Chinese President Xi Jinping
-
Chinese President: తైవాన్‌పై డ్రాగన్ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి
బీజింగ్/తైపీ: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్ చైనా దూకుడుపై తైవాన్ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆ దేశాల అండ తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. -
అవినీతికి దూరంగా ఉండండి: జిన్‌పింగ్
బీజింగ్: అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని అధికార కమ్యూనిస్టు పార్టీ అఫ్ చైనా నాయకులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచించారు. కుటుంబ సభ్యులను, బంధువులను సైతం వాటికి దూరంగా ఉంచాలన్నారు. ఈ నెల 22న సీపీసీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుల భేటీలో జిన్‌పింగ్ ప్రసంగించారు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. అవినీతిపై మనం పోరాటం చేస్తున్నారని, ఈ విషయంలో పార్టీ నేతలంతా సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మీ కింద పని చేసేవారు అవినీతి దూరంగా ఉండేలా కఠినమైన నిబంధనలు విధించాలని జిన్‌పింగ్ సూచించారు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు ప్రయోజనాలు కలి్పంచి, వారి నుంచి లంచాలు, బహుమతులు స్వీకరిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకత్వంగుర్తించింది. కొందరిపై విచారణ సైతం ప్రారంభించింది. -
జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు!
న్యూఢిల్లీ: జీ20 దేశాల అధినేతల ముఖ్యమైన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నెల 9, 10న ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ సహా వివిధ దేశాదినేతలు హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం లేదని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. బదులుగా ప్రధానమంత్రి లీ కియాంగ్ రావొచ్చని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ çకూడా సదస్సుకు రావడం లేదు. -
ఎస్సీవో వర్చువల్ భేటీకి జిన్‌పింగ్
బీజింగ్: భారత్ ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన వర్చువల్‌గా జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) శిఖరాగ్ర భేటీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని డ్రాగన్ దేశం చైనా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహా్వనం మేరకు ఎస్సీవో 23వ ప్రభుత్వాధినేతల సమావేశానికి జిన్‌పింగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 2001లో ఏర్పాటైన ఎస్సీవోలో భారత్, పాక్‌లు 2017లో శాశ్వత సభ్యదేశాలయ్యాయి. రొటేషన్ విధానంలో భారత్‌కు ఈ ఏడాది అధ్యక్ష స్థానం దక్కింది. -
నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం
బీజింగ్: దాదాపు ఐదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రితో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొన్ని నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం కుదిరిందని జిన్‌పింగ్ ప్రకటించారు. అయితే ఆ ఒప్పందాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా నిఘా భారీ బెలూన్లు చక్కర్లు కొట్టడం, వాటిని అమెరికా వాయుసేన కూల్చేయడం వంటి ఘటనలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాల్లో సందిగ్ధత నెలకొన్న విషయం తెల్సిందే. ‘‘ఇటీవల బాలీలో బైడెన్‌తో కుదిరిన ‘కనీస అవగాహన’కు కొనసాగింపుగా చైనా తన వైఖరిని స్పష్టంచేసింది. ప్రత్యేకంగా కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు ఉమ్మడిగా పురోగతి సాధించాయి. పరస్పర గౌరవం, నమ్మకాల మీదనే చర్చలు సఫలమవుతాయి’’ అని భేటీ తర్వాత జిన్‌పింగ్ వ్యాఖ్యానించారని చైనా అధికార వార్తాసంస్థ సీజీటీఎన్. ‘ బ్లింకెన్ పర్యటనతో ఇరుదేశాల బంధం కీలక కూడలికి చేరుకుంది. అయితే చైనాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను ఎత్తేయాల్సిన అవసరం ఉంది’ అని చైనా విదేశాంగ మంత్రి క్విన్ చెప్పారు. చైనాతో దౌత్య ద్వారాలు ఎప్పటికీ తెరిచే ఉండాలనే లక్ష్యంతో∙బ్లింకెన్ పర్యటన సాగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటన.. ఇద్దరు మిత్రులు సాధించిందేమిటి?
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం తన వంతు సహకారం అందిస్తానన్న ప్రకటనతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించారు. శాంతి ప్రణాళికతో వచ్చానని చెప్పారు. తన బృందంతో కలిసి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో మకాం వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, ఆయన బృందంతో సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం చైనా–రష్యా పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అండగా ఉంటానని పుతిన్‌కు జిన్‌పింగ్ అభయ హస్తం ఇచ్చారు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్రకు దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంటు జారీ చేసింది. రష్యా నుంచి బయటకు రాగానే పుతిన్‌ను అరెస్టు చేయడం తథ్యమని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు. పుతిన్‌కు స్నేహహస్తం అందించారు. జిన్‌పింగ్ రష్యాలో ఉన్న సమయంలోనే అమెరికా మిత్రుడైన జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం గమనార్హం. చైనా, రష్యా మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాల పెత్తనం ఇకపై చెల్లదన్న సంకేతాలు ఇవ్వడమే జిన్‌పింగ్, పుతిన్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐదు కీలక అంశాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో చూద్దాం.. ఉక్రెయిన్‌పై చొరవ సున్నా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో జిన్‌పింగ్ ఏమీ సాధించలేకపోయారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచలేదు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌లో హింస, అమాయక ప్రజల మరణాలపై మాటమాత్రంగానైనా స్పందించలేదు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలంటూ జిన్‌పింగ్, పుతిన్ సంయక్తంగా పశ్చిమ దేశాలకు హితబోధ చేశారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రయోజనాలను గౌరవించాలని సూచించారు. శాంతికి చొరవ చూపుతానన్న జిన్‌పింగ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పుతిన్‌తో భేటీలో ఆ ఊసే ఎత్తలేదు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికిప్పుడు తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రతిపాదన ఏదీ లేదని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు పశ్చిమ దేశాల రెచ్చగొట్టే చర్యలే కారణమని చైనా, రష్యా చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక సహకారం, రక్షణ సంబంధాలు నాటో దేశాలతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా(ఏయూకేయూఎస్) భద్రతా చట్టం వంటి వాటితో తమకు ముప్పు పొంచి ఉందని చైనా, రష్యా చెబుతున్నాయి. అందుకే పరస్పరం సైనిక సహకారం మరింత పెంపొందించుకోవాలని, రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్, పుతిన్ నిర్ణయించుకున్నారు. ఆసియా ఖండంలో స్థానికంగా ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించుకోవడంతోపాటు పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. పలు ఆసియా–పసిఫిక్ దేశాలతో అమెరికా సైనిక–రక్షణ సంబంధాలు మెరుగుపడుతుండడం పట్ల ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగించే బాహ్య సైనిక శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలు తరచుగా చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. తద్వారా తాము ఇరువురం ఒక్కటేనని, తమ జోలికి రావొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక కూటమి అమెరికాకు వ్యతిరేకంగా తామే ఒక కొత్త కూటమిగా ఏర్పాటు కావడంతోపాటు నూతన వరల్డ్ ఆర్డర్ నెలకొల్పాలన్నదే చైనా, రష్యా ఆలోచనగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ ఆర్డర్ తమ సొంత అజెండాలకు అనుగుణంగా, ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై జిన్‌పింగ్, పుతిన్ మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేద్దామని ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. అమెరికా పెత్తనం కింద ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందన్నదే వారే వాదన. జిన్‌పింగ్ చైనాకు బయలుదేరే ముందు పుతిన్‌తో కరచాలనం చేశారు. కలిసి పనిచేద్దామని, అనుకున్న మార్పులు తీసుకొద్దామని చెప్పారు. మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. పశ్చిమ దేశాల శకం ముగిసిందని, ఇకపై చైనా ప్రాబల్యం మొదలుకాబోతోందని జిన్‌పింగ్ పరోక్షంగా వెల్లడించారు. వ్యాపార, వాణిజ్యాలకు అండ యుద్ధం మొదలైన తర్వాత తమ దేశం నుంచి వెళ్లిపోయిన పశ్చిమ దేశాల వ్యాపార సంస్థల స్థానంలో చైనా వ్యాపారాల సంస్థలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. నాటో దేశాల ఆంక్షల తర్వాత ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై రష్యా ఆధారపడడం పెరుగుతోంది. ఇరు దేశాల నడుమ ఇంధన వాణిజ్యం అభివృద్ధి చెందుతోంది. చమురు, గ్యాస్, బొగ్గు, విద్యుత్, అణు శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాల సంస్థలు కలిసికట్టుగా పనిచేసేలా మద్దతు ఇస్తామని జిన్‌పింగ్, పుతిన్ తెలిపారు. కొత్తగా చైనా–మంగోలియా–రష్యా నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు చేపడతామని పుతిన్ వెల్లడించారు. రష్యాకే మొదటి ప్రాధాన్యం ► ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టయినా సరే రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ► అమెరికా వ్యతిరేకతే ఏకైక అజెండాగా రెండు దేశాలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ► ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్దం మొదలయ్యాక జిన్‌పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ► యుద్ధాన్ని ఏనాడూ ఖండించలేదు. ► రష్యాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన వైఖరి ద్వారా తేల్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు.. రష్యాలో జిన్‌పింగ్
మాస్కో: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు రష్యాలో ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన సోమవారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అవధులు లేని తమ స్నేహాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఒత్తిడి! ప్రపంచంలో రెండు బలమైన దేశాల అధినేతలు జిన్‌పింగ్, పుతిన్ సోమవారం చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్, పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత ఇరుదేశాల నడుమ ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ అధికారి యురీ ఉషాకోవ్ చెప్పారు. ఇద్దరు నాయకుల చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయని రష్యా మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా, సైనికాధిపతిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి నెలకొనాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు జిన్‌పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించడమే లక్ష్యంగా శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఆయన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బద్ధశత్రువులైన ఇరాన్, సౌదీ అరేబియా ఇటీవలే చేతులు కలిపాయి. దీని వెనుక చైనా దౌత్యం ఉంది. గత పదేళ్లుగా చైనా అధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతూ ఇటీవలే మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్ రష్యాతో సన్నిహిత సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా వైఖరిని ప్రపంచంలో చాలా దేశాలు తప్పుపట్టినప్పటికీ జిన్‌పింగ్ మాత్రం పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అమెరికా వ్యతిరేకతే చైనా, రష్యా దేశాలను ఒక్కటి చేస్తోంది. శాంతి ప్రణాళికతో వచ్చా: జిన్‌పింగ్ చైనా, రష్యా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయని జిన్‌పింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. థర్డ్ పార్టీని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. రెండు పెద్ద దేశాల సంబంధాల విషయంలో ఒక కొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ లా పరిరక్షణ కోసం రష్యాతో కలిసి పని చేస్తూనే ఉంటామని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానన్నారు. ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో చైనా చేసిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పుతిన్ తెలిపారు. దీనిపై జిన్‌పింగ్‌తో చర్చిస్తానని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ వ్యవహారాలు, సంక్షోభాల విషయంలో చైనా నిష్పాక్షిక, సమతూక వైఖరి అవలంబిస్తోందని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జిన్‌పింగ్ మాట్లాడే అవకాశమున్నట్లు సమాచారం. తన శాంతి ప్రణాళికను జెలెన్స్కీతో ఆయన పంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
దుర్భేద్యమైన ఉక్కు సైన్యం: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
