Cells
-
5జీ టెక్నాలజీ: హెచ్ఎఫ్సీఎల్, క్వాల్కామ్ జట్టు
న్యూఢిల్లీ: 5జీ అవుట్డోర్ స్మాల్ సెల్ ఉత్పత్తులను డిజైనింగ్, అభివృద్ధి చేసేందుకు క్వాల్కామ్ టెక్నాలజీస్‌తో జట్టు కట్టినట్లు దేశీ టెలికం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ వెల్లడించింది. టెల్కోలు 5జీ సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిరంతరాయ 5జీ అనుభూతిని అందించేందుకు స్థూల నెట్వర్క్కి అనుబంధంగా చిన్నపాటి అవుట్డోర్ సెల్స్ కూడా అవసరమవుతాయని పేర్కొంది. పెద్ద బేస్ స్టేషన్ల కవరేజీ అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాలు లేదా అస్సలు లేని ప్రాంతాల్లోనూ స్మాల్ సెల్స్ ఏర్పాటుతో సర్వీసులను మెరుగుపర్చవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫార్చూన్ బిజినెస్ ఇన్సైట్స్ అంచనాల ప్రకారం 2020లో 740 మిలియన్ డాలర్లుగా ఉన్న 5జీ స్మాల్ సెల్ మార్కెట్ 2028 నాటికి 17.9 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
Khosta-2: గబ్బిలాల నుంచి మానవాళికి కొత్త వైరస్!
కరోనాకి ముందు.. కరోనా తర్వాత అన్నచందాన తయారు అయ్యింది మనిషి పరిస్థితి. కొత్త కొత్త వైరస్లు, వ్యాధుల పేర్లు వినాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు గబ్బిలాల నుంచే మానవాళికి మరో ముప్పు పొంచి ఉందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఖోస్టా-2.. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న వైరస్ పేరు. ఇది రష్యా గబ్బిలాలో 2020లోనే గుర్తించామని, అది ఆ సమయంలో అది మనుషులకు అంతగా ప్రమాదం కలిగిస్తుందని అనుకోలేదని సైంటిస్టులు చెప్తున్నారు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం.. ఇప్పుడు ఇది మనిషి కణజాలంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని, వైరస్ గనుక మనుషులకు వ్యాపిస్తే.. విజృంభణ, ముప్పు రెండూ తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జర్నల్ పీఎల్ఓఎస్లో పబ్లిష్ చేశారు. కరోనా కంటే డేంజర్! Khosta-2.. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ అని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనిషి కణాలకు ఇన్ఫెక్షన్ సోకించడంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్లకు ఈ వైరస్ నిరోధకతను కలిగి ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు. అంటే.. కరోనా వైరస్ నుంచి ఉపశమనం కోసం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్పైనా తీవ్ర ప్రభావం కూడా చూపెడుతుందని వెల్లడించారు. ఖోస్టా-2 అంటే.. ఖోస్టా-2.. సార్స్-కోవ్-2కి చెందిన వైరస్. ఇది కూడా కరోనావైరస్లోనే ఉపవర్గానికి చెందిన వైరస్సే. టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఖోస్టా-1 అనేది మనుషులకు సోకదు. కానీ, ఖోస్టా-2 మాత్రం మనుషుల్లో ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్న వాళ్లు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు దీని బారి నుంచి తప్పించుకోలేరు. Omicron వేరియంట్ లాగా.. ఈ వైరస్‌లో తీవ్రమైన వ్యాధిని కలిగించే జన్యువులు లేవని పరిశోధకులు అంటున్నారు. కానీ SARS-CoV-2 జన్యువులతో కలిస్తే అది చివరికి మారే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం నిర్వహించిన మైకేల్ లెట్కో. గబ్బిలాలతో పాటు పాంగోలిన్స్, రకూన్ డాగ్స్, పామ్ సివెట్స్ జీవుల ద్వారా ఖోస్టా-2 వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ వైరస్ విజృంభణపై, వ్యాక్సినేషన్ తయారీపై ఒక అంచనాకి రాలేమని ఆయన అంటున్నారు లెట్కో. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత వ్యాక్సిన్లు మానవ కణజాలంపై ప్రభావం చూపెడుతున్న.. నిర్దిష్ట వైరస్ల కోసం రూపొందించబడుతున్నాయని, అన్ని సార్బెకోవైరస్ల నుంచి రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనే నమ్మకం సన్నగిల్లుతోందని అని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: ఈ దోమలు.. మలేరియాను అడ్డుకుంటున్నాయోచ్! -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్‌కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్‌తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
సింహం సిక్స్టీ ఫైవ్.. పులి కబాబ్ ట్రై చేస్తే..!
చికెన్, మటన్ ఎప్పుడూ తినేవే.. అదే ఏనుగు లెగ్ కర్రీనో, చిరుతపులి ఫ్రైనో ట్రై చేస్తే.. వామ్మో ఏమిటివి అనిపిస్తోందా? ఇవేవో జస్ట్ పేర్లు కాదు. ఆ జంతువుల మాంసంతో చేసే వంటకాలే. కాకపోతే ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగులను ఏమీ చంపడం లేదు. మరి ఆ మాంసం ఎలా వస్తుంది అంటారా.. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మాంసం కాని మాంసం.. జంతువులు, పక్షులను వధించి మాంసం వినియోగించడంపై కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మొక్కలు, నాచు సంబంధిత పదార్థాలతో మాంసం వంటి ఉత్పత్తులను తయారు చేసి, అమ్ముతున్నారు. కానీ అవేవీ మాంసం వంటి అనుభూతిని కలిగించలేవు. ఈ క్రమంలోనే జంతువులు, పక్షుల జీవకణాలను కృత్రిమంగా పెంచి మాంసం తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చికెన్ వంటివాటిని తయారు చేశారు కూడా. ఎవరూ ఊహించని రీతిలో.. కృత్రిమ మాంసం రూపకల్పనకు సంబంధించి లండన్‌కు చెందిన ప్రిమెవల్ ఫుడ్స్ అనే స్టార్టప్ కంపెనీ చిత్రమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. చికెన్, మటన్, బీఫ్ వంటి సాధారణమైనవి కాకుండా.. ఎవరూ ఊహించని రీతిలో సింహం, పులి, ఏనుగు వంటి మాంసాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో జంతువులను చంపడంగానీ, హింసించడంగానీ ఉండదు. ఆయా జంతువుల నుంచి సేకరించిన కొద్దిపాటి రక్తం, ఇతర కణాల నుంచి.. ల్యాబ్‌లో మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. రుచి.. బలం.. ఎక్కువట! ఇప్పుడు మనం తింటున్న చికెన్, మటన్, బీఫ్ వంటివి పెద్ద రుచిగా ఉండవని, వాటి నుంచి అందే పోషకాలు కూడా తక్కువేనని ప్రిమెవల్ ఫుడ్స్ కంపెనీ స్థాపనకు పెట్టుబడులు పెట్టిన ఏస్ వెంచర్స్ ప్రతినిధి యిల్మాజ్ బొరా అంటున్నారు. ‘‘కోళ్లు, మేకలు, పశువుల పెంపకం సులువు కాబట్టే.. వాటి మాంసాన్ని మనం వినియోగిస్తున్నాం. వాటిలో కొలెస్టరాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. అదే కృత్రిమంగా మాంసం ఉత్పత్తి చేయగలిగినప్పుడు కూడా వాటితో పనేముంది? బాగా రుచిగా ఉండే, ఎక్కువ పోషకాలు ఉండే భిన్నమైన జంతువుల వైపు మేం దృష్టిపెట్టాం. ఉదాహరణకు మంచి నిద్ర, మూడ్ ఉండేందుకు చిరుతపులి మాంసాన్ని.. మెదడు పనితీరు మెరుగుపర్చే ఏనుగు మాంసాన్ని మనం భవిష్యత్తులో తినబోతున్నాం’’ అని చెప్తున్నారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమేనని, ఇంకా అద్భుతమైన ఆహార అనుభూతినీ పొందడం ఖాయమని పేర్కొంటున్నారు. -
సెనెసెంట్ కణాలు తొలగిస్తే ‘షుగర్’కు చెక్
వయసు పెరిగే కొద్దీ శరీరంలో పేరుకుపోయే సెనెసెంట్ కణాల (విభజనకు గురయ్యే లక్షణాన్ని కోల్పోయినవి)ను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు వేయవచ్చునని కనెక్టికట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుకలపై ప్రయోగాల్లో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు వారు తెలిపారు. ఊబకాయంతో ఉన్న ఎలుకలకు సెనెసెంట్ కణాలను తొలగించే ప్రయోగాత్మక మందులు డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లు ఇచ్చినప్పుడు వాటి మధుమేహ లక్షణాలు మాయమైపోయాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మింగ్ షూ తెలిపారు. ఊబకాయం, వ్యాయామలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది మధుమేహుల్లో ఇనుల్సిన్ నిరోధకత ఉంటుంది. వాటితోపాటు కొవ్వులో ఉండే సెనెసెంట్ కణాలూ మధుమేహంపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని మింగ్ షూ చెప్పారు. ఈ కణాలను తొలగిస్తే మధుమేహానికి బ్రేకులు పడ్డాయని వివరించారు. డసాటనిబ్, క్యుయెర్‌సెటిన్‌లను తాము మానవ కొవ్వు కణజాలంపై ప్రయోగించినప్పుడు అందులోని సెనెసెంట్ కణాలు నశించాయని వివరించారు. ఊబకాయుల నుంచి సేకరించిన ఈ కణజాలాన్ని ఎలుకలకు అమర్చినప్పుడు మధుమేహ లక్షణాలు తగ్గాయని చెప్పారు. మానవుల్లోనూ ఈ మందుల ప్రభావం ఇదేలా ఉంటుందా? అన్నది పరిశీలించేందుకు త్వరలో విస్తృత ప్రయోగాలు చేస్తామన్నారు. -
కరోనా: కాపాడాల్సిన ఎంజైమ్.. ప్రాణం మీదకు తెస్తోంది!
