brother in law
-
కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా!.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు.మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు‘మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’ అంటూ కేటీఆర్ బావమరిది రాజు పాకాల విందుపై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు.. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు?. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు?దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి’’ అంటూ రేవంత్ ప్రశ్నలు గుప్పించారు.మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదు..మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదని.. ఎవరు అడ్డుకున్న మూసి పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతాం. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తాం. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తాం.’’ అని రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!‘‘బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగాము.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తాం. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెఫ్ట్‌తో అభివృద్ధి చేస్తాం. మూసి వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు. -
రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహం
Janwada Farm House Party Updates :తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిగ్గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేని మద్యాన్ని గుర్తించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ పోలీసుల దాడులతో రాజ్ పాకాల పరారీలో ఉన్నారని తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి తెలిపారు. 6.00pmతలసాని శ్రీనివాస్ యాదవ్కక్ష సాధింపు చర్యలు సరికాదుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంఅనేక సమస్యలతో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు... వాటిపై దృష్టి సారించాలిప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కేటీఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రలుగంట గంటకు మారుతున్న ఎఫ్ఐఆర్లు.. కారణం ఏమిటిఎలాంటి సర్చ్ వారెంట్ లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారుప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదువేముల ప్రశాంత్ రెడ్డి కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారుకేటీఆర్ బావమరిది సొంతంగా ఫామ్ హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారుజన్వాడలో ఏం దొరకలేదుగచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారుకేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల ఇంట్లోకి లాయర్లను పంపించాలిపోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారుప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందికేటీఆర్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఉందిసబితా ఇంద్రారెడ్డితెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దాపోలీసు కుటుంబాలు రోడ్డు ఎక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదురాజ్ పాకాల విషయంలో బండి సంజయ్ వీడియో రిలీజ్ చేశారుసెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎట్లా చేస్తారుప్రభుత్వం కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తోందితెలంగాణలో పండుగలు వచ్చినప్పుడు దావత్ లు చేసుకోవడం కామన్ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదుశ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో శుభకార్యం జరిగితే ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారుతెలంగాణలో కక్షపూరిత రాజకీయాల లేవుతెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురాకండిలేనిపోని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారు5:30pmరేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఆగ్రహంరేవ్ పార్టీ చెడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుసీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు.అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు5:10pmశైలేంద్ర పాకాల ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ పోలీసులుఓరియన్విల్లాకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు4:40pmహైదరాబాద్ ఓరియన్ విల్లా వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒరియన్ విల్లాలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై బీఆర్ఆర్ఎస్ నేతలు తిరగబడ్డారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను,మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.3:40pmఒరియన్ విల్లాస్‌లో ఉద్రిక్తతరాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎక్సైజ్ అధికారూలుకేటీఆర్ విల్లా పక్కనే ఉన్న రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల విల్లాఎక్సైజ్ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేతల వాగ్వాదంసెర్చ్ వారెంట్ చూపాలని ఎక్సైజ్ పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకి పంపిస్తాం అంటున్న బీఆర్ఎస్ నేతలుతమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్ఎస్ వాదన 3:21pmరాయదుర్గం ఓరియన్ విల్లాస్‌కు చేరుకున్న పోలీసులురాజ్ పాకాల ఉంటున్న విల్లా నెంబర్ 40కి తాళం వేసి ఉన్నట్లు పోలీసుల గుర్తింపుఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులుపోలీసుల దాడులతో ఓరియన్ విల్లా దగ్గర ఉద్రిక్తతనోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహిస్తున్నారని బీఆర్ ఎస్ నేతల ఆందోళనఎక్సైజ్ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదంఎలాంటి నోటీసులు లేకుండా ఇంటిని తడిఖీలు ఎలా చేస్తారంటు ప్రశ్ననోటీసులు చూపించాలని డిమాండ్కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటూ చెడు ప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం 2:55pmరాజేంద్ర నగర్ డీసీపీ రాజ్ పాకాల ఫామ్ హౌస్‌పై నిన్న రాత్రి దాడి చేశాంలోకల్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు చేశాంపార్టీలో మొత్తం 35 మంది ఉన్నారువీరిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారుఏడు విదేశీ మద్యం బాటిల్స్‌తో పాటు 10 దేశీయ మధ్య బాటిళ్లు స్వాధీనంబాటిల్స్తో పాటు