campaigning
-
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్‌చంద్రపవార్) నేత శరద్‌పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్‌షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్‌తో కలిసే అవకాశం లేదని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
టీఎంసీకి బూత్ ఏజెంట్ ప్రచారం.. పట్టుకున్న బీజేపీ ఎంపీ
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. హుగ్లీలో టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న బూత్ ఏజెంట్‌ను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీ బూత్ ఏజెంట్‌కు డబ్బులు ఇచ్చి, ఒక ఆశా వర్కర్‌ను బూత్‌లో కూర్చోబెట్టారని లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. ఆ ఆశా వర్కర్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లతో టీఎంసీకి అనుకూలంగా ఓటువేయాలని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ మహిళ తృణమూల్ ఏజెంట్ అని లాకెట్ చటర్జీ పేర్కొన్నారు.ఆ మహిళను పట్టుకుని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదని ఆమె అన్నారు. దీనిపై బూత్ ఏజెంట్‌ను ప్రశ్నించగా, ఆమె ఓటర్లు క్యూలో నిలుచునేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బూత్ వద్ద ఎక్కువ మంది ఓటర్లు లేరని లాకెట్ చటర్జీ తెలిపారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. -
ప్రియాంక పలకరింపు.. ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం
సాక్షి, మహబూబాబాద్/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్ఎస్కూ కాలం చెల్లింది. ఓటమికి దగ్గరగా ఉన్న ఆ పార్టీ అంతిమ గడియలు లెక్కపెట్టుకుంటోంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ఆగం చేశారన్నారు. ‘మా నాయనమ్మ ఇందిరాగాంధీ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం. ప్రజలు చైతన్య వంతులు’ అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచి్చందని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఈ చైతన్యంతో ఫాం హౌజ్‌లో ఉండి పాలించే నాయకులు కావాలో.. ప్రజల మధ్య ఉండి పాలించే కాంగ్రెస్ కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలోని తొర్రూరులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతం ప్రజలు చేసిన పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఉందని చెప్పారు. I wanted to see Indiramma but cannot see, Now I have seen her Granddaughter Priyanka Gandhi Ji. A woman who met Priyanka Gandhi Ji expresses her love towards Gandhi Family.@INCIndia @INCTelangana @SpiritOfCongres pic.twitter.com/fvION4sSJY — Abdur Rahman Ansari (@AnsariiTweets) November 24, 2023 యువత జీవితాలు చీకటి మయం ‘రాష్ట్రం సాధిస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెంచుకుంది. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ యువత జీవితాలను చీకటి మయం చేశారు. కష్టపడి చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. పేపర్ లీకేజీలతో చదువుకున్న వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది. ఉద్యోగం రాలేదని విద్యారి్థని ఆత్మహత్య చేసుకుంటే. ఆ కుటుంబాన్ని ఓదార్చా ల్సిన ప్రభుత్వం, నాయకులు అసలు ఆమె పరీక్షే రాయలేదని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు ప్రభుత్వానికి యువతపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం’ అని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరిగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి మంచి విద్యను అందించేందుకు ప్రతీ మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్‌ను నెలకొల్పుతామన్నారు. మహిళగా వారు పడే బాధలు తెలుసు ‘ఒక మహిళగా తెలంగాణలో మహిళలు పడే ఇబ్బందులు నాకు తెలుసు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఉప్పులు పప్పుల రేట్లు పెరిగినప్పుడు, గ్యాస్, కరెంట్ బిల్లులు భారమైనప్పుడు మహిళలే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇటువంటి ఖర్చులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలైన పథకాలు అమలు చేస్తాం’ అని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని మండిపడ్డారు. సాగునీటి కోసం రూ.లక్ష కోట్లు వెచి్చంచి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు పారీ్టలూ ఒక్కటే.. వారికి మద్దతుగా ఎంఐఎం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. డబ్బులు పెరిగితే మనిíÙలో అహం పెరుగుతుందని, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలకు అహం పెరిగి ప్రజల సమస్యలు పట్టడం లేదని చెప్పారు. పార్లమెంట్లో పెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలకు అంటకాగుతున్న ఎంఐఎం నాయకులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజల స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ను విమర్శించడం శోచనీయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయని ప్రియాంక చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం 60కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుంటే.. తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందన్నారు. నాన్న (రాజీవ్ గాంధీ) చనిపోయిన తర్వాత తమ కుటుంబానికి పీవీ నరసింహారావు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ అభ్యర్థులు యశస్వినిరెడ్డి (పాలకుర్తి), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), పార్టీ రాష్ట ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కర్ణాటక మంత్రులు దినేష్ గుండూరావు, తీన్మార్ మల్లన్న, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజలను నమ్ముకుంది: పొంగులేటి బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్‌రావు డబ్బులను నమ్ముకున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను నమ్ముకున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గతంలో ఇచి్చన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్‌తోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ 9, మిత్రపక్షం సీపీఐ కొత్తగూడెం గెలుస్తుందని చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, సబ్బండ వర్గాలు ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. కానీ దాని ఫలాలు మాత్రం కేసీఆర్ మాత్రమే