కరోనా బారినపడ్డ వారిలో చాలావరకు కోలుకున్నా కొందరు మాత్రం పరిస్థితి సీరియస్ అయి చనిపోయారు. పొద్దున్నే బాగున్నవారు కూడా సాయంత్రానికో, రాత్రికో కన్నుమూశారు. ఇలా కొద్దిగంటల్లోనే ఆరోగ్యం విషమించడానికి కారణం ఏమిటన్నది శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మన శరీరాన్ని కాపాడే ఓ ఎంజైమ్.. మనకు ప్రాణాపాయంగా మారుతోందని తేల్చారు. ఏమిటీ ఎంజైమ్, ఎందుకు ప్రమాదకరంగా మారుతోందన్న వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ శత్రు కణాలను.. చంపడం కోసం.. మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను సంహరించడానికి విడుదలయ్యే ఎంజైమ్‌లలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ (సీక్రెటెడ్ ఫాస్ఫోలిపేస్ ఏ2 గ్రూప్ ఐఐఏ)’ ఎంజైమ్ చాలా కీలకం. ఇది మన రోగనిరోధక శక్తికి అనుబంధంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండి శరీరమంతా తిరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు కనిపిస్తే.. వాటిని చుట్టుముట్టి ముక్కలు ముక్కలు చేసేస్తుంది. సాధారణంగా సూక్ష్మజీవుల పైపొర ప్రత్యేకమైన కొవ్వు పదార్థంతో కూడి ఉంటుంది. ఈ ఎంజైమ్ ఆ పొర ఆధారంగానే గుర్తించి దాడి చేస్తుంది. మానవ కణాల్లోనూ ఈ కొవ్వుపదార్థం ఉంటుంది. కానీ పూర్తిగా ఉపరితలంపై ఉండదు. ఈ కొవ్వుపొరకుపైన ఇతర పదార్థాల పొర (త్వచం) ఉండి.. కణాన్ని రక్షిస్తూ ఉంటుంది. మన కణాలపై దాడితోనే.. సాధారణంగా మన కణాలపై ఉన్న త్వచం ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ కరోనా వైరస్ కారణంగా మన శరీర కణాలు ఎంజైమ్ దాడికి గురవుతున్నాయి. అవయవాల్లో కణాలు నశించి, వాటి పనితీరు దెబ్బతింటోంది. ఇది మరణానికి దారితీస్తోంది. కరోనాతో ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయినవారిపై, మృతులపై.. ఫ్లాయిడ్ చిల్టన్ నేతృత్వంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ గుట్టు విప్పారు. ఎంజైమ్ ఏం చేస్తుంది? తీవ్రంగా దెబ్బతినడం, గాయపడటం వంటివి జరిగినప్పుడు.. వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.. మన శరీర కణాలు బలహీనం అవుతాయి. వాటి త్వచం దెబ్బతిని, లోపలి కొవ్వుపొరలు బహిర్గతం అవుతాయి. దీనితో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనవుతాయి. ఈ ఎంజైమ్ అలాంటి కణాలపై దాడిచేసి ముక్కలు చేస్తుంది. దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాల వల్ల.. ఇతర కణాలకు ప్రమాదం లేకుండా శరీరంలో ఉండే ఏర్పాటు ఇది. ఇక దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాలు.. వాటిలోని మైటోకాండ్రియా (కణంలో శక్తిని ఉత్పత్తి చేసే భాగం)ను విడుదల చేస్తాయి. మైటోకాండ్రియాలు కొవ్వుపొరతో కూడుకుని వైరస్, బ్యాక్టీరియాను తలపించేలా ఉండటంతో.. ఎంజైమ్ వాటిపైనా దాడి చేసి ముక్కలు ముక్కలు చేస్తుంది. కరోనా సోకినప్పుడు ఏం జరుగుతోంది? సాధారణంగా ఏ వైరస్, బ్యాక్టీరియా అయినా ఇన్ఫెక్షన్ కొంతమేరకే ఉంటుంది. ఆ సూక్ష్మజీవులను రోగనిరోధక శక్తి చంపేయడం, అవి సోకిన కణాలను ఎంజైమ్ నాశనం చేయడంతో శరీరంలో వాటి విస్తరణ ఆగిపోతుంది. బాధితులు సదరు వ్యాధి నుంచి కోలుకుంటారు. కానీ కరోనాలో మాత్రం ఈ పరిస్థితి వేరుగా ఉంటోందని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ చెప్తున్నారు. కరోనా తీవ్రస్థాయిలో సోకినవారిలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుందని.. ఊపిరితిత్తులు, కిడ్నీలు సహా చాలా అవయవాల్లో పెద్ద సంఖ్యలో కణాలు ఇన్ఫెక్ట్ అవుతున్నాయని వివరించారు. ఇలా ఇన్ఫెక్ట్ అయిన కణాలన్నీ కూడా ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ప్రభావానికి లోనుకావడంతో సదరు అవయవాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ‘‘కణాలపై ఎంజైమ్ దాడి, రోగనిరోధకశక్తి విపరీత స్పందన, దాని వెంట ఇన్ఫ్లమేషన్ శరవేగంగా జ రుగుతాయి.అది మనం జారుడుబండపై జారుతూ పోతున్నట్టే. మనకు అర్థమయ్యేలోగానే చాలావే గంగా పరిస్థితిక్షీణిస్తుంది..’అని ఫ్లాయిడ్ తెలిపారు. 127 మంది.. వెయ్యి ఎంజైమ్, రసాయనాలు శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 127 మందిని ఎంపిక చేశారు. అందులో కోవిడ్‌తో మరణించినవారు 30 మంది, ప్రాణాపాయస్థితికి వెళ్లి బయటపడ్డవారు మరో 30 మంది, మధ్యస్థాయి లక్షణాలున్న ఇంకో 30 మంది ఉండగా.. మిగతా 37 మంది కోవిడ్ సోకనివారు. రక్తంలో ఉండే వెయ్యి ఎంజైమ్‌లు, ఇతర రసాయనాల స్థాయిలు, పనితీరు.. ఈ 127 మందిలో ఎలా ఉన్నాయో పరిశీలించారు. ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ కీలకమని గుర్తించారు. ఆరోగ్యవంతుల్లో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ స్థాయి లు ఒక్కో మి.మీ. రక్తంలో 10–20 నానోగ్రామ్‌ల వరకు ఉంటాయి. కానీ కరోనా మృతులు, సీరియస్ అయినవారిలో వెయ్యి నానోగ్రామ్లకుపైగా ఉన్నట్టు గుర్తించారు. ‘బ్లడ్ యూరియా నైట్రోజన్’ కూడా.. కరోనా మృతుల్లో ‘బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్)’ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. శరీరంలో ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్థంగా ‘బీయూఎన్’ ఉత్పత్తి అవుతుంది. కిడ్నీలు దీనిని రక్తం నుంచి వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపేస్తాయి. అయితే తీవ్రస్థాయి కరోనా సోకినవారిలో కిడ్నీలు వైరస్ దాడికి గురవుతున్నాయని.. ఇన్ఫెక్ట్ కణాలను ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్ ముక్క లు చేయడంతో కిడ్నీలు దెబ్బతింటున్నట్లు తేల్చారు. దీనివల్లే వారి రక్తంలో ‘బీయూఎన్’ మోతాదు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుజాగ్రత్తలు.. ఔషధాలకు లైన్‌క్లియర్ కరోనా సోకినవారిలో కొందరి పరిస్థితి వేగంగా విషమించి మరణించడానికి కారణమేంటో తేలినందున.. దీనికి ఔషధాలు రూపొందించడం సులువని శాస్త్రవేత్త ఫ్లాయిడ్ చిల్టన్ తెలిపారు. అంతేకాదు.. కరోనా పేషెంట్ల రక్తంలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్, మూత్రంలో ‘బీయూఎన్’ శాతాన్ని ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా ఆరోగ్యం విషమించే ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని వివరించారు. తగిన చికిత్స చేయడం ద్వారా పేషెంట్లను కాపాడుకోవచ్చని వెల్లడించారు. -
కోవిడ్-19 : వైరస్ సోకిన కణాల ఫోటోలివే..
న్యూయార్క్ : కరోనా వైరస్ సోకిన శ్వాసకోశ కణాల ఫోటోలను శాస్త్రవేత్తలు ప్రచురించారు. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించిందీ ఈ చిత్రాల్లో గుర్తించారు. శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుందనేది సులభంగా అర్ధమయ్యేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు. మావన శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్ కణాలు శరీరమంతటా వ్యాపించడంతో పాటు ఇతరులకూ సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ర్టాన్ మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. తిరిగి రంగులద్దిన ఈ చిత్రాలు శ్వాసకోశ నాళాల్లో వైరస్‌కు గురైన వెంట్రుకల మాదిరి ఉన్న కణాలను చూపుతున్నాయి. ఈ కణాలు శ్లేష్మంతో పాటు వైరస్‌లను ఊపిరితిత్తుల నుంచి ఇతర భాగాలకు వ్యాపింపచేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. అధిక శక్తితో కూడిన మాగ్నిఫికేషన్ వాడుతూ మానవ శ్వాసకోశంలో తయారైన కోవిడ్-19 నిర్మాణం, తీవ్రతను పరిశోధకులు వెల్లడించారు. అతిథేయ కణాల్లో శ్వాసకోశ ఉపరితలాలపై పూర్తిగా గూడుకట్టుకుని ఉన్న వైరస్ కణాలివని పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్రమణను అడ్డుకునేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని ఈ చిత్రాల ద్వారా విస్పష్టంగా వెల్లడవుతోందని పరిశోధకులు స్పష్టం చేశారు. -
కేన్సర్‌ను చంపేసే ఫ్యాటీ ఆసిడ్స్ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలను బలితీసుకుంటున్న కేన్సర్ మహమ్మారి వ్యతిరేక పోరాటంలో శాస్త్రవేత్తలు ప్రధాన పురోగతి సాధించారు.మానవులలో క్యాన్సర్ కణాలను చంపగల ఫ్యాటీ ఆసిడ్స్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డిహోమో-గామా-లినోలెనిక్ ఆమ్లం లేదా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలోని క్యాన్సర్ కణాలలో ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఫెర్రోప్టోసిస్ అంటే దెబ్బతిన్న లేదా పనిచేయని కణాలు సురక్షితంగా, సమర్ధవంతంగా నాశనం చేయడం లేదా రీసైకిల్ చేయడం. ఇనుము ("ఫెర్రో" అంటే ఇనుము) ను ఉపయోగించే అత్యంత నియంత్రిత సెల్ డెత్ ప్రోగ్రామ్‌ను ఫెర్రోప్టోసిస్ అంటారు. దీన్ని 2012లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పీయూఎఫ్ఏ), డీజీఎల్‌ఏ ఆమ్లం ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా అటు జంతువుల్లో ఇటు మానవులలోని కేన్సర్ కణాలలోనూ ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ డీజీఎల్‌ఏను ఖచ్చితంగా కేన్సర్ కణంలోకి బట్వాడా చేయగలిగితే, అది ఫెర్రోప్టోసిస్‌ను ప్రోత్సహిస్తుందనీ, తద్వారా కణితిలోని కేన్సర్ కణాలను హరించి వేస్తుందని తెలిపారు. అంతేకాదు ఫెర్రోప్టోసిస్ ద్వారా మూత్రపిండాల సంబంధిత జబ్బులు, న్యూరోడీజెనరేషన్ వ్యాధుల వంటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తున్నామని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాట్స్ వెల్లడించారు. ‘డెవలప్మెంటల్ సెల్’ లో ఈ స్టడీ ప్రచురితమైంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా, నెమటోడ్ కేనోరబ్డిటిస్ ఎలిగాన్స్ ద్వారా జంతువుల్లో డీజీఎల్ఎతో సహా ఇతర ఆహార కొవ్వుల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణకు క్యాన్సర్‌కు సంభావ్య చికిత్స దిశగా ఒక అడుగుపడిందని చెప్పారు. అలాగే కొన్నిచిక్కులు కూడా ఉన్నాయన్నారు. సీ ఎలిగాన్స్ అనేది మైక్రోస్కోపిక్ వార్మ్. సెల్ యాక్టివిటీ అధ్యయనంలో పారదర్శకంగా ఉండే దీన్ని తరచుగా ఉపయోగిస్తారు. నెమటోడ్లకు ఈ ఆహారం ఇవ్వడం వల్ల డీజీఎల్‌ఏతో నిండిన బ్యాక్టీరియా.. అన్ని బీజ కణాలతో పాటు బీజ కణాలను తయారుచేసే మూల కణాలను కూడా చంపినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మరోవైపు ఈ ఫలితాలు మానవ కణాలకు సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకుల బృందం స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్కాట్ డిక్సన్‌తో కలిసి మరింత అధ్యయనం చేశారు. ఈ బృందం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. దీనికి అదనంగా, డీజీఎల్ఏకు వ్యతిరేకంగా పనిచేసే మరో ఫాటీ ఆసిడ్‌ను కూడా గుర్తించారు. ఈథర్ లిపిడ్గా పిలిచే దీన్ని తొలగిస్తే.. డీజీఎల్కు ఎక్స్పోజ్ అయిన కణాలు మరింత వేగంగా చనిపోతాయని కనుగొన్నారు. డిక్సన్ చాలా సంవత్సరాలుగా ఫెర్రోప్టోసిస్, క్యాన్సర్‌తో పోరాటంలో దాని సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. -
యుద్ధానికి సిద్ధమెలా?