నిషేధిత గేమింగ్ వస్తువులు స్వాధీనంఅందరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించంవిజయ్ మద్దూరి కొకైనే పాజిటివ్ వచ్చిందివిజయ్ మద్దూరికి రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాంపార్టీ నిర్వహించిన రాజ్ పాకాల పైన గేమింగ్ యాక్ట్ కింద మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశాంపార్టీకి ఎక్సైజ్ నుండి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి ఎక్సైజ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారుమోకిలా పీఎస్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశాం2:53 pmకేటీఆర్‌ను ఇరికించాలని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందహామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుకేటీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారుకేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారుస్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారుఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారుఅధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారురిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలంరేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారుసొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దాకేటీఆర్పై బురదచల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారురాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారురాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, కేటీఆర్ సతీమణి లేరుకేటీఆర్ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారురేవంత్ రెడ్డి డైవర్షన్‌లో ఇది జరుగుతోందిరేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే రియాక్ట్ అవుతున్నారుబండి సంజయ్,రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారురేవంత్ రెడ్డి,బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారురేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు2:30pmరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషిరేవ్ పార్టీపై తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ సీపీ ఖురేషి స్పందించారు. అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహించారు. ఫామ్ హౌస్ మేనేజర్ కార్తీక్, రాజ్ పాకాలపై కేసు నమోదు చేశాం. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ రాజ్ పాకాల నిర్వహించారు. విదేశీ మద్యం లభించడంతో అయన ఇంట్లో సోదాలు చేయాలి. ఫామ్‌హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. ఆయన విల్లాకు తాళం వేసి ఉంది. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలిఫామ్ హౌస్ ఓనర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాకపోతే వెంటనే సీసీ టీవీ ఫుటేజీ రిలీజ్ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. జన్వాడ్ ఫామ్‌హౌస్‌లోనే ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని అన్నారు. రేవ్ పార్టీలో వీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలొస్తున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు కాకపోతే డీజీపీ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ సీసీటీవీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయాలని అన్నారు. -
చోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ మృతి
అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్ ముంబైలో గుండెపోటుతో మృతి చెందాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయిన ఆరిఫ్ షేక్.. ఛోటా షకీల్‌కు బావ వరుస అవుతాడు.ప్రస్తుతం ఆరిఫ్ ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు.అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్‌కు ఆరిఫ్ సహాయం అందించాడనే ఆరోపణలున్నాయి. 61 ఏళ్ల ఆరిఫ్ షేక్‌ను 2022 మేలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత రెండేళ్లుగా ఆర్థర్ రోడ్ జైలులో ఆరిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి కారణంగా ఆరిఫ్ షేక్‌ను జూన్ 21న ఆస్పత్రికి తరలించారు. ఆరీఫ్‌కు ఇద్దరు సంతానం అని తెలుస్తోంది. -
అన్న విదేశాలకు.. వదినపై కన్నేసిన మరిది..
యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక మహిళకు సంబంధించిన హృదయవిదారకగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన భర్త విదేశాల్లో ఉంటున్నాడని, తనను అత్తింటివారు ఇంటిలోనికి రానీయడం లేదని ఆమె ఆరోపిస్తోంది. అలాగే తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. అతనికి సహకరించకపోవడంతో తనను కాల్‌గర్ల్ అని చెబుతూ, తన ఫోను నంబర్ వైరల్ చేస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం ఆమె అత్తింటి వారు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అయితే బాధిత మహిళ ప్రస్తుతం ఆ ఇంటి ముందు ధర్నా చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్దోయీలోని బెనీగంజ్లో ఉంటున్న బాధిత మహిళకు 2019లో షాజహాన్పూర్లో ఉంటున్న ఒక యువకునితో వివాహం జరిగింది. పెళ్లయిన నెల్లాళ్ల తరువాత ఆ యువకుడు ఉద్యోగం కోసం ఒమన్ దేశం వెళ్లాడు. అది మొదలు అమెను అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. ఆమెపై దాడి చేసి, ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఈ నేధ్యంలో బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తన మరిది తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, కాల్‌గర్ల్ అంటూ తన ఫోన్ నంబర్ వైరల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఫలితంగా తనకు లెక్కకుమించిన ఫోన్లు వస్తున్నాయని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకూ ఈపోరాటాన్ని కొనసాగిస్తానని అమె తెలిపింది. ఆమె తన 3 ఏళ్ల కుమారుడిని కూడా ధర్నాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కాగా ఈ సమస్యపై తాను ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. బాధితురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన బావ విదేశాల్లో ఉంటున్నాడని, తన సోదరిని అతను తీసుకువెళతాడని భావిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘లోకల్’లో యువతి ‘బెల్లీ’ డాన్స్.. పోలీసులకు నెటిజన్ల ఫిర్యాదు! -
Narne Nithin: అల్లు అరవింద్ సమర్పణలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా కొత్త సినిమా షురూ (ఫొటోలు)
-
వావివరుసలు మరచిన వదిన,మరిది..చివరికి జరిగిందిదే!