అనుభవిస్తున్నారని, మన త్యాగాల ఫలం మనమే అనుభవించాలంటే కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. Priyanka Gandhi Surprise visit to a Farmer Family house in Telangana 👉 Today afternoon, Congress leader Priyanka Gandhi suddenly got an opportunity to speak to Ramadevi in the language of love in Telangana, not Telugu / Hindi#PriyankaGandhi #ByeByeKCR #TelanganaElection2023 pic.twitter.com/tYZHUeBaUI — Team Congress (@TeamCongressINC) November 24, 2023 ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం ప్రియాంక ఉన్న ఫళంగా ఓ గీతకార్మికుడి ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులు ఆమెను చూసి ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సభను ముగించుకొని కొత్తగూడెం వెళ్తున్న క్రమంలో కిషన్‌నగర్‌లో నిర్మాణం అసంపూర్తిగా ఉన్న ఇంటికి మామిడి తోరణాలు, బంతిపూల దండలు కనిపించడంతో ప్రియాంక కారు ఆపి వారి ఇంట్లోకి వెళ్లారు. కుటుంబ యజమాని గీత కార్మికుడు జాగిరి రాజయ్య, రమ దంపతులతో కాసేపు ముచ్చటించారు. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుండటంతో పూజ గురించి ఆరా తీశారు. ఇంటి నిర్మాణం ఎందుకు ఆపారని, దుకాణం ఎందుకు పెట్టుకోలేదని అడిగారు. దీంతో ఇంటి యాజమాని ఆర్థిక ఇబ్బందులే కారణమన్నారు. ఇంటి యజమానురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోన్ నంబర్ తీసుకున్నారు. -
ఎన్నికల ప్రచారానికి తెర
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారాలు ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రోడ్‌షోలు, ర్యాలీలు, సమావేశాలు గురువారం సాయంత్రం 6 గంటలకు నిలిపివేసినట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. రాజస్థాన్‌లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని సీఈవో పేర్కొన్నారు. గతంలో 2018 ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ఒకరోజు ముందు సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని, ఈసారి ఒక ఒక గంట అదనంగా పొడిగించామని ఆయన చెప్పారు. రూ.682 కోట్లు స్వాధీనం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి ఇప్పటివరకు రూ.682 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. గత ఎన్నికల్లో 65 రోజుల్లో పట్టుబడినదాని కంటే ఈసారి ఎన్నికల్లో 42 రోజుల్లోనే అత్యధికంగా ప్రలోభ సొత్తు, వస్తువులు పట్టుబడినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాల్లో మాత్రమే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు దక్కించుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు!
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు! -
ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం..
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారసభ, ఇంటింటిప్రచారం.. ఏదైనా కార్యకర్తలు మాత్రం వాళ్లేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. పెద్దపల్లి సెగ్మెంట్లో ఇటీవల నిర్వహించిన సభలకు నేతలు మినహా హాజరైన వారిలో అధికశాతం పెయిడ్ కార్యకర్తలే అనడంలో అతిశయోక్తి లేదు. ఊళ్లలోనే ప్రచారం.. ► గ్రామాల్లో స్థానికంగానే ఇంటింటి ప్రచారం నిర్వహించే రాజకీయపార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్న వారు ఏ గుర్తుకు ప్రచారం చేయాలి, ఇలా చేస్తే తమకు ఎంత ఇస్తారని అడిగి మరీ వసూలు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ► అయితే ఆయా ఊళ్లలో ఉండే కొందరు చోటామోటా నాయకులు, గ్రామ పెద్దలు జనసమూహాన్ని తరలించేందుకు కొంతమొత్తాన్ని మాట్లాడుకుని అందులో కొంత నొక్కేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ► ఇంటింటి ప్రచారాన్ని స్థానికంగా ఉండేవాళ్లతో గంట, గంటన్నర సమయం పాటు నిర్వహిస్తూ రూ.100నుంచి రూ.150 దాకా చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే అగ్రనేతల సభలకు వాహనాల్లో తరలించిన సమయాల్లో రూ.300 నుంచి రూ.500దాకా చెల్లిస్తే సదరు పార్టీ కండువా వేసుకుని సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు. ► కొద్దిసేపటికోసమే కావడంతో మహిళలు, వృద్ధులు సభలకు వచ్చేందుకు పోటీపడుతున్నారు. మగ వారినికి తీసుకొస్తే వారిని తీసుకొచ్చిన నాయకుడు తిరుగు ప్రయాణంలో మందుతో విందు ఏర్పాటు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది నేతలు మహిళలనే పిలి పించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ► ఇటీవల పెద్దపల్లిలో జరిగిన ఓ సభకు 30వేల మందికిపైగా మహిళలు హాజరుకావడం గమనార్హం. ఊపందుకోనున్న ప్రచారం.. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో గుర్తులు పొందిన అభ్యర్థులు ప్రచా రంలో మునిగి తేలుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అగ్రనేతలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని జనసమీకరణలో తలమునకలయ్యారు. దీంతో పెయిడ్ కార్యకర్తలకు డిమాండ్ పెరుగుతోంది. వరి కోతలు కూడా ఇప్పుడే.. వరి కోతలు ఇప్పుడే రావడం.. ఎన్నికల ప్రచారసభలు జరగనుండడంతో వ్యవసాయ పనులకు కూలీ ల కొరత ఏర్పడుతోంది. వలసకూలీలతో కొన్ని ప్రాంతాల్లో కోతలు కోస్తుండగా.. యంత్రాలతో ఇంకొన్ని ఏరియాల్లో వరికోతలు ముమ్మరం చేస్తున్నా రు. ఏదైతేనేం.. సాధారణ ఎన్నికల ప్రచారపర్వం గడువు చివరి దవలో వస్తుండడంతో జోరు పెంచేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇవి కూడా చదవండి: చేరి.. చేజారి..! ‘హస్తం’లో తారుమారు రాజకీయం.. -
ఎన్నికలకు కళ
రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఫేస్బుక్, యూ ట్యూబ్ మొదలు ఇన్స్టాగ్రామ్ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్లో ఆయా కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. సోషల్ జమానా ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్ లెవల్ వరకు సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. ర్యాలీలు, సభల్లో... బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కొమ్ము కోయ.. రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు. అలరిస్తున్న గుస్సాడీ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంజారా నృత్యం తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. డప్పు బృందాలు ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి. - తాండ్ర కృష్ణ గోవింద్ -
‘కారు’ దిగితే అట్లుంటది మరీ..!
కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. కార్యక్రమాలను వేగవంతం చేసింది. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున పోలింగ్ బూత్‌కు పది మంది బాధ్యులను నియమిస్తున్నారు. ఈ పదిమంది కమిటీలో కొరు ఇన్‌చార్జీగా ఉంటారు. నియోజకవర్గంలో మొత్తం 266 బూత్‌లకు కమిటీలను వేసి, ఇన్చార్జీలను నియమించనున్నారు. వారంతా పార్టీ నిర్దేశించే కార్యక్రమాలను అమలు చేస్తారు. పార్టీ కార్యకలాపాల కోసం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న శుభం ఫంక్షన్ హాల్‌ను అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా అన్నీ అక్కడి నుంచే నడిపించనున్నారు. అలాగే మీడియాకు సమాచారం ఇవ్వడానికి విద్యానగర్‌లోని ఓ అపార్టుమెంటులో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ ముఖ్య నేతలు వచ్చినపుడు ఉండడానికి వీలుగా పలు ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో అద్దె ఇళ్లను ఎంపిక చేసి అందులో మకాం పెడతారు. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో ప్రచార పనులు వేగవంతమయ్యాయి. సీఎంవో నుంచి ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి రెగ్యులర్‌గా వచ్చిపోతున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ముఖ్య నేతలతో సమావేశం నిర్వహణకు.. నియోజకవర్గంలో ఒక్కో మండలం/పట్టణం నుంచి ఇరవై మంది చొప్పున వంద మందితో ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారని, అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాన్ని శుక్రవారమే నిర్వహించాల్సి ఉండగా.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి మరణంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై దృష్టి కాంగ్రెస్, బీజేపీలలో క్రియాశీలకంగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్‌కు ఇటీవల కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. మండలాలవారీగా నాయకుల జాబితాలను రూపొందించి వారిని ఏదోరకంగా కారెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో.. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైంది. బూత్‌కు పది మందితో కమిటీని ఏర్పాటు చేసి, జాబితాను కంప్యూటరీకరిస్తారు. వారికి ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. అలాగే సోషల్ మీడియాల టీంలను ఇప్పటికే అలర్ట్ చేశారు. ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో గత పాలకుల విధానాలతో జరిగిన ఇబ్బందులను వివరిస్తూ, ప్రస్తుతం జరిగిన మేలును కళ్లకు కట్టేలా రూపొందించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కామారెడ్డి క్యాంపెయిన్ ఇన్‌చార్జీగా కేటీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి పోరులో ముందున్న బీఆర్ఎస్.. తాజాగా పలు నియోజకవర్గాలకు ప్రచార ఇన్చార్జీలను ప్రకటించింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం బాధ్యతను ముగ్గురికి అప్పగించింది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్కు ఇచ్చారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు ఇంకా ఎవరినీ నియమించలేదు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ అర్బన్‌తోపాటు బోధన్ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించారు. క్యాంపెయిన్ ఇన్చార్జీల నాయకత్వంలో ఆయా నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
కమలంలో కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడొవచ్చనే అంచనాల నేపథ్యంలో...పార్టీలో ఏర్పడుతున్న పరిస్థితులు కమలనాథుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. ఇతర జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావుతో పాటు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు, ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశం పార్టీలో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్న సీనియర్ నేత, నగర పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బి.వెంకటరెడ్డి, ఆయన భార్య బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ పద్మలు.. తాము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా, తగిన గుర్తింపు లేదని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నందున తమకు అంబర్‌పేట అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరితే నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భేటీ అయిన నేతల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్‌కు నాయకత్వం అప్పగించినట్టు పార్టీవర్గాల సమాచారం. మాకేదీ గుర్తింపు..? రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతలుగా, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్లుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనేది అసంతృప్త నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉన్నట్టు సమాచారం. అలాగే పార్టీ తీరు, నాయకత్వం వ్యవహారశైలి పైనా వారు ఆగ్రహంతో ఉన్నారని, అధిష్టానం వైఖరి, ముఖ్యంగా పార్టీ అగ్రనేత అమిత్ షా అనుసరిస్తున్న తీరు సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా.. కేవలం రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్లతోనే అమిత్ షా సమావేశం కావడం, తమను దూరం పెట్టడంపై వీరంతా కినుక వహించినట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు సైతం ఆయనకే గుర్తింపునివ్వడం, వేదికపైనా తమ పక్కన అవకాశం కలి్పంచడం