కరోనా వైరస్ పేరు చెప్పగానే మనమంతా వణికి పోతున్నాం గానీ.. ఇవి మనకు కొత్తేమీ కాదు. యుగాలుగా మనపై దాడి చేస్తూనే ఉన్నాయి.. ప్రతి దాడితో మనిషి మరింత బలపడ్డాడు. కొత్త వాటిని అడ్డుకునే శక్తి సంపాదించుకున్నాడు అంతా మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ ఫలితం! ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఏం చేస్తే బలహీన పడుతుంది? మరింత బలం పుంజుకోవడం ఎలా? యుద్ధంలో మాదిరిగానే ఈ రోగ నిరోధక వ్యవస్థలోనూ.. చతురంగ బలాలు ఉంటాయి. సూక్ష్మజీవుల ఎత్తులకు పైఎత్తులేయడం.. అస్త్రశస్త్రాలతో వాటిని చిత్తు చేయడం.. నిత్యం జరిగేవే. వేగులు, సైనికులు, సమాచారం సేకరించే వారు.. బోలెడన్ని ఆయుధ కర్మాగారా లు ఈ వ్యవస్థలో భాగాలే. కణాలు, కణజాలాలు, శోషరస గ్రంథులు (లింఫ్‌నోడ్స్), అవయవాలతో కూడి ఉంటుంది ఈ వ్యవస్థ. సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని నాశనం చేయడం, లోపలికి చొరబడ్డ శత్రువు వివరాలను నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులో మళ్లీ అదే శత్రువు వస్తే అడ్డుకోవడం, క్రిములను చంపేయడం, సమాచారం ఒక చోటి నుంచి ఇంకోచోటికి చేరవేయడం వంటి సుమారు 12 పనులను ఈ వ్యవస్థ చేస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు సుమారు 21 రకాల కణాలు అందుబాటులో ఉంటాయి. ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు శరీరంపై ఏదైనా గాటు పడితే.. ఆ వెంటనే దాని గుండా బ్యాక్టీరియా వంటివి లోపలికి ప్రవేశించి బాగా పెరుగుతాయి. వీటిని అడ్డుకునేందుకు సరిహద్దులో గస్తీ సైనికుల మాదిరిగా మాక్రోఫేగస్ కణాలు రంగంలోకి దిగుతాయి. కొంచెం పెద్ద సైజు (21 మైక్రోమీటర్లు) ఉండే ఈ మాక్రోఫేగస్ ఒక్కొక్కటి వంద వరకు బ్యాక్టీరియాలను మింగేసి ఎంజైమ్‌ల సాయంతో నాశనం చేస్తాయి. మంట/వాపు కలిగించడం ద్వారా నీళ్ల లాంటి ద్రవం విడుదల చేయాల్సిందిగా రక్త కణాలకు సమాచారం పంపుతాయి. బ్యాక్టీరియా తగ్గకపోతే.. కొంతకాలం తర్వాత మాక్రోఫేగస్ విడుదల చేసే మెసెంజర్ ప్రొటీన్లతో రక్తంలో ప్రవహిస్తున్న న్యూట్రోఫిల్స్‌ను అదనపు బలగాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా ఇవి బ్యాక్టీరియాను చంపేస్తాయి. బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు తమను తాము నాశనం చేసుకునేందుకు కూడా ఇవి వెనుకాడవు. ఇంత జరిగినా బ్యాక్టీరియా ప్రభావం తగ్గలేదనుకోండి.. అప్పుడు రోగ నిరోధక వ్యవస్థకు మెదడు లాంటి డెండ్రటిక్ కణాలు రంగ ప్రవేశం చేస్తాయి. బ్యాక్టీరియా తాలూకు సమాచారం మొత్తం సేకరించి.. దగ్గరలోని శోషరస గ్రంథులను చేరుకుంటాయి. ఈ గ్రంథుల్లోని కోటాను కోట్ల హెల్పర్ టి–సెల్స్, కిల్లర్ టి–సెల్స్‌లో తగిన వాటిని గుర్తించి వాటిని చైతన్యపరుస్తాయి. ఈ టి, కిల్లర్ కణాలు గణనీయంగా వృద్ధి చెంది బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని శోషరస గ్రంథిలోనే ఉంటాయి. భవిష్యత్తులో ఇదే రకమైన బ్యాక్టీరియా దాడి చేస్తే ప్రతిదాడికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని హెల్పర్ టి–కణాలు గ్రంథుల్లోని శక్తిమంతమైన బి–కణాలను చైతన్యపరచడంతో అవి యాంటీబాడీలను తయారు చేసి బ్యాక్టీరియాపైకి వదులుతాయి. ఇవి బ్యాక్టీరియాకు అతుక్కుపోయి వాటిని నిర్వీర్యం చేస్తాయన్న మాట. దాడి చేసే సూక్ష్మజీవిని బట్టి రోగనిరోధక వ్యవస్థలోని కణాలు వేర్వేరు పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తాయి. బలహీనపడేది ఇలా.. రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడేందుకు వయసుతో పాటు ఒత్తిడి, దురలవాట్లు వంటి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపాలు, కొన్ని రకాల మందులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ వంటి రోగాలు కూడా కారణమే. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మెదడు కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే కార్టిసోల్ వంటి మంచి చేసే హార్మోన్లు కూడా శరీరానికి హానికారకంగా మారిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు ఈ హార్మోన్‌కు అలవాటు పడిపోయి తగువిధంగా స్పందించవు. కొన్ని రకాల అలవాట్లు కూడా శరీరాన్ని ఒత్తిడికి గురిచేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అయితే కొంతమందికి పుట్టుకతో బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. మరికొందరిలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం ద్వారా కీళ్లనొప్పులు, టైప్–1 మధుమేహం, మల్టిపుల్ స్లీ్కరోసిస్ వంటి రోగాలు వస్తూంటాయి. శక్తిమంతుడిగా మారాలంటే.. రోగ నిరోధక వ్యవస్థన బలపరుచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాసింత జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇందుకు మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరమూ ఉండదు. తగిన పోషకాలున్న ఆహారం సగం సమస్యలు తీరుస్తుంది. ఉదాహరణకు ప్రోటీన్లు.. రోగ నిరోధక వ్యవస్థలోని అన్ని కణాలకు, ఇతర కణాలకు కూడా ప్రొటీన్లలో ఉండే ఎల్–ఆర్జినిన్ అవసరముంటుంది. ఈ ఎల్–ఆర్జినిన్ శరీరంలో హెల్పర్ టి–సెల్స్ ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలు తగినంత మోతాదులో తీసుకోవడం (భారతీయులు రోజుకు కనీసం 400 గ్రాములు తీసుకోవాలి) వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతుంది. రోగనిరోధక కణాల్లో సుమారు 70 శాతం మన కడుపు/పేగుల్లో ఉంటాయని సైన్స్ చెబుతోంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చూసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థలో సుమారు వెయ్యి రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో అత్యధికం శరీరానికి మేలు చేసేవే కాబట్టి.. వీటిలో సమతుల్యం ఉండేలా చూడాలి. పెరుగు తదితర ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థలో సమతుల్యత చెడకుండా చూసుకోవచ్చు. విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు తగినన్ని శరీరానికి అందేలా చేయడం ముఖ్యమే. సూర్యరశ్మితో శరీరంలో ఉత్పత్తి అయ్యే విటమిన్–డి మరీ ముఖ్యం. వ్యాయామం కూడా శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా స్పష్టమైంది. మంచి ఆహారం తీసుకోవాలి.. తగినంత వ్యాయామం చేయాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలి.. ఇవన్నీ చేయగలిగితే కరోనాను దూరం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు! – సాక్షి, హైదరాబాద్ -
అంతా బాగున్నా..
వైరస్ జీర్ణ వ్యవస్థలోకి చేరే వరకు దాని లక్షణాలేవీ బయటపడవు. అంతా బాగుంది కదాని అనుకునేలోపు.. శరీరంలో వైరస్ ఆర్ఎన్ఏ హైజాక్ చేసిన కణాలతో రోగ నిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. అది.. సైటోకైన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. అవి.. వైరస్ బారినపడ్డ కణాలను గుర్తించి నాశనం చే యడం మొదలుపెడతాయి. దీంతో జ్వరం వస్తుంది. ఆహారం తీసుకుంటే వామిటింగ్ సెన్సేషనల్ కలుగుతుంది. గంటల వ్యవధి లో ఛాతీ పట్టేసిన అనుభూతి.. పొడి దగ్గు మొదలై ఎంతకీ ఆగదు. కరోనా వైరస్ బారినపడ్డ వారిలో 80 శాతం మంది తేలికపాటి జలుబు లక్షణాలే కలిగి ఉండటం, సుమారు 13 శాతం మందిలో లక్షణాల తీవ్రత ఎక్కు వగా, 5 శాతం మందిలో విషమంగా ఉన్నట్టు పరిశోధనలు బలపరుస్తున్నాయి. -
జన్యుపదార్థం హైజాక్...
వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ మన కణంలోని జన్యు పదార్థాన్ని హైజాక్ చేయడంతో సమస్య మొదలవుతుంది. శరీర వ్యవస్థ మానవ ప్రొటీన్లకు బదులుగా వైరస్ తాలూకు ప్రొటీన్లు తయారు చేయడం మొదలుపెడుతుంది. ఇది కాస్తా వైరస్ ఆర్ఎన్ఏల సంఖ్య పెరిగేందుకు కారణమవుతుంది. మరికొన్ని ఇతర వైరస్ ప్రొటీన్లు కణాలను నిర్వీ ర్యం చేస్తాయి. కణాలు శరీరానికి అవసరమైన పనులు కాకుండా.. వైరస్‌కు కావాల్సిన పనులు చేయడంలో బిజీ అయిపోతాయి. వైరస్ ఆర్ఎన్ఏ సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ అవి కణం బయటకు వచ్చేసి మరిన్ని కణాలను ఆక్రమించేస్తాయి. ఊపిరితిత్తులు, గొంతు, నోరు మొత్తం వైరస్‌లతో నిండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క రోజులో లక్షల రెట్లు పెరిగిపోయే వైరస్ రక్తం ద్వారా జీర్ణ వ్యవస్థలోకి చేరుతుంది. -
సోరియాసిస్ తగ్గి తీరుతుంది
నా వయసు 42 ఏళ్లు. చర్మంపై ఎర్రటి తెల్లటి పొడలు కనిపిస్తున్నాయి. ఆ పొడల్లో దురదగా కూడా ఉంటోంది. తలలోంచి వెండి పొలుసుల్లా రాలిపోతున్నాయి. డాక్టర్‌కు చూపిస్తే సోరియాసిస్ అని మందులు ఇచ్చారు. కానీ మూడేళ్ల నుంచి వాడుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. నా సమస్య హోమియో వైద్యంతో తగ్గుతుందా? అన్ని ఇతర వ్యాధుల్లాగే సోరియాసిస్ కూడా సాధారణ వ్యాధే. కారణాన్ని తెలుసుకుని హోమియో వైద్యం అందిస్తే సోరియాసిస్‌ను సమూలంగా నయం చేయవచ్చు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మవ్యాధి. ఈ వ్యాధి తగ్గినట్టే తగ్గి... మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఇతర చర్మవ్యాధులతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో చర్మం మీద దురద, ఎర్రటి పొడలు రావడంతో పాటు, వెండి లాంటి తెల్లటి చేపపొలుసుల్లాంటివి కనిపిస్తాయి. ఈ పొలుసుల ఆధారంగానే సోరియాసిస్‌ను నిర్ధారణ చేస్తారు. ఎందుకు వస్తుందంటే : మన చర్మంలో సహజంగా పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తుంటాయి. ఇది సాధారణ కంటికి కనిపించని ప్రక్రియ. ఈ విధంగా పాతకణాలు పోయి కొత్తకణాలు రావడానికి 28 నుంచి 30 రోజులు పడుతుంది. కానీ సోరియాసిస్‌లో ఆటో ఇమ్యూనిటీ కారణంగా చర్మంలోని కొత్త కణాలు త్వరగా రావడం జరుగుతుంది. కొత్త కణాలు 3 నుంచి 6 రోజుల్లోనే వచ్చేసి, పాతకణాలను బయటకు నెట్టేసి చర్మం మీద పొలుసుల మాదిరిగా కనిపించేలా చేస్తాయి. లక్షణాలు : చర్మంపై చిన్నగా లేక పెద్దగా ఎర్రటి పొడలు రావడం, వాటి మీద వెండి లాంటి తెల్లటి పొడలు రావడం జరుగుతుంది. ఈ పొడలు దురదగా ఉండి, గోకిన వెంటనే తెల్లటి పొలుసులు ఊడి బయటకు వస్తాయి. తలలో ఉండే సోరియాసిస్ పలుసులు పెద్దగా ఉండి పెచ్చుల మాదిరిగా కనిపిస్తూ, ఎంతకూ తగ్గకపోవడం జరుగుతుంది. హోమియో చికిత్స : ముందుగా సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణాలను తెలుసుకోవడం జరుగుతుంది. రోగి మానసిక ఒత్తిడి, ఆందోళన మొదలైన కారణాలను తెలుసుకుని, దానికి అనుగుణంగా మందులు ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాల సమస్య కాబట్టి వైద్యుల సూచన మేరకు ఓపికగా మందులు వాడాల్సి ఉంటుంది. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ పైల్స్‌కు శాశ్వత పరిష్కారం ఉంటుందా? నా వయసు 55 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? అమితంగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. వీటిలో తీవ్రతను బట్టి రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. కారణాలు : ►మలబద్దకం ►మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండర బంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ►సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ►స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం ►మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం ►పోషకాహారం తీసుకోకపోవడం ►నీరు తక్కువగా తాగడం ►ఎక్కువగా ప్రయాణాలు చేయడం ►అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ►మానసిక ఒత్తిడి.. వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు : ►నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ►మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ : ►మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ►సమయానికి భోజనం చేయడం ∙ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ►నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ►మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ►మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ముగ్గురికి వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: వైద్య రంగంలో 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటిష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్(హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా(హాప్కిన్స్ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్క్లిఫ్(ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్)లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్ డాలర్లను సమంగా పంచుకుంటారు. శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయంపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్తాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ‘వేర్వేరు ఆక్సిజన్ స్థాయిలకు జన్యువులు ఎలా ప్రతిస్పందిస్తాయనే విషయంలో, అలాగే, కొత్త ఎర్ర రక్త కణాలు, రక్త నాళాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చే విషయాల్లో వీరు చేసిన పరిశోధనలు ఆ శాస్త్ర విస్తృతికి ఎంతో దోహదపడ్డాయి’ అని కమిటీ ప్రశంసించింది. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు. ఈ అవార్డ్ ద్వారా తనకొచ్చిన డబ్బును ఎలా వినియోగించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే, ఒక మంచి పనికే ఆ డబ్బును వాడుతానని డాక్టర్ కెలీన్ తెలిపారు. ‘ఉదయం 5 గంటల సమయంలో సగం నిద్రలో ఉండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ సమయంలో ఫోన్ వచ్చింది అంటే.. అది శుభవార్తే అయ్యుండొచ్చు అనుకున్నాను. నా గుండె వేగం పెరిగింది’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ పరిశోధన ప్రారంభించేముందు అవార్డుల గురించి ఆలోచించలేదు. కణాల్లో ఆక్సిజన్ స్థాయిలపై పరిశోధన అంత సులభం కాదు. పరిశోధన ఫలితాలపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు’ అని డాక్టర్ రాట్క్లిఫ్ స్పందించారు. 2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్ జేమ్స్ ఆలిసన్, జపాన్ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్ లభించింది. డైనమైట్ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. -
ప్రాణవాయువు గుట్టు విప్పినందుకు..
తిన్న ఆహారం శక్తిగా మారాలంటే మనిషితోపాటు అన్ని రకాల జంతువులకూ ఆక్సిజన్ అవసరం. సూక్ష్మస్థాయిలో కణాలూ ఆక్సిజన్ తగ్గిపోతే ఇబ్బంది పడతాయి. ఈ సూక్ష్మ కణాలు తమ పరిసరాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉందని ఎలా గుర్తిస్తాయి? అందుకు తగ్గట్లుగా తమను తాము ఎలా మలచుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కున్న శాస్త్రవేత్తలు కెలీన్, రాట్క్లిఫ్, సెమెన్జాలకు ఈ ఏడాది వైద్యనోబెల్ దక్కింది. కణస్థాయిలో ఆక్సిజన్ స్థాయికి తగ్గట్లుగా జన్యువులను ప్రేరేపించే ఓ కణ యంత్రాంగాన్ని వీరు గుర్తించారు. ఆక్సిజన్ మోతాదుల్లో వచ్చే తేడాలు జీవక్రియలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు, రక్తహీనత మొదలుకొని కేన్సర్ వరకూ అనేకవ్యాధులకు సరికొత్త, మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. వాతావరణంలో 20 శాతం... భూ వాతావరణంలో 20 శాతం వరకూ ఉన్న ఆక్సిజన్ జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కణాల్లోని మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎంజైమ్‌ల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుందని 1931 నోబెల్ గ్రహీత ఒట్టో వార్బర్గ్ గుర్తించారు. మెడకు ఇరువైపులా రెండు పెద్ద రక్తనాళాల పక్కనే ఉండే కరోటిడ్ బాడీలో... రక్తంలో ఆక్సిజన్ మోతాదును గుర్తించే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగాన్ని నియంత్రించేందుకు ఈ కరోటిడ్ బాడీలు మెదడుకు సంకేతాలు పంపుతాయని 1938 నో»ñ ల్ గ్రహీత కార్నైయిల్ హేమన్స్ గుర్తించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు శరీరం చేపట్టే ఇంకో పని... ఎరిథ్రోపొయిటిన్ అనే హర్మోన్‌ను ఉత్పత్తి చేయడం. ఈ హార్మోన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. అయితే ఈ ప్రక్రియను ఆక్సిజన్ ఎలా నియంత్రిస్తుందన్నది ఇటీవలి వరకూ తెలియదు. జన్యు ప్రహేళిక... ఈ ఏడాది నోబెల్ అవార్డుగ్రహీతలు సెమెన్జా, రాట్క్లిఫ్లు ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువుపై పరిశోధనలు చేశారు. ఈ జన్యువులో మార్పులు చేసిన ఎలుకలను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ కొరతకు ఈ జన్యువు స్పందిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ ఎరిథ్రోపొయిటిన్ కిడ్నీ కణాల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కానీ శరీరంలోని దాదాపు అన్ని కణజాలాల్లోనూ ఎరిథ్రోపొయిటిన్ ఉత్పత్తిని నియంత్రించే జన్యువు ఉన్నట్లు స్పష్టమైంది. దీంతోపాటు అనేక ఇతర ప్రొటీన్లు, (హెచ్ఐఎఫ్–1, ఏఆర్ఎన్టీ), ఒక రకమైన కేన్సర్‌ను నిరోధించే హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువు వీహెచ్ఎల్కు కూడా కణాల ఆక్సిజన్ నియంత్రణలో తమదైన పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటి మధ్య జరిగే చర్యలు ఆక్సిజన్ మోతాదుకు తగ్గట్లుగా కణాలు మార్పులు చేసుకునేందుకు కారణమవుతున్నట్లు తెలిసింది. వీటిల్లో కొన్ని పరిశోధనలను కెలీన్ వేరుగా చేశారు. ఏతావాతా... శరీరంలో ఆక్సిజన్ మోతాదు తక్కువగా ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 ప్రొటీన్ కణ కేంద్రకంలో ఎక్కువగా పోగుపడుతుంది. ఇక్కడ అది ఏఆర్ఎన్టీతో కలసి ఆక్సిజన్ లేమి, కొరతను నియంత్రించే జన్యువులకు అతుక్కుంటుంది. ఆక్సిజన్ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 వేగంగా నశిస్తూ టుంది. కొన్ని అణువులను జత చేయడం ద్వారా ఆక్సిజన్ దీనిని నియంత్రిస్తుంటుంది. ఎన్నో వ్యాధులకు హేతువు.. కణాలు ఆక్సిజన్ లేమి, కొరతలను గుర్తించకపోవడం రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. కిడ్నీ వైఫల్యం ఉన్న వారిలో ఎక్కువ మంది రక్తహీనతతోనూ బాధపడుతుంటారు. ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్ జన్యువు సక్రమంగా పనిచేయకపోవడం దీనికి కారణం. ఆక్సిజన్ మోతాదులను గుర్తించే వ్యవస్థ కేన్సర్ విషయంలోనూ కీలకంగా ఉంటుంది. కేన్సర్ కణితుల్లో ఈ వ్యవస్థ జీవక్రియలను మార్చేందుకు, కొత్త రక్తనాళాల ఏర్పాటు, కేన్సర్ కణాలు శరీరంలో వేగంగా వ్యాప్తి చెందేందుకూ ఉపయోగపడుతూ ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కండరాలు ఎందుకు ఇలా పట్టేస్తున్నాయి?
నా వయసు 38 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. ఈ వేసవిలో మరిన్నిసార్లు ఈ సమస్య కనిపిస్తోంది. నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది. దీని నుంచి బయట పడటానికి మార్గం చెప్పండి. తరచూ కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సింపుల్ డీహైడ్రేషన్ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. పక్షవాతానికి సెమ్సెల్ థెరపీ అందుబాటులో ఉందా? నేను గత తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాను. ఇటీవల వార్తాపత్రికలు చదువుతూ పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకున్నాను. నేను ఈ చికిత్స తీసుకోదలిచాను. ప్రస్తుతం ఇది ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలెలా ఉన్నాయనే వివరాలు విపులంగా తెలియజేయండి. ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. కానీ ఒక ఆశారేఖ ఉంది. మెదడు కణాలు చనిపోయిన సమయంలోనే ఆ కణాలలో నిక్షిప్తం అయి ఉన్నదాన్ని మనం తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. ఇలా మనం 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది.ఇక మూలకణాల విషయానికి వద్దాం. మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా అన్నమాట.ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వచ్చిన ఫలితాలైతే అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. పరిస్థితి ఇంకా ఆసుపత్రిలో చికిత్స అందించే వరకు రాలేదు. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
క్యాన్సర్... వైద్యపరీక్షలు
క్యాన్సర్ వ్యాధిలో పాత కణాలు నశించకుండానే కొత్త కణాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక గడ్డలా ఏర్పడతాయి. ఆ గడ్డలనే మనం క్యాన్సర్ లేదా మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు. ఈ కణాలు రక్తప్రవాహం ద్వారా, లింఫ్ వ్యవస్థ ద్వారా శరీరంలోని మిగతా భాగాలకూ వ్యాపించి అక్కడ కూడా అపరిమితంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ దశనే మెటాస్టాసిస్ అంటారు. అంటే క్యాన్సర్ కణాలు తాము ఏర్పడిన ప్రదేశం చుట్టూ ఉండే కణజాలాలకూ, అవయవాలకూ పాకడమే కాకుండా, మిగతా శరీరభాగాలకూ వ్యాపించిందని అర్థం. ఈ దశకు చేరుకుంటే క్యాన్సర్ లొంగడం చాలా కష్టం. క్యాన్సర్ కణితిలో కణాలు పెరిగే కొద్దీ రక్తసరఫరాకు దూరమై ఆక్సిజన్ అందక నశించవచ్చు. కానీ ఆ కణాలు కొత్త రక్తనాళాలను ఏర్పరచుకుంటూ పెరుగుతూపోతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘యాంజియోజెనెసిస్’ అంటారు. ఈ విధంగా రక్తనాళాలు ఏర్పడకుండా యాంజియోజెనెసిస్ కారకాలను అరికట్టాలని ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ ఇంతవరకు సఫలం కాలేకపోయారు. అయితే ఇంతకుముందుకూ ఇప్పటికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలలో, చికిత్స విధానాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్‌తోపాటు తొలిదశలోనే కనుక్కునే స్క్రీనింగ్ టెస్టులు కూడా అందుబాటులోకి రావడం కొంతలో కొంత ఆనందం కలిగించే విషయం. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా, ఆరోగ్యంగా ఉన్నవారిలో లేదా రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్నవారిలో, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, వారు చేసే వృత్తిని బట్టి క్యాన్సర్‌ను ముందుగానే కనుక్కోవడానికి చేసే పరీక్షలను స్క్రీనింగ్ పరీక్షలు అంటారు. అలాంటివాటిల్లో రొమ్ముక్యాన్సర్‌కు చేసే మామోగ్రామ్, గర్భాశయముఖ ద్వార క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే పాప్‌స్మియర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చేసే పరీక్షలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. మనలో చాలామంది హాస్పిటల్ అన్నా, హెల్త్ చెకప్స్ అన్నా భయపడతారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్ లాంటి తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు కూడా ‘ఇన్నిరకాల పరీక్షలు ఎందుకు... ఇంత ఖర్చు ఎందుకు... అని ఆలోచించేవారు కూడా ఉంటారు. క్యాన్సర్ కణం చాలా సూక్ష్మమైనది, ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో క్యాన్సర్ చికిత్సలు వ్యక్తికీ వ్యక్తికీ మారుతున్నాయి. వాటినే టార్గెటెడ్ లేదా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ అంటారు. కణితి సైజ్, వ్యాపించే గుణం, స్టేజ్, ఎన్ని లింఫ్ నాళాలకు సోకింది, ఇతర శరీర భాగాలకు వ్యాపించిందా, పేషెంట్ వయసు, వారి ఇతర ఆరోగ్య సమస్యలు, వాటికి వాడే మందులు... ఇలా ఆ క్యాన్సర్ రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. దాన్ని నిర్ధారణ చేయడానికి అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. ‘క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా? దాన్ని ముందే తెలుసుకోగలమా?’ అని చాలామంది అడుగుతుంటారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా లక్షణాల లాగానే క్యాన్సర్ వచ్చిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, బయాప్సీ వంటి పరీక్షలు అవసరమవుతాయి. లక్షణాలు కనిపించినప్పుడు ఈ పరీక్షలతో నిర్ధారణ చేశాక, చికిత్స మొదలుపెట్టేటప్పుడు మిగతా విషయాలను తెలుసుకోడానికి రక్తపరీక్షలు, మల, మూత్ర పరీక్షలు, సీటీ స్కాన్, పెట్ స్కాన్, ఎమ్మారై వంటివి చేస్తారు. సీటీస్కాన్, ఎమ్మారై పరీక్షలు కణితి ఉన్న ప్రదేశాన్ని, దాని పరిమాణాన్ని నిర్ధారణ చేసేందుకు ఉపయోపడతాయి. క్యాన్సర్ పరీక్షల్లో కొన్ని... 1 ఎఎఫ్‌పీ (అల్ఫా ఫీటో ప్రోటీన్) : లివర్ క్యాన్సర్‌లో ఈ పరీక్ష లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. 2 సీఏ 15.3 : రొమ్ము క్యాన్సర్‌లో ఈ బ్లడ్మార్కుర్ ఫలితాల రేంజ్ ఎక్కువ. 3 సీఏ 19.9 : ఈ పరీక్ష గ్యాస్ట్రిక్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లను తెలుపుతుంది. 4 సీఏ 125 : మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్‌ను తెలుపుతుంది. 5 సీఈఏ (కార్సినో ఎంబ్రియానిక్ యాంటీజెన్) : జీర్ణవ్యవస్థ, పెద్దపేగు (కోలన్), రెక్టల్ క్యాన్సర్లలో చేస్తారు. 6 డీఆర్–70 : 13 రకాల క్యాన్సర్లను నిర్ధారణ చేస్తుంది. 7 పీఈటీ (పాజిట్రన్ ఎమిషన్ టోమోగ్రఫీ) : క్యాన్సర్ కణాల మెటబాలిక్ రేట్‌ను తెలిపే పరీక్ష. దీని ద్వారా శరీరంలో క్యాన్సర్ కణాలు ఎక్కడకి వ్యాపించాయో తెలుస్తుంది. 8 ఎండోస్కోపీ : చిన్న గొట్టం ద్వారా శరీరం లోపలి భాగాలను పరీక్షించడం. వీటిల్లో పొట్టలోపలి భాగాలను పరీక్షించేవీ, ముక్కులో పరీక్షించే నేసల్ ఎండోస్కోపీ, పెద్దపేగుల్లోకి కొలనోస్కోపీ, శ్వాసవ్యవస్థలో బ్రాంకోస్కోపీవంటివి ఉంటాయి. 9 పీఎస్ఏ : పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తెలుసుకునేందుకు వీలయ్యే ‘ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్’ అనే రక్తపరీక్ష ఇది. క్యాన్సర్‌ను ఒక ఎక్స్‌రే లేదా ఒక అల్ట్రాసౌండ్‌తోనే నిర్ధారణ చేయలేరు. ఏదో ఒక నిర్దిష్టమైన పరీక్షతో దీని నిర్ధారణ సాధ్యం కాదు. కాని కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ, మిగతా ఇన్ఫెక్షన్లు, సిస్ట్లు, క్యాన్సర్ కాని కణుతులు ఉన్నప్పుడు కూడా పైన పేర్కొన్న పరీక్షల్లోని బ్లడ్మార్కర్స్ ఎక్కువగా ఉండవచ్చు. అందుకే లక్షణాలు ఉన్నప్పుడు బయాప్సీలో క్యాన్సర్ నిర్ధారణ అయ్యాకే చికిత్స మొదలుపెట్టడానికి ఈ పరీక్షలు అవసరమవుతాయి. అంతేగాక... క్యాన్సర్ వచ్చి తగ్గాక కూడా మళ్లీ తిరగబెట్టే ప్రమాదాన్ని తెలుసుకునేందుకూ మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. మీలో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయా? 1 వారి మల, మూత్ర విసర్జనల్లో మార్పులు 2 ఆకలి, బరువు తగ్గడం 3 మానని పుండు, కణితి, కణితిలో మార్పులు 4 వీడని జ్వరం, తీవ్రమైన అలసట 5 మహిళల్లో నెలసరి మధ్యలో రక్తస్రావం, చనుమొనల నుంచి రక్తస్రావం 6 శరీరంలో ఎక్కడినుంచైనా రక్తస్రావం 7తీవ్రమైన తలనొప్పి 8కొంతకాలంగా గొంతులో మార్పులు 9 జీర్ణవ్యవస్థలో చాలాకాలంగా తగ్గని అల్సర్స్. 10 మచ్చలు, పుట్టుమచ్చల్లో మార్పులు, అవి పెరగడం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, పరీక్షలంటే భయపడకుండా అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించాలి. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
దానిని ముందే గుర్తించవచ్చా?
మా బంధువులలో ఒకరికి గర్భాశయ క్యాన్సర్ వచ్చింది. ఇది విన్నప్పటి నుంచి నాకు భయంగా ఉంది. ఇది ముందుగానే గుర్తించే అవకాశం ఉందా? పాప్‌స్మియర్ టెస్ట్ గురించి తెలియజేయగలరు. గర్భాశయ క్యాన్సర్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. దీనిని సర్వికల్ క్యాన్సర్ అంటారు. రెండోది గర్భాశయం లోపలి పొరలో వచ్చేది. దీనిని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. పాప్ స్మియర్ అనే పరీక్షలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) దగ్గర నుంచి నీరు తీసి, దానిలోని కణాలను మైక్రోస్కోప్‌లో చూడటం జరుగుతుంది. సర్విక్స్ దగ్గర కణాలలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, క్యాన్సర్‌గా మారే కణాలు కనిపిస్తున్నాయా అనేది చూడటం జరుగుతుంది. పాప్ స్మియర్లో క్యాన్సర్ రాక ముందు పదేళ్ల ముందు నుంచే మార్పులు తెలుస్తాయి. ఇది ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుకోవడం మంచిది. సర్వికల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల తొలిదశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. లక్షణాలు కనిపించేటప్పటికి అది ముదిరి, చుట్టుపక్కల అవయవాలకు పాకే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలలో భాగంగా కొందరిలో అధికంగా తెల్లబట్ట, అందులో కొద్దిగా బ్లీడింగ్ కనిపించడం, కలయిక తర్వాత బ్లీడింగ్, అధిక రక్తస్రావం, నెల మధ్యలో కూడా బ్లీడింగ్, పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశ తర్వాత కూడా బ్లీడింగ్ వంటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగ ఉండవచ్చు. ఇటువంటి లక్షణాలు గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, పుండ్లు, గడ్డలు, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, పాప్ స్మియర్, ట్రాన్స్ వజైనల్ స్కానింగ్ వంటివి చేయించుకుని, ఏదైనా తేడాగా అనిపించినప్పుడు ఎండోమెట్రియల్ బయాప్సీ, సర్వైకల్ బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకుంటే, అది హార్మోన్ల మార్పులా లేక క్యాన్సర్ మార్పులా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఏదైనా క్యాన్సర్ గాని, క్యాన్సర్ మార్పులు గాని మొదట్లోనే కనుగొంటే అది మామూలు ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు. నేను ప్రెగ్నెంట్. ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని ఒకరు చెప్పారు. దీని వల్ల ఉపయోగం ఏమిటో తెలియజేయగలరు. ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే బిడ్డ పుట్టక ముందే, గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలోని కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవడానికి చేసే పరీక్షలు. పది వారాల నుంచి పన్నెండు వారాల లోపల డబుల్ మార్కర్ టెస్ట్ అని తల్లి రక్తం తీసుకుని, అందులో బీహెచ్‌సీజీ, పాపె అనే బయోకెమికల్ మార్కర్స్ ఉండే సంఖ్యను బట్టి, బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో విశ్లేషించడం జరుగుతుంది. దీంతో పాటు పన్నెండు వారాల సమయంలో న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ (ఎన్టీ) స్కాన్ చేయడం వల్ల ఆ సమయానికి బిడ్డలో కొన్ని అవయవ లోపాలు ఉంటే తెలుస్తాయి. అలాగే ముక్కు, మెడ వెనుక భాగంలో చర్మం మందాన్ని (న్యూకల్ థిక్నెస్) బట్టి బిడ్డలో జన్యుపరమైన లోపాలు, ఇతర సమస్యలు ఏ మేరకు ఉన్నాయో తెలుస్తుంది. పదహారు నుంచి ఇరవై వారాల లోపల క్వాడ్రుపుల్ టెస్ట్ ద్వారా కూడా కొన్ని జన్యుపరమైన సమస్యలు ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల లోపల ‘టిఫా’ స్కానింగ్‌లో బిడ్డలో అవయవ లోపాలు ఉంటే 95 శాతం మేరకు తెలుస్తాయి. ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్‌లో కచ్చితంగా సమస్య ఉందని నిర్ధారించడం జరగదు. అయితే, సమస్య ఉండే అవకాశాలు ఎంత మేరకు ఉండవచ్చనేది మాత్రమే తెలుస్తుంది. సమస్య నిర్ధారించడానికి పదకొండు నుంచి పద్నాలుగు వారాల లోపల అయితే కొరియానిక్ విలస్ బయాప్సీ, పదహారు వారాల తర్వాత అయితే అమ్నియోసెంటెసిస్ అంటే బిడ్డ చుట్టూ ఉమ్మనీరు తీసి కారియోటైపింగ్ వంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో డౌన్స్ సిండ్రోమ్ వంటి కొన్ని రకాల జన్యు సమస్యలు నిర్ధారణ అవుతాయి. కాకపోతే, ఈ నిర్ధారణ పరీక్షలు చేసేటప్పుడు వందమందిలో ఒకరికి అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్‌లకు, నిర్ధారణ పరీక్షలకు వ్యత్యాసం తెలుసుకోవాలి. పీఆర్పీ థెరపీని ముఖానికి, జుట్టుకి వాడతారని విన్నాము. ఈ మధ్య దీనిని గైనకాలజీలో కూడా వాడుతున్నారని తెలిసింది. దీని గురించి వివరించగలరు. పీఆర్పీ– అంటే, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఒక మనిషి రక్తం 20–30 మిల్లీలీటర్లు తీసుకొని, దానిని సెంట్రిఫ్యూజ్ అనే పరికరంలో వేసి తిప్పినప్పుడు ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు విడిపోయి, ప్లేట్లెట్స్ ఉన్న ప్లాస్మా మాత్రమే పైకి తేలుతుంది. ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్, సైటోకైన్స్ ఉంటాయి. దీనిని శరీర భాగాల్లోకి ఇంజెక్షన్ ద్వారా పంపించినట్లయితే, ఆయా భాగాల్లో గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్లు పెరిగి, కొల్లాజెన్ టిష్యూ వృద్ధి చెందుతుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. ఇప్పటి వరకు ముఖంపై చర్మం కోసం, జుట్టు పెరగడానికి, ఇంకా ఇతర భాగాల్లోను దీనిని వాడటం జరుగుతుంది. ఇది స్టెమ్సెల్స్లాగా పనిచేసి కొత్త కణజాలం పెరగడానికి దోహదపడుతుంది. ఇందులో ఎవరి రక్తాన్ని వాళ్లకే ఇంజెక్షన్ ద్వారా పంపడం జరుగుతుంది కాబట్టి దుష్ఫలితాలు తలెత్తే అవకాశాలు చాలావరకు ఉండవు. దీనిని ఇప్పుడు గైనకాలజీ విభాగంలోనూ ఉపయోగించడం జరుగుతోంది. కాన్పుల వల్ల యోని వదులైనప్పుడు పీఆర్పీ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల అక్కడ కణజాలం పెంపొంది, యోని కొద్దిగా బిగుతుగా అయినట్లు అనిపిస్తుంది. అలాగే సెక్స్ ప్రేరేపణలకు క్లిటోరిస్ భాగంలోను, యోనిలోని జీస్పాట్ భాగంలోను ఇవ్వడం వల్ల కొందరిలో కొద్దిగా ఉపయోగం ఉండవచ్చు. దీనిని ‘ఓ–షాట్’ అంటారు. మూత్రాశయ కండరాలు వదులయ్యి, దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్ అయ్యేవారిలో పీఆర్పీ థెరపీ ద్వారా యూరెత్రా కింద పీఆర్పీని ఇంజెక్ట్ చేయడం వల్ల అక్కడ కణజాలం వృద్ధి చెంది, రక్తప్రసరణ పెరిగి కొందరిలో కాస్త ఉపశమనం దొరుకుతుంది. పీఆర్పీతో పాటు హైలురోనిక్ యాసిడ్ వంటి కొన్ని ద్రవాలను, పదార్థాలను కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారిలో గర్భాశయ పొర బాగా పలచగా ఉన్నప్పుడు, దానిని ప్రేరేపించడానికి పీఆర్పీని గర్భాశయంలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అండాశయాలలో అండాలు బాగా తగ్గిపోయినప్పుడు అండాలను పెంపొందించడానికి అండాశయాలలో ఇంజెక్ట్ చేయడం ద్వారా కొందరిలో కొత్తగా అండాలు తయారయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి పీఆర్పీ థెరపీ నెల వ్యవధిలో 3–4 సార్లు చెయ్యాల్సి ఉంటుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
గుండెకు మేలు చేసే ప్రత్యేక కణాలు...
