Campaigns
-
అట్లాంటాలో ట్రంప్ ప్రచారం.. ర్యాలీలో పాల్గొన్న భారతీయ అమెరికన్ ఓటర్లు
-
వామ్మో తెలుగు అనువాదం!
కోజికోడ్: తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో తన ప్రసంగాల అనువాదం సందర్భంగా చిత్రమైన సమస్యలు ఎదుర్కొన్నట్టు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో నెల రోజులకు పైగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెర పడటం తెలిసిందే. బుధవారం కేరళలోని కోజికోడ్‌లో రాహుల్ ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాన్ని ప్రముఖ ఉపన్యాసకుడు, ఐయూఎంఎల్ ఎంపీ అబుస్సమద్ సమాధానీ మలయాళంలోకి అనువదించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తనకెదురైన అనుభవాలను రాహుల్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక ప్రచార సభలో నా ప్రసంగాన్ని అనువదిస్తున్న వ్యక్తి ఎందుకోగానీ చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. నేనొకటి చెబుతుంటే ఆయన మరొకటి చెప్పసాగాడు. ఇక అలా కాదని నేను మాట్లాడిన పదాలు లెక్కబెట్టడం మొదలు పెట్టా. నేను హిందీలో ఐదు పదాలు మాట్లాడినప్పుడు తెలుగులో ఏడెనిమిది పదాలతో ముగిస్తాడని చూశా. కానీ ఆయన ఏకంగా 20 నుంచి 30 పదాలు మాట్లాడాడు. పైగా నేను బోరు కొట్టే విషయాలు మాట్లాడినప్పుడేమో జనం పరమోత్సాహంతో గట్టిగా చప్పట్లు కొట్టారు. మాంచి ఉత్సాహపూరితమైన ముచ్చట్లు చెప్పినప్పుడేమో అందరూ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంతా అనువాద మహిమ!’’ అంటూ వాపోయారు. ‘‘అంతా అలా ఉల్టాపల్టాగా నడిచింది. అయినా సరే, నేను ఎవరిపైనా కోపగించుకోలేని పరిస్థితి! పైగా ప్రసంగం సాగినంతసేపూ నిండుగా నవ్వుతూనే ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. బహుశా తన ప్రసంగాలకు అనువాదకునిగా ఉండటం ప్రమాదకరమైన పనేనంటూ రాహుల్ చమత్కరించడంతో అంతా నవ్వుకున్నారు. చిరిగిన దుస్తుల మాటున సంపద దాస్తున్న నేతలు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్ర శైలిని బట్టి వారిని అంచనా వేయకూడదని రాహుల్ అభిప్రాయపడ్డారు. నేటి నాయకులు తాము చూపించదలచింది మాత్రమే ప్రజలకు చూపిస్తుంటారని అన్నారు. ‘‘నన్ను కలవడానికి ఎందరో నాయకులు వస్తుంటారు. సాదాసీదా బట్టలు, చిరిగిన బూట్లతో కనిపిస్తారు. కానీ వాళ్లింటికి వెళ్తే పోరి్టకోలో ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లుంటాయి. వాళ్ల పిల్లలు అతి ఖరీదైన జీవితం గడుపుతూ కన్పిస్తారు. కనుక ఒక రాజకీయ నాయకుని ఆర్థిక స్థితిని సరిగా అంచనా వేయాలంటే అతని పిల్లలను గమనిస్తే చాలు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను కనిపెట్టిన తిరుగులేని సూత్రమిది’’ అని చెప్పారు. -
ఒక్క నియోజకవర్గాన్నీ వదలకుండా..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో దూకుడుగా ముందుకెళ్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. వరుసగా పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్‌షోలు, స్థానికంగా అభ్యర్థులు పాల్గొనే ప్రచార సభలతో.. ఏ నియోజకవర్గాన్ని, వాటి పరిధిలోని గ్రామాలను వదలకుండా ‘కార్పెట్ బాంబింగ్’ను తలపించేలా ‘కార్పెట్ కాన్వాసింగ్ (ప్రచారం)’ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాలని, ప్రతిపక్షాలను ఉక్కిరిబి క్కిరి చేసేలా వ్యూహాలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి తన్నీరు హరీశ్‌రావులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, జన సమీకరణ, ఇతర పార్టీల నుంచి చేరికలు, పార్టీ నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పలువురు కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన అంశంపైనా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఎక్కడా వదలకుండా.. సీఎం కేసీఆర్ ఈ నెల 15 నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొనేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. 10న నామినేషన్ల గడువు ముగిసి, తుది అభ్యర్థులు ఖరారవుతారు. ఆ తర్వాత మరో 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనేలా సభల షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ‘కార్పెట్ బాంబింగ్’ తరహాలో వరుసగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఎం పాల్గొనే సభలన్నింటికీ భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ సుమారు 60కిపైగా నియోజకవర్గాల్లో రోడ్‌షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ పరిధిలో కేటీఆర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్‌రావు స్థానిక ప్రచార ఇన్చార్జులుగా ఉంటూనే.. తాము పోటీచేసే నియోజకవర్గాల్లో, ఇతర చోట్ల సమన్వయ బాధ్యతలను చూడాల్సి ఉండనుంది. ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు పార్టీలో సమన్వయంతోపాటు ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పనిచేయనున్నారు. ఇక పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించడం, ఇతర కీలక నేతలతో సమన్వయం కోసం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జుల నియామకాన్ని చేపట్టారు. ప్రస్తుతానికి 54 మంది పేర్లు ఖరారు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ కీలక నేతలు ఈ ఇన్చార్జుల జాబితాలో ఉన్నారు. ఇక నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే బాధ్యతను హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ‘వార్ రూమ్’తో వ్యూహాల అమలు బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులతోపాటు విపక్షాల సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించేలా సిద్ధం చేశారు. బూత్‌స్థాయి నుంచీ పార్టీల బలాలు, బలహీనతలు, స్థానికంగా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలు వంటివన్నీ అందుబాటులో పెట్టారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యులు జగన్మోహన్రావు, దినేశ్ చౌదరి, సతీశ్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు వార్‌రూమ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు. చేరికలపై మరింత ఫోకస్ బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విపక్షాల్లోని బలమైన నేతలెవరు, వారిలో బీఆర్ఎస్లో చేరేందుకు ఉన్న అవకాశం, పార్టీలో చేర్చుకునేందుకు తీసుకోవాల్సిన చొరవపై ఓ ప్రైవేటు సర్వే సంస్థ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తోంది. దీని ఆధారంగా ఇతర పార్టీల నుంచి చేరికలను వేగవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు. విపక్షాల్లో టికెట్ దక్కని అసంతృప్తులను బీఆర్ఎస్ గూటికి చేర్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ఓ మాజీ మంత్రి త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. సాంస్కృతిక బృందానికి దిశానిర్దేశం కవి గాయకుడు ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్ గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌షోలతోపాటు ఎన్నికల ప్రచారంలో కీలకమైన సాంస్కృతిక, కళా బృందాలు ఏమేం చేయాలన్న దానిపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని చాటడంతోపాటు తెలంగాణ ఉద్యమకాలం నాటి సెంటిమెంటును రగిల్చేలా ఆటపాటలు ఉండాలని సూచించారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: నిక్కీ హేలీ
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ(51) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె విడుదల చేసే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించారు. తాజా పరిణామంతో తన మాజీ బాస్ ట్రంప్‌కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పక్షంలో బరిలో ఉండబోనంటూ గతంలో ప్రకటించిన హేలీ మనసు మార్చుకున్నారు. నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రత నిక్కీ రన్‌ధావా హేలీ. ఈమె తల్లిదండ్రులు అజిత్ సింగ్ రన్‌ధావా, రాజ్ కౌర్ రన్‌ధావా. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే అజిత్ సింగ్ కుటుంబంతో కలిసి 1960ల్లో కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు చేరారు. -
సచిన్ సోలో ప్రచార ర్యాలీ వ్యూహం..టెన్షన్లో కాంగ్రెస్
రాజస్తాన్ అంతటా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోలోగా ర్యాలీలు చేయనున్నట్లు సమాచారం. దీంతో మళ్లీ రాజస్తాన్‌లో అంతర్గతంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కోల్డ్‌వార్ ప్రారంభమైందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. కేవల 10 నెలల వ్యవధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సచిన్ ఇలా సోలోగా ప్రచార ర్యాలీలు నిర్వహించడంపై పార్టీలో రకరకాలు ఊహాగానాలు హల్చల్ చేయడం ప్రారంభించాయి. అదీగాక ఇటీవలే రాజస్తాన్‌లో భారత్ జోడో యాత్ర చాలా విజయవంతం జరిగింది కూడా. అనూహ్యంగా మళ్లీ సచిన్ ఇలా నిర్ణయం తీసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఐతే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీని సంబంధిత వాటిల్లో మరింత బోపేతం చేస్తూ కార్యచరణలో ఉంచడమే లక్ష్యంగా సచిన్ ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం నుంచే సచిన్ పైలల్ రైతులు, యువతను ఉద్దేశించి వరుస బహిరంగ సభల్లో ప్రసగించనున్నట్లు తెలిపాయి. ఐతే ఒకపక్క రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార అట్టడుగు స్థాయి సంస్థ పనుల్లో బిజీగా ఉండటం, మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన చివరి బడ్జెట్‌తో స్వయంగా వెళుతున్నందున, సచిన్ ఇలా సోలోగా ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారని కొందరూ విశ్లేషకులు భావిస్తున్నారు. అదీగాక 2003 లేదా 2013ల మాదిరిగా పార్టీ తుడిచిపెట్టుకుపోకుండా చూసేందుకు మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ జాట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఐతే పైలట్ ప్రచారానికి రాహుల్ గాంధీ ఆమోదం ఉందని చెబుతున్నప్పటికీ, ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి అనుమతి తీసుకులేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక రాష్ట్ర నాయకుడిగా సచిన్‌కి ఇదంతా అవసరమా అని పార్టీలో కొందరూ నాయకులు మండిపడుతున్నట్లు సమాచారం. (చదవండి: నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు) -
Andhra Pradesh: కాటేసిన కానుక!