వంటి వాటిపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈటల తీరుపై అసహనం! గతంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై పలువురు నేతలు అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. తమకు తెలియకుండా, కనీసం సంప్రదించకుండా తమ ప్రాబల్య ప్రాంతాలు, నియోజకవర్గాల్లో చేరికలను ఈటల ప్రోత్సహించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమను సంప్రదించకుండా సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో కొందరిని చేర్చుకోవడంపై వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వారు నిత్య అసంతృప్త వాదులే..! మరోవైపు అసంతృప్త నేతల తీరుపై ఇతర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిత్య అసంతృప్తులంటూ మండిపడుతున్నారు. తాము అనుకున్న స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని, ఇలాగైతే తామే ఢిల్లీ నుంచి ఎన్నికల కార్యాచరణను అమలు చేయాల్సి ఉంటుందంటూ క్లాస్ తీసుకునేందుకే.. కిషన్‌రెడ్డి, సంజయ్, ఈటలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారని వారు వివరిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కూడా అమిత్‌షా పిలవలేదంటూ వారు గుర్తు చేస్తున్నారు. అధినేతల తీరుతో తప్పుడు సంకేతాలు! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, ఇది కేసీఆర్ సర్కార్‌కు, బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందంటూ విమర్శలు గుప్పించిన అమిత్ షా, నడ్డాలు.. ఇదిగో విచారణ, అదిగో విచారణ అంటూ తాత్సారం చేయడమే తప్ప ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంకా అరెస్టు చేయకపోవడం వంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణమౌతున్నాయని అసంతృప్త నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. కీలక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని జరుగుతున్న ప్రచారాన్ని ఈ కారణంగా గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నామని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. -
సాక్షాత్తు ఆయనే అలా చేయడం "ఆశ్చర్యంగా ఉంది": శరద్ పవార్
సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి.. గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. (చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..) -
ఆ ఊళ్లో ఎన్నికల ప్రచారమే ఉండదు! కానీ..
గుజరాత్లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఒక వారం మాత్రమే సమయం ఉన్నందున గుజరాత్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల హోరుతో రసవత్తరమైన ఎన్నికల టెన్షన్‌తో ఉత్కంఠంగా ఉంది. కానీ, ఆ ఊరిలో మాత్రం ఎలాంటి కోలాహలం లేకుండా సాధారణ వాతావరణం కనిపిస్తుంటుంది. గుజరాత్లో రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ సమాధియాల అనే ఒక గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడి రాజకీయ పార్టీల ప్రచార ప్రవేశం మాత్రం పూర్తిగా నిషేధం. అసలు అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం జరగదు. అయినప్పటికీ అక్కడి గ్రామస్తులంతా ఓటేస్తారు. అదీ కూడా ఒక్కరు కూడా మిస్స్ కాకుండా ఫుల్‌గా ఓట్లు పడతాయి. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో అందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తుంది అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ. పైగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓటు వేసేందుకు రాకపోతే వారిపై రూ. 51/- జరిమాన కూడా విధిస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ. అక్కడ గ్రామ సర్పంచ్‌ని కూడా అందరీ ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారు. అంతేగాదు పోలీంగ్‌కు కొన్ని రోజుల ముందు కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరైనా ఓటు వేయకపోతే కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదనే నియమం 1983 నుంచి ఉంది. పైగా ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు రాదని, ఒకవేళ ప్రచారం చేస్తే తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసుని గ్రామస్తులు చెబుతున్నారు. ఐతే తమ గ్రామంలో వైఫై ఇంటర్నెట్ కనెక్షన్, సీసీటీవీ కెమెరాలు, తాగునీరు అందించే ఆర్ఓ ప్లాంట్ తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామంలో అభ్యుర్థులను ప్రచారం చేయడానికి అనుమతించరు కాబట్టి గ్రామ ప్రజలంతా తమకు మంచిదని భావించే నాయకుడికే ఏకగ్రీవంగా ఓటు వేస్తారుని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఏ కారణం చేతనైనా ఓటు వేయలేని పక్షంలో ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. (చదవండి: ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు) -
Munugode Bypoll: ప్రచారానికి జనాన్ని పిలిస్తే ఒక బాధ, పిలవకపోతే మరో బాధ
