ ఎంచుకున్నందువల్ల వినూత్నంగా ఆలోచించే అవకాశాన్ని ప్రభుత్వం ఎలా కోల్పోయిందీ ఈ పుస్తకంలో పలుచోట్ల చూడగలం. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని నగరాన్ని ప్రభుత్వ మోతుబరి పెద్దలే ఎలా నిర్ణయించారు అని పుస్తకం వివరిస్తుంది. సంబంధిత వర్గాలతోనూ, ప్రతిపక్ష పార్టీలతోనూ ఏ సంప్రదింపులూ జరగలేదని రచయిత అభిప్రాయం. ఎన్నికల ముందు చేసిన ప్రభుత్వ అధ్యయనాలన్నింటినీ పక్కన ఉంచి కొత్త ప్రభుత్వం ఏకపక్షమైన నిర్ణయం తీసుకుని ఒక ప్రాంతానికీ, ఒక వర్గానికీ లాభదాయకంగా ఉండేట్టు పనిచేసిందని రచయిత వివరించారు. ప్రభుత్వ యంత్రాంగానికంతటికీ అధిపతిగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అధికారులు ఎలా నిస్సహాయంగా ఉంటారో రచయిత స్పష్టంగా చెప్పారు. ఉద్యోగంలో చేరినపుడు ప్రభుత్వాధికారులు రాజ్యాంగానికీ, రాజ్యాంగ విలువలకూ కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. రాజకీయనాయకులు కూడా ఇలాంటి ప్రమాణమే చేస్తారు. అయినా అధికార యంత్రాంగానికీ, అధికార పార్టీకీ అభిప్రాయభేదాలు వస్తూంటాయి. ఇద్దరూ ప్రజల సంక్షేమాన్ని గూర్చి మాట్లాడినా రాజకీయ వర్గాలకు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ మారుతున్న రాజకీయ వర్గాల గూర్చి రచయిత ‘కాంట్రాక్టర్ క్లాస్ నాయకులు’( p.76) అని నిర్మొహమాటంగా చెప్పారు. రాజధాని నగరాన్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మరొకచోట (p.81) పేర్కొన్నారు. పట్టణ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల్నీ, కొత్త ఆలోచనల్నీ ఈ పుస్తకం వివరిస్తుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీ (పొలాల స్థలంలో కొత్త పట్టణాలు తయారుకావడం) అనే ప్రయోగం మనదేశంలోనే కొన్నిచోట్ల విఫలమైన విషయాన్ని ఇందులో చూస్తాం. అలాగే భూమి సేకరణ (land pooling) చేయాల్సిన విధానం, చేసిన విధానం రెంటినీ రచయిత విశ్లేషిం చారు. బెదిరింపులు, ఊహాలోక నిర్మాణం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం భూసేకరణ చేయడం విచారకరమైన విషయం. తరతరాలుగా వచ్చిన భూముల్ని, తాము ఎంతో ప్రేమగా చూసుకున్న భూముల్ని వదులుకోవడంలో రైతులు ఎంత మానసిక క్షోభను అనుభవించారో రచయిత (p.90) వివరించారు. గొప్ప నైతిక రాజ్యంగా అందరూ భావించే సింగపూర్ లాంటి దేశాలు విదేశవిధానాల్లో ఎంత అనైతికంగా ఉంటాయి అన్నది అందరికీ తెలి యని విషయం. సింగపూర్ డొల్లతనాన్ని కూడా (p.94) రచయిత వర్ణించడాన్ని చూడగలం. ఎవరి రాజధాని? అనే ప్రశ్నతోనే ఇది ప్రజల రాజధాని కాదని స్పష్టంగా చెప్పారు. రచయిత ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కావడం వల్ల వారికి విషయాలపై పూర్తి అవగాహన, పూర్తి సమాచారం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పంపకం ఉండాలని రచయిత సూచించారు. ప్రజాసమస్యలపై ఆలోచించే ప్రతి పౌరుడూ, విద్యార్థులూ అందరూ చదవాల్సిన పుస్తకమిది. కేవలం వర్గ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిపై నిర్ణయాలు తీసుకున్నారని ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇద్దరు ప్రముఖులూ తెలపడం కూడా గమనించదగింది. కె. అరవిందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