Chinna Reddy
-
Wanaparthy: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై దాడికి యత్నం
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంతపార్టీ నాయకులే పెట్రోల్‌తో దాడికి యత్నించడం కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్, తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. చేరికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చిన్నారెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మేఘారెడ్డి వర్గీయులు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలపై మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు గణేష్ గౌడ్ అనుచరులు. చిన్నారెడ్డి… pic.twitter.com/yTCuOrbKaf — Telugu Scribe (@TeluguScribe) April 18, 2024 -
పాలమూరి చేతికి షాక్‌లు..చిన్నారెడ్డి రూటు ఎటు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియర్ నేత మీదే తిరుగుబాటు మొదలైంది. సీనియర్ స్వార్థపూరిత వ్యవహారాల్ని ఇంక సహించేది లేదంటూ గాంధీభవన్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఒక్కసారిగా పార్టీలో అసమ్మతి రేగడంతో హైదరాబాద్ నాయకత్వం కూడా దిక్కులు చూస్తున్నట్లు సమాచారం. చిన్నారెడ్డి రూటు ఎటు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం ఓటర్లు విలక్షణ తీర్పును ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి గెలిచిన ప్రతినాయకుడు ఆయాపార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. మాజీమంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవటం లేదని స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానంటూ చిన్నారెడ్డి ప్రచారం చేసుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదు. ఈ ఎన్నిక లాస్ట్..! జిల్లా పార్టీకి నూతన అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ నియామకం పెద్దదుమారమే రేపింది. జడ్పీటీసీగాను.. రాష్ట్ర బీసీ సెల్లో పదవి అనుభవిస్తున్న వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వనపర్తిలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో హాత్‌సే హాత్ జోడో అభియాన్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. అసమ్మతి నేతలు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్లో సమావేశం కావటం కలకలం రేపింది. చిన్నారెడ్డి హాటావో...కాంగ్రేస్కు బజావో అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తే పార్టీ ఓడిపోతుందని.. ఆయనకు వ్యతిరేకంగా తామంతా పనిచేస్తామని అసమ్మతినేతలు హెచ్చరించటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే చివరిసారి అని చెప్పటం చిన్నారెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి వాదులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీటిస్తే సహకరించేదని కూడా తేల్చిచెప్పినట్టు సమాచారం. గాంధీభవన్ వద్ద నిరసన తెలిపిన నేతలు దిగ్విజయ్ సింగ్‌కు సైతం ఫిర్యాదు చేశారు. కొత్త చేతులకు ఎప్పుడు అవకాశం? వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి టికెట్ ఇవ్వాలని వనపర్తి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సీనియర్లు.. రేవంత్‌వర్గం అంటూ రచ్చకెక్కి అధిష్టానానికి తలనొప్పి తెప్పించారు. తాజాగా వనపర్తిలో ఇలాంటి ఘటనలు జరగటం హాట్ టాపిక్‌గా మారింది. తనకు వ్యతిరేకంగా గ్రూపులు కూడగడుతున్నట్టు ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు యువజన కాంగ్రెస రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మద్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీద పడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోనేత నాగం తిరపతిరెడ్డి సైతం పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాని చిన్నారెడ్డి మాత్రం తాను పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి పార్టీ గెలుస్తుందే ధీమాను కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్‌రెడ్డిని ఎదుర్కొవటం అంతా సులువు కాదని భావిస్తున్న పార్టీ నేతలకు తాజా విభేదాలు తలనొప్పిగా మారాయంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రైతులే కేసీఆర్ తోలు ఒలుస్తారు
భానుపురి/వలిగొండ/బీబీనగర్/నల్లగొండ: ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వట్టిమాటలను కట్టిపెట్టకపోతే, రైతులు సీఎం కేసీఆర్ తోలు ఒలచడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి హెచ్చరించారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచనల మేరకు చిన్నారెడ్డి, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలతో కూడిన బృందం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించింది. సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్‌ను సం దర్శించి రైతులతో మాట్లాడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుల్లగూడెం, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, నల్లగొండ మండలం ఆర్జాలబావిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది. చిన్నారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని నెలరోజులుగా కొనకుండా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి ఇప్పుడు వరి వేయొద్దనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో వరి తప్ప వేరే పంటలు పండించే పరిస్థితి లేదన్నారు. రైతులను లక్షాధికారులుగా చేస్తామని మాటలతో ఉబ్బించి ఇప్పుడు రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వమే కొనుగోలు చేసేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని హామీనిచ్చారు. వరికి కనీస మద్దతుధర రూ.1,960 చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: చిన్నారెడ్డి
సాక్షి, మీర్‌పేట: డబ్బులు పంచకపోవడం వల్లే తనకు ఓట్లు వేయలేదని, ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని సూచించారు. పట్టభద్రులు కూడా అధికార టీఆర్ఎస్కు ఓట్లు అమ్ముకోవడం తనకు బాధ కలిగిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఎంతో ఆశపడ్డారని, ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని 26 నెలలైనా నయా పైసా ఇవ్వలేదని, అయినా యువత వీటన్నింటిని మరిచి రూ.వెయ్యి, రెండు వేలకు ఆశపడి టీఆర్ఎస్కు ఓటు వేయడం బాధ కలిగించిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బు, మద్యంతో ప్రభావితం చేసి ఓటు వేయించుకుంటుందని, ఈ సంస్కృతి పోవాలన్నారు. -
మేం కూడా హిందువులమే.. ఇద్దర్నీ గెలిపించండి!