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నాయి. పోటీలో వివిధ పార్టీల అభ్యర్థులు, చాలా మంది స్వతంత్రులు ఉన్నప్పటకీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూడు పార్టీలు నిత్యం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యలో ఉంటున్నాయి. ఆయా పార్టీలు తమ కార్యకర్తలో సమావేశాలు నిర్వహిస్తే హంగామా కనిపించకపోవడంతో.. సామాన్య ప్రజానీకాన్ని సమీకరిస్తున్నాయి. ఆ క్రమంలో గ్రామాలు, కాలనీలకు చెందిన జనం పార్టీల సమావేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. జన సమీకరణతో మొదలవుతున్న నేతల కష్టాలు సమావేశాలు నిర్వహణ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య మాత్రం జనసమీకరణతోనే. సమావేశాలు, రోడ్‌షోలకు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. ఒక్కో పార్టీ ఆయా కార్యక్రమాల పరిస్థితి మేరకు జనాన్ని సమీకరిస్తున్నాయి. ఇంతే మంది కావాలని కూడా చెబుతున్నాయి. అయితే పిలిచినదాని కంటే ఎక్కవగా జనాలు తరలివెళ్తున్నారు. వద్దన్నా వినకుండా వస్తుండడంతో అందరికీ డబ్బులు చెల్లించలేక స్థానిక నేతులు తలలు పట్టుకుంటున్నారు. వద్దని చెబితే ‘రేపు మా ఓటు వద్దా’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జనాన్ని వద్దనలేక, అధిష్టానం వద్ద సరిపడా డబ్బులను తెప్పించుకోలేక నానా పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి స్థానిక నేతలే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకునేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. కొందరికి కాసులు.. మరి కొందరికి కష్టాలు.. సాధారణంగా ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల నాయకులకు పండుగ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్ని పార్టీలకు స్థానికంగా బాధ్యతలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఇన్‌చార్‌్జలు వచ్చారు. వారంతా సభలు, సమావేశాలు, ప్రచార వ్యవహారాలు, జన సమీకరణ వంటి అన్ని అంశాలు చూసుకుంటున్నారు. దీంతో స్థానిక నేతలకు ఎలాంటి పని లేకుండా పోయింది. కేవలం అసిస్టెంట్లుగానే మారారు. ఇదిలా ఉంటే జన సమీకరణ, ఇతర విషయాల్లో ఆయా పార్టీల్లోని కొంత మంది స్థానిక నేతలకు కాసుల వర్షం కురిపిస్తే మరి కొందరికి మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు ఇన్‌చార్జ్‌లు స్థానిక నేతల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి కొందరు మాత్రం స్వయంగానే చూసుకుంటున్నారు. ఏదేమైనా ఇన్‌చార్‌్జల రాకతో అన్ని పార్టీల్లో లోకల్ లీడర్లకు మాత్రం నాలుగు పైసలు వెనుకేసుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. -
మునుగోడులో తిట్ల దండకం!.. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్'
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ పార్టీల స్టార్ ప్రచారకర్తలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలతో దుమారం రేపుతున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రచార పర్వంలో పైచేయి సాధించేందుకు చేస్తున్న విమర్శలు వివాదాలు రేపుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఓటర్లు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రచార విన్యాసాలు కొన్ని సందర్భాల్లో వికటిస్తున్నాయి. గురువారం చౌటుప్పల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఏకంగా సమాధి కట్టిన ఘటన ప్రచారంలో కొత్తపోకడకు దారితీసింది. హడావుడిగా నేతలు అన్ని పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో క్రియాశీల కార్యకర్తలను మోహరించి ప్రతీ ఓటరును చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఊరూరా విందులు జోరుగా సాగుతున్నాయి. మద్యం, శీతల పానీయాలు, చికెన్ విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సామాజిక సమీకరణాలపై అన్ని పార్టీలు దృష్టి సారించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఓటర్లను కలుసుకునే బాధ్యతను అప్పగించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇతర పార్టీల నుంచి చేరికల పేరిట హడావుడి చేస్తూ నేతలు కండువాలు కప్పే పనిలో తీరికలేకుండా ఉన్నారు. చేరికలు నిరంతరంగా సాగుతుండటంతో ఎవరు పార్టీలో కొనసాగుతున్నారో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అధికార పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టబెడుతున్నారు. మండలాలు, గ్రామాలు, సామాజికవర్గాల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఓటరు జాబితాను అన్ని పార్టీలు వడపోసి, వివరాలను క్షేత్రస్థాయిలో అందజేశాయి. నాయకుల మాటల తూటాలు... టీఆర్ఎస్ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అయన అసలు ప్రజాప్రతినిధిగానే పనికిరారని, కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చారని, అదీగాక గెలిచిన పార్టీలో కోవర్టుగా పనిచేశారని తీవ్రంగా విమర్శిస్తోంది. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపై విమర్శలు గుప్పిస్తోంది. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు బఫూన్లని, వారు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు/ ఎమ్మెల్యేలను దండుపాళ్యం బ్యాచ్‌గా, నీతి, జాతిలేని రాక్షసులుగా దుమ్మెత్తిపోస్తున్నారు. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్, అల్లుడు వెన్నుపోటు స్టార్.. సడ్డకుడి కొడుకు టానిక్ స్టార్, మిగిలింది లిటిల్ స్టార్. వీళ్లంతా బందిపోటు స్టార్స్’ అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం టీఆర్ఎస్, బీజేపీలను ఏకిపారేస్తున్నారు. ‘ఒకరు దొంగ అయితే ఇంకొకరు గజదొంగ.. తాగడానికి గంజి లేని టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బెంజి కార్లలో తిరుగుతున్నారు. మంత్రులు మందు పోసే దివాలాకోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అడ్డమైన గాడిదలు టీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాయి’ అంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
మునుగోడులో శ్రుతిమించిన ఎన్నికల ప్రచారం.. అలా చేయడం కరెక్టేనా?
