Buggana Rajendranath Reddy
-
ఆంధ్రప్రదేవ్ అప్పులపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు.. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థికమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డు అవుతుందని, నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, కాగ్ పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని బాబు ప్రభుత్వం కూడా ఇదే చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.అలాగే, పయ్యావుల చెప్పింది నిజమా? లేక సీఎం చంద్రబాబు చెప్పింది నిజమా లేదా టీడీపీ మాజీ ఆర్థికమంత్రి యనమల చెప్పింది నిజమా.. అనేది ఒకసారి ముగ్గురు ఒకచోట కూర్చుని ఒక అంకెకు వస్తే మంచిదని బుగ్గన ఎద్దేవా చేశారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లంటూ అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనని ఆయనన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా.. ఇదేమైనా గండికోట రహస్యమా.. అని ప్రశి్నంచారు. ‘స్కాములన్నీ మీరే చేశారు. తండ్రీ కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారు.. బడ్జెట్లో సూపర్–6, సూపర్–7 పథకాలకు కేటాయింపులు ఎక్కడ..’ అని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. స్కీములన్నింటికీ రికార్డులున్నాయివైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం సున్నా అని, స్కీములన్నీ స్కాములేనంటూ చంద్రబాబు బాధ్యతలేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కీములన్నీ డీబీటీ ద్వారానే అమలుచేసింది. వీటన్నింటికీ రికార్డులున్నాయి. మరి స్కాములెక్కడుంటాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం లైసెన్సులు, ఇసుక టెండర్లలో యథేచ్ఛగా దోపిడీ సాగించారు. తండ్రి కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకున్నారు. మైనింగ్ కాంట్రాక్టులు కూడా దోపిడీయే. ఏ స్కాములో చూసినా మీరే కనిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందిగత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.42,188 కోట్లు బకాయిలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటితో ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుంది? వాటినీ పరిగణనలోకి తీసుకున్నా బాబు హయాం కన్నా మేమే తక్కువ అప్పులుచేశాం. బాబు అప్పుల పెరుగుదల 22.63 శాతమైతే మాది 13.57 శాతమేఇక గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక సగటు అప్పుల పెరుగుదల 22.63 శాతం కాగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అది 13.57 శాతమే. దీన్నిబట్టి చూస్తే ఎవరెక్కువ అప్పులు చేశారో తెలుస్తుంది? అలాగే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి రూ.16,400 కోట్లు అప్పులుచేసింది. ఈ అప్పును వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం మినహాయించింది. మరోవైపు.. మూలధన వ్యయం సున్నా అని బాబు, సింగిల్ డిజిట్ అని యనమల చెప్పారు.. కానీ, మొన్నటి బడ్జెట్ డాక్యుమెంట్‌లోనే మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా చూపెట్టారు. ఇది సున్నా, సింగిల్ డిజిట్ ఎలా అవుతుందో చెప్పాలి. ‘విద్యుత్’పై ఆరోపణల్లోనూ నిజంలేదువిద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్లు నష్టంచేసినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణల్లోనూ నిజంలేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు రూ.6,625 కోట్లు ఉండగా చంద్రబాబు హయాంలో అవి రూ.28,715 కోట్లకు పెరిగాయి. అదే వైఎస్సార్సీపీ హయాంలో 2022–23 నాటికి అవి రూ.29,110 కోట్లే. రూ.395 కోట్లే పెరిగింది.ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి నేతలు... ఇప్పుడు 6 నెలల్లోనే రూ.6,072 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారు. మరో రూ.12,000 కోట్లు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. తలసరి ఆదాయం 2018–19 నాటికి రూ.1,54,031లతో దేశంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే.. 