రాజస్థాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. తనకన్నా 8 ఏళ్లు చిన్నవాడైన మరిదిపై వదిన మనసు పారేసుకుంది. కొన్ని రోజులుగా తనను పెళ్లిచేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఒక మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వదినతో ఇతనికి సంబంధం ఏర్పడిన దరిమిలా ఆమె అతనిని వివాహం కోసం ఒత్తిడి చేసింది. ఈ నేపధ్యంలో ఆమె పోరుపడలేని మరిది ఆమెను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్‌పురా గ్రామంలో తన అత్త కూతురి వివాహానికి హాజరయ్యింది. అయితే మే 23న ఉన్నట్టుండి ఆమె మాయమయ్యింది. అయితే మర్నాడు రోడ్డు పక్కన పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తమ దర్యాప్తులో ప్రాధమికంగా ఆమె నుంచి నగలు లాక్కొని ఎవరో హత్య చేశారని భావించారు. అయితే వీరి దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మృతురాలు నైనా కన్వర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. పోలీసు అధికారి కన్నయ్యాలాల్ మాట్లాడుతూ మే 24న మదన్‌పురా గ్రామశివారులోని పొదల్లో 28 ఏళ్ల వివాహిత మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందన్నారు. ఆమెపై దాడిచేసి, గొంతునులిమి హత్య చేశారన్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మృతురాలు మే 23న రాత్రి పోనులో ఎవరితోనో మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లిందన్నారు. ఉదయానికి కూడా ఆమె తిరిగిరాలేదన్నారు. పోను కాల్ డిటైల్స్ ఆధారంగా పోలీసులు ఆ మహిళ మరిదిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారన్నారు. కాగా నైనా భర్త ముంబైలో ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు చదువుల కోసం ననిహాల్‌లో ఉంటున్నారు. ఈ సమయంలో ఆమెకు మరిదితో సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా వారి సంబంధం కొనసాగుతూనే ఉంది. నైనా మరిది దీపక్ ఆమెన్నా 8 ఏళ్లు చిన్నవాడు. అయినా ఆమె చాలాకాలంగా తనను పెళ్లిచేసుకోవాలంటూ దీపక్‌ను అడుగుతూ వస్తోంది. ఈ విషయమై మే 23న రాత్రి వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో దీపక్ ఆమపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పొదల్లో పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు దీపక్‌ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పథకం ప్రకారమే లయస్మిత హత్య ?
సాక్షి, యశవంతపుర: బెంగళూరు ఉత్తర తాలూకా రాజనకుంట ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థిని లయస్మితను పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో పాటు సొంత అత్త కూతురు కావడంతో పవన్ ఆమె పేరును తన హృదయంపై ట్యాటూ వేసుకున్నాడు. ఎఫ్బీ, ఇన్‌స్టాలో స్మిత ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. హత్యకు గంట ముందు సోషల్ మీడియాలో అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలను డిలిట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె హత్యకు గురైందని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పవన్ కోలుకోగానే విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. గ్రామస్తులతో విద్యార్థుల గొడవలు రాజనకుంట సమీపంలోని దిబ్బూరు వద్దనున్న ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులతో స్థానిక గ్రామస్థులు ఇబ్బందు పడుతున్నారు. రోజూ విద్యార్థులు మద్యం తాగి గ్రామస్తులతో గొడవలు పడుతున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని దిబ్బూరు చుట్టు పక్కల గ్రామస్తులు బెంగళూరు గ్రామీణ ఎస్పీ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. గురువారం ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక పోలీసుల పనితీరు సరిగా లేదంటూ వినతిపత్రంలో ఆరోపించారు. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
అంతం చేసింది అత్త కొడుకే..
యశవంతపుర: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన ఇంజినీరింగ్ విద్యారి్థని హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దిబ్బూరు గ్రామంలోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న కోలారుకు చెందిన లయస్మితను మరో కళాశాలలో చదువున్న పవన్ అనే యువకుడు హత్య చేశాడు. నిందితుడిని లయస్మిత మేనత్త కొడుకుగా పోలీసులు గుర్తించారు. ప్రేమను నిరాకరించిందనే ఆక్రోశంతోనే ఘోరానికి తెగబడ్డాడని తేలింది. మరో విద్యార్థి ఐడీ కార్డుతో కళాశాలలోకి ప్రవేశం ఇతరులు కాలేజీలోనికి వెళ్లటానికి అవకాశంలేదు. హత్య చేసిన పవన్ ఎలా లోపలకు వెళ్లాడనే విషయంపై అరా తీయగా మరో విద్యార్థి ఐడీ కార్డును ఉపయోగించుకుని కాలేజీలోకి వెళ్లాడు. ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు సహకరించటం వల్ల లోపలకు వెళ్లి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు కాలేజీ గేట్‌వద్దకు వెళ్లాడు. అక్కడ మరో విద్యార్థిని పరిచయం చేసుకున్నారు. అతడి కాలేజీ ఐడీతో లోపలకు వెళ్లి లయస్మిత తరగతి గది వద్దకు వెళ్లాడు. ఆమె గది నుంచి బయటకు వస్తుండగానే కత్తితో గుండెపై పొడిచాడు. అయితే నిందితుడి వద్ద ఉన్న ఐడీ కార్డు ఎవరిదనే విషయంపై పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే లయస్మిత తండ్రి నాగరాజు మూడు నెలల క్రితమే మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుర్లు. లయను ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేను సిగ్గు, శరం వదిలేసి 2 దశాబ్దాలు అవుతుంది : రాంగోపాల్ వర్మ
-
వీడిన మిస్టరీ.. బావే హంతకుడు.. అత్త ఆస్తి కోసం..
