Controversy
-
బికినీలో మోడల్ ర్యాంప్ వాక్.. మండిపడుతున్న నెటిజన్లు
పాకిస్తానీ మోడల్ రోమా మైఖేల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీలో భాగంగా బికినీలో ర్యాంప్ వాక్ చేయడంతో ఆమెకు ఈ పరిస్థితి తలెత్తింది. అంతేగాదు ఆమె బికినీలో ర్యాంప్ వాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఆమె ఆ వీడియోని తన ఖాతా నుంచి తొలగించక తప్పలేదు. ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో రోమా పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించడంతోనే ఇంతలా వ్యతిరేకత ఎదురయ్యింది. పాకిస్తాన్లో మహిళలు ధరించే దుస్తుల విషయమై కొన్ని కఠిన నియమాలు ఉంటాయి. అందులోనూ రోమా బికినీ ధరించి ర్యాంప్‌వాక్ చేయడమే గాక తాను పాకిస్తానీని ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఊపందుకున్నాయి.రోమా మైఖేల్ ఎవరు?లాహోర్‌కు చెందిన రోమా మైఖేల్ దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఒక ప్రొఫెషనల్ మోడల్‌గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్లు, ప్రసిద్ధ బ్రాండ్లతో కూడా పనిచేస్తుందామె. అంతేగాదు రోమా కేన్స్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ షోతో సహా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇన్‌స్టాలో రోమాకు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో దాదాపు 69 మంది అందాల భామలు పాల్గొన్నారు. అక్టోబర్ 25న ఫైనల్ ఈవెంట్ జరుగనుంది. అప్పుడే టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. అందులో భాగంగా వారందరికీ వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పాకిస్తానీ మోడల్ రోమా (Roma Michael) బికినీలో ర్యాంప్ వాక్ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమె వస్త్రాధారణను తప్పపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించారు. కానీ అప్పటికే ఈ వీడియో పలు ఖాతాల్లో షేర్ కావడంతో ఆ పోస్టును తొలగించినా ఆమెపై కామెంట్ల వెల్లువ ఆగడం లేదు. View this post on Instagram A post shared by Roma Michael Official (@romamichael78) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
మరో వివాదంలో కౌశిక్‌రెడ్డి.. యాదాద్రి గుడిలో రీల్స్
యాదాద్రిభువనగిరిజిల్లా,సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్‌రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. ఆలయంలో సెల్ ఫోన్లు,కెమెరాలు నిషేదం ఉండగా కౌశిక్‌రెడ్డి ఏకంగా రీల్స్ చేయడం దుమారానికి కారణమైంది.భాస్కర్ రావు ఆలయ ఈవోగా వచ్చాక రాజకీయ నాయకులను చూసి చూడమట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఏకంగా లడ్డూ కౌంటర్‌లోపలికి ఓ ఎమ్మెల్యే అనుచరులు ప్రవేశించారన్న ఆరోపణలున్నాయి.ఈ వ్యవహారంలో తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అంతకు ముందు కొండపైనున్న బాత్ రూముల్లోనే ఏకంగా తాగిపడేసిన మందుబాటిల్స్,గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కాగా, హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్‌రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అరికెపూడిగాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు -
తెలంగాణలో వివాదంగా మారిన గ్రూప్-1
-
ఫ్లెక్సీ వార్.. కొండా సురేఖ వర్సెస్ రేవూరి
సాక్షి, వరంగల్: గీసుకొండ పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.ఈ క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ -
సీఎం చంద్రబాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. లడ్డూ శాంపిల్‌ను ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపలేదని నిలదీసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. టీటీడీ తరఫు లాయర్‌పై ప్రశ్నల వర్షంల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా?. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా?. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా?. జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్‌లో చెప్పారెందుకు?. ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు?. మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ఆధారాల్లేవ్. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించారా? అని టీటీడీ లాయర్ సిదార్థ్ లూథ్రాను ప్రశ్నించింది. ‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’ లడ్డూ అంశంపై విచారణకు సిట్ వేశారు?. ఇది దర్యాప్తునకు సరిపోతుందా?.. మీ అభిప్రాయం చెప్పండి..’’ అని సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను అడిగింది ధర్మాసనం.చంద్రబాబు వైఖరిపై సుప్రీం కోర్టు సీరియస్ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్లను గాయపరిచారు అంటూ సీఎం చంద్రబాబు బాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ వ్యాఖ్యానించింది. . ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. ఆ నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో ఇరువైపులా వాదనలను రికార్డ్ చేసిన అనంతరం.. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి(గురువారం) వాయిదా వేసింది. అంతకు ముందు.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు.‘‘లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. కల్తీ జరిగిన వంద శాతం నెయ్యి వాడలేదని స్వయంగా ఈవో చెప్పారు. ఇష్టారీతిన మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో, బోర్డునే నిర్వహిస్తారు. ఈవో ను ప్రస్తుత ప్రభుత్వమే నియమించింది’’ సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.కాగా, తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు.ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి వాదనలు వినిపించారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం -
తిరుమల లడ్డూపై 30న సుప్రీంకోర్టులో విచారణ
-
రాజకీయ వేదికగా తిరుమల.. బోర్డులు ఎత్తేస్తున్నారు.