2022–23 నాటికి రూ.2,19,881లతో 15వ స్థానానికి చేరింది. యనమల ఆరోపణలు విచిత్రం.. విడ్డూరంఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల అయితే.. అప్పులపై చాలా అన్యాయంగా అవాస్తవాలు చెప్పారు. నిజానికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లే. ఇక వేస్ అండ్ మీన్స్, ఓవర్‌డ్రాఫ్ట్ అనేది అన్ని ప్రభుత్వాలు చేసేవే. వాటిని అవసరమైన రోజులు తీసుకోవడం ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తీర్చేయడం జరుగుతుంది. ఇలా తీర్చేసిన అప్పులను కూడా యనమల అప్పులుగా పేర్కొనడం.. విడ్డూరంగాను, విచిత్రంగాను ఉంది. అలాగే, ఆర్థిక విధ్వంసం, అరాచకం జరిగిందని ఆర్థికమంత్రి కేశవ్ అన్నారుగానీ, ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో చూపించలేకపోయారు? చిక్కీలపై బకాయి పెట్టామన్నారు. మరి వాళ్లు కోడిగుడ్లపై బకాయి పెట్టలేదా? రన్నింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం సహజం. ఆదాయం తగ్గలేదు, పెరిగిందిఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 1999–2004 మధ్య బాబు పెంచిన ఆదాయం 12.4 శాతమైతే.. 2004–2009 మధ్య వైఎస్సార్ 21.6 శాతం పెంచారు. తిరిగి 2014–19 మధ్య బాబు ఆరు శాతం పెంచితే 2019–2024 మధ్య జగన్ 16% పెంచారు. సూపర్ సిక్స్‌లో పావు దీపం తప్ప మిగతా ఏవీ అమలుచేయలేదు. ఎన్నికల ముందు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉండగా అవాస్తవాలు చెబుతూ తప్పులుచేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రతీసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కారు. ఈ వయస్సులో అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పడం చంద్రబాబుకు తగదు. -
ఏపీ అప్పులపై మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన క్లారిటీ
-
అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘లెక్క ఇది.. గుంజీలు ఎవరు తీయాలో ఆలోచించుకో బాబూ?’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. డీబీటీ ద్వారా అబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కాం ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై గతంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. అబద్దాన్ని నిజం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 9.56 లక్షల కోట్లు అప్పులున్నాయని.. తవ్వితే ఇంకెన్ని ఉన్నాయో అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. తవ్వడానికి ఏముంది? ప్రతి కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది ఆడిట్ జరుగుతాయి కదా?. గుంజీలు ఎవరు తీయాలో మీరే ఆలోచించుకోండి’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.‘‘2014-15లో ఓపెన్ మార్కెట్లో ఎక్కువ వడ్డీ పెట్టీ అప్పు తెచ్చుకున్నారు చంద్రబాబు. మాపై అప్పులు ఎక్కువ అయ్యాయని, ఎక్కువ వడ్డీ తో అప్పులు తీసుకున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మాజీ, ప్రస్తుత ఆర్ధిక మంత్రికి లెక్కలు అర్థం కావా?’’ అంటూ బుగ్గన ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: రాజ్యమేలుతున్న మారీచ తంత్రం!‘‘2014-19లో ట్రూ అప్ చార్జీలు రూ.6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగింది. మా ప్రభుత్వ హయాంలో 2,300 కోట్ల మాత్రమే వినియోగదారులపై భారం వేశాం. తాజాగా 5 నెలల్లోనే రూ.6,770 కోట్లు వినియోగదారులపై భారం మోపారు. ఇంకా రూ.12 వేల కోట్ల ట్రూ అప్ చార్జీల భారం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.’’ అని బుగ్గన నిప్పులు చెరిగారు. -
వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్
-
Buggana: అప్పులతో అమరావతి సాధ్యమా?
-
AP: ఈ బడ్జెట్ అగమ్యగోచరం: బుగ్గన
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా, రూ.41 వేల కోట్లు పెంచుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రనౌట్ అయ్యిందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. తాము 2019 మే 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలన్నరలోనే జూలై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కోవిడ్ వంటి ఇబ్బందులున్నప్పటికీ వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చామన్నారు. కానీ.. అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఐదు నెలల సమయం తీసుకున్నారంటూ దెప్పి పొడిచారు.