Brands
-
కథర్నాక్.. స్టోరీ టెల్లింగ్ మంత్ర
‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్‌లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్’ అంటూ యంగ్ టాలెంట్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్లకు సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అమూల్ బ్రాండ్ ‘అమూల్ గర్ల్’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్ కావడానికి చేస్తున్న టాపికల్ యాడ్స్ పాపులర్ అయ్యాయి. నగల బ్రాండ్ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్’ ఫార్మట్‌ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్‌బాయ్’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది ్ర పాడక్ట్ను ప్రమోట్ చేయడానికే కాదు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది. శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేజ్డ్ విజువల్స్‌ను ఉపయోగించుకుంటుంది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. బ్రాండ్లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్లతో కనెక్ట్ కావడానికి తమ ప్రాడక్ట్‌కు సంబంధించిన అడ్వర్టైజింగ్ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్‌ను కోరుకుంటున్నాయి. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో స్ట్రాటజిక్ స్టోరీ టెల్లింగ్ అనేది కీలకంగా మారింది. ఈ పవర్ఫుల్ టూల్ బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. సర్వేల ప్రకారంప్రాడక్ట్లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్టైజింగ్ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్ అనేది యూత్‌ఫుల్‌గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్ యువ స్టోరీ టెల్లర్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. థీమ్‌ను గుర్తించడం, సెంట్రల్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకోవడం, కస్టమర్ల హృదయాలను తాకేలా యాడ్‌ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్‌లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్ శకంలో స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), గేమింగ్ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్‌లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ‘స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలమైన సాధనం. టార్గెట్ ఆడియెన్స్‌ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్. సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్‌కు సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత. ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వికాస్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ‘నేను అయితే ఈ యాడ్‌ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు. స్టోరీ టెల్లింగ్ మంత్ర యాడ్‌లో స్టోరీ టెల్లింగ్ ఫార్మట్ అనేది కంపెనీకి, కస్టమర్లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్‌లో భాగం. మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్ గురించి తప్ప కన్జ్యూమర్ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్‌ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్ మంత్ర. ‘ఫలానా యాడ్ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్‌మార్టం చేయడంతో పాటు ఒక యాడ్ సూపర్ డూపర్ హిట్ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్ మేక్స్ ఏ గ్రేట్ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్ ఛాలెంజ్‌లను అధ్యయనం చేస్తున్నారు. -
సీతారామం హీరోయిన్ మృణాల్ ధరించిన చీర ధర తెలిస్తే షాకవ్వుతారు!
‘సీతారామం’తో తెలుగు తెరపై తళుక్కుమన్న మృణాల్ ఠాకూర్.. తొలి సినిమాతోనే హోమ్లీ లుక్ – యాక్టింగ్ స్కిల్‌తో వరుస ఆఫర్లు అందుకుంటూ.. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో దూసుకుపోతోంది. ట్రెండ్‌కి తగట్టు స్టయిల్‌నూ మారుస్తూ ఫ్యాషన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్లోని కొన్ని ఇక్కడ.. అన్మోల్.. 1986, ముంబైలో ఇశూ దత్వానీ ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘అన్మోల్.’ అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌తో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. నలభై ఏళ్లుగా వారి వ్యాపారం అదే జోరుతో సాగుతోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ నగరాల్లోనూ దీనికి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఈ అన్మోల్ జ్యూలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. గోపీ వేద్ చిన్ననాటి స్నేహితులిద్దరి ఆలోచనల ఫ్యూజనే ‘గోపీ వేద్’ లేబుల్. గోపీ వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. డాక్టర్ అర్నాజ్.. ఈఎన్టీలో గోల్డ్ మెడలిస్ట్. డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంట్రస్ట్ ఇద్దరినీ కలిపింది. అలా కలసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. గోపీ వేద్.. డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే, అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, సృజన మిశ్రమంతో ‘గోపి వేద్’ కళాత్మాకమైన లేబుల్గా ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. కాస్త సరసమైన ధరలకే కోనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఫ్యాషన్ లో ప్రయోగాలు చేయడం నాకిష్టం. నా లుక్స్‌కు, ఈవెంట్స్‌కు తగ్గట్టుగా కొత్తకొత్త ట్రెండ్స్ ట్రై చేస్తుంటా. అయితే, ఆ ఫ్యాషన్ డిజాస్టర్ కాకుండా చూసుకుంటా. ఎన్ని వచ్చినా.. చీరకట్టులోనే నేను కంఫర్ట్‌గా ఉంటా. అదే నా ఫేవరెట్ ఫ్యాషన్. – మృణాల్ ఠాకూర్ (చదవండి: యానిమల్ చిత్రంతో ఓవరనైట్ స్టార్ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే!) -
వేస్ట్ నుంచి ‘బంగారం’: అదిరిపోయే కళ
‘వ్యర్థాల గురించి మాట్లాడుకోవడం పరమ వ్యర్థం’ అనుకోవడం లేదు యువతరం. ఎలక్ట్రానిక్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు రకరకాల వ్యర్థాలను కళాకృతులుగా రూపొందించి పర్యావరణ సందేశాన్ని అందించడం ఒక కోణం అయితే, ఎలక్ట్రానిక్ వ్యర్థాలలోని విలువైన వాటితో నగలు రూపొందించే ఎమర్జింగ్ ఆర్ట్ ట్రెండ్ లోతుపాతులు తెలుసుకోవడం మరో కోణం... కోల్‌కతాలోని శ్రీశ్రీ అకాడమీ విద్యార్థులు తమ పాఠశాల అవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో అద్భుతాన్ని సృష్టించారు. ‘ట్రాష్ ఇన్స్టాలేషన్’ ప్రాజెక్ట్‌లో భాగంగా స్టూడెంట్స్ యుతిక, ఇషాని, రజనీష్, మంజరీ, అదిత్రిలు ప్లాస్టిక్‌తో తయారుచేసిన డాల్ఫిన్ స్టాచ్యూను పాఠశాల ఆవరణలోని వర్టికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. నెలరోజుల వ్యవధిలో తయారు చేసిన ‘డాల్ఫిన్ ఇన్ పెరిల్’ అనే ఈ ఆర్ట్ ఇన్స్టాలేషన్ పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, సముద్ర జీవులకు తీవ్రహాని కలుగుతుందనే విషయాన్ని ప్రచారం చేయడానికి కళను ఒక మాధ్యమంలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటుంది అదిత్రి. కేరళలోని తిరువనంతపురంలో ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’కు చెందిన యంగ్ టీమ్ 20,000 ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఉపయోగించి 90 అడుగుల పాము ఇన్‌స్టాలేషన్‌ను రూపొదించింది. ప్లాస్టిక్ అనే విషసర్పం భూగోళాన్ని కాటు వేస్తున్నట్లుగా కనిపించే ఈ ఇన్స్టాలేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాషన్ ఆఫ్ ది న్యూ ఎరా 100 శాతం ట్రాష్ అండ్ ప్లాస్టిక్!’ అంటూ ఒక యువ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ముంబైలో ఉంటున్న హరిబాబు ఇ–వేస్ట్ కళలో ఎంతోమంది యూత్‌కు ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నాడు. ఇ–వేస్ట్ కళారూపాలతో ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. కేరళలో పుట్టిన హరిబాబు చెన్నైలో పెరిగాడు. చెన్నై గవర్నమెంట్ ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో చదువుకున్నాడు. ఇ–వ్యర్థాలతో కళాకృతుల తయారీకి ప్రశంసల మాట ఎలా ఉన్నా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం ఎప్పటికప్పుడూ ఖాళీ అవుతుండేది. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని తిట్టేవారు మిత్రులు. అయితే బజాజ్ ఆర్ట్ గ్యాలరీ ఫెలోషిప్ అవార్డ్ అందుకున్న తరువాత హరిబాబుకు బ్రేక్ వచ్చింది. ఏడాది తరువాత ‘స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ స్టూడియో’ ముంబైలో ప్రారంభించాడు. టన్నుల కొద్దీ ఇ–వ్యర్థాల నుంచి ఎన్నో శిల్పాలు రూపొందించిన హరిబాబు దగ్గరికి సలహాలు, సూచనల కోసం ఎంతోమంది యంగ్ ఆర్టిస్ట్‌లు వస్తుంటారు. భువనేశ్వర్‌కు చెందిన మ్యూరల్ ఆర్టిస్ట్ దిబూస్ జెనా, ఆర్టిస్ట్ సిబానీ బిస్వాల్ ఆర్గానిక్ స్క్రాప్, రీయూజ్డ్ మెటల్‌లతో ఆర్ట్ ఇన్స్టాలేషన్లను సృష్టించారు. మానవ తప్పిదాల వల్ల సముద్రానికి జరుగుతున్న హాని గురించి తెలియజేసేలా ఉంటుంది జెనా రూపొందించిన తిమింగలం. ‘ఒషాబా బ్రాండ్ గురించి తెలుసుకున్న తరువాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ఆసక్తి పెరిగింది. వృథా అనుకునే వాటి నుంచి ప్రయోజనం సృష్టించాలి అనే వారి ఫిలాసఫీ నాకు నచ్చింది’ అంటుంది భో΄ాల్‌కు చెందిన ఇరవై రెండు సంవత్సరాల రీతిక. కళ తప్పి మూలన పడ్డ ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి గత సంవత్సరం లండన్ కేంద్రంగా ఒషాబా బ్రాండ్‌కు అంకురార్పణ జరిగింది. వాడి పారేసిన స్మార్ట్‌ఫోన్ సర్క్యూట్ బోర్డులు, ప్లగ్, యూఎస్బీ కేబుల్స్, చార్జింగ్ కేబుల్స్..మొదలైన వాటిలోని విలువైన వాటిని ఈ బ్రాండ్ ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. నిజానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆభరణాల తయారీలో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. 2018లో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్’ కాలం చెల్లిన తమ కంప్యూటర్ విడి భాగాల నుంచి సేకరించిన విలువైన వాటితో నగలు రూపొదించడానికి లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘బాయూ విత్ లవ్’తో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలువైన పదార్థాల వృథాను నివారించడానికి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి వినియోగదారులలో అవగాహన కలిగించే సృజనాత్మక విధానాన్ని ‘డెల్’ ఎంచుకుంది. ‘జువెలరీ బ్రాండ్స్ రీ–సైకిల్డ్ అల్టర్నేటివ్స్పై ఆసక్తి చూపుతున్నాయి. వాడిపాడేసిన స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు... మొదలైన వాటిలో గోల్డ్ మైన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలకు పడి ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో దాగి ఉన్న విలువైన లోహలు, ఒక టన్ను ఇ–వేస్ట్ నుంచి ఎన్ని గ్రాముల బంగారం వస్తుంది... లాంటి వివరాలు నాకు ఆసక్తికరంగా మారాయి’ అంటుంది ముంబైకి చెందిన నవీన. 23 సంవత్సరాల నవీనకు పాత, కొత్త అనే తేడా లేకుండా నగల డిజైనింగ్ ఐడియాలపై ఆసక్తి. ఈ ఆసక్తి ఆమెను ఎలైజా వాల్టర్లాగే నలుగురు మెచ్చిన డిజైనర్‌గా మార్చవచ్చు. నగ దరహాసం ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి నగలు తయారు చేసే బ్రాండ్‌గా బ్రిటన్‌లో మంచి పేరు సంపాదించింది లైలీ జువెలరి. ఎలైజా వాల్టర్ 24వ యేట ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది, యువతలో ఎంతోమందిలాగే ఇ–వ్యర్థాలలోని అపురూప అంశాలపై ఆసక్తి పెంచుకుంది. ‘ప్రపంచంలోని బంగారంలో ఏడు శాతం నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌లో దాగి ఉన్నందున ఆభరణ బ్రాండ్లు వాటిని ముఖ్యమైన వనరుగా చూస్తున్నాయి’ అంటున్న ఎలైజా వాల్టర్ ప్రయాణం యువతలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇ–వ్యర్థాల నుంచి రూపొందించిన ఈ ఆభరణాన్ని ఎలైజా వాల్టర్ డిజైన్ చేసింది. -
యానిమల్ చిత్రంతో ఓవరనైట్ స్టార్ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే!