డ్రోన్ ఫొటోల కోసం.. చంద్రన్న కానుకలున్న లారీల వైపు అక్క చెల్లెమ్మలు ఆశగా పరుగులు తీస్తుంటే డ్రోన్ ఫొటోలు బాగా వస్తాయని టీడీపీ నేతలు, నిర్వాహకులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరి ఆడక వారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని నిలిపివేసి బాధితులను ఆస్పత్రికి తరలించారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్రికల్లో ఫొటోలు, టీవీల్లో వీడియోలు, డ్రోన్ కెమెరా షాట్లు లక్ష్యంగా టీడీపీ ఆదివారం గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ ముగ్గురు పేద మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. అధికారంలో ఉండగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని బలిగొన్న చంద్రబాబు ప్రచారార్భాటం... గతవారం కందుకూరు ఇరుకు సందుల్లో నిర్వహించిన కార్యక్రమం 8 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణాన్ని మరచిపోకముందే నూతన సంవత్సరం తొలిరోజే మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి ముగ్గురు పేద మహిళలు బాబు వికృత రాజకీయ క్రీడకు బలయ్యారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తన రాజకీయ ప్రచార పదఘట్టనల కింద సామాన్యులు నలిగిపోతూ ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోతున్నా చంద్రబాబు తీరు మారడం లేదు. ఏమాత్రం పశ్చాత్తాపం కానరావడం లేదు. మంచినీళ్లూ ఇవ్వలేదు.. సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పేద మహిళలను వికాస్ కాలేజీ మైదానానికి తరలించారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ఉయ్యూరు ఫౌండేషన్ ఎండీ ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు వేదిక వద్దకు చేరుకుని స్వయంగా పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారని షెడ్యూల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పేదలను తరలించగా చంద్రబాబు సాయంత్రం 5.30 గంటలకు వేదిక వద్దకు రావడం గమనార్హం. అప్పటికే దాదాపు ఐదు గంటలకుపైగా నిరీక్షించాల్సి రావడం, కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేకపోవడంతో మహిళలు అల్లాడారు. అంత ఆలస్యంగా వచ్చినా చీరల పంపిణీని ప్రారంభించలేదు. చీరల పంపిణీ మొదలుపెడితే చంద్రబాబు ప్రసంగం వినేందుకు ఎవరూ ఉండరనే భయంతో టీడీపీ నేతలు వాటిని మహిళలకు అందించలేదు. సాయంత్రం 5.35 గంటలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించి 6.15 గంటలకు ముగించారు. కొంత మందికి మాత్రం చంద్రబాబు సంక్రాంతి కానుకలు అందచేయగా మిగతావారికి టీడీపీ నేతలు ఇస్తారంటూ వెళ్లిపోయారు. కానుక పంపిణీ కోసం సన్నగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు ఐదు నిమిషాల్లోనే... అప్పటివరకు కానుకల పంపిణీ గురించి గొప్పగా చెప్పిన నిర్వాహకులు చంద్రబాబు నిష్క్రమించగానే మాట మార్చారు. నామమాత్రంగా కొందరికి అందించి చేతులు దులిపేసుకోవాలని భావించారు. మిగిలిన వారందరికీ డివిజన్లలోకి వచ్చి పంపిణీ చేస్తామని చెప్పడంతో మహిళలు నిర్ఘాంతపోయారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ వలంటీర్లు కూడా బాబు ప్రసంగం ముగియగానే జారుకోవడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. చీరలు పంపిణీ చేస్తామని మభ్యపుచ్చి బలవంతంగా తీసుకొచ్చి గంటల తరబడి పడిగాపులు కాశాక తీరా మొహం చాటేయడంతో వారిలో ఆక్రోశం నెలకొంది. కానుకల కోసం తోసుకుంటూ తూతూమంత్రంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు కదిలారు. తోపులాటలో ఒకరిపై ఒకరు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో గుంటూరు కన్నావారితోటకు చెందిన సయ్యద్ ఆసియా (48), ఏటీ అగ్రహారానికి చెందిన గోపిదేశి రమాదేవి (50), మారుతీనగర్ నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన షేక్ బీబీ (55) తొక్కిసలాటలో ఊపిరి ఆడక మృతి చెందారు. వీరిలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 30 కౌంటర్లంటూ.. 12 లారీల్లో చంద్రన్న సంక్రాంతి కానుకలను 30 కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ కేవలం 12 మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా కానుకలతో కూడిన లారీలను నేరుగా మైదానంలోకి తరలించి వాటి నుంచే పంపిణీ చేశారు. వాహనాలను దూరంగా కాకుండా దగ్గరగా ఇరుకుగా నిలబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన 5 నిముషాల్లోనే కానుకల పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో లారీలు కదలడానికి సిద్ధమవుతున్నాయని పసిగట్టిన పేదలు కానుకల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఫలితంగా తొక్కిసలాటకు దారితీసి అమాయక మహిళలు మృత్యువాత పడ్డారు. ఇదేం మానవత్వం! గుంటూరు: చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన సయ్యద్ ఆసియా (48)ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. టీడీపీ నేతలు, ఉయ్యూరు ఫౌండేషన్ వారు ఆసియా మృతదేహాన్ని వాహనంలోని సీటులో కాకుండా, డిక్కీలో పడేసి తీసుకు రావడం బాధితులను, చూపరులను ఎంతో బాధకు గురి చేసింది. కొంచెమైనా కనికరం లేకుండా, కనీసం మానవత్వం చూపకుండా ఇలా వ్యవహరించడం దారుణం అని పలువురు విమర్శించారు. ఆసియాను కారు డిక్కీలో హాస్పిటల్‌కు పంపిస్తున్న టీడీపీ నాయకులు పోలీసులు ముందే హెచ్చరించినా.. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జేసీ రాజకుమారి తదితరులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సభాప్రాంగణం 8 వేల మందికి మాత్రమే సరిపోతుందని పోలీసులు ముందుగానే హెచ్చరించినా నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల ఘటన చోటు చేసుకుంది. బ్యారికేడ్లు పటిష్టంగా లేవని కూడా ముందుగానే హెచ్చరించామని, వారి నిర్లక్ష్యమే ఘటనకు దారి తీసిందని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. జీజీహెచ్ వద్ద ఆర్తనాదాలు.. షేక్ రజియా, ప్రసాదం సీతామహాలక్ష్మి, మస్తాన్‌బీ, తెల్లమేకల మంగమ్మ, పెందుర్తి ప్రియాంక, కమాదుల సరోజని, ఎస్.భూలక్ష్మి, హిమంది ఉమాదేవి, తెల్లమేకల రంగమ్మ, హుస్సేన్‌బీ, గుంటముక్కల సౌందర్య, జానా దుర్గ, పఠాన్ ఆస్మా, నిర్మల తదితరులు తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, గుంటూరు నగరానికి చెందిన పల్లపుకుమారి, సాయికృష్ణనగర్కు చెందిన ఇరుగు కోటేశ్వరమ్మ, కె.ఇవలమ్మ, సీతమ్మకాలనీకి చెందిన సొప్పర కీర్తన, స్వర్ణాంధ్రనగర్కు చెందిన చిట్టాల శివపార్వతి, చైత్యపురి సుగాలీకాలనీకి చెందిన ధనావత్ అలివేలు తోపులాటలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు జీజీహెచ్‌కు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు మిన్నంటాయి. కొత్త ఏడాది తొలిరోజే తమ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొందని విలపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మార్కెట్‌యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తదితరులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మంత్రి రజిని ప్రకటించారు. నాసిరకం కిట్లతో హంగామా గుంటూరు రూరల్: చంద్రన్న కానుకలంటూ సభా ప్రాంగణం వద్ద పంపిణీ చేసిన కిట్‌లో అరకిలో కందిపప్పు, ప్యాకెట్ పామాయిల్, అరకిలో చింతపండు, అరకిలో గోధుమపిండి, కిలో ఉల్లిపాయలు, అరకిలో బెల్లం, చీర ఉన్నాయి. కిట్‌లో మొత్తం సరుకుల విలువ రూ.300కి మించి ఉండదని వాటిని తీసుకున్న మహిళలు చెబుతున్నారు. పది వేల మందికి మాత్రమే చీరలు కొనుగోలు చేసి గుంటూరులోని నగరం, పరిసర ప్రాంతాల్లో 30 వేల మందికి టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం మహిళల ఆధార్ జిరాక్స్‌లను నిర్వాహకులు తీసుకున్నారు. వారి పేర్లతో టీడీపీ సభ్యత్వాలు నమోదు చేసేందుకే ఆధార్ సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మునుగోడులో 50వేల మెజార్టీతో గెలవబోతున్నా: కేఎ పాల్