బడ్జెట్ ప్రసంగంలో 21 సార్లు గత ప్రభుత్వమంటూ ప్రస్తావించారని ఎత్తిచూపారు. తీరా బడ్జెట్ చూస్తే అగమ్యగోచరం అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపాలు, లొసుగులను ఎత్తిచూపారు. ‘ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రచారం చేశారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ ప్రచారం చేసి ప్రజలకు ఆశ కల్పించారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాటి ఊసే లేదు’ అని కడిగి పారేశారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? ⇒ 2024–25 వార్షిక బడ్జెట్ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన అంచనాల మేరకు బడ్జెట్ రూ.2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్ మినహా, సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15 వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకం. ⇒ పన్ను రాబడి రూ.24 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. వాస్తవానికి ఆదాయం తగ్గింది. కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్నుల ఆదాయంలో దాదాపు 11 శాతం పెరుగుదల నమోదు కాగా, మేలో –2.8 శాతం, జూన్ లో –8.9 శాతం, జూలైలో –5.3 శాతం, ఆగస్టులో –1.9 శాతం, సెప్టెంబర్ లో –4.5 శాతం.. అలా మొత్తం మీద మైనస్ 2 శాతం ఆదాయం నమోదైంది. ఈ నేపథ్యంలో పన్ను రాబడి ఏకంగా రూ.24 వేల కోట్లు ఎలా పెరుగుతుంది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ⇒ జీఎస్టీ ఆదాయంలో రూ.16 వేల కోట్ల నుంచి రూ.21,500 కోట్ల పెరుగుదల ఎలా సా««ధ్యం? స్టాంప్స్–రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.4 వేల కోట్ల నుంచి రూ.9,500 కోట్లు, సేల్స్ ట్యాక్స్ పన్ను రూ.8,500 కోట్ల నుంచి రూ.16 వేల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.8 వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు, ఇతర పన్నులు రూ.2400 కోట్ల నుంచి రూ.5700 కోట్లు వస్తాయని ఎలా అంచనా వేస్తున్నారు? ⇒ తొలి ఆరు నెలల్లో రాబడి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78 వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? నెట్ పబ్లిక్ అకౌంట్.. అంటే ప్రభుత్వం వద్ద ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బును రూ.16 వేల కోట్ల నుంచి రూ.1,800 కోట్లకు తగ్గిస్తాం అంటున్నారు. ఆ ప్రకారం ఉద్యోగులకు పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి అన్నీ కట్టేయాలి. మరి ఈ ఐదు నెలల్లో ఆ పని చేశారా? సూపర్ సిక్స్ పేరుతో మోసం ⇒ యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ⇒తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో స్పష్టంగా కేటాయింపులు లేవు. బీసీ సంక్షేమంలో రూ.2,400 కోట్లు, ఎకనమిక్ వీకర్ సెక్షన్లో రూ.1160 కోట్లు.. ఇలా అన్ని కలిపి చూపినా తల్లికి వందనం పథకానికి రూ.5,300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుంది? ⇒ అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి చెప్పిన ప్రకారం ఆ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. మిగతా రూ.3500 కోట్లు పీఎం కిసాన్ నుంచి వచ్చేది. నిజానికి ఈ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,706 కోట్లు కావాలి. ⇒ దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుంది. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన మిగతా వారందరికీ ఇవ్వరా? వాస్తవాలు ఇలా ఉంటే.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి అన్ని పథకాలు అమలు చేసినట్లు ఎలా చెబుతారు? ⇒ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 2,07,30,000 మందికి ఇవ్వాలి. దీని ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. ⇒ 2014 ఎన్నికల్లో కూడా వ్యవసాయ రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులు, చేనేతలకు సాయం, నిరుద్యోగ భృతి.. ఇలా అన్ని హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. బాబు తీరు మొదటి నుంచీ ఇంతే. (బాబు తీరుపై వైఎస్సార్, రోశయ్యలు మాట్లాడిన వీడియో ప్రదర్శించి చూపారు).