తృప్తి డిమ్రీ.. యానిమల్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఆమె అందానికి, అభినయానికి బాలీవుడ్లోనే కాదు దక్షిణాది సినీ ఫ్యాన్సూ ఫిదా అయ్యారు. ఇక ఆమె తన అందం గురించి మాట్లాడుతూ..సెల్ఫ్ లవ్‌తోనే అందం.. ఆనందం..నన్ను నేను ప్రేమించుకోవడం, నన్ను నేను గౌరవించుకోవడం.. నా పర్సనాలిటీలో భాగం. అవే నన్ను ఆనందంగా, అందంగా ఉంచుతున్నాయి. అందుకే, ఇతరుల నుంచి వచ్చే ప్రేమ కంటే సెల్ఫ్ లవ్వే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని నా నమ్మకం అంటోంది తృప్తి డిమ్రీ. ఇక ఆమెకా ఆటిట్యూడ్‌ని ఆప్ట్ అయ్యేలా చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దామా!. సంప్రదాయ పట్టునేతకు కొత్త హంగులు అద్దుతూ సౌందర్య స్పృహకు సరికొత్త నిర్వచనంగా నిలుస్తోందీ బ్రాండ్. 2008లో ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టి, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నాజూకైన డిజైన్లు.. అలరించే రంగులతో చీరలు, గార్మెంట్స్‌ను నేస్తూ ఫ్యాషన్‌కే ఓ సిగ్నేచర్‌గా మారింది ‘రా మ్యాంగో’. డిజైన్లు ఎంత యూనిక్‌గా ఉంటాయో ధరలూ అంతే! ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. తృప్తి ధరించిన చీర బ్రాండ్ రా మ్యాంగో ధర రూ. 79,800/- క్యూరియో కాటేజ్.. ఇదొక మహిళల బ్రాండ్! ఇక్కడ పనిచేసేవారందరూ మహిళలే! ఇంకా చెప్పాలంటే మహిళల చేత మహిళల కోసం రూపుదిద్దుకున్న ప్రత్యేక బ్రాండ్ ఇది. అందుకే క్యూరియో కాటేజ్‌లో లభించే ఏ డిజైన్‌ను చూసినా వెంటనే ప్రేమలో పడిపోతారు. 1971లో ఏక్తా బథీజా ప్రారంభించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం వారి మూడోతరం వారసులు అదే ప్యాషన్‌తో కొనసాగిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. (చదవండి: నవ్వుతూ ఉండాలి) -
బుట్టబొమ్మ పూజా హెగ్డే ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ముంబై భామ పూజా హెగ్డే నటి, మోడల్ కూడా. ఆమె స్వస్థలం కర్ణాటక లోని మంగుళూరు. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది కూడా. బుట్టబొమ్మలా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఫ్యాషన్ విషయానికి వస్తే..స్టయిల్ అనేది మనం సెట్ చేసుకొనేదే. ప్రత్యేకంగా ఒక ఫ్యాషన్‌నే ఇష్టపడను. ఎక్కువగా మిక్స్ అండ్ మ్యాచ్‌ను ట్రై చేస్తుంటా అని చెబుతోంది పూజా. స్టయిల్ అనేది మనం సెట్ చేసుకొనేదే. పింక్ సిటీ బై సారికా సారికా కాక్రానియాకు చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్ అంటే ప్యాషన్. అయితే చిన్న వయసులోనే పెళ్లి, వెంటనే ఇద్దరు పిల్లలు కలగడంతో పెళ్లయిన పదిహేడు సంవత్సరాల తర్వాత తన ప్యాషన్ కోసం పనిచేయడం మొదలుపెట్టింది. అలా 2014లో తన పేరు మీదే ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించి, అనతి కాలంలోనే స్టార్స్‌కు తన డిజైన్స్‌ను అందించే స్థాయికి ఎదిగింది. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ధర మాత్రం లక్షల్లోనే. ఆన్ లైన్ కొనుగోలు చేయొచ్చు. పూజాహెగ్డే ధరించిన పింక్ సిటీ బై సారికా చీర ధర రూ 49,850/- అన్మోల్.. 1986, ముంబైలో ఇషూ దత్వానీ ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘అన్మోల్.’ అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌లో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. నలభై ఏళ్లుగా వారి వ్యాపారం అదే జోరుతో సాగుతోంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ నగరాల్లోనూ దీనికి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఈ అన్మోల్ జ్యూవెలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!) -
హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!
Sanjeev Juneja Success Story: జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు, కష్ట & నష్టాలు లెక్కకు మించి ఎదుర్కోవాలి ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకుంటున్న విజయవంతమైన వ్యక్తులలో చాలా మంది ఇలా ఎదిగినవారే. ఈ కోవకు చెందిన వారిలో 'సంజీవ్ జునేజా' (Sanjeev Juneja) ఒకరు. తన తల్లి దగ్గర నుంచి రూ. 2000 తీసుకుని వ్యాపారం ప్రారంభించి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యానికి మహారాజుగా ఎంతో మందికి ఆదర్శప్రాయుడయ్యాడు. ఇంతకీ సంజీవ్ ఎవరు? ఎలా సక్సెస్ సాధించాడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంజీవ్ జునేజా.. అంబాలలో ఒక ప్రముఖ వైద్యుడుగా ప్రసిద్ధిచెందిన డాక్టర్ IK జునేజా కొడుకు. ఈయన ఒక చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవాడు. జునేజా తన తండ్రిని 1999లో కోల్పోయాడు. అప్పటికే సొంతంగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉన్న ఇతడు తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి చనిపోక ముందే ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడు. తండ్రి మరణానంతరం ఇవన్నీ అతనికి ఉపయోగపడ్డాయి. 2003లో సంజీవ్ జునేజా రాయల్ క్యాప్సూల్స్‌తో తన కంపెనీని ప్రారంభించాడు. ఆ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి 2008లో హెయిర్ కేర్ ఫార్ములా స్టార్ట్ చేసాడు. ఇది అతి తక్కువ కాలంలోనే పాపులర్ బ్రాండ్‌గా ఎదిగింది. ఆ బ్రాండ్ పేరే 'కేశ్ కింగ్'. ఈ ఉత్పత్తులను ప్రారంభంలో ఇంటింటికి తిరిగి విక్రయించడం ప్రారంభించారు. ఆ తరువాత వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టాడు. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) కేశ్ కింగ్ ప్రారంభమైన ఆనతి కాలంలోనే సుమారు రూ. 300 కోట్లు బ్రాండ్‌గా అవతరించింది. ఇమామి కేశ్ కింగ్ సంస్థను రూ. 1651 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత పెట్ సఫా అనే మరో ఉత్పత్తిని తయారు చేశాడు. దీనికి రాజు శ్రీవాస్తవ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈయన డాక్టర్ ఆర్థోకి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. (ఇదీ చదవండి: నేచురల్ పద్దతిలో కోట్లు సంపాదిస్తున్న మహిళ - 50 ఏళ్ల వయసులో..) సంజీవ్ జునేజా కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లో పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. ప్రారంభంలో ఒక చిన్న గదిని ఆఫీసుగా చేసుకుని కేష్ కింగ్ హెయిర్ ఆయిల్ విక్రయాలతో నేడు రూప్ మంత్ర, పెట్ సఫా, డాక్టర్. ఆర్థో, సచి సహేలి, అక్యుమాస్, దంతమణి, మధుమణి, మోర్ పవర్, రాజ్సీ, తులసి మంత్రం అనే అనేక ఉత్పత్తులు ప్రారభించాడు. నేడు భారతదేశంలో గొప్ప వ్యాపార వేత్తగా మాత్రమే కాకుండా మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇప్పుడు ఆయన సంపాదన వేళా కోట్లకు చేరింది. -
భారత్‌లో అధికంగా విక్రయమయ్యే కండోమ్ బ్రాండ్స్..
