Burger
-
ట్రంప్, ఇలాన్ మస్క్ తో కలిసి బర్గర్ తిన్న కెన్నెడీ జూనియర్
-
అదో గిగా బర్గర్... ప్రపంచ రికార్డు కొట్టేసింది!
ఆగ్రాలోని హోటల్ గ్రాండ్ మెర్కూర్ బృందంతో కలిసి శరణ్‌దీప్ సింగ్ గతేడాది నవంబర్‌లో అతిపెద్ద బర్గర్‌ని తయారు చేశారు. బహుశా ఇదే అతిపెద్ద బర్గర్ అయ్యి ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఇప్పుడూ ఆ విషయాన్ని ప్రముఖ ఎన్జీవో వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించిందని సదరు హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు. పాశ్చాత్య వంటాకాన్ని కూడా పోషకాలతో కూడిన ఆహారంగా తయారు చేయొచ్చని ప్రూవ్ చేశారు. ఈ బర్గర్ తయారు చేసేందుకు మిల్లెట్స్‌తో తయరు చేసిన 20 కిలోల బన్స్, ఆరు కిలోల ఫ్రెంచ్ ఫ్రైస్, 5 కిలోల టమోటాలు, 5 కిలోల దోసకాయ, 5 కిలోల వెడ్జెస్, 12 కిలోల వివిధ రకాల మాయో / సాస్‌లు, 10 కిలోల పనీర్ 10 కిలోల బంగాళదుంప పట్టీలు, 5 కిలోల పాలకూర, 9 కిలోల టిన్ ఫుడ్, 4 కిలోల మసాలా వంటి ఇతర పదార్థాలను వినియోగించినట్లు తెలిపారు. దీన్ని రూపొందించింది బర్గర్ చచ్చుగా పిలిచే శరణ్‌దీప్ సింగ్. ఆయన ఈ బర్గర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మిల్లెట్స్ ప్రోత్సహించేందుకు తయారు చేసినట్లు తెలిపారు. ఈ బర్గర్లో బన్స్ కోసం తాను జొన్న, బజ్రా, రాగి వంటి తృణ ధాన్యాల పిండిను వినియోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం శరణ్‌దీప్ సింగ్ తయారు చేసిన బర్గరే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ లీఫ్ బర్గర్‌గా నిలవడం విశేషం. ఇది పూర్తిగా మిల్లెట్స్, తాజా కూరగాయలతో నిండి ఉంది. అతేగాదు పాశ్చాత్య వంటకాన్ని కూడా ఎలా ఆరోగ్యకరంగా పోషకమైన పద్ధతిలో ఆస్వాదించొచ్చు తెలియజెప్పారు. ఆ తర్వాత ఈ భారీ బర్గర్‌ని 200 మందికి పైగా పాఠశాల పిల్లలకు అందించినట్లు ఆ ఆగ్రా హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు శరణ్‌దీప్ 2017 నుంచి 7 కిలోల బర్గర్‌ని తయారు చేయడం ప్రారంభించారు. అలా ఆయన 2018లో 15 కిలోల బర్గర్, 2019లో 20 కిలోల బర్గర్‌ని తయారు చేశారు. అలాగే అతను క్రికెటర్ హర్భజన్ సింగ్ కోసం 25 కిలోల బర్గర్‌ను కూడా తయారు చేశారు. డిసెంబర్ 2022లో హోషియార్‌పూర్‌లోని తన సిక్స్ బై 10 బర్గర్ రెస్టారెంట్లో 45 కిలోల వెజ్జీ బర్గర్‌ను తయారు చేశారు. (చదవండి: ఆకుపచ్చ కూరగాయాలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ఇలా చేయండి..!) -
ఒత్తిడికి గురైనప్పుడు జంక్ ఫుడ్ తినడకూడదా?
సాధారణంగా దైనందిన జీవితం లేదా కెరీర్లో రకరకాల ఒత్తిడులను ఎదుర్కొనాల్సి వస్తుంటంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో రిలీఫ్ కోసం కొన్ని రకాల అలవాట్లకు లోనవ్వుతుంటాం. అవి మంచివి అయితే పర్లేదు. అదే కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి అవి మనషులను ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఆ దిశగా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటారని వాటివల్ల వారి ఆరోగ్యం ఎలా ప్రమాదంలో పడుతుందో సవివరంగా వెల్లడించారు. అదెలాగో తెలుసుకుందామా..!బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం..ఒత్తిడికి గురైనప్పుడూ చాలామంది సమోసా లేదా బర్గర్ వంటి జంక్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతారట. ఇలా తినడం వల్ల ఆందోళన స్థాయిలు పెరుగుతాయే గానీ ప్రయోజనం ఉండదని పరిశోధనలో తేలింది. అందుకోసం జంతువులపై జరిపిన అధ్యయనంలో పల ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళనలో ఉన్నప్పుడూ అవి అధిక కొవ్వుతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడంతో వాటి శరీరంలోని గట్ బ్యాక్టీరియాకి అంతరాయం కలిగించి వాటి ప్రవర్తనను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మెదుడు రసాయనాలన ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధన పేర్కొంది కూడా. ఈ మేరకు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ లోరీ మాట్లాడుతూ..అధిక కొవ్వు మెదుడులోని జన్యువుల వ్యక్తీకరణనే మార్చేయడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని అన్నారు. అంతేగాదు తమ పరిశోధనలో ఈ అధిక కొవ్వు ఆహారం తప్పనిసరిగా మెదుడులో ఆందోళన స్థితి మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. పైగా ఇలా జంక్ఫడ్ ఎక్కువగా తీసుకున్న జంతువుల్లోని మైక్రోబయోమ్ లేదా గట్ బ్యాక్టీరియాని అంచనా వేయగా తక్కువ వైవిధ్యాన్ని చూపించాయని, పైగా వాటి బరువు కూడా పెరిగినట్లు తెలిపారు. అంతేగాదు ఈ అధిక కొవ్వుతో కూడిన ఆహారం కారణంగా మెదడులో న్యూరోట్రాన్స్మీటర్ సెరోటోనిన్ ఉత్పత్తికి సంబంధించిన సిగ్నలింగ్‌లో మూడు జన్యువులు అధిక వ్యక్తీకరణనను చూపించడం గుర్తించామన్నారు పరిశోధకులు. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచే సంకేతమని చెబుతున్నారు. ఇక్కడ ఈ సెరోటోనిన్న ఫీల్ గడ్ బ్రెయిన్ కెమికల్ అని పిలుస్తారు. అయితే పరిశోధనలో జంతువుల్లోని ఈ సెరోటోనిన్ న్యూరాన్లలోని కొన్ని ఉపసమితులను సక్రియం చేయండంతో ఆందోళన వంటి ప్రతిస్పందనలు వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అంటే ? ఇక్కడ.. శరీరంలోని అనారోగ్యకరమైన మైక్రోబయోమ్ గట్ లైనింగ్(మనం తీసుకున్న ఆహారం)తో రాజీపడి శరీర ప్రసరణలో కలిసిపోతుంది. దీంతో జీర్ణశయాంతర ప్రేగు నుంచి మెదడుకు వెళ్లే వాగస్ నరాల ద్వారా మెదడుతో కమ్యూనికేట్ అయ్యి ప్రవర్తనను లేదా మూడ్‌ని మారుస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం మనకు అనారోగ్యం కలిగించే విషయాలను గుర్తించి తద్వారా భవిష్యత్తులో వాటిని నివారించేలా చేసే మరిన్ని ప్రయోగాలకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే ఇక్కడ అన్ని కొవ్వులు చెడ్డవికావని చేపలు ఆలివ్ నూనె వంటి మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.(చదవండి: డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!