నల్గొండ: 50వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలివైన మునుగోడు ప్రజలు తనకే అండగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రజలు ప్రధాన పార్టీలను ఓడిస్తారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. హైదరాబాద్‌కు తాను ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకురావడంతో అభివృద్ధి చెందిందని.. అదే మాదిరిగా మునుగోడుకు సైతం తీసుకొస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100–112 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చు మునుగోడుకు ఇస్తే ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తాను విజయం సాధిస్తున్నానని తెలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన బహిరంగ సభను రద్దు చేసుకున్నాడని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని, ఆ సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. వారంతా తనకే మద్దతుగా ఉన్నారని తెలిపారు. -
ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఎన్నికల ప్రచారం నేటి (మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుకు మోదీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శలు గుప్పించారు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో బీజేపీ నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కాంట్రాక్టర్లను మోదీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ రాకముందు కరెంట్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ సామాన్యుడి బతుకు నాశనం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేశారు. మోదీ అధికారంలో వచ్చినప్పుడు రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. మోదీ వచ్చినప్పుడు పెట్రోల్ ధర రూ.70 ఉంటే ఇవాళ 110 రూపాయలకు చేరింది. కార్పొరేట్ శక్తులకు మోదీ కొమ్ముకాస్తున్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా. ఎవరు పెద్దోళ్ల కోసం ఉన్నారు..? ఎవరు పేదోళ్ల కోసం ఉన్నారు. ఆలోచించి ఓటు వేయండి.. ఆగం కాకండి. ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని’ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
మునుగోడుపై టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్! రంగంలోకి కేటీఆర్, హరీశ్ కూడా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటంతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సర్వశక్తులూ ఒడ్డి అయినా మునుగోడులో విజయం సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి, ప్రచారాన్ని వేడెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే మునుగోడు అభ్య ర్థులను ప్రకటించినా టీఆర్ఎస్ అధికా రికంగా వెల్లడించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే అవకాశమిస్తారని.. ఈనెల 5న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొత్త జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం దగ్గర దరఖాస్తు చేసుకున్నాక.. పేరు పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియల కోసం ఈసీ దాదాపు నెలరోజుల సమయం తీసుకుంటుందని.. అందువల్ల టీఆర్ఎస్ పేరుతోనే ఉప ఎన్నికకు వెళ్లనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీపీఎం, సీపీఐలతో ‘స్టీరింగ్ కమిటీ’ మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ రెండూ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీల నేతల సమన్వయంతో ప్రచారాన్ని నిర్వహించేందుకు ‘స్టీరింగ్ కమిటీ’ఏర్పాటు చేయనున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గాన్ని 90 యూనిట్లుగా విభజించి 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ము ఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించేలా టీఆర్ఎస్ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇన్చార్జులుగా నియమితులైన నేతలు ఈ నెల 7నుంచి తమకు నిర్దేశించిన యూనిట్ (ఎంపీటీసీస్థానం) పరిధిలో ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ప్రచారంలో భాగంగా చివరి దశలో అంటే అక్టోబర్ చివరి వారంలో సీఎం కేసీఆర్ చండూరులో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఓటర్ను చేరేలా ప్రణాళిక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 35 మందికిపైగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే 75 వేల మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలిసినట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గానికి చెందిన ఏడున్నర వేల మంది గిరిజనులను ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్ బంజారా భవన్‌కు తీసుకొచ్చి పది శాతం గిరిజన రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకాలపై అవగాహన కల్పించారు. ఇలా ప్రభుత్వ పథకాలపై ప్రతీ ఓటరుకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. అక్కడక్కడా సద్దుమణగని అసమ్మతి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. పార్టీలో అంతర్గత అసమ్మతి పూర్తిస్థాయిలో సద్దుమణగడం లేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన అసంతృప్తులు.. తర్వాత కొంతమేర స్వరాన్ని తగ్గించారు. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సమన్వయం చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తమను కలుపుకొనిపోవడం లేదంటూ బీసీ సామాజికవర్గానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కొందరు నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. మునుగోడుకు కేటీఆర్, హరీశ్ కూడా? మునుగోడు టీఆర్ఎస్ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావును కూడా కేసీఆర్ రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వారు తమకు కేటాయించిన యూనిట్లలో బాధ్యతలు చూసుకుంటూనే.. సమన్వయ బృందా నికి మార్గనిర్దేశం చేస్తారని సమాచారం. -
మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల సమరానికి కమలదళం ఫుల్‌జోష్‌తో సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బహిరంగసభల్లో వారు పాల్గొంటారు. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ నాయకులు ఇక్కడ విస్తృతంగా పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌కు సరిగ్గా 30 రోజులే ఉండడంతో దసరా తర్వాత శుక్రవారం నుంచే మునుగోడులోని 6 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం పార్టీ యంత్రాంగాన్ని మోహరించనుంది. ఎన్నికల సమన్వయానికి జి.వివేక్ వెంకటస్వామి చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలతో బీజేపీ ఎలక్షన్ స్టీరింగ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పర్యవేక్షణలో పనిచేసేందుకు 6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మొత్తం 24 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను నియమించింది. వీటి పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు ఇన్‌చార్జీలుగా పార్టీనాయకులు, కార్యకర్తలను ఏర్పాటు చేసింది. ఈ నియోజకవర్గంలోని 298 పోలింగ్‌బూత్‌లకు గాను ఒక్కో దాంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించింది. అయితే.. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బహిరంగసభల కంటే ప్రతి ఓటర్ను కలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎన్నికల స్టీరింగ్ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలో చిన్న చిన్నసభలు అధికంగా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఇక్కడ చేపట్టాల్సిన బైక్ర్యాలీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
నెల రోజులపాటు ’పల్లె పల్లెకు కాంగ్రెస్’