మంచి చేస్తే అభాండాలా? ⇒ విద్యుత్ రంగానికి మా హయాంలో 2019–20లో రూ.11,600 కోట్లు, 2020–21లో కోవిడ్ ఇబ్బందుల్లో కూడా రూ.6,110 కోట్లు, 2021–22లో రూ.11,500 కోట్లు, 2022–23లో రూ.18,250 కోట్లు, 2023–24లో ఇంచుమించు రూ.15,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.8,100 కోట్లు మాత్రమే ఇచ్చింది. ⇒ 2014–15 నుంచి 2018–19 వరకు ప్రభుత్వం డిస్కంలకు రూ.31,800 కోట్లకు గాను కేవలం రూ.20,165 కోట్లే కట్టింది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.68 వేల కోట్లకుగాను రూ.62 వేల కోట్లు కట్టింది. ఈ లెక్కన ఎవరికి చిత్తశుద్ధి లేదు? ⇒ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు. పథకాల అమలుపై క్యాలెండర్ ప్రకటించి, పక్కాగా అమలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క జగనన్న అమ్మ ఒడికి రూ.26,067 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.34,378 కోట్లు, చేయూతకు రూ.19,189 కోట్లు, వైఎస్సార్ ఆసరాకు రూ.25,570 కోట్లు అందించాం. ఇలా ప్రతిదీ పక్కాగా అమలు చేశాం.బడ్జెట్ సాక్షిగా అప్పులపై దు్రష్పచారం బట్టబయలు ⇒ 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రాష్ట్ర అప్పులపై అదే పనిగా తీవ్ర దుష్ప్రచారం చేశాయి. రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లని, రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధాలు అచ్చేస్తే.. వాటిని పట్టుకుని శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమోనని చంద్రబాబు దు్రష్ఫచారం చేశారు. అప్పులు అడుక్కోవడానికేనా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు అని 2023 అక్టోబర్ 25న చెప్పిన పురంధేశ్వరి.. 2024 ఏప్రిల్ 7న రాష్ట్ర అప్పులు రూ.12,50,000 కోట్లని ప్రకటించారు. అంటే 5 నెలల్లోనే లక్షన్నర కోట్లు పెంచుతారా? ⇒ అయితే వాస్తవం ఏమిటన్నది బడ్జెట్లో బయట పడింది. రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. 2024 మార్చి 31 నాటికి రూ.4.91 లక్షల కోట్లు, గ్యారంటీ కింద తెచ్చిన అప్పు రూ.1,54,797 కోట్లు.. రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. మరి ఆనాడు ప్రచారం చేసినట్లు రూ.14 లక్షల కోట్ల అప్పు ఏది? అంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడతారా? కార్పొరేషన్ల అప్పులతో ప్రభుత్వానికి ఏం సంబంధం? డిస్కంల అప్పులతో ప్రభుత్వానికి ఎలా సంబంధం? పౌర సరఫరాలు, విద్యుత్ రంగం.. రూ.34 వేల కోట్లు డబుల్ ఎంట్రీ చేశారు. ఔట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్స్, స్కీమ్స్.. ఎవరికో కట్టవలసినవి రూ.1,13,000 కోట్లు. మరి ఇవన్నీ బడ్జెట్లో ఎందుకు చూపలేదు? అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సబబు? చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ⇒ 2023–24 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.4,83,000 కోట్లుగా మేం చూపాం. ఇప్పడు కూటమి ప్రభుత్వ బడ్జెట్లో ఆ అప్పును రూ.4,91,000 కోట్లుగా చూపారు. మరి అలాంటప్పుడు ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు అని ఎలా దు్రష్పచారం చేశారు? వారం కింద కూడా బడ్జెట్ ప్రిపేర్ అవుతుందని తెలిసీ.. చంద్రబాబు ఏపీ అప్పుల గురించి దారుణంగా అబద్ధాలు చెప్పారు. ఇందుకు చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ⇒ 2019–2024 వరకు మేము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో లేకపోయినా, కష్టపడి తిరిగి ఎన్నో సాధించాం. చంద్రబాబు కేంద్రంలో భాగస్వాములై ఏం సాధించారు? అసలు అప్పులు పెంచింది 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. 2014లో రూ.1,32,000 కోట్లుగా ఉన్న అప్పు.. 2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయేటప్పటికి రూ.3,31,000 కోట్లు అయింది. అంటే ఐదేళ్లలో ఏటా సగటున 20 శాతం పెరిగింది. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు రూ.3,31,000 కోట్లు కాగా, మేము 2024లో దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు 14.9 శాతమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలోనే తక్కువ అప్పులు చేశాం. -
చంద్రబాబు, పచ్చ మీడియా ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
-
AP Budget: కూటమి ప్రభుత్వ బడ్జెట్లో అంతా మోసమే
-
Buggana: బడ్జెట్ పెట్టడానికి ఐదు నెలలు ఎందుకు పట్టింది?