అంతర్జాతీయ బర్గర్ డే అనేది ప్రపంచ ఆహార సెలవుదినం. దీనిని ప్రతి సంవత్సరం మే 28న జరుపుకుంటారు. ఈ రోజున తమ కుటుంబ సభ్యులతో వివిధ రకాల బర్గర్లను ఆస్వాదిస్తూ జరుపుకుంటారు. నిజానికి బర్గర్లనేది అధిక క్యాలరీతో కూడిని భారీ భోజనంతో సమానం. దీనిలో అధిక సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, షుగర్లు వంటి ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుంది. అందువల్ల అధిక బరువుకి దారితీసి హృదయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే దీన్ని సరైన విధంగా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చట. అదెలాగో సవివరంగా తెలుసకుందామా..! అలాగే దీన్ని ఇష్టంగా లాగించే ప్రముఖ సెలబ్రిటీలు ఎవరో కూడా తెలుసుకుందాం.ఆరోగ్యకరమైన పోషక పదార్థాలతో ఇంట్లో తయారు చేస్తే.. బర్గర్లు నుంచి కూడా ఆశ్చర్యకరమైన రీతిలో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చట. అవి సూక్ష్మ పోషకాల నుంచి స్థూల పోషకాల వరకు అన్ని ప్రధాన ఆహార సమూహాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది భారీ భోజనం కాబట్టి మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉండే అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది. ప్రోటీన్లకు మంచి మూలం. చికెన్, చేపలు వంటి పోషకాలతో కూడిన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలు..కొలస్ట్రాల్ తక్కవగా ఉండే బర్గర్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎర్రమాంసంతో చేసిన బర్గర్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారిత ఐరన్‌తో పోలిస్తే ఇందులో లభించే ఐరన్ సలభంగా శోషించబడుతుంది. వందగ్రాముల బర్గర్లో 3 మిల్లిగ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే ఇందులో ఎర్రరక్తకణాలకు అవసరమయ్యే బీ12 కూడా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జింక్‌కి అద్భతమైన మూలం. ఇందులో ఉపయోగించే ఎర్రమాంసం అద్భుతమైన జింక్ మూలం. అలాగే ఇందులో బీ కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరగుపరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇతర ఆహార పదార్థాలు మాదిరిగానే ట్రాన్స్‌ఫ్యాట్స్, సోడియం, కెమికల్ ప్రిజర్వేటివ్‌లతో సంబంధం ఉన్న కొన్ని బర్గర్లను మితంగానే తీసుకోండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరిగా దీన్ని చూస్తే మనసాగాక ఏదో ఒక విధంగా ఇష్టంగా తినే కొందరు ప్రమఖులు ఎవరో చూద్దాం. అనన్య పాండే..వర్కౌట్లు చేసేందుకు ఇష్టపడుతుంది. ఎక్కువగా యోగాసనాలు కూడా వేస్తుంటుంది. అయితే బర్గర్ బే జ్యూసి అంటే మహా ఇష్టం. తినాలనుకుంటే ఆదివారాలు ఏదో రకంగా ఓ పట్టు పట్టేస్తుంది. అబ్దురోజిక్సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్‌బాస్ 16 సీజన్లో పాల్గొన్న తజికిస్తానీ గాయకుడు అబ్దు రోజిక్ కూడా బర్గర్లంటే మహా ఇష్టం. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మొదటగా ఇష్టం లాగించేది బర్గర్‌నే అట. ఆయనకు ఓ రెస్టారెంట్ కూడా ఉంది. వరుణ్ ధావన్: ఫిట్నెస్ ఔత్సాహికుడు కూడా ఈ బర్గర్ తనకు బలహీనతగా పేర్కొన్నాడు. తన డైట్లో ఒక్కోసారి చీట్ చేసి మరీ ఈ బర్గర్‌ను ఇష్టంగా లాగిస్తానని చెబుతున్నాడు. ఆలియా..ఎంత ఫిటనెస్గా ఉండేలా స్ట్రిట్ డైట్ ఫాలో అయినా ఆనంద క్షణాల్లో మాత్రం బర్గర్‌ని ఆస్వాదించకుండా ఉండనని అంటోంది బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియ భట్. అంతేగాదు 2022లో రిలీజ్ అయ్యిన గంగూబాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినప్పుడు వెజ్ బర్గర్‌ని ఆస్వాదిస్తూ సక్సెస్‌ని ఎంజాయ్ చేసింది. ప్రియాంక చోప్రా జోనాస్ఫిట్గా ఉండే ప్రియాంక చోప్రా సైతం క్రిస్పీ ఫ్రైస్‌తో కూడిన పెద్ద బర్గర్ తినకండా ఉండలేనంటోంది. ఆమె 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నప్పుడు బర్గర్‌ని తింటూ ఆనందంగా ఆ క్షణాన్ని సెలబ్రెట్ చేసుకుంది.(చదవండి: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటున్నారా..?) -
Burger Idli Video: బర్గర్ ఇడ్లీ ట్రై చేశారా? డెడ్లీ బ్రో..వీడియో వైరల్
దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ. ఘీ ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబారు ఇడ్లీ ఇలా రక రకాలుగా ఆరంగించేస్తాం. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, శెనగపిండి చట్నీ, కారొప్పొడి నెయ్యితో కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒక కాంబినేషన్‌తో ఇడ్లీతింటే ఆ రుచే వేరు కదా. అయితే బర్గర్ ఎపుడైనా టేస్ట్ చేశారా? ఓ వ్యక్తి బర్గర్లా ఇడ్లీని తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్ ) ఈ వీడియోలో, పెద్ద ఇడ్లీనితయారుచేసి, దీన్ని రెండు భాగాలుగా అడ్డంగా కోశాడు. ఆ తర్వాత పెనం మీద నెయ్యిని చిలకరించి తరువాత కట్ చేసి పెట్టిన ఇడ్లీ భాగాలు రెండింటినీ పెట్టాడు. ఇందులో ఒకదానిపై స్కెజ్వాన్ సాస్, మయోన్నైస్ , టొమాటో గ్రీన్ చట్నీ,మసాలా దినుసులు ఒకదాని తరువాత ఒకటి వేశాడు. ఆ తరువాత బర్గర్ ఇడ్లీకి ఫిల్లింగ్‌గా ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, బీట్రూట్, తురిమిన చీజ్, క్యారెట్లు తురుము వేశాడు. మళ్లీ చీజ్ తురిమి, ఆ తరువాత రెండు ఇడ్లీని పైన అమర్చి, గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీ , మయోనైస్ జోడించాడు. చివరికి ప్లేట్లో బర్గర్ ఇడ్లీని, వేడి సాంబార్ గిన్నెతో పాటు కొబ్బరి, టొమాటో, గ్రీన్ చట్నీని అందించాడు. దీంతో నెటిజన్లు నెగిటివ్‌గా స్పందించారు. ‘సర్వనాశనం’ అంటూ ఇడ్లీ ప్రేమికులు బాధపడగా, డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ... డెడ్లీ డిష్ అంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతే చీజ్ వేస్తున్నాడు..ఉపా కేసుకింది అరెస్టు చేసి శిక్ష విధించాలి అంటూ ఫన్నీ కామెంట్ చేయడం గమనార్హం. (రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం) Idli Burger 😭😭😭 Idli ki MC BC 😭😭 Part 1 pic.twitter.com/a8H9lDwmBM — MG 🇮🇳 (Modi Ka Parivar) (@mgnayak5) March 29, 2024 -
ఫేక్ చీజ్ వార్తలను ఖండించిన ప్రముఖ సంస్థ.. కస్టమర్ల ఆరోగ్యానికే ప్రాధాన్యం..