బీజింగ్: దేశ సార్వభౌమత్వమే పరమావధిగా అత్యంత పటిష్టతర ఉక్కు సైన్యంగా దేశ సాయుధబలగాలను శక్తివంతం చేస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. ఉప్పు– నిప్పుగా ఉండే సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంలో సఫలీకృతమై అంతర్జాతీయ సమాజంలో ప్రతిష్టను పెంచుకున్న చైనా.. దేశ సైన్యానికి ‘ఆధునిక’ జవసత్వాలను అందించడంపై దృష్టిపెట్టింది. చైనాకు మూడోసారి అధ్యక్షుడయ్యాక జిన్‌పింగ్ తొలిసారిగా ప్రసంగించారు. చైనా పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రజల నుద్దేవించి మాట్లాడారు. ‘ అంతర్జాతీయ వ్యవహా రాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించడంతోపాటు అమెరికాసహా పొరుగు దేశాల నుంచి ముప్పు, దేశ సార్వభౌమత్వ సంరక్షణ కోసం సైన్యాన్ని ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్ (ఉక్కు సైన్యం)’గా మారుస్తాం. చైనా ముందుకుతెచ్చిన గ్లోబల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్(జీడీఐ), గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ వంటి కార్యక్రమాల అమలు సహా ప్రపంచ పురోభివృద్ధి, సంస్కరణ పథంలో చైనా ఇకమీదటా గతిశీల పాత్ర పోషించనుంది. దాంతోపాటే దేశ భద్రత, అభివృద్ది ప్రయోజనాలను కాపాడుకునేందుకు దేశ భద్రత, సాయుధ బలగాలను అజేయశక్తిగా నవీకరించాలి. సుస్థిరాభివృద్ధికి భద్రతే వెన్నుముక’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ‘మీరు నాపై ఉంచిన నమ్మకమే నన్ను ముందుకునడిపే చోదకశక్తి. నా భుజస్కంధాలపై పెద్ద బాధ్యతల్ని మోపారు’ అన్నారు. ‘‘పొరుగు ప్రాంతాలతో శాంతియుత అభివృద్ధినే కోరుకుంటున్నాం. తైవాన్ స్వతంత్రత కోరే వేర్పాటువాదులను, బయటి శక్తుల జోక్యాన్ని అడ్డుకుంటున్నాం. చైనా ఆధునీకరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్దాం’ అని పార్లమెంట్లో సభ్యులనుద్దేశించి అన్నారు. -
ప్లీనరీలో జిన్‌పింగ్ వర్క్ రిపోర్ట్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదివారం అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ నిర్వహించారు. తన పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్తు దార్శనికతపై ఒక వర్క్ రిపోర్ట్‌ను ఈ సందర్భంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. కొన్ని కీలక విధానాలు, డాక్యుమెంట్లపై చర్చించారు. ఈ నెల 16న జరగబోయే కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ సదస్సుకు సన్నాహకంగా ఈ ప్లీనరీని నిర్వహించినట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గత పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సును ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. చైనా అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో ఉండడానికి వీల్లేదు. కానీ, 2018లో రాజ్యాంగాన్ని సవరించారు. పదేళ్ల పదవీ కాలం నిబంధనను తొలగించారు. జిన్‌పింగ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా పదవీలో ఉండడానికి వీలు కల్పించారు. -
జనంలోకి జిన్‌పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్‌పింగ్ మంగళవారం బీజింగ్‌లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
తైవాన్‌పై జోక్యం చేసుకోవద్దు
బీజింగ్: తైవాన్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చైనా అధినేత జిన్‌పింగ్ గట్టిగా హెచ్చరించారు. వ్యూహాత్మక కారణాలతో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య విభేదాలు మంచిది కాదని కూడా జిన్ పింగ్ పేర్కొన్నట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి వైఖరి ప్రపంచ ఆర్థిక పురోగతిపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ‘చైనా ప్రధాన భూభాగం నుంచి వేరుపడేలా తైవాన్ను ప్రేరేపించే వెలుపలి శక్తులను ఎదుర్కొంటాం. 140 కోట్ల చైనా ప్రజల అభీష్టమైన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటాం. నిప్పుతో ఆడాలనుకుంటే భస్మం అవుతారు’అంటూ గట్టి హెచ్చరికలు పంపింది. ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని తగ్గించడం, స్థూల ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, కోవిడ్‌తో పోరాటం, ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించుకోవడం వంటి వాటిపై సహకరించాలని అమెరికాను జిన్‌పింగ్ కోరారని చైనా ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలో తైవాన్ సందర్శిస్తారంటూ వస్తున్న వార్తలపై చైనాలింకా స్పందించలేదు. అయితే, బైడెన్, జిన్‌పింగ్ నవంబర్‌లో ఇండొనేసియాలో జరిగే జి–20 భేటీలో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. -
నిప్పుతో చెలగాటం ఆడొద్దు.. బైడెన్‌తో జిన్‌పింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం ఫోన్లో సుదీర్ఘంగా వాడీవేడిగా సంభాషణలు సాగాయి. రెండు దేశాల అధ్యక్షుల మధ్య గురువారం జరిగిన ఐదో విడత చర్చలు ఉదయం 8.33 నుంచి 10.50 గంటల వరకు కొనసాగినట్లు శ్వేతసౌధం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ చర్చల్లో తైవాన్ అంశమే ప్రధానంగా నిలిచింది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణతకు అమెరికానే కారణమంటూ ఎప్పటి మాదిరిగానే చైనా నిందించింది. తైవాన్ ఎప్పటికైనా తమదేనంటూ చర్చల సందర్భంగా జిన్‌పింగ్ గట్టిగా చెప్పారని చైనా పేర్కొంది. ‘‘నిప్పుతో ఆడుకునే వారు దానివల్లే నాశనమవుతారు. ఈ విషయం అమెరికా తెలుసుకోవాలి‘ అంటూ బైడెన్ వద్ద జిన్‌పింగ్ ప్రస్తావించినట్లు.. చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో.. ‘అమెరికా–చైనా సంబంధాలను వ్యూహాత్మక పోటీదారు కోణంలో చూడటం, చైనాను ప్రధాన ప్రత్యర్థిగా భావించడం వంటి వాటిని బైడెన్‌తో జిన్‌పింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి విధానం అంతర్జాతీయ సమాజాన్ని, రెండు దేశాల ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని, ఇరు దేశాల సంబంధాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని జిన్‌పింగ్ అన్నారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్–బైడెన్ చర్చలకు సంబంధించి శ్వేతసౌధం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: మరో ఆరేళ్లు అమెరికాతో ప్రయాణం- రష్యా ప్రకటన -
ప్రపంచ శాంతికి ఉమ్మడి సహకారం
బీజింగ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం మనం కోరుకోని సంక్షోభం అని చైనా అధినేత షీ జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఇరువురు నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో శాంతి సామరస్యం, స్థిరత్వం కనిపించడం లేదని అన్నారు. దేశాలు ఏవైనా సరే యుద్ధ రంగంలో కలుసుకొనే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. -
బుద్ధం శరణం గచ్ఛామి!
