cabinet sub committee
-
సమీక్షలు పూర్తి.. నిర్ణయమే తరువాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం మేరకు ఉద్యోగుల కేటాయింపులపై వచి్చన వినతుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన పూర్తయింది. వినతులపై పలుమార్లు సమీక్షలు నిర్వహించడంతో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి సూచనలు పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికను ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి సమరి్పంచింది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం ఉద్యోగుల కేటాయింపులు జరిపేందుకు జీవో 317ను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల కేటాయింపులు జరిపాయి. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్లలోని ఉద్యోగులను జీవో 317 ప్రకారం కేటాయించారు.అయితే స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా కేటాయింపులు జరపడంతో తీవ్రంగా నష్టపోయామనే భావనతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు న్యాయపోరాటానికి దిగారు. దీంతో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో జీవో 317 బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి రావడంతో దీనిపై ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు.ఈ కమిటీ ప్రభుత్వ శాఖలతో పలుమార్లు సమావేశమైంది. అదేవిధంగా ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించింది. వాటిని ఆయా శాఖలకు పంపడంతో పాటు, సమస్యాత్మకంగా లేని వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినవి, కొన్ని ఇతర స్థాయిలోనివి మినహా మిగిలిన దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలతో నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు.. ముఖ్యమంత్రికి సమర్పించారు.ఆ మూడు కేటగిరీలకు ఉపశమనం! ముడు కేటగిరీల్లోని ఉద్యోగులకు సత్వర ఉపశమనం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. స్పౌజ్, పరస్పరం (మ్యూచువల్), అనారోగ్య సమస్యల కేటగిరీలకు సంబంధించినవి దాదాపు 4 వేల వరకు దరఖాస్తులు ఉండగా.. వాటన్నింటినీ పరిష్కరించాలని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారం, పదిరోజుల్లో ఈ మూడు కేటగిరీల వారికి ఉపశమనం లభించనుంది. ఇక స్థానికత విషయంలో పలు అభ్యంతరాలు వచ్చాయి. అయితే కొత్త జిల్లాల నేపథ్యంలో జరిగిన మార్పులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, వారి స్థానికతను కూడా నిర్ధారించాలని సూచించినట్లు తెలిసింది. మిగిలిన కేటగిరీలకు సంబంధించి పలు సూచనలు కూడా చేసినట్లు సమాచారం. వెబ్‌పోర్టల్‌కు వచ్చిన దరఖాస్తులన్నీ సంబంధిత ప్రభుత్వ శాఖలకు అందగా.. వాటిని ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించి కేటగిరీల వారీగా విభజించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. కాగా ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
TG: మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. చర్చించే అంశాలివే
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 16వ తేదీన మరోసారి భేటీ కానుంది. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఈ నెల 11 నుంచి 16 వరకు అన్ని జిల్లాలో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.రోజుకు మూడు సమావేశాలు చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. 5 ఎకరాల కటాప్ పెట్టాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించనున్నారు. 92 శాతం చిన్న, సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నారని మంత్రివర్గానికి అధికారుల నివేదిక అందజేసినట్లు సమాచారం.గత ప్రభుత్వంలో రైతు బంధు, నిధుల విడుదలలో రూ. 26 వేల కోట్లు దుర్వినియోగానికి గురి అయినట్లు సబ్ కమిటీకి వ్యవసాయ శాఖ అధికారులకు నివేదిక అందజేశారు. ఇప్పటికే రైతు నివేదికల ద్వారా తీసుకున్న రైతుల అభిప్రాయాన్ని సబ్ కమిటీ ముందు అధికారులు పెట్టారు. రాష్ట్రంలో సాగు భూమి లెక్కలను మంత్రివర్గానికి అధికారులు అందించనున్నారు. -
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. భేటీ అనంతరం.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించామన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు రూ.3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని సజ్జల వెల్లడించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఉద్యోగులకు చెందిన పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం. ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 లోపల చెల్లిస్తాం. అందరి ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు చేస్తాం. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ ఎరియర్స్ అన్నీ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. చదవండి: APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు -
జగనన్న భూహక్కు-భూరక్షపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం భేటీ అయింది. సబ్ కమిటీలోని సభ్యులుగా ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి జగన్న భూరక్ష-భూహక్కు పథకం ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రమే ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని అన్నారు. సీఎం వైస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఇప్పటి వరకు 4.3 లక్షల సబ్ డివిజన్ లలో సుమారు 2 లక్షల మ్యూటేషన్ లను పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది మే నెల నాటికి 6వేల గ్రామాలు, ఆగస్టు నెల నాటికి 9వేల గ్రామాలు, అక్టోబర్ నాటికి 13వేల గ్రామాలు, డిసెంబర్ నాటికి మొత్తం 17,461 గ్రామాలకు భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు 5264 గ్రామాల్లో డ్రోన్ ద్వారా చిత్రాలను రికార్డు చేయడం జరిగిందని, జూన్ 2023 నాటికి 4006 గ్రామాలకు ఓఆర్ఐ మ్యాప్‌లను సిద్దం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే 3191 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, 2464 గ్రామాలకు గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశారని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. అలాగే భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే ఇప్పటికే సర్వే కోసం 30 అత్యాధునిక డ్రోన్లు, 70 బేస్ స్టేషన్లు, 1330 జిఎన్ఎస్ఎస్ రోవర్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, మ్యాప్ లను సిద్దం చేయడం, వెరిఫికేషన్, నోటీసుల జారీ చేయడం, వివాదాలను పరిష్కరించడం, సర్వే రాళ్లను నాటడం దశలవారీగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సమావేశంలో సీపీఎల్ఎ జి.సాయిప్రసాద్, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పోరేషన్ చైర్మన్ సౌరబ్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్న ప్రైవేటు స్కూళ్లకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొన్ని స్కూళ్లు ఏటా ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచుతున్న నేపథ్యంలో దీని నియంత్రణకు 11 మంది మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసినట్లు తెలిసింది. కొన్ని షరతులకు లోబడి ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకొనే అధికారాన్ని ఆయా ప్రైవేటు స్కూళ్లకే ఇవ్వాలని ఇటీవలి సమావేశంలో ఉపసంఘం అభిప్రాయపడ్డట్లు తెలియవచ్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ బిల్లు తీసుకొచ్చే వీలుందని సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వ వర్గాలు రూపొందిస్తున్నాయి. ఇటీవలి మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఎజెండాలోని అంశాలు తాజాగా బయటకొచ్చాయి. దీనిప్రకారం ప్రైవేటు స్కూళ్ల జమాఖర్చులనే ఫీజుల పెంపులో కొలమానంగా తీసుకోవాలనే షరతు ప్రభుత్వం విధించనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు... – స్కూల్ స్థాయిలో యాజమాన్యం సూచించే వ్యక్తి చైర్మన్‌గా, ప్రిన్సిపల్, టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, ఒక మైనారిటీ, మరో ఇద్దరు ఇతరులతో కమిటీ ఏర్పాటు చేయాలి. – ఫీజు పెంచే సంవత్సరంలోని జమాఖర్చులను ఈ కమిటీలో చర్చించాలి. ముఖ్యంగా ఆడిట్ రిపోర్టును ప్రామాణికంగా తీసుకోవాలి. – జమాఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ కేవలం డిజిటల్ విధానంలోనే జరగాలి. అప్పుడే దాన్ని విశ్వసనీయమైన లెక్కలుగా పరిగణించాలి. – ఈ తరహా లెక్కలు చూపడంలో స్కూల్ కమిటీ విఫలమైతే రాష్ట్ర స్థాయి కమిటీ దీన్ని పరిశీలించి, ఫీజు పెంచాలా? వద్దా? అనేది నిర్ధారిస్తుంది. – రాష్ట్రస్థాయి కమిటీలో ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి, పాఠశాల విద్య డైరెక్టర్ లేదా కమిషనర్, ప్రభుత్వం సూచించిన విద్యారంగ నిపుణులు ఉంటారు. అంతిమంగా ఈ కమిటీ ఎంత ఫీజు పెంచాలనేది నిర్ణయిస్తుంది. ప్రతిపాదిత చట్టంలోనూ ఇదే నిబంధన! ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని వేసింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మునుపెన్నడూలేనట్లుగా 11 మందిని చేర్చారు. కేబినేట్లో ఉన్న మంత్రుల్లో సగానికిపైగా ఈ కమిటీలో ఉండటం గమనార్హం. షరుతులతో ఫీజుల పెంపునకు ఇంత మంది మంత్రులు ఏకాభిప్రాయం తెలిపిన నేపథ్యంలో ఇదే చట్ట రూపంలో రాబోయే వీలుందని పలువురు భావిస్తున్నారు. -