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌పై రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మెక్‌డొనాల్డ్స్ తను తయారుచేస్తున్న బర్గర్లు, నగ్గెట్లలో చీజ్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించినట్లు ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో వెల్లడైంది. దాంతో సంస్థ స్పందిస్తూ వినియోగదారుల ఆరోగ్యమే తమకు ప్రధానమని చెప్పింది. మహారాష్ట్రలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్ల్లో చీజ్ వాడడంలేదంటూ చాలా వార్తలు వస్తున్నాయిని వాటిలో నిజం లేదంటూ తెలిపింది. కంపెనీ తయారుచేస్తున్న ఉత్పత్తుల్లో అధిక నాణ్యమైన చీజ్‌ను వినియోగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తమ ఉత్పత్తులు తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యను అధికారులకు వివరించినట్లు త్వరలో వారి తుది నిర్ణయాన్ని తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: ‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌ను అందించాలన్నదే తమ కంపెనీ లక్ష్యమని ప్రకటనలో చెప్పారు. సంస్థ ఎల్లప్పుడూ ఆహార ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఆహార చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హావభావాలతో ప్రత్యర్ధి ఆటగాళ్లను విరాట్ స్లెడ్జింగ్ చేయడం మనం చాలా సందర్బాల్లో చూశాం. అటువంటి కింగ్ ముందు దక్షిణాఫ్రికా యువ పేసర్ నండ్రీ బర్గర్ కుప్పిగంతులు వేశాడు. కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి తనదైన స్టైల్లో బర్గర్ కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు. ఏమి జరిగిందంటే? 14.2 ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మను బర్గర్ ఔట్ చేశాడు. రోహిత్ తర్వాత విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు దిగాడు. అదే ఓవర్లో విరాట్ ఎదుర్కొన్న తొలి బంతినే బర్గర్ గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. కోహ్లి కూడా బంతి అద్బుతంగా ఆడి డిఫెండ్ చేశాడు. ఆ బంతిని నాన్స్టైక్లో ఎండ్‌లో బర్గర్ అందుకున్నాడు. అయితే కోహ్లి క్రీజులో ఉన్నప్పటికీ బర్గర్ అత్యుత్సహం ప్రదర్శించాడు. అతడు బంతిని కోహ్లిపై విసురుతా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కోహ్లి మాత్రం నవ్వుతూ క్రీజులో నిలబడిపోయాడు. ఆ తర్వాత కోహ్లి తనదైన శైలిలో బర్గర్‌కు సమాధానం చెప్పాడు. అదే ఓవర్లో వరుసగా బౌండరీలు బాది అతడిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 46 పరుగులు చేశాడు. చదవండి: IND vs SA: ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఇదే pic.twitter.com/Wn37PpFsFt — Cricket Videos (@cricketvid123) January 3, 2024 -
రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..?
బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేది ఒకప్పటి మాట. కానీ చదువు అనంతరం మంచి బిజినెస్ ఐడియాతో కోట్లు గడించవచ్చనేది నేటి ట్రెండ్. చాలా మంది యువత మంచి బిజినెస్ ఐడియాతో తాము అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి సొంతంగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోట్లల్లో టర్నోవర్ చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో బిరాజా రౌత్ ఆయన 21వ ఏట సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకు బర్గర్లంటే చాలా ఇష్టం. ఒక మంచి భారతీయ బ్రాండ్ బర్గర్లను తయారు చేసి విక్రయించాలనే ఆలోచన వచ్చింది. దాంతో 2011లో తన టెక్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం రూ.20 వేలు పెట్టుబడితో చిన్నస్థాయిలో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. తొలుత తాను పనిచేసిన ఆఫీసు సమీపంలో రోడ్డుపై కియోస్క్ ఏర్పాటు చేసి బర్గర్లు అమ్మడం మొదలుపెట్టాడు. రౌత్ గతంలో పనిచేసిన కంపెనీలోని తన సహచర ఉద్యోగులు, మిత్రులు తొలుత కస్టమర్లుగా మారారు. ఆయన తయారుచేస్తున్న గ్రిల్డ్ బర్గర్ రుచి నచ్చటంతో సమీపంలోని కంపెనీల్లో పనిచేస్తున్న వారుసైతం ఆయన బిజినెస్‌కు కస్టమర్లుగా మారారు. దాంతో బెంగళూరులో రౌత్ తయారుచేస్తున్న బర్గర్ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. దాంతో అతడు ‘బిగ్గీస్ బర్గర్’ పేరుతో కొత్త బ్రాండ్‌ను సృష్టించి దాని ద్వారా తన వ్యాపారం సాగించాడు. అలా ఎలక్ట్రానిక్ సిటీలో అతడు వ్యాపారం ప్రారంభించిన చోటుకు నగరంలోని చాలా మంది కస్టమర్లు బర్గర్ రుచి చూసేందుకు వచ్చేవారు. ఇదీ చదవండి: ‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు అలా ఫుడ్ లవర్స్ మనసు గెలుచుకోవటంతో బిగ్గీస్ బర్గర్ క్రమంగా లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. 2023 నాటికి బిగ్గీస్ బర్గర్ కంపెనీ ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రౌత్ తన వ్యాపారాన్ని టైర్-2,3 నగరాలకు విస్తరించాలనే యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్గీస్ బర్గర్ 14 రాష్ట్రాల్లోని 28 నగరాల్లో 130 శాఖలను విస్తరించింది. 2024లో వీటి సంఖ్యను 350కి పెంచాలని చూస్తున్నారు. -
లండన్‌లో బర్గర్లు పంచిన ప్రిన్స్ విలియం.. దీనికి భారత్‌తో సంబంధం ఇదే..