భారత్‌లో పలు కంపెనీలు తమ కండోమ్‌లను విక్రయిస్తున్నాయి. కండోమ్స్ ప్రొడక్ట్ రేంజ్ కూడా అధికంగానే ఉంటుంది. డ్యూరెక్స్ కండోమ్ భారత్‌తో పాటు ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయమయ్యే నంబర్ వన్ బ్రాండ్. 150 దేశాల్లో ఈ కండోమ్స్ విక్రయమవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని మ్యాన్‌ఫోర్స్ బ్రాండ్ భారత్‌లో అత్యధికంగా కండోమ్స్ విక్రయించే కంపెనీగా చెప్పుకుంటుంది. సంబంధిత చార్ట్‌లో ఈ బ్రాండ్ పేరు టాప్‌లో కనిపిస్తుంది. మ్యాన్కోర్స్ బ్రాండ్ మ్యాన్‌కైండ్ ఫార్మ్‌కు సంబంధించినది. ఇటీవలే ఈ కంపెనీ లిస్టింగ్ షేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. స్కోర్.. టీటీకే ప్రొటెక్టివ్ డివైజెస్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ కండోమ్ బ్రాండ్. బారత్‌లో ఈ బ్రాండ్ విక్రయాలు జోరుగా దూసుకుపోతున్నాయి. కామసూత్ర భారత్‌లోని ప్రముఖ కండోమ్ బ్రాండ్లలో ఒకటి. 2017లో రేమాండ్ ఈ కామసూత్ర బాండ్‌ను కొనుగోలు చేసింది. కోహినూర్ కండోమ్ బ్రాండ్ విక్రయాల విషయంలో భారత్‌లో ముందుంది. రాకెట్ అండ్ బెంకింజర్ ఇండియా 1979లో కోహినూర్ కండోమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనితోపాటు భారత్‌లో ‘మూడ్స్’ కూడా ఆదరణ పొందిన కండోమ్ బ్రాండ్. మార్కెట్లో మూడ్స్ కండోమ్‌లలో పలు రకాల సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే.. -
ప్రపంచవ్యాప్తం గా ప్రసిద్ధి చెందిన టాప్ - 10 భారతీయ బ్రాండ్లు
-
భారత్ వైపు మళ్లిన దిగ్గజాల చూపు.. కారణం ఇదేనా..!!
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతరం లగ్జరీ ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజాలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు రెండు డజన్ల సంస్థలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. దశాబ్దకాలంలో ఇది గరిష్ట స్థాయి కాగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2020లో ఒక అంతర్జాతీయ బ్రాండ్ రాగా, 2021లో మూడు, 2022లో 11 సంస్థలు వచ్చాయి. కోవిడ్ మహమ్మారికి ముందు ఏటా దాదాపు 12–15 బ్రాండ్స్ భారత్‌కు వచ్చేవి. కోవిడ్ తర్వాత లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్‌తో గత కొద్ది నెలల్లో వాలెంటినో, మెక్లారెన్, బాలెన్షియాగా తదితర బ్రాండ్స్ వచ్చాయి. తాజాగా గ్లోబల్ బ్రాండ్స్‌ను తీసుకురావడంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), రిలయన్స్ రిటైల్ తదితర సంస్థలు కీలకంగా ఉంటున్నాయి. దేశీయంగా లగ్జరీ డిపార్ట్మెంటల్ స్టోర్స్‌ను, ప్రత్యేకంగా ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంను ప్రారంభించే దిశగా ఫ్రెంచ్ దిగ్గజం గ్యాలెరీస్ లాఫేట్తో ఏబీఎఫ్ఆర్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. అటు చైనీస్ దిగ్గజం షీన్ను తిరిగి తీసుకొచ్చేందుకు రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్.. ఎంటర్టైన్మెంట్ బ్రాండ్స్ ఆసక్తి.. ఈ ఏడాది దేశీ మార్కెట్లోకి ఎక్కువగా ఫుడ్ .. బేవరేజెస్, కొన్ని వినోద రంగ బ్రాండ్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ రాబర్టో కావలీ, బ్రిటిష్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ డన్హిల్, అమెరికాకు చెందిన స్పోర్ట్స్‌వేర్..ఫుట్‌వేర్ రిటైలర్ ఫుట్ లాకర్ మొదలైనవి కూడా భారత మార్కెట్లో కాలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి కొత్త ఎమ్‌పీవీ - వివరాలు) వీటికి తోడు ఇటలీకి చెందిన లవాజా..అర్మానీ కెఫె, అమెరికన్ సంస్థ జాంబా, ఆస్ట్రేలియన్ బ్రాండ్ ది కాఫీ క్లబ్ కూడా ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నాయి. రిటైల్ కార్యకలాపాలకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. పలు బ్రాండ్ల రాకతో రిటైల్ స్థలం లీజింగ్ 5.5 – 6 మిలియన్ చ.అ.ల మేర ఉండొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2019లో నమోదైన 6.8 మిలియన్ చ.అ. గరిష్ట స్థాయి తర్వాత ఇదే అత్యధికం. -
Fashion: సౌకర్యమే స్టైల్
కలర్స్, కట్స్, ప్రింట్లు, డిజైన్లు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి డిజైనర్లు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ప్రాంతీయ డిజైన్ల నుంచి అంతర్జాతీయ బ్రాండ్స్ వరకు రీసెంట్ లుక్స్ కోసం శోధన ఉంటూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్ వీక్స్ వేటిని పరిచయం చేస్తుందో తెలుసుకుందాం. వారసత్వ డిజైన్లు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, సౌకర్యవంతమైన డిజైనింగ్ తర్వాత స్థానిక హస్తకళ డిజైన్స్‌కి అవకాశాలు బాగా పెరిగాయి. సంప్రదాయ కళలను బాగా ఇష్టపడుతున్నారు. దీంతో మరుగున పడిపోయిన వారసత్వ కళలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు కూడా తమ స్థానిక హస్తకళల డిజైన్స్‌ని విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. మనదైన ప్రభావం ఫ్యాషన్ ప్రపంచంపై భారతదేశం ప్రభావం గురించి ఆలోచించినప్పుడు రితూకుమార్. సబ్యసాచి, మనీష్ మల్హోత్రా.. వంటి ప్రఖ్యాత డిజైనర్ల డిజైన్లు, తలపాగాలు కనిపిస్తుంటాయి. అలాగే, గ్లోబల్ టెక్స్టైల్ గురించి చూసినప్పుడు భారతదేశంలోని కుటుంబాలలో తల్లులు, బామ్మలు ధరించే చీరల థీమ్‌ను తమ డిజైన్స్‌లో తీసుకుంటున్నారు. ఆర్గానిక్, సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల జరిగిన మిలన్, ప్యారిస్, మన లాక్మే ఫ్యాషన్ వీక్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పదిహేడవ శతాబ్దం నుండి నేటి వరకు పాశ్చాత్య ఫ్యాషన్ ట్రెండ్‌పై భారతదేశ ప్రభావం ఉందని తెలుస్తోంది. అలాగే, అంతర్జాతీయ డిజైనర్ల నుంచి మనవాళ్లు స్ఫూర్తి పొందే విషయాల్లో ఫ్యాబ్రిక్స్ ఎంపికలోనూ, సంప్రదాయ డిజైన్స్‌లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనేది వాస్తవం. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్కే అగ్రస్థానం దేశీయ, అంతర్జాతీయ డిజైన్స్ చూస్తే ఫ్యాషన్ రంగంలో ఎప్పుడైనా బ్రైట్ కలర్స్, కొత్త ప్రింట్స్, కొత్త కట్స్కి అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే, ఏ వయసు వాళ్లు వాటిని ఎలా ధరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఫ్యాషన్ రంగాన్ని మాత్రం కరోనా ముందు–కరోనా తర్వాత అని విభజించి చూడచ్చు. ప్రజల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు సౌకర్యంగా దుస్తులు ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్, కంఫర్ట్ డ్రెస్సింగ్, బ్రైట్ కలర్స్,.. ఇవి ప్రపంచం మొత్తం కరోనా ఫ్రీ టైమ్‌లో తీసుకున్న నిర్ణయాలు అనేది దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా రసాయనాలు లేని సస్టేయినబుల్ ఫ్యాబ్రిక్కే అగ్రస్థానం. పార్టీలకు కూడా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌నే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఏ పెద్ద బ్రాండ్ తీసుకున్నా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ విరివిగా వచ్చేశాయి. కట్స్, ప్రింట్లు, కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఎంచుకుంటున్నారు. దీంతో మేం కూడా సౌకర్యవంతమైన డిజైన్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ చదవండి: Kidney Stones: మూత్రనాళంలో తట్టుకుంటే తీవ్రమైన నొప్పి.. కాల్షియమ్ ఆక్సలేట్ ఉండే గింజలు తింటే అంతే సంగతి! ఇలా చేస్తే.. -
‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!