-
బడ్జెట్లో పథకాలకు నిధులు సున్నా: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి,తాడేపల్లి: పథకాలకు కేటాయింపులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్‌ను రూ.41వేల కోట్లు పెంచిందని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌పై సోమవారం(నవంబర్ 11)తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘అమరావతికి రూ.15వేల కోట్లు చూపించారు. అది గ్రాంటో అప్పో చెప్పలేదు. మైనస్‌లో ఉన్న మీరు ఆరు నెలల్లో రూ.24 వేల కోట్ల ఆదాయం ఎలా పెంచుతారు. అన్నదాత సుఖీభవ పథకం ఎంతమందికి ఇస్తారో చెప్పలేదు. దీనికి బడ్జెట్లో పెట్టింది. కేవలం రూ.1000కోట్లు. ఈ పథకం అమలు చేయాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఊసే లేదు. పథకాలకు నిధుల కేటాయింపు పూర్తిగా తగ్గించారు’అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రెస్మీట్లో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదు నెలలపాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు బడ్జెట్ పెట్టలేదు?ఐదు నెలలపాటు బడ్జెట్ పెట్టకపోవడం గండికోట రహస్యంగా మారింది.గత ప్రభుత్వం" అనే మాటని 21 సార్లు ఉపయోగించారు.మేనిఫెస్టో అమలు చేస్తారని భావించిన వారికి నిరాశ కలిగేలా బడ్జెట్ ఉంది.గత ప్రభుత్వం కంటే రూ.41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ఎలాంటి పథకాలు అమలు చేయకుండానే ఇంత ఖర్చు ఎందుకో అర్థం కావడం లేదు.అమరావతి కోసం పెట్టే రూ.15 వేల కోట్ల ఖర్చు అప్పా? గ్రాంటా? ఆ లెక్కలకు క్లారిటీ ఇవ్వలేదు.మా హయాంలో ఆదాయం పెరిగితే చంద్రబాబు హయాంలో మైనస్ వచ్చింది.తల్లికివందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు.ఎవరికీ ఈ పథకాన్ని అమలు చేయకుండానే చేసినట్టు మాట్లాడారు.ఇంతకంటే అన్యాయం ఉంటుందా?రూ.10,706 వేల కోట్లకుపైగా అన్నదాత సుఖీభవకు ఇవ్వాల్సి ఉండగా వెయ్యి కోట్లు మాత్రమే ఇవ్వడమేంటి?మహిళలకు ఉచితబస్సు గురించి ప్రస్తావనే లేదు.కరెంటు సంస్థలకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొడితే మా ప్రభుత్వం చెల్లించింది.కానీ మా ప్రభుత్వం వల్ల కరెంటు సంస్థలకు నష్టాలు వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు.గతంలో కూడా రూ. 87వేల కోట్లు రైతురుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.15 వేల కోట్లు చేశారు.డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీలు 21వేల కోట్లు చెల్లించకుండా మోసం చేశారు.నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గొట్టారు.మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి గెలిచారు.2009,2014,2019,2024 లో వరుసగా అవే హామీలు ఇస్తూ జనాన్ని మోసం చేస్తూ వచ్చారు.అమరావతి ఏ రకంగా గొప్ప నగరమో తెలియదు.ప్రపంచబ్యాంకు నుంచి అప్పులు తీసుకుని కడతామంటున్నారు.మా హయాంలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తామో వివరంగా జనానికి తెలిపాం.ఎన్నికల సమయంలో ఆసరా డబ్బు ఇవ్వనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఎల్లోమీడియాలో తెగ వార్తలు రాశారు.మరి ఇప్పటి అప్పులు కనపడటం లేదా?రూ.14లక్షల కోట్ల అప్పులు చేసినట్టు గతంలో మాపైఆరోపణలు చేశారు.కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే రూ. 4 లక్షల కోట్లుగా అప్పు చేసినట్టు లెక్కలు చూపెట్టారు.మాపై తప్పుడు సమాచారం ప్రచురించిన మీడియా సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.2014-19 మధ్య చంద్రబాబు చేసిన అప్పులకంటే మా హయాంలో చాలా తక్కువగా అప్పులు చేశాం.ప్రజలంతా పరిస్థితులను గమనించాలి.మోసపూరిత మాటలు ఎవరు చెప్తున్నారో? ప్రజలకోసం ఎవరు చేస్తున్నారో చూడాలిఇదీ చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు -
మీ డబ్జా మీరు కొట్టుకోవడం కాదు: Buggana
-
కోవిడ్ టైంలో కూడా పోలవరం ఆగలేదు..
-
పోలవరంపై ఇంకెన్ని అబద్దాలు చెప్తావ్ బాబూ..