సాక్షి, యాద్రాద్రి: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, తాజాగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టిన ఘటనపై కాషాయ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత మనోహర్‌రెడ్డి తెలిపారు. సమాధి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఓడిపోతామన్న భయంతోనే, ప్రజా మద్దతు లేకే టీఆర్ఎస్ చిల్లర పనులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఓటర్లకు ప్రలోభాలు వేగవంతమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓ రాజకీయ పార్టీ పంపకాలకు శ్రీకారం చుట్టేసింది. ఇంటింటికీ కిలో చికెన్, 2 లీటర్ల థమ్సప్ పంపిణీ చేసింది. చౌటుప్పల్ మండలంలోని ఒక గ్రామానికి ఓ పార్టీ నేత ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామంలో 2200 మంది ఓటర్లు, 812 కుటుంబాలున్నాయి. గ్రామ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నేత అనుచరులు, స్థానిక లీడర్లు కలిసి 90శాతం కుటుంబాలకు చికెన్, థమ్సప్ పంపిణీ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5గంటల నుంచి మొదలుపెట్టి గంటలో పంపిణీని పూర్తి చేశారు. -
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ విస్తృత ప్రచారం
-
Munugode Bypoll: చుట్టూ మనవాళ్లే.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయం?
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో దుండగులు చేతివాటం ప్రదర్శించి జేబులు కత్తిరించేస్తున్నారు. ఏకంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి జేబులోంచి నోట్ల కట్ట కొట్టేశారు. మర్రిగూడ మండలం నామాపురం, కొట్టాల గ్రామంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సోమవారం కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగిసిన తర్వాత తన జేబు చూసుకుంటే అందులోని రూ.50 వేల నోట్ల కట్ట కనిపించలేదు. చుట్టూ మనవాళ్లే ఉన్నారు.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయమైందంటూ ఆ అభ్యర్థి నోరెళ్లబెట్టాడు. అనంతరం ఆయన వెంట ఉన్న నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వాగ్వా దానికి దిగారు. దీంతో మరో నాయకుడు కలుగజేసుకుని పోయిన డబ్బులు ఎలాగూ పోయాయి.. మనమెందుకు తగువులాడుకో వడం.. అంటూ వివాదాన్ని చల్లార్చారు. -
మునుగోడులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. తమ్ముడి కోసం ట్విస్ట్ ఇచ్చిన వెంకన్న!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో అనే దిశగా పొలిటికల్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే, ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నికల కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా కోమటిరెడ్డి అందరికీ షాకిచ్చారు. కాగా, మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంటకరెడ్డి దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ఈనెల 15వ తేదీన కోమటిరెట్టి.. తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల బరిలో కోమటిరెడ్డి సోదరుడు.. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. అయితే, మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో.. కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారానికి వస్తే హస్తం పార్టీకి అనుకూలంగా ఉండేది. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: మునుగోడులో ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’ -
సీబీఐ దాడుల వేళ కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఓ వైపు సీబీఐ దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ‘మిస్డ్ కాల్’ ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘భారత్‌ను నంబర్ వన్ చేసేందుకు మా నేషనల్ మిషన్‌లో పాలుపంచుకోండి. అందుకు 9510001000కు మిస్డ్‌కాల్ ఇచ్చి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టండి.’ అని వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ట్విట్టర్లోనూ ప్రజలకు సూచించారు. మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేపట్టిన తర్వాత మాట్లాడారు కేజ్రీవాల్. ‘సీబీఐ దాడులపై ఎలాంటి భయం అవసరం లేదు. వారి పనిని చేసుకోనిద్దాం. మమ్మల్ని వేధించేందుకు పైనుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. మా నాయకుల పని అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో తొలి పేజీలో వచ్చిన కథనాన్ని సూచిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. ఇతర మంత్రులు కైలాశ్ గహ్లోట్, సత్యేందర్ జైన్‌లపైనా దాడులు చేశారని, ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. भारत को दुनिया का नम्बर वन देश बनाने के लिए साथ आयें। इस मिशन से जुड़ने के लिए 9510001000 पर मिस कॉल करें। हमें देश के 130 करोड़ लोगों को जोड़ना है। — Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్ -
ఆత్మకూరు ఉపఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ప్రచారం
-
చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
-
చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ప్రజలకు తీపికబురు అందించింది. త్వరలోనే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ పంజాబ్‌లోని జలంధర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. కాగా, తాము.. సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు. సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్ సింగ్ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’లా ట్రీట్ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు’. ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా.. సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎమ్మెల్యే రోజా
బద్వేలు (వైఎస్సార్‌జిల్లా): బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దూసుకుపోతుందని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే అని ఎమ్మెల్యే రోజా అన్నారు. గెలుపు కోసం కాదు.. భారీ మెజార్టీ కోసం తాము.. ప్రచారం చేస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని రోజా కోరారు. కాగా, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దొంగ నాటకాలాడిన ప్రజలను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు. చదవండి: చంద్రబాబు బూతు పంచాంగం డ్రామా ఫెయిల్: సజ్జల -
Huzurabad Bypoll: వారిని ఖుషీ చేసేందుకు కోళ్లు, పొట్టేళ్లు డోర్ డెలివరీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో పెద్దపండుగగా భావించే బతుకమ్మ, దసరా వేడుకలతో ప్రచారం కాస్త నెమ్మదించినా.. జనాలు ఎన్నికల మూడ్ నుంచి బయటకు రాకుండా నేతలు నానా తంటాలు పడుతున్నారు. పండుగల నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సిన నేతలంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో సందడి తగ్గింది. అయితే, దీన్ని ముందే ఊహించిన పలుపార్టీల నేతలు ఎన్నికల వాతావరణం చల్లబడకుండా ఎవరికితోచిన ప్రయత్నాలు వారుచేస్తున్నారు. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పలు గ్రామాలు, వాడల్లో తమపార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దసరా నేపథ్యంలో ఓటర్లను ఖుషీ చేసేందుకు మేకలు, కోళ్లు డోర్ డెలివరీ చేసేస్తున్నారు. 10కుటుంబాలకు ఒక మేక లేదా పొట్టేలు చొప్పున ఇచ్చి అంతా కలిసి పంచుకోమంటున్నారు. స్థానిక చికెన్ సెంటర్లకు చెప్పి దసరారోజు తమ వారికి ఉచితంగా చికెన్ పంపిణీ అయ్యేలా సిద్ధం చేశారు. దసరా వేడుకల సందర్భంగా కొన్నిచోట్ల నాయకులే ప్రత్యేక విందులు, బతుకమ్మ వేడుకల వద్ద డీజేలు ఏర్పాటు చేశారు. ఇక దసరా రోజున తమ అనుకూలవర్గం అందరికీ చేరేలా మాంసంతోపాటు మ ద్యంబాటిళ్లను కూడా సరఫరాకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో మహిళలకు చీరలు, ఇతర గృహోపకరణాలను పంచే యోచనలోనూ నేతలు ఉన్నారని సమాచారం. చదవండి: (Huzurabad Bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం) స్థానికేతరులకు రవాణా, భోజనం.. ►ఈనెల 8వ తేదీన నామినేషన్ల పర్వం ముగియగానే ప్రచారం జోరందుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పొరుగు జిల్లాల నుంచి వచ్చిన అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. ►ఈ క్రమంలో వారికి రవాణా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. పండక్కివెళ్లి అదే ఉత్సాహంతో తిరిగి వచ్చేందుకు దసరా ఖర్చులకు కూడా ఏర్పాట్లు చేశారు. కొందరు కార్యకర్తలు కాకుండా రోజుకూలీకి వచ్చేవారికి నియోజకవర్గం అవతల చెల్లింపులు జరిపారు. ►ఇలా వస్తున్నవారికి రోజుకు భోజనం, రవాణా సదుపాయంతోపాటు రోజుకు రూ.300 వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. మొత్తానికి దసరా పండుగ రోజు స్థానిక నేతలకు పనిభారం పెరిగింది. పండగరోజు కూడా ఓటర్లను కలుసుకోవడం, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలోనే మునిగిపోయారు. మద్యం, బహుమతుల పంపిణీపై పోలీసు నిఘా..! ►హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా దసరా రోజున భారీగా మద్యం పంపిణీ జరక్కుండా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, ఫ్లయింగ్ ఫ్లయింగ్ టీములతో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ►ఇప్పటిదాకా రూ.1,45,20,727 రూపాయల నగదును, రూ.1,50,000 విలువ గల 30 గ్రాముల బంగారం రూ.9,10,000 విలువ గల 14 కిలోల వెండిని, రూ. 5,11,652 విలువైన 867 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ►ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎలాంటి చర్యలకు దిగినా వెంటనే కేసులు నమోదు చేస్తామని సీపీ సత్యానారయణ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఎక్కడ అలాంటి అనుమానాస్పద వేడుకలు జరిగినా డయల్ 100కు సమాచారమివ్వాలని సూచించిన విషయం తెలిసిందే. శనివారం నుంచి హోరెత్తనున్న ప్రచారం..! 16వ తేదీ నుంచి హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తనుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 17 వారాలుగా బీజేపీ– టీఆర్ఎస్ పార్టీలు నువ్వా–నేనా అన్న స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. 9వ తేదీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా రంగంలోకి దిగారు. 13, 14వ తేదీల్లో బతుకమ్మ, 15వ తేదీ దసరాతో ప్రచారం కాస్త నెమ్మదించింది. అయితే, 16వ తేదీ నుంచి అన్ని పార్టీలు స్పీడు పెంచనున్నాయి. 16వ తేదీ తరువాత స్టార్‌క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి జాతీయస్థాయి నేతలు, టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలు ప్రచారబరిలో దూకనున్నారు. ఇకపై నేతల మాటల తూటాలతో హుజూరాబాద్ ఉపపోరు హోరెత్తనుంది. -