‘నాటు నాటు’ తెలుగు పాటకు ఇప్పుడు దిగ్గజ కంపెనీలు ఆడిపాడుతున్నాయి. భారత్ నుంచి ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతోపాటు, ‘ది ఎలిఫెంట్ విష్ఫరర్స్’ చిత్రాల వెంట దిగ్గజ బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో రెండు భారత్‌ను వరించడం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో యూజర్లను చేరుకునేందుకు కంపెనీలు ఇప్పుడు అవార్డు పొందిన చిత్రాల ఆధారంగా ప్రచార ప్రకటనలు రూపొందించుకుంటున్నాయి. జొమాటో, స్విగ్గీ, డంజో, మీషో, కేఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రెకిట్ బెంకిసర్‌కు చెందిన కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్, గ్లూకోజ్ డ్రింక్ గ్లూకాన్ డీ, మథర్ డెయిరీ, పీఅండ్‌జీకి చెందిన టైడ్ డిటర్జెంట్ ఇప్పటికే వీటి ఆధారంగా ప్రకటనలు, మీమ్స్‌ను రూపొందించాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు, ది ఎలిఫెంట్ విష్ఫరర్స్ సినిమాలను తమ బ్రాండ్ల సందేశాల్లో చూపిస్తున్నాయి. (‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్‌తో గూగుల్ సెర్చ్‌లో జూమ్) వృద్ధికి ఎన్నో మార్గాలు.. స్విగ్గీ బైక్ ఐకాన్‌ను తీసివేసింది. దీని స్థానంలో ఏనుగును (ఎలిఫెంట్ విష్ఫరర్స్)ను ప్రవేశపెట్టింది. పేటీఎం అయితే.. ‘సే నా టో యూపీఐ ఫెయిల్యూర్స్ విత్ పేటీఎం’ అంటూ ప్రకటన రూపొందించింది. అంటే లావాదేవీల వైఫల్యానికి నో చెప్పండనే సందేశాన్ని నా టో అని గుర్తు చేసింది. ‘గెలుపొందిన అరుపుల గుసగుసలు. నిజంగా గొప్ప రాత్రి’ అని కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ ప్రకటన విడుదల చేసింది. డంజో మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మేనేజర్ తన్వీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆస్కార్ కార్యక్రమం సందర్భానుసారం వచ్చే మార్కెట్ అవకాశాల కంటే ఎక్కువని వ్యాఖ్యానించారు. ఇటువంటి తరుణంలో దేశాన్ని గర్వపడేలా చేసిన వారి గురించి సంబరాలు చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. Congratulations team RRR for delivering smiles to a billion people! You’ve made all of us proud!#NaatuNaatuSong #Oscars95 #RRR #Oscars2023Live #NaatuNaatuForOscars #Oscars pic.twitter.com/9xpW1HKseD — Dunzo (@DunzoIt) March 13, 2023 ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన డంజో 3డీ వెర్షన్‌తో ప్రత్యేకమైన హూక్ సెŠట్ప్ వెర్షన్‌ను రూపొందించింది. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటలో హూక్ స్టెప్స్ చూసే ఉంటారు. వీటిని తన మస్కట్ హర్రితో చేయించి విడుదల చేసింది. కేఎఫ్‌సీ సైతం చికెన్ డిన్నర్‌కు ఆర్ఆర్ఆర్ టైటిల్ జోడిస్తూ పోస్ట్ పెట్టింది. ఇది కేఎఫ్‌సీ ప్రియులతో పాటు, సినీ అభిమానులను చేరుకునే విధంగా ఉంది. A glass of Instant Energy to make you go NAATU NAATU. 🕺🕺#GluconD #InstantEnergy #RRR #NaatuNaatu #Oscars #TasteBhiEnergyBhi #Flavours #Orange #VitaminC pic.twitter.com/TPAIzvxsPM — Glucon-D India (@GluconDIndia) March 13, 2023 #NaatuNaatu and #TheElephantWhisperer just deliveRRRed a 'jumbo' order for 140 crore Indians. #Oscars2023 #Oscars pic.twitter.com/xcmPolutE1 — Meesho (@Meesho_Official) March 13, 2023 -
సోషల్ మీడియా ప్రమోషన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వివిధ ఉత్పత్తులు, సేవల విషయమై వినియోగదారులను ప్రభావితం చేసేలా వ్యవహరించే వారికి (ప్రభావ శీలురు) కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఏదైనా ఉత్పత్తికి వారు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అయితే ఆ విషయాన్ని బయటకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేయనుంది. ఏవి చేయాలి? ఏవి చేయకూడదు? అనే వివరాలు కొత్త నిబంధనల్లో పొందుపరచనున్నట్టు అధిక వర్గాలు వెల్లడించాయి. వచ్చే రెండు వారాల్లో వీటిని విడుదల చేయవచ్చని పేర్కొన్నాయి. ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేసే వారు మనదేశంలో వేల సంఖ్యలో ఉన్నారు. వివిధ అంశాలపై వీరు పోస్ట్‌లు పెట్టడంతోపాటు వీడియోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని బ్రాండ్ల నుంచి డబ్బులు తీసుకుని అనుకూల ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం యూజర్లలో కొద్ది మందికే తెలుసు. తాము చూసే వీడియో ఫలానా బ్రాండ్‌కు ప్రమోషన్ అని యూజర్లకు తెలిసేలా చేసి, లాభ, నష్టాలపై అవగాహన కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అధికార వర్గాలు వెల్లడించాయి. పోస్ట్‌లు, వీడియోల్లో ఫలానా బ్రాండ్‌కు ఇది పెయిడ్ ప్రమోషన్ అని ముందే వెల్లడించాలని కొత్త నిబంధనలు నిర్ధేశించనున్నాయి. -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే?
‘చిటియా కలైయా వే.. ఓ బేబీ మెరీ చిటియా కలైయా వే’ అనే ఈ హిందీ (‘రాయ్’ సినిమా) పాట భాషాకతీతంగా ఎంత హిట్టో తెలియని సినీ ప్రేక్షకుల్లేరు. అలాగే ఆ పాట మీద డాన్స్ చేసిన ఆ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిభ గురించి కూడా పరిచయం లేని అభిమానుల్లేరు. ఇక జాక్వెలిన్ స్టైల్ గురించి, ఫ్యాషన్‌లో ఆమెకున్న అభిరుచి, ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దామా ! 'నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యమే. 1990ల చివర్లో వచ్చిన ట్రెండ్స్ అంటే నాకు భలే ఇష్టం' అని ఫ్యాషన్‌పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆమె ఎక్కువగా వాడే బ్రాండ్స్‌లలో 'రోజ్ రూమ్' ఒకటి. ఈ 'రోజ్ రూమ్' బ్రాండ్ చీర ధర రూ. 15, 500. ఇక జ్యూయెలరీ విషయానికొస్తే 'అమ్రిస్'ను ఎక్కుగా ప్రిఫర్ చేస్తుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ బ్రాండ్‌లోని నెక్లెస్, కమ్మలు, ఉంగరం ధరలు నాణ్యత, డిజైన్ బట్టి ఉంటాయి. రోజ్ రూమ్: ‘ఓ స్త్రీగా నాలో నేను దేన్ని నమ్ముతాను.. ఎలా ఉండాలనుకుంటాను.. ఏం కోరుకుంటానో అవే నా డిజైన్స్ ద్వారా చెప్పాలనుకుంటాను. నా దృష్టిలో దేవుడి అద్భుతమైన సృష్టి స్త్రీ. నా బ్రాండ్ ఆమెను మరింత అద్భుతంగా మలస్తుంది’ అంటోంది ‘రోజ్ రూమ్’ లేబుల్ వ్యవస్థాపకురాలు ఇషా. ఇంతకు మించి ఈ బ్రాండ్‌కు వివరణ, వర్ణన ఏం ఉంటుంది! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ధరలూ అందుబాటులోనే. అమ్రిస్: పన్నెండేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. ప్రేరణ రాజ్‌పాల్. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తన అత్తగారికున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూయెలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ అమ్రిస్ను విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. -
ఆ పాత బ్రాండ్లకు ‘భలే’ మంచి రోజులు!