‘వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి’
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. లక్షలాదిమంది పేదల మేలు కోసమే వన్‌టైం సెటిల్మెంట్ స్కీం తీసుకువచ్చామని తెలిపారు. వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. పథకం అమలులో సాదకబాధకాలను కూలంకషంగా పరిశీలించాలని తెలిపారు. 1980-2011 వరకు ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు విడిపించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పేదల ఇళ్లపై వారికే పూర్తి హక్కు వస్తుందని పేర్కొన్నారు. తమ తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్(రిజిస్ట్రేషన్స్&ఎక్సైజ్) రజత్ భార్గవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(హౌసింగ్) అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ(ల్యాండ్,ఎండోమెంట్స్ &డీఎం- రెవెన్యూ) వి.ఉషారాణి, ప్రిన్సిపల్ పీఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి (హౌసింగ్) నారాయణ్ భరత్ గుప్తా, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ కమిషనర్ శేషగిరిరావు తదితరులు హాజరయ్యారు. -
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న పోడుభూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పోడుభూముల అంశాలపై సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ శనివారం తొలిసారి భేటీ అయింది. గిరిజన, సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోడు భూముల కింద వచ్చిన దరఖాస్తులు, పరిష్కారమైనవెన్ని, మిగిలిపోయినవెన్ని? తదితర అంశాలపై పక్కా సమాచారాన్ని రూపొందించి నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమం, అటవీశాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. పూర్తి సమాచారంతో ఈనెల 24న మరోసారి సమావేశం నిర్వహించి లోతుగా చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ విలువ సవరణకు టీఎస్ కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజలపైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ.. మరోసారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాలపైన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సబ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తూ వస్తోందని, దీంతో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చారు. మరో వైపు ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిన విషయం సబ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇలా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా భూముల విలువ పెరిగినా, గత ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో ఎలాంటి పెంపు చేయలేదు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్న చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి లావాదేవీల వలన సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని, పక్కనే ఉన్న తమిళనాడులో 7.5, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయంలో ప్రధాన వాటా కలిగిన హైదరాబాద్, హెచ్ఎండిఏ పరిధిలో పెద్ద ఎత్తున భూములు, ఆస్తుల విలువలు పెరిగిన విషయం సబ్ కమిటీలో విస్తృతంగా చర్చకు వచ్చింది. గత ఏడు సంవత్సరాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, నూతన పరిశ్రమల ఏర్పాటు, నగర విస్తరణ వలన రియల్ భూమ్ వచ్చిందన్నారు. 2019- 20 సంవత్సరానికి సంబంధించి హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సుమారు 51 శాతం లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి అధికంగా రిజిస్ట్రేషన్లు అయిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు. మరోవైపు ప్రభుత్వ విలువ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా ఉండటంతో భూములు ఇల్లు కొనుగోలు చేసే ప్రజలకు బ్యాంకు లోన్లు రావడంలో కొన్ని పరిమితులు ఉంటున్నాయని, ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు పెరిగిన విలువకు అనుగుణంగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇలా వివిధ కారణాల ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువల సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్వరలోనే అందించాలని నిర్ణయం తీసుకుంది. చదవండి: చిత్తశుద్ధి.. సమన్వయం: అభివృద్ధిలో ‘చక్రాపూర్’ ఆదర్శం ‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు! -
థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక
సాక్షి, అమరావతి: థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్టారెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, చిన్నారులకు వైద్యం కోసం అదనంగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని, జనావాసాలకు దగ్గరగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో చిన్నారులకు వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌ను పరిశీలించాలన్నారు. చిన్నారులకు అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. థర్డ్‌వేవ్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయాలని తెలిపారు. బ్లాక్ ఫంగ్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. చదవండి: ‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’ ‘ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబు’ -
ఏపీ: కరోనా పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ: కరోనా పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, ఆక్సిజన్ సరఫరాపై చర్చ జరపడంతో పాటు, బ్లాక్‌ఫంగస్ మందులు, ఇంజక్షన్ల కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ చేపట్టింది. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు హాజరయ్యారు. చదవండి: ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. -
ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
-
మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు: ఆళ్ల నాని
-
అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నట్లు అందుతున్న ఫిర్యాదులపై నిఘా వేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, తీవ్ర చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. తాజా పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి వేగవంతంగా ఉన్నా ప్రజలు సహకరిస్తే వైరస్ నియంత్రణ సాధ్యమేనని చెప్పారు. దేశంలో ఒకేరోజు పెద్దఎత్తున వ్యాక్సినేషన్లో రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ వైరస్ కట్టడిలోనూ చురుగ్గా వ్యవహరిస్తోందని వివరించారు. కోవిడ్ నియంత్రణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం ఉన్నతాధికారులతో సుమారు 3 గంటల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించింది. మంత్రుల కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్‌గా వ్యవహరించగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఇందులో పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అనివార్య కారణాలతో హాజరు కాలేదు. విద్యాశాఖ కీలకం కావడంతో సంబంధిత శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రుల కమిటీలో సభ్యుడు కాకపోయినా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్, మందులకు కొరత లేదు రాష్ట్రంలో ఎక్కడా మందులు, ఆక్సిజన్, బెడ్లకు కొరత లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా కొరత ఉంటే అది కూడా సరిదిద్దుతున్నాం. కొరత అంటే మహా అయితే 10 మెట్రిక్ టన్నులకు అటుఇటుగా ఉండవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతి చేసుకోవడంపై చర్చలు జరుపుతున్నాం. కోవిడ్ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అందరూ సహకరిస్తే కరోనాను నియంత్రించడం కష్టమేమీ కాదు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం నిత్యం మాతో చర్చిస్తున్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని, వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే టెస్ట్‌లు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం. కోవిడ్ సేవల కోసం 104 కాల్సెంటర్లో ఇప్పటికే 300 మంది వైద్యులను నియమించాం. ఈ సదుపాయాన్ని ప్రజలంతా వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించాం. నేడు ముఖ్యమంత్రి వద్ద సమీక్ష మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించే సమీక్షలో నివేదించి అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటాం. పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి కూడా చర్చకు వచ్చింది. వీటిపై ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. చదవండి: ఏపీలో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి మేకపాటి ఆంధ్రప్రదేశ్‌లో లైన్మెన్ ఉద్యోగాలు -
ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ
సాక్షి, అమరావతి: చెరకు కర్మాగారాల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స, మేకపాటి, కన్నబాబు పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకోసం చేపట్టవలసిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉత్తరాంధ్రలో చెరకు ఉత్పత్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. (చదవండి: మూడు రాజధానులు పెట్టి తీరుతాం: కొడాలి నాని) చక్కెర కర్మాగారాల సమస్యలు ఆర్థిక, పౌరసరఫరాల శాఖతో కూడా ముడిపడి ఉన్నందున మరో సమావేశం ఏర్పాటు చేయాలని, తరువాత సమావేశానికి ఆయా శాఖల కార్యదర్శులను కూడా పిలవాలని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు మంత్రి మేకపాటి సూచించారు. పర్మినెంట్, సీజనల్ ఉద్యోగుల సంఖ్య, వారి జీతాల గురించి మంత్రి బొత్స సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు సహకార చక్కెర కర్మాగారం గురించి మంత్రి మేకపాటి వివరించారు. స్థానిక చెరకు రైతుల అవసరమైన వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, జపాన్ సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని సహచర మంత్రులకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. (చదవండి: ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..) వచ్చే సీజన్లో ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సూచించారు. 6 చక్కెర కర్మాగారాలకు కేటాయించిన భూములు, వాటి విలువపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. పనిచేయని షుగర్ ఫ్యాక్టరీల గత బకాయిలు, విడుదల చేసిన నిధుల వినియోగంపై మంత్రులు ఆరా తీశారు. చిత్తూరు, నెల్లూరు, కడప, విశాఖలోని చక్కెర ఫ్యాక్టరీల ఆర్థిక పరిస్థితి, యంత్రాల స్థితిపై మంత్రులు వాకబు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చక్కెర అవసరాలు, కొనుగోలు వివరాలపైనా చర్చ జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో కర్మాగారాల్లో ఉత్పత్తి అయ్యే చక్కెరను స్థానిక పౌరసరఫరాల శాఖకు పంపిణీ చేసే పద్ధతి గురించి షుగర్, కేన్ కమిషనర్ వెంకట్రావు ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్ వెంకట్రావ్ , చక్కెర కర్మాగారాల ప్రతినిధులు హాజరయ్యారు. -
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ మంగళవారం మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సబ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించిన అన్ని క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలని, ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్.. మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం 100 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడ్డారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా ఉండే పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఉపసంఘం సమావేశం అనంతరం సభ్యులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో అన్ని అవరోధాలను త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. ఇందుకోసం అధికారులను మూడు బృందాలుగా విభజించామని వెల్లడించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఓ బృందం, చట్టపరమైన ఇబ్బందులకు మరో బృందం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు మరో బృందంగా ఏర్పడి అధికారులు పనిచేస్తారని చెప్పారు. నాలుగు కేటగిరీలుగా విభజన.. ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లో ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించామని వివరించారు. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నా తొలగిస్తామని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జీపీఏ, ఎస్పీఏలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆగిన రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడానికి ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో అదనపు ఉద్యోగులను నియమించి 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సేల్ డీడ్లపై ఉన్న అపోహలను తొలగిస్తామని చెప్పారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు తమకు ఇబ్బంది లేని రీతిలో డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. పీటీఐఎన్ అనేది యునిక్ నంబర్ అని, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా, అవకతవకల్లేకుండా ఉండేందుకే దీన్ని పొందుపరిచామని చెప్పారు. ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, దశల వారీగా అన్ని సర్వీసులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రారంభించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వస్తున్న అన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూసే కోణంలోనే మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ‘ఇష్యూ ట్రాకర్’ద్వారా పరిష్కరిస్తున్నామని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లే! వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) అంశం ఇప్పట్లో తేలేలా కన్పించట్లేదు. ఈ అంశం పరిష్కారానికి సమయం పడుతుందని, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకే పరిమితం కావా లని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించింది. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సజావుగా రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని అధికారులతో పేర్కొంది. సమావేశంలో భాగంగా ఎల్ఆర్ఎస్ లేని లేఅవుట్ల గురించి ప్రస్తావన రాగా, ప్రస్తుతానికి అధికారిక లేఅవుట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లపై దృష్టి పెట్టాలని, ఎల్ఆర్ఎస్ గురించి మరో సమావేశంలో మాట్లాడుకుందామని మంత్రులు చెప్పినట్లు సమా చారం. కాగా, ఈనెల 17న ఎంసీఆర్హెచ్ఆర్డీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగస్వాములైన అన్ని వర్గాలతో వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లోఇబ్బందులు ఉంటాయి. వాటినిఅధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించాం. డాక్యుమెంట్ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నాతొలగిస్తాం. – వేముల ప్రశాంత్‌రెడ్డి -
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
-
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
సాక్షి, అమరావతి: రెవెన్యూ భూముల సంస్కరణల మంత్రి వర్గ ఉప సంఘం భేటీ గురువారం జరిగింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ సమస్యలు తగ్గించేలా అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలన,సూచనలు చేయడమే లక్ష్యంగా చర్చ సాగింది. (చదవండి: పరిటాల సునీత ఫ్యామిలీ భూబాగోతం!) 22ఏ కింద ఉన్న భూములపై అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎస్టేట్, ఇనాం భూములపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూములను అతి తక్కువగా నామినల్ రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు నెల రోజులపాటు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. -
చంద్రన్న గోల్‌మాల్‌పై సీబీఐ
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ అక్రమాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం సచి వాలయంలో సమావేశమైన మంత్రివర్గం దీనిపై క్షుణ్నంగా చర్చించింది. అనంతరం మంత్రివర్గం తీర్మానం మేరకు ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణ కేంద్రంగా సాగిన ఈ అవినీతి వ్యవహారంలో విస్తుగొలిపే వాస్తవాలు మంత్రివర్గ ఉపసంఘం విచా రణలో వెలుగు చూశాయి. ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో నిందితుడైన వేమూరు హరి కృష్ణకు చెందిన బ్లాక్‌లిస్ట్‌లోని టెరాసాఫ్ట్‌కు గత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తు సంస్థ విచారణలో వెలుగు చూసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ ఫైబర్ గ్రిడ్ కథ... ► గ్రామీణులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్రం ఫైబర్ నెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటర్నెట్తోపాటు టీవీ చానెళ్లను ప్రసారం చేయడం కోసం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం(సీఎస్ఎస్) ఫైబర్ నెట్ నిధులతో టీడీపీ సర్కార్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ► ఏరియల్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ మొదటి దశలో భాగంగా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ పనులకు 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రపదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. హారిజోన్ బ్రాడ్‌క్రాస్ట్ ఎల్ఎల్పీ, సిగ్నమ్ డిజిటల్ నెట్‌తో టెరాసాఫ్ట్ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ► టెండర్ నిబంధనలు 15 ఏ (1), 15 బీ (5) ప్రకారం హారిజోన్ సంస్థకు టెండర్లో పాల్గొనే అర్హత లేదు. సిగ్నమ్ డిజిటల్ నెట్ దాఖలు చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం కూడా నకిలీది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్‌ను 2015 మే 11న ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై నివేదికను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఎల్ –1ని కాదని టెరాసాఫ్ట్‌కు.. ► నిబంధనల ప్రకారం బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల చోరీ కేసులో నిందితుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ బిడ్‌ను ఆమోదించాలని టీడీపీ సర్కార్ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్–1ను కాదని అధిక ధరక బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పారు. అనుమతి లేదు...