షీ జిన్‌పింగ్ సమరశంఖం పూరించారు. నాలుగు రోజుల కిందట చైనా సైనికాధికారులను సమావేశ పరిచి ‘యుద్ధానికి సిద్ధంగా ఉండాలని’ ఆయన ఆదేశించారు. శంఖారావం చేసినవాడు జిన్‌పింగ్ కాబట్టి సహజంగానే అది భూమండలమంతా ప్రతిధ్వనించింది. షీ జిన్‌పింగ్ కేవలం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అధ్యక్షుడు మాత్రమే కాదు. చైనా గమనాన్ని శాసిస్తున్న కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా. పీపుల్స్ ఆర్మీ కళ్లేలను అదిలించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ పదవి కూడా ఆయనదే. నవచైనా నిర్మాత కామ్రేడ్ మావో జెడాంగ్ కన్నుమూసిన నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ అంతటి అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోగలిగిన శక్తిమంతుడు షీ జిన్‌పింగ్. ఇప్పుడాయన ఒక ఆధునిక మహాసామ్రాజ్యానికి మకుటం లేని సామ్రాట్టు. ఇటు భూఖండాల మీదుగా, అటు మహాసముద్రాల గుండా ప్రపంచా ధిపత్యం కోసం బాటలు వేసుకుంటున్న ఉచ్ఛస్థితిలో ప్రస్తుత చైనా ప్రాభవం కనిపిస్తున్నది. ఇంతకూ ఎవరి మీద చైనా యుద్ధభేరీ? ఎవరిప్పుడు చైనాకు తక్షణ శత్రువు? వినిమయ వస్తువుల తయారీకి ప్రపంచ కార్ఖానాగా మారిన తర్వాత గడిచిన పదిహేనేళ్లలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఆర్థికబలం దన్నుతో నలుదిక్కులా చైనా కవ్వింపు చర్యలకు దిగడం మొదలుపెట్టింది. ఫలితంగా చైనాకు శత్రువులు తక్కువేమీ లేరు. సంప్రదాయక శత్రుదేశాలైన తైవాన్, జపాన్లతోపాటు దక్షిణ చైనా, తూర్పుచైనా సముద్రా ల్లోని ప్రతి తీరదేశంతోనూ అది గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది. పెద్దన్న మాదిరి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. చౌక వేతనాల కారణంగా, వస్తూత్పత్తి రంగంలో తనకు పోటీగా తయారైన వియత్నాం, ఇండోనేషియాలపై కూడా చైనా కంటగింపుతోనే ఉన్నది. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించబోతున్న ఇండో–పసిఫిక్ మహాసముద్రాల్లో తనకు ఎదురులేకుండా చూసుకోవాలని చైనా ఉవ్విళ్లూరుతున్నది. ఈ ప్రాంతంలో మరో బలమైన దేశమైన భారత్ చుట్టూ ‘పర్ల్ స్ట్రింగ్’ పేరుతో ఒక ఉరితాడును సిద్ధంచేసి ఉంచింది. చైనా దూకుడును అడ్డుకోవ డానికి అమెరికా నేతృత్వంలో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఇక్కడ ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడ్డాయి. అంతర్జాతీయ సంబం ధాల్లో ప్రస్తావించే ‘థుసుడిడిస్ ట్రాప్’ సూత్రం ప్రకారం అమెరి కాతో చైనా యుద్ధం అనివార్య పరిణామం. ప్రపంచంలో కొత్తగా సూపర్ పవర్‌గా ఎదుగుతున్న దేశం, ఇప్పటికే ఆ హోదాలో ఉన్న దేశాన్ని సవాల్ చేయడం సహజం. ఇది క్రమంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందన్న సూత్రీకరణ ప్రస్తుత అమెరికా–చైనాలకు వర్తిస్తుందని పొలిటికల్ సైంటిస్టుల అభిప్రాయం. ప్రాచీన గ్రీకు దేశంలో ఏథెన్స్, స్పార్టా నగరాల నడుమ యుద్ధం తప్పదంటూ థుసుడిడిస్ అనే సైనికాధికారి చేసిన సూత్రీకరణ ఆయన పేరుతో వ్యాప్తిలోకి వచ్చింది. కానీ, అమెరికాతో యుద్ధానికి చైనా ఇప్పుడే కాలుదువ్వక పోవచ్చు. మొన్న షీ మోగించిన రణభేరీ భారత్పైనేనని కొందరు దౌత్య నిపుణుల అభిప్రాయం. ఇది నిజంగా యుద్ధా నికి దారితీస్తుందా? హెచ్చరికలు, బెదిరింపులతో ఆగిపోతుందా చెప్పలేము కానీ, చైనా తక్షణ టార్గెట్ మాత్రం ఇండియానే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈమధ్య భారత్– చైనా జవాన్ల మధ్య జరిగిన లద్దాఖ్ ఘర్షణ చైనా అహాన్ని బాగా దెబ్బతీసింది. భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి చైనా పథకం ప్రకారం గల్వాన్ లోయలో ఘర్షణకు దిగింది. ఊహించని సంఘటన అయినప్పటికీ భారత జవాన్లు ప్రతిఘ టించిన తీరును చూసి చైనా సైన్యం అవాక్కయింది. ఈ ఘర్ష ణలో 25 మంది జవాన్లు చనిపోయారని భారత్ అధికారికంగా ప్రకటించింది. తమవైపు నష్టాలను ప్రకటించే అలవాటు చైనాకు ఎప్పుడూ లేదు. భారత్‌కు జరిగిన నష్టం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ నష్టం చైనాకు జరిగిందని విశ్వసనీయ సమా చారం. భారత్–1962, భారత్–2020 మధ్య చాలా తేడా ఉందన్న సంగతి చైనాకు అర్థమైంది. చైనా సైనికులు గల్వాన్ కవ్వింపుకు దిగడం వెనక బలమైన కారణాలున్నాయి. ప్రపం చాధిపత్యం కోసం చైనా రూపొందించుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) కార్యక్రమంలో చేరడానికి భారత్ నిరాక రించింది. అంతేకాకుండా చైనా విస్తరణను ఎదుర్కోవడానికి అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్ బృందంలో సభ్యురాలిగా చేరింది. 3,400 కిలోమీటర్ల సుదీర్ఘమైన భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల వంటి మౌలిక వసతుల కల్పనపై భారత్ దృష్టి పెట్టింది. ఇది కూడా చైనాకు ఆగ్రహం కలిగించింది. అన్నిటినీ మించి మోదీ ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడం పాక్‌తోపాటు చైనాకు కూడా కడుపుమంట కారణమైంది. ఫలి తంగా జమ్మూ–కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్‌తో కూడిన లద్దాఖ్ ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతాలుగా భారత యూనియన్‌లో భాగమయ్యాయి. లద్దాఖ్ తమ భూభాగమేనని చైనా ఎప్పటి నుంచో పేచీ పెడుతున్నది. పాకిస్తాన్ చైనా ఆర్థిక నడవా (సీపీఈసీ)లో భాగంగా గిల్గిట్ బాల్టిస్థాన్‌లో చైనా భారీ పెట్టు బడులు పెట్టింది. అపార ఖనిజ సంపదకు నిలయం గిల్గిట్ బాల్టిస్థాన్. ఇక్కడున్న హిమనీ నదాలు, సింధు. ఉపనదులపై జలవిద్యుత్కేంద్రాలు నిర్మిస్తే 