సాక్షి, హైదరాబాద్: వరంగల్ డిక్లరేషన్‌పై గంపెడాశలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. శనివారం నుంచి నెల రోజులపాటు ‘పల్లె పల్లెకు కాంగ్రెస్’పేరుతో ఈ డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూట్‌మ్యాప్‌లు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయరంగ వ్యతిరేక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాము రైతాంగానికి ఏం చేయబోతున్నామన్న అంశాలను కూడా వివరించనున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి రేవంత్ అక్కంపేటకు బయలుదేరుతారని, మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కంపేట చేరుకుని అక్కడి రైతులతో ముచ్చటిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జయశంకర్‌తో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించవచ్చని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. మైకులు పెట్టొద్దు... సన్మానాలు చేయొద్దు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈనెల 27 నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో రైతు డిక్లరేషన్ సభల ఏర్పాట్లు చేసుకుంటున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాను గ్రామాలకు వచ్చే సమయంలో టెంట్లు, మైకులు, భోజనాల ఏర్పాట్లు చేయవద్దని, ఊరేగింపులు, శాలువాలు, సన్మానాలు వద్దని నియోజకవర్గ నేతలను కోరుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. రోజుకు 4 గ్రామాలు పర్యటిస్తానని, ప్రతి గ్రామంలో 2 గంటలు ఉండి రైతులు, ప్రజలతో మాట్లాడి రాహుల్ గాంధీ సూచనల మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నేరుగా గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయా గ్రామాల ప్రజలు, రైతులతో చెట్టు కింద కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి వెల్లడించడం గమనార్హం. -
ప్రచారంలో పీక్స్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం
మార్కెట్లో దూసుకెళ్లడం కోసం కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుడగలు వేస్తుంటారు వ్యాపారులు. కార్పోరేట్ కంపెనీల నుంచి గల్లీ కొట్టు వరకు వారి వారి స్థాయిల్లో వివిధ పద్దతుల్లో ప్రచారం చేస్తుంటారు. ఫెస్టివల్ సీజన్, స్టాక్ క్లియరెన్స్ పేరుతో ఇప్పటి వరకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ వారణాసికి చెందని ఓ మొబైల్ స్టోర్ యజమాని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సరికొత్త ప్రచారానికి తెర తీశాడు. వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ సమ్మర్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. ఈ స్టోర్‌లో పది వేల రూపాయలకు పైగా విలువైన ఫోన్‌ను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోలు ఉచితంగా అందిస్తామంటూ ప్రకటించింది. అంతేకాదు మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌పై ఐదు నిమ్మకాయలు కూడా ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది. మిగిలిన మొబైల్ స్టోర్లకు భిన్నంగా మొబి వరల్డ్ ప్రకటించిన ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మండుటెండలో కూడా ఈ ఆఫర్ ఏంటా అని తెలుసుకునేందుకు స్టోర్‌కి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా అమ్మకాలు కూడా బాగున్నాయంటున్నారు స్టోర్ నిర్వాహకులు. మార్కెట్లో పెట్రోల్, నిమ్మకాయల రేట్లు మండిపోతుండటంతో వాటిని ఉచితంగా అందిస్తామంటూ ఆఫర్ ప్రకటించడం తమకు కలిసి వచ్చిందంటున్నారు స్టోర్ నిర్వాహకులు. చదవండి: యాడ్స్‌పై ఒక్క రూపాయి పెట్టలేదు.. కానీ కంపెనీ విలువ రూ.76.21 లక్షల కోట్లు -
‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’
సాక్షి, నెల్లూరు: కుప్పంలో కూడా టీడీపీకి ఓటమి భయంపట్టుకుందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. టీడీపీ స్థాయి దిగజారిందని.. కుప్పంలో విజయం సాధించడానికి లోకేష్ ఐదువేలు పంచటం సిగ్గుచేటని విమర్శించారు. సొంత నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేని బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పంని మున్సిపాలిటీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలలో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందని మంత్రి బాలినేని తెలిపారు. -
మంగళసూత్ర యాడ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
వ్యాపారంలో ఏ వస్తువుకయినా ప్రచారం ఎంతో ముఖ్యం. అందుకే కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను క్యాంపెయిన్ కోసం వెచ్చిస్తుంటాయి. అడ్వర్టైజింగ్ సంస్థలు సైతం ఎంతో జాగ్రత్తగా యాడ్స్‌ని రూపొందిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి క్రియేటివిటీ అదుపు తప్పుతుంది. దీని వల్ల అసలుకే ఎసరు వస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఇంటిమేట్ జ్యూయల్లరీ యాడ్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి చిక్కుల్లో పడ్డారు. స్టైల్ఐకాన్గా పేరున్న ఆయన ఇటీవల ఆయన రూపొందించిన యాడ్ క్యాంపెయిన్ బెడిసి కొడుతోంది. మంగళసూత్ర పేరుతో సబ్యసాచి చేసిన పనేం బాగాలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాయల్ బెంగాల్ ఇంటిమేట్ ఫైన్ జ్యూయల్లరీ థీమ్‌తో యాడ్ క్యాంపెయిన్ని సబ్యసాచి ముఖర్జి ఇటీవల ఫోట్ షూట్ నిర్వహించారు. హెటిరో సెక్సువల్, సేమ్ సెక్సువల్ మోడల్స్‌ని ఉపయోగిస్తూ ఈ షూట్‌ని పూర్తి చేశారు. అనంతరం క్యాంపెయిన్‌లో భాగంగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్యసాచి ముఖర్జీ పోస్ట్ చేశారు. ఇందులో రాయల్ బెంగాల్ మంగళసూత్ర పేరుతో పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమయ్యాయి. No! This is no lingerie or C0nd0m Ad. This is Sabyasachi Mangalsutra Ad. Ultra Woke #Sabyasachi are so creatively bankrupt that they have to use semi naked models for a Mangalsutra ad.#BoycottSabyasachi #Femina pic.twitter.com/dim9YpJhgF — श्रद्धा | Shraddha 🇮🇳 (@immortalsoulin) October 27, 2021 How nonsense #Sabyasachi think of for such a vulgur ads of #Mangalsutra ? Leftists minded peoples are continuously targeting Hindu rituals & tradition by their toxic thoughts in making Ads, Pictures etc. ऐसे "सुवरों" के लिए गाली भी छोटी पड़ेगी. Has @ascionline notice this. pic.twitter.com/KyfEx0PKpX — Hiren Pawar. (@HirenPawar1) October 29, 2021 Friend : How does a plump woman standing with an ill fitting bra, with a Jaguar on a sling convey "WHAT WOMAN WANTS"???? Me : IT'S HER CHOICE!! You've no right to make fun of her .What if she doesn't wear any????#Sabyasachi pic.twitter.com/ne74DKuDwC — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) October 29, 2021 ఇదేమైనా లింగరీనా ? బుధవారం ఈ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు అయిన మరుక్షణం నుంచే నెటిజన్లు సబ్యసాచిపై దుమ్మెత్తి పోస్తున్నారు. లింగరీ, కండోమ్ యాడ్ కాదు కదా .. మంగళ సూత్ర యాడ్‌కి ఇలాంటి ఫోటో షూట్ అవసరమా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు న్యూడిటీ చాటున ప్రమోషన్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహం వెల్లువలా పోటెత్తుతోంది. అందులో కొందరి అభిప్రాయం ఇలా ఉంది - ఇది మంచి పద్దతి కాదు. ఇందులో జ్యూయల్లరీ ఎక్కడుంది - మీరు అసలు ఏం ప్రచారం చేయాలనుకున్నారు ? ఇలాంటి జ్యూయల్లరీని ఎవరైనా ధరిస్తారా ? ప్రచారం నిర్వహించేప్పుడు జాగ్రత్తగా ఉండండి - జ్యూయల్లరీకి ఇలాంటి యాడ్ చేసినందుకు సిగ్గుపడాలి. ఈ జ్యూయల్లరీని నేను ఎప్పుడు కొనను - జ్యూయల్లరీ రూపొందించడం ఎంతో నేర్పుతో కూడిన కళ. దాన్ని ఇలా చేయడం మంచి పద్దతి కాదు - ఫోటో కింద జ్యూయల్లరీ క్యాంపెయిన్ అనే క్యాప్షన్ చూడకుంటే ఈ ఫోటోలు బీగ్రేడ్ మూవీ పోస్టర్లలా ఉన్నాయి. - సబ్యసాచి అసలు నీకేమయ్యింది. ఇలా ఎవరైనా మంగళసూత్రం అమ్మకాల ప్రకటన చేస్తారా ? మంగళసూత్ర అంటే ఇది మరికొందరు నెటిజన్లు మంగళ సూత్రం ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చాలా మంది మంగళసూతం ఎలా ధరిస్తారో, ఎలా ధరించాలో, ఎలాంటి ఫోటోలు తీయాలో చెబుతూ ట్విట్టర్ , ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సబ్యసాచిని ట్యాగ్ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. Mangalsutra looks like this #Sabyasachi It's not a random piece of fashion jewellery, it indicates the love and commitment the husband and wife have towards each other. pic.twitter.com/HB3r4Aa4A4 — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) October 27, 2021 #Mangalasutra is NOT a "tiny intimate Jewelry" to be hidden. It's Long for whole world to see. It's PIOUS It's PRIDE It's Worn with Attitide (Ghamand) of being a Sanatani Hindu Woman ! pic.twitter.com/InN90Uiddp — 🍁 Sanatani Yoddha (@VidyaSanatani) October 27, 2021 -
బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, బద్వేలు(వైఎస్సార్ కడప): బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలని ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధని భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను కోరారు. చదవండి: రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు -
పురపోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన ప్రలోభం!
సాక్షి, నకిరేకల్(నల్లగొండ): జిల్లాలో జరగుతున్న నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగి సింది. దీంతో మైకులు మూగబోయాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు 72 గంటల ముందే గడువు విధించడంతో రెండు రోజుల ముందే మున్సిపాలి టీ ఎన్నికల అభ్యర్థుల ప్ర చా రం పరిసమాప్తమైంది. ఆ యా పార్టీల అభ్యర్థుల దృష్టాంతా ఓట్ల కొనుగోళ్లపైనే కేంద్రీకృతమైంది. నకిరేకల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను 21,382 మంది ఓటర్లు ఉన్నారు. అధికార టీ ఆర్ఎస్ పార్టీ ఒంటరిగా అన్ని వార్డులకు పోటీ చేస్తోంది. వివిధ పా ర్టీలకు చెందిన 93 మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి 20, కాంగ్రెస్ నుంచి 16, బీజేపీ నుంచి 14, సీపీఎం నుంచి ము గ్గురు, టీడీపీ నుంచి ఒకరు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 14మంది, ఇండిపెండెంట్లు 25మంది మొత్తం 93 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, మరికొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్, మరికొన్ని వార్డుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా రీతిలో కనిపిస్తోంది. వారం రోజుల పాటు జోరుగా ప్రచారం చేయడంతోపాటు, ఇంటింటికీ అభ్యర్థులు, వారి పార్టీల కార్యకర్తలు తిరి గారు. ఒక్కో వా ర్డును కనీసం నాలు గైదు పర్యాయాలు చుట్టి వచ్చారు. పోలింగ్ ఈనెల 30న జరగనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు సై తం ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తూ ఓట్లు అ భ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి వార్డులో 900 నుంచి 1200 లోపు ఓట్లు కలిగి ఉన్నాయి. ఇందులో క నీసం అరవై శాతం ఓట్లకు డబ్బులు పంచితే చా ల న్న ఆలోచనలో ఆయా పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు ప్రచారం. కొన్ని వార్డుల్లో కొంత మంది అభ్యర్థులు ఒక్కో ఓటరుకు రూ.1500 నుంచి రూ.3వేల వరకు పంచుతున్నట్లు సమాచారం. ఇక పోటీ ఎక్కువగా ఉండి తప్పదు అనుకున్న కొన్ని వార్డుల్లో మాత్రం ఓ టుకు రూ.5 వేల చొప్పున పంచే ఆలోచనలో మ రికొందరున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పలు వార్డుల్లో ఇప్పటికే ఓటుకు రూ. 2వేలు పంచినట్లు తెలుస్తోంది. మరొక వార్డులో ఇంటింటికీ కేజీ చికెన్ కూడా పంపిణీ చేశారని తెలుస్తోంది. ఆఖరి రోజున జోరుగా ప్రచారం.. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ తరపున మంత్రి జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నకిరేకల్, తుంగతుర్తి, కోదాడ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య రోడ్డుషో, ప్రచార సభలు నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పాల్వాయి రజనీలు ప్రచారంలో పాల్గొన్నారు. మందు... విందు.. నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వార్డుల్లో పురుష ఓటర్లను ఒకే చోటకు చేర్చి సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యంతో మర్యాదలు చేయాల్సి వస్తోందని.. ఎక్కువ ఖర్చు అవుతోందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు తమ వెంట తిరిగే వారికి రోజు కూలి మాట్లాడుకొని తిప్పుకున్నారని, ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.350 వరకు ప్రతిరోజు చెల్లించారని సమాచారం. -
టీడీపీ ప్రచారానికి జనం కరువు
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు విజయం చేకూర్చాలంటూ సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటికే ఒక్క అధికార వైఎస్సార్సీపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి మినహా మిగిలిన పార్టీల రాష్ట్ర, కేంద్ర స్థాయి అగ్రనేతలు ప్రచారం మమ్మురంగా చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు సాధ్యం కానీ హామీలతో జనాన్ని మాయ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ సభలను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకత్వం అష్టకష్టాలు పడుతోంది. ఓ వైపు మమ్మురంగా వరి కోతలు, వ్యవసాయ పనులు, ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు మండుటెండలు కాస్తున్నాయి. దీంతో పాటు ప్రధానంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభన చేస్తోంది. ఇన్ని రకాల కారణాల రాజకీయ సభలు, సమావేశాలకు జనం సమీకరించడం నియోజకవర్గ నేతలకు కష్టంగా మారుతోంది. జనాన్ని తోలినా.. నిలవని వైనం ఉప ఎన్నికల్లో జన సమీకరణ కోసం టీడీపీ నేతలు కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రజల్లో పరపతి కోల్పోయింది. పారీ్టకి జనాధారణ కరువైంది. ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు మాజీ మంత్రుల పర్యటనలు విజయం చేయాలంటే స్థానిక నాయకత్వానికి చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. టీడీపీ నేతల సభలు, సమావేశాలకు జనం పెద్దగా రావడం లేదు. రోడ్ షోలు వెలవెలపోతున్నాయి. దీంతో ఎలాగైనా జన సమీకరణ చేసి అగ్రనేతల ముందు పరువు నిలబెట్టుకునేందుకు జిల్లా నాయకత్వంతో పాటు నియోజకవర్గ నేతలు కుస్తీ పడుతున్నారు. ఇటీవల చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంతో బరిలో నిలిచిన తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి జనాన్ని తీసుకుని రమ్మని నియోజకవర్గ నేతలు స్థానిక నేతలకు చెప్పడంతో ‘మా ఎన్నికలను బహిష్కరించిన చంద్రబాబు గొప్పల కోసం మేమెందుకు ఇంకా జెండాలు మోయాలని, మాకేం ఖర్మ’ అంటూ ముఖం చాటేశారు. రెండు రోజులుగా చంద్రబాబు పర్యటించిన సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో రోడ్‌షో విజయవంతానికి స్థానిక నాయకత్వం అరువు కూలీలను తెచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కూడా సభలు ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయాయి. చంద్రబాబు సభలకు నియోజకవర్గంలోని స్థానిక నేతలు హాజరు పెద్దగా కనిపించలేదు. జిల్లా నలుమూలల నుంచి అరువు కూలీలను తరలించినట్లు తెలుస్తోంది. ఆ జనం ప్రసంగం పూర్తి కాకుండానే వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది. ఆ సభలకు హాజరైన జనానికి డబ్బులు పంచుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కూలీలను తెచ్చిన మేస్త్రీలకు ప్యాకేజీ ఇచ్చారంటా. ఇంతా చేసి చేతి చమురు వదిలించుకున్నా కూడా సభలు సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు స్థానిక నాయకత్వంపై గుర్రుమన్నట్లు సమాచారం. చదవండి: హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ -
సాగర్ ఉపఎన్నిక: ఇక దూకుడే..