Reliance Retail Brings BPL And Kelvinator: తరాలు తరలిపోతున్న కొద్దీ.. ‘జ్ఞాపకాలు’ మేలనే అభిప్రాయం చాలామందికి కలగడం సహజం. టెక్నాలజీ ఎరాలో ఎన్నో అప్డేట్స్ వెర్షన్లు వస్తున్నా.. పాత వాటికి ఉన్నంత గ్యారెంటీ ఉండట్లేదనే రివ్యూలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి బ్రాండ్లను తిరిగి జనాలకు అందించే ప్రయత్నాలు ఈమధ్యకాలంలో ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్.. బీపీఎల్, కెల్వినేటర్ ఉత్పత్తులను తిరిగి జనాల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎయిటీస్, నైంటీస్ జనరేషన్‌కి బీపీఎల్ టీవీలు, కెల్వినేటర్ స్టెబ్లైజర్, ఫ్రిజ్‌ల లాంటి ప్రొడక్టులతో మంచి అనుభవమే ఉంది. ముఖ్యంగా డబ్బా టైప్ టీవీలు ‘బండ’ బ్రాండ్ అనే అభిప్రాయాన్ని ఏర్పరిచాయి కూడా. ఒకప్పుడు వర్చువల్ ఎంటర్టైన్మెంట్లో బీపీఎల్ టీవీలది అగ్రస్థానం ఉండేది. అయితే మిల్లీనియంలోకి అడుగుపెట్టాక టాప్ టెన్ బ్రాండ్ లిస్ట్ నుంచి కనుమరుగైన బీపీఎల్.. ఇతర కంపెనీల రాక, అటుపై బీపీఎల్‌లో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కారణంగా పతనం దిశగా నడిచింది. ఈ నేపథ్యంలో ‘నమ్మకం’ పేరుతో ప్రచారం చేసుకున్న బీపీఎల్‌ను, కెల్వినేటర్ బ్రాండ్లను రిలయన్స్ రిటైల్ తీసుకురానుంది. క్లిక్: హీరో ఈ-బైక్.. ఇక ఈజీగా! బీపీఎల్.. ది ‘బ్రిటిష్ ఫిజికల్ లాబోరేటరీస్’ 1963 పలక్కాడ్ (కేరళ)లో ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. రిలయన్స్ రిటైల్ ఎలక్ట్రికల్ రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. టీవీ, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, టీవీలు, లైట్ బల్బ్స్, ఫ్యాన్స్ లాంటి ప్రొడక్టుల తయారీతో అమ్మకాలను స్వయంగా నిర్వహించనుంది. ఇప్పటికే కెల్వినేటర్తో ఒప్పందం కుదుర్చుకోగా.. బీపీఎల్‌కు సంబంధించిన ఒప్పందం గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ రెండింటిలతో పాటు మరో రెండు ఓల్డ్ బ్రాండులను సైతం తీసుకొచ్చేందుకు రిలయన్స్ సుముఖంగా ఉంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందించనున్నట్లు సమాచారం. అయితే ఇవి వింటేజ్ మోడల్స్లోనా? లేదంటే అప్డేటెడ్ మోడల్స్లోనా? అనే విషయంపై అధికారిక ప్రకటనల సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: మెగాస్టార్ అద్భుత ప్రయోగం -
Mahesh Babu: మహేశ్... ఇట్స్ ఏ బ్రాండ్
సూర్య ఇది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటూ బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌కి బాక్సాఫీస్ దద్దరిల్లింది. వెండితెరపై మహేశ్‌బాబు చేసే యాక్టింగ్‌కే కాదు డైలాగ్ డెలివరీకి, మ్యానరిజమ్ మూమేంట్స్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్లే మహేశ్‌లోని క్రేజ్‌తో తమ బ్రాండ్ల బిజినెస్ పెంచుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి నేషనల్ లెవల్‌కి వెళ్లిపోయాడు మన మహేశ్. సాక్షి, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో మహేశ్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ మాటకొస్తే మోస్ట్ డిజైరబుల్ జాబితాల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న హీరో కూడా మహేశే. పాతిక సినిమాలు పూర్తికాక ముందే స్టార్ హీరో రేసులో టాప్ పొజిషన్‌కు చేరడమే కాదు.. హ్యాండ్సమ్ హీరోగానూ మహేష్‌కి పేరుంది. ఈ ట్యాగ్ లైన్ టాలీవుడ్‌కే పరిమితం కాలేదు.. మిగతా భాషల్లోనూ హీరోల అందగాళ్ల జాబితాలోనూ మహేశ్ష్కు చోటు దక్కింది.అందువల్లే ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్దీ బ్రాండ్లు తమ అంబాసిడర్‌గా మహేశ్‌బాబుని ఎంచుకున్నాయి. సూపర్ స్టార్ ప్రచార పవర్‌కి సలాం కొడుతున్నాయి. వాట్నాట్ కూల్‌డ్రింక్ యాడ్‌తో మొదలైన మహేశ్ యాడ్ ఛరిష్మా.. ఇప్పుడు దాదాపు అన్నింటా పాకింది. బైకులు, సోపులు, బట్టలు, ఈ కామర్స్, మొబైల్ బ్రాండ్స్ వాట్ నాట్ అన్నింటీ మహేశే కావాలన్నట్టుగా బడా కంపెనీలు పోటీ పడుతున్నాయి,. మహేశ్ నటించే యాడ్స్‌ని తీసే బాధ్యతలను ఏస్ డైరెక్టర్లుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివలాంటి వారికి అప్పగిస్తున్నాయి. మహేశే ఎందుకు మురారీ, అతడు, సీతమ్మ వాకిట్లో, శ్రీమంతుడుతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఒక్కడుతో మాస్‌ని, పోకిరితో యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సాధించిన మహేశ్ ఇప్పటికీ కాలేజ్ బాయ్‌లా కనిపిస్తుంటాడు. అందువల్లే యాడ్లలో మహేశ్ అప్పీయరెన్స్ ఆయన ఫ్యాన్స్‌నే కాదు ఫ్యామిలీ ఆడియొన్స్‌ను సైతం ఫిదా చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకోవాలంటే మహేశ్‌కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అందుకే బైజూస్ నుంచి మొదలు పెడితే టూత్‌బ్రష్, వంటనూనె, బంగారం, బట్టలు, పెర్ఫ్యూమ్, బైకులు, కూల్‌డ్రింక్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇలా అన్నింటా బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ కనిపిస్తున్నారు. వేరియేషన్స్ వెండితెరపై కూల్ లుక్‌తో కనిపించే మహేశ్‌కు బుల్లితెరపైనా వచ్చే యాడ్స్‌లో జేమ్స్‌బాండ్ తరహాలో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా థమ్స్యాడ్స్ అన్నీ సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లతోనే వస్తున్నాయి. ప్రొడక్ట్ ఏదైనా సరే ఆ యాడ్‌లో మహేశ్ అలా నడిచి వచ్చి ఇలా ఓ లుక్క్ ఇచ్చి తనదైన స్టైల్లో రెండు మాటలు చెబితే చాలు ఆ బ్రాండ్ జనాల మదిలో రిజిస్టరై పోతుంది. రన్నింగ్ సిగ్నేచర్ సిల్వర్ స్త్రీన్‌పై మహేశ్‌బాబు రన్నింగ్ సీన్లకే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మురారీలో అరటితోటలో మొదలెట్టిన రన్నింగ్ టక్కరి దొంగ, పోకిరి, సీతమ్మ మీదుగా ఇప్పటికీ ఆగడం లేదు. ఈ రన్నింగ్ సీన్లని ఓ కూల్ డ్రింక్ కంపెనీ విపరీతంగా వాడేసుకుంటోంది. ఈ కంపెనీకి ఇతర భాషల్లో ఇప్పటికే పలువురు హీరోలని మార్చినా తెలుగు లో మాత్రం మహేశ్ అలానే ఉన్నాడు. లిస్టు పెద్దదే సోషల్ మీడియాలో టాలీవుడ్‌కు ఫాలోయింగ్ పాఠాలు నేర్పించిన మహేశ్.. సౌత్‌లోనే ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. సోషల్ క్యాంపెయిన్స్లోనూ ముందుండే మహేశ్ ఓ ప్రముఖ పిల్లల హాస్పిటల్కూ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక కార్పోరేట్ బ్రాండింగ్ విషయానికి వస్తే మహేశ్ ఇప్పటి వరకు డెన్వర్ డియోడరంట్, ఫ్లిప్‌కార్ట్, క్లోజ్అప్, గోల్డ్ విన్నర్, ప్రోవోగ్ సూపర్ కలెక్షన్, ఐడియా సెల్యూలార్, టాటా స్కై, పారగాన్, టీవీఎస్ మోటార్, సంతూర్, అమృతాంజన్, రాయల్‌స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, సౌతిండియా షాపింగ్ మాల్, బైజూస్, నవరత్న, ఐటీసీ వివెల్ షాంపూ, జాస్ అలుకాస్, యూనివర్సల్ సెల్, ప్రోవోగ్, ల్యాయిడ్, గోద్రేజ్, సూర్యా డెవలపర్స్, కార్దేఖో, అభిబస్ ఇలా అనేక బ్రాండ్లకు ప్రచారం చేశారు. దీపం ఉండగానే దీపం ఉండగానే ఇళ్లు.. క్రేజ్ ఉండగానే కమర్షియల్ కెరీర్ చక్కబెట్టుకోవాలి అనేది మన సెలబ్రిటీలకు బాగా వంటపట్టిన విషయం. అందుకే ఓ వైపు వెండితెర వేల్పుగా రెండు చేతులా సంపాదిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో జిగేల్మంటూ మరికొంత సంపాదిస్తుంటారు. జనాల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి వారికి పారితోషం ఇస్తుంటారు. ఇప్పటికే పలువురు సినిమా హీరోలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరిలో మహేశ్ బాబు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న మహేశ్ బాబు ఇటు సినిమాలు చేస్తూ అటు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీటన్నిటికీ ప్రిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేశ్ బాబు ఒక్కో ఎండార్స్మెంట్కి రూ. 5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. -
బ్రాండ్లూ–వ్యాపారాలూ