బ్రిటన్‌లోని కొందరికి మొన్నటి ఆదివారం మరపురానిదిగా మిగిలిపోతుంది. ప్రిన్స్ విలియం లండన్‌లో ఒక ఫుడ్ ట్రక్ నుంచి పర్యావరణానికి హాని చేయని బర్గర్లను కొందరికి పంచిపెట్టారు. ఇది చూపరులను ఎంతగానో ఆశ్ఛర్యపరిచింది. వార్షిక ఎర్త్‌షాట్ పురస్కారాల పంపిణీలో భాగంగా గత ఏడాది విజేతలకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ‘ఎర్త్‌షాట్ బర్గర్ల’ను అందించారు. ఈ పురస్కారాలను పర్యావరణానికి విశేషమైన సేవలు అందించిన ఐదుగురికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ చానల్ సార్టెడ్ ఫుడ్‌లో షేర్ చేశారు. ఈ చానల్లో పర్యావరణ అనుకూలమైన వంటగది పరికరాలు, రకరకాల వంటకాల తయారీ విధానాలు కనిపిస్తాయి. వీడియో ప్రారంభంలో ప్రిన్స్ విలియం సార్టెడ్ ఫుడ్‌కు సంబంధించిన స్టూడియోకి చేరుకుంటారు. గత ఏడాది ఎర్త్‌షాట్ పురస్కార విజేతలు రూపొందించిన వాటిని ఒక వ్యక్తి పట్టుకుని ఉంటాడు. తరువాత బర్గర్ తయారు చేస్తుంటారు. ప్రిన్ ఆ డిష్ తీసుకుని జనం మధ్యలోకి చేరుకుంటారు. వీడియోలో ఫుడ్ ట్రక్ దగ్గర ప్రిన్స్ విలియం నిలుచుని, మీరు తినబోయే కంటైనర్‌ను నోట్‌ప్లా అనే కంపెనీ తయారు చేసిందని, దీనిలో ఎలాంటి ప్లాస్టిక్‌ను ఉపయోగించలేనది వినియోగదారులకు ఆయన చెప్పడాన్ని వినవచ్చు. ఈ కంటైనర్లకు సముద్రపు పాచితో తయారు చేస్తారు. బర్గర్‌లోని పదార్థాలను భారతదేశంలోని ఖేతీ అనే సంస్థ గ్రీన్హౌస్లలో ఉత్పత్తి చేసిందని ప్రిన్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. ముకూరు క్లీన్ స్టవ్‌పై బర్గర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. కెన్యాకు చెందిన ఓ మహిళ ఈ స్టవ్‌ను డిజైన్ చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ఉత్పాదన లక్ష్యం. ఇది కూడా చదవండి: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం -
ఆసీస్ క్రికెటర్ కోరికను తీర్చిన హర్షా బోగ్లే
హర్షా బోగ్లే.. పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ కామెంటేటరీకి పెట్టింది పేరు.. తన వాక్చాతుర్యంతో అభిమానులను కట్టిపడేయడం అతని స్పెషాలిటీ. తాజాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో హర్షా బోగ్లే కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రేస్ హారిస్ కోరికను హర్షా బోగ్లే నెరవేర్చాడు. మరి గ్రేస్ హారిస్ కోరిక ఏంటి.. ఆ కథేంటి అనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి. ఆర్సీబీతో తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రేస్ హారిస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాను బర్గర్‌ను చాలా మిస్సవుతున్నానని పేర్కొంది. గ్రేస్ హారిస్ మాటలు విన్నాడో ఏమో తెలియదు కానీ హర్షా బోగ్లే ఇవాళ ఆమెను సర్ప్రైజ్ చేశాడు. ఇవాళ(మార్చి 7న) యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు గ్రేస్ హారిస్ బెంచ్‌కే పరిమితమైంది. మ్యాచ్ మధ్యలో హర్షా బోగ్లే గ్రేస్ హారిస్ వద్దకు వచ్చి నీకిష్టమైన వస్తువు నా దగ్గర ఉంది.. ఇది నీకే అంటూ బర్గర్‌ను ఆమె చేతిలో పెట్టాడు. దీంతో నవ్వులో మునిగి తేలిన గ్రేస్ హారిస్ సంతోషంగా స్వీకరించి హర్షా బోగ్లేకు కృతజ్క్షతలు తెలిపింది. Grace Harris mentioned her craving for a burger during the press conference in the last match, and Harsha surprised her with one today. Looks like she has become everyone's favorite now. 🤣❤ pic.twitter.com/GDGV1gZvQu— Shivani Shukla (@iShivani_Shukla) March 7, 2023 -
రూ.10తో బర్గర్ షాప్‌లోకి పదేళ్ల పాప.. చిరునవ్వుతో బయటకు..!