-
లడ్డూ వివాదంపై బెంచ్ ను నిర్ణయించిన సుప్రీంకోర్టు
-
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
-
‘సిట్’తో వాస్తవాలు బయటకు రావు’
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని వీహెచ్‌పీ నేత కోటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్’తో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావన్నారు. న్యాయ విచారణ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.లడ్డులో కొవ్వు పదార్థాలు కలిశాయనే ఆధారాలు మా దగ్గర లేవు. మీడియాలో వస్తున్న కథనాలు ప్రకారం మాట్లాడుతున్నాము. అసలు వాస్తవాలు బయటకు రావాలంటే న్యాయ విచారణ జరిపించాలి’’ అని కోటేశ్వర శర్మ చెప్పారు.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలుఈ సిట్ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేసింది.పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తీసుకున్న గోతిలోనే.. బాబు అండ్ కో
-
తిరుపతి లడ్డు వివాదంపై పేర్ని నాని ఫస్ట్ రియాక్షన్
-
శ్రీవారి లడ్డూ విషయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న చంద్రబాబు తప్పులు
-
లడ్డూ ప్రసాదం వివాదంపై సిట్‌ను ఏర్పాటు చేసి తిమ్మిని బమ్మిని చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర.. ఇంకా ఇతర అప్డేట్స్
-
లడ్డూ వివాదం.. తిరుమలలో భూమన కరుణాకర రెడ్డి ప్రమాణం (ఫొటోలు)
-
తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు: బీవీ రాఘవులు
-
‘చంద్ర’ డ్రామాలు.. దొరికి పోతామనే భయంతో నో కేసు ..
-
Gunshot: రాజకీయ లబ్ది కోసం భగవంతుడితో ఈ ఆటలేంటి ?
-
తిరుమల ప్రసాదంపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత !!
-
ప్రసాదం పై చంద్రబాబు దుష్ప్రచారం ..ఏ విచారణకైనా మేం రెడీ..
-
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్‌లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్‌తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్‌లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
వ్యూస్ కోసం నెమలి కూర!
-
లావణ్య-రాజ్ తరుణ్ స్టోరీలో మరో ట్విస్ట్
-
స్మితాసబర్వాల్ వివాదం.. భట్టి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, దివ్యాంగులకు మధ్య తలెత్తిన వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడారు. స్మితా సబర్వాల్ కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశారన్నారు.సోషల్ మీడియా వేదికగా స్మితాసబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భట్టి తెలిపారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని,ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. -
నీట్.. ర్యాంకుల ‘షికార్’
నీట్ యూజీ–2024 పరీక్ష ఫలితాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. మే 5న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా.. 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. గత నెలలో ఫలితాలు వెల్లడికాగా..పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తమైంది. అనేకమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహణ సంస్థ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా పట్టణాలు, పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించింది.700+ స్కోర్‌తో ఆలిండియా కోటా సీటు..నీట్లో 700+ మార్కులు స్కోర్ చేసిన 2,321 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో మెడికల్ సీటు లభిస్తుంది. అదేవిధంగా 650+ మార్కులు స్కోర్ చేసిన 30,204 మంది విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం దక్కుతుంది. అలాగే 600+ మార్కులు స్కోర్ చేసిన 81,550 మంది విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల్లో ఏదో ఒక చోట సీటు సొంతమయ్యే అవకాశముంది.రీటెస్ట్ తర్వాత ఫలితం..గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు.. నీట్ రీటెస్ట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రీటెస్ట్ త ర్వాత హరియాణాలోని ఒక పరీక్ష కేంద్రంలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. హిస్సార్‌లోని హరదయాళ్ పబ్లి క్ స్కూల్ పరీక్ష కేంద్రంలో రీటెస్ట్‌కు ముందు వెల్లడించిన ఫలితాల్లో మొత్తం 8 మంది విద్యార్థులకు 720, 719, 718 మార్కులు వచ్చాయి. రీటెస్ట్ ఫలితాలు వెల్లడయ్యాక ఈ పరీక్ష కేంద్రంలో గరిష్ట స్కోర్ 682 మాత్రమే. అంతేకాకుండా కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే 650+ మార్కు లు వచ్చాయి. 13 మంది విద్యార్థులు 600+ మార్కులు స్కోర్ చేశారు. దీన్నిబట్టే చూస్తే రీటెస్ట్‌కు ముందు ఈ సెంటర్లో వెల్లడయిన ఫలితం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. సికర్ ఫలితం.. ఆశ్చర్యకరంరాజస్తాన్లోని సికర్ పట్టణంలో మొత్తం 50 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ పట్టణంలోని కేంద్రాల్లో మొత్తం 27,216 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 149 మందికి 700+ స్కోర్ వచ్చింది. 650 + స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 2,037. అలాగే 4,297 మంది విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. సికర్‌లో నీట్ రాసిన విద్యార్థుల సగటు మార్కులు 362. దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన మొత్తం 23 లక్షల మందిలో 30,204 మంది విద్యార్థులు 650+ స్కోర్ చేశారు. కేవలం 1.3 శాతం మంది. కాని ఒక్క సికర్లోనే 2,037 మంది 650+ స్కోర్ చేశారు. ఇది 6.8 శాతం. అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన వారిలో 1.3 శాతం మందికి మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం లభించగా.. సికర్‌లో పరీక్ష రాసిన వారిలో ఏకంగా 7.48 శాతం మందికి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ దక్కుతోంది. ఇక్కడే చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఏదో జరిగిందని నేను అనడం లేదు. కాని కేవలం 50 పరీక్ష కేంద్రాలున్న ఒక్క సిటీలో ఇంత మందికి బెస్ట్ స్కోర్ ఎలా సాధ్యమనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతోంది.ఒక్క కేంద్రంలో 12 మందికి 700+» అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రంలో మొత్తం 676 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. ఏకంగా 12 మందికి 700 + స్కోర్ వచ్చింది. » నామకల్‌లోని ద నవోదయా అకాడెమీ సీనియర్ సెకండరీ స్కూల్లో 659 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 8 మందికి 700+ మార్కులు వచ్చాయి. » సికర్‌లోని టాగోర్ పీజీ కాలేజీలో 356 మంది పరీక్ష రాయగా.. 5గురికి 700+ స్కోర్ వచ్చింది. టాప్ 50లో 37 సికర్ నుంచే» 650 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన టాప్ 50 పరీక్ష కేంద్రాల్లో 37 సికర్‌లోని పరీక్ష కేంద్రాలే. అలాగే దేశంలో బెస్ట్ ఫలితం వచ్చిన టాప్ 60 పరీక్ష కేంద్రాల్లో 43 సికర్ నుంచే ఉన్నాయి. టాప్ 50లో నామకల్‌లోని ఐదు పరీక్ష కేంద్రాలు, హర్యాన, హిస్సార్‌లోని జఝర్ వంటివి ఉన్నాయి. ళీ రాజ్‌కోట్‌లోని ఒక పరీక్ష కేంద్రంలో ఏకంగా 200 మంది విద్యార్థులకు 600 + మార్కులు వచ్చాయి.రాజస్థాన్ బెస్ట్ ప్రదర్శన» దేశ వ్యాప్తంగా నీట్ యూజీలో ఉత్తమ ఫలితాలు చూపిన టాప్ 10 సిటీలో.. ఐదు రాజస్థాన్ నుంచే ఉన్నాయి. » రాష్ట్రాలు/కేంద్రాలు పాలిత పాంత్రాల వారిగా చూసే.. నీట్లో ఉత్తమ ఫలితం చూపిన టాప్ పది రాష్ట్రాల్లో వరుసగా చండీగఢ్, రాజస్థాన్, హరియాణా కేరళ, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. » ఈశాన్య రాష్ట్రాల్లో నీట్ ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. కాగా కొన్ని పరీక్ష కేంద్రాలు, కొన్ని సిటీల్లో ఇలా ఎందుకు ఫలితం భిన్నంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మందికి బెస్ట్ ర్యాంకులు ఎలా వచ్చాయి అనే సందేహం రావడం సహజం. అయితే దీనికి ఈ సిటీల్లో అందుబాటులో ఉన్న కోచింగ్ సౌకర్యాలు కారణం కావచ్చు. కోచింగ్ వల్ల కొన్ని చోట్ల విద్యార్థులు మంచి ఫలితం సాధించి ఉండొచ్చు.» కోచింగ్‌కు పేరుగాంచిన కోటా పట్టణంలోని పరీక్ష కేంద్రాల్లో హాజరైన విద్యార్థుల డేటాను విశ్లేషించినా.. సికర్‌లో పరీక్ష రాసిన విద్యార్థులు ఎంతో ముందున్నారని అర్థమవుతోంది. కోటాలో 27,118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే..700+ స్కోర్ చేసింది 74 మంది(0.27శాతం) మాత్రమే. అదే సికర్‌లో ఆ సంఖ్య రెండింతలుగా ఉంది. 650+ స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 1,066(3.93 శాతం)గా ఉంది. అలాగే ఇక్కడ 2,599 విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. 600+స్కోర్ చేసిన విద్యార్థులు కోటాలో 9.58 శాతం ఉండగా.. సికర్‌లో అది 16 శాతంగా ఉంది.రాష్ట్రాలవారీగా 700కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులురాజస్థాన్482 కేరళ194హరియాణా146మహారాష్ట్ర 205ఉత్తరప్రదేశ్184తెలంగాణ49