కంబదూరు(అనంతపురం జిల్లా): అన్నదమ్ములు కీడెంచితే.. బావ మంచి కోరతాడనేది నానుడి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. ఆస్తి కోసం బావమరిదిని బావే హత్య చేసి, ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టాడు. రెండున్నర నెలల తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ములకనూరు గ్రామానికి చెందిన దండా శారదమ్మకు అఖిల్(15) అనే కుమారుడితో పాటు వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమారై లు ఉన్నారు. అఖిల్ గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పెద్ద కుమార్తె వర్షితకు ఎనిమిది నెలల క్రితం గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్‌తో వివాహమైంది. చదవండి: కామంతో కళ్లు మూసుకుపోయి.. వావి వరసలు మరిచిపోయి.. అనిల్ తన భార్యతో కలసి అత్తారింట్లోనే ఉంటున్నాడు. గ్రామంలో శారదమ్మకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అనిల్‌కు ఆ భూమిపై కన్ను పడింది. శారదమ్మ ఏకైక కుమారుడైన అఖిల్‌ను అడ్డు తొలగించుకొంటే భూమి తన సొంతమవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 21న ములకనూరులో జరిగిన తిమ్మప్ప జాతర సందర్భంగా అఖిల్‌కు సెల్ ఫోన్ తీసిస్తానని నమ్మించి బైక్‌లో ఎక్కించుకుని గుద్దెళ్ల సమీపంలోని తన వ్యవసాయ తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ కొడవలి, కర్రతో దాడి చేసి చంపేసి, తర్వాత డ్రిప్ వైర్‌తో శరీరాన్ని బిగించి సమీపంలోని వంకలో పూడ్చిపెట్టాడు. రోదిస్తున్న అఖిల్ తల్లి, బంధువులు మరుసటి రోజు తన కుమారుడు కన్పించలేదని అఖిల్ తల్లి శారదమ్మ కంబదూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనిల్ నెల రోజులుగా కన్పించకుండా పోవడంతో పాటు ఆ రోజు అఖిల్‌ను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన విషయం తెలిసి శారదమ్మకు అల్లుడిపై అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. బుధవారం కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్లో అనిల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. అత్త భూమి కోసం తానే బావమరిదిని చంపి పూడ్చివేశానని అంగీకరించాడు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ అతన్ని తీసుకొని అఖిల్‌ను పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లి తహసీల్దార్ నయాజ్ అహ్మద్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో అక్కడే డాక్టర్లు శ్రీనివాసునాయక్, రా«ధ పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత నిందితున్ని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. కన్నీరుమున్నీరైన తల్లి.. ‘నా వద్దే కూతురు, అల్లుడిని పెట్టుకుని సంసారమంతా చూసుకుంటిని. ఉన్న ఒక్కగానొక్క నా కొడుకును ఇంతా దారుణంగా చంపడానికి చేతులెలా వచ్చాయిరా? ఇన్ని రోజులు చెప్పకుండా ఎంత బాగా నటించావురా!’ అంటూ అఖిల్ తల్లి శారదమ్మ గుండెలవిసేలా రోదించింది. ‘ఇలాంటి వాడిని వదలొద్దండి సార్.. చంపేయండి’ అంటూ పోలీసులను వేడుకోవడం అక్కడున్న వారందరినీ కలచి వేసింది. -
గుండె ముక్కలు చేశావు.. ఎందుకిలా చేశావు..