హైదరాబాద్: చావోరేవో తేల్చుకోవాల్సిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మంత్రం జపించనుంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి విజయం కోసం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలు శనివారం నుంచి దాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మిగిలిన నాయకులు శనివారం నుంచి నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారని, పోలింగ్ ముగిసే వరకు ప్రచారంలో అధికార టీఆర్ఎస్కు తీసిపోకుండా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 27న హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార గడువు ముగిసేలోపు మరోమారు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. చివరి వారం రోజుల్లో నియోజకవర్గాన్ని చుట్టుముట్టి పోలింగ్‌కు ఉత్సాహంగా సిద్ధం కావాలని నేతలు భావిస్తున్నారు. మండలాలవారీగా ఇన్చార్జీలు ఇతర పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అంతకు రెండు నెలల ముందు నుంచే జానారెడ్డితోపాటు ఆయన తనయులు రఘువీర్, జైవీర్‌లు నియోజకవర్గంలో రెండు దఫాలుగా పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించడం, వారిని ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు దూరమైన కొందరు నేతలను కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జానా అండ్ కో గత నెల 27న హాలియాలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభకు ఆశించిన మేర జనం హాజరు కావడం, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ సభకు రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జానా, ఆయన తనయులకు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా తోడు కానుంది. ఇప్పటికే టీపీసీసీ పక్షాన మండలాలవారీ ఇన్చార్జీలను నియమించిన ఉత్తమ్ శనివారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రచారానికి హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆదివారం నుంచి ముఖ్యులంతా నియోజకవర్గంలోనే ఉండి టీఆర్ఎస్ను తలదన్నేలా ప్రచారం చేయాలని టీపీసీసీ నాయకత్వం నిర్ణయించింది. సాగర్ ఎన్నికల ప్రచారంపై టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లి, మద్యం పారించి గ్రామాల్లో హల్చల్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత మద్యం పోసినా జానారెడ్డి గెలుపు ఖాయం. కాంగ్రెస్ కేడర్ విజయంపట్ల పూర్తిస్థాయి విశ్వాసంతో ప్రచారంలో ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో జానా గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులంతా ఐక్యంగా, ప్రణాళిక ప్రకారం ప్రచారంలో పాల్గొంటారు’అని వ్యాఖ్యానించారు. చివరి వారమే కీలకం ఎన్నికల ప్రచారంలో చివరి వారంరోజులు చాలా కీలకమని, ఆ సమయంలో విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మరోమారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉండటం, ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో తాము ఎక్కడా తగ్గలేదనే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లేలా రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. కోవిడ్‌తో ఇంటికే పరిమితమైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ నెల 5 తర్వాత ప్రచారంలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. సీఎం బహిరంగసభ నిర్వహించే తేదీని బట్టి మరోమారు తాము కూడా బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌తోపాటు జానాతో సన్నిహిత సంబంధాలున్న జాతీయ నేతలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నారు. చివరి వారంపాటు నియోజకవర్గంలోని గడప గడపనూ తొక్కి జానా గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించే వ్యూహంతో టీపీసీసీ సిద్ధమవుతోంది. -
విశ్వనగరమా? విద్వేష నగరమా?
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం కావాలా? విద్వేష నగరం కావాలా? అన్న అంశంపై ఆలోచన చేయాలని హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు మరోసారి విజ్ఞప్తి చేశారు. తెల్లారి లేస్తే అనుమానాలతో ఒకరినొకరు చూసుకొనే హైదరాబాద్ నగరం కావాలా? అన్నదమ్ముల్లా కలసి ఉండే హైదరాబాద్ కావాలా? అని ప్రశ్నించారు. మతం పేరుతో ఆగమాగం కావడానికి ఇది అహ్మదాబాద్ కాదని, ప్రగతిశీల ఆలోచనలుగల హైదరాబాద్ నగరమన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తాను చదువుకొనే రోజుల్లో ఏటా నగరంలో అల్లర్లు చోటుచేసుకొని వారం, పది రోజులు కర్ఫ్యూ ఉండేదన్నారు. గత ఆరేళ్లలో అరగంట కూడా నగరంలో కర్ఫ్యూ విధించలేదన్నారు. హిందూ–ముస్లిం అనడం తప్ప బీజేపీ నేతలకు మరేదీ తెలియదన్నారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని ఎద్దేవ చేశారు. గత ఆరేళ్లుగా నగరంలో మత కల్లోలాలు, బాంబు పేలుళ్లు, ఆకాతాయిల ఆగాడాలు, చైన్ స్నాచింగ్‌లు, పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బు లేదన్నారు. నగరంలో 5 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే నిమి షాల్లో నిందితులను పట్టుకుంటున్నామన్నారు. చిన్న బిల్డర్ల సమస్యలను పరిష్కారిస్తామని, డిసెంబర్ 4 తర్వాత వారితో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ దేశంలో భాగం కాదా? కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తితే వారం రోజుల్లోనే రూ. 640 కోట్లను కేంద్రం ఇచి్చందని, గుజరాత్లో వరదలు రాగానే రూ. 500 కోట్లను ప్రధాని మోదీ ఇచ్చారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ హైదరాబాద్‌లో వరదలొస్తే ఇప్పటివరకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని, భాగ్యనగరం భారతదేశంలో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. గత ఆరేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వెళ్లిందని, మరోవైపు కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 1.40లక్షల కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయన్నారు. తెలంగాణకే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతికి ప్రధాని మోదీ ఏం ఇచ్చారు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తరఫున అమరావతి నిర్మాణానికి రూ. 100 కోట్ల విరాళాన్ని ప్రకటించడానికి సీఎం కేసీఆర్... రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే ప్రధాని కేవలం తట్టెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చారని తెలుసుకొని సీఎం కేసీఆర్ ఆ సహాయాన్ని ప్రకటించలేకపోయారన్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో గుంతల్లేని రోడ్లున్నాయా? హైదరాబాద్‌లో గుంతల్లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష ఇస్తానని ఓ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొనడాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా గుంతల్లేని రోడ్లను చూపిస్తే తానే రూ. 10 లక్షలు ఇస్తానని పేర్కొన్నారు. నీరు–తారు శత్రువులని, వర్షాలకు రోడ్లపై గుంతలు పడటం సహజం అన్నారు. ఆరేళ్లలో రూ. 67 వేల కోట్లతో నగరాభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థపై సమ్మెటపోటు పడిందని, కరోనా రాక ముందే జీడీపీ పతనమై ఆర్థిక సంక్షోభం తలెత్తిందని కేటీఆర్ పేర్కొన్నా రు. లాక్డౌన్ తర్వాత జీడీపీ ఏకంగా 31 శాతం పతనమైందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ ఉన్నాయని బీజేపీ వాళ్లు అడుగుతున్నారని, రూ. 18 వేల కోట్లతో 111 చోట్ల లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, వెళ్లి చూసుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో అవినీతి జరిగిం దని బీజేపీ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఈ పథకం ద్వారా 91.3 శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వమే హడ్కో అవార్డు ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. రూ. 20 లక్షల కోట్లతో కేంద్రం ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ ఒక మాయ అని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ చార్జిïÙట్ విడుదల చేసిందని... మరి ఇప్పటివరకు వివిధ విషయాల్లో విఫలమైనందుకు బీజేపీపై ఎఫ్ఐఆర్లు వేయాలా? అని కేటీఆర్ నిలదీశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్కు ఎలాంటి అవగాహన లేదని, ఆ పార్టీని పాతబస్తీలో ఓడిస్తామన్నారు. కాగా, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రావు, నరసింహారావు తెలిపారు. -
'సోషల్' సైనికులు