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్‌లను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. చిన్నారెడ్డి నిజాయితీ గల వ్యక్తని, వ్యవసాయ రంగంపై పీహెచ్డీ చేసిన వ్యక్తని అన్నారు. రాజకీయాలు మొత్తం కమర్షియలైన ఈ సమయంలో ఏ మాత్రం ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తని కొనియాడారు. రాములు నాయక్ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. చిన్నారెడ్డి, రాములు నాయక్‌లు నిజమైన తెలంగాణ వాదులని, ఇద్దర్నీ గెలిపించాలని ఉత్తమ్ కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ గతంలో ప్రకటించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దెబ్బకు ఈ ప్రకటన చేశారు. కానీ, ఇవ్వలేదు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా దెబ్బ కొడితే రావాల్సిన 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఇవన్నీ రావాలంటే టీఆర్ఎస్ని చిత్తు చిత్తుగా ఓడించాలి. పీఆర్సీ కూడా నివేదిక ఇచ్చింది. ఉద్యోగాల ఖాళీలు భారీగా ఉన్నాయని చెప్పింది. ( ఎమ్మెల్సీ ఎన్నికలు; వ్యూహరచనలో కాంగ్రెస్ ) 43 శాతం ఫిట్మెంట్ తగ్గితే టీఆర్ఎస్ని ఓడించండి. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తగ్గింది. అందుకే టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే విధంగా రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించండి. బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని తీసుకురావడంలో బండి సంజయ్ విఫలమయ్యారు. మేము కూడా హిందువులమే.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. భద్రాచలం రామాలయం భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది కేంద్రమే. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ని ఓడించాలి. విద్యా వ్యాపారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క పైసా పని చేయలేదు’’ అని అన్నారు. -
నల్లగొండకు రాములు.. రంగారెడ్డికి చిన్నారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. నల్లగొండ– ఖమ్మం– వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిలను నిర్ణయించినట్టు సమాచారం. నల్లగొండ స్థానానికి ఓయూ విద్యార్థి నాయకుడు కోటూరి మానవతారాయ్, రంగారెడ్డి స్థానానికి మాజీ ఎమ్మెల్యే, యువ నాయకుడు చల్లా వంశీచంద్ రెడ్డి పేర్లు కూడా అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నప్పటికీ.. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం రాములు నాయక్, చిన్నారెడ్డిల అభ్యర్థిత్వాలకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటిస్తుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం! కసరత్తు.... ఓ కొలిక్కి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేసింది. ముందుగా రెండు నెలల క్రితమే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నల్లగొండ స్థానానికి 26, రంగారెడ్డికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల వడపోత సాగుతుండగానే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ నేత చెరకు సుధాకర్‌లు నల్లగొండ స్థానంలో తమకు మద్దతివ్వాలని టీపీసీసీ నాయకత్వాన్ని విడివిడిగా కోరారు. దీంతో పొత్తులపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ జరిపిన అభిప్రాయ సేకరణలో మెజారిటీ నేతలు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండాలని కోరారు. మాణిక్యం ఠాగూర్‌తో భేటీలో ముఖ్యనాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో రెండుస్థానాల్లోనూ పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసి అభ్యర్థిత్వాలను ఓ కొలిక్కి తెచ్చిన టీపీసీసీ ఒక్కో స్థానానికి మూడు పేర్లను అధిష్టానానికి పంపింది. ఇక, ఏఐసీసీ ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడమే మిగిలింది. సామాజిక సమీకరణాలు... అనుభవం ఈ రెండు ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించేందుకు సామాజిక సమీకరణాలు, అనుభవం అనే ప్రాతిపదికలను కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నల్లగొండ– ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా రాములునాయక్‌ను కూడా ఇదే కోణంలో ఎంపిక చేసినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ఎమ్మెల్సీగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే అధికార టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. గిరిజన నేతగా, తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు ఉన్నప్పటికీ అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు పార్టీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. దీనికి తోడు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎస్టీ, అందులోనూ లంబాడీ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా రాములునాయక్ అభ్యర్థిత్వం వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపినట్టు సమాచారం. ఇక, ఈ స్థానం నుంచి పరిశీలించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ యువకుడు కావడం, ఆయన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కారణంగా తరువాత అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే టికెట్‌ను ఆశించిన విద్యార్థి నాయకుడు మానవతారాయ్ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనను పోటీ చేయించాలనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిని అనుభవం ప్రాతిపదికన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈసారి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, టి.రామ్మోహన్ రెడ్డిలు పోటీ నుంచి తప్పుకోవడం, అధిష్టానం పరిశీలనలో ఉన్న వంశీ యువకుడు కావడంతో మరోమారు అవకాశం ఇవ్వవచ్చనే ఆలోచన మేరకు ఇక్కడి నుంచి చిన్నారెడ్డి పేరు దాదా పు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆర్టీసీ కోట్లాది ఆస్తులపై కేసీఆర్ కన్ను
సాక్షి, వనపర్తి: ఆర్టీసీకి చెందిన కోట్లాది ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఆర్టీసీ వనరులను పంచిపెట్టేందుకే సంస్థలను నిర్వీర్యం చేస్తున్నా రని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక, ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు పట్టణంలోని ధర్నాచౌక్‌లో ఆందోళన చేపట్టి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆర్టీసీ చరిత్రలో ఇంత పెద్ద సమ్మె ఎప్పుడూ జరుగలేదని, ముందస్తు ప్రణాళికతో అన్ని లెక్కలు సరిచూసుకొని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేపట్టి ఆ సంస్థ ఆస్తులను తనకు కావాల్సినవారికి కట్టబెట్టు కోవడమే లక్ష్యంగా కేసీఆర్ కుట్ర పన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికులను ఆ సంస్థను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ద్రోహులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. హైకోర్టు హెచ్చరించినా వినరెందుకు? ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు పలు మార్లు ప్రభుత్వ తీరును, అధికారుల తీరును తప్పుబట్టినా తీరు మారడంలేదని చిన్నారెడ్డి విమర్శించారు. అలాగే కేంద్రంలో మోదీ సర్కార్ ఆర్థిక నిపుణులతో చర్చింకుండానే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు. మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణులు మన్మోహన్ అన్నట్లు దేశ జీడీపీ 3 శాతానికి పడిపోయిందని, మేకిన్ ఇండియా, ఇండియా స్టార్టప్ లాంటి నినాదాలతో హోరెత్తించడం తప్ప కేంద్రం చేసిందేమి లేదన్నారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు నిలువరించే యత్నంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం చిన్నారెడ్డితో పాటు పలువురుని మాత్రమే లోపలికి అనుమతించగా వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వివిధ మండలాలు నాయకులు, పట్టణ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పీవీపై వ్యాఖ్యలు.. చిన్నారెడ్డిపై హైకమాండ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత ప్రధాని పీవీ నర సింహారావులను ఉద్దేశించి ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడింది. దీనిపై తక్షణమే క్షమాపణ లు చెప్పాలని, ఏ సందర్భంలో అలా అనాల్సివచ్చిం దో వివరణ ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. బుధవారం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ’ అని విమర్శించారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ సభకు వెళ్లి, సంఘ్ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్‌కు బీజేపీ భారత రత్నతో సత్కరించిందని అన్నారు. దీనిపై పార్టీలో రాజకీయ దుమారం రేగింది. పార్టీ లోని కొందరు ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఇతర సీనియర్ నేతలతో దీనిపై చర్చించిన హైకమాండ్ పెద్దలు దీనిపై వివర ణ ఇవ్వాలని చిన్నారెడ్డికి సూచించారు. వారి ఆదేశాల మేరకు ఆయన వివరణతో కూడిన ప్రకటనను గురువారం విడుదల చేశారు. పీవీ నరసింహారావు, ప్రణ బ్ ముఖర్జీలు అంటే తనకు అపారమైన గౌరవమని, వారు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప అవకాశాలు ఇచ్చిందని చిన్నారెడ్డి అందులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ పీవీ, ప్రణబ్‌లను కాంగ్రెస్ అవమానించిందని అన డం రాజకీయమని, కాంగ్రెస్ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానని అంతే కాని పీవీ, ప్రణబ్‌లను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని, వారంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం ఉందని తెలిపారు. ఈ విషయంలో అపార్థాలు చోటు చేసుకున్నాయని తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధ పడితే అందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. -
పీవీపై అనుచిత వ్యాఖ్యలు : చిన్నారెడ్డి వివరణ
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ లు అంటే తనకు అపారమైన గౌరవమని, వాళ్ళు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు గొప్ప అవకాశాలు ఇచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. పీవీ నర్సింహారావు, ప్రణబ్ ముఖర్జీ లపై బుధవారం తాను చేసిన ప్రకటనలపై వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పివి, ప్రణబ్ లను కాంగ్రెస్ అవమానించిందని అనడం రాజకీయమని, కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానే తప్ప వాళ్ళను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. పీవీ, ప్రణబ్ అంటే ఎంతోఅభిమానం, గౌరవం ఉందని అన్నారు. తన వాఖ్యలపై కొంతకొంత అపార్థాలు చోటు చేసుకున్నాయని, ఎవరైనా బాధ పడితే చింతిస్తున్నానని అన్నారు. పివి, ప్రణబ్ లు ఎప్పటికైనా కాంగ్రెస్ గౌరవించే నేతలని ఆయన వివరణ ఇచ్చారు. (చదవండి : పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు) కాగా బుధవారం చిన్నారెడ్డి పీపీ, ప్రణబ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి చేసిన సోనియా గాంధీని, ఆమె అనుచరులను పీవీ అణగదొక్కారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి పీవీ అని విమర్శించారు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. -
పీవీ, ప్రణబ్‌పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలపై ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ అని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు మానుకొని హైదరాబాద్‌లో కూర్చున్న పీవీని సోనియాగాంధీ పిలిచి ప్రధానిని చేశారన్న చిన్నారెడ్డి.. ఇంత గౌరవం ఇచ్చినప్పటికీ పీవీ పార్టీని భ్రష్టు పట్టించారని దుయ్య బట్టారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ పీవీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఆయన మాత్రం గద్దెనెక్కిన తర్వాత సోనియా సహా సీనియర్లను అణగదొక్కే ప్రయత్నం చేశారు. ప్రధాని పదవికి మరోనేత పోటీగా తయారవుతారనే ఆయన అలా వ్యవహరించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సహకరించి పీవీ మరో ఘోరతప్పిదం చేశారు. దీంతో అప్పటివరకు కాంగ్రెస్‌ను లౌకిక పార్టీగా విశ్వసించిన మైనారిటీలు పార్టీకి దూరమయ్యారు. దీంతో పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతోనే గాంధీ కుటుంబం ఆయన్ను పక్కనబెట్టింది. కేవలం బాబ్రీని కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొడుగుతున్నారు’అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రణబ్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దే అన్నారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ సభకు వెళ్లి, సంఘ్ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్‌కు బీజేపీ భారతరత్నతో సత్కరించిందన్నారు. అది కూడా ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ముఖ్తో కలిపి ఇచ్చారని చిన్నారెడ్డి గుర్తుచేశారు. ఆరెస్సెస్ భావజాలం ఉన్న వాళ్లనే బీజేపీ దగ్గరకి తీస్తోందని, దేశమంతా ఆ భావజాలాన్ని నింపాలనే లక్ష్యంతోనే ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరెస్సెస్‌కు అనుకూలంగా లేనందుకే బీజేపీ ఆయన్ను పొగడదని చిన్నారెడ్డి అన్నారు. మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇస్తోందని, పార్టీ ప్రధాన కార్యక్రమాలన్నింటిలో ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అప్పులకుప్ప మిగులు బడ్జెట్‌తో ఉన్నామని చెబుతున్నప్పటికీ.. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణకు 1.8లక్షల కోట్ల రూపాయల అప్పున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పిందన్నారు. ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో కేసీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ద్వారా నీరందించేందుకు ఎకరాకు రూ.75వేల ఖర్చు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం ఇప్పటికే రూ.50 వేల కోట్లు దాటిందని ఆయన తెలిపారు. వీటన్నింటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పీవీపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అనుచరులను పీపీ అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి పీవీ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లను పీపీ తొక్కేశాడని ఆరోపించారు. బాబ్రీ మసీదును కూల్చి పీవీ పెద్ద తప్పు చేశాడని, దాని వల్ల కాంగ్రెస్‌కు ముస్లింలు దూరమయ్యారన్నారు. అందుకే పీవీని గాంధీ కుటుంబం పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. ‘రాజకీయాలను మానుకొని హైదరాబాద్‌కు వచ్చిన పీవీని సోనియా గాంధీ పిలిచి ప్రధానిని చేశారు. కానీ పీవీ మాత్రం గాంధీ కుటుంబాన్నే అణగదొక్కే ప్రయత్నం చేశారు. గాంధీ కుటుంబం వాళ్లు వస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అందరిని తొక్కేశారు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టింది. బాబ్రీ మసీదు కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొగుడుతున్నారు’ అని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రణబ్ కూడా పీవీలాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌పై కూడా చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. ప్రణబ్‌ను కాంగ్రెస్ పార్టీయే దేశానికి రాష్ట్రపతి చేసిందన్నారు. బీజేపికి ప్రయోజనాలు చేకూర్చారు కాబట్టే ఆ పార్టీ నేతలు పీవీ, ప్రణబ్‌లను పొగుడుతున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు కాబట్టే బీజేపీ ఆయనను పొగడడం లేదని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల అప్పు ఉందని పార్లమెంటులో ప్రకటించారన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్షా పదివేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. -
పాలమూరు రైతులపై కేసీఆర్ సవతి ప్రేమ!