Remo Dsouza Heart Break Note On His Brother In Law Jason Death: ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డిసౌజ ఇంట్లో విషాదం నెలకొంది. రెమో బావమరిది జాసన్ వాట్కిన్స్ గురువారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెమో, అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. జాసన్‌ను కోల్పోయిన బాధను తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో గురువారం రాత్రి తెలియజేశాడు రెమో. జాసన్‌తో సంతోషకరంగా ఉన్న క్షణాన్ని పంచుకుంటూ 'సోదరా మీరు మా హృదయాలను ముక్కలు చేశారు. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. విశ్రాంతి తీసుకోండి.' అంటూ పోస్ట్ పెట్టాడు. అలాగే రెమో భార్య, జాసన్ సోదరి లిజెల్ డిసౌజ కూడా తన సోదరుడి మరణంపై బాధను వ్యక్తపరిచింది. View this post on Instagram A post shared by Remo Dsouza (@remodsouza) (చదవండి: ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్) జాసన్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ 'మాకు ఇలా ఎందుకు చేశారు. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. ఎందుకు ?' అంటూ ఎమోషనల్‌గా ఇన్‌స్టా స్టోరి పెట్టింది లిజెల్. జాసన్ వాట్కిన్స్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జాసన్ మరణం గురించి తెలుసుకున్న ఓషివారా పోలీసులు వెంటనే విలే పార్లేలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉంది. అయితే జాసన్ మరణంపై రెమో డిసౌజ, లిజెల్ ఎలాంటి బహిరంగా ప్రకటన ఇప్పటివరకూ చేయలేదు. ప్రస్తుతం వారిద్దరూ వారి స్నేహితుడి వివాహం కోసం గోవాలో ఉన్నట్లు సమాచారం. జాసన్ వాట్కిన్స్ అనేక చిత్రాల్లో రెమోకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. (చదవండి: ఎందుకు అలా ఆలోచిస్తారు.. అలా పిలిస్తే నచ్చదంటున్న బ్యూటీ) -
చెల్లెని బాగా చూసుకోవాలని చెబితే.. నాకే నీతులు చెబుతావా అంటూ..
సాక్షి, తుర్కపల్లి: ‘బావా మా అక్కను ఎందుకు వేధిస్తున్నావు.. కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు సాధారణమే.. చీటికి మాటికి గొడవలు పడితే చులకనవుతారు.. సర్దుకుపోయి కాపురాన్ని చక్కదిద్దుకోవాలి.. పిల్లల ముఖం చూసైనా మారాలి’అని సర్దిచెప్పిన బావమరిదికి అవే ఆఖరి మాటలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ఆ బావ తీవ్ర ఆగ్రహంతో.. ‘నాకే నీతులు చెబుతావా’అంటూ ఇటుకతో బావమరిదిపై దాడి చేసి కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ఎర్రవల్లి వెంకటేశానికి సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన కృష్టవేణితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వెంకటేశం బ్యాండ్ మేళంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనుమానం పెంచుకుని.. కొన్నేళ్ల నుంచి వెంకటేశం దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశం మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగి వచ్చి భార్యను కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే తరుణంలో శుక్రవారం కూడా వెంకటేశం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి జరిగిన విషయాన్ని సోదరుడు రాచకొండ రమేశ్‌కు ఫోన్లో వివరించి రోదించింది. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని వెంటనే రావాలని కోరింది. నిలదీస్తే దాడి చేసి.. సిద్దిపేట జిల్లా మామిడ్యాలలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న రాచకొండ రమేశ్ శుక్రవారం రాత్రి మాదాపూర్ గ్రామంలోని సోదరి ఇంటికి వచ్చాడు. తన సోదరిని ఎందుకు వేధిస్తున్నావని బావ వెంకటేశాన్ని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహంతో వెంకటేశం ఇటుకతో బావమరిది తలపై బలంగా మోదడంతో రమేశ్ అక్కడికక్కడే కుప్పకులిపోయాడు. అదే కోపంతో అతడి ఛాతీ, కడుపులో కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గాయపడిన రమేశ్‌ను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రమే శ్ భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీన్‌రెడ్డి, ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
చెల్లిపై వేధింపులు: బావకు నచ్చచెప్పేందుకు వెళ్లిన అన్నపై కత్తి దాడి
నేరడిగొండ (బోథ్): బావమరిదిపై కత్తితో బావ దాడి చేసిన ఘటన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో చోటుచేసుకుంది. ఎస్సై భరత్‌సుమన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌తో జుబేర్ గత రెండు సంవత్సరాల క్రితం చెల్లె వివాహం జరిపారు. మూడు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా జుబేర్ బావను నచ్చజెప్పడానికి ఆయన చికెన్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ మాటామాట పెరగడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో బావ ఇమ్రాన్‌ఖాన్ మరిది జుబేర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన మెడ, చెవిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జుబేర్‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్ చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు -
కిరాతకం: బావను చంపి.. చేతిని నరికి..