-
పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం పోలవరం బాధ్యతలు తీసుకుంది. పోలవరం పూర్తైతే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది. పోలవరం ఆపేసి చంద్రబాబు పట్టిసీమ ఎందుకు కట్టారు?. ..ఆనాడు కేంద్రంతో టీడీపీ చేసుకున్న ఒప్పందంతో ఎన్నో ఇబ్బందులున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. మా ప్రభుత్వ హయాంలో పోలవరం ముఖ్యమైన పనులు పూర్తిచేశాం. వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కాలంలోనూ పోలవలం పనులు చేశాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ..పోలవరం ఎత్తు తగ్గింపు మా హయాంలోనే జరిగిందని టీడీపీ తప్పడు ప్రచారం చేస్తోంది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు తప్పడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. కోవిడ్ సంక్షోభం లేకుంటే మిగిలిన పనలు పూర్తి చేసేవాళ్లం. స్పిల్ వే కట్టిన తర్వాత అప్పర్ కాఫర్, లోయర్ కాఫర్ డ్యాం కట్టాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రంవాల్ కట్టాలి. ప్రతీ సోమవారం పోలవరం అని చంద్రబాబు భ్రష్టుపట్టించారు’’ అని అన్నారు.హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన రియాక్షన్..‘‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?. పవన్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా?. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంకా ప్రశ్నించడమేనా? మీరు ఉపముఖ్య మంత్రి కూడా. మీరు కూటమికి కారణం కూడా. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈరోజు మళ్లీ హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు మిమ్మల్ని మీరే ప్రశ్నిచుకుంటున్నారా?. మీ ప్రభుత్వం వచ్చాక క్రైం జరుగుతున్నా.. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్ధం కావట్లేదు. మీరు అధికారంలో ఉండికూడా ప్రశ్నిచడం ఏమిటి?. సమాధానం చెప్పాల్సిన మీరు హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు పాలనాపైన ఓరియెంటేషన్ అవసరం ఉంది. అదృశ్యమైన 30 వేల మంది ఆడపిల్లల జాడేదీ?. ’’అని అన్నారు. -
బుగ్గన వస్తున్నారని తెలిసి... ఇదేం చిల్లర రాజకీయం
-
పార్క్ కు తాళం వేసిన మున్సిపల్ కమిషనర్.. ఎందుకంటే !
-
డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్‌కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేశారు. వాకింగ్ పార్క్‌లో బుగ్గనను సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు.మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్ పార్కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. -
మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప.. ప్రభుత్వం చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: వంద రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దీనస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, సూపర్ సిక్స్ అమలు గురించి మహిళలు, వృద్ధులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో పారీ్టల పేరుతో దాడులు చేయడానికే సమయాన్ని వృథా చేసిందన్నారు. పచ్చ మీడియా పక్షపాతం ఏపీ అప్పుల విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పక్షపాత కథనాలు ఇస్తున్నాయని బుగ్గన ధ్వజమెత్తారు. వంద రోజుల్లో చేసిన అప్పులను ఎందుకు రాయడం లేదని ప్రశి్నంచారు. పోలవరానికి రూ.12,500 కోట్ల అదనపు నిధులు రావడానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేక విధాల కృషి చేసిందని, ఈ ఫలితాలను కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా చెప్పుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును 2016 వరకూ నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. 2014 నాటి ధరలకు ఒప్పుకున్నారని, కొత్త భూసేకరణ చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాసం గురించే ఆలోచించలేదని, కేవలం సాగు, తాగునీటి కోసం లెక్కలు వేసి, కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం వల్లే పోలవరం నిర్మాణానికి ఇబ్బందులు వచ్చాయని బుగ్గన తెలిపారు. రూ.55 వేల కోట్ల అవసరం ఉంటే.. రూ.20 వేల కోట్లకే పోలవరం చేపడతామని కేంద్రంతో అప్పటి చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుందన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ హయాంలో జరిగిన కృషిని బుగ్గన ఈ దిగువ విధంగా వివరించారు.వైఎస్ జగన్ పోలవరానికి చేసింది ఇదీ⇒ పోలవరం ప్రాజెక్టుకు ముందు రాష్ట్రం డబ్బులు పెడితే, కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఈ లెక్కలు పోలవరం అధారిటీకి వెళ్లేవి. అథారిటీ పరిశీలించి, జలశక్తికి పంపాలి. అక్కడి నుంచి ఆరి్థక శాఖకు, ఆర్బీఐకి వెళ్లి.. తిరిగి రాష్ట్రానికి నిధులు రావడానికి కొన్ని నెలలు పట్టేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్ ద్వారా నేరుగా నిధులు రావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. ⇒ పోలవరానికి సాగు, తాగునీరు రెండు కాంపొనెంట్లు ఇవ్వాలని 12–6–2021, 16–7–2021, 20–7–2021 తేదీల్లో కేంద్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఈ కారణంగానే రూ.7 వేల కోట్లు కేంద్రం ఇవ్వబోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒత్తిడివల్లే పోలవరం అనుమతులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వ గొప్పతనమేమీ కాదు. ⇒ 11.5.2022లోనే సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయి. 10–4–2023 జలశక్తిలోనే పోలవరం అదనపు ఖర్చు గురించి వివరాలు ఇవ్వమని కోరింది. 36 గ్రామాల పునరావాస వివరాలను 4–5–2023న జగన్ సర్కారు పంపింది. వరద వల్ల జరిగిన నష్టంతోపాటు అదనంగా కావల్సిన రూ.12,911 కోట్లకు కేబినెట్ నోట్ పంపమని కేంద్రం 5–6–2023లోనే జగన్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల వల్ల ఆగిపోయిన కేబినెట్ నోట్ ఇప్పుడు అమలులోకి వస్తే ఈ ఘనత తమదేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం. -