రూ.558.77 కోట్లు అదనం ► భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) గిగాబైట్ పాసివ్ ఆప్టికల్ నెట్వర్క్ (జీపీవోఎన్) సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ నెట్ రెండో దశను అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం ఐఎంపీఎల్ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేపట్టింది. జీపీవోన్తో పనులు చేపడితే రూ.851.23 కోట్లు వ్యయం అవుతుందని బీబీఎన్ఎల్ తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత దాన్ని రూ.907.94 కోట్లకు సవరించింది. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం ఐఎంపీఎల్ఎస్తో పనులు చేసేందుకు రూ.1,410 కోట్లకు ఎల్ అండ్ టీ కన్సార్టియంకు అప్పగించింది. అంటే ఇది బీబీఎన్ఎల్ నిర్థారించిన మొత్తం కంటే రూ.558.77 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కార్ దీనికి అనుమతి కూడా తీసుకోలేదు. నాసిరకం సెట్‌టాప్ బాక్సులు.. ► ఏపీ ఏరియల్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశ అమలును పర్యవేక్షించేందుకు పీఎంఏ (ప్రాజెక్టు మానిటరింగ్ ఏజెన్సీ) ఎంపికలోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడింది. ► సెట్ బాక్స్‌ల టెండర్లలో 8 సంస్థలు పాల్గొంటే తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకుండా నాలుగు సంస్థలకు పనులు విభజించి అప్పగించారు. కానీ సెట్‌టాప్ బాక్స్‌లను కేవలం టెరాసాఫ్ట్ నుంచే కొనుగోలు చేసి బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారం కేబినెట్ సబ్ కమిటీ విచారణలో వెలుగు చూసింది. సెట్ టాప్ బాక్సుల నాసిరకంగా ఉన్నట్లు కమిటీ తేల్చింది. ఈ క్రమంలో పైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది. చంద్రన్న కానుకల్లో అవినీతి వెల్లువ.. చంద్రన్న కానుక, రంజాన్ తోఫా పేరిట గత సర్కారు పేదలకు పంపిణీ చేసిన రేషన్ సరుకుల్లోనూ పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు నిర్థారణ అయింది. కానుక అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపించాలని టీడీపీ నేతలే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అక్రమాలు వెలికి తీయాలని విజయనగరం జిల్లా గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు జడ్పీ సమావేశంలో డిమాండ్ చేయడం దుమారం రేపింది. అక్రమాలు రుజువైతే రెవన్యూ రికవరీ చట్టం ద్వారా డబ్బులు తిరిగి వసూలు చేయాలని అప్పుడు ఆయన డిమాండ్ కూడా చేశారు. హెరిటేజ్‌కు సంతర్పణ.. చంద్రన్న కానుక కింద సంక్రాంతి పండుగకు పేదలకు అందించిన గిఫ్ట్ ప్యాక్‌లో మిగిలిన సరుకులతో పాటు 100 గ్రాముల చొప్పున నెయ్యి కూడా పంపిణీ చేశారు. ఇందుకోసం ఏడాదికి 1,301 కిలో లీటర్ల నెయ్యి కొనుగోలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ పలు డెయిరీలు కిలో నెయ్యి ప్యాకింగ్‌తో సహా రూ.320 నుంచి రూ. 420 వరకు అప్పట్లో విక్రయించాయి. బహిరంగ మార్కెట్లో విశాఖ డెయిరీ నెయ్యి కిలో రూ. 320, దొడ్ల డెయిరీ నెయ్యి రూ. 350, తిరుమల డెయిరీ నెయ్యి రూ. 375, నందిని డెయిరీ నెయ్యి రూ.420 చొప్పున రిటైల్ అమ్మకాలు జరుపుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిటైల్ కొనుగోలు దారులకు కిలో గేదె నెయ్యి రూ.372కే విక్రయిస్తామని విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్ పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే ఇలా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే వారిని కాదని హెరిటేజ్ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ. 499తోపాటు దీనిమీద 14.5 శాతం విలువ ఆధారిత పన్ను కలిపి కిలో రూ.575 చొప్పున గత సర్కారు కొనుగోలు చేసింది. ఒక ఏడాది నెయ్యి సరఫరాలోనే రూ.26 కోట్లకు పైగా దుర్వినియోగం అయిందనే ఆరోపణలున్నాయి. కానుక పేరిట కోట్లు స్వాహా.. సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు అర కిలో కందిపప్పు, అర కిలో శనగలు, అర కిలో బెల్లం, అర లీటర్ పామాయిల్, కిలో గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. ఈ సరుకులన్నీ ఒక సంచిలో పెట్టి ఇచ్చేందుకు గిఫ్ట్ సంచుల పేరిట ఏటా అదనంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసి నాసిరకం సంచులిచ్చారు. బెల్లం దుర్వాసన రావడంతో సగం మంది లబ్ధిదారులు డస్ట్‌బిన్‌లో పారేశారు. ఈ విషయాన్ని కళ్లారా చూసిన నాటి సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించినా ఫలితం శూన్యం. చంద్రన్న కానుక సరుకుల సరఫరా టెండర్లను సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకున్నారు. 2015 – 2019 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.565.94 కోట్ల విలువైన సరుకులు పీడీఎస్ కింద సేకరించారు. మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా సరుకుల కోసం రూ.1,200.34 కోట్లు ఖర్చు చేశారు. అయితే ధరల్లో వ్యత్యాసం, నాసిరకం సరుకులు సరఫరా చేయడం ద్వారా రూ.158.38 కోట్ల మేర ఇందులో అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