జిందాబాద్‌లుండవు.. నినాదాలు వినిపించవు.. సభ, ర్యాలీల ఆర్భాటాలు కనిపించవు.. కానీ, జరగాల్సిన ప్రచారం జరిగిపోతుంది. చెప్పాల్సింది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోతుంది. ఇది కదా ప్రచారమంటే! ఇప్పుడన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియానే అసలైన ‘గొంతుక’గా మారింది. ఎంతమంది కార్యకర్తలున్నా.. ఎంత మందీ మార్బలమున్నా, ఎంత గొప్ప ఉపన్యాసాలిచ్చినా.. అది ప్రజలకు చేరకపోతే వృథానే. పైగా కరోనా విజృంభిస్తోన్న తరుణంలో భారీగా జనసమీకరణ, బహిరంగసభలంటే ప్రజలే కాదు, కార్యకర్తలూ జంకుతున్నారు. అందుకే, అన్ని పార్టీలు బయట లక్షలాదిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నా సరే.. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాలకు ఎంతమంది ఫాలోవర్లు ఉంటే.. తమ పోస్టులు అంతకుమించి జనాల్లోకి చేరతాయని పారీ్టలు విశ్వసిస్తున్నాయి. అందుకే, తమ పార్టీ సోషల్‌మీడియా విభాగాలను క్రియాశీలం చేశాయి. అన్ని పారీ్టల్లోని ‘సోషల్ సైనికులు’తమ పోస్టులు, షేర్లతో ప్రచార వేడిని రెండింతలు చేస్తున్నారు. ఎన్నికల్లో జెండాలు, ఎజెండాల కంటే ప్రచారం సందర్భంగా జరుగుతున్న ఘటనలే ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక నిరూపించింది. అసలు పోటీలోనే లేదనుకున్న బీజేపీ సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఏకంగా దుబ్బాక సీటును ఎగరేసుకుపోయింది. దీంతో అప్పటిదాకా సోషల్ మీడియాను ఎగతాళి చేసిన పార్టీలు, నాయకులు కూడా దానికి పెద్దపీట వేస్తున్నారు. కరోనా దెబ్బకు యువకులు, విద్యార్థులందరి చేతికి స్మార్ట్ఫోన్లు వచ్చాయి. డేటా, సోషల్‌మీడియా వినియోగం పెరిగింది. ఇప్పుడు ప్రజల్ని ప్రభావి తం చేయడం పెద్ద పనికాదు. సోషల్ మీడియాలో వచ్చే ఒక్క పోస్టు కూడా జనంలోకి నేరుగా దూసుకుపోతుంది. ప్రచారం రూపేణా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆదరణ సోషల్ మీడియా ద్వారా వస్తుందని భావించే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పారీ్టలు ఈ మాధ్యమాన్ని విరివిగా వాడుకునే పనిలో పడ్డాయి. అటు ప్రచారం.. ఇటు పైసలు వివిధ సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆకర్షితులై వ్యాపారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన పార్టీలు, నాయకులకు భారీగా విరాళాలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడ్డ నగరవాసులతో అన్ని పార్టీలు నిరంతరం టచ్‌లో ఉంటున్నాయి. వారి నుంచి విరాళాలే కాదు, పారీ్టలకు మద్దతుగా వారి వీడియోలను కూడా సేకరిస్తున్నాయి. వీటిని స్థానిక ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తమ ఓటుబ్యాంకు నిలుపుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. ఫలానా సమయంలో తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్లే మీకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకోవడం కూడా పలు పార్టీలకు కలిసివస్తోంది. హైదరాబాద్‌లో అన్ని భాషలు మాట్లాడే ప్రజలుంటారు. అందుకే, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ కంటెంట్‌ను అన్ని పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్.. చివరికి వాట్సాప్‌లోని స్టేటస్లు, డీపీలు, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ల ద్వారా కూడా ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు, సోషల్‌మీడియా విభాగాల సిబ్బంది జోరుగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గంటగంటకు వాట్సాప్ స్టేటస్‌లతో లక్షలాదిమందిని ప్రభావితం చేయవచ్చని కొన్ని పారీ్టలు గుర్తించి అనుకూలంగా మలుచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు దాదాపు అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ గ్రేటర్ ఎన్నికలపైనే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కంటెంట్‌కు డిమాండ్ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అంతా ఎవరికి వారే ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అన్ని పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు ఇటీవల తాత్కాలిక ప్రాతిపదికన కంటెంట్ రైటర్లు, పీఆర్వోలు, కార్టూనిస్టులు, వీడియో ఎడిటర్లు, డీటీపీ ఆపరేటర్లను భారీగా నియమించుకున్నాయి. ప్రత్యర్థులపై పదునైన ‘పంచ్’వేస్తూ చేసే పోస్టులకు ప్రాధాన్యమిస్తున్నారు. వ్యంగ్య కా ర్టూన్లు, వెటకారం నిండిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఈ పనిచేసినందుకు ఒక్కొక్కరికి 15 రోజుల కోసమే రూ. 50 వేల దాకా ముట్టజెపుతున్నారంటే వీరికి ఎంతప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పీఆర్ ఏజెన్సీల చేతిలో ‘ట్విట్టర్ హ్యాండిల్స్’ పలువురు ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిళ్ల నిర్వహణ బాధ్యతను పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ఏజెన్సీలు చూస్తుంటాయి. వివిధ పరిణామాలపై ఇవి సదరు నాయకుని అభిప్రాయాన్ని తెలియజేస్తుంటాయి. సంతాపాలు, శుభాకాంక్షలు వంటివి క్షణాల్లో సదరు నేతల హ్యాండిళ్లలో ప్రత్యక్షం అవుతున్నాయంటే అదంతా పీఆర్ ఏజెన్సీల పనే. రాష్ట్రంలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తరువాత ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసద్. ఫేస్బుక్, ట్విట్టర్లలో వీరి ఫాలోవర్ల సంఖ్య మిలియన్ మార్కు దాటింది. చాలామంది రాష్ట్ర నాయకుల సోషల్ మీడియా ఖాతాలను సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ కంటెంట్ రైటర్లు, విశ్రాంత విలేకరులు నిర్వహిస్తున్నారు. -
ప్రచార కార్యక్రమాల్లో బిగ్‌బీ
-
ఆర్బీఐ ప్రచార కార్యక్రమాల్లో బిగ్‌బీ
ముంబై: ఆర్థిక మోసాలపై కస్టమర్లలో అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ప్రముఖులతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటికోసం తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. ‘ఆర్బీఐ సేస్’ పేరిట రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్న మరో ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ‘అవగాహన పెంచుకోవడానికి పైసా ఖర్చు కాదు .. కానీ అజ్ఞానానికి మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది‘ అని సందేశం పోస్ట్ చేశారు. లాక్డౌన్ కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ బచ్చన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్బీఐ ఏడాది కాలంగా కస్టమర్లలో అవగాహన పెంచేందుకు ఇంగ్లిష్, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో ఫేస్బుక్ పేజ్ కూడా ప్రారంభించింది. ట్విట్టర్లో ఫాలోవర్ల సంఖ్యాపరంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌ను కూడా అధిగమించి, అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్‌గా ఆర్బీఐ నిల్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ట్విట్టర్ హ్యాండిల్‌కు 6.64 లక్షల ఫాలోవర్లు ఉండగా, ఆర్బీఐకి ఏకంగా 9.66 లక్షల మంది ఉన్నారు. -
మైకులు కట్.. ప్రచార బృందాల తిరుగుముఖం
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం గడువు శనివారం సాయంత్రం ముగిసింది. సుమారు 20 రోజులుగా నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయా పార్టీల నేతలు తిరుగుముఖం పట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ, టీడీపీతో పాటు పలు పార్టీలు, స్వతంత్రులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తుండటంతో.. ప్రచార పర్వంలో ఆయనే అంతా తానై వ్యవహరించారు. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని 70 మంది ఇన్చార్జీలు శానంపూడి సైదిరెడ్డి పక్షాన ప్రచార, సమన్వయ బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యత అప్పగించినా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న హుజూర్నగర్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల 4న నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు శ్రమిస్తున్న బీజేపీ కూడా హుజూర్నగర్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అభ్యర్థి కోట రామారావు తరఫున కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు మూలంగా పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం కూడా ప్రస్తుత ఉప ఎన్నికలో పోటీ చేస్తుండగా,నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ప్రచారంలో పాల్గొన్నారు.28 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో..ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇదిలాఉంటే సోమవారం జరిగే ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సోమవారం హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. -
మేం ఇంతే.. వేటినీ వదలం..!