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చట. చైనాకు ఒకరకంగా బంగారు బాతు వంటిది గిల్గిట్ బాల్టిస్థాన్. లద్దాఖ్‌లో చైనా ఆక్రమించిన ఆక్సా యిచిన్ ప్రాంతాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తున భారత్ ఒక వైమానిక స్థావరాన్ని నిర్మించడం కూడా చైనా కలవరానికి కారణమైంది. చైనా వ్యూహాత్మక రవాణా మార్గాలన్నీ ఈ విమాన స్థావరానికి చేరువగా ఉంటాయి. గల్వాన్ భంగపాటు తర్వాత తన ఆధిపత్యాన్ని నిరూపించు కోవడానికి భారత్‌పై మరింత పెద్ద దాడికి చైనా పూనుకునే అవకాశం ఉన్నది. ఆర్థికపరంగా చూసినా, మిలిటరీ పరంగా చూసినా భారత్ కంటే చైనా శక్తిమంతంగా కనిపిస్తున్నది. ఒక్క వైమానిక రంగంలో మాత్రమే భారత్ బలంగా ఉన్నది. ఈ నేప థ్యంలో రక్షణ వ్యవహారాల నిపుణుల్లో కొందరు భారత్ క్వాడ్ కూటమితో కలిసి సముద్ర జలాల్లో చైనాను నిలువరించడానికే ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. భౌగోళిక సరిహద్దుల్లో యుద్ధరంగం భారత్‌కు అనుకూలంగా ఉండదని వీరి ఉద్దేశం. చైనాకు అనుకూలంగా పాక్ రంగంలోకి దిగుతుంది. అమెరికాతో ఒప్పందం ఫలితంగా అఫ్గానిస్తాన్‌లో త్వరలో తాలిబన్లు అధి కారంలోకి రాబోతున్నారు. ఇది భారత్‌కు ప్రతికూలం. అమెరి కాతో శతృత్వం కారణంగా ఇరాన్ చైనాకు చేరువైంది. ఇలా మధ్య ఆసియా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల్లో చైనాకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని ఈ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరు చెబుతున్న కారణాలన్నీ నిజమే. కానీ సరిహద్దుల్లో భారత్‌కు అనుకూల వాతావరణం లేదన్నది సరికాదు. ఒక్కసారి చరిత్రను మధిస్తే ఈ సరిహద్దే మనకు అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడగలదని అర్థమవు తుంది. ఎందుకంటే సుదీర్ఘమైన 3,400 కిలోమీటర్ల సరిహద్దు భారత్ – చైనా సరిహద్దు కాదు. ఇది టిబెట్–భారత సరిహద్దు మాత్రమే. టిబెట్ ముమ్మాటికీ చైనా ఆక్రమిత ప్రాంతమే. చరి త్రలో కొంతకాలం కొన్ని చైనా రాజవంశాల ఏలుబడిలో ఉన్నంత మాత్రాన టిబెట్ చైనాలో భాగమని భావిస్తే, ఆగ్నే యాసియా దేశాలను కూడా భారత్‌లో భాగంగా గుర్తించవలసి ఉంటుంది. క్రీస్తుశకం ఏడో శతాబ్దం టిబెట్ చరిత్రలో కీలకమైన కాలం. అప్పటి నుంచి దాదాపు రెండొందల యేళ్లకాలం టిబెట్ సువి శాలమైన స్వతంత్ర రాజ్యంగా విలసిల్లింది. దక్షిణాన అరుణా చల్‌ప్రదేశ్, భూటాన్, నేపాల్, లద్దాఖ్‌ల వరకు, పడమట కిర్ఘిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, షింజియాంగ్‌ల వరకు, ఉత్తరాన గోబీ ఎడారుల వరకు, తూర్పున చైనాలోని సెచువాన్, చెంగ్డూ ప్రావి న్స్‌ల వరకు టిబెట్ సరిహద్దులు విస్తరించాయి. ఈకాలంలోనే భారతదేశంలో నిరాదరణకు గురౌతున్న బౌద్ధం టిబెట్‌లోకి ప్రవేశించి విస్తరించింది. టిబెట్ బౌద్ధం పూర్తిగా భారతీయ శాఖ. ఆదినుంచీ చైనా కంటే మిన్నగా భారత్‌తోనే టిబెట్ సాంస్కృతిక సంబంధాలు ఎక్కువగా ఉండేవి. హిందువులకు పవిత్రమైన కైలాస పర్వతం, మానస సరోవరం టిబెట్లోనివే. ఇవి పరాయి దేశంలో ఉన్నట్లుగా హిందువులు ఎప్పుడూ భావించలేదు. టిబెటన్ల స్వర్ణయుగం కాలంలో హన్ జాతీయ చైనీయుల టాంగ్ సామ్రాజ్యం తూర్పు చైనాకు మాత్రమే పరిమితమైంది. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో చివరి హిందూ సామ్రాజ్యం హర్షవర్ధనుడి ఏలుబడిలో ఉంది. ఆ కాలంలోనే చైనా బౌద్ధ యాత్రికుడు హువాన్సాంగ్ వేల కిలోమీటర్ల దూరం నడిచి భారత్‌కు వచ్చి బౌద్ధ విజ్ఞానాన్ని అభ్యసించి, అనేక విలువైన బౌద్ధ గ్రంథాలను తీసుకొని చైనాకు వెళ్లాడు. ఇందుకోసం ఆయన తన విలువైన జీవితకాలంలో ఇరవై సంవత్సరాలను వెచ్చించాడు. ఆ తర్వాత కొంత కాలానికే భారతదేశం దక్షిణ కొసనున్న కేరళ నుంచి ఒక నంబూద్రి బ్రాహ్మణ బాలుడు ఎనిమిదో ఏటనే సన్యసించి వేల కిలోమీటర్లు కాలినడకన దేశాటన చేసి, అద్వైతవాదంతో హిందూ ధర్మాన్ని పునఃప్రతి ష్టించి బౌద్ధాన్ని దేశం నుంచి బహిష్కరించడంలో కీలకపాత్ర పోషించాడు. 32వ ఏటనే కన్నుమూశాడు. ఈ కర్తవ్య నిర్వ హణకు ఆయన తన జీవితకాలంలో మూడొంతులు వెచ్చిం చాడు. ఆ బ్రాహ్మణ బాలుడు ఆదిశంకరుడు. అప్పుడు దేశం విడిచి వెళ్లిన బౌద్ధం (భారతీయ వజ్ర యానం) టిబెట్‌లో భద్రంగా ఉన్నది. కాకపోతే టిబెట్ మాత్రం తన స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. దురాక్రమణకు గురైనప్పటికీ మంగోల్‌ల ఏలుబడిలోనూ, చింగ్ పాలకుల (మంచూరియన్ జాతి) హయాంలోనూ స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవించిన టిబెట్ ఇప్పుడు హన్ జాతీయవాద కమ్యూనిస్టుల పాలనలో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నది. చైనా జాతీయ వాదాన్ని పునరుజ్జీవింపజేసిన మావో జెడాంగ్ అసలు సిసలు వారసుడు షీ జిన్‌పింగ్. ఇప్పుడు చైనాలో హన్ జాతీయవాదం ప్రపంచ పెత్తనంకోసం తహతహలాడుతున్నది. షింజియాంగ్‌లో వీగర్ ముస్లిం మైనారిటీలను ఊచకోత కోశారు. పది లక్షలమందికి పైగా ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్నారు. టిబెట్‌లో బౌద్ధులకు సామూహిక ప్రార్ధనలకు సైతం అనుమతి లేదు. స్వాతంత్య్ర కాంక్ష టిబెటన్లలోనూ, వీగర్లలోనూ అడుగంటలేదు. ఇప్పుడు భారతదేశం స్వాప్నికుడైన పండిత నెహ్రూ పాలనలో లేదు. హిందూ జాతీయవాదంలో కాకలు తీరిన నరేంద్ర మోదీ నాయ కత్వంలో ఉంది. హన్ జాతీయవాదం, హిందూ జాతీయవాదం ముఖాముఖి తలపడబోయే సన్నివేశానికి ఇది పూర్వరంగం. టిబెటన్ల స్వాతంత్య్ర ఆకాంక్షలకు బహిరంగ మద్దతు ప్రకటించి అక్కడ శాంతియుత ఉద్యమాలకు ఊపిరిపోసే అవకాశం ఇంకా ఆలస్యం చేస్తే లభించదు. ఇంక కొంతకాలానికి అక్కడ టిబెటన్లు మైనారిటీలుగా మారిపోతారు. ఆసియా ఖండలోని అన్ని ప్రధాన జీవనదులకూ పుట్టినిల్లు టిబెట్. ఇప్పటికే మెకాంగ్ నదిపై లెక్కకు మించి నిర్మించిన డ్యామ్‌ల వల్ల ఆగ్నేయాసియా దేశాలు అల్లాడుతున్నాయి. బ్రహ్మపుత్రను సైతం దారిమళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. టిబెట్ స్వాతంత్య్ర ఆకాంక్షలకు మద్దతుగా ప్రపంచ జనాభిప్రాయాన్ని సమీకరించే అవకాశాన్ని భారత్ వదులుకోరాదు. హన్ జాతీయవాద దూకుడుకు ప్రస్తుత చైనా భూభాగంలోనే కళ్లెం వేయడానికి ఇదే అదను. మనం పంపించివేసిన బౌద్ధాన్ని నెత్తినపెట్టుకున్న టిబెట్ ప్రజల జాతీయవాదమే ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్‌డాంగ్‌లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్‌పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
డ్రాగన్‌తో షేక్‌హ్యాండ్!
-
అగ్రరాజ్యంగా చైనా.. పట్టుబిగిస్తున్న జిన్‌పింగ్!
(సాక్షి నాలెడ్జ్సెంటర్) : చైనా ప్రజా విప్లవం(1949) నుంచీ పాలకపక్షంగా కొనసాగుతున్న చైనా కమ్యూనిస్ట్‌పార్టీ(సీపీసీ) 19వ మహాసభలు(కాంగ్రెస్) బుధవారం ప్రారంభమౌతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన నేత(కోర్లీడర్) జీ జిన్పింగ్ఎంతటి బలమైన నేతగా ఆవిర్భవిస్తారనేది చర్చనీయాంశమైంది. విప్లవకాలంలో పార్టీని విజయపథంలో నడిపించిన మావో జెడాంగ్తర్వాత డెంగ్జియావోపింగ్చైనా అగ్రనేతగా పేరు తెచ్చుకున్నా పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పదవేమీ తీసుకోలేదు. అయినా నేతలందరి అభిప్రాయాలనే సేకరించి పార్టీలోని వివిధ ప్రాంతాలు, వర్గాల నేతలతో సంకీర్ణాన్ని నిర్మించారు. ఈ సంకీర్ణం నాయకత్వానే ఎవరూ ఊహించని ఆర్థిక సంస్కరణలను చైనాలో విజయవంతంగా అమలయ్యేలా డెంగ్పునాదులు వేశారు. చైనాను ప్రపంచ ఆర్థికశక్తిగా మార్చిన జిన్‌పింగ్ చైనా అన్ని విధాలా అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది ప్రస్తుత నేత జిన్పింగ్హయాంలోనే(2012 నుంచి). రెండోసారి సీపీసీ ప్రధానకార్యదర్శి పదవిని 19వ కాంగ్రెస్‌లో చేపట్టాక ఆయన అధికార కేంద్రీకరణ మార్గంలో పయనిస్తారేమోననే భయాందోళనలు చైనాలో వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిన్‌పింగ్‌కూడా గోర్బచ్యోవ్మాదిరిగా కొంత ధైర్యం చేసి ఇటీవల చైనాలో అగ్రపదవుల్లోని అధికారులు, నేతల అవినీతిని అరిక్టడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఎదుగూబొదుగూ లేని చైనా కార్మికుల జీతాలు బాగా పెంచారు. చైనా ఆర్థికవృద్ధి రేటు కొద్దిగా మందగించినా ఫరవాలేదుగాని సీపీసీ కనున్నల్లో నడిచే ప్రభుత్వ వ్యవస్థ కూలిపోకూడదనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారనే ప్రశంసలు కూడా అందుకున్నారు. సీపీసీలో, ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించి తన మార్గంలో పయనించేవారికి పదోన్నతులు కల్పించారు. అవితీతిపరులుగా తేలిన కమ్యూనిస్ట్నేతలను ఇంటికి సాగనంపారు. కాని, కిందటేడాది తనను కోర్లీడర్గా ప్రకటింకున్నప్పటి నుంచీ వ్యక్తి పూజను జిన్పింగ్ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. సీపీసీ కాంగ్రెస్తర్వాత రాజ్యాంగ సవరణతో అధికార కేంద్రీకరణ? ఇప్పటికే బలమైన నేతగా అవతరించిన జిన్‌పింగ్ సీపీసీ మహాసభల్లో 70 శాతం పదవుల్లోకి కేవలం తన అనుయాయులనే తీసుకొచ్చి, తర్వాత తన పెత్తనాన్ని పటిష్టం చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరిస్తారనే కొందరు అంచనావేస్తున్నారు. 19వ సీపీసీ కాంగ్రెస్‌లో రెండోసారి నాయకత్వం చేపట్టాక ఆయన మావోలా మారతారా? లేక డెంగ్మాదిరిగా అందర్నీ కలుపుకుపోయే సంకీర్ణ నేతగా చైనాను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళతారా? అనే విషయం సమీప భవిష్యత్తులో తెలుస్తుంది. 138 కోట్ల జనాభా, 95 లక్షల చదరుపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న దేశాన్ని సంపూర్ణ అధికారాలతో ‘సుప్రీం లీడర్’గా జీపింగ్అవరిస్తే అది ఏకపార్టీ పాలనలోని చైనాకేగాక యావత్ప్రపంచానికి మంచిది కాదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
సహకారమే సరైన, ఏకైక అవకాశం: చైనా
బీజింగ్: అమెరికాతో ఆరోగ్యకర, సుస్థిర ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. పరస్పర సహకారంతో ముందుకెళ్లటమే ఇరు దేశాలకున్న ఏకైక అవకాశమన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో భేటీ అయిన జిన్‌పింగ్.. ‘మనం జాగ్రత్తగా చర్చించుకోవాలి. ఆరోగ్యకర, సుస్థిర చైనా–అమెరికా సంబంధాల అభివృద్ధిలో కొత్త శకం ప్రారంభం కావాలి’ అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాపై చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. పరస్పర సహకారంతో ముందుకెళ్లటమే ఇరుదేశాల ముందున్న ఏకైక అవకాశమన్నారు. -
త్వరలో మోదీతో ఒబామా భేటీ
వాషింగ్టన్: భారత్ ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఒకే వేదికపైకి రానున్నారు. ఈ నెల 30న ఐక్యరాజ్యసమితి నిర్వహించనున్న 11వ ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు మోదీ, ఒబామా భేటీకి వేదికగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా పాల్గొంటారు. మొత్తం 140 దేశాల ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పారిస్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే చేతుల మీదుగా జరగనుంది. ఆ రోజు ప్రారంభంకానున్న ఈ సమావేశంలో ఒబామా భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై మరోసారి ద్వైపాక్షిక సంబంధాలను చర్చిస్తారు. ఇప్పటికే రెండుసార్లు మోదీతో ఒబామా భేటీ అయిన విషయం తెలిసిందే. మోదీతో భేటీకన్నా ముందే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ఒబామా భేటీ కానున్నారు. -