బట్టబయలైన అమరావతి కుంభకోణం
-
బట్టబయలైన అమరావతి కుంభకోణం
సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో అమరావతి వేదికగా టీడీపీ ప్రభుత్వం పాల్పడిన కుంభకోణం బట్టబయలైంది. రాజధాని అవినీతిపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నివేదికను సమర్పించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిని బహిర్గతం చేసింది. ఉపసంఘం బయటపెట్టిన నివేదికలో అమరావతిలో వేలకోట్ల అవినీతి జరిగినట్టు తేలింది. ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్‌ను బయటపెట్టింది. టీడీపీ నేతల బండారాన్ని మంత్రివర్గ ఉపసంఘం పూస గుచినట్టు వివరించింది. రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు 4,075 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టు నివేదిక పేర్కొంది. (ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు) మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్‌ల పేర్లతో భారీగా భూ కొనుగోలు చేసినట్టు వివరాలతో కూడిన నివేదికన ప్రభుత్వానికి సమర్పించింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలందరి భూ కుంభకోణాలను కమిటీ బట్టబయలు చేసింది. 900 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి టీడీపీ నేతలు బలవంతంగా కొనుగోలు చేసినట్టు కూడా కమిటీ నివేదికలో తెలిపింది. తెల్ల రేషన్ కార్డు దారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్టు స్పష్టం చేసింది. హైద్రాబాద్‌లో తెల్ల రేషన్ కార్డు దారులు కూడా అమరావతిలో భూములు కొన్నట్టు, టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొన్నట్టు కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసమే సీఆర్డీఏ పరిధిని అనేక మార్లు మార్చినట్టు ఆధారాలు గుర్తించిన ఉపసంఘం, దానిని ప్రభుత్వానికి సమర్పించింది. భారీ కుంభకోణం బయటకు రావడంతో టీడీపీ నేతలు బండారం బయటపడినట్లయింది. కాగా రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని మంత్రి పేర్ని నాని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. లోకయుక్త, సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేలా నిర్ణయం ఉంటుందని మంత్రి ప్రకటించారు. -
సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
-
సీఎం జగన్‌తో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయ్యింది. చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సిద్ధం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. -
ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్ కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మావోయిస్టుల సమస్యలపై ప్రభుత్వం ఓ సబ్‌కమిటీని నియమించింది. అర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన ఈ ఉపసంఘం పనిచేయనుంది. ఈ సబ్‌కమిటీలో హోం, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం, తీవ్రవాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపులో విధాన రూపకల్పన, ధ్వంసమైన ఆస్తులకు పరిహారం, నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, తదితర అంశాలను ఈ సబ్‌కమిటీ సమీక్షించనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిపార్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తామని జీవోలో పేర్కొంది. -
గత ప్రభుత్వ అవినీతిపై సీఎం జగన్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హాయంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. సీసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్‌రంగ సమీక్షా సమావేశంలో ఈమేరకు ప్రకటన చేశారు. కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. సోలావర్, విండ్ పవర్ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని, ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. సోలార్, విండ్ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని.. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌ను కలిసిన నావికాదళ అధికారులు క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌ను తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, నావికాదళ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు.