cashback offer
-
గుడ్‌న్యూస్.. రెండున్నర నెలలపాటు భారీ క్యాష్ బ్యాక్
రూపే (RuPay) క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారికి శుభవార్త. తమ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక స్కీమ్ కింద రూపే ఇటీవల భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలలపాటు ఈ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై భారీగా క్యాష్ బ్యాక్ పొందే వీలు కల్పించింది."ఆఫర్ వ్యవధిలో డిస్కవర్ నెట్వర్క్ లేదా కెనడా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, యూఎస్ఏలోని డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో కార్డులను అంగీకరించే వ్యాపారుల వద్ద చేసిన పాయింట్-ఆఫ్-సేల్ కొనుగోళ్లపై క్వాలిఫైడ్ రూపే కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్లు 25 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు" అని రూపే సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ మే 15 నుంచి జూలై 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫర్ వ్యవధిలో ఒక కార్డ్‌కి ఒక లావాదేవీకి గరిష్ట క్యాష్‌బ్యాక్‌గా రూ. 2,500 లభిస్తుంది. రూపే అనేది డెబిట్, క్రెడిట్, ఇంటర్నేషనల్, ప్రీపెయిడ్, కాంటాక్ట్‌లెస్ కార్డ్. భారతీయులందరికీ దేశీయ చెల్లింపు కార్డులను అందించాలనే ఆర్బీఐ దృష్టిని నెరవేర్చడానికి ఎన్పీసీఐ వీటిని ప్రారంభించింది. -
Valentines day 2023:పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ చూశారా..!
సాక్షి,ముంబై: వాలెంటైన్ డే సందర్బంగా పేమెంట్ సంస్థ పేటీఎం లవర్స్‌కు వాలెంటైన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది రూ.140 దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ చెల్లింపుల ద్వారా ఒక్కొక్కటి మూడు చొప్పున మూడు రకాల కార్డులను అందిస్తోంది. లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంటర్టైన్మెంట్, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్‌లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్‌బ్యాక్ పాయింట్లను పొందుతారు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 20 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లను పొందాలంటే పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్‌కి రీఛార్జ్, యుటిలిటీ బిల్లులను చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు నన్న సంగతి తెలిసిందే. వాలెంటెన్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే పేమెంట్ తరువాత పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌పై క్లిక్ చేయండి క్రిందికి స్క్రోల్ చేసి, 14వేల క్యాష్‌బ్యాక్ పాయింట్ల బ్యానర్లో ప్లే అండ్ విన్ నొక్కండి. ఇలా వచ్చిన మొత్తం 9 తొమ్మిది కార్డ్‌లను స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు స్నేహితులనుంచి అదనపు కార్డ్‌ను తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. అన్‌లాక్ చేయకుంటే స్క్రాచ్ కార్డ్‌లు స్వీకరించిన 3 రోజుల తర్వాత పనికిరావు This Valentine's, win over love & cashback with #PaytmValentinesCashback!🤩 Send money, recharge, pay bills & more to collect cards & win up to 14000 Cashback points!* Play now to win: https://t.co/fE1siDe2Ko *Offer ends on 20th February 2023 #PaytmSeUPI — Paytm (@Paytm) February 13, 2023 -
జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ దీపావళి సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 24 వరకు ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
పేటీఎం బంపరాఫర్!! క్షణాల్లో రూ.5లక్షల లోన్,అప్లయ్ చేయండిలా!
Paytm Loan Process: ప్రముఖ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం బంపరాఫర్ ప్రకటించింది. చిరు వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా రూ.5లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రోజూ ఈఎంఐ చెల్లించే అవకాశాల్ని కల్పించింది. బిజినెస్ కోసం వ్యాపారులు పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చు. పూర్తి డిజిలైజేషన్ పద్దతిలో జరిగే లోన్ ప్రక్రియలో అదనపు పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. వ్యాపారులు పేటీఎంలో బిజినెస్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటే రోజూవారీ లావాదేవీలపై అల్గారిథమ్ని ఉపయోగించి అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ పెద్దమొత్తంలో లోన్‌ను మంజూరు చేస్తుంది. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్‌లో ఐదు పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ►అందుబాటులో ఉన్న ఆఫర్‌ను చెక్ చేసేందుకు లోన్ కావాలనుకునే వ్యాపారి పేటీఎం యాప్‌ని తెరిచి, ‘బిజినెస్ లోన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అవసరాన్ని బట్టి, వ్యాపారి రుణ మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ► అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో మీకు డిస్ప్లే అవుతాయి. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు. ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాల్సి ఉంటుందనే విషయాలు మీకు కనిపిస్తాయి . ►అనంతరం లోన్ పొందుతున్న వ్యక్తి వివరాలను నిర్ధారించడానికి చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి, కొనసాగించడానికి ‘గెట్ స్టార్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ► సీకేవైసీ నుండి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ►ఈ సందర్భంగా పాన్ వివరాలు, పుట్టిన తేదీ, ఇమెయిల్, అడ్రస్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది రుణాన్ని మంజూరు చేసే ముందు పాన్, క్రెడిట్స్కోర్,కేవైసీ వివరాలను ధృవీకరిస్తుంది. ►ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. -
బైక్ కొనే వారికి యమహా గుడ్‌న్యూస్...!
కొత్తగా బైక్‌లను కొనే వారికి ప్రముఖ జపానీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా గుడ్‌న్యూస్‌ను అందించింది. ఫెస్టివల్ సీజన్లో భాగంగా యమహా స్కూటీలపై సుమారు రూ. 4000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ ఆఫర్ యమహా 125సీసీ స్కూటీ రేంజ్‌పై అందుబాటులో ఉండనుంది. ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్), రే జెడ్ఆర్ 125ఎఫ్ఐ, రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) మోడల్ స్కూటీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. చదవండి: చైనా బొమ్మల్లో ‘విషం’.. అమెరికా అలర్ట్! యమహా స్కూటీ ధరలు ఇలా..(ఎక్స్‌షోరూమ్ ధరలు) యమహా ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) ధర రూ. 78,530 రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ధర రూ. 79,830 యమహా ఫాసినో 125 ఎఫ్ఐ ఫీచర్స్.. యమహా బ్లూ కోర్ ఇంజన్ టెక్నాలజీతో కొత్త BS-6-మోడల్ ఫాసినో రానుంది, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ (Fi), 125 cc ఇంజిన్‌ను అమర్చారు. 5000 ఆర్పీఎమ్వద్ద 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఈ బైక్ సుమారు 66కెఎమ్పీఎల్ మైలేజీను ఇస్తుంది. చదవండి: ‘ఈవీ’ మేకర్స్ ఆశలపై డ్రాగన్ నీళ్లు.. సప్లయ్ అంతా అటు వైపే! -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మొబైల్ రీఛార్జీలపై అందించనున్న క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డులను పేటీఎం నేడు(సెప్టెంబర్ 23) ప్రకటించింది. ప్రతిరోజూ మొదటి 1,000 మంది వినియోగదారులు ఇన్నింగ్స్ విరామ సమయంలో తమ మొబైల్ ఫోన్ నంబర్లను రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్(రూ.50 వరకు) పొందుతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.(చదవండి: బ్యాంకు ఖాతాదారులకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక!) జియో, వీఐ, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కస్టమర్లు రూ.10 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేటీఎం తెలిపింది. "కొత్త వినియోగదారులు జియో రూ.11, రూ.21, రూ.51 అదనపు డేటా ప్యాక్స్, వోడాఫోన్ ఐడియా రూ.16, రూ.48 అదనపు డేటా ప్యాక్, ఎయిర్టెల్ అదనపు డేటా ప్యాక్ రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ప్రతిరోజూ ఐపీఎల్ మ్యాచ్ జరిగే రాత్రి 7.30 నుంచి 11 గంటల మధ్య వచ్చే విరామ సమయంలో వారు చేసుకునే ప్రతి రీఛార్జీలపై 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఇతర బహుమతి వోచర్లను కూడా రీడీమ్ చేసుకోవచ్చు" పేటీఎం పేర్కొంది. -
ఫీచర్లు లీక్, వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్!
యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్. వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ ఫర్ చేసిన యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాట్సాప్ ఓ ఫీచర్‌పై వర్క్ చేస్తుండగా.. ఆ ఫీచర్లు లీకయ్యాయి. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. ఇటీవల తెచ్చిన వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను యూజర్లు వినియోగించేలా వాట్సాప్ కొత్త అప్ డేట్లను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ త్రూ మనీ ట్రాన్స్ఫర్ చేసిన యూజర్లుకు క్యాష్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది.ఫోన్ పే, పేటీఎం తరహాలో యూపీఐ ద్వారా వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసిన వినియోగదారులకు 'క్యాష్‌బ్యాక్' అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ చేసే పనిలో వాట్సాప్ ప్రతినిధులు ఉండగా.. ఆ ఫీచర్లు లీక్ అయ్యాయి. 227 రకాల బ్యాంక్ అకౌంట్లకు.. వాట్సాప్ ఇటీవల వాట్సప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆప్షన్ ను వినియోగించి యూజర్లు వాట్సాప్ ద్వారా 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని వాట్సాప్పేమెంట్ డైరక్టర్ మనేష్ మహాత్మే వెల్లడించారు. చదవండి: వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ఫర్ ఇలా చేయండి.. -
మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై పేటీఎమ్ బంపర్ ఆఫర్...!
Paytm Offers Rewards: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ తన యూజర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను, ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించనుంది. ప్రతి బిల్లు చెల్లింపులో యూజర్లకు సుమారు రూ .500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. అంతేకాకుండా ప్రతి బిల్ చెల్లింపుపై సుమారు 5వేల వరకు కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పాయింట్లను కూడ పొందవచ్చును. ఈ క్యాష్‌బ్యాక్ పాయింట్లతో ప్రముఖ బ్రాండ్స్ డీల్స్, గిఫ్ట్ వోచర్లను పొందవచ్చును. చదవండి: వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వీఐ పోస్ట్‌పెయిడ్ సేవలకు సంబంధించిన అన్ని బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల కోసం రివార్డులను పొందడమే కాకుండా, కంపెనీ రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా వినియోగదారులు అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. యూజర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి పేటీఎం ఇటీవల మొబైల్ బిల్లు చెల్లింపులో భాగంగా త్రీ టైమ్-క్లిక్ తక్షణ చెల్లింపు ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది. యూజర్లు యూపీఐ, వ్యాలెట్, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాకింగ్‌ను ఉపయోగించి చెల్లింపులను చేయవచ్చును. చదవండి: Work From Home: భవిష్యత్తులో ఉద్యోగులు ఇలా ఉంటారా! -
పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం
paytm cash back offer : పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. దీంతో సబ్సిడీ లేని సిలిండర్లను కొనుగులు చేయడం సామాన్యులకు కష్టంగా మారింది. అయితే పెరుగుతున్న సిలిండర్ల ధరల్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్కీమ్‌లను ప్రకటించింది. కొత్త, పాత కస్టమర్లకు వేర్వేరు ఆఫర్లు అందిస్తోంది. ♦ పేటీఎం తాజాగా '3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేటీఎంలో కొత్తగా చేరిన కస్టమర్ మొదటి మూడు నెలల కాలంలో పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 900ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకేసారి మూడు కంపెనీలకు చెందిన మూడు సిలిండర్లు బుక్ చేస్తే ఏకంగా రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ♦ ఇక ఇప్పటికే ఉన్న పేటీఎం కష్టమర్లు ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్‌కు చెందిన ఎల్పీజీ సిలీండర్లను బుక్ చేస్తే ప్రతి బుకింగ్ మీద 5000 వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అందిస్తోంది. ఈ పాయింట్లను పేటీఎంలో చేసే ఇతర షాపింగుల్లో ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. ♦ పేటీఎం పోస్ట్ పెయిడ్ కష్టమర్లు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల్లించవచ్చు -
Apple Days Sale: ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..!
భారత ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ దిగ్గజం విజయ్ సేల్స్ ఆపిల్ ఉత్పత్తులపై భారీగా క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆపిల్ డేస్ సేల్‌ను విజయ్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ మంగళవారం ఆగస్టు 3 న మొదలై ఆగస్టు 9 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఆపిల్ డేస్ సేల్‌లో భాగంగా ఐఫోన్ల నుంచి మాక్‌బుక్స్‌తో పాటు ఇతర ఆపిల్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా భారీగా క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. దేశ వ్యాప్తంగా కంపెనీ రిటైల్ అవుట్లెట్లలో ఈ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీకి చెందిన వెబ్సైట్ విజయ్‌సేల్స్. కామ్‌లో కూడా కొనుగోలు చేయవచ్చును. ఆపిల్ ఉత్పత్తులపై విజయ్ సేల్స్ అందిస్తోన్న ఆఫర్లు..! ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ. 50,999. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ప్రో ధర రూ. 1,09,900 నుంచి ప్రారంభంకానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ధర రూ.1,19,999 నుంచి ప్రారంభంకానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ధర ప్రారంభ ధర రూ. 73,400. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ. 63.499. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ ఎస్ఈ ప్రారంభ ధర రూ. 35,990. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ ఎక్స్ఆర్ ప్రారంభ ధర రూ. 43,199. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. ఐపాడ్ ప్రారంభ ధర రూ. 24,500 కాగా, ఐపాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 55,900 కాగా చ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును. మాక్‌బుక్ ఎర్ ఎమ్1, మాక్‌బుక్ ప్రో విత్ ఎమ్1 చిప్ సెట్ కొనుగోలుపై వరుసగా రూ. 6000, రూ 7000 క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఆపిల్ వాచ్ ఎస్ఈ కొనుగోలుపై వరుసగా రూ. 3000, రూ. 2000 క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. -
త్వరపడండి: శాంసంగ్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు..!
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్‌లో తన వినియోగదారుల కోసం అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ ఉత్పత్తులపై కొత్త శ్రేణి ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 20శాతం మేర క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి. శాంసంగ్ టీవీలు: ఎంపిక చేసిన శాంసంగ్ చేసిన టీవీలకు కంపెనీ నుంచి ప్రీమియం సౌండ్బార్లను ఉచితంగా అందిస్తోంది. ఆఫర్ వ్యవధిలో 75-అంగుళాల అంతకంటే ఎక్కువ QLED టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు 99,990 రూపాయల విలువైన సౌండ్‌బార్ Q900T లేదా QLED TV మోడల్‌ను బట్టి 48,990 రూపాయల విలువైన Q800T సౌండ్‌బార్ లభిస్తుంది. వినియోగదారులు ఈ టీవీలను 36 నెలల ఈఎంఐ లభిస్తోంది.అంతేకాకుండా కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. శాంసంగ్ సౌండ్ డివైజ్స్: ఎంపిక చేయబడిన శాంసంగ్ సౌండ్ బార్స్‌పై 10శాతం వరుకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనుంది. శాంసంగ్ ఫ్రిజ్‌లు: సైడ్ బై సైడ్, కర్డ్ మాస్ట్రో, ఫ్రోస్ట్ ఫ్రీ, డైరక్ట్ కూల్ లాంటి శాంసంగ్ ఫ్రీజ్‌ల మోడళ్లను ఈఎంఐతో కొనుగోలు చేస్తే సుమారు 15శాతం వరకు క్యాష్‌బ్యాక్ కాకుండా డిజిటల్ కంప్రెసర్‌పై పది సంవత్సరాల వరకు వారంటీని ఇవ్వనుంది. మైక్రోవేవ్ ఓవెన్స్: శాంసంగ్ మైక్రోవేవ్ ఓవెన్స్ మ్యాగ్నెట్రాన్ పై 5 సంవత్సరాల వారంటీతో పాటు పది శాతం వరకు క్యాష్‌బ్యాక్, సెరమిక్ ఎనామిల్ కావిటీ మెడల్‌పై పది సంవత్సరాల వారంటీనీ ఇవ్వనుంది. చదవండి: మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్! -
Samsung Galaxy S21+: రూ.10వేల క్యాష్ బ్యాక్, ఇంకా మరెన్నో ఆఫర్స్
టెక్ మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ పై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక 128 జీబీ మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ రూ. 71,999 ఉండగా.. 256 జీబీ మోడల్ ఖరీదు రూ.75,999 ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ఫోన్ కొనుగులు చేసిన స్మార్ట్ వినియోగదారులకి రూ. 15,990 విలువ గల గెలాక్సీ బడ్స్ ప్రో, రూ. 990 వోచర్ ను సొంతం చేసుకోవచ్చు.గెలాక్సీ 21 ప్లస్ ఆల్ట్రా, గెలాక్సీ ఎస్ 21ప్లస్, గెలాక్సీ 21 ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.10వేల శాంసంగ్ షాప్ వోచర్ ను పొందవచ్చు. గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా లేదా గెలాక్సీ ఎస్ 21 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారుల కోసం శాంసంగ్ రూ.10వేలు, రూ.5,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్‌ను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే వరుసగా రూ. 10,000, రూ. 5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయని, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం ఉందని శాంసంగ్ తన అధికారిక నోట్ లో పేర్కొంది. అన్ని ఆఫర్లు తక్షణమే లభిస్తాయని జూన్ 30, 2021 వరకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ఫీచర్స్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 6.7-అంగుళాల ఫ్లాట్, ఫుల్ హెచ్డి + డిస్ప్లేతో అమోలేడ్ ప్యానెల్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 12MP + 12MP + 64MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4,800 ఎంఏహెచ్ బ్యాటరీపై నడుస్తుంది. చదవండి : 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లతో అదరగొడుతున్నాయ్ -
Paytm: ఎల్పీజీపై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్ ధర కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 61 రూపాలయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తే.. ఏంటి జోక్ అనుకుంటున్నారా. కాదు వాస్తవమే. 861 రూపాయల విలువ చేసే గ్యాస్ సిలిండర్ కేవలం 61 రూపాలకే లభించనుంది. గ్యాస్ సిలిండర్‌పై ఆఫర్ పొందటానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఆఫర్ పొందొచ్చు. ఈవాలెట్ సంస్థ పేటీఎం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. పేటీఎం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. దీని ప్రకారం మన దగ్గర గ్యాస్ సిలిండర్ ధర 861 రూపాయలుగా ఉంది. అంటే క్యాష్‌బ్యాక్ రూ.800 తీసేస్తే.. కేవలం 61 రూపాయలకే సిలిండర్ వచ్చినట్లు అవుతుంది. ఇక ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందాలని భావించే వారు పేటీఎం ద్వారా తొలి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారై ఉండాలి. వీరికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఆఫర్లో ఒక మెలిక ఉంది. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే రూ.10 నుంచి రూ.800 వరకు మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ రూ.800 వస్తుందని చెప్పడానికి లేదు. రూ.10 కూడా రావొచ్చని గుర్తుపెట్టుకోవాలి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఇందులో మీకు ఎంత క్యాష్‌బ్యాక్ వచ్చింది అనేది ఉంటుంది. పేటీఎం ద్వారా ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేయడానికి చర్యలు 1. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 2. దీని తరువాత, మీ గ్యాస్ ఏజెన్సీతో సిలిండర్ బుకింగ్ చేయవలసి ఉంటుంది. 3. దీని కోసం, పేటీఎం యాప్‌లో Moreకి వెళ్లి, ఆపై రీఛార్జ్, పే బిల్లులపై క్లిక్ చేయండి. 4. దీని తరువాత, మీరు సిలిండర్ బుక్ చేసే ఆప్షన్ వస్తుంది. 5. ఇక్కడ, మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. 6. బుకింగ్ చేయడానికి ముందు, మీరు FIRSTLPG ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాలి. బుకింగ్ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. ఈ స్క్రాచ్ కార్డును 7 రోజుల్లో ఉపయోగించాలి. క్యాష్‌బ్యాక్ డబ్బులు పేటీఎం వాలెట్‌కు 48 గంటల్లోగా వచ్చి చేరతాయి. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ -
రిలయన్స్ డిజిటల్లో యాపిల్ వాచ్ న్యూ సిరీస్ 6 లాంఛ్
సాక్షి, హైదరాబాద్ : యాపిల్ వాచ్ న్యూ సిరీస్ 6, యాపిల్ వాచ్ ఎస్ఈ, ఐపాడ్ 8 జనరేషన్ ప్రీ బుకింగ్‌ను అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మై జియో స్టోర్స్‌లో రిలయన్స్ డిజిటల్ ప్రారంభించింది. కస్టమర్లు ఈ ఉత్పత్తులను ఇక తమ సమీప రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్స్‌తో పాటు రిలయన్స్డిజిటల్.ఇన్ లోనూ ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈనెల 30 వరకూ పొందవచ్చని రిలయన్స్ డిజిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : రిలయన్స్ చేతికి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇక యాపిల్ వాచ్ సిరీస్ 6, వాచ్ ఎస్ఈ రిటైల్ విక్రయాలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. యాపిల్ వాచ్ సిరీస్ 6 బ్లడ్ ఆక్సిజన్ స్ధాయిలను తెలిపే ఫీచర్‌తో పాటు ఆల్ న్యూ స్లీపీయాప్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ సేవల వంటి ఆధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. న్యూ యాపిల్ వాచ్ సిరీస్ 6 ప్రారంభ ధర రూ 40,900 కాగా, ఇక యాపిల్ వాచ్ ఎస్ఈ శ్రేణి రూ . 29,900 నుంచి అందుబాటులో ఉంటుందని రిలయన్స్ డిజిటల్ పేర్కొంది. -
పేటీఎంకు గూగుల్ షాక్!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీల సంస్థ పేటీఎంకు టెక్ దిగ్గజం గూగుల్ శుక్రవారం షాకిచ్చింది. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా క్రీడలపై బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. దీంతో కొద్ది గంటలపాటు పేటీఎం యాప్‌పై గందరగోళం నెలకొంది. అయితే, వివాదాస్పదమైన ’క్యాష్‌బ్యాక్’ ఫీచర్‌ను పేటీఎం తొలగించడంతో యాప్‌ను సాయంత్రానికి గూగుల్ మళ్లీ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. గూగుల్ నిబంధనలకు అనుగుణంగా క్యాష్‌బ్యాక్ కింద ఆఫర్ చేస్తున్న స్క్రాచ్ కార్డులను ఉపసంహరించినట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. కొత్త కస్టమర్లను చేర్చుకోనివ్వకుండా పేటీఎంకు గూగుల్ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ వృద్ధి చెందేందుకు మరింత తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ‘(గూగుల్ వంటి) కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆధిపత్యం గలవారు బాధ్యతగా కూడా మెలగాల్సి ఉంటుంది. ఈ దేశ అభివృద్ధి పాలుపంచుకోవాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుంది. నవకల్పనలను అణగదొక్కేయకుండా దేశ స్టార్టప్ వ్యవస్థకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతోంది. ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్లు మొదలయ్యే ముందు బెట్టింగ్ యాప్స్ కుప్పతెప్పలుగా రావడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకు ముందు ఏం జరిగిందంటే... ప్లేస్టోర్‌లో పేటీఎం యాప్ పునరుద్ధరణకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లఘించినందుకు యాప్‌ను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ టోర్నమెంటు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మా విధానాలపై వివరణ విడుదల చేశాం‘ అని గూగుల్ పేర్కొంది. కేవలం ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌ను మాత్రమే తొలగించామని, ఇప్పటికే ఉన్న యూజర్లపై ప్రతికూల ప్రభావమేదీ ఉండబోదని తెలిపింది. మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన పేటీఎం .. ప్లే స్టోర్‌లో కొత్తగా డౌన్లోడ్ చేసుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు తమ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, యాప్‌ను వెంటనే మళ్లీ అందుబాటులోకి తెస్తామని, యూజర్ల డబ్బుకేమీ ఢోకా లేదని భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. క్రికెట్ లీగ్ తెచ్చిన తంటా.. క్రికెట్ ఇష్టపడే యూజర్లు తాము జరిపే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందే విధంగా తమ కన్జూమర్ యాప్‌లో ఇటీవల ’పేటీఎం క్రికెట్ లీగ్’ను ప్రారంభించినట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు. ‘ఈ గేమ్ ఆడే యూజర్లకు ప్రతీ లావాదేవీ తర్వాత స్టిక్కర్స్ లభిస్తాయి. వాటన్నింటినీ సేకరించి, పేటీఎం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ భారత్‌లో పూర్తిగా చట్టబద్ధమే. మేం అన్ని నిబంధనలు, చట్టాలను పక్కాగా పాటిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ భావిస్తోంది. అందుకే ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌ను తొలగించింది‘ అని వివరించారు. బెట్టింగ్ యాప్స్ అన్నీ తొలగింపు.. క్రీడలపై బెట్టింగ్ చేసే యాప్స్ వేటినీ తాము అనుమతించబోమని, అలాంటి వాటన్నింటినీ తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని గూగుల్ తమ బ్లాగ్‌లో వెల్లడించింది. ‘స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే అనియంత్రిత గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ కేసినోలు మొదలైన వాటిని మేం అనుమతించం‘ అని స్పష్టం చేసింది. యూజర్లు నష్టపోకుండా, వారి ప్రయోజనాలు కాపాడేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో గూగుల్‌ప్లే డెవలపర్ అకౌంట్‌ను రద్దు చేయడం సహా తీవ్ర చర్యలు ఉంటాయని ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుజానె ఫ్రే తెలిపారు. మరోవైపు, ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు గూగుల్ ఇలాంటి చర్య తీసుకోవడమనేది .. తమ కఠినతరమైన విధానాల గురించి డెవలపర్లకు మరోసారి గుర్తు చేయడానికే అయి ఉంటుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనం చంద్వానీ పేర్కొన్నారు. -
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై : వొడాఫోన్ ఐడియా కూడా ప్రతీ రీచార్జ్ పై కమిషన్ అందించే పథకాన్ని లాంచ్ చేసింది. కరోనా, లాక్ డౌన్ ఇబ్బందుల్లో ఉన్నతమ కస్టమర్ల సౌలభ్యం కోసం “రీఛార్జ్ ఫర్ గుడ్” పేరుతో లాంచ్ చేసిన పథకంలో ఇతర ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆన్లైన్ రీచార్జ్ చేస్తే కమిషన్ అందివ్వనుంది. వొడాఫోన్ ఐడియా, వొడాఫోన్ లేదా ఐడియా కస్టమర్లు వేరేవారికి చేసిన రీచార్జిపై ఏకంగా 6 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉందని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇది ప్రతి వొడాఫోన్, ఐడియా కస్టమర్లకు వర్తిసుందని, స్నేహితుడు, కుటుంబం లేదా ఆన్లైన్ రీఛార్జ్ ఎలాగో తెలియని లేదా ఇంటర్నెట్కు ప్రాప్యత లేని ఎవరికైనా రీఛార్జ్ చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. (జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్) మై వొడాఫోన్, మై ఐడియా యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేయాల్సి వుంటుంది. వీటి ద్వారా వొడాఫోన్ ఐడియా,ఐడియా వినియోగదారులకు రీచార్జ్ చేస్తే 6 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఇందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే రీచార్జ్ చేసిన 96 గంటల్లో వినియోగదారుల ఖాతాకు క్యాష బ్యాక్ జమ అవుతుంది. ప్రస్తుత ప్రీపెయిడ్ కస్టమర్ మైవోడాఫోన్ యాప్ లేదా మైఇడియా అనువర్తనానికి లాగిన్ అవ్వాలి. అనంతరం వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్ కోసం రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. దీని తరువాత, రీఛార్జ్ చేస్తున్న కస్టమర్ రీఛార్జ్ విలువను బట్టి క్యాష్‌బ్యాక్ పొందుతారు. అలాగే తదుపరి రీఛార్జిపై క్యాష్‌బ్యాక్ కూపన్‌ను వాడుకోవచ్చని కంపెనీ ఒక ప్రకనటనలో తెలిపింది. జియో 4.16 శాతం కమిషన్ అందుస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం -
ఎస్బీఐ కస్టమర్లకు ‘కూల్’ న్యూస్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్. మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న వారికి బ్యాంకుచల్లటి కబురు చెప్పింది. ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీ( ఎయిర్ కండిషనర్స్) కొనుగోలు చేసినకస్టమర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా అందిస్తున్న ఈ అవకాశం మే 30వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే 1,500 రూపాయల చొప్పున క్యాష్‌బ్యాక్ పొందాలంటే 3 నెలల, 6 నెలల, లేదా 9 నెలలు ఈఎమ్ఐలు పై వర్తిస్తుంది. అలాగే కనిష్ట ఆర్డర్ విలువ రూ.20వేలు ఉండాలి. అలాగే పెద్ద పెద్ద లేదా ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ షాపుల్లో మాత్రమే లభ్యం. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లార్జ్ ఫార్మాట్ ఎలక్ట్రానిక్ చైన్, జనరల్ ట్రేడ్ మర్చంట్ ఔట్లెట్లలో లభిస్తుంది. అందుకే ముందే క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందా లేదా అనేది తమ వినియోగదారులు ముందే నిర్ధారించుకోవాల్సి ఉంటుందని బ్యాంకుకోరింది. ఈ క్యాష్ బ్యాక్ ఆగష్టు 30, 2019 నాటికి వినియోగదారును ఖాతాలో జమ చేయబడుతుంది. బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ కింద పిన్‌ల్యాబ్స్ స్విప్ మిషన్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. చార్జ్ స్లిప్‌లో రూ.1,500 క్యాష్ బ్యాక్ అని కచ్చింగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ కార్డు 3, 6, 9, 12 నెలల కాలపరిమితికి 14 శాతం వడ్డీని, 18 నెలలు, 24 నెలల కాలపరిమితికి 15 శాతం వడ్డీని విధిస్తోంది. -
ఐఫోన్లపై పేటీఎం మాల్ భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై : ఖరీదైన ఐఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో మంచి అవకాశం. డిజిటల్ దిగ్గజం పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్ సేల్ కి తెరలేపింది. తన వెబ్సైట్లో ఐఫోన్లపై ఆకట్టుకునే క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్ఈ నుంచి ఎక్స్ఎస్ మ్యాక్స్ దాకా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఆర్ తదితర ఫోన్లపై గరిష్టంగా రూ.15వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందిస్తోంది. దీంతోపాటు కొన్ని మోడల్స్‌పై ప్రోమోకోడ్ ఆఫర్ కూడా ఉంది. ఐ ఫోన్స్ ఎక్స్ మాక్స్ : 256 జీబీ స్టోరేజి వేరియంట్‌ను రూ. 1,14,156 లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐ ఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ మోడల్‌ను రూ. 53,687లకే అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎక్స్ : 64జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియింట్ ధరలు వరుసగా రూ. 89,999 రూ. 75,489గా ఉన్నాయి. దీంతోపాటు ఎకోడాట్ స్మార్ట్ స్పీకర్ కూడా ఉచితం.. ఐఫోన్ 8 : 64జీబీ స్టోరేజ్ వేరియింట్ రూ. 59,990. 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 70,799 ఐఫోన్ 8 ప్లస్ : ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ వేరియింట్ ధర రూ. 68వేలు. ఐఫోన్ 7 : 32 జీబీ వేరియంట్ ధర రూ. 39,530. 128జీబీ స్టోరేజి మోడల్ ధర రూ. 52,999. ఐఫోన్ 7 ప్లస్ : 32జీబీ 128జీబీ , 256 జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ. 49,899, రూ. 61,999, రూ. 64,990లు. -
21 నుంచి బజాజ్ ఫిన్సర్వ్ రిపబ్లిక్ డే సేల్
ముంబై: గణతంత్ర దినోత్సరం సందర్భంగా బజాజ్ ఫిన్సర్వ్ పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు రిపబ్లిక్ డే సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బజాజ్ ఫిన్సర్వ్ డైరెక్ట్ ఆన్లైన్ పోర్టల్ https:// www.bajajfinservmarkets.in/ emistore/ ద్వారా ఈఎంఐ కొనుగోళ్లపై రూ.2019 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నోకాస్ట్ ఈఎంఐ కింద, ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన 4 గంటల్లో, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను 24 గంటల్లో డెలివరీ చేస్తామని ప్రకటించింది. -
వోడాఫోన్ బంపర్ ఆఫర్
టెలికాంసంస్థ వొడాఫోన్ తన ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, జియోలకు దీటుగా ఆఫర్లతో ముందుకొచ్చింది. వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌లను మై వొడాఫోన్ యాప్ ద్వారా రీచార్జి చేసుకున్న వారికి నిర్దేశిత వోచర్లు వస్తాయి. అంటే రీచార్జ్ చేసుకున్న ప్లాన్ఆధారంగా ఈ వోచర్లు లభిస్తాయి. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.399, రూ.458, రూ.509 ప్యాక్‌లను రీచార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.399 రీచార్జికు 8 వోచర్లు, రూ.458కు 9, రూ.509 రీచార్జికి 10 వోచర్లను వోడాఫోన్ అందిస్తోంది. వీటిద్వారా తదుపరి రీచార్జ్ సమయంలో 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. -
రూ.2 వేల ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్
సాక్షి, ముంబై: ఎయిర్టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు శుభవార్త. ఫెస్టివ్ సీజన్లో భారతి ఎయిర్టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.2 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో మంగళవారం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఆన్‌లైన లేదా ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారు ఈ ఆఫర్‌ను దక్కించుకోవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2018తో ముగియనుంది. 4జీ స్మార్ట్ఫోను కొనుగోలు చేసిన తరువాత ఎయిర్టెల్ 4జీ సిమ్ వేసి మై ఎయిర్టెల్ యాప్ ద్వారా ఫ్రీ ఆఫర్లను క్లెయిమ్ చేసుకోవాలి. ఇలా వారి అకౌంట్లోకి రూ.50 విలువైన 40 కూపన్లు క్రెడిట్ అవుతాయి. వాటిని తరువాత చేసుకునే రీ ఛార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర రాయితీ పొందవచ్చు. ఈ కూపన్లను వాడుకోవాలనుకునే ప్రీ పెయిడ్ కస్టమర్లు రూ.199, రూ.249, రూ.448 ప్లాన్లను వాడాల్సి ఉంటుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు రూ.399 ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవాలి. నగదు చెల్లింపు పథకం మొదటి 40 నెలలు చెల్లుబాటు అవుతుంది. ఒక రీచార్జ్‌కి ఒక కూపన్‌ను మాత్రమే రిడీమ్ చేసుకునే అవకాశం. -
సరికొత్త ఆఫర్ : ‘జియోఫై’ పై భారీ తగ్గింపు
ముంబై : రిలయన్స్ జియో రోజుకో కొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. నిన్న కాక మొన్ననే జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్, తాజాగా జియోఫై పోర్టబుల్ 4జీ రూటర్ విక్రయాలను పెంచడానికి సరికొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతో జియోఫై రూటర్ 499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్ రూటర్ ధరను రూ.1999 నుంచి రూ.999కు తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం కొత్త జియోఫై యూనిట్ కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ డివైజ్ కలిగి ఉన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. జూలై 3 నుంచి అంటే నేటి నుంచి ఈ ఆఫర్‌ను యూజర్లకు జియో అందిస్తోంది. అయితే ఎప్పుడు వరకు ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులో ఉండనుందో కంపెనీ వెల్లడించలేదు. జియోఫై క్యాష్‌బ్యాక్ ఆఫర్ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్ సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్ చేయించుకోవాలి. ఇలా 12 నెలల పాటు రీఛార్జ్ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత, తర్వాత బిల్ సైకిళ్లలో ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్జియో అందించనుంది. జియో తన పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.199 కింద 25 జీబీ డేటాను, ఉచిత వాయిస్ కాల్స్‌ను, అపరిమిత ఎస్ఎంఎస్లను, జియో యాప్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు. కొత్త జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన రోజుల్లోనే మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. మాన్సూన్ ఆఫర్ కింద 4,900 రూపాయల విలువైన ప్రయోజనాలను జియో తన ఒప్పో కస్టమర్లకు అందిస్తోంది. జూన్‌లో కూడా జియో తన ఎంపిక చేసిన ప్యాక్‌లకు రోజుకు 1.5 జీబీ అదనపు డేటాను యూజర్లకు ఆఫర్చేస్తోంది. -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్నుప్రకటించింది. గెలాక్సీ ఎస్9, ఎస్ 9 ప్లస్ డివైస్‌లపై ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, లేదా పేటీఎం మాల్ ద్వారా చేసిన కొనుగోళ్లపై రూ .9000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. జూన్ 30వ తేదీవరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అదనంగా మరో 9వేల రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్, వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఉంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు శాంసంగ్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లను ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్9 64 జీబీ వేరియంట్ ధర, రూ. 57,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 61,900, 256జీబీ వేరియంట్ ధర రూ .65,900 గా ఉంది. అయితే, ఎస్ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 64,900 రూపాయలు, 128 జీబీ వేరియంట్ ధర 68,900 రూపాయలు , 256 జీబీ వేరియంట్ ధర 72,900 రూపాయలు లభిస్తుంది. తాజాగా వీటిపై 9వేల భారీ తగ్గింపు లభ్యం. గడువు తేదీ ముగిసిన 90 రోజుల తరువాత కస్టమర్ల ఖాతాలోకి ఈ డిస్కౌంట్‌ను క్రెడిట్ చేస్తుంది. అలాగే ఫోన్లను కొనుగోలు చేసిన బిల్లును వినియోగదారులు 180 రోజుల లోపు కంపెనీకి అందించాల్సి ఉంటుంది. Remix your everyday with Super Slow-mo on the reimagined camera of Samsung #GalaxyS9 and #GalaxyS9Plus. Get one time screen replacement* and INR 9000.00 cashback* on ICICI Bank Credit Cards or Paytm mall. Move up now: https://t.co/x6LDp29WsO pic.twitter.com/Xyk2esgrUB — Samsung Mobile India (@SamsungMobileIN) June 2, 2018 -
ఈ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ ఇటీవల లాంచ్ చేసిన ‘పీ20 ప్రో, పీ 20లైట్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. మే 2వతేదీనుంచి 7వరకు మెగా సేల్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కస్టమర్లకు అమెజాన్ ద్వారా ప్రత్యేక క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లు 2 మే నుండి 7 మే, 2018 వరకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు 100 జీబీ అదనపు డేటాను అందించడానికి వొడాఫోన్తో కూడా కంపెనీ భాగస్వామ్యం ఉంది. కస్టమర్ సంతృప్తిపై తమకు పూర్తి విశ్వాసం వుందని హువావే ఇండియా-కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ సంజీవ్ ప్రకటించారు. ప్రపంచంలో మొట్టమొదటి లైకా ట్రిపుల్ కెమెరా, అపూర్వమైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను కలిగి ఉన్న హువావే పీ 20 ప్రొ పై 5వేలరూపాయల తక్షణ క్యాష్‌బ్యాక్. అంతేకాక వినియోగదారులకు 6,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరికరం నెలకు రూ.5417 వద్ద 12 నెలలకు నో కాస్ట్ ఈఎంఐ. ఈ ఆఫర్ యాక్సిస్ బ్యాంక్ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది. పీ 20 లైట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారాకొనుగోల చేస్తే 1500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై నెలకు 1667 నుంచి 12 నెలలు వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. అలాగే 2వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ . మరోవైపు వోడాఫోన్ భాగస్వామ్యంతో ఈ రెండు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 199 పైన 10 నెలల పాటు 10 రీఛార్జ్లపైన 100 జీబీ డేటా అదనంగా అందిస్తుంది. దీంతోపాటు పోస్ట్ పోయిడ్ కస్టమర్లకు వోడాఫోన్ రెడ్ ప్లాన్ రూ. 399 రీచార్జ్‌పై 10 నెలల పాటు 10జీబీ ఉచిత డేటా అదనంగా పొందవచ్చు. కాగా హువావే పీ 20 ప్రొ ,ప్రీ20 లైట్ లాంచింగ్ ధరలు వరుసగా రూ.64,999, ధర 19,999గా ఉన్నాయి. -
ఆ పాపులర్ స్మార్ట్ఫోన్లపై 8వేల క్యాష్‌బ్యాక్
పాపులర్ శాంసంగ్ డివైజ్‌లపై అమెజాన్ ఇండియా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 5 నుంచి ప్రారంభమైన శాంసంగ్ కార్నివల్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు అమెజాన్ తెలిపింది. అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఆన్ సిరీస్, గెలాక్సీ నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. స్మార్ట్ఫోన్లపై మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, టాబ్లెట్లు, వేరియబుల్స్, స్టోరేజ్ గాడ్జెట్లను కూడా శాంసంగ్ డిస్కౌంట్లలో అందుబాటులో ఉంచింది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్ఫోన్లు- శాంసంగ్ గెలాక్సీ ఏ8ప్లస్‌పై 4వేల రూపాయల అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్ అనంతరం దీని ధర 28,990 రూపాయలకు దిగొచ్చింది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్(32జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర కూడా రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అనంతరం 10,990 రూపాయలుగా ఉంది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 64జీబీ వేరియంట్ అమెజాన్ ఇండియాలో 12,990 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ నోట్ 8పై అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ 8వేల రూపాయలను అందిస్తోంది. దీంతో దీని ధర కూడా 59,900 రూపాయలకు దిగొచ్చింది. అదనంగా గెలాక్సీ ఆన్5 ప్రొ, గెలాక్సీ ఆన్7 ప్రొలపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే7 ప్రొ, గెలాక్సీ జే5 ప్రైమ్‌తో పాటు పలు శాంసంగ్ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 1,500 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై అమెజాన్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే అది స్మార్ట్ఫోన్లు, వేరియబుల్స్, టాబ్లెట్లకు వర్తించడం లేదు. కేవలం టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే అందిస్తోంది. పేటీఎం మాల్ కూడా శాంసంగ్ ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.