మాక్రోఫేగస్ అనే ప్రత్యేక కణాలు గుండెజబ్బుతో దెబ్బతిన్న గుండెకు మరమ్మతు చేసేందుకు.. కొన్ని సందర్భాల్లో మళ్లీ ఆరోగ్యకరంగా మార్చేందుకు ఉపయోగపడతాయని గుర్తించారు పీటర్ మంక్ కార్డియాక్ సెంటర్ శాస్త్రవేత్తలు. పసిపిల్లల్లోని కణాల మాదిరిగా వ్యవహరించే ఈ మాక్రోఫేగస్‌లు గుండెజబ్బు తరువాత పసిపిల్లల్లో మాదిరిగానే అవయవాల ఎదుగుదలకు ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లొరెట్టా రోగర్స్ తెలిపారు. అయితే శరీరంలో మొత్తం నాలుగు రకాల మాక్రోఫేగస్‌లు ఉన్నాయని... గుండెజబ్బు తరువాత వీటి సంఖ్య 11కు చేరుతుందని తాము పరిశోధనల్లో గుర్తించామని చెప్పారు. గుండెజబ్బు తరువాత ముందుగా పసిపిల్లల స్థాయిలో ఉండే మాక్రోఫేగస్‌లు నాశనమవుతాయని... పసిపిల్లల్లో మాత్రం వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతాయని తద్వారా రక్తనాళాలు, గుండె కండరాలు ఎదిగేందుకు సాయపడతాయని వివరించారు. గుండెపోటు తరువాత కొంత ఆలస్యంగానైనా ఈ మాక్రోఫేగస్‌లు గుండెను చేరుకుంటాయని.. వీటిల్లో కొన్ని పసిపిల్లల స్థాయి కణాలుగా మారతాయని కాకపోతే.. ఈ కణాలు గుండెను చేరుకునే సమయానికి అక్కడి కణాలన్నీ నాశనమైపోయిన కండరం దెబ్బతిని ఉంటుందని వివరించారు. గుండెపోటు తరువాత గుండె ఎలా ప్రవర్తిస్తుందో పూర్తిగా తెలుసుకోగలిగితే సరికొత్త, మరింత సమర్థమైన చికిత్సలు అందించేందుకు వీలేర్పడుతుందని.. ఈ పరిశోధనలు అందుకు ఉపయోగపడతాయని లొరెట్టా తెలిపారు. -
కణం మరణాన్ని నేరుగా చూశారు!
పాడైపోయినా.. ప్రమాదకరంగా మారినా శరీరంలోని కణాలు వెంటనే తమంతట తాము చచ్చిపోతాయి. ఈ ప్రక్రియను అపోప్టోసిస్ అంటారు. ఇదెలా జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోగలిగితే కేన్సర్ మొదలుకొని జట్టు రాలిపోవడం వరకూ అనేక సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ దిశగా ఓ ముందడుగు వేశారు. ఒక రకమైన అపోప్టోసిస్‌లోని దశలను, వేగాన్ని గుర్తించడంలో వీరు విజయం సాధించారు. ఇందుకోసం కప్ప గుడ్లపై పరిశోధనలు చేశారు. కొంచెం పెద్ద సైజులో ఉండటం వల్ల అవి నాశనం కావడాన్ని మైక్రోస్కోపు గుండా నేరుగా చూడగలిగారు. కణం నుంచి సైటోప్లాసమ్‌ను సూక్ష్మమైన గొట్టంలోకి మారుస్తూండగా పచ్చటి వెలుగు కనిపించింది. దీన్నే అపోప్టోసిస్ సంకేతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకో పద్ధతిలో చూసినప్పుడు ఇది వెలుగులా కాకుండా ఓ తరంగంలా కనిపించిందని నిమిషానికి 30 మైక్రాన్ల వేగంతో ప్రయాణించిందని.. దీన్నిబట్టి కప్ప కణం ఒకటి నాశనమయ్యేందుకు దాదాపు 33 నిమిషాలు పట్టినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ ఫారెల్ తెలిపారు. ఈ తరంగాలు వెలువడ్డ తరువాత కాస్‌పేసెస్ అనే ప్రొటీన్లు చైతన్యవంతమయ్యాయని.. ఒక్కోటి ఇంకోదాన్ని తట్టిలేపడం.. ఇది మరోదాన్ని చైతన్యవంతం చేస్తూ కణం మొత్తం నిర్వీర్యమైపోయేలా చేశాయని వివరించారు. అపోప్టోసిస్ వెనుక ఉన్న మిగిలిన ప్రక్రియలను కూడా అర్థం చేసుకోగలిగితే వ్యాధి నివారణలో ఎలా వాడుకోవచ్చో తెలుస్తుందని చెప్పారు. వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలంటే... వయసు ఎంత పెరిగినా ఏమాత్రం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే భలే ఉంటుందని మనం చాలాసార్లు అనుకుని ఉంటాం. మినసోటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పాల్ డీ రాబిన్స్ తాజా పరిశోధన ప్రకారం.. మన శరీరంలో ఉండే సెనోలిటిక్స్ అనే అతిసూక్ష్మ అణువులను చైతన్యవంతం చేస్తే చాలు. శరీర కణాలు ఒక దశ తరువాత విభజితం కావని మనం చదువుకుని ఉంటాం. శాస్త్రీయ పరిభాషలో దీన్ని సెనిసెన్స్ అంటారు. ఈ దశకు చేరుకున్నప్పుడు కణజాలం పనియడం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా జబ్బులు చుట్టుముడతాయి. సెనోలిటిక్ అణువులు ఈ పరిస్థితి తీవ్రతను తగ్గించడంతోపాటు కణాలు మళ్లీ విభజితమయ్యేలా చేస్తాయి అని పాల్ డీ రూబిన్స్ అంటున్నారు. సెనిసెంట్ దశలో ఉన్న కణాలను శరీరం నుంచి బయటకు పంపే విషయంలో జన్యువుల పాత్ర 30 శాతం కాగా.. వాతావరణం70 శాతం ప్రభావం చూపుతుందని గత పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాం? ఎంత తరచుగా వ్యాయామం చేస్తున్నాం? వంటి అంశాలన్నీ కణాల సెనిసెన్స్‌ను ప్రభావితం చేస్తాయని లేదంటే సెనోలిటిక్ ఆధారిత మందులను తయారు చేయడం ద్వారా దీన్ని సాధించాల్సి ఉంటుందని వివరించారు. -
2019లో మార్కెట్లోకి లిథియమ్ అయాన్ సెల్స్
న్యూఢిల్లీ: భారత్‌లోనే తొలిసారిగా మేడిన్ ఇండియా లిథియమ్ అయాన్ సెల్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ (ఐసీఏ) అంచనా వేసింది. లిథియమ్ అయాన్ సెల్స్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో విరివిగా ఉపయోగిస్తారు. ‘మునత్ ఇండస్ట్రీస్ భారతదేశపు తొలి లిథియమ్ అయాన్ సెల్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం మూడు దశల్లో రూ.799 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ప్రాజెక్ట్ తొలిదశ 2019 ఏప్రిల్ నాటికి పూర్తయి లిథియమ్ బ్యాటరీలు మార్కెట్లో అందుబాటులోకి రావొచ్చు’ అని ఐసీఏ తెలిపింది. కాగా లిథియమ్ అయాన్ సెల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు అవుతోంది. -
‘సూక్ష్మం’లోనే మోక్షం!
సాక్షి, హైదరాబాద్ మన శరీరంలో కోట్ల సంఖ్యలో కణాలు ఉంటాయని మనకు తెలుసు. ఒక్కోదాంట్లో ఉండే డీఎన్ఏ, వాటి భాగాలైన జన్యువుల గురించి కూడా వినే ఉంటాం. మరి ఎక్సోసోమ్స్ గురించి...? ఊహూ... వీటి గురించి తెలిసే అవకాశాలు చాలా చాలా తక్కువే. ఒకొక్కరిలో కనీసం వెయ్యి లక్షల కోట్ల వరకూ ఉండే అతిసూక్ష్మమైన కొవ్వు తిత్తులివి! ఇంకా చెప్పాలంటే శరీర కణాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి. కణాల అన్నింటి నుంచి ఇవి విడుదలవుతూంటాయనితెలుసుగానీ.. ఎందుకున్నాయో, ఏం చేస్తాయో..? ఎలా చేస్తాయో మాత్రం మిస్టరీనే! ఈ రహస్యాలను ఛేదిస్తే కేన్సర్‌సహా అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుంది. సరిగ్గా ఇవే లక్ష్యాలుగా ‘ఎక్సోసోమ్’లపై ప్రయోగాలు చేస్తున్నారు రఘు కల్లూరి. తెలుగువాడైన ఈ యువశాస్త్రవేత్త హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ’కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా రఘు కల్లూరి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. మన శరీరంలోని కణాలన్నీ విడుదల చేసే అతిసూక్ష్మమైన తిత్తుల్లాంటి నిర్మాణాలే ఎక్సోసోమ్‌లు. సుమారు 30 ఏళ్ల కిత్రమే వీటిని గుర్తించారు. కానీ అప్పట్లో ఇవి కణ వ్యర్థాలు మాత్రమే అని అనుకునేవాళ్లు. అయితే గత పదేళ్లలో ఎక్సోసోమ్‌లకు సంబంధించిన ప్రాథమిక వివరాలు అర్ధమవుతున్న కొద్దీ శాస్త్రవేత్తల్లో వీటిపై ఆసక్తి పెరిగింది. కణాలన్నీ వీటిని విడుదల చేస్తాయని తెలుసుగానీ.. ఎందుకు చేస్తాయో... ఎలా చేస్తాయో తెలియదు. నానోమీటర్ల సైజులో మాత్రమే ఉండే ఎక్సోసోమ్లలో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లు ఉంటాయని, కొన్నిసార్లు ఇవి ఇతర కణాల్లోకి చొచ్చుకుపోగలవనీ కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఈ అంశాల ఆధారంగా ఎక్సోసోమ్‌లు వేర్వేరు కణాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తద్వారా కొన్ని భౌతిక మార్పులకు కారణమవుతున్నాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. వీటిని తగు విధంగా నియంత్రించగలిగితే వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని నా అంచనా. వైద్యరంగంలో అద్భుత ఫలితాలు.. కణాలు అన్నీ వీటిని విడుదల చేస్తాయని తెలిసింది. అయితే అన్ని ఎక్సోసోమ్‌లు ఒకేలా ఉండవు. కణాల స్థితికి అనుగుణంగా వీటిలో ఉండే డీఎన్ఏ, ఆర్ఎన్ఏలు మారిపోతూంటాయి. ఇంకోలా చెప్పాలంటే కణాలు ఆరోగ్యంగా ఉండే ఒక రకమైన కూర్పు లేకుండా ఇంకోలా ఉంటాయన్నమాట. కేన్సర్, కొన్ని ఇతర వ్యాధులతో బాధపడుతన్న వారి రక్తాన్ని పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. అందువల్లనే ఈ ఎక్సోసోమ్‌లను భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణకు మెరుగైన సాధనంగా వాడుకోవచ్చునని భావిస్తున్నాం. అంతేకాదు.. ఇవి ఇతర కణాల్లోకి చాలా సులువుగా చొచ్చుకుపోగలవు కాబట్టి వీటి ఆధారంగా శరీరంలోని వివిధ భాగాలకు మందులు నేరుగా చేరవేయవచ్చు కూడా. నేను పనిచేస్తున్న ఎండీ యాండర్సన్ కేన్సర్ సెంటర్‌తోపాటు కొంతమంది ఇతర శాస్త్రవేత్తలు ఎక్సోసోమ్‌లలోకి మందులు చేర్చడంలో ఇప్పటికే విజయం సాధించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కేన్సర్ కణతులను గణనీంగా తగ్గించవచ్చునని కూడా రుజువైంది. ప్రయోజనాలెన్నో.. సింపుల్‌గా చెప్పాలంటే.. పిసరంత రక్తం నుంచి ఎక్సోసోమ్‌లను వేరు చేసి.. వ్యక్తుల తాలూకూ ఆరోగ్య పరిస్థితిని మదింపు చేయవచ్చు. డీఎన్ఏ మార్పులు మొదలుకొని ప్రొటీన్లు తదితరాలన్నింటినీ విశ్లేషించే అవకాశం లభిస్తుంది కాబట్టి.. ఎక్సోసోమ్‌ల ఆధారంగా వ్యక్తిగతమైన, కచ్చితమైన వైద్యం సాధ్యమవుతుంది. కేన్సర్ విషయానికి వస్తే జన్యుమార్పులన్నింటినీ గుర్తించి తదనుగుణంగా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులను కూడా వీటి ద్వారా గుర్తించే అవకాశముంది. నానోస్థాయిలో ఉంటాయి కాబట్టి వీటితో మందులు సరఫరా చేయడాన్ని నానో వైద్యం అని కూడా అనవచ్చు. సహజసిద్ధంగా శరీరమే వీటిని ఉత్పత్తి చేస్తూంటాయి కాబట్టి.. శరీర రోగ నిరోధక వ్యవస్థ వీటిని అడ్డుకోదు కూడా. తద్వారా కొన్ని రకాల మందులతో వచ్చే దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చు. -
మొటిమలుంటే అందమైన చర్మం...