సాక్షి, నాగర్ కర్నూలు : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. ప్రభుత్వం తమకు న్యాయమైన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన ఆందోళన మంగళవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేటలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ప్రభుత్వం ఏవిధమైన పరిహారం ఇచ్చిందో.. అదేమొత్తంలో పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని, వెంటనే భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే.. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఉద్యమిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాపైన అమితమైన ప్రేమను చూపుతూ.. పాలమూరు జిల్లా రైతన్నలపై సవతి తల్లి ప్రేమ ఎలా చూపిస్తారని మండిపడ్డారు. -
‘కేసీఆర్‌ను గెలిపిస్తే రాష్ట్రం నాశనమే’
సాక్షి, పెద్దమందడి: ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేసి కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం నాశనం అవుతుందని వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమాయపల్లి, పామిరెడ్డిపల్లి, ముందరితండా, చీకర్చెట్టుతండా వీరాయపల్లి, చిన్నమందడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దొడగుంటపల్లిలో ఆయన మాట్లాడుతూ సాగునీరు తెచ్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హ యాంలోనే కాల్వలను తవ్వామని, అపట్లో రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఖిల్లాగఘనపురం, బుద్దారం, పెద్దమందడి మండలాల్లో 27 వేల ఎకరాల కు సాగునీరు అందించేందుకు కృషిచేశామన్నారు. నీళ్లు తెచ్చింది నిరంజన్‌రెడ్డి కాదు.. చిన్నారెడ్డి అని గుర్తించుకోవాలన్నారు. అనంతరం మాసిరెడ్డి, వడ్డె సింగోటంతోపాటు యువకులు చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వేణుగోపాల్, రమేష్‌గౌడ్, నాయకులు వెంకటస్వామి, సత్యారెడ్డి, ఉసేనయ్య, సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నరసింహరెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి: మహాకూటమి అభ్యర్థి చిన్నారెడ్డి గురువారం నియోజకవర్గంలోని పెద్దమందడి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలను కలిసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బలిజపల్లి, పామిరెడ్డిపల్లి, వీరాయపల్లి, పెద్దమందడి గ్రామాలతోపాటు తండాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తిరుపతయ్య, వెంకటయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెబ్బేరు: కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి ఆధ్వర్యంలో మహాకూటమి నాయకులు పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి పనులు జరగడంతోపాటు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు రాణిరాంద్ర, పీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మానస, సీపీఐ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, శ్రీనివాస్‌గౌడ్, విజయవర్ధన్‌రెడ్డి, కృష్ణకుమార్‌రెడ్డి, రంజిత్, రాములు యాదవ్, అంజి, షకీల్, నిజాం, చిట్టిబాబు, సర్వేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
రంగస్థలం రెడీ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల రణరంగం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు సైతం ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇలా దాదాపు అన్ని చోట్ల కూడా రెబెల్స్ బెడద తప్పేలా లేదు. అలాగే మహాకూటమి పొత్తులో భాగంగా కేటాయించిన స్థానాల్లో సైతం స్నేహపూర్వక పోటీతో బరిలో నిలుస్తుండడంతో ఆసక్తి నెలకొంది. అంతేకాక ఎన్నికల పోరులో హేమాహేమీలు, దాదాపు అన్ని పార్టీల నుంచి అందరూ పాత కాపులే బరిలోకి దిగడంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. మొత్తం మీద ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయనే చెప్పాలి. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెబెల్స్‌తో ఉక్కిరిబిక్కిరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబెల్స్ బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చాలాచోట్ల టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు సైతం బరిలోకి దిగారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ రెబెల్‌గా మక్తల్ నియోజకవర్గం నుంచి ఎం.జలందర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఒక్క స్థానం మినహా ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు పెద్దగా రెబెల్స్ బెడద లేదు. అయితే మహాకూటమి నుంచి మాత్రం చాలా చోట్ల రెబెల్స్ బెడద పట్టి పీడిస్తోంది. ఒక్క మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శలు మారేపల్లి సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి సయ్యద్ ఇబ్రహీం బీఎస్పీ నుంచి నామినేషన్లు వేశారు. అలాగే తెలంగాణ ఇంటి పార్టీనేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. వీరితో పాటు మహాకూటమిలో భాగస్వామ్యమైన తెలంగాణ జన సమితి నుంచి జి.రాజేందర్‌రెడ్డి పార్టీ బీ–ఫాంతో మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా నారాయణపేటలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన కుంభం శివకుమార్‌రెడ్డి... రూటు మార్చి బీఎల్ఎఫ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దేవరకద్రలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన న్యాయవాది జి.మధుసూదర్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇలా మొత్తం మీద రెబెల్స్ అభ్యర్థులు ప్రధాన పోటీదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. - మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యనేతలందరూ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మహాకూటమి తరఫున మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్రశేఖర్, టీజేఎస్ నుంచి జి.రాజేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు టిక్కెట్ ఆశించి భంగపడిన వారిలో టీపీసీసీ కార్యదర్శులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, సయ్యద్ ఇబ్రహీం సైతం పోరులో నిలుస్తున్నారు. సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి, పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలవుతున్న సయ్యద్ ఇబ్రహీం బీఎస్పీ బీ–ఫాం తెచ్చుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరితో పాటు బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి కూడా పోటీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా అందరూ హేమాహేమీలు బరిలో నిలవడంతో మహబూబ్‌నగర్ అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. - జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే మల్లు రవి మధ్య పోరు ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు బీజేపీ తరఫున మధుసూదన్‌యాదవ్ తదితరులతో పాటు స్వతంత్రులు బరిలో ఉన్నారు. అయితే, ఇక్కడ రెబెల్స్ బెడద లేకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డికి సౌమ్యుడిగా మంచి పేరు ఉండటంతో విపక్ష పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని చెబుతున్నారు. - దేవరకద్ర నియోజకవర్గంలో పోరు కాస్త హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. అయితే మహాకూటమి నుంచి కాంగ్రెస్ నేత డోకూరు పవన్‌కుమార్‌కు టిక్కెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో కూడా ఇద్దరు తలపడటం... ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో కేడర్‌కు అందుబాటులో ఉండటంతో పవన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి భంగపడిన హైకోర్టు న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో దేవరకద్రలో సైతం పోరు ఆసక్తికరంగా మారింది. - మక్తల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు రెబెల్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు. అయితే చిట్టెం అభ్యర్థిత్వంపై తిరుగుబాటు చేసిన టీఆర్ఎస్ నేతలు... రెబెల్‌గా ఎం.జలందర్‌రెడ్డిని బరిలో నిలిపారు. అలాగే మహాకూటమి తరఫున టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ తరఫున కూడా బలమైన నేత కొండయ్య బరిలో ఉన్నారు. ఇలా మొత్తం మీద మక్తల్ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. - నారాయణపేట నియోజవర్గంలో ఎన్నికల పోరు కొత్త రూపం సంతరించుకుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన కుంభం శివకుమార్‌రెడ్డి బీఎల్ఎఫ్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి టీఆర్ఎస్ తరఫున మరోసారి బరిలో నిలిచారు. వీరితో పాటు కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన సరాఫ్ కృష్ణ సైతం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే నియోజకవర్గంలో కాస్త బలంగా ఉన్న బీజేపీ తరఫున కె.రతంగ్‌పాండు రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తం మీద పేట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొన్నట్లయింది. - రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కొడంగల్ పోరు సైతం ఉత్కంఠ భరితంగా మారింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ఎనుముల రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తంగా మారింది. ఇరువురు నేతలు నిత్యం బలప్రదర్శనతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. అలాగే బీజేపీ తరఫున సీనియర్‌నేత నాగూరావ్ నామాజీ పోటీ చేస్తున్నారు. - నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉద్దండులు తలపడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బరిలో నిలిచారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి అత్యంత సీనియర్‌నేత నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో పోరు రసవత్తరంగా మారింది. అలాగే బీజేపీ తరఫున దిలీప్ ఆచారి కూడా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. - కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పోరు రణరంగాన్ని తలపిస్తోంది. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన జూపల్లి కృష్ణారావుకు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతీసారి జూపల్లికి తన ఎన్నికల ప్రత్యర్థి మారుతుండటంతో సులువుగా గెలుపొందే వారు. కానీ ఈసారి మాత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తే.. మళ్లీ బరిలోకి దిగడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీ తరఫున ఎల్లేటి సుధాకర్‌రావు కూడా కాస్త ప్రభావం చూపుతారని తెలుస్తోంది. - అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మరోసారి బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మల్లేశ్వర్ ఇలా ఇతర పక్షాల నేతలు బరిలో నిలిచినప్పటికీ పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉండనుంది. ఇక్కడి నుంచి గెలుపొందే అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందనే సెంటిమెంట్ ఉండటంతో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. - రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ పోరు కూడా త్రిముఖంగా మారింది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి టి.ఆచారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృషిచేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కాంగ్రెస్ తరఫున చల్లా వంశీచంద్‌రెడ్డి బరిలో ఉన్నారు. - వనపర్తి నియోజకవర్గం నుంచి ఈసారి ఉద్దండులు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండగా.. ఈసారి మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈసారి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో పోరు ఆసక్తికరంగా మారింది. - అలంపూర్ నియోజకవర్గంలో కూడా రెండు పార్టీల మధ్య పోరు నువ్వా – నేనా అన్నట్లుగా మారింది. కాంగ్రెస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే అబ్రహం పోటీలో ఉన్నారు. ఇరువురు కూడా గట్టిగా తలపడుతుండడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. - రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాలలో గద్వాల ఒకటి. ఇక్క డి నుంచి మాజీ మంత్రి డీకే.అరుణ కాంగ్రెస్ తర ఫునే పోటీలో ఉండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఇప్పటికే మూడు సార్లు వరుసగా విజయం సాధిస్తున్న డీకే అరుణ... మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూసిన టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి తలపడేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా మొత్తం మీద గద్వాల్ నియోజకవర్గం పోరు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
నాటి శత్రువులే.. నేటి మిత్రులు
సాక్షి, వనపర్తి / ఆత్మకూరు : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఈ చిత్రాలను ఉదాహరణగా చెప్పొచ్చు. అమరచింత నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కె.వీరారెడ్డి, టీడీపీ నుంచి కె.దయాకర్‌రెడ్డి పోటీ పడగా వీరారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరే బరిలోకి దిగగా వీరారెడ్డిపై దయాకర్‌రెడ్డి గెలుపొందారు. అలా ప్రత్యర్థులు ఉన్న వీరిద్దరు ఇప్పుడు మహాకూటమి ఏర్పాటుతో ఒక్కటయ్యారు. ఈ మేరకు మక్తల్ నుంచి మహాకూటమి తరఫున కె.దయాకర్‌రెడ్డి బరిలో ఉండగా.. ఆత్మకూరులో శనివారం జరిగిన మహాకూటమి పార్టీల్లోని కార్యకర్తల సమావేశంలో వేదికపై పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఇక మరో ఫొటోలో ఉన్న ఇద్దరు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి బాల్యమిత్రులు! అయితే, దశాబ్దాల కాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా టీడీపీ, కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వీరిలో రావుల 1994 ఎన్నికల్లో చిన్నారెడ్డిపై విజయం సాధించగా.. 1999 ఎన్నికల్లో చిన్నారెడ్డి రావులపై గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల్లో మళ్లీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి చిన్నారెడ్డిపై గెలిచారు. ఇప్పుడు మహాకూటమిలో టీడీపీ, కాంగ్రెస్ భాగస్వామ్యం కావడంతో శనివారం జరిగిన చిన్నారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి, ఆ తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశానికి రావుల హాజరై వేదికపై చిన్నారెడ్డితో పలు అంశాలపై చర్చించండి కనిపించింది. వనపర్తిలో జరిగిన సమావేశంలో వేదికపై మిత్రులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి ఆత్మకూరు సమావేశంలో మాట్లాడుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు వీరారెడ్డి, కె.దయాకర్‌రెడ్డి -
కూటమిదే గెలుపు
సాక్షి వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలకు కలిపి సుమారు 1.05 లక్షల ఓటు బ్యాంకు ఉందని అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల పైచిలుకు మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. రావుల వనపర్తి సీటు కావాలని అడిగితే ఇవ్వడానికి తాను సిద్ధంగానే ఉన్నానని, సిట్టింగ్ స్థానం కావడంతోనే కాంగ్రెస్‌కు కేటాయించారని వివరించారు. శనివారం నామినేషన్ వేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి తన బాల్యమిత్రుడని, తరువాత వేర్వేరు పార్టీల్లో కొనసాగినా ఏనాడూ విద్వేషాలు రగిలించలేదని, వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు. మీరిద్దరు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తే ఓటమి ఎరుగని నేతలుగా కొనసాగుతారని అధికారులు, ప్రజాప్రతినిధులు అంటుంటారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ 9నెలల ముందుగా ఎన్నికలకు వె ళ్లడం ద్వారా ప్రజలపై రూ.4వేలకోట్ల అదనపు భారం పడిందని తెలిపారు. కేసీఆర్ దయతో నా మినేటెడ్ పోస్టు తెచ్చుకున్న నాయకుడు నాలుగేళ్ల పాటు నిరంకుశపాలన కొనసాగించారని, ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, వనపర్తి ప్రజలమీద ఉన్న గౌరవంతో ఓర్చుకున్నామని వెల్లడించారు. డాక్టర్ బాలకిష్టయ్య, అయ్యప్ప, రావులతో పాటు తాను ప్రజల్లో ఒకరిగా కలిసిపోయామని, కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని చెప్పారు. అన్ని సీట్లూ మావే: నాగం కాంగ్రెస్, టీడీపీతో పొత్తేమిటని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు విమర్శిస్తున్నారని, 2009 ఎన్నికల్లో టీ డీపీతోనే మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ గెలిచారని మాజీ మంత్రి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగం జనార్ధన్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగా ణ బిల్లు పార్లమెంట్లో పాసైనప్పుడు 272 మంది ఎంపీలు ఓటు వేశారని కేసీఆర్ ఆ సమయంలో పార్లమెంట్లో లేరని, ఓటు వేయకుండా తప్పించుకున్నారని విమర్శించారు. 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం, సోనియాగాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 2014 ఎన్ని కల సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, మిషన్ భగీరథ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో అధికారంలోకి వ చ్చిన కేసీఆర్ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలోనూ కూటమి అ భ్యర్థులే గెలుస్తారని నాగం ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గ బాగుకోసమే ఇద్దరం కలిశాం: రావుల వనపర్తి నియోజవర్గం అభివృద్ధి కోసమే చిన్నారెడ్డి, తాను ఇద్దరం కలిశామని, రాష్ట్రంలోనూ ప్ర జాస్వామ్యానికి ముప్పు పొంచి ఉండటంతోనే కాం గ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో కలిసి తె లంగాణ ప్రజాకూటమిగా ఏర్పడ్డామని టీడీపీ పొ లిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. తామిద్దరం పదో తరగతి వరకు ఇక్కడే చదువుకుని పాలిటెక్నిక్ కళా శాల మైదానంలో ఆటలాడుకునే వాళ్లమని, త ర్వాత ఇద్దరం చెరో రాజకీయపార్టీలో చేరి సి ద్ధాం తపరంగా విభేదించుకున్నామే తప్ప ఏనాడూ వ్య క్తిగత విమర్శలు, గొడవలకు దిగలేదని గుర్తుచేశా రు. వనపర్తి అభివృద్ధికి ఎంతో కృషిచేశామని చె ప్పారు. ఇటీవల ఈ ప్రాంతానికి ఉన్న మంచిపేరు చెడిపోయే ప్రమాదం ఉండటంతో ఇద్దరం కలిసి మీ ముందుకు వస్తున్నామని ప్రజలకు వివరించా రు. చిన్నారెడ్డితో కలిసి ప్రతి మండలానికి ప్రచారానికి వస్తానని, గెలుపునకు కృషియాలని కోరారు. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దుచేసిన సమయం లో సీఎం కేసీఆర్ 100 సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రాబోతున్నామని అనడం చూస్తే ఆయ నకు ఓటమి భయం పట్టుకుందని అర్థమవుతుందన్నారు.కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ గెలిస్తే..నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్..
సాక్షి, ఖిల్లాఘనపురం: డిసెంబర్ 11 తరువాత నీళ్ల నిరంజన్‌రెడ్డి.. కన్నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతా సిద్ధం చేసిన తరువాత వచ్చి నీళ్లు తెచ్చానని, నీళ్ల నిరంజన్‌రెడ్డి గా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. నిరంజన్‌రెడ్డి గెలిస్తే జీఎస్టీ తరహాలో ఎన్ఎస్టీ (నిరంజన్‌రెడ్డి సర్వీస్ ట్యాక్స్) వేస్తారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు రోజు రాత్రి రూ.12 కోట్ల అవినీతి సొమ్ముతో 29 కిలోల బంగారం కొన్న అవినీతి పరుడా వనపర్తిలో గెలిచేది? అని నిలదీశారు. ఇప్పటివరకు వనపర్తి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా తాను, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రజలకు సేవ చేశామన్నారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి కృష్ణుడిగా, తాను అర్జునుడిగా ఎన్నికల యుద్ధంలో దిగుతున్నామని చిన్నారెడ్డి అభివర్ణించుకుంటూ ఎన్నికల బరిలో తమను తట్టుకునేవారు ఉండబోరని చెప్పారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరిస్తాన్న వారు కొత్తగా 12వేల ఎకరాలకే ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్‌విండో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ నిరంజన్‌రెడ్డికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చూపుతామని ప్రతినబూనారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, శివసేనారెడ్డి, నాగం తిరుపతిరెడ్డి, సతీష్, డాక్టర్ నరేందర్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, కొండారెడ్డి, కృష్ణయ్యయాదవ్, బాల్‌రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తుంది’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తుందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. భూ ప్రక్షాళన తర్వాత 9లక్షల తప్పులు దొర్లినట్లు సీఎం చెప్పారని, భూ ప్రక్షాళన పరిస్థితి.. కొండనాలుకకు మందేస్తే! ఉన్న నాలుక ఊడిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూ ప్రక్షాళన తప్పుల వల్ల చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, రైతు బంధు పథకం కంటే! మద్దతు ధర రైతులకు చాలా మేలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతు ధరతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం పేరు మార్చమంటే.. ఈ సర్కారుకు మనసు రావటంలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటక మాదిరిగా తెలంగాణలో కూడా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన దాన్ని చూసి ఇవాళ టీఆర్ఎస్ ప్రకటించిందని తెలిపారు. కేసీఆర్ స్వయంగా సొంత నిర్ణయాలు తీసుకుని మేనిఫెస్టో ప్రకటించారని అన్నారు. -
ఆర్టీసీని మూసేస్తాననడం సరైంది కాదు
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులను భయపెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నాడని, ఆర్టీసీని మూసేస్తానని సీఎం చెప్పడం సరైనది కాదని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. దాదాపు 50 వేలకు పైగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను విస్మరించడం దారుణమన్నారు. ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి సీఎం కేసీఆర్ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ఆర్టీసీ అధికారుల వల్ల ఆర్టీసీ నష్టల్లో లేదని, ప్రభుత్వ విధానాల వల్లే నష్టాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కానీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృసి చేయడం లేదని మండిపడ్డారు. డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని హితవు పలికారు. ప్రైవేటు బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు మాట్లాడుతూ..‘ ఉద్యోగాలు తీసేస్తామని కేసీఆర్, ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓట్ల కోసం అడగకపోయినా కుల సంఘాలకు రూ.5 కోట్లు, 5 ఎకరాలు కేటాయిస్తున్నారు. న్యాయంగా రావాల్సిన జీతాలు అడిగితే ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ భయపెడుతున్నారు. రోడ్లపైన కూడా ప్రజలకు అన్యాయంగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది కలిగే పనులను ప్రభుత్వం మానుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పీసీసీ ఆలోచిస్తుంది. ఈ నెల 11న రాహుల్ గాంధీ సమక్షంలో జాతీయ ఓబీసీ కమిటీ మీటింగ్ ఉంది. 2019 ఎన్నికల్లో కలసి ఉంటే కలదు సుఖం అనే నినాదంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద’ని అన్నారు. -
అందుకే ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టారు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానమున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ముఖం చూయించలేకే ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ బలంతోనే కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ..కేసీఆర్ బెంగుళూరలో బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా థర్డ్‌ప్రంట్ కడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ తొత్తుగా కేసీఆర్ పని చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా భిక్ష వల్లే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం అయ్యారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నారని, ఇది రైతు బంధు పథకం కాదు..ఓట్ల బంధు పథకం అని ఎద్దేవా చేశారు. గిట్టుబాటుధర కల్పిస్తే ఇప్పుడు ఇచ్చే రైతు పెట్టుబడి పథకం కంటే ఎక్కువగా డబ్బులు వస్తాయని తెలియజేశారు. మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకు కూడా స్పందించలేదని, రైతు బంధు పథకమని నమ్మి ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పట్టించుకోడని చెప్పారు. -
రేవంత్ రెడ్డిని చూస్తే ఆయన గుర్తుకొస్తున్నాడు
వనపర్తి జిల్లా : కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై వనపర్తి ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే..తనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తున్నారని మాజీ మంత్రి, వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చినపుడు ప్రజలు ఆయనను చూసేందుకు వెంట పరిగేత్తేవారని వ్యాఖ్యానించారు. ఇపుడు రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వచ్చినా అలాంటి దృశ్యమే కనిపిస్తోందని చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింహగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా రేవంత్ రెడ్డి హజరయ్యారు. ముందుగా ద్విచక్ర వాహనాలతో వనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చిన్నారెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు అకస్మాత్తుగా ఢిల్లీపై ప్రేమ పుట్టిందన్నారు. ఎన్నికలు ఎపుడొచ్చినా వనపర్తిలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం గెలవలేడన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఉంటే..తన లాంటి నాయకుడికి తిరుగే ఉండదని వ్యాఖ్యానించారు. మా పార్టీ నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేరమని బలవంతంగా భయపెట్టి ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి లుచ్చా రాజకీయం తాము చేయమన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడిని ప్రధాన మంత్రి కానిద్దామా..తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గెలిపిద్దామా అని సూటిగా అడిగారు. నీళ్లిచ్చామని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెబుతున్నారని, కానీ వాళ్లు ఎన్ని నీళ్లిచ్చినా ఆ నీళ్లలో కనిపించేది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మేనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉంటే వృధా అయిపోయేదని అన్నారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేసిన కేసీఆర్‌తోనే మళ్లీ ఇపుడు పొత్తుపెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రేస్ పార్టీలో చేరాతానంటే..కొంత మంది మా నాయకులు వద్దన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి ఇంత ఊపు వచ్చిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేరకపోయుంటే కాంగ్రేస్ పార్టీకి ఇంత బలం ఉండేది కాదేమోనని జోస్యం చెప్పారు. రేవంత్ రాష్ట్ర, దేశ రాజకీయాలను ఉతికారేస్తాడని అన్నారు. రేవంత్ రాక సందర్భంగా వచ్చిన జనాన్ని చూసి తనకే ఆశ్చర్యమేస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2019లో రాహుల్ గాందీ ప్రధాన మంత్రి అవుతాడని, గత ఎన్నికల్లో తనపై పోటి చేసిన టీఆర్ఎస్ నాయకుడు నిరంజన్ రెడ్డి మళ్లీ తనపై గెలవలేడని వ్యాఖ్యానించారు. -
నాగం చేరితే కాంగ్రెస్‌కు లాభమే
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ప్రయోజనమే కలుగుతుందని, ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో చిన్నారెడ్డి, మరో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడారు. నాగం జనార్దన్‌రెడ్డి జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోనూ ప్రభావం చూపించే నాయకుడని చిన్నారెడ్డి అన్నారు. నాగం లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానించాల్సిందేనన్నారు. జైపాల్‌రెడ్డి, నాగంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు పనిచేయాలని కోరారు. వనపర్తికి చెందిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తన కంటే రావుల బలమైన అభ్యర్థి అని భావిస్తే వనపర్తి సీటును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రావుల కాంగ్రెస్‌లోకి వస్తే దేవరకద్రలో అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేతలెవరూ నాగం చేరికను వ్యతిరేకించడంలేదని వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరినవారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తా..