Huzurabad Bypoll: అధినేతలకు సిసలైన సవాలే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే బీజేపీ–టీఆర్ఎస్కు చెందిన స్థానిక నేతలు దాదాపు 17 వారాలుగా ప్రచారంలో తలమునకలయ్యారు. ఆ పార్టీల మధ్య నువ్వా–నేనా అన్న స్థాయిలో యుద్ధం నడుస్తోంది. శుక్రవారం నామినేషన్ల ఆఖరు రోజు అందరి కంటే ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మొదలుపెట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తొలిసారిగా హుజూరాబాద్‌కు వచ్చి ప్రసంగించి కేడర్‌లో జోష్ నింపారు. మొత్తానికి ఇంతకాలం స్థానిక నేతలతో సాగిన ప్రచారం ఇంకాస్త రంగులద్దుకోనుంది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారానికి దిగుతుండటంతో వారి చరిష్మా పార్టీకి తప్పకుండా ఉపయోగపడుతుందని, ఓటర్లను వారు తప్పకుండా ఆకర్షించగలుగుతారని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో పేర్కొన్న టీఆర్ఎస్ నేతల్లో దాదాపు అంతా నాలుగు నెలలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ జాబితాలో ఫైర్ బ్రాండ్లకే పెద్దపీట వేశారు. దీంతో హుజూరాబాద్ ప్రచారం మరింత పదునెక్కనుంది. అధినేతలకు సిసలైన సవాలే.. మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం బరిలో నిలిచాయి. ఈ స్థానంలో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్, గెలిచి సత్తా చాటాలని బీజేపీ, పూర్వ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌కు ఇది తొలి ఉప ఎన్నిక కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బైపోల్‌ను సవాలుగా తీసుకున్నారు. తనకు ఎంతో అచ్చివచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా ఉపపోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో మూడు ప్రధాన పార్టీల అధినేతలకు ఈ ఉపఎన్నిక చాలాకీలకంగా మారింది. చదవండి: (Huzurabad Bypoll 2021:పెంచేటోళ్లు వాళ్లు.. పంచేటోళ్లం మేము) బండి, కిషన్, విజయశాంతి ప్రత్యేక ఆకర్షణ..! ప్రజాసంగ్రామ యాత్ర కావడం వల్ల ఇంతకాలం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ ప్రచారానికి పెద్దగా అందుబాటులో లేకుండాపోయారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తొలిస్థానంలో ఆయనే నిలవడం గమనార్హం. తరువాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, డీకే అరుణ, తరుణ్‌చుగ్, డా.లక్ష్మణ్, మురళీధర్‌రావు, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్, విజయశాంతి, చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్‌రాథోడ్ తదితరులు 20 మంది జాబితాలో ఉన్నారు. బండి, అరవింద్, డీకే, రఘునందన్ అంతా ఫైర్ బ్రాండ్లుగా పేరున్నవారే. ఈ అందరిలోనూ బండి సంజయ్, కిషన్‌రెడ్డి, విజయశాంతి సభలకు జనాలు భారీగా వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. కేసీఆర్, కేటీఆర్‌లే స్టార్లు..! అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా 20 మందితో కూడిన తమ స్టార్ క్యాంపెయిన్ల లిస్టు విడుదల చేసింది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, గంగుల, కొప్పుల, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుంకె రవిశంకర్, సతీశ్‌బాబు, పెదిŠద్ సుదర్శన్ రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే.. వీరంతా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన జూన్ 12 తరువాత నుంచి హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. 20 మంది జాబితాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మినహా అంతా 17 వారాలుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ లోకల్ స్టార్లుగా మారిపోవడం గమనార్హం. అజారుద్దీన్, సీతక్క ప్రత్యేకం.. కాంగ్రెస్ పార్టీ సైతం 20 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్, భట్టి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, అనసూయ సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉ న్నారు. వీరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్, జగ్గారెడ్డి, వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి అంతా ఫైర్బ్రాండ్లుగా పేరున్నవారే. ఈ జాబితాలో అజారుద్దీన్, అనసూయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
ఎన్నికల్లో అధిక ఖర్చు: సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశంలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఎన్నికల ప్రచారంలో నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా ఆయన నేరానికి పాల్పడినట్లు తేల్చింది. శిక్షగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎల్రక్టానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లో ఉండాలని తీర్పు చెప్పింది. ఈ శిక్షను ఆయన తిరిగి అప్పీల్ చేసే అవకాశం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ, 2012 ఎన్నికల్లో నిర్ణయించిన ఆర్థిక మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ ఖర్చు చేశారని కోర్టు తేలి్చంది.