సాక్షి, మైసూరు: అక్కను వేధిస్తున్నాడని సొంత బావను హతమార్చారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఉదయగిరిలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హతుడు ప్రైవేటు ఉద్యోగి మహమ్మద్ నురాన్ (36) కాగా, నిందితులు కలీం పాష, అజ్మల్ పాష, హలామత్ పాష, ఖదీర్ పాషా. వివరాలు.. మహమ్మద్ నురాన్ తన భార్యకు అక్రమ సంబంధం ఉందని నిత్యం వేధించేవాడు. దీనిపై అనేక పంచాయతీలు జరిగినా అతడు మానలేదు. దీంతో బావమరదులందరూ కలిసి అతనిని ఇంట్లోనే తీవ్రంగా కొట్టిచంపారు. ముగ్గురు పారిపోగా, ఖదీర్ ఒక్కడు తన బావ చేతిని నరికి ఆ ముక్కను సంచిలో తీసుకుని ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు -
చెల్లెల్ని కాపురానికి పంపాలని ఒత్తిడి.. మాట వినకపోవడంతో
నెల్లూరు (క్రైమ్): మద్యం మత్తులో బావను బీర్ బాటిల్‌తో పొడిచి బావమరిది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటిక వద్ద జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. సత్యనారాయణపురానికి చెందిన సునీల్ (33), మౌనిక దంపతులు. సునీల్ ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మౌనిక సోదరుడు పవన్ బావ ఇంట్లోనే ఉంటూ బావతో పాటు పనులకు వెళ్లేవాడు. సునీల్ చెల్లెలు శైలజను కిసాన్‌నగర్‌కు చెందిన రాజాకు ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. అయితే రాజా చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె భర్తపై నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శైలజ తన అన్న సునీల్ వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో తన భార్యను కాపురానికి పంపాలని రాజా కొద్ది రోజులుగా బావ సునీల్‌పై ఒత్తిడి తెస్తున్నాడు. చెడు వ్యసనాలు మాని మంచిగా ఉంటానంటే శైలజను కాపురానికి పంపుతానని సునీల్ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో రాజా పవన్‌ను కలిసి తన భార్యను కాపురానికి పంపేందుకు సహాయం చేయాలని కోరారు. క్షణికావేశంలో హత్య కుటుంబంలో జరుగుతున్న గొడవలను మా ట్లాడి పరిష్కరించుకుందామని పవన్ తన బావ సునీల్‌ను సోమవారం బోడిగాడితోట శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఇంతలో రాజా మద్యం తీసుకుని వారున్న చోటుకు వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం తాగుతున్న క్రమంలో శైలజను భర్తతో పంపాలని పవన్ ఒత్తిడి తెచ్చాడు. వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన పవన్ తాను తాగుతున్న బీర్ బాటిల్‌ను పగులగొట్టి క్షణికావేశంలో సునీల్‌ను విచక్షణా రహితంగా పొడిచాడు. గాయపడిన సునీల్‌ను స్థానికులు చికిత్స నిమి త్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న నవాబుపేట ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్సైలు హాస్పిటల్ వద్ద కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పో స్టు మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మరదలిపై అనుమానం.. చంపి, శవాన్ని..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో మరదల్ని హత్య చేశాడో బావ. ఈ సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కూకట్పల్లి ఏవీబీపురంలో నివాసం ఉంటున్న భూపతి అనే వ్యక్తి మరదలిపై అనుమానంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోవాల్సిన తనతో కాకుండా ఇతరులతో తిరుగుతోందని అనుమానించి హత్య చేశాడు. అనంతరం శవాన్ని నీటి సంపులో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే చావటానికి ధైర్యం చాల్లేదు. దీంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. -
రూ.2 వేల కోసం బావమరిదిని హత్య
సాక్షి, పెద్దారవీడు: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక పోవడంతో సొంత బామరిదిని బావ బాణంతో పొడిచి చంపాడు. ఈ సంఘటన మండల కేంద్రం పెద్దారవీడు పంచాయతీ పరిధిలో చెంచుగూడెంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుడుముల చిన్నయ్య వద్ద ఆయన బావమరిది మండ్ల రాజయ్య గతంలో రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు కచ్చితంగా తిరిగి ఇవ్వాలని బావ అడిగాడు. బావమరిది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం ఇద్దరూ మద్యం పూటుగా తాగి ఇంటికి వచ్చి ఘర్షణ పడ్డారు. మాటామాట పెరిగి ఇద్దరూ గొడ్డలితో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. కుడుముల చిన్నయ్య చేతిలోని గొడ్డలి కింద పడిపోయింది. రాజయ్య గొడ్డలితో చంపుతాడని భయపడి చిన్నయ్య ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే బాణం (అంబు) తెచ్చి రాజయ్య (35)ను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి గృహాలు ఎదురెదురుగా ఉన్నాయి. రాజయ్య అక్క గుర్రమ్మకు చిన్నయ్యతో వివాహమైంది. మృతుడి భార్య హనుమక్క గర్భిణి కావడంతో కాన్పు కోసం మార్కాపురం మండలం జమ్మనపల్లె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న మృతుడి భార్య కన్నీరు మున్నీరైంది. మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు కారణాలు బంధువులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఆయన వెంట ట్రైనీ డీఎస్పీ స్రవంతిరాయ్, సీఐ రాఘవేంద్ర ఉన్నారు. వీఆర్వో బద్వీటి మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.రామకృష్ణ తెలిపారు. -