యుక్త వయసు వచ్చిన అమ్మాయిలకు ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. అయితే వారు తెగ ఇబ్బంది పడిపోయి రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. ఇలాంటివి వాడకపోయినా వయసు పెరిగే కొద్ది అందమైన, మృదువైన చర్మం దానంతట అదే వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొటిమలే లేని యువతుల జన్యు సమాచారాన్ని, మొటిమలు కలిగిన వారితో పోల్చి చూసినపుడు వారి కణాల్లోని టెలిమోర్ల పొడవులో తేడా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల వారి కణాలు ఇతరుల కంటే ఎక్కువసార్లు విభజన చెందుతాయి. అంటే టెలిమోర్ల పొడవు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ కాలం కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీరిలో టెలిమరేజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయి, టెలిమోర్ల పొడవు తగ్గిపోకుండా చూస్తుంటుంది. ఇది టెలిమోర్ల పొడవు తగ్గిపోకుండా చూస్తుంటుంది. ఈ ఎంజైమ్ కొందరిలో ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల సమస్యలు వస్తుంటాయన్నమాట. -
నేను మీ కణాన్ని!
ఒక డజను పవర్ స్టేషన్స్‌ను అణు పరిమాణంలోకి మారిస్తే... ఒక పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థను సూక్ష్మరూపానికి తగ్గిస్తే... ఒక పెద్ద నగరాన్ని మినియేచర్ స్కేలుకు కుదిస్తే... అదే నేను. ఆనంద్ జీవకణాన్ని. అనేక పవర్ స్టేషన్లో శక్తి ఉత్పత్తి, రకరకాల రవాణా వ్యవస్థలో రాకపోకలూ, ఆత్మరక్షణకు ఓ పోలీసు వ్యవస్థ, ఇతర వస్తువుల ఉత్పాదన... ఇన్ని మాటలెందుకు? ఒక మెట్రోపాలిటన్ సిటీని అమాంతం సూక్ష్మీకరిస్తే ఒక కణం అవుతుంది. అలాంటి కణాలు ఆనంద్ ఒంట్లో ఎన్ని ఉంటాయో తెలుసా? 60 ట్రిలియన్! (ఒక ట్రిలియన్ అంటే... ఒకటి పక్కన పన్నెండు సున్నాలు. అంటే పది లక్షల కోట్లు). నేను జీవానికి మూలం. నేను ఇలాగే ఉంటానని చెప్పడం కష్టం. ఒక్కో చోట ఒకలా ఉంటా. అంటే కన్ను కణమైతే ఒకలాగా... కాలేయ కణం మరొకలాగా ఉంటానన్నమాట. అంతెందుకు... అంతెత్తున ఉండే జిరాఫీలో ఒకలాగా... చిన్న చిట్టెలుకలో మరోలా ఉంటాను. ఎన్నెన్నో ఆకృతులు... మరెన్నో రూపాలు నాకు నిర్దిష్టంగా ఒక రూపం అంటూ ఉండదు. నాకు ఎన్నో ఆకృతులు. గుండ్రంగా, గోళాకృతిలో, రాడ్ షేప్‌లో ఇలా ఎన్నెన్నో ఆకారాలు. కణాన్ని బట్టి... అది ఉండే స్థానాన్ని బట్టి... నిర్వహించాల్సిన పనిని బట్టి... అనుక్షణం స్పందించే గుండె దగ్గర్నుంచి... ఎప్పటికీ స్థిరంగా ఉన్నట్లు అనిపించే ఎముక వరకు ఎన్నెన్నో రకాల కణాలుంటాయి. ఆనంద్ ఏ పని చేయాలన్నా అందులో కోట్లాది కణాలు పనిచేస్తాయి. కణం అంటూ ఒకే దాన్ని గురించి చెప్పడం కష్టం. కాబట్టి ఉదాహరణకు రాడ్ కణాన్ని తీసుకుందాం. ఉదాహరణకు ఆనంద్ రాత్రిపూట మిణుకు మిణుకుమనే ఒక చుక్కను చూడాలనుకోండి. అతడిలోని 25 కోట్ల రాడ్ కణాలు పనిచేయాలి. అందులోని కనీసం మూడు కోట్ల కణాలు వెలుగును పట్టేసే విద్యుత్ రసాయనాలను వెలువరించాలి. ఇందుకు శక్తి కావాలి. ఆ శక్తి కోసం నాలోని పవర్ జనరేటింగ్ యూనిట్స్ పనిచేయాలి. నా పవర్ జనరేటింగ్ యూనిట్స్ పేరు మైటోకాండ్రియా. చాలా మెటోకాండ్రియాల ద్వారా ఆ శక్తిని ఉత్పత్తి జరుగుతుంది. అసలు నాదే చాలా సూక్ష్మ రూపం కదా. మరి నాలోని కణాంశమైన ఆ మైటోకాండ్రియా ఇంకెంత సూక్ష్మరూపంలో ఉంటుందో ఊహించండి. శక్తి కోసం మండించే ఇంధనం... చక్కెర! చక్కెరను మండించి శక్తిని తయారు చేస్తాను. ఫ్యాక్టరీలో వస్తువుల ఉత్పాదనకు ఇంధనం మండిస్తే... పొగ, కాలుష్యాల లాగే నాలోనూ వ్యర్థాలు వెలువడతాయి. అవి ప్రధానంగా కార్బన్ డైయాక్సైడ్, నీళ్ల రూపంలో ఉంటాయి. మీకు కనిపించే శక్తి విద్యుత్ రూపంలో కనిపిస్తుంది కదా. అలాగే నాలోని శక్తి అడినోసిస్ ట్రై ఫాస్ఫేట్ (ఏటీపీ) అనేది రసాయన శక్తి రూపంలో ఉంటుంది. శ్వాస పీల్చడం అనే పెద్ద పని దగ్గర్నుంచి, రెప్పపాటులో కనురెప్ప మూయడానికీ ఆ శక్తి ఉపయోగపడుతుంటుంది. ఆనంద్ చురుగ్గా ఉన్నప్పుడే కాదు... మామూలు సమయంలోనూ ఆనంద్‌లో శక్తి వెలువడటం జరుగుతూనే ఉంటుంది. అంతెందుకు ఆనంద్ నిద్రపోతున్నా, కలలు కంటున్నా అవసరమైన శక్తిని నేను ఉత్పత్తి చేసుకుంటూనే ఉంటా. ఒక్క ఎర్రరక్తకణాల్లో తప్ప మైటోకాండ్రియా అనే ఈ శక్తి ఉత్పాదక కేంద్రాలు అన్ని కణాల్లోనూ ఉంటాయి. అవి రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండాలి. వాటికి ప్రత్యేకంగా శక్తి అవసరం లేదు కాబట్టి ఎర్రరక్తకణాల్లో మైటోకాండ్రియాలు ఉండవు. అది క్షణక్షణాభివృద్ధి... క్షణకణాభివృద్ధి... నేను అనుక్షణం అభివృద్ధి చెందే క్రమాన్ని... ఒకటి రెండుగానూ, రెండు నాలుగుగానూ విడిపోయే అద్భుతాన్ని చూడాలంటే... అమ్మ కడుపులో పడ్డ తర్వాత ఆనంద్ మొదటి కణం విడిపోవడాన్ని చూడవచ్చు. అక్కడి నుంచి మొదలైన కణకణాభివృద్ధి చూడవచ్చు. కణకణాభివృద్ధి కాదది... క్షణక్షణాభివృద్ధి! కణాల్లోని డీఎన్ఏలలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా ఒక కణం నుంచి ఒక రూపం పెరుగుతుంది. ఒక ప్లాన్ తాలూకు బ్లూప్రింట్‌ను చూసి... నిర్మాణం పూర్తయ్యాక పెద్ద బిల్డింగ్‌ను చూసిన అనుభవమే పిండం పూర్తి ఆకృతిని పొందాక కలుగుతుంది. అక్కడ కణంలోని అతి చిన్న కణాంశాలలో ఉన్న సమాచారం మేరకు వెంట్రుకల ఆకృతి, వాటి రంగు, ఒంటి రంగూ... ఇవన్నీ చిన్నారికి వచ్చేస్తాయి. ఇది ఒక అద్భుతమైతే ఒక అవయవం ఎంత పెరగాలో అంతే పెరిగి అక్కడ ఆగిపోవడం మరో అబ్బురం. అన్ని వేళ్లూ ఒకేలా పెరిగినా చిటికెన వేలు చూడండి... ఎంత చిన్నగా ఉంటుందో! మీకు మరో అద్భుత విషయం చెప్పనా...? ఆనంద్ కంటిలో ఉన్న రాడ్ కణంలోని డీఎన్ఏలోనూ ఒక పూర్తి ఆనంద్‌ను రూపొందేందుకు అవసరమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అతడి కాలి కణంలోనూ అదే సమాచారం ఉంటుంది. అయితే ఆనంద్‌ను మళ్లీ రూపొందించే పని మేం చేయం. ఉదాహరణకు నేను కంటిలోని రాడ్ కణాన్ని అనుకోండి. మరో రాడ్ కణాన్ని రూపొందిస్తానంతే. కాకపోతే నేనున్న చోటిని బట్టి ఒక కణం వేగంగా విభజితం కావాలా, లేక ఆలస్యంగా కావాలా అన్నది నేను ఏ కణాన్ని అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకు మరో ఉదాహరణ ఇస్తా. నేను కొవ్వు కణాన్ని అనుకోండి. కాస్తంత ఆలస్యంగా కణభివృద్ధి జరుగుతుంది. అదే చర్మం కణాన్ని అనుకోండి. ప్రతి పదిగంటలకోసారి కొత్త కణాలు రూపొందడం జరుగుతుంది. ఇలా మిగతా కణాలు పుట్టడం, చనిపోతూ ఉండటం జరుగుతుంటాయి. కానీ... మెదడు కణాలు మాత్రం ఒకసారి పుట్టాక చనిపోవడం అంటూ జరిగితే కొత్త కణాలు పుట్టవు. అయితే మెదడులో ఎన్నెన్నో కణాలుంటాయి. అవి జీవితకాలానికి సరిపోయేంతగానే కాదు... మరెన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అవి చనిపోతూ ఉన్నా... మిగతావి జీవితకాలపు అవసరాలకు మించి ఉంటాయి. నాకూ ఒక అద్భుతమైన ప్యాకింగ్... నాకు రూపం ఇచ్చేందుకు నాపైన ఒక పొర ఉంటుంది. అదెంత పలచగా ఉంటుందో మీకు తెలుసా? దాని మందం 0.0000001 మిల్లీమీటర్లు. నిన్నమొన్నటి వరకూ అది పల్చటి ఒక పొర మాత్రమే మాత్రమే అని అందరూ అనుకునే వారు. నాలోని అంతర్గత అవయవాలకు పైన సెలోఫెన్ బ్యాగ్‌లా మాత్రమే నా పొరని చూసేవారు. కానీ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనిపెట్టాక నా పొర గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. అది నాలోని వాతావరణాన్ని ఒకేలా ఉంచడానికి పనికి వచ్చే ఒక పొర. నాలోని లవణాలూ, రసాయనాలూ, నీళ్లూ అన్నీ సమతులంగా ఉంచేలా చూసే ఒక కోటగోడ. ప్రోటీన్లు పుట్టడానికి నా లోపలికి వేటిని అనుమతించాలో, వేటిని రానివ్వకుండా చూడాలో తెలిసిన ఒక మహాదుర్గం. ఇదెలా జరుగుతుందో చెప్పడానికి అందరికీ అర్థం