గత ప్రభుత్వంపై కూటమి సర్కార్ విషం చల్లుతోంది: బుగ్గన
-
వంద రోజులు దాటినా.. ఇంకా విషం చల్లడమేనా?: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి దానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతోందని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిపోయింది. ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ప్రతిదానికీ గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. ప్రజలు సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎదురుచూస్తున్నారు. మహిళలకు,వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. నెగెటివ్ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లో పార్టీల పేరుతో దాడులు చేశారు. పోలవరం ఇపుడే నిర్మాణం జరుగుతుందనే భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు...నాలుగు నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఎక్కడ రాయలేదు. ప్రజాశక్తి పత్రికలో గత ప్రభుత్వ హయంలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని రాసింది. కూటమి ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్లను గత ప్రభుత్వం అప్పు తెచ్చామని ప్రచారం చేస్తున్నారు. 2005లో మొదలుపెట్టిన పోలవరం పనులు ప్రారంభం కాగా.. ఇప్పుడు చంద్రబాబుతోనే ప్రారంభించినట్లు ప్రచారం చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. 2016సెప్టెంబర్ 8 వరకు పోలవరం పనులు చేయలేదు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలవరానికి 55 వేల కోట్లు అవసరం ఉండగా.. 20 వేల కోట్లకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పుకొని రావడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగలేదు...పోలవరం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులను మేమే చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ చేసిన పొరపాట్లను 2019లో అధికారంలో వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. పోలవరానికి 31 వేల 600 కోట్ల రూపాయలకు పెంచడానికి వైఎస్సార్సీపీ కృషి చేసింది. ఈ రోజు 12 వేల 500 కోట్ల రూపాయలు మంజూరు కావడం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనత. ఆ రోజు ప్రధాని, ఆర్థిక మంత్రి సహకారం, వైఎస్ జగన్ కృషి కారణంగానే పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగు నెలల్లో టీడీపీ ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదు’’ అని అన్నారు. చదవండి: బాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందే: విజయసాయిరెడ్డి -
ఆర్డినెన్స్ పేరుతో నాటకం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడంతో పాటు రాష్ట్ర అప్పుపై చేసిన దు్రష్ఫచారం బండారం బట్టబయలవుతుందనే భయంతోనే 2024–25 సంవత్సరం పూర్తి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని ఆ ర్థి క శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసి నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019–20కి సంబంధించి రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండ్రోజుల ముందు అంటే జూన్ 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని.. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చి చెబుతూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎత్తిచూపారు. కోవిడ్ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా, నిధుల విషయంలో అస్పష్టత లేకపోయినప్పటికీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు జూన్ 21.. రెండో సమావేశాలు జూలై 22–27 వరకు నిర్వహించారని, ఆ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా.. ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచి్చందో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.అబద్ధాలు బయట పడకూడదనే.. » పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నిధులు లేవనే సాకు చూపి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సమరి్థంచుకోవడం. మరొకటి రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లంటూ ఎన్నికల్లో చెప్పిన అబద్ధాల బండారం బయట పడకుండా చూసుకోవడం. » పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకపోవడం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తామని ఇచి్చన హామీకి మంగళం పాడినట్టేనా? » దీపం పథకం కింద ఒక్కో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయనట్లేనా? » మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచి్చన హామీని అటకెక్కించినట్లేనా? » తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా మోసం చేయడం కాదా? » 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పెన్షన్ ఇస్తామని ఇచి్చన హామీని అమ లు చేయకుండా తప్పించుకోవడానికేనా? » రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సహాయం అందిస్తామని ఇచి్చన హామీని అమలుచేయకుండా మోసం చేస్తారా? » 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా వారికి ద్రోహం చేస్తారా? » రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లుందని ఎన్నికల్లో దు్రష్ఫచారం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,74,556 కోట్లని తప్పుడు లెక్కలు చెప్పారు. వాస్తవానికి అన్ని రకాల అప్పులు కలిపి రాష్ట్రానికి ఉన్నది రూ.7 లక్షల కోట్లే. -