మరదలి పట్ల అసభ్య ప్రవర్తన.. బావ అరెస్ట్
మల్కాజిగిరి: మరదలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బావను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ మీర్జాలగూడకు చెందిన చింక లక్ష్మీనారాయణ అలియాస్ సతీష్ వంటమనిషిగా పని చేస్తున్నాడు. ఈ నెల 10న రాత్రి మీర్జాలగూడలో ఉంటున్న భార్య చెల్లెలు ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉండడం గమనించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు మంగళవారం సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆడపడుచు భర్త లైంగిక దాడి.. ఫొటోలు తీసి
పశ్చిమగోదావరి, కొవ్వూరు : వరుసకు సోదరుడయ్యే వ్యక్తి (ఆడపడుచు భర్త) ఆరికిరేవుల గ్రామానికి చెందిన ఓ వివాహితపై లైంగిక దాడికి తెగబడ్డాడు. జనవరి 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చీటీల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి శుక్రవారంఆరికిరేవుల వస్తుంటాడు. ఆ గ్రామానికి చెందిన తన బావమరిది ఇంటికి ప్రతివారం వస్తుండేవాడు. జనవరి 31న ఉదయం వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బావమరిది భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీసి బయట ఎవరికైనా చెబితే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, మౌనంగా ఉంటే రూ.ఐదువేలు ఇస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన వివాహిత అప్పటి నుంచి బాధను దిగమింగుకుని మౌనంగానే రోధిస్తోంది. ఎట్టకేలకు విషయం భర్త, అత్తమామలకు చెప్పి వారి సహకారంతో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీఐ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. -
అనారోగ్యంతో సీఎం బావ కన్నుమూత
అల్వాల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండో సోదరి భర్త అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన పర్వతనేని రాజేశ్వరరావు (84) హైదరాబాద్‌లోని అల్వాల్ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. సీఎం సోదరి, రాజేశ్వరరావు సతీమణి విమలాదేవి గతేడాది చనిపోయారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉదయమే అక్కడికి చేరుకుని రాజేశ్వరరావు పార్థివదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు రాజేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్వర్గధామ శ్మశాన వాటికలో రాజేశ్వరరావు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అక్కడే ఉన్నారు. రాజేశ్వరరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు -
నమ్మించి గొంతుకోశాడు..
సాక్షి, ఆదిలాబాద్ : అక్కను చూసేందుకు వచ్చి బావ చేతిలో బావమరిది హతమైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని దహేలిలో నివాసముంటున్న నర్సమ్మ – దత్తుల కూతురు మమతను ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఓసావార్ సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోగా అక్కతో కలిసి మనోజ్ (25) బావపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏడాది నుంచి అక్కాబావలు కలిసి ఉంటున్నారు. గురువారం తన అక్కను చూసేందుకు వచ్చాడు. అక్కతో పాటు ఆమె పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. బావ సంతోష్ బావమరిదిని టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకువెళ్లాడు. మమత జిన్నింగ్ ఫ్యాక్టరీ దగ్గరికి రాగానే బైక్ నడుపుతున్న మనోజ్‌ను కత్తితో వెనకనుంచి మెడను కోశాడు. ఆ తర్వాత కడుపులో పలుమార్లు పోడవడంతో మనోజ్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్రావు, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
బావను హతమార్చిన బామ్మర్ది
వంగూరు (కల్వకుర్తి): ఇంటికి వచ్చిన బావ (అక్క భర్త)కు సకల మర్యాదలు చేయాల్సిన ఓ బామ్మర్ది.. అక్కతో తరచూ గొడవపడుతున్నాడనే నెపంతో కట్టెతో కొట్టడంతో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని డిండిచింతపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంగారమ్మతో బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన రాములు(40)కి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తుండడంతో గత కొన్నిరోజులుగా బంగారమ్మ తల్లి గ్రామమైన డిండిచింతపల్లిలోనే ఉంటుంది. భార్యాపిల్లలను తీసుకెళ్లడానికి రెండు రోజుల క్రితం వచ్చిన రాములుకు బామ్మర్ది రమేష్‌కు మధ్య సోమవారం గొడవ జరిగింది. ఈ క్రమంలో కట్టె తీసుకుని రాములు మెడపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో బంధువులు నీళ్లు తాపి పడుకోబెట్టారు. ఆ సమయంలోనే మృతిచెందాడు. పెళ్లయిన నాటి నుంచి భర్తతో ఉన్న గొడవలు చివరికి భర్త ప్రాణాలు పోయేవరకు వెంటాడడంతో భార్య బంగారమ్మ కన్నీరుమున్నీరయ్యింది. ఈ సంఘటన గ్రామస్తులకు తెలియడంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, వెల్దండ, చారకొండ ఎస్ఐలు వీరబాబు, బాలకృష్ణలు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను ఇతర వివరాలను తెలుసుకుని పంచనామా నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. రాములుకు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