చైనా అధినేతతో టాప్ సీఈఓల భేటీ
బీజింగ్ : చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 23న సియాటెల్‌లో జరిగే వ్యాపార చర్చల్లో ఆయనతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, పెప్సి ఇంద్రా నూయి, ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఆలీబాబా జాక్ మా తదితర టాప్ 30 సీఈఓలు పాల్గొననున్నారు. అమెరికా, చైనాలకు చెందిన చెరో 15 దిగ్గజ వ్యాపార కంపెనీల సీఈఓలు ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. ఈ రౌంట్ టేబుల్ సమావేశానికి అమెరికా మాజీ ఆర్థిక మంత్రి హెన్రీ పాల్సన్ అధ్యక్షత వహించనున్నారు. వ్యాపార, వాణిజ్యాంశాల్లో చైనా, అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, అవకాశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇరు దేశాల దైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. -
పౌర అణు సహకారం వేగవంతం
భారత్, రష్యాల ప్రతిన * రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ చర్చలు * చైనా అధ్యక్షుడితోనూ భేటీ * భారత రైల్వేల్లో రష్యా నిధులు ఉఫా(రష్యా): ద్వైపాక్షిక పౌర అణుశక్తి రంగంలో సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. అలాగే, ఇరుదేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రతినబూనాయి. 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం రష్యా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై వారిరువురు సమగ్ర సమీక్ష జరిపారని భారత విదేశాంగ శాఖకార్యదర్శి ఎస్ జైశంకర్ వెల్లడించారు. పుతిన్‌తో చర్చల సందర్భంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ)లో భారతకు పూర్తి స్థాయి సభ్యత్వం విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్న ఎస్సీఓలో భారత్, పాకిస్తాన్లకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని ప్రస్తుత ఎస్సీఓ సమావేశాల్లో ఆమోదించనున్నారు. ఆ సంస్థలో భారత్ సభ్యత్వ ప్రక్రియ వచ్చే సంవత్సరంలోగా పూర్తవుతుంది. ఈ విషయంలో పుతిన్ అందించిన సహకారానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీఓలో భారత్ సభ్యత్వం గురించి పుతిన్ స్వయంగా ఫోన్‌చేసి చెప్పిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అలాగే, తనకు రష్యాలో లభించిన స్వాగతం, ఆతిథ్యానికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఏటా జరిగే ద్వైపాక్షిక శిఖరాగ్ర చర్చల కోసం ఈ సంవత్సరం చివరలో మరోసారి రష్యా రానున్నానని మోదీ వెల్లడించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రష్యాలో జరుపుకోవడాన్ని మోదీ స్వాగతించారు. రష్యాలోని అన్ని నగరాల్లో ఆ కార్యక్రమం జరగడం ముదావహమన్నారు. దీనిపై స్పందిస్తూ.. ‘నాకు యోగా చేయడం రాదు. మీరంతా చేస్తున్నప్పుడు చూస్తే చాలా కష్టమనిపించింది. అందుకే నేను ప్రయత్నించలేదు’ అని మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడైన పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్‌లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రష్యా పాలుపంచుకునే అవకాశముంది. కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా నిధులు అందించే ప్రతిపాదన ఉందని, దీనిపై భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని రష్యా రైల్వేస్ చీఫ్ వ్లాదిమిర్ యకునిన్ వెల్లడించారు. పుతిన్‌లో చర్చల అనంతరం.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడానికి సంబంధించి పాక్‌పై చర్య తీసుకోవాలన్న భారత్ ప్రతిపాదనను ఐరాసలో చైనా అడ్డుకోవడాన్ని జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా మోదీ నిరసించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా చైనా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్‌పైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సంవత్సరం వ్యవధిలో మనం 5 సార్లు కలుసుకోవడం భారత్, చైనాల అనుబంధాన్ని చాటుతుందని భారత ప్రధాని చైనా అధ్యక్షుడితో వ్యాఖ్యానించారు’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా జులై 10న భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌లు ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం. అయితే, ఆ సమావేశం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. నవంబర్‌లో కఠ్మాండులో జరినిన సార్క్ సదస్సులో కలిసినప్పటికీ.. వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. సైనిక కూటమి బ్రిక్స్ ఉద్దేశం కాదు సైనిక, రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడం బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల ఉద్దేశం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేసి, పాశ్చాత్య దేశాల అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలున్న ఆ దేశాలన్నీ కలిసి.. అమెరికా డాలర్ ఆధారిత ద్రవ్య వ్యవస్థను మార్చాలనుకుంటున్నాయన్నారు. ఐరాస, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల వద్ద తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కలసికట్టుగా కృషిచేస్తాయని మీడియాతో అన్నారు. -
చైనా నుంచి పాక్ తీరం వరకు ఎకనామిక్ కారిడార్?