నోయిడా: ప్రస్తుత కాలంలో బర్గర్లు, పిజ్జాలు అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాగే ఓ చిన్నారి బర్గర్ షాప్‌కు వెళ్లి బర్గర్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న రూ.10 నోటును తీసిచ్చింది. కానీ, ఆమె ఆర్డర్ చేసిన బర్గర్ ధర రూ.90. ఆ విషయం ఆ చిన్నారికి తెలియదు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఆ పాప బర్గర్ తింటూ చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఇంతకీ లోపల ఏం జరిగిందనే విషయాన్ని బర్గర్ కింగ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. నొయిడాలోని బొటానికల్ మెట్రో స్టేషన్‌కు దగ్గర్లోని బర్గర్ కింగ్ షాపులోకి 10 ఏళ్ల పాప వచ్చింది. తన పాకెట్లో ఉన్న రూ.10 అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది. అయితే, దాని ధర రూ.90 ఉన్నప్పటికీ అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారిని చూసి క్యాష్ కౌంటర్లోని వ్యక్తి మిగిలిన రూ.80 చెల్లించాడు. బర్గర్ అసలు ధర ఆ పాపకు చెప్పకుండానే కేవలం రూ.10కే బర్గర్‌ను తెప్పించి ఇచ్చాడు. దీంతో బర్గర్ అందుకున్న ఆనందంలో ఆ చిన్నారి చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న సోషల్ మీడియా యూజర్ అమాయకంగా బర్గర్ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి ఫొటో తీశారు. ఆ ఫోటోను లైఫ్ మెంబర్ అనే ట్విటర్లో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బర్గర్ కింగ్ సంస్థ యాజమాన్యం చిన్నారికి బర్గర్ అందించిన ఉద్యోగి ధీరజ్ కుమార్‌గా గుర్తించింది. తమ షాపులోకి వచ్చిన చిన్నారి పట్ల ధీరజ్ ప్రవర్తించిన తీరుకు ప్రశంసలు కురిపించింది. అంతే కాదు ఆ వ్యక్తిని సన్మానించింది. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది బర్గర్ కింగ్ ‘ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మా నోయిడా బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రెస్టారెంట్లో పని చేస్తున్న ధీరజ్ కుమార్ తన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్నారు.’ అంటూ జరిగిన సంఘటనను గుర్తు చేసుకూంటూ పలు ఫోటోలు షేర్ చేసింది. #WorldFoodDay2022 पर मेरी नज़र में इससे खूबसूरत तस्वीर और नही हो सकती.. काउंटर स्टाफ के सुनहरे भविष्य की हार्दिक शुभकामनाएं 💖💐@anandmahindra@IAmSudhirMishra @News18India @RandeepHooda @BurgerKing ...👌👌👍💐 pic.twitter.com/RcAp3cKR7R — Life Member (IFTDA) (@Life_Mem_IFTDA) October 19, 2022 This #WorldFoodDay, Dheeraj Kumar, working at our Noida Botanical Garden Metro Station restaurant, has inspired us all with his beautiful act of kindness. We had a very special guest who walked into our restaurant asking for a #burger but had only ₹10 with her. (1/3) pic.twitter.com/89oXh07sOB — BurgerKingIndia (@burgerkingindia) October 20, 2022 ఇదీ చదవండి: యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ యూనివర్సిటీ నోటీసులు -
రేప్ కేసు రద్దు.. మాజీ భర్తకు వెరైటీ శిక్ష
ఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టుకెక్కింది ఓ మహిళ. అయితే.. చివరికి ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే యత్నం చేశారు. మరి తమ విలువైన సమయాన్ని వృథా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే విచిత్రమైన ఓ శిక్ష విధించింది. నోయిడా, మయూర్ విహార్‌లో బర్గర్ సింగ్, వాట్ ఏ బర్గర్ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్ రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడతను. అయితే.. వైవాహిక బంధంలో తన భర్త శారీరకంగా, మానసికంగా తనను హింసించాడంటూ 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండేళ్లపాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా.. జులై4వ తేదీన న్యూఢిల్లీ సాకేత్ కోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్ఐఆర్ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే.. ఈ పరిణామంపై జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమాయాన్ని వృథా చేశారు. ఈ వ్యవధిలో ఎన్నో కీలక అంశాలను చర్చించే వాళ్లం. కాబట్టి, పిటిషనర్ కచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు.. అతనిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటే అనాథలకు బర్గర్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాథశ్రమాలను ఎంచుకుని వంద మంది దాకా అనాథలకు బర్గర్ అందించాలని ఆ వ్యక్తిని ఆదేశించింది కోర్టు. పైగా శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అంతేకాదు.. మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాథలకు బర్గర్లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
బర్గరే బంగారమాయేగా!
-
100 కోట్ల క్లబ్లో అలియా చిత్రం.. ఎలా ఎంజాయ్ చేస్తుందంటే ?
Alia Bhatt Celebrates Gangubai Kathiawadi Success With Burger And Fries: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతియవాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషీ అతిథి పాత్రల్లో సందడి చేశారు. అయితే మాఫీయ క్వీన్, వేశ్య పాత్రలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌తో అలరించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్.. ఇటీవలే ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కి అతిపెద్ద ఓపెనింగ్స్ ఇచ్చిన మూడో చిత్రం గంగూబాయి కతియవాడి. అయితే ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది అలియా భట్. అది ఎలా అంటే.. ఒక బర్గర్, ఫ్రైస్ తింటూ ఎంజాయ్ చేసింది అలియా భట్. ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో గురువారం (మార్చి 10) షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో '100 కోట్ల మార్క్ దాటినందుకు శుభాకాంక్షలు గంగూబాయి, వేగన్ బర్గర్ + ఫ్రైతో అలియాకు శుభాకాంక్షలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అని క్యాప్షన్ రాసింది. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
గ్లాసులో బర్గర్.. ఎలా తినాలి గురూ..
ప్రతి రెస్టారెంట్ మెనూలో కామన్‌గా కనిపించే ఐటమ్.. బర్గర్. చికెన్, మటన్, వెజిటబుల్.. భిన్న రుచుల్లో, నచ్చిన వెరైటీలో దొరుకుతుంది. సాధారణంగా బర్గర్లను ట్రేలలో సర్వ్ చేస్తారు. అదే ట్రేలో సైడ్ డిషెస్గా చిప్స్ కానీ, ఫ్రైస్ కానీ ఉంటాయి. ఇది రొటీన్. కానీ వెరైటీగా ట్రై చేద్దామనుకున్నారో ఏమో రెడిట్ రెస్టారెంట్ వాళ్లు బర్గర్‌ను చక్కగా ఒక గ్లాస్లో సర్దేశారండీ!! దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో మొత్తం బర్గర్ అంతా ఒక గ్లాస్లో స్టఫ్ చేసి ఉండటం మనం చూడొచ్చు. బర్గర్ తయారీకి ఉపయోగించే పదార్థాలు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ దానిని పేర్చిన విధానం మాత్రం వింతగా ఉంది. గ్లాస్ అడుగుభాగంలో బ్రెడ్ ముక్కలు పేర్చి, ఆపైన చీజ్ సాస్‌లతో వెజిబటుల్స్ను అమర్చారు. ఇదే పద్ధతిని గ్లాస్ పై భాగం వరకు అనుసరించారు. అన్నింటికంటే పైన నువ్వులతో ఉన్న బ్రెడ్‌ను పెట్టారు. (చదవండి: రికార్డుల్లోకి బర్గర్.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?) ఇక్కడ బర్గర్‌ని వెరైటీగా సర్వ్ చేస్తుండటంతో కస్టమర్లు సదరు రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. ఇలా గ్లాస్లో బర్గర్‌ని సర్వ్ చేస్తే ఎలా తినాలని కొందరు కస్టమర్లు ప్రశ్నించగా.. మరికొందరు మామూలు పద్ధతిలో ఎందుకు సర్వ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా బాగానే ఉందని ఇంకొందరు కామెంట్ చేశారు. తినడం సంగతి ఎలా ఉన్నా ఫోటోతో ఈ బర్గర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చదవండి: వైరల్: వాటిని తినకుండా 17 ఏళ్లు దాచింది! -
రికార్డుల్లోకి బర్గర్.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?