బావను కొట్టి చంపిన బావమరిది
తూర్పుగోదావరి,గొల్లప్రోలు (పిఠాపురం): మండలంలోని చేబ్రోలులోని ఎస్సీ పేటలో బావను కొట్టి చంపిన ఘటన చోటు చేసుకుంది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేబ్రోలు గ్రామానికి చెందిన దొండపాటి గంగకు చెందుర్తి గ్రామానికి చెందిన ఆరుగుళ్ల శ్రీనివాస్(34)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడు నెలలుగా శ్రీనుకు గంగకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో గంగ చేబ్రోలులోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కాగా శ్రీను తన కుమారులను తీసుకుని పండగ సందర్భంగా చేబ్రోలులోని భార్య వద్దకు బుధవారం వచ్చాడు. ఇంటి వద్ద అత్తవారి కుటుంబ సభ్యులకు శ్రీనుకు మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో గంగ సోదరుడు (బావమరిది) దొండపాటి చంద్రబాబు మంచం పట్టెతో శ్రీను తల వెనుక బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన శ్రీనును స్థానికులతో పాటు మేనత్త కుటుంబ సభ్యులు కత్తిపూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మొదట ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను గురువారం మృతి చెందాడు. తండ్రి చనిపోవడంతో ముగ్గురు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పిఠాపురం సీఐ బి.సూర్య అప్పారావు గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌లోని కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు. సంఘటనకు దారి దీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. ఎస్సై బి.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పథకం ప్రకారమే బావని హత్య చేశాడు.!
సాక్షి, విజయవాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో బావాబావమరదుల మధ్య జరిగిన వివాదంలో బావమరిదిని బావ హతమార్చిన ఘటన సత్యనారాయణపురంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నింధితుడిని డీసీపీ నవాబ్ జాన్ అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతోనే రైల్వే గేట్‌మ్యాన్ రాజును కత్తులతో విచక్షణా రహితంగా తన చెల్లెలు భర్త శేఖరే హత్య చేశాడు. తన భార్య పుట్టింటికి రావడవం లేదనే మనస్థాపంతో ఆమె కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్న శేఖర్, పథకం ప్రకారమే తన బావని హతమార్చాడని వెల్లడించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించామని డీసీపీ తెలిపారు. ఐదువేల కోసం హతమార్చాడు -
భర్తను ప్రేమించడం లేదని మరిదిని దారుణంగా....
కోల్‌కతా : ఎనిమిదేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోల్‌కతాకు చెందిన దుఖ్రామ్ దాస్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుబ్రతా దాస్(22)కు ప్రియాంక(19)తో వివాహం జరిగింది. అయితే దుఖ్రామ్ దాస్ తన చిన్న కుమారుడు రిజు(8)ను చాలా గారాబంగా చూసుకునేవాడు. రిజును గారాబం చేస్తూ.. ఎప్పుడూ అతడి భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ మామగారు తన భర్తపై ప్రేమానురాగాలు చూపించకుండా..నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రియాంక భావించేది. ఈ క్రమంలో మరిదిపై ఆమె ద్వేషాన్ని పెంచుకుంది. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల 29న రిజు స్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న డ్రమ్‌లో నీళ్లను తోడుకునేందుకు అందులోకి వంగి చూస్తుండగా.. అతడి వెనకాలే వెళ్లిన ప్రియాంక రిజును నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసింది. అనంతరం అతడిని డ్రమ్‌లో పడేసి మూత బిగించింది. తర్వాత ఏమీ తెలియనట్లు ఇంట్లోకి వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తే రిజు డ్రమ్‌లో పడిపోయాడని అంతా భావించారు. కానీ రిజు మరణించిన నాలుగు రోజుల తర్వాత పశ్చాత్తాప పడిన ప్రియాంక తన భర్త ముందు అసలు నిజాన్ని బయటపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రిజు తండ్రి దుఖ్రామ్ దాస్ ప్రియాంకపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం ద్వేషం కారణంగానే ప్రియాంక రిజును హత్య చేసిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.