ఏ చిన్న అవకాశం వచ్చినా సంప్రదా యాల్ని అడ్డం పెట్టుకోవడం, నమ్మకంగా వ్యాపారం చేసుకోవడం మనకి అలవాటు. కరోనా తెరమీదకు వచ్చినపుడు భారతీ యత, వాడి వదిలేసిన దినుసులు మళ్లీ మొలకలెత్తాయి. ‘కోవిడ్ ఏమీ చెయ్య దండీ, ధనియాల చారు ఓ గుక్కెడు తాగండి. అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ హామీలు ఇచ్చినవాళ్లు ఎందరో?! ఇది చైనాలో పుట్టింది. వాళ్లే చెబుతున్నారు. చిటికెడు పసుపుపొడి వేసుకుని ముప్పూటా ఆవిరి పట్టండి. సమస్త మలినాలు వదిలిపోతాయ్ అంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు దొరికిన చోటల్లా చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్లడం మొదలు పెట్టారు. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్న జనం ఎవరేం చెబితే అది నెత్తిన పెట్టుకుని అమలు చేశారు. చేసిన వాళ్లంతా బావుందంటూ ప్రచారం చేశారు. పైగా దానికితోడు మన భారతీయత, దేశవాళీ దినుసులు చేరే సరికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఒకప్పుడు ఆవఠేవలు, ఇంగువ హింగులు మన రోజు వారీ వంటల్లో బొట్టూ కాటుకల్లా అలరించేవి. చూశారా, ఇప్పుడవే దిక్కు అయినాయి. మడి, ఆచారాల పేరు చెప్పి వ్యక్తిగత శుభ్రత, సమాజ శుభ్రత పాటిస్తే తప్పులు అంటగట్టారు. ఇప్పుడవన్నీ ఈ మహా జాఢ్యానికి మందుగా తయారయ్యాయి. సందట్లో సడే మియా అన్నట్టు పాత దినుసులన్నిటికీ గుణాలు అంటగట్టి ప్రచా రంలోకి తెచ్చారు. ‘ఉసిరి’ బంగారం అన్నారు. దాంట్లో ఉన్న రోగ నిరోధక లక్షణాలు అమృతంలో కూడా లేవన్నారు. ఉసిరిగింజ, ఉసిరి పప్పు అన్నీ సిరులేనని ప్రచారం సాగింది. ఇట్లా లాభం లేదని లాభసాటి పథకం తయారు చేశారు. సింగినాదానికి, జీల కర్రకి, పసుపుకి, ఇంగువకి బ్రాండ్ తగిలించి, దానికో పేరు చిరు నామా ఉన్న ముఖాన్ని అడ్డంపెట్టి అమ్మకాలు సాగించారు. అశ్వగంథ, కస్తూరి లాంటి అలనాటి దినుసులకి ఒక్కసారి లెక్కలు వచ్చాయి. ధనియాల నించే కొత్తిమీర మొలకెత్తుతుందని కొన్ని తరాలు కొత్తగా తెలుసుకున్నాయ్. ‘మన వేదాల్లో అన్నీ ఉన్నా యిష!’ అన్నారు పెద్దలు. ఏ మాత్రం విస్తుపోకుండా ‘సబ్బులు మీ చేతి కోమలత్వాన్ని పిండేస్తాయ్ జాగ్రత్త! అందుకని సంప్రదాయ మరియు ప్రకృతిసిద్ధమైన కుంకుడుకాయని మాత్రమే వాడండి’ అంటూ మూడంటే మూడు భద్రాచలం కుంకుళ్లని సాచెలో కొట్టి పడేసి, దానికి రాములవారి బ్రాండ్ వేసి, వెల రూపాయి పావలా, పన్నులు అదనం అంటూ అచ్చేసి అమ్ముతున్నారు. దాన్ని మిం చింది ‘సీకాయ్’ అంటూ పై సంగతులతో మరో బ్రాండు. ఇందులో ఉసిరి గుణాలున్నాయ్, ఇంగువ పలుకులున్నాయ్ అంటూ ట్యాగ్ లైన్లు తగిలించి మార్కెట్లోకి వదులుతున్నారు. మృత్యుభయం ఆవరించి ఉన్నవాళ్లు దేన్ని సేవించడానికైనా రెడీ అవుతున్నారు. దాదాపు ఏడాదిగా ఈ చిల్లర వ్యాపారాలు టోకున సాగుతున్నా, ఏ సాధికార సంస్థా వీటి గురించి మాట్లాడిన పాపాన పోలేదు. మన దేశంలో దేనికీ జవాబుదారీతనం లేదు. వ్యాపారంలో ఒకే ఒక్క ఐడియా కోట్లు కురిపిస్తుందని వాడుక. రకరకాల బ్రాండ్ పేర్లతో శొంఠి, అల్లం, లవంగాలు, వెల్లుల్లి లాంటి ఘాటు ఘాటు దినుసులు ఔషధ గుణాలు సంతరించుకుని ఇళ్లలోకి వస్తున్నాయ్. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని సామెత. ఇప్పుడు అన్ని రకాల తులసీదళాలు గొంతుకి మేలు చేస్తాయని నమ్ముతున్నారు. ఆ తులసి ఫలానా నేలలో పుట్టి పెరిగితే, అది మరింత సర్వ లక్షణ సంపన్నగా బ్రాండ్ వేస్తే– ఇక దాని గిరాకీ చెప్పనే వద్దు. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు’. ఔను, మర్చేపోయాం గురూ అంటూ అంతా నాలికలు కరుచుకున్నారు. అయితే ఓ చిన్న మెలిక ఉంది. ఆ ఉల్లి ఫలానా గుట్టమీద పండాలి. అప్పుడే దానికి గుణం అని షరతు విధించారు. ఇహ ఆ ఉల్లిని బంగారంలో సరితూచాల్సిందే! పొద్దున్నే పేపర్ తిరగేస్తే, టీవీ ఆన్ చేస్తే రకరకాల వ్యాపార ప్రకటనలు. అన్నీ పోపులపెట్టె సరంజామాలోంచే. మన అమ్మలు, అమ్మమ్మలు చిన్నప్పుడు పోసినవే. ఎవరికీ లేని వైద్య వేదం ఆయు ర్వేదం మనకుంది. అది వ్యాధిని రూట్స్ నించి తవ్వి అవతల పారేస్తుందంటారు. ప్రస్తుతం కూరలు, పళ్లు వాటి ప్రత్యేక ఔషధ గుణాల పేర్లు చెప్పి అమ్ముతున్నారు. పైగా, వాటి శుభ్రత దానికి బ్రాండ్ యంత్రాలు మార్కెట్లోకి వచ్చాయి. కొనగలిగినవాళ్లు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు ఒంటెపాల ప్రకటన వచ్చింది. అన్నీ ఇమ్యూన్ శక్తి పెంచేవే. చిన్నప్పుడు చందమామ కథలో రాజుగారి వైద్యానికి పులిపాలు అవసరపడటం దాన్ని ఓ సాహసి సాధించడం గుర్తుకొచ్చాయి. చివరకు ఆ సాహసికి అర్ధ రాజ్యం కూడా దక్కుతుంది. స్వచ్ఛభారత్‌ని దేశం మీదకు తెచ్చినపుడు గాంధీగారి ఫేమస్ కళ్లజోడుని సింబల్‌గా వాడుకున్నారు. కరెన్సీ మీద కూడా ఆ కళ్లజోడే! ఎవరో అన్నారు గాంధీజీ వేరుశనగ పప్పులు, మేకపాలు సేవించేవారని చెప్పుకుంటారు. ఈ విపత్కర పరిస్థితిలో మేక పాలను మార్కెట్లోకి తెచ్చి మహాత్ముణ్ణి బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకుంటే.. పరమాద్భుతంగా ఉంటుంది అనే ఆలోచన ఓ కార్పొ రేట్ కంపెనీకి వచ్చింది. మరిహనేం అయితే.. మేకపాలతో పాటు, మేక నెయ్యి కూడా వదుల్దాం, అన్నీ కలిపి ఓ యాడ్‌తో సరి పోతుంది. అనుకున్నారు. పనిలోపనిగా మేక మాంసం కూడా కలి పారు! సేమ్ బ్రాండ్! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బ్రాండింగ్ ఇక సరికొత్తగా..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా సమయంలో బ్రాండ్లకు కష్టకాలం వచ్చింది. విశ్వసనీయమైన వినియోగదార్లు కూడా బ్రాండ్లను మరచిపోతున్నారు. ఈ సమయంలో బ్రాండ్లు మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలి. వినియోగదార్లతో సన్నిహిత సంబంధాన్ని ఎర్పరచుకోవాలి. బ్రాండ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ‘జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండింగ్’ లాక్డౌన్ సడలింపుల వేళ ఒక సర్వేను నిర్వహించింది. కస్టమర్లను చేరుకోవడంపైనే ఇప్పుడు కంపెనీలు దృష్టిసారించాయని సర్వేలో తేలింది. బ్రాండ్లు కొత్త పరిస్టితులను అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని జాన్‌రైజ్ డైరెక్టర్ సుమన్ గద్దె వెల్లడించారు. ప్రపంచం అంతా సాధారణ స్టితికి రావాలని ఎంతలా ప్రయత్నిస్తుందో.. అంత కంటే ఎక్కువగా కంపెనీలు తమ వినియోగదార్లతో అనుబంధాన్ని పెంచుకోవడానికి కృషి చేయాల్సి ఉందన్నారు. బ్రాండ్లకు ప్రచారం కల్పించడం కోసం వ్యాపార ప్రకటనలపై డబ్బులు పెట్టడానికి అసలు వెనకాడకూడదని కంపెనీలు అంటున్నాయని చెప్పారు. ‘‘మా క్లయింట్ల జాబితాలో మరిన్ని బ్రాండ్లు చేరుతూనే ఉన్నాయి. కోవిడ్ కంటే ముందుతో పోలిస్తే ఆదాయాలు తగ్గినప్పటికీ.. వ్యాపార ప్రకటనలపై, బ్రాండ్ కమ్యూనికేషన్‌పై మరిన్ని వ్యయాలు చేయడానికి కంపెనీలు సిద్దంగా ఉన్నాయి’ అని జాన్‌రైజ్ డైరెక్టర్ చైతన్య బోయపాటి తెలిపారు. కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి.. సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది 27–35 వయసున్న వారున్నారు. 42.4 శాతం మంది ముందుగా తమ పిల్లల దుస్తులు, బొమ్మలు, ఇతరత్రా వస్తువులను కొనాలని భావిస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 53.8 శాతం మంది స్నేహితులను కలవాలనుకుంటున్నారు. 9 శాతం మంది సౌందర్యం, వెల్నెస్ ఉత్పత్తుల షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ సురక్షితమైనదని 60 శాతం మంది గట్టిగా విశ్వసిస్తున్నారు. 49 శాతం మంది సమీప భవిష్యత్‌లో మాల్స్‌కు వెళ్లే ప్రసక్తి లేదని అంటున్నారు. దుస్తులు, ఆభరణాల షాపింగ్‌పై 18 శాతం మందే ఆసక్తి కనబరిచారు. 58 శాతం మంది సినిమా థియేటర్లు, వినోదానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక స్విగ్గీ, జొమోటో లేదా సొంత డెలివరీ వ్యవస్థలున్న రెస్టారెంట్లు డెలివరీ అత్యంత సురక్షితం అన్న శక్తివంతమైన సందేశాన్ని పంపితేనే నిలదొక్కుకోగలుగుతాయి. ఇవి ఆహారంతో పాటు భద్రత చర్యల గురించి ప్రకటనల ద్వారా తెలియజెబుతూ వినియోగదార్ల మెదడులోకి ఎక్కాలి. రిటైలర్లు పాత ధోరణి నుంచి బయటకు వచ్చి కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి అని సర్వేలో తేలింది.æ -