ఏ పని చేసినా కాస్త కళా పోషణ.. ప్రత్యేకత ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ కోవలోకే చెందుతాడు రాబర్ట్ జాన్ డీ వీన్. ఇంతకీ ఆయనెవరు..? అంత ప్రత్యేకమైన పని ఏం చేశాడు? సాధారణంగా బర్గర్ అంటే ఏ వందో రెండొందలో ఉంటుంది. ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లలో అయితే రూ.500 వరకు ఖరీదు ఉంటుంది. మరి ఈ ఫొటోలో ఉన్న బర్గర్ ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.4.5 లక్షలు. ఏంటీ అంత చిన్న బర్గర్‌కు అంత ఖరీదా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ప్రత్యేకతే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన బర్గర్‌గా రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. డీ డాల్టన్ అనే డచ్ రెస్టారెంట్ యజమాని అయిన రాబర్ట్‌కు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించాడు. వెంటనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ అని ఇంటర్నెట్లో వెతకగా, 2011లో 352 కిలోలతో ఓరేగాన్ రెస్టారెంట్ తయారు చేసిన బర్గర్‌కు దాదాపు రూ.3,72,432 రికార్డు ధర పలికినట్లు తెలుసుకున్నాడు. దీని కన్నా ఖరీదైన బర్గర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎక్కు వ బరువుతో చేస్తే ఆహారపదార్థాలు చాలా వ్యర్థం అవుతా యని భావించాడు. పైగా ఒక్కరే తయారుచేసేలా, ఒక్కరే ఆ బర్గర్‌ను ఆరగించేలా ఉండాలని తనకు తాను షరతు విధించుకున్నాడు. దాంతో ఖరీదైన పదార్థాలతో తయారు చేయాలనుకుని, బర్గర్ కోసం వాడే రొట్టె (బన్)ను బంగారు పూతతో పూసి, రొట్టెల మధ్య ఉంచే పదార్థాలను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటిని ఉంచాడు. దీంతో ఈ బర్గర్ ఖరీదు అమాంతంగా పెరిగిపోయి అత్యంత ఖరీదైన బర్గర్‌గా రికార్డులు తిరగరాసింది. దీనికి రాబర్ట్ ముద్దుగా పెట్టుకున్న పేరు గోల్డెన్ బాయ్..! -
వైరల్: వాటిని తినకుండా 17 ఏళ్లు దాచింది!
వాషింగ్టన్ : మనం తినడానికి ఏదైనా కొంటే ఏం చేస్తాం?.. వాటిని మర్చిపోకుండా.. వీలైనంత తొందరగా తినేస్తాం. కానీ, వాటిని అల్మారాలో దాచిపెట్టి ప్రతిరోజూ వాటివంక చూస్తూ కూర్చోం. అయితే, ఓ మహిళ మాత్రం తినడానికి తెచ్చుకున్న బర్గర్, ఫ్రైస్‌లను తినకుండా కొన్నేళ్ల పాటు దాచిపెట్టింది. తాజాగా వాటిని బయటకు తీసి టిక్‌టాక్ సెలెబ్రిటీ అయిపోయింది. వివరాలు.. అమెరికాకు చెందిన ఓ మహిళ 2004లో మెక్‌డొనాల్డ్ చీజ్ బర్గర్, ఫ్రైస్ కొని ఇంటికి తెచ్చుకుంది. అయితే వాటిని తినకుండా.. పైన కవరు కూడా తీయకుండా అట్టే దాచిపెట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు! ఏకంగా 17 ఏళ్లు దాచింది. ఆమెతో పాటు ఇతరులు కూడా వాటి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి తెగ ఆసక్తి చూపేవారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆమె వాటిని తెరిచి చూడటానికి నిశ్చయించుకుంది. వాటిని కవరులోంచి బయటకు తీసింది. బర్గర్ బాగా ముడుచుకుపోయి గట్టిగా తయారయింది. లోపలి పదార్ధం పీనట్ బటర్‌ను తలపిస్తోంది. ఇక, ఫ్రైస్ తాజాగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆమె కూతురు సవానా వైట్‌హెడ్ ఈ దృశ్యాలను వీడియో తీసి తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ఆ ఆహారానికి నా అంత వయసుంది’’.. ‘‘ ఇంకా నయం వాటిని తింటాననలేదు’’.. ‘‘ ఓల్డ్ను గోల్డ్ చేశారు కదు తల్లీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : హఠాత్తుగా అమ్మాయి 50 ఏళ్ల మగాడిగా మారింది! -
దీన్ని 20 నిమిషాల్లో తింటే రూ.90 వేలు మీవే!
లండన్: ఇంట్లో వంట తినీతినీ బోర్ కొడుతుందనేవారికి వారికి ఇది తప్పకుండా నోరూరించే వార్త. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టేక్ అవే రెస్టారెంట్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. వాళ్లు తయారు చేసిన ఓ బర్గర్‌ను 20 నిమిషాల్లో తినేస్తే.. రూ.93 వేలు ఇస్తారట. అయితే ఆ బహుమానం నగదు రూపేణా కాదండోయ్.. ఫుడ్ వోచర్ ద్వారా! మరి అంత పెద్ద మొత్తంలో ఆఫర్ ప్రకటించారంటే బర్గర్‌కూ ఓ ప్రత్యేకత ఉంటుందిగా. మరేం లేదు.. ఆ బర్గర్ మిగతా వాటి కన్నా పెద్దదిగా అంటే సుమారు 14 ఇంచులుండటమే కాక రెండు కిలోల బరువుంది. సాధారణంగా అయితే ఇది పదిమందికి సులభంగా సరిపోతుందంటున్నారు ఆ రెస్టారెంట్ యజమాని యునుస్ సెవినిక్. లాక్‌డౌన్‌తో ఎంతో నష్టపోయామని, భోజన ప్రియులను ఆకర్షిస్తూ తిరిగి రెస్టారెంట్‌కు మునుపటి వైభవం తెచ్చేందుకు ఈ ఆఫర్ ప్రకటించామని ఆయన పేర్కొన్నాడు. (హలీమ్.. వియ్ వాంట్ యూ..) అయితే ఆ బర్గర్ ధర కూడా తక్కువేమీ కాదు. మూడు వేల పైచిలుకే ఉంది. దీని గురించి యునుస్ మాట్లాడుతూ.. "నా రెస్టారెంట్లో కాస్త ధరలు ఎక్కువగా ఉన్నాయని కొందరంటున్నారు. నిజమే, ఎందుకంటే నేను చవక సరుకులు తీసుకురాను. పైగా ఇంట్లో సొంతంగా తయారు చేస్తా"నని చెప్పుకొస్తున్నాడు. కాగా కరోనా కట్టడికిగానూ మున్ముందు కూడా భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించక తప్పని పరిస్థితి. దీంతో రెస్టారెంట్లు కొత్త ఆలోచనలతో మరింత వినూత్నంగా సిద్ధమవుతున్నాయి. బ్యాంకాక్‌లో ఓ రెస్టారెంట్.. కస్టమర్లు ఒంటరిగా భోజనం చేస్తున్నారన్న అనుభూతి చెందకుండా ప్రతీ టేబుల్ దగ్గర పాండా బొమ్మలను పెట్టి ఉంచారు. సిడ్నీలోనూ ఓ చోట మనుషుల ఆకృతిలో అట్ట బొమ్మలను తయారు చేయించి కస్టమర్లు కూర్చునే చోట పెట్టారు. (లాక్డౌన్ సడలింపులు : అమెజాన్ గుడ్ న్యూస్) -
చికెన్ బర్గర్లో మెటల్ రాడ్ ప్రత్యక్షం..