అప్పుల భారంతో ఆర్టీసీ ప్రగతి గతి తప్పింది. గత టీడీపీ ప్రభుత్వ సేవలో తరించి నిండా మునిగిం ది. ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ సభలు, సమావేశాలకు ఇష్టానుసారంగా వాడుకోవడంతో నష్టాల పాలైంది. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం కోట్లాది రూపాయలు బకాయి పడింది. బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా నష్టాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఖర్చులు, కార్మికుల జీతాలు భరించలేని స్థితిలో ఉంది. సాక్షి, చిత్తూరు రూరల్: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేసింది. ప్రచార అర్భాటాల కోసం ఆర్టీసీ బస్సులను ఇష్టానుసారంగా వాడుకుంది. సభలు, సమావేశాలు, విహారయాత్రల పేరుతో ఆర్టీసీకి రూ.4 కోట్ల వరకు బకాయిలు పడింది. ఈ బకాయిల వసూళ్లకు నాలుగేళ్లుగా ఆర్టీసీ అధికారులు శాఖల వారీగా ప్రదక్షిణలు చేశారు. చెల్లింపు విషయంలో వివిధ శాఖల అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో ఆర్టీసీని అప్పుల భారం వెంటాడుతోంది. బకాయిలు వసూళ్లు కాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆర్టీసీ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. జిల్లాలోని 14 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 1,378 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు 583, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ 422, ఎక్స్‌ప్రెస్ 192, అల్ట్రా డీలక్స్ 38, సూపర్‌లగ్జరీ 78, ఏసీ 32, మెట్రో సర్వీసులు 33 ఉన్నాయి. ఈ బకాయిల బస్సు సర్వీసుల్లో నిత్యం 7 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2 కోట్లు ఉంటే.. నెల రూ.55 నుంచి రూ.60 కోట్లకు వరకు ఆదాయం వస్తోంది. అయితే ప్రతి నెలా ఆర్టీసీ ఖర్చులు పోను రూ.6 కోట్లు నష్టం వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీనికి తోడు టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను వాడుకుని వదిలేయడంతో ఆర్టీసీకి అప్పుల భారం పెరిగింది. ప్రచారం కోసమే.. గత నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కనపెట్టింది. ఇష్టానుసారంగా టీడీపీ ప్రభుత్వ సమావేశాలకు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపించారు. ఇలా తరచూ బస్సులను మళ్లించడంతో జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో వారికి ప్రైవేటు సర్వీసులే దిక్కుగా మారాయి. 2015 అక్టోబర్ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలకు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను తిప్పించారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు బకాయిలు పడింది. ఇటీవల ఈ బకాయిల్లో కేవలం రూ.14.64 లక్షలు మాత్రమే చెల్లించింది. 2015 నుంచి బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ శాఖల వారీగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కోట్లలో ఉన్న బకాయిలను రూ. 14.64 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కూడా ఆర్టీసీ అధికారులు వివిధ శాఖలకు ప్రతి రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరింత భారం.. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. ప్రతి నెలా సుమారు రూ.60 కోట్ల ఆదాయం వస్తుంటే.. ఆదాయం ఖర్చులకు, కార్మికుల జీతాలకు సరిపోవడం లేదు. దీంతో నెలకు రూ. 6 నుంచి 7 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు అధికారులు వాపోతున్నారు. ఈ తరుణంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్టీసీకి మరింత భారాన్ని తెచ్చిపెడుతోంది. సొంత డప్పు కోసం చంద్రబాబు ఆర్టీసీని వాడుకున్నారని, ప్రయాణికుల సేవలను పక్కనబెట్టిన బాబు సేవలో నిమగ్నమైన ఆర్టీసీకి గుణపాఠామని కార్మికవర్గాలు, పలువురు ప్రయాణికులు విమర్శిస్తున్నారు. సర్వీసుల్లో నిత్యం 7 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2 కోట్లు ఉంటే.. నెల రూ.55 నుంచి రూ.60 కోట్లకు వరకు ఆదాయం వస్తోంది. అయితే ప్రతి నెలా ఆర్టీసీ ఖర్చులు పోను రూ.6 కోట్లు నష్టం వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీనికి తోడు టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను వాడుకుని వదిలేయడంతో ఆర్టీసీకి అప్పుల భారం పెరిగింది. ప్రచారం కోసమే.. గత నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కనపెట్టింది. ఇష్టానుసారంగా టీడీపీ ప్రభుత్వ సమావేశాలకు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపించారు. ఇలా తరచూ బస్సులను మళ్లించడంతో జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో వారికి ప్రైవేటు సర్వీసులే దిక్కుగా మారాయి. 2015 అక్టోబర్ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలకు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను తిప్పించారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు బకాయిలు పడింది. ఇటీవల ఈ బకాయిల్లో కేవలం రూ.14.64 లక్షలు మాత్రమే చెల్లించింది. 2015 నుంచి బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ శాఖల వారీగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కోట్లలో ఉన్న బకాయిలను రూ. 14.64 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కూడా ఆర్టీసీ అధికారులు వివిధ శాఖలకు ప్రతి రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
కాంగ్రెస్‌కు ‘మోదీ’ ప్రచారం
రాయ్‌పూర్: ప్రధాని మోదీ వేషధారణలో ఉన్న ఈ వ్యక్తి పేరు అభినందన్ పాఠక్. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన గతంలో ఎన్డీయే భాగస్వామ్య రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉండేవారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలు అమలవ్వక పోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రచారానికి వెళ్లినప్పుడు పాఠక్‌తో ఇలా ఫొటో తీసుకుని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోకు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం వచ్చింది.