బ్రాండ్స్‌కు కరోనా గండం!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో దేశీయంగా టాప్ 100 కంపెనీల బ్రాండ్ విలువ గణనీయంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది జనవరిలోని వేల్యుయేషన్‌తో పోలిస్తే ఏకంగా 25 బిలియన్ డాలర్ల మేర విలువ పడిపోయి ఉండొచ్చని ఓ నివేదిక చెబుతోంది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా టాప్ 500 బ్రాండ్స్ విలువ జనవరితో పోలిస్తే 1 లక్ష కోట్ల డాలర్ల మేర పడిపోయింది. టాప్ బ్రాండ్స్ ఇవే..: టాటా గ్రూప్ అత్యంత విలువైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. విలువ కేవలం 2% పెరిగినప్పటికీ ఈ ఏడాది తొలిసారిగా 20 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ మైలురాయిని అధిగమించింది. లగ్జరీ హోటల్ బ్రాండ్ తాజ్ దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా నిల్చింది. 100 పాయింట్ల సూచీలో 90.5 పాయింట్లు దక్కించుకుంది. ఇక, 8.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఎల్ఐసీ రెండో స్థానంలో, 7.9 బిలియన్ డాలర్లతో రిలయన్స్ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత 4,5 స్థానాల్లో ఇన్ఫోసిస్ (7.08 బిలియన్ డాలర్లు), ఎస్బీఐ (6.4 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరగా, మహీంద్రా ఒక స్థానం తగ్గి ఏడో ర్యాంక్‌కు పడిపోయింది. ఇండియన్ ఆయిల్ 15 ర్యాంకులు ఎగబాకి 8వ స్థానానికి చేరగా, హెచ్‌సీఎల్ ఒక ర్యాంకు తగ్గి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఎయిర్టెల్ 8 స్థానాలు పడిపోయి 10వ ర్యాంకులో నిల్చింది. కాగా, అంతర్జాతీయంగా 500 కంపెనీల్లోని టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ టాటా గ్రూప్ మాత్రమేనని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. -
వంట నూనెల మార్కెట్లో బ్రాండ్స్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీల హవా నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మొత్తం అమ్మకాల్లో విడినూనెల వాటా 70 శాతం ఉండేది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడీ వాటాను ప్యాక్డ్ విభాగం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత బ్రాండ్లు క్రమంగా మార్కెట్‌ను చేజిక్కించుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నూనెను దిగ్గజ బ్రాండ్లు పోటీ ధరలో అందిస్తుండడంతో వీటి డిమాండ్ పెరిగిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఇప్పుడు దేశంలో ఒక్కో కస్టమర్ ఏటా సగటు వినియోగం 18 కిలోలకు చేరింది. 2000 సంవత్సరానికి ముందు ఇది కేవలం 10 కిలోలు మాత్రమే. ఇదీ నూనెల మార్కెట్.. దేశవ్యాప్తంగా 23.5 మిలియన్ టన్నుల వంట నూనెల వినియోగం జరుగుతోంది. ఇందులో దిగుమతులు 15 మిలియన్ టన్నులు. మిగిలినది దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. వినియోగం ఏటా 2.5–3 శాతం పెరుగుతోంది. పామ్ ఆయిల్ 9 మిలియన్ టన్నులు, సోయా 4.5, సన్‌ఫ్లవర్ 2.5, ఆవ నూనె 2.5, కాటన్ సీడ్ ఆయిల్ 1.2, రైస్ బ్రాన్ ఆయిల్ 1 మిలియన్ టన్నులు, మిగిలినది పల్లి నూనె, నువ్వుల నూనె వంటివి ఉంటాయి. ఇక దేశీయంగా 2018–19లో సోయా ఆయిల్‌సీడ్ 11 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆవాల ఉత్పత్తి గతేడాది 7 మిలియన్ టన్నులు కాగా, ఈ ఏడాది 8.5 మిలియన్ టన్నులు, రైస్ బ్రాన్ ఆయిల్ 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి కానుంది. దేశంలో సన్‌ఫ్లవర్ ఉత్పత్తి దాదాపు లేనట్టే. పల్లి నూనె పదేళ్ల క్రితం వినియోగం 1.2 మిలియన్ టన్నులు ఉంటే, ఇప్పుడు 200 టన్నులకు వచ్చి చేరింది. ధర పెరిగే అవకాశం లేదు.. వంట నూనెల ధర ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘అంతర్జాతీయంగా వంట నూనె గింజలు, నూనె ధర తగ్గింది. మరోవైపు డాలర్ విలువ పడిపోతోంది. దిగుమతులు చవక అయ్యాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. అందుకే నూనెల ధర పెరగదు. ఇక రైతులకు మద్దతు ధర దొరక్కపోతే నూనె గింజల ఉత్పత్తి నుంచి తప్పుకుంటారు. ఇదే జరిగితే వచ్చే 10 ఏళ్లలో దిగుమతులే 25 మిలియన్ టన్నులకు చేరుకోవడం ఖాయం. అందుకే ప్రభుత్వమే చొరవ తీసుకుని మంచి మద్దతు ధర నిర్ణయించాలి. దిగుమతి సుంకం పెంచాలి. ఇవన్నీ జరిగితే రైతులను ప్రోత్సహించినట్టే’ అని వివరించారు. ఫుడ్ ఇండస్ట్రీ 20 శాతం.. దేశీయంగా జరుగుతున్న మొత్తం నూనెల వినియోగంలో ఫుడ్ ఇండస్ట్రీ వాటా 20 శాతముంటుందని ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా వెల్లడించారు. నమ్కీన్, స్నాక్స్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఫుడ్ పరిశ్రమ కొంత కాలంగా కాటన్ సీడ్ ఆయిల్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తోందన్నారు. పత్తి గింజల నూనె ధర తక్కువ కూడా. ఇతర వంటకాల్లోనూ వాడేందుకు ఈ నూనె అనువైనది అని వివరించారు. ఏటా 13 లక్షల టన్నుల కాటన్ సీడ్ ఆయిల్ భారత్‌లో ఉత్పత్తి అవుతోంది. భారత్‌లో కర్జూర ఉత్పత్తి.. దేశంలో నూనె గింజల ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. పంట వైశాల్యంలో ఎలాంటి మార్పు లేదు. ఉత్పాదకతే తగ్గుతోందని మహారాష్ట్ర అగ్రికల్చర్ కాస్ట్, ప్రైస్ కమిషన్ చైర్మన్ పాషా పటేల్ తెలిపారు. ‘దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దేశవ్యాప్తంగా వర్షాలు క్షీణించాయి. ప్రభుత్వమే చొరవ తీసుకుని పచ్చదనాన్ని పెంచాల్సిందే. మరో విషయమేమంటే తక్కువ నీటిని వినియోగించే బాంబూ, కర్జూర వంటి పంటల వైపు రైతులు మళ్లుతున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్‌లో కర్జూర పంట వేస్తున్నారు’ అని వివరించారు. -
దేశాభిమాన బ్రాండ్‌గా ఎస్బీఐ
ముంబై: దేశాభిమానాన్ని అత్యధికంగా ప్రతిబింబించే బ్రాండ్స్ జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అగ్రస్థానంలో నిల్చింది. బ్రిటన్‌కి చెందిన ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యూగవ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 16 శాతం మంది.. ఈ విషయంలో ఎస్బీఐకి ఓటేశారు. ఇక ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, పతంజలి సంస్థ చెరి 8 శాతం ఓటింగ్‌తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ చెరి 6 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. రంగాల వారీగా చూస్తే అత్యధిక దేశాభిమాన బ్రాండ్స్‌తో ఆర్థిక రంగం అగ్రస్థానం దక్కించుకుంది. ఆటోమొబైల్, కన్జూమర్ గూడ్స్, ఫుడ్, టెలికం రంగాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 2 నుంచి 8 మధ్యలో.. మొత్తం 11 రంగాలు, 152 బ్రాండ్స్‌పై యూగవ్ ఈ సర్వే నిర్వహించింది. బ్యాంకుల పరిస్థితేమీ బాగులేదు: ఫిచ్ పేరుకుపోయిన మొండిబాకీల భారం, పేలవ పనితీరును అధిగమించి మూలధన పరిమాణాన్ని మెరుగుపర్చుకునే దాకా భారత బ్యాంకుల పరిస్థితి ప్రతికూలంగానే ఉండనుందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. బ్యాంకింగ్ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ నెగిటివ్ రేటింగ్ తప్పదని విశ్లేషించింది. -
అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్స్‌లో..
పతంజలి, రిలయన్స్ జియో న్యూఢిల్లీ: దేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్స్’ జాబితాను గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఇప్సార్ విడుదల చేసింది. ఇందులో గూగుల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ నిలిచాయి. రామ్‌దేవ్ బాబా ప్రమోట్ చేస్తోన్న పతంజలి 4వ స్థానంలో నిలవటం గమనార్హం. ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో 9వ స్థానంలో ఉంది. కేవలం ఒకే ఒక ఫైనాన్షియల్ సంస్థ ఎస్బీఐ మాత్రమే జాబితాలో స్థానం పొందింది. ఇది ఐదో స్థానంలో ఉంది. ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పదో స్థానంలో, అమెజాన్ ఆరో స్థానంలో ఉన్నాయి. శాంసంగ్ ఏడో స్థానంలో, ఎయిర్టెల్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఇక 11–20 మధ్య ర్యాంకుల్లో స్నాప్‌డీల్, యాపిల్, డెటాల్, క్యాడ్బరీ, సోనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, గుడ్డే, అమూల్ బ్రాండ్స్ ఉన్నాయి. -
గుచ్చి గుచ్చి చంపుదామా!