మెల్బోర్న్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం తయారుచేసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడని జనం రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇన్స్టంట్ ఫుడ్‌పై నెట్టుకొస్తూ ఏదో తినేశామనిపిస్తున్నారు. రెస్టారెంట్లు సైతం సమయానికి డెలివరీపై దృష్టిసారించడమే కానీ ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేదు. మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను ఆర్డర్ చేస్తే నాణ్యత లేని ఆహారం తమ తలుపు తట్టిన తీరును ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ మహిళ ఫేస్బుక్ పోస్ట్‌లో వాపోయారు. చికెన్, చీజ్‌కు ఆర్డర్ ఇస్తే చికెన్ బర్గర్లో మెటల్ రాడ్ ఉందని ఆద తిప అనే మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తన మూడేళ్ల మేనకోడలు ఈ ఆర్డర్ చేసింని, తనకు ఇంకా ఈ చికెన్ బర్గర్ ఇవ్వకపోవడం మంచిదైందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పెద్దసంఖ్యలో నెటిజన్లు రెస్టారెంట్ నిర్వాకంపై మండిపడ్డారు. చదవండి : ఉద్యోగినితో ఎఫైర్ : మెక్‌డొనాల్డ్ సీఈవోపై వేటు -
పదేళ్లయినా పాడవని బర్గర్!
రేక్జవిక్ : బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? మహా అయితే రెండ్రోజులు. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ఏకంగా పదేళ్లయినా పాడవలేదు! ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఇది చదవండి. బర్గర్లు, పీజాల తయారీలో ప్రసిద్ధి చెందిన మెక్‌డొనాల్డ్ కంపెనీ ఐస్లాండ్లో 2009లో తన చివరి అవుట్‌లెట్‌ను మూసివేసింది. అయితే, చివరగా హిజోర్టర్ స్మెర్సెన్ అనే వ్యక్తి ఆ షాప్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్, ఓ బర్గర్ కొన్నాడు. అయితే అతను ఈ వాటిని తినేందుకు బదులు, మెక్‌డొనాల్డ్ గుర్తుగా అలానే ఉంచుకోవాలనుకున్నాడు. మొదట్లో అతను వీటిని తన దగ్గర నిల్వ చేశాడు. తరువాత నేషనల్ మ్యూజియంకు అప్పగించాడు. ఇప్పుడు వాటిని ఒక హోటల్లో భద్రపరిచారు. అయితే, సుమారు పదేళ్లయినా ఇప్పటికీ అవి తాజాగా ఉన్నాయి. దీని గురించి తెలుసుకున్న వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. కాగా వీటి గురించి ఫుడ్సైన్స్కు చెందిన ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ తేమ ఏమాత్రం లేనందునే అవి తాజాగా ఉన్నాయని అన్నారు. -
బర్గర్ తిని.. రక్తం కక్కుకున్నాడు
ముంబై : ఓ వ్యక్తి బర్గర్ తిని రక్తం కక్కుకున్న సంఘటన గత బుధవారం పుణేలో చోటు చేసుకుంది. వివరాలు.. సజీత్ పఠాన్ అనే వ్యక్తి(31) తన స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి గాను సమీప ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న బర్గర్ కింగ్ ఔవుట్‌లెట్‌కి వెళ్లాడు. అనంతరం సజీత్ ఓ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ వచ్చిన తర్వాత బర్గర్ తీసుకుని కాస్తంత తిన్నాడు. వెంటనే ఉక్కిరిబిక్కిరి అవ్వడమే కాక రక్తం కక్కున్నాడు. గొంతు నొప్పితో విలవిల్లాడాడు. దాంతో సజీత్ తెప్పించుకున్న బర్గర్‌ని పరిశీలించగా.. దానిలో పగిలిన గ్లాస్ ముక్కలు కనిపించాయి. వెంటనే సజీత్ స్నేహితులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న స్టోర్ యజమాన్యం.. అప్పటికప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సజీత్‌కు రూ. 15 వేలు చెల్లించింది. మరుసటి రోజు అంతకు రెట్టింపు డబ్బులు ఇచ్చి.. ఈ విషయం బయటకు చెప్పవద్దని కోరింది. దీని గురించి ఔట్లెట్ మానేజర్ని ప్రశ్నించగా.. తనకు ఈ విషయం గురించి తెలీదని.. ఆ రోజు సెలవులో ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం సజీత్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందన్నారు డాక్టర్లు. అతని శరీరంలోకి చేరిన గ్లాస్ ముక్క అదే బయటకు వస్తుందని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అవి రాగానే బర్గర్ కింగ్ ఔట్లెట్ మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జంక్‌ఫుడ్ ఎందుకు తినకూడదంటే..?
టీనేజీ పిల్లల క్రేజ్ అంతా జంక్‌ఫుడ్డే. అలా నిలబడి త్వరత్వరగా తినడానికి అది అనువుగా ఉంటుంది. చేతికేమీ అంటకుండా ఫ్రెండ్స్ అంతా కలిసి తినేయడానికి వీలుగానూ ఉంటుంది. అందుకే టీనేజీ పిల్లలు వాటిని ఎగబడి తింటుంటారు. పిజ్జా, బర్గర్, పఫ్స్ వంటివాటికి ప్రాణం పెడుతుంటారు. కానీ వాటి గురించి టీనేజ్ పిల్లలకు కాస్త అవగాహన కల్పిస్తే వారు వీటికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆ వయసు లో వారిలో శారీరకంగా ఎదుగుదల కనిపిస్తుంది. మానసిక వికాసం చోటు చేసుకుంటూ ఉంటుంది. వారికి వ్యక్తిత్వ నిర్మాణమూ కొనసాగుతుంటుంది. వీటన్నింటినీ జంక్‌ఫుడ్ దెబ్బకొడుతుంది. జంక్‌ఫుడ్‌తో అనర్థాలివే... బేకరీ ఐటమ్స్, పిజ్జా, బర్గర్, బాగా పాలిష్ చేసిన ధాన్యాలతో తయారు చేసే పదార్థాలు వంటి జంక్‌ఫుడ్ ఎందుకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయో తెలుసుకుంటే, వాటి నుంచి దూరంగా ఎందుకుండాలో కూడా తెలుస్తుంది. ఫైబర్ చాలా తక్కువ : జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో పీచుపదార్థాల (ఫైబర్) భూమిక ఎంతో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, క్యాన్సర్‌ను నివారించడం, మలబద్దకాన్ని దూరం చేయడానికి పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. అయితే జంక్‌ఫుడ్‌లో మాత్రం ఆహారాన్ని పేగుల్లో సాఫీగా కదిలేలా చేసే పీచుపదార్థాలు చాలా తక్కువగా ఉంటుంది. ∙హానికారక ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ: జంక్‌ఫుడ్ చాలా కాలం పాటు నిల్వ ఉండటానికి వీలుగా వాటి తయారీకి హైడ్రోజెనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కాని వాటి వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ∙చెడు కొవ్వులూ ఎక్కువే : రుచి పెరగడానికి వాడే కొన్ని కొవ్వు పదార్థాల వల్ల... ఈ ఆహారం కారణంగా ఒంట్లో చాలా త్వరగా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ పేరుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ ∙దీర్ఘకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉప్పు ఎక్కువగా వాడతారు. అది భవిష్యత్తులో హైపర్‌టెన్షన్ (హైబీపీ) వంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. -
వాలెంటెన్స్ డే స్పెషల్ బర్గర్, ధరెంతంటే...