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాలు పలు ముఖ్యమైన ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. వీటిలో చైనాలోని పశ్చిమాన ఉన్న కష్గర్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ తీర ప్రాంతమైన గ్వాదర్ వరకు మల్టీబిలియన్ డాలర్ ఎకానమిక్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అంతే కాకుండా పాకిస్తాన్లో శక్తి, అవస్థాపన రంగాల మీద చైనా 46 బిలియన్ డాలర్లని పెట్టుబడి చేయనుంది. ఆసియా ఖండం మీద చైనా ప్రభావం పెంచుకునేందుకు ఈ చర్య దోహదపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
షి జిన్‌పింగ్ పర్యటనపై టిబెటన్ల నిరసన జ్వాల
న్యూఢిల్లీ: భారత్‌లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పర్యటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇక్కడ నివసిస్తున్న టిబెటన్లు ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. గత రెండు రోజుల నుంచి టిబెటన్లపై చైనా వైఖరిని ఖండిస్తూ టిబెటన్లు చేసిన నినాదాలు మిన్నంటాయి. శుక్రవారం ఉదయం మూడో రోజు కూడా టిబెటన్లు తీవ్ర నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరియ మిగతా ఆ దేశ ప్రతినిధిలు బసచేసిన తాజ్ ప్యాలెస్ హోటల్ వద్ద టిబెటన్లు ఆందోళనకు దిగారు. అక్కడి పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో 20 మంది నిరసన కారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం కూడా ఇదే పరంపర కొనసాగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం సమర్పిస్తున్న క్రమంలో ఓ టిబెట్ యువకుడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. టిబెట్ జెండా పట్టుకొని ధౌలాకువా వద్ద ఉన్న టీవీ టవర్‌పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. -
చైనా అధ్యక్షుడి పర్యటనపై నిరసన జ్వాల
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పర్యటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇక్కడ నివసిస్తున్న టిబెటన్లు ఆయన పర్యటకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. టిబెటన్లపై చైనా వైఖరిని ఖండిస్తూ టిబెటన్లు చేసిన నినాదాలు మిన్నంటాయి. గురువారం రెండో రోజు నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. టీవీ టవరెక్కిన యువకుడు ైచైనా అధ్యక్షుడు షీ జీపింగ్ రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం సమర్పిస్తున్న క్రమంలో ఓ టిబెట్ యువకుడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. టిబెట్ జెండా పట్టుకొని ధౌలాకువా వద్ద ఉన్న టీవీ టవర్‌పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. నగరంలో పలుచోట్ల భద్రత పటిష్టం టిబెటన్ల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో నగరంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలను చేపట్టారు. చైనా అధ్యక్షుడు, ఆయన సతీమణి సందర్శించిన ప్రాంతాలన్నింటిలో భారీగా పోలీసులు మోహరించారు. సర్ధార్ పటేల్ మార్గ్‌లో చైనా అధ్యక్షుడు బస చేసిన ఐదునక్షత్రాల హోటల్ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. హోటల్ పరిసరాలల్లో ఒక కిలోమీటరుు పరిధిలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ముందస్తుగా ఇంకా పలుచోట్ల ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.టిబెటన్లు అధికంగా నివసించే మజ్నూ కా టీలా ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. కొత్తవారిని ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ నివసించే వారి గుర్తింపు పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ దారి మల్లింపు విషయమై ముందే పోలీసులు సూచనలు చేసినప్పటికీ పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. -
జిన్‌పింగ్ రాకతో వెల్లువెత్తిన నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటను నిరసిస్తూ టిబెటన్లు బుధవారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చైనా రాయబార కార్యాలయం వద్ద టిబెటన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. టిబెటన్ యూత్ కాంగ్రెస్ నాయకులతోపాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టిబెట్‌పై చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ 2009 నుంచి ఇప్పటిదాకా దాదాపు 130 మందికిపైగా టిబెటన్లు ఆత్మాహుతి చేసుకున్నారని, అటువంటి సమస్య పరిష్కారం కోసం తాము భారత్‌ను నమ్ముకుంటే.. భారత్ ఇప్పుడు చైనాతో చేతులు జోడించడం సరికాదంటూ నినాదలు చేశారు. భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేలా భారత్ ఆయనపై ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్లు టిబెటన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు టెంజింగ్ జిగ్మె చెప్పారు. ఇదిలాఉండగా బుధవార మధ్యాహ్నం భారత్‌కు చేరుకున్న జిన్‌పింగ్ గుజరాత్‌కు వెళ్లి అక్కడి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.