సూపర్ సిక్స్ మొదట్లోనే డకౌట్: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, సిటీ బ్యూరో: చంద్రబాబు ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలు ఆరంభానికి ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కుంటి సాకులతో అన్నీ అసత్యాలు వల్లించారని, ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు లెక్కలు చూపించారని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు అసలు శ్వేతపత్రానికే అర్థం మార్చాడని, రాష్ట్రాభివృద్ధి కోసం తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. కేవలం గత ప్రభుత్వంపై నిందలు, అన్నింటికీ బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే వల్లించే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకొని, ఇప్పుడు తమ సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధం చెప్పించారని విమర్శించారు. రాష్ట్ర పరిపాలన కోసం రూ.2 లక్షల 50 వేల కోట్లు అవసరం ఉంటే ఆదాయం రూ.2 లక్షల 40 వేల కోట్లని.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని, ఏం చేయాలని ప్రజలను ప్రశి్నస్తే ఏలా అని నిలదీశారు. అలాంటప్పుడు ఏటా దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను ఎలా ప్రకటించారని దుయ్యబట్టారు.వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి.. శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే.. సంపద సృష్టి ఒట్టి మాటే ⇒ చంద్రబాబు సంపద సృష్టి అంతా ఒట్టి మాటే. 2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.1,14,671 కోట్లు. ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగింది. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయం ఏటా 16.7 శాతం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చాక 2019 జూలైలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరెందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు? అలా చేస్తే మీ బండారం బయట పడుతుందనే కదా! ⇒ నిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయి. ఇతరత్రా అన్నీ కలుపుకున్నా కూడా మొత్తం అప్పులు రూ.7 లక్షల కోట్లు మాత్రమే. మా ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, మేము ఏకంగా రూ.47,800 కోట్లు ఇచ్చాం. మేము తీసుకొచి్చన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్)ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వైఎస్సార్సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా?⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసింది. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారు. 2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, మా హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే. ఇది ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? వైఎస్సార్సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా? ⇒ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయి. అంటే టీడీపీ హయాంలో 21.63 శాతం పెరిగాయి. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5.18 లక్షల కోట్లు. అంటే 12.9 శాతం పెరుగుదల మాత్రమే. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పారీ్టలకు అనుబంధంగా ఉన్న ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి పత్రికలు ఎన్నడూ ఇలా వన్ సైడ్ తప్పుడు కథనాలు ప్రచురించలేదు. ఆ రెండు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) పత్రికలు మాత్రం ఏకపక్షంగా తప్పుడు రాతలు రాస్తున్నాయి.‘‘పేదల పథకాలకు సంబంధించి ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం కష్టమని మేము తొలి ఏడాది ఓ సమావేశం (అంతర్గత)లో చెబితే..‘ఇది నేను ఇచి్చన మాట. మేనిఫెస్టోలో పెట్టాం. ఇది పేద వారికి సంబంధించిన వాగ్దానం. మాట తప్పేందుకు కుదరదు. ఒకవేళ తప్పాల్సి వస్తే నేనే దిగిపోతాను’ అన్నారు. మేమంతా షాక్ అయ్యాం. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము, మా అధికారులందరం కోవిడ్‌ను సైతం లెక్కచేయకుండా తిరిగాం. అలా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కమిట్మెంట్తో హామీలు అమలు చేశారు’’ అని బుగ్గన వివరించారు.అన్నీ తప్పుడు లెక్కలు⇒ టీడీపీ హయాంలో 2014–19 మ«ధ్య స్థూల ఉత్పత్తి బ్రహా్మండంగా పెంచామని చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకోవడం సరికాదు. కోవిడ్ పీరియడ్.. కోవిడ్ లేని కాలంతో పోలికా? టీడీపీ పాలన కంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో వృద్ధి సాధించాం. 2014 నుంచి 2019 వరకు దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82గా నమోదైంది. పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014– 2019 మధ్య 2.98 శాతం కాగా, 2019–2024 మధ్య 4 శాతం. అయినా పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేయడం విడ్డూరం. ⇒ వైఎస్ జగన్ పాలనలో స్థూల ఉత్పత్తితో పాటు తలసరి ఆదాయం కూడా మెరుగు పడింది. టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం. వైఎస్సార్సీపీ పాలనలో చివరి ఏడాది 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతానికి పెరిగింది. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరింది. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం నంబర్ వన్‌గా నిలిచింది. మా పాలనలో మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. -
జగన్ గురించి సంచలన నిజం బయటపెట్టిన బుగ్గన..!