వాలెంటెన్స్ డేకి మీ ప్రియమైన వారిని బయటికి తీసుకెళ్లి, డిన్నర్ ఇప్పించాలని అనుకుంటున్నారా? అయితే వారి కోసం అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఓ రెస్టారెంట్ ఎక్స్ట్రా-స్పెషల్ వాలెంటెన్స్ డే డిన్నర్ ఐడియాను ఆఫర్ చేస్తోంది. గోల్డ్, డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్‌తో కూడిన బర్గర్‌ను వినియోగదారులకు అందించనున్నట్టు తెలిపింది. దీని ధరను కూడా భారీగానే నిర్ణయించింది. 3వేల డాలర్లు అంటే సుమారు రూ.2 లక్షలకు ఈ బర్గర్‌ను ఆఫర్ చేస్తోంది. ''ఈ వాలెంటెన్స్ డేకి కేవలం 3వేల డాలర్లకు బిగ్ బాయ్ బర్గర్‌ను మీరు పొందవచ్చు. మీ ప్రియమైన వారికి ఈ వాలెంటెన్స్ రాత్రి ప్రపోజ్ చేసేందుకు వీలుగా ఎంగేజ్మెంట్ రింగ్‌తో దీన్ని ఆఫర్ చేస్తున్నాం'' అని ఫేస్బుక్ పోస్టు ద్వారా పౌలిస్ నార్త్ఎండ్ తెలిపింది. ఈ పోస్టులో బర్గర్ ఫోటోను కూడా ట్యాగ్ చేసింది. ఎంగేజ్మెంట్ రింగ్‌తో పాటు బర్గర్‌కు పక్కనే ప్రైస్ కూడా ఉన్నాయి. అయితే 48 గంటల ముందే ఈ బర్గర్‌ను ఆర్డర్ చేసుకోవాలని రెస్టారెంట్ తెలిపింది. స్థానిక రిపోర్టుల ప్రకారం ఎంగేజ్మెంట్ రింగ్ 7/8 క్యారెట్ ఉంటుందని, కే జువెల్లర్స్ నుంచి దీన్ని వినియోగదారులకు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఆ బర్గర్ ఖరీదు 10వేల డాలర్లు
బర్గర్ ఖరీదు సాధారణంగా ఓ 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉండొచ్చు. కానీ దుబాయ్ లో ఓ బర్గర్ మాత్రం ఏకంగా 10వేల డాలర్ల ఖరీదు పలికింది. అంటే దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 6,55,505 అన్నమాట. జ్యూసీ బర్గర్ కోసం నిర్వహించిన చారిటీ ఆక్షన్ లో దుబాయ్ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ విల్లా వ్యవస్థాపకుడు అస్మా అల్ ఫహిమ్ 10వేల డాలర్లకు దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ బర్గర్ లో యూనిటెడ్ అరబ్ ఎమిరెట్స్ లోని ఏడు ఎమిరెట్స్ కు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏడు గొడ్డు మాంసం ముక్కులుంటాయి. దీన్ని దుబాయ్ గాలెరీస్ లఫెట్టేకి చెందిన కలినరీ డైరెక్టర్ రస్సెల్ ఇంపియాజి, ఖత్తర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సభ్యుడు షేక్ మొహమ్మద్ బిన్ అబ్దులాహ్ అల్ థానీ తయారుచేశారు. రెండేళ్ల క్రితం నిర్వహించిన వేలంలో ఈ బర్గర్ 7వేల డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ ఏడాది దీన్ని ధర మరింత పెరిగింది. పింక్ క్యారవాన్ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా సేకరించిన నగదును బెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి వాడుతుంటారు. ఈ బర్గర్ తో పాటు మరికొన్ని డిషెస్ కూడా వేలానికి వచ్చాయి. మొత్తంగా 29,633 డాలర్లను ఈ సంస్థ సేకరించింది. -
బర్గర్ తెచ్చిన తంటా !
ఆలస్యంగా డెలివరీ చేశాడని తిరస్కరణ కక్షగట్టిన డెలివరీ బాయ్ కాల్‌గర్ల్ అంటూ వాట్సాప్‌లో కస్టమర్ ఫోన్ నంబర్ చివరకు ఊచలు లెక్కబెడుతున్న యువకుడు బొమ్మనహళ్లి (బెంగళూరు) : ఆన్లైన్ లో బుక్ చేసిన బర్గర్‌ను ఆలస్యంగా డెలివరీ చేయడంతో నిరాకరించిన మహిళపై కక్ష పెంచుకుని ఆమె ఫోన్ నెంబర్‌ను వాట్సాప్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా ప్రచారం చేసిన ఓ బర్గర్ డెలివరీ బాయ్ ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. నిందితుడు శ్రేయస్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఇక్కడి జేపీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు.... ఈనెల 8న నగరానికి చెందిన ఓ యువతి ఆన్లైన్లో బర్గర్ ఆర్డర్ చేసింది. దానిని రాత్రి పది గంటల సమయంలో డెలివరీకి తీసుకు రావడంతో ఆమె నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి ఆమె కక్ష పెంచుకున్న డెలివరీ బాయ్ శ్రేయస్ సదరు యువతి ఫోన్ నెంబర్ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి కాల్గర్స్గా ప్రచారం చేశాడు. దీంతో తరచూ ఆ యువతికి అభ్యంతర ఫోన్‌కాల్స్ వస్తుండటంతో ఆమె ఫోన్ సిచ్చాఫ్ చేసి జేపీ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి శ్రేయస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.