కావడానికి ఒక పోలిక చెప్పనా? నాలోకి రావాల్సిన రసాయనాలూ, బయటి పదార్థాలూ నా గోడ గుర్తుపట్టేలా ఒక ఐడెంటిటీ కార్డ్‌ను ధరిస్తాయి. ఆ ట్యాగ్‌లను చూసి గుర్తుపట్టాకే ఆ పదార్థాలను లోపలికి పంపుతుందది. నా పొర గుర్తుపట్టలేదంటే నాలోకి నో ఎంట్రీ. నాలోకి అనుమతించకపోవడమే కాదు... నా కాలనీలోని ఇరుగుపొరుగు కణాలన్నీ కలిసి దాన్ని కొంతదూరం తరిమికొడతాయి. ఇదే పని చేయకపోతే ఏమవుతుందో తెలుసుకోండి. కనురెప్ప దగ్గర దుమ్ము చేరితే కళ్లు చికిలించుకోవు. దాంతో కంట్లోకి దుమ్ము చేరుతుంది. కంట్లోకి దుమ్ము చేరినట్టే ఏ కాలేయంలోకో, కిడ్నీలోకో ఫారిన్‌బాడీ వెళ్తే? అందుకే ఈ తరిమి కొట్టడాలు. మాలోనే ఒక కణానికీ మరో కణానికీ సంభాషణ జరుగుతూ ఉంటుంది. అదెలాగో ఇంకా స్పష్టంగా తెలియదు. బహుశా ఎంజైములే కావచ్చు. ఇలా సంభాషణ ఎలా జరుగుతుందని అబ్బురపడకండి. దీనికీ ఉదాహరణ ఉంది. ఆనంద్ శరీరం నుంచి గుండెను వేరు చేస్తే కణాలన్నీ క్రమబద్ధంగా కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు స్పందిస్తూ ఉంటాయి. కానీ మళ్లీ గుండెను ఒంట్లోకి చేర్చండి. వేళ్లతాటింపుతో క్రమబద్ధంగా కదిలే హార్మోనియం మెట్లలా మళ్లీ ఇవి క్రమబద్ధంగా కదలడం మొదలవుతుంది. ఈ సమాచారం ఎలా చేరుతుందన్నది ఇంకా మిస్టరీయే. హర్మోనులు కూడా కణాల మధ్య కమ్యూనికేషన్స్‌కు ముఖ్యమైన సాధనాలే! ఉదాహరణకు ఆనంద్ ఒంటికి శక్తి కోసం చక్కెరను మండిస్తూ ఉంటాం కదా. ఇంతలోనే... ‘‘ఇంక ఉత్పత్తి అయిన శక్తి చాలు. ఆ ప్రక్రియ ఆపేయండి’’ అంటూ హార్మోన్ల సహాయంతో రక్తప్రవాహ మార్గంలో ఆదేశాలు అందుతాయి. అంతే... శక్తి ఉత్పత్తి ఆగిపోతుంది. మళ్లీ అవసరం పడగానే ‘‘పవర్ కావాలి. ఏటీపీలను అందించండి’’ అంటూ ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఆ శత్రువుతో పోరాటం కష్టం... మాకు ప్రధాన శత్రువు వైరస్. అదీ కణంలాగే ఉంటుంది. కానీ దానికి శక్తి ఉత్పాదన కేంద్రాలైన మైటోకాండ్రియాలు ఉండవు. అది కణం తాలూకు కోటగోడ అయిన పైపొరను దాటి వస్తుంది. కణంలో అచ్చం కణంలాగే ఇమిడిపోయి మా మైటోకాండ్రియానుంచి శక్తిని విచ్చలవిడిగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దాంతో అసలు కణం చనిపోతుంది. చనిపోయిన కణాన్ని వదిలేసి పొరుగుకణంలోని మైటోకాండ్రియాను మళ్లీ పట్టుకుంటుంది వైరస్. ఇలా ఒంటిలోకి చేరిన కొద్దిసేపట్లోనే వైరస్ లక్షలాది కణాలను ధ్వంసం చేస్తుంది. ఇదే ప్రక్రియ అదేపనిగా జరిగితే ఆనంద్ ప్రాణాలకు ముప్పు తప్పదు. ఆనంద్ ఫ్రెండ్స్ పదిమంది ఒక చోట చేరితే... వాళ్ల మధ్య సమన్వయం ఉంటుందా? ఆలోచించండి... మేం అరవై ట్రిలియన్స్ మందిమి అద్భుతమైన క్రమశిక్షణతో ఆనంద్ ఒంట్లో నూరేళ్లు ఉంటాం కదా. ఇది వేనోళ్ల చెప్పుకోవాల్సిన మాట కాదా! ఎన్నో పనుల్లో ఇదీ ఒకటి... నేనేం చేస్తానో... ఎలా చేస్తానో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ... ఒక చేపలో ప్రొటీన్స్ ఉంటాయి. మనం తినే మాంసంలో ప్రొటీన్లు ఉంటాయి. పప్పుల్లోనూ అవి ఉంటాయి. వాటిని మీరు తింటారు కదా... అలాగే మన గోరు తయారయ్యే పదార్థమూ ప్రొటీనే. చేపల్లో, మాంసాహారంలో, పప్పుల్లో ఉన్న ప్రొటీన్లను విడగొట్టి... మళ్లీ ఒంటికి కావాల్సిన ప్రొటీన్‌గా రూపొందించుకుంటూ ఉంటా. ఇలా నేను రకరకాల ఎన్ని ప్రోటీన్లను నా అవసరానికి తగ్గట్లుగా మార్చుకుంటూ ఉంటా. నాలో కనీసం 600 రకాల ఎంజైములు తయారవుతుంటాయి. ఆర్ఎన్ఏ (రైబో న్యూక్లిక్ యాసిడ్) అనే మాస్టర్ కెమిస్ట్ ఆదేశాల మీద ఈ ఎంజైములు తయారవుతుంటాయి. నాలో ఆవిర్భవించే సెల్యులార్ ఎంజైముల సహాయంతో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ఉండే హార్మోన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక యాంటీబాడీలు రూపొందుతుంటాయి. -
ఫ్యూయెల్ సెల్ తో మూత్రాన్ని విద్యుత్తుగా...
లండన్ : వ్యర్థాల నుంచి విద్యుత్ అంటూ ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పటికే మనిషి మూత్రాన్ని విద్యుత్తుగా మార్చేందుకు సైతం అనేక పరిశోధనలు జరిపారు. విద్యుత్ ఉత్పాదకత పెంచేందుకు ప్రపంచమంతా పలు రకాల అధ్యయనాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా చవకైన, శక్తివంతమైన అతి చిన్న ఫ్యూయెల్ సెల్ పరికరంతో మూత్రాన్ని విద్యుత్తుగా మార్చవచ్చని కొత్త తరహా పరిశోధనలద్వారా కనుగొన్నారు. మూత్రం ఉండే పునరుత్పాదక జీవశక్తిని వినియోగించి ఫ్యూయెల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. లండన్ బాత్ విశ్వవిద్యాలయం, మెరీ యూనివర్శిటీ లు బ్రిస్టల్ రోబోటిక్ ల్యాబరెటరీ ద్వారా సరికొత్త టెక్నాలజీతో పరిశోధనలు నిర్వహించారు. ఈ కొత్త రకం ఫ్యూయెల్ సెల్స్ గురించి ఎలక్ట్రో కిమికా ఆక్టా జర్నల్ లో ప్రచురించారు. దీనిద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఎటువంటి ఖరీదైన వస్తువులు అవసరం లేదని, కార్బన్, కాటన్, టిటానియమ్ వైర్లతో తయారయ్యే అతి చవుకైన కాథోడ్ ఉపయోగించి శక్తివంతమైన విద్యుత్తును వెలికి తీయవచ్చని వివరించారు. ఆహార వ్యర్థాల్లో... ముఖ్యంగా గుడ్డు తెల్లసొనలోని వొవాల్బుమిన్ ప్రొటీన్, గ్లూకోజ్ లు విద్యుత్తును వెలికి తీసేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. వీటితో ఫ్యూయెల్ సెల్స్ మరింత వేగంగా స్పందించి, మరింత శక్తిని సృష్టించేందుకు వీలవుతుంది. అయితే ఈ పరిశోధనల్లో ఎలక్ట్రోడ్ల పొడవు పెంచి మెలిపెట్టడంద్వారా విద్యుత్ ఉత్పత్తి పదిరెట్లు పెరిగినట్లు కనుగొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా నిరుపేద, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫ్యూయెల్ సెల్స్ ద్వారా వ్యర్థాలను వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాన రచయిత జోన్ ఖౌలర్ వెల్లడించారు. తాము రూపొందించిన డిజైన్ సంప్రదాయ నమూనాలకంటే తక్కువ ధర కలిగి, మరింత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ వెలికి తీసే మిగిలిన అన్ని పరికరాలకన్నా, మూత్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ఈ ఫ్యూయెల్ సెల్ పరికరంతో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తికావడం గమనించవచ్చని ఖౌలర్ తెలిపారు. -
కణాలు చేసుకునే ఆత్మహత్య... ‘అపాప్టోసిస్’!
మెడిక్షనరీ కొన్ని కణాలు ఆత్మహత్య చేసుకుంటాయి. వినడానికి నివ్వెరపోయేలా అనిపించినా ఈ మాట వాస్తవం. ఉదాహరణకు గుడ్ల నుంచి పుట్టీపుట్టగానే... అది కప్పగా ఎదిగే క్రమంలో కొన్నాళ్ల పాటు దానికి తోక ఉంటుంది. తెలుగులో తోకకప్పగా పిలుచుకునే ఈ దశను ఇంగ్లిష్‌లో ‘టాడ్‌పోల్ లార్వా’ దశగా పేర్కొంటారు. మరి ఈ దశనుంచి కప్ప గా ఎదిగే క్రమంలో తోక ఏమవుతుంది. అది అక్కర్లేదు కాబట్టే కణాలు తమను తాము నిర్మూలించుకుంటాయి. దాంతో కప్ప రూపొందుతుంది. మరి ఇదే ప్రక్రియను అవసరం లేని కణాల విషయంలో జరిగేలా చూస్తే...? ఇలా వినూత్నంగా ఆలోచించడం వల్ల వచ్చిన ఒక వైద్యచికిత్స ప్రక్రియలో... జీవకణాల్లోని జీవపదార్థం (సైటోప్లాజమ్)లోకి కొన్ని రసాయనాలను పంపించి, కణం ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతారు. దాంతో సైటోప్లాజమ్ తనంతట తానుగా నాశనం అయ్యేలా తనను ‘ప్రోగ్రామ్’ చేసుకుంటుంది. ‘దీన్నే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ అంటారు. గుట్టలుగుట్టలుగా పుట్టే క్యాన్సర్ కణాలు తమంతట తామే నాశనం అయ్యేలా కణాలను ప్రోగ్రామ్ చేసుకునేలా పురిగొల్పితే...? ఈ దిశగా ఆలోచిస్తూ క్యాన్సర్ కణాలు తమను తాము సంహరించుకునేలా శాస్త్రవేత్తలు ‘ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ ఆఫ్ క్యాన్సర్ జరిగేలా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.