gucci... స్పెల్లింగ్ ఇదే! అయినా దీనిని పలకడం మాత్రం ‘గూచి’యే! ప్రపంచంలో అత్యంత పాపులర్ బ్రాండ్స్‌లో ఇది టాప్‌లో ఉంది. ఒళ్లు కప్పుకోవడానికి బట్టలు. హృదయాన్ని విప్పి చూపడానికి గూచి. ప్రపంచం అంతా తొడిగేస్తోంది కదా..! మరి మనమూ, మన పిల్లలు ఏం తక్కువ? మన పర్సులో కొంచెం క్యాషే తక్కువ!! ఒక జత ‘గూచి’ కొనాలంటే ఓ ఏడాది జీతం కూడా సరిపోకపోవచ్చు. కానీ, ఆ ఆలోచనని ఆస్వాదించాలంటే... ఆ ప్యాటర్న్స్ని ధరించాలంటే... పైకం అక్కర్లేదు, కొంచెం మైకం ఉంటే చాలు. నిజంగా మన చుట్టూ ఉండే డల్‌నెస్‌ని చిరునవ్వుతో ఎలాగైతే చీల్చేస్తామో! అలాగే, ఈ షాకింగ్ కలర్స్‌తో సగటు జీవితాన్ని ఒక్కోసారి ఇలా వేసుకొని మరీ గుచ్చి గుచ్చి చంపుదామా! కమాన్ లెట్స్ బ్రైటన్ అప్. ద వరల్డ్ ఈజ్ వాచింగ్ అజ్! ఈ ధీమాతో ఒక కొత్త యాటిడ్యూడ్ని కాలరెగరేసుకొని ధరిద్దాం రండి.ఈ తొడుగుతో ఒక కొత్త ఆహ్లాదాన్ని ఆస్వాదిద్దాం పదండి. మనకు తెలిసినవి ఏడు రంగులు. కానీ, ఫ్యాషన్ ప్రపంచంలో వేల రంగులను సృష్టిస్తున్నారు డిజైనర్లు. ఐలాండ్ పారడైస్, ఫియస్టా రోజ్, బటర్‌కప్, లింపెట్ షెల్... ఇలా సైకెడెలిక్ కలర్స్‌ను సృష్టించి, వాటితో డిజైనర్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. టాప్ టు బాటమ్ అదరగొట్టేస్తున్నారు. అందులో ‘గూచి’ బ్రాండ్‌తో అలెస్సండ్రో మిచేలే డిజైన్స్ ప్రముఖమైనవి. బాలీవుడ్లో ఐశ్వర్యారాయ్, కంగనా రనౌత్, సోనమ్‌కపూర్.. వంటి తారలంతా గూచి డ్రెస్సుల్లో బ్రైట్‌గా వెలిగిపోతున్నారు. వెదురు నుంచి ప్రయాణం ‘గూచి’ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఇటాలియన్ బ్రాండ్. 19వ శతాబ్దిలో అంటే కనీసం వందేళ్ల క్రితం ఈ కంపెనీని స్థాపించారు గూచి అనే ఇటలీ వ్యాపారి. వెదురుతో చేసిన హ్యాండ్ బ్యాగ్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చి, తర్వాత లెదర్ గూడ్స్‌తో తమ మార్కెట్‌ను విస్తృతం చేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. ఫ్యాషన్ ఇండస్ట్రీకి చిరునామా అయిన ప్యారిస్‌లో తమ బ్రాండ్‌కు ఒక మార్కెట్‌ను సృష్టించుకొని తర్వాత న్యూయార్క్, లండన్ నగరాలకు విస్తరించారు. ఆ తర్వాత ప్రపంచంలోని అన్ని ప్రముఖ నగరాలలోనూ గుచి తన వైభవాన్ని చాటుతోంది. మనకు తెలియని కలర్స్ కహానీ! టాప్ టు బాటమ్ ప్లెయిన్ కలర్స్‌తో క్లాత్‌పైన మ్యాజిక్ చేయడం ‘గూచి’ డిజైనర్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. అలాగని అవి గాడీ రంగులు కాదు కాంతిమంతమైన రంగుల ఎంపిక అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలోచన గూచి కంపెనీకే పెద్ద ఎస్సెట్‌గా మారింది. పువ్వుల ప్రింట్లతో హవా! కాంతిమంతమైన రంగుల ఫ్యాబ్రిక్మీద అదరగొట్టే పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, జామెట్రికల్ లైన్స్ చూస్తే మతిపోతుంది. అవార్డులు: ప్రతియేటా అంతర్జాతీయ అవార్డులు గూచి సొంతం చేసుకుంటుంది. సిఎఫ్డిఎ (కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ అమెరికా) ఇంటర్నేషనల్ అవార్డ్ 2016. బ్రిటీష్ ఫ్యాషన్ ఇంటర్నేషనల్ డిజైనర్ అవార్డ్ 2015. ఖరీదులోనూ ఘనం ఒక్కో డ్రెస్ మన రూపాయల్లో లక్షన్నర నుంచి మొదలు. బ్యాగ్ అయినా, బెల్ట్ అయినా, షూస్ అయినా.. ఇతర అలంకార వస్తువులన్నీ అత్యంత ఖరీదైనవే! అందుకే గూచి ఉత్పత్తి అంటే లగ్జరీ ఫ్యాషన్ అనే పేరు స్థిరపడిపోయింది. డాలర్లలో డాబుసరి చూపుతున్న గూచి వేర్లో అంత అందం ఏముంది విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా.. అయితే ‘గూచి’ డాట్కామ్ని ఒకసారి క్లిక్ చేయండి. అందులో స్త్రీ, పురుషులు, పిల్లలకు విడివిడిగా డిజైనరీ దుస్తులు, ఇతర యాక్ససరీస్ వివరాలు ఉన్నాయి.. క్రియేటివ్ డిజైనర్ అలెస్సండ్రో మిచేలే అనే ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ చేస్తున్న రంగుల మాయాజాలం అంతా ఇంతా కాదు. ఘనమైన పేరు సంపాదించాడు కనుకనే బ్యాగుల తయారీలో అగ్రగామిగా ఉండే ‘గూచి’ కంపెనీ అలెస్సండ్రే మిచేలేకి రెడ్‌కార్పెట్ పరిచింది. ఆ విధంగా ఈ కంపెనీకి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్‌లో సెటిల్ అయ్యాడు అలెస్సండ్రో. ఫ్యాషనబుల్ దుస్తుల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు. డిజైనర్ అలెస్సండ్రో మిచేలే తాను ధరించే దుస్తుల్లోనూ ఆ వైవిధ్యాన్ని చూపుతాడు. మన భారతీయ వనితలూ వాటిని కళ్లకద్దుకొని మేనిని సింగారించుకుంటున్నారు. అలెస్సండ్రే మిచేలే, గూచి కంపెనీ క్రియేటివ్ డిజైనర్ -
రాజధానిలో 'వరల్డ్ స్టేషనరీ ఎక్స్ పో'..!
న్యూఢిల్లీః పాఠశాల విద్యార్థులకు, కార్యాలయాలకు కావలసిన పరికరాలు, నోట్ బుక్ లు, డైరీలు మొదలైన ఉత్పత్తులతో కూడిన ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో దేశ రాజధాని నగరంలో ప్రారంభం కానుంది. జూలై 29న ప్రారంభమయ్యే అతిపెద్ద ఎక్స్ పో మూడురోజులపాటు కొనసాగనుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రగతి మైదానంలో ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో శుక్రవారం ప్రారంభం కానుంది. సుమారు 7000 నుంచి 8000 వరకూ స్టేషనరీ ఉత్పత్తులే లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మెక్స్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తుంది. జూలై 29న ప్రారంభమై మూడు రోజుల పాటు అంటే 31వ తేదీ వరకూ జరిగే ఈ స్టేషనరీ ఫెయిర్ లో ప్రపంచవ్యాప్తంగా దొరికే వివిధ రకాల స్టేషనరీ ఉత్పత్తులు ఒకేచోట లభ్యమయ్యేట్లుగా.. వన్ స్టాప్ హబ్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ స్టేషనరీ ఎక్స్ పో లో వారి వారి బడ్జెట్ ను బట్టి చిన్న, మధ్య తరహా, భారీ కార్యాలయాలు, సంస్థలు, విద్యా సంస్థలు, మొదలైన అన్ని తరహాల వారికి అందుబాటులో ఉండేట్లుగా స్టేషనరీ ఉత్పత్తులను ఇక్కడ ఉంచనున్నారు. వినియోగదారులు ముఖ్యంగా ఆఫీసు, సంస్థలకు అవసరమైన పరికరాలను, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ భారీ ఎక్స్ పో ప్రధాన కేంద్రంగా చెప్పొచ్చు. పెన్నులు, పెన్నిళ్ళు, కాగితాలు వంటి కార్యాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, పదిరూపాయలు మొదలుకొని వంద రూపాయల వరకూ అన్ని పరిథుల్లోనూ వస్తువులు అందుబాటులో ఉంటాయని మెక్స్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ డైరెక్టర్ హిమానీ గులాటీ తెలిపారు. దీంతోపాటు గిఫ్ట్ ఎక్స్ పో, ఆఫీస్ ఎక్స్ పో పేరున మరో రెండు ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన సుమారు 150 కంపెనీల వస్తువులు ఈ ప్రత్యేక వేదికలో లభ్యమౌతాయని గులాటీ తెలిపారు. -
నచ్చితే కొనేస్తా!
కథానాయికగా త్వరలో కాజల్ అగర్వాల్ పదేళ్లు పూర్తి చేసుకోనున్నారు. హీరోయిన్లు ఇన్నేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. పైగా ఇంకా బిజీగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. ఏంటా సీక్రెట్? అనే ప్రశ్న కాజల్ అగర్వాల్ ముందుంచితే - ‘‘సినిమా సినిమాకీ నటిగా ఇంప్రూవ్ అవుతుంటాను. కొత్త కొత్త పాత్రలు సెలక్ట్ చేసుకుంటుంటాను. అన్నింటికన్నా మించి సక్సెస్‌ని నెత్తికెక్కించుకోను. కష్టపడటానికి వెనకాడను’’ అన్నారు. ఒకవైపు సినిమాలు చేయడంతో పాటు మరోవైపు కొన్ని బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నారామె. మరి... డ్రెస్సుల విషయంలో మీరు బ్రాండ్‌కి ప్రాధాన్యం ఇస్తారా? అని కాజల్‌ని అడిగితే - ‘‘బ్రాండ్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నట్లే.. నేను స్ట్రీట్ ఫుడ్ కూడా తింటుంటాను. బట్టలకు కూడా దీన్ని ఆపాదించొచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు చిన్న చిన్న షాఫుల్లో, స్ట్రీట్ సైడ్ కూడా కొంటాను. వాటిని బ్రాండెడ్ డ్రెస్సులతో మ్యాచ్ చేసి, వేసుకుంటా. ఏది కొన్నా నాకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటా’’ అని చెప్పారు. -
సెలబ్రిటీలూ.. బాధ్యతగా వ్యవహరించండి
న్యూఢిల్లీ: నాణ్యతలేని, తప్పుదారి పట్టించే బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించే విషయంలో సెలబ్రిటీలు బాధ్యతగా నడుచుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్(సీసీపీసీ) మంగళవారం సూచించింది. సీసీపీసీ సమావేశంలో కౌన్సిల్ చైర్మన్, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీలకు మార్గదర్శకాలు ఉండాలి. అంబాసిడర్‌గా సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మా బ్రాండ్ మందు వాడితే ఆర్నెల్లలో ఎత్తు పెరుగుతారు అంటూ ప్రకటన చేస్తుంటారు. అది సమంజసమా.. కాదా.. అన్నది ఆలోచించాలి’ అని సూచించారు.