మహబూబ్ నగర్ జిల్లా : బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నాగం జనార్దన్ రెడ్డి లాంటి బలమైన నాయకుల అవసరం కాంగ్రెస్‌కు ఎంతైనా ఉందన్నారు. నాగం జనార్దన్ రెడ్డి, జైపాల్ రెడ్డిలపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లోని వచ్చినా తాను ఆహ్వానిస్తానని తెలిపారు. రావుల తనకంటే బలమైన అభ్యర్థి అని భావిస్తే తన సీటును కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. రావుల కాంగ్రెస్‌లోకి వస్తే దేవరకద్రలో అవకాశం ఉంటుందని, పవన్‌కుమార్ రెడ్డి కంటే రావుల బలమైన అభ్యర్థి అవుతాడని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటే స్వాగతిస్తామన్నారు. నాగం చేరికను కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నేతలెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. కేవలం ఇతర పార్టీలు మారి కాంగ్రెస్‌లో చేరినవారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
అవి టీఆర్ఎస్ గ్రామ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అవి రైతు సమన్వయ సమితులు కావని, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలని ఎద్దేవా చేశాయి. ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి టీఆర్ఎస్ పోలింగ్ బూత్ కమిటీలను వేసుకుంటున్నారని ఆరోపించాయి. సోమవారం శాసనసభలో రైతు సమన్వయ సమితులపై జరిగిన లఘుచర్చలో జి. చిన్నారెడ్డి (కాంగ్రెస్), కౌసర్ మొయినుద్దీన్ (ఎంఐఎం), ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (బీజేపీ), సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ), సున్నం రాజయ్య (సీపీఎం) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే హోదాలో వెళ్తే గెంటేశారు?: జి.చిన్నారెడ్డి ‘రైతు సమన్వయ సమితులను ఎమ్మెల్యేల ద్వారా వేస్తామన్నారు. పేర్లు ఇవ్వాలా అని అడిగితే కలెక్టర్లు ఇవ్వమన్నారు. మా జాబితాలు పంపించాం. కమిటీలు పూర్తయిన తర్వాత అవగాహన సదస్సులకు వెళ్తే మేం ఇచ్చిన పేర్ల వాళ్లు ఎవరూ అక్కడ లేరు. ఎమ్మెల్యే హోదాలో వెళ్లిన మమ్మల్ని అక్కడి నుంచి పోలీసులతో గెంటి వేయించారు. ఇదేనా తెలంగాణ ప్రజాస్వామ్యం? సమితులపై కలెక్టర్లను అడిగితే జాబితాలను జిల్లా మంత్రులకు పంపించామని చెప్పారు. జిల్లా వ్యవసాయధికారులు, కలెక్టర్లు సంతకాలు పెట్టలేదు. కొన్ని చోట్ల కలెక్టర్లు సంతకాలు పెట్టేందుకు నిరాకరిస్తే నేరుగా ముఖ్య కార్యదర్శి చేత ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నారు. పోస్టల్ శాఖలో పనిచేస్తున్నవారు, గజం భూమి లేని వారు, హైదరాబాద్‌లో స్థిరపడ్డవాళ్లు, పందులు కాసే వాళ్లను ఆ సమితుల్లో వేశారు. వీళ్లా రైతులకు మార్గదర్శనం చేసేది. ఇవి రైతు సమన్వయ సమితులు కావు. టీఆర్ఎస్ గ్రామకమిటీలు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కమిటీలు వేసుకునే రీతిలో ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. అయినా నాలుగేండ్లు నిద్రపోయి ఇప్పుడు ఎకరానికి రూ.8 వేలు ఇస్తరా? ఇది రైతులను ఓటర్లుగా చూడడం కాదా? అయినా మీరు ఇచ్చిన రుణమాఫీని చూసిన రైతులు ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తారంటే నమ్మడం లేదు.’ కౌలుదారులకు ఇస్తారా ‘ప్రభుత్వం ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయం ఇవ్వడం మంచిదే. అయితే, ఆ పైసలు పట్టాదారులకిస్తారా? కౌలు చేసుకున్న వారికి కూడా ఇస్తారా? ప్రభుత్వ భూముల్లో చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు కూడా ఆ సాయం ఇస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలి.’ – కౌసర్ మొయినుద్దీన్ అనేక తప్పిదాలు జరిగాయి ‘రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో అనేక తప్పిదాలు జరి గాయి. వీరి ద్వారానే మొత్తం జరుగుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. వీళ్లు రైతుల పాస్‌పుస్తకాలు, టైటిల్డీడ్ల విష యంలో కూడా వేలు పెడుతున్నారు. అసలు వీరి అధి కారాలేంటి? అవి రైతు సమన్వయ సమితులా? టీఆర్ఎస్ పోలింగ్ బూత్ కమి టీలా? రాజకీయం చేస్తే రైతాంగం క్షమించదు. రైతు రుణమాఫీ కింద వడ్డీని కూడా కడతామన్నారు. ఒక్కరికయినా కట్టారా?’ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి ‘రైతుల కోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక ప్రభుత్వ సంస్థలున్నాయి. అధికార యంత్రాంగం ఉంది. స్థానిక సంస్థలున్నా యి. ఇవన్నీ ఉండగా మళ్లీ ఈ సమితులు ఎందుకు? రాజకీయంగా వీటి వల్ల గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. ముందు కల్తీ విత్తనాలు, పురుగు మందుల నియంత్రణకు చర్యలు తీసుకోండి. ఖమ్మం జిల్లాలో 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో 20,848 మంది రైతులకు రూ.101 కోట్ల రుణమాఫీ చేయండి.’ – సండ్ర వెంకటవీరయ్య 45 శాతం కౌలుదారులే ‘రాష్ట్రంలో 1.13 కోట్ల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుంటే అందులో 45 శాతం కౌలుదారులే. కౌలుదారు చట్టాన్ని అమలు చేసి వారికి అన్ని హక్కులు కల్పించాలి. రైతు సమన్వయ సమితుల్లో రైతులనే పెట్టాలి తప్ప రాజకీయ నిరుద్యోగులను కాదు. అవి రాజ్యాంగేతర శక్తులుగా మారకూడదు.’ – సున్నం రాజయ్య -
చిన్నారెడ్డిపై దాడి తగదు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పై పెబ్బేరులో టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దాడులతో ప్రజా పోరాటాలను అడ్డుకోవాలని చూస్తే ఉద్యమాలు మరింత ఉదృతమవుతాయంటూ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక 39 జీవో పైన ఉద్యమం చేయడం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతని పేర్కొన్నారు. చిన్నారెడ్డి పైన నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు దాడులు చేయడం ఇది రెండో సారి అని వెల్లడించారు. ఇలాగే దాడులు చేసి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తే ప్రతిఘటిస్తామని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటాలు ఆగవని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూనే ఉంటామని తెలిపారు